1
00:00:06,382 --> 00:00:10,845
క్లైనర్ మెడ కోసిన తీరు చూశాక, స్పష్టంగా
వారు వెనిజులా నుండి వచ్చారని తెలుస్తుంది.
2
00:00:12,847 --> 00:00:16,142
- అది నీకెలా తెలుసు?
- అది వెనిజులా బటర్‌ఫ్లై కోత.
3
00:00:16,142 --> 00:00:18,978
ఊపిరాడకపోవడం ఇంకా రక్తస్రావం
ఒకేసారి జరుగుతాయి,
4
00:00:18,978 --> 00:00:20,646
అప్పుడు రక్తపు మడుగులో ఉంటారు.
5
00:00:21,647 --> 00:00:25,693
క్లైనర్‌కు వెనిజులాలో ఎవరైనా ఉండి ఉండాలి.
అతనితో కలిసి పని చేస్తున్నవారు.
6
00:00:25,693 --> 00:00:26,902
లేదా అతనికి.
7
00:00:26,986 --> 00:00:29,947
ఎవరికైతే ఇది గందరగోళంగా మారడం
అసంతృప్తిగా ఉందో వారికి.
8
00:00:29,947 --> 00:00:33,659
ఎవరికైతే మనం బాస్ అనుకున్న అతనిని
చంపించగల శక్తి ఉందో వారికి.
9
00:00:33,743 --> 00:00:36,370
తెలివైన, భారీకాయుడు
నాకు ఒకసారి ఇలా చెప్పాడు,
10
00:00:36,454 --> 00:00:38,706
"చెత్త వేటకుక్క ఉందని తెలిస్తే తప్ప
11
00:00:38,706 --> 00:00:41,751
"చెత్త కుప్పల్లో తిరిగే కుక్కను పెట్టరు."
12
00:00:41,751 --> 00:00:44,503
వాళ్ళు వెనిజులా నుండి
అమలు చేస్తున్నారంటావా?
13
00:00:44,587 --> 00:00:45,838
అది సాధ్యమే.
14
00:00:46,297 --> 00:00:48,674
నువ్వు చివరిసారి నిఘా పెట్టింది ఎప్పుడు?
15
00:00:48,758 --> 00:00:50,384
క్లైనర్ ఆవరణలోనా?
16
00:00:50,468 --> 00:00:53,137
నాయకత్వంలో మార్పుల వలన తప్పులు దొర్లవచ్చు.
17
00:00:53,137 --> 00:00:55,306
అది జరిగినప్పుడు నాకు చూడాలని ఉంది.
18
00:00:56,474 --> 00:00:59,477
మనకు ఒక కారు కావాలి,
పట్టణంలో అందరికీ నా కారు తెలుసు,
19
00:00:59,477 --> 00:01:01,520
నీ బెంట్లీ చిన్నదేమీ కాదు.
20
00:01:01,604 --> 00:01:03,230
నేను అది చూసుకుంటాను.
21
00:01:05,316 --> 00:01:06,734
ఇది స్టేషన్ హౌస్.
22
00:01:06,734 --> 00:01:09,069
ఈ పాటికి పెంట అంతా తెలిసిపోయి ఉంటుంది.
23
00:01:09,153 --> 00:01:12,448
పెంటా? తిట్టు అంతే, ఫిన్లీ.
24
00:01:13,699 --> 00:01:18,662
రీచర్
25
00:01:26,712 --> 00:01:29,381
నాకు ఫోన్‌లతో పని చేసే
వాలంటీర్లంతా కావాలి.
26
00:01:29,465 --> 00:01:31,926
స్టీవెన్‌సన్, క్లైనర్ ఇంటికి
వెళ్ళే వైపున్న
27
00:01:31,926 --> 00:01:34,929
ట్రాఫిక్ కెమెరాల
సెక్యూరిటీ ఫుటేజీ కనుక్కో.
28
00:01:34,929 --> 00:01:38,474
గూగుల్ ఉపగ్రహం నుండి
ఏదైనా కనుగొనే ప్రయత్నం చెయ్.
29
00:01:38,474 --> 00:01:41,227
అంటే, గూగుల్
అలా పని చేస్తుందని అనుకోను, సర్.
30
00:01:41,227 --> 00:01:44,730
మార్‌గ్రేవ్ ప్రజల బుర్రలు చెడిపోతున్నాయి.
అది పూర్తి చెయ్!
31
00:01:44,814 --> 00:01:46,857
- అలాగే, సర్.
- హే, బేకర్.
32
00:01:46,941 --> 00:01:49,068
మనం ఒక ప్రకటనను తయారు చేద్దాం,
33
00:01:49,068 --> 00:01:53,197
"మేము ఇంకా
సమాచార సేకరణ స్థాయిలో ఉన్నాము...
34
00:01:54,698 --> 00:01:57,076
" వగైరా, వగైరా."
35
00:01:58,244 --> 00:02:02,122
మేము కృషి చేస్తున్నది అంతా
నిలిపి వేస్తున్నాం, మోరిసన్ దానితో సహా.
36
00:02:02,206 --> 00:02:03,916
- అతను ఎక్కడ దొరికాడు?
- ఆఫీస్‌లో.
37
00:02:03,916 --> 00:02:06,502
- ఈ ఉదయం సెక్రటరీ అతన్ని చూశాడు.
- సరే.
38
00:02:06,502 --> 00:02:09,088
బహుశా కౌంటీ ఫోరెన్సిక్‌లు
చేరుకొని ఉంటారేమో?
39
00:02:09,088 --> 00:02:11,340
- వాళ్ళకు ఏదైనా తెలిసిందా?
- ఇంకా లేదు.
40
00:02:11,340 --> 00:02:13,175
నేను అక్కడకు వెళతాను.
41
00:02:13,259 --> 00:02:16,428
మా నాన్న నేరం చేశారని
ఇంకా అనుకుంటున్నావా, చెత్త మొహం?
42
00:02:16,512 --> 00:02:19,765
- శాంతించు, శాంతించు!
- నాపైనుండి చేతులు తియ్!
43
00:02:19,849 --> 00:02:23,102
పరిస్థితులను పరిగణలోకి తీసుకుని
నీకు మరో అవకాశం ఇస్తాను.
44
00:02:23,102 --> 00:02:25,020
కానీ మరోలా చేయాలనుకుంటే,
45
00:02:25,104 --> 00:02:28,232
ఇది చాలా త్వరగా మరో మార్గంలోకి వెళుతుంది.
46
00:02:30,150 --> 00:02:32,278
- చెత్త...
- వద్దు, వద్దు! శాంతించు!
47
00:02:32,278 --> 00:02:34,488
మా నాన్న
హత్య చేసినట్టు విచారిస్తున్నారు.
48
00:02:34,572 --> 00:02:37,283
సమాజానికి ఇవ్వడం తప్ప ఏం తెలియని వ్యక్తి
49
00:02:37,283 --> 00:02:40,035
పేరు, ప్రతిష్టలను
చెడగొట్టే ప్రయత్నం చేశారు!
50
00:02:40,119 --> 00:02:43,163
ఉద్వేగంలో ఉన్నావని తెలుసు,
నాకు బాధగా ఉంది, కేజే.
51
00:02:43,247 --> 00:02:46,375
కానీ నేను ఈ పట్టణంలో
నా ఉద్యోగం తప్ప ఏం చేయలేదు.
52
00:02:46,375 --> 00:02:48,377
పోరా, చెత్త వెధవ.
53
00:02:49,128 --> 00:02:50,546
వెంటనే, నా ఆఫీసుకు రా!
54
00:02:56,844 --> 00:02:59,096
నువ్వు కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకుంటా.
55
00:02:59,096 --> 00:03:01,765
ఇప్పుడే ఘటనా స్థలానికి వెళ్ళకు,
56
00:03:01,849 --> 00:03:03,893
అంతా శాంతించే వరకు.
57
00:03:03,893 --> 00:03:08,188
మీరు ఇప్పుడు మీ చీఫ్ డిటెక్టివ్‌ను
ఘటనా స్థలం చల్లబడ్డాక వెళ్ళమన్నారా?
58
00:03:08,272 --> 00:03:10,274
నేను అతనిని విశ్రాంతి తీసుకోమన్నాను.
59
00:03:10,274 --> 00:03:13,193
ఈ పట్టణ శక్తివంతమైన సంరక్షకుడిపై
హత్యానేరం మోపావు,
60
00:03:13,277 --> 00:03:16,530
అతను మిగిలిన అందరిలాగానే,
బాధితుడని తెలుసుకుంటావు.
61
00:03:16,614 --> 00:03:19,700
ప్రస్తుతం నీకు ఈ చుట్టుపక్కల
మంచి పేరు లేదు.
62
00:03:19,700 --> 00:03:21,160
నీకు సహాయం చేస్తున్నాను.
63
00:03:21,160 --> 00:03:25,748
అందుకని విధులు ఆపేసి వెళ్ళు,
త్వరలోనే నేను నిన్ను ఆటలోకి రమ్మంటాను.
64
00:03:44,391 --> 00:03:47,603
- ఇది మంచి వాహనం.
- ఇది ఒకచోటనుండి మరోచోటకు తీసుకెళుతుంది.
65
00:03:47,603 --> 00:03:51,148
నిజం చెప్పాలంటే,
నాకు బ్రిటీష్ కార్లు అంతగా తెలియవు.
66
00:03:51,148 --> 00:03:52,983
కిటికీలకు టింట్ వేయించాలి.
