1 00:00:32,750 --> 00:00:36,291 క్రోనోస్ అనే గ్రీకు దేవుడి గురించి మీకు ఏమైనా తెలుసా? 2 00:00:41,000 --> 00:00:42,333 ఆయన కొడవలి పట్టుకుంటాడు. 3 00:00:48,250 --> 00:00:50,125 దానితో రంధ్రం చేశాడు... 4 00:00:53,750 --> 00:00:55,500 విశ్వంలో ఓ చీలిక... 5 00:00:58,833 --> 00:01:01,541 స్వర్గం మరియు భూమి మధ్యలో. 6 00:01:03,833 --> 00:01:06,125 ఈ ప్రపంచాన్ని తర్వాతి దానితో వేరు చేయడానికి. 7 00:01:07,833 --> 00:01:09,541 తెలిసిన వాటిని తెలియని వాటి... 8 00:01:12,916 --> 00:01:14,291 నుండి వేరు చేయడానికి. 9 00:01:23,750 --> 00:01:26,833 ప్రపంచం ఇలాంటి ఒకదాని కోసం ఎదురు చూస్తూ ఉంది. 10 00:01:27,708 --> 00:01:32,708 ఔటర్ రేంజ్ 11 00:01:48,875 --> 00:01:54,708 3 రోజుల ముందు 12 00:02:08,041 --> 00:02:09,916 నాకు మళ్ళీ ఆ కల వచ్చింది. 13 00:02:12,416 --> 00:02:14,708 రెబెక్కా నేరుగా చీకట్లోంచి బయటికి వచ్చింది. 14 00:02:17,041 --> 00:02:21,208 అమీ ఆమె చేతులలోకి పరిగెత్తింది. పెర్రీ కూడా. 15 00:02:23,166 --> 00:02:24,916 మేమంతా ఆనందంతో ఏడ్చేశాం. 16 00:02:27,208 --> 00:02:28,791 నాకు మేలుకోవాలని లేదు. 17 00:02:40,083 --> 00:02:42,041 రాయల్, ఆ విషయం పెర్రీకి చెప్పకు. 18 00:02:43,250 --> 00:02:44,500 అస్సలు చెప్పను. 19 00:04:49,208 --> 00:04:51,916 వద్దు, వద్దు. అయ్యో వద్దు. 20 00:04:53,458 --> 00:04:56,708 నీవు కత్తులు, కాటార్లతో పొడుస్తావు... 21 00:05:00,750 --> 00:05:01,958 శుభోదయం. 22 00:05:02,041 --> 00:05:04,166 -హే, ఏం చేస్తున్నావు? -ఏం లేదు. 23 00:05:05,333 --> 00:05:06,541 ఎలా ఉన్నావు? 24 00:05:07,416 --> 00:05:08,375 ఏంటి? 25 00:05:09,458 --> 00:05:11,583 అంకుల్ రెట్ వద్ద సారాయి వాసన వస్తోంది. 26 00:05:11,666 --> 00:05:13,791 వద్దు! నా మాంసం ముక్క నాకు ఇచ్చేయ్! 27 00:05:13,875 --> 00:05:16,333 చివరిసారి ఎప్పుడు స్నానం చేసావు? ఎవరితో? 28 00:05:16,416 --> 00:05:18,583 -వద్దు! -ఇంకా కాఫీ ఉందా, అమ్మా? 29 00:05:18,666 --> 00:05:21,208 నీవే చేసుకో. నాకు హ్యాంగ్ ఓవర్‌ లేదు. 30 00:05:29,000 --> 00:05:30,375 అందరూ విన్నారా? 31 00:05:31,333 --> 00:05:32,625 అంతా బాగానే ఉంది కదా? 32 00:05:36,500 --> 00:05:37,500 అవును. 33 00:05:38,833 --> 00:05:41,041 -నిజంగా? -నేను గుర్రాలకు మేత వేస్తాను. 34 00:05:41,166 --> 00:05:44,583 త్వరగా చేసేయ్. ఐదు నిమిషాల్లో చర్చికి వెళ్తున్నాం. 35 00:05:44,666 --> 00:05:46,791 ఎనిమిది కూడా కాలేదు. 36 00:05:47,958 --> 00:05:49,791 తాత, ఇప్పుడు పది అయింది. 37 00:05:53,083 --> 00:05:54,708 సెల్ ఫోన్ తెచ్చుకోవలసిన సమయం. 38 00:05:54,791 --> 00:05:58,541 సరే, అమీ. ఇటు రా. మనం ఆలస్యంగా వెళ్ళకూడదు. 39 00:05:59,375 --> 00:06:00,333 పదండి వెళ్దాం. 40 00:06:14,291 --> 00:06:18,250 ఎంత దృఢమైన పునాది 41 00:06:18,333 --> 00:06:21,500 యే ప్రభువు పరిశుద్ధులారా 42 00:06:21,583 --> 00:06:24,750 మీ విశ్వాసం కోసం వేయబడింది 43 00:06:24,833 --> 00:06:28,333 ఆయన అద్భుతమైన మాటలో 44 00:06:28,750 --> 00:06:32,125 ఆయన ఇంతకంటే ఏం చెప్పగలడు 45 00:06:32,333 --> 00:06:35,541 ఆయన నీకు చెప్పే దాని కంటే ఎక్కువ 46 00:06:36,000 --> 00:06:39,750 ఆశ్రయం కోసం 47 00:06:39,833 --> 00:06:42,625 యేసు వద్దకు పరిగెత్తిన నీకు 48 00:06:42,708 --> 00:06:44,208 హే, తాత. 49 00:06:46,333 --> 00:06:48,041 చూడు, ఇది నీ కోసం తయారు చేసాను. 50 00:06:49,250 --> 00:06:51,291 ధన్యవాదాలు, బంగారం. ఏంటిది? 51 00:06:51,750 --> 00:06:54,541 స్వర్గం అంటే ఎలా ఉంటుందని అనుకున్నామో అది గీయమన్నారు. 52 00:06:54,666 --> 00:07:00,083 అయితే, ఇది నేను, నీవు, బామ్మ, ఇది అంకుల్ రెట్. 53 00:07:00,583 --> 00:07:03,625 నాన్న, అమ్మ. మిగతా వాళ్ళు. 54 00:07:03,875 --> 00:07:06,583 నాకు నచ్చింది, బంగారం. ధన్యవాదాలు. దీనికి ధన్యవాదాలు. 55 00:07:06,666 --> 00:07:08,166 వెళ్లి మీ బామ్మను వెతుకు. 56 00:07:09,166 --> 00:07:13,166 అయితే సరే! అమేలియా కౌంటీ, సిద్ధంగా ఉన్నారా? 57 00:07:13,333 --> 00:07:18,333 ఈ వారం ఫైనల్స్‌లో రెట్ అబాట్ ఇక్కడ రెండో స్థానంలో మన ముందుకు వచ్చాడు. 58 00:07:18,416 --> 00:07:20,875 లీడర్‌బోర్డ్‌లో ముందుకెళ్ళి, మొదటి స్థానానికి 59 00:07:20,958 --> 00:07:23,666 చేరడానికి తన కెరీర్‌లోనే ఉన్నతస్థాయి విజయం కావాలి. 60 00:07:23,750 --> 00:07:29,750 ఆ ఆధిక్యం,మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని, చూపించడానికిది తన సమయం అనుకుంటున్నాడు. 