1 00:00:07,000 --> 00:00:10,280 దురదృష్టం కొద్దీ, ఇవాళ శాంగ్ గారు మనతో లేరు, 2 00:00:10,480 --> 00:00:14,490 ఇక మీరు తెలుసుకుంటారు... ఇది శాంగ్ ఆకాంక్షలకు ప్రతిరూపం అని. 3 00:00:14,690 --> 00:00:17,080 అంటే ఇతను సులువుగా దూసుకొచ్చి, తర్వాత శాంగ్ చేత 4 00:00:17,280 --> 00:00:20,000 పూర్తి అధికారం బదిలీ రాయించుకున్నాడని అంటున్నావా? 5 00:00:20,200 --> 00:00:20,920 నేనది నమ్మను. 6 00:00:21,120 --> 00:00:24,770 ఎన్నో ఏళ్ళుగా నా స్నేహితురాలు మిలాని డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతోంది. 7 00:00:27,770 --> 00:00:28,940 నాకు ఏం జరుగుతోంది? 8 00:00:29,440 --> 00:00:32,260 నువ్వు భీతి తాకిడికి లోనవుతున్నావు, క్రెగ్. 9 00:00:32,460 --> 00:00:33,680 సమాజద్వేషికి పని చేస్తున్నాం. 10 00:00:33,880 --> 00:00:34,720 నాతో అబద్ధమాడారు. 11 00:00:34,920 --> 00:00:38,480 - మనం స్నేహితులం కాగలమా అని తెలుసుకోడానికి. - ఇంకా? 12 00:00:38,680 --> 00:00:41,910 ఒక సంక్షోభ సమయంలో ఇక ముందు నేను నీపై ఆధారపడను. 13 00:00:45,790 --> 00:00:47,110 ఫ్రాంక్ ఫ్లోరెజ్. 14 00:00:47,310 --> 00:00:50,550 ఇతని గురించి తెలుసుకోవాలంటే, ఫ్లోరె‌జ్‌‌ను కనుక్కో. 15 00:01:21,950 --> 00:01:24,480 - హాయ్. - శాంగ్ వూ గారిని కలవాలి. 16 00:01:24,680 --> 00:01:27,120 - మీరు ముందస్తు అనుమతి తీసుకున్నారా? - లేదు. 17 00:01:27,960 --> 00:01:32,460 అయితే, శాంగ్‌కు ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ కలవకూడదనే విధానం ఉంది. 18 00:01:33,420 --> 00:01:35,420 శాంగ్ వూ గారిని కలవాలి. 19 00:01:37,470 --> 00:01:38,840 నేను చెప్పాను కదా... 20 00:01:39,470 --> 00:01:41,470 మీకు ముందస్తు అనుమతిని ఏర్పాటు చేయనా? 21 00:01:41,890 --> 00:01:44,270 ఆయనకు ఖాళీ సమయం దొరికే దాకా నేను వేచి చూస్తాను. 22 00:02:45,240 --> 00:02:48,750 సర్? హాయ్. అవును, ఆయన మీకు 10 నిమిషాలు ఇవ్వగలరంట. 23 00:03:13,020 --> 00:03:14,230 రండి, రండి. 24 00:03:17,110 --> 00:03:19,890 నమస్కారం, శాంగ్. నా పేరు... 25 00:03:20,090 --> 00:03:22,570 ఇంగ్లీష్. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతాను. 26 00:03:24,330 --> 00:03:26,790 నా పేరు రీజెస్ పాటాఫ్, 27 00:03:27,370 --> 00:03:30,920 మీకొక కానుకను ఇవ్వడానికి ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చాను. 28 00:03:31,540 --> 00:03:34,500 మీరు వెళ్ళేటప్పుడు దాన్ని నా సహాయకురాలికి ఇవ్వచ్చు. 29 00:03:36,210 --> 00:03:39,590 దురదృష్టవశాత్తూ, ఈ కానుక 30 00:03:40,550 --> 00:03:42,050 మీరు చనిపోయాకే చేరుతుంది. 31 00:03:42,680 --> 00:03:44,850 నేను చనిపోయాక నాకు దాంతో పనేంటి? 32 00:03:45,510 --> 00:03:49,060 ఇది అమరత్వం అనే కానుక అని మీకు నేను చెబితే? 33 00:03:56,480 --> 00:03:58,190 మీ సెషన్ ముగిసింది 34 00:04:15,790 --> 00:04:18,380 ద కన్సల్టెంట్ - ఎస్1 35 00:04:31,480 --> 00:04:32,710 213 డెలివరీస్ 36 00:04:32,910 --> 00:04:35,760 హేయ్, ఈ వారాంతంలో నాకు ఎందుకు కాల్ చేయలేదు? 37 00:04:35,950 --> 00:04:37,690 నీకు 10 సందేశాలు పంపి ఉంటాను. 38 00:04:37,940 --> 00:04:39,880 నా ఫోన్ నెంబర్, నా ఖాతాలు, 39 00:04:40,080 --> 00:04:42,890 నా పాస్‌వర్డ్స్, నా భద్రతా ప్రశ్నలు మార్చాల్సి వచ్చింది. 40 00:04:43,090 --> 00:04:45,510 అది సిగరెట్టా? నాకొక దమ్ము ఇస్తావా? 41 00:04:45,710 --> 00:04:48,980 మన గురించి అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయి. తాళం వేసిన చిన్న గదిలో. 42 00:04:49,180 --> 00:04:53,410 నా తల్లిదండ్రుల పేర్లు, నేను అరుదుగా వెళ్ళే జిమ్ పేరు అతనికి తెలుసు. 43 00:04:53,710 --> 00:04:55,080 అతనికి అన్నీ తెలుసు. 