1 00:00:18,435 --> 00:00:22,064 గుర్రాలను ప్రేమించిన అమ్మాయి 2 00:00:59,977 --> 00:01:01,186 త్వరగా నిద్ర లేచావే. 3 00:01:01,270 --> 00:01:05,399 అవును. లోట్టి కొంచెం గీరగా ప్రవర్తించింది, అందుకని అలా షికారుకు తీసుకెళ్ళాను. 4 00:01:05,983 --> 00:01:06,984 లోట్టి అలా చేసిందా? 5 00:01:08,527 --> 00:01:09,528 భోజనం చేశాను. 6 00:01:10,404 --> 00:01:11,446 అవును, నాకు తెలుసు. 7 00:01:25,127 --> 00:01:27,796 -హే, నిన్ను ఒకటి అడగాలని... -తలుపు కొట్టాలని తెలీదా? 8 00:01:27,880 --> 00:01:29,590 క్షమించు. మర్చిపోతున్నాను. 9 00:01:29,673 --> 00:01:33,093 నాకు కాస్త ఏకాంత సమయం కావాలి. అందరూ ఇష్టం వచ్చినప్పుడు, వచ్చేస్తున్నారు. 10 00:01:33,177 --> 00:01:34,428 మనం ఇద్దరమే కదా ఉన్నాం. 11 00:01:34,511 --> 00:01:36,972 తలుపుకు కర్టెన్ పెట్టడానికి ఒక కారణం ఉంది. నాకంటూ ఒక జీవితం ఉంది. 12 00:01:37,055 --> 00:01:39,349 ప్రతీదానికి నువ్వు నా వ్యక్తిగత స్థలంలోకి రాకూడదు. 13 00:01:39,933 --> 00:01:41,810 ఈ మధ్య నువ్వు ఊరికే కోప్పడుతున్నావు, బుజ్జి. 14 00:01:41,894 --> 00:01:44,104 నేనేం కోప్పడటం లేదు. అలాగే నేనేం బుజ్జిని కాను. 15 00:01:48,901 --> 00:01:52,821 ఒకవేళ మీ అమ్మ ఇక్కడ ఉండి ఉంటే, నీతో మాట్లాడగలిగేది, అంటే, 16 00:01:52,905 --> 00:01:55,282 -నీలో వస్తున్నా మార్పుల గురించి. -ఓరి, దేవుడా. 17 00:01:55,365 --> 00:01:58,660 లేదు... నా ఉద్దేశం ఆ మార్పులు కూడా అనుకో. 18 00:01:59,244 --> 00:02:01,038 కానీ నేను అనేది నీ భావనల గురించి. 19 00:02:02,122 --> 00:02:04,499 నీ వయసులో ఉన్నప్పుడు, నాకు ఆకలి తప్ప ఇంకేం తెలీదు. 20 00:02:04,583 --> 00:02:08,711 సరే. కానీ అమ్మ చనిపోయి ఇప్పటికే చాలా ఏళ్ళు అయింది, 21 00:02:08,794 --> 00:02:10,756 కాబట్టి ఇక ఆ విషయాన్ని వదిలేయ్. 22 00:02:13,926 --> 00:02:14,927 సరిగ్గానే అన్నావులే. 23 00:02:18,305 --> 00:02:22,601 నాకు ఊర్లో కొంత పని ఉంది. వస్తావా? ఒకప్పటిలా కలిసి వెళ్లొచ్చు. 24 00:02:22,684 --> 00:02:26,688 -లేదు, నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది. -ఒంటరిగానా? 25 00:02:26,772 --> 00:02:28,857 నేనేం ఒంటరిగా లేను. నాతో లోట్టి ఉంది. 26 00:02:29,858 --> 00:02:32,945 కానీ మన వీధి చివర ఉన్న ఆ అమ్మాయి సంగతి ఏంటి? 27 00:02:33,612 --> 00:02:35,280 పాస్టర్ గారి అమ్మాయా? 28 00:02:35,364 --> 00:02:36,865 తను నీ స్నేహితురాలు కాదా? 29 00:02:37,366 --> 00:02:39,618 అంటే, మా చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారం, 30 00:02:39,701 --> 00:02:41,161 అయినంత మాత్రాన ఇప్పుడు స్నేహితులం అవ్వము కదా. 31 00:02:41,245 --> 00:02:44,039 సరే, ఆమెకు కూడా గుర్రాలంటే ఇష్టం ఉండొచ్చు. మీరు ఇద్దరూ కలిసి స్వారీ చేసి చూడండి. 32 00:02:44,122 --> 00:02:47,501 మిల్లికి గుర్రపు సైడ్ జీను అంటే ఏమిటో కూడా తెలిసి ఉండదు. 33 00:02:47,584 --> 00:02:49,086 సరే, నాకైతే ఆ పిల్ల మొదటి నుండి ఇష్టం. 34 00:02:49,670 --> 00:02:51,588 ఆ పిల్ల మొదటి నుండి చాలా స్వతంత్రంగా ఆలోచించేది, 35 00:02:51,672 --> 00:02:54,258 ఇక్కడి అమ్మాయిలతో పోల్చితే అది చాలా మేలు అనొచ్చు. 36 00:02:58,971 --> 00:03:01,056 రాత్రికి కలుద్దాం, బుజ్జి. లవ్ యు. 37 00:03:02,516 --> 00:03:03,517 బాయ్. 38 00:03:15,028 --> 00:03:16,029 ఇదుగో. 39 00:03:17,823 --> 00:03:18,824 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 40 00:04:19,551 --> 00:04:21,553 సెలూన్ 41 00:04:41,532 --> 00:04:43,200 మీ నష్టానికి చింతిస్తున్నాను, మిస్. 42 00:04:44,451 --> 00:04:47,621 ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఇతర విషయాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, 43 00:04:47,704 --> 00:04:51,750 కానీ మీ నాన్న గారు మిస్టర్ సైలస్ మెక్కాల్ గారికి చాలా డబ్బు అప్పు చెల్లించాల్సి ఉంది. 