1 00:00:12,012 --> 00:00:14,723 ఎవరూ ఊహించని విధంగా, సెనేట్ న్యాయశాఖ సభ్యుల కమిటీ సదస్సు 2 00:00:14,806 --> 00:00:18,227 జరుగుతుండగా, మన దేశ పౌరసంబంధాల వ్యవహారాల దిగ్గజమైన 3 00:00:18,310 --> 00:00:20,354 క్యాథెరిన్ న్యూమ్యాన్ కొడుకును తామే కిడ్నాప్ చేశామంటూ 4 00:00:20,437 --> 00:00:23,565 సంచలనాత్మకంగా హ్యాక్ చేసి కొందరు వెల్లడిపరచారు. 5 00:00:23,649 --> 00:00:25,359 శ్రీమతి న్యూమ్యాన్ అప్పటికే యూకేకి 6 00:00:25,442 --> 00:00:28,320 అమెరికా దేశ రాయబారిగా రాష్ట్రపతి ఆమోదం పొందడానికి తుది సన్నాహాలు చేసుకుంటున్నారు. 7 00:00:28,403 --> 00:00:31,240 నిజం చెప్పు, క్యాథెరిన్, 8 00:00:31,323 --> 00:00:35,035 లేదా ప్రపంచమంతా చూస్తుండగా నీ కొడుకు చావాల్సి ఉంటుంది. 9 00:00:35,118 --> 00:00:37,287 కిడ్నాప్ చేయబడిన ఆమె బిడ్డను 10 00:00:37,371 --> 00:00:40,040 విడిపించేందుకు గాను, ఆమెను "నిజం చెప్పమని" 11 00:00:40,123 --> 00:00:41,792 కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. 12 00:00:42,376 --> 00:00:46,880 ...ఆ షాకింగ్ వీడియో మరియు అసాధారణమైన డిమాండ్ మాత్రమే. 13 00:00:46,964 --> 00:00:50,425 అందులో, లియో వాళ్ళ అమ్మ, మరియు కూపర్ న్యూమ్యాన్ పిఆర్ సంస్థకు అధినేత్రి, 14 00:00:50,509 --> 00:00:52,386 క్యాథెరిన్ న్యూమ్యాన్ ని "నిజం చెప్పమని" డిమాండ్ చేశారు. 15 00:00:52,469 --> 00:00:54,930 ...కూపర్ న్యూమ్యాన్ పిఆర్ సంస్థ అధినేత్రి చివరాఖరికి యూకేకి 16 00:00:55,013 --> 00:00:57,057 రాయబారిగా అధ్యక్షుని ఆమెదాన్ని పొందారు. 17 00:00:57,140 --> 00:00:59,977 ...ఆ అప్రసిద్ధమైన ఫోటోలలో మీరు చూస్తున్న విధంగా 18 00:01:00,060 --> 00:01:01,979 ఇక్కడే లియో న్యూమ్యాన్ చివరిగా కనిపించారు. 19 00:01:02,062 --> 00:01:04,857 ఈ విషయమై క్యాథెరిన్ న్యూమ్యాన్ గారు ఇంకా స్పందించాల్సి ఉండగా 20 00:01:04,940 --> 00:01:08,151 సోషల్ మీడియాలో మాత్రం అనేక కథనాలు స్వయం విహారం చేస్తున్నాయి. 21 00:01:08,235 --> 00:01:12,990 "నిజం చెప్పు" ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది. ఆ హ్యాష్ ట్యాగ్ లా కనిపించే లోగోను 22 00:01:13,073 --> 00:01:15,742 కార్పొరేట్ సంస్థల అవినీతిని ఎత్తి చూపడానికి ప్రపంచమంతటా ప్రజలు 23 00:01:15,826 --> 00:01:17,786 ఉపయోగిస్తున్నారు. 24 00:01:52,654 --> 00:01:53,780 'ఫాల్స్ ఫ్లాగ్' అనే సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 25 00:01:53,864 --> 00:01:55,407 అమిత్ కోహెన్ - మరియా ఫెల్డ్ మ్యాన్ సృష్టి 26 00:02:17,346 --> 00:02:20,140 ...ప్రజా సంబంధాల సంస్థ కూపర్ న్యూమ్యాన్ యొక్క క్లయింట్లు 27 00:02:20,224 --> 00:02:23,810 "నిజం చెప్పమని" ఒత్తిడి చేస్తున్నారు. 28 00:02:23,894 --> 00:02:26,563 కూపర్ న్యూమ్యాన్ పిఆర్ వారు క్యాథెరిన్ న్యూమ్యాన్ కొడుకు... 29 00:02:26,647 --> 00:02:28,649 పెళ్లి నుండి పారిపోతున్నావా, పెళ్ళికి వెళ్తున్నావా? 30 00:02:28,732 --> 00:02:31,818 ...లియో న్యూమ్యాన్ విడిపింపుపై ఇంకా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. 31 00:02:31,902 --> 00:02:34,696 అమెరికా సంయుక్త రాష్ట్రాల సెనేట్ కమిటీ సమావేశంలో 32 00:02:34,780 --> 00:02:36,949 సంచలనాత్మకంగా ప్రసారం చేయబడిన ఆ వీడియోలో 33 00:02:37,032 --> 00:02:41,537 రాయబార అభ్యర్థి అయిన శ్రీమతి న్యూమ్యాన్ గారిని "నిజం చెప్పమని" డిమాండ్ చేశారు. 34 00:02:41,620 --> 00:02:45,791 మరో గంటలో, ఎఫ్.బి.ఐ వారు న్యూ యార్క్ లో ఒక న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారని 35 00:02:45,874 --> 00:02:46,875 విశ్వసనీయ వర్గాల సమాచారం. 36 00:02:46,959 --> 00:02:48,377 టి.ఎల్.ఎఫ్ ట్యాక్సీ క్యాబ్ 37 00:02:54,258 --> 00:02:55,717 హే, అది మొదలవుతుంది! 38 00:02:55,801 --> 00:02:57,594 అతన్ని మిడ్ టౌన్, మాన్హాటన్ లో పార్క్ మాడిసన్ హోటల్ 39 00:02:57,678 --> 00:02:59,930 నుండి కిడ్నాప్ చేశారు, ఇప్పటికీ అతని ఆచూకీ తెలీలేదు. 40 00:03:00,472 --> 00:03:04,393 ఆ కుర్రాడు ప్రాణాలతో ఉన్నాడని ధృవీకరించి, ప్రాణాలకు బదులు డిమాండ్లు చేశారు కాబట్టి, 41 00:03:04,476 --> 00:03:07,354 దీన్ని అపహరణ కేసుగా కాకుండా కిడ్నాప్ కేసుగా పరిగణించి 42 00:03:07,437 --> 00:03:09,064 ఆ విధంగానే దర్యాప్తు జరుపుతాము. 43 00:03:09,147 --> 00:03:12,526 వీలైతే "నిజం చెప్పు" అన్న డిమాండ్ ని... 44 00:03:12,609 --> 00:03:13,902 బ్రేకింగ్ న్యూస్ లియో న్యూమ్యాన్ కిడ్నాప్ 45 00:03:13,986 --> 00:03:16,488 ...కాస్త వివరంగా వర్ణించమని కిడ్నాపర్లను అడుగుతున్నాం. 46 00:03:16,572 --> 00:03:18,490 - అలా అడగడం ప్రమాదకరం. - ఇప్పటికైతే ఇతర వ్యాఖ్యలు... 47 00:03:18,574 --> 00:03:20,909 నా అనుభవంలో, సాధారణంగా డబ్బు, వస్తు రూపంలోని డిమాండ్లు చేయని 48 00:03:20,993 --> 00:03:23,203 కిడ్నాపర్లు మనం వాళ్ళతో చర్చించేకొద్దీ ఇంకా ఇంకా డిమాండ్ చేస్తారని తెలుసుకున్నా. 49 00:03:23,287 --> 00:03:26,081 అయితే, మనం ఎలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నామో ఎలా తెలుసుకోగలం? 50 00:03:26,164 --> 00:03:29,251 అలాగే, ఈ వ్యక్తిని గనుక ఎవరైనా చూసి ఉంటే వెంటనే 51 00:03:29,334 --> 00:03:31,795 - పోలీసులను సంప్రదించమని అడుగుతున్నాం. - ఏంటిది? 52 00:03:32,337 --> 00:03:37,009 ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని నేరుగా ఎదుర్కొకండి. ఇతను చాలా ప్రమాదకరమైనవాడు. 53 00:03:37,092 --> 00:03:39,761 ఇతను ప్రస్తుతం యూరోప్ లో ఉండి ఉండొచ్చు. కానీ తరచూ దేశాలు మారుతుంటాడు, 54 00:03:39,845 --> 00:03:42,306 ప్రస్తుతం షాన్ టిల్సన్ అనే మారుపేరుతో చలామణి అవుతున్నాడని భావిస్తున్నాం. 55 00:03:42,389 --> 00:03:44,725 - దీని గురించి మీకు తెలుసా? - మనం టిల్సన్ నుండి సమాచారం రాబట్టాలి. 56 00:03:44,808 --> 00:03:46,810 వారు అన్న ఈ "నిజం" రాయబారి పదవికి సంబంధించిందా? 57 00:03:46,894 --> 00:03:49,730 యూకేలో కొంత మందిని అరెస్ట్ చేశారన్నది నిజమేనా? 58 00:03:49,813 --> 00:03:52,691 ఆన్లైన్ కథనాలపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. 59 00:03:52,774 --> 00:03:56,320 కాకపోతే, ప్రస్తుతం యూకే ప్రభుత్వంతో కలిసి కొంత మంది విషయంలో 60 00:03:56,403 --> 00:03:58,822 - దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పగలను. - సరే, నాకు ఆ విషయం తెలీదు. 61 00:03:58,906 --> 00:04:00,866 ఇలా చెప్తే నిఘా పెట్టి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. 62 00:04:00,949 --> 00:04:02,034 మనం కలిసి పని చేయాలి. 63 00:04:02,117 --> 00:04:04,703 మీ ద్వారా ప్రపంచానికి తెలీదు అనే కనీస నమ్మకం నాకు పుట్టకపోతే 64 00:04:04,786 --> 00:04:07,122 - ఏ విషయాన్నైనా మీకు నేనెందుకు చెప్తా? - అతను టిల్సన్ అని మాత్రమే అన్నాడు! 