1 00:00:09,927 --> 00:00:11,929 హలో! 2 00:00:21,522 --> 00:00:23,440 డ్రింక్ అప్! 3 00:00:46,338 --> 00:00:48,298 వాండరీ రూపొందించిన పాడ్ కాస్ట్ ""వీ క్రాష్డ్"" ఆధారంగా 4 00:01:07,067 --> 00:01:09,236 వి-వర్క్ రోజుకు 1.2 మిలియన్ డాలర్లు నష్టపోతోంది 5 00:01:20,581 --> 00:01:22,207 నేను పిచ్చివాణ్ని కావాలనుకుంటున్నారా? 6 00:01:22,291 --> 00:01:24,543 అవును, ఏది మంచిదో కాసేపు ప్రయోగం చేసి చూడు, నాకు కాస్త సమయమివ్వు. 7 00:01:24,626 --> 00:01:25,627 వి-వర్క్ గాలాక్టిక్ హెడ్ క్వార్టర్స్ 8 00:01:25,711 --> 00:01:27,004 తొందరేం లేదు. 9 00:01:27,087 --> 00:01:28,547 - కానీ ఎక్కువ సమయంతీసుకోకు, సరేనా? - అలాగే. 10 00:01:28,630 --> 00:01:31,133 ప్రపంచాన్ని మార్చడం అని అన్నారు కదా మళ్లీ అక్కడికే వెళ్తారా? 11 00:01:32,342 --> 00:01:35,846 ప్రపంచాన్ని జాగృతం చేయడమే మా లక్ష్యం. అంతే. 12 00:01:35,929 --> 00:01:37,222 అది ఎలా చేస్తారు? 13 00:01:37,306 --> 00:01:38,849 మంచి ప్రశ్న. 14 00:01:38,932 --> 00:01:44,188 ఒక లక్ష్యంతో క్రియాశీలంగా జీవించడం ద్వారా. చక్కటి, సంపూర్ణమైన జీవితాన్ని గడపడం ద్వారా 15 00:01:44,271 --> 00:01:46,315 అలా చేయడం ద్వారా అది చాలా... 16 00:01:46,398 --> 00:01:51,111 అలా చేయడం ద్వారా మనల్ని మనం జాగృతం చేసుకుని, తర్వాత ప్రపంచాన్ని జాగృతం చేస్తాం. 17 00:01:51,195 --> 00:01:52,196 ప్రపంచాన్ని. 18 00:01:52,279 --> 00:01:53,947 దీన్ని మీ పెట్టుబడిదారులు ఎలా భావిస్తారు? 19 00:01:54,031 --> 00:01:56,533 సాధారణంగా, ఏ కంపెనీ లక్ష్యమైనా డబ్బు సంపాదించడమే కదా. 20 00:01:56,617 --> 00:02:01,246 అవును. నువ్వు చేసే పని ద్వారా ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్దేశం నీకున్నప్పుడు, 21 00:02:01,330 --> 00:02:04,958 నీ పనికి వెనకాల ఓ అర్థం ఉన్నప్పుడు, 22 00:02:05,042 --> 00:02:06,668 విజయం దానంతట అదే మిమ్మల్ని అనుసరిస్తుంది. 23 00:02:06,752 --> 00:02:08,336 ఆడమ్, మేం రెడీ. 24 00:02:08,419 --> 00:02:10,714 అవును, డబ్బు కూడా మీ వెంటే వస్తుంది. 25 00:02:11,548 --> 00:02:12,549 మిసెస్ న్యూమాన్... 26 00:02:13,091 --> 00:02:14,635 కాస్త పక్కకు తప్పుకోండి. 27 00:02:27,356 --> 00:02:29,566 మీ కొత్త యజమాని 28 00:02:29,650 --> 00:02:31,318 బ్లూమ్ బెర్గ్ బిజినెస్ వీక్ సిఇఓ ఆడమ్ న్యూమాన్ 29 00:02:31,401 --> 00:02:33,362 వి-వర్క్ - బిలియన్ డాలర్ల యూనికార్న్ స్టార్టప్ 30 00:02:33,445 --> 00:02:34,530 నేటి గిగ్ ఆర్ధిక వ్యవస్థ 31 00:02:38,075 --> 00:02:39,868 మీరు ఓ గర్వించదగిన తండ్రి కదా. 32 00:02:39,952 --> 00:02:42,829 ముప్ఫై నాలుగు నగరాలు, 87,000 మంది సభ్యులు. 33 00:02:42,913 --> 00:02:44,915 మా పెట్టుబడి మీకు అక్కర్లేదనుకుంటా. 34 00:02:44,998 --> 00:02:46,416 బెంచ్ మార్క్ క్యాపిటల్ న్యూ యార్క్ ఆఫీస్ 35 00:02:46,500 --> 00:02:48,710 డే కేర్ సెంటర్లో సభ్యులంతా 36 00:02:48,794 --> 00:02:52,840 మద్యం తాగుతూ గడపడాన్ని నేను ఇన్ స్టాగ్రామ్ పోస్టుల్లో చూశాను. 37 00:02:52,923 --> 00:02:54,174 - డే క్యాంప్? - సమ్మర్ క్యాంప్. 38 00:02:54,258 --> 00:02:55,843 సమ్మర్ క్యాంప్. అవును. 39 00:02:55,926 --> 00:02:58,595 వారికి మేం అందజేసిన వనరుల్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు, 40 00:02:58,679 --> 00:03:01,390 ప్రతి ఒక్కరూ మా వనరుల్ని వృథా చేస్తున్నారు. 41 00:03:01,473 --> 00:03:04,393 కాబట్టి, కార్పొరేట్ తరహా నాయకత్వ శ్రేణి ఉంటే ఎలా ఉంటుందా అని అలోచిస్తున్నాను. 42 00:03:04,476 --> 00:03:07,646 అతని భార్య, తను కూడా పనిచేస్తోంది కదూ? 43 00:03:07,729 --> 00:03:09,982 లేకపోతే పని చేయట్లేదేమో. మరి... 44 00:03:10,065 --> 00:03:11,441 ఆమె ఎప్పుడూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. 45 00:03:11,525 --> 00:03:13,610 అతని పనుల్లో ఆమె సాయపడుతూ ఉంటుంది. 46 00:03:13,694 --> 00:03:14,862 సరే. 47 00:03:15,612 --> 00:03:18,365 - నువ్వు నాతో వేళాకోళం ఆడట్లేదు కదా? - కాస్తంత. 48 00:03:18,448 --> 00:03:20,534 వీళ్లపై మేం ఎంతో డబ్బు పెట్టుబడి పెట్టాం. 49 00:03:20,617 --> 00:03:21,910 వాళ్లెంత డబ్బు పోగొడుతున్నారు? 50 00:03:21,994 --> 00:03:25,205 - ఈ ఏడాది 40 కోట్లు సంపాదించబోతున్నారు. - లేదు, లేదు. 51 00:03:25,289 --> 00:03:26,790 నన్ను రెచ్చగొట్టవద్దు, బ్రూస్. 52 00:03:26,874 --> 00:03:29,418 "వాళ్లెంత సంపాదించబోతున్నారు?" అని నేను అడగటం లేదు. 53 00:03:29,501 --> 00:03:31,211 "వాళ్లెంత ఖర్చు చేయబోతున్నారు?" అని అడుగుతున్నాను. 54 00:03:31,295 --> 00:03:33,881 వాళ్లు ఇదంతా స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో నేర్చుకున్నారేమో నాకు తెలియదు. 55 00:03:33,964 --> 00:03:35,424 దాన్ని లాభం అని అంటారు. 56 00:03:35,507 --> 00:03:39,970 నువ్వు సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే, అప్పుడు "లాభం" అనేదేమీ ఉండదు. 57 00:03:40,053 --> 00:03:42,598 ఈ విషయాన్ని హార్వర్డ్ లో మాకు పదే పదే చెప్పి, మా బుర్రల్లోకి ఎక్కించారు. 58 00:03:42,681 --> 00:03:45,392 నువ్వు హార్వర్డ్ లో చదువుకున్నావా? ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదే. 59 00:03:46,143 --> 00:03:47,686 సరే, వివరంగా చెబుతా విను. 60 00:03:47,769 --> 00:03:50,814 ఉదాహరణకి, నీకు నిమ్మరసం అమ్మే దుకాణం ఉందనుకో... 61 00:03:50,898 --> 00:03:52,774 చూడు, వాళ్లు తప్పక లాభాలు సంపాదిస్తారు. 62 00:03:52,858 --> 00:03:56,153 ...నిజానికి నిమ్మరసం కంటే నిమ్మకాయల ధర ఎక్కువ, 63 00:03:56,236 --> 00:03:58,030 - వాళ్లు లాభాలు గడిస్తారు. - ...కానీ నువ్వేమో నిమ్మరసాన్ని 64 00:03:58,113 --> 00:03:59,865 రాయితీపై ఇవ్వాలని పట్టుబట్టావు, 65 00:03:59,948 --> 00:04:02,284 ఇప్పుడు వి-వర్క్ తన సభ్యులకు ఇస్తున్న మాదిరిగా అన్నమాట. 66 00:04:02,367 --> 00:04:03,368 వాళ్లు లాభాలు సంపాదిస్తారు. 67 00:04:03,452 --> 00:04:05,621 ఎలా సంపాదిస్తారు, బ్రూస్? చెప్పు. 68 00:04:05,704 --> 00:04:07,831 ఇలాంటి ఎత్తులు జిత్తులు ఇంతకుముందు ఎన్నో చూశాం కదా? 69 00:04:07,915 --> 00:04:09,041 చూడలేదా? 70 00:04:09,124 --> 00:04:10,626 ఈసారి మాత్రం తేడా ఏముంటుంది? 71 00:04:11,543 --> 00:04:13,712 ఆడమ్. అదే తేడా. 72 00:04:18,466 --> 00:04:19,593 ఇతనా? 73 00:04:21,887 --> 00:04:25,140 తను సేకరించిన డబ్బంతా ఇట్టే ఖర్చు చేసేస్తే ఏం జరుగుతుంది? 74 00:04:27,267 --> 00:04:28,477 మళ్లీ మరింత డబ్బు ఇస్తావా? 75 00:04:30,729 --> 00:04:32,940 మనం ఇంకా ఆ పరిస్థితికి రాలేదు, సరేనా? 76 00:04:33,565 --> 00:04:34,566 సరే. 77 00:04:35,108 --> 00:04:37,110 హేయ్, నేను నమ్మలేకపోతున్నాను, 78 00:04:37,194 --> 00:04:39,488 ఆగస్ట్, ఓలీ, 79 00:04:39,571 --> 00:04:41,782 మీ నాన్న ఒక రాక్ స్టార్. 80 00:04:41,865 --> 00:04:45,410 మీరు దాన్ని చూడాలని తను ఆరాటపడుతున్నాడు. నేను పంపిన ఫ్రేమ్ అందిందా? 81 00:04:45,494 --> 00:04:49,540 చూశా. చూశా. తను చాలా కష్టజీవి. 82 00:04:49,623 --> 00:04:51,625 కొద్దిగా వ్యాపారవేత్త కూడా, 83 00:04:51,708 --> 00:04:56,296 తనకు పదేళ్ల వయసున్నప్పుడు తల్లిని కూర్చోబెట్టుకుని ఇక అద్దె కట్టడం 84 00:04:56,380 --> 00:04:58,799 - మొదలుపెడతానని అన్నాడు. - అవును. తనకు పదేళ్ల వయసున్నప్పుడు. 85 00:04:58,882 --> 00:05:03,011 ఇప్పుడు, మ్యాగజైన్ కవర్ పేజీలకు ఎక్కాడు, తనకొక అద్భుతమైన భార్య, 86 00:05:03,095 --> 00:05:05,597 నలుగురు పిల్లలు. 87 00:05:05,681 --> 00:05:08,600 అతను ఇంటికొస్తే, నేనెంత గర్విస్తున్నానో చెప్పు. 88 00:05:08,684 --> 00:05:12,771 చెబుతా. నిజానికి తను ఇప్పుడే ఇంట్లోకి వచ్చాడు. 89 00:05:12,855 --> 00:05:14,398 ఇలా వచ్చి మీ నాన్నని పలకరించు. 90 00:05:17,860 --> 00:05:18,861 ఇదిగో తను. 91 00:05:18,944 --> 00:05:20,028 - అబ్బా! - హేయ్! 92 00:05:20,112 --> 00:05:21,488 మ్యాగజైన్ అందిందా? 93 00:05:21,572 --> 00:05:23,866 నా చేతిలోనే ఉంది. 94 00:05:23,949 --> 00:05:25,909 నర్సులందరికీ చూపించాను కూడా. 95 00:05:25,993 --> 00:05:28,328 మీరు అలా చేస్తారని నాకు తెలుసు. 96 00:05:28,412 --> 00:05:29,621 హలో. 97 00:05:29,705 --> 00:05:31,748 సరే. మేం డిన్నర్ కి వెళ్లాలి. 98 00:05:31,832 --> 00:05:35,043 సరేనా? మళ్లీ వచ్చే వారం ఫోన్ చేయండి. ఓకే? 99 00:05:35,127 --> 00:05:37,838 - ఓకే. ఓకే. బై-బై. - అబ్బా, బై. 100 00:05:37,921 --> 00:05:40,132 - బై, బై, బై. బై. - బై, బై, బై. బై-బై. 101 00:05:43,385 --> 00:05:46,263 - నువ్వు జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు. - తను మనతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. 102 00:05:46,847 --> 00:05:49,933 చాలు, చాలు. చాలు. 103 00:05:50,017 --> 00:05:51,393 మరీ సున్నితంగా ఆలోచిస్తున్నావు. 104 00:05:51,476 --> 00:05:52,936 నేను వెళ్లాలి. 105 00:05:53,020 --> 00:05:55,189 ఆడమ్. ఆడమ్, నువ్వు... 106 00:05:55,272 --> 00:05:58,609 - ఇవాళ శనివారం రాత్రి. మనం... - చూడు, నేను వెళ్లాలి, సారీ, సరేనా? 107 00:05:58,692 --> 00:06:00,152 బై, బై, బై, బై, బై, బై. 