1 00:00:24,600 --> 00:00:26,520 -మనము అందుకోలేము. -ఏంటి? 2 00:00:26,600 --> 00:00:28,400 -సూర్యాస్తమయం. -కొంచెం వేగం పెంచు. 3 00:00:28,480 --> 00:00:29,800 ఈ రోడ్డులను చూసావా అసలు? 4 00:00:29,880 --> 00:00:33,120 వెబ్‌సైట్‌లో, హాట్ టబ్‌లో షాంపేన్ పట్టుకొని, సూర్యుడిని చూసే 5 00:00:33,200 --> 00:00:35,840 జంట ఉంది. అది మనమే. దానికి డబ్బు కట్టాం. 6 00:00:35,920 --> 00:00:37,760 -మనం చస్తే? -నీ చుట్టూ చూడు. 7 00:00:37,840 --> 00:00:39,320 -చూస్తున్నాను... -అవునా... 8 00:00:39,400 --> 00:00:41,600 ఇంకా మంచిగా చావవచ్చుగా? 9 00:00:41,680 --> 00:00:45,480 మనం ఆ అంచుకు వెళ్లి, 800 అడుగుల ఎత్తు నుండి మంటలలోకి దొర్లటం, 10 00:00:45,560 --> 00:00:47,640 మనంత హాయిగా ఉండేవాళ్లు ఇంకెవరూ లేరు. 11 00:00:48,680 --> 00:00:49,640 సరే, ఆగు. 12 00:00:55,320 --> 00:00:59,200 మమ్మల్స్ 13 00:01:00,680 --> 00:01:02,080 సరే, ఆగు. 14 00:01:05,440 --> 00:01:06,840 -ఏది? -తెలియదు. 15 00:01:06,920 --> 00:01:09,560 ఆ నీలం క్యాబినో లేక ఇంకొకటో గుర్తులేదు. 16 00:01:09,680 --> 00:01:11,560 -సిగ్నలు లేదు. -అదే అనుకుంటాను. 17 00:01:11,640 --> 00:01:13,440 -త్వరగా, వెళ్లు, జాగ్రత్త! -సరే. 18 00:01:15,640 --> 00:01:17,560 టైమ్ లేదు! ఏం చేస్తున్నావు? 19 00:01:18,040 --> 00:01:20,440 టైమ్ లేదు! అరే రా, లోపలికి రా. 20 00:01:20,520 --> 00:01:22,600 -నేను రాలేను! -హాట్ టబ్‌లో కూర్చో. 21 00:01:27,200 --> 00:01:28,280 -సరే. -సరే. 22 00:01:32,000 --> 00:01:33,680 వచ్చేసాము! 23 00:01:34,040 --> 00:01:35,320 అది చూడు. 24 00:01:36,760 --> 00:01:37,920 అయితే, 25 00:01:39,800 --> 00:01:43,520 సామాను సర్దుతావా, లేదంటే సెక్స్ చేసి, సామాను సర్దుతావా? 26 00:01:46,280 --> 00:01:47,240 బి. 27 00:01:49,880 --> 00:01:51,920 నీవు నాతో లేదా చరిత్రలోని మరో స్త్రీతో 28 00:01:52,000 --> 00:01:54,680 కూర్చునే అవకాశమొస్తే ఎవరిని ఎంచుకుంటావు? 29 00:01:55,400 --> 00:01:56,840 పరిస్థితిని బట్టి... 30 00:01:57,600 --> 00:02:01,440 నువ్వు, జేన్స్, మాన్స్‌ఫీల్డ్ ఇంకా ఫాండాల మధ్యలో, 31 00:02:02,160 --> 00:02:03,200 డెబ్బీ హారీ, 32 00:02:04,240 --> 00:02:06,440 లేదా బియాన్సే ఇలా ఎవరైనా సరే. 33 00:02:06,520 --> 00:02:07,520 నువ్వే? 34 00:02:11,320 --> 00:02:12,280 మార్లన్ బ్రాండో. 35 00:02:12,600 --> 00:02:15,000 అల్బర్ట్ కేమస్. రస్‌పుతిన్. 