1 00:00:07,130 --> 00:00:09,660 శాంగ్‌కు తలబిరుసు, గర్వం, అపరిపక్వత ఉండవచ్చు, 2 00:00:09,860 --> 00:00:11,450 కానీ అతను చెడ్డవాడు కాదు. 3 00:00:11,650 --> 00:00:13,330 - మీకు సాయం చేయనా? - రీజెస్ పాటాఫ్. 4 00:00:13,530 --> 00:00:16,370 అన్ని వ్యాపార విషయాలలో నేను శాంగ్‌ గారితో సంప్రదించాలి. 5 00:00:16,570 --> 00:00:21,380 ఇక మీరు తెలుసుకుంటారు... ఇది శాంగ్ ఆకాంక్షలకు ప్రతిరూపం అని. 6 00:00:21,580 --> 00:00:22,420 మనకు యజమానులు ఎవరు? 7 00:00:22,620 --> 00:00:23,920 శాంగ్‌కు ఒకే ఒక బంధువు ఉంది. 8 00:00:24,120 --> 00:00:26,710 అతని తల్లి, బుసాన్‌లో జీవిస్తోంది, ఆమెకు ఇంగ్లీషు రాదు. 9 00:00:26,910 --> 00:00:28,050 నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? 10 00:00:28,250 --> 00:00:30,010 నేను శాంగ్‌కు సృజనాత్మక సలహాదారుని. 11 00:00:30,210 --> 00:00:34,200 - ''సృజనాత్మక సలహాదారు''? - నా హోదా నేనే పెంచుకున్నా. 12 00:00:35,610 --> 00:00:38,390 పూర్తి అధికారం బదిలీ అయ్యేలా రాయించుకున్నాడని అంటున్నావా? 13 00:00:38,590 --> 00:00:39,310 నేను ఇది నమ్మను. 14 00:00:39,510 --> 00:00:42,500 నీకు ఆ వాసన వస్తోందా? అతిగా మాగిన పళ్ళలా. 15 00:01:17,320 --> 00:01:18,560 హలో? 16 00:01:18,760 --> 00:01:21,410 ఎలేన్? నేను రీజెస్ పాటాఫ్‌ను. 17 00:01:22,450 --> 00:01:25,580 పాటాఫ్ గారు... అంతా బానే ఉందా? 18 00:01:26,580 --> 00:01:27,670 ఇప్పుడు... 19 00:01:28,880 --> 00:01:30,380 ఉదయం 3 గంటలు కావస్తోంది. 20 00:01:32,000 --> 00:01:34,370 మామూలు రోజులకన్నా నువ్వు ఆఫీసుకు... 21 00:01:34,570 --> 00:01:37,590 కాస్త ముందుగా రాగలవా అని అడగటానికి కాల్ చేశాను. 22 00:01:42,100 --> 00:01:45,640 తప్పకుండా. అత్యవసరమైన పని ఉంటే, నేను ఉ.8 గంటలకు రాగలను. 23 00:01:47,060 --> 00:01:48,400 అది నిరాశపరిచింది. 24 00:01:49,060 --> 00:01:51,770 నువ్వు వెనువెంటనే వస్తావని ఆశించాను. 25 00:02:14,210 --> 00:02:15,460 హలో? 26 00:02:15,670 --> 00:02:18,410 ఎలేన్? నేను రీజెస్ పాటాఫ్‌ను. 27 00:02:18,610 --> 00:02:20,580 అవును, పాటాఫ్‌ గారు, ఇందాకే మాట్లాడాం. 28 00:02:20,780 --> 00:02:23,080 మామూలు రోజులకన్నా నువ్వు ఆఫీసుకు... 29 00:02:23,280 --> 00:02:26,310 కాస్త ముందుగా రాగలవా అని అడగటానికి కాల్ చేశాను? 30 00:02:29,650 --> 00:02:31,400 నేను 40 నిమిషాల్లో రాగలను. 31 00:02:36,110 --> 00:02:37,820 మీ సెషన్ ముగిసింది 32 00:02:55,420 --> 00:02:58,010 ద కన్సల్టెంట్ - ఎస్1 33 00:03:16,150 --> 00:03:17,930 నా పేరు ఎలేన్ హేమన్. 34 00:03:18,130 --> 00:03:21,320 ఇప్పుడు మంగళవారం ఉదయం 3‌‌‌‌‌‌‌:23 కావస్తోంది, 35 00:03:21,820 --> 00:03:23,910 ఇది రికార్డ్ చేసే సమయానికి, 36 00:03:24,110 --> 00:03:27,870 ఎల్ఏ నడిబొడ్డున ఉన్న కాంప్‌వేర్ కార్యాలయాలకు కారులో వెళుతున్నాను. 37 00:03:29,960 --> 00:03:34,530 నాకు ఏమైనా జరిగితే, ఈ సందేశాన్ని నా క్లౌడ్ నుండి వెలికితీస్తే, 38 00:03:34,730 --> 00:03:38,170 ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నా. 39 00:03:40,880 --> 00:03:44,330 లాస్ ఏంజెలెస్‌లోని విజయవంతమైన మొబైల్ గేమ్ స్టూడియోల్లో పనిచేసే 40 00:03:44,530 --> 00:03:45,600 సృజనాత్మక సలహాదారుగా, 41 00:03:46,350 --> 00:03:48,560 శ్రమను, ఎక్కువ పని గంటలను ఆశిస్తాను. 42 00:03:50,350 --> 00:03:53,730 విజయం సాధించడానికి ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. 