44 00:04:51,834 --> 00:04:54,253 ఆ డబ్బును వసూలు చేయడానికి మిస్టర్ మెక్కాల్ ప్రయత్నించినప్పుడు, 45 00:04:54,336 --> 00:04:56,004 మీ నాన్న ఆయనపై తుపాకీ గురిపెట్టారు. 46 00:04:57,256 --> 00:05:01,552 కాబట్టి, మిస్టర్ మెక్కాల్ ఆయన్ని కాల్చారు. ఆత్మరక్షణ కొరకు కాబట్టి, ఆయన్ని విడుదల చేసారు. 47 00:05:05,973 --> 00:05:07,808 ఆయన గుర్రం ఎక్కడ? 48 00:05:08,600 --> 00:05:09,852 ఆయన టౌన్ లోకి వెళ్ళాడు. అవునా? 49 00:05:09,935 --> 00:05:14,189 గుర్రాలు పారిపోవడం సహజం, మిస్. నేను ఒక నోటీసు జారీ చేస్తాను. 50 00:05:15,399 --> 00:05:17,860 ఆయన శవాన్ని మీ ఇంటికి తీసుకురావడానికి సహాయం కావాల్సి వస్తే చెప్పండి. 51 00:06:46,281 --> 00:06:49,493 దుఃఖపడువారు ధన్యులు, వారు... వారు ఓదార్చబడుదురు. 52 00:06:49,576 --> 00:06:51,203 ఇప్పడు దానికి సరైన సమయం కాదు, మిల్లి. 53 00:06:52,663 --> 00:06:54,248 మీ నాన్న విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నాను. 54 00:06:54,331 --> 00:06:55,832 నేను కూడా. 55 00:06:55,916 --> 00:07:00,629 ఏదైతే ఏముందిలే, నాకైతే వీలైనంత త్వరగా ఆయన్ని స్వర్గంలో కలుసుకోవాలని ఉంది. 56 00:07:00,712 --> 00:07:01,547 నిజంగా? 57 00:07:02,548 --> 00:07:05,092 మా నాన్నని స్వర్గంలో కలవాలని నీకు అంత ఆతృతగా ఉందా? 58 00:07:05,175 --> 00:07:06,176 అవును. 59 00:07:06,552 --> 00:07:08,679 ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఏరోజూ కలవని నీకు? 60 00:07:09,179 --> 00:07:10,556 అంటే, ఆయన వయస్సు ఎక్కువ కదా. 61 00:07:12,307 --> 00:07:14,226 -నువ్వు ఆయన బట్టలు వేసుకున్నావు కదా. -అవును. 62 00:07:15,018 --> 00:07:17,145 ఆయన జ్ఞాపకం వస్తున్నారా? 63 00:07:17,229 --> 00:07:19,731 లేదు. నేను కొంత పని మీద టౌన్ కి వెళ్తున్నాను. 64 00:07:21,817 --> 00:07:23,861 అంటే, ఇది మారు వేషం అన్నమాట. 65 00:07:25,279 --> 00:07:26,280 అలాంటిదే. 66 00:07:27,406 --> 00:07:29,992 తెలుసా, నాకు నిరాశగా ఉన్నపుడు, నేను వర్జిల్ మందుల దుకాణంకి వెళ్తాను. 67 00:07:30,075 --> 00:07:31,827 అక్కడి మందులు వెంటనే సంతోషాన్ని కలిగిస్తాయి. 68 00:07:31,910 --> 00:07:33,579 నేను ఇప్పుడు వర్జిల్ దుకాణంకి వెళ్లడం లేదు. 69 00:07:33,662 --> 00:07:36,540 ఆ పిరికి పంద, సైలస్ మెక్కాల్ ని సెలూన్ లో కాల్చి చంపడానికి వెళ్తున్నాను. 70 00:07:39,001 --> 00:07:41,879 -ఆగు, ఏంటి... ఇప్పుడే చంపుతావా? -అవును. 71 00:07:41,962 --> 00:07:43,922 నీకు అసలైన సైలస్ ఎవరో కనీసం తెలుసా? 72 00:07:44,006 --> 00:07:46,717 ఎందుకంటే... మేరీ వాళ్ళ నాన్న పేరు సైలస్ ఎం., 73 00:07:46,800 --> 00:07:50,679 -అలాగే పెర్ల్ వాళ్ళ నాన్న పేరేమో సైలస్ ఎఫ్... -మిల్లి, నోరు మూసుకో. 74 00:07:52,264 --> 00:07:54,725 పదా, లోట్టి. వెళదాం. నడువు. 75 00:07:56,518 --> 00:07:57,519 -మంచి గుర్రం. -జేన్. 76 00:07:58,645 --> 00:07:59,646 జేన్, ఆగు. 77 00:08:01,565 --> 00:08:02,649 ఆగు, జేన్! 78 00:08:10,616 --> 00:08:13,577 -నాకేసి బిస్కెట్ విసిరావా? -నేను కూడా నీతో వస్తాను. 79 00:08:13,660 --> 00:08:15,412 నిన్ను నేనెందుకు తీసుకెళ్లాలి? 80 00:08:15,495 --> 00:08:18,290 ఎందుకంటే ఇప్పుడు నీతో తోడుగా ఒక స్నేహితురాలు వస్తే మంచిది అనిపిస్తుంది. 81 00:08:18,373 --> 00:08:19,833 మనం స్నేహితులం కాదు. 82 00:08:19,917 --> 00:08:21,043 ఒకప్పుడు స్నేహితులమే కదా. 83 00:08:21,752 --> 00:08:25,714 నీ జుట్టు, బట్టలు చూస్తుంటే నువ్వు గందరగోళంలో ఉన్నట్టు ఉన్నావు. 84 00:08:25,797 --> 00:08:28,592 ఒక మగాడిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే, మగాడిలాగే బట్టలు వేసుకోవాలి. 