44 00:04:58,540 --> 00:05:02,840 ఆన్ శాంగ్ వూ గారికి 45 00:05:15,140 --> 00:05:17,100 శాంగ్ వూ గారికి డెలివరీ వచ్చింది. 46 00:05:19,570 --> 00:05:20,940 క్షమించండి. 47 00:05:21,900 --> 00:05:25,030 అతని పేరు విన్న ప్రతీసారి, తన ముఖాన్ని ఊహించుకుంటాను. 48 00:05:30,740 --> 00:05:32,940 హిల్‌టెక్ కార్ప్, నీకు గుర్తున్నారా? 49 00:05:33,140 --> 00:05:34,940 - రష్యాలో కృత్రిమ అంగాలు. - అవును. 50 00:05:35,140 --> 00:05:36,520 లోతుగా ఆరా తీశాను. 51 00:05:36,720 --> 00:05:40,610 పాటాఫ్ రావడానికి మందు, తర్వాత వారి సామర్థ్యంపై పోలికలు చూశాను. 52 00:05:40,810 --> 00:05:43,070 వార్షిక టర్నోవర్ 26 మిలియన్ డాలర్లు ఉండేది. 53 00:05:43,270 --> 00:05:45,240 ఇప్పుడు 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. 54 00:05:45,440 --> 00:05:48,160 వారి ఉత్పాదనని ఆరు నెలల్లో దాదాపు రెండింతలు చేశాడు. 55 00:05:48,360 --> 00:05:51,430 అతని పనిని అతను చాలా బాగా చేస్తాడేమో. 56 00:05:52,850 --> 00:05:56,920 సరే, సరదా కోసం, రష్యాలో అంగాలు కోల్పోయినవారిపై పరిశోధించాను. 57 00:05:57,120 --> 00:05:59,260 - నీ వారాంతం ఇలా గడిచిందా? - ఈ రాత్రి... 58 00:05:59,450 --> 00:06:01,420 ప్రార్థనకు వెళ్ళాలి, కనుక సంతులనం ఉందిలే. 59 00:06:01,620 --> 00:06:05,010 జాతీయ స్థాయిలో, ఏడాదికి 1,50,000 మంది అంగాలు కోల్పోతున్నారు. 60 00:06:05,210 --> 00:06:08,350 ఉన్నట్టుండి, మన మిత్రుడు పాటాఫ్ అంగాల వ్యాపారంలో చేరాడు. 61 00:06:08,550 --> 00:06:11,200 ఇప్పుడు ఏడాదికి 2,90,000 మంది అంగాలు కోల్పోతున్నారు. 62 00:06:11,620 --> 00:06:12,850 దాదాపు రెండింతలు చేశాడు. 63 00:06:13,050 --> 00:06:15,310 ఏంటి, ఉన్నట్టుండి, రెండింతల సంఖ్యలో రైతులు 64 00:06:15,510 --> 00:06:17,610 యంత్రాల్లో పడుతున్నారా? అర్థమే లేదు. 65 00:06:17,810 --> 00:06:21,490 సంఖ్యలు పెరుగుతూ ఉంటాయి. మనం మౌలిక కారణాలను పరిగణించాలి. 66 00:06:21,690 --> 00:06:24,380 యుద్ధం, మందుపాతరలు, వ్యాధులు. 67 00:06:25,260 --> 00:06:26,870 సరే, ఈ చిత్రాన్ని చూడు. 68 00:06:27,070 --> 00:06:28,200 ఈమె మిలాని మొరొజోవ్. 69 00:06:28,400 --> 00:06:31,250 ఈమె విక్టర్ కుల్జర్ అనే ఇతనితో దగ్గరగా పని చేస్తుంది. 70 00:06:31,440 --> 00:06:34,000 - ఇతనూ శాంగ్‌లాంటి ఒప్పందంపై సంతకం చేశాడు. - అవును. 71 00:06:34,200 --> 00:06:37,480 ఈ చిత్రం తీసిన మూడు నెలల తర్వాత, కుల్జర్... చనిపోయాడు. 72 00:06:40,730 --> 00:06:42,170 - అందగత్తె. - ఇంకా అలానే ఉంది. 73 00:06:42,370 --> 00:06:46,740 కానీ ఈమెకు కొన్ని మార్పులు జరిగాయి. కొత్త చేయి, కొత్త కాలు, కొత్త దవడ వచ్చాయి. 74 00:06:47,360 --> 00:06:50,510 ఆగు, నువ్వు నాకు ఏం చెప్తున్నావంటే, 75 00:06:50,710 --> 00:06:53,640 ఆమె సగం శరీరాన్ని తెంపుకునేలా అతను ఆమెను ఒప్పించాడనా? 76 00:06:53,840 --> 00:06:56,790 అవును, కుల్జర్ గారి వ్యాపార ప్రయోజనాల మెరుగుదలకు. 77 00:07:16,930 --> 00:07:19,290 నాకు తీరిక లేదు, నేరుగా విషయం మాట్లాడుదాం. 78 00:07:19,490 --> 00:07:23,460 - మీరు ఏం అమ్ముతారు? - నేను అమ్మే వ్యక్తిని కాదని చెప్పగలను. 79 00:07:23,660 --> 00:07:26,760 నేను ఒక కన్సల్టెంట్‌గా నా సేవలను అందించాలనుకుంటున్నాను. 80 00:07:26,960 --> 00:07:30,110 నాకు కన్సల్టెంట్ అవసరం లేదు. మీ చుట్టూ చూడండి, తాతగారు, 81 00:07:30,570 --> 00:07:31,820 నాకు ఏ కొరతా లేదు. 82 00:07:32,490 --> 00:07:35,160 పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది, శాంగ్ గారు. 83 00:07:36,200 --> 00:07:40,870 నేను చొరవ తీసుకుని కాంప్‌వేర్ ఖాతాలను, లెక్కలను సమీక్షించాను. 84 00:07:42,960 --> 00:07:46,670 మీరు మీ సిబ్బందికి కేవలం మరో నాలుగు నెలలకు మాత్రమే చెల్లించగలరు. 