1 00:00:12,554 --> 00:00:13,555 ఎవరు మీరు? 2 00:00:16,391 --> 00:00:17,809 నాతో రండి. 3 00:01:11,780 --> 00:01:14,950 పీటీ ఫోన్ ని మీరు ఎప్పుడో పారేసి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు, ఎందుకు? 4 00:01:15,033 --> 00:01:17,703 మన్నించాలి, కానీ... అసలు ఎవరు మీరు? 5 00:01:17,786 --> 00:01:19,621 మీ స్నేహితుడికి సాయపడిన వ్యక్తిని నేను. 6 00:01:20,539 --> 00:01:22,916 సాయమా? అంటే ఏకీకరణ చేయడం ద్వారానా? దాని వల్లనే అతను చనిపోయాడు. 7 00:01:23,000 --> 00:01:25,002 పీటీ చనిపోయింది దాని వల్ల కాదు. 8 00:01:25,085 --> 00:01:27,004 చికిత్స తర్వాత పాటించమని నేను చెప్పిన సూచనలని 9 00:01:27,087 --> 00:01:29,631 పాటించి ఉంటే ఏమీ జరిగేదు కాదు, కానీ అతను ఇలా జ్వరం తగిలిందో లేదో, వెంటనే పారిపోయాడు... 10 00:01:29,715 --> 00:01:31,341 అయితే, మీరు... డాక్టర్ ఆ? 11 00:01:33,594 --> 00:01:35,429 మీ తలలో ఆ చిప్ ని పెట్టిన వ్యక్తిని నేను, 12 00:01:35,512 --> 00:01:38,098 దాన్ని డీయాక్టివేట్ చేయగల ఏకైక వ్యక్తిని కూడా నేనే. 13 00:01:46,648 --> 00:01:48,483 బహుశా దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలని నాకు లేదేమో. 14 00:01:49,151 --> 00:01:52,070 అవును. కానీ మీ పని అవతారానికి కావలసింది అదేనేమో. 15 00:01:52,738 --> 00:01:56,533 దీన్నంతటి గురించి అతను ఏమనుకుంటున్నాడో, అసలు ఆనందంగా ఉన్నాడో లేదో అని ఎప్పుడైనా ఆలోచించారా? 16 00:01:57,284 --> 00:02:00,537 నాకు ఆ "పని అవతారం" అనే పదమే నచ్చదు. ఏదో మీరందరూ స్కూల్ పిల్లల్లాగా. 17 00:02:01,663 --> 00:02:04,291 అయినా మీపై వేర్పాటు పద్ధతి జరిగి రెండేళ్లేగా అయింది? 18 00:02:04,374 --> 00:02:06,668 అయితే మీ పని అవతారం నిజంగానే స్కూల్ పిల్లోడులే. 19 00:02:08,211 --> 00:02:13,717 నా పని అవతారానికి సొంతంగా ఒక జీవితం ఉంది, ఆ కారణంగా, నేను నా జీవనం సాగించగలుగుతున్నాను. 20 00:02:15,093 --> 00:02:17,721 కానీ మీరు ఉన్నారు కాబట్టే అతను కూడా ఉన్నాడు. 21 00:02:17,804 --> 00:02:20,933 ఏ విధంగా చూసుకున్నా, అతను మీరూ ఒక్కటే. 22 00:02:23,810 --> 00:02:25,854 అతను అక్కడ వేరుగా ఉంటారని మీకు అనిపిస్తోందా? 23 00:02:26,688 --> 00:02:29,650 జుట్టు వేరేగా దువ్వుకుంటాడు, లేకపోతే వేరే జోకులకు నవ్వుతాడు అనుకుంటున్నారా? 24 00:02:30,901 --> 00:02:32,986 మీరు అన్నట్టు అతనికి అక్కడి జీవితం నచ్చే ఉండవచ్చు. 25 00:02:33,612 --> 00:02:35,030 నచ్చనూ ఉండకపోవచ్చు. 26 00:02:36,365 --> 00:02:40,410 బహుశా ప్రతిరోజూ దాని నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాడేమో. 27 00:02:42,538 --> 00:02:46,875 కానీ అది మీకు తెలీదు. ఎప్పటికీ తెలీదు. 28 00:02:49,294 --> 00:02:53,340 మీ స్వార్థం కోసం, భావావేశంగా మీరు బాగుండటానికి, అతని అనుమతి లేకుండానే 29 00:02:54,132 --> 00:02:57,553 అతడిని ఆ నరకంలోకి వదిలేశారు. 30 00:03:01,807 --> 00:03:03,392 నేనేమీ చెడ్డ వాడిని కాదు. 31 00:03:04,393 --> 00:03:06,645 మీరు సరైన పనే చేయాలనుకుంటున్నారు అనుకుంటా. 32 00:03:08,438 --> 00:03:09,523 మీ ఇద్దరూ కూడా. 33 00:03:14,570 --> 00:03:15,737 మిస్టర్ స్కౌట్. 34 00:03:19,783 --> 00:03:21,118 ఎవరు మీరు? 35 00:03:21,201 --> 00:03:24,955 మనిద్దరం సహోద్యోగులం. ఆఫీసులో. 36 00:03:28,876 --> 00:03:31,170 ఎవరితో అయినా మాట్లాడుతున్నావా, మార్క్? 37 00:03:34,006 --> 00:03:36,717 పర్లేదులే. నేను స్నేహితుడిని అనుకొని చెప్పు. 38 00:03:38,218 --> 00:03:39,178 అయ్య బాబోయ్! 39 00:03:40,679 --> 00:03:42,181 ఏం చేస్తున్నారు మీరు? 40 00:03:46,226 --> 00:03:47,811 - వచ్చి చేతులు పట్టుకోండి. - ఏంటి? 41 00:03:48,645 --> 00:03:50,439 రండి. చేతులు పట్టుకోండి. 42 00:03:54,943 --> 00:03:56,945 బాబోయ్. ఓరి నాయనోయ్. 43 00:03:57,696 --> 00:04:00,073 అయ్య బాబోయ్. ఓరి దేవుడా. 44 00:04:03,619 --> 00:04:05,829 అయ్యో. అయ్యయ్యో. 45 00:04:07,539 --> 00:04:08,624 నేను ఇతని సహోద్యోగిని. 46 00:04:08,707 --> 00:04:10,209 కాదు. 47 00:04:11,877 --> 00:04:15,547 ఇతని పేరు డగ్ గ్రేనర్. ప్రత్యేకమైన అంతస్థులో ఇతను సెక్యూరిటీకి హెడ్. 48 00:04:15,631 --> 00:04:17,298 సెక్యూరిటీయా? చచ్చాన్రా దేవుడా. 49 00:04:18,007 --> 00:04:20,719 సరే, నాకు వికారంగా ఉంది, వాంతి వస్తోంది. 50 00:04:20,802 --> 00:04:24,223 - వాంతి వచ్చేస్తోంది. - వద్దు! వద్దు! 51 00:04:24,306 --> 00:04:25,516 అందులో డీ.ఎన్.ఏ ఉంటుంది. 52 00:04:30,437 --> 00:04:33,774 ఇదుగో, గ్రేణర్ సెక్యూరిటీ కార్డ్. 53 00:04:33,857 --> 00:04:36,818 దీనితో మీరు ఎక్కడికైనా వెళ్లవచ్చు, దీన్ని ఎవరికీ లింక్ చేయలేరు కూడా. 54 00:04:36,902 --> 00:04:39,655 రేఫు దీన్ని ఆఫీసుకు తీసుకువెళ్లండి, దీనితో ఏం చేయాలో అతనికి తెలుస్తుంది. 55 00:04:40,322 --> 00:04:41,698 ఎవరికి? 56 00:04:41,782 --> 00:04:42,950 మీకే. 57 00:04:43,492 --> 00:04:48,121 నాకు పీటీ ఫోన్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. 58 00:04:48,747 --> 00:04:50,165 ఈ శవం సంగతి నేను చూసుకుంటా. 59 00:04:51,542 --> 00:04:53,919 ఇంటికి వెళ్ళండి. మీ బట్టలను ఎక్కడైనా పారేయండి. 60 00:04:55,170 --> 00:04:56,171 వెంటనే వెళ్లిపోండి. 61 00:05:03,971 --> 00:05:07,015 నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ఏమీ కాదు, మీరు వెళ్లిపోండి. 62 00:05:07,099 --> 00:05:09,184 పీటీ మొదలుపెట్టిన దాన్ని మనం ముగిద్దాం, మార్క్. 63 00:05:10,227 --> 00:05:11,895 ఇక ఇక్కడి నుండి వెళ్లిపోండి! 64 00:08:09,031 --> 00:08:10,866 - హేయ్. - హేయ్. 