85 00:08:28,675 --> 00:08:31,512 లేదా పగ తీర్చుకోకుండా కూడా ఉండొచ్చు, అది కూడా సాధ్యమే కదా. 86 00:08:32,221 --> 00:08:35,015 మిల్లి, బైబిల్ వచనాలు చెప్తూ నన్ను ఆపడానికి ప్రయత్నించే 87 00:08:35,097 --> 00:08:36,850 నిన్ను తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. 88 00:08:37,643 --> 00:08:40,979 బైబిల్. అంటే ఏంటి, ఒక పుస్తకమా? 89 00:09:00,582 --> 00:09:02,584 ఇలా స్వారీ చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? 90 00:09:04,211 --> 00:09:05,963 మన ప్రణాళికను పోలీసుకు చెప్తే మంచిది. 91 00:09:06,046 --> 00:09:07,714 ఆయనకీ ముందే తెలుసు, కానీ పట్టించుకోవడం లేదు. 92 00:09:08,215 --> 00:09:10,926 అంటే, ఎవరైనా ఒకరు మొత్తం విషయాన్ని ఆయనకు వివరించాలి కదా. 93 00:09:11,009 --> 00:09:13,554 మేరీ వాళ్ళ నాన్నకి పిచ్చి ఎక్కి సైకోలాగ ప్రవర్తిస్తున్నాడు, ఆయన్ని జైలులో 94 00:09:13,637 --> 00:09:15,305 వేసి తప్పులు తెలిసేలా చేయాలని చెప్పాలి. 95 00:09:15,389 --> 00:09:18,934 ఆ తర్వాత నువ్వు, నేను కలిసి చర్చికి వెళ్లి నువ్వు చేయడానికి సిద్దమైన ఈ విషయాన్ని 96 00:09:19,017 --> 00:09:21,812 బట్టి క్షమించమని దేవుడిని ప్రాధేయపడాలి. 97 00:09:21,895 --> 00:09:23,230 నీకు ఇంకా ఆయన్ని చంపాలని ఉంటే. 98 00:09:23,313 --> 00:09:24,982 నువ్వు ఎప్పుడూ ఇలాగే ఎక్కువ మాట్లాడతావా? 99 00:09:25,065 --> 00:09:28,902 అవును. కానీ నువ్వు మాత్రం నిశ్శబ్దంగా, కటువుగా ఉండే రకానివి కదా. 100 00:09:28,986 --> 00:09:31,613 చిన్నపుడు స్కూల్ లో ఉండే పిల్లలు నువ్వు మూగదానివి అనుకునేవారు, గుర్తుందా? 101 00:09:33,866 --> 00:09:35,284 -హాయ్ చెప్పు. -సరే. 102 00:09:36,910 --> 00:09:38,120 శుభోదయం, మిల్లి. 103 00:09:38,203 --> 00:09:39,538 నీ అద్దాలు నాకు బాగా నచ్చాయి. 104 00:09:40,289 --> 00:09:41,498 ధన్యవాదాలు, ఎలెనోర్. 105 00:09:41,582 --> 00:09:44,042 -వీటిని ఈ మధ్యనే... -వాళ్ళు నిన్ను ఆటపట్టిస్తున్నారు. 106 00:09:45,836 --> 00:09:48,380 ఆగు, జేన్, వద్దు. దయచేసి ఇలా చేయకు. 107 00:09:48,964 --> 00:09:50,757 చేస్తే నీ జీవితమంతా నువ్వే బాధపడాల్సి వస్తుంది. 108 00:09:50,841 --> 00:09:53,427 నీ మనస్సాక్షిపై చెరగని మచ్చగా మిగిలిపోతుంది. 109 00:09:53,510 --> 00:09:56,138 ఇది చాలా చెడ్డ పని, దీని వల్ల నువ్వు నాతో, ఇంకా మనకు తెలిసిన వారితో 110 00:09:56,221 --> 00:09:57,931 కలిసి స్వరానికి రాలేవు చూసుకో. 111 00:09:58,765 --> 00:10:00,225 అంతే కాదు, నిన్ను ఉరితీసేయొచ్చు. 112 00:10:03,312 --> 00:10:05,397 ఇక్కడే ఉండు. నా గుర్రాన్ని చూసుకో. 113 00:10:10,903 --> 00:10:14,031 నేను సైలస్ మెక్కాల్ కోసం వెతుకుతున్నాను. ఈ భవనం అతనిదే, అవునా? 114 00:10:17,075 --> 00:10:19,995 -అవును, కానీ అతను ఇక్కడ లేడు. -సరే, ఎక్కడ ఉన్నాడు? 115 00:10:20,078 --> 00:10:22,539 నాకు తెలీదు. అతను ఎక్కడ ఉంటాడనేది నేనేం రాసి పెట్టుకొను. 116 00:10:28,003 --> 00:10:31,006 అది అతను కావాలని చేసినది కాదు, దేవా. అతన్ని క్షమించు! మమ్మల్ని దయచేసి క్షమించు! 117 00:10:34,635 --> 00:10:37,095 -ఏమైంది? -నేను నిన్ను బయట ఎదురు చూడమన్నాను కదా. 118 00:10:37,971 --> 00:10:39,890 నువ్వు పాస్టర్ గారి కూతురివి కదా? 119 00:10:41,141 --> 00:10:42,226 అవును. 120 00:10:44,311 --> 00:10:47,606 చర్చికి రావడం మానేసినందుకు నన్ను క్షమించమని మీ నాన్నగారిని అడుగు. 121 00:10:47,689 --> 00:10:49,650 ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నాను, అందుకని... 122 00:10:49,733 --> 00:10:51,902 మేము వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని ఆయనకు చెప్తాను. 123 00:10:51,985 --> 00:10:53,487 ఇప్పుడే వెళ్తున్నాం. 