108 00:06:09,745 --> 00:06:14,166 ఈ సంవత్సరాంతానికి మనం 40 కొత్త ప్రాంతాల్లో రెండు మిలియన్ చదరపు అడుగుల 109 00:06:14,249 --> 00:06:15,792 స్థలాన్ని ప్రారంభించబోతున్నాం! 110 00:06:18,086 --> 00:06:21,089 ఆవి, ఏంటి... కానర్ వైపు అలా చూశావు? 111 00:06:25,177 --> 00:06:27,763 ఇది సాధ్యమని నేను అనుకోవట్లేదు. 112 00:06:30,724 --> 00:06:31,725 సాధ్యం కాదా? 113 00:06:32,643 --> 00:06:37,523 మేం ఈ ఏడాది చివరకు ఎనిమిది కొత్త ప్రాంతాలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. 114 00:06:38,315 --> 00:06:39,775 ఆ మాత్రం చేస్తే ఈ ఏడాది అద్భుతం సాధించినట్లే. 115 00:06:39,858 --> 00:06:44,696 1987నుంచీ, స్టార్ బక్స్ సగటున రోజుకు రెండు దుకాణాల చొప్పున తెరిచింది. 116 00:06:44,780 --> 00:06:46,114 కావచ్చు, కానీ మనది స్టార్ బక్స్ కాదు. 117 00:06:46,198 --> 00:06:47,491 ఒప్పుకుంటా. ఒప్పుకుంటా. 118 00:06:47,574 --> 00:06:49,493 మనం స్టార్ బక్స్ కంటే బాగా ఎదగాలి. 119 00:06:49,576 --> 00:06:53,497 ఆడమ్. యజమానులకు కాఫీ గురించి అర్థమవుతుంది. 120 00:06:54,331 --> 00:06:57,084 వాళ్లకు కో వర్కింగ్ స్పేస్ అంటే అర్థం కాదు. 121 00:06:57,167 --> 00:06:59,461 కొలంబస్, ఓహైయోలో కాదు, 122 00:06:59,545 --> 00:07:01,880 వాళ్లు అనేది ఏంటంటే, కొద్దిపాటి స్థలాన్ని సేకరించాలంటే... 123 00:07:01,964 --> 00:07:04,883 వాళ్లనేది అంటూనే ఉంటారు. మనం మొదటి లొకేషన్ ప్రారంభించడానికి 124 00:07:04,967 --> 00:07:08,011 ప్రయత్నిస్తున్నప్పటినుంచీ వాళ్లు అంటూనే ఉన్నారు. 125 00:07:08,095 --> 00:07:13,976 కొలంబస్, ఓహైయోలోనా లేక మార్స్ లోనా అనేది నేను పట్టించుకోను. అర్థమైందా? 126 00:07:14,059 --> 00:07:16,436 పని జరిగేలా చూడటం నీ బాధ్యత. 127 00:07:16,520 --> 00:07:17,896 బహుశా నువ్వు మన గుర్తుని మరచిపోయావేమో. 128 00:07:18,981 --> 00:07:19,982 కష్టపడి పనిచేయండి 129 00:07:20,065 --> 00:07:22,734 - నేను మీకోసం అహోరాత్రాలూ కష్టపడుతున్నా. - సరే, సరే. 130 00:07:23,235 --> 00:07:25,612 పైగా, ఇక్కడికి రావడానికి నా సోదరి పెళ్లికి కూడా వెళ్లలేదు. 131 00:07:25,696 --> 00:07:30,325 నీ సోదరి పెళ్లికి వెళ్లు. నువ్వు నాకోసం మహోపకారం చేస్తున్నావు. 132 00:07:30,409 --> 00:07:32,578 లీజింగ్ విభాగానికి కొత్త చీఫ్ ఎవరు కావాలనుకుంటున్నారు? 133 00:07:32,661 --> 00:07:34,246 మీరు ఆవి కంటే ఛండాలంగా పని చేయరు. 134 00:07:38,417 --> 00:07:41,628 మనం వేగంగా ఎందుకు 135 00:07:41,712 --> 00:07:46,258 ఎదగలేకపోతున్నాం? 136 00:07:47,551 --> 00:07:50,637 ఎందుకంటే యజమానులు నీ వ్యాపార నమూనా చెత్తగా ఉందనుకుంటున్నారు కాబట్టి. 137 00:07:51,930 --> 00:07:54,016 సోదరా, మనం ఆఫీస్ స్పేస్ ని లీజుకు తీసుకుంటాం. 138 00:07:54,099 --> 00:07:56,894 కొన్ని బల్బులు వేలాడదీస్తాం, నియోన్ లైట్ల వెలుగులో పేరు వెలిగేలా చేస్తాం. 139 00:07:56,977 --> 00:07:58,937 ఇక ఈ ప్రపంచాన్ని మార్చేస్తున్నట్లుగా నటిస్తాం. 140 00:07:59,021 --> 00:08:00,355 ఇంతేనా నువ్వనుకుంటున్నది? 141 00:08:00,439 --> 00:08:02,983 నువ్విచ్చే జీతం కూడా చాలా తక్కువ. 142 00:08:03,066 --> 00:08:05,110 సోదరా, నేను వారానికి ఏడు రోజులు పనిచేస్తున్నా. 143 00:08:05,194 --> 00:08:08,071 నువ్వు ఉచితంగా ఇచ్చే కొంబూచా టీ కోసం నువ్వు చేసే విస్తరణ పనుల గురించి 144 00:08:08,155 --> 00:08:11,241 నేను ఆహా ఓహో అంటూ గొప్పగా చెప్పాలా? 145 00:08:12,242 --> 00:08:14,578 - ఛీ, ఇదేం బాగోలేదు. - ఆవి, ఆవి, ఆవి, ఆవి, ఆవి. 146 00:08:14,661 --> 00:08:15,996 ఆగు, ఆగు, ఆగు, ఆగు. 147 00:08:17,039 --> 00:08:19,166 ఈ వారం నీపై ఎంతో ఒత్తిడి ఉందన్న సంగతి నాకు తెలుసు. 148 00:08:21,793 --> 00:08:23,086 నువ్వు వెళ్లిపోవడం నాకిష్టం లేదు, 149 00:08:23,170 --> 00:08:24,880 జీవితం చాలా చిన్నది మిత్రమా. 150 00:08:24,963 --> 00:08:26,840 నీకు 10 శాతం జీతం ఎక్కువ ఇస్తా, సరేనా? 151 00:08:28,050 --> 00:08:29,051 సరిపోదు. 152 00:08:29,134 --> 00:08:30,636 నీ జీతం రెట్టింపు చేస్తాను? 153 00:08:35,140 --> 00:08:37,058 ఈ ఆఫర్ నీకు నచ్చినట్లుంది. 154 00:08:39,061 --> 00:08:44,525 డ్రింక్స్ తాగి, భోజనం చేస్తూ దీని గురించి మాట్లాడుకోవచ్చుకదా? 155 00:08:47,486 --> 00:08:50,572 వాగ్యూ మాంసం ఈ ఉదయమే జపాన్ నుంచి వచ్చింది. 156 00:08:52,533 --> 00:08:55,827 ఆవి, నువ్వు ఉంటున్నట్టేగా? 157 00:08:56,662 --> 00:08:59,373 ఆవి, ఆవి. ఇలా రా. 158 00:08:59,873 --> 00:09:04,253 రా, రా, రా, రా, రా. ఇలా వచ్చి కూర్చో. 159 00:09:05,045 --> 00:09:08,257 మీరంతా చేయాల్సింది ఇలాగే. 160 00:09:08,340 --> 00:09:10,592 ఎవరైనా స్థలం యజమాని కుదరదంటే, అతనికిచ్చే అద్దెని రెట్టింపు చేయండి. 161 00:09:10,676 --> 00:09:13,720 అది కూడా కాదంటే, లీజ్ కాల పరిధిని రెట్టింపు చేయండి. 162 00:09:13,804 --> 00:09:16,139 భోజనం చేస్తూ మాట్లాడుకుందామని వారిని ఆహ్వానించండి. 163 00:09:16,223 --> 00:09:19,476 వాళ్లని ఒప్పించేందుకు ఏదైనా చేయండి. 164 00:09:19,560 --> 00:09:21,019 మన సంగతి వాళ్లకు అర్థం కాదు! 165 00:09:21,103 --> 00:09:24,106 వాళ్లని ఒప్పించే బాధ్యత మీదే. లేహైమ్! 166 00:09:24,773 --> 00:09:27,025 మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 167 00:09:27,109 --> 00:09:29,152 - అర్థం కావట్లేదు. - సరే. 168 00:09:29,236 --> 00:09:30,237 కొలంబస్ ఓహైయో 169 00:09:30,320 --> 00:09:32,781 - అద్దెను పెంచితే ఒప్పుకుంటారా? - ఎంత పెంచుతారు? 170 00:09:32,865 --> 00:09:35,075 మీ వ్యాపార నమూనా చూస్తే భయమేస్తోంది. 171 00:09:35,158 --> 00:09:37,870 డెన్వర్ కొలరాడో 172 00:09:38,453 --> 00:09:40,622 లీజు కాలపరిధిని పెంచితే ఒప్పుకుంటారా? 173 00:09:41,540 --> 00:09:45,169 ఏమో మరి. మళ్లీ వ్యాపార మాంద్యం వస్తే ఏమవుతుంది? 174 00:09:45,252 --> 00:09:47,588 శాన్ డియాగో కాలిఫోర్నియా 175 00:09:47,671 --> 00:09:48,672 వావ్. 176 00:09:49,214 --> 00:09:52,634 సగటు వాణిజ్య లీజు ఐదేళ్లే. కానీ మేం పదేళ్లకు గ్యారంటీ ఇస్తాం. 177 00:09:54,136 --> 00:09:55,137 వేళాకోళం ఆడుతున్నావా? 178 00:09:55,220 --> 00:09:57,472 మీరు చదరపు అడుగుకి 90 డాలర్లు అడుగుతున్నారు కదా? 179 00:09:58,724 --> 00:10:00,058 మేం 130 డాలర్లు ఇస్తాం, సరేనా? 180 00:10:00,142 --> 00:10:03,478 ఒసెట్రా కేవియర్ చేపను ఇంకొకటి తెప్పిస్తారా? 181 00:10:03,562 --> 00:10:04,771 ఒప్పందం నాకు ఇష్టమే. 182 00:10:10,652 --> 00:10:13,363 ఆడమ్ అంటే అదీ. మాకు మొత్తం మీ భవనం కావాలి. 183 00:10:14,198 --> 00:10:16,783 మొత్తం భవనమా? ఇందులో ఇతర కిరాయిదారులు ఉన్నారు, తెలుసా. 184 00:10:16,867 --> 00:10:18,785 వాళ్ళ లీజులకి మేం డబ్బు చెల్లిస్తాం. 185 00:10:21,872 --> 00:10:22,831 కౌలుదాత సంతకం 186 00:10:28,420 --> 00:10:30,005 ఇది నీ కొత్త వ్యాపార నమూనా. 187 00:10:30,088 --> 00:10:31,089 రోజుకి -1.8 మిలియన్ డాలర్లు. 188 00:10:31,173 --> 00:10:32,424 నీ చేతిని నువ్వే కాల్చుకోబోతున్నావు. 189 00:10:35,219 --> 00:10:37,012 దేవుడా, దేవుడా. 190 00:10:37,721 --> 00:10:40,599 మనకు ఈ ఏడాది 400 మిలియన్లు నష్టం రాబోతున్నట్లు అంచనా. 191 00:10:40,682 --> 00:10:44,186 అద్భుతం. లెస్లి, డబ్బుని ఎవరు నష్టపోతారో తెలుసా? 192 00:10:44,269 --> 00:10:46,980 అమెజాన్, ఉబర్. ట్విట్టర్, స్పాటిఫై, స్నాప్ చాట్. 193 00:10:47,064 --> 00:10:48,982 - వాటి గురించి విన్నావా? - విన్నాను. 194 00:10:49,066 --> 00:10:50,275 సరే, ఫిల్! 195 00:10:50,359 --> 00:10:53,612 నాకోసం ఫ్రెడ్ స్టోర్ నుంచి చైనీస్ చికెన్ తెప్పించు. 196 00:10:53,695 --> 00:10:55,489 ఇది వేగవంతమైన అభివృద్దికి అయ్యే ఖర్చు. 197 00:10:55,572 --> 00:10:57,616 మరి అంత వేగంగా ఎందుకు? 198 00:10:59,785 --> 00:11:01,954 బాదంపప్పులు మరిన్ని ఎక్కువ వేసి. 199 00:11:02,037 --> 00:11:05,541 ఇవి వ్యాపార వృద్ధికి అవుతున్న ఖర్చులు కావు. 20 ఏళ్ల పాటు లీజులకు తీసుకున్నందుకు అవుతున్నాయి. 200 00:11:06,166 --> 00:11:07,626 ఉద్యోగుల తొలగింపుపై మనం దృష్టి పెట్టాలి. 201 00:11:09,336 --> 00:11:11,338 మనం ఉద్యోగుల్ని తీసేయకూడదు, అర్థమైందా? 202 00:11:13,757 --> 00:11:18,554 మిగెల్, లెస్లీలకు సలాడ్లు తెప్పించు! అదనంగా బాదంపప్పు వేయించు! 203 00:11:21,765 --> 00:11:24,101 రిలాక్స్, రిలాక్స్. 204 00:11:24,685 --> 00:11:28,772 ఖర్చులు తగ్గించండి. ఇతరత్రా వసతులపై ఖర్చు తగ్గించండి. 205 00:11:28,856 --> 00:11:32,234 ఉచితంగా ఇచ్చే రొట్టెలు, పండ్ల రసాలు... 206 00:11:32,317 --> 00:11:34,236 మన నష్టాలకు కర్బూజా పండ్లు కారణం కాదు. 207 00:11:34,820 --> 00:11:36,113 క్షమించాలి. 208 00:11:36,196 --> 00:11:40,659 ఆమె ఏం చెప్పాలనుకుంటోందంటే, ఇవన్నీ నిర్వహణీయం కాదని. 209 00:11:47,791 --> 00:11:48,792 ఏం చేయాలో నాకు తెలుసు. 210 00:11:51,503 --> 00:11:52,504 మనకు మరింత డబ్బు కావాలి. 211 00:11:53,630 --> 00:11:54,715 ఇంకా డబ్బు కావాలా? 212 00:11:54,798 --> 00:11:57,176 లేదు, ఆడమ్, అసలు విషయం అది కాదు. 213 00:11:57,259 --> 00:11:58,760 డబ్బు అనేది ఎప్పటికీ ముఖ్యమైన విషయమే. 214 00:11:59,636 --> 00:12:01,096 సరే, ఫిల్! 215 00:12:04,641 --> 00:12:05,893 ఆడమ్, నువ్వేనా? 216 00:12:05,976 --> 00:12:07,895 అవును, బాబా ఘనోష్. 