65 00:08:10,949 --> 00:08:13,410 నీళ్లు తాగడానికి వచ్చానంతే. నీకేమైనా కావాలా? 66 00:08:13,994 --> 00:08:14,995 ఎక్కడికి వెళ్లిపోయావు? 67 00:08:15,829 --> 00:08:16,830 ఎవరు, నేనా? 68 00:08:17,456 --> 00:08:18,957 - అవును. - కేవలం... 69 00:08:19,041 --> 00:08:20,292 నాకు కారు శబ్దం వినిపించింది. 70 00:08:22,920 --> 00:08:24,087 అవునా? 71 00:08:32,554 --> 00:08:33,679 నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు. 72 00:08:36,475 --> 00:08:38,477 అది నీ కల ఏమో. 73 00:08:41,145 --> 00:08:43,398 నేను లేచి గంట అయింది, నువ్వు లేనే లేవు. 74 00:08:48,695 --> 00:08:49,988 సరే, అంటే... 75 00:08:52,074 --> 00:08:53,617 క్షమించు, నేను... 76 00:08:55,619 --> 00:08:58,789 నేను మనస్సు ప్రశాంతంగా ఉండటానికి అలా బయటకు వెళ్లాను. 77 00:09:01,083 --> 00:09:02,209 నువ్వు బాగానే ఉన్నావా? 78 00:09:07,631 --> 00:09:11,301 అంటే, ఇది నాకు చాలా పెద్ద విషయం కదా. నాకు... 79 00:09:15,180 --> 00:09:16,890 నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇది... 80 00:09:22,062 --> 00:09:23,272 నేను వెళ్లిపోనా? 81 00:09:27,693 --> 00:09:28,694 అదే మంచిదేమో. 82 00:09:30,779 --> 00:09:31,905 అదే మంచిదేమో. 83 00:10:24,833 --> 00:10:26,210 నీ యెంకమ్మ. 84 00:10:28,754 --> 00:10:29,796 మార్క్! 85 00:10:30,422 --> 00:10:33,717 - హేయ్. - ఇంత మంచులో పొద్దునే బయటకు వచ్చావే. 86 00:10:33,800 --> 00:10:38,180 మామూలుగా మధ్యాహ్నానికి ఇంకాసేపు ఉందనగా చెత్తను వేస్తుంటావు. 87 00:10:38,263 --> 00:10:43,352 ఇవాళ కాస్త ముందుగానే పని మొదలుపెట్టాను, అంతే. 88 00:10:44,853 --> 00:10:46,396 నిన్ను చూస్తే ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు, మార్క్. 89 00:10:48,690 --> 00:10:53,529 దాని గురించి మనం వేడిగా టీ తాగుతూ మాట్లాడుకుంటే బాగుంటుందేమో, ఏమంటావు? 90 00:10:54,738 --> 00:10:58,575 సరే. ఇవాళ ఎలా గడుస్తుందో చూస్తాను ముందు. 91 00:10:59,576 --> 00:11:03,747 ఇది మామూలు మంచు కాదురా నాయనోయ్. 92 00:11:21,932 --> 00:11:24,059 మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ 93 00:12:29,666 --> 00:12:30,751 బర్ట్ జీ. 94 00:12:31,418 --> 00:12:34,713 మిస్టర్ మిల్చెక్. మిమ్మల్ని చూడటం బాగుంది, సర్. 95 00:12:34,796 --> 00:12:36,381 - ఇంత త్వరగా వచ్చారే. - దయచేసి కూర్చోండి. 96 00:12:36,465 --> 00:12:37,466 థ్యాంక్యూ. 97 00:12:38,133 --> 00:12:39,676 నేను మీ కోసం ఒకటి తెచ్చాను. 98 00:12:40,594 --> 00:12:43,388 కనబడకుండా పోయిన 7199-జీ. 99 00:12:43,472 --> 00:12:47,267 ఆస్వాల్డ్ ఎగిరి గంతెస్తాడు. నాకు కూడా అలానే ఉందనుకోండి. 100 00:12:47,351 --> 00:12:50,103 మంచిది. ఇప్పుడు మనం తుది సన్నాహాలపై దృష్టి పెట్టవచ్చు కదా! 101 00:12:50,187 --> 00:12:52,189 - తప్పకుండా. - ఏ ఆటంకాలు లేకుండా. 102 00:12:52,272 --> 00:12:54,316 - తప్పకుండా. - సూపర్. 103 00:12:58,654 --> 00:13:00,447 - నేను చూడవచ్చా? - తప్పకుండా. 104 00:13:06,453 --> 00:13:07,538 సూపర్. 105 00:13:07,621 --> 00:13:08,872 - అవును. - వావ్. 106 00:13:10,290 --> 00:13:12,626 ఈ డిపార్టుమెంటుకు మీరు ఒక గొప్ప నాయకునిగా పని చేశారు, బర్ట్ జీ. 107 00:13:12,709 --> 00:13:13,710 థ్యాంక్యూ. 108 00:13:13,794 --> 00:13:15,587 మీకు ఒక ప్రత్యేకమైన రివార్డ్ ఇవ్వాలి. 109 00:13:16,463 --> 00:13:20,008 బ్రేక్ రూమ్ కి తీసుకెళ్లకుంటే చాలు. 110 00:13:20,092 --> 00:13:21,802 నిన్న జరిగినదాని నుండే నేను ఇంకా కోలుకోలేదు. 111 00:13:25,389 --> 00:13:30,477 లేదు. అది కాదు. ఇది వేరేది. ఎదురు చూస్తూ ఉండండి. 112 00:13:38,402 --> 00:13:41,363 డిలన్ జీ. శుభోదయం. 113 00:13:42,990 --> 00:13:44,116 ఏంటది? 114 00:13:44,658 --> 00:13:45,701 నాతో రా, 115 00:13:49,329 --> 00:13:52,124 నిన్న రాత్రి జరిగినదాన్ని అత్యవసర సర్దుబాటు అని అంటాము. 116 00:13:52,791 --> 00:13:57,087 అప్పుడప్పుడూ ఉద్యోగులను బయట కూడా పని అవతారాలుగా మార్చడానికి వీలు కల్పించే రక్షణాత్మక చర్య అది. 117 00:13:57,171 --> 00:13:59,214 మీరు అలా చేయగలరని మాకు ఎప్పుడూ చెప్పలేదే. 118 00:13:59,298 --> 00:14:00,757 అది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడతాం. 119 00:14:01,592 --> 00:14:04,428 మిస్ కొబెల్ ఈ మధ్య చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి, నేను ఆమెకి కూడా ఇది చెప్పలేదు. 120 00:14:05,220 --> 00:14:08,307 ఆ పిల్లాడు. వాడు... వాడు నా కొడుకా? 121 00:14:12,561 --> 00:14:15,522 వాడు వెయ్యి లెక్కపెడతాను అన్నాడు, కానీ పూర్తిగా లెక్కపెట్టకుండానే వచ్చేశాడు. 122 00:14:18,317 --> 00:14:22,029 ఇది నీ సహచరులకి చెప్పకపోవడమే మంచిది, డిలన్. 123 00:14:22,696 --> 00:14:26,408 ఈ ఓటీసీ చాలా రహస్యమైనది. అర్థమైందా? 124 00:14:31,163 --> 00:14:32,497 నాకు ఆ పిల్లాడి పేరు చెప్తావా? 125 00:14:34,958 --> 00:14:37,794 తెలియకపోవడమే మంచిది. 126 00:14:41,006 --> 00:14:43,675 హేయ్, ఈ త్రైమాసికం బాగా ఒత్తిడ్తితో కూడుకున్నదని నేను అర్థం చేసుకోగలను. 127 00:14:44,426 --> 00:14:47,262 నీకు కొన్ని ప్రత్యేకమైన పెర్కులని ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను. 128 00:14:48,764 --> 00:14:49,932 ఏమంటావు? 129 00:14:55,437 --> 00:14:58,524 మంచి వాడివి, డిలన్. నువ్వు మంచి వాడివి. 130 00:15:52,953 --> 00:15:55,163 మార్క్ ఎస్. శుభోదయం. 131 00:15:56,373 --> 00:15:57,374 శుభోదయం. 132 00:16:02,129 --> 00:16:03,505 మరి, నన్ను నువ్వేమైనా... 