124 00:10:53,570 --> 00:10:54,947 వెళ్లే ముందు, ఒకమాట, సైలస్ ఎక్కడ? 125 00:10:55,989 --> 00:10:57,115 మీరు ఆ విషయం చెప్పాల్సిన పని లేదు. 126 00:10:57,199 --> 00:10:58,408 నాకు చెప్పండి. 127 00:10:58,492 --> 00:11:02,329 ఆయన వేటకు వెళ్ళాడు, ఇక్కడి నుండి ఇరవై మైళ్ళు ఉత్తరానికి. 128 00:11:02,913 --> 00:11:04,331 ట్రబుల్సమ్ నది దగ్గర. 129 00:11:05,040 --> 00:11:06,917 కానీ నేనైతే అతని దగ్గరకు ఒంటరిగా వెళ్లను. 130 00:11:07,000 --> 00:11:09,586 ఆయన తుపాకీ వేగంగా తీయగలడు, అంతకంటే వేగంగా ఆయన కోపం రగులుకుంటుంది. 131 00:11:10,379 --> 00:11:13,257 -డెబ్భై మీటర్ల దూరం ఉన్న ఈగని కూడా కాల్చగలడు. -ఎందుకు? 132 00:11:13,757 --> 00:11:14,758 "ఎందుకు" అంటే ఏంటి నీ ఉద్దేశం? 133 00:11:14,842 --> 00:11:17,511 ఈగను ఎందుకు కాల్చడం పాపం? 134 00:11:18,136 --> 00:11:19,137 వీటిని మేము తీసుకెళ్తున్నాం. 135 00:11:19,221 --> 00:11:21,682 మాకు... మాకు సమాచారం అందించినందుకు. 136 00:11:41,952 --> 00:11:43,620 ఇప్పుడు మనం ఏం చేయాలి? 137 00:11:44,621 --> 00:11:47,207 మనం వెనక్కి వెళ్లలేము. ఇప్పుడు మనం దోషులం. 138 00:11:48,083 --> 00:11:51,170 నువ్వు వెళ్లవచ్చు. మీ తల్లితండ్రులు అర్థం చేసుకుంటారు అనుకుంటా. 139 00:11:51,837 --> 00:11:52,963 తమాషా చేస్తున్నావా? 140 00:11:53,589 --> 00:11:57,301 తుపాకీ చూపించి సెలూన్ లో దోపిడీ చేశాను అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 141 00:11:57,801 --> 00:12:01,555 తుపాకీ చూపి దోపిడీ చేసింది నేను. నువ్వు అనుకోకుండా అక్కడ ఉన్న సాక్షివి మాత్రమే. 142 00:12:05,100 --> 00:12:07,853 సరే, ఒకవేళ నేను ఇంటికి తిరిగి వెళ్లినా కూడా, 143 00:12:07,936 --> 00:12:11,356 నేను... నేను ఏడుగురు తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోవాలి. 144 00:12:11,440 --> 00:12:14,526 అలాగే ఇంట్లో వంట వండడానికి, శుభ్రం చేయడానికి 145 00:12:14,610 --> 00:12:16,278 చర్చిలో సర్దడానికి సహాయం చేయాల్సి ఉంటుంది. 146 00:12:17,988 --> 00:12:19,656 నేను ముందు ఒక భర్తను వెతుక్కోవాలి. 147 00:12:19,740 --> 00:12:21,366 నువ్వు దేవుడిని పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. 148 00:12:23,243 --> 00:12:25,329 సరే. అలాగే, అలాగే. 149 00:12:26,580 --> 00:12:28,874 ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉండి బాగా ఆలోచిద్దాం. 150 00:12:28,957 --> 00:12:30,501 తర్వాత ఉదయమే లేచి, 151 00:12:30,584 --> 00:12:33,253 మనల్ని కిడ్నాప్ చేసారనో, లేక దయ్యం పట్టిందనో చెపుదాము. 152 00:12:34,129 --> 00:12:35,756 నువ్వు నీకు నచ్చింది చెప్పుకో. 153 00:12:36,256 --> 00:12:38,759 నేనైతే ట్రబుల్సమ్ నది గుండా వెళ్లి ఆ వెధవని చంపి తీరతాను. 154 00:12:38,842 --> 00:12:41,178 ఆ బార్ లో ఉన్న వ్యక్తి సైలస్ ఈగలను కాల్చే విధానం గురించి చెప్పినప్పుడు వినలేదా? 155 00:12:41,261 --> 00:12:43,013 అయితేనో, నేనేం ఈగని కాను కదా. 156 00:12:48,977 --> 00:12:51,146 జేన్. అది మద్యం. 157 00:12:53,190 --> 00:12:54,566 ఓహ్, ఛ, అవునా? 158 00:12:55,859 --> 00:12:57,152 నేనింకా పళ్ళ రసం అనుకున్నాను. 159 00:12:57,778 --> 00:12:59,238 ఇంతకు ముందు ఎప్పుడైనా త్రాగావా? 160 00:12:59,947 --> 00:13:00,948 లేదు. 161 00:13:02,157 --> 00:13:03,158 -నువ్వు? -లేదు. 162 00:13:04,451 --> 00:13:08,372 మద్యం నిన్ను వేశ్యగా లేదు మంత్రగత్తెగా మార్చేస్తుంది. ఒక్కోసారి రెండూ జరుగుతాయి. 163 00:13:08,956 --> 00:13:10,541 -నీకు రుచి చూడాలని లేదా? -లేదు. 164 00:13:35,399 --> 00:13:39,486 అమ్మాయిలకు చిన్న తనంలో, గుర్రాలు అంటే 165 00:13:39,570 --> 00:13:42,614 చాలా ఇష్టం ఉంటుంది కదా? 166 00:13:45,325 --> 00:13:47,578 కానీ ఒక్కసారి ఎదిగి పెద్ద అయిన తర్వాత, ఒక్కసారిగా 167 00:13:47,661 --> 00:13:49,746 వంటింట్లోనే ఉంటూ, పిల్లల్ని చూసుకోవాలి. 