217 00:12:09,354 --> 00:12:10,522 - ఆడమ్. - ఏయ్! 218 00:12:10,606 --> 00:12:11,607 - ఏంటి? - ఏమైంది? 219 00:12:11,690 --> 00:12:13,817 నిధుల సేకరణ కోసం వేసుకున్న స్కూల్ దుస్తులు ఇవి. 220 00:12:13,901 --> 00:12:15,319 నువ్వు ఆలస్యం చేస్తున్నావు. పద, వెళ్దాం. 221 00:12:15,402 --> 00:12:18,447 అబ్బా. మరచిపోయా. నేను రాలేను. 222 00:12:18,530 --> 00:12:20,240 - రాలేవా? - రాలేను. నేను రాలేను. 223 00:12:21,491 --> 00:12:24,494 - ఏంటి? - నేను బ్రూస్ ని కలవాలి. చాలా అర్జెంట్. 224 00:12:24,578 --> 00:12:25,913 - లేదు, ఆడమ్. - అవును. 225 00:12:25,996 --> 00:12:27,915 ఆడమ్, వద్దు. నేను దీనికోసం నెలల తరబడి ప్లాన్ చేస్తున్నాను. 226 00:12:27,998 --> 00:12:30,083 నేను నిర్వాహక కమిటీలో ఉన్నాను కూడా. 227 00:12:30,167 --> 00:12:32,628 - వాళ్లకి 25వేల డాలర్లు ఇచ్చేయ్. - ఇప్పటికే 25వేల డాలర్లు ఇచ్చాం. 228 00:12:32,711 --> 00:12:34,421 అందుకే కదా నిర్వాహక కమిటీలో నాకు చోటు దక్కింది! 229 00:12:34,505 --> 00:12:36,131 అయితే 50వేల డాలర్లు ఇవ్వు. 230 00:12:37,591 --> 00:12:39,968 స్వీటీ, మనం ఒక జట్టు. 231 00:12:40,052 --> 00:12:43,764 - ఇది మనిద్దరం కలసి చేయబోతున్నాం. - నేను వెళ్లాలి. సారీ. నువ్వు కాస్త... 232 00:12:44,765 --> 00:12:47,100 ఇదొక పెద్ద విధానం. 233 00:12:47,184 --> 00:12:49,311 ...కలతగా ఉన్నట్టున్నావు. ఓకె. బై, బై, బై, బై. 234 00:12:50,187 --> 00:12:51,188 సరదాగా గడుపు! 235 00:13:12,918 --> 00:13:16,338 అక్కడ క్యూ ఉంది. ఫైర్ మార్షల్ అరగంట క్రితం వచ్చాడు. 236 00:13:16,421 --> 00:13:17,548 హాలు పూర్తిగా నిండిపోయింది. 237 00:13:23,595 --> 00:13:25,097 మనం కాస్త అతిగా డ్రెస్ చేసుకున్నామేమో. 238 00:13:30,561 --> 00:13:31,687 - హాయ్. - హాయ్. 239 00:13:31,770 --> 00:13:33,772 - ఎలీషియా. - రెబెకా. నువ్వు భలేగా ఉన్నావు. 240 00:13:33,856 --> 00:13:37,818 థాంక్స్. తను అలా అన్నందుకు నిజంగా మీ కళ్లలో కోపం కనిపిస్తోంది. 241 00:13:37,901 --> 00:13:40,445 ఫరవాలేదులే, అది కేవలం ఆమె మొహమే. 242 00:13:40,529 --> 00:13:42,823 దేవుడా, వీళ్లు త్వరగా మనల్ని లోనికి పంపితే బాగుండును. ఆకలి దంచేస్తోంది. 243 00:13:44,658 --> 00:13:48,579 ఇలాంటి ఈవెంట్లలో ఇలా ఆలస్యం చేయడం కొందరికి అలవాటు. 244 00:13:48,662 --> 00:13:49,913 నువ్వెవరి సాయం తీసుకున్నావు? 245 00:13:51,373 --> 00:13:53,458 - సారీ, నాకు అర్థం కాలేదు... - విడాకుల కోసం. 246 00:13:53,542 --> 00:13:54,710 నేను విడాకులు తీసుకోలేదు. 247 00:13:54,793 --> 00:13:56,628 - క్షమించు. నేను... - ఫరవాలేదు. 248 00:13:56,712 --> 00:13:59,840 నీ కళ్లలో బాగా తెలిసిన భావమేదో కనిపించింది, కానీ నేను... 249 00:13:59,923 --> 00:14:02,134 లేదు. లేదు, లేదు. నిజానికి మేం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. 250 00:14:02,217 --> 00:14:03,844 మంచిది. మంచిది. 251 00:14:04,636 --> 00:14:07,139 ఎందుకంటే విడాకులు నిన్ను నిర్దయగా మారుస్తాయి. 252 00:14:08,182 --> 00:14:11,435 అతను చనిపోవాలని, కానీ పిల్లలు మాత్రం బాధపడకూడదని అనిపిస్తుంది. 253 00:14:11,518 --> 00:14:16,398 దాంతో నేను ఇరకాటంలో పడ్డాను. అది దారుణమైన పరిస్థితిలోకి నెట్టింది. 254 00:14:19,484 --> 00:14:22,487 సరే, ఈ రోజుల్లో ఇదేమంత గొప్ప విషయం కాదు, 255 00:14:22,571 --> 00:14:26,408 కానీ... కష్టాలనేవి మనం కొనితెచ్చుకునేవే. 256 00:14:26,909 --> 00:14:29,411 ప్రతికూల భావాలు వస్తూ ఉంటాయి, 257 00:14:29,494 --> 00:14:31,205 కాని అవి లోపలకు రాగానే, 258 00:14:31,288 --> 00:14:34,291 వాటిని ప్రేమగా బయటకు వెళ్లిపొమ్మని చెప్పాలి. 259 00:14:38,170 --> 00:14:39,171 వావ్. 260 00:14:40,130 --> 00:14:42,424 నీ మాటలు భలే వింతగా ఉన్నాయి. 261 00:14:42,508 --> 00:14:43,842 నువ్వు థెరపిస్టువా లేక... 262 00:14:43,926 --> 00:14:48,680 లేదు, లేదు. నేను జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాను, అంతే. 263 00:14:49,890 --> 00:14:51,225 నాకు అది నచ్చింది. 264 00:14:51,308 --> 00:14:52,559 చాలామంది కోపంతో కళ్లు తిప్పుతారు. 265 00:14:52,643 --> 00:14:55,521 నేను కళ్లు తిప్పలేదు. ఇక్కడ కళ్లేమీ తిరగలేదు. 266 00:14:56,939 --> 00:14:58,357 ఛీ! 267 00:14:58,440 --> 00:14:59,608 బాగా చల్లగా ఉంచు. 268 00:15:01,193 --> 00:15:02,194 చల్లగా! 269 00:15:02,277 --> 00:15:03,403 నెగటివ్ 292. 270 00:15:03,487 --> 00:15:07,157 నేను మరిన్ని పెట్టుబడులు సేకరించబోతున్నాను. మొదటి అవకాశం బెంచ్ మార్క్ కే ఇస్తున్నాను. 271 00:15:07,991 --> 00:15:09,952 - ఆడమ్. - మనకిది చాలా కీలకమైన సమయం, బ్రూస్. 272 00:15:10,035 --> 00:15:12,663 ఆడమ్, నేను నీకు ఇక డబ్బు ఇవ్వలేను, సరేనా? 273 00:15:12,746 --> 00:15:14,998 నీ డబ్బు అవసరాలకు నువ్వే దారి వెతుక్కో. 274 00:15:15,082 --> 00:15:18,752 నువ్వేదో నాకు ఒరగబెడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నేనే నీకు అవకాశం ఇస్తున్నాను, బ్రూస్. 275 00:15:18,836 --> 00:15:21,380 నువ్వు ముందు కొన్ని ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలి. 276 00:15:21,463 --> 00:15:24,716 చక్కటి వ్యాపార పద్ధతులు. నిర్వహణీయ వృద్ధి. 277 00:15:24,800 --> 00:15:27,803 మన వృద్ధి నిర్వహణీయమైనది కాదని ఎవరన్నారు, బ్రూస్? 278 00:15:27,886 --> 00:15:30,889 - దేవుడా. - లేదు. లేదు. మరొక్క నిమిషం ఉండు! 279 00:15:31,515 --> 00:15:35,227 చూడు. నాకు అంకెలు కనిపిస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. 280 00:15:35,310 --> 00:15:37,062 బ్లిట్జ్ స్కేలింగ్, అవునా? 281 00:15:37,145 --> 00:15:41,942 ముందూ వెనకా చూడకుండా మార్కెట్ షేర్ ను కొనడం వ్యాపార సంస్థను నడిపే పద్ధతి కాదు. 282 00:15:42,025 --> 00:15:44,820 కొత్త ఆర్ధిక వ్యవస్థలో ఇలాగే వ్యాపారం చేయాలి. 283 00:15:44,903 --> 00:15:46,363 నేను తట్టుకోలేకపోతున్నాను. 284 00:15:46,446 --> 00:15:47,614 అంటే ఇది పనిచేస్తోందన్నమాట. 285 00:15:47,698 --> 00:15:49,116 ఇప్పుడు వెన్ను నొప్పి ఎలా ఉంది? 286 00:15:49,199 --> 00:15:50,200 అలాగే ఉంది. 287 00:15:51,076 --> 00:15:54,329 ఆడమ్... నీ ఎదుట ఉన్నవాటిపై దృష్టి పెట్టు. 288 00:15:56,582 --> 00:15:59,084 బెంచ్ మార్క్ లో మమ్మల్ని మేము కేవలం డబ్బుగా చూసుకోము. 289 00:15:59,168 --> 00:16:03,463 మమ్మల్ని మేము లాభాలను తెచ్చిపెట్టే వాళ్లమని భావిస్తాం. 290 00:16:04,298 --> 00:16:08,886 అనుభవం, ఆర్ధిక క్రమశిక్షణ, మరికాస్త తెలివితేటలు అవసరం. 291 00:16:09,428 --> 00:16:12,639 మేం స్పెక్యులేటర్లం కాము. బ్లిట్జ్ స్కేల్ చేయం. 292 00:16:13,891 --> 00:16:15,058 మాది సాఫ్ట్ బ్యాంక్ కాదు. 293 00:16:18,187 --> 00:16:19,396 నేను చెప్పినదాని గురించి ఆలోచించు. 294 00:16:20,272 --> 00:16:23,317 తప్పకుండా, బ్రూస్. తప్పకుండా. 295 00:16:31,992 --> 00:16:33,160 - హలో? - డేమియన్. 296 00:16:33,243 --> 00:16:35,871 సాఫ్ట్ బ్యాంక్ లో మసయోషి సన్ తో నాకు మీటింగ్ ఏర్పాటు చెయ్యి. 297 00:16:35,954 --> 00:16:38,290 నువ్వేమన్నావు "సాఫ్" అనా? "సాఫ్ బ్యాంక్" ఒకే పదమా? 298 00:16:38,373 --> 00:16:40,334 సాఫ్-టా! టా, టా. 299 00:16:40,417 --> 00:16:41,919 సాఫ్ట్ బ్యాంక్ గురించి తెలియకుండా ఎలా ఉన్నావు? 300 00:16:42,461 --> 00:16:44,963 - ఏయ్, ఆడమ్. - ఫిల్, నాకోసం టోక్యోకి ప్లేన్ టికెట్ బుక్ చెయ్యి. 301 00:16:45,047 --> 00:16:46,840 ఆడమ్, ఇప్పుడే మాసా ఇన్ స్టాగ్రామ్ చూశా. 302 00:16:46,924 --> 00:16:49,134 - అతను టోక్యోలో లేడు. ఇండియాకి వెళ్లాడు. - ఏంటి? ఇండియాకా? 303 00:16:49,218 --> 00:16:52,346 - అవును, స్టార్టప్ ఇండియాలో పాల్గొనేందుకు. - స్టార్టప్ ఇండియా? 304 00:16:52,429 --> 00:16:54,973 నాకోసం ఒక ఆహ్వాన పత్రిక, మాట్లాడేందుకు అవకాశం సంపాదించు. 305 00:16:55,057 --> 00:16:58,393 ఆ సదస్సు ఇప్పుడు జరుగుతోంది. షెడ్యూల్ ముందే నిర్ణయమైపోయింది. 306 00:16:58,477 --> 00:17:01,313 వేగంగా ఎదుగుతున్న, 14 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన 307 00:17:01,396 --> 00:17:03,273 కంపెనీకి వ్యవస్థాపక సిఇఓ 308 00:17:03,357 --> 00:17:05,233 సదస్సుకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పు. 309 00:17:05,317 --> 00:17:06,359 - ఫిల్? - ఏంటి? 310 00:17:06,443 --> 00:17:08,737 మసయోషి సన్ గురించి వీలైనంత సమాచారం నాకు పంపు. 311 00:17:08,819 --> 00:17:11,656 అతను ఎక్కడ పెరిగాడు, ఎలా ఎదిగాడు వంటి అతని జీవిత సమాచారమంతా. 312 00:17:11,740 --> 00:17:13,492 మొత్తం సమాచారం. అర్థమైందా? 313 00:17:13,575 --> 00:17:17,663 నాకోసం తక్షణమే ఇండియాకి ఒక ప్లేన్ టికెట్ బుక్ చేయండి. 314 00:17:17,746 --> 00:17:18,789 ఇండియాలో ఎక్కడికి? 315 00:17:18,872 --> 00:17:20,999 ఇండియాలో ఎక్కడో నాకు తెలియదు నువ్వే కనుక్కో! 316 00:17:21,583 --> 00:17:25,546 అయాన్ ర్యాండ్. కానీ స్త్రీవాద వ్యతిరేక సమాచారం వంటిదేదీ అందులో లేదా? 317 00:17:25,628 --> 00:17:27,047 లేదు. 318 00:17:27,130 --> 00:17:30,759 శక్తిమంతమైన మహిళల్ని జనం అసహ్యించుకునేందుకే ఇష్టపడతారు. 319 00:17:30,843 --> 00:17:32,553 అది నిజమే. 320 00:17:32,636 --> 00:17:35,097 సారీ. నా భర్త ఫోన్ చేస్తున్నాడు. ఏమీ అనుకోవుగా? 