61 00:07:47,458 --> 00:07:48,625 కానీయ్, రెట్! 62 00:07:52,291 --> 00:07:53,583 అమేలియా కౌంటీ రోడియో 63 00:08:07,000 --> 00:08:08,958 సరిపోలేదు. నేను ముందుకెళ్ళడం లేదు. 64 00:08:09,041 --> 00:08:12,291 లేదు, నీవు బానే చేసావు. ఆ ఎద్దు సరిగా ఎక్కించుకోలేదు. 65 00:08:12,833 --> 00:08:14,916 హే, వచ్చేసారి సాధిస్తావులే. 66 00:08:15,125 --> 00:08:17,458 అవును, అదొక చెత్త ఎద్దు, రెట్. 67 00:08:17,541 --> 00:08:18,833 -హే ఆపు. -జాగ్రత్త, అమీ. 68 00:08:18,916 --> 00:08:20,375 అది తాత అన్నాడు, నేను కాదు! 69 00:08:20,791 --> 00:08:22,125 మనం ఇంట్లో కలుసుకుందాం. 70 00:08:23,416 --> 00:08:25,125 -సరే కలుద్దాం. -బై. 71 00:08:36,041 --> 00:08:38,541 నేరుగా వెళ్ళి మంచం ఎక్కు. ఉదయం 4 హెచ్ ఉంది. 72 00:08:38,625 --> 00:08:40,875 ఈ కథ దీని గురించి... దాన్ని ఏమంటారు? 73 00:08:40,958 --> 00:08:42,458 ఖగోళశాస్త్రజ్ఞుడు. 74 00:08:51,833 --> 00:08:54,208 నీవు, తాత ఎలా కలుసుకున్నారో చెబుతావా? 75 00:08:56,083 --> 00:08:57,958 ఆ కథ నీకు చెప్పేసాను. 76 00:08:58,291 --> 00:09:01,583 తెలుసు, కానీ... మళ్ళీ చెప్పు. 77 00:09:02,583 --> 00:09:06,833 సరే, మేము చాలా ఏళ్ల క్రితం కలుసుకున్నాము. 78 00:09:07,541 --> 00:09:09,291 మీ తాత కష్టపడి పెరిగారు. 79 00:09:10,083 --> 00:09:13,166 తన సొంత తల్లి, తండ్రి ఎవరో తెలియదు. 80 00:09:13,250 --> 00:09:17,208 ఒక రోజు, ఏదో జరిగింది, అది అతన్ని పారిపోయేలా చేసింది. 81 00:09:17,291 --> 00:09:19,125 తనకు గుర్తు లేదని అంటాడు. 82 00:09:19,500 --> 00:09:25,041 మా వాళ్ళకు దొరికాడు. తను నీ అంత వయసులోనే ఈ పొలానికి చేరుకున్నాడు. 83 00:09:27,375 --> 00:09:30,166 నా జీవితమంతా అతని కోసమే ఎదురు చూసానేమో అనిపిస్తుంది. 84 00:09:48,333 --> 00:09:49,416 శాంతించు. 85 00:11:17,208 --> 00:11:18,541 హలో. 86 00:11:21,166 --> 00:11:24,750 హే. 87 00:11:26,958 --> 00:11:29,083 నీవూ అనుభూతి చెందుతున్నావు, కదా బాబూ? 88 00:11:29,166 --> 00:11:31,750 నీవు కూడా అనుభూతి చెందుతున్నావు కదా మిత్రమా? 89 00:11:33,791 --> 00:11:35,083 నీవు అనుభూతి చెందుతున్నావు 90 00:11:37,416 --> 00:11:38,750 నాకు వినబడుతోంది. 91 00:11:49,750 --> 00:11:50,708 హలో. 92 00:11:50,791 --> 00:11:52,250 ఏదో వస్తోంది. 93 00:11:54,083 --> 00:11:55,875 ఏదో జరుగుతోంది. 94 00:11:56,750 --> 00:12:00,166 వేన్. నువ్వేనా? తాగి ఉన్నావా? 95 00:12:00,875 --> 00:12:02,125 లేదు. 96 00:12:04,750 --> 00:12:06,958 -ఎవరు అది? -వేన్. 97 00:12:07,291 --> 00:12:08,375 వాగుతున్నాడు. 98 00:12:34,666 --> 00:12:36,333 279 మాత్రమే వస్తోంది. 99 00:12:36,416 --> 00:12:37,750 అయితే, మళ్ళీ లెక్కపెట్టు. 100 00:12:37,833 --> 00:12:38,875 రెండుసార్లు పెట్టా. 101 00:12:40,041 --> 00:12:42,125 మళ్ళీ ఆ దక్షిణం వైపు కంచె అంటావా? 102 00:12:42,208 --> 00:12:43,750 నేను చూసాను, అది బానే ఉంది. 103 00:12:43,833 --> 00:12:45,416 ఛ, ఖచ్చితంగానా? 104 00:12:48,333 --> 00:12:49,208 సరే. 105 00:12:53,125 --> 00:12:54,666 -రెండు కనబడడం లేదు. -ఏంటీ? 106 00:12:54,750 --> 00:12:57,000 -నీవు చూశావా... -దక్షిణం వైపు కంచె బాగుంది. 107 00:12:57,416 --> 00:12:58,500 రెట్ ఎక్కడున్నాడు? 108 00:12:58,583 --> 00:13:00,208 అది చెప్పడం చాలా కష్టం. 109 00:13:00,333 --> 00:13:03,166 వాడి బెడ్రూమ్ చూసేదాన్ని, కానీ ఇంకెవరు కనబడతారో అని భయం. 110 00:13:07,291 --> 00:13:08,708 -హే. -హే. 111 00:13:09,541 --> 00:13:12,625 నీ బాధ్యతల నుండి తప్పించబోతున్నాను అని నీవనుకుంటుంటే, 112 00:13:12,708 --> 00:13:16,333 నీ ఆలోచన తప్పు. డ్రెస్ వేసుకో, మనం కంచెలను చూడడానికెళ్తున్నాం. 113 00:13:20,500 --> 00:13:21,458 ఆమె నీకు తెలుసా? 114 00:13:23,166 --> 00:13:24,375 నాకైతే గుర్తులేదు. 115 00:13:25,125 --> 00:13:26,541 నేనేమైనా చేయగలనా? 116 00:13:26,625 --> 00:13:28,333 దేవుడా, చెయ్యగలరని ఆశిస్తున్నా. 117 00:13:28,500 --> 00:13:30,541 అబాట్ రాంచ్ కోసం వెతుకుతున్నాను. 118 00:13:31,666 --> 00:13:32,875 దగ్గర్లో ఉన్నానా? 119 00:13:33,166 --> 00:13:35,000 అవును, అక్కడే ఉన్నావు. అది నాదే. 120 00:13:35,250 --> 00:13:37,291 ఎక్కడ నుండి వచ్చావు, బౌల్డర్? మిస్సౌలా? 121 00:13:37,791 --> 00:13:42,250 బౌల్డర్. ఏం చూసి గుర్తుపట్టారు? జుట్టును చూసా? 122 00:13:44,208 --> 00:13:46,750 మొత్తం వేషధారణ చూసి. నిన్ను ఎవరైనా పంపారా? 