168 00:13:50,956 --> 00:13:53,500 అవును, వింతైన విషయమే. 169 00:13:57,296 --> 00:14:00,007 కానీ నువ్వు అలా కాదు. నీకు ఇంకా గుర్రాలు అంటే ఇష్టమే. 170 00:14:01,049 --> 00:14:02,384 అవును. 171 00:14:05,345 --> 00:14:08,974 అవి చాలా అద్భుతమైన జీవులని నా ఉద్దేశం కూడా. 172 00:14:09,975 --> 00:14:12,227 వాటితో ఎలా మెలగాలని అర్థం చేసుకుంటే చాలు. 173 00:14:16,315 --> 00:14:17,316 డాన్స్ చేయాలని ఉందా? 174 00:14:18,275 --> 00:14:20,027 లేదు. నేను కూర్చొనే ఉంటా. 175 00:14:23,697 --> 00:14:26,950 అవును కదా, నువ్వు ఇంకా దుఃఖ పడుతున్నావు. 176 00:14:27,951 --> 00:14:29,828 మరీ డాన్స్ చేయలేనంత బాధలో ఉన్నావా? 177 00:14:30,746 --> 00:14:33,874 నాకు డాన్స్ చేయడం నచ్చదు. గుర్రపు స్వారీ అంటేనే ఇష్టం. 178 00:14:35,375 --> 00:14:36,376 అంతే. 179 00:14:42,049 --> 00:14:45,427 నేను డాన్స్ వేయకూడదు అన్నారు. 180 00:14:46,303 --> 00:14:47,804 ఎందుకంటే... 181 00:14:53,143 --> 00:14:54,645 అదేదో దుష్ట క్రియ అన్నారు. 182 00:14:54,728 --> 00:14:56,271 నాకు గుర్తు లేదు. 183 00:14:58,440 --> 00:15:01,235 కానీ, కొన్నిసార్లు, 184 00:15:01,902 --> 00:15:04,655 నేను మా అమ్మకు ఉన్న పెద్ద గౌనులు వేసుకుంటుంటాను. 185 00:15:04,738 --> 00:15:08,867 అవి వేసుకొని, కాళ్ళను ఇలా పైకి లేపుతూ, డాన్స్ హాల్ అమ్మాయిలా గెంతుతాను. 186 00:15:10,536 --> 00:15:14,248 అంటే ఎలాంటి చెడ్డ పనులు చేయని అమ్మాయిలాగే ఉంటూ. 187 00:15:14,331 --> 00:15:16,250 నువ్వు కూడా ప్రయత్నించు. వచ్చి డాన్స్ చెయ్. 188 00:15:16,333 --> 00:15:17,668 పదా. నడువు. 189 00:15:20,629 --> 00:15:21,839 కాళ్ళను పైకి లేపు. యాహూ! 190 00:15:25,217 --> 00:15:29,388 లేదా... లేదా ఇలా కూడా చేయొచ్చు, అంటే, గెంతుతూ డాన్స్ చేస్తున్నట్టు. 191 00:15:30,055 --> 00:15:31,640 అలా చేయడం నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. 192 00:16:19,396 --> 00:16:21,273 చెత్త మొహంది. 193 00:16:50,302 --> 00:16:51,553 పదా, లోట్టి. 194 00:17:22,542 --> 00:17:24,127 నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు, మెక్కాల్! 195 00:18:09,173 --> 00:18:10,716 నా దగ్గర తుపాకీ ఉంది. 196 00:18:10,799 --> 00:18:12,342 కాల్చకు. మేము హాని తలపెట్టడానికి రాలేదు. 197 00:18:13,969 --> 00:18:14,970 ఇది నేనే. 198 00:18:17,181 --> 00:18:20,184 మిల్లి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 199 00:18:20,267 --> 00:18:21,768 నేను ఏం చేస్తున్నానా? 200 00:18:22,561 --> 00:18:24,104 నన్ను అలా చావమని వదిలేసి వచ్చింది నువ్వే. 201 00:18:24,188 --> 00:18:26,481 అదృష్టవశాత్తు ముసలి డాక్టర్ హెన్రీగారిని కలిసాను. 202 00:18:26,565 --> 00:18:29,318 నది దాటితే వచ్చే ఊర్లలో వైద్యం చేస్తుంటాను. 203 00:18:29,401 --> 00:18:31,862 కొన్ని సార్లు, మా నాన్నా, నేను ఈయనతో కలిసి పర్యటిస్తూ 204 00:18:31,945 --> 00:18:34,781 -వాక్య పరిచర్య చేస్తుంటాం. -నేను ఈమెను కోడి ఏమోనని అనుకున్నా. 205 00:18:34,865 --> 00:18:35,866 ఒక్క క్షణం. 206 00:18:37,534 --> 00:18:39,578 -నువ్వు నన్ను చావుకు వదిలేసి వచ్చావు. -నీకోసం వెనక్కి వచ్చేదాన్ని. 207 00:18:39,661 --> 00:18:40,787 నేను ఆ సోది నమ్మను. 208 00:18:40,871 --> 00:18:42,873 చిన్నప్పుడు లైల్ థామస్ తో కలిసి సిగరెట్లు 209 00:18:42,956 --> 00:18:44,291 కాల్చడానికి వదిలేసినట్టే ఇప్పుడు కూడా వదిలేసావు. 210 00:18:44,374 --> 00:18:45,417 ఇది నీ గురించి కాదు. 211 00:18:45,501 --> 00:18:48,420 అదే కదా సమస్య. నేనేమో ప్రాణాలకు తెగించి నీకోసం వస్తే, 212 00:18:48,504 --> 00:18:50,797 నువ్వు కనీసం నన్ను పట్టించుకోవడం లేదు. 