321 00:17:35,180 --> 00:17:37,307 - లేదు, లేదు. మాట్లాడు. - నేను కాస్త... థాంక్యూ. 322 00:17:37,391 --> 00:17:38,475 హాయ్, లవ్. 323 00:17:39,226 --> 00:17:42,771 లేదు, మేం పాల్గొనలేదు. అక్కడొక ఫైర్ మార్షల్ మమ్మల్ని లోపలకి వెళ్లనీయలేదు. అదొక... 324 00:17:43,772 --> 00:17:46,024 - ఆగు, ఏంటీ? - నేను ఇండియా వెళ్తున్నానని చెబుతున్నా. 325 00:17:46,108 --> 00:17:48,944 కొన్ని రోజులే. ఇప్పుడు కార్లో ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నా. 326 00:17:50,153 --> 00:17:51,154 మనకు పెట్టుబడులు అవసరం. 327 00:17:51,238 --> 00:17:53,907 అక్కడొక పెట్టుబడిదారు ఉన్నాడు. చాలా ముఖ్యమైనవాడు. 328 00:17:54,491 --> 00:17:56,118 అద్భుతం. 329 00:17:57,244 --> 00:17:58,537 లేదు. ఇది చాలా... 330 00:17:59,746 --> 00:18:01,164 ఓకే, ఓకే, ఆడమ్. కానీ... 331 00:18:01,248 --> 00:18:04,418 గుర్తుంచుకో, డబ్బు ఎంతన్నది ముఖ్యం కాదు. మన లక్ష్యమే మనకు ముఖ్యం. 332 00:18:04,501 --> 00:18:07,004 - ఓకే, లవ్ యూ. ప్రియా. - అదే వి-వర్క్ ని ముందుకు తీసుకెళ్తోంది. 333 00:18:07,713 --> 00:18:08,630 హలో? 334 00:18:10,090 --> 00:18:11,425 సరే. 335 00:18:11,508 --> 00:18:12,759 సరే, లవ్ యూ. 336 00:18:14,094 --> 00:18:15,137 సారీ. థాంక్ యూ. 337 00:18:15,220 --> 00:18:17,848 వి-వర్క్ లో ఆడమ్ కి సంబంధించి చాలా మంచి పరిణామం చోటు చేసుకుంది. 338 00:18:17,931 --> 00:18:20,434 నువ్వు అతని పక్కన ఉన్నావు కాబట్టి నాకు అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. 339 00:18:20,517 --> 00:18:21,727 నువ్వు చాలా మంచిదానివి. 340 00:18:21,810 --> 00:18:23,854 లేదు. నిజంగా చెబుతున్నా. నువ్వు అదృష్టవంతురాలివి. 341 00:18:23,937 --> 00:18:27,191 అబ్బా, తోడునీడగా ఉండే జీవిత భాగస్వామి ఉంటే ఎంతో బాగుంటుంది. 342 00:18:27,274 --> 00:18:30,485 నా ఉద్దేశం, మార్క్ అయితే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టలేడు 343 00:18:30,569 --> 00:18:32,863 తనలో అంతర్గతంగా దాగి ఉన్న లోపలి మనిషికి దాన్ని వదిలేస్తాడు. 344 00:18:32,946 --> 00:18:35,115 అతను తన అసిస్టెంట్ సెసెకి వదిలిపెట్టేశాడు. 345 00:18:35,699 --> 00:18:37,201 అతని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. 346 00:18:37,284 --> 00:18:38,410 నాకు సాయం చెయ్యి. 347 00:18:38,493 --> 00:18:42,289 లోటుపాట్లతో కూడిన లోపలి మనిషిని చక్కదిద్దుకునే ఒక పుస్తకం గురించి నాకు తెలుసు. 348 00:18:42,372 --> 00:18:44,583 వాళ్లంతా చెత్త వెధవలు. అతను కూడా అలాంటివాడే, సారీ. 349 00:18:44,666 --> 00:18:47,252 - నాకు ఆ పుస్తకం కావాలి. - సరే. దాని పేరు ఓషన్స్ ఆఫ్ గ్రేస్. 350 00:18:47,336 --> 00:18:48,921 - ఓషన్స్ ఆఫ్ గ్రేస్. - చాలా బాగుంటుంది. 351 00:18:49,421 --> 00:18:50,422 మసయోషి సన్. 352 00:18:50,506 --> 00:18:52,299 పూర్తిగా బయటివ్యక్తి ఇప్పుడు టెక్నాలజీకే అధిపతి 353 00:18:52,382 --> 00:18:53,967 అతను కొరియన్ కావడంవల్ల క్లాస్ మేట్లు ఆటపట్టించేవారు 354 00:18:59,806 --> 00:19:03,352 ఫిల్, స్టార్టప్ ఇండియాకోసం నా పక్కన మరొక వ్యక్తి కూడా ఉండాలి. 355 00:19:06,813 --> 00:19:07,898 రెబెకా న్యూమాన్ 356 00:19:07,981 --> 00:19:09,608 గ్వినెత్ పాల్ట్రోకి రెబెకా న్యూమాన్ బంధువా? 357 00:19:09,691 --> 00:19:10,734 ఆడమ్ న్యూమాన్ ఆస్తుల విలువ? 358 00:19:10,817 --> 00:19:12,319 గ్వినెత్ పాల్ట్రోకి ఎంతమంది కజిన్లు ఉన్నారు? 359 00:19:16,281 --> 00:19:18,700 ఎలీషియా కెన్నడీ 360 00:19:21,161 --> 00:19:21,995 ఎలీషియాకి చెందిన రా రివైవల్ 361 00:19:22,079 --> 00:19:23,121 చల్లటి పండ్ల రసాల రంగంలో గొప్ప విషయం 362 00:19:27,042 --> 00:19:29,503 ఎలీషియా కెన్నడీకి చెందిన గొప్ప జ్యూస్ కంపెనీ 363 00:19:29,586 --> 00:19:30,921 ఎలీషియా జ్యూస్ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, 364 00:19:31,004 --> 00:19:32,005 దాన్ని అద్భుతమైన రీతిలో ఎలా నడుపుతోంది! 365 00:19:37,427 --> 00:19:38,428 ఇంగ్రిడ్. 366 00:19:39,179 --> 00:19:41,807 రేపు హార్లో మూన్ ని స్కూల్లో దింపడానికి నేను వెళ్తాను. 367 00:19:44,142 --> 00:19:45,477 నేనేమైనా తప్పు చేశానా? 368 00:19:51,149 --> 00:19:55,070 సరే, స్వీటీ, రోజంతా సంతోషంగా గడుపు. లవ్యూ, బై. 369 00:19:58,574 --> 00:19:59,867 - బై, అమ్మా. - బై. 370 00:20:02,744 --> 00:20:04,079 ఇటు, ఇటు. 371 00:20:04,162 --> 00:20:07,958 సంతోషంగా గడుపు. పాఠాలు బాగా వినాలి. లవ్ యూ. 372 00:20:10,544 --> 00:20:11,545 రెబెకా. 373 00:20:12,629 --> 00:20:14,339 ఎలీషియా, హాయ్. 374 00:20:14,423 --> 00:20:17,050 ఇంతకుముందెన్నడూ ఇలా అనుకోకుండా కలవలేదు కదా? 375 00:20:17,134 --> 00:20:19,011 - విధి అంటే ఇదేనేమో. - అవును! 376 00:20:19,094 --> 00:20:21,805 నీకొక సంగతి చెప్పనా, ఓషన్స్ ఆఫ్ గ్రేస్ పుస్తకం సగం చదివేశా. 377 00:20:21,889 --> 00:20:23,932 - దేవుడా, అది భలే బాగుంది. - నీకు నచ్చిందా? 378 00:20:24,016 --> 00:20:27,311 బాగుంది కదా? తర్వాత నువ్వు ఇన్నర్ గాడెస్ కూడా చదవాలి. 379 00:20:27,394 --> 00:20:28,896 ఒక్క క్షణం. ఏంటది? 380 00:20:28,979 --> 00:20:30,314 - ఇన్నర్ గాడెస్. - ఇన్నర్... 381 00:20:30,397 --> 00:20:32,608 - నీకు బాగా నచ్చుతుంది. - ఇప్పడు నాకొక గురువు దొరికింది. 382 00:20:33,609 --> 00:20:34,526 థాంక్ యూ. 383 00:20:34,610 --> 00:20:37,362 రెబెకా. నా దగ్గర జేడ్ ఎగ్ ఉంది. 384 00:20:37,446 --> 00:20:39,072 ఇప్పుడు దాన్ని ధరించే ఉన్నాను. 385 00:20:39,156 --> 00:20:41,241 - భలే, నికోల్. - గ్వినైత్ కి చెప్పు. 386 00:20:41,325 --> 00:20:42,326 సరే. 387 00:20:45,287 --> 00:20:47,706 - తన దగ్గర జేడ్ ఎగ్ ఉందట. - ఏంటది? 388 00:20:48,290 --> 00:20:53,420 అది గుడ్డు రూపంలో చెక్కిన రాయిలాంటిది... 389 00:20:55,589 --> 00:20:57,132 తొడ ఎముకలను గట్టి పరుస్తుంది. 390 00:20:57,716 --> 00:20:59,927 ఆ సంగతి గ్వినైత్ పాల్ట్రోకి చెప్పమంటుందేంటి? 391 00:21:00,010 --> 00:21:04,264 గ్వినైత్ నాకు కజిన్ అవుతుంది, వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచీ ఫ్రెండ్స్. 392 00:21:04,348 --> 00:21:07,935 ఆమెను మళ్లీ కలవాలని అనుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని తనే చెప్పవచ్చుగా. 393 00:21:09,478 --> 00:21:10,854 టీ తాగుదామా? 394 00:21:10,938 --> 00:21:13,565 - తాగాలనే ఉంది, కానీ నేను ఆఫీస్ కి వెళ్లాలి. - ఆ, అలాగే, ఫరవాలేదు. 395 00:21:13,649 --> 00:21:16,693 ఈ రాత్రికి డ్రింక్ కి కలుద్దామా? 396 00:21:16,777 --> 00:21:18,070 నేను ఖాళీగానే ఉన్నాను. 397 00:21:18,570 --> 00:21:19,988 ముంబయి 398 00:21:22,950 --> 00:21:27,955 36 మిలియన్ డాలర్ల పోస్ట్ మనీ వాల్యుయేషన్ కి మా సీరీస్ బి పెంచిన తర్వాత, 399 00:21:28,038 --> 00:21:31,625 ప్రపంచవ్యాప్తంగా కోరల్ రీఫ్ లు మనుగడకోసం పోరాడుతున్నాయి. 400 00:21:31,708 --> 00:21:33,335 పేటెంట్ పొందిన మా సాంకేతిక పరిజ్ఞానం... 401 00:21:33,418 --> 00:21:34,419 ...కొన్ని నెలల్లోనే సాకారమైంది. 402 00:21:34,503 --> 00:21:37,256 అభివృద్ధి సాధించిన మా క్లౌడ్ నేటివ్ పర్యవేక్షణా ఉపకరణం. 403 00:21:42,135 --> 00:21:43,011 - ఎస్. - ఏ. 404 00:21:43,095 --> 00:21:44,054 - ఏ. - ఎస్. 405 00:21:44,137 --> 00:21:46,265 సాఫ్ట్ వేర్ ఏజ్ ఏ సర్వీస్. 406 00:21:56,567 --> 00:22:00,195 - అబ్బా! - ఆడమ్. హేయ్. 407 00:22:01,446 --> 00:22:04,533 హేయ్. హేయ్, హేయ్, హేయ్. 408 00:22:04,616 --> 00:22:06,535 నిన్నిలా కలవడం బాగుంది. 409 00:22:06,618 --> 00:22:07,661 ఇది అద్భుతంగా ఉంది. 410 00:22:07,744 --> 00:22:10,038 ఆకట్టుకునే విధంగా తయారుకావడం నాకు ఇష్టం. 411 00:22:10,122 --> 00:22:13,333 నన్ను ఆహ్వానించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. 412 00:22:13,834 --> 00:22:15,502 పద, ఏదైానా తిని వద్దాం, సరేనా? 413 00:22:15,586 --> 00:22:16,795 - అలాగే. - కాస్త తిను. 414 00:22:16,879 --> 00:22:18,213 నా గది ఎలా ఉందో చెబితే నువ్వు నమ్మలేవు. 415 00:22:18,297 --> 00:22:21,758 నాకంటూ ఒక పియానో ఉంది, ప్రైవేట్ బట్లర్ ఉన్నాడు, నా బట్టలు సర్దింది అతనే. 416 00:22:21,842 --> 00:22:26,180 ఇక మినీ బార్ నిజంగా మినీ బార్ లా లేదు. ఇంట్లో నా ఫ్రిజ్ అంత ఉంది. 417 00:22:26,263 --> 00:22:27,806 గదిలో ఏముందిలే. 418 00:22:27,890 --> 00:22:30,517 నిన్ను తాజ్ మహల్ కు తీసుకువెళ్తాను. 419 00:22:31,101 --> 00:22:35,355 నా కుమారుడి ప్రసంగం వినాలని నాకెంతో ఆరాటంగా ఉంది. 420 00:22:42,529 --> 00:22:45,908 సోదర సోదరీమణులారా, వి-వర్క్ వ్యవస్థాపక సిఇఓ 421 00:22:45,991 --> 00:22:47,784 ఆడమ్ న్యూమాన్. 422 00:22:49,953 --> 00:22:52,039 #స్టార్టప్ ఇండియా 423 00:23:06,553 --> 00:23:10,098 నాకు పదమూడేళ్ల వయసున్నప్పుడు, నా తల్లిదండ్రులు విడిపోయారు. 424 00:23:13,018 --> 00:23:16,688 నాకు దిక్కు తోచలేదు. 425 00:23:17,189 --> 00:23:21,610 నా చెల్లెలు, నేనూ అమ్మతోపాటే ఉండేవాళ్ళం. నాకు 18ఏళ్ల వయసు వచ్చేలోగా మేం 13 సార్లు ఇళ్లు మారాం. 426 00:23:21,693 --> 00:23:23,570 పదమూడుసార్లు. 