123 00:13:47,541 --> 00:13:52,375 అంటే, టౌన్‌లో ఒకతను ఉన్నాడు, మీరొక పరిరక్షకుడని, మీ పొలాన్ని 124 00:13:53,000 --> 00:13:55,291 బాగా నిర్వహిస్తారని, ఇలా చాలా చెప్పాడు. 125 00:13:55,458 --> 00:13:57,208 సరే. నీవు నిరాశ్రయురాలివా? 126 00:13:57,583 --> 00:13:58,666 కాదు. 127 00:13:58,833 --> 00:14:00,000 మరి ఏంటి నీవు? 128 00:14:00,083 --> 00:14:01,250 నేను కవయిత్రిని. 129 00:14:01,333 --> 00:14:03,291 -నీవు కవయిత్రివా? -కవయిత్రిని. 130 00:14:03,791 --> 00:14:05,791 మేం కవితల కోసం ఏం చూడట్లేదు. 131 00:14:06,208 --> 00:14:07,750 మంచిది, నేనూ అమ్మడం లేదు. 132 00:14:09,000 --> 00:14:10,791 మరి ఇక్కడికెందుకు వచ్చావు? 133 00:14:12,500 --> 00:14:15,875 శాంతి, జ్ఞానోదయం, స్ఫూర్తి. 134 00:14:16,500 --> 00:14:20,500 తమాషాగా అన్నాను. నిజం చెప్పాలంటే, క్యాంపు కోసం మంచి స్థలానికై వెతుకుతున్నా. 135 00:14:20,583 --> 00:14:22,000 కొద్ది రోజులే. 136 00:14:22,541 --> 00:14:25,333 మాది యాత్రికుల పొలం కాదు, పశువుల దొడ్డి. 137 00:14:25,791 --> 00:14:27,000 నాకు తెలుసు. 138 00:14:30,791 --> 00:14:32,166 నేను డబ్బులు ఇస్తాను. 139 00:14:33,458 --> 00:14:35,375 ఇదిగో, తీసుకోండి. మీకు అవసరమని తెలుసు. 140 00:14:35,458 --> 00:14:37,041 అది నీకెలా తెలుసు? 141 00:14:37,125 --> 00:14:39,625 నా ఉద్దేశ్యం, మీది కుటుంబాలుండే పొలం,... 142 00:14:44,083 --> 00:14:46,708 ఏమంటారు? నేను క్యాంపుకని మాత్రమే చూస్తున్నా. 143 00:14:52,583 --> 00:14:53,833 సరే. 144 00:14:54,916 --> 00:14:59,000 పడమర వైపు బయలులో ఉండు. ఎర్రటి గుర్తులు గల కంచె పక్కగా వెళ్ళు. 145 00:14:59,083 --> 00:15:01,458 నీటి కోసం దొడ్డిలో ఒక కొళాయి ఉంది. 146 00:15:01,541 --> 00:15:03,291 హమ్మయ్య, ధన్యవాదాలు, సర్. 147 00:15:03,375 --> 00:15:05,166 హా, రాయల్. కేవలం రాయల్. 148 00:15:05,541 --> 00:15:06,791 ఆటమ్. 149 00:15:12,541 --> 00:15:14,208 ఎట్టకేలకు మిమ్మల్ని కలవడం సంతోషం. 150 00:15:21,375 --> 00:15:23,875 అంత డబ్బుండి, కారు లేకుండా ఎవరుంటారు? 151 00:15:24,875 --> 00:15:25,958 ఆమె. 152 00:15:26,583 --> 00:15:29,625 రా, ఇంకా రెండు ఆవులు కనిపించడం లేదు. 153 00:16:10,166 --> 00:16:13,625 నేను నిన్ను చూస్తాను నీవు నన్ను చూడు 154 00:16:13,833 --> 00:16:14,958 అబ్బాయిలూ. 155 00:16:15,500 --> 00:16:17,083 మీ నాన్న సర్జరీ ఎలా జరిగింది? 156 00:16:17,166 --> 00:16:19,541 పర్వాలేదు థాంక్స్. ఊరికే అలా వచ్చి... 157 00:16:19,666 --> 00:16:22,083 మీ ఇంటికెళితే, సిసిలియా కొన్ని పోయాయంది? 158 00:16:22,166 --> 00:16:24,291 దొరుకుతాయి. మీ అభిమానం అభినందనీయం. 159 00:16:25,000 --> 00:16:26,500 మీ కోసం ఏమి చేయగలం? 160 00:16:26,625 --> 00:16:28,958 ఈ విషయం స్వయంగా చెబితే బాగుంటుందని... 161 00:16:29,041 --> 00:16:30,666 ఓ మైలు దాటారని చట్టం చెబుతుంది. 162 00:16:30,750 --> 00:16:32,750 మీ కంచెలను జరపడానికి 30 రోజుల సమయముంది. 163 00:16:32,833 --> 00:16:35,958 లేకపోతే 80,000 డాలర్ల జరిమానా విధిస్తారు, మేం కోర్టుకెళ్తాం. 164 00:16:36,625 --> 00:16:40,250 సరే. ఇది అసలు దేని గురించి? నీటి హక్కులా? డ్రిల్లింగా? 165 00:16:40,333 --> 00:16:41,916 కేవలం వ్యాపారమే. 166 00:16:42,000 --> 00:16:43,791 ఇది అర్థం లేనిది, మీకు కూడా తెలుసు. 167 00:16:43,875 --> 00:16:46,000 నిజం చెబుతున్నా, నాకూ అర్థం కాలేదు. 168 00:16:46,083 --> 00:16:47,958 కానీ ఏదో మా నాన్నలో చిచ్చు రేపింది. 169 00:16:48,416 --> 00:16:50,375 -ఆయనతో మాట్లాడాలనుకుంటే... -లేదు. 170 00:16:50,500 --> 00:16:52,333 చర్చించడానికి ఇక్కడేం లేదు, ల్యూక్. 171 00:16:52,416 --> 00:16:55,083 ఆ ఉత్తరం స్వయంగా కౌంటీ మదింపుదారు నుండే వచ్చింది, 172 00:16:55,166 --> 00:16:58,166 వాస్తవమేమిటంటే, మీరు కొంత భూమిని పోగొట్టుకోబోతున్నారు. 173 00:17:01,083 --> 00:17:02,208 బిల్లీ! 174 00:17:02,666 --> 00:17:03,958 ఇది దొంగతనం కాదు. 175 00:17:04,125 --> 00:17:05,458 ఇదంతా చట్టబద్ధమైనది. 176 00:17:05,500 --> 00:17:06,458 బిల్లీ! 177 00:17:06,500 --> 00:17:10,250 -నాన్నతో మాట్లాడతాను, ఏం చెబుతాడో చూద్దాం. -మౌనంగా ఉంటావా? 178 00:17:10,333 --> 00:17:12,875 మీ కుటుంబం ఎన్నో బాధలు పడిందని నాకు తెలుసు. 179 00:17:12,958 --> 00:17:15,041 నేను చెప్పినట్లుగా, అది కేవలం వ్యాపారం. 180 00:17:15,500 --> 00:17:17,250 ల్యూక్, పద వెళ్దాం! 