43 00:03:55,360 --> 00:03:57,800 కానీ ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, 44 00:03:58,000 --> 00:04:00,570 ఈ పదవికి ఎలా వచ్చాడో తెలియదు, 45 00:04:02,990 --> 00:04:05,490 ఇతనికి ఎలాంటి అధికారం ఉందో నాకు తెలియదు. 46 00:04:10,330 --> 00:04:11,410 లోపలికి రండి. 47 00:04:15,210 --> 00:04:16,630 ఎందుకు ఇంత సమయం పట్టింది? 48 00:04:18,340 --> 00:04:21,720 - నేను వాలీ నుండి కారులో వచ్చాను. - కాస్త దగ్గరగా ఉండలేవా? 49 00:04:23,300 --> 00:04:26,140 ఇద్దరు వర్థమాన నటులతో అపార్ట్‌మెంట్ పంచుకుంటున్నా. 50 00:04:27,050 --> 00:04:29,170 మేము అలాంటి దాన్నే భరించగలం. 51 00:04:29,360 --> 00:04:31,310 4866 మగ్నోలియా. 52 00:04:34,810 --> 00:04:35,960 నా చిరునామా మీకు తెలుసా? 53 00:04:36,160 --> 00:04:39,800 ఎలైజా మరియు డైసీలతో. 54 00:04:40,000 --> 00:04:41,650 ఇంకా నటులు కాని నటులతో. 55 00:04:42,490 --> 00:04:43,780 అదేంటి? 56 00:04:44,700 --> 00:04:45,680 అది నా గురించా? 57 00:04:45,880 --> 00:04:47,140 ఇది నీ ఉద్యోగ ఫైల్. 58 00:04:47,340 --> 00:04:49,120 ఇది రికార్డుల గదిలో చూశాను. 59 00:04:50,160 --> 00:04:52,580 - మనకు రికార్డుల గది ఉందా? - అవును మరి. 60 00:04:53,330 --> 00:04:56,290 నేను సంప్రదించిన ప్రతీ కంపెనీకి రికార్డుల గది ఉంది. 61 00:04:57,290 --> 00:05:00,210 నేను... నేను ప్రతీదీ సర్వర్‌పై ఉందని అనుకున్నాను. 62 00:05:00,920 --> 00:05:03,070 కాగితాలు వాడవద్దని శాంగ్ అనేవాడు. 63 00:05:03,270 --> 00:05:05,580 ఈ ఫైళ్ళ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. 64 00:05:05,780 --> 00:05:08,330 ఉదాహరణకు, కాంప్‌వేర్ ఉద్యోగుల సగటు వయసు 65 00:05:08,530 --> 00:05:12,020 27 ఏళ్ళని నీకు తెలుసా? నీ వయసు 27 ఏళ్ళు. 66 00:05:12,470 --> 00:05:15,840 సగటు విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ అని తెలుసా? 67 00:05:16,040 --> 00:05:17,630 నీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. 68 00:05:17,830 --> 00:05:20,730 సగటు జీతం 62,000 డాలర్లని తెలుసా? 69 00:05:21,900 --> 00:05:24,320 విషాధకరంగా, నీ జీతం ఇంతకంటే కాస్త తక్కువే. 70 00:05:26,200 --> 00:05:28,640 మీరు ఉ. 3 కి కాల్ చేసి, రాత్రి దుస్తులలో 71 00:05:28,840 --> 00:05:31,540 పిలిపించింది, నేను సగటు ఉద్యోగినని చెప్పడానికా? 72 00:05:37,670 --> 00:05:40,610 వివిధ రకాల చుర్రోస్. రెండు లవంగాలవి, 73 00:05:40,810 --> 00:05:44,340 రెండు మాచా-క్రంచ్‌వి, రెండు పిస్తా కలిపిన డార్క్ చాక్లెట్‌వి. 74 00:05:49,180 --> 00:05:51,010 - ఎలేన్? - ఏంటి? 75 00:05:51,890 --> 00:05:55,560 లవంగమా, మాచా-క్రంచా, లేక పిస్తా కలిసిన డార్క్ చాక్లెటా? 76 00:05:57,600 --> 00:05:59,380 నేను అల్పాహారం ఇష్టపడే వ్యక్తి కాను. 77 00:05:59,580 --> 00:06:03,030 ఉదయం 3 గంటలకు చుర్రోస్ కావాలంటే చాలా దూరం కారులో వెళ్ళాలి. 78 00:06:04,030 --> 00:06:05,690 అంతే సంగతులు, డానా. 79 00:06:11,530 --> 00:06:12,530 కూర్చో. 80 00:06:21,340 --> 00:06:23,090 ఇక్కడ ఎందుకున్నాను, పాటాఫ్ గారు? 81 00:06:25,510 --> 00:06:27,910 సోల్ విమానాశ్రయం నుండి గంటా 20 నిమిషాల క్రితం 82 00:06:28,110 --> 00:06:31,450 లాస్ ఏంజెలెస్ గమ్యస్థానానికి, ఒక ఫ్లయిట్ బయలుదేరింది. 83 00:06:31,650 --> 00:06:33,370 అందులో ఉన్న ప్రయాణీకురాలు 84 00:06:33,570 --> 00:06:35,930 శాంగ్ గారి ప్రయోజనాలకు చేటు చేసే వ్యక్తి. 85 00:06:36,600 --> 00:06:39,560 ఆమె తన ప్రయాణం పూర్తి చేయకూడదు. 