1 00:00:20,437 --> 00:00:24,566 పార్క్ మాడిసన్ హోటల్ న్యూ యార్క్ సిటీ 2 00:00:25,526 --> 00:00:30,447 ఉదయం 2:06 గంటలకు 3 00:00:36,912 --> 00:00:39,748 కేట్? ఇక్కడ ఉన్నావా! 4 00:00:41,792 --> 00:00:43,460 నువ్వు ఈ పాటికి పడుకొని ఉండాలి కదా. 5 00:00:45,045 --> 00:00:49,466 ప్రతీ క్లయింట్ విషయంలో జరిగింది, మార్టిన్. వాళ్ళు ప్రతీ క్లయింట్ ని హ్యాక్ చేశారు. 6 00:00:49,550 --> 00:00:51,718 మనం ఆ క్లయింట్స్ అందరికీ సంజాయిషీ ఇచ్చాము కదా. 7 00:00:51,802 --> 00:00:53,679 మనకు ఇలా చేస్తున్న వెధవలు ఎవరు? 8 00:00:54,388 --> 00:00:55,389 మనం కచ్చితంగా బయట పడతాం. 9 00:00:56,431 --> 00:00:57,432 నిజంగానా? 10 00:00:59,268 --> 00:01:00,477 ఆలైస్ ఫోన్ చేసింది. 11 00:01:00,561 --> 00:01:02,938 ఇతరులపై నడిచే చెడ్డ వార్తలను బయట పడకుండా చూసే మనమే 12 00:01:03,021 --> 00:01:05,107 గత కొన్ని రోజులుగా వార్తల్లోకి ఎక్కుతున్నాం అని అంది. 13 00:01:05,691 --> 00:01:06,775 ఆమె చింతించడంలో అర్ఠం ఉంది. 14 00:01:06,859 --> 00:01:08,485 అయితే ఆమెకు జీతాన్ని పెంచండి. 15 00:01:12,322 --> 00:01:13,824 ఆమె క్రెస్వెల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. 16 00:01:18,161 --> 00:01:19,454 అతను సరిగ్గా మనం అనుకున్నట్టే ఉన్నాడు. 17 00:01:53,071 --> 00:01:54,239 'ఫాల్స్ ఫ్లాగ్' అనే సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 18 00:01:54,323 --> 00:01:55,866 అమిత్ కోహెన్ - మరియా ఫెల్డ్ మ్యాన్ సృష్టి 19 00:02:24,603 --> 00:02:26,271 పదా. నడువు, డోరా. మంచి కుక్క. 20 00:02:28,482 --> 00:02:30,734 డోరా. డోరా! 21 00:02:31,944 --> 00:02:32,986 ఆగు! 22 00:02:38,951 --> 00:02:40,244 డోరా. 23 00:02:55,551 --> 00:02:57,678 లియో న్యూమ్యాన్ కిడ్నాప్ కేసులో తాజాగా 24 00:02:57,761 --> 00:03:01,014 నెలకొన్న ట్విస్ట్ పై ఇంకా ఎలాంటి వ్యాఖ్యా చేయబడలేదు. 25 00:03:01,515 --> 00:03:05,686 కూపర్ న్యూమ్యాన్ సంస్థ క్లయింట్స్ పై ఏకకాలంలో జరిగిన హ్యాకింగ్ తరువాత, 26 00:03:05,769 --> 00:03:09,273 లియో వాళ్ళ అమ్మ, క్యాథెరిన్ గారిని ఉద్దేశిస్తూ 27 00:03:09,356 --> 00:03:11,483 అటు అమెరికాలో, ఇటు యూకేలో డిజిటల్ బిల్ బోర్డులపై 28 00:03:11,567 --> 00:03:13,402 "నిజం చెప్పమని" సందేశాలు వెలువడ్డాయి. 29 00:03:13,485 --> 00:03:16,697 అలాగే హ్యాకర్లు డిమాండ్ చేస్తూ విడుదల చేసిన ఇటీవలి వీడియోలో 30 00:03:16,780 --> 00:03:20,242 ఎరిక్ క్రెస్వెల్ గా పేర్కొనబడిన వ్యక్తిపై కూడా ఎలాంటి వ్యాఖ్యా చేయబడలేదు. 31 00:03:21,827 --> 00:03:23,704 వాళ్ళు సరిగ్గా ఏ సమయానికి ఆచూకీ లేకుండా పోయారు తెలుసా? 32 00:03:23,787 --> 00:03:25,747 ...చూస్తుంటే ఒత్తిడి మరింత పెరుగుతుందనే... 33 00:03:25,831 --> 00:03:28,125 లేదు, ఎందుకంటే వాళ్లపై నిఘా తీసేసాం కదా. 34 00:03:28,208 --> 00:03:30,294 ...కిడ్నాపర్లే నేరుగా విషయంపై... 35 00:03:30,377 --> 00:03:33,213 ఈ కేసుపై పని చేస్తున్న యూకే మరియు అమెరికా పోలీసులు 36 00:03:33,297 --> 00:03:35,174 లియో ఆచూకిని కనిపెడితే తప్ప పరిస్థితి అంతే. 37 00:04:15,088 --> 00:04:17,089 నీకు తర్వాత ఫోన్ చేస్తాను. మా దగ్గర కేవలం డేటాబేస్ మాత్రమే ఉంది. 38 00:04:17,173 --> 00:04:19,468 - సరే, ఇంకేమైనా తెలిసిందా? సరే. - బాగానే ఉంది. అవును, ఇంకా అక్కడే ఉంది. 39 00:04:19,551 --> 00:04:20,677 నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. 40 00:04:22,095 --> 00:04:24,056 - ఏం తెలిసింది? - వాళ్ళు ఉన్న ఆ ఇల్లు బ్రిడ్జి దగ్గర శవమై 41 00:04:24,139 --> 00:04:26,683 ఉన్న యూకే వ్యక్తిదే అని ధృవీకరించారు. 42 00:04:27,476 --> 00:04:28,894 ఏదయినా గుర్తింపు దొరికిందా? 43 00:04:28,977 --> 00:04:30,187 సామ్యూల్ బ్రోలిన్, 44 00:04:30,854 --> 00:04:32,731 అతని పక్కింటి వ్యక్తి, అలాగే ఇతర సర్వీసు కంపెనీ వాళ్ళు చెప్పారు. 45 00:04:32,814 --> 00:04:35,609 కానీ ఆ ఇల్లు ఇస్రేల్ లో ఉన్న ఒక కంపెనీ పేరు మీద ఉంది. 46 00:04:36,443 --> 00:04:39,696 అంటే బినామీ కంపెనీ అన్నమాట. పక్కింటి వాళ్ళు ఇంకేం చెప్పారు? 47 00:04:40,489 --> 00:04:43,408 - "ముందే ఎందుకు రాలేదు" అన్నారు. - అవును, ముందే ఎందుకు వెళ్ళలేదు? 48 00:04:43,492 --> 00:04:46,703 ఎందుకంటే ఆ అడ్రెస్ కు మన వద్ద ఉన్న శవానికి సంబంధం ఉందని వాళ్లకు తెలీదు కదా! 49 00:04:47,287 --> 00:04:49,122 ఎవరినైనా గుర్తించాడా? 50 00:04:49,206 --> 00:04:52,835 టిల్సన్ మరియు మెక్ అలిస్టర్ ని గుర్తించాడు. కానీ మిగతా వాళ్ళని చూడలేదు. 51 00:04:53,418 --> 00:04:55,712 వాళ్ళు పారిపోయే ముందు అతని కారును తగలబెట్టేశారు, 52 00:04:55,796 --> 00:04:58,298 అలాగే అక్కడ ఉన్న ఆఫీసర్ బ్రోలిన్ కారులో, ఇంకా ఇంట్లో రక్తాన్ని చూసాడు. 53 00:04:58,382 --> 00:04:59,675 అది ఎవరి రక్తమో ఇంకా తెలీదు. 54 00:05:01,301 --> 00:05:03,303 కానీ అక్కడ ఇక్కడి కంటే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. 55 00:05:03,887 --> 00:05:05,514 చూస్తుంటే విషయం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. 56 00:05:05,597 --> 00:05:06,974 ఓహ్, అవునా? 57 00:05:08,559 --> 00:05:10,686 వాళ్ళు దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఊహించనిదేదో జరిగి ఉండొచ్చు. 58 00:05:10,769 --> 00:05:12,062 అందుకు నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? 59 00:05:12,145 --> 00:05:13,146 పోలీసుల సరిహద్దు, దాటకూడదు 60 00:05:13,230 --> 00:05:15,440 - మనం విమానాశ్రయంలో ఉన్నాం. - కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారో లేదో తెలీదు. 61 00:05:15,524 --> 00:05:16,942 అలాంటిది ఇక విమానం ఎక్కారో లేదో అస్సలు తెలుసుకోలేము. 62 00:05:17,025 --> 00:05:18,110 కాస్త నా మాట నమ్ము! వాళ్ళు పారిపోతున్నారు! 63 00:05:18,193 --> 00:05:20,821 ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా, స్వయంగా వచ్చారని నేను అనుకోను. 64 00:05:20,904 --> 00:05:23,240 టిల్సన్ ఏదో ఒక సమయంలో మెక్ అలిస్టర్ ని కలిసాడని మనకు తెలుసు, 65 00:05:23,323 --> 00:05:25,492 అలాగే ఈ కిడ్నాప్ విషయంలో మోనిక్ కి అసలు సంబంధమే లేదు. 66 00:05:25,576 --> 00:05:26,869 కావచ్చు, అందుకే ఆమె చనిపోయి ఉంది. 67 00:05:26,952 --> 00:05:29,705 అంటే ఆమె మరణంలో నిజంగానే నాటాలి తొమ్ప్సన్ చేయి కూడా ఉంది అంటున్నావా? 68 00:05:29,788 --> 00:05:31,456 బహుశా వాళ్ళ మధ్య గొడవ జరిగి ఉండొచ్చు. 69 00:05:31,540 --> 00:05:34,251 నేను ఏం అనుకుంటున్నాను అంటే నువ్వు వీళ్ళను మొదటి నుండి బాగా 70 00:05:34,334 --> 00:05:35,335 తక్కువ అంచనా వేశావు. 71 00:05:37,212 --> 00:05:38,881 - నిన్ను కూడా తక్కువగానే అంచనా వేసుంటాను. - అంటే ఏంటి? 72 00:05:38,964 --> 00:05:41,383 నేను మిలటరీలో పని చేసి వచ్చా, స్కాట్. ఇలాంటి కేసులు ఎన్నో చూసాను. 73 00:05:41,466 --> 00:05:44,261 ఇక్కడ అంతా శుభ్రం చేసేసారు. తుపాకి గుండు కేసులు, టైర్ల గుర్తులు లేవు. 74 00:05:44,344 --> 00:05:46,597 గోడల్లో, నేల మీద బుల్లెట్ కన్నాలు ఉన్నాయి, కానీ మోనిక్ రక్తం తప్ప 75 00:05:46,680 --> 00:05:48,265 - ఇక్కడ ఇంకేం లేవు. - నీ ఉద్దేశం ఏంటి? 76 00:05:48,348 --> 00:05:49,892 నువ్వు మొదటి నుండి వాళ్ళను అమెరికా తీసుకెళ్లాలని చూసావు, 77 00:05:49,975 --> 00:05:51,894 ఆ తర్వాత నా పైఅధికారుల దగ్గరకి వెళ్లి వాళ్ళ పై నిఘా తీయించావు. 