181 00:17:26,416 --> 00:17:27,583 ఇది చట్టబద్ధమైనదేనా? 182 00:17:28,125 --> 00:17:29,250 అలానే అనిపిస్తోంది. 183 00:17:29,333 --> 00:17:31,000 లాయర్‌కు ఫోన్ చేయమంటావా? 184 00:17:31,208 --> 00:17:32,583 అది నేను చూసుకుంటాను. 185 00:17:33,250 --> 00:17:36,875 పెద్ద వేన్ ఏదో చేయబోతున్నాడు లేదా మతితప్పింది. ఏది ఏమైనాకాని. 186 00:17:37,458 --> 00:17:39,125 పదండి, వీటిని వెతుకుదాం. 187 00:17:40,375 --> 00:17:44,708 రెట్, నీవు ఉత్తరం వైపు వెళ్ళు. పెర్రీ, దక్షిణం వైపు. నేను పడమరకు వెళ్తాను. 188 00:22:02,333 --> 00:22:05,541 అమేలియా కౌంటీ షెరీఫ్ 189 00:22:16,916 --> 00:22:18,125 జాయ్ వచ్చింది. 190 00:22:34,166 --> 00:22:35,416 హాయ్, రాయల్. 191 00:22:41,250 --> 00:22:42,416 హలో చెప్పు. 192 00:22:43,208 --> 00:22:44,375 హాయ్, జాయ్. 193 00:22:46,666 --> 00:22:50,416 ఎఫ్‌బిఐ రెబెక్కా కోసం వెతకడం మానేస్తోందని జాయ్ మాకు చెబుతోంది. 194 00:22:51,083 --> 00:22:55,000 ఇప్పటికే వారితో మాట్లాడి, వీలైనన్ని జవాబులు పొందాలని చూశాను, కానీ... 195 00:22:55,083 --> 00:22:56,000 ఇప్పుడు ఎందుకు? 196 00:22:56,166 --> 00:22:57,791 ఎందుకు వెతకటం మానేస్తున్నారు? 197 00:22:58,291 --> 00:22:59,583 తొమ్మిదో నెల పరిమితి. 198 00:22:59,708 --> 00:23:02,833 తనకు తానుగా వెళ్లిపోయుంటే ప్రాధాన్యత తగ్గుతుంది. 199 00:23:03,250 --> 00:23:06,833 తను అమీని వదిలివెళ్ళే అవకాశమే లేదని వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పాలి. 200 00:23:06,916 --> 00:23:07,875 నాకు తెలుసు. 201 00:23:07,958 --> 00:23:10,875 అయితే రెబెక్కా నీతో మాట్లాడిన చివరి విషయం... 202 00:23:10,958 --> 00:23:14,500 నేను ఆ ప్రశ్నకు జవాబిచ్చాను. సమాచారం దాస్తున్నానని అనుకుంటున్నారా? 203 00:23:14,583 --> 00:23:16,958 -మేమేమి దాచడం లేదు. -సాయం చేస్తున్నామంతే. 204 00:23:17,041 --> 00:23:18,791 -ఇది సాయంచేయడం కాదు. -అబ్బాయిలూ. 205 00:23:18,875 --> 00:23:20,791 నాకు తెలుసు. నాకు తెలుసని మీకు తెలుసు. 206 00:23:22,041 --> 00:23:24,000 హే. పెర్రీ, నా వైపు చూడు. 207 00:23:27,291 --> 00:23:28,625 ఇది చాలా కష్టమని తెలుసు. 208 00:23:29,833 --> 00:23:33,041 నేను వదిలేయడం లేదు. ఓ స్నేహితురాలిగా మాట్లాడుతున్నాను. 209 00:23:33,125 --> 00:23:35,166 మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. 210 00:23:47,333 --> 00:23:50,333 ప్రియమైన దేవుడా, భూమి కోసం మీకు ధన్యవాదాలు. 211 00:23:51,000 --> 00:23:52,666 మా ఆరోగ్యం కోసం మీకు ధన్యవాదాలు. 212 00:23:52,750 --> 00:23:55,166 బామ్మ, తాతల కోసం మీకు ధన్యవాదాలు. 213 00:23:55,250 --> 00:23:57,166 అంకుల్ రెట్‌ కోసం మీకు ధన్యవాదాలు. 214 00:23:57,666 --> 00:24:00,541 దయచేసి అమ్మను ఇంటికి తీసుకురండి. ఆమెన్. 215 00:24:01,625 --> 00:24:02,625 ఆమెన్. 216 00:25:26,583 --> 00:25:30,041 స్టేట్ అఫ్ వయోమింగ్ అమేలియా కౌంటీ మదింపుదారు కార్యాలయం 217 00:25:38,166 --> 00:25:40,250 ఏం జరుగుతోంది అసలు? 218 00:25:42,041 --> 00:25:43,458 ఛ! 219 00:26:20,541 --> 00:26:21,375 శుభోదయం. 220 00:26:23,500 --> 00:26:25,708 -ఆకలిగా ఉందా? -లేదు, ధన్యవాదాలు. 221 00:26:26,541 --> 00:26:28,083 ఇక్కడంతా బాగానే ఉంది కదా? 222 00:26:28,458 --> 00:26:29,500 చాలా బాగుంది. 223 00:26:30,250 --> 00:26:32,333 మీకు చాలా పెద్ద పొలం ఉంది. 224 00:26:32,458 --> 00:26:36,000 ఇక్కడ ఏదో ప్రత్యేకమైనది ఉంది, తెలుసా. 225 00:26:36,416 --> 00:26:37,500 నాకు తెలుసు. 226 00:26:39,416 --> 00:26:41,250 కబుర్లు చెప్పడానికే వచ్చారా? 227 00:26:41,791 --> 00:26:43,458 లేదు, నేను... 228 00:26:44,458 --> 00:26:48,791 ఓ పని చేయి. దీనికి, వాగుకు మధ్యన ఉండు, సరేనా? 229 00:26:49,583 --> 00:26:51,833 పడమర బయలులో ఉండమన్నానని తెలుసు, కానీ... 230 00:26:53,583 --> 00:26:55,416 నీవు ఇక్కడున్నావని ఎవరికైనా తెలుసా? 231 00:26:55,541 --> 00:26:58,041 ఇక్కడ సెల్ సిగ్నల్ అందదు. నీకేమన్నా అయితే... 232 00:26:58,125 --> 00:26:59,333 నాకు ఏమీ కాదు. 233 00:27:00,458 --> 00:27:01,416 సరే. 234 00:27:01,708 --> 00:27:03,083 అంత ఖచ్చితంగా ఎలా చెబుతావు? 235 00:27:03,541 --> 00:27:04,750 నేను భద్రంగా ఉంటా. 236 00:27:05,291 --> 00:27:09,083 ప్రపంచం ఎలా ఆడాలో అలా ఆడుతుంది. చింతించాల్సింది ఏం లేదు. 237 00:27:09,208 --> 00:27:11,625 ఒకవేళ అది చెడుగా మారితే? 238 00:27:12,250 --> 00:27:13,333 ఎలా చెడుగా? 