1 00:00:12,137 --> 00:00:14,556 {\an8}15 ఫిబ్రవరి 2022 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ 2 00:00:14,556 --> 00:00:17,226 {\an8}పారిస్ సెయింట్-జెర్మైన్ 1-0 రియల్ మాడ్రిడ్ 3 00:00:17,226 --> 00:00:19,645 {\an8}ఛాంపియన్స్ లీగ్ మొదటి ఆటలో 4 00:00:19,645 --> 00:00:23,190 పారిస్ సెయింట్-జెర్మైన్ తో ఆడిన ఆటలో నిరాశాజనకంగా 1-0 ఓటమిని చవిచూసిన తర్వాత, 5 00:00:23,190 --> 00:00:26,485 రియల్ మాడ్రిడ్ ని మరొకసారి మీడియా వారు నిశితంగా పరిశీలిస్తున్నారు. 6 00:00:30,864 --> 00:00:32,783 వాళ్ళు గనుక పరిస్థితిని చక్కదిద్దకపోతే, 7 00:00:32,783 --> 00:00:34,743 పోటీలో ఇంత త్వరగా ఈ జట్టు బయటకు రావడం 8 00:00:34,743 --> 00:00:37,746 గడిచిన నాలుగేళ్లలో ఇది మూడవ సారి అవుతుంది. 9 00:00:43,001 --> 00:00:47,130 {\an8}రియల్ మాడ్రిడ్ తో పీ.ఎస్.జి పోటీ. ఈ ఆట ఫలితం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? 10 00:00:48,257 --> 00:00:49,424 {\an8}నాకైతే మ్యాచ్ ఎప్పుడు చూస్తానా అని ఉంది. 11 00:00:49,424 --> 00:00:53,387 {\an8}అంటే, ఇదే కదా మనం కోరుకునేది. అందరూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. 12 00:00:53,387 --> 00:00:58,308 {\an8}పీ.ఎస్.జి, ఎంబాపె, మెస్సి అలాగే జట్టులో ఉన్న మిగతావారు రియల్ మాడ్రిడ్ తో పోల్చితే చాలా మెరుగైన ఆటగాళ్లు. 13 00:00:58,308 --> 00:01:01,812 {\an8}రియల్ మాడ్రిడ్ వారు బెర్నాబ్యూలో ఆడినప్పుడు అందరూ వారే గెలుస్తారు అనుకుంటారు, 14 00:01:01,812 --> 00:01:06,525 {\an8}కానీ ఈ జట్టుకు వ్యతిరేకంగా, అంటే మెస్సి, నేమార్, డి మారియా అలాగే ఎంబాపె కూడా కచ్చితంగా 15 00:01:06,525 --> 00:01:10,112 {\an8}ఆడబోయే పారిస్ సెయింట్-జెర్మైన్ తో వారు ఇబ్బంది పడక తప్పదు అనిపిస్తోంది. 16 00:01:10,112 --> 00:01:12,990 {\an8}ప్రస్తుతం ఎలా చూసినా పీ.ఎస్.జి వారే గెలుస్తారు అని అనిపిస్తోంది. 17 00:01:12,990 --> 00:01:17,786 {\an8}ఎంబాపె లేదా నేమార్ కౌంటర్ అటాక్ చేస్తే ఎవరైనా ఎలా తట్టుకోగలరు? 18 00:01:17,786 --> 00:01:18,996 {\an8}వాళ్లకు కలిసి రావాలని కోరుతున్నా. 19 00:01:20,956 --> 00:01:22,875 ఇక పోతే, జట్టులో ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు, 20 00:01:22,875 --> 00:01:26,003 టోర్నమెంట్ లో ఆడడానికి ఇదే వారికి చివరి అవకాశం కావచ్చు. 21 00:01:26,879 --> 00:01:28,630 మేము మారిపోవాలి, వెళ్ళిపోవాలి అంటూ 22 00:01:28,630 --> 00:01:30,716 చాలా మంది ఫిర్యాదులు చేశారు. 23 00:01:30,716 --> 00:01:37,264 కానీ వాళ్ళు మాకన్నా బాగా ఆడినా కూడా, నేను మ్యాచ్ నుండి వచ్చిన తర్వాత, 24 00:01:37,264 --> 00:01:38,932 {\an8}కార్వహల్ బెంచ్ మీద కూర్చోవడం చూశాను. 25 00:01:38,932 --> 00:01:41,185 అప్పుడు నేను అతని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాను: 26 00:01:41,185 --> 00:01:44,021 "రెండవ ఆటలో మనం వాళ్ళను చితక్కొట్టేయబోతున్నాం." 27 00:01:46,440 --> 00:01:48,817 కోర్ట్వా! 28 00:01:48,817 --> 00:01:49,818 అసాధ్యం 29 00:01:51,278 --> 00:01:52,404 నమ్మశక్యంగా లేదు 30 00:01:52,404 --> 00:01:54,948 బెంజెమా! ఇది నమ్మశక్యంగా లేదు! 31 00:01:54,948 --> 00:01:56,325 {\an8}గోల్! 32 00:01:56,325 --> 00:01:58,202 {\an8}బెంజెమా 33 00:01:58,202 --> 00:01:59,786 {\an8}- లూకా... - మొడ్రిచ్! 34 00:01:59,786 --> 00:02:00,704 మొడ్రిచ్ 35 00:02:03,957 --> 00:02:05,000 లెజెండ్ 36 00:02:05,000 --> 00:02:07,503 గోల్! 37 00:02:07,503 --> 00:02:08,878 మ్యాజిక్ గోల్ 38 00:02:10,255 --> 00:02:13,717 వినిసియస్ జూనియర్! 39 00:02:28,815 --> 00:02:31,777 రీఎంట్రీ 40 00:02:31,777 --> 00:02:34,029 {\an8}మంచివి అన్నీ జతగా వస్తాయి అంటుంటారు. 41 00:02:34,029 --> 00:02:35,572 {\an8}డేవిడ్ బెక్హామ్ రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. లెజెండ్ 42 00:02:35,572 --> 00:02:36,990 {\an8}కానీ ఒకే సీజన్ లో స్పెయిన్ లోని లాలీగలో 43 00:02:36,990 --> 00:02:42,371 అలాగే ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ని గెలవడం దాదాపుగా అసాధ్యమైన పనే అని చెప్పాలి. 44 00:02:42,955 --> 00:02:44,122 దాదాపుగా. 45 00:02:44,122 --> 00:02:49,127 ఎందుకంటే రియల్ మాడ్రిడ్ వారి పేరుగాంచిన శాంటియాగో బెర్నాబ్యూ స్టేడియంలో, 46 00:02:49,127 --> 00:02:52,798 ఆ అభిమానులు మన వెనుక నిలబడినప్పుడు, అద్భుతాలు జరగవచ్చు. 47 00:02:55,968 --> 00:02:58,095 మాడ్రిడ్ స్పెయిన్ 48 00:02:58,095 --> 00:03:01,348 పారిస్ సెయింట్-జెర్మైన్ తో రెండవ ఆట ఆడడానికి కొన్ని రోజుల ముందు, 49 00:03:01,348 --> 00:03:05,060 రియల్ మాడ్రిడ్ వారు లాలీగలో రియల్ సొసీయడాడ్ తో తలపడాల్సి ఉంది. 50 00:03:05,769 --> 00:03:09,690 ఉత్తర స్పెయిన్ నుండి వచ్చిన ఈ జట్టు పేరుగాంచిన బ్లాంకోస్ ని ఎలాగైనా పడగొట్టాలన్న తపనతో ఉంది. 51 00:03:13,193 --> 00:03:16,363 మార్చ్ 5, 2022 - లాలీగ రియల్ మాడ్రిడ్ - రియల్ సొసీయడాడ్ 52 00:03:18,907 --> 00:03:21,493 ఇవాళ రాత్రి ఆట సొంత ఊర్లోని బెర్నాబ్యూలో జరుగుతోంది, 53 00:03:21,493 --> 00:03:26,164 కాబట్టి తమ అభిమానుల కోసం విజయాన్ని సాధించాలి అన్న ఒత్తిడి కారణంగా ఆట మరింత ఉత్కంఠభరితంగా ఉంది. 54 00:03:26,164 --> 00:03:28,500 ఓయర్జాబల్ ఏరియా లోనికి వస్తున్నాడు చూసుకోండి! 55 00:03:28,500 --> 00:03:31,628 కానీ ప్రారంభంలో రియల్ మాడ్రిడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. 56 00:03:33,755 --> 00:03:36,383 రియల్ సొసీయడాడ్ కి ఒక పెనాల్టీ. 57 00:03:37,926 --> 00:03:41,555 గోల్ కోసం కోర్ట్వాకి వ్యతిరేకంగా ఓయర్జాబల్ ఎడమ కాలు. 58 00:03:43,265 --> 00:03:45,601 అతను పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఎడమ కాలితో గట్టిగా తన్నాడు! 59 00:03:45,601 --> 00:03:48,395 {\an8}- కొంచెంలో పోయింది. - రియల్ సొసీయడాడ్ కి 0-1. 60 00:03:48,395 --> 00:03:50,105 {\an8}రియల్ మాడ్రిడ్ 0-1 రియల్ సొసీయడాడ్ పదవ నిమిషం 61 00:03:50,105 --> 00:03:52,232 {\an8}రియల్ సొసీయడాడ్ వారు చాలా బాగా ఆడారు. 62 00:03:52,232 --> 00:03:53,817 {\an8}వారు టాప్ నాలుగవ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు... 63 00:03:53,817 --> 00:03:54,902 {\an8}డెర్మోట్ కొర్రిగన్ ది అథ్లెటిక్ 64 00:03:54,902 --> 00:03:56,361 {\an8}...కానీ వాళ్ళు గోల్స్ పెద్దగా వదలడం లేదు. 65 00:03:57,446 --> 00:03:59,198 ఇంకా సొసీయడాడ్ తో 0-1. 66 00:03:59,198 --> 00:04:01,992 మొడ్రిచ్ మధ్యలో ఉన్న కామావింగాకి బంతిని పంపించాడు. 67 00:04:01,992 --> 00:04:04,161 కామావింగా బంతిని తన్నాడు! గోల్! 68 00:04:04,161 --> 00:04:06,538 {\an8}రియల్ మాడ్రిడ్ 1-1 రియల్ సొసీయడాడ్ 40వ నిమిషం 69 00:04:06,538 --> 00:04:08,624 {\an8}కామావింగా భలే గోల్ కొట్టాడు! 70 00:04:08,624 --> 00:04:13,378 బెంజెమా నుండి మొడ్రిచ్ కి! మొడ్రిచ్ తిరిగి దానిని... 71 00:04:13,378 --> 00:04:15,214 {\an8}గోల్! 72 00:04:15,214 --> 00:04:17,591 {\an8}రియల్ మాడ్రిడ్ 2-1 రియల్ సొసీయడాడ్ 43వ నిమిషం 73 00:04:19,426 --> 00:04:23,555 రియల్ సొసీయడాడ్ తో ఆడిన ఆటలో మేము ఎదురుతిరిగాము. 74 00:04:23,555 --> 00:04:24,973 {\an8}10 - లూకా మొడ్రిచ్ మిడ్ ఫీల్డర్ 75 00:04:24,973 --> 00:04:28,810 {\an8}పారిస్ తో ఆడబోయే రెండవ ఆటకు మాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. 76 00:04:30,521 --> 00:04:31,730 వాళ్ళు ఎదురుతిరిగి బాగా ఆడారు, 77 00:04:31,730 --> 00:04:34,608 ఆ సీజన్ లో అతిగొప్ప ప్రదర్శనలలో ఒకటిగా ఆ ఆట నిలిచింది. 78 00:04:34,608 --> 00:04:37,986 ఒక విధంగా ఇలా చెప్పారు, "ఆటను అదుపులోకి తీసుకోగల జట్టు ఒకటి ఉంది, 79 00:04:37,986 --> 00:04:39,988 {\an8}ఒక జట్టుపై ఆధిపత్యం చూపగలది, గోల్స్ కొట్టగలది... 80 00:04:39,988 --> 00:04:40,989 {\an8}సిడ్ లోవ్ ది గార్డియన్ 81 00:04:40,989 --> 00:04:43,200 {\an8}...ఒక రియల్ మాడ్రిడ్ జట్టులా కనిపించగల జట్టు ఒకటి ఉంది" అని. 82 00:04:43,825 --> 00:04:47,162 {\an8}లాలీగ - ఆఖరి స్కోర్ రియల్ మాడ్రిడ్ 4-1 రియల్ సొసీయడాడ్ 83 00:04:52,292 --> 00:04:55,546 మంచిది! చాలా బాగుంది! బ్రావో! 84 00:05:00,259 --> 00:05:03,846 నిజమే, మనం కావాలనుకున్న ఆట తీవ్రత ఇదే. 85 00:05:03,846 --> 00:05:06,265 అభిమానులకు ఇలాంటి తీవ్రతతో ఆడితేనే నచ్చుతుంది. 86 00:05:06,265 --> 00:05:11,562 మాలో ఉన్న అతిగొప్ప ఆటను అభిమానులు ఇలాంటి ఆటల్లోనే వెలికితీస్తారు. 87 00:05:14,064 --> 00:05:16,525 పదండి, బయటకు వెళ్లి అభిమానులను పలకరిద్దాం. 88 00:05:16,525 --> 00:05:19,945 మార్సెలో పెద్దగా ఆడింది లేదు, కానీ అతను ఒక నాయకుడు అయ్యాడు, 89 00:05:19,945 --> 00:05:22,447 జట్టును ఒకటి చేసి, అందరితో మాట్లాడుతూ, 90 00:05:22,447 --> 00:05:25,033 లాకర్ రూమ్ నుండి బెంచ్ వరకు ఆటలో ఒకటై నడిపించాడు. 91 00:05:25,450 --> 00:05:27,077 {\an8}ప్రిడ్రాగ్ మిజటోవిక్ రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్.లెజెండ్ 92 00:05:27,077 --> 00:05:30,205 {\an8}అలాంటి మనస్సు, ఆ పద్దతి జట్టుకు చాలా సహాయపడింది. 93 00:05:32,916 --> 00:05:35,377 మేము పిచ్ నుండి వచ్చి ఒకరిని ఒకరం చూసుకున్నాం, 94 00:05:35,377 --> 00:05:38,130 తర్వాత, "మనం బయటకు వెళ్ళాలి" అనుకున్నాం. 95 00:05:38,130 --> 00:05:41,967 ఎందుకంటే మా అభిమానులు "మేము మీతోనే ఉన్నాం" అని మాతో చెప్తూనే ఉన్నారు, 96 00:05:41,967 --> 00:05:44,178 ఎప్పటిలాగే. 97 00:05:44,178 --> 00:05:46,722 {\an8}మాకు ఆ ఫీలింగ్ వచ్చి చాలా కాలం అవుతుంది. 98 00:05:46,722 --> 00:05:48,724 {\an8}12 - మార్సెలో రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. 2007-22 99 00:05:48,724 --> 00:05:51,351 {\an8}మాకు మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, మేము, "హమ్మయ్యా" అనుకున్నాం. 100 00:05:53,061 --> 00:05:56,732 క్లబ్ కీర్తి కోసం జట్టు అలాగే అభిమానులు కలిసి పనిచేసిన ఆ ఫీలింగ్. 101 00:06:02,070 --> 00:06:04,364 సాధించగలం! సాధించగలం! 102 00:06:10,454 --> 00:06:12,206 అభిమానులు ముఖ్యమా? 103 00:06:12,206 --> 00:06:16,126 కచ్చితంగా. మాకు బుధవారం రోజున వాళ్ళ సహాయం చాలా అవసరం. 104 00:06:20,631 --> 00:06:25,761 ఆ ఐకమత్యం, వారు ఇచ్చిన ప్రోత్సాహం... అది మాకు ఎంతో సహాయం చేసింది. 105 00:06:27,930 --> 00:06:29,556 - ఇది ఎవరు? - నా కొడుకు. 106 00:06:29,556 --> 00:06:33,560 ఇవాళ నిద్ర లేచాడు, కాబట్టి మేము మొదటి సారి బెర్నాబ్యూ పిచ్ మీదకు వెళ్తున్నాం. 107 00:06:33,560 --> 00:06:36,146 అంతే కదా? మనం కలిసి ఆ పిచ్ మీదకు వెళ్తున్నాం కదా? 108 00:06:40,192 --> 00:06:41,818 భలే, చూస్తున్నారా ఎలా పోతున్నాడో? 