67
00:03:53,776 --> 00:03:55,361
కనీసం మూడు రోజులు పడుతుంది.
68
00:03:55,361 --> 00:03:58,864
- నాకు బదులుగా మరో కారు ఇవ్వు.
- సరే, మేము బదులుగా ఇవ్వము.
69
00:04:01,450 --> 00:04:02,743
ఖచ్చితంగా అంటున్నావా?
70
00:04:08,374 --> 00:04:11,460
ఈలోపు మీరు నా కారు తీసుకోవచ్చేమో.
71
00:04:12,544 --> 00:04:16,090
ఇది బెంట్లీ కాదు, కానీ మిమ్మల్ని
ఇటు నుండి అటు తీసుకెళుతుంది.
72
00:04:17,549 --> 00:04:19,343
చాలా బాగుంది.
73
00:04:29,937 --> 00:04:31,689
సాధారణంగా రోమా టమోటాలు తీసుకుంటాను.
74
00:04:31,689 --> 00:04:33,899
ఇవి ఇంకా పండలేదు.
75
00:04:33,983 --> 00:04:36,652
తరువాతి వారం,
వీటితో మంచి శాండ్విచ్ చేయవచ్చేమో.
76
00:04:41,949 --> 00:04:43,867
అది ఎలా చేస్తారు, మి. మోస్లీ?
77
00:04:45,035 --> 00:04:49,957
- ఏం చేయాలి?
- ఇక్కడే ఉండడం. మార్‌గ్రేవ్‌లో.
78
00:04:50,582 --> 00:04:53,419
వేరే చోట సులువుగా ఉంటుందని
ఎప్పుడూ ఆలోచించలేదా?
79
00:04:53,419 --> 00:04:56,130
ఆలోచించారా? నాకు తెలుసు.
80
00:04:57,297 --> 00:04:58,298
మరి ఎందుకు ఉన్నారు?
81
00:05:00,134 --> 00:05:03,137
క్లైనర్ కంటే ముందే,
82
00:05:03,137 --> 00:05:08,267
టీల్స్ కంటే ముందు నా కుటుంబం ఉంది,
మిస్ రాస్కో పిల్లలు వచ్చినప్పుడు.
83
00:05:08,267 --> 00:05:12,896
ఇక, నన్ను ఎవరైనా ఎందుకు తరిమేయాలి?
84
00:05:12,980 --> 00:05:17,109
నన్ను, నా సోదరిని వాళ్ళు పంపాలంటే
అది శవపేటికలోనే పంపాలి.
85
00:05:17,109 --> 00:05:20,821
అయినా అప్పుడు కూడా,
మేము మార్‌గ్రేవ్ శ్మశానంలో ఉంటాము.
86
00:05:20,821 --> 00:05:24,658
ప్రశ్న నేను ఇంకా ఇక్కడ
ఎందుకు ఉన్నానని కాదు.
87
00:05:24,742 --> 00:05:27,244
అసలు ముందుగా
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని.
88
00:05:27,244 --> 00:05:32,666
హార్వర్డ్ స్క్వేర్ నుండి
మార్‌గ్రేవ్‌కు చాలా దూరం, డిటెక్టివ్.
89
00:05:34,043 --> 00:05:36,170
రీచర్ కూడా నన్ను అదే అడిగాడు.
90
00:05:37,004 --> 00:05:38,464
నువ్వు అతనికి ఏం చెప్పావు?
91
00:05:39,715 --> 00:05:41,508
నేను నీకూ అదే చెబుతాను.
92
00:05:43,302 --> 00:05:45,679
అది నీకు అనవసరం.
93
00:05:51,685 --> 00:05:54,563
ఈసారి, నాకు రోమా టమోటాలు తీసుకురా.
94
00:05:56,023 --> 00:05:57,316
తెస్తాను.
95
00:06:13,791 --> 00:06:16,085
- అది అయిపోయిందా?
- లేదు.
96
00:06:16,085 --> 00:06:17,795
కానీ నేను సహకారం తీసుకువచ్చాను.
97
00:06:20,881 --> 00:06:23,717
- రాస్కో. చిన్న మార్‌గ్రేవ్ మర్యాద.
- హే.
98
00:06:23,801 --> 00:06:25,344
నువ్వు ఉంటున్నావా?
99
00:06:27,012 --> 00:06:28,722
నాకు ఎటూ పాలుపోవడం లేదు.
100
00:06:30,015 --> 00:06:32,267
నీకు సెట్లర్స్ ఆఫ్ కటాన్ ఆడడం వచ్చనుకుంటా.
101
00:06:32,351 --> 00:06:35,020
- అదిక్కడ బోర్డ్ గేమ్ సెంట్రల్.
- అది బాగుంది.
102
00:06:35,104 --> 00:06:37,731
- వాళ్ళకు కాలక్షేపం.
- ప్రస్తుతానికి. భయపడుతున్నారు.
103
00:06:37,815 --> 00:06:39,483
అంటే, నాకూ భయంగానే ఉంది.
104
00:06:39,900 --> 00:06:42,319
నా మర్యాదలు ఏవి?
మంచి నీళ్ళు తీసుకొస్తాను.
105
00:06:42,319 --> 00:06:44,029
ధన్యవాదాలు.
106
00:06:44,822 --> 00:06:46,657
ఆమె పూర్తిగా గందరగోళంగా ఉంది.
107
00:06:48,450 --> 00:06:51,328
ఈ చోటు ఒకప్పటి
ముఠాకు సాక్ష్యంగా నిలుస్తుంది.
108
00:06:51,328 --> 00:06:53,539
తలుపులు దృఢంగా చేశారు, మంచి అలారం వ్యవస్థ.
109
00:06:53,539 --> 00:06:55,124
మీ సహజ జ్ఞానం వాడండి.
110
00:06:55,124 --> 00:06:58,085
ప్రమాదం అనిపిస్తే,
మీ కుటుంబాన్ని తీసుకొని పారిపోండి.
111
00:06:58,210 --> 00:06:59,294
జరగండి, అమ్మాయిలు.
112
00:07:00,045 --> 00:07:03,841
సరే. నేను వెళతాను.
రెండు రోజుల్లో కలుస్తాను.
113
00:07:03,841 --> 00:07:06,051
వద్దు, నేను వెళ్ళాలి.
114
00:07:06,135 --> 00:07:07,594
ఇప్పుడు, నియమాలు ఏంటి?
115
00:07:07,678 --> 00:07:11,515
రెండూ తాళం వేయాలి, నిద్ర పోతున్నప్పుడు
లైట్లు వద్దు, చలిమంట వద్దు.
116
00:07:11,515 --> 00:07:13,225
మీరు ఇది అధిగమిస్తారు.
117
00:07:15,144 --> 00:07:16,562
ధన్యవాదాలు.
118
00:07:18,272 --> 00:07:20,399
మీరు చేసినదానికి అంతటికీ ధన్యవాదాలు.
119
00:07:20,399 --> 00:07:22,442
నిన్ను మంచి చేతుల్లో పెట్టాను.
120
00:08:07,863 --> 00:08:11,074
బీఫ్ జర్కీనా?
పరివేష్టిత ప్రదేశంలోనా?
121
00:08:11,158 --> 00:08:13,577
ప్రోటీన్, ఐరన్, జింక్.
122
00:08:13,577 --> 00:08:15,579
అది ఇన్సులిన్ పెంచదు.
123
00:08:16,788 --> 00:08:18,081
నీకు జర్కీ ఇష్టం.
124
00:08:21,293 --> 00:08:23,462
నీగ్లీ నాకు మంచి ఆహారం పరిచయం చేసింది.
125
00:08:31,345 --> 00:08:34,181
అయితే, నీగ్లీ. మంచి స్నేహితురాలా?
126
00:08:35,307 --> 00:08:39,102
- మేము ఇద్దరం 110వ దాంట్లో కలిసి చేశాం.
- అయితే, నీ స్నేహితురాలు.
127
00:08:39,186 --> 00:08:42,606
- అంటే, ఆమెను అలా అనవచ్చు.
- నేను అలా అన్నాను.
128
00:08:42,606 --> 00:08:45,776
- నువ్వు ఆమెను అలా ఎందుకు అనవు?
- తనను నీగ్లీ అని పిలుస్తాను.
129
00:08:52,491 --> 00:08:54,326
పదవ వంతు సంగతి ఏంటి?
130
00:08:54,743 --> 00:08:56,036
పెద్ద కథ.
131
00:08:57,829 --> 00:08:59,122
ఎక్కడికో వెళ్ళాలన్నావు?
132
00:09:03,126 --> 00:09:06,922
ఆర్మీ నేను నా ప్రత్యేక పరిశోధన యూనిట్‌ను
ఏర్పాటు చేసుకోనిచ్చింది.
133
00:09:06,922 --> 00:09:10,634
పెంటగాన్ అది విఫలమవుతుందని అనుకుంది,
అందుకని నన్ను ఇన్‌ఛార్జ్ చేశారు.
134
00:09:10,634 --> 00:09:13,095
- మేము తొమ్మిది మంది ఉన్నాం.
- మిగిలిన వారు ఏరి?
135
00:09:13,095 --> 00:09:14,304
తెలియదు.
136
00:09:14,388 --> 00:09:16,348
- సన్నిహితులు కారా?
- చాలా సన్నిహితం.
137
00:09:17,349 --> 00:09:18,976
కలిసి చాలా ఎదుర్కొన్నాం.
138
00:09:20,143 --> 00:09:22,729
- కానీ అప్పుడు నేను ఆర్మీలో ఉన్నాను.