213 00:18:51,882 --> 00:18:53,884 -వస్తానని అడిగింది నువ్వు. -ఎందుకంటే నువ్వు పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. 214 00:18:53,967 --> 00:18:55,385 -నేను కోపం మీద ఉన్నాను. -అయితే? 215 00:18:56,345 --> 00:18:58,639 కోపం వచ్చిన ఎందరో నీలాగే కాల్చి చంపుకుంటూ పోవాలంటావా? 216 00:18:59,556 --> 00:19:02,017 -ఏమో. -నువ్వు కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదు. 217 00:19:02,100 --> 00:19:04,728 నా వల్ల కాకపోతే, అసలు మెక్కాల్ ఎక్కడ ఉంటాడనే విషయం కూడా నీకు తెలీదు. 218 00:19:04,811 --> 00:19:08,190 ఇదంతా చేస్తున్నది అందుకోసమేనా? నాచేత ధన్యవాదాలు చెప్పించుకోవడానికా? 219 00:19:08,774 --> 00:19:10,108 -చెప్తే నీ సొమ్మేం పోదు కదా. -సరే. 220 00:19:11,318 --> 00:19:12,528 ధన్యవాదాలు, మిల్లి. 221 00:19:12,611 --> 00:19:15,489 నీ జీవితంలో ఉన్న ఒంటరితనం, విసుగు చాలదన్నట్టు 222 00:19:15,572 --> 00:19:17,074 నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నందుకు. 223 00:19:17,783 --> 00:19:20,786 -అలా అనడం ఏం బాలేదు. -నిన్ను మెప్పించే సమయం నాకు లేదు. 224 00:19:20,869 --> 00:19:23,997 మా నాన్న గుర్రం అక్కడే ఉంది. చూసావా? 225 00:19:24,081 --> 00:19:26,667 దాని మీద ఉన్న జీనును ఆయన నాకు ఇస్తానని చెప్పారు. 226 00:19:27,167 --> 00:19:28,544 కాబట్టి, ఇప్పుడు నేను ఆయన గుర్రాన్ని, 227 00:19:28,627 --> 00:19:31,213 దాని మీద ఉన్న జీనును తీసుకొని పోయి, సైలస్ మెక్కాల్ తిరిగి వచ్చే వరకు 228 00:19:31,296 --> 00:19:32,339 ఇక్కడే ఎదురుచూస్తాను, 229 00:19:32,422 --> 00:19:34,383 వాడు రాగానే వాడి తలను పేల్చి చంపుతాను. 230 00:19:34,883 --> 00:19:36,051 కావాలంటే నువ్వు ఇక్కడే ఉండి చూడొచ్చు... 231 00:19:37,386 --> 00:19:39,346 లేదా ఆ ముసలి వ్యక్తిని నిద్ర లేపి ఇక్కడి నుండి దొబ్బెయ్. 232 00:19:39,930 --> 00:19:40,931 ఆయన్ని నిద్ర లేపాలా? 233 00:19:47,896 --> 00:19:52,025 సరే, డాక్టర్. ఆమె రావడం లేదు. మనం వెళదాం పదండి. 234 00:19:57,239 --> 00:19:59,074 -ఏం జరిగింది? -నాకు తెలీదు. 235 00:20:06,206 --> 00:20:07,374 ఆయన చనిపోయాడు. 236 00:20:08,625 --> 00:20:09,960 మనం ఏం చేయాలి? 237 00:20:11,003 --> 00:20:14,006 ఏమీ లేదు. ఆయన ముసలితనం కారణంగా చనిపోయాడు. 238 00:20:14,089 --> 00:20:16,550 ఈయన మంచి క్రైస్తవుడు. ఈయనను మర్యాదలతో ఖననం చేయాలి. 239 00:20:17,050 --> 00:20:18,886 -ఈయన్ని తీసుకెళ్లడానికి నాకు సహాయం చెయ్. -అందుకు నాకు సమయం లేదు. 240 00:20:18,969 --> 00:20:20,429 మర్యాదగా సహాయం చెయ్, లేదా నేను అరుస్తాను! 241 00:20:27,728 --> 00:20:30,397 ఆవిడ పొగరుకి అంతే లేదు తెలుసా. 242 00:20:31,607 --> 00:20:33,150 -వెళ్లి దాక్కో. -మరి ఈ శవం సంగతి? 243 00:20:33,233 --> 00:20:35,444 కావచ్చు, అయినా నువ్వు ఆమెతో పడుకోవాలనుకుంటున్నావు. 244 00:20:37,237 --> 00:20:38,280 ఎవరక్కడ? 245 00:20:43,535 --> 00:20:44,620 ఎందుకు వచ్చావో చెప్పు. 246 00:20:50,626 --> 00:20:55,255 ఓహ్, మీరు రావడం మంచిదైంది. ఓరి, నాయానో. దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. 247 00:20:55,339 --> 00:20:58,175 మీలాంటి బలమైన, ధైర్యవంతులు రాకుండా ఉంటే మేమెంతో భయపడేవారం. 248 00:20:59,301 --> 00:21:00,552 మీరెవరో నాకు తెలుసా? 249 00:21:01,637 --> 00:21:05,307 లేదు. నా పేరు సేడి. ఇతను నా సోదరుడు క్లేటన్. 250 00:21:06,099 --> 00:21:09,770 చర్చి నుండి ఇంటికి వెళ్తుండగా హఠాత్తున కొందరు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. 251 00:21:12,189 --> 00:21:13,273 అది నిజమేనా? 252 00:21:17,569 --> 00:21:18,570 అవును. 253 00:21:19,655 --> 00:21:20,656 ఆ శవం ఎవరిది? 