133 00:16:03,589 --> 00:16:05,507 నేను నిన్ను నీ డెస్క్ దాకా తీసుకెళ్లడానికి వచ్చాను. 134 00:16:06,341 --> 00:16:07,426 ఇది కొత్త ప్రోటోకాల్. 135 00:16:09,261 --> 00:16:10,262 బాగానే ఉంది. 136 00:16:11,388 --> 00:16:12,389 అయితే ముందు పద మరి. 137 00:16:55,390 --> 00:16:56,767 ఏంటి, ఇప్పుడు మమ్మల్ని బంధించి ఉంచుతున్నారా? 138 00:16:56,850 --> 00:16:59,394 "సురక్షిత ప్రదేశం" అని అంటే బాగుంటుంది. 139 00:17:00,187 --> 00:17:04,566 ఇవి ఉండటం వలన మీరు మీ డెస్కుల వద్దనే చక్కగా పని చేసుకుంటున్నారని మాకు భరోసాగా ఉంటుంది. 140 00:17:04,650 --> 00:17:06,401 ఇలా చేయమని మిస్టర్ గ్రేనర్ చెప్పారా? 141 00:17:08,987 --> 00:17:10,364 మార్క్ ఎస్ వచ్చేశాడు. 142 00:17:10,446 --> 00:17:11,448 కూర్చో. 143 00:17:11,990 --> 00:17:14,742 - నేను... - బ్లాక్ కాఫీయే కదా. నేను తెస్తానులే. 144 00:17:15,285 --> 00:17:16,286 శుభోదయం, మార్క్. 145 00:17:17,454 --> 00:17:18,955 - శుభోదయం. - శుభోదయం. 146 00:17:20,540 --> 00:17:21,791 మార్క్, ఏంటి ఇదంతా? 147 00:17:26,630 --> 00:17:27,631 ఎలా ఉన్నావు, అర్వ్? 148 00:17:27,714 --> 00:17:29,842 బాగానే ఉన్నా, థ్యాంక్యూ. నేను... 149 00:17:29,925 --> 00:17:33,262 ఈ మార్పులు... చాలా బాగున్నాయి. 150 00:17:33,345 --> 00:17:34,763 అవును. 151 00:17:34,847 --> 00:17:35,973 డిలన్, నువ్వు బాగానే ఉన్నావా? 152 00:17:36,765 --> 00:17:37,975 బాగానే ఉన్నాను. 153 00:17:38,517 --> 00:17:42,312 ఏంటి ఇలా జవాబు ఇస్తున్నావు? మామూలుగా అయితే పంచ్ వేస్తావు కదా? 154 00:17:44,731 --> 00:17:47,860 ఇదుగో. చక్కగా చేసుకొని తీసుకొని వచ్చాను. 155 00:17:51,113 --> 00:17:52,114 థ్యాంక్స్. 156 00:17:57,411 --> 00:18:00,789 హేయ్, నేను. మీకు తెలుసో లేదో కానీ, గ్రేనర్ ఇంకా రాలేదు. 157 00:18:00,873 --> 00:18:03,375 అంతా బాగానే ఉంది, మీరు ఎక్కడ ఉన్నారా అని ఆలోచిస్తున్నా. 158 00:18:06,837 --> 00:18:10,299 నా శరీరాన్ని కాస్త ముందుకు ఇలా ఒంచి, 159 00:18:10,382 --> 00:18:13,135 పాప మెడను మెల్లగా ఇలా పట్టుకోవాలి. 160 00:18:15,304 --> 00:18:19,474 మెల్లగా శ్వాస విడవాలి. సన్నని గాలి మాత్రమే విడుదలయ్యేలా. 161 00:18:20,225 --> 00:18:23,645 ఆ తర్వాత ఇలా చేయాలి, ఆపై ఇలా చేయాలి. 162 00:18:24,313 --> 00:18:29,109 పాపకి చనుమొనలు కనిపించేలా చేయాలి, ఆ తర్వాతా గుటగుటా తాగేస్తుంది, అంతే. 163 00:18:30,611 --> 00:18:31,862 ఇప్పుడు మీరు ప్రయత్నించి చూడండి. 164 00:18:33,155 --> 00:18:34,156 సరే. 165 00:18:34,781 --> 00:18:36,825 నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్దమేనా, బంగారం? 166 00:18:38,660 --> 00:18:39,703 సరే. 167 00:18:40,787 --> 00:18:44,541 - చనుమొనలను పాపకి చూపండి. - అలాగే. 168 00:18:44,625 --> 00:18:47,961 - తను... - తాగేస్తోంది. 169 00:18:48,045 --> 00:18:51,298 - అంతే, ఎలెనోర్, అంతే! సూపర్! - ఓరి దేవుడా. 170 00:18:52,216 --> 00:18:56,178 పాప తాగేస్తోంది, తాగేస్తోంది. 171 00:18:59,389 --> 00:19:05,270 తర్వాత తను విమానశ్రయంలో ఉండే రెస్ట్ రూమ్ కి వెళ్లి, చేత్తో పిండాలని చూస్తుంది. 172 00:19:06,313 --> 00:19:11,193 తను టాయిలెట్ లోకి వెళ్లి టాయిలెట్ పేపర్ పై పిండాలనుకుంటుంది, 173 00:19:11,276 --> 00:19:14,112 కానీ అవి చుట్టూరా పడిపోతాయి. 174 00:19:14,196 --> 00:19:17,199 - చాలా వేగంగా వస్తున్నాయన్నమాట. - అయ్యయ్యో! 175 00:19:19,159 --> 00:19:20,160 ఇక ఆపండి. 176 00:19:21,245 --> 00:19:25,999 ఓరి దేవుడా. నాకు సాయపడినందుకు థ్యాంక్స్. 177 00:19:27,584 --> 00:19:29,336 మీరు అంగడికి వెళ్లాలని అన్నట్టున్నారు? 178 00:19:30,087 --> 00:19:34,591 నేను లేకుండానే చూసుకోగలరులే. ఇక్కడ నాకు భలే సరదాగా ఉంది. 179 00:19:34,675 --> 00:19:38,470 అదీగాక, ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి 180 00:19:38,554 --> 00:19:40,639 ఆయాలు, పని మనుషులు ఎవరూ లేరు కదా? 181 00:19:40,722 --> 00:19:41,723 అది నిజమే. 182 00:19:45,936 --> 00:19:48,230 పురుడు పోసే రిసార్టులో నాకొక సంపన్న మహిళ పరిచయం అయింది. 183 00:19:48,814 --> 00:19:50,941 తన భర్త రాష్ట్ర సెనేటర్ అనుకుంటా. 184 00:19:51,024 --> 00:19:52,317 వావ్. 185 00:19:52,401 --> 00:19:56,780 నాకు తెలుసు, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ పార్కులో తనని కలిశాను, 186 00:19:56,864 --> 00:19:59,116 అప్పుడు తను నన్ను అస్సలు గుర్తుపట్టనే లేదు, భలే వింతగా అనిపించింది. 187 00:19:59,700 --> 00:20:01,201 అది అస్సలు మంచి విషయమే కాదు. 188 00:20:01,994 --> 00:20:02,995 అవును. 189 00:20:04,621 --> 00:20:08,333 అంటే... ఏమో మరి. ఇది పిచ్చిగా అనిపించవచ్చు. 190 00:20:11,295 --> 00:20:16,049 మార్క్ పని చేసే సంస్థ, లూమన్ వాళ్లు, తాము కేవలం పని కోసమే వేర్పాటు పద్దతి జరుపుతామంటారు. 191 00:20:16,800 --> 00:20:20,053 కానీ నాకేం ఆలోచన వచ్చిందంటే, ఒకవేళ ఎవరికైనా... 192 00:20:21,597 --> 00:20:24,641 అంటే, ఎవరికైనా బిడ్డ కావాలనిపించి, కానీ వాళ్లకి ఒకవేళ... 193 00:20:26,727 --> 00:20:27,728 ఏమో మరి. 194 00:20:30,898 --> 00:20:33,901 నేను అయితే వాడు మహేష్ బాబు అయినా పట్టించుకోనులే. 195 00:20:33,984 --> 00:20:35,569 అతనికి బిడ్డని కనిస్తే అదే చాలు, కాబట్టి... 196 00:20:37,237 --> 00:20:38,238 అవును. 197 00:20:43,619 --> 00:20:44,703 వేర్పాటు పద్ధతి జరిపించుకోవడం. 198 00:20:46,788 --> 00:20:48,665 మార్క్ అసలు అలా ఎందుకు చేయించుకున్నాడు? 199 00:20:50,375 --> 00:20:53,670 తన భార్య చనిపోయిన వెంటనే అలా చేయించుకున్నాడు. 