- ఇప్పుడు?
139
00:09:24,648 --> 00:09:26,108
ఆర్మీలో లేను.
140
00:09:36,076 --> 00:09:38,161
ఎన్నో ఏళ్ళుగా మీ అన్నయ్యతో మాట్లాడలేదు.
141
00:09:38,245 --> 00:09:40,622
నీ ఆర్మీ స్నేహితులతో సంప్రదింపులు లేవు.
142
00:09:40,706 --> 00:09:42,791
అంత సులువుగా మనుషులను ఎలా వదిలేస్తావు?
143
00:09:43,458 --> 00:09:46,003
- అది మంచిది కాదు.
- అది నువ్వు చెబుతున్నావు.
144
00:09:46,003 --> 00:09:47,921
వదిలేయ్, ఫిన్లీ.
145
00:09:48,005 --> 00:09:50,299
నీకంటే వేగంగా
చెట్టులో రింగులు పోవడం చూశాను.
146
00:09:54,678 --> 00:09:56,388
నా భార్య చనిపోయింది.
147
00:09:58,932 --> 00:10:02,311
ఆమె చనిపోయింది,
నేను ఉంగరం పెట్టుకోకుండా ఉండలేను.
148
00:10:02,311 --> 00:10:03,979
నాకు నువ్వు అది కాదు చెప్పింది.
149
00:10:03,979 --> 00:10:06,356
నేను నీకు చెప్పినదల్లా,
ఆమె పేరు షారన్ అనే.
150
00:10:06,440 --> 00:10:09,151
మా విడాకుల గురించి
నువ్వు చెప్పింది నిజమని నేను అనలేదు.
151
00:10:09,151 --> 00:10:12,195
- నన్ను ఎందుకు సరి చేయలేదు?
- నేను ఎవరినీ సరి చేయను.
152
00:10:13,030 --> 00:10:14,865
నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు.
153
00:10:16,533 --> 00:10:19,286
అందరూ నాలాంటి వారిని ఊహిస్తుంటారు,
154
00:10:20,829 --> 00:10:23,749
కోపిష్టి, చాదస్తం...
155
00:10:23,749 --> 00:10:26,335
- తలపోటు తెస్తావు.
- తలనొప్పి తెస్తాను.
156
00:10:28,211 --> 00:10:30,797
వాళ్ళు ఆమె నన్ను
వదిలేసిందని అనుకుంటున్నారు.
157
00:10:33,592 --> 00:10:35,093
అందుకే బోస్టన్ వదిలి వచ్చావా?
158
00:10:37,971 --> 00:10:42,642
నగరంలో ఉంటూ ప్రతి ప్రదేశం
నీ జీవితంలో ప్రేమ జ్ఞాపకంగా ఉండేలా
159
00:10:42,726 --> 00:10:44,353
జీవించాలని అనుకుంటావు.
160
00:10:45,062 --> 00:10:50,150
ప్రతి రెస్టారెంట్,
ప్రతి అడుగులో, నిరుత్సాహంతో.
161
00:10:52,194 --> 00:10:55,989
- తనపట్ల నా వైఫల్యాలను గుర్తుచేస్తూ.
- నీకు నువ్వు చెప్పుకుంటావా?
162
00:10:56,073 --> 00:11:00,619
ఆమెకు కొండమీది కోతినైనా
తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను.
163
00:11:05,874 --> 00:11:08,251
ఇప్పుడు నెలవారీ మొబైల్ బిల్ కడుతున్నాను,
164
00:11:09,378 --> 00:11:11,713
తన వాయిస్‌మెయిల్ వినవచ్చని.
165
00:11:12,130 --> 00:11:16,051
సిగరెట్ తాగడం మానేద్దామనుకుని,
సిగరెట్ దుకాణం పైన ఉంటున్నావు,
166
00:11:16,051 --> 00:11:18,762
జార్జియాలో వేసవిలో సూటు వేసుకుని,
167
00:11:18,762 --> 00:11:20,806
నిర్మానుష్యమైన చోట ఉద్యోగం చేస్తూ.
168
00:11:20,806 --> 00:11:24,893
ఇదంతా నీ భార్యను రక్షించలేకపోయినందుకు
నువ్వు చేస్తున్న తపస్సు లాంటిదా?
169
00:11:24,893 --> 00:11:26,645
అలాంటిదే.
170
00:11:32,067 --> 00:11:34,027
సరే, అది పిచ్చితనం.
171
00:11:34,111 --> 00:11:36,947
నువ్వు అలా అనుకుంటే అది నీ పిచ్చితనం.
172
00:11:38,115 --> 00:11:39,366
పోరా.
173
00:11:40,784 --> 00:11:43,870
నువ్వు తిడుతుంటే నాకు నచ్చుతుంది.
అది తరుచుగా చేయాలి.
174
00:11:45,038 --> 00:11:46,832
రెండింతల తిట్లు నీకు.
175
00:11:55,090 --> 00:11:56,716
ఏదో జరుగుతోంది.
176
00:12:07,602 --> 00:12:09,896
క్లైనర్ హత్య జరిగి
ఇంకా 24 గంటలు కాలేదు.
177
00:12:09,980 --> 00:12:12,315
మేనల్లుడు బయట బట్వాడా చేస్తున్నాడా?
178
00:12:13,400 --> 00:12:17,654
నకిలీ నోట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి,
కోస్ట్ గార్డ్ దిగ్బంధానికి ధన్యవాదాలు.
179
00:12:17,654 --> 00:12:18,947
ఉద్రిక్తత నెలకొంది.
180
00:12:18,947 --> 00:12:21,867
కొనుగోలుదారులకు వారి నకిలీ డబ్బు కావాలి.
181
00:12:21,867 --> 00:12:24,202
ఆ ట్రక్కు నిండా అది ఉండి ఉంటుంది.
182
00:12:25,620 --> 00:12:27,372
వెళ్ళి చూద్దాం.
183
00:12:30,208 --> 00:12:32,752
అబ్బో, అప్పుడే అర్థరాత్రి అయిపోయింది.
184
00:12:32,836 --> 00:12:36,256
మీ ఇద్దరూ, పళ్ళు తోముకుంటే,
మనం ఇంకో ఆట ఆడవచ్చు.
185
00:12:38,216 --> 00:12:41,178
మరో ఆటా? వాళ్ళు అలసిపోరా?
186
00:12:41,178 --> 00:12:43,430
అవును, వాళ్ళను మేల్కొని ఉంచుతున్నాను.
187
00:12:43,430 --> 00:12:46,850
వాళ్ళు నిద్రపోతే, పీడకలలు వస్తాయి.
వాళ్ళకు నాన్న కావాలి.
188
00:12:47,809 --> 00:12:49,394
నాకు పీడకలలు వచ్చేవి.
189
00:12:50,729 --> 00:12:55,275
నాకూ నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు.
190
00:12:55,275 --> 00:12:58,236
- ఆయన, మా అమ్మ, ఇద్దరూ.
- దేవుడా, ఏం జరిగింది?
191
00:12:58,320 --> 00:12:59,613
కారు ప్రమాదం.
192
00:13:01,031 --> 00:13:03,992
నేను వెనుక కూర్చున్నాను.
ప్రాణాలతో బయటపడడం అద్భుతం.
193
00:13:03,992 --> 00:13:05,368
అది భయానకం.
194
00:13:08,622 --> 00:13:14,252
తరువాత, నేను ఆసుపత్రిలో ఉన్నాను,
మా అమ్మమ్మ హ్యారీ పాటర్ చదివి వినిపించేది.
195
00:13:14,336 --> 00:13:16,713
ఎందుకంటే హ్యారీకి కూడా నాలాగే జరిగింది.
196
00:13:16,713 --> 00:13:18,215
కానీ నిజానికి,
197
00:13:18,215 --> 00:13:21,009
వాళ్ళు అతన్ని కాపాడి,
ప్రపంచాన్ని ఉత్తమ చోటుగా
198
00:13:21,009 --> 00:13:23,386
మార్చేందుకు చనిపోయిన మాంత్రికులు.
199
00:13:23,970 --> 00:13:27,349
నాకు అబద్ధం చెప్పుకునేదాన్ని,
నా తల్లిదండ్రులు మాంత్రికులని
200
00:13:27,349 --> 00:13:29,476
అలానే చేస్తూ చనిపోయారని అనుకునేదాన్ని.
201
00:13:29,476 --> 00:13:31,520
నువ్వు వాళ్ళలా ఉండాలని అనుకున్నావు.
202
00:13:32,604 --> 00:13:34,147
అందుకేనా పోలీసువు అయ్యావు?
203
00:13:35,982 --> 00:13:37,442
అలోచన అయితే అదే.
204
00:13:42,405 --> 00:13:44,491
అంటే, వాళ్ళు బాగానే ఉంటారు.
205
00:13:44,491 --> 00:13:48,453
పిల్లలు దృఢంగా ఉంటారు,
వాళ్ళకు నువ్వు ఉండడం అదృష్టం.
206
00:13:51,331 --> 00:13:52,749
ధన్యవాదాలు.
207
00:13:59,339 --> 00:14:01,967
ఏం జరుగుతోంది? నీకు ఏం కనిపిస్తుంది?
208
00:14:05,053 --> 00:14:06,096
ఛ.
209
00:14:07,514 --> 00:14:11,518
అమ్మాయిలకు షూస్ వేసి,
కింద తలుపు దగ్గర వేచి ఉండు.