65 00:04:07,206 --> 00:04:09,416 కావచ్చు, కానీ ఇప్పుడు వారంతా జనం కంట కనబడకుండా పోతారు కదా? 66 00:04:10,083 --> 00:04:13,295 అనుమానితులను మిస్ అవనివ్వకండి! ఛ. 67 00:04:13,378 --> 00:04:17,216 ఇప్పుడు లియో గర్ల్ ఫ్రెండ్, ఎరిన్ టోరెన్స్, మాట్లాడుతుంది. 68 00:04:18,382 --> 00:04:21,887 ఎవరికైనా ఏమైనా తెలిసినా, లేదా ఎక్కడైనా ఏమైనా చూసినా 69 00:04:22,804 --> 00:04:24,806 దయచేసి అధికారులకు తెలపండి. 70 00:04:25,766 --> 00:04:27,017 మాకు లియో కావాలి. 71 00:04:27,100 --> 00:04:29,394 నార్త్ హాల్ట్ 72 00:04:29,478 --> 00:04:31,688 లైవ్ సీసీటీవీ సర్వేలెన్స్ 73 00:04:31,772 --> 00:04:33,982 ఆదేష్ చోప్రా 74 00:04:34,066 --> 00:04:35,234 వాళ్ళు బ్రిటిషు వారిని అరెస్ట్ చేశారా? చివరి రోజులు అనుకుంట. 75 00:04:35,317 --> 00:04:36,693 ఏం నిజం? సూట్ కేసులో ఉన్న కురాడు లియో. 76 00:04:44,535 --> 00:04:46,411 టాంగో నాలుగు ఎదురుగా ఉంది 77 00:04:53,836 --> 00:04:55,879 లండన్ లో ఉన్నా. సూచనల కోసం ఎదురుచూడు 78 00:05:25,242 --> 00:05:26,743 ట్యాక్సీ 79 00:05:37,754 --> 00:05:38,797 అసలు ఏం జరిగింది? 80 00:05:38,881 --> 00:05:42,426 నా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. నన్ను క్షమించు. 81 00:05:44,219 --> 00:05:46,263 ఓరి, దేవుడా. మాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. 82 00:05:48,182 --> 00:05:50,934 ...కాస్త అతనికి, ఆహ్... నా దగ్గర... డబ్బులు లేవు. 83 00:05:51,018 --> 00:05:52,019 సరే. ఇస్తా. 84 00:05:53,770 --> 00:05:55,939 ఓహ్, అమ్మా. నన్ను క్షమించు. 85 00:05:56,023 --> 00:05:57,733 నువ్వు ఎందుకు క్షమించమని అంటున్నావు? 86 00:05:57,816 --> 00:06:00,235 - ఎంత? - ఇరవై పౌండ్లు, ధన్యవాదాలు. 87 00:06:00,319 --> 00:06:02,070 - ఏం పర్లేదు. - సరే. ఉంటా, మిత్రమా. 88 00:06:06,325 --> 00:06:07,659 నాకు అంతా చెప్పు. 89 00:06:08,535 --> 00:06:11,079 ఇప్పుడు నాతో అదంతా మళ్ళీ చెప్పించకండి. 90 00:06:11,163 --> 00:06:13,582 - ముందు బట్టలు మార్చుకుంటా. - సరే. 91 00:06:13,665 --> 00:06:15,167 అభినందనలు 92 00:06:21,590 --> 00:06:22,925 దేని కోసం చూస్తున్నావు? 93 00:06:25,052 --> 00:06:26,803 వాళ్ళు నా ఫోన్ తీసేసుకున్నారు. 94 00:06:26,887 --> 00:06:29,306 ఇక్కడ ఒకచోట పాత ఫోన్ ఒకటి ఉండాలి. 95 00:06:29,389 --> 00:06:30,390 ఇంకేమైనా ఉండాలా? 96 00:06:37,147 --> 00:06:38,148 అది ఎక్కడ పెట్టావు? 97 00:06:38,232 --> 00:06:39,441 ఏంటి? 98 00:06:39,525 --> 00:06:41,777 చెప్పు, మోన్. సీరియస్ గా అడుగుతున్నాను. ఎక్కడ పెట్టావు? 99 00:06:42,277 --> 00:06:43,403 ఏంటి పెట్టేది? అదేంటో చెప్పు. 100 00:06:46,031 --> 00:06:50,077 డబ్బులు, సరేనా? అవి నావి కాదు. ఇంకొకరివి నా దగ్గర ఉంచాను. 101 00:06:50,160 --> 00:06:51,703 ఇప్పుడు వాళ్లకవి కావాలి. 102 00:06:52,746 --> 00:06:55,290 "సూ... సూచనల కోసం ఎదురుచూడు." "సూచనలు" అంటే ఏమిటి? 103 00:06:56,208 --> 00:06:57,501 కొంపదీసి నువ్వేమీ రిప్లై ఇవ్వలేదుగా. 104 00:06:57,584 --> 00:06:59,545 లేదు. నేనేం రిప్లై ఇవ్వలేదు. 105 00:07:00,045 --> 00:07:02,089 ఇదంతా ఏంటి? దీనికి, న్యూ యార్క్ తో సంబంధం ఏంటి? 106 00:07:04,424 --> 00:07:06,385 - నేను చెప్పలేను, మోన్. - సరే. 107 00:07:06,468 --> 00:07:08,470 అయితే డబ్బు ఎక్కడ ఉందో నేను కూడా చెప్పలేను. 108 00:07:08,554 --> 00:07:09,721 నాకది ఇచ్చేయ్... 109 00:07:09,805 --> 00:07:10,931 - ఆమ్మో! - హే! 110 00:07:11,014 --> 00:07:12,724 నేను బట్టలు మార్చుకుంటున్నాను! 111 00:07:12,808 --> 00:07:16,311 అయితే? నేను ఈపాటికి నీ భర్తను అయి ఉండేవాడిని. 112 00:07:16,395 --> 00:07:19,022 - అంటే, మోన్ నాకు సహాయం చేస్తుంది. - లేదు, నేనేం చేయడం లేదు. 113 00:07:20,107 --> 00:07:23,443 మొత్తం నిజం చెప్పు. లేదంటే నేను తనకి చెప్పేస్తాను. 114 00:07:26,738 --> 00:07:28,156 ఇది నేనే కదా. 115 00:07:28,240 --> 00:07:29,533 అయితే, ఏం చేస్తున్నావు లోపల? 116 00:07:32,244 --> 00:07:35,372 ఇక్కడ కాదు. నన్ను మార్కెట్ లో కలువు. 117 00:07:36,415 --> 00:07:37,499 సరే. 118 00:07:46,300 --> 00:07:48,969 నేను కాస్త ఆలోచించుకోవాలి, కాబట్టి... 119 00:07:49,052 --> 00:07:51,346 నేను అర్థం చేసుకోగలను. కానీ మనం కాస్త మాట్లాడుకోవాలి. 120 00:07:52,014 --> 00:07:53,015 అవును. 121 00:07:53,557 --> 00:07:56,268 సరే, నాకు తెలుసు. నన్ను... నన్ను క్షమించు. 122 00:07:56,935 --> 00:07:58,312 నిన్న నీకు కూడా స్పెషల్ రోజు అని తెలుసు. 123 00:07:58,395 --> 00:08:01,940 పెళ్లి రద్దు చేయాలని నీకు ఉంటే నేను నిన్ను తప్పుబట్టను. 124 00:08:04,735 --> 00:08:06,195 నా సమస్య ఏంటో చెప్పనా... 125 00:08:07,362 --> 00:08:09,823 నువ్వు నిజంగానే ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఉన్నా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటాను. 126 00:08:20,375 --> 00:08:22,961 ఫ్లాట్ కి వెళ్ళు, నేను నిన్ను అక్కడ కలుస్తాను. 127 00:08:23,921 --> 00:08:26,465 అప్పుడు ఈ విషయం గురించి కూలంకషంగా మాట్లాడుకోవచ్చు. 128 00:08:26,548 --> 00:08:29,760 నాతో మాట్లాడాలి అనిపిస్తే, అప్పుడు, నా పాత ఫోన్ నంబర్ కి ఫోన్ చెయ్. 129 00:08:38,018 --> 00:08:39,394 వాళ్ళు ఇంతకీ ఏమేమి తీసుకున్నారు? 130 00:08:39,477 --> 00:08:40,854 ప్రతీ ఫోన్, ల్యాప్ టాప్, అన్నీను. 131 00:08:40,938 --> 00:08:44,024 - అవును. నా వీడియో గేమ్ కూడా పట్టుకుపోయారు. - వాళ్లు దేనికోసం సోదా చేసారో తెలుసా నీకు? 132 00:08:44,107 --> 00:08:45,359 లేదు. నాకెందుకు తెలుస్తుంది? 133 00:08:45,859 --> 00:08:46,944 వాళ్ళు ఏమీ చెప్పలేదా? 134 00:08:47,027 --> 00:08:48,362 - దేని గురించి? - నాకు కూడా తెలీదు. 135 00:08:49,238 --> 00:08:51,490 నాకు తెలీదు. సరేనా? నాకు ఏమీ తెలీదు. 136 00:08:52,574 --> 00:08:53,825 సోని. 137 00:08:56,537 --> 00:08:59,623 - నాకు ఏమీ తెలీదు. - వాళ్ళు ఇలా చేయలేరు. 138 00:08:59,706 --> 00:09:02,292 నిన్ను ఇలా కిడ్నాప్ చేసి ఒక క్రిమినల్ ని చేసి ఉండకూడదు. 139 00:09:02,376 --> 00:09:04,086 ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా నీ గురించే. 140 00:09:04,169 --> 00:09:05,462 ఛ. 141 00:09:05,546 --> 00:09:08,382 కానీ వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, లేదంటే నువ్వు ఇలా వచ్చి ఉండేవాడివి కాదు. 142 00:09:09,758 --> 00:09:10,759 అవునా? 143 00:09:11,260 --> 00:09:12,344 మనం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. 