200 00:20:56,590 --> 00:20:59,676 మొదట్లో, కాలేజీలో టీచర్ గా చేరాడు, కానీ అది చేయలేకపోయాడు. 201 00:21:02,387 --> 00:21:04,139 అసలు ఆమె గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా? 202 00:21:04,890 --> 00:21:06,141 పెద్దగా ఏమీ మాట్లాడడు. 203 00:21:07,976 --> 00:21:11,313 నా భర్త చనిపోయినప్పుడు, ఎక్కడ చూసినా నాకు ఆయనే కనిపించేవాడు. 204 00:21:11,396 --> 00:21:13,565 అప్పుడు చాలా కష్టంగా అనిపించేది. 205 00:21:15,734 --> 00:21:17,736 మార్క్ కి కూడా అలాగే ఆమె కనిపించేదా? 206 00:21:25,410 --> 00:21:27,079 శ్రేష్ఠత 33% పూర్తి అయింది 207 00:21:31,500 --> 00:21:32,501 హేయ్. 208 00:21:33,544 --> 00:21:34,545 హేయ్. 209 00:21:34,628 --> 00:21:36,505 - నేను ఇప్పుడే బాత్రూమ్ నుండి వస్తున్నాను. - అవునా? 210 00:21:36,588 --> 00:21:40,926 అవును. సోప్ లేబుల్స్ ఏవీ లేవు ఏంటి? 211 00:21:41,802 --> 00:21:42,928 - సోప్ లేబుల్స్ ఆ? - అవును. 212 00:21:43,011 --> 00:21:48,058 సోప్ డిస్పెన్సర్స్ మీద "సోప్" అని ఉండాలి కదా? 213 00:21:48,767 --> 00:21:49,768 అలా ఎప్పుడూ మనం పెట్టలేదు కదా. 214 00:21:50,727 --> 00:21:51,937 అది సోప్ అని అందరికీ తెలిసిందే కదా. 215 00:21:53,981 --> 00:21:56,233 ఇది ఓ&డీ వాళ్లని అడగాల్సిన ప్రశ్న అనుకుంటా. 216 00:21:56,316 --> 00:21:59,987 అర్వ్, మనం ఎక్కడికీ వెళ్లకూడదని నీకు తెలుసు కదా. 217 00:22:00,070 --> 00:22:01,947 బర్ట్ విషయంలో నీకు ఆందోళనగా ఉందని నాకు తెలుసు. 218 00:22:03,490 --> 00:22:06,994 అక్కడికి మనం వెళ్లిన కారణంగా, అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారేమో? 219 00:22:07,077 --> 00:22:08,954 నిజంగానే తీసుకుంటున్నారేమో, అంతా తమరి చలవే కదా. 220 00:22:10,080 --> 00:22:12,249 అసలు మొదట్నుంచీ అక్కడికి వెళ్లడం మంచిది కాదని 221 00:22:12,332 --> 00:22:15,502 అరిగిపోయిన రికార్డర్ లా నీకు చెప్తూనే ఉన్నాను. 222 00:22:17,171 --> 00:22:19,298 శుభోదయం, రిఫైనర్లారా! 223 00:22:20,299 --> 00:22:21,633 ఏంటిది? 224 00:22:23,343 --> 00:22:24,678 సంగీత నృత్య కార్యక్రమం. 225 00:22:25,345 --> 00:22:27,222 తనకి 75% వచ్చిందా? 226 00:22:32,769 --> 00:22:35,272 హెల్లీ ఆర్, ముందుకు రండి. 227 00:22:36,982 --> 00:22:38,066 సంగీత నృత్య కార్యక్రమమా? 228 00:22:38,150 --> 00:22:42,112 సియానాలో 75 శాతానికి చేరుకోవడం ద్వారా, నువ్వు, నీకు అలాగే నీ సహచరులకు 229 00:22:42,196 --> 00:22:47,910 అయిదు నిమిషాల పాటు సంగీత నృత్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందించావు. 230 00:22:48,785 --> 00:22:52,915 మిస్టర్ మిల్చెక్, తను ఇప్పుడు 73 శాతం వద్దనే ఉంది. 231 00:22:54,041 --> 00:22:56,126 అవును, కానీ ఈ రోజు ఉదయం నుండి అందరికీ ఇబ్బందిగానే ఉంది. 232 00:22:56,835 --> 00:22:59,129 - నీకేం ఇబ్బంది వచ్చి పడింది? - ఈ సమయంలో కాస్తంత సరదాగా గడిపితే 233 00:22:59,213 --> 00:23:01,215 అందరికీ ఊరటగా ఉంటుంది అనుకున్నా. 234 00:23:01,798 --> 00:23:04,718 హెల్లీ, దయచేసి సంగీత నృత్య కార్యక్రమం బండి దగ్గరకి రా. 235 00:23:06,803 --> 00:23:09,139 ఒక శైలిని, ఒక పరికరాన్ని నువ్వు తీసుకోవచ్చు. 236 00:23:09,223 --> 00:23:10,682 సంగీత పారవశ్యం (ఒకటి ఎంచుకోండి) 237 00:23:10,766 --> 00:23:12,017 బాడీ ఫంక్ బైన్సీ స్వింగ్ 238 00:23:15,145 --> 00:23:18,357 మరాకాని ఎంచుకున్నావా. సూపర్. 239 00:23:18,440 --> 00:23:20,776 చిడతలను ఎంచుకొని ఉండాల్సింది. 240 00:23:22,069 --> 00:23:25,405 నేను "డిఫయంట్ జాజ్" సంగీతాన్ని ఎంచుకుంటున్నాను. 241 00:23:26,698 --> 00:23:29,034 ఈ కార్యక్రమం హెల్లీకి గుర్తింపుగా జరిగేదే అయినా 242 00:23:29,117 --> 00:23:32,871 మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. 243 00:23:46,260 --> 00:23:47,261 వావ్. 244 00:23:48,804 --> 00:23:49,805 సరే మరి. 245 00:23:56,061 --> 00:23:57,062 చీర్స్. 246 00:23:57,771 --> 00:23:58,897 నాకు కంగారుగా ఉంది! 247 00:24:20,127 --> 00:24:21,378 కానివ్వు, మార్క్. 248 00:24:42,274 --> 00:24:44,193 అర్వింగ్, మరి నీ సంగతేంటి? నీ ప్రతిభ చూపించు. 249 00:25:29,905 --> 00:25:32,699 నాన్నా. నాన్నా. నాన్నా. 250 00:25:38,956 --> 00:25:42,209 - వాడి పేరేంటి? నాకు వాడి పేరు చెప్పు! - డిలన్! పైకి లేయ్! 251 00:25:42,292 --> 00:25:43,293 వీడిని లేపండి! 252 00:25:46,255 --> 00:25:48,757 - నన్ను కొరుకుతున్నాడు! - డిలన్, ఏం చేస్తున్నావు! 253 00:25:48,841 --> 00:25:52,219 - బాబోయ్! డిలన్! లేయ్, డిలన్! - నన్ను కొరికేస్తున్నాడు! 254 00:26:03,313 --> 00:26:04,523 చర్మం ఊడి వచ్చేలా కొరికాడు. 255 00:26:05,107 --> 00:26:07,234 అతనికి సెప్టిక్ ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. 256 00:26:10,112 --> 00:26:13,407 ఇది సరైన ప్రవర్తన కాదు, డిలన్, నేను దీన్ని మిస్ కొబెల్ కి ఫిర్యాదు చేస్తాను. 257 00:26:14,199 --> 00:26:15,868 అవునా, తోడుగా నన్ను కూడా రమ్మంటావా? 258 00:26:30,132 --> 00:26:33,260 సంగీత నృత్య కార్యక్రమాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నాను. 259 00:26:46,231 --> 00:26:47,691 అసలు నీకేమైంది? 260 00:26:48,483 --> 00:26:49,735 వాళ్లు మనల్ని ఎప్పుడైనా పని అవతారాలుగా మార్చగలరు. 261 00:26:50,694 --> 00:26:51,778 ఏంటి? 262 00:26:52,946 --> 00:26:55,949 ఆఫీసు బయట ఉన్నా కూడా, దాన్ని అత్యవసర సర్దుబాటు అని పిలుస్తారు. 263 00:26:56,783 --> 00:26:58,118 నువ్వు ఏం అంటున్నావు? 264 00:26:58,869 --> 00:27:00,954 నిన్న రాత్రి, నేను లిఫ్ట్ ఎక్కాక, 265 00:27:01,038 --> 00:27:04,583 నేను మిల్చెక్ తో మా ఇంట్లో మేలుకున్నాను. 