254 00:21:21,657 --> 00:21:22,950 బందిపోటులలో ఒకరిది. 255 00:21:23,951 --> 00:21:25,160 చూస్తుంటే ముసలోడిలా ఉన్నాడు. 256 00:21:27,287 --> 00:21:29,081 మీ రాక అతన్ని భయపెట్టినట్టు ఉంది. 257 00:21:29,164 --> 00:21:31,041 మీ స్వరాలూ వినగానే చచ్చి పడ్డాడు. 258 00:21:31,124 --> 00:21:33,710 ఆ తర్వాత మిగతా వాళ్ళు అడవిలోకి పారిపోయారు. 259 00:21:43,512 --> 00:21:44,888 మీరు లోపలికి వస్తే మంచిది. 260 00:22:23,177 --> 00:22:26,680 క్షమించండి. నాకు ఇంత ఆకలి ఉందని నాకే తెలీదు. 261 00:22:28,849 --> 00:22:30,517 ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? 262 00:22:30,601 --> 00:22:33,854 అబ్బాయిలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. పెద్దగా ఏమీ వ్యక్తపరచరు. 263 00:22:33,937 --> 00:22:38,483 అస్తమాను చెప్తూనే ఉంటా, "నీ మనసులో ఏమున్నా దాన్ని బయటకు చెప్పాలి. 264 00:22:38,567 --> 00:22:41,904 ఎలాంటి విషయమైనా సరే, లేదంటే నీకే మంచిది కాదు" అని. 265 00:22:42,613 --> 00:22:46,450 కొంతమంది తమ బలం, బలుపు చూపించుకోవడానికే నిశ్శబ్దాన్ని వాడుతుంటారు. 266 00:22:47,034 --> 00:22:49,870 నేను కాదు. ఎంత గోలైనా చేస్తా. 267 00:22:54,583 --> 00:22:57,336 బయట ఉన్నది నీ గుర్రమేనా? మట్టి రంగులో ఉన్నది? 268 00:22:57,836 --> 00:23:00,297 అవును. ఎందుకు? 269 00:23:01,215 --> 00:23:02,883 చూస్తుంటే ముసలిదానిలా ఉంది. 270 00:23:02,966 --> 00:23:04,510 అదొక చెత్త గుర్రం. 271 00:23:05,010 --> 00:23:09,223 దాన్ని నా పిల్లకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. తనకు గుర్రాలు అంటే చాలా ఇష్టం. 272 00:23:15,145 --> 00:23:17,356 -మీరు మేరీ గురించి మాట్లాడుతున్నారా? -ఎంతపని చేసావ్, మిల్లి. పరిగెత్తు. 273 00:23:18,899 --> 00:23:19,900 నీకు తాను తెలుసా? 274 00:23:21,068 --> 00:23:24,321 మేము చిన్నప్పుడు కలిసి స్కూల్ కి వెళ్లాం. అందుకే ఇక్కడికి వచ్చాము. 275 00:23:25,072 --> 00:23:26,114 ఆమె నిన్ను పంపిందా? 276 00:23:26,865 --> 00:23:29,451 అవును. మీకు ఒక సందేశం చెప్పమని చెప్పింది. 277 00:23:30,577 --> 00:23:33,080 మేము చాలా కాలంగా ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. 278 00:23:36,542 --> 00:23:38,919 మాకు తెలుసు. తాను కూడా అందుకే బాధపడుతుంది. 279 00:23:56,061 --> 00:23:58,146 దూరం అయినందుకు తనకు ఇంకా నాపై కోపంగా ఉందా? 280 00:23:59,606 --> 00:24:00,941 కొంత వరకు. 281 00:24:01,567 --> 00:24:03,527 మీరు ఎంత చెడ్డవారైనా సరే, మిమల్ని క్షమించగలను 282 00:24:03,610 --> 00:24:07,906 కానీ పట్టించుకోని తండ్రిగా మాత్రం క్షమించలేను అంది. 283 00:24:10,701 --> 00:24:13,412 అందుకే ఇంకా తాను డిడ్డిలిన్ డోరా దగ్గర పని చేస్తుంది అనుకుంటున్నావా? 284 00:24:13,495 --> 00:24:16,206 బహుశా అయ్యుండొచ్చు. ఆమె అలాగే... 285 00:24:17,708 --> 00:24:19,751 మీపై తనకి చాలా నిరాశగా ఉందని అంది. 286 00:24:20,878 --> 00:24:22,838 ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని చంపుతున్నందుకు. 287 00:24:22,921 --> 00:24:26,258 ఒక మంచి తండ్రిగా ఉండడం కంటే ప్రజల్ని భయపెట్టడానికి ప్రాముఖ్యత ఇస్తున్నందుకు. 288 00:24:27,843 --> 00:24:30,846 అంటే, నేను కేవలం... మగాడి లక్షణమే అది కదా. 289 00:24:33,140 --> 00:24:34,516 మగాళ్లు చేసేదే అది. 290 00:24:37,060 --> 00:24:39,938 మగాళ్లందరూ వాళ్ళ తమ్ముడి భార్యలతో పడుకుంటారా? 291 00:24:43,483 --> 00:24:44,693 ఆ విషయం నీకెలా తెలుసు? 292 00:24:46,987 --> 00:24:50,032 నామీద కోప్పడకండి. నేను సమాచారాన్ని తెచ్చా అంతే. 293 00:24:51,200 --> 00:24:53,911 మేరీ... నాకు తాను గుర్తుంది. 