239 00:27:13,750 --> 00:27:15,916 అది నీ నెమలి విషయంలో చేసినట్లుగా. 240 00:27:19,625 --> 00:27:21,541 ఈ పొలాన్ని ఎంతకు అమ్ముతారు? 241 00:27:22,208 --> 00:27:23,375 నేను అమ్మను. 242 00:27:24,333 --> 00:27:26,041 మీరు ఆ మాటే అంటారని అనుకున్నా. 243 00:27:26,708 --> 00:27:29,625 నాకు తెలిసినదాని ప్రకారం, అది ఎప్పుడోకప్పుడు చేయాల్సిందే. 244 00:27:29,708 --> 00:27:31,125 ఆ విషయం నా భార్యకు చెప్పు. 245 00:27:31,208 --> 00:27:34,958 తన కుటుంబంలో 100 ఏళ్లకు పైగా ఉన్నాను, ఒక్క ప్రతిపాదనా అందుకోలేదు. 246 00:27:35,041 --> 00:27:36,208 అది మీ భార్య విషయం. 247 00:27:37,625 --> 00:27:38,583 మీ సంగతి ఏంటి? 248 00:27:41,250 --> 00:27:42,875 చెప్పండి, దాని ధర ఎంత? 249 00:27:44,583 --> 00:27:45,666 యాభై లక్షలు? 250 00:27:47,000 --> 00:27:47,833 ఆరవై? 251 00:27:48,416 --> 00:27:50,208 నీ దగ్గర ఉన్నట్లే మాట్లాడుతున్నావు. 252 00:27:51,208 --> 00:27:52,375 బహుశా ఉందేమో. 253 00:27:53,125 --> 00:27:54,083 నిరూపించు. 254 00:27:57,750 --> 00:28:00,458 ఒక మహిళ తన రహస్యాలు దాచుకోవాలి కదా? 255 00:28:01,875 --> 00:28:03,375 మీరు మీవి చెబితే తప్ప. 256 00:28:07,250 --> 00:28:09,791 మీరు పంచుకోవాలనుకునే రహస్యాలేమైనా ఉన్నాయా, రాయల్? 257 00:28:14,083 --> 00:28:16,000 ఎప్పుడైనా అలా అనిపిస్తే, ఇక్కడే ఉంటాను. 258 00:28:50,666 --> 00:28:53,125 హే, గురూ, క్షమించు. అది కాదు నా ఉద్దేశ్యం... 259 00:28:53,500 --> 00:28:56,958 నీవు మొత్తం చెప్పావని నాకు తెలుసు, నా ఉద్దేశ్యం నిన్ను... 260 00:28:57,041 --> 00:29:01,125 అందరం దాన్ని కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నాం. 261 00:29:11,083 --> 00:29:13,333 హే, డ్రింక్ తాగుతావా? 262 00:29:13,500 --> 00:29:14,500 వస్తావా? 263 00:29:20,625 --> 00:29:24,208 నేను దీని కోసం గత పదేళ్ళు వృధా చేశానేమో? 264 00:29:24,916 --> 00:29:27,541 అంటే, నా వయసులో నీకు భార్య, బిడ్డ ఉన్నారు. 265 00:29:28,083 --> 00:29:31,125 ఇదొక పతనం, తర్వాతి దాంట్లో బాగా ప్రయాణిస్తావు. 266 00:29:31,625 --> 00:29:36,458 కొన్ని రిస్క్‌లు తీసుకో, కానీ వాటి గురించి పశ్చాతాప పడకు, నేను చెప్పేది అంతే. 267 00:29:37,333 --> 00:29:38,458 నిజమే. 268 00:29:39,791 --> 00:29:42,708 అయితే ఈ టకీలా విషయంలో పశ్చాత్తాప పడతామనుకుంటా. 269 00:29:52,666 --> 00:29:55,083 -నాలుగు షాట్‌లు. -సరే, నాలుగు షాట్‌లు టకీలా. 270 00:29:55,291 --> 00:29:56,833 మరియా ఇక్కడేం చేస్తోంది? 271 00:29:57,166 --> 00:29:58,833 నాకు తెలియదు. 272 00:30:01,166 --> 00:30:02,291 ఏంటి? 273 00:30:02,750 --> 00:30:03,916 ఏంటి? 274 00:30:04,375 --> 00:30:05,500 ఏంటి? 275 00:30:06,208 --> 00:30:09,500 నీకు 16 ఏళ్ల నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు. 276 00:30:09,583 --> 00:30:12,833 ఎంత ఆలోచించినా తెలుసుకోలేకపోయాను మీరిద్దరూ ఎందుకు కలవలేదని? 277 00:30:12,916 --> 00:30:14,250 -నాకు తెలుసు. -అవునా? 278 00:30:14,333 --> 00:30:17,875 ఆమె బాయ్‌ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళాడు. నేనిక్కడే ఉన్నాను. 279 00:30:17,958 --> 00:30:22,166 నీవెళ్ళి తనతో డాన్స్ చేయడానికి ఎన్ని సాకులు చెబుతావు? 280 00:30:22,250 --> 00:30:23,583 లే! 281 00:30:23,666 --> 00:30:26,958 కానీయ్, వెధవ! పైకి లే! 282 00:30:27,416 --> 00:30:29,250 వెళ్లి, ఆ అమ్మాయిని తీసుకురా! కానీయ్! 283 00:30:33,000 --> 00:30:35,250 హే, ఏడుపుగొట్టు. ఇది అమ్మాయిల రాత్రి. 284 00:30:58,083 --> 00:31:00,291 రాయల్, ఇక్కడ లోపల ఉన్నావా? 285 00:31:01,250 --> 00:31:02,833 ఒక్క నిమిషం ఆగు. 286 00:31:37,875 --> 00:31:41,458 రెబెక్కా శాశ్వతంగా వెళ్ళిపోయింది అనుకుంటా. 287 00:31:44,000 --> 00:31:47,125 పెర్రీకి లేదా అమీకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. 288 00:31:54,458 --> 00:31:56,333 ఇది దేవుడి ప్రణాళికలో భాగమా? 289 00:32:03,875 --> 00:32:05,875 -నీవు అది నమ్ముతావా? -నమ్మను. 290 00:32:18,166 --> 00:32:19,208 నాకు తెలియదు. 291 00:32:36,333 --> 00:32:41,750 తెలుసా... మనకు బాధ కలిగిందంటే, దానర్థం దేవుడు లేడని కాదు. 292 00:32:48,375 --> 00:32:52,208 దానితో పోరాడకూడదు. దాన్ని అంగీకరించాలి అంతే. 293 00:32:54,708 --> 00:32:56,416 పర్వాలేదు. అదంతే. 294 00:33:04,250 --> 00:33:05,500 కాదు, అలా కాదు. 295 00:33:30,166 --> 00:33:34,625 నేను అనేది అదే. అంటే, లాభార్జనే లక్ష్యంగా గల అలాంటి వ్యక్తులతో పోటీపడలేము. 