266 00:27:05,709 --> 00:27:06,710 ఏంటి? 267 00:27:09,338 --> 00:27:10,547 నేను నా కొడుకుని చూశాను. 268 00:27:16,637 --> 00:27:17,846 వాడు వచ్చి నన్ను హత్తుకున్నాడు. 269 00:27:19,348 --> 00:27:21,183 నన్ను చూసి చాలా సంతోషపడ్డాడు. 270 00:27:23,560 --> 00:27:26,230 ఆ తర్వాత మిల్చెక్ వాడిని లాగేశాడు, అంతటితో అయిపోయింది. 271 00:27:28,315 --> 00:27:31,109 అది చాలా వేగంగా గడిచిపోయింది, ఇంకా గుర్తు తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. 272 00:27:31,193 --> 00:27:34,321 - బాబోయ్, డిలన్. నాకు బుర్ర పని చేయట్లేదు. - అవును, అది న్యాయం కాదు. 273 00:27:35,280 --> 00:27:38,075 ఇప్పట్నుంచీ రోజూ ఇక్కడ ఆ జ్ఞాపకాలు నా మెదడులో తిరుగుతూనే ఉంటాయి. 274 00:27:38,158 --> 00:27:39,660 వాడిని చూసే అవకాశం నాకు ఎప్పటికీ దక్కదు కూడా. 275 00:27:39,743 --> 00:27:41,995 అతను నీ కొడుకు కాదు, డిలన్. అతను నీ పనియేతర అవతారం యొక్క కొడుకు. 276 00:27:42,079 --> 00:27:44,957 తొక్కేం కాదు. వాడు నా కొడుకే. 277 00:27:46,083 --> 00:27:48,877 ఇది మంచిదే. దీన్ని మనం వాడుకోవచ్చు. 278 00:27:48,961 --> 00:27:50,212 ఏంటి? 279 00:27:50,295 --> 00:27:51,839 వీళ్ళు మనల్ని బయట, పని అవతారాలుగా మార్చగలరు కదా, 280 00:27:51,922 --> 00:27:54,132 అంటే ఆ పని మనపై మనం కూడా చేసుకోవచ్చు కదా? 281 00:27:54,216 --> 00:27:55,884 నువ్వు ఏమంటున్నావు? 282 00:27:56,802 --> 00:28:00,597 మనల్ని నియత్రించడానికి వాళ్లు ఉపయోగించే దాన్ని మనం కనిపెట్టి, దాన్ని మనం నియంత్రించవచ్చు. 283 00:28:02,057 --> 00:28:04,393 మనందరం బయట లోకాన్ని చూడవచ్చు, మనమెవరమో తెలుసుకోవచ్చు. 284 00:28:04,476 --> 00:28:07,896 కానీ, హెల్లీ, అది మంచి పని కాదు. మనం పని అవతారాలం. 285 00:28:07,980 --> 00:28:11,900 అదీగాక, ఆ కంట్రోల్స్ ఉండే చోటుకు మనం వెళ్లే అవకాశం అస్సలు లేదు. 286 00:28:13,110 --> 00:28:14,862 నువ్వు సెక్యూరిటీ ఆఫీసు గురించి మాట్లాడుతున్నావా? 287 00:28:16,864 --> 00:28:18,115 అది... 288 00:28:18,198 --> 00:28:19,408 గ్రేనర్ కీ కార్డు ఆ? 289 00:28:20,075 --> 00:28:22,119 - ఇది నీకు ఎక్కడిది? - సంగీత నృత్య కార్యక్రమం 290 00:28:22,202 --> 00:28:23,787 జరుగుతున్నప్పుడు, ఇది నా జేబులో ఉన్నట్టు గుర్తించా. 291 00:28:23,871 --> 00:28:27,624 నేను ఇవాళ ఆఫీసుకు వచ్చేటప్పుడు ఇది నా దగ్గరే ఉండింది అనుకుంటా. 292 00:28:27,708 --> 00:28:30,294 మన సెక్యూరిటీ హెడ్ కి సంబంధించిన కీ కార్డ్ నీ పనియేతర అవతారం దగ్గర ఎందుకు ఉంది? 293 00:28:34,631 --> 00:28:35,757 ఏమో, నాకూ తెలీదు. 294 00:28:40,137 --> 00:28:42,055 మనం ఇప్పుడు అలా బయటకు వెళ్లాలి అనుకుంటా. 295 00:28:42,639 --> 00:28:45,142 సెక్యూరిటీ గార్డులందరూ పని చేసే సెక్యూరిటీ ఆఫీసుకా? 296 00:28:45,225 --> 00:28:46,226 అది అదిరిపోతుంది. అవును. 297 00:28:46,310 --> 00:28:49,188 సెక్యూరిటీ గార్డులు ఉన్నారో లేదో ఎవరికి తెలుసు? నేను గ్రేనర్ ని తప్ప ఇంకెవరినీ చూడలేదు. 298 00:28:49,271 --> 00:28:52,024 - మరి మిల్చెక్ సంగతేంటి? - వాడు ఒకేసారి అన్నిచోట్లా ఉండలేదు కదా. 299 00:28:52,107 --> 00:28:54,860 - అసలు మీరందరూ మాట్లాడేది పద్ధతిగా... - ఆ ఆఫీసు ఎక్కడ ఉందో నీకు తెలుసా? 300 00:28:55,861 --> 00:28:58,530 గతేడాది ఫైర్ అలారం డ్రిల్ జరిగినప్పుడు దాన్ని పీటీ చూశాడు. నాకు కూడా చూపాడు. 301 00:29:02,201 --> 00:29:03,577 ఈ పని మనం చేయగలం. 302 00:29:07,539 --> 00:29:08,957 స్టోరేజ్ గది 303 00:29:15,672 --> 00:29:18,091 చూడు, ఒకవేళ మిల్చెక్ కానీ వస్తే, వాడిని అడ్డుకో. 304 00:29:18,175 --> 00:29:19,343 - నేను చూసుకుంటాలే. - సరే. 305 00:29:32,481 --> 00:29:34,024 ఇది పని చేయాలనే కోరుకుందాం. 306 00:29:46,787 --> 00:29:48,247 ఇంకా సైనికులు ఎవరూ రాలేదు. 307 00:29:48,914 --> 00:29:51,500 సరే మరి, మనం పర్పెటువిటీ వింగ్ ని దాటిపోవాలి, కాబట్టి... 308 00:29:51,583 --> 00:29:52,584 అర్వింగ్. 309 00:29:52,668 --> 00:29:53,752 నన్ను మన్నించు, మార్క్. 310 00:29:53,836 --> 00:29:56,380 - ఎక్కడికి వెళ్తున్నావు? - బర్ట్ ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. 311 00:29:56,463 --> 00:29:57,589 మరి మన ప్లాన్ సంగతేంటి? 312 00:29:57,673 --> 00:30:00,551 నన్ను... నన్ను క్షమించు, మార్క్ నీ మాటలు నాకు వినిపించడం లేదు! నేను వెంటనే వచ్చేస్తాను! 313 00:30:01,218 --> 00:30:02,636 - అసలు... - ఏంటి? 314 00:30:05,556 --> 00:30:06,557 సరే. 315 00:30:33,584 --> 00:30:34,793 ఇదే. 316 00:31:16,001 --> 00:31:17,753 ఇది చాలా విచిత్రంగా ఉంది. 317 00:31:27,012 --> 00:31:28,305 అది ఇక్కడ ఉంది. 318 00:31:38,232 --> 00:31:39,566 ఓరి దేవుడా. 319 00:31:42,653 --> 00:31:45,364 ఎండిఆర్ అర్వింగ్. బీ - ఎండిఆర్ డిలన్. జీ ఎండిఆర్ హెల్లీ. ఆర్ - ఎండిఆర్ మార్క్. యస్ 320 00:31:45,447 --> 00:31:47,032 చూడు, ఇవి మన పేర్లే. 321 00:31:48,909 --> 00:31:50,786 దాని పేరేంటి? అత్యవసరం అని ఏదో ఉండాలి కదా? 322 00:31:50,869 --> 00:31:51,995 అత్యవసర సర్దుబాటు. 323 00:31:52,621 --> 00:31:54,331 సర్వర్ హెల్త్ మానిటర్ 324 00:31:56,416 --> 00:31:58,126 సెక్యూరిటీ ఆఫీసు ప్రోటోకాల్ క్విక్ స్టార్ట్ గైడ్లు 325 00:31:58,210 --> 00:31:59,545 అయ్యయ్యో. 326 00:32:02,172 --> 00:32:04,383 లిఫ్టులో కిందికి వస్తోంది కొబెల్ 327 00:32:08,345 --> 00:32:10,055 - అయ్యయ్యో. - ఏమైంది? 328 00:32:14,309 --> 00:32:15,602 కొబెల్. 329 00:32:15,686 --> 00:32:16,854 తను ఇక్కడికి రాదులే. 