427 00:23:23,654 --> 00:23:28,116 అంటే 13 కొత్త స్కూళ్లు, 13 మొదటి రోజులు, 13 మారిన రోజులూ, 428 00:23:28,200 --> 00:23:30,327 మళ్లీ మొదటినుంచీ ఆరంభించాలని నాకు తెలుసు. 429 00:23:31,620 --> 00:23:35,499 కొత్త స్నేహితులు, కొత్త నిబంధనలు, కొత్తగా ఆటపట్టించేవాళ్లు. 430 00:23:36,625 --> 00:23:39,795 మా నాన్న మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. 431 00:23:39,878 --> 00:23:42,965 డబ్బు ఉండేది కాదు, మా ఆర్ధిక పరిస్థితి నన్ను కలవరపరిచేది, 432 00:23:43,048 --> 00:23:46,176 నాకు పదేళ్ల వయసప్పుడు మా అమ్మ అద్దె నేను కట్టడం మొదలుపెట్టాను. 433 00:23:47,594 --> 00:23:50,681 చివరకు, మేం కిబుజ్ లో స్ధిరపడ్డాం. 434 00:23:51,807 --> 00:23:54,268 చెప్పాలంటే, 435 00:23:54,351 --> 00:23:59,940 నేను ఈ ప్రాంతానికి చెందినవాడినేనని నాకు మొట్టమొదట అనిపించిన ప్రాంతం అదే. 436 00:24:01,817 --> 00:24:04,486 పిల్లలందరూ ఒకే గదిలో పడుకునేవాళ్లం. 437 00:24:04,570 --> 00:24:06,905 ఒకే కేఫటేరియాలో తినేవాళ్ళం, 438 00:24:06,989 --> 00:24:13,787 నా జీవితంలో మొదటిసారి, నాకంటూ ఓ ప్రాంతం ఉందనిపించింది. 439 00:24:16,373 --> 00:24:21,461 20 ఏళ్ల వయసులో, నేను న్యూ యార్క్ కి వచ్చాక, ఒక విభిన్నమైన అనుభవం ఎదురైంది. 440 00:24:21,545 --> 00:24:25,299 ఈ ప్రపంచంలోనే ఒంటరి ప్రదేశానికి వచ్చానని అనిపించింది. 441 00:24:26,842 --> 00:24:29,303 జనమంతా కలిసి బతుకుతున్నా 442 00:24:29,386 --> 00:24:30,721 దూరం దూరంగానే ఉంటున్నారు. 443 00:24:30,804 --> 00:24:33,223 విడిగా. ఎవరికీ ఏమీ పట్టనట్లుగా. 444 00:24:34,224 --> 00:24:38,687 అప్పుడు "దీనికి మరో దారంటూ ఉండే ఉంటుంది" అని నేను అనుకున్నాను. 445 00:24:39,730 --> 00:24:43,317 వి-వర్క్ అనేది ఒక డెస్క్ కంపెనీ కాదు. 446 00:24:43,400 --> 00:24:46,069 అది వర్క్ స్పేస్ ను షేర్ చేసుకునే కంపెనీ కూడా కాదు. 447 00:24:46,153 --> 00:24:50,032 అదొక విప్లవం, ఒక సముదాయం. 448 00:24:50,949 --> 00:24:52,201 నిజాయితీగా చెప్పాలంటే, 449 00:24:52,743 --> 00:24:55,996 నా జీవితాంతం నేను వెతుకుతున్న ప్రతీదీ ఇందులో ఉంది. 450 00:24:56,079 --> 00:24:58,040 ఇదొక అద్భుతమైన ప్రయాణం. 451 00:24:58,123 --> 00:25:03,128 నమ్మశక్యం కాని కొత్త బంధాలను ఏర్పరచుకున్నాను, పాతవాటికి మరమ్మతులు చేశాను. 452 00:25:04,588 --> 00:25:07,508 నా తండ్రి నిజానికి ఇవాళ ఇక్కడే ఉన్నాడు. 453 00:25:08,300 --> 00:25:12,930 ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మేం ఇప్పుడు సన్నిహితంగా ఉన్నాం. 454 00:25:14,389 --> 00:25:15,682 అబ్బా. చెయ్యి పైకెత్తు. 455 00:25:16,892 --> 00:25:19,061 అబ్బా, చెయ్యి పైకెత్తు. 456 00:25:22,439 --> 00:25:24,149 అవును. అవును. 457 00:25:29,863 --> 00:25:32,824 ఒంటరితనానికి స్వస్తి చెప్పాలనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. 458 00:25:35,202 --> 00:25:36,411 మీకొక విషయం చెప్పాలి. 459 00:25:41,917 --> 00:25:45,045 చిన్నతనంలో నువ్వు అప్పుడప్పుడు నవ్వేవాడివని ఖచ్చితంగా చెప్పగలను. 460 00:25:46,380 --> 00:25:49,216 అబ్బా, నేను నిన్ను తప్పుపట్టడం లేదు, సరేనా? 461 00:25:49,299 --> 00:25:51,301 బాధ అనేది జీవితంలో ఒక భాగం. 462 00:25:51,385 --> 00:25:53,762 అయితే ఇదంతా వినడానికే నన్ను ఇక్కడకు రమ్మన్నావా? 463 00:25:54,346 --> 00:25:55,931 లేకపోతే ఇదంతా నీ వ్యాపారంలో నన్ను వాడుకునేందుకా? 464 00:25:56,014 --> 00:25:57,307 ఇది నీ గురించి కాదు. 465 00:25:57,391 --> 00:25:58,392 మన్నించాలి. 466 00:26:00,519 --> 00:26:01,520 న్యూమాన్ 467 00:26:02,980 --> 00:26:05,899 మీ ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. 468 00:26:05,983 --> 00:26:07,192 చాలా సంతోషం. 469 00:26:07,276 --> 00:26:08,652 మసయోషి సన్. 470 00:26:08,735 --> 00:26:10,195 ఆడమ్. ఆడమ్ న్యూమాన్ 471 00:26:10,279 --> 00:26:13,031 ఆడమ్. మీ కంపెనీ వృద్ధి ఎలా ఉందనుకుంటున్నావు? 472 00:26:13,115 --> 00:26:16,952 మా వృద్ధా? అసంతృప్తికరంగా. 473 00:26:17,035 --> 00:26:19,496 మా కంపెనీ అమెజాన్ కంటే మూడింతలు పెద్దదిగా ఉండాలి. 474 00:26:20,163 --> 00:26:21,290 గుడ్. 475 00:26:21,373 --> 00:26:24,835 ఒకసారి నువ్వు సంతృప్తి చెందావంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. 476 00:26:25,794 --> 00:26:28,463 కానీ అమెజాన్ ఒక టెక్ కంపెనీ. 477 00:26:28,547 --> 00:26:31,466 తక్కువ వ్యయం, విస్తరణకు అపారమైన అవకాశాలు గలది. 478 00:26:31,550 --> 00:26:37,222 విస్తరణకు వి-వర్క్ కు గల అవకాశాలు కూడా అపారమైనవే. 479 00:26:38,182 --> 00:26:41,435 ఒక కోవర్కింగ్ కంపెనీ "టెక్" కంపెనీ ఎలా అవుతుంది? 480 00:26:42,144 --> 00:26:45,105 వి-వర్క్ కి రండి, మీకు చూపిస్తాను. 481 00:26:45,731 --> 00:26:46,940 ఈసారి న్యూ యార్క్ కి వస్తాను. 482 00:26:48,567 --> 00:26:50,235 బాగుంది. 483 00:26:51,653 --> 00:26:52,654 సంతోషం. 484 00:26:54,031 --> 00:26:56,200 - ఎవరాయన? - నా ప్రేక్షకుల్లో ఒకరు. 485 00:27:04,374 --> 00:27:05,918 నువ్వు నిజంగా జీవించావు. 486 00:27:06,960 --> 00:27:07,961 ఏంటీ? 487 00:27:08,045 --> 00:27:11,298 నటన, ఇండియా, వాల్ స్ట్రీట్. 488 00:27:11,381 --> 00:27:13,509 ఈ కళలన్నింటినీ నేను కంపెనీ ఆత్మను నిలబెట్టేందుకు 489 00:27:13,592 --> 00:27:16,512 చేస్తున్న ప్రయత్నాలు. 490 00:27:17,721 --> 00:27:19,181 కంపెనీలకు ఆత్మలు ఉంటాయా? 491 00:27:20,432 --> 00:27:21,517 మా కంపెనీకి ఉంది. 492 00:27:21,600 --> 00:27:25,103 ఉంది. నువ్వు వస్తే, నీ కళ్ళతో నువ్వే చూడవచ్చు, సరేనా? 493 00:27:26,271 --> 00:27:28,732 ఈ చోటు గురించి నీకెలా తెలుసు? 494 00:27:28,815 --> 00:27:31,485 ఇదివరకు నేనూ, ఆడమ్ ఇక్కడకు వస్తూ ఉండేవాళ్లం. 495 00:27:33,570 --> 00:27:38,408 అయ్యో పాపం, ఆడమ్. ఇప్పుడీ చోటు మాది. 496 00:27:41,119 --> 00:27:43,330 - థాంక్ యూ. చీర్స్. - చీర్స్. 497 00:27:44,540 --> 00:27:45,541 దేవుడా. 498 00:27:46,875 --> 00:27:48,377 ఆ ఇద్దరు వెధవల్నీ చూడు. 499 00:27:50,420 --> 00:27:54,341 మొదట్లో ఈ మగాళ్లు నీవెంట కూడా పడేవారనుకుంటా, అవునా? 500 00:27:54,424 --> 00:27:56,844 వాళ్లకు నువ్వు కావాలి. అది మత్తులాంటిది. 501 00:27:56,927 --> 00:28:01,306 - కానీ అది నిరాశతోనే ముగుస్తుంది! - ఎల్లప్పుడూ కాదు. ఇక ఆపు. 502 00:28:01,390 --> 00:28:04,601 విడాకులు నన్ను ద్వేషపూరితంగా మార్చేశాయి. 503 00:28:04,685 --> 00:28:08,272 కోపాన్ని పెంచాయి, నన్ను క్రూరంగా మార్చాయి. 504 00:28:08,355 --> 00:28:09,356 కాస్త క్రూరంగా. 505 00:28:11,108 --> 00:28:12,734 ఇది నిజంగా విచారకరం. 506 00:28:14,194 --> 00:28:16,113 సారీ. 507 00:28:16,196 --> 00:28:18,282 అవును, ఎందుకంటే నీకు ఇంకా ప్రేమపై నమ్మకం ఉంది. 508 00:28:18,365 --> 00:28:22,953 లేదు. ఎందుకంటే నువ్వు తెలివైనదానివి, 509 00:28:23,996 --> 00:28:27,291 అందమైన, దయగలదానివి. 510 00:28:27,374 --> 00:28:29,376 నిన్ను చూడగానే తెలుసుకున్నాను. 511 00:28:31,211 --> 00:28:35,215 నీకు ఏది కావాలన్నా, ఎవరు కావాలన్నా నువ్వు పొంది తీరతావు. 512 00:28:36,175 --> 00:28:37,551 నువ్వొక సూపర్ నోవావి. 513 00:28:38,969 --> 00:28:40,095 నీకు చీర్స్. 514 00:28:41,555 --> 00:28:43,223 నీకు ఆకాశమే హద్దు. 515 00:28:43,307 --> 00:28:44,474 - నాకోసం. - నీకోసం. 516 00:28:44,558 --> 00:28:45,767 - నాకోసం! - నీకోసం! 517 00:28:45,851 --> 00:28:47,352 నీకోసం! 518 00:29:13,045 --> 00:29:17,007 గుడ్ మార్నింగ్, ఫిల్. తను బతికే... సరే, మంచిది. 519 00:29:19,593 --> 00:29:23,847 - ఇంగ్రిడ్, కాస్త సాయం చెయ్యి. - నాన్నలాగే నేనూ చెప్పులు వేసుకోను! 520 00:29:23,931 --> 00:29:26,350 హాయ్, నీ కూతురు బూట్లు వేసుకోదట. ఇంతకీ ఇండియా ఎలా ఉంది? 521 00:29:27,726 --> 00:29:30,145 - నువ్వు వచ్చేశావా? ఏంటీ? - పదండి, పిల్లలూ. రండి. 522 00:29:30,229 --> 00:29:33,148 - మరి ఇంటికి రాలేదేం? - ఇంకొక ముద్దు. పదండి. 523 00:29:34,525 --> 00:29:36,735 న్యూమాన్, హార్లోని మీరు స్కూలుకి తీసుకెళ్తారా? 524 00:29:37,986 --> 00:29:39,279 ఏంటీ? లేదు. 525 00:29:41,406 --> 00:29:43,408 సాస్ 526 00:29:43,492 --> 00:29:45,285 సాస్? సాస్ అంటే ఏంటి? 527 00:29:45,369 --> 00:29:46,620 సాఫ్ట్ వేర్ ఏజ్ ఏ సర్వీస్ 528 00:29:46,703 --> 00:29:48,705 స్పేస్ ఏజ్ ఏ సర్వీస్. 529 00:29:48,789 --> 00:29:50,290 అది "సాఫ్ట్ వేర్" అయ్యుంటుంది. 530 00:29:50,374 --> 00:29:51,416 ఇప్పుడు "స్పేస్" అయింది. 531 00:29:51,500 --> 00:29:53,544 టెక్నాలజీవైపు మారేందుకు మనకు ఇది ఇరుసులాంటిది. 532 00:29:53,627 --> 00:29:56,421 మాసాకు చెందిన విజన్ ఫండ్ టెక్ కంపెనీలపైనే పెట్టుబడి పెడుతోంది. 533 00:29:56,505 --> 00:29:59,550 మసయోషి సన్ మనదాంట్లో పెట్టుబడులు పెడుతున్నాడా? 534 00:29:59,633 --> 00:30:01,426 ఇంకా పెట్టలేదు. పెడతాడు. 535 00:30:01,510 --> 00:30:03,929 సూసన్, నువ్వు కొందరు ఇంజనీర్లను నియమించు. 536 00:30:04,012 --> 00:30:05,472 ఏ రకం ఇంజనీర్లు? 537 00:30:06,682 --> 00:30:07,683 అన్ని రకాలవాళ్లూ. 538 00:30:08,725 --> 00:30:10,060 రోజుకు -1.9 మిలియన్ డాలర్లు. 539 00:30:10,143 --> 00:30:12,980 ఆడమ్, నువ్వు మాకు నిధులు అందజేయాలి. 