1 00:00:08,960 --> 00:00:13,200 నిర్వాహక వర్గపు స్వీట్‌లో నీకు కార్యాలయం వద్దని నేను అనుకోవాలా? 2 00:00:13,400 --> 00:00:17,540 నేను నీకు సాయపడగలను, ఇయన్. ఇదంతా సద్దుమణిగే దాకా. 3 00:00:17,740 --> 00:00:19,790 - ఫ్రాంక్ ఫ్లోరెజ్? - ఎలా తెలుసుకున్నావు? 4 00:00:19,990 --> 00:00:20,890 రీజెస్ పాటాఫ్. 5 00:00:22,940 --> 00:00:24,960 మీరు అతను వివరించినట్టుగా ఏమీ లేరు. 6 00:00:25,160 --> 00:00:28,680 నా గురించి చాలు. మీ గురించి చెప్పండి, ప్యాట్రిషియా. 7 00:00:28,870 --> 00:00:32,360 బంగారు అస్తిపంజరపు తయారీ పనిని మీకు రీజెస్ పాటాఫ్ అప్పజెప్పాడా? 8 00:00:36,280 --> 00:00:37,120 ధన్యవాదాలు. 9 00:00:41,450 --> 00:00:43,860 దారిలో జబ్బు చేసింది, అందుకే వెనక్కొచ్చేశాను. 10 00:00:44,060 --> 00:00:45,420 నీకు చెప్పి ఉండాలి. 11 00:00:46,080 --> 00:00:47,420 ప్రైవేట్ నెంబర్ హలో. నేను రీజెస్‌ను. 12 00:00:48,590 --> 00:00:50,050 హేయ్ 13 00:00:52,210 --> 00:00:53,530 నన్ను అనుగ్రహింపుము, 14 00:00:53,730 --> 00:00:57,510 శుద్దపరుచుము, ప్రభువా, తీర్చిదిద్దుము, మిమ్ములతో నన్ను నింపివేయుము. 15 00:00:58,100 --> 00:01:01,460 నన్ను వాడుకొనుము. నా యందున్న దుష్టశక్తులను పారద్రోలుము. 16 00:01:01,660 --> 00:01:03,750 వారిని నాశనం చేయుము, ఓడించుము, 17 00:01:03,950 --> 00:01:06,520 దానితో నేను ఆరోగ్యముగా ఉందును, సత్కార్యములు చేయుదును. 18 00:01:06,980 --> 00:01:11,340 అన్ని వశీకరణములను, క్షుద్రశక్తులను, శాపములను, దుష్ట దృష్టిని, 19 00:01:11,540 --> 00:01:14,970 క్రూరమైన క్రిమి రోగములను, అణిచివేతలను... 20 00:01:15,170 --> 00:01:20,530 చెడు, పాపం, అసూయ, మోసములను నా నుంచి తొలగించివేయుము. 21 00:01:21,120 --> 00:01:24,400 శారీరక, మానసిక, నైతిక, 22 00:01:24,600 --> 00:01:27,110 ఆధ్యాత్మిక మరియు క్రూరమైన రుగ్మతలు. 23 00:01:27,310 --> 00:01:30,990 ఈ చెడులన్నింటినీ నరకంలో బూడిద చేయుము, అవి ఇకపై నన్ను తాకలేవు. 24 00:01:31,190 --> 00:01:33,610 నన్ను వేధించే శక్తులన్నిటినీ నేను కమాండ్ చేస్తాను, 25 00:01:33,810 --> 00:01:36,220 సర్వశక్తిమంతుడైన దేవుని శక్తితో... 26 00:01:58,700 --> 00:02:01,350 నన్ను సంకటపరిచెడు అన్ని శక్తులను, 27 00:02:01,550 --> 00:02:05,440 సర్వశక్తివంతుడైన దేవుని బలము, మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామము ద్వారా. 28 00:02:05,640 --> 00:02:07,820 కన్యయగు మేరీ మాత మధ్యవర్తిత్వం ద్వారా, 29 00:02:08,020 --> 00:02:11,650 నన్ను విడిచిపెట్టమని, శాశ్వత నరక స్థానము పొందమని ఆదేశిస్తున్నా, 30 00:02:11,850 --> 00:02:14,160 అక్కడ ఆ శక్తులు దైవదూతలచే కట్టివేయబడతాయి, 31 00:02:14,350 --> 00:02:17,720 కన్యయగు మేరీ మాత పాదముల కిందపడి నలిగిపోతాయి. 32 00:02:28,390 --> 00:02:29,810 ఏంటది? 33 00:02:31,360 --> 00:02:32,190 ఎవరది? 34 00:02:39,740 --> 00:02:41,910 హలో? ఏంటి ఈ... 35 00:02:43,280 --> 00:02:45,940 అక్కడే ఉండు. అంతటా గాజు ముక్కలున్నాయి. 36 00:02:46,140 --> 00:02:47,310 ఏదైనా పొగొట్టుకున్నామా? 37 00:02:47,510 --> 00:02:49,290 ఏదైనా విలువైనది ఉందా? 38 00:02:49,620 --> 00:02:50,710 హలో? 39 00:02:52,460 --> 00:02:53,880 ఛత్! 