296 00:33:35,333 --> 00:33:38,166 నాన్న చెప్పే ఆ పాత కాలపు పద్ధతులు అవీ... 297 00:33:38,250 --> 00:33:40,708 చూడు, కుటుంబం ఇంకా భూమి అనేవి 298 00:33:40,791 --> 00:33:44,166 ఎప్పటికీ ఆయనకు డబ్బు కంటే ఎక్కువ ముఖ్యమైనవి. 299 00:33:45,375 --> 00:33:47,458 ఆయనకు తెలిసింది ఒక్క దారే. 300 00:33:49,083 --> 00:33:50,250 అవునవును. 301 00:33:50,875 --> 00:33:53,666 ఆ దారికి మూల్యంగా ఆయన మొత్తం భూమి వదులుకోవాలి. 302 00:33:55,208 --> 00:33:58,250 -మనం పదేళ్ల క్రితమే అమ్మి ఉంటే... -అబ్బా. 303 00:33:59,166 --> 00:34:00,166 హే. 304 00:34:01,958 --> 00:34:04,041 -నాకు ఒక మాటివ్వు. -ఏంటి? 305 00:34:05,750 --> 00:34:08,125 ఆ రోడియో విషయాన్ని వదిలేయొద్దు. 306 00:34:09,041 --> 00:34:11,166 అలాగే, నాకు తెలుసు, ఒకటి చెప్పనా... 307 00:34:11,291 --> 00:34:14,208 ముందుకెళ్ళడం గురించైతే, ఎద్దుల స్వారీ చేస్తూనే ఉంటాను. 308 00:34:14,291 --> 00:34:16,875 ముందుకెళ్ళడం. దేని నుండి ముందుకెళ్ళడం? 309 00:34:17,416 --> 00:34:20,083 పెర్రీ, మరీలే. రెబెక్కా నుండి. 310 00:34:28,666 --> 00:34:32,500 ఛ, క్షమించు. నేను తాగి ఉన్నాను. అదొక... 311 00:34:33,666 --> 00:34:35,958 తెలివిలేకుండా అనేశాను. 312 00:34:44,541 --> 00:34:47,291 నాకిక ఓపిక, శక్తి నశించిందనుకుంటా. 313 00:34:47,375 --> 00:34:50,750 బాధ పడకు, హే. హే, నేను చెప్పేది విను. 314 00:34:51,208 --> 00:34:54,458 నీవు బాగుంటావు. సరేనా? 315 00:34:56,458 --> 00:34:58,333 అమీ కూడా. నన్ను నమ్ము. 316 00:35:01,333 --> 00:35:04,250 హే, బానే ఉన్నావా? బయటకు వెళ్ళాలా? 317 00:35:05,000 --> 00:35:09,958 సరే. వెళ్లి వాంతి చేసుకొని లోపలికి రా, మన బీర్లను పూర్తి చేద్దాం. 318 00:35:17,458 --> 00:35:19,041 హే, బానే ఉన్నావా? 319 00:35:21,166 --> 00:35:24,458 చెత్త నా వెధవ! ఏంటిది? 320 00:35:24,541 --> 00:35:26,708 నీకొకటి తెలుసా, నేను లోపలికెళుతున్నా. 321 00:35:27,000 --> 00:35:29,583 నీకేమైంది, చెత్త వెధవా? 322 00:35:30,625 --> 00:35:32,208 రెండు బీర్లు ఇవ్వు. 323 00:35:34,000 --> 00:35:35,083 నీవు ఇరుక్కుపోయావు. 324 00:35:36,000 --> 00:35:36,958 ఏంటీ? 325 00:35:37,041 --> 00:35:40,916 నిన్ను ఆ ఎద్దుపైకి ఎక్కించిన వారు నిన్ను ఇరికించేసారు. నీవంతకంటే మెరుగు. 326 00:35:41,833 --> 00:35:44,500 గత ఐదేళ్లలో నీవు మరీ దిగజారుంటే తప్ప. 327 00:35:46,666 --> 00:35:48,625 నిన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. 328 00:35:48,708 --> 00:35:52,750 చదువు ఏమైంది? నీవు పశువైద్యురాలు అలాంటిదేదో అవుతావనుకున్నాను. 329 00:35:52,833 --> 00:35:56,625 అలసటతో నా ఆరోగ్యం పాడుచేసుకున్నాను, ఇంటిని మిస్ అయ్యాను. 330 00:35:56,958 --> 00:35:58,333 ఈ ఊరిని మిస్ అయ్యావా? 331 00:35:58,416 --> 00:36:01,500 ఒక రకంగా. మిస్ అయ్యాను, అంటే మిగతా వాటితో పాటు. 332 00:36:03,875 --> 00:36:06,833 సరే, నీ సంగతి ఏంటి? ఎట్టకేలకు ఆ పొలాన్ని వదిలేసావా? 333 00:36:07,291 --> 00:36:09,375 లేదు. వదిలేయలేదు. 334 00:36:09,500 --> 00:36:12,500 నీవు చేయబోయే మొదటి పని పారిపోవడం అని చెప్పావు. 335 00:36:17,666 --> 00:36:19,500 ఇదిగో. డబ్బులు నేను ఇస్తాను. 336 00:36:20,333 --> 00:36:22,125 అది నీ కుర్రాడి కోసం కాదా? 337 00:36:22,208 --> 00:36:24,458 ట్రెవర్? కాదు. 338 00:36:26,041 --> 00:36:27,625 తను నావాడు కాదు. 339 00:36:29,541 --> 00:36:30,791 నీకు... 340 00:36:32,500 --> 00:36:33,916 నీకు... 341 00:36:35,083 --> 00:36:36,625 ఓహ్, ఛ. ఒక్క సెకండ్. 342 00:36:38,000 --> 00:36:41,041 శాంతించు. ఓసారి లోపలికెళ్ళి, ల్యూక్‌ను వెతకొచ్చు కదా? 343 00:36:41,125 --> 00:36:42,333 -ల్యూక్‌ను వెతకాలా? -హే. 344 00:36:42,416 --> 00:36:45,208 చావు, వెధవ! నువ్వు వివరణ ఇస్తే మంచిది. 345 00:36:45,291 --> 00:36:48,375 -తనను ముట్టుకున్నావంటే, కిందికి తోస్తా. -అది సరైనదా? 346 00:36:48,750 --> 00:36:52,875 నీవు ఎద్దు స్వారీ చేసినట్లే పోట్లాడితే, తప్పకుండా నేనే గెలుస్తాను. 347 00:37:20,208 --> 00:37:22,333 త్వరగా ఓ నిజం చెప్పనా? 348 00:37:24,125 --> 00:37:26,500 నేను పెద్దగా సంపాదించనని తెలుసు, 349 00:37:27,500 --> 00:37:30,583 కానీ నీవు కలుసుకోబోయే అతి పెద్ద వెధవ వాడే. 350 00:37:32,166 --> 00:37:33,833 నేనెళ్ళి ట్రక్ తీసుకొస్తాను. 351 00:37:39,541 --> 00:37:40,541 అబ్బాయిలూ. 352 00:37:54,083 --> 00:37:55,291 పద వెళ్దాం. రా. 