540 00:30:13,897 --> 00:30:15,941 కానీ నువ్వే మమ్మల్ని మరింత ఖర్చు పెట్టమంటున్నావేంటి? 541 00:30:16,024 --> 00:30:18,902 మిగెల్, మనం ఎదగడానికి ఖర్చు చేయాలి. ఎదగడానికి ఖర్చుచేయాలి. 542 00:30:18,986 --> 00:30:21,947 అర్థమైందా? సూక్ష్మదృష్టితో ఆలోచించే సమయం కాదిది. 543 00:30:22,614 --> 00:30:25,701 నువ్వు సంతృప్తి చెందితే ఎదుగుదల ఆగిపోతుంది. 544 00:30:25,784 --> 00:30:27,619 ఆడమ్, నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, 545 00:30:27,703 --> 00:30:30,205 వచ్చి నీతో కలసి రేపటిని నిర్మించమని అడిగావు. 546 00:30:30,289 --> 00:30:31,999 కానీ, నువ్వు చేస్తున్నది అందుకు తగ్గట్లుగా లేదు. 547 00:30:32,082 --> 00:30:34,668 లెస్లీ, ఇది వి-వర్క్ భవిష్యత్తు. 548 00:30:34,751 --> 00:30:37,713 దాన్ని నువ్వు చూడలేకపోతే, నువ్వు ఉద్యోగం వదిలి వెళ్లొచ్చు. 549 00:30:37,796 --> 00:30:39,756 సూసన్, ఇంజనీర్లు. 550 00:30:40,924 --> 00:30:42,843 ఓకె. ఓకె. డేమియన్! 551 00:30:44,428 --> 00:30:45,512 డేమియన్! 552 00:30:46,430 --> 00:30:47,598 - డేమియన్! - ఏంటి? 553 00:30:47,681 --> 00:30:51,143 వి-వర్క్ లాబ్స్ ను లోపలినుంచి నిశితంగా పరిశీలించమని వైర్డ్ మ్యాగజైన్ వాళ్లకు చెప్పు. 554 00:30:51,226 --> 00:30:52,227 - సరేనా? - సరే. 555 00:30:52,936 --> 00:30:55,939 ఆడమ్, ఇంతకీ వి-వర్క్ లాబ్స్ అంటే ఏంటి? 556 00:30:56,023 --> 00:30:57,232 రేపు ఎలా ఉంటుందో చెప్పేదే వి-వర్క్ లాబ్స్ 557 00:30:57,316 --> 00:30:58,317 వైర్డ్ 558 00:30:58,400 --> 00:31:00,569 వర్క్ ప్లేస్ లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వి-వర్క్ 559 00:31:05,157 --> 00:31:06,325 నో కాలర్ ఐడి 560 00:31:07,242 --> 00:31:09,494 - హలో? - నేను న్యూ యార్క్ లో ఉన్నాను. 561 00:31:09,578 --> 00:31:11,705 మరో 15 నిమిషాల్లో మీ ఆఫీసుకి వస్తాను. 562 00:31:12,456 --> 00:31:14,750 అద్భుతం. అద్బుతం. త్వరగా రండి. 563 00:31:14,833 --> 00:31:15,959 కలుద్దాం, మాసా. 564 00:31:16,543 --> 00:31:17,544 ఫిల్! 565 00:31:24,218 --> 00:31:26,428 అందరూ వినండి! వినండి! 566 00:31:26,512 --> 00:31:29,348 ఒక ప్రముఖ వ్యక్తి మన ఆఫీసుని చూడటానికి రాబోతున్నాడు. 567 00:31:29,431 --> 00:31:32,059 వి-వర్క్ ఎనర్జీ ఎలా ఉంటుందో... 568 00:31:32,142 --> 00:31:37,439 అతను చూసి అర్థం చేసుకునేలా మనం చేయగలగాలి. 569 00:31:37,523 --> 00:31:38,732 ఉత్సాహభరితంగా ఉండాలి. 570 00:31:44,696 --> 00:31:46,865 మీ అందరికీ 100 షేర్ల చొప్పున ఇస్తాను, సరేనా? 571 00:31:48,575 --> 00:31:52,746 సరే, మీలో కొంతమందిని కాస్త అటూ ఇటూ మారుస్తాను, ఓపిక పట్టండి. 572 00:31:52,829 --> 00:31:55,165 నువ్వు, నువ్వు, నువ్వు. నీ పేరేంటి? 573 00:31:55,249 --> 00:31:56,416 బ్రయాన్. 574 00:31:56,500 --> 00:31:57,501 - ఏంటి? - బ్రయాన్. 575 00:31:57,584 --> 00:32:01,004 బ్రయాన్? బ్రయాన్. ఏ డిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? 576 00:32:01,088 --> 00:32:02,172 నేను ఇక్కడ పనిచేయట్లేదు. 577 00:32:02,256 --> 00:32:03,340 - ఫిల్. - చెప్పు? 578 00:32:03,423 --> 00:32:04,591 ఇతను ఇకపై ఇక్కడే పనిచేస్తాడు. 579 00:32:04,675 --> 00:32:05,676 - హాయ్, బ్రయాన్. - ఇక్కడ కూర్చో. 580 00:32:05,759 --> 00:32:07,052 - సరే. - కూర్చో. 581 00:32:07,135 --> 00:32:08,720 నువ్వు, దయచేసి నుంచో. 582 00:32:08,804 --> 00:32:10,430 నువ్వు నవ్వుతున్నావు. 583 00:32:11,807 --> 00:32:14,643 లోపలినుంచి నవ్వాలి. లోపలి నుంచి. 584 00:32:16,395 --> 00:32:17,396 ఫిల్. 585 00:32:17,479 --> 00:32:20,858 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. ఇది పిచ్చాసుపత్రి కాదు. 586 00:32:20,941 --> 00:32:23,652 ఫిల్, వీళ్లకి ఎలా నవ్వాలో చూపించు. 587 00:32:23,735 --> 00:32:24,736 ఫిల్ నవ్వినట్లుగా నవ్వాలి. 588 00:32:26,905 --> 00:32:29,157 మీరిద్దరూ చక్కటి జంట అవుతారు. 589 00:32:29,241 --> 00:32:30,701 డేటింగ్ లో ఉన్నారా? 590 00:32:30,784 --> 00:32:32,953 డేటింగ్ చేయాలి. చూడముచ్చటైన జంటగా ఉంటారు. 591 00:32:33,036 --> 00:32:34,788 నీ మొహంలో ప్రేమ తొణికిసలాడనీ. 592 00:32:37,749 --> 00:32:41,461 ముగ్గురూ ప్రేమగా మాట్లాడుకోండి. ఇక్కడ కూర్చోండి. లేదు, లేదు. ఇక్కడ కూర్చోండి. 593 00:32:41,545 --> 00:32:43,505 ఫిల్, అందరికీ కాఫీ పంపించు. 594 00:32:43,589 --> 00:32:46,758 అంతా వినండి. చాలా ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. 595 00:32:46,842 --> 00:32:52,097 మనం ఈ ప్రదేశాన్ని ఉత్సాహంతోనూ, దయతోనూ ఉత్తేజితం చేద్దాం. 596 00:32:52,181 --> 00:32:53,265 మీకు నచ్చిన పని చేయండి. 597 00:32:53,348 --> 00:32:54,474 లేహైమ్! 598 00:32:54,558 --> 00:32:55,809 - చీర్స్. - చీర్స్! 599 00:32:55,893 --> 00:32:57,394 - ఫిల్, టైమ్. - మూడు నిమిషాలు. 600 00:32:57,477 --> 00:32:58,854 ఎవరో ఒకరు డాన్స్ చేస్తూ ఉండాలి. 601 00:33:00,814 --> 00:33:01,857 ఒక్క నిమిషం. 602 00:33:01,940 --> 00:33:05,819 శక్తి, ప్రేమ, కోరిక, సృజనాత్మకత. 603 00:33:05,903 --> 00:33:09,448 ఫుస్బాల్. విజేతకు మరో 100 షేర్లు లభిస్తాయి. 604 00:33:09,531 --> 00:33:11,158 నీ పేరేంటి? 605 00:33:11,241 --> 00:33:13,660 - హోలీ. - నాతో రా, హోలీ. 606 00:33:13,744 --> 00:33:16,914 సరే, ఇక్కడ. నిలబడు, నిలబడు. నువ్వు... 607 00:33:22,044 --> 00:33:24,171 అతని ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. తన ప్రోగ్రామ్ ని మార్చుకున్నాడట. 608 00:33:26,340 --> 00:33:27,591 ఇక్కడ అద్భుతమైన ఎనర్జీ ఉంది. 609 00:33:27,674 --> 00:33:30,802 రోజుకి -2.1 మిలియన్ డాలర్లు. 610 00:33:33,472 --> 00:33:34,473 నువ్వు చూస్తావా? 611 00:33:35,057 --> 00:33:36,725 చూస్తాను. 612 00:33:38,352 --> 00:33:39,353 ఏంటి? 613 00:33:42,105 --> 00:33:43,815 నేను దీన్ని అధిగమించగలను. 614 00:33:44,608 --> 00:33:45,984 నేను తిరిగి ఏం రాయాలి? 615 00:33:46,652 --> 00:33:47,861 "కొత్త ఫోన్. ఎవరు మీరు?" అని. 616 00:33:47,945 --> 00:33:49,279 నోర్మూసుకో. 617 00:33:53,075 --> 00:33:55,202 ఈ గణాంకాలు అంత బాగోలేవు. 618 00:33:55,285 --> 00:34:00,123 చూశావుగా? వీటిని సరిచేసేందుకు అకౌంటింగ్ ట్రిక్కులు ఏమీ లేవు. 619 00:34:00,207 --> 00:34:04,461 అద్దెలపై ఎక్కువ ఖర్చు చేయలేం. ఎక్కువ కాలపరిమితితో లీజులకు కట్టుబడలేం. 620 00:34:04,545 --> 00:34:06,880 - అలాగే సభ్యత్వ రాయితీలు ఇవ్వలేం. - బాగా చెప్పావు. 621 00:34:07,714 --> 00:34:10,926 మేం ఇక్కడ రోజంతా కూర్చుంటాం. కానీ దానివల్ల గణాంకాలు మారవు. 622 00:34:11,927 --> 00:34:13,178 నువ్వు ఆడమ్ తో మాట్లాడు. 623 00:34:16,181 --> 00:34:18,891 మేం మరొకసారి గణాంకాలను పరిశీలించగలం. 624 00:34:18,976 --> 00:34:22,396 కానీ అవి మారేవి కావు. ఇది పనిచేసేది ఇలా మాత్రం కాదు. 625 00:34:22,478 --> 00:34:25,690 మిగెల్, మనం ఏదో ఒకటి చేయాలి. 626 00:34:25,774 --> 00:34:28,150 అవును, కానీ కంపెనీ వృద్ధి చెందాలంటే మనం ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. 627 00:34:28,235 --> 00:34:30,571 అది మంచిది కాదు. ఇదేమీ కారు బంపర్ పై అంటించే ప్రకటన కాదు. 628 00:34:31,864 --> 00:34:35,242 సరే, కానీ మనం వృద్ధిని ఆపట్లేదు. 629 00:34:38,745 --> 00:34:40,371 ఏం చేస్తున్నావు నువ్వు? 630 00:34:41,456 --> 00:34:45,127 చూసి నేర్చుకునే గుణం నీకుంటే, దీన్ని చూస్తే నీకు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. 631 00:34:46,503 --> 00:34:49,715 సరే. ఎవరో ఒకరు ఏదైనా దారి చూపించండి. 632 00:34:49,797 --> 00:34:53,467 చెప్పండి. మీరందించే సేవల కోసం మేం వేలాది డాలర్లు వెచ్చిస్తున్నాం. 633 00:34:56,388 --> 00:34:57,389 ఏదైనా మార్గం చూపించండి. 634 00:34:58,140 --> 00:34:59,516 ఇది మా పని కాదు. 635 00:35:02,102 --> 00:35:03,228 ఉద్యోగుల తొలగింపు. 636 00:35:03,312 --> 00:35:05,230 చెత్త సలహా, మాథ్యూ. 637 00:35:05,314 --> 00:35:07,983 మీ మనోభావాలకు దెబ్బ తగిలితే క్షమించండి. 638 00:35:08,066 --> 00:35:10,694 తన సహ వ్యవస్థాపకుడితో మాట్లాడేందుకు ఇతను ఇంతగా భయపడుతుంటే... 639 00:35:10,777 --> 00:35:11,778 చెత్తగా వాగకు, మాథ్యూ. 640 00:35:11,862 --> 00:35:14,948 ...మనం తాగిన సైనికుల్లా ఖర్చు చేస్తూనే ఉంటే. 641 00:35:15,032 --> 00:35:17,075 ఇక మనకు అవకాశాలు ఏమీ ఉండవు. 642 00:35:17,159 --> 00:35:19,036 కాబట్టి, ఇక మిగిలింది ఉద్యోగుల తొలగింపే. 643 00:35:20,829 --> 00:35:22,414 ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదు. 644 00:35:24,333 --> 00:35:26,710 ఆడమ్ నీ మాటలు వింటే, నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు. 645 00:35:26,793 --> 00:35:29,171 ఏదైనా సలహా చెప్పండి. 646 00:35:30,506 --> 00:35:33,175 హాలీవుడ్ బౌలీవార్డ్ లో 48,000 చదరపు అడుగులు... 647 00:35:33,258 --> 00:35:34,635 మాసా వస్తున్నాడు. 648 00:35:38,472 --> 00:35:40,349 ఈ చోటుని ఉత్తేజితం చేయండి! 649 00:35:41,141 --> 00:35:44,144 ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మీ మీ పొజిషన్లలోకి వెళ్లండి. 650 00:35:44,228 --> 00:35:45,896 "ప్రదేశాన్ని ఉత్తేజితం చేయడం" అంటే అదే. 