109 00:06:41,818 --> 00:06:43,153 స్కోర్! స్కోర్! 110 00:06:44,238 --> 00:06:46,448 స్కోర్! తన్ను! 111 00:06:47,199 --> 00:06:48,700 పదా! 112 00:06:50,118 --> 00:06:51,119 స్కోర్! 113 00:06:51,119 --> 00:06:54,081 గోల్! 114 00:07:03,048 --> 00:07:04,716 9 మార్చ్ 2022 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ 115 00:07:04,716 --> 00:07:07,386 రియల్ మాడ్రిడ్ - పీ.ఎస్.జి 16 రౌండ్ లలో ఒకటి, రెండవ మ్యాచ్ 116 00:07:09,471 --> 00:07:12,057 తమ అభిమానుల చెక్కుచెదరని నమ్మకంతో బలాన్ని తెచ్చుకొని, 117 00:07:12,057 --> 00:07:13,684 పారిస్ సెయింట్-జెర్మైన్ తో జరగబోయే 118 00:07:13,684 --> 00:07:16,395 రెండవ మ్యాచ్ విజయం మీద రియల్ మాడ్రిడ్ కన్నేసింది. 119 00:07:17,896 --> 00:07:18,897 రియల్ మాడ్రిడ్ 120 00:07:20,732 --> 00:07:23,402 మేము బెర్నాబ్యూకి బస్సు మీద వెళ్ళినప్పుడు, 121 00:07:23,402 --> 00:07:27,406 స్టేడియంకి వెళ్లే దారిలో జనం బయట వీధుల్లో నిలబడడం మేము చూశాం. 122 00:07:27,406 --> 00:07:28,991 అది చాలా అందమైన దృశ్యం. 123 00:07:28,991 --> 00:07:31,577 {\an8}ఆ క్షణం నుండి చాలా స్పష్టంగా ఫీల్ అవ్వగలిగాం... 124 00:07:31,577 --> 00:07:32,828 {\an8}4 - డేవిడ్ అలాబ డిఫెండర్ 125 00:07:32,828 --> 00:07:34,079 ...ఏదైనా చేయగలం అని. 126 00:07:34,830 --> 00:07:38,500 {\an8}మేము యూరప్ రాజులం 127 00:07:43,714 --> 00:07:46,925 బెర్నాబ్యూలో మ్యాచ్ జరిగే రాత్రుళ్ళు చాలా స్పెషల్, 128 00:07:46,925 --> 00:07:50,012 కానీ ఆ రాత్రి, ఆ వాతావరణంలో ఒక మాయ ఉన్నట్టు అనిపించింది. 129 00:07:50,596 --> 00:07:52,181 జట్టు వారికి స్టేడియంలో ఉన్న 130 00:07:52,181 --> 00:07:56,393 ఎనభై వేల మంది అభిమానులలో ప్రతీ ఒక్కరి సపోర్ట్ స్పష్టంగా తెలుస్తుంది. 131 00:07:57,603 --> 00:08:01,398 వాళ్ళు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలి అంటే, వాళ్లకు అది చాలా ముఖ్యం. 132 00:08:02,774 --> 00:08:05,986 కానీ ఆ కార్యక్రమాన్ని పాడు చేయడానికి పారిస్ సెయింట్-జెర్మైన్ అక్కడే ఉంది. 133 00:08:13,911 --> 00:08:16,538 రియల్ మాడ్రిడ్ 0 - 0 పారిస్ సెయింట్-జెర్మైన్ 134 00:08:17,998 --> 00:08:20,125 ఇక బెర్నాబ్యూలో ఆట మొదలైంది. 135 00:08:20,125 --> 00:08:23,837 - రియల్ మాడ్రిడ్ కదలడం ప్రారంభించారు. - మొదలైంది! మొదలైంది! 136 00:08:26,632 --> 00:08:28,509 ఏరియా లోపల ఎంబాపె ఉన్నాడు చూసుకోండి. 137 00:08:28,509 --> 00:08:30,469 - ఎంబాపె తన్నాడు. - కోర్ట్వా బాగా ఆపాడు. 138 00:08:30,469 --> 00:08:33,179 కోర్ట్వా తన శరీరాన్ని అడ్డు పెట్టి ఆపాడు! 139 00:08:33,847 --> 00:08:35,849 {\an8}ఇంకొకసారి మా జట్టు చాలా బాగా ఆడడం మొదలెట్టింది. 140 00:08:35,849 --> 00:08:37,142 {\an8}మారిసియో పోచెట్టినో పీ.ఎస్జి కోచ్ 2021-22 141 00:08:37,142 --> 00:08:39,061 {\an8}మేము మొదటి హాఫ్ లో మాడ్రిడ్ ని పూర్తిగా తొక్కేసాం. 142 00:08:40,312 --> 00:08:43,065 బాల్ ఆ ముగ్గురి మధ్యలోనే ఉంది. ఈలోగా నేమార్ వచ్చాడు. 143 00:08:43,065 --> 00:08:44,650 నేమార్ తన్నాడు! 144 00:08:44,650 --> 00:08:46,026 కోర్ట్వా. 145 00:08:46,693 --> 00:08:51,240 చూసుకోండి, వాళ్ళు వెనుక నుండి వస్తున్నారు. బాల్ ఆటలో నుండి వెళ్లడం లేదు. 146 00:08:51,240 --> 00:08:53,867 వెళ్లడం లేదు. అతను వెనక్కి వాలాడు! 147 00:08:53,867 --> 00:08:57,287 ఎంబాపె స్కోర్ చేశాడు. పారిస్ సెయింట్-జెర్మైన్ గోల్ చేసింది. 148 00:08:57,287 --> 00:08:59,248 కానీ ఇది లెక్కలోకి రాదు. ఇది ఆఫ్ సైడ్. 149 00:08:59,831 --> 00:09:03,836 మాడ్రిడ్ అదృష్టం బాగుంది ఆ గోల్ ని ఆఫ్ సైడ్ అని లెక్కించలేదు. 150 00:09:04,837 --> 00:09:07,130 వాళ్లకు అందిన ఉపశమనాన్ని చూడొచ్చు. 151 00:09:08,340 --> 00:09:09,758 కానీ అది ఎంతో సేపు లేదు. 152 00:09:09,758 --> 00:09:12,427 ఖాళీ ఉంది చూసుకోండి. ఎంబాపె వస్తున్నాడు. 153 00:09:12,427 --> 00:09:15,806 ఎంబాపె ఇంకా పరిగెడుతున్నాడు. ఇంకా వెళ్తున్నాడు. అతన్ని అలాబ ఆపాలి. 154 00:09:15,806 --> 00:09:18,100 ఎంబాపె-అలాబ. ఎంబాపె-అలాబ. ఎంబాపె స్కోర్ చేశాడు. 155 00:09:18,100 --> 00:09:21,687 {\an8}- భలే గోల్. - ఎంబాపె స్కోర్ చేశాడు. 0-1. 156 00:09:21,687 --> 00:09:24,523 {\an8}రియల్ మాడ్రిడ్ 0-1 పీ.ఎస్.జి 39వ నిమిషం - ఏజిజి 0-2 157 00:09:29,903 --> 00:09:31,572 అందరికీ సుపరిచితమైన అతని వేగం. 158 00:09:31,572 --> 00:09:33,532 అతని కాలి లోపలి భాగంతో తన్నుతాడు. 159 00:09:33,532 --> 00:09:34,616 {\an8}డేనియల్ రియోలో ఆర్.ఎమ్.సి 160 00:09:34,616 --> 00:09:36,493 {\an8}ఎంబాపె సాధించిన ఆ గోల్ నిజంగా అద్భుతమైంది. 161 00:09:37,286 --> 00:09:40,414 కోర్ట్వా చటుక్కున దానిని మొడ్రిచ్ కి పంపాడు. 162 00:09:40,414 --> 00:09:43,876 పీ.ఎస్.జి ముందు ముగ్గురు ఆటగాళ్లను పెట్టింది, కానీ మాడ్రిడ్ కి సమయం లేదు. 163 00:09:43,876 --> 00:09:45,127 {\an8}హాఫ్-టైమ్ అయింది. 164 00:09:45,127 --> 00:09:46,503 {\an8}రియల్ మాడ్రిడ్ 0-1 పీ.ఎస్.జి హాఫ్ టైమ్ - ఏజిజి 0-2 165 00:09:46,503 --> 00:09:50,966 {\an8}మొదటి హాఫ్ లో పారిస్ లో ఏం జరిగిందో అదే కొనసాగినట్టు ఉంది. 166 00:09:50,966 --> 00:09:52,050 కిలియన్ ఎంబాపె... 167 00:09:52,050 --> 00:09:53,468 {\an8}రోబర్టో మార్టినెజ్ యుఈఎఫ్ఏ టెక్నికల్ పరిశీలకుడు 168 00:09:53,468 --> 00:09:54,970 {\an8}...ఖాళీని కనుగొనడం, ప్రమాదకరంగా నిలబడడం. 169 00:09:54,970 --> 00:09:58,348 అలాగే పారిస్ లో తాము పీ.ఎస్.జి జట్టు అంత బాగా ఆడలేము అని రియల్ మాడ్రిడ్ వాళ్లకు తెలుసు అనుకుంటున్నాను. 170 00:09:58,348 --> 00:10:01,310 అలాగే గెలిచే అవకాశం లేనట్టు కనిపించిన క్షణమే ఆ ఆటలో అత్యంత కీలకమైన క్షణం అనుకుంటున్నాను. 171 00:10:01,310 --> 00:10:04,313 ఈ రెండు జట్ల మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. 172 00:10:04,313 --> 00:10:06,190 {\an8}మేము రెండు సార్లు స్కోర్ చేయాలి... 173 00:10:06,190 --> 00:10:08,192 {\an8}కార్లో ఆంచెలొట్టి రియల్ మాడ్రిడ్ సి.ఎఫ్ కోచ్ 174 00:10:08,192 --> 00:10:09,443 {\an8}...ఆటను టై చేయడానికి. 175 00:10:09,443 --> 00:10:10,527 {\an8}9 - కరీమ్ బెంజెమా ఫార్వార్డ్ 176 00:10:10,527 --> 00:10:11,862 {\an8}పారిస్ చాలా బలమైన జట్టు. 177 00:10:11,862 --> 00:10:16,909 {\an8}వాళ్ళతో మా స్కోర్ 0-1, అయినా కూడా మేము ఇంకా గెలవగలం అనే అనుకున్నాం. 178 00:10:16,909 --> 00:10:18,493 మా అభిమానులు కూడా అదే అనుకున్నారు. 179 00:10:18,493 --> 00:10:21,455 వాళ్ళు ఈ క్లిష్టమైన సందర్భంలో కూడా మాతోనే ఉన్నారు. 180 00:10:21,455 --> 00:10:26,710 మేము కొంచెం మెరుగైనట్టు మాకు కనిపించింది, కాబట్టి మేము ఒక్క అడుగు ముందుకు వేస్తే, 181 00:10:26,710 --> 00:10:29,838 మేము స్కోర్ చేసి ఆటలో తిరిగి నిలబడగలం అనిపించింది. 182 00:10:31,548 --> 00:10:36,595 రియల్ మాడ్రిడ్ రెండవ హాఫ్ లో ఆటను టై చేయడానికి రెండు గోల్స్ చేయాల్సిన స్థితిలో ఆటను మొదలెట్టింది. 183 00:10:40,265 --> 00:10:42,851 ఎలాంటి ప్రత్యర్థికైనా అది చాలా పెద్ద రిస్క్, 184 00:10:42,851 --> 00:10:46,563 అది కూడా జట్టులో కిలియన్ ఎంబాపె ఉన్న వారికి వ్యతిరేకంగా అంటే చెప్పాల్సిన పనే లేదు. 185 00:10:47,272 --> 00:10:50,567 లోనికి బాల్ వెళ్తోంది, చూసుకోండి. ఏం జరగబోతోంది? 186 00:10:50,567 --> 00:10:52,569 - గోల్! - అది ఆఫ్ సైడ్. 187 00:10:54,530 --> 00:10:57,407 - చూడడానికి ఆఫ్ సైడ్ లాగే ఉంది. - అవును, నిజమే. 188 00:10:57,407 --> 00:11:00,410 ఇంకొక గోల్ ని ఆఫ్ సైడ్ గా పరిగణించారు. 189 00:11:00,410 --> 00:11:02,621 మాడ్రిడ్ కి మరోసారి కొంచెంలో కలిసొచ్చింది. 190 00:11:03,121 --> 00:11:05,832 మేము అవకాశం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 191 00:11:05,832 --> 00:11:08,544 ఎందుకంటే, అప్పుడు ఏమైనా జరగొచ్చు. 192 00:11:09,878 --> 00:11:13,340 అలాగే ఆ అవకాశం సందర్భాన్ని వాడుకుంటే తప్పక దొరుకుతుంది. 193 00:11:15,050 --> 00:11:18,053 కరీమ్ బెంజెమా గోల్ కీపర్ పై ఒత్తిడి పెడుతున్నాడు. 194 00:11:18,053 --> 00:11:21,682 దానిని వెనక్కి తన్ను! దానిని వెనక్కి తన్ను! 195 00:11:21,682 --> 00:11:25,143 {\an8}- గోల్! గోల్! - ఆట మొదలైంది! పదండి! 196 00:11:25,143 --> 00:11:26,979 {\an8}రియల్ మాడ్రిడ్ 1-1 పీ.ఎస్.జి. 61వ నిమిషం - ఏజిజి 1-2 197 00:11:31,775 --> 00:11:33,902 గోల్ కీపర్ తప్పు చేశాడు, 198 00:11:33,902 --> 00:11:35,904 కానీ అతని మీద ఒత్తిడి పెట్టడం వల్లే అలా అవుతుంది. 199 00:11:35,904 --> 00:11:38,407 నేను కీపర్ పై ఒత్తిడి పెట్టాను, కానీ మిగతా జట్టు దగ్గరవుతోంది. 200 00:11:38,407 --> 00:11:41,243 బాల్ ని కోల్పోయాం, కానీ అక్కడ విని ఉన్నాడు. 201 00:11:41,243 --> 00:11:44,246 అతను మళ్ళీ ఒత్తిడి నిలపడంతో మేము స్కోర్ చేయగలిగాము. 202 00:11:44,246 --> 00:11:48,166 ఆ గోల్ తర్వాత, అంతా మారిపోయింది. 203 00:11:52,462 --> 00:11:56,967 ఆ గోల్ ఆటలో కీలక సందర్భం అయింది. 204 00:11:58,969 --> 00:12:00,971 మెస్సి మొడ్రిచ్ నుండి తప్పించుకోవడానికి చూస్తున్నాడు. 205 00:12:00,971 --> 00:12:02,097 మొడ్రిచ్ అలాగే మెస్సి. 206 00:12:02,097 --> 00:12:05,184 భలే లాగాడు! అద్భుతం, లూకా! 207 00:12:05,184 --> 00:12:06,268 కానివ్వు! 208 00:12:11,148 --> 00:12:16,153 ఇక అక్కడి నుండి పీ.ఎస్.జి పతనం, రియల్ మాడ్రిడ్ ఎదగడం మొదలైంది. 209 00:12:16,153 --> 00:12:18,572 వాళ్ళు నమ్మశక్యం కాని స్థాయికి చేరుకున్నారు. 210 00:12:19,072 --> 00:12:21,200 వాళ్ళు అట్టడుగున మొదలెట్టి ఎదిగారు. 211 00:12:21,200 --> 00:12:23,911 పీ.ఎస్.జి పై స్థాయిలో మొదలెట్టి కిందికి పోయింది. 212 00:12:29,082 --> 00:12:31,835 మా రీఎంట్రీకి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. 213 00:12:32,419 --> 00:12:34,630 ఆ తర్వాత ఏది జరగాలో అది జరిగింది. 214 00:12:35,797 --> 00:12:37,799 లూకా నేమార్ మీద ఒక కన్నేసి ఉంచాడు, 215 00:12:37,799 --> 00:12:40,969 అతను ఆటలో ఇంకా పెద్దగా ఏమీ చేయలేదు. 216 00:12:40,969 --> 00:12:44,473 మొడ్రిచ్ పరిగెడుతున్నాడు. ఎవరూ అతన్ని పట్టుకోలేరు. 217 00:12:44,473 --> 00:12:48,352 బాల్ ని వినిసియస్ కి ఇచ్చాడు. వినిసియస్ బాక్సు లోపల ఉన్నాడు! 218 00:12:48,352 --> 00:12:52,105 దానిని కంట్రోల్ చేస్తున్నాడు. అతనికి అక్కడ కరీమ్ కావాలి. ఎవరైనా పర్లేదు. అతనికి ఖాళీ తగ్గుతోంది! 219 00:12:52,105 --> 00:12:53,190 అతను దానిని వెనక్కి పంపాడు! 220 00:12:53,190 --> 00:12:57,361 బాల్ గోల్ ముందు ఉన్న మొడ్రిచ్ కి వెళ్ళింది. మొడ్రిచ్ ఏరియాలో ఉన్న కరీమ్ కి పంపాడు! 