353 00:38:06,458 --> 00:38:07,833 చెత్త నా కొడుకా. 354 00:38:09,916 --> 00:38:13,958 మా నాన్న మీ భూమి వెంట పడ్డాడని మీ అందరి గురించి బాధ పడ్డాను, 355 00:38:14,083 --> 00:38:15,791 కానీ ఇప్పుడు లెక్క చెయ్యను. 356 00:38:15,875 --> 00:38:20,541 మీకు ఉన్నదంతా తీసేసుకుంటాం. నీ ప్రపంచమంతా అదృశ్యమవుతుంది, 357 00:38:20,625 --> 00:38:22,250 నీ చెత్త భార్య మాదిరిగానే. 358 00:38:24,458 --> 00:38:27,625 తనకు నీకంటే మంచోడు దొరికాడని ఒప్పుకోవడానికి సిగ్గుగా ఉందా? 359 00:38:27,791 --> 00:38:30,750 లేదా తను తెలివి తెచ్చుకొని, నీ నుండి పారిపోయి... 360 00:40:08,291 --> 00:40:09,583 పెర్రీ. 361 00:40:10,791 --> 00:40:14,041 నన్నేం చేయమంటావో చెప్పు. సరేనా? 362 00:40:17,333 --> 00:40:21,583 రెండు గంటలలో హాస్పిటల్‌కు తీసుకెళ్ళమంటావా అనేది నీవే చెప్పాలి. 363 00:40:21,666 --> 00:40:25,000 షెరీఫ్ దగ్గరకు తీసుకెళ్ళమంటావా అనేది నీవే చెప్పాలి. 364 00:40:31,458 --> 00:40:32,500 పెర్రీ! 365 00:41:52,750 --> 00:41:54,083 ఏంటిది? 366 00:42:18,708 --> 00:42:20,000 తన అన్నలకు తెలుసా? 367 00:42:20,083 --> 00:42:22,125 లేదు. వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. 368 00:42:23,208 --> 00:42:26,541 మేమేం అనుకన్నామంటే, తనను మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే, తను... 369 00:42:26,625 --> 00:42:28,083 అసలు తను ఇక్కడికెందుకొచ్చాడు? 370 00:42:44,708 --> 00:42:45,625 సరే. 371 00:42:47,916 --> 00:42:49,000 దీన్ని సరిచేద్దాం. 372 00:42:53,125 --> 00:42:54,750 షెరీఫ్‌కు కాల్ చేయటం లేదా? 373 00:42:54,833 --> 00:42:58,000 నేను పొరపాటు చేశాను, సరేనా? దీన్ని మీ సమస్యగా చేసుకోకండి. 374 00:42:58,083 --> 00:43:01,250 ఫోన్ చేస్తే, మీరిద్దరూ జైలుకు వెళ్తారు, నీవొక్కడివే కాదు. 375 00:43:01,875 --> 00:43:03,208 నీకు అర్థమవుతోంది కదా? 376 00:43:04,958 --> 00:43:06,041 అది తీసెయ్. 377 00:43:08,666 --> 00:43:11,000 నేను, నీ తమ్ముడు దీని సంగతి చూస్తాం. 378 00:43:11,083 --> 00:43:13,083 ఎవరైనా కాల్ చేస్తే, నీవు మాట్లాడొద్దు. 379 00:43:13,291 --> 00:43:17,083 మీ అమ్మ లేస్తే, ఒక్క మాట కూడా చెప్పొద్దు. అర్థమయిందా? 380 00:43:22,875 --> 00:43:25,583 చూడు, దీని విషయంలో మంచి పధ్ధతి అంటూ ఏమీ లేదు. 381 00:43:25,666 --> 00:43:27,541 మీ అన్న చాలా అనుభవించాడు. 382 00:43:27,625 --> 00:43:29,875 అమీ నాన్నను కూడా పోగొట్టుకునే అవకాశం ఇవ్వను. 383 00:43:29,958 --> 00:43:31,000 నీవు అంగీకరిస్తావా? 384 00:43:31,500 --> 00:43:35,125 తప్పకుండా, కానీ నా సంగతేంటి? నేరం నామీద వేసుకోవాలా? 385 00:43:35,250 --> 00:43:37,041 మీ ఇద్దరిలో ఎవరినీ పోగొట్టుకోను. 386 00:43:40,250 --> 00:43:41,750 మరి మనమేం చేయబోతున్నాం? 387 00:43:49,500 --> 00:43:52,708 ఆ చొక్కాలు కాల్చేసి, ట్రక్కును శుభ్రం చేసేయ్. 388 00:43:52,875 --> 00:43:54,625 ఆ శవాన్ని నాకు వదిలేయ్. 389 00:43:54,708 --> 00:43:56,333 మీరేం చేయబోతున్నారు? 390 00:43:56,416 --> 00:43:59,666 నేనొచ్చే వరకు పశువుల దొడ్లో ఆగు. అర్థమైందా? 391 00:43:59,750 --> 00:44:02,333 నేను తిరిగొచ్చాకా, ఎప్పటికీ దాని ఊసే ఎత్తము. 392 00:44:05,291 --> 00:44:06,916 హే, ట్రెవర్‌ను చూసారా? 393 00:45:04,958 --> 00:45:06,333 ఏంటది? 394 00:45:06,750 --> 00:45:07,958 నీవు నిద్రపో. 395 00:45:08,416 --> 00:45:09,625 ఎవరది? 396 00:45:36,250 --> 00:45:37,458 హే. 397 00:45:37,541 --> 00:45:39,041 ఏంటి విషయం? ఏం జరిగింది? 398 00:45:39,166 --> 00:45:40,375 మీ తమ్ముడు ఉన్నాడా? 399 00:45:40,750 --> 00:45:41,875 ఎందుకు? 400 00:45:42,041 --> 00:45:43,500 మీరంతా ఇందాకే వచ్చారా? 401 00:45:45,041 --> 00:45:49,250 నేను, బహుశా ఓ గంట కిందట వచ్చుంటాను. ఎందుకు, ఏం జరిగింది? 402 00:45:50,708 --> 00:45:52,041 హాయ్, అమీ. 403 00:45:52,583 --> 00:45:54,208 వెళ్లి పడుకో, బంగారం. 404 00:45:54,416 --> 00:45:55,958 నాకు నీళ్ళు కావాలి. 405 00:45:56,583 --> 00:45:58,041 రెట్ ఎక్కడ? 406 00:46:07,916 --> 00:46:09,458 మేం లోపలికి రావచ్చా? 407 00:46:09,666 --> 00:46:11,791 -లేదు, రావద్దు. -మళ్ళీ అడుగుతున్నాను. 408 00:46:12,291 --> 00:46:13,791 రెట్ ఎక్కడున్నాడు? 409 00:46:15,458 --> 00:46:16,666 తను ఇక్కడ లేడు. 410 00:46:16,791 --> 00:46:17,958 అయితే మరి ఎక్కడున్నాడు? 411 00:46:19,666 --> 00:46:20,583 నాకు తెలియదు. 