85 00:07:50,840 --> 00:07:53,160 - అసలు నువ్వు ఎవడ్రా? - రీజెస్ పాటాఫ్. 86 00:07:53,360 --> 00:07:56,330 మన పరిచయంలో ఆ విషయాన్ని స్పష్టం చేశాననుకుంటాను. 87 00:07:56,530 --> 00:08:00,180 ఈసారి మీ చేతి పరికరంలో దాన్ని రాసుకోండి. 88 00:08:07,190 --> 00:08:11,680 మీ సిబ్బందికి ఎక్కువ చెల్లిస్తున్నారు, మీ ఉత్పత్తికి తక్కువ విలువనిస్తున్నారు. 89 00:08:11,880 --> 00:08:16,200 మీ వయసును, జాతిని, బోళాతనాన్ని మనుషులు వారి ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. 90 00:08:16,830 --> 00:08:19,160 బ్యాంకులు మీకు మరో పైసా అప్పివ్వవు. 91 00:08:20,040 --> 00:08:24,860 మీ మదుపరులు ఈ దయనీయమైన పరిస్థితులను తెలుసుకోగానే, 92 00:08:25,060 --> 00:08:27,500 మీ స్థానంలో మరొకరిని కూర్చోబెడతారు. 93 00:08:27,920 --> 00:08:32,200 ఈ వాస్తవాలు ఎంతో అసౌకర్యమైనవి అయినా, 94 00:08:32,400 --> 00:08:34,130 ఇవి నిజాలేనని మీకు తెలుసు. 95 00:08:36,090 --> 00:08:37,710 నాతో ఇలా ఎవరూ మాట్లాడరు. 96 00:08:37,900 --> 00:08:40,420 మూడు రాత్రుల క్రితం, 19వ అంతస్తు బాల్కనీలో, 97 00:08:40,620 --> 00:08:43,690 మీరు ఏడుస్తూ నిలబడ్డారు, కిందకు దూకేయాలని అనుకున్నారు. 98 00:08:44,810 --> 00:08:47,940 శాంగ్ గారు, మీకు నా ప్రశ్న ఇదే. 99 00:08:48,940 --> 00:08:50,150 మిమ్మల్ని ఏం ఆపింది? 100 00:08:52,440 --> 00:08:53,640 అది మీకెలా తెలిసింది? 101 00:08:53,840 --> 00:08:56,770 ఆ పిట్ట గోడపైనే మీరు ఆగిపోయేలా చేసిన ఏకైక విషయం, 102 00:08:56,970 --> 00:08:59,640 మీ వ్యాపార వారసత్వం నిర్వీర్యం అవుతుందన్న భయమే. 103 00:08:59,840 --> 00:09:01,830 మీరు ఎవరికీ గుర్తుండరనే భయమే. 104 00:09:03,710 --> 00:09:05,750 నిరాశకు లోనైనట్టు ఉన్నారు, శాంగ్ గారు. 105 00:09:06,000 --> 00:09:09,490 కాసేపు బయటకు వెళ్తాను, మీరు కొంచెం తమాయించుకోండి. 106 00:09:09,690 --> 00:09:10,460 అవసరం లేదు. 107 00:09:11,380 --> 00:09:12,380 ఆగండి. 108 00:09:21,930 --> 00:09:24,960 - వీలైనంత కష్టపడుతున్నా. - కానీ సమస్యలు పెరిగిపోతున్నాయి. 109 00:09:25,160 --> 00:09:29,440 - ఒక సరైన గేమ్‌ని సృష్టిస్తే చాలు. - కానీ మీ ప్రార్థనలకు జవాబు దొరకటం లేదు. 110 00:09:30,770 --> 00:09:36,030 నా సేవలను స్వీకరించండి, శాంగ్ గారు, మీ ఆందోళనలు ఆగిపోతాయి. 111 00:09:41,540 --> 00:09:42,690 ఎప్పుడు మొదలుపెడతారు? 112 00:09:42,890 --> 00:09:45,620 దురదృష్టవశాత్తూ, మీరు పోతే కానీ మొదలుపెట్టను. 113 00:09:46,540 --> 00:09:49,400 - పోవాలా? - ఆ విషయాన్ని నేను స్పష్టం చేశాను కదా? 114 00:09:49,600 --> 00:09:52,820 క్షమించండి. ఈ రోజు నేను కలుస్తున్న మూడో క్లయింట్ మీరు, 115 00:09:53,020 --> 00:09:55,370 కొన్నిసార్లు సంభాషణలు అస్పష్టమవుతాయి. 116 00:09:55,570 --> 00:09:59,010 మీ జీవితం ముగిశాకే నా కాంట్రాక్టు మొదలవుతుంది. 117 00:10:48,230 --> 00:10:49,270 పర్లేదు. 118 00:10:49,600 --> 00:10:52,010 లోపల గడియ పెట్టుకుని అతను బయటకు రావడం లేదు. 119 00:10:52,210 --> 00:10:54,300 ఫ్రాంక్ ఫ్లోరెజ్ గురించి పాటాఫ్ చెప్పాడా? 120 00:10:54,500 --> 00:10:56,510 అది ''జ్'' లేదా ''స్'' కావచ్చు. 121 00:10:56,710 --> 00:10:57,550 చెప్పలేదు. 122 00:10:57,750 --> 00:10:59,260 ఆ రష్యన్ అమ్మాయి ఏమందంటే, 123 00:10:59,460 --> 00:11:02,770 పాటాఫ్ గురించి తెలియాలంటే, ఫ్రాంక్ ఫ్లోరెజ్‌ను కనుక్కోవాలని. 124 00:11:02,970 --> 00:11:04,520 నాకు ఇది ముందే ఎందుకు చెప్పలేదు? 125 00:11:04,720 --> 00:11:07,190 ఎందుకంట్ 32 ఫ్లోరెజ్‌లు, 1100 ఫ్లోరెస్‌లు ఉన్నారు, 126 00:11:07,390 --> 00:11:08,730 హౌ మెనీ ఆఫ్ మీ ప్రకారం. 127 00:11:08,930 --> 00:11:13,110 ఫలితాలను తగ్గిస్తున్నా. ఫ్రాంక్ ఫ్లోరెజ్, అంగవిహీనుడు అనే ఫలితమే లేదు. 