651 00:35:50,943 --> 00:35:51,944 అతని కార్యక్రమం మళ్లీ రద్దయింది. 652 00:35:53,779 --> 00:35:56,865 రోజుకు -2.3 మిలియన్ డాలర్లు. 653 00:35:57,783 --> 00:35:58,951 హేయ్. 654 00:36:00,160 --> 00:36:01,495 ఈ రోజు ఎలా గడిచింది? 655 00:36:22,599 --> 00:36:28,689 ఆర్లింగ్టన్ లో 4.9 మిలియన్లతో, డెన్వర్ లో6.3 మిలియన్లతో నిర్మాణాలు పూర్తయ్యాయి. 656 00:36:28,772 --> 00:36:32,734 శాన్ డియాగోలో 8.2 మిలియన్ల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. 657 00:36:32,818 --> 00:36:36,238 - ఆర్టింగ్టన్ లో సభ్యుల నియామకానికి అయిన ఖర్చులు... - మనకు ఇంకా ఎంత సమయం ఉంది? 658 00:36:36,822 --> 00:36:39,908 నువ్వేమంటావు, జాన్? బహుశా నువ్వు... 659 00:36:39,992 --> 00:36:41,660 మేధావుల్లారా, దీనికి సమాధానం నేను చెబుతా. 660 00:36:41,743 --> 00:36:42,744 నష్టాలనే దెబ్బలతో రక్తమోడుతోంది. 661 00:36:42,828 --> 00:36:46,290 దానికి వెంటనే డబ్బు అనే రక్తం ఎక్కించాలి, లేదంటే కుప్పకూలిపోతాం. 662 00:36:47,207 --> 00:36:48,500 ఇంకో మార్గం ఆస్తులు అమ్ముకోవడం. 663 00:36:49,042 --> 00:36:51,295 మనకు ఎంత సమయం ఉంది? 664 00:36:51,378 --> 00:36:54,631 ఏ ఏడాది, ఏ క్వార్టరో చెప్పండి. 665 00:36:55,382 --> 00:36:58,468 ఏళ్లు కాదు, మిగెల్. మేం చెబుతున్నది నెలలే. 666 00:37:02,890 --> 00:37:05,517 ఆడమ్ న్యూమాన్ 667 00:37:06,894 --> 00:37:07,978 మాసా 668 00:37:10,689 --> 00:37:13,859 ఈ చోటుని ఉత్తేజితం చేయండి! 669 00:37:16,528 --> 00:37:17,529 ఆడమ్... 670 00:37:17,613 --> 00:37:18,614 రోజుకి -2.4 మిలియన్ డాలర్లు. 671 00:37:18,697 --> 00:37:19,740 ...మనం మాట్లాడుకోవాలి. 672 00:37:23,660 --> 00:37:28,248 ఆడమ్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం అనుకున్నాం, 673 00:37:28,332 --> 00:37:32,211 ఆ రోజు రానే వచ్చింది. నా ఉద్దేశం... 674 00:37:34,796 --> 00:37:38,050 ఆడమ్, మన కంపెనీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 675 00:37:38,133 --> 00:37:41,887 నీ వద్ద రెండే రెండు దారులున్నాయి. ఒకటి, తక్షణం 12 లొకేషన్లను మూసేయడం. 676 00:37:41,970 --> 00:37:43,805 అది జరిగే పని కాదు. 677 00:37:43,889 --> 00:37:47,309 రెండోది, అనవసరమైన కార్యకలాపాలను స్తంభింపజేయడం. 678 00:37:47,392 --> 00:37:49,394 వి-వర్క్ లాబ్స్ తో సహా. 679 00:37:49,478 --> 00:37:51,438 ముమ్మాటికీ అలా చేయను. 680 00:37:51,522 --> 00:37:53,565 నీకున్న మార్గాలు అవే. 681 00:37:53,649 --> 00:37:56,109 - రిచర్డ్... - ఇప్పటిదాకా అతనిపట్ల మెతకగా ఉన్నావు, బ్రూస్. 682 00:37:56,193 --> 00:37:58,862 నీ ముందు ఉన్న మార్గాలు అవే. 683 00:38:01,949 --> 00:38:05,035 - హాయ్, వి-వర్క్ కి స్వాగతం. - హాయ్, రెబెకా. 684 00:38:05,118 --> 00:38:07,120 దేవుడా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. 685 00:38:07,204 --> 00:38:09,748 దీన్ని చూస్తున్నందుకు నాకు చాలా ఉత్కంఠగా ఉంది. 686 00:38:09,831 --> 00:38:11,708 బాగుంది. అయితే నేను త్వరగా నీకు అంతా చూపిస్తాను... 687 00:38:11,792 --> 00:38:13,585 - అలాగే. - ...ఆ తర్వాత మనం యువరాజు వద్దకు వెళ్దాం. 688 00:38:13,669 --> 00:38:17,172 నా కంపెనీలోని కాన్ఫరెన్స్ గదిలో కూర్చుని, 689 00:38:17,256 --> 00:38:20,300 నాకున్న మార్గాలేమిటో ఇతను చెబుతాడా? 690 00:38:20,384 --> 00:38:22,427 నా ముందు ఏయే మార్గాలున్నాయో నువ్వా నాకు చెప్పేది? 691 00:38:22,511 --> 00:38:24,263 మనం ఉన్న పరిస్థితి ఇదే. 692 00:38:24,346 --> 00:38:26,223 - నా మాట వినండి. - ఆడమ్, ఇలా చూడు. 693 00:38:26,723 --> 00:38:28,684 నువ్వు ఇండియానుంచి వచ్చి నాలుగు నెలలైంది. 694 00:38:29,601 --> 00:38:31,103 మాసా ఇంకా రాలేదు. 695 00:38:31,770 --> 00:38:33,438 ఇదంతా చూడు. 696 00:38:33,522 --> 00:38:36,525 ఇది చూస్తుంటే నా కంపెనీ ఏర్పాటైన తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి. 697 00:38:36,608 --> 00:38:37,609 - అవునా? - ఆ. 698 00:38:37,693 --> 00:38:38,944 నీ మాటలు వింటే సంతోషంగా ఉంది. 699 00:38:39,027 --> 00:38:40,529 ఇదిగో ఆడమ్. 700 00:38:41,530 --> 00:38:42,990 అంతరాయానికి మన్నించండి. 701 00:38:43,073 --> 00:38:44,908 - హాయ్, లవ్. - మోటెక్! 702 00:38:44,992 --> 00:38:47,744 నా స్నేహితురాలిని పరిచయం చేయాలని వచ్చాను. 703 00:38:47,828 --> 00:38:50,205 - ఎలీషియా కెన్నడీ. వావ్. - అవును. 704 00:38:50,289 --> 00:38:52,332 - మీ కంపెనీకి నేను గొప్ప అభిమానిని, కెన్నడీ. - వావ్. 705 00:38:52,416 --> 00:38:54,960 మిమ్మల్ని ఇక్కడకు రప్పించేందుకు మేం ఎంతమంది రిక్రూటర్లను 706 00:38:55,043 --> 00:38:57,087 నియమించామో మీకు తెలుసా? 707 00:38:57,171 --> 00:38:59,882 మీరు వచ్చినందుకు మేం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? 708 00:38:59,965 --> 00:39:03,302 ఆడమ్, ఈమె నా కొత్త స్నేహితురాలు ఎలీషియా, నీకు చెప్పాను కదా. 709 00:39:03,385 --> 00:39:05,929 నన్ను చూడటానికి వచ్చింది. నేను ఆమెకు ఆఫీసు చూపించి... 710 00:39:06,013 --> 00:39:09,933 అవును. అవును. ఈమె నా అద్భుతమైన భార్యను చూసేందుకు వచ్చారు. 711 00:39:10,684 --> 00:39:12,019 అవును. అవును. 712 00:39:12,102 --> 00:39:17,941 మీరు ఇక్కడకు వచ్చారు కదా, దీన్ని ఆస్వాదించండి, సరేనా? 713 00:39:18,025 --> 00:39:20,611 - కొంచెం. చాలా కొంచెం. - కొంచెం కంటే ఎక్కువే. 714 00:39:20,694 --> 00:39:24,198 - ఇది చాలా అద్భుతంగా ఉంది. - ఓకే. అద్భుతంగా ఉంది. 715 00:39:24,281 --> 00:39:26,742 ఆ రిక్రూటర్లందరికీ చెప్పినట్లుగానే, 716 00:39:26,825 --> 00:39:29,119 నా సొంత కంపెనీలో నాకొక ఉద్యోగం ఉంది. 717 00:39:29,203 --> 00:39:31,705 చాలా విజయవంతమైన మహిళ ఈమె. బహుశా తనే నీకు ఉద్యోగమిస్తుందేమో. 718 00:39:31,788 --> 00:39:34,124 కానీ నేను తనకు ఉద్యోగమివ్వను. 719 00:39:34,208 --> 00:39:37,294 అయితే మీరు అడిగేది ఏమిటి? 720 00:39:41,089 --> 00:39:42,174 మీరు ఒంటరిగా ఉంటున్నారా? 721 00:39:44,259 --> 00:39:46,011 - క్షమించాలి. ఆడమ్... - ఏంటి? 722 00:39:46,094 --> 00:39:49,765 ఊరికే అడుగుతున్నా, మీరు ఒంటరిగానే ఉంటున్నారా అని. 723 00:39:49,848 --> 00:39:52,976 - ఆడమ్, ఇది... - లేదు, లేదు. ఊరికే అడుగుతున్నా... 724 00:39:56,063 --> 00:39:59,566 ప్రతి ఒక్కరూ ఒంటరివాళ్లే. అసలు ఈ ప్రపంచమే ఒంటరిది. 725 00:40:03,111 --> 00:40:05,531 ఒప్పుకుంటా. 726 00:40:05,614 --> 00:40:08,784 మీకు ఉద్యోగం ఆఫర్ చేయనిది అందుకనే. 727 00:40:10,202 --> 00:40:14,748 మీకొక లక్ష్యాన్ని ఆఫర్ చేస్తా, అది కోట్లు తెచ్చిపెడుతుంది, 728 00:40:14,831 --> 00:40:19,211 ఒక గ్లోబల్ కమ్యూనిటిని ఏర్పాటు చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్లో సంతోషాన్ని, 729 00:40:19,294 --> 00:40:22,297 వారి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మీకు అర్థమైందా? 730 00:40:22,381 --> 00:40:27,219 అలాగే ఈ ప్రపంచపు ఒంటరితనాన్ని కొద్దిమేర తగ్గిస్తుంది కూడా. 731 00:40:27,886 --> 00:40:30,180 ఇప్పుడే, ఇక్కడే. 732 00:40:30,264 --> 00:40:33,350 ఇతనిలో ఉన్న మంచి మరియు చెడ్డ లక్షణం ఏమిటంటే "లేదు" అనే సమాధానం వినకపోవడం. 733 00:40:33,433 --> 00:40:35,686 ఇప్పటిదాకా నేను "లేదు" అనే మాటను వినలేదు. 734 00:40:39,189 --> 00:40:41,149 ఈ విషయాన్ని మీరు మీ బోర్డుముందు పెట్టవచ్చుగా? 735 00:40:41,233 --> 00:40:42,901 నేనే బోర్డుని. 736 00:40:46,363 --> 00:40:47,865 - దీని గురించి ఆలోచించి చెబుతా. - అలాగే. 737 00:40:47,948 --> 00:40:50,033 మేం వెళ్లాలి. అర్జెంటు పని ఉంది. 738 00:41:01,420 --> 00:41:02,629 ఆడమ్ సీరియస్ గానే చెబుతున్నాడా? 739 00:41:05,674 --> 00:41:07,342 అతను సీరియస్ మనిషి కాకపోతే అతనితో ఉండేదాన్నే కాను. 740 00:41:09,428 --> 00:41:12,431 మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నాకు ఏయే మార్గాలున్నాయో మీరు చెబుతున్నారు. 741 00:41:12,514 --> 00:41:13,891 నాకు రెండు మార్గాలున్నాయన్నారు. 742 00:41:15,684 --> 00:41:16,935 నేను మూడో మార్గాన్ని ఎంచుకుంటాను. 743 00:41:24,359 --> 00:41:25,360 మానవ వనరుల తొలగింపు ప్రక్రియ 744 00:41:25,444 --> 00:41:28,488 ...మన కుటుంబం కోసం చేసే మంచి పని కొందరు ఉద్యోగులను తొలగించడం. 745 00:41:29,573 --> 00:41:31,283 నన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేశారు. 746 00:41:32,451 --> 00:41:33,452 నన్ను కూడా. 747 00:41:37,206 --> 00:41:38,540 రోజుకి -2.4 మిలియన్ డాలర్లు. 748 00:41:38,624 --> 00:41:40,334 రోజుకి -2.2 మిలియన్ డాలర్లు. 749 00:41:44,171 --> 00:41:45,923 రైమ్ పాడాలంటే, సరైన సమయంలో పాడాలి 750 00:41:46,006 --> 00:41:47,633 - అది చాలా ట్రికీ, ట్రికీ - ఇదిగో! 751 00:41:47,716 --> 00:41:49,593 రైమ్ పాడటం చాలా ట్రికీ 752 00:41:49,676 --> 00:41:51,386 రైమ్ పాడాలంటే, సరైన సమయంలో పాడాలి 753 00:41:51,470 --> 00:41:53,889 నువ్వు కాసేపటి క్రితమే కంపెనీలో 7% మంది ఉద్యోగుల్ని తీసేశావు 754 00:41:53,972 --> 00:41:56,767 కానీ రన్-డిఎంసి కోసం వేలాది డాలర్లు ఖర్చు చేస్తున్నావు? 755 00:41:57,351 --> 00:42:00,521 మన వృద్ధి దశలో ఇదొక సాధారణమైన పని. 