412 00:46:22,000 --> 00:46:23,916 తన ట్రక్కు వాకిట్లో లేదు. 413 00:46:26,458 --> 00:46:29,375 అవును. అయితే నాకు తెలియదు. 414 00:46:30,541 --> 00:46:31,916 నీవు ట్రెవర్‌ను చూసావా? 415 00:46:32,500 --> 00:46:33,916 బార్‌లో చూడటమే. 416 00:46:42,750 --> 00:46:44,791 నాన్నా, నాకు దాహంగా ఉంది. 417 00:46:45,541 --> 00:46:47,083 ఆగు, తల్లీ. 418 00:46:47,583 --> 00:46:48,541 హే. 419 00:46:49,875 --> 00:46:51,708 మీరు లోపలికి రావడం లేదు. 420 00:46:54,750 --> 00:46:56,500 నీ చేతికి ఏమైంది? 421 00:46:57,416 --> 00:46:58,958 గుర్రం తొక్కింది. 422 00:47:01,541 --> 00:47:03,666 సరే, నీవు మాతో బయటికి వస్తావా? 423 00:47:05,208 --> 00:47:06,541 ఊరికే చూడడానికి. 424 00:47:07,083 --> 00:47:10,041 నాన్నా, నీళ్ళు ఇస్తావా? 425 00:47:45,958 --> 00:47:47,000 ధన్యవాదాలు. 426 00:47:47,291 --> 00:47:48,916 -హే. -హే. 427 00:47:49,375 --> 00:47:52,166 తనను మళ్ళీ పడుకోబెడతావా, నాకు కొంచెం... 428 00:47:52,250 --> 00:47:54,958 -తలుపు దగ్గర ఎవరున్నారు? -పర్వాలేదు. నేను చూసుకుంటా. 429 00:47:55,333 --> 00:47:59,625 బామ్మ నిన్ను పడుకబెడుతుంది, ఒక్క నిమిషం బయటికి వెళ్ళొస్తా. 430 00:47:59,708 --> 00:48:01,000 -సరేనా? -సరే. 431 00:48:02,125 --> 00:48:03,416 రా, బంగారం. 432 00:48:06,833 --> 00:48:08,583 ల్యూక్, ఇప్పుడు అర్ధరాత్రి ఒంటిగంట. 433 00:48:12,666 --> 00:48:15,916 ఇక్కడేం దొరుకుతుందని అనుకుంటున్నావో నాకు తెలియదు. 434 00:48:22,375 --> 00:48:23,791 ల్యూక్, రా. 435 00:48:26,958 --> 00:48:29,291 -వీటిని తెరవగలవా? -ఏముందని అనుకుంటున్నావు... 436 00:48:29,375 --> 00:48:31,125 తలుపులు తెరువు అంతే. 437 00:48:31,208 --> 00:48:34,958 హే, ముందే చెప్తున్నా, రెట్ లోపల ఉన్నాడంటే, అయిపోయినట్లే. 438 00:48:42,708 --> 00:48:46,333 నేను ఇంటికెళ్ళి, వెనుకవైపు తాళంచెవి తీసుకొస్తాను. 439 00:48:47,750 --> 00:48:48,875 వద్దు. 440 00:48:51,416 --> 00:48:53,583 ఇప్పుడే లోపలికి వెళతాం అనుకుంటా. 441 00:49:01,000 --> 00:49:03,583 అందరూ, ఆపేయండి. 442 00:49:18,250 --> 00:49:20,875 ల్యూక్, దీన్ని నువ్వు చూడాలి. 443 00:49:27,333 --> 00:49:29,458 ఎవరో బయటికెళ్ళినట్లు అనిపిస్తోంది. 444 00:49:29,833 --> 00:49:32,583 ఏంటి? కాదురా, వెధవా, అంతకు ముందు వెళ్లిన గుర్తులు. 445 00:49:34,916 --> 00:49:36,625 నాకైతే చాలా తాజాగా అనిపిస్తుంది. 446 00:50:16,125 --> 00:50:17,833 టిల్లీ. టిల్లీ! 447 00:52:22,541 --> 00:52:24,416 ఏంటిది, రాయల్? 448 00:52:31,333 --> 00:52:32,750 అదేంటో నాకు తెలియదు. 449 00:52:35,333 --> 00:52:37,166 మీకు ఏదైనా తెలిసుండాలి. 450 00:52:37,291 --> 00:52:39,708 లేకపోతే మీరు శవాన్ని అలా ఎందుకు విసిరేస్తారు? 451 00:52:49,875 --> 00:52:52,000 మీకు గ్రీక్ దేవుడు క్రోనోస్ గురించి తెలుసా? 452 00:52:54,250 --> 00:52:55,250 ఏంటీ? 453 00:52:55,333 --> 00:52:58,458 ఆయన ప్రతి నాగరికతలో కనిపించాడు, 454 00:52:58,541 --> 00:53:02,875 ఆయన అక్కడక్కడ ఉద్భవించాడు. 455 00:53:03,791 --> 00:53:07,916 ఆయన ఎప్పుడూ ఒక కొడవలి పట్టుకుంటాడు. 456 00:53:11,000 --> 00:53:12,083 ఏం మాట్లాడుతున్నావు? 457 00:53:12,208 --> 00:53:17,458 తను ఆ కొడవలితో ఒక రంధ్రం చేసాడు, విశ్వంలో చీలిక లాంటిది, 458 00:53:17,541 --> 00:53:22,833 స్వర్గానికి, భూమికి మధ్యలో, ఈ లోకాన్ని తరువాతి దానితో వేరు చేయడానికి. 459 00:53:23,000 --> 00:53:27,583 తెలిసినవాటిని తెలియనివాటి నుండి వేరు చేయడానికి. 460 00:53:28,708 --> 00:53:34,000 మనకు సమయం అనేది అలా ఏర్పడింది, క్రోనోస్...అదే క్రోనాలజీ. 461 00:53:41,083 --> 00:53:42,916 దీని గురించి ఇంకెవరికి తెలుసు? 462 00:53:49,041 --> 00:53:50,250 ఎవరికీ తెలియదు. 463 00:53:53,375 --> 00:53:54,416 నిజంగానా? 464 00:53:56,291 --> 00:53:57,458 అవును. 465 00:54:04,041 --> 00:54:05,708 నేనెవరికీ చెప్పను. 466 00:54:08,500 --> 00:54:09,333 హే. 467 00:54:09,833 --> 00:54:11,625 నేనెవరికీ చెప్పను. 468 00:54:12,375 --> 00:54:14,666 ఇది మనమధ్యే మిగిలే చిన్ని రహస్యం. 469 00:54:17,708 --> 00:54:18,583 ఒప్పందమా? 470 00:54:23,416 --> 00:54:26,875 తెలుసా, లోకం ఇలాంటి ఒకదాని కోసం ఎదురుచూస్తోంది. 471 00:56:31,125 --> 00:56:33,125 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 472 00:56:33,208 --> 00:56:35,208 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత