1 00:00:14,139 --> 00:00:15,307 మీ పేరేంటి? 2 00:00:26,151 --> 00:00:27,152 మీ పేరేంటి? 3 00:00:49,716 --> 00:00:50,717 హలో? 4 00:00:58,100 --> 00:01:00,269 మన్నించాలి, నేను కాస్త తొందరపడ్డాను. 5 00:01:02,187 --> 00:01:04,313 బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు. 6 00:01:04,397 --> 00:01:06,650 మీకు అభ్యంతరం లేకపోతే ఒక చిన్న సర్వే తీసుకోగలరా? 7 00:01:07,943 --> 00:01:08,944 ఇంతకీ మీరెవరు? 8 00:01:09,486 --> 00:01:10,487 ఇందులో అయిదు ప్రశ్నలు ఉంటాయి. 9 00:01:10,571 --> 00:01:11,864 మీకు మత్తుగా ఉందని నాకు తెలుసు, 10 00:01:11,947 --> 00:01:15,325 కానీ దాని వల్ల మీరు పూర్తిగా హోష్ లోకి వచ్చేయగలరు. 11 00:01:16,451 --> 00:01:17,828 మీరు ఎవరు? 12 00:01:27,379 --> 00:01:28,380 ఓరి దేవుడా. 13 00:01:37,514 --> 00:01:40,517 హేయ్! తలుపు తెరవండి! 14 00:01:47,441 --> 00:01:50,694 సర్వే అయ్యాక, నాకు కూడా మీతో మాట్లాడాలని చాలా ఆత్రంగా ఉంది. 15 00:01:51,320 --> 00:01:53,030 తొలి ప్రశ్నని అడగమంటారా? 16 00:01:54,406 --> 00:01:55,908 మీ సర్వేలో నేను పాల్గొనను. 17 00:01:57,075 --> 00:01:59,328 తొలి ప్రశ్నని అడగమంటారా? 18 00:02:02,998 --> 00:02:04,124 నన్ను ఇక్కడి నుండి బయటకు పంపేయండి. 19 00:02:08,086 --> 00:02:09,086 హేయ్! 20 00:02:10,881 --> 00:02:12,174 తలుపు తెరవండి! 21 00:02:13,133 --> 00:02:14,134 ఛ. 22 00:02:15,469 --> 00:02:18,096 హేయ్! నన్ను ఇక్కడి నుండి బయటకు పంపించండి! 23 00:02:41,245 --> 00:02:42,246 హేయ్. 24 00:02:44,039 --> 00:02:45,040 హలో. 25 00:02:46,041 --> 00:02:47,167 అయిదు ప్రశ్నలా? 26 00:02:48,627 --> 00:02:49,753 అయిదే ప్రశ్నలు. 27 00:02:51,088 --> 00:02:52,339 మరి అయిపోయాక, నాకు ఏం దక్కుతుంది? 28 00:02:54,967 --> 00:02:56,301 అది మీరు ఇచ్చే సమాధానాలపై ఆధారపడి ఉంటుంది. 29 00:02:59,763 --> 00:03:00,764 సరే. 30 00:03:01,640 --> 00:03:03,016 మంచిది. అయితే అడగడం మొదలుపెడతాను. 31 00:03:03,517 --> 00:03:06,019 మొదటి ప్రశ్న, మీ పేరేంటి? 32 00:03:06,770 --> 00:03:08,522 అదేనా మొదటి ప్రశ్న? 33 00:03:09,147 --> 00:03:10,399 ఇంటి పేరు లేకుండా చెప్పినా పర్వాలేదు. 34 00:03:24,872 --> 00:03:25,873 నాకు గుర్తు లేదు... 35 00:03:26,957 --> 00:03:28,417 పర్వాలేదు. 36 00:03:28,500 --> 00:03:31,545 మీరు సమాధానం చెప్పలేకపోతే, "తెలియదు" అని చెప్పవచ్చు. 37 00:03:32,921 --> 00:03:34,089 అసలు ఏం జరుగుతోంది? 38 00:03:34,173 --> 00:03:35,424 సరే, తెలియదు అన్నమాట. 39 00:03:35,507 --> 00:03:39,761 రెండవ ప్రశ్న, మీరు అమెరికాలోని ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో జన్మించారు? 40 00:03:39,845 --> 00:03:42,014 - ఒక్క నిమిషం ఆగండి. - రాష్ట్రం లేదా ప్రాంతం పేరు చెప్పండి. 41 00:03:42,097 --> 00:03:43,640 - నాకు తెలీదు. - తెలియదు అన్నమాట. 42 00:03:43,724 --> 00:03:48,437 మూడవ ప్రశ్న, అమెరికాలోని ఏ రాష్ట్రం లేదా ఏ ప్రాంతం పేరైనా చెప్పండి. 43 00:03:48,520 --> 00:03:49,897 - అబ్బా. నాకు... - మొదట ఏది గుర్తొస్తే, అది చెప్పండి. 44 00:03:49,980 --> 00:03:52,858 - ఏమో మరి. డెలవేర్. ఏంటిదంతా? - డెలవేర్. 45 00:03:52,941 --> 00:03:57,070 నాల్గవ ప్రశ్న, మిస్టర్ ఈగన్ కి అన్నింటికన్నా ఏ టిఫిన్ అంటే ఇష్టం? 46 00:03:57,154 --> 00:03:58,864 నాకు తెలీదు... అసలు ఏంటా అర్థం పర్థం లేని ప్రశ్న! 47 00:03:58,947 --> 00:04:01,325 కదా? తెలియదు అన్నమాట. అయిదవ ప్రశ్న. 48 00:04:01,408 --> 00:04:03,994 ఇది ఆఖరి ప్రశ్న అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. 49 00:04:04,077 --> 00:04:05,370 మీకు గుర్తున్నంత వరకు, 50 00:04:05,454 --> 00:04:09,416 మీ అమ్మగారి కనుల వర్ణం ఏంటో చెప్పగలరా? 51 00:04:27,434 --> 00:04:29,686 సరే, అసలు ఏం... ఏం జరుగుతోంది? 52 00:04:29,770 --> 00:04:31,146 తెలియదు అన్నమాట. 53 00:04:31,230 --> 00:04:37,110 అయితే మీరు తెలియదు, తెలియదు, డెలవేర్, తెలియదు, తెలియదు అని సమాధానమిచ్చారు. 54 00:04:38,403 --> 00:04:39,905 మీరు నన్ను ఏం చేశారు? 55 00:04:51,458 --> 00:04:53,001 మీరు సరైన స్కోరును సాధించారు. 56 00:05:46,930 --> 00:05:48,640 లూమన్, మార్క్ స్కౌట్ ప్రత్యేక అంతస్థుకు ప్రవేశం 57 00:06:49,868 --> 00:06:51,495 మిస్టర్ స్కౌట్ కోసం అంతా సిద్ధంగా ఉందా? 58 00:07:00,420 --> 00:07:01,421 థ్యాంక్ యూ. 59 00:07:05,133 --> 00:07:06,134 మీరు వెళ్లవచ్చు. 60 00:07:38,625 --> 00:07:41,044 ప్రత్యేక అంతస్థుకు ప్రవేశం 61 00:08:31,929 --> 00:08:32,929 నమస్తే, మిస్టర్ స్కౌట్. 62 00:08:33,013 --> 00:08:34,014 నమస్తే, జడ్. 63 00:08:44,900 --> 00:08:47,528 - సరే మరి, మళ్లీ సాయంత్రం కలుద్దాం. - సరే, త్వరలోనే కలుద్దాం. 64 00:11:13,841 --> 00:11:15,926 మార్క్ ఎస్ - అలెన్ టౌన్ 65 00:11:16,009 --> 00:11:17,886 - నీ శ్వాస ఏదో తేడాగా ఉంది. - క్షమించాలి. 66 00:11:17,970 --> 00:11:19,137 నీకు బాగాలేదా ఏంటి? 67 00:11:19,221 --> 00:11:21,390 ఏమో. నిన్నంతా పీటీ ముక్కు చీదుతూనే ఉన్నాడు. 68 00:11:21,974 --> 00:11:23,851 నీ శ్వాసని నా మీదకు వదలకు. వదిలావంటే నీ స్వరపేటికను పీకి పడేస్తాను. 69 00:11:23,934 --> 00:11:26,353 వావ్. అంత సీరియస్ ఎందుకు బాసూ. 70 00:11:26,436 --> 00:11:28,647 నీ మీదకి నా శ్వాసని వదిలితే, నీకు అనారోగ్యం వస్తుందో లేదో తెలీదు కానీ, 71 00:11:28,730 --> 00:11:31,358 క్రిములమయమైన నా స్వరపేటికిన పీకేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు అనారోగ్యం వస్తుంది. 72 00:11:31,441 --> 00:11:33,068 కాదు. ఎండార్ఫిన్లు. 73 00:11:35,028 --> 00:11:37,781 పీటీ ఇవాళ సెలవు పెట్టకూడదని కోరుకుంటున్నా, ఎందుకంటే 74 00:11:37,865 --> 00:11:40,701 నేను టమ్వాటర్ ఫైలును పూర్తి చేసేస్తున్నా, దీన్ని ప్రాసెస్ చేయడానికి అతను ఉండాలి. 75 00:11:40,784 --> 00:11:42,369 అతను ఆఫీసుకు రావట్లేదు అనుకుంటా. 76 00:11:42,452 --> 00:11:43,453 డ్రేన్స్ విల్ 77 00:11:43,537 --> 00:11:47,040 అది ఇవాళ ప్రాసెస్ కాకపోతే, వచ్చే మంగళవారం దాకా వాళ్లకి తెలీనే తెలీదు. 78 00:11:47,124 --> 00:11:49,751 - లూమన్ లో ఇలాంటి పిచ్చివి మామూలే కదా. - మాటలు జాగ్రత్త, గురూ. 79 00:11:50,335 --> 00:11:52,129 హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్? 80 00:11:52,212 --> 00:11:54,047 అబ్బా, అర్వ్. మేము ఇదివరకే చెప్పాం కదా. 81 00:11:54,131 --> 00:11:55,716 అ పలకరింత గురించా? మీరు ఊరికే సరదాగా అన్నారంతే కదా. 