330 00:32:17,646 --> 00:32:19,106 అత్యవసర సర్దుబాటు ప్రోటోకాల్ 331 00:32:19,189 --> 00:32:21,441 అబ్బో, అది నీకెలా తెలుసు? ఇక్కడి నుండి దొబ్బేద్దాం పద. 332 00:32:35,205 --> 00:32:36,456 హార్మనీ, నేను నీ కోసమే వెతుకుతున్నా. 333 00:32:36,540 --> 00:32:38,458 - ఇప్పుడు నాకు తీరిక లేదు... - బోర్డు కూడా ఉంది. 334 00:32:39,501 --> 00:32:40,669 ఇప్పుడా? 335 00:32:41,295 --> 00:32:42,504 డగ్ గ్రేనర్ చనిపోయాడు. 336 00:32:46,425 --> 00:32:47,426 ఏంటి? 337 00:32:48,427 --> 00:32:50,345 బోర్డు ఇది చాలా పెద్ద విషయమని భావిస్తోంది. 338 00:32:51,138 --> 00:32:53,557 అతను కనిపించడం లేదని నీకు తెలుసో లేదో, నువ్వు పోలీసులతో ఏవైనా మాట్లాడావో లేదో 339 00:32:53,640 --> 00:32:55,058 బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది. 340 00:32:58,187 --> 00:33:00,522 పీటర్ కిల్మర్ పై ఏకీకరణ ప్రక్రియ జరిపినవారే 341 00:33:00,606 --> 00:33:03,942 మిస్టర్ గ్రేనర్ ని కూడా చంపి ఉంటారు. 342 00:33:07,946 --> 00:33:09,615 ఏకీకరణ అనేది అసంభవమని బోర్డు నీకు మరొక్కసారి గుర్తు... 343 00:33:09,698 --> 00:33:13,368 ఏకీకరణ జరిగింది. దాన్ని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. 344 00:33:13,952 --> 00:33:18,999 ఇంకా, నా దగ్గర ఉన్న సాక్ష్యాలను మధ్యలో బ్రోకర్స్ తో కాకుండా 345 00:33:19,082 --> 00:33:21,251 నేరుగా మీకే చూపాలనుకుంటున్నాను. 346 00:33:28,342 --> 00:33:29,510 బోర్డు ఒప్పుకుంది... 347 00:33:33,180 --> 00:33:36,725 ...వచ్చే వారం జరగబోయే ఈగన్ కుటుంబ పార్టీ సమయంలో నిన్ను కలుసుకుంటారు, 348 00:33:36,808 --> 00:33:40,062 అప్పుడు మరింతగా నీతో చర్చిస్తారు. మరిన్ని వివరాలు తర్వాత తెలియజేస్తారు. 349 00:33:50,614 --> 00:33:52,824 వాటి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. 350 00:34:29,987 --> 00:34:33,489 అయితే, అక్కడ ఎవరూ లేరా? అది చాలా వింతగా ఉందే. 351 00:34:34,449 --> 00:34:37,452 మనం నిరంతర పర్యవేక్షణలో ఉన్నామని మనం అనుకుంటుంటాం కదా, వాళ్లకి అది చాలేమో. 352 00:34:37,536 --> 00:34:40,246 ఇక్కడ అంతా దారుణంగా ఉంటుందని మీకు ఎవరూ చెప్పకపోవడం నిజంగానే బాధాకరమైన విషయం. 353 00:34:40,330 --> 00:34:42,081 - నీకు అది అర్థమవుతోందా? - అవుతోంది. 354 00:34:42,666 --> 00:34:45,335 కొన్ని సూచనలు ఉన్నాయి, అన్నీ చాలా తేలిగ్గా ఉన్నాయిలే. 355 00:34:45,418 --> 00:34:47,713 ట్రాక్ బాల్ ని ఆన్ చేసి, కోడును టైప్ చేసి, 356 00:34:47,795 --> 00:34:50,340 ఆ తర్వాత స్విచ్ నొక్కి, టైప్ చేసి, తిప్పి, 357 00:34:50,424 --> 00:34:52,176 - టైప్ చేసి, అలాగే ఉంచాలి. - ఏంటి? 358 00:34:54,261 --> 00:34:57,639 ట్రాక్ బాల్, టైప్, స్విచ్, టైప్, తిప్పాలి, టైప్, అలాగే ఉంచాలి. అంతే. 359 00:34:58,682 --> 00:34:59,808 ఏంటి? 360 00:34:59,892 --> 00:35:03,562 నేను తెలివిమంతుడిని. అందుకే కదా నాకు మీకన్నా మూడింతలు ఎక్కువ పెర్కులు దక్కింది. 361 00:35:04,146 --> 00:35:07,149 కానీ ఇది చెయాలంటే, మనలో ఒకరు ఇక్కడే ఉండాలి, కదా? 362 00:35:07,232 --> 00:35:10,360 అవును, పని అయ్యాక. నేను ఉంటాలే. నాకు ఒకసారి ఎలాగూ జరిగింది కాబట్టి, అదే న్యాయం కూడా. 363 00:35:10,444 --> 00:35:13,697 చాలా గొప్పవాడివేలే కానీ, ఇది ఇద్దరు వ్యక్తులు చేయాల్సిన పని. 364 00:35:13,780 --> 00:35:15,449 ఏం పర్వాలేదు. నాకు ఇద్దరు వ్యక్తులంత బలం ఉంది. 365 00:35:16,450 --> 00:35:18,035 బలానికీ, దీనికీ సంబంధమే లేదు. 366 00:35:18,619 --> 00:35:21,580 అవును, ఇటు చూడు. ప్రక్రియ జరిగే సమయంలో రెండు స్విచ్చులను 367 00:35:21,663 --> 00:35:23,081 పట్టుకొని ఉండాలి. 368 00:35:24,082 --> 00:35:26,084 అదీగాక, అవి రెండూ తలుపు ఇరువైపులా ఉంటాయి. 369 00:35:28,462 --> 00:35:29,463 ఎలాగైనా నేను చేసేయగలను. 370 00:35:30,672 --> 00:35:32,716 వీడ్కోలు, బర్ట్! 371 00:35:33,425 --> 00:35:35,093 సోదరసోదరీమణులారా, 372 00:35:35,177 --> 00:35:39,765 ఇప్పుడు అందరూ మీ హీరోని ఉద్దేశించి గట్టిగా చప్పట్లు కొట్టండి. 373 00:35:42,226 --> 00:35:45,312 అందరూ రండి! దగ్గరకు రండి. 374 00:35:45,395 --> 00:35:47,105 బర్ట్, బర్ట్, బర్ట్. 375 00:35:51,818 --> 00:35:53,237 పవర్ 376 00:35:56,490 --> 00:35:58,534 శుభాభినందనలు, డిజైనర్లారా... 377 00:35:59,826 --> 00:36:01,411 ఒక రిఫైనర్ కి కూడా. 378 00:36:03,914 --> 00:36:05,999 మళ్లీ ఆ తలుపులను పరిశీలించాలి అన్నమాట. 379 00:36:06,667 --> 00:36:08,001 ఈలోపు... 380 00:36:08,710 --> 00:36:12,714 బర్ట్ జీ. ఇది మీ కోసమే. 381 00:36:12,798 --> 00:36:14,550 బై బై వీడియో పేరు - "బర్ట్ జీ." 382 00:36:19,763 --> 00:36:20,764 హలో. 383 00:36:22,808 --> 00:36:24,810 ఇది కాస్త వింతగానే ఉంది, కానీ... 384 00:36:26,812 --> 00:36:29,273 ఈ ఉద్యోగం విషయంలో చాలా వరకూ అన్నీ వింతగానే ఉన్నాయని చెప్పవచ్చు. 385 00:36:29,773 --> 00:36:32,067 నాకన్నా మీకే ఇవన్నీ బాగా తెలుసనుకుంటా. 386 00:36:32,150 --> 00:36:36,154 మీరందరూ ఎవరో నాకు తెలీదనుకోండి, 387 00:36:36,947 --> 00:36:39,533 కానీ మీతో నిలబడి ఉన్న ఆ వ్యక్తి నాకు తెలుసు. 388 00:36:40,325 --> 00:36:43,662 ఆయన మీతో దాదాపుగా ఏడేళ్లు పని చేశాడు, 389 00:36:43,745 --> 00:36:46,081 అవన్నీ ఫలవంతంగానే సాగి ఉంటాయని ఆశిస్తున్నా. 390 00:36:46,164 --> 00:36:48,417 అవి... అవి ఎలా గడిచాయో నాకు తెలీదు, 391 00:36:48,500 --> 00:36:51,670 అలాగే నేను, అంటే అతను మీతో ఏం పని చేసేవాడో నాకు తెలీదు, 392 00:36:51,753 --> 00:36:57,467 కానీ మీతో ఉండి ఇంటికి చేరుకున్నాక నాకు ఏ ఫిలింగ్ ఉంటుందో తెలుసు. 