144 00:09:13,011 --> 00:09:14,012 దావా వేయొచ్చు, కదా? 145 00:09:14,096 --> 00:09:16,098 - అవును. పరిహారం పొందవచ్చు. - వద్దు. 146 00:09:17,266 --> 00:09:19,810 దానికి బదులు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. 147 00:09:19,893 --> 00:09:21,436 ఇప్పటికే జరిగింది చాలు, ఇంకేం వద్దు, సరేనా? 148 00:09:21,520 --> 00:09:23,313 ఏదో పొరపాటు జరిగింది. ఎవరికైనా ఇలా జరిగి ఉండొచ్చు. 149 00:09:23,397 --> 00:09:24,982 - అవును, అందులోనూ ఛామన ఛాయ ఉన్నారికే. - అవును. 150 00:09:25,065 --> 00:09:26,358 నాకెప్పుడూ ఇలా జరగలేదు. 151 00:09:26,441 --> 00:09:28,360 కష్టపడి, ఉన్న దాంట్లో తిని, తృప్తిచెందే వారికి 152 00:09:28,443 --> 00:09:30,362 ఇలాంటివి జరగవు. 153 00:09:40,914 --> 00:09:42,875 నాకు ఇవ్వడానికి మీ దగ్గర ఆ కంపెనీ షర్ట్ ఇంకా ఉందా? 154 00:09:51,592 --> 00:09:53,760 ...తక్షణమే పోలీసులను సంప్రదించండి. 155 00:09:53,844 --> 00:09:57,598 ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని నేరుగా ఎదుర్కొకండి. ఇతను చాలా ప్రమాదకరమైనవాడు. 156 00:09:57,681 --> 00:09:58,891 లియో న్యూమ్యాన్ కిడ్నాప్ 157 00:10:00,267 --> 00:10:03,020 ఇతను ప్రస్తుతం యూరోప్ లో ఉండి ఉండొచ్చు. కానీ తరచూ దేశాలు మారుతుంటాడు, 158 00:10:03,103 --> 00:10:05,522 ప్రస్తుతం షాన్ టిల్సన్ అనే మారుపేరుతో చలామణి అవుతున్నాడని భావిస్తున్నాం. 159 00:10:05,606 --> 00:10:07,149 అతనికి పొలిటికల్ లింక్స్ ఉన్నాయా? 160 00:10:07,232 --> 00:10:08,984 వారు అన్న ఈ "నిజం" రాయబారి పదవికి సంబంధించిందా? 161 00:10:09,067 --> 00:10:10,110 ...యూకేలో చేసినవా? 162 00:10:10,194 --> 00:10:12,029 ఏం జరుగుతోందో మాకు చెప్పగలరా? 163 00:10:12,112 --> 00:10:14,823 ఆన్లైన్ కథనాలపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. 164 00:10:15,574 --> 00:10:18,994 కాకపోతే, ప్రస్తుతం యూకే ప్రభుత్వంతో కలిసి కొంత మంది విషయంలో 165 00:10:19,077 --> 00:10:20,746 దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పగలను. 166 00:10:22,831 --> 00:10:24,583 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 167 00:10:25,959 --> 00:10:26,960 బానే ఉన్నాను. 168 00:10:30,797 --> 00:10:31,798 రెడీగా ఉన్నాను. 169 00:10:37,179 --> 00:10:38,180 మళ్లీ షరా మామూలే. 170 00:10:38,263 --> 00:10:39,264 అవును. 171 00:10:46,146 --> 00:10:49,525 మీ వ్యాసాలు కూడా అదే సృజనాత్మకతతో వ్రాస్తే బాగుంటుంది. 172 00:10:53,362 --> 00:10:54,446 టారా. 173 00:11:00,160 --> 00:11:03,497 ముందు నువ్వు మమ్మల్ని కలుసుంటే బాగుండేది. నేను నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. 174 00:11:04,039 --> 00:11:07,459 వైస్-ఛాన్సలర్ ఆఫీసు వారు నీ విషయంలో నిర్దోషివని హామీ ఇమ్మంటున్నారు. 175 00:11:08,377 --> 00:11:10,379 కిడ్నాప్ విషయంలో నీ పేరు వచ్చింది 176 00:11:10,462 --> 00:11:11,922 కాబట్టి, ఇప్పుడు కాలేజీ పేరు కూడా ప్రస్తావిస్తారు. 177 00:11:12,005 --> 00:11:15,467 పోలీసులు ఆ రోజు రాత్రి హోటల్ లో ఉన్న ప్రతీ బ్రిటిషు వారిని ప్రశ్నించారు. 178 00:11:15,551 --> 00:11:16,885 ఎలాంటి ఛార్జీలు లేకుండా నన్ను విడుదల చేశారు. 179 00:11:18,929 --> 00:11:21,390 నిజంగానే ఇలాంటి విషయంలో నా ప్రమేయం ఉందని అనుకుంటున్నారా ఏంటి? 180 00:11:21,890 --> 00:11:24,309 లియో న్యూమ్యాన్ అడ్మిషన్ విషయంలో నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మనిద్దరికీ తెలుసు. 181 00:11:24,393 --> 00:11:28,772 నేను... దర్యాప్తులో ఏది తేలితే దానికి కట్టుబడి ఉంటా అన్నాను, అలాగే ఉన్నా కూడా. 182 00:11:28,856 --> 00:11:31,650 న్యూ యార్క్ కి వెళ్తానని ముందుకు వచ్చావు కూడా. 183 00:11:31,733 --> 00:11:33,277 అందుకుగాను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో తెలుసా? 184 00:11:38,866 --> 00:11:40,075 సరిగ్గానే అన్నారు. 185 00:11:40,158 --> 00:11:42,035 నాకు క్యాథెరిన్ న్యూమ్యాన్ పెద్దగా నచ్చకపోవచ్చు, 186 00:11:42,119 --> 00:11:44,663 కానీ ఒక తల్లిగా, ఆమె ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. 187 00:11:46,456 --> 00:11:48,208 నా గురించి ఈ చర్చ అంతా 188 00:11:48,292 --> 00:11:52,254 ఇంకొక వైరల్ విషయం ఏదోకటి రాగానే మాయం అయిపోతుంది. 189 00:11:52,337 --> 00:11:53,547 అలాగే జరగాలని కోరుకుంటున్నాను. 190 00:11:54,840 --> 00:11:56,633 ఎందుకంటే ఇంతకు మించి కాలేజీ పేరు పాడవ్వడం... 191 00:12:01,054 --> 00:12:03,015 అందరి కన్నా కాలేజీ పేరే ముఖ్యం, టారా. 192 00:12:03,098 --> 00:12:05,058 సీసీటీవీ సర్వేలెన్స్ 193 00:12:05,142 --> 00:12:08,687 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం బ్లెంహెయిమ్ కాలేజీ 194 00:12:43,472 --> 00:12:46,517 అలాగే, ఈ వ్యక్తిని గనుక ఎవరైనా చూసి ఉంటే 195 00:12:47,059 --> 00:12:49,228 వెంటనే పోలీసులను సంప్రదించమని అడుగుతున్నాం. 196 00:12:49,311 --> 00:12:51,355 ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని నేరుగా ఎదుర్కొకండి. 197 00:12:52,022 --> 00:12:53,982 ఇతను చాలా ప్రమాదకరమైనవాడు. 198 00:12:54,066 --> 00:12:57,361 ఇతను ప్రస్తుతం యూరోప్ లో ఉండి ఉండొచ్చు. కానీ తరచూ దేశాలు మారుతుంటాడు, 199 00:12:57,945 --> 00:13:01,031 ప్రస్తుతం షాన్ టిల్సన్ అనే మారుపేరుతో చలామణి అవుతున్నాడని భావిస్తున్నాం. 200 00:13:01,949 --> 00:13:03,325 అతనికి పొలిటికల్ లింక్స్ ఉన్నాయా? 201 00:13:03,408 --> 00:13:05,702 వారు అన్న ఈ "నిజం" రాయబారి పదవికి సంబంధించిందా? 202 00:13:05,786 --> 00:13:08,372 యూకేలో కొంత మందిని అరెస్ట్ చేశారన్నది నిజమేనా? 203 00:13:08,455 --> 00:13:11,124 ఆన్లైన్ కథనాలపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. 204 00:13:11,667 --> 00:13:14,962 కాకపోతే, ప్రస్తుతం యూకే ప్రభుత్వంతో కలిసి కొంత మంది విషయంలో 205 00:13:15,045 --> 00:13:16,547 దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పగలను. 206 00:13:18,590 --> 00:13:21,969 ఎవరికైనా ఏమైనా తెలిసినా, లేదా ఎక్కడైనా ఏమైనా చూసినా, 207 00:13:22,511 --> 00:13:24,638 దయచేసి అధికారులకు తెలపండి. 208 00:13:25,180 --> 00:13:27,015 మాకు లియో కావాలి. 209 00:13:29,059 --> 00:13:30,060 నీ చర్చ ఎలా జరిగింది? 210 00:13:30,143 --> 00:13:31,311 ఏం చర్చ? 211 00:13:31,395 --> 00:13:32,646 క్యాథెరిన్ న్యూమ్యాన్ తో. 212 00:13:32,729 --> 00:13:34,815 ఇక్కడి విషయాలను ఆవిడకి చెప్పడానికే కదా మెల్లిగా జారుకున్నావు? 213 00:13:34,898 --> 00:13:36,733 నేనేమి జారుకోను. 