36 00:02:15,080 --> 00:02:16,880 రష్యాకెల్లా మహా ప్రేమ నాయిక. 37 00:02:18,240 --> 00:02:20,760 పాల్ న్యూమాన్. ఇగ్గీ పాప్. 38 00:02:21,520 --> 00:02:24,400 -యువ ఎల్విస్ ప్రెస్‌లీ. -మరీ ఎక్కువయ్యారు. 39 00:02:24,440 --> 00:02:28,680 హెన్రీ మిల్లర్, రాయన్ గోస్లింగ్ ఇంకా నువ్వు. 40 00:02:29,240 --> 00:02:31,960 లేదు, ఆగు. స్టీవ్ మెక్‌క్వీన్, హెన్రీ మిల్లర్, 41 00:02:32,040 --> 00:02:35,720 రాయన్ గోస్లింగ్, ఓటిస్ రెడ్డింగ్, ప్రిన్స్, నువ్వు. 42 00:02:36,840 --> 00:02:39,360 ఇలాంటివి నిజాయితీగా మాట్లాడటం బావుంది. 43 00:02:40,360 --> 00:02:41,520 నేను అలా చేయమన్నాను. 44 00:02:41,600 --> 00:02:43,560 -లేస్తున్నాడు. -సరే? 45 00:02:45,400 --> 00:02:46,760 -తెలిసిందా? -అవును. 46 00:02:47,640 --> 00:02:49,080 మనల్ని ఇష్టపడతాడంటావా? 47 00:02:49,160 --> 00:02:50,240 మొదట్లో. 48 00:02:51,000 --> 00:02:52,920 ఆ తరువాత సిగ్గుపడతాడు. 49 00:02:53,400 --> 00:02:54,480 తరువాత ద్వేషిస్తాడు. 50 00:02:54,800 --> 00:02:57,240 అయితే, తరువాత కొద్ది రోజులకి మళ్లీ ఇష్టపడవచ్చు. 51 00:02:57,320 --> 00:02:58,320 కానీ మరీ కాదు. 52 00:02:58,400 --> 00:03:02,120 అందుకే మనం చస్తే, కొంచెం మిస్సవుతాడు, తరువాత అంతా మరిచిపోతాడు. 53 00:03:02,920 --> 00:03:05,000 హ్యాపీ వార్షికోత్సవం శ్రీమతి బకింగ్‌హామ్. 54 00:03:22,560 --> 00:03:23,720 ఇది విను. 55 00:03:23,800 --> 00:03:26,520 "అత్యంత విశ్రాంతిని కోరుకుంటున్నారా? 56 00:03:26,600 --> 00:03:30,120 "నిష్ణాతులైన మసాజ్, సోనియా, ప్లైమౌత్, 57 00:03:30,200 --> 00:03:34,920 "వేడి రాయి, స్వీడిష్ గాఢ చర్మపు మసాజ్ అందిస్తారు, 58 00:03:35,000 --> 00:03:38,120 "రేకీ ఇంకా చెవి మైనపు తొలగింపు 59 00:03:38,200 --> 00:03:39,600 "75 క్విడ్‌ల నుండి." 60 00:03:39,680 --> 00:03:41,080 -చేద్దామా? -చెయ్యి! 61 00:03:41,160 --> 00:03:42,160 సరే మరి. 62 00:03:45,760 --> 00:03:47,840 సోనియా, ప్లైమౌత్ నుండి... 63 00:03:48,920 --> 00:03:51,400 నీకు అదృష్టం పట్టింది. 64 00:03:53,520 --> 00:03:57,920 దయచేసి, రెండు రైకీ మసాజులు. 65 00:04:02,040 --> 00:04:03,040 ఆమండీన్? 66 00:04:03,320 --> 00:04:05,840 ఆమండీన్, బయటకు రా. తిమింగలం ఉంది. 67 00:04:05,920 --> 00:04:08,280 జోక్ చేయట్లేదు. పెద్ద తిమింగలం. 68 00:04:08,360 --> 00:04:10,480 అరే రా, తిమింగలం ఉంది. 69 00:04:15,320 --> 00:04:16,520 హాయ్. 