210
00:14:14,604 --> 00:14:18,358
నేను అరవగానే,
నువ్వు చెట్లల్లోకి పరిగెత్తు, పరుగు ఆపకు.
211
00:14:20,068 --> 00:14:22,862
మనం టెన్నెస్సీలో ఉన్నాం.
212
00:14:22,946 --> 00:14:26,116
అతను కనీసం బాత్రూం కోసమూ
ఆపుకోకుండా ప్రయాణిస్తున్నాడు.
213
00:14:28,243 --> 00:14:30,912
హే, వెనుకకు ఉండు, దగ్గరగా వెళుతున్నావు.
214
00:14:30,996 --> 00:14:32,247
పరవాలేదు.
215
00:14:32,247 --> 00:14:35,083
మామూలుగా అనుసరించిన దానికంటే
కాస్త వెనుకకు ఉండాలి.
216
00:14:35,083 --> 00:14:36,626
నా దూరం సరైనదే.
217
00:14:36,710 --> 00:14:39,170
గ్రాండ్ కారవాన్‌లో జిరాఫీవి.
వెనుకకు ఉండు.
218
00:14:39,254 --> 00:14:41,631
ఎవరినైనా ఎన్నిసార్లు అనుసరించానో తెలుసా?
219
00:14:41,715 --> 00:14:44,384
నేను ఎక్కువసార్లు కాదంటాను.
220
00:14:44,384 --> 00:14:46,511
అక్కడే కూర్చుని, సూట్ వేసుకో.
221
00:14:50,640 --> 00:14:53,101
చాల్లే, ఇక నేను ఇంకో బ్లూస్ పాట వినలేను.
222
00:14:53,101 --> 00:14:55,103
ఇది టీ బోన్ వాకర్‌ది.
223
00:14:55,103 --> 00:14:59,024
ఆఫ్రికన్ అమెరికన్ కళా రూపాలలో
ప్రత్యేకమైన వాటిలో ఒకటి కనుగొన్నారు.
224
00:14:59,024 --> 00:15:01,109
నేను టీ బోన్ అంటే తెల్లవాడనుకున్నాను.
225
00:15:01,109 --> 00:15:04,571
టీ బోన్ బర్నెట్ తెల్లవాడే.
వాకర్ నల్లవాడు.
226
00:15:04,571 --> 00:15:06,197
ఏంటిది, ఫిన్లీ.
227
00:15:06,281 --> 00:15:08,533
లేదు, ఇంకేదో ఉండి ఉంటుంది.
228
00:15:08,617 --> 00:15:10,702
ఇక్కడ ఏం ఉందో చూడాలి.
229
00:15:11,411 --> 00:15:14,080
వద్దు, వద్దు.
230
00:15:16,708 --> 00:15:18,335
ఇదిగో వెళుతున్నాం.
231
00:15:23,214 --> 00:15:26,092
ఇప్పటి వరకూ ఉన్న రాక్ పాటలకు
మంచి ప్రారంభం.
232
00:15:37,520 --> 00:15:39,939
ఏం చేస్తున్నావు?
233
00:15:41,191 --> 00:15:44,736
ఇది చెప్పాల్సిందే, తెల్లవాళ్ళు ఏదీ వదలరు,
వాళ్ళు ఉత్సాహంగా ఉండగలరు.
234
00:15:50,533 --> 00:15:53,662
- అతను లైన్లు మారుతున్నాడు, బయటకెళ్ళు.
- అలాగే.
235
00:16:39,999 --> 00:16:41,209
ఛ!
236
00:16:50,009 --> 00:16:51,052
పరిగెత్తు!
237
00:17:19,664 --> 00:17:22,459
అందరూ, ఇటు రండి. ఇక్కడకు. ఇక్కడకు.
238
00:17:22,459 --> 00:17:25,253
పొదల్లోకి వెళ్ళండి. దాక్కోండి.
239
00:17:25,253 --> 00:17:27,464
- నేను వాళ్ళను దారి మళ్ళిస్తాను.
- వద్దు.
240
00:17:27,464 --> 00:17:29,132
సరే! అలా చెయ్!
241
00:17:29,132 --> 00:17:31,926
సమీపంలో ఇక్కడకు తూర్పుకు
అగ్నిమాపక రోడ్డు ఉంది.
242
00:17:32,010 --> 00:17:34,929
మొదటి మైలు రాయి దగ్గర
నన్ను కలవండి. దాక్కోండి.
243
00:17:36,389 --> 00:17:37,766
కదలకు.
244
00:18:54,926 --> 00:18:55,927
నా కళ్ళు!
245
00:19:10,692 --> 00:19:14,946
సుదీర్ఘ ప్రయాణం, ఉద్వేగభరితమైన రోజు.
అతను రెండు నిమిషాలలో పడుకుంటాడు.
246
00:19:21,953 --> 00:19:23,162
అతని సంగతి ఏంటి?
247
00:19:27,542 --> 00:19:29,002
నేనేమన్న గద్దనా?
248
00:19:36,009 --> 00:19:37,260
సగం పడుకున్నాడు.
249
00:19:37,260 --> 00:19:41,055
అయినా పార్కింగ్ ప్రదేశం కనిపించకుండా
అతని మానిటర్ అడ్డుగా ఉంది.
250
00:19:43,683 --> 00:19:45,560
మనం ఇది చేద్దాం.
251
00:19:49,314 --> 00:19:51,149
చూస్తూ ఉండు, నేను తాళం తీస్తాను.
252
00:19:51,149 --> 00:19:53,359
ఆ తలుపు తెరిస్తే శబ్దం అవుతుంది.
253
00:19:53,443 --> 00:19:56,404
- నాకో మంచి ఆలోచన వచ్చింది.
- నువ్వేం చేయబోతున్నావు?
254
00:19:56,404 --> 00:20:00,533
ఈ ట్రక్కుల పైకప్పు బరువు తగ్గించేందుకు
సన్నని వినైల్‌తో చేయబడ్డాయి.
255
00:20:21,804 --> 00:20:23,014
నెమ్మదిగా!
256
00:20:36,319 --> 00:20:37,195
రీచర్!
257
00:20:38,947 --> 00:20:40,031
రీచర్!
258
00:20:42,200 --> 00:20:43,034
ఏంటి?
259
00:22:30,516 --> 00:22:34,645
టెన్నెస్సీ అధికారులకు ఫోన్ చేస్తాను,
గంటలోపు దీన్ని స్వాధీనం చేసుకుంటారు.
260
00:22:34,729 --> 00:22:37,273
ఉపయోగం లేదు. ట్రక్ ఖాళీగా ఉంది.
261
00:22:44,697 --> 00:22:48,159
ఏం జరుగుతోందో నీకు తెలిస్తే,
నాకు చెప్పు.
262
00:22:48,159 --> 00:22:51,162
తప్పుగా అనుకున్నాం.
డబ్బును బయటకు రవాణా చేయడం లేదు.
263
00:22:51,162 --> 00:22:55,333
మరి అతను ఏం చేస్తున్నాడు, గంటల తరబడి
ప్రయాణం చేసింది ఏమీ లేని దానికా?
264
00:22:55,333 --> 00:22:57,710
నాకు తెలియదు. కానీ జోకు తెలుసు.
265
00:22:59,170 --> 00:23:01,255
జో మనకు ఇప్పుడు సహాయపడలేడు, రీచర్.
266
00:23:02,465 --> 00:23:05,093
అయితే, మనం జోకు
సహాయం చేసిన వారితో మాట్లాడదాము.
267
00:23:05,093 --> 00:23:07,428
- ఫ్రొఫెసర్లు.
- వాళ్ళు అందుబాటులో లేరు.
268
00:23:07,512 --> 00:23:11,140
ఇకపై కాదు.
కొన్ని గంటల క్రితం దిగి ఉంటారు.
269
00:23:11,224 --> 00:23:14,477
నీకు అది ఎలా తెలుసు?
నువ్వు కనీసం నీ వాచ్ చూసుకోలేదు.
270
00:23:14,477 --> 00:23:16,187
ఇప్పుడు తెల్లవారుజాము,
271
00:23:16,187 --> 00:23:18,731
- అందుకని మనం సందేశం పంపుదాము... -హలో?
272
00:23:19,816 --> 00:23:21,984
హే. క్షమించండి.
273
00:23:22,068 --> 00:23:25,238
- నేను విలియం బ్రయంట్ కోసం చూస్తున్నాను. -నువ్వు ఎవరు?
274
00:23:25,238 --> 00:23:29,408
పూర్వ విద్యార్థిని,
తిరిగి కలుద్దామని చూస్తున్నాను.
275
00:23:29,492 --> 00:23:34,330
క్షమించండి. నాకు నిజంగా
ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు.
276
00:23:34,997 --> 00:23:37,291
ప్రొఫెసర్ బ్రయంట్ ఈ ఉదయం చనిపోయాడు.
277
00:23:38,543 --> 00:23:41,003
- ఏం జరిగింది? -అతన్ని చంపేశారు.
278
00:23:41,087 --> 00:23:44,674
మధ్యరాత్రి విమానం దిగాడు,
అతని కుక్కను నడకకు తీసుకెళ్ళాడు ఇంకా...
279
00:23:46,050 --> 00:23:47,844
నేను అతని సహాయకురాలిని.
280
00:23:47,844 --> 00:23:50,638
నేను ఇక్కడ రాత్రంతా
ఒక పత్రం కోసం పని చేస్తున్నాను.
281
00:23:50,638 --> 00:23:54,267
ఇప్పుడు ఆ వార్త విన్న దగ్గరనుండి
ఏమీ తోచక కూర్చున్నాను.