128 00:11:13,310 --> 00:11:14,530 రెండు స్పెల్లింగ్‌లతోనూ. 129 00:11:14,730 --> 00:11:17,340 శుక్రవారం రాత్రి పానీయాలు ఎలా ముగిశాయో చెప్పలేదు. 130 00:11:20,300 --> 00:11:24,460 యజమాని ఎవరు అని చూపించడానికి అతను హద్దు మీరి ప్రవర్తించాడని అందాం. 131 00:11:24,650 --> 00:11:26,350 దీని గురించి ప్యాటి ఏమనుకుంటోంది? 132 00:11:27,600 --> 00:11:29,840 - తనకు నేనేమీ చెప్పలేదు. - ఎందుకని? 133 00:11:30,030 --> 00:11:32,500 పని తప్పించుకోవడానికే ఇవి చేస్తున్నానని అనుకుంటుంది. 134 00:11:32,700 --> 00:11:34,800 - నిజమా? - కాదు. ఇతను... 135 00:11:35,000 --> 00:11:37,690 - పైకి మనకు కనిపించే వ్యక్తి కాదు. - డెనీస్ డెలిలో! 136 00:11:41,530 --> 00:11:43,910 డెనీస్ డెలిలో. 137 00:11:47,700 --> 00:11:49,910 మీలో ఎవరో ఒకరు డెనీస్ డెలిలో అయ్యుంటారు. 138 00:11:54,840 --> 00:11:56,090 మంచిది. 139 00:11:57,170 --> 00:11:59,050 ఆ పేరు సుపరిచితంగా అనిపిస్తోందే? 140 00:12:14,730 --> 00:12:15,730 లోపలికి రండి. 141 00:12:19,900 --> 00:12:21,430 - పాటాఫ్ గారు? - చెప్పు. 142 00:12:21,630 --> 00:12:25,450 - మీరు డెనీస్ కోసం చూస్తున్నారు కదా? - డెలిలో. 143 00:12:25,820 --> 00:12:30,940 ఆమె వివరాలు ఇక్కడున్నాయి. ప్రతీ నెలా ఆమెకు ఇచ్చే జీతం 5,256.70 డాలర్లు, 144 00:12:31,140 --> 00:12:34,460 ఆమె ఉత్పాదకత నిజంగానే శూన్యం. 145 00:12:34,790 --> 00:12:36,280 బహుశా ఆమె దెయ్యమేమో? 146 00:12:36,480 --> 00:12:39,240 జనవరి నుండి డెనీస్ దీర్ఘ-కాలిక జబ్బు బారిన పడింది. 147 00:12:39,440 --> 00:12:40,780 శాంగ్ జీతం కొనసాగించాడా? 148 00:12:40,980 --> 00:12:43,660 అతను వివక్ష కేసును ఎదుర్కోకూడదనుకుంటే, చెల్లించాలి. 149 00:12:43,860 --> 00:12:45,680 - ఆమెకు ఏమైంది? - ఒత్తిడి. 150 00:12:48,680 --> 00:12:51,810 - డైసీ హోయట్? - అలెర్జీలు. 151 00:12:54,350 --> 00:12:57,190 - డిలన్ గ్యారెటి? - బయటకి ప్రకటించని మానసిక జబ్బు. 152 00:13:01,780 --> 00:13:03,720 మృతుల గురించి చెడ్డగా మాట్లాడను, 153 00:13:03,920 --> 00:13:06,430 కానీ శాంగ్‌కు వ్యాపారపు తెలివితేటలు లేవు. 154 00:13:06,630 --> 00:13:10,100 శాంగ్ తనని తాను ఎక్కువగా సృజనాత్మక వ్యక్తిగానే చూసుకున్నాడు, 155 00:13:10,300 --> 00:13:12,080 పైగా అతని వయసు 20 ఏళ్ళే. 156 00:13:13,160 --> 00:13:16,190 నేను ఊహించిన దానికంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 157 00:13:16,390 --> 00:13:20,700 ఖర్చులు తగ్గించేందుకు మనం వెంటనే చర్యలు తీసుకోకపోతే, ఆరు వారాలు కూడా మనలేము. 158 00:13:20,900 --> 00:13:22,070 ఆరు వారాలా? 159 00:13:22,270 --> 00:13:25,590 మనం ప్రతీ ఖర్చును కనిష్టానికి తగ్గిస్తే, బహుశా రెండు నెలలు. 160 00:13:30,850 --> 00:13:33,130 హేయ్, దేని బరువు ఎక్కువ? 161 00:13:33,320 --> 00:13:35,420 మూడు హైనాలా లేదా ఒక పెద్ద మగ గొరిల్లానా? 162 00:13:35,620 --> 00:13:37,880 దీన్ని ప్రారంభించటానికి ఇంకా ఎంత కాలం పడుతుంది? 163 00:13:38,080 --> 00:13:39,970 దీన్ని ఎవరూ సరిగ్గా మార్కెట్ చేయలేరు. 164 00:13:40,160 --> 00:13:42,590 - అలాంటి వారు ఉంటే? - మూడు నెలలు. 165 00:13:42,790 --> 00:13:45,570 నువ్వు వారాంతాలు కూడా పని చేయాల్సి రావచ్చు, నిపుణుడా. 166 00:13:45,950 --> 00:13:48,930 మనకు ఆరు వారాల సమయముంది, ఆ తర్వాత మనకు జీతాలు చెల్లించరు. 167 00:13:49,130 --> 00:13:52,690 ఆగు. ఏంటి? కంపెనీ మూతపడటానికి మనకు ఆరు వారాలే ఉందని పాటాఫ్ చెప్పాడా? 168 00:13:52,890 --> 00:13:53,600 ఇప్పుడే. 169 00:13:53,800 --> 00:13:56,400 వాడి నోట్లో నుండి వచ్చే ఏ మాటా నేను నమ్మను. 170 00:13:56,600 --> 00:13:58,710 నీకు అర్థం కావడం లేదా? ఇది మరో పరీక్ష. 171 00:14:00,670 --> 00:14:03,920 హే, రౌల్. అప్‌స్కర్ట్ జంగల్‌ యాప్‌కు దగ్గరగా పోలిన యాప్ ఏది? 