756 00:42:01,980 --> 00:42:05,901 పైగా, ఈ ఖర్చుని మనం భరించగలం. ప్రతి ఒక్కరికీ నైతిక ప్రోత్సాహం అవసరం. 757 00:42:05,984 --> 00:42:07,110 ప్రతి ఒక్కరికీ ఉద్యోగం అవసరం! 758 00:42:07,903 --> 00:42:10,572 లెస్లీ, నువ్వు మా సంస్థలో ముందుగా చేరిన ఉద్యోగుల్లో ఒకతెవు. 759 00:42:10,656 --> 00:42:12,950 కాబట్టి నువ్వంటే నాకు ఒక రకమైన అభిమానం. 760 00:42:13,033 --> 00:42:16,453 కానీ ఇలాగే మరొకరు మాట్లాడి ఉంటే వెంటనే వాళ్లను ఉద్యోగంలోంచి తీసేసేవాణ్ని. 761 00:42:17,454 --> 00:42:19,206 జాగ్రత్త. నీ హద్దుల్లో ఉండు. 762 00:42:19,831 --> 00:42:21,583 - నేను వెళ్తున్నాను. - జాగ్రత్తగా ఉండాలా? 763 00:42:24,795 --> 00:42:26,839 నువ్వేమో వినోదం చూస్తూ ఉంటావా? 764 00:42:27,840 --> 00:42:31,510 నగరంలో పాపం మేం ఏదీ దాచలేం 765 00:42:31,593 --> 00:42:35,389 లేత రంగు వేసిన కిటికీలకు తెలుసు లోపల ఎవరున్నారో 766 00:42:35,472 --> 00:42:37,266 రైమ్ పాడటం చాలా ట్రికీ 767 00:42:37,349 --> 00:42:39,351 రైమ్ పాడాలంటే, సరైన సమయంలో పాడాలి 768 00:42:39,434 --> 00:42:40,727 ఇది ట్రికీ 769 00:42:40,811 --> 00:42:43,063 ట్రికీ, ట్రికీ, ట్రికీ, ట్రికీ 770 00:42:56,451 --> 00:42:57,703 ఛీ. 771 00:43:09,882 --> 00:43:11,884 హార్లో మూన్, నువ్వు దేనికి కృతజ్ఞతలు తెలుపుకుంటావు? 772 00:43:12,467 --> 00:43:17,014 నా స్నేహితులకి, ఫ్రాగీ ది ఫ్రాగ్ కి కృతజ్ఞతలు చెబుతా. 773 00:43:18,223 --> 00:43:21,977 - బాగుంది. - నేను ఎలీషియా కెన్నడీకి కృతజ్ఞతలు చెబుతా. 774 00:43:22,936 --> 00:43:25,022 నేను తనని ఉద్యోగంలో పెట్టుకున్నా. 775 00:43:25,105 --> 00:43:28,108 - ఆ సంగతి ఆమె నాకు చెప్పలేదు. - అవును. అవును. బాగుంది కదా? 776 00:43:28,192 --> 00:43:30,736 - అది... - అది... వావ్. 777 00:43:30,819 --> 00:43:32,154 తను పనిలో బిజీగా ఉన్నానంది. 778 00:43:32,237 --> 00:43:35,365 తన కంపెనీని వదిలి, వి-వర్క్ లో చేరుతున్నట్లు నాతో చెప్పనే లేదు. 779 00:43:35,449 --> 00:43:37,993 కంపెనీ పట్ల నీకు గల మక్కువే ఈ మార్పును కోరుకోవడానికి 780 00:43:38,076 --> 00:43:40,037 కారణమని తను చెప్పింది, కాబట్టి నీకు థాంక్ యూ. 781 00:43:40,120 --> 00:43:43,540 తనని చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ గా నియమిస్తున్నా. 782 00:43:43,624 --> 00:43:46,126 ఇదిగో. ఇదిగో. 783 00:43:46,210 --> 00:43:48,545 నాన్నా, అమ్మ ఎవరికి కృతజ్ఞతలు తెలుపుతుందో చెప్పలేదు. 784 00:43:50,881 --> 00:43:53,091 రివ్కా, నువ్వు దేనికి కృతజ్ఞతలు చెబుతావో చెప్పు. 785 00:43:53,175 --> 00:43:54,343 నాకు ఆకలి వేస్తోంది మరి. 786 00:43:55,010 --> 00:43:56,929 మీరు కానివ్వండి. నాకు ఆకలి పోయింది. 787 00:43:57,596 --> 00:43:59,806 - నేను మాంసం తెచ్చేది వారానికి ఒక రాత్రి. - నాకు తెలుసు. 788 00:43:59,890 --> 00:44:01,141 వారానికి ఒక్క రాత్రి మాత్రమే. 789 00:44:01,225 --> 00:44:05,479 మీరు ఒక జంతువు భయాన్ని తింటుంటే నాకు కడుపులో తిప్పుతుంది మరి. 790 00:44:05,562 --> 00:44:08,815 ఇది చికెన్, సరేనా? దీనికి భయమేమీ ఉండదు. 791 00:44:08,899 --> 00:44:10,484 అది కూడా ఒక ప్రాణే. జీవంతో ఉన్న ప్రాణులకు... 792 00:44:10,567 --> 00:44:12,903 - ఖచ్చితంగా భయం ఉండదు. - ...భయం, నిస్సహాయత ఉంటాయి. 793 00:44:12,986 --> 00:44:15,155 జీవంతో ఉండే ప్రాణులన్నింటికీ భయం, నిస్సహాయత ఉంటాయి. 794 00:44:15,239 --> 00:44:17,908 కొన్నిసార్లు మనుషులు ఆ సంగతి మరచిపోతారు. ఏమీ అనుకోవద్దు. 795 00:44:17,991 --> 00:44:20,827 కానీ, నువ్వు ఎవరికి కృతజ్ఞతలు చెబుతావో చెప్పనేలేదు. 796 00:44:22,287 --> 00:44:24,915 ఇదిగో. తీసుకో. 797 00:44:24,998 --> 00:44:26,291 మీ అమ్మకు చెప్పకు. 798 00:44:26,875 --> 00:44:27,876 చెప్పను. 799 00:44:27,960 --> 00:44:30,212 ఓకే, చీర్స్. 800 00:44:30,295 --> 00:44:33,549 హాయ్. మీరు ఎలీషియా కెన్నడీకి ఫోన్ చేశారు. జవాబివ్వడానికి తను అందుబాటులో లేదు... 801 00:44:34,591 --> 00:44:36,677 నేను పీజా కూడా తీసుకొస్తాను. 802 00:44:36,760 --> 00:44:38,887 - వద్దు. - తెస్తాను. 803 00:44:40,848 --> 00:44:42,224 రోజుకి -2.3 మిలియన్ డాలర్లు. 804 00:44:42,307 --> 00:44:43,475 రోజుకి -2.4 మిలియన్ డాలర్లు 805 00:44:43,559 --> 00:44:44,560 మాసా వచ్చాడు. 806 00:44:44,643 --> 00:44:45,519 - ఇప్పుడా? - ఇప్పుడే! 807 00:44:53,902 --> 00:44:58,574 మాసా. మాసా. మాకోసం సమయం కేటాయించినందుకు థాంక్స్. మీకు ఎంత టైమ్ ఉంది? 808 00:45:00,200 --> 00:45:01,451 పన్నెండు నిమిషాలు. 809 00:45:02,119 --> 00:45:05,330 పన్నెండు నిమిషాలు. మా భవిష్యత్తు పనిని వెంటనే చూపిస్తాను. 810 00:45:05,414 --> 00:45:07,165 మీరు ఇలా రావడం నాకెంతో సంతోషంగా ఉంది. 811 00:45:29,813 --> 00:45:32,441 నేను దీన్ని "స్పేస్ ఏజ్ ఏ సర్వీస్" అంటాను. 812 00:45:32,524 --> 00:45:36,570 ప్రపంచవ్యాప్తంగా సముదాయాలను అనుసంధానించేందుకు మేం డేటా సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. 813 00:45:42,284 --> 00:45:43,660 నువ్వు బూట్లు వేసుకోవా? 814 00:45:48,373 --> 00:45:49,374 వేసుకోను. 815 00:45:58,258 --> 00:45:59,259 నువ్వు భలేవాడివి. 816 00:46:00,594 --> 00:46:01,595 నాతో కారులో రా. 817 00:46:04,181 --> 00:46:08,185 మాకు ప్రస్తుతం మిలియన్ చదరపు అడుగుల వి-వర్క్ స్పేస్ ఉంది... 818 00:46:10,103 --> 00:46:11,813 నువ్వు చూపించేది ఏదీ నాకు అనవసరం. 819 00:46:13,482 --> 00:46:14,942 నేను కంపెనీలని చూడను. 820 00:46:15,943 --> 00:46:17,361 వ్యవస్థాపకులను చూస్తాను. 821 00:46:22,074 --> 00:46:26,286 నేను జపాన్ లోని ఒక చిన్న ప్రావిన్స్ లో కొరియన్ వలసవాద దంపతులకు పుట్టాను. 822 00:46:27,496 --> 00:46:31,917 మేం జపాన్ ఇంటి పేరును పెట్టుకున్నా, ప్రయోజనం లేకపోయింది. 823 00:46:32,835 --> 00:46:35,379 ప్రతి ఒక్కరికీ మేం బయటివాళ్లమని తెలుసు. 824 00:46:36,088 --> 00:46:39,383 నాకు 16 ఏళ్ళ వయసున్నప్పుడు, అమెరికాకి వెళ్లాను, 825 00:46:39,466 --> 00:46:42,386 కానీ అక్కడా పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. 826 00:46:44,596 --> 00:46:48,767 నా జీవితంలో ఎంతో వివక్ష చవిచూశాను... 827 00:46:50,435 --> 00:46:51,937 ఎంతో ఒంటరితనాన్ని భరించాను. 828 00:46:54,273 --> 00:46:56,024 ఇదంతా నీకు తెలుసు. 829 00:46:56,108 --> 00:46:58,819 అందుకనే స్టార్టప్ ఇండియాలో అలా మాట్లాడావు. 830 00:46:58,902 --> 00:46:59,903 నేను... 831 00:47:01,530 --> 00:47:05,033 అవరోధం ఎదురైతే, అందుకు బాధపడకూడదు. 832 00:47:05,117 --> 00:47:09,204 ఎందుకంటే అదే నీ ఎదుగుదలకు అవకాశాలు చూపిస్తుంది. 833 00:47:32,477 --> 00:47:34,897 రివ్కా, చీకట్లో కూర్చున్నావేంటి? 834 00:47:35,731 --> 00:47:37,983 నువ్వు మత్తు మందు తీసుకోకముందే నీతో మాట్లాడదామని. 835 00:47:40,736 --> 00:47:41,945 మన మొదటి డేటింగ్... 836 00:47:44,239 --> 00:47:45,741 అందుకు చాలామంది అభ్యంతరాలు తెలిపారు. 837 00:47:47,826 --> 00:47:48,827 నువ్వు నన్ను చూశావు. 838 00:47:51,288 --> 00:47:55,083 టేబుల్ కి అవతల వైపునుంచి నన్ను చూశావు, అవునా? 839 00:47:56,460 --> 00:48:00,714 నువ్వు అసలు సిసలు మనిషివేనా అని ఎలీషియా నన్ను అడిగింది. 840 00:48:02,341 --> 00:48:03,342 అవునని చెప్పాను. 841 00:48:03,425 --> 00:48:07,804 కానీ ఎన్ని రాత్రులు నేను ఒంటరిగా పడుకున్నానో ఆమెకు చెప్పలేదు, 842 00:48:07,888 --> 00:48:09,681 నిన్ను చిన్నబుచ్చడం ఇష్టం లేక. 843 00:48:18,148 --> 00:48:19,358 ఎక్కడున్నావు నువ్వు? 844 00:48:21,318 --> 00:48:22,486 ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు. 845 00:48:27,115 --> 00:48:28,283 నువ్వు నా భార్యవి. 846 00:48:30,410 --> 00:48:34,540 ఈ కుటుంబం నా జీవితం, మేం నీవాళ్ళం. నీకది అర్థమవుతోందా? 847 00:48:34,623 --> 00:48:36,458 మనకంటే ముఖ్యమైనదేదీ లేదు. 848 00:48:36,542 --> 00:48:39,920 నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. 849 00:48:41,964 --> 00:48:43,549 నేను ఇక్కడే ఉన్నాను. 850 00:48:45,884 --> 00:48:46,927 ఊ-హు. 851 00:48:48,220 --> 00:48:49,721 నావైపు ఎందుకు చూడవు? 852 00:48:51,682 --> 00:48:53,809 నాతో ఎందుకు మాట్లాడవు? నన్ను ఎందుకు ముట్టుకోవు? 853 00:48:53,892 --> 00:48:57,896 - మన పిల్లలవైపు ఎందుకు చూడవు? - రివ్కా, రివ్కా. దయచేసి ఆపు. 854 00:48:57,980 --> 00:49:00,524 - విను, విను. నన్ను చెప్పనీ. - నా వల్ల కావట్లేదు, ఆడమ్. 855 00:49:00,607 --> 00:49:02,484 - ఇలా చూడు, చూడు. - లేదు. నేను చూడను. 856 00:49:02,568 --> 00:49:04,403 - దయచేసి చూడు. - ఏంటి? ఏంటిది? 857 00:49:07,614 --> 00:49:10,200 ఇది వి-వర్క్ లో మాసా పెట్టిన పెట్టుబడి. 858 00:49:14,538 --> 00:49:15,539 మనకోసం. 859 00:49:20,419 --> 00:49:22,171 నేను సాధించాను. 860 00:49:27,467 --> 00:49:30,095 వద్దు, వద్దు, వద్దు. ఊరుకో, ఊరుకో, ఊరుకో. 861 00:49:30,179 --> 00:49:32,556 ఇది నీకోసం, సరేనా? నీకోసం. 862 00:49:32,639 --> 00:49:34,099 ఎప్పుడూ నీకోసమే. 863 00:49:36,435 --> 00:49:37,519 హేయ్. 864 00:49:40,480 --> 00:49:42,191 4.4 బిలియన్ డాలర్లు 865 00:50:33,784 --> 00:50:35,786 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య