1 00:00:18,435 --> 00:00:22,147 తన భర్తను తిరిగి ఇచ్చేసిన మహిళ 2 00:00:23,482 --> 00:00:26,276 అవును, ఆ పేరు ఈ ప్రదేశాన్ని సూచిస్తుంది. 3 00:00:26,360 --> 00:00:28,237 కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే, 4 00:00:28,820 --> 00:00:31,990 తమ వస్త్రాల ద్వారా వారి దేశ మూలాన్ని తెలుపుతూ అమెరికా 5 00:00:32,073 --> 00:00:35,285 విజయానికి కారణమైన వలసదారు మహళలను సూచిస్తుంది. 6 00:00:35,369 --> 00:00:38,705 స్త్రీలు... ఇక్కడ ఉన్న మా అమ్మలాంటి వారు. 7 00:00:42,417 --> 00:00:43,877 ప్రత్యేకించి ఈ పీస్ కి సంబంధించి 8 00:00:43,961 --> 00:00:46,421 మీరు మూల పదార్థాలను ఎక్కడి నుండి తెచ్చారో చెప్పగలరా? 9 00:00:46,505 --> 00:00:48,674 తప్పకుండ. మేము వాటిని ప్రపంచంలో ఎన్నో చోట్ల నుండి తీసుకొచ్చాము. 10 00:00:48,757 --> 00:00:49,800 ఆ చుట్టూ ఉన్నవి అన్నీ... 11 00:00:49,883 --> 00:00:51,385 సెరీనా మిశ్ర ఇటీవలి సృష్టి 2021 12 00:01:00,644 --> 00:01:02,980 మీరు సెరీనా ఇంకా తన స్నేహితులతో కంటే 13 00:01:03,063 --> 00:01:04,730 ఆ సెక్యూరిటీ వ్యక్తితోనే ఎక్కవసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. 14 00:01:04,815 --> 00:01:08,151 మరీస్, అతను సెనెగల్ నుండి వచ్చాడు అంట. చాలా మంచి అతను. 15 00:01:08,235 --> 00:01:10,320 మీ ప్రవర్తన చూసి నాకు సిగ్గు వేసింది. 16 00:01:12,030 --> 00:01:14,992 -ఎంత సేపు వేడి చేయాలి? యాభై సెకంలా? -ఒక 45 సెకన్లు చెయ్. 17 00:01:18,287 --> 00:01:20,706 ఇప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు? 18 00:01:21,290 --> 00:01:23,166 నేనేం చేయడం లేదు. మీరే చేస్తున్నారు. 19 00:01:24,626 --> 00:01:27,963 ఏదో ఒక్కసారి ఏదైనా కొత్తది చేద్దామని, కొత్తవారిని కలుద్దామని 20 00:01:28,046 --> 00:01:30,465 బయటకు వెళ్లాం, కానీ ఒప్పుకోరు. 21 00:01:30,549 --> 00:01:33,802 ఆహ! మళ్ళీ అదే తిండి, అదే ఇల్లు, అదే మోకాలు చూసుకోవడానికి 22 00:01:33,886 --> 00:01:37,931 ఉత్తిపుణ్యాన ఇంటికి వచ్చేయాలి అన్నారు. 23 00:01:38,015 --> 00:01:40,601 మీకు ఉండాలని ఉంటే ఉండిపోవచ్చు కదా. టాక్సీ లో వచ్చి ఉండాల్సింది. 24 00:01:43,645 --> 00:01:44,897 ఇదుగోండి. తీసుకోండి. 25 00:01:47,149 --> 00:01:48,567 కావలసినంత వేడిగా ఉందో లేదో చెప్పండి. 26 00:01:49,985 --> 00:01:55,657 బాగానే ఉంది, బాబోయ్. ఈ మధ్య నీకేం అయిందో తెలియడం లేదు. 27 00:01:55,741 --> 00:01:58,243 ఇది మరీ దారుణంగా ఉంది. 28 00:01:59,828 --> 00:02:01,663 నాకు ఫోర్క్ కావాలి, బుజ్జి. 29 00:02:06,251 --> 00:02:10,172 పుట్టినరోజు శుభాకాంక్షలు 30 00:02:12,090 --> 00:02:14,301 నువ్వు ఇంకా నూరేళ్లు చల్లగా ఉండాలి, అను. 31 00:02:14,384 --> 00:02:16,345 నిన్ను, వికాస్ ని దేవుళ్ళు చల్లగా చూస్తూ, 32 00:02:16,428 --> 00:02:18,805 ఇంకా బోలెడన్ని సంవత్సరాల ఆయుష్షు ఇవ్వాలని... 33 00:02:20,140 --> 00:02:21,308 అరే, అను, ఏడుస్తున్నావా? 34 00:02:21,391 --> 00:02:22,392 లేదు. 35 00:02:23,101 --> 00:02:26,188 ముసలిదానివి అవుతున్నానని ఏం బాధపడకు. మనమంతా ముసలివాళ్ళమైపోతున్నాం. 36 00:02:26,271 --> 00:02:28,065 -అవును. అవును! -అవును. నళినిని చూడు. 37 00:02:28,148 --> 00:02:31,360 ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు పీడ మొకం అయిపొయింది. 38 00:02:31,443 --> 00:02:33,195 డాక్టర్ నాకు అనీమియా ఉందన్నాడు. 39 00:02:33,278 --> 00:02:37,449 లేదు, ఇది విక్ గురించి. ఇక అతనితో నేను వేగలేను. 40 00:02:39,284 --> 00:02:40,536 -అలా అనకు. -ఓరి, భగవంతుడా. 41 00:02:40,619 --> 00:02:42,454 -మను కూడా ఈ యాప్స్ బాగా వాడుతున్నాడు. -అది నాకు తెలీదు... 42 00:02:42,538 --> 00:02:43,956 అదేదో శబ్దం చేస్తూ ఉంటాడు. 43 00:02:44,039 --> 00:02:46,834 లేదు, లేదు, లేదు. నేను ఈ సారి సీరియస్ గా అంటున్నాను. 44 00:02:49,837 --> 00:02:55,050 నిన్న రాత్రి, తన ఆర్టిస్ట్ షోలో, నా కూతురు సెరీనా ఎంత సంతోషంగా, స్వేచ్ఛగా కనిపించిందో. 45 00:02:55,634 --> 00:02:58,262 కానీ, ఇంకేం పని లేనట్టు, కారణం లేకపోయినా విక్ అందరినీ ఇంటికి తీసుకెళ్లాడు. 