40 00:03:16,900 --> 00:03:18,610 మీ సెషన్ ముగిసింది 41 00:03:36,210 --> 00:03:38,800 ద కన్సల్టెంట్ - ఎస్1 42 00:03:55,230 --> 00:03:57,590 బంగారం, నీ పనికి ఆలస్యమవుతుంది. 43 00:03:57,790 --> 00:04:00,320 డా. గ్రాంట్‌కు కాల్ చేశా. జబ్బుగా ఉందని చెప్పా. 44 00:04:02,740 --> 00:04:04,450 నీకు ఏమైంది? 45 00:04:04,910 --> 00:04:07,120 ముక్కు బంకగా ఉంది, గొంతు నొప్పిగా ఉంది. 46 00:04:09,330 --> 00:04:11,460 నీ మూడు రోజుల విషజ్వరం నాకు అంటుకుందేమో. 47 00:04:13,290 --> 00:04:15,190 ఎన్ని రోజులుగా ఇంటి పట్టున ఉన్నావు? 48 00:04:15,390 --> 00:04:16,990 మంగళవారం, బుధవారం, గురువారం. 49 00:04:17,190 --> 00:04:20,340 నిజానికి, ఈ రోజు చాలా బాగా అనిపిస్తోంది. 50 00:04:22,510 --> 00:04:23,510 మంచిది. 51 00:04:24,510 --> 00:04:26,800 నాకు కొంచెం వేడిగా టీ ఇవ్వచ్చుగా. 52 00:04:34,480 --> 00:04:40,480 ఎలేన్ హేమన్ సృజనాత్మక సలహాదారు 53 00:05:14,730 --> 00:05:18,210 పాటాఫ్ గారు? ముఖ్య వాడకందారుల నుండి విశ్లేషణాత్మక సమాచారం అందుతోంది. 54 00:05:18,410 --> 00:05:19,880 ఈ రోజు డానా ఎక్కడ ఉన్నారు? 55 00:05:20,080 --> 00:05:21,940 ఆమె కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు. 56 00:05:25,240 --> 00:05:28,490 ముప్ఫై ఏళ్ళ లోపున్న పురుషులను మనం బాగా ఆకట్టుకుంటున్నాం. 57 00:05:29,320 --> 00:05:31,290 సంఖ్యలు. వీటి అర్థం ఏంటి? 58 00:05:32,370 --> 00:05:33,690 క్రియాశీల వాడకందారుల సంఖ్య. 59 00:05:33,890 --> 00:05:36,460 ఆడటానికి వెచ్చించిన సమయం. ఆడకుండా ఉన్న సమయం. 60 00:05:36,750 --> 00:05:38,070 వారికి మన గేమ్ నచ్చిందా? 61 00:05:38,270 --> 00:05:41,360 ఈ రోజు చివరన సంతృప్తి నివేదిక ప్రచురితం అవుతుంది. 62 00:05:41,560 --> 00:05:43,550 టామీ, కాయ్ ఇంకా గణిస్తున్నారు. 63 00:05:48,180 --> 00:05:51,040 వాళ్ళే కాల్ చేశారు. బహుశా తాజా సమాచారం చెప్తారేమో. 64 00:05:51,240 --> 00:05:52,720 నీ ఫోను కాల్‌కు స్పందించు. 65 00:05:54,680 --> 00:05:55,680 హాయ్. 66 00:06:08,610 --> 00:06:12,020 - క్రెగ్? బానే ఉన్నావా? - మూడు రోజుల ఫ్లూ. ఇది అంటురోగం. 67 00:06:12,220 --> 00:06:13,200 - షూస్. - ఏంటి? 68 00:06:14,410 --> 00:06:16,500 కొత్త విధానం. ఎవరికీ మినహాయింపు లేదు. 69 00:06:21,340 --> 00:06:24,960 ఈ ఆలోచన ఎవరిది? వద్దులే. చెప్పి నీ ఆక్సిజన్ వృధా చేసుకోకు. 70 00:06:28,680 --> 00:06:30,140 ఇదొక కళాఖండం. 71 00:06:33,220 --> 00:06:34,640 బాబు, బతికే ఉన్నావే. 72 00:06:36,100 --> 00:06:38,040 అవును. మూడు రోజుల ఫ్లూ వచ్చిందంతే. 73 00:06:38,240 --> 00:06:39,840 ఇక్కడంతా పాదాల కంపు కొడుతోంది. 74 00:06:40,040 --> 00:06:43,470 అధ్యయనాలు చేశారు. ఉత్త పాదాలతో నడిస్తే సృజనాత్మకత పెరుగుతుందట. 75 00:06:43,670 --> 00:06:46,640 నన్ను నమ్మండి, పాటాఫ్ దీన్ని మన పని పెంచడానికి చేయడం లేదు. 76 00:06:46,840 --> 00:06:48,850 తన పెత్తనం చూపించడానికే చేస్తున్నాడు. 77 00:06:49,050 --> 00:06:51,070 అతనేమో తన స్కీ బూట్లతో కూర్చున్నాడు. 78 00:06:56,370 --> 00:06:57,900 ఎందుకని ఎవరూ పని చేయడం లేదు? 79 00:06:58,100 --> 00:07:00,370 ఏం చేయాలో చెప్తారని ఎదురు చూస్తున్నాం. 