82 00:11:55,799 --> 00:11:59,761 లేదు, మాకు నిజంగానే ఆ పలకరింత నచ్చట్లేదు. దానికి ఎన్ని కారణాలు చెప్పాం మేము? 83 00:12:00,470 --> 00:12:02,723 - ఎనిమిది. - ఎనిమిది కారణాలు. 84 00:12:02,806 --> 00:12:05,267 వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైనా వింటే మేము మీకు వండి పెట్టేవాళ్ళం అనుకుంటారు. 85 00:12:05,350 --> 00:12:08,854 అదీగాక అది కాస్త అయోమయంగా ఉంది. అంటే, మీ పిల్లలు డిన్నర్ చేశారా? లేక... 86 00:12:08,937 --> 00:12:10,939 అవును. నువ్వు అంత పనికిమాలిన తండ్రివా? 87 00:12:12,441 --> 00:12:14,526 - పీటీ రాలేదా? - బాగాలేక రాలేదని అనుకుంటున్నాం. 88 00:12:14,610 --> 00:12:17,446 అయ్యయ్యో. ఇవాళ డిలన్, టమ్వాటర్ ని పూర్తి చేసేయబోతున్నాడే. 89 00:12:17,529 --> 00:12:19,072 అవును, నా ఫైల్ పూర్తి కాలేదని అతను గమనిస్తే, 90 00:12:19,156 --> 00:12:21,158 ఈ త్రైమాసికానికి ఉత్తమ రిఫైనర్ రివార్డ్ నాకు దూరమైపోతుంది, 91 00:12:21,241 --> 00:12:22,951 దానితో నాకు కుక్కీల పార్టీ కూడా మిస్ అయిపోతుంది. 92 00:12:23,035 --> 00:12:26,079 తొక్కలోది. ఈ ప్రోత్సాహకాలు ఏంటో అస్సలు అర్థమే కావడం లేదు. 93 00:12:26,163 --> 00:12:28,081 మా రోజుల్లో ఏదైనా ఫైలును ప్రాసెస్ చేసినప్పుడు, 94 00:12:28,165 --> 00:12:29,958 వాళ్లు కరచాలనం చేసి, కాఫీ పార్టీ ఇచ్చేవారు. 95 00:12:30,042 --> 00:12:32,377 కాఫీ పార్టీని ప్రోత్సాహకంగా ఇచ్చేవారంటే నమ్మలేకపోతున్నాను. 96 00:12:32,461 --> 00:12:35,297 అవును, ఇచ్చేవాళ్లు. దానికి మేము సంబరపడిపోయేవాళ్ళం కూడా. 97 00:12:35,380 --> 00:12:37,049 అది దారుణం, గురూ. 98 00:12:37,132 --> 00:12:38,759 అవును, చాలా దారుణమైన విషయం. 99 00:12:38,842 --> 00:12:43,388 రోజంతా కష్టపడి పనిచేశాక, పిల్లలు తినే కుక్కీలను పొందలేక పోవడమంటే అంతే కదా. 100 00:12:43,472 --> 00:12:45,766 అర్వ్ ఇవాళ పంచులేస్తున్నాడుగా. 101 00:12:46,767 --> 00:12:49,269 మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ శాఖకు శుభోదయం. 102 00:12:49,353 --> 00:12:50,562 హాయ్, మిస్టర్ మిల్చెక్. 103 00:12:51,647 --> 00:12:53,315 మార్క్, నీతో ఓ నిమిషం మాట్లాడవచ్చా? 104 00:13:06,411 --> 00:13:09,414 మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ 105 00:13:23,387 --> 00:13:26,557 నువ్వు మిస్ కొబెల్ ని చివరిసారి చూసినప్పుడు, ఆమె పాత ఆఫీసు గదిలో ఉండింది. 106 00:13:26,640 --> 00:13:28,100 ఇప్పుడు తను కొత్త ఆఫీసు గదిలోకి మారింది. 107 00:13:28,684 --> 00:13:30,352 ఆ ఆఫీసు గది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 108 00:13:31,144 --> 00:13:32,354 దేని గురించి మాట్లాడాలి? 109 00:13:32,896 --> 00:13:33,897 ఆ విషయం ఆమె ఎప్పుడూ చెప్పదు, 110 00:13:33,981 --> 00:13:36,817 కానీ ఆమె గది గురించి పొగిడితే, ఆమెకి కాస్త బాగుంటుంది. 111 00:13:42,781 --> 00:13:46,243 అడ్మినిస్ట్రేషన్ 112 00:13:47,911 --> 00:13:50,247 మార్క్? లోపలికి రా. తలుపు మూసేయ్. 113 00:13:51,290 --> 00:13:52,291 ఆఫీసు చాలా బాగుంది. 114 00:13:52,791 --> 00:13:54,042 ఏం కాదు, ఇది దారుణంగా ఉంది. 115 00:13:55,169 --> 00:13:56,920 అవును, పాతది ఇంకా బాగుంది. 116 00:14:04,553 --> 00:14:06,847 నువ్వు దారుణంగా కనబడుతున్నావే. తాగింది ఇంకా దిగనట్టుగా కనబడుతున్నావు. 117 00:14:08,182 --> 00:14:09,266 కూర్చో. 118 00:14:15,022 --> 00:14:17,024 ఇవాళ బోర్డు ఈ సమావేశానికి వేరే చోటు నుండి హాజరవుతుంది. 119 00:14:20,277 --> 00:14:22,362 నా ముందు మార్క్ ఎస్ ఉన్నాడు. 120 00:14:32,748 --> 00:14:33,874 హలో. మీరు... 121 00:14:38,420 --> 00:14:41,215 ఇవాళ డిపార్టుమెంటుకు నేను చీఫ్ గా ఉండాలని చెప్పడానికి ఈ సమావేశం అనుకుంటా. 122 00:14:41,298 --> 00:14:44,468 సరే మరి... అంటే, 123 00:14:44,551 --> 00:14:47,679 ఇంతకు ముందు పీటీ లేనప్పుడు నేను ఇలా వ్యవహరించాను, కాబట్టి ఏ సమస్యా ఉండదు. 124 00:14:47,763 --> 00:14:50,933 పీటీ ఇప్పుడు ఈ సంస్థలో పని చేయడం లేదు. 125 00:14:52,059 --> 00:14:53,060 ఏమన్నారు? 126 00:14:54,478 --> 00:14:59,900 పీటీ ఇప్పుడు ఈ సంస్థలో పని చేయడం లేదు అని అన్నాను. 127 00:14:59,983 --> 00:15:04,279 మన్నించు, మార్క్. మీ ఇద్దరి మధ్యా ఉన్న స్నేహం నాకు బాగా నచ్చుతుంది. 128 00:15:06,532 --> 00:15:10,077 అంటే, ఈ విషయంలో ఏదైనా నోటీసు ఇచ్చి ఉండాలి కదా. ఏమైంది? 129 00:15:10,160 --> 00:15:11,286 నీకు చెప్పాలనే మాకూ ఉంది, 130 00:15:11,370 --> 00:15:14,331 కానీ గోప్యత పాలసీ ప్రకారం మేము మీకు చెప్పలేము. 131 00:15:14,414 --> 00:15:17,167 అలా చెప్తే, పీటీ గోప్యతకి నీ ద్వారా భంగం కలిగించిన వాళ్లం అవుతాము. 132 00:15:20,838 --> 00:15:25,133 మార్క్, నీ కీ కార్డును నా బల్లపై పెడతవా? 133 00:15:29,888 --> 00:15:34,142 మార్క్ ఎస్, మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ చీఫ్ గా పదోన్నతి పొందడం ద్వారా 134 00:15:34,226 --> 00:15:37,896 కియర్ సంస్థకు సేవలందించే అధికారాన్ని నేను నీకు బదిలీ చేస్తున్నాను. 135 00:15:37,980 --> 00:15:39,231 అభినందనలు. 136 00:15:49,283 --> 00:15:52,119 ఈ సందర్భంలో నీకు కావాలంటే అభ్యర్థించి కరచాలనం పొందవచ్చు. 137 00:15:58,458 --> 00:16:00,085 థ్యాంక్ యూ. నేను కరచాలనం పొందవచ్చా? 138 00:16:07,509 --> 00:16:11,054 నీకు ఇంతకుముందు శిక్షణ ఇవ్వలేదని తెలుసు, కాబట్టి అర్వింగ్ నిన్ను గైడ్ చేస్తాడు. 139 00:16:11,138 --> 00:16:15,601 ఆ ఫ్లోచార్ట్ ప్రకారం నడుచుకో, సందర్భాలను బట్టి సరైన విధంగా ఎస్కలేట్ చేయ్, చాలు. 140 00:16:15,684 --> 00:16:16,685 కంగారుపడాల్సిన పనేమీ లేదు. 141 00:16:17,561 --> 00:16:19,646 - నీకు కాస్తంత సమయం అవసరమైతే... - థ్యాంక్ యూ. కానీ ఆ అవసరం లేదు. 142 00:16:23,525 --> 00:16:26,653 బోర్డుకు కూడా ధన్యవాదాలు. 143 00:16:28,447 --> 00:16:33,493 ఈ సమావేశంలో బోర్డు మౌఖికంగా స్పందించదు. 144 00:16:43,837 --> 00:16:46,256 ఇంతకు ముందు రిఫైనర్ గా ఉన్న మహిళ పేరు... 145 00:16:46,340 --> 00:16:47,883 కెరోల్. డిలన్ స్థానంలో ఉండేది. 146 00:16:51,011 --> 00:16:52,012 బాధపడకు. 147 00:16:52,095 --> 00:16:54,723 నేను బాగానే ఉన్నాను. మనకేమీ కాదులే. 148 00:16:54,806 --> 00:16:56,683 నువ్వూ, పీటీ మంచి మిత్రులని నాకు తెలుసు. 149 00:16:56,767 --> 00:17:00,103 నీ కామెడీ నచ్చిన ఏకైక వ్యక్తి అతను. 150 00:17:00,187 --> 00:17:04,107 అంతా బాగానే ఉంది. అయితే, నేను ఇన్పుట్ సర్వేతో మొదలుపెడితే సరిపోతుందా? 151 00:17:04,191 --> 00:17:05,400 అది కాస్త వింతగా లేదంటావా? 152 00:17:05,483 --> 00:17:06,527 అదే ప్రామాణిక పద్ధతి. 