46 00:02:58,345 --> 00:03:00,013 భోజనం వడ్డించాను, కానీ... 47 00:03:00,514 --> 00:03:06,228 రోజూ అదే పని, అదే తిండి, నాకు చేతులకు సంకెళ్లు వేసినట్టు ఉంది. 48 00:03:06,311 --> 00:03:07,479 అవును, కానీ అలా జీవితాంతం ఇద్దరు 49 00:03:07,563 --> 00:03:10,566 మనుషులు కలిసి ఇరుక్కున్న బంధమే కదా పెళ్లి అంటే? ఏమంటావు? 50 00:03:11,191 --> 00:03:12,651 ఆ విషయం నాకు తెలీదు కదా? 51 00:03:13,235 --> 00:03:16,196 ఏమీ తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నాను. 52 00:03:16,280 --> 00:03:18,866 అప్పుడు చాలా చిన్నదాన్ని, వెర్రి దాన్ని. 53 00:03:18,949 --> 00:03:21,660 మనమంతా అదే చేసాం. ఏదో అలా అయిపొయింది. 54 00:03:22,828 --> 00:03:24,204 కానీ ఇప్పుడు భరించడం తప్ప ఇంకేం చేయగలం? 55 00:03:25,455 --> 00:03:26,915 అయితే ఇక ఆర్డర్ చేద్దామా? 56 00:03:26,999 --> 00:03:29,501 కానీ, పుష్పా, నాకు భరించాలని లేదు. 57 00:03:29,585 --> 00:03:34,173 నాకు సంతోషంగా ఉండాలని ఉంది, కానీ విక్... నాకు అడ్డుగా ఉన్నాడు. 58 00:03:34,256 --> 00:03:35,632 అరే, దేనికి అడ్డుగా ఉన్నాడు? 59 00:03:36,258 --> 00:03:38,427 ప్రస్తుతం నీ ముసలి జీవితంలో నువ్వేం మిస్ అవుతున్నావు? 60 00:03:46,059 --> 00:03:51,023 నాకు ఇప్పుడు 60 ఏళ్లు, కానీ అతని బాగోగులు చూసుకోవడం తప్ప ఇంకేం చేయడంలేదు, 61 00:03:51,690 --> 00:03:53,525 కానీ అతను నన్ను అస్సలు పట్టించుకోడు. 62 00:03:54,902 --> 00:03:56,862 పరిస్థితి ఇలాగే కొనసాగాల్సిన పని లేదని నాకు తెలుసు. 63 00:03:58,447 --> 00:04:00,282 అయితే వెనక్కి ఇచ్చేయొచ్చు కదా. 64 00:04:02,075 --> 00:04:03,285 -ఏంటి? -ఉదయ, 65 00:04:03,368 --> 00:04:05,120 ఏం పిచ్చి వాగుడు వాగుతున్నావు? 66 00:04:05,204 --> 00:04:07,539 అమెరికాలో, నీకు నీ భర్త నచ్చకపోతే, 67 00:04:07,623 --> 00:04:10,834 నువ్వు వెళ్లి అతన్ని ఇచ్చేసి ఇంకొకడిని ఇంటికి తెచ్చుకోవచ్చు. 68 00:04:11,793 --> 00:04:13,545 లేదు, ఇలా చేయకూడదు. 69 00:04:13,629 --> 00:04:19,593 నేను ఏమంటున్నాను అంటే, నువ్వు సంతోషంగా లేకపోతే నీ సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి, అను. 70 00:04:19,676 --> 00:04:21,053 సంతోషం, సంతోషం! 71 00:04:21,553 --> 00:04:23,639 అది తప్ప ఈ రోజుల్లో జనానికి ఇంకేం అక్కరలేదు అనుకుంట. 72 00:04:24,139 --> 00:04:26,433 జీవితం అంటే సంతోషంగా ఉండడం మాత్రమే కాదు. 73 00:04:26,517 --> 00:04:28,560 కష్టాలను ఎదురుకోవాలి. 74 00:04:29,811 --> 00:04:31,980 నేను ఆకలితో చచ్చేలోపు 75 00:04:32,064 --> 00:04:33,607 కనీసం ఇప్పటికైనా ఏమైనా ఆర్డర్ చేద్దామా? 76 00:04:34,107 --> 00:04:37,653 నా కడుపులో గురగుర మంటుంది. 77 00:04:37,736 --> 00:04:40,155 ఏవండీ? కాస్త ఇలా వస్తారా? 78 00:04:40,239 --> 00:04:42,783 అందరికీ నేనే చెప్పేయనా? త్వరగా చెప్పేస్తాను. 79 00:05:38,755 --> 00:05:40,340 భర్తకు వారెంటీ 80 00:05:42,384 --> 00:05:44,469 మీరు తిరిగి ఇచ్చేయడానికి కారణం ఏంటి? 81 00:05:45,554 --> 00:05:46,555 కారణమా? 82 00:05:46,638 --> 00:05:48,891 అవును, మేడం. మీ భర్తను తిరిగి ఇచ్చేయడానికి కారణం ఏంటి? 83 00:05:51,894 --> 00:05:53,145 ఏమని చెప్పను? 84 00:05:55,564 --> 00:06:00,068 హా, దేవుడి దయవల్ల నేను ఇంకొక ఇరవై ఏండ్లు బ్రతికితే 85 00:06:00,152 --> 00:06:02,988 ఆ కాలమంతా ఇతనితో వేగే ఓపిక నాకు లేదు, అందుకే కొత్తగా ఎవరైనా కావాలి. 86 00:06:04,072 --> 00:06:09,786 నా నుండి కదా. చెప్పు. నీకు నా నుండి కొత్తగా ఏమైనా కావాలి. 87 00:06:09,870 --> 00:06:13,916 ఇక్కడ ఉన్న ఎంపికలు ఏంటంటే: "సరిపోవడం లేదు," "తయారీ లోపం," "డెలివరీ ఆలస్యం," 88 00:06:13,999 --> 00:06:15,417 "గూడ్స్ పాడైంది," "సరిగ్గా సూట్ కాలేదు" మాత్రమే. 89 00:06:15,501 --> 00:06:17,377 అయితే నాకు "సరిగ్గా సూట్ కాలేదు"... 90 00:06:19,254 --> 00:06:20,255 ఇకపై. 91 00:06:21,840 --> 00:06:23,675 సరే. అలాగే నా దగ్గర ఇది ఉంది. 92 00:06:24,593 --> 00:06:27,971 మీకు ఇది కావాలో వద్దో నాకు తెలీదు... దీన్ని, భర్త వారెంటీ అంటారా? 