80 00:07:00,750 --> 00:07:03,190 ఏంటి? ఊరుకోండి. నేను మూడు రోజులు రాలేదు. 81 00:07:03,390 --> 00:07:05,880 మనం అప్‌స్కర్ట్ జంగల్‌ పై ఎందుకు పని చేయడం లేదు? 82 00:07:06,210 --> 00:07:07,210 అది పూర్తయింది. 83 00:07:09,220 --> 00:07:10,870 "పూర్తయింది" అంటే ఏంటి? 84 00:07:11,070 --> 00:07:14,910 పూర్తయ్యేంత దాకా పాటాఫ్ పని చేయించాడు. నిన్న రాత్రే దాన్ని ఆమోదించాడు. 85 00:07:15,110 --> 00:07:18,290 మేం ఏ పని చేసేవాళ్లం కాదు, కానీ నీకు క్యాన్సర్ ఉందనుకున్నాం. 86 00:07:18,490 --> 00:07:20,420 ఇక నిన్ను ఏ విషయంగా గుర్తుంచుకుంటాం? 87 00:07:20,620 --> 00:07:23,020 నేను లేకుండానే అప్‌స్కర్ట్ జంగల్ పూర్తి చేశారా? 88 00:07:24,110 --> 00:07:26,230 దాన్ని ఒకసారి చూస్తావేమో చూడు. 89 00:07:46,130 --> 00:07:49,760 మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ 90 00:08:38,970 --> 00:08:40,040 హాయ్, క్రెగ్. 91 00:08:40,240 --> 00:08:42,680 బాగున్నావా? నీకు బాగా జబ్బు చేసిందని విన్నానే. 92 00:08:45,730 --> 00:08:48,190 అసలు ఇక్కడ ఏం జరిగి చస్తోంది? 93 00:08:53,070 --> 00:08:56,770 నిజంగానే సాధించావు. నీకు నువ్వే ఆఫీసును దొంగిలించుకున్నావు. 94 00:08:56,970 --> 00:08:58,850 - కూర్చో. - నేను కూర్చోను. 95 00:08:59,050 --> 00:09:01,790 నువ్వు సహాయకురాలివి, నీకు మరో కుర్చీ ఉండకూడదు. 96 00:09:04,080 --> 00:09:06,530 నా గేమ్‌ పేరు మార్చాడని నాతో ఎందుకు చెప్పలేదు? 97 00:09:06,730 --> 00:09:09,900 "స్కర్ట్ పైకెత్తు" అన్న మాటతో మనం గేమ్‌ను ప్రవేశపెట్టలేము. 98 00:09:10,100 --> 00:09:11,240 ఇది అతని ఆలోచనా? 99 00:09:11,440 --> 00:09:13,700 ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందో గుర్తు లేదు. 100 00:09:13,900 --> 00:09:17,660 "బాధ అడవి", "నొప్పితో పగిలే అద్దం" లేదా మరో లక్ష పేర్ల సంగతేంటి? 101 00:09:17,860 --> 00:09:20,290 క్రెగ్, అది ముఖ్య వాడకందారులకు చేరిపోయింది. 102 00:09:20,490 --> 00:09:23,060 అప్పుడేనా? మీరు దాన్ని కనీసం పరీక్షించారా? 103 00:09:31,650 --> 00:09:33,970 నేను వార్తలను ప్రతి రోజూ చూస్తున్నాను. 104 00:09:34,170 --> 00:09:36,950 పొమోనాలో చోరీ చేసిన దొంగల హత్య పేరుతో ఏమీ రాలేదు. 105 00:09:49,000 --> 00:09:52,320 "నేను మీకు స్నాయువులు జత చేయుదును, కండలు వచ్చునట్టు చేయుదును, 106 00:09:52,520 --> 00:09:54,070 "మిమ్ము చర్మముతో కప్పెదను. 107 00:09:54,270 --> 00:09:56,910 "మీలో ఊపిరిని ఉంచుదును, మీరు ప్రాణమునుకు వచ్చుదురు. 108 00:09:57,110 --> 00:09:59,970 "అప్పుడు నేనే ప్రభువునని మీరు ఎరుగుదురు." ఎజికీల్ 37. 109 00:10:01,640 --> 00:10:03,920 ఈ వారమంతా ఇదే చేస్తూ ఉన్నావా? 110 00:10:04,120 --> 00:10:06,440 బైైబిల్ సూక్తులను మననం చేయడమా? 111 00:10:07,640 --> 00:10:12,070 అవును, ఆడియో వెర్షన్ డౌన్‌లోడ్‌ చేశాను. లేవగానే ఈ చెత్త తెలిసింది. 112 00:10:13,190 --> 00:10:15,570 నువ్వు తిరిగి రావని అనుకున్నాను. 113 00:10:16,030 --> 00:10:18,930 నాకు నా ఇంట్లో కూడా భద్రత లేదని అనిపిస్తోంది. 114 00:10:19,130 --> 00:10:21,620 మా ముందరి అద్దాన్ని నిన్న రాత్రి ఎవరో పగలగొట్టారు. 115 00:10:22,870 --> 00:10:24,730 భద్రతలేని ప్రాంతంలో ఉంటున్నావు. 