70 00:04:17,840 --> 00:04:19,960 హలో. ఆమండీన్! 71 00:04:20,000 --> 00:04:22,560 తిమింగలం ఇంకా టామ్ జోన్స్ ఉన్నారు. 72 00:04:22,640 --> 00:04:24,200 అసలైన టామ్ జోన్స్. 73 00:04:24,240 --> 00:04:25,640 -ఆమండీన్? -జేమీ... 74 00:04:27,800 --> 00:04:28,880 స్రావం అవుతుంది. 75 00:04:31,600 --> 00:04:32,760 ఏం కాదులే. 76 00:04:32,800 --> 00:04:34,240 అలా అనిపించట్లేదు. 77 00:04:34,360 --> 00:04:36,600 -మీరు లోపలికి రాకూడదు. -తనను వదలాలని లేదు. 78 00:04:36,680 --> 00:04:38,240 మీరు ఇక్కడే వేచి ఉండండి. 79 00:05:32,040 --> 00:05:33,040 హే. 80 00:05:35,200 --> 00:05:36,120 హే. 81 00:05:43,920 --> 00:05:45,440 ఎలా ఉంది ఇప్పుడు? 82 00:05:46,480 --> 00:05:47,600 మత్తుగా. 83 00:05:48,560 --> 00:05:49,560 అదీ మంచిదే. 84 00:05:52,640 --> 00:05:54,600 ఇందులో మంచి చూద్దాం. 85 00:05:56,640 --> 00:05:58,720 ఇక వాడు మనల్ని అస్సలు ద్వేషించలేడు. 86 00:06:02,840 --> 00:06:03,800 అవును. 87 00:06:04,440 --> 00:06:06,080 నిన్న రాత్రి ఏం చేసావు? 88 00:06:07,200 --> 00:06:08,240 నేను... 89 00:06:09,920 --> 00:06:11,040 స్కాచ్ తాగాను. 90 00:06:12,840 --> 00:06:15,200 తరువాత, దాదాపు ఆరు గంటలపాటు గూగుల్ చేసాను. 91 00:06:17,720 --> 00:06:20,800 ఆ నీలి తిమింగలాల గురించి, టామ్ జోన్స్ గురించి 92 00:06:21,560 --> 00:06:23,040 అన్ని వివరాలు తెలుసు నాకు. 93 00:06:23,120 --> 00:06:24,400 పరీక్షించి చూడు. 94 00:06:25,760 --> 00:06:27,440 భూమికెల్లా అతి పెద్ద క్షీరదం? 95 00:06:28,040 --> 00:06:29,360 టామ్ జోన్స్. 96 00:06:30,760 --> 00:06:34,360 దాని నాలుక 2.7 టన్నులు. 97 00:06:35,400 --> 00:06:41,400 టామ్ జోన్స్ అంగం అతి పెద్ద జైవిక అంగం. పది అడుగులు. 98 00:06:44,320 --> 00:06:45,440 దేవుడా, పర్వాలేదు. 99 00:06:46,840 --> 00:06:47,840 పర్వాలేదు. 100 00:06:48,800 --> 00:06:50,320 ఓహ్, బేబీ. 101 00:06:52,320 --> 00:06:54,640 ఏం కాలేదుగా? నీకేం కావాలి? 102 00:06:54,720 --> 00:06:56,160 మనం జనాలకు చెప్పాలి. 103 00:06:56,240 --> 00:06:58,040 -అక్కరలేదు. -జరిగింది కదా. 104 00:06:58,120 --> 00:07:00,280 బేబీ, నా దగ్గర నెంబర్లు లేవు. 105 00:07:01,520 --> 00:07:04,160 ఇదిగో. అందరికీ కాల్ చేయి. 106 00:07:04,960 --> 00:07:07,080 నాకు అంతిమ సంస్కారాలు కావాలి. అది కాదు... 107 00:07:07,160 --> 00:07:09,880 ఏదో ఒకటి. వీడ్కోలు చెప్పినట్టుగా ఏదో ఒకటి. 