294 00:24:55,913 --> 00:24:57,873 ప్రతీ శుక్రవారం బడి పూర్తయిన తర్వాత స్కూల్ వెనుక 295 00:24:57,956 --> 00:25:01,084 -జడ్జిగారి కొడుకుతో పడుకొనేడి తనే కదా? -అవును. అది తనే అనుకుంట. 296 00:25:01,585 --> 00:25:06,089 ఎంత గట్టిగా అరిచేదో తెలుసా. తన అరుపులు క్లాసులో అందరికీ వినిపించేవి. 297 00:25:06,673 --> 00:25:10,302 అంటే, తనకు గణితం ఎంత బాగా వచ్చంటే, స్వయంగా వ్యాపారం చేసినా బాగా నడిచేది. 298 00:25:10,385 --> 00:25:12,638 -ఆహ్, అంటే, నిజమే అనుకుంట. -ఆపండి! 299 00:25:13,847 --> 00:25:16,767 దయచేసి... ఇక ఆపండి. 300 00:25:21,897 --> 00:25:23,190 నన్ను క్షమించమని మేరీతో చెప్పండి. 301 00:25:25,234 --> 00:25:26,985 నేను ఎందుకూ పనికిరాని వెధవని అని నాకు తెలుసు. 302 00:25:29,321 --> 00:25:31,698 కానీ దయచేసి, మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇంటికి తిరిగి రమ్మని తనతో చెప్పండి. 303 00:25:34,868 --> 00:25:35,869 మిమ్మల్ని వేడుకుంటున్నాను. 304 00:25:37,996 --> 00:25:39,373 ఈ బాధ... 305 00:25:41,750 --> 00:25:42,876 అబ్బా. 306 00:25:42,960 --> 00:25:45,796 ఎవరైనా నన్ను తలలోకి షూట్ చేసేస్తే బాగుండు అనిపిస్తుంది. 307 00:25:51,802 --> 00:25:52,845 నన్ను క్షమించండి. 308 00:25:53,762 --> 00:25:54,930 అది మేము చేయలేము. 309 00:25:55,013 --> 00:25:56,056 ఓహ్, ప్లీజ్. 310 00:25:58,141 --> 00:25:59,184 దయచేసి, మీరే చెప్పాలి. 311 00:26:03,522 --> 00:26:08,318 మీ క్షమాపణలు మేరీకి అవసరం లేదు. వాటికి అర్థమే లేదు. 312 00:26:10,487 --> 00:26:13,240 మీరు అనుభవిస్తున్న ఈ సహించలేని వేదనే ఆమెకు కావాల్సిన క్షమాపణలు. 313 00:26:16,910 --> 00:26:20,747 కానీ కావాలంటే బయట ఉన్న ఆ గుర్రాన్ని తీసుకెళ్లగలం. మట్టి రంగు గుర్రం. 314 00:26:22,916 --> 00:26:26,962 ఆమె దాన్ని అంగీకరిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ప్రయత్నించి చూస్తాం. 315 00:26:31,592 --> 00:26:34,303 ఆయన తన తమ్ముడి భార్యతో పడుకున్న విషయం నీకెలా తెలుసు? 316 00:26:35,053 --> 00:26:36,471 మా తండ్రి పాస్టర్. 317 00:26:36,555 --> 00:26:38,640 జనం ఆయనకి అన్ని విషయాలను చెప్తుంటారు. 318 00:26:39,808 --> 00:26:41,435 నీ సహాయానికి ధన్యవాదాలు, మిల్లి. 319 00:26:42,686 --> 00:26:44,271 -నువ్వు అతన్ని కృంగదీయాలని అనుకున్నావు. -అవును. 320 00:26:44,354 --> 00:26:46,356 ఒంటరిగా వెళ్లి ఉంటే నిన్ను కచ్చితంగా చంపేసి ఉండేవాడు. 321 00:26:46,857 --> 00:26:48,525 అలాగే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి. 322 00:26:54,865 --> 00:26:56,033 లోట్టి మీద నేను వస్తాను. 323 00:26:58,327 --> 00:26:59,494 నువ్వు మా నాన్న గుర్రం మీద రావచ్చు. 324 00:27:02,456 --> 00:27:05,125 నా వల్ల కాదు. జేన్, నాకు... ఎలా స్వారీ చేయాలో తెలీదు. 325 00:27:05,209 --> 00:27:07,294 సులభమే. నేను నీకు చూపిస్తాను. 326 00:27:14,676 --> 00:27:15,677 సిద్ధమా? 327 00:27:27,773 --> 00:27:29,483 జీను ఉంటే స్వారీ చేయడం చాలా సులభం. 328 00:27:29,566 --> 00:27:30,567 నువ్వు మాట్లాడుతున్నావు. 329 00:27:30,651 --> 00:27:32,402 స్వారీ చేస్తూ కూడా నేను మాట్లాడగలను. 330 00:27:32,486 --> 00:27:34,530 గుర్రాలంటే భయం ఉండే అమ్మాయి ఇవన్నీ ఇప్పుడు చెప్తుంది అన్నమాట. 331 00:27:34,613 --> 00:27:37,324 -సరే, పదా వెళదాం. -నాకు ఇంకా భయం ఉంది. 332 00:27:37,866 --> 00:27:39,910 మానసికంగా కృంగదీయడానికి మనం మరికొందరు మగాళ్లని వెతుక్కోవాలి. 333 00:27:39,993 --> 00:27:41,537 పదా, మిల్లి. త్వరగా నడువు. 334 00:27:41,620 --> 00:27:45,165 ప్రయత్నిస్తున్నాను. పడిపోతే సంగతి ఏంటి? గుర్రం మీద నుండి పడిపోతామా? 335 00:27:51,421 --> 00:27:53,340 సిసిలియా ఆహ్రెన్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 336 00:28:57,446 --> 00:28:59,448 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్