116 00:10:24,930 --> 00:10:27,440 మరి ముసుగులలో వచ్చిన ఆ ముగ్గురి సంగతి ఏంటి? 117 00:10:27,640 --> 00:10:32,340 నాకు తెలియదు. బహుశా ఎవరో దొంగలు తప్పుడు దుకాణానికి వచ్చారేమో. 118 00:10:33,840 --> 00:10:37,010 క్రెగ్, ఇది నీకు సంకటం కలిగిస్తుంది, 119 00:10:37,720 --> 00:10:39,890 కానీ అతను నిన్ను చంపాలనుకోవడం లేదు. 120 00:11:08,160 --> 00:11:10,730 ఇందులో బరువు భరించే లక్షణం మార్చావా? 121 00:11:10,930 --> 00:11:11,730 మార్చలేదు. 122 00:11:11,930 --> 00:11:14,740 ఒక పాము, ఒక కోతి జట్టు కడితే 3 అంగుళాల... 123 00:11:14,940 --> 00:11:17,870 గట్టిపరచిన అద్దం ఎలా పగిలిపోతుందో నాకు వివరిస్తావా? 124 00:11:18,060 --> 00:11:20,160 పాటాఫ్ దాన్ని మరింత కాకతాళీయం చేశాడు. 125 00:11:20,360 --> 00:11:22,140 - కాకతాళీయమా? - సరదా కోసం. 126 00:11:25,560 --> 00:11:29,230 ఎలాంటి వ్యూహం లేని ఆటలో సరదా ఎక్కడ ఉంటుంది? 127 00:11:38,990 --> 00:11:40,140 త్వరగా కానిస్తావా? 128 00:11:40,340 --> 00:11:41,610 నా షూ పోయింది. 129 00:11:48,950 --> 00:11:50,040 వాడు నాశనం కాను! 130 00:12:00,130 --> 00:12:02,410 ఇవేంటి? చెత్త జోకర్ బూట్లా? 131 00:12:02,610 --> 00:12:05,850 వీటికి లోహపు మడమలు ఉన్నాయి. లోహపు మడమలతో షూస్ ఎవరు వాడుతారు? 132 00:12:08,770 --> 00:12:10,420 - ప్యాటి ఎలా ఉంది? - కోపంగా ఉంది. 133 00:12:10,620 --> 00:12:12,500 పొమోనాకు వెళ్ళానని తను కనుగొంది. 134 00:12:12,700 --> 00:12:15,210 - ఎలా? - నా ఈమెయిల్స్ చదువుతోందేమో. 135 00:12:15,410 --> 00:12:16,770 నా ఊబర్ రశీదును చూసింది. 136 00:12:17,770 --> 00:12:21,140 - ఏం జరిగిందో తనకు చెప్పావా? - లేదు, ఏం జరగలేదని చెప్పాను. 137 00:12:21,340 --> 00:12:23,820 నా ఊబర్ ఖాతాను ఎవరో దొంగిలించారని చెప్పాను. 138 00:12:24,780 --> 00:12:27,850 - ఆమెకు ఎందుకని నిజం చెప్పవు? - అది విడ్డూరంగా అనిపిస్తుంది. 139 00:12:28,050 --> 00:12:31,770 నేను పెళ్ళిని ప్రతిపాదించినప్పుడు, ప్రయత్నిస్తానని, పనిని ఎగ్గొట్టనని, 140 00:12:31,970 --> 00:12:33,900 కాథలిక్‌గా మారుతానని, డ్రగ్స్ తీసుకోనని, 141 00:12:34,100 --> 00:12:36,840 ఆమెకు నచ్చే ఈ చెత్తంతా చేస్తానని మాటిచ్చాను. 142 00:12:37,710 --> 00:12:39,300 క్రెగ్ కోసం! 143 00:12:39,840 --> 00:12:42,870 హేయ్, అది తెస్తావా లేదా మరీ ముఖ్యమైన వ్యక్తివి అయిపోయావా? 144 00:12:43,070 --> 00:12:44,890 నేను ప్యాటీతో మాట్లాడాలి. 145 00:13:00,860 --> 00:13:02,740 క్రెగ్ 146 00:13:14,460 --> 00:13:17,170 ముఖ్య వాడకందారుల నుండి సంతృప్తి నివేదిక. 147 00:13:17,960 --> 00:13:19,610 ఇది ఆలస్యమైనందుకు క్షమించండి. 148 00:13:19,810 --> 00:13:21,570 మీ కోసం ముద్రించాను. 149 00:13:21,770 --> 00:13:23,090 వాళ్ళు ఏమంటున్నారు? 150 00:13:23,670 --> 00:13:27,120 "అద్భుతం, వ్యసనదాయకం" నుండి "ఈ చెత్తతో విసుగొస్తోంది" దాకా. 151 00:13:27,320 --> 00:13:28,120 ఇది సాధారణమే. 152 00:13:28,320 --> 00:13:31,830 ఎస్కేప్ ఫ్రమ్ గింప్ ఐలాండ్‌ను ద్వేషించినా, అదే మన ముఖ్య ఆదాయ వనరు. 153 00:13:32,030 --> 00:13:34,750 అన్ని సమయాల్లో అన్ని రకాల మనుషులను సంతోషపెట్టలేం. 