93 00:06:28,055 --> 00:06:29,765 ఓహ్, అవును. థాంక్స్. 94 00:06:30,933 --> 00:06:34,228 వావ్. ముప్పై ఏడు సంవత్సరాల వివాహ బంధం. 95 00:06:34,728 --> 00:06:37,064 ఇంతటితో ముగిసిందని తెలుసు, కానీ, ఎంతైనా అది గొప్ప విషయమే, 96 00:06:37,147 --> 00:06:38,148 కాబట్టి మీకు అభినంధనలు. 97 00:06:39,399 --> 00:06:40,442 ధన్యవాదాలు. 98 00:06:44,112 --> 00:06:46,823 అయితే, ఇప్పుడు ఏం జరుగుతుంది? 99 00:06:47,407 --> 00:06:51,203 ఇప్పుడు మిస్టర్ వికాస్ అనబడే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లి, 100 00:06:51,286 --> 00:06:56,124 ఈ వయసు, క్వాలిటీ, నైపుణ్యాలు, చరిత్ర ప్రకారం విలువను అంచనా వేసి... 101 00:06:56,208 --> 00:06:57,251 సరే. 102 00:06:57,334 --> 00:07:01,296 నా భార్య నా నైపుణ్యాల గురించి చెప్పేది నమ్మకండి, నాకు చాలా నైపుణ్యాలు ఉన్నాయి. 103 00:07:01,380 --> 00:07:03,757 నాకు భౌగోళిక శాస్త్రం తెలుసు, నాకు... 104 00:07:03,841 --> 00:07:06,760 సరే, అయితే మీకు కాస్త మెరుగు పెట్టి, ఏమైనా మార్పులు ఉంటే చేసి 105 00:07:06,844 --> 00:07:09,847 మళ్ళీ అమ్మకానికి ఫ్లోర్ మీద నిల్చోబెడతాం. 106 00:07:10,556 --> 00:07:11,849 మళ్ళీ ఫ్లోర్ మీదా? 107 00:07:11,932 --> 00:07:14,393 ఇక్కడే, భర్తల విభాగంలో. 108 00:07:14,476 --> 00:07:16,979 భర్తలు 109 00:07:17,980 --> 00:07:21,650 సరే, అను. ఇక ఉంటాను అయితే. 110 00:07:23,318 --> 00:07:26,446 సరే. మంచిది, ధన్యవాదాలు, విక్. 111 00:07:26,530 --> 00:07:27,656 సరే, అలాగే... 112 00:07:31,034 --> 00:07:33,245 తిరిగి ఇవ్వబడిన వ్యక్తి 113 00:07:33,328 --> 00:07:34,329 అలాగే. 114 00:07:38,166 --> 00:07:39,585 నా పేరు ఇబ్రహీం. స్వాగతం. 115 00:07:39,668 --> 00:07:41,044 హే. నా పేరు సాల్. 116 00:07:41,128 --> 00:07:42,504 నేను వికాస్ ని. 117 00:07:46,717 --> 00:07:49,511 ఇక మీ మార్పిడి కోసం ఆఖరుగా మీ ఫోన్ నంబర్ చెప్పండి. 118 00:07:49,595 --> 00:07:51,513 అప్పుడు మీ ఇద్దరి పని అధికారికంగా పూర్తయినట్టే. 119 00:07:51,597 --> 00:07:55,642 మార్పిడా? లేదు, లేదు. నాకు ఇంకొక భర్త వద్దు. 120 00:07:56,393 --> 00:07:59,479 నేను మా స్టోర్ లో మార్పిడి మాత్రమే చేయగలను, అది కూడా మరికాస్త తక్కువ విలువ చేసే భర్తను 121 00:07:59,563 --> 00:08:01,398 లేదా భార్యను మాత్రమే ఇవ్వగలను. 122 00:08:01,481 --> 00:08:03,358 కానీ నేను ఆన్లైన్ లో చూస్తే, మీ ఒప్పందంలో అక్కడ... 123 00:08:03,442 --> 00:08:04,818 దురదృష్టవశాత్తు, 124 00:08:04,902 --> 00:08:08,363 అది బయట దేశంలో 1986కి ముందు జరిపిన కొనుగోళ్ళకు వర్తించదు. 125 00:08:21,710 --> 00:08:22,836 టిష్యు కావాలా? 126 00:08:23,879 --> 00:08:24,880 ధన్యవాదాలు. 127 00:08:31,094 --> 00:08:32,888 టీవీ చూడాలని ఉందా? 128 00:08:33,388 --> 00:08:35,097 సరే. నీకు ఏం చేయాలని ఉంటే అదే చేద్దాం. 129 00:08:36,390 --> 00:08:39,477 సరే. న్యూస్ చూద్దామా? 130 00:08:40,229 --> 00:08:41,522 న్యూస్ అయితే బాగానే ఉంటుంది. 131 00:08:44,024 --> 00:08:46,193 వచ్చే వారం ఇరు వర్గాలు తిరిగి బేరసారాలు జరపవచ్చు 132 00:08:46,276 --> 00:08:48,237 అని అధికారులు చెప్తున్నారు, 133 00:08:48,320 --> 00:08:50,405 స్వయంగా ఏర్పరచుకున్న గడువు ముగిసేలోపు 134 00:08:50,489 --> 00:08:52,741 ఒక పరిష్కారం అందుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. 135 00:08:52,824 --> 00:08:55,494 స్ట్రైకింగ్ హోటల్ ప్రతినిధి ఇవాళ ప్రెజెంట్ చేయనున్నారు. 136 00:08:55,994 --> 00:09:00,123 నూతన ఒప్పందంపై నిర్ణయానికి వచ్చే ముందు, సంస్థ స్థాయి ఆశాజనకంగా... 137 00:09:15,347 --> 00:09:19,601 విక్ ని కలవడానికి ముందు నేను పెయింటర్ కావాలని అంకున్నాను. 138 00:09:20,936 --> 00:09:22,521 నిన్ను అందుకే ఎంచుకున్నాను అనుకంటా. 139 00:09:24,022 --> 00:09:28,569 నీ పొగడ్తకు పడిపోయా. నువ్వు అద్భుతమైన మహిళవి, తెలుసా? 140 00:09:34,491 --> 00:09:37,953 నీకు కూడా మొదటి నుండి ఆర్టిస్ట్ కావాలని ఆశా? 141 00:09:38,036 --> 00:09:40,038 లేదు. అదేం కాదు. 