282
00:23:54,267 --> 00:23:59,397
- క్షమించండి. నా నివాళులు. -ధన్యవాదాలు. నేను వెళ్ళాలి.
283
00:23:59,397 --> 00:24:00,857
అతన్ని వేగంగా చంపేశారు.
284
00:24:00,857 --> 00:24:02,984
వాళ్ళు ఆ ఇద్దరినీ
చేరుకోలేదని ఆశిద్దాం.
285
00:24:14,996 --> 00:24:17,123
ఇప్పుడు ఉదయం 5 గంటలయింది,
ఇది బాగుండాలి.
286
00:24:17,123 --> 00:24:19,959
- ఫ్రొఫెసర్ కాస్టిల్లో? -అవును.
287
00:24:19,959 --> 00:24:23,671
నేను జాక్ రీచర్‌ను.
మీరు మా అన్నయ్య, జోతో పనిచేస్తున్నారు.
288
00:24:23,671 --> 00:24:26,007
ఇప్పుడు నేను అక్కడకు వచ్చే వరకు
289
00:24:26,132 --> 00:24:28,885
మీరు ప్రాణాలతో ఉండాలంటే,
నేను చెప్పబోయేదంతా చేయండి.
290
00:24:39,520 --> 00:24:40,521
చార్లీ?
291
00:24:42,440 --> 00:24:43,524
చార్లీ?
292
00:24:46,819 --> 00:24:47,820
సురక్షితంగా ఉంది.
293
00:24:48,821 --> 00:24:50,323
వాళ్ళు మన వెనుక రారు.
294
00:24:51,407 --> 00:24:52,366
ధన్యవాదాలు.
295
00:24:52,950 --> 00:24:55,578
అమ్మాయిలు? అమ్మాయిలు, రండి, పరవాలేదు.
296
00:24:56,412 --> 00:24:59,207
అంతా బాగానే ఉంది. తన కాలు బెణికింది.
297
00:24:59,207 --> 00:25:02,210
సరే, చెడ్డ విషయం ఏంటంటే
మనం నడుస్తూనే ఉండాలి.
298
00:25:02,210 --> 00:25:04,879
నేను పికార్డ్‌ను డిన్నర్‌కు కలవమంటాను.
299
00:25:04,879 --> 00:25:08,507
రోడ్డుకు కొన్ని మైళ్ళ ముందు,
అది అందరూ ఉన్నచోట సురక్షితం.
300
00:25:08,591 --> 00:25:11,052
మనం చెట్ల వరుస గుండా నడుద్దాం, దాక్కుందాం.
301
00:25:11,052 --> 00:25:14,931
నీ మడమ మడత పడింది, కదా?
ఒకటి చెప్పనా.
302
00:25:17,308 --> 00:25:19,227
కాంక్లిన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కు.
303
00:25:20,853 --> 00:25:22,980
- బాగానే ఉన్నావా?
- సిద్ధమా? వన్, టూ, త్రీ.
304
00:25:23,064 --> 00:25:25,107
పైకి ఎక్కు, బాగా చేశావు.
305
00:25:25,191 --> 00:25:26,359
సరే.
306
00:25:28,819 --> 00:25:30,821
హబుల్ అమ్మాయిల కంటే కఠినంగా ఎవరు ఉంటారు?
307
00:25:35,284 --> 00:25:38,037
- ఎవరూ కాదు.
- సరిగ్గా చెప్పావు.
308
00:25:39,205 --> 00:25:40,206
పదండి వెళదాం.
309
00:25:40,206 --> 00:25:41,958
సరే. రండి.
310
00:25:46,254 --> 00:25:48,089
నీ తల జాగ్రత్త.
311
00:26:01,644 --> 00:26:04,605
సరే, ఇది టీఎస్ఏ దాటి తీసుకెళ్ళలేవు.
312
00:26:06,148 --> 00:26:10,069
నీకు పికార్డ్ ఫోన్ చేస్తే,
అందరూ ఎలా ఉన్నారో కనుక్కో.
313
00:26:12,196 --> 00:26:13,698
రాస్కో కఠినమైనది.
314
00:26:14,573 --> 00:26:16,158
తను ఖచ్చితంగా బాగానే ఉంటుంది.
315
00:26:30,423 --> 00:26:32,550
ఇదిగో, అది అక్కడ పెట్టు.
316
00:26:32,550 --> 00:26:33,634
సరే.
317
00:26:35,386 --> 00:26:36,762
బయట చల్లగా ఉంది.
318
00:26:38,431 --> 00:26:43,561
అది శ్రమకంటే ఎక్కువగా భయం వలన.
అడ్రినలిన్ వలన మత్తుగా ఉంటుంది.
319
00:26:46,522 --> 00:26:48,316
మనం ఇక్కడకు ఎలా చేరామో తెలియదు.
320
00:26:49,567 --> 00:26:52,361
- మేము చెడ్డవాళ్ళం కాదు.
- నాకు అది తెలుసు.
321
00:26:55,781 --> 00:27:00,036
చార్లీ, నేను మీకు ఒకటి చెప్పాలి.
322
00:27:04,081 --> 00:27:06,000
మిమ్మల్ని మోసం చేశారు.
323
00:27:06,876 --> 00:27:10,504
పాల్ యాక్సిస్ ఫైనాన్షియల్‌లో తన ఉద్యోగం
ఏడాది క్రితమే వదిలేశాడు.
324
00:27:10,588 --> 00:27:16,469
అతను ఆ బ్యాంక్‌లో పనిచేయడం లేదు.
అతను మీకు చెప్పినదంతా అబద్ధం.
325
00:27:16,469 --> 00:27:18,637
ఇప్పుడు జరుగుతున్నదంతా...
326
00:27:20,431 --> 00:27:21,932
అతనికి సంబంధం ఉంది.
327
00:27:29,148 --> 00:27:30,483
నాకు తెలుసు
328
00:27:31,901 --> 00:27:36,655
నా భర్త ఎక్కడ పని చేస్తున్నాడో,
ఎక్కడ చేయడం లేదో,
329
00:27:36,739 --> 00:27:38,616
అతని జీవితంలో ప్రతిఒక్క రోజు.
330
00:27:44,246 --> 00:27:47,666
- నీకు ఏదీ తెలియదని చెప్పావు.
- నా కుటుంబాన్ని రక్షిస్తున్నాను.
331
00:27:50,378 --> 00:27:52,755
కానీ మనల్ని అడవిలో కాల్చారు కాబట్టి,
332
00:27:52,755 --> 00:27:54,423
అది చేజారిపోయిందని అయిందంటాను.
333
00:27:56,133 --> 00:27:59,512
మా జీవితాలు ఎలా నాశనం అయ్యాయో
వింటావా, ఆఫీసర్ కాంక్లిన్?
334
00:28:01,389 --> 00:28:04,725
నన్నూ కాల్చబోయారని పరిగణిస్తే,
నాకది తెలుసుకునే అర్హత ఉంది.
335
00:28:08,729 --> 00:28:11,440
పాల్‌ను మి. క్లైనర్ కలవాలని అనుకున్నాడు.
336
00:28:11,524 --> 00:28:15,403
పాల్‌కు ఉత్సాహం కలిగింది.
క్లైనర్ ఒక ప్రముఖ వ్యక్తి.
337
00:28:15,820 --> 00:28:16,821
కూర్చో.
338
00:28:19,782 --> 00:28:25,454
పాల్, నా వ్యాపార వ్యవహారాలు
దాదాపుగా తయారీలో మాత్రమే ఉంటుంది.
339
00:28:25,538 --> 00:28:28,457
పర్యావసానంగా, అనుకూల
నిబంధనలు అందించే సరఫరాదారులు,
340
00:28:28,541 --> 00:28:31,544
విక్రేతలతోనే వ్యవహారిస్తాను,
నగదు రూపంలో చేస్తాను.
341
00:28:31,544 --> 00:28:34,171
నావైపు అంతా చట్టబద్దంగా,
నిజాయితీగా ఉన్నది.
342
00:28:34,255 --> 00:28:37,091
ఇప్పుడు నేను వాళ్ళకు
చెల్లించేది వాళ్ళు ప్రకటించినా,
343
00:28:37,091 --> 00:28:39,427
అది ఐఆర్ఎస్ ఇంకా వాళ్ళకు మధ్య విషయం.
344
00:28:39,427 --> 00:28:43,764
సరే. కానీ నాలాంటి వ్యక్తి మీ సంస్థకు
ఎలా సహాయపడగలడో తెలియలేదు.
345
00:28:44,640 --> 00:28:47,685
నాకు నగదు బదిలీకి నిపుణుడు కావాలి,
346
00:28:47,685 --> 00:28:50,271
ఆ అనుకూల నిబంధనలు అమలు అయ్యేలా చూసేందుకు.
347
00:28:50,271 --> 00:28:51,897
పట్టణంలో అంతా అనుకునేది ఏంటంటే
348
00:28:51,981 --> 00:28:55,359
నిన్ను ఇతర సంస్థలు
ఇంటర్వ్యూ చేస్తున్నాయని.
349
00:28:55,443 --> 00:28:58,821
క్లైనర్ పరిశ్రమలు
నీకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది.
350
00:29:00,030 --> 00:29:02,825
అది అద్భుతమైన విషయం.
351
00:29:03,742 --> 00:29:08,289
నేను సాంప్రదాయ ఆర్థిక విభాగంలో
మాత్రమే పని చేశాను,
352
00:29:08,289 --> 00:29:11,792
అంటే, బ్యాంకులకు.