78 00:05:51,977 --> 00:05:54,938 ఎందుకంటే టిల్సన్ దేశం వదిలి పారిపోతాడని నాకు తెలుసు కాబట్టి! 79 00:05:55,022 --> 00:05:59,484 ఇది నీ బాధ్యతని ఫీల్ అవుతున్నావని తెలుసు, కానీ నేను ఎఫ్.బి.ఐ వాడిని, సిఐఏ కాదు. 80 00:06:00,110 --> 00:06:03,197 వీళ్ళను తీసుకుపోవడానికి నేను మనుషులను పంపానని నువ్వు నిజంగానే అనుకుంటున్నావా? 81 00:06:03,280 --> 00:06:05,115 నేను నిజంగానే వీళ్ళను తీసుకెళ్లాలి అనుకుంటే ఎప్పుడో చిక్కే వారు. 82 00:06:05,199 --> 00:06:06,450 ఇది వాదించే సమయం కాదు. 83 00:06:06,533 --> 00:06:08,493 అంతే కానీ ఎక్కడో పల్లెటూరులో ఒక ఇంట్లో ఉండరు. 84 00:06:08,577 --> 00:06:11,413 ఇదంతా వాళ్ళ పని. మేము కాదు! హే, నేను ఇంకా మాట్లాడుతున్నాను! 85 00:06:11,496 --> 00:06:12,664 వాళ్ళను వెతకాలా వద్దా? 86 00:06:14,750 --> 00:06:17,628 తర్వాత మనం పాస్ పోర్టులు సంపాదించాలి, కాబట్టి నాకు ఫోటోలు కావాలి. 87 00:06:17,711 --> 00:06:20,172 హే, ఫోటోలు నేను తీయనా? నేను తీస్తాను. 88 00:06:20,881 --> 00:06:23,133 సరే, కనీసం ఇలాంటి వాటికైనా వీడిని ఉపయోగించుకుందాం. 89 00:06:23,217 --> 00:06:24,927 వీడి వల్ల ఇక్కడ ఏం ఉపయోగమో నాకు ఇంకా తెలీడం లేదు. 90 00:06:25,010 --> 00:06:27,804 ఏమీ అనుకోకు, కానీ నీతో మాట్లాడడానికి ఎవరైనా సరే, కచ్చితంగా జంకుతారు. 91 00:06:27,888 --> 00:06:29,348 కానీ నేను మాత్రం అందరితో మాట్లాడగలను. 92 00:06:29,431 --> 00:06:31,266 నాతో మాట్లాడడానికి ఎవరైనా ఇష్టపడతారు. చూడగానే నేను ఎవరికైనా నచ్చుతాను. 93 00:06:31,350 --> 00:06:33,685 - నాకు నచ్చడం లేదే. - నువ్వు వేరులే. 94 00:06:34,353 --> 00:06:36,104 మీలో ఎవరికైనా వీడు నచ్చుతాడా? 95 00:06:36,855 --> 00:06:37,856 అవును. 96 00:06:39,233 --> 00:06:40,359 నాకు వీడు నచ్చుతాడు. 97 00:06:44,655 --> 00:06:46,073 మనం ఎత్తుకొచ్చిన ఈ కార్ ని కనిపెట్టింది ఎవరు? 98 00:06:46,156 --> 00:06:49,201 ఫోటోలు దిగడం పూర్తయ్యాక, మీరు ముగ్గురు తర్వాతి ట్రైన్ లో లండన్ పోండి. 99 00:06:49,284 --> 00:06:52,371 రేపు ఉదయం 10కి నాకు 68 లక్షల రూపాయలు కావాలి. 100 00:06:52,454 --> 00:06:55,415 నేను మీకు చెప్పిన యాప్ ద్వారా ఈ నంబర్ కి సూచనలు పంపండి. 101 00:06:55,499 --> 00:06:57,709 - రేపు ఉదయం 10కా? - నీకు పిచ్చా? 102 00:06:57,793 --> 00:06:59,711 సమాధానం వినడం ఇష్టం లేకపోతే, ప్రశ్నలు అడగకూడదు. 103 00:06:59,795 --> 00:07:01,755 - కూపర్ న్యూమ్యాన్ పిఆర్ ని హ్యాక్ చేసావు. - దానికి రెండు వారాలు పట్టింది. 104 00:07:01,839 --> 00:07:03,966 నాతో రావాలని ఉంది అన్నావు. మార్టిన్ కోప్ ల్యాండ్ ని కలవాలని ఉందా లేదా? 105 00:07:07,594 --> 00:07:09,930 - సరే. - అయితే, ఏదోకటి ఆలోచించు. ఉదయం 10కి. 106 00:07:10,013 --> 00:07:11,265 నన్ను నిరాశపరచకు. 107 00:07:11,348 --> 00:07:14,810 మనం మూడున్నరకు బ్యాటర్సీ పార్కులో కలవాలి, సరేనా? 108 00:07:14,893 --> 00:07:16,854 - నా సంగతి ఏంటి? - నువ్వు నాతో వస్తున్నావు. 109 00:07:16,937 --> 00:07:18,689 - ఎందుకు? - ఎందుకంటే నేను నిన్ను నమ్మను. 110 00:07:19,273 --> 00:07:22,484 అలాగే, మీ వాళ్లకు ఫోన్ చేయాలని మీకు అనిపించవచ్చు. కానీ ఫోన్ చేయకండి. 111 00:07:22,568 --> 00:07:25,612 మీరు తీసుకొనే ప్రతీ రిస్క్ నన్ను రిస్క్ లో పెడుతుంది. చెప్పింది చేయండి అంతే. 112 00:07:25,696 --> 00:07:29,366 లేదంటే ఏది ఏమైనా మీ వాళ్ళను మళ్ళీ కలిసే అవకాశమే మీకు ఉండదు. సరేనా? 113 00:07:30,409 --> 00:07:33,787 సరే, ఇక లండన్ వెళ్ళాక, కొత్త బట్టలు తీసుకొని, జుట్టు స్టైల్ మార్చుకోండి. 114 00:07:33,871 --> 00:07:37,249 ఎయిర్ పోర్ట్ దాటి వెళ్లాలంటే, మీరు ఇప్పుడు ఉన్నట్టు కనిపించకూడదు. 115 00:07:37,332 --> 00:07:40,460 ప్లాన్ ని మరోసారి త్వరగా రివ్యూ చేద్దాం. 116 00:07:41,587 --> 00:07:43,839 - అందరిలో కలిసిపోయే మగాడిని కావాలి. - ఇక్కడ ఆడవాళ్ళం కూడా ఉన్నాం. 117 00:07:44,423 --> 00:07:46,842 ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా, సహజంగా ప్రవర్తించాలి. 118 00:07:49,678 --> 00:07:51,847 ఇద్దరంగా వెళ్ళాలి. అప్పుడే మనల్ని ఆపే అవకాశాలు తగ్గుతాయి. 119 00:07:51,930 --> 00:07:53,515 ప్రత్యేకంగా వాదించుకుంటూ వెళ్తుంటే. 120 00:07:54,391 --> 00:07:55,851 ఎప్పుడైనా సరే, మనసులో ఒక ఉద్దేశంతో వెళ్లాలి. 121 00:07:55,934 --> 00:07:57,477 పోలీసుల నుంచి పారిపోవాలనే ఉద్దేశం తప్ప. 122 00:07:57,561 --> 00:08:00,522 అందరికంటే ముందు కానీ, చివర గాని ఉండకూడదు. అలా ఉంటే మనల్ని గుర్తుంచుకోవచ్చు. 123 00:08:01,857 --> 00:08:04,818 ఎక్కువ మందితో కలిసి ప్రయత్నిస్తున్నట్టు నటించండి. 124 00:08:04,902 --> 00:08:08,071 కళ్ళలోకి చూడకండి. అనవసరంగా వాదనల్లోకి దిగకండి. 125 00:08:08,155 --> 00:08:11,033 ఎవరైనా ప్రశ్నించినప్పుడు, మీకు తెలిసిన ఒక వ్యక్తిని మనసులో ఊహించుకొని 126 00:08:11,116 --> 00:08:12,659 కామన్ గా చెప్పే సమాధానం ఇవ్వండి. 127 00:08:12,743 --> 00:08:14,077 అప్పుడే మీరు చెప్పిన విషయాలు మీకు గుర్తుంటాయి. 128 00:08:14,161 --> 00:08:16,038 అలాగే ఎప్పుడైనా సరే, 129 00:08:16,121 --> 00:08:17,873 ఇతరులకు మనపై ఆసక్తి ఉంది అనుకుంటుంటాము, 130 00:08:17,956 --> 00:08:19,958 కానీ వాళ్ళది తప్ప ఇంకెవ్వరిదీ వాళ్లకి పట్టదు. 131 00:08:20,626 --> 00:08:24,046 కాబట్టి సహజంగా ప్రవర్తించండి. మీ టెన్షన్ ఇతరులకు తెలీకూడదు. 132 00:08:24,129 --> 00:08:26,465 అప్పుడు మీరు ఎంత సులభంగా తప్పించుకోగలరో చూసి మీరే నమ్మలేరు. 133 00:08:26,965 --> 00:08:30,677 కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్న ఆ నిజం ఏంటి? 134 00:08:30,761 --> 00:08:33,514 క్యాథెరిన్ న్యూమ్యాన్ కి తెలిసి ఉంటే, ఆమె చెప్పడానికి ముందుకు రావడం లేదు. 135 00:08:33,597 --> 00:08:37,558 నిజం చెప్పు అనే నినాదం ఒక పాపులర్ ఉద్యమంగా మారడం చూస్తున్నాం. 136 00:08:37,643 --> 00:08:40,604 నిన్న సాయంత్రం, ఒక అనామక బృందం లండన్ అండర్ గ్రౌండ్ మార్గాలలో 137 00:08:40,687 --> 00:08:42,313 ప్రకటన బోర్డులను హ్యాక్ చేసింది. 138 00:08:42,397 --> 00:08:46,360 ఇది కొన్ని గంటల క్రితం చికాగోలో కూపర్ న్యూమ్యాన్ ఆఫీసు ఎదురుగా జరిగిన సంఘటన. 139 00:08:46,443 --> 00:08:50,572 దేశమంతటా ఇలాంటి విధ్వంసక చర్యలు జరిగినట్టు తెలుస్తుంది, 140 00:08:50,656 --> 00:08:52,074 చెప్పాలంటే, ప్రపంచమంతటా 141 00:08:52,157 --> 00:08:55,661 నిజం చెప్పు అనే నినాదం రోజు రోజుకూ బలపడుతుంది. 142 00:08:55,744 --> 00:08:57,496 బ్రేకింగ్ న్యూస్ నిజం చెప్పమని ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు 143 00:08:57,579 --> 00:09:00,707 విధ్వంసక చర్యలు. హ్యాకింగ్. ఇవి ప్రజల నుంచి సింపతీ పొందలేవు. 144 00:09:01,375 --> 00:09:04,670 వాళ్ళు ముసుగులు వేసుకుని, మనల్ని నిజం చెప్పమని అడగడం నవ్వు తెప్పిస్తుంది, కదా? 145 00:09:04,753 --> 00:09:06,505 ఆలైస్ చింతించడంలో తప్పు లేదు. 146 00:09:08,006 --> 00:09:10,384 ప్రస్తుతం మనపై అభిప్రాయం ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. 147 00:09:10,968 --> 00:09:14,054 ఒక మాట చెప్పనా, ఆన్లైన్ లో మనపై సానుభూతి గట్టిగానే ఉంది. 148 00:09:14,137 --> 00:09:17,140 నాకు తెలుసు. ఆ విషయాన్ని నాకు చూపమని కైట్లిన్ కి చెప్పావు కదా, ఆమె చూపించింది. 