142 00:09:40,122 --> 00:09:41,707 సరే. 143 00:09:41,790 --> 00:09:45,252 నేను డే క్యాంప్ కౌన్సెలర్ గా, ఐస్ క్రీమ్ ఇచ్చేవాడిగా పని చేశా. 144 00:09:45,752 --> 00:09:48,547 అలాగే సీర్స్ షాపులో అరలు సర్దేవాడిని. 145 00:09:49,423 --> 00:09:50,924 నాకు సీర్స్ అంటే చాలా ఇష్టం. 146 00:09:52,301 --> 00:09:54,178 అలాగే, కాలేజీలో ఉండగా ఇంకా చాలా చేసేవాడిని. 147 00:09:54,261 --> 00:09:58,432 నేను క్యాంపస్ టూర్ గైడ్ ని. అలాగే కోస్టా రికాలో జిప్ లైన్ ఆపరేట్ చేసేవాడిని. 148 00:09:58,515 --> 00:09:59,683 అదొక పెద్ద కథ. 149 00:10:01,852 --> 00:10:05,480 ఒక వేసవిలో, ఆఫీసు కుర్చీలు బాగు చేస్తూ కూర్చున్నా. అది ఇంకొక పెద్ద కథలే. 150 00:10:05,564 --> 00:10:07,191 అలాగే కొంత మోడలింగ్ కూడా చేశా. 151 00:10:07,691 --> 00:10:08,901 నువ్వు మోడల్ వా? 152 00:10:09,568 --> 00:10:10,569 కొంతకాలమే. 153 00:10:11,486 --> 00:10:14,031 అంటే, ఫాషన్ మోడల్ ఆహ్? 154 00:10:29,880 --> 00:10:31,381 కానివ్వు, అను. నువ్వు ఇది చేయగలవు. 155 00:10:31,465 --> 00:10:33,926 లేదు, నా వల్ల కాదు. ఇదంతా వృధా ప్రయాస. 156 00:10:34,009 --> 00:10:35,594 ఇదేమీ వృధా ప్రయాస కాదు. 157 00:10:36,512 --> 00:10:38,847 సరే, నేను వచ్చి చూస్తాను. 158 00:10:45,562 --> 00:10:50,400 ఇది బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. 159 00:10:50,484 --> 00:10:52,778 అవును. నువ్వు "చాలా చాలా బాగుంది" అనే కొద్దీ, 160 00:10:52,861 --> 00:10:54,279 అదంతా అబద్ధమని నాకు తెలుస్తుంది. 161 00:10:54,363 --> 00:10:58,492 నిజంగా. మొదటిసారి అయినా బాగా చేసావు. డైనమిక్ గా ఉంది. 162 00:10:59,535 --> 00:11:02,329 అవును, అందం చూసే వారి కళ్ళలో ఉంటుంది, అవునా? 163 00:11:02,412 --> 00:11:04,873 పరిమాణాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి. 164 00:11:06,375 --> 00:11:08,961 -సరే, ఇక రిలాక్స్ అవ్వు. -నేను రిలాక్స్ గానే ఉన్నాను. 165 00:11:09,044 --> 00:11:11,463 అవునా? మరి నీ భుజాలు ఎందుకు ఇలా బిగించేసావు? 166 00:11:13,549 --> 00:11:15,801 సరదా విషయం ఏంటంటే, మా అమ్మ కూడా ఇలాగే చేసేది. 167 00:11:21,098 --> 00:11:22,766 నన్ను చూస్తే నీకు మీ అమ్మలా ఉన్నానా? 168 00:11:23,767 --> 00:11:26,311 కొంచెం, కానీ, మరొక విధంగా కాదు. 169 00:11:31,692 --> 00:11:36,238 "నాకైతే, వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు. మనసుకు కూడా," 170 00:11:37,114 --> 00:11:38,782 మిషెల్ ఒబామా అన్నమాట. 171 00:11:39,992 --> 00:11:42,536 సరే, నాకు మంచి ఆకారం కావాలని ఎప్పటినుండో ఆశ. 172 00:11:44,204 --> 00:11:48,709 "మనం వ్యాయామం చేయాల్సిందే, లేదంటే ఎప్పటికైనా మూలనపడతాం," 173 00:11:50,544 --> 00:11:53,547 ఇది బరాక్ ఒబామా అన్నాడు, నిజంగా. నడువు! 174 00:11:55,507 --> 00:11:56,925 కానివ్వు, నువ్వు చేయగలవు! 175 00:11:59,219 --> 00:12:01,346 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది! 176 00:12:01,430 --> 00:12:05,017 గుద్దు, మోకాలితో తన్నాలి. గుద్దు, మోకాలితో తన్నాలి. 177 00:12:05,100 --> 00:12:07,895 నిర్ణయించుకోండి, ప్రయత్నించండి, విజయం పొందండి. 178 00:12:08,562 --> 00:12:11,356 నిర్ణయించుకోండి, ప్రయత్నించండి, విజయం పొందండి. 179 00:12:12,441 --> 00:12:16,820 గుర్తుంచుకోండి, ఎదురుచూసేవారికే మంచి జరుగుతుంది. 180 00:12:20,741 --> 00:12:22,701 -కానివ్వండి! కదలాలి! -నాకు తెలుసు. 181 00:12:22,784 --> 00:12:24,244 గుద్దండి, మళ్ళీ గుద్దండి! 182 00:12:24,328 --> 00:12:25,871 ...అది బాగానే ఉంది, 183 00:12:26,371 --> 00:12:30,292 ఎందుకంటే, విక్ వంట గది నుండి సోఫా వరకు మాత్రమే కదిలేవాడు. 184 00:12:33,086 --> 00:12:34,630 రౌల్, నేను చెప్పేది వింటున్నావా? 185 00:12:35,672 --> 00:12:39,092 అను, చపాతీ మీద వెన్న ఎక్కువ వేసినట్టు అనిపించడం లేదా? 186 00:12:48,352 --> 00:12:50,229 నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. 187 00:12:50,312 --> 00:12:53,982 నన్ను అడిగితె వీరిలో ఎవడు చేత్తో చెప్పేవాడిని. 