353
00:29:11,876 --> 00:29:14,962
అవును. నీ సంకోచాన్ని అర్థం చేసుకోగలను.
354
00:29:14,962 --> 00:29:18,507
కొత్తది, తెలియనిది.
355
00:29:19,758 --> 00:29:21,844
అదే జీవితంలో ఉత్సాహాన్ని ఇచ్చేది, కదా?
356
00:29:23,512 --> 00:29:24,847
అవును.
357
00:29:29,351 --> 00:29:31,187
అయితే, నేను అనుకుంటుంది ఇదే.
358
00:29:31,187 --> 00:29:34,273
నాకు వెనిజులాలో పెద్ద క్లయింట్లు ఉన్నారు.
359
00:29:34,273 --> 00:29:36,734
నాతో పాటు తరువాతి వారం రావచ్చుగా?
360
00:29:36,734 --> 00:29:39,153
అతని వ్యాపారం, అది పనిచేసే తీరు,
361
00:29:39,153 --> 00:29:41,697
సంస్థ సంస్కృతి, అన్నీ చూడవచ్చు.
362
00:29:41,697 --> 00:29:45,242
ఇది నువ్వు చేయాలని అనుకునే
పని ఏమో చూడు.
363
00:29:45,326 --> 00:29:47,453
నీ సమయానికి తగ్గట్టుగా చెల్లిస్తాను.
364
00:29:47,453 --> 00:29:51,582
ఇక రోజు పనికి, రెండు వారాల జీతం.
365
00:30:00,591 --> 00:30:02,885
పాల్ అసలు వెనిజులా వెళ్ళకుండా ఉండాల్సింది.
366
00:30:03,802 --> 00:30:06,263
అయితే, లంచ్ ఎలా ఉంది?
367
00:30:06,347 --> 00:30:10,184
- నాకు అరటికాయలు ఇష్టం.
- నాకు కూడా.
368
00:30:10,184 --> 00:30:13,229
ఆ విషయాలు నేను చూడాలి.
369
00:30:13,229 --> 00:30:15,439
- పని ఎలా ఉంది?
- బాగుంది.
370
00:30:15,523 --> 00:30:19,485
నా ఉద్దేశం,
మీ క్లయింట్ అవసరాలు ముఖ్యమైనవి,
371
00:30:19,485 --> 00:30:21,737
కానీ వాటిని తగ్గించాలని అనుకుంటున్నాను.
372
00:30:23,989 --> 00:30:25,282
- చూడవచ్చా?
- తప్పకుండా.
373
00:30:27,535 --> 00:30:30,829
నువ్వు కొన్ని గంటలలోనే
అంత డబ్బును బదిలీ చేశావా?
374
00:30:32,706 --> 00:30:34,542
ఇదంతా ఖచ్చితంగా చట్టబద్ధమైనదేనా?
375
00:30:34,542 --> 00:30:36,335
వంద శాతం.
376
00:30:36,335 --> 00:30:40,005
- నేను నా పని చాలా బాగా చేస్తాను.
- అది ఖచ్చితం.
377
00:30:40,089 --> 00:30:42,800
ఈ బదిలీ ధ్రువీకరణ నాకు పంపించగలవా?
378
00:30:42,800 --> 00:30:44,051
తప్పకుండా.
379
00:30:48,722 --> 00:30:49,640
పంపించాను.
380
00:30:49,640 --> 00:30:52,226
చూడు, పాల్. నువ్వు
నా సంస్థలో ఉండాలనుకుంటున్నా.
381
00:30:52,226 --> 00:30:54,853
నా సంస్థకు నీ అవసరం ఉంది,
382
00:30:54,937 --> 00:30:58,107
నాకు సమయం వృథా చేయడం ఇష్టంలేదు.
బేరసారాలు చేయను.
383
00:30:58,107 --> 00:31:00,442
ప్రస్తుతం నీ జీతానికి నాలుగు రెట్లు,
384
00:31:00,526 --> 00:31:03,571
అదనంగా సంవత్సరం చివర్లో 50 శాతం బోనస్.
385
00:31:03,571 --> 00:31:08,826
కానీ దీనిపై సిరా ఆరకముందే,
నా క్లయింట్ నిన్ను కలవాలని అనుకుంటున్నాడు.
386
00:31:08,826 --> 00:31:11,370
ఈ అశ్వశాల నుండి సుమారు అర మైలు నడక.
387
00:31:11,370 --> 00:31:14,790
ఇది అందమైన దేశం,
నడిస్తే బాగుంటుంది.
388
00:31:14,790 --> 00:31:16,166
పదండి వెళదాం.
389
00:31:18,502 --> 00:31:21,547
- నీకు గుర్రాలు ఇష్టమా, పాల్?
- ఇష్టమే.
390
00:31:25,551 --> 00:31:29,096
- ఇవన్నీ రేసుగుర్రాలా?
- అన్ని రిటైర్ అయిపోయాయి.
391
00:31:30,014 --> 00:31:34,893
అంటే, ఇక్కడ తిని పడుకుంటాయి,
అంటే, కొత్త విజేతలను కలుస్తాయి.
392
00:31:34,977 --> 00:31:38,731
- చెడ్డ జీవితం ఏం కాదు.
- వాటికి అది నచ్చుతుంది.
393
00:31:38,731 --> 00:31:40,524
కానీ మొదట్లో కాదు.
394
00:31:40,608 --> 00:31:44,695
ఈ జంతువులను వీలైనంత కఠినంగా,
వేగంగా పరిగెత్తేందుకు ఉపయోగించారు.
395
00:31:44,695 --> 00:31:47,197
పరిగెత్తడం, శిక్షణ పొందడం,
శిక్షణ, పరిగెత్తడం.
396
00:31:47,281 --> 00:31:52,244
ఆ తరువాత, ఏదో రోజు,
వాటిని శాలలో బంధిస్తారు, అవి తిరగబడతాయి.
397
00:31:52,328 --> 00:31:55,456
కరుస్తాయి, గేట్‌ను కొరుకుతాయి,
398
00:31:55,456 --> 00:31:59,126
గోడలను పగలగొట్టాలని, వాటిని గుద్దుతాయి.
399
00:31:59,877 --> 00:32:05,174
ఆ తరువాత, ఒక రోజు, ఆపేస్తాయి.
400
00:32:06,008 --> 00:32:07,635
ఆపేస్తాయి అంతే.
401
00:32:08,886 --> 00:32:10,429
అలా ఎందుకో తెలుసా?
402
00:32:11,388 --> 00:32:12,473
సరే.
403
00:32:12,473 --> 00:32:14,725
ఎందుకంటే అవి ఇరుక్కుపోయాయని గ్రహిస్తాయి.
404
00:32:14,725 --> 00:32:18,312
అవి తమ కర్మను
తప్పించుకోలేవని తెలుసుకుంటాయి.
405
00:32:18,312 --> 00:32:22,191
వాటి కొత్త జీవితం
అంత చెడ్డగా ఏం లేదని గ్రహిస్తాయి.
406
00:32:22,816 --> 00:32:24,943
నీకు ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా?
407
00:32:26,153 --> 00:32:27,363
లేదు.
408
00:32:27,363 --> 00:32:29,406
నువ్వు ఈ రోజు బదిలీ చేసిన డబ్బు,
409
00:32:29,490 --> 00:32:32,242
నువ్వ అన్నీ
న్యాయబద్ధంగానే చేయాలని అనుకున్నా,
410
00:32:32,326 --> 00:32:34,244
అది అసాధ్యమైన పని.
411
00:32:34,328 --> 00:32:39,083
ఎందుకంటే డాలర్‌లో ప్రతి సెంటు అంతర్జాతీయ
నకిలీ నోట్ల పధకానికి అనుసంధానమై ఉంది,
412
00:32:39,083 --> 00:32:41,043
అందులో నువ్విప్పుడు భాగమయ్యావు.
413
00:32:41,043 --> 00:32:44,838
నీకు మార్కెట్ రేట్ కంటే అంత ఎక్కువ
చెల్లించగలుగుతున్నది, నిజానికి,
414
00:32:44,922 --> 00:32:47,383
నాకు నా సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉంది.
415
00:32:49,593 --> 00:32:51,136
హాస్యమాడుతున్నారు.
416
00:32:52,513 --> 00:32:53,931
ఇది హాస్యమా?
417
00:32:54,598 --> 00:32:58,644
నువ్వు చాలా తీవ్రమైన పరిస్థితిలో
ఇరుక్కున్నావు, పాల్.
418
00:32:58,644 --> 00:33:02,439
కోట్ల డబ్బును అక్రమ మార్గంలో
చట్టవిరుద్ధమైన టెండర్‌కు బదిలీ చేశావు,
419
00:33:02,523 --> 00:33:04,274
ఆ తరువాత సాక్ష్యం పంపావు.
420
00:33:04,358 --> 00:33:08,946
నీ ఈమెయిల్, నీ ఐపీ అడ్రస్,
నీ పని ఉత్పత్తి.
421
00:33:08,946 --> 00:33:12,700
ఇప్పుడు నువ్వు ఇందులో భాగమే.
422
00:33:16,453 --> 00:33:18,956
నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు.
423
00:33:18,956 --> 00:33:23,794
పారిపోవాలని అనుకుంటే, ఇక్కడ ఉన్న
గుర్రాలు పరిగెత్తాలని అనుకున్నట్టు.