393 00:36:58,302 --> 00:37:03,974 ఇంటికి అలసటగానే చేరుకున్నా, ఏదో సంతృప్తిగా, సాధించినట్టుగా అనిపించేది. 394 00:37:04,057 --> 00:37:05,976 మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం కాబోలు. 395 00:37:06,059 --> 00:37:08,979 మీతో ఇవాళ నేను గడిపేది ఆఖరి రోజే అయినా, 396 00:37:09,062 --> 00:37:12,816 మీరందరూ నా మనస్సులో, 397 00:37:12,900 --> 00:37:18,447 అలాగే మెదడులోని నేను చేరుకోని తీరాల్లో ఉంటారని నాకు తెలుసు. 398 00:37:18,947 --> 00:37:21,867 మీరు నాలో ఎంతటి ముద్ర వేశారో ఇక్కడ ఉన్న నాకు తెలియకపోయినా, 399 00:37:22,367 --> 00:37:25,412 అది మాత్రం చెరపలేనిదని చెప్పగలను, ఇంకా... 400 00:37:25,954 --> 00:37:29,917 ఇక్కడ కూర్చొని ఉన్న నాకు మిమ్మల్ని అసలు కలిసినట్టు గానీ, 401 00:37:30,000 --> 00:37:33,587 మీ పేర్లు గానీ, మీరు ఎలా ఉంటారని గానీ, 402 00:37:33,670 --> 00:37:36,215 అసలు మీరెంత మంది ఉంటారని గానీ 403 00:37:36,298 --> 00:37:39,176 ఏమీ తెలియకపోయినా కానీ 404 00:37:39,259 --> 00:37:42,012 నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తాను. 405 00:37:42,095 --> 00:37:44,765 ఏదేమైనా, నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 406 00:37:44,848 --> 00:37:46,975 ఇక బర్ట్, మనం కలుద్దాం. 407 00:37:47,684 --> 00:37:49,728 అభినందనలు. 408 00:37:50,729 --> 00:37:52,105 అదరగొట్టేశావు, బాసూ. 409 00:37:53,774 --> 00:37:55,108 సెలవు. 410 00:38:10,958 --> 00:38:13,710 మీరందరూ ఇక్కడ నిలబడి... 411 00:38:15,087 --> 00:38:16,588 అతని చావును కళ్లారా చూస్తారా? 412 00:38:17,172 --> 00:38:18,423 అర్వింగ్, ఏమంటున్నావు నువ్వు? 413 00:38:19,049 --> 00:38:24,513 వ్యవస్థాపకుని అడుగుజాడల్లో నడిచినందుకు మాకు శిక్ష వేస్తున్నారా? 414 00:38:25,097 --> 00:38:29,476 బర్ట్ పనియేతర అవతారం పదవీ విరమణ పొందుతున్నాడు. అది నీకు కూడా ఎప్పుడోకప్పుడు జరగాల్సిందే. 415 00:38:30,477 --> 00:38:32,938 నువ్వు ఆపరా, దొంగ చచ్చినోడా. 416 00:38:34,481 --> 00:38:35,941 నువ్వు మాత్రం వేర్పాటు పద్ధతి జరిపించుకోవు. 417 00:38:37,067 --> 00:38:39,152 నువ్వు బయటకు వెళ్లినా కూడా నీకు ఇక్కడి జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. 418 00:38:39,236 --> 00:38:41,738 నువ్వు ప్రతీరోజూ ఈ జ్ఞాపకాలతోనే ఇంటికి వెళ్తావు. 419 00:38:42,656 --> 00:38:45,868 ఎవరూ కూడా నీ నుండి వాటిని తీసుకోలేరు, వేరు చేయలేరు. 420 00:38:46,535 --> 00:38:48,161 అవి నీలో ప్రత్యేకంగా ఏమీ ఉండవు. 421 00:38:48,829 --> 00:38:50,539 నీకు కూడా పని అవతారమంటూ ఏదీ ఉండదు! 422 00:38:50,622 --> 00:38:53,542 ఇక ఆపు! తక్షణమే ఎండిఆర్ కి వెళ్లిపో. 423 00:38:53,625 --> 00:38:55,919 మిస్టర్ మిల్చెక్, దయచేసి శాంతించడి. 424 00:38:56,003 --> 00:38:58,547 అతను ఇక్కడ ఉండటం నాకు సంతోషంగా ఉంది. 425 00:39:00,215 --> 00:39:01,633 అతను ఇక ఏమీ మాట్లాడకుండా ఉంటాడని మాట ఇస్తున్నా. 426 00:39:12,436 --> 00:39:15,856 నువ్వు బర్ట్ పార్టీలో ఉండి, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకవచ్చు. 427 00:39:16,523 --> 00:39:20,152 కానీ నీ ప్రవర్తన నీకు గానీ, ఈ మహత్తర చోటును నెలకొల్పిన వ్యవస్థాకుని గానీ 428 00:39:20,235 --> 00:39:21,987 చేటు తెచ్చే విధంగా ఉండకూడదు. 429 00:39:25,407 --> 00:39:27,701 మీకందరికీ ఇవాళ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. 430 00:39:36,376 --> 00:39:39,630 సరే, మిస్టర్ మిల్చెక్. 431 00:39:41,131 --> 00:39:45,427 ఇక మనందరం బర్ట్ కి వీడ్కోలు పలుకుదాం. 432 00:39:48,430 --> 00:39:50,933 పని అవతారానికి సంబంధించిన పదవీ విరమణ గేయం 433 00:39:54,937 --> 00:39:58,273 బర్ట్ పని అవతారానికి సంబంధించిన పదవీ విరమణ గేయం మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. 434 00:40:16,250 --> 00:40:21,713 నిన్నటి రోజుకి శుభోదయం 435 00:40:22,422 --> 00:40:28,178 నువ్వు లేచావు, కానీ సమయం వేగంగా గడిచిపోయింది 436 00:40:28,846 --> 00:40:32,307 ఉన్నట్టుండి నీ జ్ఞాపకాలు 437 00:40:32,391 --> 00:40:35,143 గుర్తుకు రావడం లేదే 438 00:40:35,227 --> 00:40:40,858 గుర్తున్నాయా, నీకు గుర్తున్నాయా? 439 00:40:41,441 --> 00:40:46,738 గడిచిన కాలంలోని స్మృతులు 440 00:40:47,489 --> 00:40:53,120 ఆనందంగా గడిపిన క్షణాలు, ఏడ్చిన క్షణాలు 441 00:40:53,704 --> 00:40:56,957 నీకు ఎదురైన మంచి క్షణాలు, కష్టాలు 442 00:40:57,040 --> 00:41:00,127 ఆ మధ్యలో నువ్వు అనుభవించిన జీవితం 443 00:41:00,210 --> 00:41:04,631 గుర్తున్నాయా, నీకు గుర్తున్నాయా? 444 00:41:04,715 --> 00:41:08,385 నీ జీవిత జ్ఞాపకాలు? 445 00:41:08,468 --> 00:41:12,514 గుర్తున్నాయా? 446 00:41:12,598 --> 00:41:18,395 ఆనందంగా, బాధగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకో 447 00:41:19,188 --> 00:41:24,443 వాటిని నీ మెదడులో దాచిపెట్టుకో 448 00:41:25,152 --> 00:41:30,699 జ్ఞాపకాలు అనేవి స్మృతులు 449 00:41:31,408 --> 00:41:37,331 రేపటి రోజున నీకు తలచుకోవడానికి పనికి వస్తాయి 450 00:41:39,124 --> 00:41:45,005 అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 451 00:41:45,088 --> 00:41:47,007 అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 452 00:41:47,090 --> 00:41:52,095 కాలం వేగంగా కదులుతోంది 453 00:41:53,096 --> 00:41:56,391 కనుక కుదిరినప్పుడే జ్ఞాపకాలను ఏర్పరచుకో 454 00:41:56,475 --> 00:41:59,394 నేటి కలలను గుర్తుంచుకో 455 00:41:59,478 --> 00:42:01,438 గుర్తుంచుకో 456 00:42:02,272 --> 00:42:07,236 నీ జీవిత జ్ఞాపకాలను గుర్తుంచుకుంటావా? 457 00:42:15,619 --> 00:42:16,620 అర్వింగ్? 458 00:42:29,424 --> 00:42:32,177 ఈ చోటును పుర్తిగా నాశనం చేసేద్దాం. 459 00:42:57,995 --> 00:42:59,830 గాంజ్ లోని కొత్త కళాఖండం "అశ్లీలంగా లేదు" 460 00:43:01,707 --> 00:43:03,458 గాంజ్ కాలేజీ ఉపకార వేతనాన్ని సాధించిన వారిని ప్రకటించనుంది 461 00:43:03,542 --> 00:43:05,961 ఫార్మాకోలజీ మరియు సైకాలజీ చదువుతున్న విద్యార్థినులకు. 462 00:43:42,080 --> 00:43:43,498 - హేయ్. - హేయ్. 463 00:43:46,168 --> 00:43:47,169 నా ఫోన్ కోసం వచ్చాను. 464 00:43:48,337 --> 00:43:49,922 సరే. లోపలికి రా. 465 00:43:56,136 --> 00:43:57,137 ఎలా ఉన్నావు? 466 00:43:57,763 --> 00:43:59,681 - నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? - సూపర్. 467 00:43:59,765 --> 00:44:02,476 లోపలికి రా. వచ్చి ఆరాంగా కూర్చో. 468 00:44:04,561 --> 00:44:07,356 నీ ఫోన్ గోడకి, బెడ్ కి మధ్య ఉండింది. 469 00:44:09,399 --> 00:44:13,111 నేనే తెచ్చి ఇచ్చి ఉండేవాడిని, కానీ నీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. 470 00:44:13,195 --> 00:44:15,489 కాబట్టి, ఇది చాలా మంచి విషయం. 471 00:44:19,284 --> 00:44:20,410 నువ్వు బాగానే ఉన్నావా? 472 00:44:21,537 --> 00:44:24,831 హా, బాగానే ఉన్నాను. కాస్తంత అలసటగా ఉందంతే. 473 00:44:26,625 --> 00:44:27,626 సరే. నేను బయలుదేరుతానులే. 474 00:44:27,709 --> 00:44:28,919 వద్దు, వద్దు. రా. 475 00:44:29,002 --> 00:44:31,004 హేయ్, చూడు. నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. 476 00:44:31,088 --> 00:44:33,173 - లేదు, నేను సిద్ధంగానే ఉన్నాను. - లేదు. 477 00:44:33,257 --> 00:44:35,884 నువ్వు అస్సలు సిద్ధంగా లేవు. నువ్వు చాలా దారుణమైన స్థితిలో ఉన్నావు. 478 00:44:35,968 --> 00:44:38,053 - నన్ను... నన్ను క్షమించు. - సరే. 479 00:44:38,136 --> 00:44:41,849 ఇంకా... తన గురించి మాట్లాడినందుకు మన్నించు. 480 00:44:42,933 --> 00:44:44,560 లేదు, నేను మరీ అతిగా వాగాను. అది... 481 00:44:45,477 --> 00:44:47,938 ఓ విషయం చెప్పనా? నువ్వు తన గురించి మాట్లాడినా, మాట్లాడకపోయినా పర్వాలేదు. 482 00:44:48,021 --> 00:44:50,232 - నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు. - సరే. ఆగు. 483 00:44:50,315 --> 00:44:51,316 ఇది చూడు. 484 00:45:00,826 --> 00:45:02,953 చూశావా? తనే నా భార్య. 485 00:45:14,548 --> 00:45:15,549 చింపేశా. 486 00:45:28,478 --> 00:45:29,479 ఏంటి? 487 00:45:30,939 --> 00:45:33,942 సరే అయితే. నేను నీకు తన గురించి అన్నీ చెప్తాను. 488 00:45:35,152 --> 00:45:39,031 అలెక్సా, మనం... మనం జెమ్మా గురించి మాట్లాడుకోవచ్చు. 489 00:45:40,199 --> 00:45:43,660 తను చాలా గొప్ప వ్యక్తి. తను... 490 00:45:43,744 --> 00:45:45,245 ఉంటాను, మార్క్. 491 00:45:47,331 --> 00:45:48,457 నిజంగానా? 492 00:45:50,709 --> 00:45:51,710 ఓరి దేవుడా... 493 00:46:12,898 --> 00:46:14,316 తను చాలా గొప్ప వ్యక్తి. 494 00:46:23,867 --> 00:46:25,369 అసాధారణమైన వ్యక్తి. 495 00:46:36,713 --> 00:46:42,386 నేను నిన్ను మళ్లీ కలుస్తాను 496 00:46:43,428 --> 00:46:50,060 మనం ఒకప్పుడు కలుసుకొనే చోట్లలో 497 00:46:51,520 --> 00:46:58,360 రోజంతా నా మనస్సు నిండా 498 00:46:59,027 --> 00:47:02,781 అవే ఆలోచనలు 499 00:47:06,076 --> 00:47:12,583 ఆ చిన్ని హోటల్ లో 500 00:47:13,876 --> 00:47:19,882 ఎదురుగా ఉన్న పార్క్ 501 00:47:21,633 --> 00:47:27,264 పిల్లల రంగులరాట్నం 502 00:47:28,557 --> 00:47:31,226 ఆ రావి చెట్టు 503 00:47:31,310 --> 00:47:34,688 నా భార్య చాలా అసాధారణమైన వ్యక్తి. 504 00:47:37,191 --> 00:47:42,529 నేను నిన్ను మళ్లీ కలుస్తాను 505 00:47:42,613 --> 00:47:45,824 నా భార్యకి జాజికాయలు పడేవి కావు. 506 00:47:45,908 --> 00:47:49,828 ప్రతీ ఆహ్లాదకరమైన వేసవి రోజున 507 00:47:49,912 --> 00:47:53,123 తను తుమ్మినప్పుడల్లా, రెండు సార్లు తుమ్మేది. 508 00:47:53,207 --> 00:47:58,337 ఆనందమైన, ఆనందం కాని క్షణాల్లోనూ 509 00:47:58,420 --> 00:48:00,672 నా భార్యకి ఇతరుల కుక్కలు నచ్చేవి. 510 00:48:00,756 --> 00:48:04,301 నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను 511 00:48:04,384 --> 00:48:07,679 నా భార్యకి కార్డిగన్ కోట్లు నచ్చేవి కావు. 512 00:48:07,763 --> 00:48:10,432 నేను నిన్ను కలుసుకుంటాను... 513 00:48:10,516 --> 00:48:12,518 తనకు సంబంధించిన ఈ విషయాలన్నీ నాకు... 514 00:48:16,063 --> 00:48:17,064 చాలా ఇష్టం. 515 00:48:17,147 --> 00:48:21,944 అప్పుడే చీకటి పడితే 516 00:48:23,403 --> 00:48:27,783 నేను చందమామకేసి చూస్తాను 517 00:48:28,534 --> 00:48:33,372 కానీ నేను నిన్ను మళ్లీ కలుస్తాను 518 00:48:40,546 --> 00:48:47,386 నేను నిన్ను మళ్లీ కలుస్తాను 519 00:48:49,012 --> 00:48:55,018 ప్రతీ ఆహ్లాదకరమైన వేసవి రోజున 520 00:48:57,104 --> 00:49:03,360 ఆనందమైన, ఆనందం కాని క్షణాల్లోనూ 521 00:49:05,112 --> 00:49:11,243 నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను 522 00:49:12,327 --> 00:49:15,581 నేను నిన్ను కలుసుకుంటాను 523 00:49:16,290 --> 00:49:20,127 ఉదయించిన సూర్యునిలో 524 00:49:21,420 --> 00:49:27,342 అప్పుడే చీకటి పడితే 525 00:49:28,427 --> 00:49:33,390 నేను చందమామకేసి చూస్తాను 526 00:49:34,725 --> 00:49:41,732 కానీ నేను నిన్ను మళ్లీ కలుస్తాను 527 00:49:47,696 --> 00:49:49,698 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య