221 00:12:57,361 --> 00:12:59,029 గోల్! 222 00:12:59,446 --> 00:13:03,200 {\an8}రియల్ మాడ్రిడ్ 2-1 పీ.ఎస్.జి 76వ నిమిషం - ఏజిజి 2-2 223 00:13:14,545 --> 00:13:18,298 కరీమ్ బెంజెమా చేసిన రెండవ గోల్ తో జట్లు సమం అయ్యాయి. 224 00:13:18,298 --> 00:13:22,094 ఇంకొక్కటి స్కోర్ చేస్తే, మాడ్రిడ్ తరువాతి రౌండ్ కి వెళ్లొచ్చు, 225 00:13:22,094 --> 00:13:24,012 ఊహించశక్యం కానీ తిరుగు రాకతో. 226 00:13:26,598 --> 00:13:28,642 - నమ్మశక్యంగా లేదు. - కానివ్వండి! 227 00:13:28,642 --> 00:13:31,061 పదండి. అతన్ని చూడండి. 228 00:13:31,061 --> 00:13:33,939 వినిసియస్. ఇంకా వినిసియస్ దగ్గరే ఉంది. మార్క్వినోస్ బాల్ ని డిఫెన్స్ కి పంపాడు. 229 00:13:33,939 --> 00:13:35,148 గోల్! 230 00:13:35,899 --> 00:13:39,444 {\an8}రియల్ మాడ్రిడ్ 3-1 పీ.ఎస్.జి 78 నిమిషం - ఏజిజి 3-2 231 00:13:45,534 --> 00:13:49,454 - ఇది రియల్ మాడ్రిడ్ అంటే! - అవును, సర్! 232 00:13:53,333 --> 00:13:56,128 కరీమ్ స్కోర్ చేసినప్పుడు, నాకు తెలిసి స్టేడియంలో జనం పిచ్చెక్కిపోయారు. 233 00:13:56,128 --> 00:13:57,462 జట్టుగా మాకే మతి పోయింది. 234 00:13:58,172 --> 00:14:01,508 ఈ జట్టు, అలాగే దాని అభిమానుల గొప్పతనం. 235 00:14:02,759 --> 00:14:06,555 అప్పుడు నాకు సెక్యూరిటీ వారి కుర్చీ ఒకటి కనిపించింది, దానిని ఎత్తేసాను. 236 00:14:07,181 --> 00:14:11,185 ఎందుకో నాకు కూడా తెలీదు, అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 237 00:14:11,185 --> 00:14:12,936 {\an8}అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. 238 00:14:12,936 --> 00:14:14,062 {\an8}3 - ఏడెర్ మిలిటావ్ డిఫెండర్ 239 00:14:14,062 --> 00:14:16,273 {\an8}వాడు ఆ కుర్చీని ఎత్తేశాడు, అది వైరల్ అయిపొయింది. 240 00:14:19,401 --> 00:14:20,861 లైక్స్ - వ్యూస్ - షేర్ 241 00:14:29,077 --> 00:14:30,662 డేవిడ్ అలాబ మా కుర్చీలో కూర్చోకు! 242 00:14:30,662 --> 00:14:34,458 - ఆ కుర్చీ నీ దగ్గర ఉందా? - ఆ కుర్చీ నా దగ్గరే ఉంది, అవును. 243 00:14:36,627 --> 00:14:38,253 వేడుకలను అటు ఉంచితే, 244 00:14:38,253 --> 00:14:41,673 జట్టు ఇంకొక 12 నిముషాలు ఓపికగా ఆటను లాగించాలి. 245 00:14:43,884 --> 00:14:45,344 {\an8}పరిస్థితి మారిపోయింది. 246 00:14:45,344 --> 00:14:46,929 {\an8}14 - కాసెమిరో రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. 2013-22 247 00:14:46,929 --> 00:14:49,473 {\an8}మేము ఇంకా బాగా ఆడుతున్నాం. స్కోర్ చేయడానికి ఇంకా అవకాశాలు దొరికాయి. 248 00:14:50,098 --> 00:14:52,601 {\an8}లూకా! లూకా! భలే కదిలాడు! 249 00:14:52,601 --> 00:14:54,102 డిఫెండర్లు పంపించేశారు. 250 00:14:54,102 --> 00:14:56,230 - కొట్టాడు! - ఎడమ కాలితో, 251 00:14:56,230 --> 00:14:58,857 కుడి దానితో, మళ్ళీ ఎడమ కాలితో. ఇప్పుడు వైడ్ పోయింది! 252 00:14:59,650 --> 00:15:03,487 అతను నేమార్ కి ఇచ్చాడు. ముగిసింది! ఇది ఇక ముగియాలి! 253 00:15:03,487 --> 00:15:04,738 ఈల వెయ్, రెఫ్! 254 00:15:06,281 --> 00:15:08,659 {\an8}అతను ఈల వేయాల్సిందే! ఇక ముగిసింది! ఇక ముగిసింది! 255 00:15:08,659 --> 00:15:10,744 {\an8}రియల్ మాడ్రిడ్ 3-1 పీ.ఎస్.జి ఆఖరి స్కోర్ - మొత్తం 3-2 256 00:15:10,744 --> 00:15:12,663 {\an8}రియల్ మాడ్రిడ్ గెలిచారు! 257 00:15:12,663 --> 00:15:15,541 రియల్ మాడ్రిడ్ జట్టు తరువాతి రౌండ్ కి వెళ్తోంది! 258 00:15:15,541 --> 00:15:16,917 మాడ్రిడ్ గెలిచింది! 259 00:15:16,917 --> 00:15:19,419 కరీమ్ బెంజెమా హ్యాట్రిక్ కొట్టాడు! 260 00:15:19,419 --> 00:15:21,839 బెర్నాబ్యూలో మనం చూసిన ఈ విషయం నమ్మశక్యం కానిది! 261 00:15:33,851 --> 00:15:34,977 బ్రావొ! 262 00:15:42,401 --> 00:15:45,612 అక్కడి వాతావరణంతో, ఆ మాయతో రియల్ మాడ్రిడ్... 263 00:15:45,612 --> 00:15:48,198 ఆ జట్టు తిరిగి నిలబడగలం అని నమ్మారు. 264 00:15:48,198 --> 00:15:52,828 వాళ్ళు కోల్పోవడానికి ఏమీ లేని పరిస్థితి నుండి సరైన ఎత్తుగడలు, అలాగే కొంచెం అదృష్టంతో, 265 00:15:52,828 --> 00:15:56,915 వాళ్ళు గెలిచి క్వాలిఫై అవ్వగలిగారు. 266 00:15:56,915 --> 00:16:06,884 ఇది లెక్క! ఇది లెక్క! మాడ్రిడ్ గెలిచే విధానం ఇది! 267 00:16:06,884 --> 00:16:11,763 ఇవాళ ఎలా ఉందో స్టేడియంని మేము అలాగే చూడాలి అనుకున్నాం. 268 00:16:11,763 --> 00:16:13,056 {\an8}మాకు అభిమానులు అవసరం. 269 00:16:13,056 --> 00:16:14,558 {\an8}ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 9 - కరీమ్ బెంజెమా 270 00:16:14,558 --> 00:16:16,185 {\an8}కాబట్టి నేటి ఈ విజయం వారిదే. 271 00:16:17,394 --> 00:16:21,064 ఇవాళ చోటు చేసుకున్న సన్నివేశం బహుశా బెర్నాబ్యూలో చోటుచేసుకున్న 272 00:16:21,064 --> 00:16:22,983 అత్యంత అతీతమైంది కావచ్చు. 273 00:16:22,983 --> 00:16:25,194 {\an8}కొంతమంది మాడ్రిడ్ ఊహించని విజయాన్ని సాధిస్తుంది అని నమ్మారు... 274 00:16:25,194 --> 00:16:26,612 {\an8}జోసెఫ్ పెద్రేరోల్ అట్రెస్ మీడియా 275 00:16:26,612 --> 00:16:29,072 {\an8}...పీ.ఎస్.జిని ఓడిస్తుందని. అందరూ ఆశలు పెట్టుకున్న జట్టు. స్టార్ల జట్టు. 276 00:16:29,072 --> 00:16:32,242 అపారమైన ఖతార్ డబ్బుతో నడిచే జట్టు. అది ఊహకే అందలేదు. 277 00:16:35,454 --> 00:16:38,916 మేము ఇలాగే గెలుస్తాం! మేము ఇలాగే గెలుస్తాం! 278 00:16:40,125 --> 00:16:42,920 పదండి! రియల్ మాడ్రిడ్! ఇలాగే కొనసాగుదాం! 279 00:16:48,175 --> 00:16:52,012 నేను ఒక ఫ్రెండ్ ని కలిసాను, నేను ఇలా అంటున్నందుకు అతను కోపపడతాడు, 280 00:16:52,012 --> 00:16:54,097 కానీ అతను మొడ్రిచ్ పక్కింటిలోనే ఉంటాడు. 281 00:16:54,097 --> 00:16:55,766 {\an8}నేను అతనితో, "నీకు ఏమని అనిపిస్తోంది?" అన్నాను. 282 00:16:55,766 --> 00:16:56,850 {\an8}పాకో గొంజాలెజ్ కాడేనా కోప్ 283 00:16:56,850 --> 00:16:58,936 {\an8}అందుకు అతను, "ఏమో, కానీ లూకా నాతో చెప్పాడు, 284 00:16:58,936 --> 00:17:01,980 {\an8}మేము గనుక పారిస్ సెయింట్-జెర్మైన్ ని ఓడిస్తే, ఛాంపియన్షిప్ మాదే" అన్నాడు. 285 00:17:01,980 --> 00:17:05,317 లూకా ఏమైనా అన్నాడు అంటే, అది మామూలు వ్యక్తి అనడం లాంటిది కాదు. 286 00:17:05,317 --> 00:17:09,946 మొడ్రిచ్ ఏమైనా అన్నాడు అంటే, మనకు ఆలోచన రావాలి. 287 00:17:10,531 --> 00:17:14,451 ఈ విషయం ఎక్కడి నుండి లీక్ అయిందో నాకు తెలీదు, 288 00:17:14,451 --> 00:17:20,915 కానీ నన్ను అడిగితే, అవును, నేనే అన్నాను, ఎందుకంటే నేను పూర్తిగా అది జరుగుద్దని నమ్మాను. 289 00:17:20,915 --> 00:17:23,836 నేను ఏమైనా అంటే, అది కచ్చితంగా జరుగుద్దనే అంటాను. 290 00:17:23,836 --> 00:17:28,632 అందుకు కారణం నాకు ఈ జట్టు మీద ఉన్న నమ్మకం అలాగే విశ్వాసమే. 291 00:17:28,632 --> 00:17:32,302 ఇది చాలా స్పెషల్ జట్టు అని నాకు అర్థమైంది. 292 00:17:32,302 --> 00:17:39,184 ఈ సీజన్ లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల కారణంగా, ఇబ్బందుల్లో నుండి ఎలా బయటపడాలో మాకు తెలిసింది. 293 00:17:39,685 --> 00:17:41,812 అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 294 00:17:46,316 --> 00:17:47,860 పదండి! 295 00:18:01,707 --> 00:18:03,041 ఏడూ. 296 00:18:05,544 --> 00:18:06,837 పదా! 297 00:18:07,504 --> 00:18:08,505 విని. 298 00:18:10,716 --> 00:18:12,843 - బాగా ఆడారు, మిత్రులారా. సూపర్! - వెళ్లి **** దీద్దాం. 299 00:18:19,099 --> 00:18:20,517 క్రూస్! 300 00:18:20,517 --> 00:18:23,896 - నీకు నొప్పి రావడం లేదు. నీకు నొప్పి రావడం లేదు! - నిజమే. 301 00:18:35,782 --> 00:18:37,242 నేను ఎగిరి గెంతుతాను! 302 00:18:41,163 --> 00:18:42,456 అదరగొట్టావు, లుకిటా! 303 00:18:44,166 --> 00:18:46,168 అద్భుతం! లూకి! కానివ్వు! 304 00:18:57,429 --> 00:19:00,933 నేను అందరినీ హగ్ చేసుకోవాలి అనుకున్నాను. అందరికీ థాంక్స్ చెప్పాలి అనుకున్నాను, 305 00:19:00,933 --> 00:19:07,523 ఎందుకంటే మా చుట్టూ ఉన్న వీళ్ళందరూ మాకు చాలా ముఖ్యమైనవారు, 306 00:19:07,523 --> 00:19:14,363 అలాగే అందరూ అలాంటి ఒక రాత్రికి అర్హత సాధించుకున్నవారే. 307 00:19:16,448 --> 00:19:19,409 అంతే! అంతే! 308 00:19:26,458 --> 00:19:28,752 అంతే. అంతే. 309 00:19:34,299 --> 00:19:38,011 లూకా మొడ్రిచ్ మాత్రం, ఈ క్షణం కోసం పదేళ్లు కష్టపడాల్సి వచ్చింది. 310 00:19:40,889 --> 00:19:44,768 నిరంతరం నవ్వుతో ఉండే ఆటగాడు, లూకా... 311 00:19:44,768 --> 00:19:46,186 మొడ్రిచ్! 312 00:19:47,062 --> 00:19:48,188 {\an8}మొడ్రిచ్ 10 313 00:19:48,188 --> 00:19:52,943 నా పేరు లూకా మొడ్రిచ్, నేను రియల్ మాడ్రిడ్ లో 2012లో చేరాను. 314 00:19:53,610 --> 00:19:55,070 లూకా మొడ్రిచ్ 315 00:19:55,070 --> 00:19:57,739 {\an8}ది మేస్ట్రో 316 00:19:59,575 --> 00:20:01,702 గడిచిన 24 గంటల గురించి చెప్పు. 317 00:20:01,702 --> 00:20:03,328 చాలా హడావిడిగా గడిచి ఉంటాయి కదా. 318 00:20:03,328 --> 00:20:05,038 అది నిన్న రాత్రి జరిగింది. 319 00:20:05,038 --> 00:20:08,750 నేను ఆ విషయం విన్నప్పుడు, నేను వ్యక్తపరచలేకపోయా... 320 00:20:08,750 --> 00:20:12,087 నిన్న రాత్రి ఎలా ఫీల్ అయ్యాను... అన్నది వ్యక్తపర్చలేను, 321 00:20:12,087 --> 00:20:15,299 అలాగే ఇక్కడికి వచ్చి చేరడం... 322 00:20:17,092 --> 00:20:19,720 చాలా సంతోషంగా ఉంది, అంతే. 323 00:20:21,388 --> 00:20:26,059 మొడ్రిచ్ ని చేర్చుకున్నప్పుడు, అతను రియల్ మాడ్రిడ్ లో 324 00:20:26,059 --> 00:20:29,438 ఇప్పుడు చేరిన స్థాయికి, అలాగే ఆటతీరుతో ఈ లెవెల్ కి 325 00:20:29,438 --> 00:20:31,356 చేరగలడు అని ఎవరూ ఊహించలేదు. 326 00:20:31,356 --> 00:20:36,862 అతను టోట్టెంహమ్ లో ఉన్నప్పుడు అద్భుతమైన ఆటగాడు కావడంతో నాకు చాలా నచ్చాడు. 327 00:20:40,741 --> 00:20:44,203 అతను మంచి మిడ్ ఫీల్డర్ అవుతాడు అనుకున్నాను 328 00:20:44,203 --> 00:20:47,164 కానీ రియల్ మాడ్రిడ్ చరిత్రలో మరపురాని ఆటగాడిగా నిలిచిపోతాడు అని ఊహించలేదు. 329 00:20:57,508 --> 00:21:01,136 ఆ షర్ట్ లో ఉన్న గొప్పతనం మనకు తెలుస్తుంది, 330 00:21:01,136 --> 00:21:06,808 దానిని మొట్టమొదటి సారి వేసుకోవడం చాలా ప్రత్యేకమైన, అందమైన విషయం. 331 00:21:07,351 --> 00:21:09,978 అతను చేరినప్పుడు, ప్రాముఖ్యంగా... 332 00:21:09,978 --> 00:21:12,314 4.2 కోట్లు సిగ్గును పోగొట్టుకోవడానికి 333 00:21:12,314 --> 00:21:16,652 ...అతన్ని చేర్చుకోవడం పెద్ద దండగైన విషయం అని న్యూస్ పేపర్ మొదటి పేజీలో రాశారు. 334 00:21:16,652 --> 00:21:19,613 మాడ్రిడ్ లో తన గుర్తింపు వేయడానికి మొదట్లో ఇబ్బంది పడ్డాడు. 335 00:21:20,113 --> 00:21:24,076 మాడ్రిడ్ వారి మెలకువలలో సగానికి పైనే పనిచేయడం లేదు. 