149 00:09:17,808 --> 00:09:20,686 కానీ అందులో ఉన్న మంచి విషయాలన్నీ మనోళ్లు 150 00:09:20,769 --> 00:09:22,479 రాసినవే అని మాత్రం చెప్పలేదు. 151 00:09:23,355 --> 00:09:24,439 చెప్పాల్సిన పని కూడా లేదు అనుకో. 152 00:09:25,440 --> 00:09:28,443 ఇది ఒక యుద్ధం, కేట్. అవే ఎత్తగడలు ఇక్కడ కూడా పని చేస్తాయి. 153 00:09:29,111 --> 00:09:30,320 నేను అర్థం చేసుకోగలను. 154 00:09:30,404 --> 00:09:34,783 నువ్వు ఐఓపి ఎనర్జీ వాళ్ళకు ఫోన్ చేసావు కదా. దానికి ఏమీ ఏమన్నది? 155 00:09:34,867 --> 00:09:36,827 ఆమె నీతో మాత్రమే మాట్లాడతాను అంది. 156 00:09:36,910 --> 00:09:39,705 కానీ నేను న్యూ యార్క్ వదిలి వెళ్ళట్లేదు. లియో దొకరనంత వరకు నేను కదలను. 157 00:09:39,788 --> 00:09:41,832 నన్ను కలవాలి అనుకుంటే, ఆమె ఇక్కడికి రావచ్చు. 158 00:09:41,915 --> 00:09:43,458 ఆమె ఇవాళ మధ్యాహ్నం వస్తుంది. 159 00:09:46,420 --> 00:09:48,881 ఒకవేళ క్రెస్వెల్ ఇంకా ఉన్నా కూడా, 160 00:09:49,381 --> 00:09:52,426 గత 25 ఏండ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. 161 00:09:52,509 --> 00:09:54,052 మరి అతని రిపోర్టు సంగతి? 162 00:09:54,136 --> 00:09:56,054 అది ఎవరికీ అందుబాటులో లేదు. 163 00:09:56,972 --> 00:09:57,973 ఎవరికీ అందుబాటులో లేదు. 164 00:09:58,056 --> 00:10:01,226 నువ్వు నన్ను నమ్మాలి, కేట్. ఇదంతా మనం ఎన్నో ఏళ్ల క్రితమే చక్కబెట్టేసాం. 165 00:10:04,188 --> 00:10:08,150 ఒకవేళ అతను కనిపించే అవకాశం ఉంటే, ముందు మనమే కనుగొనాలి. 166 00:10:26,460 --> 00:10:28,420 అయితే, నువ్వు ఈ పని చేయడం ఎలా మొదలుపెట్టావు? 167 00:10:28,504 --> 00:10:30,214 అంటే, నువ్వు ఆర్మీలో ఉన్నావని నాకు తెలుసు, కానీ ఏంటి, 168 00:10:30,297 --> 00:10:32,883 మిలటరీనా లేక పారా మిలటరీనా? లేక... 169 00:10:41,683 --> 00:10:43,977 కనీసం మనం ఏ జంక్షన్ లో దిగబోతున్నామో చెప్తావా? 170 00:10:44,061 --> 00:10:45,562 అప్పుడు నేను ఏ రోడ్డు తీసుకోవాలో చూస్తాను. 171 00:10:47,648 --> 00:10:48,649 చెప్పవా? సరే. 172 00:11:00,661 --> 00:11:01,995 నా మాట విను, షాన్. 173 00:11:03,205 --> 00:11:06,750 మా నాన్నకు నేను అస్సలు నచ్చను, కానీ మా అమ్మకు నేను చాలా దగ్గర 174 00:11:06,834 --> 00:11:09,086 కనుక మనం వెళ్లబోయే ముందు నేను క్షేమంగానే ఉన్నానని ఆమెకు చెప్పాలనుకుంటున్నాను. 175 00:11:09,169 --> 00:11:12,589 - అంటే, ఇప్పుడు ఫోన్ చేయడం... - మాట్లాడడం ఆపకపోతే కాల్చి చంపుతా. 176 00:11:21,849 --> 00:11:23,350 రూబెన్ ని స్పీకర్ లో పెట్టు. 177 00:11:27,896 --> 00:11:29,314 - సర్? - ఎక్కడ ఉన్నావు? 178 00:11:29,398 --> 00:11:32,067 బేస్ కి వచ్చేస్తున్నాం. అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. 179 00:11:32,150 --> 00:11:34,987 ఆ ఇంట్లో దొరికిన ఆధారాలపై ఫోరెన్సిక్ వారు సమాచారం ఇచ్చారు. 180 00:11:35,070 --> 00:11:37,072 అయిదుగురు అనుమానితుల చేతి గుర్తులు అక్కడే ఉన్నాయి. 181 00:11:38,115 --> 00:11:39,575 ఆ ఫోన్ సంభాషణను ఇతరులు వింటున్నారు, సర్. 182 00:11:40,409 --> 00:11:41,702 హాయ్, నేను స్కాట్ ని. 183 00:11:41,785 --> 00:11:44,454 హాయ్, స్కాట్. అలాగే అక్కడ ఇద్దరి రక్తం ఉంది. 184 00:11:44,538 --> 00:11:46,915 ఒకటి మోనిక్ తొమ్ప్సన్ ది, అలాగే రెండవది ఎడ్డీ వాకర్ ది. 185 00:11:48,292 --> 00:11:51,712 మేము హాస్పిటల్స్ అన్నిటిలో చూస్తున్నాం. ఆ ఇంటి యజమాని సంగతి ఏమైనా తెలిసిందా? 186 00:11:51,795 --> 00:11:53,964 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీల సహాయంతో దర్యాప్తు చేస్తున్నాం. 187 00:11:54,047 --> 00:11:56,800 కానీ మన మొదటి ప్రాధాన్యత అనుమానితులను పట్టుకోవడమే కావాలి. 188 00:11:56,884 --> 00:11:58,969 నిజమే. టచ్ లో ఉండు. 189 00:12:02,431 --> 00:12:04,433 సరే, కలిసి ఉన్నారంటే, పట్టుకోవడం సులభం అవుతుంది. 190 00:12:05,058 --> 00:12:07,686 నిఘా పెట్టి ఉంచితే అప్పుడు ఇంకా సులభం అయ్యేది. 191 00:12:13,483 --> 00:12:16,278 మనం ఇప్పుడు డిడ్కోట్ పార్క్ వేని సమీపిస్తున్నాం. 192 00:12:16,361 --> 00:12:18,780 హియర్ఫోర్డ్ బాన్బరి మరియు ఆక్స్ఫర్డ్ కి 193 00:12:18,864 --> 00:12:20,991 వెళ్లేవారు ఇక్కడ ట్రైన్ మారాలి. 194 00:12:21,074 --> 00:12:22,075 నిజం చెప్పు 195 00:12:22,659 --> 00:12:23,911 మీరు ఇక్కడ దిగేటట్టు అయితే... 196 00:12:24,620 --> 00:12:26,038 పని ఎంత వరకు వచ్చింది? 197 00:12:26,121 --> 00:12:28,665 పర్లేదు. ఆఫ్ షార్ అకౌంట్ లోకి వెళ్ళాను. డబ్బు దొరికింది. 198 00:12:29,750 --> 00:12:30,959 ఇప్పుడే క్లిష్టమైన పని మొదలవుతుంది. 199 00:12:32,753 --> 00:12:34,129 ఏంటి? 200 00:12:36,423 --> 00:12:37,633 ఆమె ఏం చేస్తుంది? 201 00:12:43,889 --> 00:12:46,350 లండన్ కి కొన్ని మైళ్ళ దూరంలో సర్వేలెన్స్ కెమెరాకి చిక్కారు. 202 00:12:46,433 --> 00:12:49,228 - తర్వాతి చెక్ పాయింట్ ముందే రోడ్డు మారారు. - వాడు టిల్సన్ అయ్యుండొచ్చు. 203 00:12:50,604 --> 00:12:52,856 కానీ అది మెక్ అలిస్టర్ ఆహ్? 204 00:12:52,940 --> 00:12:54,066 కచ్చితంగా చెప్పలేం. 205 00:12:54,149 --> 00:12:56,109 ఆ కారుని కనిపెట్టడానికి లండన్ అంతటా నిఘా పెట్టాం, 206 00:12:56,193 --> 00:12:58,654 అలాగే మఫ్టీలో ఉన్న సాయుధ దళాలు కూడా వీధి వీధి తిరిగి గాలిస్తున్నారు. 207 00:12:59,821 --> 00:13:01,698 వాళ్ళు విడిపోయి వెళ్లడంలో అర్థం ఉంది. 208 00:13:01,782 --> 00:13:04,493 - విమానాశ్రయాలకు సమాచారం పంపారా? - ప్రైవేటు వాటికి కూడా. 209 00:13:04,576 --> 00:13:06,995 మన కంటికి కనిపించకుండా దేశం వదిలి వెళ్ళలేరు. 210 00:13:08,789 --> 00:13:11,708 ఇంత త్వరగా అయిదు పాస్ పోర్టులు ఎలా సంపాదించగలవు? 211 00:13:11,792 --> 00:13:13,794 డబ్బు ఉంటే ఈ దేశంలో కొనలేనిది ఏదీ లేదు. 212 00:13:13,877 --> 00:13:15,295 ఆదేష్ మనల్ని నిరాశపరచడు. 213 00:13:15,379 --> 00:13:17,673 కంప్యూటర్ల విషయానికి వస్తే వాడి లాంటి వారిని నేనెవరిని చూడలేదు. వాడు... 214 00:13:17,756 --> 00:13:20,801 వీళ్ళు ప్రమాదకరమైన వారు, కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడకుంటే మంచిది. 215 00:13:20,884 --> 00:13:23,136 - సరే. అలాగే. మాట్లాడను. - అస్సలు మాట్లాడకు. 216 00:13:23,220 --> 00:13:25,722 సరే, అర్థమైంది. కానీ నా సందేహం ఏంటంటే... 217 00:13:25,806 --> 00:13:26,932 కాస్త... 218 00:13:27,015 --> 00:13:28,016 సరే. 219 00:13:35,190 --> 00:13:36,900 నీకు చాలా అవసరం ఉన్నట్టు ఉంది. 220 00:13:41,738 --> 00:13:43,031 నీతో వీడు ఎవడు? 221 00:13:43,907 --> 00:13:45,492 వీడు ఎవడు? 222 00:13:45,576 --> 00:13:46,827 ఎవడోలే. వీడి గురించి చింతించాల్సిన పని లేదు. 223 00:13:58,755 --> 00:13:59,882 ఫోన్ కావాలి. 224 00:14:02,676 --> 00:14:04,011 సరే. 225 00:14:11,685 --> 00:14:13,520 ఇరవై వేల పౌండ్లు ఇవ్వాలి. ఇవ్వడానికే వచ్చావని అనుకుంటున్నా. 226 00:14:13,604 --> 00:14:17,149 నేను ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే తెచ్చా. అలాగే కొన్ని కొనాలి. 227 00:14:40,964 --> 00:14:43,258 వాడు ఇవ్వాల్సిన మొత్తం డబ్బు తెచ్చాను అంటున్నాడు. 