214 00:13:36,817 --> 00:13:39,361 కానీ, నిజమే, నేను శ్రీమతి న్యూమ్యాన్ గారితో మాట్లాడాను. 215 00:13:39,444 --> 00:13:40,654 అలాగే నా బాస్ తో కూడా. 216 00:13:41,446 --> 00:13:43,031 వాళ్ళు చెప్పమన్న "నిజం" ఏమిటో ఆమెని అడిగావా? 217 00:13:44,616 --> 00:13:46,702 - అలా అడగడం అంత సులభమయ్యుంటే అడిగేవాడినే. - ఆహా. 218 00:13:47,911 --> 00:13:50,789 వాళ్ళు వేసుకున్న మాస్కులు, సెనేట్ లో చేసిన రచ్చ కారణంగా, ఇదంతా ఆమె రాయబార 219 00:13:50,873 --> 00:13:52,791 పదవికి సంబంధించిందని ప్రస్తుతానికి భావిస్తున్నాం. 220 00:13:53,959 --> 00:13:54,960 ఏ విధంగా సంబంధించింది? 221 00:13:55,669 --> 00:13:56,879 ఆ విషయం నేను చెప్పలేను. 222 00:13:59,173 --> 00:14:00,340 ఎందుకంటే నాకు కూడా తెలీదు. 223 00:14:02,259 --> 00:14:04,344 నేను తెలుసుకోవాల్సిన విషయం ఇంకేమైనా ఉందా? 224 00:14:07,055 --> 00:14:09,183 ఆ డిమాండ్ చేసిన కిడ్నాపర్ స్వరం యొక్క అనాలసిస్ వచ్చింది. 225 00:14:09,266 --> 00:14:13,854 ఇంటర్నెట్ నుండి తీసుకున్న అనేక స్వరాలను కలిపి ఆ సందేశాన్ని ఎడిట్ చేశారు, కనుక... 226 00:14:14,563 --> 00:14:17,149 అలాగే అనేక చోట్ల లియోను చూసినట్టు రిపోర్టులు వచ్చాయి. 227 00:14:17,232 --> 00:14:18,650 అవును, ఇక్కడ కూడా అదే పరిస్థితి. 228 00:14:19,943 --> 00:14:22,112 వాళ్ళు ఒకరితో ఒకరు సంప్రదించడానికి ఏమైనా ప్రయత్నించారా? 229 00:14:22,196 --> 00:14:24,823 మీరు పెట్టిన న్యూస్ కాన్ఫరెన్స్ కారణంగా ఇక అలా జరుగుతుందని నేను అనుకోను. 230 00:14:27,951 --> 00:14:31,663 ఒకటి చెప్పనా, ఒకరికి ఒకరు పరిచయం లేనంత మాత్రానా వాళ్ళు కలిసి లేరని అనుకోలేము. 231 00:14:31,747 --> 00:14:34,917 ప్రతీ కిడ్నాపర్ కి వ్యక్తిగతంగా పనిని అప్పగించి, ఒకరితో ఒకరికి పరిచయం 232 00:14:35,000 --> 00:14:37,794 లేకుండానే పనిని పూర్తి చేసిన కేసులు నేను ఎన్నో చూసాను. 233 00:14:38,504 --> 00:14:42,257 కనుక వాళ్ళెవరో మనకి, అలాగే వాళ్ళలో వాళ్లకే తెలికుండా ఉండేందుకు మాస్కులు వాడుంటారు. 234 00:14:42,341 --> 00:14:43,759 తొమ్ప్సన్ ఎక్కడికో వెళ్తుంది. 235 00:14:49,890 --> 00:14:53,393 రెండవ అనుమానితురాలు బ్రిక్స్ టన్ మార్కెట్ లో, నా ముందే ఉంది. 236 00:15:06,156 --> 00:15:07,950 మార్కెట్ హెచ్ఎల్ 237 00:15:17,751 --> 00:15:19,044 అయితే, నా ఉద్యోగం ఏంటో తెలుసా? 238 00:15:19,962 --> 00:15:21,964 నేను కంపెనీలకు, వారి ట్యాక్స్ ని... 239 00:15:22,881 --> 00:15:23,882 తగ్గించుకోవడానికి సహాయం చేస్తాను. 240 00:15:23,966 --> 00:15:26,426 వాళ్ళు కట్టాల్సిన డబ్బు ఎగవేయడానికి సాయం చేస్తావు. 241 00:15:28,262 --> 00:15:33,308 అంటే, నేను... వాళ్ళ దగ్గర ఉండే అదనపు డబ్బును, 242 00:15:33,392 --> 00:15:34,852 వేరొక చోటుకి తరలిస్తుంటాను. 243 00:15:37,688 --> 00:15:38,689 నా అకౌంట్ లోకి. 244 00:15:39,523 --> 00:15:41,525 - నువ్వు దొంగతనం చేసావా? - లేదు. 245 00:15:41,608 --> 00:15:43,986 - అయితే అది నీ డబ్బా? - కాదు. 246 00:15:44,069 --> 00:15:45,445 అయితే దొంగతనం చేసావా? 247 00:15:46,864 --> 00:15:47,990 అది వాళ్ళ డబ్బు కూడా కాదు. 248 00:15:48,073 --> 00:15:50,826 వాళ్ళు న్యాయంగా దొంగతనం చేసినంత మాత్రానా అది దొంగతనం కాకుండా పోదు. 249 00:15:50,909 --> 00:15:52,411 అదేనా నీ వాదన? 250 00:15:55,330 --> 00:15:58,500 కొన్ని వేల డాలర్లు కనిపించనంత మాత్రానా తేడా తెలుస్తుందని అనుకోలేదు. 251 00:15:58,584 --> 00:16:00,043 కొన్ని వేలు అంటే? 252 00:16:00,127 --> 00:16:03,005 కొన్ని వందల వేలు అనుకో. 253 00:16:04,131 --> 00:16:05,132 నాట్. 254 00:16:05,883 --> 00:16:06,884 నాలుగు లక్షలు ఉండొచ్చు. 255 00:16:07,968 --> 00:16:09,303 సీరియస్ గా అంటున్నావా? 256 00:16:09,970 --> 00:16:11,722 మనిద్దరిలో నువ్వే కాస్త వివేకంతో ఆలోచిస్తావనుకున్నా. 257 00:16:13,223 --> 00:16:14,391 నాటాలి తొమ్ప్సన్ మోనిక్ తొమ్ప్సన్ 258 00:16:14,474 --> 00:16:16,268 అయితే, మెసేజ్ చేసేది ఎవరు? 259 00:16:16,768 --> 00:16:19,980 నాకు తెలీదు. వాళ్ళను నేనెప్పుడూ కలవలేదు. 260 00:16:20,063 --> 00:16:23,150 మా క్లయింట్, నీమస్, వాళ్ళకి మిస్ అవుతున్న డబ్బు గురించి తెలిసిన తర్వాత 261 00:16:23,233 --> 00:16:25,068 నేను తీసుకున్న డబ్బుకు బదులు రెండింతల డబ్బు 262 00:16:25,152 --> 00:16:27,321 వేర్వేరు అకౌంట్లకు మార్చి వాళ్లకు తిరిగి ఇస్తే ఇదంతా మర్చిపోతాం అన్నారు. 263 00:16:27,905 --> 00:16:30,741 చాలా మటుకు ఆన్లైన్ లోనే చేశా, చివర్లో కొన్నిటిని క్యాష్ గా ఇవ్వాల్సి వచ్చింది. 264 00:16:31,950 --> 00:16:34,536 న్యూ యార్క్ లో చివరిగా ఇవ్వాల్సి ఉంది, కానీ వసూలు చేసుకోవాల్సిన వ్యక్తి రాలేదు. 265 00:16:35,245 --> 00:16:37,206 అయితే, దీనికి ఆ కిడ్నాప్ తో సంబంధమే లేదా? 266 00:16:41,043 --> 00:16:42,044 ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పు. 267 00:16:42,127 --> 00:16:43,545 - అది నీ కోటులో ఉందా? - లేదు. 268 00:16:44,046 --> 00:16:46,048 ఆ డబ్బును వెనక్కి ఇచ్చేస్తే నీ సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావా? 269 00:16:46,131 --> 00:16:48,550 ఇదేం తమాషా విషయం కాదు, నాట్. నీ గురించి న్యూస్ లో ఉంది. 270 00:16:48,634 --> 00:16:50,302 పోలీసులు నిన్ను గమనిస్తూ ఉంటే ఏం చేస్తావు? 271 00:16:51,178 --> 00:16:53,472 నాకు వేరే ఏ దారి ఉంది, మోన్? 272 00:16:54,431 --> 00:16:56,725 దయచేసి డబ్బు నాకు ఇవ్వు. 273 00:17:01,396 --> 00:17:02,397 సరే. 274 00:17:03,607 --> 00:17:04,816 సరేనా? 275 00:17:06,234 --> 00:17:07,236 సరే. 276 00:17:07,319 --> 00:17:11,949 అయితే ఒక గంటలో నా ఆఫీసు బయట నన్ను కలువు. 277 00:17:12,031 --> 00:17:13,575 - సరే. - సరే. 278 00:17:35,222 --> 00:17:37,891 సౌత్ బ్యాంకుకి వెళ్ళు 279 00:17:41,228 --> 00:17:43,063 ఆమె చెల్లి ఎక్కడికి వెళ్ళింది? 280 00:17:43,689 --> 00:17:45,649 - వాళ్ళు తలో దిక్కుకు వెళ్లిపోయారు. - నాటాలి పైనే కన్నేసి ఉంచండి. 281 00:17:45,732 --> 00:17:47,150 లేదు. ఆమె చెల్లిని కూడా ట్రాక్ చేయండి. 282 00:17:54,324 --> 00:17:57,661 లియో న్యూమ్యాన్ కిడ్నాప్ తాజా సమాచారం 283 00:17:58,245 --> 00:18:00,247 నిజం చెప్పు, క్యాథెరిన్, 284 00:18:00,873 --> 00:18:06,044 లేదా ప్రపంచమంతా చూస్తుండగా నీ కొడుకు చావాల్సి ఉంటుంది. నిజం... 285 00:18:06,128 --> 00:18:08,380 ఇవాళ నువ్వు పని చేస్తాను అన్నావు కదా? 286 00:18:08,463 --> 00:18:09,715 - అవును, పనే చేస్తున్నాను. - సరే. 287 00:18:09,798 --> 00:18:11,341 సరే, అయితే ఇక రండి, సార్. మాకు సాయం చేయండి. 288 00:18:11,425 --> 00:18:12,426 సరే. 289 00:18:16,722 --> 00:18:18,724 మా కార్పెట్ వ్యాపారాన్ని నువ్వు తక్కువగా చూస్తావని నాకు తెలుసు. 