336 00:21:24,076 --> 00:21:26,203 చూసుకోండి, చూసుకోండి! 337 00:21:28,288 --> 00:21:30,374 ఆ కుర్రాడిని కాస్త వదిలేయండి. 338 00:21:30,374 --> 00:21:33,377 జట్టులో తన స్థానాన్ని కనుగొనేవరకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి. 339 00:21:33,377 --> 00:21:34,920 {\an8}అతను గొప్ప ఆటగాడు... 340 00:21:34,920 --> 00:21:36,713 {\an8}హోసే మరీనొ రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. కోచ్ 2010-13 341 00:21:36,713 --> 00:21:39,258 {\an8}...అలాగే నాకు తెలిసి బెర్నాబ్యూలో అతను ఎంత 342 00:21:39,258 --> 00:21:41,677 గొప్ప ఆటగాడో స్వల్పంగా జనం చూసినట్టు ఉన్నారు. 343 00:21:42,636 --> 00:21:45,180 మొడ్రిచ్ ఎడం కాలితో తన్నాడు. భలే స్ట్రైక్! 344 00:21:45,180 --> 00:21:46,306 అద్భుతమైన గోల్! 345 00:22:00,988 --> 00:22:03,782 మొడ్రిచ్! మొడ్రిచ్! అతను షూట్ చేయగలడు! గోల్! 346 00:22:09,997 --> 00:22:13,125 సెర్జియో రామోస్ స్కోర్ చేయడానికి నువ్వు తన్నిన బాల్, 347 00:22:13,125 --> 00:22:14,626 చరిత్రలో నిలిచిపోయిన షాట్ అయింది. 348 00:22:16,587 --> 00:22:22,301 నేను ఆ షాట్ ని చూసిన ప్రతీసారి, నా రోమాలు... 349 00:22:22,301 --> 00:22:25,053 - నిక్కపొడుచుకుంటాయి. - ...నిక్కపొడుచుకుంటాయి, అవును. 350 00:22:27,431 --> 00:22:30,642 మీకు ఫుట్ బాల్ అంటే ఇష్టమైతే, మీకు మొడ్రిచ్ కూడా నచ్చుతాడు. 351 00:22:30,642 --> 00:22:33,687 అతను గడిచిన కొన్నేళ్లలో మనం చూసిన అతిగొప్ప ఆటగాళ్లలో ఒకడు. 352 00:22:33,687 --> 00:22:37,399 అతను అత్యంత క్లిష్టమైన పాస్ లు చేయగలడు, 353 00:22:37,399 --> 00:22:39,860 లేదా అత్యంత క్లిష్టమైన ఐడియాలను నిజం చేయగలడు. 354 00:22:39,860 --> 00:22:41,695 మార్సెలో నుండి మొడ్రిచ్ కి ఎడమవైపు నుండి. 355 00:22:41,695 --> 00:22:42,779 రియల్ మాడ్రిడ్ దాడి చేస్తోంది. 356 00:22:42,779 --> 00:22:45,449 మొడ్రిచ్ లోనికి వచ్చాడు. వావ్! అద్భుతమైన కదలిక! ఓరి, దేవుడా! 357 00:22:45,949 --> 00:22:49,620 అతను బాల్ ని తిరిగి సంపాదించిన తర్వాత బెర్నాబ్యూ ఎలా స్పందిస్తుందో మీరే చూడండి. 358 00:22:50,454 --> 00:22:54,458 - మొడ్రిచ్! అద్భుతం! - పదా, మొడ్రిచ్! అంతే, సర్! 359 00:22:54,458 --> 00:22:56,293 అది ప్రేమకు మించిన విషయం. 360 00:22:56,293 --> 00:22:59,254 అలాంటి ఫుట్ బాల్ ఆటను ఇంకా నిబద్ధతను చూసినందుకు వాళ్ళు మురిసిపోయారు. 361 00:22:59,254 --> 00:23:00,672 ఆ సంఘటనను వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. 362 00:23:00,672 --> 00:23:03,342 పదవ నంబర్ జర్సీ వేసుకున్న లూకా... 363 00:23:03,342 --> 00:23:05,052 మొడ్రిచ్! 364 00:23:05,677 --> 00:23:10,098 బెర్నాబ్యూలో అందరూ మన పేరు అరుస్తుంటే వచ్చే ఫీలింగ్ భలే ఉంటుంది. 365 00:23:10,098 --> 00:23:12,059 ఒక రియల్ మాడ్రిడ్ మిడ్ ఫీల్డర్ కి 366 00:23:12,059 --> 00:23:16,063 ప్రత్యర్థి జట్టు స్టేడియంలో అందరూ నిలబడి సలాం కొట్టడం 367 00:23:16,063 --> 00:23:18,190 మామూలు విషయం కాదు. 368 00:23:18,190 --> 00:23:20,859 అది చూడడం భలే ఉంది: లూకా మొడ్రిచ్ కి కేవలం 369 00:23:20,859 --> 00:23:24,196 రియల్ మాడ్రిడ్ అభిమానులే కాదు, ఈబర్ అభిమానులు కూడా చప్పట్లు కొడుతున్నారు. 370 00:23:24,821 --> 00:23:27,449 {\an8}ఈ గుసెప్ప మియాజ్జ స్టేడియం 371 00:23:27,449 --> 00:23:29,159 {\an8}లూకా మొడ్రిచ్ కి చప్పట్లు కొడుతోంది. 372 00:23:32,913 --> 00:23:36,208 డిసెంబర్ 3, 2018 373 00:23:36,792 --> 00:23:39,127 "జీవితంలో మంచి విషయాలు సులభంగా రావు." 374 00:23:39,753 --> 00:23:42,297 అది నాకు చాలా ఇష్టమైన వాక్యం. 375 00:23:47,469 --> 00:23:52,015 బాలోన్ డోర్ అవార్డును ఏడాదికి ఒకసారి ప్రపంచంలోనే అతిగొప్ప ఫుట్ బాలర్ కి ఇస్తారు. 376 00:23:53,141 --> 00:23:55,644 అలాంటి దానికి నామినేట్ చేయబడడమే చాలా గొప్ప. 377 00:23:55,644 --> 00:23:58,397 కేవలం కొందరు మాత్రమే అది గెలవగలరు. 378 00:23:59,857 --> 00:24:01,024 చాలా బాగుంది. 379 00:24:01,024 --> 00:24:03,944 వెళ్లి ఎంజాయ్ చేద్దాం. అలాగే గెలవాలని ఆశిద్దాం. 380 00:24:04,695 --> 00:24:11,285 అంతే. ఆ అమూల్యమైన బాల్ ని నా చేతితో పట్టుకోవాలి. 381 00:24:12,411 --> 00:24:14,204 ప్రస్తుతం నేను అదొక్కటే ఆలోచిస్తున్నాను. 382 00:24:27,426 --> 00:24:29,595 {\an8}బాలోన్ డోర్ 2018 383 00:24:31,513 --> 00:24:35,350 {\an8}2018 బాలోన్ డోర్ విజేత: 384 00:24:35,350 --> 00:24:38,270 {\an8}లూకా మొడ్రిచ్! 385 00:24:38,270 --> 00:24:41,190 {\an8}2008 నుండి 2022 వరకు, 386 00:24:41,190 --> 00:24:43,984 {\an8}ప్రపంచ ఫుట్ బాల్ ని కేవలం ఇద్దరు ఆటగాళ్లే ఏలారు, 387 00:24:43,984 --> 00:24:48,989 {\an8}క్రిస్టియానో రోనాల్డో అలాగే లియోనెల్ మెస్సి, వారే అతిగొప్పవారు అనొచ్చు. 388 00:24:48,989 --> 00:24:50,073 {\an8}అలాంటి సమయంలో, 389 00:24:50,073 --> 00:24:54,703 {\an8}కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డును చేజిక్కించుకోగలిగాడు. 390 00:24:54,703 --> 00:24:56,246 {\an8}లూకా మొడ్రిచ్. 391 00:25:20,437 --> 00:25:23,482 పారిస్ సెయింట్-జెర్మైన్ కి వ్యతిరేకంగా సొంతం చేసుకున్న భావోద్వేగపూరితమైన విజయం తర్వాత, 392 00:25:23,482 --> 00:25:25,526 లోస్ బ్లాంకోస్ మంచి ఊపు మీద ఉన్నారు. 393 00:25:26,401 --> 00:25:29,738 కానీ వారికి దగ్గరలోనే ఒక చిరకాల శత్రువు పగతీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది. 394 00:25:29,738 --> 00:25:32,157 20 మార్చ్ 2022 - లాలీగ రియల్ మాడ్రిడ్ - ఎఫ్.సి బార్సెలోనా 395 00:25:34,201 --> 00:25:36,620 సీజన్ లోని రెండవ ఎల్ క్లాసికోలో, 396 00:25:36,620 --> 00:25:41,792 ఎఫ్.సి బార్సెలోనా వారు తమ బద్ధశత్రువులను ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు, 397 00:25:42,376 --> 00:25:46,672 ఈ పాత శత్రువుల మధ్య, మొదటి మ్యాచ్ ని ఓడడం కారణంగా వాళ్ళ ఈగో దెబ్బతింది. 398 00:25:47,673 --> 00:25:50,926 బెర్నాబ్యూలో క్లాసికో మొదలైంది. 399 00:25:50,926 --> 00:25:52,427 బార్సెలోనా ఆట మొదలెట్టింది. 400 00:25:52,427 --> 00:25:56,181 డెంబెలె ఇప్పుడు నాచోతో ఆడుతున్నాడు. బాల్ ని తనకు తానే పాస్ చేసుకున్నాడు. 401 00:25:56,181 --> 00:25:59,726 చాలా వేగంగా వెళ్తున్నాడు. క్రాస్ బాల్ వస్తోంది. బార్సెలోనా స్కోర్ చేసింది. 402 00:25:59,726 --> 00:26:02,479 ఇవాళ కనుపరిచిన ఆటతీరును ఈ క్లబ్ లో ఏమాత్రం ఆమోదించరు. 403 00:26:02,479 --> 00:26:05,065 మొదటి గోల్ తోనే వారు దగ్గర ఉన్న పోస్ట్ నుండి చేధించేశారు. 404 00:26:05,065 --> 00:26:07,860 బహుశా మేము అంతగా దృష్టి నిలపలేదు ఏమో. 405 00:26:07,860 --> 00:26:11,154 రెండవ గోల్ సెట్ ప్లే నుండి వెళ్ళింది, మళ్ళీ మేము అక్కడ ఎవరం లేము. 406 00:26:11,154 --> 00:26:14,783 హాఫ్-టైమ్ అయ్యేసరికి, "బహుశా మనం ఇంకా పుంజుకోగలమేమో" అనుకున్నాం. 407 00:26:14,783 --> 00:26:18,787 అప్పుడు వాళ్ళు మళ్ళీ స్కోర్ చేశారు. తర్వాత మేము ఒక ఫ్రీ-కిక్ ఇచ్చాము, వాళ్ళు మళ్ళీ గోల్ కొట్టారు. 408 00:26:19,580 --> 00:26:23,333 {\an8}లాలీగ - ఆఖరి స్కోర్ రియల్ మాడ్రిడ్ 0-4 ఎఫ్.సి బార్సెలోనా 409 00:26:23,333 --> 00:26:25,043 బెంజెమా జట్టులో లేడు. 410 00:26:25,043 --> 00:26:26,670 {\an8}జేవీ హెర్నాండెజ్ ఎఫ్.సి బార్సెలోనా కోచ్ 411 00:26:26,670 --> 00:26:29,423 {\an8}ఒక జట్టుగా వాళ్ళు చాలా చెత్తగా ఆడారు. అలాగే మేము చాలా బాగా ఆడాం. 412 00:26:29,423 --> 00:26:31,675 నేను ఆటను బాగా ప్లాన్ చేయలేదు. 413 00:26:32,176 --> 00:26:35,095 కొన్నిసార్లు అనుకున్నట్టే జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అనుకున్నట్టు జరగదు. 414 00:26:35,095 --> 00:26:39,224 నేను ఒకసారి పొరబడొచ్చు. కానీ రెండు సార్లు తప్పు చేయడం సాధారణంగా జరగదు. 415 00:26:39,224 --> 00:26:41,560 {\an8}ఆట ముగిసిన తర్వాత కోచ్ సాధారణంగా మాట్లాడరు... 416 00:26:41,560 --> 00:26:42,644 {\an8}2 - డాని కార్వహల్ డిఫెండర్ 417 00:26:42,644 --> 00:26:44,813 {\an8}...ఎందుకంటే సాధారణంగా ఆట ముగిసిన తరవాత ఎమోషనల్ గా ఉంటారు. 418 00:26:44,813 --> 00:26:48,025 కానీ ఆ రోజు ఆయన మాట్లాడారు, ఆయన మాతో... 419 00:26:48,025 --> 00:26:50,903 "రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే మనం ఛాంపియన్స్ లీగ్ అలాగే లాలీగలో గెలవబోతున్నాం" అన్నారు. 420 00:26:50,903 --> 00:26:55,032 నేను అలా అనడానికి కారణం నన్ను నేను ఓదార్చుకోవడానికి అలా అన్నాను, సరేనా? 421 00:27:02,206 --> 00:27:06,084 తమ బద్ధశత్రువు దగ్గర ఎదురైన ఓటమిని మర్చిపోవాలన్న 422 00:27:06,084 --> 00:27:09,046 కోరికతో, జట్టు ఇప్పుడు తమ తర్వాతి పోటీ మీద దృష్టి పెట్టింది. 423 00:27:09,671 --> 00:27:11,965 ఛాంపియన్స్ లీగ్ లోని క్వార్టర్ ఫైనల్, 424 00:27:11,965 --> 00:27:15,260 యూరప్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జట్టు అక్కడ వీరి కోసం ఎదురుచూస్తోంది. 425 00:27:15,260 --> 00:27:16,512 చెల్సీ. 426 00:27:30,817 --> 00:27:32,236 మీరు రియల్ మాడ్రిడ్ తో తలపడేటట్టు అయితే, 427 00:27:32,236 --> 00:27:34,905 ఆ రియల్ మాడ్రిడ్ ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు, 428 00:27:34,905 --> 00:27:37,032 {\an8}అది చెప్పడం కష్టం, రేపు ఆటలోనే తెలుస్తుంది, 429 00:27:37,032 --> 00:27:39,826 {\an8}కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అందరూ చెల్సీ గెలుస్తుంది అనుకుంటున్నారు. 430 00:27:39,826 --> 00:27:42,871 ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ కి సరైన బలం లేరు. 431 00:27:42,871 --> 00:27:47,459 అక్టోబర్ నుండి మేము ఇదే చెప్తున్నాం. శారీరకంగా వారికి ఆ సత్తా లేదు. 432 00:27:47,459 --> 00:27:49,378 మాడ్రిడ్ ఒక ఆట ప్లాన్ తో వస్తోంది. 433 00:27:49,378 --> 00:27:52,714 {\an8}ఆ ఆట ప్లాన్ ఎక్కువ గోల్స్ తేడాతో ఓడిపోవద్దు అని అయ్యుండొచ్చు. 434 00:27:52,714 --> 00:27:53,882 చెల్సీ స్టాంఫోర్డ్ గేట్ 435 00:27:56,426 --> 00:27:58,387 లండన్ యునైటెడ్ కింగ్డమ్ 436 00:27:58,387 --> 00:28:01,306 ఇటీవలి సంవత్సరాలలో, చెల్సీ జట్టు యూరోపియన్ ఫుట్ బాల్ లో 437 00:28:01,306 --> 00:28:02,599 ఒక భయంకరమైన శక్తిగా ఆవిర్భవించింది. 438 00:28:03,350 --> 00:28:07,104 గత సీజన్ లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందు 439 00:28:07,104 --> 00:28:09,565 రియల్ మాడ్రిడ్ ని పోటీ నుండి తొలగించింది ఈ జట్టే. 440 00:28:12,484 --> 00:28:14,736 కాంటే ఉన్నాడు. అతను బాల్ ని పులిసిచ్ కి వదిలాడు. 441 00:28:14,736 --> 00:28:17,406 పులిసిచ్ వాళ్ళను ఎదుర్కొంటున్నాడు. పైకి చూశాడు. 442 00:28:17,406 --> 00:28:18,532 చెల్సీ స్కోర్ చేసింది. 