154 00:13:34,950 --> 00:13:39,260 చేయలేం. నేను రేపు కొన్ని కాల్స్ చేయాలి, మీరు దాన్ని మార్కెటింగ్‌కు ఆమోదించే లోపు. 155 00:13:39,460 --> 00:13:40,690 రేపు శనివారం. 156 00:13:41,190 --> 00:13:44,010 నేను రేపు కొన్ని గంటలు వద్దామనుకున్నా, 157 00:13:44,210 --> 00:13:45,990 పనులు ముందుకు జరిగేలా చూడటానికి. 158 00:13:48,700 --> 00:13:51,080 క్రెగ్‌కు నయమైనట్టు ఉంది. 159 00:13:54,660 --> 00:13:59,440 - ఇందాక నీ ఆఫీసులో చూశాను. - మూడు రోజుల ఫ్లూ జ్వరం. 160 00:13:59,640 --> 00:14:02,050 చాలా మంది దీని బారిన పడుతున్నారు. 161 00:14:06,300 --> 00:14:08,010 తన కోసం ఎందుకు అబద్ధమాడుతున్నావు? 162 00:14:17,230 --> 00:14:18,520 నేను అబద్ధమాడటం లేదు. 163 00:14:19,940 --> 00:14:21,230 అంటే, నేను... 164 00:14:26,860 --> 00:14:30,160 - క్రెగ్‌కు ఇంట్లో పరిస్థితులు బాలేవు. - ప్యాటితోనా? 165 00:14:32,780 --> 00:14:35,190 నేను ఆమెతో కొంచెమే సంభాషించాను, 166 00:14:35,390 --> 00:14:40,000 కానీ వాళ్ళ పెళ్ళి జరగదనే అభిప్రాయం నాకు ఏర్పడింది. 167 00:14:41,460 --> 00:14:43,000 నువ్వు ఏమనుకుంటావు, ఎలేన్? 168 00:14:44,840 --> 00:14:49,550 అది వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళే తేల్చుకోవాల్సిన విషయం అనుకుంటాను. 169 00:14:52,220 --> 00:14:53,470 నువ్వన్నది నిజమే. 170 00:14:54,060 --> 00:14:57,390 ఉద్వేగాలను విశ్లేషించుకోవడానికి వారు కొంతకాలం విడిగా ఉండాలేమో. 171 00:15:00,480 --> 00:15:03,760 అయితే, ఇప్పుడు మనం క్రెగ్‌కు కాస్త పనిభారం తగ్గిద్దామా? 172 00:15:03,960 --> 00:15:07,820 తప్పకుండా. స్నేహితులు ఉన్నది అందుకే కదా. 173 00:15:08,650 --> 00:15:09,530 సరే. 174 00:15:14,910 --> 00:15:19,000 - ఎలేన్? - చెప్పండి, పాటాఫ్ గారు. 175 00:15:22,380 --> 00:15:23,380 నీ కంప్యూటర్? 176 00:15:43,940 --> 00:15:46,570 - నీ కోసం పలుచగా చేశాను. - ధన్యవాదాలు, బంగారం. 177 00:15:54,200 --> 00:15:58,370 మమ్మల్ని, నీ సంపద నుండి మేము అందుకోబోయే ఈ ఆహారాన్ని దీవించు, ప్రభువా. 178 00:15:59,080 --> 00:16:02,000 మమ్మల్ని భద్రంగా, ఐక్యంగా, బలంగా ఉంచినందుకు ధన్యవాదాలు. 179 00:16:02,500 --> 00:16:03,500 ఆమెన్. 180 00:16:06,630 --> 00:16:07,670 ఆమెన్. 181 00:16:10,340 --> 00:16:12,130 దెయ్యాలను వదిలించడం సంగతేంటి? 182 00:16:12,680 --> 00:16:16,390 అవి నిజమేనా లేదా కేవలం టీవీ ప్రేక్షకుల కోసం కల్పించినవా? 183 00:16:17,220 --> 00:16:22,230 దెయ్యాలు ఆవహించినప్పుడు చర్చి కొన్నిసార్లు జోక్యం చేసుకుంటుంది. 184 00:16:23,230 --> 00:16:25,270 అవి కల్పిత దెయ్యాలైనా లేక నిజమైనవి అయినా. 185 00:16:26,060 --> 00:16:29,720 - మీరు ఎప్పుడైనా దెయ్యాలను వదిలించారా? - అంటే వ్యక్తిగతంగానా? 186 00:16:29,920 --> 00:16:31,050 అవును. 187 00:16:31,250 --> 00:16:32,950 అలా చేయమని ఎప్పుడూ పిలవలేదు. 188 00:16:34,780 --> 00:16:36,700 ఇది మనలో మాట, క్రెగ్, 189 00:16:37,740 --> 00:16:40,120 దీని గురించి నేను కాస్త నిరాశపడుతున్నా. 190 00:16:41,870 --> 00:16:45,610 - నిన్ను ఏదైనా ఆవహించినట్లు అనిపించిందా... - లేదు, నాకు అలా లేదు. 191 00:16:45,810 --> 00:16:48,460 అంటే... నేను పని చేసే చోట ఒకతను ఉన్నాడు. 