290 00:18:19,349 --> 00:18:21,059 ఎంతైనా కార్పెట్స్ కాళ్ళ క్రింద ఉండేవే కదా మరి. 291 00:18:21,143 --> 00:18:23,145 నీకొక మాట చెప్తా విను. ఒకసారి ఊహించుకో, సరేనా 292 00:18:23,228 --> 00:18:25,147 నేలమీద నీ పిల్లలతో ఆడుకుంటున్నట్టు, సరేనా? 293 00:18:25,230 --> 00:18:27,399 ఒక అందమైన ఆదివారం రోజున పిల్లలతో సినిమా చూస్తున్నట్టు ఊహించుకో. 294 00:18:27,482 --> 00:18:30,444 లేదా అద్భుతమైన శీతాకాలం చలి మంట ఎదురుగా నీ భార్యతో గడుపుతున్నట్టు ఊహించుకో. 295 00:18:30,527 --> 00:18:32,362 నా ఉద్దేశం, మా ఇంట్లో ఉన్నట్టు ఊహించుకోకు. కానీ విషయం ఏమిటంటే, 296 00:18:32,446 --> 00:18:36,366 మేము ఇక్కడ కార్పెట్స్ అమ్మడం లేదు, వాటితో ఏర్పరచుకోగల అనుభవాలను అమ్ముతున్నాం. 297 00:18:36,950 --> 00:18:40,078 నీ కుటుంబానికి అందమైన జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నంత మాత్రానా స్పెషల్ అయిపోతావా? 298 00:18:40,162 --> 00:18:42,789 మా నాన్న, ఏమీ లేని స్థితి నుండి ఇదంతా కష్టపడి నిర్మించారు. 299 00:18:43,415 --> 00:18:44,791 నీకు తెలుసో లేదో, రోజూ సూర్యుడు ఉదయించక ముందే లేచి, 300 00:18:44,875 --> 00:18:47,503 రాత్రి వరకు పనిచేసేవారు, మాకందరికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చి 301 00:18:48,086 --> 00:18:50,756 ఏమైనా సాధించగలం అని చూపించడానికి. 302 00:18:51,381 --> 00:18:52,966 ఇది నీకు కూడా ఒక అవకాశమే, బాబు. 303 00:18:54,635 --> 00:18:55,886 సరసమైన ధరలకే కార్పెట్స్ కాష్కో కార్పెట్స్ 304 00:18:55,969 --> 00:18:56,970 ఈ అవకాశాన్ని పాడు చేసుకోకు. 305 00:19:01,558 --> 00:19:05,437 మొదటి సిసిటివి అనుమానితుడు 306 00:19:05,521 --> 00:19:08,357 హాయ్, నా పేరు స్టీవ్ మెక్ అలిస్టర్. దయచేసి మీ సందేశాన్ని వదలండి. 307 00:19:08,941 --> 00:19:11,026 హాయ్. మళ్ళీ నేనే ఫోన్ చేస్తున్నా. 308 00:19:11,777 --> 00:19:13,320 దయచేసి నీ ఫోన్ ఎత్తు, స్టీవ్. 309 00:19:13,946 --> 00:19:15,739 నేను నిజంగా డైసీతో మాట్లాడాలి. 310 00:19:15,822 --> 00:19:17,324 నేను ప్రయత్నిస్తూనే ఉంటాను.* 311 00:19:20,744 --> 00:19:22,079 ధన్యవాదాలు, హెథర్. 312 00:19:23,247 --> 00:19:26,124 నేరారోపణను ఎదుర్కొంటున్న టీచర్ పిల్లలకు ఏం నేర్పుతోంది? 313 00:19:33,173 --> 00:19:34,508 వాళ్ళు కాలేజీ పేరును ప్రస్తావించారా? 314 00:19:35,425 --> 00:19:36,426 అవును. 315 00:19:42,057 --> 00:19:44,351 ఆమె నేరం చేసి ఉంటే బయటకు ఎలా వచ్చి ఉంటుంది? 316 00:20:14,256 --> 00:20:18,677 మేము కార్పెట్స్ అమ్ముతాం అనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నిజానికి మేము అవి అమ్మం. 317 00:20:18,760 --> 00:20:20,262 - మేము కలలను అమ్ముతాము. - ఆదేష్ చోప్రా? 318 00:20:20,846 --> 00:20:23,974 - ఏంటి? - "నిజం" ఏంటో నీకు తెలుసా, ఆదేష్? 319 00:20:26,310 --> 00:20:29,104 - నన్ను ఎలా కనుగొన్నావు? - నీతో ఒక ఫోటో దిగొచ్చా? 320 00:20:29,188 --> 00:20:30,731 - దేనికి? - నాకు ఒక బ్లాగ్ ఉంది. 321 00:20:30,814 --> 00:20:32,774 చాలా పాపులర్ బ్లాగ్. గూడుపుఠాణీల గురించి రాస్తుంటాను. 322 00:20:32,858 --> 00:20:35,194 నాకు ఏమీ తెలీదు, సరేనా? ఇదంతా అపార్థం వల్ల జరిగింది. 323 00:20:35,277 --> 00:20:37,362 - లేదు, లేదు. ఇక్కడ కాదు. - ఒక్క క్షణం పడుతుంది అంతే. 324 00:20:37,446 --> 00:20:39,156 కానీ నేను పనిలో ఉన్నా, సరేనా? నేను... 325 00:20:39,907 --> 00:20:41,325 చూడు, నేను బయటకు వస్తాను. 326 00:20:41,408 --> 00:20:42,534 - సరేనా? - ఎప్పుడు? 327 00:20:43,493 --> 00:20:45,621 - తర్వాత, సరేనా? తర్వాత. - ఓహ్, సరే. అలాగే. 328 00:20:58,550 --> 00:21:01,303 నాటాలి తొమ్ప్సన్ అనుమానితురాలు 329 00:21:26,870 --> 00:21:28,413 తలుపులు మూసుకుంటున్నాయి. 330 00:21:37,256 --> 00:21:38,715 తలుపులు తెరుచుకుంటున్నాయి. 331 00:21:47,516 --> 00:21:49,935 మస్వెల్ పీటర్స్ అకౌంటెంట్స్ 332 00:22:01,864 --> 00:22:04,283 నాటాలి. నువ్వు వస్తావని మేము అనుకోలేదు. 333 00:22:05,033 --> 00:22:06,034 జైల్స్ ఉన్నాడా? 334 00:22:06,118 --> 00:22:08,245 లేదు, క్షమించాలి. ఉదయమంతా క్లయింట్స్ తో మీటింగ్ ఉంది. 335 00:22:10,289 --> 00:22:11,290 నేను ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. 336 00:22:11,373 --> 00:22:14,835 - నేను చెప్తున్నా కదా, అతను... - దూరం పెడుతున్నాడు. సరే, అర్థమైంది. 337 00:22:17,045 --> 00:22:19,256 నా ఉద్యోగం ఉందా, ఊడిందా అని ఆలోచిస్తున్నాను. 338 00:22:19,339 --> 00:22:20,924 ఇప్పుడది మానవ వనరుల శాఖ చేతిలో ఉంది. 339 00:22:22,134 --> 00:22:24,219 వావ్. నిజంగానా? 340 00:22:26,597 --> 00:22:27,639 నా కంప్యూటర్ ఎక్కడ? 341 00:22:27,723 --> 00:22:30,601 అంటే, పోలీసులు వచ్చి నీ పేరున ఉన్న దాదాపు ప్రతీ వస్తువును తీసుకెళ్లిపోయారు. 342 00:22:34,771 --> 00:22:38,025 నన్ను... నన్ను క్షమించండి. నేను... ఇది సిగ్గు చేటు. నేను... 343 00:22:39,067 --> 00:22:40,819 దయచేసి కాస్త ఇలా కూర్చోవచ్చా? 344 00:22:44,156 --> 00:22:45,699 ఒక్క నిమిషానికి ఏమీ కాదులే. 345 00:22:48,285 --> 00:22:49,745 నీళ్లు కావాలా? 346 00:22:51,288 --> 00:22:52,623 నాకొక కాఫీ ఇస్తారా 347 00:22:53,707 --> 00:22:55,375 పాలు, పంచదార ఎక్కువ వేసి ఇవ్వండి, ప్లీజ్? 348 00:22:56,460 --> 00:22:58,212 నేను నెమ్మదిస్తాను. ఒక నిమిషం సమయం కావాలి అంతే. 349 00:22:58,921 --> 00:22:59,922 సరే. 350 00:23:14,603 --> 00:23:15,979 మస్వెల్ పీటర్స్ 351 00:23:29,618 --> 00:23:32,913 హార్డింగ్ బ్యాంక్ - మీ ఆన్లైన్ బ్యాంకింగ్ కి సైన్ ఇన్ అవ్వండి 352 00:23:35,624 --> 00:23:36,625 సెక్యూరిటీ కీతో లాగిన్ అవ్వండి 353 00:23:42,881 --> 00:23:44,633 లోడ్ అవుతోంది... 354 00:24:02,317 --> 00:24:03,318 విజయవంతం! 355 00:24:11,326 --> 00:24:12,327 ఇదుగోండి. 356 00:24:18,917 --> 00:24:21,003 అసలు నువ్వు ఏమేమి చేస్తున్నావు, నాటాలి? 357 00:24:22,004 --> 00:24:23,422 మనం ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నాం? 358 00:24:23,505 --> 00:24:24,506 ఆమెను అరెస్ట్ చేయండి. 359 00:24:56,038 --> 00:24:58,832 నేను జైల్స్ కి ఒక లేఖ రాశాను. 360 00:25:00,000 --> 00:25:01,084 ఏం పర్లేదు అనుకుంట. 361 00:25:08,634 --> 00:25:10,177 మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. 362 00:25:10,761 --> 00:25:12,054 కానీ నేను ఇక వెళ్ళాలి. 363 00:25:15,307 --> 00:25:16,433 చెత్త పిల్ల. 364 00:25:17,100 --> 00:25:22,940 నా అక్కపై నిఘా ఉంది. డబ్బు నా దగ్గర ఉంది. 365 00:25:37,496 --> 00:25:40,332 అలా చేయడం కుదరదు. 