228 00:14:43,342 --> 00:14:47,429 అలాగే అమెరికాలో ప్రవేశించగల అయిదు యూకే పాస్ పోర్టులు కూడా కావాలి అంట. 229 00:14:47,513 --> 00:14:49,598 అలాగే స్టెర్లింగ్ ఇంకా డాలర్లలో డబ్బు కావాలట. 230 00:14:51,183 --> 00:14:55,437 అలాగే మీ వద్ద ఉంటే ఒక ట్రాకర్ కూడా కావాలి. అవన్నీ నాకు ఇంకో గంటలో కావాలి. 231 00:14:58,190 --> 00:14:59,733 నేను మళ్ళీ వస్తానని చెప్పా కదా, మసూద్. 232 00:15:00,692 --> 00:15:02,152 చెత్త నా కొడకా. 233 00:15:07,908 --> 00:15:10,536 - ఏం చేస్తున్నావు? - పొలం దున్నుతున్నాను. 234 00:15:10,619 --> 00:15:11,620 నువ్వు... 235 00:15:12,871 --> 00:15:14,748 మనం ఈ పని పూర్తి చేయడానికి ఎంత సమయం ఉందో తెలుసు కదా, ఆదేష్, 236 00:15:14,831 --> 00:15:16,250 అలాంటప్పుడు గేమ్స్ ఆడుతున్నావేంటి? 237 00:15:16,333 --> 00:15:19,169 లేదు. ఆ మార్కెట్ కి యాక్సెస్ పొందాలంటే ఈ ఆటలో పొలాన్ని సిద్ధం చేయాలి. 238 00:15:20,337 --> 00:15:21,588 ఏం మాట్లాడుతున్నావు? 239 00:15:23,006 --> 00:15:24,007 సరే. 240 00:15:24,633 --> 00:15:26,677 నేను నీ డబ్బును ఈ గేమ్ లోకి పంపిస్తున్నాను. 241 00:15:26,760 --> 00:15:31,974 నేను గేమ్ లో ఉండే క్రెడిట్స్ కొని, తర్వాత ఆ అకౌంట్ వివరాలను ఇంకొకరికి పంపుతాను, 242 00:15:32,057 --> 00:15:34,643 వాళ్ళు ఆ క్రెడిట్ ని ఆన్లైన్ లో మాములు డబ్బు కోసం అమ్ముతారు. 243 00:15:34,726 --> 00:15:37,646 కానీ అందుకు ముందు, నేను ఈ ఆట ఆడాలి. 244 00:15:39,898 --> 00:15:43,193 నువ్వు ఇప్పుడు చేసే పని లీగల్ కాదు అనుకుంట కదా. 245 00:15:44,444 --> 00:15:49,157 నాటాలీ, మనం పోలీసులకు వద్దకు వెళ్లకుండా ఎంత ఎక్కువ సేపు గడిపితే, అంత దోషులమవుతాం. 246 00:15:49,741 --> 00:15:53,161 ఆ విషయం నీకు అర్థం అవుతుంది కదా? మనం ఇంకా లోనికి కూరుకుపోతున్నాం. 247 00:15:53,245 --> 00:15:56,707 మనం ఇప్పటి వరకు చేసిన వాటిని జనం అర్థం చేసుకొనే అవకాశం ఉంది, 248 00:15:56,790 --> 00:15:59,251 కానీ ఇలా డబ్బును చేరవేయడం సంగతి? 249 00:15:59,960 --> 00:16:02,171 అమెరికా వెళ్లడమో? అసలు మనం ఏం ఆలోచిస్తునామో అర్థమవుతుందా? 250 00:16:05,299 --> 00:16:07,134 మనం ఎవరిని నమ్ముతున్నామో చూడు. 251 00:16:08,302 --> 00:16:10,637 ఎడ్డీ ఏమో, "షాన్ నిన్ను చంపలేడు. 252 00:16:10,721 --> 00:16:13,515 నువ్వు సి.ఎన్.పి.ఆర్ ని హ్యాక్ చేసావు. నీకు ఏం తెలుసో నీకే తెలీదు. 253 00:16:13,599 --> 00:16:16,810 స్టార్ వార్స్ లో లీల యువరాణి హాలోగ్రామ్ ని చేరవేసే ఆర్2-డీ2 రోబోట్ లాంటివాడివి నువ్వు. 254 00:16:16,894 --> 00:16:19,146 నువ్వు చాలా విలువైనవాడివి" అన్నాడు. కానీ నాకు ఆ విలువ వద్దు. 255 00:16:19,229 --> 00:16:20,856 ఒక రోబోట్ లా పని చేస్తూ సంపాదించుకొనే విలువ అసలే వద్దు. 256 00:16:20,939 --> 00:16:24,651 ఒక విజయవంతమైన బిజినెస్ నడపాలనుకుంటున్నా. ఒక మంచి తండ్రిని, భర్తను కావాలనుకుంటున్నా. 257 00:16:26,528 --> 00:16:29,448 న్యూ యార్క్ విషయంలో నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోనవసరం లేదు, ఆదేష్. 258 00:16:30,449 --> 00:16:33,493 కానీ ఆ డబ్బును మాత్రం షాన్ కి అప్పజెప్పాలి. వెంటనే. 259 00:16:44,546 --> 00:16:46,465 ఛ! సిగ్నల్ పోయింది. 260 00:16:46,548 --> 00:16:47,799 ప్రయాణికులకు మా క్షమాపణలు. 261 00:16:47,883 --> 00:16:49,760 కొంత సమయం నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది. 262 00:16:49,843 --> 00:16:53,180 నాకు సమాచారం తెలిసిన వెంటనే ఏం జరుగుతుందని మీకు చెప్తాను. 263 00:16:53,514 --> 00:16:57,226 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సహజ చరిత్ర మ్యూజియం 264 00:17:38,350 --> 00:17:40,018 నేను చెప్పిన కోడ్ ఏంటో చెప్పమని అడిగిందా? 265 00:17:40,102 --> 00:17:41,228 అవును, అడిగింది. 266 00:17:41,311 --> 00:17:42,563 చాలా థాంక్స్. 267 00:17:43,397 --> 00:17:45,190 - నేను వెళ్లి టీ తెచ్చుకుంటా, సరేనా? - అలాగే, వెళ్ళు. 268 00:17:45,274 --> 00:17:46,400 ఇలా రా. 269 00:17:51,029 --> 00:17:53,240 నువ్వు... చూడడానికి వేరేలా ఉన్నావు. 270 00:17:54,491 --> 00:17:56,368 అదేం కాదు. దురదృష్టవ శాత్తు నేను ఇంకా నేనే. 271 00:17:58,245 --> 00:18:01,123 ఆమె చాలా తిట్లు తిడుతుంది. నాకు నచ్చింది. 272 00:18:01,206 --> 00:18:03,000 నాకు తెలిసి. హెథర్ చాలా కూల్ గా ఉంటుంది. 273 00:18:06,670 --> 00:18:07,754 నువ్వు భయపడుతున్నావు. 274 00:18:10,215 --> 00:18:11,758 ఎక్కడ చూసినా నీ గురించే వార్తలు వస్తున్నాయి. 275 00:18:13,302 --> 00:18:14,344 నాకు తెలుసు. 276 00:18:15,345 --> 00:18:16,346 అవన్నీ నిజమేనా? 277 00:18:21,101 --> 00:18:22,102 కొంత మట్టుకు. 278 00:18:23,353 --> 00:18:25,022 కానీ ఏం నమ్మాలని నేను నీకు చెప్పను. 279 00:18:26,064 --> 00:18:27,649 నీకు ఏదైనా ప్రమాదం కలగడం నాకు ఇష్టం లేదు. 280 00:18:30,277 --> 00:18:31,653 ఫోటోలు ఏం బాలేవు... 281 00:18:32,154 --> 00:18:33,488 క్షమించండి, ఏమన్నారు? 282 00:18:33,572 --> 00:18:35,908 ఈ రిస్కు తీసుకోవడం అవసరం కాదేమో అంటున్నాడు. 283 00:18:36,241 --> 00:18:37,659 ఇంకో అయిదు వేల పౌండ్లు కావాలి... 284 00:18:38,994 --> 00:18:41,955 ఇంకొక 10 వేలు ఖర్చు అవుతుంది. మొత్తం 75 వేల పౌండ్లు. 285 00:18:42,039 --> 00:18:45,667 చేతికి డబ్బు అందే వరకు మీకు పాస్ పోర్టులు ఇవ్వము. డబ్బు ఉందా? 286 00:18:49,505 --> 00:18:50,923 కరెంట్ అకౌంట్ 37.50 పౌండ్లు 287 00:18:51,590 --> 00:18:53,926 - సమస్యా? - అదేం లేదు. సమస్య కాదు. 288 00:18:54,009 --> 00:18:56,595 మాకు ఇంకొంత సమయం కావాలి. అంతే. 289 00:18:58,722 --> 00:19:00,599 - నేను కొన్నాళ్ళు వేరొక చోటికి వెళ్ళాలి. - ఎన్ని రోజులు? 290 00:19:01,308 --> 00:19:03,977 తెలీదు. కానీ ఎక్కువ కాలం కాకూడదని ఆశిస్తున్నాను. 291 00:19:04,061 --> 00:19:05,229 ఎక్కడికి? 292 00:19:06,271 --> 00:19:10,400 చెప్పలేను. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. 293 00:19:10,484 --> 00:19:13,612 ఏం జరిగినా, ఎవరు ఏం చెప్పినా... 294 00:19:15,697 --> 00:19:18,575 నేను అన్నిటికంటే గర్వపడేది నీ గురించే, డైసీ డ్యూక్. 295 00:19:19,910 --> 00:19:21,203 కానీ... 296 00:19:21,286 --> 00:19:23,121 ఎప్పటికీ నువ్వు నీలాగే ఉండు. సరేనా? 297 00:19:26,792 --> 00:19:28,544 నువ్వు భయపడాల్సినది ఏమీ లేదు. 298 00:19:32,005 --> 00:19:34,967 నాకు ఒక మాట ప్రమాణం చెయ్. నువ్వు ఎక్కడికి వెళ్లినా... 299 00:19:38,804 --> 00:19:40,264 తిరిగి వచ్చేటప్పుడు ఒక స్నో గ్లోబ్ తీసుకురానని మాత్రం మాట ఇవ్వు. 300 00:19:42,641 --> 00:19:43,642 సరే. 301 00:19:48,981 --> 00:19:49,982 సరే. 302 00:19:50,607 --> 00:19:52,693 నువ్వంటే నాకు చాలా ప్రేమ. 303 00:19:56,071 --> 00:19:58,615 సరే, ఇక నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళు. కానీ మీ నాన్నకు ఏమీ చెప్పకు. 304 00:19:58,699 --> 00:19:59,700 సరే. 305 00:20:02,411 --> 00:20:03,537 ధన్యవాదాలు. 306 00:20:26,727 --> 00:20:27,561 డబ్బు ఏమీ లేదు... 307 00:20:27,644 --> 00:20:28,687 వాడు అబద్ధం చెప్తున్నాడని మనకు తెలుసు... 308 00:20:28,770 --> 00:20:30,522 వార్తలో ఎక్కడ చూసినా వీడి గురించే! 309 00:20:30,606 --> 00:20:32,316 ఇంకా ఇంగ్లీషు సరిగా నేర్చుకోలేదా, మసూద్? 310 00:20:33,483 --> 00:20:35,152 నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూశారేమో అని భయపడుతున్నాడు. 