192 00:16:49,500 --> 00:16:52,170 అతని మదిలో ఏం జరుగుతోందో నాకు తెలియదు. 193 00:16:52,630 --> 00:16:58,350 నా మనసులో నిజంగానే కొన్ని విపరీత ఆలోచనలు రావడం మొదలైంది. 194 00:16:59,810 --> 00:17:04,270 కొన్నిసార్లు మనమే ఒక శత్రువును సృష్టించుకుంటాం, 195 00:17:04,810 --> 00:17:06,560 మన పరాజయాలను సమర్థించుకోవడానికి. 196 00:17:07,980 --> 00:17:10,650 ఈ కాథలిక్ బోధన చాలా నిర్దయగా ఉందే, ఆ? 197 00:17:12,440 --> 00:17:14,320 నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, క్రెగ్? 198 00:17:17,450 --> 00:17:21,750 మొదటి కారణం, నేను ప్యాటిని పెళ్ళి చేసుకోవచ్చని. 199 00:17:23,330 --> 00:17:26,270 ఇప్పుడు... అంటే ప్రస్తుతం, 200 00:17:26,470 --> 00:17:30,420 నేను సజీవంగా ఉండటానికి వచ్చాననుకుంటాను. 201 00:17:33,090 --> 00:17:34,340 నీ శత్రువు ఎవరు? 202 00:17:36,890 --> 00:17:40,310 అతను షావో కాన్‌లా రాక్షసుడు, డాంకీ కాంగ్‌లాంటి గొరిల్లా. 203 00:17:41,180 --> 00:17:45,230 కొన్నిసార్లు బౌజర్‌లాంటి విలన్. క్షమించాలి, ఇవి సాంకేతిక నామాలు. 204 00:17:57,860 --> 00:17:58,950 అతను నా యజమాని. 205 00:18:00,070 --> 00:18:01,240 అతను అంతే. 206 00:18:03,580 --> 00:18:06,920 నేను అతని గురించిన ఆలోచనతో ఇంటికి వెళ్ళకూడదు, 207 00:18:07,710 --> 00:18:12,050 కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆలోచనలోకి వస్తున్నాడు. 208 00:18:14,130 --> 00:18:15,300 ఏం చేయబోతున్నావు? 209 00:18:19,260 --> 00:18:21,100 అతనే ఆ వ్యక్తి. 210 00:19:21,490 --> 00:19:22,910 ఓరి నీ ఛ. 211 00:19:47,810 --> 00:19:49,060 హలో, బాబు. 212 00:19:53,770 --> 00:19:54,810 కూర్చోనా? 213 00:20:02,910 --> 00:20:04,870 నీతో ఒక ఆట ఆడాలనుకుంటున్నా. 214 00:20:12,500 --> 00:20:14,000 ఫోన్లు వాడే అనుమతి నాకు లేదు. 215 00:20:17,880 --> 00:20:20,590 దీని పేరు మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ. 216 00:20:23,380 --> 00:20:25,300 నిన్ను ఎవరూ కోపగించుకోరులే. 217 00:20:33,100 --> 00:20:36,940 కాంప్‌వేర్ గేమ్స్ మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ 218 00:20:40,940 --> 00:20:43,610 మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ 219 00:20:51,700 --> 00:20:53,370 నీ మాటల్లో చెప్పు... 220 00:20:54,620 --> 00:20:57,790 ఆ ఆట వల్ల నీలో ఏయే భావాలు కలుగుతున్నాయో నాకు చెప్పు. 221 00:21:15,020 --> 00:21:16,020 స్థాయి 300 పూర్తి! 222 00:21:17,810 --> 00:21:18,590 301వ స్థాయి - ఆరంభం 223 00:21:18,790 --> 00:21:21,360 301వ స్థాయి ఆరంభం 224 00:21:45,840 --> 00:21:48,410 హాయ్, నేను కాంప్‌వేర్ నుండి ఎలేన్‌ను. 225 00:21:48,610 --> 00:21:50,160 మీరు టాన్, కదా? 226 00:21:50,360 --> 00:21:51,680 ట్యాంగ్, రుచుల్లో ఒకటి. 227 00:21:52,720 --> 00:21:57,560 క్షమించండి, ఇది శనివారం ఉదయం, నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. 228 00:21:58,150 --> 00:22:02,840 మీ ఆటతీరులో అసాధారణమైన ధోరణిని మేం పసిగట్టాం, అందుకే కాల్ చేశాను. 229 00:22:03,040 --> 00:22:05,930 మీరు మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీని 7 గంటల 11 నిమిషాల పాటు, 230 00:22:06,130 --> 00:22:08,600 తొమ్మిది సార్లు ఆడారని మా డేటా చెబుతోంది, 231 00:22:08,800 --> 00:22:11,600 అలాగే మీరు 316వ స్థాయిలో ఆగిపోయారని చెబుతోంది. 232 00:22:11,800 --> 00:22:15,160 అవును, నేను తిరిగి పొందలేని 7 గంటల 11 నిమిషాలు. 233 00:22:15,460 --> 00:22:17,830 అయితే మీరు 316వ స్థాయితో నిరాశ చెందారా? 234 00:22:18,170 --> 00:22:21,320 చూడండి, బంగారు గుడ్డు కోసం పరిగెత్తుతా, ఆ ఏనుగు పడిపోతుంది, 235 00:22:21,520 --> 00:22:24,660 నేను ప్రతీసారి చనిపోతున్నాను. 236 00:22:24,860 --> 00:22:27,830 నాకెంత కోపం వచ్చిందంటే, ముఖాన్ని వసారా కిటికీకి గుద్దుకున్నా. 237 00:22:28,030 --> 00:22:28,870 ట్యాంగ్ నుండి 1స్టారే. 238 00:22:29,070 --> 00:22:29,840 కాల్ ముగిసింది 239 00:22:48,320 --> 00:22:51,520 నేను ఇప్పటి వరకూ ఆడిన ప్రతీ ఆటను పూర్తి చేశాను. 240 00:22:51,720 --> 00:22:54,690 అయితే మీరు 316వ స్థాయి వద్ద ఆగిపోయారా? 241 00:22:54,890 --> 00:22:56,910 నేను ఆగలేదు. అది తప్పుగా పని చేసింది. 242 00:23:00,250 --> 00:23:02,210 కైల్, మీ చేతికి ఏమైంది? 243 00:23:03,290 --> 00:23:04,710 నేను కిటికీని గుద్దాను. 244 00:23:09,090 --> 00:23:12,430 - ఈ ఆట వల్లనా? - ఆ చెత్త ఏనుగు వల్ల. 245 00:23:36,040 --> 00:23:37,620 రీజెస్ చిత్రం అందుకున్నారు 246 00:24:14,370 --> 00:24:16,160 చెత్త వెధవలు. 247 00:24:20,830 --> 00:24:22,020 డానా, ఇక్కడ ఎందుకున్నావు? 248 00:24:22,220 --> 00:24:25,380 ఆయన షార్ట్‌బ్రెడ్ కావాలన్నాడు. ఇంట్లో చేసినదై ఉండాలన్నాడు. 249 00:24:27,420 --> 00:24:30,340 ప్రయాణంలో ఇప్పటికే మూడింటిని తిన్నాను. నన్ను ఆపు. 250 00:24:31,420 --> 00:24:33,550 మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? టెర్రీ? 251 00:24:33,970 --> 00:24:34,890 టిమ్మీ. 252 00:24:36,390 --> 00:24:39,000 అవును, వాడికి కుట్లు వేశారు. బాగవుతుందిలే. 253 00:24:39,200 --> 00:24:41,600 వాడి నరానికి గాయం కాకపోవడం వింత. 254 00:24:43,850 --> 00:24:44,900 ఏం జరిగింది? 255 00:24:46,980 --> 00:24:50,090 వాడు కోపంతో ఊగిపోయాడు, మేం అదుపు చేయలేకపోయాం. 256 00:24:50,290 --> 00:24:52,950 వాడి చేతిని బాత్రూమ్ కిటికీలోకి దూశాడు. 257 00:24:54,860 --> 00:24:57,520 కిటికీ మూసే ఉందని వాడికి తెలియలేదో ఏంటో మరి. 258 00:24:57,720 --> 00:24:59,830 డేరియస్‌లా టిమ్ చేతిపనులలో దిట్ట కాడు. 259 00:25:00,910 --> 00:25:03,660 డానా, టిమ్మీ నీ ఫోన్‌లో గేమ్స్ ఆడుతాడా? 260 00:25:04,870 --> 00:25:07,880 వాడు మమ్మల్ని తన్నకుండా చేసే ఏకైక విషయం అదే. 261 00:25:13,590 --> 00:25:15,050 నువ్వు షార్ట్‌బ్రెడ్ కాదే. 262 00:25:22,680 --> 00:25:26,900 పిండికి ఎక్కువ నిష్పత్తిలో కొవ్వును కలిపాను, పాటాఫ్ గారు. 263 00:25:27,270 --> 00:25:31,480 అన్నిటిని తినాలనుకుంటే, మీరు మీ గుండె ఆరోగ్యాన్ని చూసుకోండి. 264 00:25:33,190 --> 00:25:35,260 ఈ వారాంతంలో ఇంకేదైనా జరుగుతోందా? 265 00:25:35,460 --> 00:25:37,410 ఇక నీతో ఏమాత్రం అవసరం లేదు. 266 00:25:40,530 --> 00:25:42,650 పాటాఫ్ గారు, మనకొక సమస్య వచ్చింది. 267 00:25:42,850 --> 00:25:44,980 ఆట ముఖ్య వాడకందారులను అనుసరిస్తున్నాను, 268 00:25:45,180 --> 00:25:47,460 వారిలో ఎవరూ 316వ స్థాయిని దాటలేదు. 