188 00:12:54,066 --> 00:12:57,110 అక్కడ ఉన్న వాడిని చూసావా, అను? 189 00:12:57,736 --> 00:12:58,946 ఆ బేస్ బాల్ టోపీ పెట్టుకున్నోడా? 190 00:12:59,029 --> 00:13:03,909 అవును. ఉత్త దండగ. నాలుగు సార్లు వాడి రేట్ తగ్గించారు. 191 00:13:03,992 --> 00:13:05,285 అయ్యో. 192 00:13:06,912 --> 00:13:08,580 నిన్ను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా? 193 00:13:08,664 --> 00:13:11,917 చూసి పోతున్నారు అంతే. 194 00:13:13,210 --> 00:13:15,712 కానీ ఇప్పుడు నాకు కొంత సమయం దొరికింది... 195 00:13:16,213 --> 00:13:19,383 నాలో నేను కొన్ని మార్పులు చేసుకోవాలని అర్థమైంది. 196 00:13:21,176 --> 00:13:22,261 ఓహ్, అవునా? 197 00:13:23,470 --> 00:13:27,933 అవును. నేను సాల్ ఇంకా ఇబ్రహీంతో మాట్లాడుతున్నాను. 198 00:13:28,517 --> 00:13:31,395 ఇబ్రహీం ఒక కుటుంబ థెరపిస్ట్. 199 00:13:31,895 --> 00:13:34,565 నేను ఎక్కడ పొరపాటు చేసానో తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాడు... 200 00:13:35,357 --> 00:13:38,527 బహుశా నువ్వు నన్ను తిరిగి ఇచ్చేసేటప్పుడు అన్న మాటలు నిజమేనేమో. 201 00:13:38,610 --> 00:13:41,864 బహుశా మనం ఇక ఒకరికి ఒకరం సరైనవారం కామేమో. 202 00:13:42,364 --> 00:13:45,492 ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను కూడా 203 00:13:46,577 --> 00:13:48,912 కాస్తా కూస్తో సర్దుకుపోయుంటే బాగుండేది, కానీ నేనలా చేయలేదు. 204 00:13:48,996 --> 00:13:51,915 నేను కూడా నా గురించి నేను చాలా తెలుసుకుంటున్నాను. 205 00:13:51,999 --> 00:13:56,044 నేను ఇన్నాళ్లు సంతోషం కోసం తప్పుడు ప్రదేశాలలో వెతుకుతున్నానని తెలిసింది. 206 00:13:58,297 --> 00:14:00,883 -అవునా? -అవును. నాలో నేను సంతోషాన్ని వెతుక్కోవాలి. 207 00:14:00,966 --> 00:14:02,926 నేనేంటో తెలుసుకోవాలి. 208 00:14:03,010 --> 00:14:06,013 ఒంటరిగా ఉండడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. 209 00:14:07,848 --> 00:14:14,313 సరే, సరే. బహుశా ఇదంతా మన మంచికేనేమో. 210 00:14:16,190 --> 00:14:17,774 నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 211 00:14:19,067 --> 00:14:20,360 ధన్యవాదాలు, విక్. 212 00:14:22,446 --> 00:14:26,575 నేను ఇక వెళ్ళాలి. నేను... 213 00:14:27,743 --> 00:14:30,162 -వచ్చే వారం వీలైతే వచ్చి కలుస్తా. -సరే. 214 00:14:30,746 --> 00:14:32,206 -సరే. -అలాగే. 215 00:14:32,289 --> 00:14:34,082 -బాయ్. -సరే, బాయ్. 216 00:14:51,600 --> 00:14:53,602 ఇటలీలో ఒంటరి ప్రయాణం 217 00:14:56,230 --> 00:14:58,315 వెర్నాజ్జ. 218 00:15:01,568 --> 00:15:05,364 బొక్క దెల్ల వెరీత. 219 00:15:06,448 --> 00:15:07,658 చావ్ బెల్లా. 220 00:15:09,368 --> 00:15:11,995 స్పెగట్టి కార్బోనారా. 221 00:15:25,843 --> 00:15:29,471 నా ఇంటికి సాదర స్వాగతం. 222 00:15:29,555 --> 00:15:33,642 నేను దీని గురించే చెప్తున్నాను, నా ఇంటి ముందు తోట. 223 00:15:33,725 --> 00:15:36,395 నువ్వు ఇప్పటికి ఒక లక్ష సార్లు చూసి ఉంటావులే. 224 00:15:36,478 --> 00:15:38,272 అంటే, నువ్వు చూస్తే కనిపిస్తుంది కదా. 225 00:15:38,355 --> 00:15:39,565 హాయ్, అను! 226 00:15:39,648 --> 00:15:41,441 ఇదుగో, ఒక్క నిమిషం దీన్ని పట్టుకుంటావా? 227 00:15:41,525 --> 00:15:42,734 అను, ఎక్కడికి పోయావు? 228 00:15:42,818 --> 00:15:45,529 -హాయ్. -నీకేం కాలేదు కదా? 229 00:15:45,612 --> 00:15:48,198 చూస్తుంటే క్రింద పడ్డట్టు ఉన్నావు. 230 00:15:48,282 --> 00:15:53,245 హే, నేను ఇప్పుడే... వావ్! స్టోర్ లో అద్భుతమైన పీస్ ఒకటి కొన్నాను. 231 00:15:53,871 --> 00:15:56,415 నిజానికి, నాకు ఈయనపై ఎప్పటి నుండో ఇష్టం ఉంది. 232 00:15:56,498 --> 00:16:00,794 చాలా తక్కువ రేటుకే వచ్చాడు, నిజానికి కాదనుకోలేకపోయా. 233 00:16:00,878 --> 00:16:01,962 ఇది మన మధ్య ఇబ్బందికరంగా ఉంటుందా? 234 00:16:02,045 --> 00:16:04,882 లేదు, అలా ఏం కాదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. 235 00:16:04,965 --> 00:16:07,342 మంచిది, మంచిది. 236 00:16:07,843 --> 00:16:10,804 అవును, నేను కూడా అదే అనుకున్నాను, ఎంతయినా నువ్వే కదా వెనక్కి ఇచ్చేసావు. 237 00:16:11,305 --> 00:16:12,306 అవును, అవును. కానీ... 238 00:16:12,389 --> 00:16:14,433 -అవును. -అవును. 239 00:16:14,516 --> 00:16:15,934 నువ్వు అతని వెనక్కి ఇచ్చేసావు. 240 00:16:17,060 --> 00:16:18,687 ఇప్పుడు నేను తీసుకున్నాను. 241 00:16:22,649 --> 00:16:25,235 ఈ ఇంటి ముందు తోట అంత బాగా ఏం ఉండదులే. 242 00:16:25,319 --> 00:16:27,112 మనం వెనక్కి వెళ్లి చూస్తే బాగుంటుంది 243 00:16:27,196 --> 00:16:29,948 అక్కడైతే చాలా ఆకర్షణలు ఉంటాయి. 244 00:16:30,449 --> 00:16:31,575 లోపలికి నడువు. 245 00:16:41,752 --> 00:16:45,047 -అబ్బో, పర్లేదు. -ఇది చాలా బాగుంది. 246 00:16:47,966 --> 00:16:49,885 హాయ్, అను. 247 00:16:50,385 --> 00:16:52,387 ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 248 00:16:52,471 --> 00:16:53,472 హాయ్, బార్బరా. 249 00:16:53,555 --> 00:16:56,225 నేను ఇల్లు శుభ్రం చేస్తుండగా వికాస్ బట్టలు కొన్ని కనిపించాయి 250 00:16:56,308 --> 00:17:02,147 ఒకవేళ అవసరం ఉంటుందేమో అని ఇచ్చి వెళదామని వచ్చాను. 251 00:17:02,231 --> 00:17:04,733 అయ్యో, అదేం అవసరం లేదు. 252 00:17:04,816 --> 00:17:07,152 ఇది బాగా బరువు ఉంది, నిజానికి. 253 00:17:07,236 --> 00:17:08,819 కావాలంటే నేను లోపలికి వచ్చి పెడతాను. 254 00:17:08,904 --> 00:17:11,365 సరే. కానీ, ఇక ఈ బట్టలు తనకు అవసరం ఉండవు. 255 00:17:12,115 --> 00:17:13,784 -ఉండవా? -లేదు. ఓహ్, అవును. 256 00:17:13,867 --> 00:17:16,078 నేను వికాస్ కి అన్నీ కొత్త బట్టలు కొన్నాను. 257 00:17:16,662 --> 00:17:17,663 వికాస్? 258 00:17:17,746 --> 00:17:18,872 -బార్బీ? -ఏంటి? 259 00:17:18,955 --> 00:17:21,500 -అంతా బాగుందా? -అబ్బా! భలే ఉన్నావు. 260 00:17:24,044 --> 00:17:25,045 హలో, అను. 261 00:17:25,628 --> 00:17:27,506 చాలా అందంగా ఉన్నాడు కదా? 262 00:17:30,008 --> 00:17:31,677 అవును, కానీ ఒక మాట చెప్పనా? 263 00:17:32,302 --> 00:17:37,099 బహుశా చెప్పాబెట్టకుండా ఇంటికి రావడం అప్పుడే మంచిది కాకపోవచ్చు. 264 00:17:37,182 --> 00:17:38,183 ఏమన్నావు? 265 00:17:38,267 --> 00:17:40,227 ఇదంతా మనకు అలవాటు పడడానికి 266 00:17:40,310 --> 00:17:43,689 మనకు ఇంకొంత సమయం కావాలి. 267 00:17:45,315 --> 00:17:47,526 నువ్వు ఏకిభవిస్తావని నాకు తెలుసు. ఇక బాయ్. 268 00:18:01,707 --> 00:18:04,835 ఎలా ఉన్నావు, అమ్మా? ఏం చేస్తున్నావు? 269 00:18:04,918 --> 00:18:09,089 అబ్బా, చాలా జరుగుతున్నాయి, సారూ. 270 00:18:09,756 --> 00:18:11,675 నేనైతే ఏం చేస్తున్నానంటే. 271 00:18:11,758 --> 00:18:15,053 ఈ మధ్య తోట పని బాగా చేస్తున్నాను... 272 00:18:15,137 --> 00:18:16,471 సరే, తర్వాతి వాక్యం చెప్పు, 273 00:18:16,555 --> 00:18:19,183 "మా ఇద్దరికీ ఒక రూమ్ కావాలి." 274 00:18:19,266 --> 00:18:20,267 సరే. 275 00:18:20,350 --> 00:18:22,394 జె వుద్రేయఙ్ చామ్బరే పూర్ దూ. 276 00:18:22,477 --> 00:18:23,478 అర్థమైందా? 277 00:18:23,562 --> 00:18:29,818 జె వుద్రేయఙ్ చామ్బరే పూర్ దూ. 278 00:18:29,902 --> 00:18:32,905 బాగా చెప్పావు. మనం బాగా నేర్చుకుంటున్నాం. 279 00:18:36,617 --> 00:18:39,161 ...చదవాలనుకున్నవి చదువుతున్నాను... 280 00:18:48,378 --> 00:18:50,547 పక్షులను చూస్తున్నాను... 281 00:18:59,056 --> 00:19:01,016 నిన్ను తలచుకుంటే నాకు చాలా గర్వంగా ఉందని గుర్తుంచుకో. 282 00:19:01,099 --> 00:19:03,268 బహుశా ఎప్పుడైనా డబుల్ డేట్ కి వెళ్దాం. 283 00:19:03,352 --> 00:19:05,729 ప్రయత్నిస్తున్నాను. నెమ్మదిగా, నెమ్మదిగా. 284 00:19:06,396 --> 00:19:07,689 నువ్వు ఎప్పుడంటే అప్పుడే. 285 00:19:08,190 --> 00:19:10,567 ఊర్లో ఒక కొత్త సూషి హోటల్ తెరిచారు, నీకు నచ్చవచ్చు. 286 00:19:13,320 --> 00:19:16,073 -ఓరి, దేవుడా. అమ్మ, నీకేం కాలేదు కదా? -నేను-నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. 287 00:19:16,156 --> 00:19:20,410 అరే. అయ్యాయ్యో. బార్బరా, నీకేం కాలేదు కదా? 288 00:19:20,494 --> 00:19:23,330 నన్ను క్షమించు. నేను నిన్ను చూసుకోలేదు. 289 00:19:23,413 --> 00:19:26,917 ఎలా చూసుకోకుండా నడిపావు, అను? కారులో వెనుక చూపించే అద్దం లేదా? 290 00:19:27,000 --> 00:19:28,377 నా దృష్టి మళ్లింది. 291 00:19:28,460 --> 00:19:31,171 అంటే, నేను ఈ మధ్యనే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, 292 00:19:31,255 --> 00:19:34,258 ఎందుకంటే, ఇంతకు ముందు ఎక్కడికైనా విక్ తీసుకెళ్లేవారు. 293 00:19:34,341 --> 00:19:37,135 సరే. అలాగే. అర్థమైంది. 294 00:19:37,219 --> 00:19:39,096 చూడు, కనీసం నీ ఇంటి వరకు నన్ను దించనివ్వు. 295 00:19:39,179 --> 00:19:42,724 అదే కదా నీ ప్లాన్? అవసరం లేదు. నేను వెళ్ళగలను. 296 00:19:43,433 --> 00:19:45,519 వద్దు! అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. 297 00:19:46,478 --> 00:19:49,523 చెత్త మనిషి! దేవుడా, బాబోయ్. 298 00:19:50,107 --> 00:19:52,818 వికాస్! బంగారం, నాకు సహాయం కావాలి. 299 00:20:45,579 --> 00:20:48,248 -ఇదంతా అను పనే. -నడువు. సరే. 300 00:20:49,666 --> 00:20:50,667 సరే. 301 00:20:50,751 --> 00:20:53,378 -నేను పట్టుకోనా? సరే. ధన్యవాదాలు. -అవును. సరే, పదా. 302 00:20:54,421 --> 00:20:55,631 పర్లేదా? 303 00:20:55,714 --> 00:20:58,383 -నామీదకి వాలు. -ఇదంతా ఉత్త ఆర్భాటం. 304 00:21:06,266 --> 00:21:07,392 నరకానికి పోండి. 305 00:21:41,468 --> 00:21:43,720 అలాగే మన అద్భుతమైన అతిథులు, 306 00:21:43,804 --> 00:21:45,597 ఇంకా ఇంటి నుండి చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. 307 00:21:55,232 --> 00:21:57,401 -హే, క్లార్క్. -అను. 308 00:21:57,901 --> 00:21:59,611 సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి వచ్చావు. 309 00:21:59,695 --> 00:22:01,947 భర్తల పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. 310 00:22:02,030 --> 00:22:03,448 నాకేం వద్దు. 311 00:22:07,452 --> 00:22:08,453 విక్? 312 00:22:10,664 --> 00:22:11,957 ఏమైంది? 313 00:22:12,040 --> 00:22:16,795 బార్బరా నన్ను ఇచ్చేసింది. సంసారం జీవితం తనకు తగినది కాదంట. 314 00:22:19,006 --> 00:22:22,217 ఇంకా ఆవిడ కొన్న జ్యాకెట్ వేసుకొని హీరోలాగే తిరుగుతున్నావా? 315 00:22:22,301 --> 00:22:25,804 నాకు చేతనైనంతగా నేను ప్రయత్నించాలి కదా... 316 00:22:26,972 --> 00:22:29,474 లేదు, వద్దు. నా రేటును చూడకు. 317 00:22:29,558 --> 00:22:31,935 లేదు, విక్. ఇది మరీ తక్కువ! 318 00:22:32,436 --> 00:22:37,107 నన్ను రెండు సార్లు వెనక్కి ఇచ్చారు, కాబట్టి నాకు ఇప్పుడు విలువ లేదు. 319 00:22:39,943 --> 00:22:41,778 రా, ఇలా కూర్చో. 320 00:22:45,032 --> 00:22:46,909 హే, చల్లగా ఏమైనా త్రాగుతావా? 321 00:22:56,710 --> 00:22:58,629 ఆమె కోసం నువ్వు ఎందుకు మారావు? 322 00:23:00,547 --> 00:23:01,632 ఏంటి? 323 00:23:01,715 --> 00:23:04,885 ముప్పై ఏడు ఏళ్ళు నేను నీకు అన్నీ చేశాను, కానీ నువ్వు... 324 00:23:05,636 --> 00:23:06,637 ఏమీ చేయలేదు. 325 00:23:07,721 --> 00:23:11,850 ఇంతలో బార్బరాతో ఉండడానికి వెళ్లి ఆదర్శ భర్తవి అయిపోయావు. 326 00:23:11,934 --> 00:23:15,854 "నన్ను చూడు, బార్బరా కోసం వండుతున్నాను, శుభ్రం చేస్తున్నాను, 327 00:23:15,938 --> 00:23:19,358 చీకిపోయిన బార్బరా జుట్టు దువ్వుతున్నాను" అనుకుంటూ. 328 00:23:19,441 --> 00:23:23,111 -అంటే... మా మీద నిఘా పెట్టావన్నమాట? -ఓహ్, మూసుకో. 329 00:23:23,195 --> 00:23:26,156 నేనేం మీ మీద జేమ్స్ బాండ్ లాగ ఇంట్లో కెమెరాలు పెట్టి చూడలేదు. 330 00:23:26,782 --> 00:23:29,243 -జేమ్స్ బాండ్ అలా చేయడు. -నేనేం అంటున్నానో నీకు తెలుసు. 331 00:23:34,790 --> 00:23:38,001 మనకు పెళ్ళైన మొదట్లో, నేను ఏదైనా చేస్తే. 332 00:23:38,085 --> 00:23:41,255 నువ్వు "అది... అది అలా ఎందుకు చేసారు" అనేదానివి. 333 00:23:41,880 --> 00:23:43,715 నీకు నచ్చినట్టు కాకుండా 334 00:23:43,799 --> 00:23:46,385 నేను ఏం చేసినా అది తప్పే. 