311 00:20:35,235 --> 00:20:36,612 ఎవరూ చూడలేదు. 312 00:20:37,487 --> 00:20:39,114 వీడిని అప్పగిస్తే ఏమైనా ఇస్తారా? 313 00:20:39,448 --> 00:20:40,741 చూడు. 314 00:20:42,993 --> 00:20:45,662 వీళ్ళ శవాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చెయ్. 315 00:20:46,205 --> 00:20:48,665 ఆగండి! ఆగండి! డబ్బు వస్తుంది, ఒట్టు. 316 00:20:49,291 --> 00:20:50,417 మాకు ఇంకొక అరగంట ఇవ్వండి. 317 00:20:51,210 --> 00:20:52,377 మాకు ఇంకొక అరగంట ఇవ్వండి. 318 00:20:55,589 --> 00:20:56,590 అలీ. 319 00:21:02,054 --> 00:21:03,430 మీరిద్దరూ నాతో రండి. 320 00:21:12,731 --> 00:21:13,815 ఇక్కడ ఎదురు చూడండి. 321 00:21:24,159 --> 00:21:26,578 హే, మిత్రమా, ఇలా చూడు, అక్కడ... నేను... 322 00:21:27,287 --> 00:21:29,206 అసలు ఎవరివిరా నువ్వు? 323 00:21:29,289 --> 00:21:32,209 - నేను ముందే చెప్పాను కదా. - ఇరానియన్ భాష ఏ విద్యార్థి మాట్లాడతాడు? 324 00:21:32,292 --> 00:21:33,877 భాషలు చదివే విద్యార్థి. 325 00:21:33,961 --> 00:21:35,587 నువ్వు చరిత్రను కదా చదువుతున్నా అన్నావు. 326 00:21:35,671 --> 00:21:39,216 నా మాజీ ప్రియురాలు తూర్పు సంస్కృతులను చదువుతుంది. నాకు నొప్పిగా ఉంది. 327 00:21:39,299 --> 00:21:41,468 అవును. అంటే నీ మాజీ ప్రియురాలు నిన్ను ఇరానియన్ నేర్చుకోమని చెప్పిందా? 328 00:21:41,552 --> 00:21:43,554 అవును. నిజానికి అది ఫార్సీ భాష. 329 00:21:43,637 --> 00:21:45,389 నేను మనకు 30 నిముషాలు ఇప్పించాను. 330 00:21:45,472 --> 00:21:46,807 నేను మనకు 30 నిముషాలు ఇప్పించాను. 331 00:21:51,103 --> 00:21:53,272 నేను ఎందుకు పనికొస్తానో నీకు ఇంకా స్పష్టత రాలేదా? 332 00:22:01,572 --> 00:22:03,866 డబ్బు విషయంలో ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది? 333 00:22:03,949 --> 00:22:06,577 బహుశా ఆమె దగ్గర డబ్బు లేదేమో. బహుశా వాళ్ళు పోలీసుల దగ్గరకు వెళ్లారేమో. 334 00:22:06,660 --> 00:22:08,787 బహుశా... లేదు, వాళ్ళు అలా చేయరు. 335 00:22:11,832 --> 00:22:14,501 - ఇంకా వైఫై లేదా? - అస్తమాను అడగడం ఆపు. ప్లీజ్. 336 00:22:19,464 --> 00:22:20,465 నేను ఏమనుకుంటున్నాను అంటే... 337 00:22:21,842 --> 00:22:25,012 మనం సెండ్ మీద నొక్కితే, అప్పుడు... 338 00:22:26,763 --> 00:22:28,223 అప్పుడు వాడికి మన అవసరం ఇక ఉండదు, అవునా? 339 00:22:29,850 --> 00:22:33,353 ప్రయాణికులారా, సర్వీసులో జరిగిన జాప్యానికి చింతిస్తున్నాం. 340 00:22:33,437 --> 00:22:38,483 మనం త్వరలోనే మన చివరి గమ్యం, పాడింగ్టన్ స్టేషన్ కి చేరనున్నాం. 341 00:22:44,198 --> 00:22:45,240 నెట్ వచ్చింది. 342 00:23:10,432 --> 00:23:11,808 ఏమైంది? 343 00:23:11,892 --> 00:23:13,185 నా డబ్బు ఉందా? 344 00:23:13,268 --> 00:23:15,145 ఇంకా లేదు. వస్తుంది. 345 00:23:18,315 --> 00:23:19,149 ఆగండి! ఆగండి! 346 00:23:19,233 --> 00:23:20,359 ఆగండి, ఆగండి! అది మీరే కదా? 347 00:23:20,442 --> 00:23:21,318 అది మీ ఫోనే కదా? 348 00:23:22,861 --> 00:23:23,695 అది మీ ఫోనేనా? 349 00:23:26,156 --> 00:23:27,324 షాన్, ఫోన్ చూడు. 350 00:23:28,992 --> 00:23:30,035 ఫోన్ చెక్ చెయ్. 351 00:23:35,707 --> 00:23:37,292 - డబ్బు వచ్చింది. - చూపించు. 352 00:23:38,961 --> 00:23:40,212 కరెంట్ అకౌంట్ 80,031.50 పౌండ్లు 353 00:23:40,796 --> 00:23:41,797 డబ్బు వచ్చింది. 354 00:23:49,638 --> 00:23:51,974 మీ అమ్మకు ఫోన్ చేయాలనుకుంటే, వీళ్ళ దగ్గర ప్రీపెయిడ్ ఫోన్ ఉంటుంది, అది వాడుకో. 355 00:23:52,057 --> 00:23:53,225 త్వరగా కానివ్వు, సరేనా? 356 00:23:57,104 --> 00:23:58,397 ఇంకొక విషయం. 357 00:23:58,480 --> 00:24:02,317 కొన్ని వీధుల అవతల ఒక కార్ పార్క్ చేశాను. దానికి బదులు చిన్నది ఒక కార్ కావాలి. 358 00:24:05,320 --> 00:24:07,823 అనుమానాస్పదంగా ఏమైనా చూస్తే గనుక, 359 00:24:07,906 --> 00:24:09,241 మా స్టాఫ్ వారిని సంప్రదించండి 360 00:24:09,324 --> 00:24:14,246 లేదా బ్రిటిషు ట్రాన్స్ పోర్ట్ పోలీసులకు 61016కి ఫోన్ చేయండి. 361 00:24:14,329 --> 00:24:17,165 చూస్తే, సంప్రదించి, సహకరించండి. 362 00:24:19,793 --> 00:24:22,212 మా డిపార్చర్ బోర్డులలో ఎదురైన సాంకేతిక సమస్య వల్ల 363 00:24:22,296 --> 00:24:24,506 ఇవాళ కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. 364 00:24:24,590 --> 00:24:27,176 దయచేసి రానున్న ప్రకటనలను వినండి. 365 00:24:27,259 --> 00:24:28,886 నెట్వర్క్ రైల్ తరపున... 366 00:24:28,969 --> 00:24:30,137 నిజం చెప్పు క్యాథెరిన్ 367 00:24:30,220 --> 00:24:32,723 ...మీకు ఎదురైన అంతరాయానికి క్షమాపణలు తెలుపుతున్నాం. 368 00:25:18,352 --> 00:25:19,728 ఎక్కు. 369 00:25:24,399 --> 00:25:25,817 ఇక పద. 370 00:25:33,450 --> 00:25:35,869 - క్రెస్వెల్ గురించి ఏమైనా తెలిసిందా? - ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ఏం తెలీలేదు. 371 00:25:37,538 --> 00:25:40,040 కానీ చోప్రా ఇంకా మెక్ అలిస్టర్ ని చూసాం అని చాలా రిపోర్టులు వచ్చాయి, 372 00:25:40,123 --> 00:25:41,333 కానీ కచ్చితంగా ధృవీకరించలేకపోతున్నాం. 373 00:25:41,416 --> 00:25:42,543 పోలీసులు అందరి ఫిర్యాదులను చెక్ చేస్తున్నారు. 374 00:25:42,626 --> 00:25:44,753 - అయితే కార్, ఇంకా టిల్సన్ సంగతి? - ఇంకా ఏం తెలీలేదు. 375 00:25:45,420 --> 00:25:46,421 - మేడం? - ఏంటి? 376 00:25:46,505 --> 00:25:49,716 - లిడియా తొమ్ప్సన్ రిసెప్షన్ లో ఉన్నారు. - ఆమెకు విషయం చెప్పారు కదా? 377 00:25:50,551 --> 00:25:52,803 మీ నుండి వినాలి అంటున్నారు. ఆ బాధ్యతే మీదే అంటున్నారు. 378 00:25:54,680 --> 00:25:58,225 - మేము ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాం. - వెళ్లి అదే విషయం చెప్పమంటారా? 379 00:26:10,445 --> 00:26:11,572 హలో? 380 00:26:12,072 --> 00:26:14,074 జో, నేనే మాట్లాడుతున్నాను. 381 00:26:15,534 --> 00:26:16,702 సరే, నువ్వు చెప్పేది నేను వినను 382 00:26:16,785 --> 00:26:20,205 అని అంటుంటావని నాకు తెలుసు, కానీ, చట్టరీత్యా 383 00:26:20,289 --> 00:26:23,333 నా లీగల్ ప్రతినిధి కాల్ హ్యాక్ చేయడం కుదరదు కదా? 384 00:26:24,001 --> 00:26:25,127 అవును. 385 00:26:26,170 --> 00:26:29,506 సరే. అయితే నన్ను నాన్న సమాధి దగ్గర 386 00:26:29,590 --> 00:26:31,800 అరగంటలో కలవమని అమ్మకు చెప్పు. 387 00:26:31,884 --> 00:26:32,885 ఎన్.సి.ఏ జాతీయ క్రైం ఏజెన్సీ 388 00:26:32,968 --> 00:26:36,263 ప్లీజ్, జో. ఇక ఎన్నడూ నేను ఇంకేం అడగను, ఒట్టు. 389 00:26:37,598 --> 00:26:38,849 నన్ను క్షమించు. 390 00:27:00,454 --> 00:27:04,458 అప్పుడు ఆ దొంగలు అంతా వెళ్లిపోయాకా, అలీ... 391 00:27:04,541 --> 00:27:08,462 అపుడు చాలా నెమ్మదిగా, అలీ బాబా గుహ వైపు వెళ్ళాడు. 392 00:27:10,756 --> 00:27:12,174 కానీ తలుపు కదలలేదు. 393 00:27:12,257 --> 00:27:15,010 అతను తన చేతులతో తొయ్యడానికి చూసాడు, కానీ అది కదలలేదు. 394 00:27:17,262 --> 00:27:20,682 ఆ రహస్య పదాలు. ఆ రహస్య పదాలు ఏంటంటే, "తెరుచుకో సామి." 395 00:27:22,392 --> 00:27:25,938 అతను చాలా నెమ్మదిగా నడవాల్సి వచ్చింది, ఎందుకంటే... 396 00:27:28,148 --> 00:27:30,275 అక్కడ చాల చాలా చీకటిగా ఉంది. 397 00:27:30,359 --> 00:27:33,028 అతను చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నడవాల్సి వచ్చింది... 