269 00:25:48,000 --> 00:25:49,420 ఇది కష్టమైన ఆట. 270 00:25:49,960 --> 00:25:53,740 అందులో సాంకేతిక లోపముందేమో, పరీక్ష చేయడానికి మరింత సమయం తీసుకోవాలేమో. 271 00:25:53,940 --> 00:25:56,260 వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉండాలి... 272 00:25:57,390 --> 00:25:58,390 ఎప్పటికీ... 273 00:25:59,390 --> 00:26:01,080 అవసరమైతే. 274 00:26:01,280 --> 00:26:03,420 వారు విసిగిపోతున్నారు, కోప్పడుతున్నారు. 275 00:26:03,620 --> 00:26:06,600 కొన్ని సందర్బాల్లో, వాడకందారులు స్వీయ హానికి పాల్పడ్డారు. 276 00:26:07,520 --> 00:26:10,970 డానా కొడుకుకూ అదే జరిగింది. ఆమె గేమ్‌ను డౌన్‌లోడ్ చేసింది, 277 00:26:11,170 --> 00:26:14,180 ఆమె కొడుకు గేమ్ ఆడాడు, ఆసుపత్రి పాలయ్యాడు. 278 00:26:14,380 --> 00:26:16,030 ఇది అసాధ్యం. 279 00:26:17,410 --> 00:26:21,740 ఒక చిక్కును పూర్తి చేయాలి, కానుక గెలవాలి, తర్వాతి స్థాయికి వెళ్ళాలి. 280 00:26:22,450 --> 00:26:25,450 చాలా అమాయకమైన, చిన్నపిల్లల ఆట. ఇందులో హాని ఎక్కడుంది? 281 00:26:26,460 --> 00:26:28,210 మనం విడుదలను వాయిదా వేయాలి. 282 00:26:28,670 --> 00:26:34,240 మనం ఇప్పుడు ఆరంభించకపోతే, శాంగ్ గారికి, కాంప్‌వేర్‌కు ఉనికే లేకుండా పోతుంది. 283 00:26:34,440 --> 00:26:40,050 నేను వాడకందారుల ఫీడ్‌బ్యాక్ విశ్లేషించాను, వాళ్ళు ఎక్కువగా సానుకూలంగానే చెప్పారు. 284 00:26:43,060 --> 00:26:45,770 మనం విడుదలకు సిద్ధమని మార్కెటింగ్‌ వారికి చెప్పు. 285 00:26:55,940 --> 00:27:01,200 "మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ నేను ఇంతవరకూ ఆడిన ఆటల్లో అత్యుత్తమైన ఆట." 286 00:27:01,490 --> 00:27:03,740 ఇవి నా మాటలు కావు, ఓహాయో నుండి రిహానివి. 287 00:27:19,930 --> 00:27:22,140 ఛత్! ఈ చెత్త ఆట నాశనం కాను. 288 00:27:26,520 --> 00:27:27,630 బయటకు వెళ్తున్నావా? 289 00:27:27,830 --> 00:27:32,440 - కొన్ని చిన్న పనులు చేయాలి. - కానీ నీకు జబ్బు చేసిందనుకున్నానే. 290 00:27:34,650 --> 00:27:35,690 కోపంగా ఉన్నావా? 291 00:27:36,230 --> 00:27:40,490 - నాకు కొంత గాలి కావాలి. బయటకు వెళ్ళాలి. - ఆగు, ఆగు, ఆగు. బంగారం? 292 00:27:41,660 --> 00:27:42,910 నేను ఏమైనా చేశానా? 293 00:27:45,030 --> 00:27:46,740 నాకు తెలియదు, క్రెగ్. చేశావా? 294 00:27:50,370 --> 00:27:51,290 ప్యాటి. 295 00:28:05,550 --> 00:28:09,100 అవి బతకడానికి ఇక్కడ వాటికి తగినంత సహజ వెలుతురు లేదు. 296 00:28:09,980 --> 00:28:12,250 వారాంతాల్లో, నేను మొక్కల్ని సేకరించి, 297 00:28:12,450 --> 00:28:14,550 వాటిని కళల శాఖ కిటికీ దగ్గర పెడతాను. 298 00:28:14,750 --> 00:28:17,190 అందరికంటే ఎక్కువ వెలుగు హారియట్ గదిలోనే ఉంటుంది. 299 00:28:22,910 --> 00:28:23,910 ధన్యవాదాలు. 300 00:28:25,570 --> 00:28:28,870 మనం కేవలం వెలుగులోనే ఎదగగలం, ఎలేన్. 301 00:29:24,720 --> 00:29:27,550 మీరు ఓడిపోయారు! 302 00:30:13,430 --> 00:30:15,770 రీజెస్ పాటాఫ్ 303 00:31:24,710 --> 00:31:26,660 ఉపశీర్షికలు అనువదించినది Pradeep Kumar Maheshwarla 304 00:31:26,860 --> 00:31:28,800 క్రియేటివ్ సూపర్‌వైజర్