443 00:28:19,366 --> 00:28:22,536 ఆ ఓటమి, అలాగే ఎల్ క్లాసికోలోని ఇటీవలి ఫలితం 444 00:28:22,536 --> 00:28:25,247 మాడ్రిడ్ ఆటగాళ్లను బాగా కృంగదీసింది. 445 00:28:30,586 --> 00:28:33,255 {\an8}నాకు తెలిసి చెల్సీ జట్టు ప్రీమియర్ లీగ్ లోని మేటి జట్ల బలానికి... 446 00:28:33,255 --> 00:28:34,173 {\an8}అలెక్స్ కిర్క్ ల్యాండ్ ఈ.ఎస్.పి.ఎన్ 447 00:28:34,173 --> 00:28:35,549 {\an8}...ప్రతిరూపం అనుకుంటున్నాను. 448 00:28:39,511 --> 00:28:42,222 జట్టులో అందరూ కుర్రోళ్లే, బోలెడన్ని ఆశలతో, విజయం మీద కోరికతో ఉన్నవారే. 449 00:28:42,222 --> 00:28:45,559 కాబట్టి మేము చాలా దూకుడుగా, బలవంతంగా ఆట ఆడాం. 450 00:28:46,310 --> 00:28:49,229 {\an8}ఎందుకంటే ప్రీమియర్ లీగ్ పోటీలలో అలాంటి ఆట విధానం మాకు బాగా అలవాటు... 451 00:28:49,229 --> 00:28:50,647 {\an8}థామస్ టుషేల్ చెల్సీ కోచ్ 2021-22 452 00:28:50,647 --> 00:28:52,649 {\an8}...ఒకరిని ఒకరు తోసుకుంటూ, నేరుగా ఢీకొనే తరహా ఆట. 453 00:28:52,649 --> 00:28:56,820 రూఢిగర్ తన్నుతున్నాడు. బంతి ఎగిరింది, అద్భుతమైన గోల్! 454 00:28:56,820 --> 00:29:00,365 అలాగే చెల్సీ జట్టు ప్రీమియర్ లీగ్ లో అయిదు సార్లు ఛాంపియన్స్. 455 00:29:03,285 --> 00:29:04,161 6 ఏప్రిల్ 2022 456 00:29:04,161 --> 00:29:05,913 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ చెల్సీ - రియల్ మాడ్రిడ్ 457 00:29:05,913 --> 00:29:09,499 స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ కి స్వాగతం, చెల్సీ ఎఫ్.సి స్వస్థలం, 458 00:29:09,499 --> 00:29:13,670 ఇది ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మొదటి ఆట. 459 00:29:18,383 --> 00:29:21,220 ఛాంపియన్స్ లీగ్ లో మొదటి నుండి మాడ్రిడ్ నే అందరూ ఇష్టపడేవారు. 460 00:29:21,220 --> 00:29:24,348 {\an8}కానీ ఇప్పుడు వారు అంత బలమైన పోటీని ఎదుర్కోనుండడంతో ఇప్పుడు జనం... 461 00:29:24,348 --> 00:29:25,432 {\an8}ఇనెస్ సైన్జ్ టీవీ ఆజ్టెక 462 00:29:25,432 --> 00:29:27,017 {\an8}...పెద్దగా వారి మీద ఆశలు పెట్టుకోలేదు. 463 00:29:33,482 --> 00:29:36,527 ఇష్టమైనా లేకున్నా, రియల్ మాడ్రిడ్ మొదటి విజిల్ నుండే 464 00:29:36,527 --> 00:29:38,111 ఆటను చేజిక్కించుకోవాలని చూసింది. 465 00:29:40,447 --> 00:29:41,740 ఆట మొదలైంది. 466 00:29:44,159 --> 00:29:46,870 బెంజెమా నుండి వెల్వెర్డేకి భలే పాస్. 467 00:29:47,621 --> 00:29:49,915 వినిసియస్, బాక్సులో ఎవరు తనకు అడ్డు లేరు. 468 00:29:49,915 --> 00:29:51,834 ఈ బ్రెజిలియన్... లోనికి దూసుకెళ్లాడు. 469 00:29:51,834 --> 00:29:54,461 బార్ కి తగిలింది! మొదటి గోల్ చేజిక్కినట్టే చిక్కి పోయింది. 470 00:29:55,462 --> 00:30:00,050 ఆ తర్వాత, ఆట మొదలైన ఇంకొక 20 నిమిషాలకి, ఒక అద్భుతం జరిగింది. 471 00:30:01,760 --> 00:30:03,428 టోనీ క్రూస్. 472 00:30:03,428 --> 00:30:06,098 బెంజెమా అలాగే వినిసియస్ భలే అందంగా బాల్ ని ఇచ్చి పుచ్చుకున్నారు. 473 00:30:06,098 --> 00:30:08,183 ఈ స్ట్రైకర్ తన పరుగును ఆపడం లేదు. 474 00:30:08,183 --> 00:30:10,435 మొదటి క్రాస్... గోల్ వెళ్ళింది. భలే గోల్. 475 00:30:10,435 --> 00:30:12,437 {\an8}బెంజెమా నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేశాడు. 476 00:30:12,437 --> 00:30:13,856 {\an8}చెల్సీ 0-1 రియల్ మాడ్రిడ్ 21వ నిమిషం 477 00:30:13,856 --> 00:30:15,524 {\an8}మెండిని దాటుకుంటూ ఈ ఫ్రెంచ్ కుర్రాడు తలతో బాల్ ని కొట్టాడు. 478 00:30:15,524 --> 00:30:19,152 {\an8}వెస్ట్ లండన్ లో రియల్ మాడ్రిడ్ మొదటి గోల్ చేసింది. 479 00:30:20,654 --> 00:30:23,866 ఆ గోల్ ఆటగాళ్ల మధ్య పెద్ద వేడుకకు దారి తీసింది. 480 00:30:26,535 --> 00:30:29,121 మొదటిగా, అలాంటి క్లిష్టమైన స్టేడియంలో 481 00:30:29,121 --> 00:30:30,581 ఆ గోల్ చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాలి. 482 00:30:31,707 --> 00:30:32,833 కానీ నేను మామూలుగానే అంత. 483 00:30:34,042 --> 00:30:37,671 నేను ఇంతే. ఆ ఉద్వేగాన్ని నేను పిచ్ మీదే వదిలేస్తాను. 484 00:30:37,671 --> 00:30:42,426 నేను నా జట్టుసభ్యులకు సహాయం చేయాలి అనే అభిరుచిని మాత్రమే వ్యక్తపరచడానికి చూస్తాను. 485 00:30:42,426 --> 00:30:47,806 కరీమ్ లాంటి ఒక తోటి ఆటగాడు గోల్ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది అంతే, 486 00:30:47,806 --> 00:30:49,474 ఎందుకంటే అందుకు అతనికి అర్హత ఉంది. 487 00:30:49,474 --> 00:30:50,642 ఇది నా ఉద్దేశం మాత్రమే. 488 00:30:54,396 --> 00:30:56,565 ప్రారంభంలో ముందంజలో ఉన్నా కూడా, 489 00:30:56,565 --> 00:30:59,985 బెంజెమా లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లకు చెల్సీ లాంటి జట్టుతో ఆడేటప్పుడు 490 00:30:59,985 --> 00:31:03,363 ఒక్క క్షణం కూడా తప్పటడుగు వేయకూడదు అని బాగా తెలుసు. 491 00:31:12,289 --> 00:31:15,250 వెల్వెర్డే, కుడివైపు ఒక్కడే ఉన్నాడు. 492 00:31:15,250 --> 00:31:17,211 మొడ్రిచ్, ఖాళీ ఉంది. 493 00:31:17,711 --> 00:31:19,630 బాల్ మొడ్రిచ్ దగ్గర ఉంది. కర్లింగ్ క్రాస్... 494 00:31:19,630 --> 00:31:21,465 బెంజెమా, రెండు గోల్స్! 495 00:31:21,465 --> 00:31:23,175 {\an8}రియల్ మాడ్రిడ్ తమ లీడ్ ని రెండింతలు చేసుకుంది. 496 00:31:23,175 --> 00:31:26,470 {\an8}చెల్సీ 0-2 రియల్ మాడ్రిడ్ 24వ నిమిషం 497 00:31:31,808 --> 00:31:33,060 కానీ, అందరూ అనుకున్నట్టే, 498 00:31:33,060 --> 00:31:35,270 హోమ్ సైడ్ జట్టును అంత ఈజీగా తీసిపారేయలేం, 499 00:31:35,270 --> 00:31:38,065 వారు స్వల్ప వ్యవధిలోనే తిరిగి ఒకడుగు ముందుకు వేశారు. 500 00:31:39,191 --> 00:31:41,944 జార్జినో లోనికి తన్నాడు. హావర్జ్. 501 00:31:41,944 --> 00:31:45,364 {\an8}దాంతో చెల్సీ స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ లో ఒక గోల్ ని సాధించారు. 502 00:31:45,364 --> 00:31:47,074 {\an8}చెల్సీ 1-2 రియల్ మాడ్రిడ్ 40వ నిమిషం 503 00:31:54,081 --> 00:31:57,167 {\an8}చెల్సీ ఇంతకు ముందు ఎక్కడ వదిలిందో అక్కడి నుండే ఆటను అందుకుంది, 504 00:31:57,167 --> 00:31:59,086 {\an8}రెండవ గోల్ కోసం ముందుకు వెళ్తున్నారు. 505 00:32:00,587 --> 00:32:04,258 కానీ అంతలోనే బెంజెమా తన మ్యాజిక్ ని చూపించాడు. 506 00:32:04,258 --> 00:32:06,969 బెంజెమా వెంటపడుతున్నారు. మెండి బాల్ ని అరకొరగా తన్నాడు. 507 00:32:06,969 --> 00:32:09,555 రూఢిగర్ అక్కడికి వెళ్ళలేడు... బెంజెమా అందుకున్నాడు! 508 00:32:10,597 --> 00:32:12,224 బెంజెమా స్కోర్ చేశాడు! 509 00:32:12,558 --> 00:32:17,271 {\an8}చెల్సీ 1-3 రియల్ మాడ్రిడ్ 46వ నిమిషం 510 00:32:20,065 --> 00:32:22,901 సెకండ్ హాఫ్ లో రియల్ మాడ్రిడ్ త్వరితగతిన స్కోర్ చేసి 511 00:32:22,901 --> 00:32:24,778 రెండు గోల్స్ ఆధిక్యతను తిరిగి తెచ్చుకున్నారు. 512 00:32:25,404 --> 00:32:27,739 స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ లో ఆసక్తికరమైన సన్నివేశం ఇది. 513 00:32:28,615 --> 00:32:31,118 లోస్ బ్లాంకోస్ 3-1తో ఉన్నారు. 514 00:32:32,661 --> 00:32:37,374 నేను మామూలుగా వెనుక నుండి బాల్ ని తన్నను, 515 00:32:37,374 --> 00:32:39,418 ఎందుకంటే అది పెద్దగా పనిచేయదు. 516 00:32:39,418 --> 00:32:44,047 కానీ చివరికి నేను మూడు వేరువేరు రకాల గోల్స్ చేశాను, అన్నీ చాలా ముఖ్యమైనవే. 517 00:32:45,716 --> 00:32:47,885 కానీ 3-1తో ముందంజలో ఉన్నా కూడా, 518 00:32:47,885 --> 00:32:49,261 రియల్ మాడ్రిడ్ ఇంకా వాళ్ళ గోల్ కీపర్, 519 00:32:49,261 --> 00:32:51,930 తిబా కోర్ట్వా జాగ్రత్తగా ఉండక తప్పదు. 520 00:32:52,598 --> 00:32:54,266 హవెర్జ్ షాట్ కి అడ్డుపడ్డారు. 521 00:32:54,266 --> 00:32:55,726 అది ఇప్పుడు అహ్పిలిక్వేటా దగ్గరకు వెళ్ళింది. 522 00:32:57,186 --> 00:32:58,353 అద్భుతంగా అడ్డుకున్నాడు. 523 00:33:00,063 --> 00:33:02,774 ఆ సమయంలో, ఒక్క క్షణం పాటు, 524 00:33:02,774 --> 00:33:04,151 నేను దానిని ఆపలేను ఏమో అనుకున్నాను. 525 00:33:04,151 --> 00:33:05,903 కానీ దానిని అలా ఆపడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్. 526 00:33:05,903 --> 00:33:07,821 {\an8}అలాగే, ఆ సమయంలో, ఆటను త్వరగా ముగించి గెలవాలి అనుకున్నాను. 527 00:33:07,821 --> 00:33:08,906 {\an8}1 - తిబా కోర్ట్వా గోల్ కీపర్ 528 00:33:11,325 --> 00:33:13,202 కార్నర్ కిక్ ను కుడి కాలితో తన్నాడు. 529 00:33:13,202 --> 00:33:15,329 కోర్ట్వా ఆపేసాడు. 530 00:33:15,913 --> 00:33:18,957 అహ్పిలిక్వేటా దానిని లోనికి పంపాడు. లూకాకు వైడ్ వేసాడు. 531 00:33:19,583 --> 00:33:23,128 మౌంట్ దగ్గరకు వెళ్ళింది. అతను బార్ కి పై నుండి తన్నాడు. 532 00:33:27,841 --> 00:33:29,218 {\an8}ఆఖరి విజిల్ కూడా వేసేశారు. 533 00:33:29,218 --> 00:33:30,677 {\an8}చెల్సీ 1-3 రియల్ మాడ్రిడ్ ఆఖరి స్కోర్ 534 00:33:30,677 --> 00:33:32,137 {\an8}స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ లో 3-1తో ఆట ముగిసింది. 535 00:33:32,137 --> 00:33:34,431 {\an8}కరీమ్ బెంజెమా హ్యాట్రిక్ కొట్టడంతో, 536 00:33:34,431 --> 00:33:38,519 రియల్ మాడ్రిడ్ వారు కీలకమైన లీడ్ తో తిరిగి స్పానిష్ రాజధానిలో ఆట ఆడనున్నారు. 537 00:33:44,233 --> 00:33:49,780 మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం? 538 00:33:56,537 --> 00:34:00,040 మీరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? 539 00:34:00,791 --> 00:34:02,125 లేదు. 540 00:34:02,125 --> 00:34:03,627 ప్రస్తుతం అయితే అలా అనిపించడం లేదు. 541 00:34:04,962 --> 00:34:06,630 అలా ఎందుకు అన్నారు? 542 00:34:06,630 --> 00:34:08,005 ఒత్తిడిని తగ్గించుకోవడానికి. 543 00:34:08,005 --> 00:34:09,591 అలా అయితే అందరి దృష్టి నా మీదే ఉంటుంది అని. 544 00:34:09,591 --> 00:34:12,719 నేను ఆ వ్యాఖ్యని మ్యాచ్ అయిన వెంటనే చేశాను. 545 00:34:12,719 --> 00:34:14,263 అలాగే మేము నిరాశతో ఉన్నామనేది నిజమే. 546 00:34:14,263 --> 00:34:17,724 అలాగే, మేము ఆటలో నుండి వైదొలిగాము అని మాలో మేము అస్సలు అనుకోలేదు లెండి. 547 00:34:17,724 --> 00:34:21,728 కరీమ్! కరీమ్! కరీమ్ బెంజెమా! 548 00:34:21,728 --> 00:34:23,397 మనం ఇప్పుడు 549 00:34:23,397 --> 00:34:26,358 ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తితో ఉన్నాం, కరీమ్ బెంజెమా. 550 00:34:26,358 --> 00:34:28,819 ఈ బాల్ మీదే అనుకుంట. 551 00:34:28,819 --> 00:34:30,612 మీరు దీనితో మూడు సార్లు స్కోర్ చేశారు. 552 00:34:30,612 --> 00:34:32,364 - అభినందనలు. - థాంక్స్. 553 00:34:32,364 --> 00:34:34,824 ఛాంపియన్స్ లో మీరు ఇంకొక హ్యాట్రిక్ ఎలా స్కోర్ చేశారు? 