108 00:07:09,960 --> 00:07:10,960 అలాగే. 109 00:07:20,400 --> 00:07:22,080 నిన్ను ఇక్కడికి తెచ్చినప్పుడు, 110 00:07:23,280 --> 00:07:26,200 నానుండి దూరంగా తీసుకెళ్లాక, కార్ పార్క్‌కు వెళ్లాను. 111 00:07:30,440 --> 00:07:31,920 ప్రార్థించాను. 112 00:07:32,000 --> 00:07:33,360 నువ్వు దేవుడిని నమ్మవుగా. 113 00:07:33,440 --> 00:07:35,400 తెలుసు. పూర్తిగా సోదని, 114 00:07:35,480 --> 00:07:38,360 కానీ చేసాను. ఆయనను ప్రార్థించాను, సరేనా? అది... 115 00:07:40,080 --> 00:07:43,160 బిడ్డను తీసుకెళ్లిపో, కానీ నిన్ను తీసుకెళ్లవద్దన్నాను. 116 00:07:45,360 --> 00:07:47,360 ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమైనా, 117 00:07:49,320 --> 00:07:51,920 నా ప్రేమకు సాటి రాదని. 118 00:07:55,440 --> 00:07:57,640 -అంటే, విన్నాడుగా. -అవును విన్నాడు. 119 00:07:59,040 --> 00:08:00,840 ఆయన అస్తిత్వం లేకపోయినా కానీ. 120 00:08:12,960 --> 00:08:14,040 హే, అమ్మా. 121 00:08:15,000 --> 00:08:18,160 లేదు, ఆమండీన్ ఫోన్ నుండి చేసాను. నాకు అస్సలు సిగ్నల్ లేదు. 122 00:08:18,240 --> 00:08:19,800 నాన్న ఉన్నాడా? 123 00:08:21,040 --> 00:08:22,920 ఒక విషయం చెప్పాలి. 124 00:08:31,280 --> 00:08:33,760 చెప్పటం మరిచాను. టౌనుకి చేపల వాన్ వచ్చింది. 125 00:08:33,800 --> 00:08:35,360 కొంచెం ఎరలు తెచ్చాను. 126 00:08:36,880 --> 00:08:38,000 బావుంది. 127 00:08:38,080 --> 00:08:41,440 నేను స్కూలులో ఉన్నప్పుడు, ఆక్టోపస్‌ల మీద ప్రాజెక్టు చేసాను. 128 00:08:42,120 --> 00:08:44,480 క్లాసు అందరి ముందూ నుంచున్నాను, 129 00:08:44,520 --> 00:08:47,640 చాలా కంగారేసింది, చెప్పిన మొదటి విషయం ఏంటో తెలుసా, 130 00:08:47,760 --> 00:08:49,880 "ఆక్టోపస్‌కు ఎనిమిది వృషణాలుంటాయని. 131 00:08:50,880 --> 00:08:53,640 "తంతువులు! అంటే, తంతువులని!" 132 00:08:58,600 --> 00:09:02,640 నేల మింగేయాలనుకునే క్షణమది. అంటే, ప్లీజ్, ఇప్పుడే మింగేయి! 133 00:09:04,760 --> 00:09:05,840 లూ? 134 00:09:06,720 --> 00:09:07,720 లూ? 135 00:09:14,760 --> 00:09:15,960 టీ కావాలా? 136 00:09:16,960 --> 00:09:18,160 సరే. 137 00:09:23,400 --> 00:09:25,880 హే, లూ, నేను. ఆమండీన్ ఫోన్ నుండి. 138 00:09:31,760 --> 00:09:33,400 ఓహ్, లేదు. మన్నించు. 139 00:09:33,520 --> 00:09:34,840 తనెలా ఉంది? 140 00:09:34,880 --> 00:09:37,840 తను బాగానే ఉంది. అంటే, తెలుసుగా, బాగానే ఉంది. 