172 00:14:04,340 --> 00:14:07,080 అది క్యాచీ క్యూబీ లాంటిది, కానీ అంతరిక్షంలో కాదు. 173 00:14:07,280 --> 00:14:10,660 ఆ పాత గేమ్‌కు కొత్త హంగులు అద్దటానికి ఎంత సమయం పడుతుంది? 174 00:14:10,860 --> 00:14:11,910 గ్రాఫిక్స్ అధికం. 175 00:14:12,110 --> 00:14:15,210 మనం బొమ్మలు గీశామంటే, రేపటికి తొలి కాపీ తయారవుతుంది. 176 00:14:15,410 --> 00:14:16,730 ఈ రాత్రికే మన లక్ష్యం. 177 00:14:17,560 --> 00:14:19,340 కాంప్‌వేర్‌ను దీనితో రక్షించగలవా? 178 00:14:19,540 --> 00:14:23,900 ఆసక్తికరమైన వాస్తవం, మూడు హైనాల బరువు ఒక పెద్ద మగ గొరిల్లా బరువుకు సమానం. 179 00:14:25,490 --> 00:14:26,740 దేవుడా. 180 00:14:34,040 --> 00:14:37,710 టేబుల్ టెన్నిస్ బల్లను వేలంలో గెలిచాను. నగదులోనే చెల్లించమన్నారు. 181 00:14:49,880 --> 00:14:52,050 మీకు జీవిత బీమా ఉంది కదా? 182 00:14:53,180 --> 00:14:55,970 - హా, ఉంది. - దీనికి దానికీ తేడా ఏముంది? 183 00:14:57,390 --> 00:14:59,840 ఒకవేళ మీ అకాల మరణం సంభవిస్తే, 184 00:15:00,040 --> 00:15:04,230 మీ వారసత్వాన్ని రక్షించుకోవడానికి మీరు ఏయే ఏర్పాట్లను చేశారు? 185 00:15:07,190 --> 00:15:09,320 - ఏమీ చేయలేదు. - అయితే, ఇదే ఆ సమయం. 186 00:15:10,450 --> 00:15:14,430 శాంగ్ గారు, నా మార్గదర్శకత్వంలో, జనాలు మిమ్మల్ని ఆరాధిస్తారు. 187 00:15:14,630 --> 00:15:16,910 ఒక రోజున, వాళ్ళు మీకు మోకరిల్లుతారు. 188 00:15:22,210 --> 00:15:23,650 దీన్ని నా బృందంతో చర్చించాలి. 189 00:15:23,850 --> 00:15:27,280 మీరు ఈ క్లిష్ట పరిస్థితికి రావడానికి మీ బృందమే కారణం. 190 00:15:27,480 --> 00:15:31,660 ఆన్ శాంగ్ వూ తనని తాను వినడం ఎప్పుడు ఆపేశారు? 191 00:15:31,860 --> 00:15:34,260 నేనేం చేయాలో ఎవరూ చెప్పకూడదు, మీతో సహా. 192 00:15:36,510 --> 00:15:40,640 ఇంత చిన్న జీవితంలో మీరు ఎన్నో సాధించారు. 193 00:15:41,850 --> 00:15:44,770 మరణంలో మీరు ఎంత సాధించగలరో ఆలోచించండి. 194 00:16:35,660 --> 00:16:39,790 - క్రెగ్. అతను తాళాలు మార్చాడు. - ఏంటి? 195 00:16:41,290 --> 00:16:45,400 రికార్డుల గది తాళాలు. ఫ్రాంక్ ఫ్లోరెజ్‌పై ఏదైనా ఫైల్ ఉందా అని చూశాను. 196 00:16:45,600 --> 00:16:47,240 అతని తాళం ఇంకా నీ దగ్గరుందా? 197 00:16:47,440 --> 00:16:50,860 నకలు చేయించి, అసలు తాళాన్ని శనివారం తిరిగి అరలో పెట్టేశాను. 198 00:16:51,060 --> 00:16:54,030 లేడీ డిటెక్టివ్ ఈ అనుభవం నుండి ఏం నేర్చుకుంది? 199 00:16:54,230 --> 00:16:56,500 - అక్కడికి ఎవరో వచ్చారని తనకు తెలిసిందా? - అవును. 200 00:16:56,690 --> 00:16:59,080 నాతో ఆట ఆడినట్టే నీతోనూ ఆట ఆడుతున్నాడు. 201 00:16:59,280 --> 00:17:01,350 మీ ఇద్దరి మధ్యా అసలేం జరిగింది? 202 00:17:02,520 --> 00:17:05,340 చెప్పా కదా, నేను అతిగా తాగి ఇంటికి వెళ్ళానని. 203 00:17:05,540 --> 00:17:07,920 సరే, అతన్ని శృంగారభరిత యోగా క్లాసుకి తీసుకెళ్ళి 204 00:17:08,120 --> 00:17:11,440 తర్వాత మేం కాఫీ తాగడానికి వెళితే, నీకు కుతూహలం కలగదా? 205 00:17:13,860 --> 00:17:17,100 నేను చేయకూడదనుకున్న పనిని నాతో చేయించాలని చూశాడు. 206 00:17:17,300 --> 00:17:22,040 లైంగికమైనదో లేక అలాంటిదేదో కాదు. ఎలా అంటే, నిజంగా దారుణమైనది. 207 00:17:24,040 --> 00:17:26,020 - నువ్వు అది చేశావా? - ఏది? 208 00:17:26,220 --> 00:17:28,000 అతను చేయమన్న పనిని. 209 00:17:29,880 --> 00:17:30,880 చేయలేదు. 210 00:17:32,670 --> 00:17:33,590 నీకు మంచిది. 211 00:17:35,130 --> 00:17:36,180 ధన్యవాదాలు. 212 00:17:48,060 --> 00:17:48,980 లోపలికి రండి. 213 00:17:51,820 --> 00:17:52,820 పాటాఫ్ గారు? 214 00:17:56,610 --> 00:18:01,580 - అది ముఖ్యమైన విషయమా? - ఐదు లక్షల డాలర్ల విలువైనది కావచ్చు. 215 00:18:03,870 --> 00:18:06,520 ఇది కంపెనీ ఆస్తో కాదో నాకు తెలియదు కానీ... 216 00:18:06,720 --> 00:18:10,110 - గతేడాది యాట్‌లో శాంగ్ పెట్టుబడి పెట్టాడు. - అది మునిగిపోయింది. 217 00:18:10,310 --> 00:18:12,650 అవును. చెక్ రాసినప్పుడు అతనికి అది తెలియదు. 218 00:18:12,850 --> 00:18:17,340 దాన్ని బాగు చేయవచ్చో లేదో తెలియదు కానీ, దాని మూలంగా కొంత డబ్బు రాబట్టవచ్చు. 219 00:18:18,430 --> 00:18:22,060 శాంగ్ గారిది దూకుడు స్వభావం. అలాంటి వారిని సులభంగా మోసగించవచ్చు. 220 00:18:22,970 --> 00:18:25,640 నీది కూడా దూకుడు స్వభావమా, ఎలేన్? 221 00:18:26,890 --> 00:18:29,850 దాని గురించి ఆలోచించి జవాబు ఇస్తాను, పాటాఫ్ గారు. 222 00:18:34,570 --> 00:18:36,600 అప్‌స్కర్ట్ జంగల్ 223 00:18:36,790 --> 00:18:38,310 రౌల్, మనం పూర్తి చేశామా? 224 00:18:38,500 --> 00:18:39,680 అవును, సిద్ధమైంది. 225 00:18:39,880 --> 00:18:42,060 దీన్ని పంచుకోవాలని కోరుకుంటున్నావా? 226 00:18:42,260 --> 00:18:44,200 నన్ను నమ్ము, ఇది సరిపోతుంది, బాబు. 227 00:19:10,020 --> 00:19:11,020 లోపలికి రండి. 228 00:19:13,110 --> 00:19:16,730 పాటాఫ్ గారు, ఇది సరైన సమయమేనా? 229 00:19:18,240 --> 00:19:20,780 మనందరికీ త్వరలోనే సమయం ముగియనుంది. 230 00:19:22,120 --> 00:19:27,120 అవును. మనం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని విన్నాను. 231 00:19:28,040 --> 00:19:30,190 అందుకు సహాయపడేది నా దగ్గర ఉండవచ్చు. 232 00:19:30,390 --> 00:19:31,830 మరో మునిగిపోయిన పడవా? 233 00:19:32,920 --> 00:19:35,450 మీకు నచ్చిన ఆట, అప్‌స్కర్ట్ జంగల్. 234 00:19:35,650 --> 00:19:39,870 మన వనరులన్నీ అందులో పెడితే, దాన్ని నెలాఖరుకు ప్రారంభించవచ్చు. 235 00:19:40,070 --> 00:19:43,220 దాన్ని సరిగా మార్కెట్ చేస్తే, వేగంగా ఆదాయం అర్జించవచ్చు. 236 00:19:44,470 --> 00:19:46,620 - అంత త్వరగానా? - మీ కోసం నమూనా తయారు చేశాం. 237 00:19:46,820 --> 00:19:48,770 సీసా కొత్తది, కానీ నీళ్ళు పాతవే. 238 00:19:51,520 --> 00:19:55,010 మీకొకటి తెలుసా? మీకు కావాలంటే దానిని మీ ఫోన్‌లో పెడతాను. 239 00:19:55,210 --> 00:19:59,010 మీరు దాన్ని ఏ సమయంలోనైనా చూడవచ్చు. స్నానపుగదిలో, టాయిలెట్‌లో. 240 00:19:59,210 --> 00:20:02,030 మీకు కావాల్సిందల్లా ఓ స్థానిక సర్వర్, ఒక "గో" మీట. 241 00:20:09,830 --> 00:20:12,620 శుక్రవారం మన పానీయాన్ని ఆనందించాను, క్రెగ్. 242 00:20:13,170 --> 00:20:14,830 ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. 243 00:20:17,250 --> 00:20:18,110 ఫర్వాలేదు. 244 00:20:18,310 --> 00:20:22,990 మనం జోక్యం చేసుకున్న విషయం నీకు గాభరా కలిగించలేదని ఆశిస్తున్నాను. 245 00:20:23,190 --> 00:20:26,330 నాకా? లేదు, లేదు. ఖాళీ కడుపుతో మరీ ఎక్కువ తాగేశానంతే. 246 00:20:26,530 --> 00:20:27,810 నీ గాభరాకు కారణం అదేనా? 247 00:20:31,230 --> 00:20:33,550 మీ స్నేహితురాలి ఆచూకీ ఏమైనా దొరికిందా? 248 00:20:33,740 --> 00:20:36,720 మిలాని కథ సుఖాంతం కాదని అనుకుంటున్నాను. 249 00:20:36,910 --> 00:20:41,530 ఆమె నాకు తెెలిసినప్పటి నుండి, నమ్మలేనంత దురదృష్టం ఆమెను వెంటాడుతోంది. 250 00:20:41,990 --> 00:20:42,990 ఊహించుకోగలను. 251 00:20:43,780 --> 00:20:46,910 సీడబ్ల్యూ అనే అక్షరాలున్న ఎర్రటి మీట. మీరు ఇక ఆడవచ్చు. 252 00:20:47,450 --> 00:20:50,950 - ఈ అడ్డదారి తీసుకోవచ్చా? - అదే అత్యుత్తమ దారి. 253 00:21:19,270 --> 00:21:22,470 ముందస్తు అడ్వాన్సు లేదు. లాభంలో వాటా లేదు. 254 00:21:22,670 --> 00:21:24,760 మీకు మీరు జీతాన్ని కూడా చెల్లించుకోలేదు. 255 00:21:24,960 --> 00:21:26,560 - ఇందులో మీ లాభం ఏంటి? - ఊరుకో. 256 00:21:26,760 --> 00:21:29,830 నా గురించి మీరు దిగులుపడకండి, శాంగ్ గారు. 257 00:21:30,120 --> 00:21:31,700 నాకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 258 00:21:33,660 --> 00:21:35,080 దీంతో నేను ఏం నష్టపోతాను? 259 00:21:45,090 --> 00:21:49,330 - దీంతో మన వ్యాపారం ముగిసింది. - నాకు ఒక డాలరు కూడా ఖర్చవ్వలేదు. 260 00:21:49,530 --> 00:21:53,850 సర్, ఒక్క డాలరు కూడా వృధా చేయలేని పరిస్థితి మీది. 261 00:21:55,480 --> 00:21:58,420 మనం మళ్ళీ ఒకరినొకరం కలవబోమని అనుకుంటాను. 262 00:21:58,620 --> 00:21:59,760 మనం కలవబోము. 263 00:21:59,960 --> 00:22:04,280 కానీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం, నేను రెండు వారాల్లో తిరిగి వస్తాను. 264 00:22:05,650 --> 00:22:07,530 - రెండు వారాలా? - పని ఆరంభించడానికి. 265 00:22:08,240 --> 00:22:09,660 చేయాల్సిన పని ఎంతో ఉంది. 266 00:22:11,280 --> 00:22:13,900 - కానీ మీరు అన్నది... - ముందుగానే మొదలుపెట్టగలను. 267 00:22:14,100 --> 00:22:17,580 కానీ ఆ నిర్ణయాన్ని మీకై మీరే తీసుకోవాలి. 268 00:22:19,880 --> 00:22:25,160 ఒకప్పుడు నాకున్న క్లయింటు, ఒక్కో ముక్కు రంధ్రంలో ఒక్కో పదునైన పెన్సిల్ పెట్టుకుని, 269 00:22:25,360 --> 00:22:29,220 బల్లపైకి తన తలను ఎంతో వేగంగా కిందకు దించుకున్నాడు. 270 00:22:30,140 --> 00:22:32,970 చాలా సృజనాత్మకమైన చర్య. ఎంతో ధైర్యమైన చర్య. 271 00:22:35,930 --> 00:22:38,980 మీ పెన్సిళ్ళకు వేరే ఏ ఉపయోగం లేనట్టు ఉంది. 272 00:22:40,400 --> 00:22:42,320 నేను చనిపోవడం లేదు. 273 00:22:48,610 --> 00:22:51,820 నేను మొదటి నుండే ఆ విషయం స్పష్టం చేశానని అనుకుంటాను. 274 00:22:52,120 --> 00:22:55,060 నేను జోక్యం చేసుకోకపోతే, ఈ రోజు నుండి కొద్ది నెలలలో, 275 00:22:55,260 --> 00:22:58,770 కాంప్‌వేర్ కానీ, శాంగ్ గారు కానీ కొనసాగటానికి మిగలరు. 276 00:22:58,970 --> 00:23:01,420 ఇప్పుడే, లేదంటే ఎప్పటికీ కాదు అనే పరిస్థితి. 277 00:23:04,800 --> 00:23:06,510 మరో మార్గం కచ్చితంగా ఉండాలి. 278 00:23:07,470 --> 00:23:08,530 నేను ఏమైనా చేస్తాను. 279 00:23:08,730 --> 00:23:12,750 ఏంటిది, శాంగ్ గారు. ఇది ముగింపు కాదు. 280 00:23:12,950 --> 00:23:14,210 ఇది ప్రారంభం. 281 00:23:14,410 --> 00:23:18,020 కాంట్రాక్టుపై సంతకాలు చేశాం, మీ వారసత్వం సురక్షితం. 282 00:23:19,230 --> 00:23:21,440 ఇప్పుడు మిమ్మల్ని ఏదీ ఆపలేదు. 283 00:23:24,020 --> 00:23:28,570 బహుశా మీ తరపున నన్ను ఏర్పాట్లు చేయమంటారా? 284 00:23:30,320 --> 00:23:31,260 ఏర్పాట్లా? 285 00:23:31,460 --> 00:23:34,910 నా క్లయింట్లలో 93 శాతం మంది వివరాలను కోరుకోరు. 286 00:23:36,120 --> 00:23:38,540 మీకూ నేను ఏర్పాట్లు బుక్ చేయనా? 287 00:23:47,550 --> 00:23:52,240 ఈ సేవ కోసం నేను చిన్న మొత్తంలో అధికారిక రుసుము వసూలు చేస్తాను. 288 00:23:52,440 --> 00:23:55,050 ఇది నా సమయాన్ని కొంత వృధా చేస్తుంది. 289 00:23:57,600 --> 00:24:00,590 - ఎంత? - మీ ఖాతాలు దయనీయ పరిస్థితిలో ఉన్నాయి, 290 00:24:00,780 --> 00:24:03,300 మీ నుండి డబ్బు తీసుకోవాలంటే అపరాధ భావన కలుగుతోంది. 291 00:24:03,500 --> 00:24:08,280 కానీ, నాకు మరో విధంగా మీరు పరిహారం చెల్లించగలరా? 292 00:24:11,150 --> 00:24:13,070 - ఏసుక్రీస్తు దేహము. - ఆమెన్. 293 00:24:18,120 --> 00:24:19,450 ఏసుక్రీస్తు దేహము. 294 00:24:41,430 --> 00:24:44,590 - హేయ్. - హేయ్, వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోయావు. 295 00:24:44,790 --> 00:24:47,400 బిజీగా కనిపించావు. సా.6 గంటలకు తప్పించుకున్నా. 296 00:24:47,860 --> 00:24:49,050 ఇప్పటికే ఇల్లు చేరావా? 297 00:24:49,250 --> 00:24:52,860 భోజనానికి వచ్చాను. నా డేట్‌ను శుక్రవారం నుండి మార్చుకున్నాను. 298 00:24:53,490 --> 00:24:54,430 ఎలా జరుగుతోంది? 299 00:24:54,630 --> 00:24:58,350 నీకు అది సరిగ్గా అనిపించకపోతే, నువ్వు "అనాసపండు" అని చెప్పవచ్చు. 300 00:24:58,550 --> 00:25:02,080 బిల్ తీసుకురమ్మని చెప్పి, బాత్రూమ్‌కు వెళ్ళాడు. 301 00:25:02,960 --> 00:25:05,080 సిగ్మా మగాడు. నువ్వే కట్టాలనుకుంటాడు. 302 00:25:05,500 --> 00:25:06,820 వీళ్ళు చాలా మంచివాళ్ళు. 303 00:25:07,020 --> 00:25:07,940 నీకు ఏం కావాలి? 304 00:25:08,140 --> 00:25:11,610 అయితే, కోటిలో ఒకడైన ఫ్రాంక్ ఫ్లోరెజ్‌ను కనుగొన్నాననుకుంటా. 305 00:25:11,810 --> 00:25:14,370 - కనీసం అతని నెంబర్ కనుగొన్నా. - ఎలా? 306 00:25:14,570 --> 00:25:17,160 పాటాఫ్ ఫోన్‌లో వేగులా పనిచేసే సాఫ్ట్‌వేర్ పెట్టాను. 307 00:25:17,360 --> 00:25:18,500 అతనికి ఏమాత్రం తెలియదు. 308 00:25:18,700 --> 00:25:20,420 అతను డెమోను ప్రారంభించగానే, 309 00:25:20,610 --> 00:25:23,170 తన ఫోన్‌ నుండి పరిచయాల ఫైల్‌ దొంగిలించా, ఇక అంతే, 310 00:25:23,370 --> 00:25:27,090 ఫ్లోరెజ్ పేరు వచ్చింది. ఇటీవలి కార్యకలాపం లేదు, కానీ నెంబర్ దొరికింది. 311 00:25:27,290 --> 00:25:28,800 - అతనికి కాల్ చేశావా? - ఇంకా లేదు. 312 00:25:29,000 --> 00:25:31,930 చేయగలను. కానీ ఒక ఆడ గొంతు తక్కువగా బెదిరిస్తుంది. 313 00:25:32,130 --> 00:25:35,470 మనకు అతని గురించి ఏమీ తెలియదు, మనం అతన్ని భయపెట్టకూడదు. 314 00:25:35,670 --> 00:25:39,280 అతని వివరాలను పంపు, నేను అతనికి రేపు కాల్ చేస్తాను. 315 00:25:40,910 --> 00:25:44,690 - ధన్యవాదాలు. - హేయ్, మనం చేస్తున్నది సరైనదే, కదా? 316 00:25:44,890 --> 00:25:46,150 అతనికి తెలియకుండా చేయడం? 317 00:25:46,350 --> 00:25:48,190 మనం అతని వివరాలను నిర్ధారిస్తున్నాం, 318 00:25:48,390 --> 00:25:51,840 మంచివాడయితే, పాటాఫ్ కాంప్‌వేర్ అవసరాలకు తగిన మనిషే అవుతాడు. 319 00:25:52,800 --> 00:25:55,910 అతన్ని పనిలో పెట్టుకుని శాంగ్ చక్కటి వ్యాపారమే చేశాడేమో. 320 00:25:56,110 --> 00:25:58,010 అతను కనుక్కోలేడు, కదా? 321 00:25:59,890 --> 00:26:01,100 అనాస పండు. 322 00:26:02,640 --> 00:26:03,600 హాయ్. 323 00:27:51,920 --> 00:27:52,960 మెల్లగా. 324 00:29:16,670 --> 00:29:20,070 హేయ్! హేయ్! అతనికి కాల్ చేశావా? 325 00:29:20,270 --> 00:29:23,950 - నేనెవర్ని? నీ సహాయకురాలినైతే కాను. - నా సృజనాత్మక సలహాదారువి. 326 00:29:24,150 --> 00:29:27,290 పొమోనాలో ఫ్రాంక్‌కు నగల దుకాణం ఉంది, ఈ వివరాలే దొరికాయి. 327 00:29:27,490 --> 00:29:28,870 అతను పాటాఫ్‌కు ఎలా తెలుసు? 328 00:29:29,070 --> 00:29:33,420 నేను దాన్ని ఫోన్‌లో అడగాలనుకోలేదు. మనం అక్కడికి వెళ్ళి, అతన్ని కలవాలి. 329 00:29:33,620 --> 00:29:36,210 ఈ వారాంతంలో రాలేను. చర్చికి వస్తానని మాటిచ్చాను. 330 00:29:36,410 --> 00:29:39,720 - నేను ఈ పనిని ఒంటరిగా చేయను. - సరే. ఏదో ఒకటి ఆలోచిస్తాను. 331 00:29:39,920 --> 00:29:41,130 జీసస్ క్షమిస్తాడు, కదా? 332 00:29:41,330 --> 00:29:45,470 అతను నిన్న రాత్రి డెమో లింక్‌ను ఆఫీసులో అందరికీ పంపాడని విన్నావా? 333 00:29:45,670 --> 00:29:49,350 - మంచిది. దానికోసం శ్రమించావు. - ఆ వెర్షన్‌లో దొంగిలించే సాఫ్ట్‌వేర్ ఉంది. 334 00:29:49,550 --> 00:29:51,990 ఈ ఉదయం ప్రతీ ఒకరి పరికరానికి ప్రవేశానుమతి పొందా. 335 00:29:52,750 --> 00:29:53,860 అయితే దాన్ని తొలగించు. 336 00:29:54,050 --> 00:29:57,710 బతికించావు దేవుడా, నీకు సైబర్‌నేరాల సూక్ష్మ వివరాలు భలే తెలుసు. 337 00:30:27,280 --> 00:30:30,120 క్లిష్టపరిస్థితుల్లో శాంగ్ గారు మనకు నిర్దేశం చేస్తారు. 338 00:31:40,560 --> 00:31:42,510 ఉపశీర్షికలు అనువదించినది Pradeep Kumar Maheshwarla 339 00:31:42,700 --> 00:31:44,650 క్రియేటివ్ సూపర్వైజర్ రాజేశ్వరరావు వలవల