554 00:34:34,824 --> 00:34:36,243 నా మీద నమ్మకం ఉంచుకొని. 555 00:34:36,243 --> 00:34:40,246 ఇది ఫుట్ బాల్. ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. 556 00:34:40,246 --> 00:34:42,666 నేను నా మీద గట్టి నమ్మకం పెట్టుకుంటా. నాకు మంచి ఫీలింగ్ ఉంది. 557 00:34:52,842 --> 00:34:58,974 నా ఉద్దేశంలో అయితే మేము ఈ మ్యాచ్ కి నైపుణ్యంలో, అలాగే అంచనాలలోను అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాం. 558 00:34:58,974 --> 00:35:01,810 ఎందుకంటే ఇది చాలా పెద్ద గేమ్. 559 00:35:05,689 --> 00:35:10,068 బెంజెమా లాంటి అద్భుతమైన ఆటగాడికి కూడా తాను ఒక్కడినే ఇది చేయలేనని తెలుసు. 560 00:35:10,986 --> 00:35:13,572 అతని విజయానికి తన జట్టు సభ్యులు చాలా ముఖ్యం. 561 00:35:13,572 --> 00:35:16,116 అలాగే ఇటీవల, ఒక ఆటగాడు మరి ముఖ్యంగా మారాడు. 562 00:35:16,783 --> 00:35:20,162 మేము పిచ్ బయట కూడా అస్తమాను మాట్లాడుకుంటాం. అతను నేను ఏం చేయాలో చెప్తుంటాడు. 563 00:35:20,162 --> 00:35:23,832 నేను ఇక్కడికి వచ్చిన నాట నుండి, అతనే నా బాగోగులు చూసుకున్నాడు. 564 00:35:27,586 --> 00:35:29,796 కరీమ్ బెంజెమా అలాగే వినిసియస్ జూనియర్ 565 00:35:29,796 --> 00:35:33,008 ఆట విషయానికి వస్తే అత్యంత ప్రమాదకరమైన జోడిగా తయారయ్యారు. 566 00:35:34,676 --> 00:35:38,722 వారిద్దరూ పిచ్ బయటా, లోపలా ఏర్పరుచుకున్న బంధం ప్రత్యేకమైంది. 567 00:35:45,312 --> 00:35:47,231 మాతో వీడి ఫోటో తీయండి. 568 00:35:50,359 --> 00:35:53,529 మీరు అలాగే వినిసియస్ అంత బాగా ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? 569 00:35:53,529 --> 00:35:55,197 నాకు మొదటి నుండి తన మీద మంచి ఫీలింగ్ ఉంది. 570 00:35:55,197 --> 00:35:59,743 నేను తనకు ఉన్న సత్తాను చూస్తున్నాను, అలాగే మాకు అతను ఒక అద్భుతమైన ఆటగాడు 571 00:35:59,743 --> 00:36:02,996 కాబట్టి నేను అతనికి సహాయం చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. 572 00:36:06,041 --> 00:36:07,918 వినిసియస్ కి బెంజెమా అంటే చాలా ఇష్టం. 573 00:36:07,918 --> 00:36:11,505 అలాగే బెంజెమా కూడా అతన్ని తన చిన్న తమ్ముడిలా చూసుకుంటుంటాడు. 574 00:36:12,214 --> 00:36:19,054 వాళ్ళ గురించి పెద్దగా తెలీని వారు వాళ్ళ పనితీరు పనిచేయదు అనుకుంటారు. 575 00:36:19,054 --> 00:36:22,599 {\an8}కానీ వాళ్లిద్దరూ జట్టుకు ఉన్న అవసరాన్ని బట్టి సరిగ్గా తమను తాము అలవరచుకోగల ఆటగాళ్లు. 576 00:36:22,599 --> 00:36:24,560 {\an8}రోబర్టో కార్లోస్ రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. లెజెండ్ 577 00:36:24,560 --> 00:36:26,728 {\an8}కారణంగా ఫుట్ బాలర్స్ గా వారు బాగా ఎదిగారు. 578 00:36:27,688 --> 00:36:30,732 మళ్ళీ, వినిసియస్ వస్తున్నాడు. అద్భుతమైన క్రాస్ వేశాడు. 579 00:36:30,732 --> 00:36:33,527 అక్కడ బెంజెమా ఉన్నాడు. ఇప్పుడు రియల్ మాడ్రిడ్ 2-1! 580 00:36:34,027 --> 00:36:38,490 ఫుట్ బాల్ ప్రపంచంలో వాళ్ళది అత్యంత గొప్ప భాగస్వామ్యాలలో ఒకటి, వాళ్ళే బెస్ట్ అని కూడా అనొచ్చు. 581 00:36:38,490 --> 00:36:42,703 బెంజెమా, మంచి పాస్. విని... ఓహ్, భలే గోల్! 582 00:36:42,703 --> 00:36:44,496 అద్భుతమైన ఫినిష్. 583 00:36:44,496 --> 00:36:46,248 వినిసియస్ ఏరియా లోపల ఉన్నాడు. 584 00:36:46,248 --> 00:36:48,458 బాల్ ని కరీమ్ కి పంపించాడు... గోల్! 585 00:36:48,458 --> 00:36:49,918 గోల్, గోల్, గోల్! 586 00:36:55,299 --> 00:36:57,843 చెల్సీతో 2వ మ్యాచ్ కి 48 గంటలు ఉంది 587 00:36:57,843 --> 00:37:02,097 వరుస విజయాలను పోగేసుకోవడంతో, జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. 588 00:37:02,097 --> 00:37:05,184 కానీ ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ లో రెండవ మ్యాచ్ 589 00:37:05,184 --> 00:37:06,685 ఇంకొన్ని రోజుల్లోనే ఉంది, 590 00:37:06,685 --> 00:37:09,354 కాబట్టి వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. 591 00:37:18,655 --> 00:37:20,532 {\an8}ఇంగ్లాండ్ లో ఆడిన మంచి ఆట తర్వాత... 592 00:37:20,532 --> 00:37:21,700 {\an8}15 - ఫెడే వెల్వెర్డే మిడ్ ఫీల్డర్ 593 00:37:21,700 --> 00:37:23,243 {\an8}...అంతా పూర్తి చేసి చక్కబెట్టినట్టు అనిపించింది. 594 00:37:23,243 --> 00:37:27,080 మా డిఫెన్స్ ఇంకా దాడులను చాలా చక్కగా కానిచ్చాము, 595 00:37:27,080 --> 00:37:31,001 చూడడానికి అంతా మా కంట్రోల్ లో ఉన్నట్టే అనిపించింది. 596 00:37:37,716 --> 00:37:42,429 ఆటగాళ్లతో, "మనం గెలుస్తున్నాం అని మర్చిపోండి" అని చెప్పడం అసాధ్యం. 597 00:37:42,429 --> 00:37:44,723 ఎందుకంటే మేము గెలుస్తున్నాం కదా. అదే నిజం. 598 00:37:45,516 --> 00:37:48,060 12 ఏప్రిల్ 2022 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ 599 00:37:48,060 --> 00:37:50,312 రియల్ మాడ్రిడ్ - చెల్సీ క్వార్టర్ ఫైనల్స్, 2వ మ్యాచ్ 600 00:38:03,325 --> 00:38:05,994 శాంటియాగో బెర్నాబ్యూ స్టేడియంకి స్వాగతం. 601 00:38:05,994 --> 00:38:11,416 ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ లోని రెండవ మ్యాచ్ కి స్వాగతం. 602 00:38:11,416 --> 00:38:13,752 రియల్ మాడ్రిడ్ వెర్సెస్ చెల్సీ మ్యాచ్ కి స్వాగతం. 603 00:38:16,171 --> 00:38:20,133 లండన్ లో ఆడిన ఆట తర్వాత రియల్ మాడ్రిడ్ 3-1 ఆధిక్యంతో ఉంది. 604 00:38:21,301 --> 00:38:24,596 ఇప్పుడు మేము వీక్షకులతో నిండిన బెర్నాబ్యూలో ఆడడానికి వెళ్లాం, 605 00:38:24,596 --> 00:38:26,598 అక్కడ మాముందు ఉన్న లక్ష్యం ఒక్కటే... ఎలాగైనా గెలవాలి. 606 00:38:26,598 --> 00:38:29,810 ఆట ఆడడానికి అది అత్యంత కష్టమైన ప్రదేశాలలో ఒకటి 607 00:38:29,810 --> 00:38:31,812 ఎందుకంటే అక్కడ ఉండే ఒత్తిడి మనకు తెలుస్తుంది. 608 00:38:31,812 --> 00:38:34,857 మేము కోల్పోవడానికి ఇంకేం లేదు అన్న మనస్తత్వంతో ఆడాము, 609 00:38:34,857 --> 00:38:35,941 అది మాకు చాలా పనికొచ్చింది. 610 00:38:44,449 --> 00:38:45,909 వెంటనే అక్కడ అందరికీ ఒకటి అర్థమైంది, 611 00:38:45,909 --> 00:38:48,662 చెల్సీ అక్కడికి ఆశలు వదులుకొని రాలేదు అని. 612 00:38:49,746 --> 00:38:51,456 రెండు గోల్స్ చేస్తే ఆట లెవెల్ అవుతుంది. 613 00:38:52,124 --> 00:38:55,085 అలాగే వాళ్ళు కూడా సమయాన్ని ఏమాత్రం వృధా చేయలేదు. 614 00:38:56,128 --> 00:39:00,007 {\an8}చెల్సీ ఏరియాలోనికి వెళ్ళింది! చెల్సీ స్కోర్ చేసింది! 615 00:39:00,007 --> 00:39:03,218 {\an8}చూసుకోండి, ఎందుకంటే చెల్సీ మళ్ళీ నిలద్రొక్కుకుంటోంది. 616 00:39:05,220 --> 00:39:08,682 రియల్ మాడ్రిడ్ వారు "మేము సెమీ-ఫైనల్స్ కి వెళ్లిపోయాం" అనుకున్నారు. 617 00:39:08,682 --> 00:39:11,351 అంతే. గోల్ పోనిచ్చేసారు. వెంటనే "తప్పులు చేయకూడదు రా బాబు" అనుకున్నారు. 618 00:39:11,351 --> 00:39:12,978 రియల్ మాడ్రిడ్ 0-1 చెల్సీ 619 00:39:17,107 --> 00:39:19,568 బాల్స్ కుడి వైపు నుండి ఎగురుకుంటూ వచ్చాయి. 620 00:39:19,568 --> 00:39:20,986 {\an8}చెల్సీ స్కోర్ చేసింది. 621 00:39:20,986 --> 00:39:22,154 {\an8}రూఢిగర్ స్కోర్ చేశాడు. 622 00:39:22,154 --> 00:39:23,697 {\an8}రియల్ మాడ్రిడ్ 0-2 చెల్సీ 51వ నిమిషం 623 00:39:23,697 --> 00:39:25,908 వాళ్ళు ఇంకొక గోల్ వదిలారు: "మనం తడబడుతున్నాం" అనుకున్నారు. 624 00:39:27,284 --> 00:39:30,120 అప్పుడే ఊహించని పరిణామం ఎదురైంది. 625 00:39:31,163 --> 00:39:33,665 కొవచిచ్, ఏరియా లోపల ఖాళీ కోసం చూస్తున్నాడు, 626 00:39:33,665 --> 00:39:36,043 వెర్నర్ లోనికి వెళ్ళాడు. క్రాస్ కోసం చూస్తున్నాడు. 627 00:39:36,043 --> 00:39:37,711 {\an8}మళ్ళీ లోనికి తోశాడు. 628 00:39:37,711 --> 00:39:41,465 {\an8}- నేను ఇది నమ్మలేకపోతున్నా. - చెల్సీ స్కోర్ చేసింది. 629 00:39:41,465 --> 00:39:42,716 {\an8}రియల్ మాడ్రిడ్ 0-3 చెల్సీ 75వ నిమిషం 630 00:39:43,842 --> 00:39:48,430 చెల్సీ చేసిన మూడవ గోల్ వల్ల రియల్ మాడ్రిడ్ తమ సీజన్ ని కాపాడుకోవడానికి ఇంకొక 15 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 631 00:39:49,806 --> 00:39:53,810 తమ సొంత అభిమానుల ముందే సీజన్ నుండి తొలగిపోయిన అవమానం ఎదురుకాకుండా ఉండాలి అంటే 632 00:39:53,810 --> 00:39:55,395 క్లబ్ వెంటనే స్కోర్ చేయాలి. 633 00:39:57,814 --> 00:40:01,818 మూడు గోల్స్ ఇచ్చిన తర్వాత కూడా పరిగెత్తడం అంటే కష్టమే. 634 00:40:02,486 --> 00:40:04,404 నాకు అస్సలు ఓపిక లేదు. 635 00:40:04,404 --> 00:40:08,158 ఒక్క క్షణం అందరిలో సందేహం పుట్టింది, అంటే: "ఏం జరుగుతోంది? 636 00:40:08,158 --> 00:40:10,327 ఛాంపియన్స్ కప్ చేజారిపోతోంది" అనిపించింది. 637 00:40:13,956 --> 00:40:16,625 అప్పుడు మేము ఒకరిని ఒకరం చూసుకున్నాం, 638 00:40:16,625 --> 00:40:22,923 చూడగానే ఆటగాళ్లు అందరి కళ్ళలో మనం మ్యాచ్ దిశను తిప్పి గెలవగలం అన్న ధైర్యం 639 00:40:22,923 --> 00:40:24,132 కనిపించింది. 640 00:40:25,092 --> 00:40:26,593 అదును కోసం వెతుకుతుండగా, 641 00:40:26,593 --> 00:40:29,471 జట్టుకి అవసరమైన ప్రోత్సాహం అందించడానికి ఆంచెలొట్టి జట్టులో తాను ఎంతగానో 642 00:40:29,471 --> 00:40:32,140 నమ్మే అనుభవజ్ఞుడైన ఒక ఆటగాడి సహాయం కోరాడు. 643 00:40:33,892 --> 00:40:36,478 {\an8}రోడ్రిగో అలాగే నేను చేరాము. 644 00:40:36,478 --> 00:40:40,941 {\an8}అలాగే, మేము పిచ్ మీదకు రావడానికి ముందే వాడితో ఇలా అన్నా: "నువ్వు కచ్చితంగా స్కోర్ చేస్తావు" అని. 645 00:40:40,941 --> 00:40:43,861 {\an8}వాడు స్కోర్ చేస్తాడో లేదో నాకు తెలీదు, కానీ మనస్ఫూర్తిగా అన్నాను. 646 00:40:43,861 --> 00:40:46,363 "నువ్వు కచ్చితంగా స్కోర్ చేస్తావు. రిలాక్స్ అవ్వు, అది జరుగుతుంది." 647 00:40:46,363 --> 00:40:47,990 కానీ నా మనసులో మాత్రం, 648 00:40:47,990 --> 00:40:50,993 "ఏమవుతుందో చూద్దాం, ఇది చాలా కష్టం" అనుకున్నాను. 649 00:40:52,244 --> 00:40:54,705 వాడు తనని తాను నమ్ముకున్నాడో లేదో తెలీదు, 650 00:40:54,705 --> 00:40:58,584 కానీ మార్సెలో అన్నమాట ఒక ప్రవచనంలా పనిచేసింది. 651 00:40:58,584 --> 00:41:01,295 లూకా మొడ్రిచ్ అందించిన కొంచెం సహాయంతో. 652 00:41:01,295 --> 00:41:03,630 బాల్ ని విడిపించడానికి ప్రయత్నించిన 653 00:41:03,630 --> 00:41:05,883 కాంటే సహాయంతో చెల్సీ తిరిగి బాల్ ని తీసుకుంది. 654 00:41:05,883 --> 00:41:08,969 అలాబ భలే బ్లాక్ చేశాడు. బాల్ మార్సెలో దగ్గర ఉంది. దానిని మొడ్రిచ్ కి పంపించాడు. 655 00:41:08,969 --> 00:41:11,680 మొడ్రిచ్ నుండి ఒక క్రాస్. రోడ్రిగో బ్యాక్ పోస్ట్ దగ్గర ఉన్నాడు! 656 00:41:11,680 --> 00:41:13,265 గోల్! 657 00:41:13,599 --> 00:41:17,436 {\an8}రియల్ మాడ్రిడ్ 1-3 చెల్సీ 80వ నిమిషం - ఏజిజి 4-4 658 00:41:17,436 --> 00:41:20,564 {\an8}- పదండి! సూపర్! - గోల్! 