153 00:17:06,609 --> 00:17:09,946 1ఏ వద్ద నుండి మొదలుపెట్టి, ఆమె ఇచ్చే సమాధానాలను బట్టి, ఏ లైన్ చదవాలో అది చదువు. 154 00:17:10,030 --> 00:17:12,031 ఇవన్నీ కాకుండా నేను తనతో మామూలుగా మాట్లాడితే? 155 00:17:12,115 --> 00:17:15,661 తనకి సమాచారాన్ని సరైన పద్ధతిలో అందించాల్సిన అవసరం ఉంది. 156 00:17:15,743 --> 00:17:17,162 నీకు అందించిన పద్ధతిలోనే. 157 00:17:17,246 --> 00:17:18,247 లూమన్ రీసైకిల్స్! 158 00:17:18,329 --> 00:17:22,960 "ట్రయినీకు చిరాకు వచ్చి వెళ్లిపోతామంటే, నేరుగా 19వ పేజీకి వెళ్లండి." 159 00:17:24,127 --> 00:17:26,964 తను మూడు సార్లు అడిగితే కానీ నువ్వు ఆమెని పంపకూడదు. 160 00:17:27,047 --> 00:17:28,924 అలాగే. సరే మరి. 161 00:17:29,424 --> 00:17:31,301 ట్రయినీ వెళ్లిపోతామని మూడు సార్లు అడిగినప్పుడే వారిని పంపించాలి 162 00:17:33,971 --> 00:17:35,639 ఇమేజ్ బాగానే ఉంది. 163 00:17:36,890 --> 00:17:38,058 తను కూడా బాగానే ఉంది. 164 00:17:39,101 --> 00:17:40,811 సరే మరి. ఇక నువ్వు మొదలుపెట్టవచ్చు. 165 00:17:44,606 --> 00:17:46,942 మీరందరూ ఇలా చేరడం చూడటమంటే నాకు చాలా ఇష్టం. 166 00:17:48,777 --> 00:17:50,153 నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మొదలుపెట్టు. 167 00:17:53,991 --> 00:17:55,367 - సరే మరి. - అలాగే. 168 00:17:55,450 --> 00:17:56,535 బీ-004 ట్రయినీ స్టేట్మెంట్: మాట్లాడేది ఎవరు? 169 00:17:56,618 --> 00:17:58,579 ప్రశ్న ప్ర-001: మీ పేరు ఏంటి? ప్రామాణికమైన ప్రతిస్పందన: తెలియదు 170 00:18:02,040 --> 00:18:03,041 ఇక మొదలుపెట్టు. 171 00:18:06,003 --> 00:18:07,004 మీ పేరేంటి? 172 00:18:16,597 --> 00:18:17,598 ఇంకో సారి అడుగు. 173 00:18:19,683 --> 00:18:21,018 మీ పేరేంటి? 174 00:18:26,857 --> 00:18:27,941 - మార్క్. - ఏంటి? 175 00:18:28,025 --> 00:18:29,526 నువ్వు ఉపోద్ఘాతాన్ని చదవలేదు. 176 00:18:30,152 --> 00:18:31,153 హలో? 177 00:18:31,695 --> 00:18:32,696 అయ్యయ్యో! 178 00:18:36,783 --> 00:18:38,827 మన్నించాలి, నేను కాస్త తొందరపడ్డాను. 179 00:18:40,787 --> 00:18:41,622 బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు. 180 00:18:42,539 --> 00:18:43,916 - అదే. - సరే. 181 00:18:45,250 --> 00:18:46,793 బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు. 182 00:18:46,877 --> 00:18:49,546 మీకు అభ్యంతరం లేకపోతే ఒక చిన్న సర్వే తీసుకోగలరా? 183 00:18:51,673 --> 00:18:52,674 ఇంతకీ మీరెవరు? 184 00:18:53,759 --> 00:18:54,927 ఇందులో అయిదు ప్రశ్నలు ఉంటాయి. 185 00:18:55,010 --> 00:18:56,220 మీకు మత్తుగా ఉందని నాకు తెలుసు, 186 00:18:56,303 --> 00:18:59,348 కానీ దాని వల్ల మీరు పూర్తిగా హోష్ లోకి వచ్చేయగలరు. 187 00:19:01,058 --> 00:19:02,351 మీరు ఎవరు? 188 00:19:02,976 --> 00:19:04,394 "మీరు ఎవరు?" 189 00:19:09,149 --> 00:19:10,317 నాల్గవ ప్రశ్న, మిస్టర్ ఈగన్ కి అన్నింటికన్నా ఏ టిఫిన్ అంటే ఇష్టం? 190 00:19:17,032 --> 00:19:18,659 హేయ్! తలుపు తెరవండి! 191 00:19:18,742 --> 00:19:20,035 మార్క్. 192 00:19:20,118 --> 00:19:22,913 సర్వే అయ్యాక, నాకు కూడా మీతో మాట్లాడాలని చాలా ఆత్రంగా ఉంది. 193 00:19:22,996 --> 00:19:24,206 తొలి ప్రశ్నని అడగమంటారా? 194 00:19:24,289 --> 00:19:26,250 మీ సర్వేలో నేను పాల్గొనను. 195 00:19:29,753 --> 00:19:31,922 తొలి ప్రశ్నని అడగమంటారా? 196 00:19:32,005 --> 00:19:34,049 నన్ను ఇక్కడి నుండి బయటకు పంపేయండి. హేయ్! 197 00:19:37,719 --> 00:19:40,264 - తలుపు తెరవండి! - తను... తను అలా చేయకూడదు. 198 00:19:40,848 --> 00:19:41,849 హేయ్! 199 00:19:41,932 --> 00:19:43,225 తను బద్ధలుకొట్టుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. 200 00:19:43,308 --> 00:19:44,893 - నన్ను ఇక్కడి నుండి బయటకు పంపించండి! - నేనలా కానివ్వను. 201 00:19:46,270 --> 00:19:47,479 మీరు దీన్ని చూస్తున్నారా? 202 00:19:48,981 --> 00:19:49,982 చూస్తున్నాను. 203 00:19:51,233 --> 00:19:52,442 నన్నేమైనా సాయపడమంటారా? 204 00:19:54,403 --> 00:19:55,445 నువ్వు సాయపడకూడదు. 205 00:20:02,870 --> 00:20:04,538 మీరు సరైన స్కోరును సాధించారు. 206 00:20:05,998 --> 00:20:09,626 మీకు నేను చెప్పింది ఎందుకు గందరగోళానికి గురిచేసిందో ఇప్పుడు నాకు అర్థమైంది. 207 00:20:10,711 --> 00:20:13,255 - ఏంటి? - ఉపోద్ఘాతం ఒకటి ఉండింది, 208 00:20:13,338 --> 00:20:15,883 సర్వేను మొదలుపెట్టి, మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ముందు, 209 00:20:15,966 --> 00:20:18,510 నేను దాన్ని చదవాలి... 210 00:20:19,511 --> 00:20:22,222 కానీ నేను దాన్ని చదవకుండా నేరుగా సర్వేని ప్రారంభించాను. 211 00:20:22,306 --> 00:20:23,348 నేనేమైనా బోనులో జంతువునా? 212 00:20:24,349 --> 00:20:25,350 ఏమన్నారు? 213 00:20:26,602 --> 00:20:30,522 నన్ను ఆహారం కోసం పెంచారా, అందుకే నాకు ఏ జ్ఞాపకాలూ లేవా? 214 00:20:33,108 --> 00:20:38,197 మిమ్మల్ని పెంచడం, మీకు వివేకాన్ని ఇవ్వడం, మీ గోళ్ళను కత్తిరించడం... 215 00:20:38,280 --> 00:20:39,865 - నాకు తెలీదు. - ...ఇవన్నీ మేం చేశామనుకుంటున్నారా... 216 00:20:39,948 --> 00:20:41,200 నాకు తెలీదు. అసలు మీరెవరో నాకు తెలీదు. 217 00:20:41,283 --> 00:20:43,493 లేదు, మీరేమీ బోనులో జంతువు కాదు. ఓరి నాయనోయ్. 218 00:20:44,161 --> 00:20:45,579 మరి నా పేరేంటి? 219 00:20:47,122 --> 00:20:48,123 హెల్లీ. 220 00:20:48,624 --> 00:20:51,251 మీ పేరు హెల్లీ. హెల్లీ ఆర్. 221 00:20:52,669 --> 00:20:53,670 దయచేసి అక్కడ కూర్చోండి. 222 00:21:08,268 --> 00:21:10,187 వెల్కమ్ సర్వేలో పాల్గొన్నందుకు థ్యాంక్స్. 223 00:21:10,270 --> 00:21:14,274 ప్రశ్నలు మిమ్మల్ని భయాందోళనలకు, అయోమయానికి గురి చేసి ఉంటాయని అర్థమైంది. 224 00:21:14,358 --> 00:21:18,695 మంచి విషయమేంటంటే, ఇప్పుడు మీరు మా సంస్థలో చేరబోతున్నారు. 225 00:21:25,827 --> 00:21:27,955 లూమన్ ఇండస్ట్రీస్ లో ప్రత్యేకమైన అంతస్థులో ఉద్యోగిగా 226 00:21:28,038 --> 00:21:31,083 మీరు నియమితులయ్యారు. 227 00:21:31,708 --> 00:21:32,835 ఏ అంతస్థు అన్నారు? 228 00:21:44,930 --> 00:21:48,559 వేర్పాటు పద్ధతి గురించి మీకు అయోమయంగా ఉన్నట్టుంది. 229 00:21:49,101 --> 00:21:50,853 దాని గురించి మాట్లాడుకొనే ముందు, 230 00:21:50,936 --> 00:21:55,607 మీరు వినుండే అవకాశమున్న అంశమైన పని, పనేతర జీవితాల మధ్య సమతుల్యత గురించి మాట్లాడదాం. 231 00:21:56,567 --> 00:21:58,652 ముందుగా, మిమ్మల్ని మీరు ఒక పెండులమ్ ముల్లుగా ఊహించుకోండి. 