398 00:27:35,447 --> 00:27:37,407 - నువ్వు ఇక్కడికి రాకూడదు. - నేను నిన్ను చూడాలని అనుకున్నాను. 399 00:27:37,491 --> 00:27:41,828 నాకు ఈ ఉద్యోగం ఉండడం ఇంకా నా అదృష్టం. వాళ్ళు మా అందరిపై నిఘా పెట్టారు. 400 00:27:42,371 --> 00:27:44,706 ఎన్.సి.ఏ వాళ్ళకి కూడా ఇవాళ లైబ్రరీ రోజని తెలీదు. 401 00:27:44,790 --> 00:27:46,959 నాకు ఎవరెవరి నుంచో ఫోన్లు వస్తున్నాయి. 402 00:27:48,669 --> 00:27:50,003 అందుకే నువ్వు నా పేరు వాడడం మానేశావా? 403 00:27:51,004 --> 00:27:53,131 టీచింగ్ అసిస్టెంట్ సోనియా కపూర్ సౌత్ హాల్ లైబ్రరీ 404 00:27:54,925 --> 00:27:58,720 ఆదేష్, నువ్వు అసలు నీలాగే లేవు. 405 00:27:59,304 --> 00:28:00,430 నా మాట విను. 406 00:28:01,807 --> 00:28:04,184 ఇక నుంచి ఏం జరిగినా, నీకు ఈ విషయం తెలియాలి. 407 00:28:06,812 --> 00:28:09,439 నువ్వు ఈ ఒక్క విషయం తెలుసుకోవాలి. 408 00:28:11,567 --> 00:28:13,068 మన బంధం అబద్ధం కాదు. 409 00:28:14,403 --> 00:28:17,322 నువ్వు, ఇంకా నేను. మన ప్రేమ నిజం. ఇప్పటికీ నిజమే. 410 00:28:19,449 --> 00:28:21,159 నేను ఇంకా నేనే, సోని. 411 00:28:21,660 --> 00:28:23,287 నేను ఇప్పటికీ నేనే. 412 00:28:23,787 --> 00:28:24,997 నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. 413 00:28:30,252 --> 00:28:33,005 ఇప్పుడే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. 414 00:28:33,630 --> 00:28:36,466 ఆపై మనమిద్దరం కలిసి పారిపోవాలి. వెంటనే. 415 00:28:40,762 --> 00:28:42,347 నేను నిన్ను చాలా నమ్మా, ఆదేష్. 416 00:28:43,473 --> 00:28:44,600 నిన్ను ప్రేమించాను. 417 00:28:47,352 --> 00:28:48,770 కానీ ఇక నిన్ను నమ్మలేను. 418 00:29:39,655 --> 00:29:41,281 ప్రేమతో స్మరించుకుంటున్నాం కార్ల్ అంథోని తొమ్ప్సన్ 419 00:29:41,365 --> 00:29:42,366 డిసెంబర్ 27, 1962 - ఆగష్టు 18, 2004 420 00:29:42,449 --> 00:29:44,535 లిడియాగారి భర్త నాటాలి & మోనిక్ పియ్రమైన తండ్రి 421 00:29:44,618 --> 00:29:45,619 మా హృదయాలలో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు 422 00:29:58,507 --> 00:30:01,009 చూడండి, తను సురక్షితంగానే ఉండుంటుంది. వాళ్ళు తనను ఇప్పుడే ఎక్కించుకుంటున్నారు. 423 00:30:21,989 --> 00:30:25,868 శ్రీమతి తొమ్ప్సన్, చాలా సేపు ఇలా కూర్చోబెట్టినందుకు నన్ను క్షమించండి. 424 00:30:27,202 --> 00:30:28,912 మీరు నాటాలి ఆచూకీ తెలుసుకొని ఉంటారని జో అన్నాడు. 425 00:30:30,038 --> 00:30:33,750 క్షమించండి, మేము ఇంకా కనుగొనలేదు. ఇప్పటికీ తన ఆచూకీ కోసం చూస్తున్నాం. 426 00:30:38,422 --> 00:30:40,424 మోనిక్ విషయంలో నేను చింతిస్తున్నాను. 427 00:30:40,924 --> 00:30:42,176 మేమిద్దరమూ. 428 00:30:46,972 --> 00:30:52,269 పార్క్ మాడిసన్ హోటల్ 429 00:30:52,352 --> 00:30:53,604 పదిహేనవ అంతస్తు బి మెట్లు 430 00:30:54,104 --> 00:30:55,689 నీతో నన్ను రావద్దంటావా అయితే? 431 00:30:55,772 --> 00:30:59,526 మనమిద్దరం వెళ్తే, మనం ఆందోళన పడుతున్నాము అనుకుంటుంది. నేనొక్కదాన్నే వెళ్తాలే. 432 00:31:05,199 --> 00:31:06,533 అబద్ధాలు వద్దు, నిజం ముద్దు 433 00:31:06,617 --> 00:31:10,746 నిజం చెప్పు! నిజం చెప్పు! నిజం చెప్పు! 434 00:31:10,829 --> 00:31:12,915 ఇక అబద్ధాలు ఆపండి 435 00:31:23,050 --> 00:31:24,676 నిజం ఎప్పటికైనా గెలుస్తుంది 436 00:31:46,114 --> 00:31:47,282 ఏమీ. 437 00:31:48,700 --> 00:31:50,744 ట్రాఫిక్ వల్ల ఆలస్యం అయింది. క్షమించు. 438 00:31:51,286 --> 00:31:54,540 ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా, నువ్వు వచ్చావు చూడు, అదే చాలు. 439 00:31:54,623 --> 00:31:58,627 నీకోసం నేను ఎప్పుడైనా సమయం కేటాయిస్తా. స్నేహపూర్వకమైన వారిని చూడడం సంతోషమే. 440 00:32:06,218 --> 00:32:08,053 నాకు ముగ్గురు పిల్లలు, ఇంకొంతమంది సవతి పిల్లలు ఉన్నారు, 441 00:32:08,136 --> 00:32:10,264 అయినప్పటికీ నువ్వు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నావో నేను ఊహించలేను కూడా. 442 00:32:10,347 --> 00:32:12,975 ప్రస్తుతం నీపై ఒత్తిడి తీసుకురావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. 443 00:32:13,058 --> 00:32:16,144 - కానీ నీకు చింతగా ఉంది. నాకది అర్థమైంది. - నాన్న ఆరోగ్యం బాలేదని నీకు తెలుసు. 444 00:32:16,228 --> 00:32:18,438 ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. 445 00:32:18,522 --> 00:32:22,568 హద్దు మీరి మాట్లాడుతున్నాను అనుకోకు, కానీ ఆయన బాగుండడం నాకు అన్నిటికంటే ముఖ్యం. 446 00:32:22,651 --> 00:32:23,652 మీరిద్దరూ బాగుండాలి. 447 00:32:25,028 --> 00:32:27,030 నిన్ను చూసి నేను ఈర్ష్య పడేదాన్ని. 448 00:32:27,781 --> 00:32:30,409 నీలాంటి కూతురు ఉంటే బాగుండు అని ఆయన కోరుకునేవాడేమో అనుకునేదాన్ని. 449 00:32:30,492 --> 00:32:33,453 అలాగే చార్లీ నీపై కూడా చాలా గర్వపడేవాడు. 450 00:32:34,037 --> 00:32:36,707 తెలుసా, నేను విన్న దాన్ని బట్టి ఎన్నో కంపెనీల సీఈఓలు తమ ఉద్యోగాన్ని 451 00:32:36,790 --> 00:32:38,375 ఒక పెద్ద ఆయిల్ టాంకర్ ని నడపడంతో పోల్చుకుంటుంటారు. 452 00:32:38,458 --> 00:32:42,254 అనుకున్నట్టే, నువ్వు కూడా సరిగ్గా అలాగే పని చేసేదానివి. 453 00:32:43,088 --> 00:32:45,215 కానీ సంస్థ రహస్యాలు అన్నీ తెలిసిన వ్యక్తివి నువ్వే. 454 00:32:47,551 --> 00:32:50,262 నువ్వు రాయబారి పదవి గురించి మాట్లాడడానికి పిలిచావేమో అని ఆశించా. 455 00:32:50,345 --> 00:32:51,638 ఎరిక్ క్రెస్వెల్ అంటే ఎవరు? 456 00:32:51,722 --> 00:32:53,182 నా దగ్గర అన్ని సమాధానాలు లేవు, ఏమీ. 457 00:32:53,265 --> 00:32:57,477 పరిస్థితి ఎంత దారుణంగా కాగలదో నాకు తెలుసు. నేను ఇంకా చిన్న పిల్లని కాదు. 458 00:32:57,978 --> 00:32:59,730 చార్లీ నీకు ఏమేమి చెప్పాడు? 459 00:32:59,813 --> 00:33:02,274 ఐఓపి ఎనర్జీ కంపెనీ పగ్గాలు నా చేతికి చిక్కాక, కంపెనీని నడిపించడానికి 460 00:33:02,357 --> 00:33:05,652 నాన్న నాకు ఎంత వరకు తెలియాలో అంతే చెప్తాను అన్నారు. 461 00:33:05,736 --> 00:33:08,655 అప్పుడైతే అవసరమైనప్పుడు ఎలాంటి లీగల్ విషయాలలో నా ప్రమేయం లేదని నిరూపించగలమని. 462 00:33:09,489 --> 00:33:11,158 ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చి ఉంటారో ఏమో. 463 00:33:12,993 --> 00:33:15,746 కానీ అసలు నిజం ఏది ఏమైనా బయటకు రాకూడదు అని మాత్రం 464 00:33:15,829 --> 00:33:17,581 నాకు బాగా తెలుసు. 465 00:33:17,664 --> 00:33:19,499 అయితే తెలియాల్సిందల్లా నీకు తెలుసు కదా. 466 00:33:20,083 --> 00:33:24,213 నేను బిజినెస్ ని పరిశుభ్రమైన శక్తి వనరుల వైపు తిప్పడానికి చెమటోడ్చాను, క్యాథెరిన్. 467 00:33:24,296 --> 00:33:25,756 పునరుత్పాదక వనరులు, నైతిక విధానాలను స్థాపించాను. 468 00:33:25,839 --> 00:33:28,342 ఈ సమయంలో పేరు పోగొట్టుకోవడం చాలా పెద్ద సమస్య అవుతుంది. 469 00:33:30,552 --> 00:33:32,638 మా నాన్న నీ మొట్టమొదటి క్లయింట్. 470 00:33:33,180 --> 00:33:35,057 అందుకు ఎంతగా రుణపడి ఉన్నానో నాకు గుర్తు చేయనవసరం లేదు. 471 00:33:35,140 --> 00:33:39,770 అలాగే నీ విశ్వాసం ఎంత గొప్పదో, నీకు లియో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 472 00:33:42,439 --> 00:33:44,608 ఏ చింతా వద్దు అని చార్లీకి చెప్పు. 