424
00:33:23,794 --> 00:33:27,339
వెళ్ళి పోలీసులకు చెప్పు,
నీ భార్యకు డబ్బు బదిలీ చెయ్,
425
00:33:27,423 --> 00:33:30,509
వ్యక్తిగత విమానం చూసి,
తిరిగి యూ.ఎస్.కు
426
00:33:30,509 --> 00:33:32,177
అంతా సురక్షితంగా ఉన్న చోటుకు.
427
00:33:32,261 --> 00:33:35,806
కానీ నీకు ఒక విషయం చెబుతాను,
ఏ ప్రదేశమూ సురక్షితం కాదు.
428
00:33:36,473 --> 00:33:41,228
ఎవరికైనా చెబితే, నువ్వు ఈ రోజు
చేసిన దానికి కనీసం 30 ఏళ్ళు జైలు పడుతుంది.
429
00:33:41,228 --> 00:33:43,313
నేను చేయలేను...
430
00:33:45,315 --> 00:33:48,026
- నేను ఇది చేయలేను.
- ఏది చేయలేవు?
431
00:33:48,110 --> 00:33:52,740
నువ్వు ఆ ల్యాప్‌టాప్‌ను నొక్కుతూ
నీ కలలకు మించి గొప్పవాడివి అవుతావా?
432
00:33:52,740 --> 00:33:53,949
నాదో ప్రతిపాదన.
433
00:33:53,949 --> 00:33:55,659
నీకు నేను ఒక సహాయం చేస్తాను.
434
00:33:55,743 --> 00:33:58,829
నేను నిన్ను నీ నుండి రక్షిస్తాను.
435
00:33:59,788 --> 00:34:02,207
నిన్ను ఇక్కడ కొంత సమయం వదిలి వెళతాను,
436
00:34:02,291 --> 00:34:05,794
నువ్వు పారిపోయి, ఏ పిచ్చి పనులు చేయకుండా.
437
00:34:05,878 --> 00:34:09,089
నీలో నుండి ఆ భయం అంతా పోయాక,
438
00:34:09,173 --> 00:34:11,925
అప్పుడు నువ్వు ఇది చేయడమే కాకుండా
439
00:34:12,009 --> 00:34:16,263
చేయాలనుకుంటున్నట్టు తెలుసుకుంటావు.
440
00:34:17,556 --> 00:34:21,310
ఈలోపు, పాల్,
441
00:34:22,561 --> 00:34:24,605
గేట్‌ను కొరికేయకు.
442
00:35:22,120 --> 00:35:23,914
వద్దు, వద్దు వద్దు!
443
00:35:25,874 --> 00:35:27,876
- ఏం జరుగుతోంది?
- ఇలా రా!
444
00:35:33,757 --> 00:35:36,176
దయచేసి, వద్దు, దయచేసి నాకు సహాయం చెయ్.
445
00:35:42,140 --> 00:35:44,226
ఇతను మి. క్లైనర్ మాట వినడంలేదు.
446
00:35:44,226 --> 00:35:47,187
నీకు, నీ కుటుంబానికి జరిగేది ఇదే,
447
00:35:47,271 --> 00:35:48,939
నీకు చెప్పింది చేయకపోతే.
448
00:35:48,939 --> 00:35:50,566
వద్దు, వ్దదు, వద్దు!
449
00:35:50,566 --> 00:35:51,942
వద్దు, వద్దు.
450
00:35:51,942 --> 00:35:53,610
వద్దు!
451
00:35:56,113 --> 00:35:57,698
నీ కళ్ళముందు ఒక మనిషికి
452
00:35:59,199 --> 00:36:01,952
శిలువ వేయడం చూస్తే,
453
00:36:03,036 --> 00:36:04,705
నీకు చెప్పింది చేస్తావు.
454
00:36:06,164 --> 00:36:09,418
పాల్ అతను చెప్పింది చేశాడు,
అయినా వాళ్ళు చంపేశారు.
455
00:36:12,254 --> 00:36:14,673
తరువాత వీళ్ళకు అలా జరగనీయను.
456
00:36:15,215 --> 00:36:17,050
నేను అలా జరగనీయను.
457
00:36:19,636 --> 00:36:21,680
పదండి వెళదాం.
458
00:36:21,680 --> 00:36:24,474
సరే, రండి. రండి అమ్మాయిలు.
459
00:36:29,021 --> 00:36:31,148
- ఏం జరిగింది?
- మమ్మల్ని కనుగొన్నారు.
460
00:36:31,148 --> 00:36:33,525
- ఎలా?
- తెలియదు. నేను అది చూసుకున్నాను.
461
00:36:33,609 --> 00:36:35,694
మనం ఇంకా అవకాశాలు తీసుకోలేము.
462
00:36:35,694 --> 00:36:38,989
మనం తరువాత ఏం చేయాలో
తెలుసుకునే వరకూ నేను మీతో ఉంటాను.
463
00:36:50,417 --> 00:36:53,170
జాబ్లింగ్స్ గ్యారేజీ
క్లైనర్‌పై గ్రే ఫైల్
464
00:36:53,170 --> 00:36:56,006
{\an8}అనేక ఆపరేషన్లలో ఒకటి
465
00:36:56,798 --> 00:36:59,843
బహారి, నువ్వు సోహో గ్రాండ్ నుండి
విమానాశ్రయానికి వెళ్ళాలి...
466
00:37:00,761 --> 00:37:04,389
సరే, ఈ సవారీని వదిలి వస్తాను.
467
00:37:04,932 --> 00:37:07,851
నువ్వు ఈ రాక్షసుడిని చూడాలి.
మొత్తం వెనుక సీటుకు సరిపోయాడు.
468
00:37:11,104 --> 00:37:12,814
నువ్వు విమానాశ్రయానికి వెళ్ళలేవు.
469
00:37:13,315 --> 00:37:17,527
నువ్వు కొన్ని నిమిషాలు వేచి ఉండాలి, తరువాత
ఈ రాక్షసుడిని నగరంలోకి తీసుకెళ్ళాలి.
470
00:37:18,862 --> 00:37:19,821
అలాగే, సర్.
471
00:37:20,906 --> 00:37:23,200
- ముందుకు వెళ్ళాక ఎడమకు.
- సరే.
472
00:37:33,835 --> 00:37:36,004
- నేను సహాయం చేయనా?
- నాకు ఒక సూట్ కావాలి.
473
00:37:36,088 --> 00:37:38,256
నా దగ్గర సరిపడ బట్ట ఉందో లేదో తెలియదు.
474
00:37:38,340 --> 00:37:40,968
నాకు పరాచికాలకు సమయం లేదు,
నాకు వెంటనే కావాలి.
475
00:37:40,968 --> 00:37:45,180
జయంట్స్ ఫుట్‌బాల్ ఆటగాడు ఎప్పుడూ
కావాల్సినట్టు చేయించుకునే వాడు కాదు.
476
00:37:45,180 --> 00:37:47,349
నీకు చతురస్రాకారంలో పాకెట్ కావాలా?
477
00:37:48,934 --> 00:37:49,935
సరే.
478
00:38:09,746 --> 00:38:11,832
సరే, మనకో సమస్య వచ్చింది.
479
00:38:37,649 --> 00:38:38,859
ఏ సహాయం చేయగలను, సర్?
480
00:38:38,859 --> 00:38:41,445
నా క్లయింట్, స్టెఫనీ కాస్టిలోను కలవాలి.
481
00:38:41,445 --> 00:38:43,530
ఆమె మీ సంరక్షణలో ఉందనుకుంటా.
482
00:38:43,530 --> 00:38:45,907
అసలు ఆమెకు ఏం జరుగుతోంది?
483
00:38:45,991 --> 00:38:48,869
తనను అరెస్ట్ చేయమని,
ఆమె ప్రమాదంలో ఉందని చెప్పింది,
484
00:38:48,869 --> 00:38:50,954
ఇప్పుడు మాకు ఏమీ చెప్పడం లేదు.
485
00:38:51,038 --> 00:38:55,584
మాటిస్తున్నాను, సార్జెంట్ డియాజ్,
నేనూ, ఆమె మాట్లాడుకున్నాక నీకు చెబుతాను.
486
00:38:55,584 --> 00:38:56,710
నేను మాటిస్తున్నాను.
487
00:38:58,837 --> 00:39:00,422
సరే. నాతో రండి.
488
00:39:02,382 --> 00:39:03,800
ఇటు వైపు.
489
00:39:10,891 --> 00:39:14,603
ఆ రీచర్ ఇంట్లో
నిజంగా ఏదో నీరు ఉన్నట్టు ఉంది.
490
00:39:14,978 --> 00:39:18,398
- మీ సహోద్యోగికి నా నివాళులు.
- ధన్యవాదాలు.
491
00:39:18,482 --> 00:39:21,276
మీ అన్నయ్య మరణానికి నా నివాళులు.
492
00:39:22,736 --> 00:39:25,697
మీకు, జోతో ఎలా పరిచయం?
493
00:39:28,158 --> 00:39:30,786
గత కొన్నేళ్ళుగా కలిసి పని చేస్తున్నాం.
494
00:39:31,536 --> 00:39:34,873
అతను తెలివైన వాడు,
అతనికి తెలియనిది కూడా అతనికి తెలుసు,
495
00:39:34,873 --> 00:39:36,583
అది ఇంకా తెలివైనవాడిగా చేసింది.
496
00:39:37,751 --> 00:39:41,630
ఎప్పటికప్పుడు అతని ఉద్యోగానికి
నా నైపుణ్యం కావాలి.