141 00:09:39,000 --> 00:09:40,960 బావున్నాము. బాగుంటుందిలే, అదే... 142 00:09:42,040 --> 00:09:43,280 పర్వాలేదు. 143 00:09:43,360 --> 00:09:45,040 అమ్మా నాన్నకు చెప్పావా? 144 00:09:45,120 --> 00:09:46,320 హా, ఇప్పుడే చెప్పాను. 145 00:09:49,040 --> 00:09:52,040 లూ, నేను వెళ్లాలి. ఇక్కడ సిగ్నల్ అంత బాగాలేదు. 146 00:09:52,160 --> 00:09:53,360 లవ్ యూ, జేమీ. 147 00:09:54,760 --> 00:09:55,760 లవ్ యూ టూ. 148 00:10:11,600 --> 00:10:15,040 పాల్ ఏంటి సంగతి సెక్సీ 149 00:10:25,640 --> 00:10:26,960 ఎప్పుడు వస్తున్నావు? సోమవారం 150 00:10:27,040 --> 00:10:28,440 గుర్తొస్తున్నావు నాకు కూడా 151 00:10:28,520 --> 00:10:30,160 నీ నడ్డి నీ అంగం అన్నీ మిస్సవుతున్నాను 152 00:10:30,240 --> 00:10:32,640 హే. నువ్వు నా పొరుగు, కదా? 153 00:10:33,520 --> 00:10:36,120 పక్కింటి టామ్‌ను. కలవటం సంతోషం. 154 00:10:36,760 --> 00:10:39,360 నీ సంగతి తెలియదు కానీ, నేను తిరిగి వస్తాను. 155 00:10:39,520 --> 00:10:42,040 ఇది నీకు బాగా తెలిసిన చోటులాగా ఉంటుంది. 156 00:10:42,120 --> 00:10:44,880 నీ ఆత్మలో లీనమైపోతుంది. 157 00:10:45,640 --> 00:10:47,120 అలా ఎప్పుడన్నా అనిపించిందా? 158 00:10:49,880 --> 00:10:50,760 ఏం కాలేదుగా? 159 00:10:57,480 --> 00:10:58,960 జీసెస్ క్రైస్ట్! 160 00:10:59,040 --> 00:11:01,160 ఏంటది, నత్తలు లాంటివి తిన్నావా? 161 00:11:07,440 --> 00:11:08,800 టామ్ జోన్స్? 162 00:11:08,880 --> 00:11:10,200 అవును. 163 00:11:52,880 --> 00:11:55,480 జేమీ, బాబు. సమయం ఆసన్నమైంది. 164 00:11:57,560 --> 00:11:58,920 నేనెలా ఉన్నాను? 165 00:12:02,440 --> 00:12:04,400 నీ ముక్కు, నోటికి బాగా దగ్గరిగా ఉంది. 166 00:12:04,480 --> 00:12:05,760 థాంక్స్, బాబు. ఛీర్స్. 167 00:12:21,760 --> 00:12:23,320 నీ ప్రేమ చాలా దృఢమైనది. 168 00:12:23,800 --> 00:12:26,880 నువ్వేం చేసినా కానీ, ఇది మాత్రం గుర్తుంచుకో. 169 00:12:26,960 --> 00:12:29,080 కనీసం ఒకరికొకరు తోడున్నారుగా. 170 00:12:29,440 --> 00:12:31,640 ధన్యవాదాలు. అభినందనీయం. ఛీర్స్. 171 00:12:33,720 --> 00:12:36,840 మా నాన్న ఫిల్హార్‌మోనీ డి పారిస్‌లో 172 00:12:36,920 --> 00:12:39,080 లీడ్ వయోలనిస్ట్. 173 00:12:39,160 --> 00:12:42,520 ఆమండీన్ చిన్నప్పుడు, ఆయన తొడ మీద కూర్చొని 174 00:12:42,600 --> 00:12:44,400 మోజార్ట్ వినేది తను. 175 00:12:45,960 --> 00:12:50,320 ఇది... ఇది మీ తాత వయోలిన్. 