473 00:33:45,317 --> 00:33:48,403 మేము ఎరిక్ క్రెస్వెల్ ని, అలాగే లియోని కూడా కనిపెడతాం. 474 00:33:48,487 --> 00:33:51,365 ఎప్పటిలాగే ఈ పరిస్థితిని కూడా చక్కబెడతాము. అదేకదా మా పని. 475 00:33:53,992 --> 00:33:55,077 అలా జరగాలనే నేను ఆశిస్తున్నాను. 476 00:34:06,129 --> 00:34:08,130 మనం ఎక్కడ షాపింగ్ చేయాలో నువ్వే ఎలా నిర్ణయించేసావు? 477 00:34:10,175 --> 00:34:11,385 నేను చండాలంగా ఉన్నాను. 478 00:34:15,222 --> 00:34:17,139 నాట్, హాయ్. నాట్. 479 00:34:18,100 --> 00:34:19,726 నేను నిన్ను దాదాపు గుర్తుపట్టలేకపోయా. 480 00:34:19,810 --> 00:34:21,186 అందుకే కదా ఇలా తయారైంది? 481 00:34:23,522 --> 00:34:25,357 - ఎక్కడికి వెళ్ళావు? - షాపింగ్ చేయడానికి. 482 00:34:26,567 --> 00:34:27,818 నువ్వు? 483 00:34:28,485 --> 00:34:29,820 నేను కూడా అదే చేశా. 484 00:34:31,237 --> 00:34:32,822 నువ్వు రావేమో అనుకున్నాను. 485 00:34:33,657 --> 00:34:36,368 నేను ఆర్2-డి2 ని కదా. నా అవసరం మీకుంది. 486 00:34:39,996 --> 00:34:42,081 - టారా గురించి ఏమైనా తెలిసిందా? - లేదు. 487 00:34:45,002 --> 00:34:47,504 సరే, బట్టల విషయంలో నేనేం చేయలేకపోయా, 488 00:34:47,588 --> 00:34:49,630 కనీసం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తావా? 489 00:34:49,715 --> 00:34:51,550 ఈ పార్కులో సెక్యూరిటీ కెమెరాలు లేవు. 490 00:34:51,632 --> 00:34:53,217 అందుకే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాను. 491 00:35:00,225 --> 00:35:01,602 బాగానే ఉన్నారా? 492 00:35:01,685 --> 00:35:04,354 - నేనేం మాట్లాడదలచుకోలేదు. - కంప్యూటర్ ని నాశనం చేసావా? 493 00:35:05,230 --> 00:35:06,356 ఇదేనా నువ్వు చెప్పదలచుకున్నది? 494 00:35:07,357 --> 00:35:09,193 ఆ డబ్బును తియ్యడానికి తను ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? 495 00:35:09,276 --> 00:35:10,986 ఒక పొలాన్నే నిర్మించాల్సి వచ్చింది. 496 00:35:12,154 --> 00:35:15,240 నేను పదింటికి కలవమన్నాను. ఇంకొక వ్యక్తి ఎక్కడ? 497 00:35:15,824 --> 00:35:18,368 ఏమో. లండన్ రాకముందే ట్రైన్ దిగి వెళ్ళిపోయింది. 498 00:35:19,995 --> 00:35:22,497 సరే, త్వరగా పని పూర్తి చేయాలి. టేబుల్ క్రింద నుంచి ఇస్తా. 499 00:35:22,998 --> 00:35:25,584 పాస్ పోర్టులు, టికెట్లు, క్యాష్. 500 00:35:25,667 --> 00:35:27,794 రాత్రికి చవకైన హోటల్ లో ఉండడానికి ఖర్చు చేయండి. 501 00:35:27,878 --> 00:35:29,254 వేర్వేరుగా విమానాల్లో ప్రయాణం చేయాలి. 502 00:35:29,755 --> 00:35:32,883 రేపు ఉదయం, ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం 10 గంటలకు కలవాలి. 503 00:35:34,259 --> 00:35:36,094 వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ దగ్గర. 504 00:35:36,178 --> 00:35:37,721 నేను రేక్యావిక్ విమానంలో రావాలా? 505 00:35:37,804 --> 00:35:41,058 మనం మూడు మార్గాలలో, వేర్వేరు విమానాశ్రయాల నుంచి ప్రయాణించబోతున్నాం. 506 00:35:41,141 --> 00:35:42,643 తను వచ్చింది. 507 00:35:43,769 --> 00:35:46,063 వావ్. మీరు ఏ పనైనా సమయానికి చేస్తారా? 508 00:35:46,146 --> 00:35:48,524 టారా, ఎక్కడికి వెళ్ళావు? 509 00:35:48,607 --> 00:35:50,025 మీరిద్దరూ ఇక వెళ్ళాలి. 510 00:36:00,410 --> 00:36:02,204 నాకేం చెప్పనవసరం లేదు, నేను నీతోనే ఉంటా. 511 00:36:03,497 --> 00:36:05,290 నేను నీతో మాట్లాడాలి. 512 00:36:05,374 --> 00:36:08,001 అలా దూరంగా వెళ్ళు. కనిపించేంత దూరమే. 513 00:36:12,464 --> 00:36:14,925 బ్లాక్ కాఫీ ఇవ్వండి. ఆ పాత... 514 00:36:15,676 --> 00:36:17,678 నేను నిన్ను మోసం చేయనని స్వయంగా 515 00:36:17,761 --> 00:36:19,179 చెప్తే నమ్ముతావేమో అని వచ్చా. 516 00:36:23,225 --> 00:36:25,018 నేను మీతో రాలేను. 517 00:36:27,354 --> 00:36:28,355 డైసీ ఎలా ఉంది? 518 00:36:30,691 --> 00:36:32,943 - నేను వెళ్తానని నీకు తెలుసు. - అవును, మీరంతా వెళ్తారని తెలుసు. 519 00:36:33,026 --> 00:36:34,903 జాగ్రత్తగా ఉంటే చాలని అలా చెప్పా. 520 00:36:36,947 --> 00:36:38,574 నేను ఇది చేయగలనేమో అనుకున్నాను. 521 00:36:39,867 --> 00:36:41,660 తనను వదిలి వచ్చే బలం నాకు ఉంది అనుకున్నాను... 522 00:36:44,413 --> 00:36:47,791 నాకు ఏడేళ్ల వయసులో, ముసుగు వేసుకున్న కొంత మంది మా 523 00:36:48,625 --> 00:36:51,211 నాన్నను బ్రిటిషు వారికి సమాచారం అందిస్తున్నాడని ఆరోపించి తీసుకెళ్లారు. 524 00:36:52,462 --> 00:36:54,464 వాళ్ళు ఆయన ముందు రెండు మార్గాలు పెట్టారు. 525 00:36:55,465 --> 00:36:57,259 నిజం ఒప్పుకుంటే, కాలికి తుపాకీ గుండు. 526 00:36:57,342 --> 00:36:59,094 లేదంటే చావు. 527 00:37:01,638 --> 00:37:02,806 ఆయన నిజం ఒప్పుకోలేదు. 528 00:37:02,890 --> 00:37:07,686 అందుకు గాను నేను ఎన్నో ఏళ్ళు ఆయనపై కోపంతో రగిలిపోయాను. 529 00:37:09,271 --> 00:37:11,690 కానీ చానాళ్ల తర్వాత, ఆయన నాకు మార్గదర్శకంగా అలా చేసారని తెలిసింది. 530 00:37:12,274 --> 00:37:15,110 నీ బిడ్డకు అది చూపిస్తే, ఇంకేం ఇవ్వాల్సిన పని లేదు. 531 00:37:17,696 --> 00:37:20,824 ఇక బ్రతకడం నా వల్ల కాదని వాడి అమ్మ అనుకున్నా వాడు బ్రతికేయగలడు. 532 00:37:22,784 --> 00:37:24,119 ఆమె ఆత్మహత్య చేసుకుంది. 533 00:37:24,786 --> 00:37:26,330 మరి నీ సంగతి ఏమైంది? 534 00:37:26,413 --> 00:37:28,332 నేను మా తాతయ్యతో ఉన్నాను. 535 00:37:29,166 --> 00:37:31,585 ఆర్మీ, అంటే బ్రిటిషు ఆర్మీలో చేరి, 536 00:37:31,668 --> 00:37:33,378 దీనంతటికి కారణమైన వారిపై పగ తీర్చుకొనే వరకు. 537 00:37:35,088 --> 00:37:38,550 నాకు నేనే ఒక ఉదాహరణగా నిలిచాను. 538 00:37:42,012 --> 00:37:44,556 ఆ కుర్రాడి పై కన్నేసి ఉంచడానికి నాకు నువ్వు కావాలి. 539 00:37:48,393 --> 00:37:50,687 ఎయిర్ పోర్ట్ లో నీకు బట్టలు కొంటాను. పదా. 540 00:37:59,571 --> 00:38:01,240 సెంట్రల్ లండన్ కి ట్రైన్లు 541 00:38:12,251 --> 00:38:16,296 లండన్ సిటీ ఎయిర్పోర్ట్ 542 00:38:56,211 --> 00:38:58,005 - మనం తిరిగి పని మొదలుపెట్టాలి. - అవును. 543 00:39:00,632 --> 00:39:01,633 థాంక్స్. 544 00:39:03,802 --> 00:39:05,429 హే, నువ్వు ఎక్కడ పని చేసావు? 545 00:39:06,180 --> 00:39:07,598 - ఏమన్నావు? - ఇందాక ఎయిర్ ఫీల్డ్ లో, 546 00:39:07,681 --> 00:39:08,974 నువ్వు మాజీ సైనికురాలిని అన్నావు కదా? 547 00:39:10,058 --> 00:39:13,103 రాయల్ మిలటరీ పొలీసు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్. 548 00:39:13,812 --> 00:39:16,315 నువ్వు ఈ పనిని చాలా సార్లు చేసావని చెప్పగలను. 549 00:39:16,398 --> 00:39:17,900 చాలా బాగా హ్యాండిల్ చేసావు. 550 00:39:18,817 --> 00:39:21,278 ఇలా చేయడం మరీ అలవాటైపోతుందేమో అనుకున్నాను, కానీ, 551 00:39:22,237 --> 00:39:23,530 అలా కాలేదు. 552 00:39:23,614 --> 00:39:26,325 లేదు. చివరి సారి నేను చెప్పాల్సినప్పుడు ఒక తల్లికి తన 553 00:39:26,408 --> 00:39:28,493 పన్నెండేళ్ల బిడ్డ ఇక తిరిగి రాడని చెప్పాల్సి వచ్చింది. 554 00:39:29,494 --> 00:39:30,662 అది డెన్వర్ కేసు విషయంలోనా? 555 00:39:31,872 --> 00:39:33,874 నువ్వు ఇక్కడికి రాకముందు ఆ కేసును చదివాను. 556 00:39:35,792 --> 00:39:37,586 నువ్వు నన్ను ఎందుకు నమ్మవో నాకు ఇప్పుడు అర్థమైంది. 557 00:39:37,669 --> 00:39:41,381 - లేదు. అదేం కాదు. - నిజమే, అది నా తప్పే. మాకు వాడు దొరికాడు. 