659 00:41:20,564 --> 00:41:23,525 రోడ్రిగో స్కోర్ చేశాడు! 660 00:41:23,525 --> 00:41:26,945 మాడ్రిడ్ టై ని లెవెల్ చేశారు! 661 00:41:26,945 --> 00:41:32,034 మొడ్రిచ్ నుండి రోడ్రిగోకి వెళ్ళింది! 662 00:41:32,826 --> 00:41:34,870 {\an8}అసిస్ట్ లకు ఒక హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఉంటే... 663 00:41:34,870 --> 00:41:36,205 {\an8}సెమ్రా హంటర్ ఐటివి లాలీగ ప్రెజెంటర్ 664 00:41:36,205 --> 00:41:38,165 {\an8}...కచ్చితంగా ఆ గోల్ అందులో ఉంటుంది. 665 00:41:40,876 --> 00:41:42,669 అది నేను చూసిన అతిగొప్ప పాస్ లలో ఒకటి. 666 00:41:42,669 --> 00:41:45,756 నేను అతిగా చెప్పాలని అనుకోవడం లేదు కానీ ఆ బంతి అతని కాలి కింద అతుక్కున్నట్టు కనిపించింది. 667 00:41:45,756 --> 00:41:48,175 ఆ బాల్ ని అలా మాత్రమే తాకి స్కోర్ చేయగలడు. 668 00:41:48,175 --> 00:41:52,304 అలా చేయడం అసలు ఎవరికైనా అసాధ్యం అయ్యుండాలి. 669 00:41:52,304 --> 00:41:54,973 రోడ్రిగో స్కోర్ చేసి ఉండకపోతే ఎవరూ ఆ పాస్ గురించి మాట్లాడేవారు కాదు. 670 00:41:54,973 --> 00:41:56,934 అది చాలా కష్టమైన హిట్. 671 00:41:56,934 --> 00:42:01,522 కానీ దేవుని దయవల్ల స్కోర్ చేసాం. వాడిని చూసి నాకు చాలా సంతోషం వేసింది. 672 00:42:01,522 --> 00:42:03,106 గోల్ వేసాడు... 673 00:42:03,106 --> 00:42:05,234 రోడ్రిగో! 674 00:42:05,234 --> 00:42:08,570 కొన్ని రోజుల క్రితం ట్రైనింగ్ లో అతను నాతో ఇలా అన్నాడు: 675 00:42:08,570 --> 00:42:10,822 "బాల్ ని తీసుకొని, ఖాళీల కోసం వెతుకు" అని. 676 00:42:10,822 --> 00:42:14,201 {\an8}నేను కూడా అదే చేశా, దాంతో స్కోర్ చేయగలిగా. 677 00:42:14,201 --> 00:42:15,869 {\an8}21 - రోడ్రిగో గోస్ ఫార్వార్డ్ 678 00:42:15,869 --> 00:42:18,247 వాడు: "నువ్వు నేను స్కోర్ చేయగలను అన్నప్పుడు నిజంగానే అన్నావా?" అన్నాడు. 679 00:42:18,247 --> 00:42:22,459 అందుకు నేను "మనకు నిరాశ రాకూడదని అలా చెప్పా" అన్నాను. 680 00:42:25,587 --> 00:42:30,300 {\an8}ఎక్స్ట్రా టైమ్ కి వెళ్తున్నాం. బెర్నాబ్యూలో స్కోర్ 1-3. 681 00:42:33,053 --> 00:42:34,805 మొత్తం 90 నిముషాలు గడిచేసరికి, 682 00:42:34,805 --> 00:42:37,850 రియల్ మాడ్రిడ్ ఇంకా చెల్సీల సమిష్టి స్కోర్లు టై అయ్యాయి, 683 00:42:37,850 --> 00:42:40,310 కారణంగా మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్ కి వెళ్ళింది. 684 00:42:41,812 --> 00:42:46,817 ఇరు జట్లలో ఎవరు స్కోర్ చేసినా ఎవరు తర్వాతి రౌండ్ కి వెళ్తారనేది ఖరారు అవుతుంది. 685 00:42:49,945 --> 00:42:55,075 ఓహ్, రియల్ మాడ్రిడ్ నువ్వు గెలిస్తే చూడాలని ఉంది 686 00:42:59,204 --> 00:43:03,125 {\an8}ఎక్ట్రా టైమ్ లో మొదటి హాఫ్ లో రియల్ మాడ్రిడ్ ఆటను మొదలెడుతుంది. 687 00:43:04,459 --> 00:43:10,090 ఆట మొదలైంది, మార్సెలో ఇంకా అలాబ ఆటను నడిపిస్తున్నారు. 688 00:43:10,090 --> 00:43:14,136 రియల్ మాడ్రిడ్ గట్టిగా ప్రయత్నిస్తే, మేము గెలుస్తాం అనుకుంటున్నాను. 689 00:43:14,136 --> 00:43:18,056 - జేమ్స్ నుండి థియాగో సిల్వాకి. - పదా కామావింగా. 690 00:43:18,056 --> 00:43:20,142 కామావింగా అడ్డుకున్నాడు. 691 00:43:20,142 --> 00:43:22,394 వినిసియస్ లోనికి వెళ్ళాడు. 692 00:43:22,394 --> 00:43:25,272 వినిసియస్ ఏరియా లోనికి వెళ్ళాడు. 693 00:43:33,197 --> 00:43:36,700 {\an8}గోల్! 694 00:43:36,700 --> 00:43:38,619 {\an8}రియల్ మాడ్రిడ్ 2-3 చెల్సీ 96వ నిముషం - ఏజిజి 5-4 695 00:43:38,619 --> 00:43:41,288 గోల్, గోల్, గోల్! 696 00:43:41,288 --> 00:43:45,000 గోల్! 697 00:43:45,834 --> 00:43:48,378 గోల్ వేశాడు కరీమ్... 698 00:43:48,378 --> 00:43:51,048 బెంజెమా! 699 00:43:55,052 --> 00:43:56,803 మేము ఆ కదలికను అస్తమాను ప్రాక్టీసు చేస్తుంటాం. 700 00:43:56,803 --> 00:43:58,764 నేను గోల్ లైన్ దగ్గరకు వెళ్లి క్రాస్ చేస్తాను. 701 00:43:58,764 --> 00:44:02,351 కానీ ఈ సారి పరిస్థితి వేరు, సహజంగా నేను కిందకు ఉండగా క్రాస్ చేస్తాను, 702 00:44:02,351 --> 00:44:04,102 {\an8}ఎందుకంటే వాళ్ళ వైపు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. 703 00:44:04,102 --> 00:44:05,229 {\an8}20 - వినిసియస్ జూనియర్ ఫార్వార్డ్ 704 00:44:05,229 --> 00:44:09,399 నేను ఏం చేయాలో కరీమ్ నాకు చెప్పాడు, అది పనిచేసింది. 705 00:44:15,948 --> 00:44:19,618 ఆ అభిమానుల నుండి, అలాగే ఆటగాళ్ల నుండి అంత ప్రోత్సాహం అందుతుండగా, 706 00:44:19,618 --> 00:44:22,120 సానుకూల దృక్పధంతో ఉంటే, ఇలాంటివి జరుగుతుంటాయి. 707 00:44:22,120 --> 00:44:23,705 బెర్నాబ్యూలో నాకు నచ్చేది అదే. 708 00:44:24,289 --> 00:44:25,791 ముప్పై సెకన్లు ఉన్నాయి! 709 00:44:26,625 --> 00:44:28,544 ఇక ఈ ఆట ముగియాల్సిందే. 710 00:44:28,544 --> 00:44:30,921 {\an8}ముగిసింది! 711 00:44:30,921 --> 00:44:32,089 {\an8}అంతే! 712 00:44:32,089 --> 00:44:33,882 {\an8}రియల్ మాడ్రిడ్ 2-3 చెల్సీ ఆఖరి స్కోర్ 713 00:44:33,882 --> 00:44:35,092 {\an8}ఆట ముగిసింది! 714 00:44:35,676 --> 00:44:38,971 {\an8}రియల్ మాడ్రిడ్ సెమీ-ఫైనల్స్ కి వెళ్తున్నారు! 715 00:44:38,971 --> 00:44:41,640 మేము మునుపెన్నడూ లేనంతగా ఇబ్బంది పడ్డాము. 716 00:44:41,640 --> 00:44:45,894 వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్లి తిరిగి లేచారు, రియల్ మాడ్రిడ్ అంటే ఇంతే! 717 00:44:45,894 --> 00:44:48,188 ఎన్నటికీ లొంగిపోరు! 718 00:44:49,189 --> 00:44:52,359 బెర్నాబ్యూ అంతా కూడా ఒక్కటై రియల్ మాడ్రిడ్ సెమీ-ఫైనల్ కి వెళ్లడాన్ని 719 00:44:52,359 --> 00:44:54,444 వేడుక చేసుకుంటోంది. 720 00:44:57,030 --> 00:44:59,533 కానీ గెలుపు కూడా శరీరం మీద ప్రభావం చూపుతుంది. 721 00:45:24,600 --> 00:45:26,226 పని అయిపోయింది. 722 00:45:26,894 --> 00:45:28,103 నా పని అయిపోయింది. 723 00:45:28,729 --> 00:45:30,230 అద్భుతం. 724 00:45:35,235 --> 00:45:36,570 అద్భుతం. 725 00:45:39,489 --> 00:45:40,574 నేను గనుక ఇవాళ చావకపోతే... 726 00:45:42,242 --> 00:45:43,535 నాకు చావే లేనట్టు. 727 00:45:45,162 --> 00:45:48,707 కానీ భలే వాతావరణం కదా? 728 00:45:48,707 --> 00:45:50,083 మీ అందరికీ థాంక్స్. 729 00:46:00,093 --> 00:46:02,721 మేము కష్టపడేకొద్దీ... 730 00:46:05,057 --> 00:46:06,558 నేను అంతగా సంతోషిస్తాను. 731 00:46:16,151 --> 00:46:17,194 పదండి! 732 00:46:17,194 --> 00:46:19,530 నీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన గోలా అది? 733 00:46:19,530 --> 00:46:23,784 నాకు తెలిసి, అవును. అది మాకు అవసరమైన బలాన్ని ఇచ్చింది. 734 00:46:23,784 --> 00:46:25,786 మేము కొంచెం ఇరకాటంలో ****. 735 00:46:25,786 --> 00:46:29,373 కాబట్టి, అవును అంటాను, అవును. 736 00:46:29,373 --> 00:46:31,208 నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన గోల్. 737 00:46:32,751 --> 00:46:35,587 లూకా మొడ్రిచ్ అలాగే రోడ్రిగో మధ్య ఉన్న బంధం 738 00:46:35,587 --> 00:46:37,214 తండ్రి కొడుకుల బంధం లాంటిది. 739 00:46:38,382 --> 00:46:40,968 వాడితో నాకు ప్రత్యేకమైన బంధం ఉంది. 740 00:46:40,968 --> 00:46:43,929 వాడు చాలా గొప్ప కుర్రోడు. 741 00:46:43,929 --> 00:46:47,140 మర్యాదస్తుడు, నిరంతరం మెరుగవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. 742 00:46:47,975 --> 00:46:50,769 ఈ అనుభవజ్ఞుడైన క్రొయెషియన్ ఆ యువ బ్రెజిలియన్ ని 743 00:46:50,769 --> 00:46:52,354 తన అండలో పెట్టుకున్నాడు. 744 00:46:52,354 --> 00:46:55,232 లూకా మొడ్రిచ్ గురించి మాట్లాడడం నాకు ఎప్పుడైనా సరే చాలా స్పెషల్. 745 00:46:55,232 --> 00:46:59,111 అతను నాకు తండ్రి లాంటి వాడు అని మేము అస్తమాను జోక్ చేస్తుంటాం. 746 00:46:59,111 --> 00:47:01,530 అంతేగాక మేము ఒకరిని ఒకరం చాలా బాగా అర్థం చేసుకుంటాం కూడా. 747 00:47:01,530 --> 00:47:05,576 రోడ్రిగో సరదాగా మొడ్రిచ్ ని "నాన్నా" అని పిలుస్తుంటాడు. 748 00:47:05,576 --> 00:47:10,914 ఎందుకంటే నిజానికి మొడ్రిచ్ కూడా రోడ్రిగో వాళ్ళ తండ్రి వయస్సు వాడే. 749 00:47:10,914 --> 00:47:13,834 ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య అంతపెద్ద వయసు తేడా ఉంది. 750 00:47:17,671 --> 00:47:21,550 ఎప్పటికైనా, వీళ్ళ తరం వెళ్లిపోక తప్పదు. 751 00:47:21,550 --> 00:47:27,389 వినిసియస్, వెల్వెర్డే, కామావింగా, రోడ్రిగో లాంటి యువ ఆటగాళ్లు పైకి వస్తున్నారు. 752 00:47:27,389 --> 00:47:30,475 వాళ్ళే ఈ క్లబ్ వర్తమాన, భవిష్యత్తులకు ప్రతినిధులు. 753 00:47:34,897 --> 00:47:37,774 {\an8}రియల్ మాడ్రిడ్ వారి ఫార్ములా ఏంటంటే అద్భుతమైన ఆటగాళ్ల మిశ్రమం కలిగి ఉండడమే... 754 00:47:37,774 --> 00:47:39,860 {\an8}ఫ్లోరెంటినో పెరెజ్ రియల్ మాడ్రిడ్ సీ.ఎఫ్. ప్రెసిడెంట్ 755 00:47:39,860 --> 00:47:41,528 {\an8}...యువ ఆటగాళ్లు, అనుభవం ఉన్న ఆటగాళ్లు. 756 00:47:41,528 --> 00:47:44,823 ఈ ఏర్పాటు అంతా మేము "మాడ్రిడిజం" అని పిలుచుకునే ఫీలింగ్ కిందకి వస్తుంది. 757 00:47:46,325 --> 00:47:50,996 కొత్త ఆటగాళ్లకు సహాయం చేయాలని మాకు ఉంటుంది. 758 00:47:50,996 --> 00:47:52,873 వాళ్ళు కూడా చెప్పినట్టు వింటారు. 759 00:47:52,873 --> 00:47:55,375 నేర్చుకోవాలి అన్న తృష్ణ వాళ్లకు ఉంది, అది చాలా ముఖ్యం. 760 00:47:56,210 --> 00:47:58,879 వాళ్ళు వయసులో చిన్నవారే కానీ అనుభవంలో కాదు... 761 00:47:59,630 --> 00:48:01,173 అని నేను అస్తమాను అంటుంటాను. 762 00:48:01,173 --> 00:48:05,135 అలాగే అనుభవం ఉన్నవారు, యువకులు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. 763 00:48:06,261 --> 00:48:08,472 - నాకు గనుక వీడికి ఉన్న గుణాలు ఉంటే... - వద్దు, ఆపేయ్. 764 00:48:10,933 --> 00:48:13,685 నేను అనుభవం ఉన్నవారు కూడా మేము ఎలా చేసామో అలాగే చేస్తున్నారు. 765 00:48:14,186 --> 00:48:17,397 కొత్తగా వచ్చే వారిని ఆహ్వానిస్తూ: "ఇది మీ ఇల్లే అనుకోండి" అంటున్నారు. 766 00:48:17,397 --> 00:48:19,900 అదే ఈ క్లబ్ లో ఉన్న గొప్పతనం. 767 00:48:19,900 --> 00:48:22,778 అందరూ ఎప్పటికైనా వదిలి వెళ్లాల్సిందే, అలాగే కొత్త ఆటగాళ్లు వస్తారు. 768 00:48:22,778 --> 00:48:23,946 {\an8}రాఉల్ గొంజాలెజ్ రియల్ మాడ్రిడ్ లెజెండ్ 769 00:48:23,946 --> 00:48:26,156 {\an8}వాళ్ళు కూడా అంతే బాగా ఆడగలవారు, అలా జట్టుకు సమతుల్యత ఉంటుంది. 770 00:48:26,156 --> 00:48:29,451 - పదండి కుర్రాళ్ళూ, రండి! - ఒకటి, రెండు, మూడు... హలా మాడ్రిడ్! 771 00:48:30,619 --> 00:48:33,497 లాకర్ రూమ్ లో ఉన్న అదే ఉత్సాహాన్ని వారు పిచ్ మీదకు తీసుకెళతారు. 772 00:48:33,497 --> 00:48:36,375 అలాగే పిచ్ మీద నుండి అది అభిమానులకు సోకుతుంది. 