176 00:12:52,160 --> 00:12:54,000 ఇది మీ బాబుకి ఇవ్వాలనుకున్నాడు. 177 00:12:55,000 --> 00:12:56,960 ఇది మీ తరువాతి కొడుకుకి ఇవ్వండి. 178 00:13:06,000 --> 00:13:07,720 చాలా కరుణ మీది. ధన్యవాదాలు. 179 00:13:13,000 --> 00:13:16,760 ఇదంతా అవసరమా అని మీ అందరికీ అనిపించవచ్చు. 180 00:13:19,560 --> 00:13:23,960 కానీ మీరందరూ రావటమే పెద్ద విషయం, అందుకే నేను ఒకటి చెప్పాలి. 181 00:13:25,080 --> 00:13:26,840 నా భర్త గురించి. 182 00:13:32,240 --> 00:13:35,120 జేమీ నువ్వు చాలా మంచివాడివి, 183 00:13:36,760 --> 00:13:38,960 సరదా, గాంభీర్యం, 184 00:13:39,680 --> 00:13:41,280 శృంగారం అన్నీ కలగలిసి ఉంటావు. 185 00:13:42,080 --> 00:13:43,280 నిన్ను ప్రేమిస్తున్నాను. 186 00:13:43,360 --> 00:13:46,360 నీతో కలిసి వందమంది పిల్లలను కనాలని ఉంది. 187 00:13:50,240 --> 00:13:52,680 నేను కూడా ప్రేమిస్తున్నాను. లవ్ యూ. 188 00:13:55,880 --> 00:13:57,560 ఆమండీన్ ఇంకా జేమీకి. 189 00:13:57,640 --> 00:14:00,240 -ఆమండీన్ ఇంకా జేమీ. -ఆమండీన్ ఇంకా జేమీకి. 190 00:14:09,600 --> 00:14:11,960 నేను పనికి వెళ్లను. చాలా చిరాకుగా ఉంది. 191 00:14:12,040 --> 00:14:14,440 సరే, అలాగే, తరువాత కలుస్తాను. 192 00:15:57,280 --> 00:15:58,760 నిజానికి చాలా సిగ్గుగా ఉంది. 193 00:15:58,840 --> 00:16:01,000 లేదు, సిగ్గేం లేదు. అది... 194 00:16:02,720 --> 00:16:05,560 తను నీ చెల్లి కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 195 00:16:06,320 --> 00:16:08,640 కానీ, అంటే... 196 00:16:08,720 --> 00:16:10,440 తను అలా చేయటం మొదలుపెడుతుంది 197 00:16:10,520 --> 00:16:12,800 నేను ఏదన్నా కథ చెపుతున్నప్పుడు, 198 00:16:12,880 --> 00:16:14,960 ఆ రోజు ఏదో అయింది, 199 00:16:15,040 --> 00:16:18,120 చాలా చిన్నదే. సోదిది, తెలియదు. ఏదైతేనేం, 200 00:16:18,200 --> 00:16:20,440 నేను కథలో ఏదో చెపుతున్నాను 201 00:16:21,040 --> 00:16:24,440 తను అస్సలు గమనించలేదు. 202 00:16:24,960 --> 00:16:27,040 మాట్లాడుతున్నాననీ గమనించలేదు. 203 00:16:27,120 --> 00:16:31,720 తను ఎంతో దూరంలో ఉన్నట్టు నేను నేపథ్యంలో మాట్లాడుతున్నట్టు ఉంది. 204 00:16:31,800 --> 00:16:35,320 -నీ ప్రేమతో నువ్వున్నప్పుడు... -పాల్ తెలుసా నీకు? 205 00:16:37,880 --> 00:16:38,880 ఏంటి? 206 00:16:40,400 --> 00:16:42,040 ఏంలేదు. అంతా అనవసరం. 207 00:16:44,480 --> 00:16:47,880 నేను నిపుణుడిని కాదు, కానీ నువ్వూ ఆమండీన్ వైద్యుడిని కలవండి. 