558 00:39:42,591 --> 00:39:44,218 కానీ నేనే పోనిచ్చాను. 559 00:39:45,219 --> 00:39:46,345 నన్ను క్షమించు. 560 00:39:46,428 --> 00:39:49,348 కానీ మోనిక్ చావుకు బాధ్యత నీది కాదు అని నేను చెప్తున్నా చూడు, 561 00:39:49,431 --> 00:39:51,308 నాకు తెలుసు కాబట్టే అంటున్నాను. 562 00:39:54,228 --> 00:39:56,021 స్కాట్, నేను నీకు ఒకటి చెప్పాలి. 563 00:39:56,939 --> 00:39:58,148 క్షమించు. 564 00:39:59,650 --> 00:40:00,776 ఆదేష్ చోప్రా. 565 00:40:01,360 --> 00:40:02,945 లండన్ స్టాన్ స్టెడ్ ఎయిర్పోర్ట్ కి స్వాగతం 566 00:40:03,028 --> 00:40:06,365 వావ్, చాలా బాగా రెడీ అయ్యాడు. అది కచ్చితంగా వాడే, అవునా? 567 00:40:06,448 --> 00:40:07,533 అవును. 568 00:40:08,158 --> 00:40:09,535 స్టాన్ స్టెడ్. 569 00:40:10,035 --> 00:40:13,038 అంటే, వీడు విమానం ఎక్కుతున్నాడు అంటే, మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తుంటారు. 570 00:40:13,830 --> 00:40:15,374 ఇప్పడు ఏం చేయాలని అనుకుంటున్నావు? 571 00:40:16,959 --> 00:40:18,293 ఏంటి? 572 00:40:18,377 --> 00:40:20,170 అమ్మా, నేను పెద్దగా మాట్లాడలేను. 573 00:40:20,254 --> 00:40:22,965 కానీ నా గురించి చింతించకు అని చెప్పడానికి ఫోన్ చేశాను. 574 00:40:23,048 --> 00:40:24,049 నాకేం కాలేదు. 575 00:40:24,967 --> 00:40:27,469 నేను ఫ్రెండ్స్ తో కాస్త బయటకు వెళ్తున్నా, కాబట్టి కొన్నాళ్ళు ఫోన్ చేయకపోవచ్చు. 576 00:40:27,553 --> 00:40:30,055 కానీ అప్పుడప్పుడు సంప్రదిస్తాను. నన్ను నమ్ము. సరేనా? 577 00:40:30,556 --> 00:40:31,849 ఐ లవ్ యు. బాయ్. 578 00:40:32,516 --> 00:40:35,727 అది... ఎడ్డీ వాకర్. 579 00:40:37,938 --> 00:40:40,274 అసలు పేరు లియమ్ మెకెన్న. 580 00:40:40,357 --> 00:40:41,650 ఫోన్ చేసిన వ్యక్తి మెకేన్నా, లియమ్ 581 00:40:41,733 --> 00:40:43,277 వీడిని మా డ్రగ్ స్క్వాడ్ నుంచి తీసుకున్నాం. 582 00:40:44,027 --> 00:40:47,781 మంచి ప్రతిభ ఉన్నోడే, కానీ అనుభవం తక్కువ. కొన్ని చిన్నా, చితకా కేసుల మీద పని చేసాడు, 583 00:40:47,865 --> 00:40:50,325 కానీ ఈ పనికి సరైన వాడు. 584 00:40:50,409 --> 00:40:52,744 - అయిపోవచ్చింది. - ఆ ముఠాలోకి చేరి, 585 00:40:52,828 --> 00:40:56,707 ఎవరు అసలైన దోషో కనుగొని, వీలైతే లియో ఆచూకీ తెలుసుకోవడమే వీడి పని. 586 00:40:59,293 --> 00:41:02,504 ఇదంతా నీ పనా? వీడి అరెస్ట్? ఆ ఇంటర్వ్యూ? 587 00:41:04,590 --> 00:41:06,133 ఇవన్నీ నాకు చెప్పేంత నమ్మకం కూడా లేదా? 588 00:41:06,216 --> 00:41:08,969 లిడియా తొమ్ప్సన్ వచ్చినప్పుడే వీడి నుంచి సందేశం అందింది. 589 00:41:10,053 --> 00:41:12,556 వీడి దగ్గర ఫోన్ ఉంది, కానీ వీడిపై కన్నేసి ఉంచారు. 590 00:41:12,639 --> 00:41:15,809 వీడి సందేశం ప్రకారం, అంతా అనుకున్నట్టే జరుగుతుందని తెలుస్తుంది. 591 00:41:16,685 --> 00:41:19,646 కానీ మా అంచనా ప్రకారం వీళ్ళు దేశం వదిలి వెళ్తారని ఊహించలేదు. 592 00:41:20,147 --> 00:41:22,316 వీళ్ళ విమానాలు ఎగిరిన వెంటనే, ఎన్.సి.ఏ చట్ట పరిధిలో ఇక ఉండరు. 593 00:41:23,734 --> 00:41:25,360 కాబట్టి వీళ్ళను ఇప్పుడు పోనిస్తే... 594 00:41:26,028 --> 00:41:27,070 వీళ్ళను పోనిస్తే? 595 00:41:27,654 --> 00:41:29,156 ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. 596 00:41:31,325 --> 00:41:33,327 సెక్యూరిటీ చెక్ కి సిద్ధం అవ్వండి 597 00:41:33,410 --> 00:41:37,372 దయచేసి పాస్ పోర్టులు చూపండి. బోర్డింగ్ పాస్ కూడా. 598 00:41:54,264 --> 00:41:55,265 పాస్ పోర్టు. 599 00:42:27,464 --> 00:42:28,799 సరే. అర్థమైంది. 600 00:42:37,891 --> 00:42:40,310 సరే, ఆగండి. నాకు అర్థమైంది ఒకసారి చెప్తాను. 601 00:42:41,019 --> 00:42:44,773 మీరు మన నలుగురు కిడ్నాపర్లు, లేదా ఉగ్రవాదులను కనిపెట్టారు, 602 00:42:45,482 --> 00:42:48,193 వారిలో ఒకడు చాలా హత్యలు చేసిన వాడని మనకు ముందే తెలుసు, 603 00:42:48,277 --> 00:42:50,654 అయినా వాళ్ళను యూకే నుండి బయటకు వెళ్ళడానికి ఒప్పుకున్నారు, 604 00:42:50,737 --> 00:42:52,406 ఇప్పుడు అంతా అమెరికా వెళ్తున్నారు. 605 00:42:52,489 --> 00:42:55,200 అలాగే, ఒకసారి వాళ్ళు ఇక్కడ దిగిన తర్వాత, వాళ్ళను పారిపోనివ్వడమే మన ప్లాన్ అంటారు. 606 00:42:55,784 --> 00:42:57,870 కానీ వాళ్ళ బ్యాగులలో మీరు ట్రాకర్లు పెట్టడమే కాకుండా 607 00:42:57,953 --> 00:43:00,080 చాలీ చాలని అనుభవం ఉన్న ఒకడు మన మనిషి 608 00:43:00,163 --> 00:43:02,708 ఆన్ చేస్తేనే గాని పని చేయని ట్రాకర్ ఉన్న ఒక సెల్ ఫోన్ తో 609 00:43:02,791 --> 00:43:05,169 వాళ్లతో ప్రయాణిస్తున్నాడు కాబట్టి 610 00:43:05,252 --> 00:43:06,962 మనం ఏం కంగారు పడకుండా ఉండాలి అంటారు. 611 00:43:07,045 --> 00:43:08,463 ఇంకా ఏమైనా మిస్ అయ్యానా? 612 00:43:09,173 --> 00:43:12,384 చెప్పాలంటే, అవును. టిల్సన్ కి ఇప్పటికే అనుమానం వచ్చి ఉంటుంది. 613 00:43:12,885 --> 00:43:15,262 వాళ్లపై నిఘా పెడితే క్షణంలో వాడు కనిపెట్టగలడు. 614 00:43:15,345 --> 00:43:18,348 - స్కాట్, నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు. - ఇది రిస్క్ అని తెలుసు, సార్. 615 00:43:18,432 --> 00:43:20,100 ఉద్యోగాలనే పోగొట్టుకునేంత రిస్క్. 616 00:43:20,184 --> 00:43:23,020 కానీ వాళ్ళు తీసుకుంటున్న రిస్క్ ని కూడా చూడండి. మళ్ళీ న్యూ యార్క్ ఎందుకు వెళ్ళాలి? 617 00:43:23,520 --> 00:43:26,064 వాళ్ళు తింగరోళ్ళు కాదు, కాబట్టి ఏదో ఒక మంచి కారణం ఉండి ఉంటుంది. 618 00:43:26,148 --> 00:43:29,735 కావాలంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయగలం. కానీ లియో విషయంలో మనకు ఏమీ తెలీదు. 619 00:43:29,818 --> 00:43:30,861 ఓరి, నాయనో. 620 00:43:30,944 --> 00:43:34,156 న్యూ యార్క్ లో, లండన్ లో ఉన్నన్ని పబ్లిక్ కెమెరాలు ఉండవని నాకు తెలుసు 621 00:43:34,239 --> 00:43:36,325 కానీ మేము వాళ్లపై నిఘా వేసే ఉంచుతాం. 622 00:43:36,408 --> 00:43:39,161 అలాగే, సర్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం తెలుసుకోవాలి. 623 00:43:58,430 --> 00:43:59,681 కాస్త తాజా గాలి కావాలనిపించింది. 624 00:44:00,933 --> 00:44:02,267 అవును, నాకు కూడా. 625 00:45:11,503 --> 00:45:13,714 జమాల్ బ్రౌన్ సులభంగా రెండు పాయింట్లు సంపాదించాడు. 626 00:45:13,797 --> 00:45:15,757 ఈ ఫస్ట్ హాఫ్ లో ఇది రెండవ సారి. 627 00:45:16,717 --> 00:45:18,051 పేరోస్ బ్రాడ్లికి వేగంగా బాల్ వేసాడు. 628 00:45:18,135 --> 00:45:20,470 బ్రాడ్లి తిరిగి పేరోసికి ఇచ్చాడు. ఆ కిందకి ఒక వ్యక్తి ఉన్నాడు. 629 00:45:20,554 --> 00:45:23,724 అతని వెనక గోల్ ఉంది. చూడకుండానే బాల్ గోల్ లో వేసాడు. 630 00:45:23,807 --> 00:45:25,767 పదునాలుగవ స్లాం డంక్. 631 00:45:25,851 --> 00:45:27,853 మరీస్ విల్సన్. అద్భుతంగా ఆడాడు. 632 00:45:27,936 --> 00:45:32,274 ఐస్బెర్గ్స్ 58-56. వాళ్ళు వాటన్నిటిని మళ్ళీ గోల్ చేశారు. 633 00:45:32,357 --> 00:45:34,026 వాడితో నువ్వు పడుకుంటావా లేక నేను పడుకోవాలా? 634 00:45:34,109 --> 00:45:35,277 నువ్వే పడుకో. 635 00:46:22,157 --> 00:46:23,700 ఉదయం కలుద్దాం. 636 00:46:26,495 --> 00:46:28,080 చాలా పనులు ఉన్నాయి. 637 00:48:11,308 --> 00:48:12,476 అంతా సిద్ధమా? 638 00:49:19,501 --> 00:49:21,503 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్