232 00:22:01,238 --> 00:22:02,531 బాబోయ్! 233 00:22:02,614 --> 00:22:04,700 దానికి లాక్ బయటి నుండి వేసి ఉంటుంది. 234 00:22:04,783 --> 00:22:06,159 - నన్ను బయటకు పంపించేయండి! - దేవుడా! 235 00:22:08,328 --> 00:22:12,207 దయచేసి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉంటారా? 236 00:22:24,303 --> 00:22:25,304 దయచేసి ఇక్కడ కూర్చోండి. 237 00:22:47,409 --> 00:22:49,203 సరే, నా పేరు మార్క్. 238 00:22:50,579 --> 00:22:53,790 ఇంకా... నేను... 239 00:22:53,874 --> 00:22:56,376 కొన్నేళ్ళ క్రితం నేను కూడా ఈ బల్ల మీదనే మేల్కొన్నాను. 240 00:22:57,002 --> 00:22:58,045 ఈ గదిలోనే. 241 00:22:58,128 --> 00:23:03,884 అప్పుడు స్పీకర్ నుండి ఓ గొంతు, పేరేంటో చెప్పమని నన్ను 19 సార్లు అడిగింది. 242 00:23:07,012 --> 00:23:09,223 నేను సమాధానం చెప్పలేనని గ్రహించినప్పుడు, 243 00:23:09,306 --> 00:23:14,728 నిన్ను వెంటాడి మరీ చంపేస్తా అని ఆ స్వరంతో అన్నాను. 244 00:23:16,647 --> 00:23:19,566 అలా నేనెందుకు అన్నానో నాకు తెలీదు. అంటే, ఆ క్షణాన నాకూ భయమేసింది. 245 00:23:20,817 --> 00:23:22,152 మరి ఆ మనిషిని మీరు చంపేశారా? 246 00:23:23,862 --> 00:23:24,863 లేదు. 247 00:23:25,572 --> 00:23:30,118 లేదు, ఆ వ్యక్తి పేరు పీటీ, తర్వాత అతను నా ప్రాణ స్నేహితుడు అయ్యాడు. 248 00:23:32,204 --> 00:23:35,749 కాబట్టి, మీరు కూడా ఇక్కడ జీవితాన్ని పొందాల్సి ఉంటుంది, హెల్లీ. 249 00:23:36,667 --> 00:23:38,293 జీవితాన్ని పొందాల్సి ఉంటుందా? 250 00:23:47,344 --> 00:23:53,809 అంటే, పెండులమ్ ముల్లు లాంటి జీవితానికి... 251 00:23:56,562 --> 00:23:58,313 నన్ను ఇక్కడి నుండి పంపించేయండి! 252 00:24:07,948 --> 00:24:10,826 - మరోసారి అడగండి. - ఏంటి? 253 00:24:10,909 --> 00:24:14,830 మిమ్మల్ని పంపిచేయమని మీరు రెండుసార్లు అడిగారు. అదే ఇంకోసారి అడగండి. 254 00:24:16,331 --> 00:24:17,875 - మార్క్. - చెప్పండి. 255 00:24:18,959 --> 00:24:21,253 నేను ఈ చోటు నుండి వెళ్లిపోవాలనుకుంటున్నా. 256 00:24:23,672 --> 00:24:26,675 మీకు ఈ లూమన్ సంస్థ అంతగా నచ్చినట్టుగా అనిపించడం లేదు. 257 00:24:26,758 --> 00:24:30,345 మీరు నిరాశ చెందారు కనుక, మీకు ఇష్టం లేని చోట ఉంచడం సమంజసం కాదు. 258 00:24:30,429 --> 00:24:33,390 కాబట్టి, ఇక్కడి నుండి బయటకు వెళ్దాం పదండి. 259 00:24:39,855 --> 00:24:40,856 అర్వ్. 260 00:25:03,629 --> 00:25:07,424 శాఖలన్నీ ప్రస్తుతం బాగా ఖాళీగానే ఉన్నాయి, కానీ త్వరలోనే ఇవన్నీ నిండిపోతాయి. 261 00:25:07,508 --> 00:25:09,218 వీళ్ళు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 262 00:25:10,052 --> 00:25:11,637 మరి నేను అందులో భాగమా? 263 00:25:12,471 --> 00:25:14,431 లేదు. మీరు వేరేవారి స్థానంలో వచ్చారు. 264 00:25:15,224 --> 00:25:16,517 ఎవరి స్థానంలో? 265 00:25:18,393 --> 00:25:20,103 అది మీకేదో నచ్చని విషయంలా చెప్పారే? 266 00:25:27,319 --> 00:25:29,696 ఈ మలుపు తీసుకున్నాక, నేరుగా ఉన్న మెట్ల ద్వారా మీరు వెళ్లవచ్చు. 267 00:25:36,995 --> 00:25:38,163 మీరు నాతో రావట్లేదా? 268 00:25:38,247 --> 00:25:39,665 నేను చూడకూడదు. 269 00:25:39,748 --> 00:25:41,250 ఏమన్నారు? 270 00:25:41,333 --> 00:25:42,751 అంటే, మీరు వెళ్లిపోయాక, మీరు... 271 00:25:44,503 --> 00:25:45,838 మీరు వెళ్తుండగా నేను చూడలేను. 272 00:25:53,011 --> 00:25:54,388 అవునులెండి. 273 00:26:03,772 --> 00:26:06,859 ప్రత్యేక అంతస్థు పరిమితి అధికారమున్న వారికే ప్రవేశం 274 00:26:27,546 --> 00:26:29,590 ఏంటిది? 275 00:27:21,892 --> 00:27:23,477 - నేను చనిపోయున్నానా? - లేదు. 276 00:27:24,102 --> 00:27:26,480 - కొంపదీసి ఇది నరకం కాదు కదా? - కాదు. 277 00:27:27,648 --> 00:27:29,358 మరి నేనెందుకు వెళ్లిపోలేకపోతున్నాను. 278 00:27:29,441 --> 00:27:32,236 మీరు బయటకు వెళ్లారు కదా. అంటే కనీసం మెట్ల దాకా అయినా వెళ్లారు. 279 00:27:32,319 --> 00:27:34,696 మీరు వెళ్లారు, కానీ మళ్లీ వెనక్కి వచ్చేశారు. 280 00:27:35,781 --> 00:27:37,366 - నేనేమీ రాలేదు. - మీరే వెనక్కి వచ్చారు. 281 00:27:38,325 --> 00:27:39,326 రండి. 282 00:27:42,746 --> 00:27:45,666 తొలి రోజే ఆఫీసు పరికరాన్ని ఆయుధంగా వాడారు. 283 00:27:46,834 --> 00:27:49,127 మీతో మంచి సరదాగా ఉంటుంది. 284 00:27:49,837 --> 00:27:51,672 చూడండి, నాకు కూడా జాలి కలిగింది. 285 00:27:51,755 --> 00:27:56,760 నాకు కూడా మార్క్ ని తన్నాలని ఉంది, కానీ నేను అతని బాసుని. 286 00:27:56,844 --> 00:27:58,887 అతను మీ డిపార్టుమెంట్ చీఫ్ కూడా. 287 00:27:59,680 --> 00:28:02,266 కాబట్టి మనిద్దరం స్థైర్యంగా ముందుకు సాగాలి. 288 00:28:03,100 --> 00:28:07,104 మంచి విషయమేంటంటే, మీ జాయినింగ్ లో భాగంగా ఇంకా ఒక్క భాగం మాత్రమే మిగిలి ఉంది, 289 00:28:07,187 --> 00:28:10,315 దాన్ని మార్క్ తప్పుదారి పట్టించే అవకాశం లేదు. 290 00:28:11,108 --> 00:28:12,359 ఎందుకలా? 291 00:28:12,943 --> 00:28:14,862 ఎందుకంటే అది వీడియో కాబట్టి. 292 00:28:22,369 --> 00:28:24,538 లూమన్ కి స్వాగతం, హెల్లీ. 293 00:28:27,291 --> 00:28:29,001 హెల్లీ ఆర్ 294 00:28:50,439 --> 00:28:51,732 కూర్చో. 295 00:29:10,709 --> 00:29:12,085 నా మీద మీకు కోపంగా ఉందా? 296 00:29:13,253 --> 00:29:17,633 చేతగానితనానికా లేక అగౌరవపరిచినందుకా? 297 00:29:18,842 --> 00:29:20,677 - అంటే... - పీకల దాకా కోపం ఉంది! 298 00:29:22,471 --> 00:29:24,848 ఓ విషయం చెప్పనా, మా అమ్మ నాస్తికురాలు. 299 00:29:25,807 --> 00:29:29,186 నరకం గురించి ఒక మంచి విషయం ఉంది, అలాగే ఒక చెడు విషయం కూడా ఉంది అని తను అనేది. 300 00:29:29,770 --> 00:29:31,188 మంచి విషయమేంటంటే, 301 00:29:31,855 --> 00:29:36,693 నరకం అనేది కేవలం మనిషి యొక్క భయంకరమైన కల్పన మాత్రమే. 302 00:29:36,777 --> 00:29:37,778 కానీ చెడు విషయమేమిటంటే, 303 00:29:39,363 --> 00:29:43,283 మానవులకు తమ కల్పనలను సృష్టించే అలవాటు ఉంది కూడా. 304 00:29:47,621 --> 00:29:49,164 మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. 305 00:29:51,041 --> 00:29:54,628 నీ డిపార్టుమెంట్ మంచి వైపు వెళ్లవచ్చు, అలాగే చెడు వైపు కూడా వెళ్లవచ్చు. 306 00:29:55,379 --> 00:29:57,297 కానీ అది దేని మీద ఆధారపడుంటుందో తెలుసా? 307 00:30:04,179 --> 00:30:05,180 పని చేసే జనాల మీద. 308 00:30:16,692 --> 00:30:17,985 మీరు ఇక్కడ కూర్చోండి. 309 00:30:23,949 --> 00:30:25,993 లూమన్ "హెల్లీ ఆర్." సుస్వాగతం 310 00:30:31,915 --> 00:30:34,543 కానివ్వండి, అక్కడకు వెళ్లి కూర్చోండి. 