335 00:23:46,468 --> 00:23:49,555 నేను ఎంత చేసినా నిన్ను తృప్తి పరచలేకపోయా, కాబట్టి 336 00:23:50,764 --> 00:23:51,890 నేను ప్రయత్నించడం మానేశా. 337 00:23:58,355 --> 00:24:03,318 ఇన్నాళ్లూ, లోపం నీలో ఉంది అనుకున్నాను... 338 00:24:05,112 --> 00:24:07,114 కానీ ఇప్పుడు నాతో నేను ఒంటరిగా గడిపాను. 339 00:24:09,032 --> 00:24:12,828 నేను కూడా తక్కువ దాన్ని కాదని అర్థమైంది. 340 00:24:14,913 --> 00:24:17,624 లేదు. నువ్వు ఏమాత్రం తక్కువ కాదు. 341 00:24:22,713 --> 00:24:25,174 మనిద్దరం ఒకరినొకరు విలువను తెలుసుకోలేకపోయాం. 342 00:24:30,721 --> 00:24:31,889 నన్ను క్షమించు. 343 00:24:46,486 --> 00:24:48,363 అయితే, ఇప్పుడు ఏంటి? నువ్వు... 344 00:24:49,114 --> 00:24:51,116 ఇబ్రహీంని కొనడానికి వచ్చావా? 345 00:24:51,742 --> 00:24:53,452 లేదు, ఇక కొనడాలు ఏమీ లేవు. 346 00:24:54,328 --> 00:24:56,288 అయితే ఇలా ఒంటరిగానే ఉండిపోతావా? 347 00:24:57,206 --> 00:24:58,290 ఏమో. 348 00:25:08,175 --> 00:25:09,468 మనకు ఏమైంది? 349 00:25:12,137 --> 00:25:15,182 సమృద్ధి కలిగిన ఈ దేశానికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. 350 00:25:15,265 --> 00:25:19,603 ఇప్పుడు అన్నీ ఉన్న ప్రదేశంలో ఉన్నా 351 00:25:19,686 --> 00:25:22,272 ఏమీ లేకుండా మిగిలిపోయాం. 352 00:25:22,356 --> 00:25:24,608 లేదు, ఏమీ లేకుండా కాదు. 353 00:25:25,359 --> 00:25:27,861 మన పెళ్లి కానీ కూతురు సెరీనా ఉంది 354 00:25:27,945 --> 00:25:30,155 ప్రతీ ఏడాది కొన్ని గంటలు మనల్ని వచ్చి కలుస్తుంది. 355 00:25:41,250 --> 00:25:43,585 నేను నిన్ను మళ్ళీ కొనాలంటే నువ్వు మారాలి. 356 00:25:43,669 --> 00:25:46,004 ఇంతకు ముందులా ఉండడం ఇక నా వల్ల కాదు. 357 00:25:49,216 --> 00:25:50,217 సరే. 358 00:25:50,884 --> 00:25:52,594 నాకు ఉత్సాహవంతంగా బ్రతకాలని ఉంది. 359 00:25:53,637 --> 00:25:55,097 అంటే ఏంటో కూడా నాకు తెలీదు 360 00:25:55,180 --> 00:25:58,684 ఎలా పొందాలో కూడా తెలీదు, కానీ నాకు అలాంటి జీవితం కావాలి. 361 00:25:59,184 --> 00:26:01,311 అలాంటి బ్రతుకును నువ్వు నాకు దూరం చేయకూడదు. 362 00:26:01,395 --> 00:26:05,148 నాకు కూడా. నాకు... కూడా జీవితమంతా కూర్చొని గడపాలని లేదు. 363 00:26:05,232 --> 00:26:09,069 లేదు, నిజంగా అంటున్నాను, విక్. నేనేం... పడవలో షికార్లు కొట్టడం గురించి మాట్లాడడం లేదు. 364 00:26:09,152 --> 00:26:11,154 ఈ రోజుల్లో పడవలో షికారుకి ఎవరూ వెళ్లడంలేదు. అవి దండగ. 365 00:26:13,240 --> 00:26:15,909 ఈ మధ్య బూతులు కూడా మాట్లాడుతున్నావా? 366 00:26:18,370 --> 00:26:19,746 నేను ఇప్పుడు ఒక కొత్త మనిషిని. 367 00:26:29,464 --> 00:26:30,465 లేదు. 368 00:26:34,344 --> 00:26:35,554 నువ్వు నన్ను కొనకూడదు. 369 00:26:37,639 --> 00:26:40,309 ఇప్పుడు నాకు ఎలాంటి విలువ లేదు. ఇంకా మంచి వాడు కావాలి. 370 00:26:56,241 --> 00:26:58,243 -ఇందులోకి ఎక్కు. -ఎందుకు? 371 00:26:58,327 --> 00:27:01,580 -ఎక్కు. -చెప్పా కదా. నువ్వు నన్ను కొనలేవు. 372 00:27:01,663 --> 00:27:04,291 అవును, నేనేం నిన్ను కొనడం లేదు. నిన్ను దొంగిలిస్తున్నాను. 373 00:27:04,833 --> 00:27:07,461 అడ్డమైన విలువల గురించి చెప్పకు. అదంతా సోది. 374 00:27:07,544 --> 00:27:09,588 నడువు. ఎవరైనా చూసే లోపు ఎక్కు. 375 00:27:10,631 --> 00:27:14,384 సరే, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? జీవితంలో ఎప్పుడూ నువ్వు ఏమీ దొంగిలించలేదు. 376 00:27:14,468 --> 00:27:16,220 అవును, అది నిజమే. 377 00:27:16,303 --> 00:27:19,556 కానీ నన్ను తిరిగి ఇవ్వాలనుకుంటే ఎలా? నీ దగ్గర రసీదు ఉండదు కదా. 378 00:27:20,933 --> 00:27:22,351 నేను నిన్ను తిరిగి ఇవ్వను. 379 00:27:26,021 --> 00:27:27,731 సరే, నడువు. పదా. 380 00:27:29,024 --> 00:27:30,025 వెళ్ళు. 381 00:27:44,581 --> 00:27:47,376 బిగ్సేవ్ 382 00:27:48,085 --> 00:27:49,378 పదా, వెళ్ళు. 383 00:28:02,266 --> 00:28:04,226 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 384 00:29:08,248 --> 00:29:10,250 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్