497
00:39:41,630 --> 00:39:44,883
అంతర్జాతీయ మరియు
దేశీయ ద్రవ్య విధానం.
498
00:39:44,883 --> 00:39:50,555
కానీ జో నన్ను, ప్రొఫెసర్ బ్రయంట్‌ను
మేము ప్రచారం చేయని ప్రత్యేకత కోసం.
499
00:39:51,932 --> 00:39:54,267
యూ.ఎస్.లో మేము ఇద్దరమే విద్యార్థులం
500
00:39:54,351 --> 00:39:57,604
ప్రపంచ ఆర్థిక స్థాయిలో ఎంయూసీ,
మాస్ అన్‌డిటెక్టబుల్
501
00:39:57,604 --> 00:40:01,817
కౌంటర్‌ఫీటింగ్ సైద్ధాంతిక ప్రభావాలపై
ప్రత్యేకంగా అభ్యసిస్తున్న వాళ్ళం.
502
00:40:01,817 --> 00:40:05,695
- ఈరోజుల్లో అదేనా పెద్ద సమస్య?
- అది మీరు ఊహించిన దానికంటే పెద్దది.
503
00:40:05,779 --> 00:40:10,659
80 శాతం యూ.ఎస్. కరెన్సీ
100 డాలర్ల నోట్లని మీకు తెలుసా?
504
00:40:10,659 --> 00:40:14,538
నాకు మీ సంగతి తెలియదు,
కానీ నేను నిత్యం 80 శాతం డబ్బు,
505
00:40:14,538 --> 00:40:16,081
వంద డాలర్ల నోట్లే చూశాను.
506
00:40:16,081 --> 00:40:20,627
- అయితే, ఆ నగదు అంతా ఎక్కడ ఉంది?
- విదేశాలలో, రహస్య ఆర్థిక వ్యవస్థలు,
507
00:40:20,627 --> 00:40:23,505
మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా.
508
00:40:23,505 --> 00:40:26,007
ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అనుకూలం కాదు.
509
00:40:26,091 --> 00:40:28,593
కానీ వాళ్ళందరికీ కావాల్సిన నోటు ఉంటుంది.
510
00:40:28,677 --> 00:40:30,345
అమెరికన్ వంద డాలర్ల నోటు.
511
00:40:31,179 --> 00:40:33,598
ప్రపంచంలోనే అత్యంత
స్థిరమైన కరెన్సీ మనకుంది.
512
00:40:33,682 --> 00:40:36,226
మిగిలినవాటికి అది రిజర్వ్ లాగా ఉంటుంది.
513
00:40:36,226 --> 00:40:39,146
ఎవరూ నకిలీ ఉగాండా షిల్లింగ్ కోసం
మార్కెట్‌లోకి రారు.
514
00:40:39,146 --> 00:40:42,274
దొంగనోట్లు ముద్రించేవారికి
యూ.ఎస్. వంద డాలర్ ఒక ట్రోఫీ.
515
00:40:42,274 --> 00:40:45,819
ఇప్పుడు, నకిలీ నోటు బాగుంటే,
అది సూపర్‌నోటు అంటారు.
516
00:40:45,819 --> 00:40:49,906
ఉత్తర కొరియా ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ను
సృష్టించేందుకు అంకితం చేసింది.
517
00:40:49,990 --> 00:40:53,451
కానీ అది స్థిరమైనది అయితే,
ప్రతిరూపం కష్టం.
518
00:40:53,535 --> 00:40:56,705
అవును. అంటే, భద్రతా విశేషాంశాలు ఉన్నాయి.
519
00:40:56,705 --> 00:41:00,167
స్ట్రిప్స్, హోలోగ్రామ్‌లు,
నిర్దిష్ట రంగులు.
520
00:41:01,084 --> 00:41:05,046
ఎవరికైనా పట్టుదల, ప్రతిభ ఉంటే
521
00:41:05,130 --> 00:41:07,382
వాటి అన్నిటికి నకలు ప్రతి చేయవచ్చు.
522
00:41:07,382 --> 00:41:08,800
ముఖ్యమైనది కాగితం.
523
00:41:09,843 --> 00:41:14,014
ఇక, జో, అతను
ఆ కాగితం దొరకడం అసాధ్యం చేశాడు.
524
00:41:14,014 --> 00:41:16,850
ఎలా చేశాడంటే,
యూ.ఎస్.లో కేవలం ఒక్క సంస్థ మాత్రమే
525
00:41:16,850 --> 00:41:21,021
యూ.ఎస్. మింట్‌కు కాగితం తయారు చేయగల
చట్టబద్ధమైన అధికారం ఉంది.
526
00:41:21,021 --> 00:41:24,357
ఆ ప్రదేశం ఫోర్ట్ నాక్స్ కంటే
అత్యంత భద్రతతో ఉంటుంది.
527
00:41:24,441 --> 00:41:29,362
ఏదేమైనా, జో సూపర్‌నోట్లను ఎలా
ముద్రిస్తున్నారో కనుగొన్నాడు.
528
00:41:29,446 --> 00:41:32,490
అది ఎక్కడో జార్జియాలో
జరుగుతుందని భావించాడు.
529
00:41:33,408 --> 00:41:38,288
- జార్జియాలో తయారీనా?
- కోకో కోలా, వేరుశెనగపప్పు లాగా.
530
00:41:41,958 --> 00:41:43,835
అదేంటి?
531
00:41:43,919 --> 00:41:47,797
నా భాగస్వాములు, నేను,
మేము వ్యవస్థను వెనుకకు తీసుకెళ్ళాం.
532
00:41:48,548 --> 00:41:52,093
వాళ్ళు డబ్బును వెనిజులాలో తయారు చేసి,
యూ.ఎస్.కు రవాణా చేయడం లేదు.
533
00:41:52,177 --> 00:41:55,597
వాళ్ళు డబ్బును యూ.ఎస్.లో తయారు చేసి
వెనిజులా పంపుతున్నారు.
534
00:41:56,973 --> 00:41:58,558
నేను వెళ్ళాలి.
535
00:41:59,643 --> 00:42:01,937
అది వెనిజులా అని తెలుసుకోలేకపోయాను.
536
00:42:01,937 --> 00:42:06,441
వాళ్ళకు ఆ కాగితం ఎక్కడనుండి వస్తుందో
తెలుసుకుంటే, అది ఆపగలరు.
537
00:42:06,441 --> 00:42:09,694
మీరు పోలీస్ కస్టడీలోనే ఉండాలని తెలుసుగా.
538
00:42:09,778 --> 00:42:13,073
- ఇది మీ భద్రత కోసమే.
- నాకు అర్థమైంది.
539
00:42:13,073 --> 00:42:16,284
ఇది చేస్తున్న వారిని ఎలా పట్టుకుంటాను?
540
00:42:20,038 --> 00:42:21,164
బాధాకరంగా.
541
00:42:24,876 --> 00:42:27,128
నువ్వు మిలటరీలో ఏ విభాగంలో ఉన్నావు?
542
00:42:28,421 --> 00:42:30,507
నీ బూట్ల లేసు నిచ్చెన ముడి వేశావు.
543
00:42:30,507 --> 00:42:35,220
ప్యాంట్లు, మిలటరీ అంచులు.
చేతులు సరిగ్గా నీ మణికట్టు వరకు ఉన్నాయి.
544
00:42:35,220 --> 00:42:37,097
సైన్యం. మొదటి లెఫ్టినెంట్.
545
00:42:37,097 --> 00:42:41,101
మేజర్ జాక్ రీచర్,
వన్ టెన్త్ ప్రత్యేక పరిశోధనలు, రిటైర్డ్.
546
00:42:41,101 --> 00:42:43,561
- మీరు కలవడం సంతోషం, సర్.
- నీ సహాయం కావాలి.
547
00:42:44,813 --> 00:42:47,899
నేను లాయర్‌ను కాను,
నాది సరైన పని చేసే ప్రయత్నం.
548
00:42:47,983 --> 00:42:51,611
ఇద్దరు ఫెడరల్ ఏజెంట్లు,
ఎంతోమంది పోలీసులు, పౌరులు చనిపోయారు.
549
00:42:51,695 --> 00:42:53,530
కేసును వ్యక్తిగతంగా పరిశోధిస్తున్నా.
550
00:42:53,530 --> 00:42:56,992
మా అన్నయ్య, జో రీచర్,
రహస్య సేవలో పని చేశాడు.
551
00:42:56,992 --> 00:42:59,286
నా గురించి చూడొచ్చు,
నా రికార్డ్ చూడవచ్చు.
552
00:42:59,286 --> 00:43:02,372
నేను సమయం వృథా చేయడం,
కథలు అల్లడం లాంటి చేయను.
553
00:43:02,372 --> 00:43:04,708
లోపల ఉన్న మహిళ ప్రమాదంలో ఉంది.
554
00:43:04,833 --> 00:43:09,713
నా నుండి ఫోన్ వచ్చేవరకు
నువ్వు ఆమె సురక్షితంగా ఉంచాలి.
555
00:43:09,713 --> 00:43:12,382
ఇది అనధికారికంగా చేయాలి,
ఎవరికీ తెలియకుండా.
556
00:43:12,382 --> 00:43:14,467
నేను నిన్ను నమ్మవచ్చా, డియాజ్?
557
00:43:16,094 --> 00:43:17,178
నమ్మవచ్చు, సర్.
558
00:47:27,887 --> 00:47:29,889
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
559
00:47:29,973 --> 00:47:31,975
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్