208 00:16:47,960 --> 00:16:49,760 థెరపీలాంటిది. 209 00:16:50,360 --> 00:16:53,400 చాలా కష్టాలు చూసారు. షాకులో ఉండుండవచ్చు. 210 00:16:53,480 --> 00:16:54,720 నేను షాక్‌లో ఉన్నాను. 211 00:16:54,800 --> 00:16:57,800 -అది చాలా సహజం. -షాక్. అది చదువు. 212 00:16:58,200 --> 00:16:59,040 ఏంటది? 213 00:16:59,920 --> 00:17:01,680 చదువు అంతే. గట్టిగా. 214 00:17:08,200 --> 00:17:09,600 "పాల్: ఎప్పుడు వస్తున్నావు? 215 00:17:11,320 --> 00:17:12,560 "ఆమండీన్: సోమవారం. 216 00:17:13,960 --> 00:17:15,240 "పాల్: గుర్తొస్తున్నావు. 217 00:17:16,400 --> 00:17:20,080 "ఆమండీన్: నాకు కూడా. బిక్క మొహం. 218 00:17:24,560 --> 00:17:26,240 "పాల్: నీ నడుం మిస్సవుతున్నాను. 219 00:17:27,680 --> 00:17:29,560 "ఆమండీన్: నీ అంగాన్ని మిస్సవుతున్నా. 220 00:17:32,240 --> 00:17:34,520 "పాల్: నీ ముఖం మీద రావాలనుంది. 221 00:17:36,720 --> 00:17:40,160 "ఆమండీన్: నువ్వు వచ్చిన వెంటనే. ముద్దు." 222 00:18:15,320 --> 00:18:16,320 జేమీ ఎలా ఉన్నాడు? 223 00:18:19,760 --> 00:18:20,760 బాగానే ఉన్నాడు. 224 00:18:32,000 --> 00:18:33,040 పద. 225 00:18:35,680 --> 00:18:37,280 అదీ మంచి పిల్ల అంటే. 226 00:18:43,480 --> 00:18:45,320 హే, ఉంగు, మంచి పిల్లవు. 227 00:18:46,240 --> 00:18:47,960 ఉండు. 228 00:19:02,800 --> 00:19:04,040 ఏం కాలేదు. 229 00:19:04,440 --> 00:19:06,480 ఏం కాలేదు. అది అలా మంచిగా ఉండాలి. 230 00:19:07,640 --> 00:19:08,800 ఏం కాలేదు. 231 00:19:12,680 --> 00:19:13,800 అంతే. 232 00:19:15,240 --> 00:19:17,000 అంతే. ఊపిరి తీసుకో. 233 00:20:03,560 --> 00:20:04,800 నువ్వెవరు అసలు? 234 00:20:06,760 --> 00:20:08,640 -కూర్చో. -నా ఇంటిలోనుండి పో! 235 00:20:08,720 --> 00:20:10,200 నేను ఆమండీన్ భర్తను. 236 00:20:29,440 --> 00:20:31,040 సరే, తమాషాగా ఉంది కదా? 237 00:20:31,960 --> 00:20:33,240 నీ జీవితంలో 238 00:20:34,640 --> 00:20:37,080 అలా సంతోషంగా సాగిపోతుంటావు, 239 00:20:38,160 --> 00:20:39,440 ఒక వాస్తవికతలో. 240 00:20:41,720 --> 00:20:42,920 ఇక తరువాత, హఠాత్తుగా, 241 00:20:44,040 --> 00:20:45,920 ప్రమాదం జరుగుతుంది. 242 00:20:48,200 --> 00:20:52,000 అప్పుడు చుట్టూ చూసుకుంటే, నువ్వు బీచ్‌లో ఒంటరిగా 243 00:20:52,440 --> 00:20:54,080 టామ్ జోన్స్‌తో ఉంటావు. 244 00:20:55,560 --> 00:20:56,560 ఏంటి? 