311 00:30:44,344 --> 00:30:45,429 నా పేరు హెల్లీ ఆర్. 312 00:30:47,764 --> 00:30:48,932 మళ్లీ ఈ వీడియోను నాకు చూపే 313 00:30:49,016 --> 00:30:53,187 సుమారు రెండు గంటల ముందు నేను ఈ వీడియోను చేస్తున్నాను. 314 00:30:55,147 --> 00:30:58,483 మామూలు పరిభాషలో వేర్పాటు అని పిలవబడే పద్ధతిని నా మీద జరపడానికి 315 00:30:58,567 --> 00:31:00,485 నేనే నా ఇష్టానుసారం అంగీకరించాను. 316 00:31:02,321 --> 00:31:07,409 చికిత్స చేసి పని, అలాగే పనియేతర జీవితాలకు సంబంధించిన జ్ఞాపకాలను 317 00:31:07,492 --> 00:31:11,663 వేరు చేయడానికి నేను సమ్మతి తెలిపాను. 318 00:31:12,623 --> 00:31:13,957 ప్రాదేశికంగా వేరుచేయబడిన జ్ఞాపకాలు మాత్రమే 319 00:31:14,041 --> 00:31:18,128 ఇప్పట్నుంచీ నాకు గుర్తు ఉంటాయని నేను అంగీకరిస్తున్నాను. 320 00:31:19,421 --> 00:31:21,965 లూమన్ సంస్థలోని ప్రత్యేకమైన బేస్మెంట్ అంతస్థులో ఉన్నప్పుడు, బయటి జ్ఞాపకాలు 321 00:31:22,049 --> 00:31:24,968 నాకు గుర్తు ఉండవు, అలాగే ఇక్కడి నుండి బయటకు వెళ్లినప్పుడు 322 00:31:25,052 --> 00:31:27,513 ఇక్కడి జ్ఞాపజాలు నాకు గుర్తు ఉండవు. 323 00:31:29,932 --> 00:31:33,185 ఈ మార్పు అనేది సమగ్రమైనదని, 324 00:31:33,268 --> 00:31:36,188 అలాగే దీన్ని పూర్వ స్థితికి చేర్చడం సాధ్యం కాదని నాకు తెలుసు. 325 00:31:37,773 --> 00:31:39,441 ఈ ప్రకటనలను నేను నా ఇష్టానుసారమే చేస్తున్నాను. 326 00:31:44,780 --> 00:31:47,699 అంతే అయిపోయింది. 327 00:31:54,831 --> 00:31:55,832 సరే మరి. 328 00:31:56,917 --> 00:31:57,918 మీ స్థానానికి వెళ్లండి. 329 00:32:16,770 --> 00:32:18,272 అయితే, నేను ఇక్కడి నుండి ఎప్పటికీ బయట పడలేనా? 330 00:32:20,524 --> 00:32:21,817 మీరు సాయంత్రం అయిదు గంటలకు వెళ్తారు. 331 00:32:22,317 --> 00:32:25,487 నిజానికి, ఒక్కొక్కళ్లను ఒక్కో సమయంలో బయటకు పంపుతారు, కాబటి 5:15 అవుతుంది. 332 00:32:26,697 --> 00:32:29,867 కానీ అలా ఏమీ అనిపించదులెండి. మీ ఈ అవతారానికైతే అనిపించదు మరి. 333 00:32:31,577 --> 00:32:32,911 నాకు కుటుంబం ఉందా? 334 00:32:33,954 --> 00:32:35,289 ఇక్కడ అది మీకు తెలిసే అవకాశం లేదు. 335 00:32:36,874 --> 00:32:38,584 నాకు మరో దారి కూడా ఉండదు కదా. 336 00:32:39,751 --> 00:32:45,007 మీరు ఇక్కడికి రోజూ వస్తున్నారంటే, మీరు ఇక్కడికి రావాలనే ఎంచుకున్నారని అర్థం. 337 00:33:13,076 --> 00:33:14,077 హలో. 338 00:33:52,199 --> 00:33:53,325 శుభరాత్రి. 339 00:33:53,408 --> 00:33:54,409 శుభరాత్రి. 340 00:34:35,033 --> 00:34:36,034 మిస్టర్ స్కౌట్ 341 00:34:43,458 --> 00:34:46,043 "ప్రియమైన మార్క్, గదిలో పెట్టెలను మోసేటప్పుడు, 342 00:34:46,128 --> 00:34:48,505 మీరు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ స్లైడును తట్టుకొని కిందపడ్డారు, 343 00:34:48,589 --> 00:34:52,176 దానితో మీ నుదురుకు చిన్నపాటి గాయమైంది." 344 00:34:59,141 --> 00:35:00,517 పిప్స్ బార్ & గ్రిల్ విఐపి యాక్సెస్ కార్డ్ 345 00:35:00,601 --> 00:35:01,977 ఈ గిఫ్ట్ కార్డ్ ద్వారా పిప్స్ లోని విఐపి విభాగానికి 346 00:35:02,060 --> 00:35:03,145 ఒకసారి మాత్రమే ప్రవేశించగలరు. 347 00:35:03,228 --> 00:35:04,479 నేను విప్స్ విఐపిని. 348 00:35:20,287 --> 00:35:21,496 ఓయ్! 349 00:35:22,164 --> 00:35:23,749 మన్నించండి. 350 00:35:25,125 --> 00:35:26,960 కాస్త కళ్లు ఈ మంచు రోడ్డు మీద పెట్టి నడపండి. 351 00:35:29,838 --> 00:35:30,839 క్షమించండి. 352 00:35:56,865 --> 00:35:59,868 బెయిర్డ్ క్రీక్ నివాస సముదాయం 353 00:36:30,566 --> 00:36:34,570 అవును, ఈ కీటకం తన మూడు నుండి ఏడు రోజుల జీవితాన్ని... 354 00:36:52,504 --> 00:36:56,925 ఆహా. తెలుసు, మిసెస్ సెల్విగ్. అంటే, అది మళ్లీ నా స్థలంలోనే వేశారు. 355 00:36:57,759 --> 00:37:01,513 అవును. చెత్త బండి రేపు రాత్రి వస్తుంది. ఇవాళ రీసైకిల్ బండి వస్తుంది. 356 00:37:02,514 --> 00:37:05,642 అవును, అది వింతగానే ఉంది, కానీ వాళ్లు ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. 357 00:37:05,726 --> 00:37:08,061 మీవే రెండూ ఉంటే, నావి పెట్టుకోవడానికి స్థలం... 358 00:37:25,746 --> 00:37:26,997 - హేయ్. - హేయ్. 359 00:37:31,210 --> 00:37:32,211 మర్చిపోయావా ఏంటి? 360 00:37:37,174 --> 00:37:38,759 అవును. అబ్బా. 361 00:37:38,842 --> 00:37:39,843 మరేం పర్వాలేదులే. 362 00:37:40,844 --> 00:37:41,845 - క్షమించు. - పర్వాలేదులే. 363 00:37:41,929 --> 00:37:44,640 - నువ్వు ప్యాంట్ వేసుకుంటావా, నేను... - ఇది ప్యాంటే కదా. 364 00:37:44,723 --> 00:37:46,517 ...నిన్ను మళ్లీ... దాన్ని ప్యాంట్ అనరు. 365 00:37:47,893 --> 00:37:51,730 మరి డిన్నర్ లేకపోతే, దాన్ని డిన్నర్ అని అనడం ఎందుకు? 366 00:37:51,813 --> 00:37:52,940 - ఓ విషయం. - అంటే... 367 00:37:53,649 --> 00:37:55,317 నిజానికి ఈ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు. 368 00:37:55,400 --> 00:37:56,944 - నేనా? - అవును. 369 00:37:57,027 --> 00:38:00,322 చిన్నప్పుడు, నీ కన్నా నేనే మెరుగ్గా ఉండేదాన్ని అనే విషయం నీకు గుర్తుందా? 370 00:38:00,405 --> 00:38:02,866 మర్చిపోయి ఉంటాలే. 371 00:38:04,326 --> 00:38:06,745 అదీగాక, నీ మ్యారేజ్ యానివర్సరీ సమీపిస్తోంది, 372 00:38:06,828 --> 00:38:08,705 కాబట్టి నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుంటుందని అనిపించింది. 373 00:38:10,123 --> 00:38:11,124 అదేం లేదు. 374 00:38:13,168 --> 00:38:15,462 ఈ దెబ్బ బాగుంది. ఎప్పుడు తగిలిందేంటి? 375 00:38:15,546 --> 00:38:17,756 ఆఫీసులో తగిలిందిలే, వాళ్లు క్షమాపణ చెప్పారు కూడా. 376 00:38:18,382 --> 00:38:19,800 క్షమాపణ చెప్పారా. అయితే ఓకేలే. 377 00:38:20,843 --> 00:38:22,761 ఆ క్షమాపణతో పాటు ఏదైనా వివరణ కూడా ఇచ్చారా? 378 00:38:22,845 --> 00:38:25,180 పర్వాలేదులే. ఒక గిప్ట్ కార్డ్ ఇచ్చారు. 379 00:38:25,764 --> 00:38:28,475 గిఫ్ట్ కార్డ్ ఇచ్చారన్నమాట ఆ గిఫ్ట్ కార్డ్ ద్వారా ఎక్కడికి వెళ్లవచ్చు? 380 00:38:29,518 --> 00:38:30,644 ఏమో మరి. పిప్స్. 381 00:38:31,270 --> 00:38:34,147 పిప్సే ఉంటుందిలే. పండగ చేస్కో. 382 00:38:34,231 --> 00:38:36,024 పండగే చేసుకుంటా, నువ్వు లేకుండానే పండగ చేసుకుంటా. 383 00:38:45,284 --> 00:38:46,743 మన ఏకాకి జీవి వచ్చేశాడు. 384 00:38:46,827 --> 00:38:49,246 - హాయ్, రిక్. - రికెన్. రికెన్ అని పిలువు. 385 00:38:50,497 --> 00:38:52,416 - ప్రశాంతంగా ఉన్నట్టున్నావే. - మరంతే కదా. 386 00:38:53,125 --> 00:38:54,334 - సరే మరి. - హాయ్, బంగారం. 387 00:38:54,418 --> 00:38:55,419 హాయ్. 388 00:38:56,170 --> 00:39:00,757 లేదు, నా దృష్టిలో చాలామంది జీవితమంటే ఆహారం మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించరనుకుంటా. 389 00:39:00,841 --> 00:39:02,551 - అవును. - మన జీవితాలలో 390 00:39:02,634 --> 00:39:06,054 అనేకానేక సంక్లిష్టకరమైన అనుభూతులు, కార్యకలాపాలు గట్రా ఉంటాయి. 391 00:39:06,138 --> 00:39:08,932 మరి ఆహారం విషయానికే వస్తే, ఏంటి అది? 392 00:39:09,016 --> 00:39:10,392 - అవును, ఏంటది? - ఇంధనం. 393 00:39:11,018 --> 00:39:13,353 కేలరీలు. ఆ రెండూ ఒకటే కాదు. 394 00:39:13,437 --> 00:39:15,814 - అవును, అంతే, ప్యాటన్. - అవును. 395 00:39:15,898 --> 00:39:17,566 కానీ, ఓ విషయం... 396 00:39:17,649 --> 00:39:22,863 మన్నించాలి, మార్క్, ఇంకా మా నాన్న "తాగుడే జీవనం" అని ఓ ఫ్లాస్కు మీద రాసి ఉంచారు. 397 00:39:24,448 --> 00:39:26,325 - అవును. - అది చాలా తేలికైన విషయం కదా. 398 00:39:26,408 --> 00:39:28,785 అవును. మా నాన్న తాగుడు గురించి అందరూ తప్పుగా అనుకున్నారు. 399 00:39:28,869 --> 00:39:32,247 రికెన్ మరియు రిబెక్, నువ్వు గతంలో హిస్టరీ ప్రొఫెసర్ గా చేసేవాడివని చెప్పారు, మార్క్. 400 00:39:32,331 --> 00:39:33,332 అవును. 401 00:39:33,415 --> 00:39:35,792 మరి ఇందులో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. 402 00:39:37,211 --> 00:39:39,213 ఆహారానికి, జీవితానికి సంబంధించిన విషయం మీద. 403 00:39:41,340 --> 00:39:44,885 నాకు అంతగా తెలీదు. ఎక్కువగా నేను మొదటి ప్రపంచ యుద్ధం గురించే బోధించేవాడిని. 404 00:39:44,968 --> 00:39:47,095 సరే. నేను చెప్తాను. 405 00:39:47,179 --> 00:39:48,931 నేను చరిత్ర అంతటా హింసను, యుద్ధాన్ని పోల్చుతూ 406 00:39:49,014 --> 00:39:52,768 ప్రచురించబడిన పరిశోధనా కథనాన్ని ఈ మధ్యనే చదివాను. 407 00:39:53,393 --> 00:39:54,394 పుస్తకాల పురుగు వచ్చేశాడు. 408 00:39:54,478 --> 00:39:55,896 యుద్ధమంటే పిచ్చి అనుకోవచ్చు. 409 00:39:56,980 --> 00:40:02,444 కానీ ఏదేమైనా, అందులో, జనాలు దాన్ని మహా యుద్ధంగా అభివర్ణించారని ఆయన చెప్పారు. 410 00:40:03,028 --> 00:40:05,697 ఏంటంటే, దాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగా పిలిస్తే అందరూ అదోలా చూసేవారట. 411 00:40:06,281 --> 00:40:07,616 అది నిజమా? 412 00:40:11,411 --> 00:40:16,792 అంటే, అప్పటికి ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం జరగలేదు కదా, 413 00:40:16,875 --> 00:40:20,212 అందుకే ఎవరూ దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం అని పిలిచి ఉండరు. 414 00:40:21,463 --> 00:40:23,090 - వావ్. - అంతేగా. 415 00:40:23,173 --> 00:40:24,591 - సరిగ్గా చెప్పావు. - మరి. 416 00:40:25,300 --> 00:40:26,343 అది నిజం. 417 00:40:26,426 --> 00:40:27,970 అందుకే మనం ప్రతి పార్టీకి వీడిని పిలవాలి. 418 00:40:28,929 --> 00:40:32,516 స్వర్గస్తురాలైన మార్క్ భార్య, జెమ్మా కూడా టీచరే. రష్యా సాహిత్యం గురించి బోధించేది. 419 00:40:32,599 --> 00:40:34,518 - నాకు సాహిత్యమంటే ప్రాణం. - కదా? 420 00:40:35,519 --> 00:40:37,688 కానీ మార్క్ ఇప్పుడు లూమన్ లో పని చేస్తున్నాడు. 421 00:40:37,771 --> 00:40:39,106 - రికెన్. - నిజంగానా? 422 00:40:39,189 --> 00:40:41,066 అవును. సుమారుగా రెండేళ్ల నుండి పని చేస్తున్నాను. 423 00:40:41,149 --> 00:40:43,110 - మీరు మందులను తయారు చేస్తారా? - లేదు. 424 00:40:43,193 --> 00:40:45,863 లూమన్ ని నేను టెక్నాలజీకి సంబంధించిన సంస్థ అని అనుకున్నాను. 425 00:40:45,946 --> 00:40:47,739 - దాన్ని 1800లలో స్థాపించారు. - నిజంగానా? 426 00:40:47,823 --> 00:40:49,616 ఉపశమనాన్ని కలుగజేసే మందులను కదా? 427 00:40:49,700 --> 00:40:50,784 వాళ్లు చేయనివంటూ ఏమైనా ఉన్నాయా? 428 00:40:51,743 --> 00:40:54,454 అవును, కానీ నేను కార్పరేట్ ఆర్కైవ్స్ శాఖలో పని చేస్తున్నా, కాబట్టి... 429 00:40:54,538 --> 00:40:56,790 అయితే నీకు భయంకరమైన రహస్యాలు తెలిసుంటాయి. 430 00:40:57,332 --> 00:40:59,126 - అదేం లేదులే. - లేదు. 431 00:40:59,209 --> 00:41:03,338 మార్క్ పని ఎంత గోప్యమైనదంటే, దానికి అతనిపై వేర్పాటు పద్ధతిని ప్రయోగించాల్సి వస్తుంది. 432 00:41:07,843 --> 00:41:08,844 వావ్. 433 00:41:10,762 --> 00:41:12,264 అది మామూలు విషయం కాదు కదా? 434 00:41:14,016 --> 00:41:17,311 అవును. దాని గురించి మాట్లాడాలా వద్దా అనే నిర్ణయం కూడా అతనిదే అనుకుంటా. 435 00:41:17,394 --> 00:41:18,854 - అంతే కదా, రికెన్? - ఓరి దేవుడా. 436 00:41:18,937 --> 00:41:20,814 - లేదు. అదేం లేదులే. - ఓరి దేవుడా, మార్క్. 437 00:41:20,898 --> 00:41:22,566 - దయచేసి నన్ను క్షమించు. - పర్వాలేదులే. నేనేం పట్టించుకోను. 438 00:41:22,649 --> 00:41:25,694 - మన్నించాలి. - కాదు, అది చాలా గొప్ప విషయం అనుకుంటా. 439 00:41:25,777 --> 00:41:27,446 అంటే, నాకు కూడా ఆ అవకాశం వస్తే బాగుండు అనిపిస్తోంది. 440 00:41:28,530 --> 00:41:31,909 నేనెప్పుడూ ఆ మరో అవతారం గురించే ఆలోచిస్తుంటాను. 441 00:41:34,786 --> 00:41:37,748 అంటే, మరో అవతరాం అంటూ ఏమీ ఉండదు. 442 00:41:38,624 --> 00:41:40,709 ఉన్నది నేనే. పని చేసేది నేనే. 443 00:41:40,792 --> 00:41:44,922 కానీ నాకు ఆంతరంగిక భావాల విషయం మాత్రం అర్థం కావట్లేదు. అది ఎలా ఉంటుంది? 444 00:41:48,175 --> 00:41:51,553 అది చాలా తేలిక. జ్ఞాపకాలను విడగొడతారు, 445 00:41:51,637 --> 00:41:54,973 ఆఫీసులో ఉన్నప్పుడు, మనం ఇక్కడ చేసేవేవి మనకి గుర్తుండవు. 446 00:41:55,057 --> 00:41:56,058 అంతే కదా, మార్క్? 447 00:41:56,141 --> 00:41:58,936 - అంటే, అది... - అయితే నువ్వు తొమ్మిది గంటలకు 448 00:41:59,019 --> 00:42:01,605 వెళ్లడం, సాయంత్రం అయిదు గంటలు అయ్యాక బయటకు రావడం మాత్రమే నీకు గుర్తుంటుందా? 449 00:42:01,688 --> 00:42:04,233 - ఒకరి తర్వాత మరొకరిని పంపుతారు, కనుక... - ఒకరి తర్వాత మరొకరిని పంపుతారా? 450 00:42:04,316 --> 00:42:07,569 అలాగే, ఆఫీసులో ఉన్నప్పుడు బయటి విషయాలేవీ గుర్తుండవు. 451 00:42:07,653 --> 00:42:11,323 ఒక్క మాటలో చెప్పాలంటే, నీలోని ఉద్యోగి ఆఫీసులోనే ఇరుక్కుపోతాడు. 452 00:42:11,406 --> 00:42:13,575 అంటే... 453 00:42:13,659 --> 00:42:16,203 - ఇరుక్కుపోవడమని కాదు, కానీ... - కానీ ఏంటి? 454 00:42:20,290 --> 00:42:24,253 లేదు, లేదు. నాకు తెలుసుకోవాలనుంది. ఇరుక్కుపోవడం కాక ఇంకేం చెప్పాలనుకున్నావు? 455 00:42:27,130 --> 00:42:28,131 ఏం చెప్పాలనుకున్నావు? 456 00:42:32,261 --> 00:42:35,055 అయితే, మీ ఆఫీసు గురించి చెప్పే స్థితిలో నువ్వు లేవని మాకు తెలిసిందనుకుంటా. 457 00:42:35,138 --> 00:42:36,431 సరే, నిజానికి మనం అసలు విషయాన్ని 458 00:42:36,515 --> 00:42:37,641 - పక్కన పెట్టేశామనుకుంటా. - అవును. 459 00:42:39,309 --> 00:42:41,979 విషయమేంటంటే, మార్క్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, 460 00:42:42,062 --> 00:42:43,814 అది నైతికరపరంగా, అలాగే సామాజికపరంగా 461 00:42:45,190 --> 00:42:47,150 వివాదాస్పదమైన నిర్ణయం. 462 00:42:47,734 --> 00:42:50,487 ధర్మబద్ధంగా, శాస్త్రీయంగా కూడా. 463 00:42:51,530 --> 00:42:54,950 కానీ మార్క్, నేను బేషరతుగా 464 00:42:55,576 --> 00:42:56,785 నీకు మద్దతుగా ఉంటాను. 465 00:42:56,869 --> 00:42:58,495 - బాగా చెప్పావు. - థ్యాంక్స్. 466 00:42:58,579 --> 00:43:00,998 - అంతే కదా. - నేను మార్క్ కి మద్ధతుగా ఉంటాను. 467 00:43:02,124 --> 00:43:03,125 వావ్. 468 00:43:04,751 --> 00:43:07,087 అది మీ మంచితనం. 469 00:43:07,963 --> 00:43:10,382 నిజానికి సాంప్రదాయంగా అయితే ఈ సమయంలో మనం ఆహారం తినాల్సిన సమయమైంది 470 00:43:10,465 --> 00:43:12,509 అని నేను అనాలి. 471 00:43:13,886 --> 00:43:16,471 కానీ నేను ఒక విషయం చెప్పాలి, ఆహారం లేకపోవడం వలన 472 00:43:16,555 --> 00:43:21,101 మనం అనేకానేక అంశాలపై లోతుగా విశ్లేషించామనుకుంటా. 473 00:43:21,185 --> 00:43:23,020 - అవును. అంతే. - అంతే కదా? 474 00:43:23,103 --> 00:43:25,981 లిమాలో ఉన్న నా స్నేహితుడు ఆహారం ఉన్న డిన్నర్ తిని చాలా కాలమైంది... 475 00:43:27,608 --> 00:43:30,277 నేను నీకు మూడు వేల డాలర్లు ఇస్తే, నువ్వు నన్ను క్షమిస్తావా? 476 00:43:31,570 --> 00:43:36,491 ఇవాళ జరిగిన అరాచకాల గురించి ఇంకా నీకు పుట్టబోయే బిడ్డకి తెలీదు కనుక, 477 00:43:36,575 --> 00:43:40,037 బిడ్డ పుట్టే దాకా నిన్నేమీ చేయను. 478 00:43:40,120 --> 00:43:43,540 ఓరి దేవుడా. ఇదుగో, బాసూ. 479 00:43:46,585 --> 00:43:47,586 థ్యాంక్ యూ. 480 00:43:52,508 --> 00:43:56,595 హేయ్, నువ్వు తీసుకొనే పొట్టి మీసమున్న డాక్టర్ దగ్గర చికిత్స ఎలా సాగుతోంది? 481 00:44:01,517 --> 00:44:02,518 నువ్వు వెళ్ళట్లేదా? 482 00:44:04,353 --> 00:44:06,813 ఆఫీసుకు వెళ్తున్నా కదా, ఇప్పుడు బాగానే ఉందిలే. 483 00:44:08,148 --> 00:44:09,149 సరే. 484 00:44:10,734 --> 00:44:13,529 ఆ ఉద్యోగంలో చేరినందుకు నీ మీద నాకు గర్వంగా ఉంది. నిజంగానే చెప్తున్నా. 485 00:44:14,738 --> 00:44:17,032 తను కూడా గర్వపడుతుంది. అందులో సందేహమే లేదు. 486 00:44:20,327 --> 00:44:23,872 కానీ తన గురించిన జ్ఞాపకాలు ఎనిమిది గంటల పాటు రాకుండా చూసుకోవడం, 487 00:44:23,956 --> 00:44:26,792 కోలుకోవడం రెండూ ఒకటే కాదు అనుకుంటా. 488 00:44:34,842 --> 00:44:36,677 ఇక్కడే ఉన్నావు కాబట్టి, ఇక్కడే పడుకోరాదూ? 489 00:44:38,178 --> 00:44:39,179 లేదు. 490 00:44:40,347 --> 00:44:41,348 ఎందుకు? 491 00:44:41,431 --> 00:44:43,267 మీ ఇంట్లో ఎక్కడ చూసినా గర్భానికి సంబంధించిన వాసనే వస్తోంది. 492 00:44:47,062 --> 00:44:49,273 కానీ అందులోని ఆంతరంగిక కోణమే నాకు అర్థం కావట్లేదు. 493 00:44:51,108 --> 00:44:52,526 తను భలే సరదాగా ఉంది కదా? 494 00:44:53,110 --> 00:44:55,904 - నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండాలి. - లేదు, నేను ఉండను. 495 00:44:55,988 --> 00:44:57,906 దుప్పట్లను స్వయంగా నేనే చేస్తున్నాను, 496 00:44:57,990 --> 00:45:01,034 కాబట్టి పెద్ద దుప్పటి చేయడానికి నాకు ఇంకా చాలా సమయం పడుతుంది. 497 00:45:01,785 --> 00:45:04,288 కానీ ట్విన్ సైజ్ బెడ్ సౌకర్యంగానే ఉంటుంది, 498 00:45:04,371 --> 00:45:07,124 ఇంకా పజమాలను బాల్టిక్ గుడ్డతో చేశాను, 499 00:45:07,207 --> 00:45:09,585 కాబట్టి నీకు నిద్ర బాగానే పడుతుంది. 500 00:45:10,127 --> 00:45:14,256 థ్యాంక్స్. కానీ మూడు పరుపుల మంచం విషయమే నాకు అర్థం కావట్లేదు. 501 00:45:14,339 --> 00:45:16,341 - అవును. - చిన్నారి పెరిగేకొద్దీ మంచాలను మార్చితే, 502 00:45:16,425 --> 00:45:20,262 దాని వల్ల చిన్నారికి గాయమయ్యే అవకాశం ఉందని రికెన్ సహోద్యోగి ఒకరు మాకు చెప్పారు. 503 00:45:20,345 --> 00:45:21,722 మాన్పించలేని గాయం. 504 00:45:21,805 --> 00:45:26,018 కానీ ఆ చిన్నారికి పుట్టిన క్షణం నుండే మనం తగినంత పెద్ద మంచం ఉండేలా చేస్తే, 505 00:45:26,101 --> 00:45:29,146 గది అంతటా స్వేచ్ఛగా తిరిగే వీలు ఆ చిన్నారికి దక్కుతుంది. 506 00:45:29,771 --> 00:45:31,356 అర్థమైంది. సరే. 507 00:45:36,486 --> 00:45:37,487 సరే. 508 00:45:38,572 --> 00:45:40,574 ఇవాళ నీ కంపెనీని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, మార్క్. 509 00:45:42,826 --> 00:45:43,827 మంచిది. 510 00:45:44,328 --> 00:45:45,537 సరే మరి, బంగారం. 511 00:45:46,663 --> 00:45:47,748 - ఇక వెళ్దామా, బంగారం? - సరే. 512 00:45:47,831 --> 00:45:48,916 - పద. - స్వీట్ డ్రీమ్స్. 513 00:45:48,999 --> 00:45:50,000 థ్యాంక్స్. 514 00:45:51,543 --> 00:45:53,045 శుభరాత్రి, రాజుగారు. 515 00:45:53,128 --> 00:45:54,546 శుభరాత్రి, రాణిగారు. 516 00:47:51,955 --> 00:47:52,956 హేయ్. 517 00:47:53,457 --> 00:47:54,458 హేయ్. 518 00:47:54,958 --> 00:47:55,959 లేచి ఎంత సేపయింది? 519 00:47:56,543 --> 00:47:57,669 చాలా సేపయింది. 520 00:48:00,923 --> 00:48:04,468 నిన్న రాత్రి ఇంటి ముందు సూటుబూటు వేసుకొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 521 00:48:04,551 --> 00:48:06,220 - సూటుబూటు వేసుకొనున్న వ్యక్తా? - అవును. 522 00:48:06,303 --> 00:48:08,222 చిన్న ఆఫీసర్ అంటావా లేదా పెద్ద ఆఫీసర్ అంటావా? 523 00:48:08,305 --> 00:48:09,306 నేను నిజమే చెప్తున్నాను. 524 00:48:09,890 --> 00:48:11,600 నిన్న రాత్రి నా ఇంటి ముందు నిజంగానే నీకు ఒక మనిషి కనిపించాడా? 525 00:48:11,683 --> 00:48:12,935 అవును. 526 00:48:13,519 --> 00:48:14,520 వామ్మోయ్. 527 00:48:15,646 --> 00:48:18,482 నన్ను అదోలా చూశాడు. నేనేదో అతనికి తెలుసు అన్నట్టుగా. 528 00:48:19,024 --> 00:48:21,610 ఆ ఆగంతకుడు నిన్ను అర్థం చేసుకున్నవాడిలా అనిపించాడా? 529 00:48:21,693 --> 00:48:22,945 చాలా. 530 00:48:24,488 --> 00:48:27,282 గుట్ట దిగువున ఒక బార్ ఉంది. అక్కడి నుండి ఎవడో తాగేసి వచ్చుంటాడు. 531 00:48:28,200 --> 00:48:30,911 బార్ అంటే గుర్తుకు వచ్చింది, ఇంకా నీ నుండి సారాయి కంపు కొడుతోంది. 532 00:48:31,870 --> 00:48:35,332 మన్నించు, ఇక్కడిలా కాకుండా నా చిన్నప్పుడు అమ్మానాన్నలు నా మంచాలను మార్చేవారు కదా, 533 00:48:35,415 --> 00:48:38,627 ఆ ఆలోచనను మర్చిపోదామని తాగాను. 534 00:48:39,211 --> 00:48:41,004 ఆ పంచ్ వేయడానికి తగిన సందర్భం కోసం కాచుకొని ఉన్నావు కదా. 535 00:49:27,718 --> 00:49:28,719 మిసెస్ సెల్విగ్ కాల్ చేస్తున్నారు 536 00:49:28,802 --> 00:49:30,596 పిప్స్ బార్ & గ్రిల్ లంచ్ - డిన్నర్ 537 00:49:30,679 --> 00:49:32,431 విఐపీ ప్రాంగణం 538 00:49:32,514 --> 00:49:33,515 హలో. 539 00:49:35,058 --> 00:49:40,022 సరే. రీసైక్లింగ్ వారు నిన్నే వచ్చి తీసుకెళ్తారు, మిసెస్ సెల్విగ్. 540 00:49:40,105 --> 00:49:41,398 ఇవాళ రాత్రి చెత్తను తీసుకొని వెళ్తారు. 541 00:49:41,481 --> 00:49:45,152 మీరు మీ చెత్త బుట్టని నా స్థలంలోనే పెడుతూ ఉన్నారు. కాబట్టి... 542 00:49:47,154 --> 00:49:48,655 సరే. అలాగే. 543 00:49:49,907 --> 00:49:53,202 విషయమేంటంటే, నేను ఇప్పుడు మాట్లాడలేను. డిన్నర్ కి బయటకు వచ్చున్నాను. కానీ... 544 00:49:54,786 --> 00:49:56,288 లేదు, ఒక్కడినే వచ్చాను. 545 00:49:59,041 --> 00:50:01,502 పిప్స్ బార్ అండ్ గ్రిల్ కి వచ్చాను. 546 00:50:02,544 --> 00:50:03,629 ఎవరండి మీరు? 547 00:50:05,214 --> 00:50:07,424 ఫోన్ పెట్టేయ్. త్వరగా. 548 00:50:12,513 --> 00:50:15,724 మన్నించండి, మిసెస్ సెల్విగ్. ఆహారం వడ్డించారు, తర్వాత మాట్లాడదాం. 549 00:50:18,018 --> 00:50:20,938 హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్? 550 00:50:26,026 --> 00:50:28,820 క్షమించు. ఇప్పుడు నీకు ఆ వాక్యం గుర్తు లేదు. 551 00:50:31,240 --> 00:50:33,700 మీరు నన్ను వెంబడిస్తున్నారా? 552 00:50:34,701 --> 00:50:36,245 నీ గొంతు ఇక్కడ వేరుగా ఉంది. 553 00:50:37,204 --> 00:50:38,288 దరిద్రంగా ఉంది. 554 00:50:40,374 --> 00:50:42,918 - సరే, అసలు మీరు ఎవరు? నాకు... - పీటీ. 555 00:50:43,001 --> 00:50:45,337 నా పేరు పీటీ. నేను నీ సహోద్యోగిని. 556 00:50:47,631 --> 00:50:51,510 అది సాధ్యం కాదు. నా డిపార్టుమెంటులోని వారందరికీ... 557 00:50:51,593 --> 00:50:54,513 జ్ఞాపకాలు వేరు చేయబడతాయి. నాకు కూడా అది చేశారు. 558 00:50:56,390 --> 00:50:58,559 సరే. కానీ వేరు చేయడాన్ని పునరుద్ధరించడం అసాధ్యం. 559 00:50:58,642 --> 00:51:02,312 అవును. దాన్ని పునరుద్దరించడం సులువైన విషయం కాదు. నేను బయటి సహాయం పొందాను. 560 00:51:15,450 --> 00:51:18,120 అయితే, మీకు ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించలేదా? 561 00:51:18,203 --> 00:51:20,789 - మీరు ఫిర్యాదు చేయకుండా ఇలా... - లేదు. 562 00:51:21,498 --> 00:51:24,585 నేను ముందు ఫిర్యాదు చేయాలనే చూశాను. నువ్వు కూడా ఆ ప్రయత్నం చేశావు. 563 00:51:26,420 --> 00:51:29,506 సరే మరి. అయితే... 564 00:51:30,966 --> 00:51:32,426 మీపై జరిగిన వేర్పాటు పద్ధతి ఇప్పుడు పునరుద్ధరించబడింది. 565 00:51:32,509 --> 00:51:37,306 ఇప్పుడు వాళ్లు మీ వెంట పడుతున్నారు అంటున్నారా? 566 00:51:41,101 --> 00:51:42,102 అవును. 567 00:51:45,439 --> 00:51:49,610 "వాళ్లు" అంటే గ్రేనర్, అతను ఇప్పుడు ఇక్కడే ఉండుండవచ్చు. 568 00:51:49,693 --> 00:51:54,323 గ్రేనర్. సరే. అంటే, అతను మీకు తెలిసిన వ్కక్తా లేకపోతే... 569 00:51:54,406 --> 00:51:57,701 అతను మనిద్దరికీ తెలుసు. కానీ అతనంటే మనకి ఇష్టం లేదు. 570 00:51:59,286 --> 00:52:00,287 అలాగా. 571 00:52:06,210 --> 00:52:10,506 అక్కడ వాళ్లు చెప్పేది ఒకటి, నిజంగా జరిగేది ఒకటి. 572 00:52:12,049 --> 00:52:13,759 నాకు ఏదైనా జరిగితే, 573 00:52:14,718 --> 00:52:18,180 నాకు తెలిసిన విషయాలు మూడవ కంటికి కూడా తెలియాల్సిన అవసరముంది. 574 00:52:20,682 --> 00:52:22,559 ఆ మూడవ కన్ను నా స్నేహితుడిది అయితే మరీ మంచిది. 575 00:52:28,190 --> 00:52:30,692 అయితే, మనం స్నేహితులమా? 576 00:52:32,194 --> 00:52:33,570 నేను నీ ప్రాణ స్నేహితుడిని. 577 00:52:35,239 --> 00:52:36,740 నువ్వు నాకు మంచి స్బేహితుడివి. 578 00:52:40,577 --> 00:52:43,372 పిప్స్ 579 00:53:05,602 --> 00:53:09,731 పుట్టినరోజు శుభాకాంక్షలు, కోడలా! 580 00:53:12,109 --> 00:53:14,820 మార్క్, కార్డు విషయంలో మన్నించు. 581 00:53:15,863 --> 00:53:18,198 నేను హడావిడిగా ఏదోకటి తీసుకోవాల్సిన పరిస్థితి, అది సరైన కార్డ్ కాదని తెలుసు. 582 00:53:18,282 --> 00:53:21,493 కానీ, నువ్వు నాకు చాలా మంచి కోడలువు కాగలవులే. 583 00:53:23,745 --> 00:53:27,291 మనం బయటి ప్రపంచంలో ఎలాంటి వాళ్లం అని, ఇంకా మనం ఏ దారులను ఎంచుకున్నాం అని, 584 00:53:27,916 --> 00:53:30,627 వాటిని ఎందుకు ఎంచుకున్నాం అని తెగ ఆలోచిస్తూ ఉండేవాళ్లం. 585 00:53:37,384 --> 00:53:39,344 అలాంటి చోటుకు పని చేయమని పంపించే వాళ్ళు 586 00:53:39,428 --> 00:53:41,805 ఎంతటి దుర్మార్గులు అయ్యుంటారా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. 587 00:53:43,599 --> 00:53:46,143 ప్రత్యేకించి, పని చేసేది తామే అయితే, ఎంతటి పాపం చేసుంటారా అని అనుకొనేవాడిని. 588 00:53:49,146 --> 00:53:52,941 కానీ మనం దుర్మార్గులం కాదు, మార్క్. అసలైన దుర్మార్గులం మనం కాదు. 589 00:53:55,694 --> 00:53:59,740 అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని నీకు లేకపోతే, నేనేమీ నిన్ను బలవంతపెట్టను. 590 00:54:02,326 --> 00:54:06,330 కానీ నీకు తెలుసుకోవాలనుంటే, ఈ కార్డ్ వెనుక చిరునామా ఉంది, అక్కడికి వెళ్లు. 591 00:54:08,332 --> 00:54:13,128 ఒంటరిగా వెళ్లు, అక్కడ నీకు సుదీర్ఘమైన సమాధానానికి ఆరంభం కనబడుతుంది. 592 00:54:13,212 --> 00:54:16,340 499 హాఫ్ లూప్ ఆర్ డీ 593 00:54:34,733 --> 00:54:37,069 మార్క్, మీరేనా? 594 00:54:37,152 --> 00:54:38,445 హాయ్. మిసెస్ సెల్విగ్. 595 00:54:39,905 --> 00:54:44,201 నా చెత్త బుట్టలు మీ వాటితో కలిసిపోయినందుకు నాకు సిగ్గుగా ఉంది. 596 00:54:44,284 --> 00:54:45,577 పర్వాలేదులెండి. 597 00:54:46,787 --> 00:54:47,788 డిన్నర్ ఎలా ఉంది? 598 00:54:48,789 --> 00:54:51,750 బాగానే ఉంది. నాకు కాస్తంత అలసటగా ఉంది. 599 00:54:53,460 --> 00:54:56,004 మా అమ్మ క్యాథలిక్ అన్నమాట. 600 00:54:56,088 --> 00:55:01,802 నిద్రిస్తున్న చిన్నారిని ఆశీర్వదించడానికి దైవదూతలకు ఎనిమిది గంటలు పడుతుందని అనేది. 601 00:55:02,678 --> 00:55:05,055 మీరు తగినంత సేపు నిద్రపోయి దైవదూతలకు తగినంత సమయం ఇస్తున్నారనే ఆశిస్తున్నా. 602 00:55:06,139 --> 00:55:09,560 ఇవాళ రాత్రి వాళ్లకి చాలా సమయమే ఇస్తానులెండి. 603 00:55:11,144 --> 00:55:12,646 శుభరాత్రి, మిసెస్ సెల్విగ్. 604 00:55:12,729 --> 00:55:13,730 మార్క్. 605 00:55:16,900 --> 00:55:18,610 మీరు చాలా మంచి వారు. 606 00:57:08,387 --> 00:57:10,389 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య