773 00:48:38,502 --> 00:48:42,756 వాళ్లకు మేము ఎదుర్కొన్న వాటిని నిరంతరం నేర్పడానికి చూస్తుంటాం. 774 00:48:42,756 --> 00:48:44,466 మంచివి అలాగే చెడ్డవి కూడా. 775 00:48:44,466 --> 00:48:47,177 అలా అయితే వాళ్ళు అవే చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. 776 00:48:47,177 --> 00:48:50,597 ఏ ఆటగాడు కూడా, నేను తోపును అనుకోడు, 777 00:48:50,597 --> 00:48:52,975 {\an8}ఎదుటివారికంటే ఎక్కువ లేదా తక్కువ ఈగో చూపడు. 778 00:48:52,975 --> 00:48:54,268 {\an8}8 - టోనీ క్రూస్ మిడ్ ఫీల్డర్ 779 00:48:54,268 --> 00:48:57,354 {\an8}కారణంగా అందరూ ఒక్కటిగా ఉంటూ, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు ఉండకపోవడం వల్ల 780 00:48:57,354 --> 00:48:58,981 ఒక అద్భుతమైన జట్టు ఏర్పడింది అని నా ఉద్దేశం. 781 00:48:59,565 --> 00:49:01,191 నేను కాసెమిరోతో మాట్లాడిన ప్రతీసారి, ఇలా అంటా, 782 00:49:01,191 --> 00:49:03,777 "హేయ్, మనం భలే ఆడి వచ్చాము కదా?" 783 00:49:19,168 --> 00:49:22,254 లాలీగ 1 రియల్ మాడ్రిడ్ - జిపి 31 - పాయింట్స్ 72 784 00:49:22,254 --> 00:49:24,173 లాలీగలో గెలవాల్సిన ఒక యుద్ధంగా, 785 00:49:24,173 --> 00:49:29,011 రియల్ మాడ్రిడ్ వారు ప్రాంతీయ సీజన్ లో అప్పటివరకు ఎదుర్కొనని అత్యంత బలమైన పోటీదారుతో పోరాడాల్సి వచ్చింది. 786 00:49:29,011 --> 00:49:32,306 వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్న సేవిల్లాతో ఆడటానికి దక్షిణానికి బయలుదేరారు, 787 00:49:32,306 --> 00:49:35,893 ప్రత్యర్థి జట్టు తమ సొంత గడ్డపై నేటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడింది లేదు. 788 00:49:36,727 --> 00:49:40,063 మ్యాచ్ డే 32కి స్వాగతం. 789 00:49:40,063 --> 00:49:42,024 సేవిల్లా వెర్సస్ రియల్ మాడ్రిడ్. 790 00:49:42,024 --> 00:49:47,237 లీడర్స్ తో పోల్చితే సేవిల్లా మూడవ స్థానంలో ఉంది. 791 00:49:52,743 --> 00:49:55,412 {\an8}ఆట మొదలుకావడానికి ముందే మాకు తెలుసు, అక్కడ గనుక గెలిస్తే... 792 00:49:55,412 --> 00:49:57,289 {\an8}6 - నాచో ఫెర్నాండేజ్ డిఫెండర్ 793 00:49:57,289 --> 00:50:00,417 {\an8}...బలమైన ప్రత్యర్థిని తోసేసి, టైటిల్ కి ఒక అడుగు దగ్గర కాగలము అని. 794 00:50:03,921 --> 00:50:07,341 కానీ కీలకమైన లాలీగ మ్యాచ్ లు, అలాగే ఛాంపియన్స్ లీగ్ లోని 795 00:50:07,341 --> 00:50:10,302 క్లిష్టమైన పోటీని ఎదుర్కొంటూ వరుస మ్యాచ్లు ఆడాలి అంటే, 796 00:50:10,302 --> 00:50:13,180 శారీరకంగా అలాగే మానసికంగా చాలా అలసిపోవడం సహజమే. 797 00:50:15,098 --> 00:50:17,226 {\an8}రాకిటిచ్ తన్నాడు... గోల్. 798 00:50:17,226 --> 00:50:19,728 {\an8}సేవిల్లా 1-0 రియల్ మాడ్రిడ్ 21వ నిమిషం 799 00:50:21,480 --> 00:50:24,399 సేవిల్లా వారిని తమ సొంత స్టేడియంలో ఓడించడం అంటే చాలా కష్టం. 800 00:50:24,399 --> 00:50:28,111 వాళ్ళు చాలా దగ్గరగా ఉంటూ, ప్రత్యర్థిపై బలమైన ఒత్తిడి పెడతారు. 801 00:50:30,489 --> 00:50:32,157 ఆ బాల్ ని చూసుకోండి! 802 00:50:32,157 --> 00:50:33,825 ఇది రెండవ గోల్ కావచ్చు. ఇది రెండవ గోల్. 803 00:50:34,284 --> 00:50:38,080 {\an8}సేవిల్లా 2-0 రియల్ మాడ్రిడ్ 25వ నిమిషం 804 00:50:38,080 --> 00:50:41,208 {\an8}కోచ్ మాతో సర్వం ఒడ్డి పోరాడమన్నారు. 805 00:50:41,208 --> 00:50:42,709 "దూకుడుగా ఆడండి. 806 00:50:42,709 --> 00:50:45,420 మొదటి హాఫ్ కన్నా దారుణంగా ఎలాగు ఆడలేరు. 807 00:50:45,420 --> 00:50:49,091 మనకు ఆ టైటిల్ కావాలి అంటే, ఎలాగైనా గెలవడానికి ప్రయత్నించాల్సిందే" అన్నారు. 808 00:50:49,800 --> 00:50:52,553 {\an8}కార్లో ఆంచెలొట్టి ఈ ఆటగాళ్ల విషయంలో ఏదైనా విషయం గురించి 809 00:50:52,553 --> 00:50:54,054 {\an8}నిశ్చితంగా ఉండొచ్చు అంటే 810 00:50:54,054 --> 00:50:56,181 అది వారి పట్టువదలని తత్వమే. 811 00:50:57,933 --> 00:51:01,311 ఆ ఆటలోనే రెండవ హాఫ్ నిజంగా చాలా చాలా ఆసక్తికరమైంది. 812 00:51:01,311 --> 00:51:05,440 ఒక గోల్ పడే వరకు ఆట కొనసాగుతూనే, ఆటగాళ్లు ఆడుతూ పరిగెత్తుతూనే ఉన్నారు. 813 00:51:05,440 --> 00:51:06,608 మొడ్రిచ్ డిఫెన్స్ ని దాటేశాడు. 814 00:51:06,608 --> 00:51:09,444 కరీమ్! బాక్సు లోపల ఉన్నాడు! 815 00:51:11,488 --> 00:51:13,907 వినిసియస్ ఏరియాలో ఉన్నాడు. బాల్ మళ్ళీ కార్వహల్ కి వెళ్ళింది. 816 00:51:13,907 --> 00:51:18,036 {\an8}కార్వహల్ దానిని బాక్సులోకి పంపాడు. గోల్, గోల్, గోల్! 817 00:51:18,036 --> 00:51:20,080 {\an8}రోడ్రిగో. ఈ కుర్రాడు అద్భుతమైనవాడు. 818 00:51:21,206 --> 00:51:24,251 రెండవ హాఫ్ లో పడ్డ మొదటి గోల్ తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. 819 00:51:24,251 --> 00:51:27,671 ఇక అక్కడి నుండి, మేము చాలా అవకాశాలను ఏర్పరచుకున్నాం. 820 00:51:27,671 --> 00:51:31,008 రోడ్రిగో. రోడ్రిగో అతన్ని దాటుకొని వెళ్ళాడు. 821 00:51:31,008 --> 00:51:33,468 బెంజెమాకి ఖాళీ ఉంది. 822 00:51:33,468 --> 00:51:35,554 వైడ్ పడింది! 823 00:51:37,347 --> 00:51:40,058 బాల్ లోనికి వస్తోంది. 824 00:51:40,058 --> 00:51:41,143 8 నిముషాలు మిగిలి ఉన్నాయి 825 00:51:41,143 --> 00:51:43,604 సేవిల్లా డిఫెన్స్ వారు అడ్డుపడ్డారు. కానీ బాల్ ని కార్వహల్ తీసుకున్నాడు. 826 00:51:43,604 --> 00:51:45,772 కార్వహల్ బాల్ ని లోనికి పంపాడు. 827 00:51:45,772 --> 00:51:47,316 కార్వహల్... గోల్! 828 00:51:47,316 --> 00:51:48,859 {\an8}సేవిల్లా 2-2 రియల్ మాడ్రిడ్ 82వ నిమిషం 829 00:51:48,859 --> 00:51:52,279 {\an8}గోల్, గోల్, గోల్! 830 00:51:52,279 --> 00:51:55,365 రియల్ మాడ్రిడ్ వారు ఆ సీజన్ లో 831 00:51:55,365 --> 00:51:57,034 పొందిన ఆత్మవిశ్వాసం 832 00:51:57,034 --> 00:51:59,536 విజయం ఎప్పుడైనా మన ముంగిట ఉంది అన్నట్టు చేసింది. 833 00:52:00,871 --> 00:52:03,874 కానీ కేవలం ఇంకొన్ని సెకన్లే ఉండడంతో, సమయం మించిపోతుంది. 834 00:52:03,874 --> 00:52:04,875 అదనపు సమయం 835 00:52:04,875 --> 00:52:06,293 వాళ్లకు కూడా. 836 00:52:07,044 --> 00:52:09,546 కరీమ్ స్టార్ కావడానికి చూస్తున్నాడు. 837 00:52:09,546 --> 00:52:12,132 వినిసియస్ వచ్చాడు చూడండి. మడమతో బాల్ ని రోడ్రిగోకి పంపాడు. 838 00:52:12,132 --> 00:52:14,134 రోడ్రిగో దానిని గోల్ లైన్ కి తీసుకెళ్లాడు. 839 00:52:14,134 --> 00:52:16,220 దానిని మళ్ళీ కరీమ్ కి పంపాడు. కరీమ్, కరీమ్... 840 00:52:16,220 --> 00:52:17,846 {\an8}గోల్! 841 00:52:17,846 --> 00:52:19,890 {\an8}సేవిల్లా 2-3 రియల్ మాడ్రిడ్ ఆఖరి స్కోర్ 842 00:52:19,890 --> 00:52:22,726 {\an8}ఇది రియల్ మాడ్రిడ్ అంటే. అవును, సర్! 843 00:52:22,726 --> 00:52:25,354 గోల్! 844 00:52:25,354 --> 00:52:28,440 కరీమ్ స్కోర్ చేసాడు! 845 00:52:28,440 --> 00:52:31,360 రియల్ మాడ్రిడ్ స్కోర్ చేసింది! 846 00:52:32,694 --> 00:52:35,322 మాడ్రిడ్ వారు ఆ గోల్ కి చేసుకున్న వేడుకను చూస్తే 847 00:52:35,322 --> 00:52:39,618 వాళ్ళు తాము లాలీగలో గెలిచామని గ్రహించారు అన్నట్టు ఉంటుంది. 848 00:52:47,835 --> 00:52:53,465 అది లెక్క! అది లెక్క! మాడ్రిడ్ గెలిస్తే ఇలా ఉంటుంది! 849 00:52:53,465 --> 00:52:56,009 లీగ్ టైటిల్ తమ చేతికి అందేంత దూరం ఉండడంతో, 850 00:52:56,009 --> 00:52:59,012 ఆటగాళ్లు ఇప్పుడు తమ దృష్టిని ఛాంపియన్స్ లీగ్ వైపు మళ్లించారు. 851 00:53:00,514 --> 00:53:02,933 మాడ్రిడ్ జట్టుకు లాలీగలో గెలవడం ఒక బాధ్యత లాంటిది. 852 00:53:02,933 --> 00:53:05,686 కానీ ఛాంపియన్స్ లో గెలవడం వారి కల. 853 00:53:05,686 --> 00:53:08,021 రియల్ మాడ్రిడ్ అలాగే ఛాంపియన్స్ కప్ మధ్య ఉన్న బంధం 854 00:53:08,021 --> 00:53:10,190 ఒక ప్రేమ బంధం లాంటిది అని నేను అస్తమాను అంటుంటాను. 855 00:53:10,190 --> 00:53:12,276 అది మాలో ఒక భాగం. 856 00:53:12,276 --> 00:53:14,194 కేవలం ఛాంపియన్స్ ని గెలవడం మాత్రమే కాదు, 857 00:53:14,194 --> 00:53:18,156 చివరి వరకు పోరాడే మా నైజంతో అది మేము చేయాలి. 858 00:53:20,576 --> 00:53:23,662 మంచి విషయం ఏంటంటే, ఆ మొదటి మ్యాచ్ వారి దేశంలో ఆడడం. 859 00:53:23,662 --> 00:53:27,958 కాబట్టి కీలకమైన తమ రెండవ మ్యాచ్ ని, స్వదేశంలో, వారి అభిమానుల మధ్య ఆడే అవకాశం వీరికి ఉంది. 860 00:53:29,918 --> 00:53:34,423 కానీ చెడ్డ వార్త ఏంటంటే, మాడ్రిడ్ ఇప్పుడు మాంచెస్టర్ సిటీ లాంటి భారీ జట్టుతో పోరాడాలి... 861 00:53:34,423 --> 00:53:35,841 మాంచెస్టర్ యునైటెడ్ కింగ్డమ్ 862 00:53:35,841 --> 00:53:38,177 ...వారి చిరకాల శత్రువు పెప్ గ్వార్డియెలా కోచింగ్ ఇస్తున్న జట్టు. 863 00:53:40,721 --> 00:53:42,556 {\an8}మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ ఒక విపరీతం లాంటిది. 864 00:53:42,556 --> 00:53:43,974 {\an8}పీటర్ డ్రురి సీబీఎస్ కామెంటేటర్ 865 00:53:43,974 --> 00:53:46,810 ఆగ్వెరో! దిమ్మతిరిగిపోతోంది! 866 00:53:46,810 --> 00:53:48,437 అతను లీగ్ ని గెలిచాడు! 867 00:53:54,526 --> 00:53:56,904 ముందు వారు ఫ్రెంచ్ ఛాంపియన్స్ తో తలపడ్డారు. 868 00:53:56,904 --> 00:53:58,197 ఎంబాపె, నేమార్, అలాగే మెస్సి. 869 00:53:58,197 --> 00:54:00,657 ఆ తర్వాత గత ఏడాది తమను బయటకు పంపించిన యూరోపియన్ ఛాంపియన్స్ తో పోరాడారు. 870 00:54:00,657 --> 00:54:03,827 ఇప్పుడు వాళ్ళు గ్వార్డియెలా కోచింగ్ ఇచ్చిన ఇంగ్లీషు ఛాంపియన్స్ తో ఆడనున్నారు, 871 00:54:03,827 --> 00:54:06,622 వారు ముందే ఫైనల్స్, సెమీ-ఫైనల్స్ కి చేరుకున్నారు, ఏదొక సమయంలో కచ్చితంగా గెలుస్తారు కూడా. 872 00:54:06,622 --> 00:54:09,082 ఎందుకంటే అయిదేళ్ల వ్యవధిలో ఆ క్లబ్ మీద పెట్టిన 90 కోట్లు ఉత్తినే పోవు కదా, 873 00:54:09,082 --> 00:54:11,084 వాళ్ళు ఏదొక సమయంలో కచ్చితంగా గెలుస్తారు. 874 00:54:11,084 --> 00:54:12,961 అలాగే రోడ్రి! 875 00:54:14,963 --> 00:54:16,048 26 ఏప్రిల్ 2022 876 00:54:16,048 --> 00:54:22,012 పిచ్ మీద అంత బలమైన ఆటగాళ్లు ఉండడంతో, ఆట కచ్చితంగా రసవత్తరంగా ఉండబోతోంది. 877 00:54:22,930 --> 00:54:26,475 ఆ మొదటి మ్యాచ్ నిజంగానే మీరు మీ జీవితంలో చూడగల 878 00:54:26,475 --> 00:54:30,354 అత్యంత నమ్మశక్యం కాని, దుమ్ముదులిపిన 879 00:54:30,354 --> 00:54:33,398 మతిపోగోట్టగల మ్యాచ్ అని కచ్చితంగా చెప్పగలను. 880 00:54:38,987 --> 00:54:40,405 తర్వాత రానున్నది 881 00:54:40,405 --> 00:54:42,908 మాంచెస్టర్ సిటీ భలే ప్రారంభాన్ని చేసింది! 882 00:54:45,118 --> 00:54:49,081 గోల్! 883 00:54:49,873 --> 00:54:51,250 ఫైనల్స్... 884 00:54:51,250 --> 00:54:52,876 మేము వారితో ఆడము, 885 00:54:53,502 --> 00:54:54,503 మేము వారిపై గెలుస్తాం. 886 00:56:23,842 --> 00:56:25,844 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్