366 00:25:45,337 --> 00:25:50,050 అయితే డబ్బు ఇవ్వను 367 00:26:00,018 --> 00:26:01,812 ఎర్రని సంచి. 368 00:26:09,820 --> 00:26:12,698 జో మొబైల్ 369 00:26:12,781 --> 00:26:14,658 నాటాలి తొమ్ప్సన్. 370 00:26:14,741 --> 00:26:16,785 నాటాలి తొమ్ప్సన్ అనుమానితురాలు 371 00:26:23,500 --> 00:26:24,877 కాఫీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. 372 00:26:26,211 --> 00:26:29,548 అది నీ స్థాయికి సరిపోని పని కదా? అంటే, నీలాంటి యువరాజు ఇలాంటివి చేయరు కదా? 373 00:26:29,631 --> 00:26:30,757 నీకేమైనా కావాలా? 374 00:26:31,758 --> 00:26:33,552 - నా ఎక్స్ బాక్స్ గేమ్. - అయితే "రాను" అంటావా? 375 00:26:34,720 --> 00:26:36,138 - అంటే డబ్బులు ఇస్తావా? - లేదు. 376 00:26:36,763 --> 00:26:39,183 అయితే సరే. నేను "రాను." 377 00:26:48,650 --> 00:26:49,651 అవును, అది అతనే! 378 00:26:49,735 --> 00:26:52,362 - ఆదేష్! ఆదేష్! - మనం ఇప్పుడు ఒక ఫోటో దిగొచ్చా? 379 00:26:53,822 --> 00:26:55,407 లైవ్ 380 00:27:16,803 --> 00:27:18,096 ఎన్.సి.ఏ 381 00:27:26,855 --> 00:27:30,776 మీరు నా చెల్లికి ఫోన్ చేయాలి. కాదు, మా అమ్మకి. మోనిక్ కి ఫోన్ చేయమనండి. 382 00:27:30,859 --> 00:27:31,818 ఎందుకు? 383 00:27:32,778 --> 00:27:35,405 ఎందుకంటే నేను ఇప్పుడు నిజానికి మోనిక్ ని కలవాలి. 384 00:27:36,156 --> 00:27:37,157 సౌత్ బ్యాంక్ దగ్గర. 385 00:27:39,826 --> 00:27:40,827 ఛ. 386 00:27:40,911 --> 00:27:43,205 మనం కాస్త మాట్లాడుకోవాలి అనుకుంట. దయచేసి ఇలా రండి. 387 00:27:43,288 --> 00:27:45,165 ఎన్.సి.ఏ ప్రధాన కార్యాలయం లండన్, యూకే క్వాడ్ 1 388 00:27:53,048 --> 00:27:54,508 - మెసేజ్ చేసేది ఎవరు? - నాకు తెలీదు. 389 00:27:54,591 --> 00:27:55,717 సరే, అతను ఎలా ఉంటాడు? 390 00:27:55,801 --> 00:27:57,302 - నేను అతన్ని చూడలేదు. - నాటాలి. 391 00:27:57,386 --> 00:27:59,638 - నేను నిజంగానే చూడలేదు. - దీనికి లియో న్యూమ్యాన్ తో సంబంధం ఏంటి? 392 00:27:59,721 --> 00:28:02,349 లేదు, మోనిక్ క్షేమంగా ఉందని తెలిసే వరకు నేనేం చెప్పను. 393 00:28:03,642 --> 00:28:04,726 దయచేసి సాయం చేయండి. 394 00:28:23,829 --> 00:28:25,163 నువ్వు ముందుగా ఫోన్ చేయాలి కదా. 395 00:28:26,874 --> 00:28:28,333 నేను మెసేజ్ లు పెట్టాను. 396 00:28:28,417 --> 00:28:30,085 అలాగే నేను నీకు తిరిగి ఫోన్ చేశాను. మీ ఆఫీసుకి. 397 00:28:30,919 --> 00:28:31,962 నువ్వు ఎక్కడ ఉన్నావో వాళ్లకు తెలీదు. 398 00:28:33,630 --> 00:28:36,717 - నిన్ను పనిలో నుండి తీసేసారా? - తాత్కాలికంగా. నేను డైసీని చూడొచ్చా? 399 00:28:36,800 --> 00:28:38,385 ఈ పుకార్ల వల్ల తనపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? 400 00:28:38,468 --> 00:28:40,137 అందుకే నేను ఇక్కడికి వచ్చింది. 401 00:28:41,096 --> 00:28:42,306 అమ్మా? 402 00:28:42,389 --> 00:28:44,099 హాయ్, బంగారం. 403 00:28:44,766 --> 00:28:46,101 ఇలా రా. 404 00:28:50,480 --> 00:28:51,481 నీకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాం. 405 00:28:52,191 --> 00:28:53,817 క్షమించు, బుజ్జి. నా ఫోన్ పోయింది. 406 00:28:54,818 --> 00:28:56,111 దానర్థం, పోలీసులు తీసేసుకున్నారనే కదా. 407 00:29:00,365 --> 00:29:02,910 మిగతా పిల్లలు నా గురించి ఏవేవో అంటుంటారని నాకు తెలుసు. 408 00:29:03,493 --> 00:29:04,745 నేను అవేం పట్టించుకోను. 409 00:29:05,579 --> 00:29:07,539 ఇవన్నీ పోయేలా చేయగలిగితే బాగుండు అనుకుంటున్నాను. 410 00:29:08,040 --> 00:29:09,791 నిజం చెప్పాలంటే, అవన్నీ పోతాయి. 411 00:29:10,626 --> 00:29:13,253 ఒకమాట చెప్పనా, ఇదంతా బాగానే ఉంది. అంటే, నువ్వు ఫెమస్ అయ్యావు కదా. 412 00:29:14,254 --> 00:29:16,256 డైసీ హోమ్ వర్క్ చేయాలి. కాబట్టి... 413 00:29:16,340 --> 00:29:18,759 - అమ్మ ఇప్పుడే కదా వచ్చింది. - అదేం పర్లేదు. 414 00:29:19,760 --> 00:29:20,761 సరే. 415 00:29:22,763 --> 00:29:26,016 నువ్వు ఏం విన్నా, చదివినా, నేను నీకు మాట ఇస్తున్నాను, 416 00:29:26,099 --> 00:29:28,769 నేను తప్పుడు పని ఏమీ చేయలేదు. సరేనా? 417 00:29:30,479 --> 00:29:31,563 సరే. 418 00:29:43,325 --> 00:29:44,284 వెళ్ళిపోకు అమ్మా. 419 00:29:49,039 --> 00:29:50,666 నేను తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? 420 00:30:05,848 --> 00:30:06,932 వాడు టిల్సన్ అయ్యుంటాడు. 421 00:30:07,015 --> 00:30:08,517 - అందులో సందేహమే లేదు. - ఒకవేళ వాడే అయినా, 422 00:30:08,600 --> 00:30:10,352 - మనం కనిపెట్టడానికి నిఘా సరిగ్గా లేదు. - మన మనుషులు ఉన్నారు కదా. 423 00:30:10,435 --> 00:30:12,145 ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్లకు బ్యాకప్ లేరు. 424 00:30:12,229 --> 00:30:14,439 మోనిక్ కి ఎలాంటి రక్షణా లేదు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. 425 00:30:14,523 --> 00:30:15,858 ఆమె చట్ట విరుద్ధమైన పనులు చేస్తుంది. 426 00:30:15,941 --> 00:30:17,067 అలా అని మనం అప్పుడే అనలేం. 427 00:30:17,150 --> 00:30:18,277 ఆమెపై నిఘా ఉంచడానికే మనకు అనుమతి ఉంది, 428 00:30:18,360 --> 00:30:21,738 - ఇలాంటి సైకోగాళ్ళకి ఎరగా వేయడానికి కాదు. - ఆమె మనల్ని వాడి దగ్గరకి తీసుకెళ్తుంది. 429 00:30:21,822 --> 00:30:22,990 మనం ఇంకొంతమంది ఆఫీసర్లను పొగేసి 430 00:30:23,073 --> 00:30:24,408 - అక్కడికి పంపిస్తే... - అప్పటికే లేట్ అయిపోతుంది. 431 00:30:29,246 --> 00:30:30,581 - నాట్. - ఏంటి... 432 00:30:31,290 --> 00:30:32,416 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 433 00:30:32,499 --> 00:30:34,418 - క్షమించండి, మాకు ఒక నిమిషం ఇస్తారా? - సరే. 434 00:30:36,503 --> 00:30:37,504 మీ అమ్మ నాకు ఫోన్ చేసింది. 435 00:30:38,297 --> 00:30:40,757 ఆమె మోనిక్ కి ఫోన్ చేయాలి. మీలో ఎవరైనా తనతో మాట్లాడారా? 436 00:30:40,841 --> 00:30:42,259 - నీకు ఒక లాయర్ కావాలి. - ఆమె బాగానే ఉందా? 437 00:30:42,342 --> 00:30:43,343 నాకు తెలీదు. 438 00:30:44,553 --> 00:30:45,888 నీ గురించి నాకు చింత ఎక్కువైపోతోంది. 439 00:30:47,389 --> 00:30:49,266 ఇలా చూడు, నాట్, ఇక ఇంతటితో ఈ గూడుపుఠాణి ముగియాలి. 440 00:30:49,349 --> 00:30:50,601 సరేనా? 441 00:30:50,684 --> 00:30:53,020 నిన్నిలా ఊరికే తీసుకొస్తామంటే కుదరదు. 442 00:30:54,146 --> 00:30:55,355 నువ్వు నా తరఫున వాదించలేవు. 443 00:30:56,899 --> 00:30:58,692 నిజం చెప్పాలంటే, వాళ్ళ పుణ్యమా అని, 444 00:30:59,568 --> 00:31:03,488 నిన్న మనం పెళ్లి చేసుకోలేకపోయాం, కాబట్టి నేను వాదించగలను. 445 00:31:05,282 --> 00:31:09,453 ఇలా చూడు. నిన్ను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేసారా? 446 00:31:12,122 --> 00:31:14,958 - జో, నువ్వు ఇక్కడ ఉండకూడదు. - ఆహ, వద్దు. 447 00:31:15,042 --> 00:31:18,420 ఇవేం చెప్పకు. నేను వెళ్ళను, సరేనా? అస్సలు కుదరదు. 448 00:31:21,924 --> 00:31:23,967 - ఏం జరుగుతోంది? - చూడండి, నా క్లయింట్ ని ఎందుకు ఉంచారు? 449 00:31:24,051 --> 00:31:25,677 ఆయన ఇలా వాదించలేడు, కదా? 450 00:31:25,761 --> 00:31:29,097 అతని న్యాయవాది సభ్యత్వాన్ని రిస్క్ లో పెట్టుకోవాలని ఉంటే అది అతని నిర్ణయం. 451 00:31:29,181 --> 00:31:31,141 ఈ విషయం కోర్టుకు ఎక్కితేనే ఆ సమస్య తలెత్తుతుంది, 452 00:31:31,225 --> 00:31:33,852 కానీ నువ్వు నిరపరాధివి కాబట్టి అలా జరిగేది లేదు. 453 00:31:59,378 --> 00:32:01,505 క్షమించాలి, ఏం తదుపరి దర్యాప్తు చేయాలి? 454 00:32:01,588 --> 00:32:03,382 ఇవాళ మీ ఆఫీసుకు ఎందుకు వెళ్ళావు, నాటాలి? 455 00:32:06,677 --> 00:32:07,678 నాటాలి? 456 00:32:09,429 --> 00:32:12,474 నా పేరు ఇంటర్నెట్ అంతా ఫెమస్ కావడానికి కారణం ఏంటని మా బాస్ కు చెప్పడానికి. 457 00:32:16,103 --> 00:32:18,480 ఈ రోజు ఉదయం నువ్వు ఆఫీసులో సరిగ్గా 458 00:32:18,564 --> 00:32:20,148 ఏం చేసావో మాకు తెలుసు అని చెప్తే నువ్వు ఏమంటావు? 459 00:32:21,900 --> 00:32:23,110 మీరనేది నాకు అర్థం కావడం లేదు. 460 00:32:23,193 --> 00:32:26,154 మేము సోదాలు చేస్తుండగా, మీ ఆఫీసులో అనేక సర్వేలెన్స్ కెమెరాలు ఉంచాం అంటే? 461 00:32:29,324 --> 00:32:30,409 అప్పుడు మీ సమాధానం ఏమై ఉంటుంది? 462 00:32:31,118 --> 00:32:32,327 మీరు అలా ఎందుకు చేస్తారు? 463 00:32:32,870 --> 00:32:34,663 - వాళ్ళు అలా చేయకూడదు, అవునా? - ఏమంటారు, నాటాలి? 464 00:32:34,746 --> 00:32:38,000 చూడండి, మీ దగ్గర సరైన ఆధారం ఉంటే దయచేసి దాని విషయానికి వస్తారా? 465 00:32:38,083 --> 00:32:39,293 అయితే ఇలాగే కొనసాగుదాం అంటారా? 466 00:32:39,877 --> 00:32:41,628 నా చెల్లి సురక్షితంగా ఉందో లేదో నాకు తెలియాలి అంతే. 467 00:32:49,595 --> 00:32:52,848 మీరు మీ గమ్య స్థానానికి చేరుకున్నారు 468 00:33:41,438 --> 00:33:44,233 మోనిక్ తొమ్ప్సన్ 469 00:33:52,282 --> 00:33:53,992 మీరు ముందెన్నడూ పేరు వినలేదని చెప్పిన 470 00:33:54,076 --> 00:33:55,994 బ్లూ రాబిన్ హోల్డింగ్స్ కంపెనీ మీకు గుర్తుందా? 471 00:33:56,662 --> 00:34:00,332 ఎందుకంటే, మా ఫ్రాడ్ బృందం కొన్ని తనిఖీలు చేయగా తెలిసింది ఏంటంటే 472 00:34:00,415 --> 00:34:03,919 ఆ కంపెనీ డైరెక్టర్, "మాడలీన్ క్రాఫ్ట్స్" అనే వ్యక్తి 473 00:34:04,002 --> 00:34:07,214 పుట్టినరోజు సరిగ్గా మీ పుట్టినరోజు సంఖ్యలనే వేరొక 474 00:34:07,297 --> 00:34:09,591 - ఆర్డరులో పెడితే వస్తుంది. - నన్ను ఈ విచారణను ఆపేయమంటావా? 475 00:34:09,675 --> 00:34:12,094 బ్లూ రాబిన్ హోల్డింగ్స్ అనేది ఒక కల్పిత కంపెనీ, అవునా, నాటాలి? 476 00:34:12,177 --> 00:34:14,804 అలాగే గత రెండేళ్లుగా మీరు నీమస్ గ్రూప్ వారి డబ్బును 477 00:34:14,888 --> 00:34:16,806 ఆ కంపెనీ పేరుతో దారి మళ్లిస్తున్నారు. 478 00:34:17,808 --> 00:34:19,560 ఆమె సురక్షితంగా ఉందని నాకు చెప్పండి, అప్పుడు నేను మీకు అంతా చెప్తాను. 479 00:34:22,187 --> 00:34:25,858 నా క్లయింట్ తో నాకు కొంత సమయం కావాలి. 480 00:34:27,192 --> 00:34:29,235 మోనిక్ సురక్షితంగా ఉంది, ఆమె ఇప్పుడు ఇక్కడికే వస్తుంది. 481 00:34:29,319 --> 00:34:31,029 మీరు నిజం చెప్తున్నారని నేనెలా నమ్మేది? 482 00:34:31,947 --> 00:34:35,409 ఆమె దగ్గర పెద్ద మొత్తాల్లో అమెరికన్ డాలర్లు మరియు 483 00:34:35,492 --> 00:34:37,953 - ఒక బర్నర్ ఫోన్ ఉన్నాయి. - ఇక విచారణను ఆపేయాలి అని కోరుతున్నాను. 484 00:34:38,036 --> 00:34:40,205 ఆమెకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆమెను అరెస్ట్ చేయలేరు. 485 00:34:40,289 --> 00:34:42,291 - అయితే నిజం చెప్పు. - ఏం మాట్లాడకు. 486 00:34:42,373 --> 00:34:44,960 జో, నిన్ను ఇందుకే ఉండొద్దు అన్నాను. 487 00:34:45,043 --> 00:34:48,297 నాటాలి, జరిగింది ఏమైనా, అది నీ తప్పు కాదని నాకు తెలుసు. 488 00:34:48,380 --> 00:34:52,176 సరేనా? సరే, ఈ ఇంటర్వ్యూ ఇక ఆగాలని అంటున్నాను. 489 00:34:52,259 --> 00:34:53,760 నీకు కావాల్సింది ఇదేనా, నాటాలి? 490 00:34:54,636 --> 00:34:56,346 కావాలంటే మీ లాయరును మీరు పంపించేయవచ్చు. 491 00:34:59,224 --> 00:35:00,601 నీకు కావాల్సింది అదే అయితే. 492 00:35:04,646 --> 00:35:05,647 సరే. 493 00:35:08,150 --> 00:35:09,776 ఆయన్ని పంపించేయండి. 494 00:35:10,986 --> 00:35:11,987 మంచిది. 495 00:35:13,197 --> 00:35:14,198 నాటాలి. 496 00:35:41,850 --> 00:35:45,771 ఎన్.సి.ఏ ప్రధాన కార్యాలయం లండన్, యూకే క్వాడ్ 2 497 00:35:51,318 --> 00:35:52,528 ఆమె నిజంగానే సురక్షితంగా ఉందా? 498 00:35:58,742 --> 00:36:00,994 నువ్వు దొంగిలిస్తున్న కంపెనీలో అతిపెద్ద 499 00:36:01,078 --> 00:36:03,038 వాటా ఎవరిదో నీకు తెలుసు కదా? 500 00:36:04,790 --> 00:36:06,291 కూపర్ న్యూమ్యాన్ పిఆర్. 501 00:36:06,375 --> 00:36:09,503 క్యాథెరిన్ న్యూమ్యాన్, లియో న్యూమ్యాన్ వాళ్ళ అమ్మగారి కంపెనీ. 502 00:36:09,586 --> 00:36:10,921 నాకు ఆ విషయం తెలీదు. 503 00:36:11,588 --> 00:36:14,007 నిజంగా, ఒట్టేసి చెబుతున్నా. నాకు ఆ విషయం అస్సలు తెలీదు. 504 00:36:14,091 --> 00:36:16,927 "నిజం" అంటే ఏమిటో నీకు తెలుసా, నాటాలి? 505 00:36:19,680 --> 00:36:22,307 క్రితం సారి మనం పెందలకాడే షాపు ఎప్పుడు మూసేసామో తెలుసా? 506 00:36:22,391 --> 00:36:24,601 - ఎప్పుడూ మూయలేదు. - ఎన్నడూ మూయలేదు. 507 00:36:24,685 --> 00:36:29,398 కానీ నువ్వు ఒకరోజు వచ్చి మాతో పని చేసేసరికి, 508 00:36:30,023 --> 00:36:31,775 మా కంపెనీ పేరు మొత్తం నాశనమైంది. 509 00:36:33,151 --> 00:36:37,072 అదేం నాశనం కాలేదు. అంటే, పేరు రావడం ఒక విధంగా 510 00:36:37,656 --> 00:36:38,866 చెడ్డ విషయం కాదు. 511 00:36:38,949 --> 00:36:43,412 నువ్వు నమ్మదగిన వాడివి కాదు, నీపై ఆధారపడి ఏమీ చేయలేము. 512 00:36:47,749 --> 00:36:49,877 బహుశా అందరూ శాంతించే వరకు మేము కొంత కాలం 513 00:36:51,044 --> 00:36:52,838 ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్తే మంచిదేమో. 514 00:36:55,632 --> 00:36:58,635 నేను నారికి ఫోన్ చేసి, అక్కడ కొన్ని రోజులు ఉండగలమోమో అడుగుతాను. 515 00:37:11,064 --> 00:37:12,482 నేను రావడం లేదు, ఆదేష్. 516 00:37:18,197 --> 00:37:20,073 నేను నీతో అక్కడికి రాను. 517 00:37:23,702 --> 00:37:25,537 కానీ నువ్వు నా భార్యవి కదా. 518 00:37:28,165 --> 00:37:29,166 నన్ను క్షమించు. 519 00:37:30,584 --> 00:37:31,793 హే. 520 00:37:33,128 --> 00:37:34,129 హే. 521 00:37:35,047 --> 00:37:38,509 నీకు నీ కుటుంబం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. 522 00:37:38,592 --> 00:37:39,968 కానీ మాట ఇస్తున్నా... 523 00:37:40,052 --> 00:37:41,595 ఇక నేను ఆ మాటలు నమ్మలేను. 524 00:37:42,221 --> 00:37:43,222 ప్లీజ్. 525 00:37:44,598 --> 00:37:45,599 నువ్వు నీ మాటపై నిలబడలేవు. 526 00:37:49,436 --> 00:37:52,523 నేను పరిస్థితిని సరి చేయగలను, సోనియా. 527 00:37:54,191 --> 00:37:56,693 నిజం బయటకి వస్తుంది. 528 00:37:56,777 --> 00:37:58,195 నిజం ఏమిటంటే... 529 00:38:00,656 --> 00:38:02,866 నీకు ఈ జీవితం ఎన్నటికీ చాలదు, అవునా? 530 00:38:13,794 --> 00:38:14,837 నేను సరిచేయగలను. 531 00:39:28,243 --> 00:39:29,453 మోన్? 532 00:39:29,536 --> 00:39:30,704 మోన్? 533 00:39:31,538 --> 00:39:33,999 మోన్. మోన్, నువ్వు బాగానే ఉన్నావా? ఏం జరిగింది? 534 00:39:35,209 --> 00:39:38,003 మోన్, ప్లీజ్, దయచేసి నాతో మాట్లాడు. ఏం జరిగింది, మోన్? 535 00:39:43,634 --> 00:39:44,635 మోన్. 536 00:39:53,936 --> 00:39:55,020 మనం సరైన నిర్ణయమే తీసుకున్నాం. 537 00:39:55,938 --> 00:39:57,439 మనం టిల్సన్ ని పట్టుకొని ఉండేవాళ్ళం. 538 00:39:57,981 --> 00:40:00,526 నువ్వు ఇక్కడ విధానాలు, నియమాలు అని ఆలోచిస్తుండగా, 539 00:40:00,609 --> 00:40:04,947 అక్కడ ఒక బిడ్డ, అలాగే వాడి అమ్మ, వాడు ఇంకెంతకాలం బ్రతికుంటాడో తెలీక చస్తున్నారు. 540 00:40:07,491 --> 00:40:10,118 లియోని కనిపెట్టడం నీకెంత ముఖ్యమో నాకు అంత ముఖ్యం కాదు అనుకుంటున్నావా? 541 00:40:13,705 --> 00:40:17,417 అదంతా కాకపోయినా, వాడు ఎంత త్వరగా దొరికితే నాకు అంత త్వరగా నీ తలనొప్పి పోతుంది. 542 00:40:18,877 --> 00:40:24,299 నేను నిన్ను హెచ్చరించాను 543 00:40:35,978 --> 00:40:37,771 నీ చెల్లి తనను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పిందని అతనికి చెప్పు. 544 00:40:37,855 --> 00:40:40,607 - ఏంటి? - ఎప్పటిలాగే వాడు, గూడర్థాలు వ్రాయకు. 545 00:40:43,527 --> 00:40:44,570 నన్ను మోనిక్ తో మాట్లాడనివ్వండి. 546 00:40:44,653 --> 00:40:46,572 నాటాలి, ఇప్పుడు నువ్వు బేరసారాలు జరిపే స్థితిలో లేవు. 547 00:40:46,655 --> 00:40:49,241 దయచేసి నన్ను మోనిక్ తో మాట్లాడనివ్వండి, 548 00:40:49,324 --> 00:40:50,659 తర్వాత మీరు ఏం చేయమన్నా చేస్తాను. 549 00:40:53,787 --> 00:40:54,788 సరే. 550 00:40:58,792 --> 00:41:03,964 నేను నాటాలిని. చెల్లి తనను ఎవరో అనుసరిస్తున్నారనుకుంది 551 00:41:04,047 --> 00:41:05,632 సాధారణంగా ఎంత త్వరగా రిప్లై ఇస్తాడు? 552 00:41:05,716 --> 00:41:06,717 వెంటనే. 553 00:41:07,259 --> 00:41:09,052 మెసేజ్ చేసేటప్పుడే ఫోన్ ఆన్ చేస్తాడు. 554 00:41:11,054 --> 00:41:13,640 నీ దగ్గర డబ్బు ఉంది, రేపు వచ్చి ఇస్తాను అని చెప్పు. 555 00:41:20,105 --> 00:41:22,858 డబ్బు ఉంది రేపు కలుద్దామా? 556 00:41:34,077 --> 00:41:36,496 సూచనలు ఇచ్చే వరకు ఆగు. 557 00:41:56,683 --> 00:42:00,145 ఎన్.సి.ఏ ప్రధాన కార్యాలయం 558 00:42:00,854 --> 00:42:01,897 రెండు నిముషాలు. 559 00:42:10,906 --> 00:42:12,324 నీ రూమ్ నాదానికన్నా పెద్దదా? 560 00:42:17,246 --> 00:42:19,414 నేను ఎంత కంగారు పడ్డానో. అసలు నువ్వు ఏం అలోచించి ఇలా చేసావు? 561 00:42:20,999 --> 00:42:22,167 నా కోసమే, కదా? 562 00:42:24,127 --> 00:42:26,088 అమెరికాలో నన్ను కాలేజీకి పంపడానికి నువ్వు డబ్బు దొంగిలించావు. 563 00:42:27,506 --> 00:42:28,632 నేను దొంగిలించలేదు. 564 00:42:28,715 --> 00:42:29,800 అవునా? 565 00:42:36,682 --> 00:42:38,725 ఆ కాలేజీలో నీకు సీటు దొరికినప్పుడు 566 00:42:39,393 --> 00:42:41,311 నేను చాలా గర్వపడ్డాను. 567 00:42:41,395 --> 00:42:42,729 ఇప్పటికీ గర్వపడుతున్నాను. 568 00:42:43,730 --> 00:42:46,066 డబ్బు అనే ఒక చిన్న కారణం, 569 00:42:46,149 --> 00:42:49,236 నీ ప్రతిభ గురించి ఈ లోకానికి తెలియనివ్వకుండా అడ్డుపడటం నాకు ఇష్టం లేదు. 570 00:42:49,319 --> 00:42:52,781 అంతేకాక, నువ్వు ఎక్కడో ఉంటావు, కాబట్టి... నాకూ మంచిదే. 571 00:42:55,534 --> 00:42:56,869 ఇవాళ నువ్వు వెళ్ళింది అందుకేనా? 572 00:42:59,121 --> 00:43:02,165 నేను అస్తమాను నిన్ను కాపీ కొడుతుంటానని నువ్వు అనేదానివి. ఇప్పుడు చూడు... 573 00:43:02,916 --> 00:43:05,335 లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. 574 00:43:05,419 --> 00:43:07,921 నీపై ఎలాంటి కేసు ఉండదు. అంతా సర్దుకుంటుంది. 575 00:43:09,131 --> 00:43:10,132 ఈ విషయం అమ్మకి తెలుసా? 576 00:43:12,092 --> 00:43:13,552 నాకు బాగా జీతం వస్తుందని తెలుసు అంతే. 577 00:43:13,635 --> 00:43:16,638 ఆమె సౌత్ లండన్ ఫైనాన్స్ మేనేజర్లు 578 00:43:16,722 --> 00:43:19,474 సిటీ ట్రేడర్లు సంపాదించేంత సంపాదిస్తారు అనుకుంటుంది పాపం. 579 00:43:20,851 --> 00:43:23,520 ఎంతైనా మనమంతా ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతాం, కదా? 580 00:43:26,523 --> 00:43:27,983 సరే. ఇక వెళ్దాం. 581 00:43:29,735 --> 00:43:31,445 కొంచెం సేపు ఓపిక పట్టు. 582 00:43:31,528 --> 00:43:32,863 అంతా సర్దుకుంటుంది. 583 00:43:35,449 --> 00:43:36,450 నువ్వే చూస్తావుగా. 584 00:43:54,801 --> 00:43:55,802 హే. 585 00:43:55,886 --> 00:43:56,887 కొత్త సమాచారం అందింది. 586 00:44:05,103 --> 00:44:07,022 మనం దృష్టి పెట్టాల్సిన అయిదవ వాడు అనుకుంట. 587 00:44:07,105 --> 00:44:09,024 కిడ్నాప్ జరిగిన రోజున ఎయిర్ పోర్ట్ లో 588 00:44:09,107 --> 00:44:11,360 "ఎడ్డీ వాకర్" అనే ఒకడు కార్ అద్దెకు తీసుకున్నాడు. 589 00:44:12,194 --> 00:44:15,822 దానికి కొన్ని గంటల ముందే వాడి డెబిట్ కార్డును హోటల్ దగ్గరున్న బార్ లో వాడాడు. 590 00:44:27,835 --> 00:44:28,836 ఎడ్డీ వాకర్? 591 00:44:29,795 --> 00:44:31,421 - చెప్పండి? - దయచేసి మాతో రండి. 592 00:44:31,505 --> 00:44:32,631 ఇదంతా దేనికి? 593 00:44:32,714 --> 00:44:34,049 - మాట విని మాతో రండి, ప్లీజ్. - సీరియస్ గా అంటున్నారా? 594 00:44:34,132 --> 00:44:36,176 సరే, నేను వస్తున్నాను. నన్ను ముట్టుకోకండి, సరేనా? 595 00:44:38,804 --> 00:44:40,222 ఇది లియో న్యూమ్యాన్ గురించేనా? 596 00:44:40,305 --> 00:44:42,349 మిస్టర్ వాకర్ ఎక్కడ చదువుతున్నాడో గెస్ చేయండి? 597 00:44:46,270 --> 00:44:47,938 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వూల్వ్సి కాలేజీ 598 00:44:48,021 --> 00:44:50,524 విద్యార్థి ఐడి వాకర్ - ఎడ్డీ 599 00:45:48,582 --> 00:45:50,584 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్