86 00:06:42,860 --> 00:06:45,690 ఓ వాణిజ్య విమానాన్ని తిరిగి వెళ్ళిపోయేలా చేయమంటారా? 87 00:06:46,490 --> 00:06:47,260 దారిలో ఉండగా? 88 00:06:47,460 --> 00:06:49,720 నువ్వు సహజంగానే సమస్యలు పరిష్కరిస్తావు, ఎలేన్. 89 00:06:49,920 --> 00:06:52,120 - నీ ఫైల్‌లో అలా ఉంది. - అలా ఉందా? 90 00:06:54,330 --> 00:06:57,790 ఈ విమానంలో వస్తున్న వ్యక్తి ఎవరు? 91 00:07:03,420 --> 00:07:04,550 ఆన్ సీ-వూ. 92 00:07:06,260 --> 00:07:07,260 శాంగ్ అమ్మగారా? 93 00:07:08,220 --> 00:07:09,300 ఇక్కడికి వస్తోందా? 94 00:07:10,430 --> 00:07:15,390 శాంగ్ సృష్టించిన ప్రతీదాన్ని ఆమె ముక్కలు చేసి, నాశనం చేయాలనుకుంటోంది. 95 00:07:17,600 --> 00:07:19,060 అతని కలను. 96 00:07:20,770 --> 00:07:21,850 అతని గమ్యాన్ని. 97 00:07:25,070 --> 00:07:26,630 దేనితో శృంగారం చేశాడు? 98 00:07:26,830 --> 00:07:27,690 అతని ముఖంతో. 99 00:07:28,280 --> 00:07:29,400 అతని నోటితో. 100 00:07:30,070 --> 00:07:33,060 గొంతుతో చేశాడు, సరేనా... అంటే, అంత బాగలేదు. 101 00:07:33,260 --> 00:07:35,640 బుజ్జీ, ఇది అధికారులకు తెలియజేయాలి. 102 00:07:35,840 --> 00:07:37,650 లేదు, లేదు. మేము తెలుపబోతున్నాం. 103 00:07:37,840 --> 00:07:39,870 "మేము"? దీన్ని ఇంకా ఎవరు చూశారు? 104 00:07:40,870 --> 00:07:42,330 నేను, ఎలేన్ అంతే. 105 00:07:44,210 --> 00:07:46,000 మీరు మళ్ళీ సమయం గడుపుతున్నారా? 106 00:07:46,710 --> 00:07:50,050 లేదు, మేము గడపటం లేదు. ఇద్దరం ఒకే మునిగే పడవలో ఉన్నాం. 107 00:07:53,140 --> 00:07:54,140 అవును. 108 00:08:00,600 --> 00:08:04,150 నేను పని తర్వాత వస్తాను, నాకు షాపింగ్‌లో సాయం చేయి. 109 00:08:04,730 --> 00:08:05,730 మంచి సమయం ముందుంది. 110 00:08:06,650 --> 00:08:08,360 - నువ్వంటే ఇష్టం. - సరదాగా గడుపు. 111 00:08:09,900 --> 00:08:12,470 అలాగే, బంగారం, ఆ చెడ్డ మనిషి 112 00:08:12,670 --> 00:08:15,820 నీ నోట్లో ఏదైనా పెట్టాలని చూస్తే, వచ్చి అమ్మకు చెప్పు. 113 00:08:16,580 --> 00:08:17,580 సరే. 114 00:08:31,380 --> 00:08:32,280 ఏం జరిగింది? 115 00:08:32,480 --> 00:08:35,120 అతను అభివృద్ధి పలకను మొత్తం చెరిపేశాడు. 116 00:08:35,320 --> 00:08:37,600 - ఎప్పటి నుండి? - ఉదయం 5:30 నుండి. 117 00:08:49,730 --> 00:08:50,820 నువ్వు... 118 00:08:51,400 --> 00:08:54,050 మనం పని చేస్తున్న ప్రతీదాన్ని అతను నాశనం చేయకూడదు. 119 00:08:54,250 --> 00:08:55,970 కెర్‌ఫఫుల్ కూడా పోయింది. 120 00:08:56,170 --> 00:08:58,430 తొంభై ఐదు మంది ఏం పని చేయాలా అని చూస్తున్నారు. 121 00:08:58,630 --> 00:08:59,790 కెర్‌ఫఫుల్! 122 00:09:02,290 --> 00:09:03,620 కుదరదు. వాడు అయిపోయాడు. 123 00:09:04,710 --> 00:09:05,920 అయిపోయాడంతే. 124 00:09:12,880 --> 00:09:14,090 ఎక్కడికి వెళుతున్నావు? 125 00:09:14,720 --> 00:09:17,870 పది వారాలుగా మలవిసర్జన చేస్తున్న పిల్లులను చిత్రీకరించాను. 126 00:09:18,070 --> 00:09:21,060 ఎందుకు? శాంగ్ ఆ పని కోసం నెలకు 5,800 డాలర్లు చెల్లించాడు. 127 00:09:21,680 --> 00:09:22,960 దాంతో నేను సర్దుకుపోయాను. 128 00:09:23,160 --> 00:09:27,090 ఇప్పుడు ఈ వెధవ ఉన్నట్టుండి వచ్చి, అదంతా చెరిపేయవచ్చని అనుకుంటున్నాడు. 129 00:09:27,290 --> 00:09:28,960 క్రెగ్, ఈరోజు సెలవు తీసుకో. 130 00:09:29,160 --> 00:09:33,090 - తర్వాత బాధపడటం కన్నా ఇప్పుడు ఆలోచించు. - నేను సవాళ్ళను ఎదుర్కొంటాను. 131 00:09:33,290 --> 00:09:36,320 - సరే. అతను వింత మనోస్థితిలో ఉన్నాడు. - వాడే ఒక వింత మనోస్థితి. 132 00:09:36,780 --> 00:09:38,200 - పక్కకు జరుగు. - హేయ్. 133 00:09:39,120 --> 00:09:41,140 శాంగ్ తల్లి సోల్ నుండి వస్తోంది. 134 00:09:41,340 --> 00:09:43,190 - ఏంటి? - ఆమె ఎప్పుడైనా ఫ్లయిట్ దిగవచ్చు. 135 00:09:43,390 --> 00:09:45,000 నాకు అది ఎందుకు చెప్పలేదు? 136 00:09:46,040 --> 00:09:48,330 ఓరి దేవుడా! దాదాపు రాజీనామా చేసేశాను. 137 00:09:49,750 --> 00:09:51,570 ఆమె ఉద్దేశ్యాలేంటో నాకు తెలియదు. 138 00:09:51,770 --> 00:09:54,210 ఆగు. ఆమె తన న్యాయవాదులతో వస్తుందంటావా? 139 00:09:59,510 --> 00:10:01,370 - మరి? - వ్యూహం మారింది. 140 00:10:01,570 --> 00:10:02,720 బాబులు, దగ్గరగా రండి. 141 00:10:03,890 --> 00:10:06,380 ఇదే నాటకం. మనం మన తలలు వంచుకుని, 142 00:10:06,580 --> 00:10:08,380 ఏదో పనిలో ఉన్నట్టు కనపడదాం, ఎందుకంటే, 143 00:10:08,580 --> 00:10:10,560 కొత్త యజమాని ఎక్కువ రోజులు ఉండబోవటం లేదు. 144 00:10:36,880 --> 00:10:39,630 ఏమండి... నాకు సాయం చేస్తారా? 145 00:10:41,140 --> 00:10:43,140 క్షమించండి. ఈ భాష నేను మాట్లాడను. 146 00:10:44,470 --> 00:10:47,840 మీ భాషను మీరు ఎంచుకోవాలి అలాగే... 147 00:10:48,030 --> 00:10:49,170 ఒక్క నిమిషం ఆగండి. 148 00:10:49,370 --> 00:10:52,020 మొదట ఇది కొన్ని వాణిజ్య ప్రకటనలని చూపిస్తుంది. 149 00:10:53,570 --> 00:10:55,570 శాంగ్ వూ... నేను అతని తల్లిని... 150 00:10:57,280 --> 00:11:00,310 - ఆన్ గారు? - శాంగ్. శాంగ్ వూ. 151 00:11:00,510 --> 00:11:02,390 అవును. మీరు సరైన చోటికే వచ్చారు. 152 00:11:02,590 --> 00:11:05,140 నా పేరు ఎలేన్ హేమన్. నేను మీ అబ్బాయితో పని చేశాను. 153 00:11:05,340 --> 00:11:06,290 రండి, కూర్చోండి. 154 00:11:07,290 --> 00:11:09,290 రోసీ, మాకు నీళ్ళు తీసుకొస్తావా? 155 00:11:10,460 --> 00:11:11,670 మీ బ్యాగ్ తీసుకుంటా. 156 00:11:18,340 --> 00:11:20,760 సహచరులారా, దయచేసి మీకొక విజ్ఞప్తి. 157 00:11:30,640 --> 00:11:33,730 ఈరోజున మనకొక ప్రత్యేకమైన సందర్శకురాలు వచ్చారు. 158 00:11:34,230 --> 00:11:35,400 మామా శాంగ్. 159 00:11:36,230 --> 00:11:41,660 ఆమె అందమైన అబ్బాయి ఇదే మట్టిపై ఎంతో హింసాత్మకంగా, దారుణంగా చంపబడ్డాడు. 160 00:11:42,700 --> 00:11:45,990 శాంగ్‌కు వినమ్రులైన సేవకులు అందరి తరపున... 161 00:11:47,240 --> 00:11:51,290 మమ్మల్ని మీ బాధను తీసేయనివ్వండి. 162 00:12:21,650 --> 00:12:22,650 మాట్లాడండి. 163 00:12:23,570 --> 00:12:24,780 మనసు విప్పి మాట్లాడండి. 164 00:12:31,500 --> 00:12:33,500 మా అబ్బాయి... 165 00:12:35,500 --> 00:12:37,210 చాలా మంచి అబ్బాయి. 166 00:12:37,630 --> 00:12:39,300 శాంగ్ మంచి అబ్బాయి. 167 00:12:41,420 --> 00:12:44,760 వాడి హృదయంలో ప్రేమ ఉండేది. 168 00:12:45,680 --> 00:12:46,850 మనందరిని ప్రేమించాడు. 169 00:12:48,310 --> 00:12:49,640 కానీ... 170 00:12:50,470 --> 00:12:53,140 వాడిని దుష్టత్వం బలి తీసుకుంది. 171 00:12:56,400 --> 00:12:59,570 అతని జ్ఞాపకార్థం, మనం కష్టపడి పని చేయాలి. 172 00:13:40,400 --> 00:13:44,610 డానా, ఈ రాత్రి మామా శాంగ్ బసకు ఏర్పాటు చేశామా? 173 00:13:45,110 --> 00:13:47,410 ఆమె తన సూట్‌కేస్‌తో పాటు వచ్చింది. 174 00:13:47,740 --> 00:13:49,490 నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. 175 00:13:50,160 --> 00:13:52,020 ఆమెకు పెన్రిత్‌లో స్వీట్ బుక్ చేయి. 176 00:13:52,220 --> 00:13:55,480 తనని సందర్శించే విఐపీలందరికీ శాంగ్ అక్కడే ఏర్పాటు చేసేవాడు. 177 00:13:55,680 --> 00:13:57,940 అతని తల్లికి అలాగే చేసి ఉండేవాడు. 178 00:13:58,140 --> 00:13:59,530 సరే, నాకు గందరగోళంగా ఉంది. 179 00:13:59,730 --> 00:14:01,900 నేను అతని సహాయకురాలినా, లేదా ఇంకా నువ్వేనా? 180 00:14:02,100 --> 00:14:04,380 నువ్వే సహాయకురాలు. నేను సృజనాత్మక సలహాదారు. 181 00:14:05,970 --> 00:14:07,970 మళ్ళీ గుర్తు చేయి. అదేంటి? 182 00:14:09,720 --> 00:14:13,170 ఆ గాజు పగలగొట్టడానికి ఎంత ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది? 183 00:14:13,360 --> 00:14:15,040 - అప్‌స్కర్ట్ గ్యాలరీ? - అవును. 184 00:14:15,240 --> 00:14:17,540 దానిపై ఏనుగుని నిలబెట్టవచ్చు. 185 00:14:17,740 --> 00:14:20,760 ఏనుగా, కుదరదు. బహుశా రెండు ఖడ్గమృగాలను పెట్టచ్చేమో. 186 00:14:20,960 --> 00:14:24,860 - రెండు ఖడ్గమృగాల బరువు ఏనుగు కంటే ఎక్కువ. - అది సరైనది అనుకోను. 187 00:14:26,280 --> 00:14:27,890 హేయ్, భోజనానికి వస్తావా? 188 00:14:28,090 --> 00:14:30,430 లేదు, బిజీగా ఉన్నట్టు నటించడంలో బిజీగా ఉన్నాం. 189 00:14:30,630 --> 00:14:31,600 నీకేం తెలుసు? 190 00:14:31,800 --> 00:14:35,480 ఏనుగుల బరువు 5,900 కేజీలు, ఖడ్గమృగాల బరువు గరిష్టంగా 3,200 కేజీలు. 191 00:14:35,680 --> 00:14:38,440 ఆ గాజు ఎంత బలమైనది అంటే, ఏనుగు మనపై నాట్యమాడవచ్చు. 192 00:14:38,640 --> 00:14:40,880 - దానిపై పందెం కాస్తావా? - కాయను. 193 00:14:41,840 --> 00:14:44,750 మేము వెళ్ళి... మేము వెళ్ళి భోజనం చేస్తాం. 194 00:14:46,380 --> 00:14:48,170 అశ్వదళం ఎప్పుడు వస్తోంది? 195 00:14:48,630 --> 00:14:50,910 ఆమె ఇంకా ఎవరిని పనిలో పెట్టుకోలేదేమో. 196 00:14:51,110 --> 00:14:53,620 రెండు వారాలే అయ్యింది. ఆమె ఇంకా శోకంలోనే ఉంది. 197 00:14:53,820 --> 00:14:56,500 అవును, వాడికి కొరియన్ భాష తెలుసు. ఎందుకు తెలియదు? 198 00:14:56,700 --> 00:14:59,210 ఆమెకు ఏదేదో చెప్పి ఆమె చేత సంతకం చేయిస్తే? 199 00:14:59,410 --> 00:15:02,880 - అన్ని జవాబులు నాకెలా తెలుస్తాయి? - ఇది కొన్ని నెలలు పట్టవచ్చు. 200 00:15:03,080 --> 00:15:05,340 - అలా అయితే, మనం వేచి చూద్దాం. - వద్దు! 201 00:15:05,540 --> 00:15:06,930 శాంగ్‌కు ఏం చేశాడో తెలుసుగా. 202 00:15:07,130 --> 00:15:09,740 అలాంటి వెధవ కింద మనం పని చేయలేం, చేయగలమా? 203 00:15:12,240 --> 00:15:13,910 మనలో కొంతమంది చేయగలరు. 204 00:15:14,280 --> 00:15:16,910 ఈ ఉద్యోగ పదవి నాకు ఆరు నెలలు ఉంటే చాలు. 205 00:15:17,660 --> 00:15:20,820 శాంగ్ నాకు వ్యక్తిగత రెఫరెన్స్ రాయలేడు, కానీ పాటాఫ్ రాయగలడు. 206 00:15:21,020 --> 00:15:24,530 రాత్రి దుస్తులతో, జట్టుకు వేసే రింగుతో యజమానిని ఆకట్టుకోగలవా? 207 00:15:24,730 --> 00:15:28,740 నాకు ఉదయం 3 గంటలకు ఫోన్ చేశాడు, 747 విమానాన్ని మార్గమధ్యంలో ఆపడానికి. 208 00:15:28,940 --> 00:15:29,990 వీడు చాలా తిక్కోడు. 209 00:15:30,190 --> 00:15:32,470 - మనం సరైన పని చేయాలి. - ఒప్పుకుంటాను. 210 00:15:33,970 --> 00:15:35,810 నేను చాలా అలసిపోయాను. నాకు తెలియదు... 211 00:15:36,430 --> 00:15:37,640 సరైన పని ఏంటి? 212 00:15:39,600 --> 00:15:42,670 - మామా శాంగ్‌కు ఆ వీడియో ఇస్తాం. - ఆమె చూడాల్సిన పని లేదు. 213 00:15:42,870 --> 00:15:46,800 ఆమె చూడాల్సిన అవసరం లేదు, కానీ అది తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. 214 00:15:47,000 --> 00:15:48,740 ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? 215 00:15:54,070 --> 00:15:55,830 మీరు వెళుతున్నారా, పాటాఫ్ గారు? 216 00:15:56,700 --> 00:16:00,860 డానా ఎంతో సహృదయంతో మామా శాంగ్‌కు పెన్రిత్‌లో గది బుక్ చేసింది. 217 00:16:01,060 --> 00:16:02,670 ఆమెను అక్కడికి తీసుకెళుతున్నా. 218 00:16:03,710 --> 00:16:06,110 పాటాఫ్ గారు. డానా ఇది మీకు ఇవ్వమన్నారు. 219 00:16:06,310 --> 00:16:07,860 ఇది హోటల్ చిరునామా. 220 00:16:08,060 --> 00:16:09,880 నన్ను కారు ఏర్పాటు చేయమంటారా? 221 00:16:10,510 --> 00:16:14,290 తన తల్లిని నేను వ్యక్తిగతంగా చూసుకోవాలని శాంగ్ కోరుకునేవాడు. 222 00:16:14,490 --> 00:16:17,930 ఆమె సురక్షితంగా హోటల్లో చెకిన్ అయ్యేలా చూసుకుంటాను. 223 00:16:18,220 --> 00:16:20,890 ఇలా రండి, అమ్మగారు. 224 00:16:23,190 --> 00:16:24,400 ఆమె సూట్‌కేసు. 225 00:16:27,770 --> 00:16:30,530 నువ్వు లేకపోతే మేము ఏం చేస్తాం, ఎలేన్? 226 00:16:37,410 --> 00:16:40,980 ఒకడు అమ్మ, కొడుకు, ఇద్దరితోనూ పడుకుంటే వాడిని ఏమంటారు? 227 00:16:41,180 --> 00:16:42,960 అందుకు ఏదో పేరు ఉండే ఉంటుంది. 228 00:17:04,940 --> 00:17:10,180 హేయ్, ఇయన్, నేను నా ఉద్యోగ ఫైల్‌ చూడాలనుకుంటే, ఎవరిని అడగాలి? 229 00:17:10,370 --> 00:17:12,890 విన్నపాన్ని రాసి ఇవ్వు, ఈమెయిల్‌లో పంపుతారు. 230 00:17:13,090 --> 00:17:15,180 కాదు, అంటే కాగితపు నకలు. 231 00:17:15,380 --> 00:17:18,490 - రికార్డుల గదిలో ఏముందో చూాడాలనుకుంటున్నా. - ఏంటి? 232 00:17:18,870 --> 00:17:20,080 రికార్డుల గది. 233 00:17:21,660 --> 00:17:23,830 నీకు రికార్డుల గది గురించి తెలియదా? 234 00:17:24,290 --> 00:17:26,080 మనకు స్టోర్‌రూమ్ ఉందనుకుంటా. 235 00:17:26,830 --> 00:17:27,830 ఎక్కడుంది? 236 00:18:27,350 --> 00:18:28,730 - ఏం చేస్తున్నావు? - ఛత్. 237 00:18:29,850 --> 00:18:32,470 వద్దు! వద్దు, వద్దు, వద్దు. 238 00:18:32,670 --> 00:18:34,800 నువ్వు ఇది మామా శాంగ్‌కు ఇవ్వకపోతే, 239 00:18:35,000 --> 00:18:37,990 నేనిస్తా, ఎందుకంటే వాడుంటే నేను రేపు ఇక్కడికి రాను. 240 00:18:43,030 --> 00:18:45,120 సరే. నేను ఇస్తాను. 241 00:18:46,450 --> 00:18:47,660 ఒట్టు? 242 00:19:13,270 --> 00:19:14,360 ధన్యవాదాలు. 243 00:19:18,990 --> 00:19:20,360 - హాయ్. - హాయ్. చెకిన్ కోసమా? 244 00:19:20,950 --> 00:19:22,520 ఒక అతిథి కోసం వచ్చాను. 245 00:19:22,720 --> 00:19:24,450 కాంప్‌వేర్ పేరు మీద బుక్ అయ్యింది. 246 00:19:27,040 --> 00:19:28,440 గదిని బుక్ చేశారు, 247 00:19:28,640 --> 00:19:31,110 కానీ ఆ బుకింగ్ కింద ఇంకా ఎవరూ చెకిన్ చేయలేదు. 248 00:19:31,310 --> 00:19:32,250 ఆమె ఇక్కడకు లేదా? 249 00:19:55,690 --> 00:19:56,470 హే. 250 00:19:56,670 --> 00:19:59,340 నేను హోటల్ దగ్గరున్నా, కానీ ఎవరూ చెకిన్ చేయలేదు. 251 00:19:59,540 --> 00:20:00,900 ఏంటి? ఆమెతోనే వెళ్ళాడు కదా? 252 00:20:01,910 --> 00:20:03,310 భోజనానికి తీసుకెళ్ళాడేమో. 253 00:20:03,510 --> 00:20:06,990 బహుశా ముక్కలుగా కోయబడి, అతని కారు డిక్కీలో ఉందేమో. 254 00:20:11,330 --> 00:20:13,860 - ఛత్, ఇక్కడికి వచ్చాడు. - మీ ఇంటికా? 255 00:20:14,060 --> 00:20:16,070 కాదు, ఆఫీసుకి. ఇప్పుడే వచ్చాడు. 256 00:20:16,270 --> 00:20:18,170 - ఒంటరిగా ఉన్నాడా? - తెలియదు. 257 00:20:19,630 --> 00:20:20,570 ఆ, ఒంటరిగా ఉన్నాడు. 258 00:20:20,770 --> 00:20:21,870 ఆమె ఎక్కడుందో అడుగు. 259 00:20:22,070 --> 00:20:23,470 నువ్వే అడుగు. 260 00:20:25,760 --> 00:20:27,140 సరే, నేనే అడుగుతాను. 261 00:20:27,340 --> 00:20:28,390 సరే, ఉంటాను. 262 00:20:41,360 --> 00:20:44,180 మరీ పొద్దు పోయాక కాల్ చేస్తున్నావు, ఎలేన్. 263 00:20:44,380 --> 00:20:48,640 నాకు తెలుసు, క్షమించండి. అది... సిబ్బంది కొంత సేకరించారు, 264 00:20:48,840 --> 00:20:51,900 మామా శాంగ్‌కు పువ్వులు పంపితే బాగుంటుందని అనుకున్నారు, 265 00:20:52,100 --> 00:20:54,080 లేదా కొన్ని పళ్ళను. 266 00:20:54,540 --> 00:20:56,320 మా అందరికీ శాంగ్ అంటే ఎంతో ఇష్టం. 267 00:20:56,520 --> 00:20:58,380 అది సరైనది అనుకుంటే చేయండి. 268 00:20:59,050 --> 00:21:03,510 నేను వాటిని ఎన్నో గదికి లేదా స్వీట్‌కు పంపాలి, పాటాఫ్ గారు? 269 00:21:04,590 --> 00:21:07,540 మీరు ఆమెను పెన్రిత్ హోటల్లోకి చెకిన్ చేయించారు కదా? 270 00:21:07,740 --> 00:21:10,040 లేదు. శాంగ్ తల్లి వేరే ఏర్పాట్లు చేసుకుంది. 271 00:21:10,240 --> 00:21:12,100 మనం హోటల్‌ను రద్దు చేయవచ్చు. 272 00:21:14,350 --> 00:21:15,690 ఆమె ఎక్కడ బస చేస్తోంది? 273 00:21:17,150 --> 00:21:18,690 ఆమె నాకు చెప్పలేదు. 274 00:21:19,980 --> 00:21:21,930 కానీ మీరు ఆమెను ఎక్కడో దింపారు కదా, 275 00:21:22,130 --> 00:21:23,550 ఆమె సూట్‌కేసుతో పాటు? 276 00:21:23,750 --> 00:21:25,820 మేము ఎక్కడికి వెళ్ళాం? 277 00:21:26,570 --> 00:21:29,080 అవును, ప్రయత్నించి గుర్తు తెచ్చుకోండి. 278 00:21:30,580 --> 00:21:33,690 హంసల్లా కనిపించే, కాలి తెడ్లతో నడిచే పడవలను చూడటం, 279 00:21:33,890 --> 00:21:37,080 అవి తమాషాగానే ఉన్నాయని అనుకోవటం నాకు గుర్తుంది. 280 00:21:40,420 --> 00:21:44,320 డానా, నువ్వు మెక్‌ఆర్థర్ పార్క్ ప్రాంతంలో అన్ని హోటల్స్‌కు కాల్ చేసి 281 00:21:44,520 --> 00:21:47,290 ఆన్ సీ-వూ అనే ఆమెను చెకిన్ చేశారా అని కనుక్కోవాలి. 282 00:21:47,490 --> 00:21:49,100 స్నానం చేస్తున్నా, ఎలేన్. 283 00:21:49,300 --> 00:21:51,140 సరే, కానీ ఫోను చేతిలోనే ఉంది కదా. 284 00:22:05,490 --> 00:22:08,070 ట్రాఫిక్. 30 నిమిషాలు. సారీ. ప్యాటి. 285 00:22:28,010 --> 00:22:29,160 ఏమండి. 286 00:22:29,360 --> 00:22:33,000 వంగపూల రంగులో పెద్ద సూట్‌కేస్‌తో 50ల్లో ఉన్న ఓ కొరియన్ మహిళని చూశారా? 287 00:22:33,200 --> 00:22:34,430 క్షమించాలి, చూడలేదు. 288 00:22:39,020 --> 00:22:40,150 ఏమండి. 289 00:22:40,810 --> 00:22:44,980 నడివయసు, వంగపూల రంగు సూట్‌కేసుతో ఉన్న కొరియన్ మహిళ కోసం చూస్తున్నా. 290 00:22:45,360 --> 00:22:46,360 చూడలేదు. 291 00:22:58,460 --> 00:23:01,040 - క్రెగ్. - పాటాఫ్ గారు. 292 00:23:01,750 --> 00:23:03,900 ఇంకా పని చేస్తున్నావు. ఇది ప్రశంసనీయం. 293 00:23:04,100 --> 00:23:06,130 ఇంటికి వెళ్లడానికి వేచి చూస్తున్నా. 294 00:23:07,630 --> 00:23:08,760 ఏంటది? 295 00:23:09,720 --> 00:23:11,580 ఇది ఇంకా పూర్తి కాలేదు. 296 00:23:11,780 --> 00:23:13,350 మరి, నాకు వివరించు. 297 00:23:14,760 --> 00:23:18,960 సరే. ఇది గాజుకి చెందిన తనన శక్తికి సంబంధించినది. 298 00:23:19,160 --> 00:23:20,710 ఈ నీలపు రేఖ కనపడుతోంది కదా? 299 00:23:20,910 --> 00:23:23,510 గాజు మోసే బరువుని లెక్కించే యుఆర్‌ఎల్‌కు సంధానించా. 300 00:23:23,710 --> 00:23:26,980 గాజు ఎంత మందంగా ఉంటే, మనం అంత బరువు మోపవచ్చు. కాబట్టి... 301 00:23:28,030 --> 00:23:30,320 ఒక ఏనుగు, అది ఫర్వాలేదు. 302 00:23:30,780 --> 00:23:34,410 ఆపై ఏనుగు, ఖడ్గమృగం, అది కూడా ఫర్వాలేదు. 303 00:23:35,870 --> 00:23:37,700 ఏనుగు, ఖడ్గమృగం, కోతి. 304 00:23:40,460 --> 00:23:41,460 కోతి చెడ్డది. 305 00:23:43,210 --> 00:23:44,690 అవి ఎక్కడికి పోయాయి? 306 00:23:44,890 --> 00:23:47,860 - అవన్నీ కిందకు పడ్డాయి. - కింద ఏముంది? 307 00:23:48,060 --> 00:23:51,630 ఏమైనా ఉండవచ్చు. లోహపు ముళ్ళు ఉండవచ్చు, 308 00:23:52,050 --> 00:23:56,890 లేక ట్రాంపొలీన్లు ఉండవచ్చు లేదా... ఏవైనా. 309 00:23:57,810 --> 00:24:00,560 అక్కడ ఏం ఉండాలని అనుకుంటున్నావు, క్రెగ్? 310 00:24:02,440 --> 00:24:05,900 ఏం కనుక్కోవాలని అనుకుంటున్నావు, నువ్వు పడిపోవడం ఆగినప్పుడు? 311 00:24:08,280 --> 00:24:10,280 ఇది ఆడాలని ఉంది. ఎప్పుడు సిద్ధమవుతుంది? 312 00:24:12,240 --> 00:24:15,450 బహుశా మనం మొదట ఎలేన్‌తో మాట్లాడాలేమో? 313 00:24:16,160 --> 00:24:17,080 ఎలేన్? 314 00:24:19,000 --> 00:24:20,400 ఆమె మీ సృజనాత్మక సలహాదారు. 315 00:24:20,600 --> 00:24:23,650 ఆమె ఇలాంటి పనులు చేస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేకుండా. 316 00:24:23,850 --> 00:24:24,940 అవుననుకో. ఎలేన్. 317 00:24:25,140 --> 00:24:27,450 మనలో మాట, అసలు తను ఇక్కడ చేసే పనేంటా అని 318 00:24:27,650 --> 00:24:29,320 నేను ఆశ్చర్యపోతున్నాను. 319 00:24:29,520 --> 00:24:30,460 చక్కటి పని. 320 00:24:31,630 --> 00:24:32,880 థాంక్స్, యజమాని గారు. 321 00:25:13,470 --> 00:25:15,870 - అతను దాన్ని చేయమన్నాడు. - ఏంటి? 322 00:25:16,070 --> 00:25:18,870 రెండేళ్ళలో, నేను ఇచ్చిన ఒక్క ఆలోచనని శాంగ్ తీసుకోలేదు, 323 00:25:19,070 --> 00:25:21,460 ఇక పాటాఫ్ వచ్చాడు, వచ్చిన రెండు రోజుల్లోనే... 324 00:25:21,660 --> 00:25:22,850 తను మామా శాంగ్‌ని చంపాడు. 325 00:25:24,230 --> 00:25:26,340 - ఆగు, ఏంటి? - తను ఎక్కడుందో నాకు తెలియదు. 326 00:25:26,540 --> 00:25:28,060 డానాకు తన జాడ తెలియలేదు. నేను, 327 00:25:28,860 --> 00:25:30,050 పోలీసులకు కాల్ చేయనా? 328 00:25:30,250 --> 00:25:33,760 వద్దు. ఏమని? ఏమని చెప్తావు? పర్యాటకురాలు కనపడం లేదనా. 329 00:25:33,960 --> 00:25:37,780 ఏంటిది. బహుశా ఆమె శోకం నుండి తేరుకోవడానికి కొంత సమయం కావాలేమో. 330 00:25:41,990 --> 00:25:44,360 - శుభరాత్రి, క్రెగ్. - ఆగు, ఆగు, ఆగు. 331 00:25:44,560 --> 00:25:46,960 ఏంటి? నాపై కోప్పడుతున్నావా? 332 00:25:47,750 --> 00:25:49,940 నీపై కోప్పడటానికి కూడా అలసటగా ఉంది. 333 00:25:50,140 --> 00:25:52,570 నొస్తోంది. మూడు గంటలే నిద్రపోయాను. 334 00:25:52,770 --> 00:25:55,160 నేను కేవలం టీ, చుర్రోస్ మాత్రమే తిన్నా. 335 00:25:55,360 --> 00:25:58,950 స్పష్టంగా ఆలోచించలేకపోతున్నా, ఇప్పుడు వాలీకి 40 నిమిషాలు బండి నడపాలి. 336 00:25:59,150 --> 00:26:02,770 101 రహదారిని మూసేశారని విన్నావా? నా జీవితం తగలడా! 337 00:26:04,350 --> 00:26:06,500 కాన్యన్ పర్వతంపై పాకుకుంటూ పోతున్నాయి. 338 00:26:06,700 --> 00:26:08,770 నా బండి వస్తోంది. బానే ఉన్నావా? 339 00:26:09,860 --> 00:26:11,010 ఎప్పుడూ బానే ఉంటాను. 340 00:26:11,210 --> 00:26:14,640 సరే. కాస్తంత నిద్రపో, ఎందుకంటే రేపు మనం పని చేయాలి. 341 00:26:14,840 --> 00:26:16,450 - సరే. - ఉంటాను. 342 00:27:00,700 --> 00:27:03,330 సుస్వాగతం మామా శాంగ్ 343 00:27:57,800 --> 00:28:00,670 రికార్డులు 344 00:29:20,340 --> 00:29:22,280 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 345 00:29:22,480 --> 00:29:24,430 క్రియేటివ్ సూపర్‌వైజర్ వలవల రాజేశ్వరరావు