245 00:21:04,800 --> 00:21:07,400 కేఫ్ షీనో ఇంకా ఓల్డ్ బ్రాంప్టన్ రోడ్. 246 00:21:09,400 --> 00:21:12,080 జోస్ టాపాస్ బార్, బెర్మండీ వీధిలో. 247 00:21:13,160 --> 00:21:16,320 ఈమధ్యనే తిరిగి చేసిన పాత అసలైన ప్రింట్ కోసం 248 00:21:16,400 --> 00:21:19,480 ఫ్రాంకోయిస్ ట్రఫాట్స్ 400 బ్లోస్, బీఎఫ్ఐకి వెళ్లటం. 249 00:21:23,760 --> 00:21:25,000 ఉబర్ లక్స్. 250 00:21:25,880 --> 00:21:28,000 ఇక్కడినుండి వెనక్కి. 251 00:21:29,520 --> 00:21:31,720 నేను గత రెండు వారాలుగా నిఘా పెట్టాను. 252 00:21:32,760 --> 00:21:34,440 నీగురించి నాకు అంతా తెలుసు. 253 00:21:36,560 --> 00:21:39,440 నీ ఉద్యోగం, ఇల్లు. 254 00:21:40,440 --> 00:21:43,320 చచ్చిన జెరానియం మొక్కల పక్కన ఇటుక క్రింద తాళం. 255 00:21:43,440 --> 00:21:45,880 సోహో స్క్వేర్‌లో సోమవారం కలిసి 256 00:21:45,960 --> 00:21:48,560 వాగ్‌మమాస్‌కు తీసుకెళ్లిన గర్ల్‌ఫ్రెండ్. 257 00:21:49,400 --> 00:21:50,480 వెండీ విల్సన్. 258 00:21:52,080 --> 00:21:54,280 వెండీ నిశ్చితార్థపు ఉంగరం పెట్టుకుంది. 259 00:21:55,680 --> 00:21:57,480 ఇక్కడ పెళ్లి బాజాలు అలాంటివి? 260 00:21:58,000 --> 00:22:00,360 -సరే... -నా భార్యతో పడుకుంటున్నావు. 261 00:22:00,440 --> 00:22:02,000 -విను అంతే. -నువ్వు... 262 00:22:03,040 --> 00:22:06,440 నా భార్యతో పడుకుంటున్నావా లేదా? 263 00:22:09,200 --> 00:22:10,640 దయచేసి వెండీకి చెప్పకు. 264 00:22:12,200 --> 00:22:13,800 -మంచిది. -దయచేసి. 265 00:22:14,160 --> 00:22:15,200 పడుకుంటున్నావు. 266 00:22:18,160 --> 00:22:19,160 మంచిది. 267 00:22:22,320 --> 00:22:24,160 ఎందుకంటే దీనితో సమస్య. 268 00:22:26,960 --> 00:22:28,400 నా భార్యంటే నాకు ప్రేమ. 269 00:22:29,720 --> 00:22:30,760 నిజంగా. 270 00:22:34,080 --> 00:22:37,080 చాలా ప్రేమ తనంటే, తనకోసం ఏదైనా చేస్తాను. 271 00:22:37,160 --> 00:22:40,960 నిన్నేదో ఇంత అంద-మై-న ఇంటిలోకి వచ్చి 272 00:22:41,040 --> 00:22:43,280 బెదిరించటం కాదు. 273 00:22:46,160 --> 00:22:47,600 అంటే, తనకోసం ప్రాణమిస్తాను. 274 00:22:51,080 --> 00:22:52,320 ప్రాణాలు తీస్తాను. 275 00:22:53,960 --> 00:22:55,840 అందుకే ఎంపిక నీదే ఇక. 276 00:22:56,240 --> 00:22:59,160 ఇది ఇప్పుడే ముగించేయి, 277 00:22:59,240 --> 00:23:02,960 ఇక జీవితంలో నా భార్యతో మాట్లాడకు, 278 00:23:04,800 --> 00:23:06,960 లేదా నేను నాలోని మృగాన్ని లేపుతాను. 279 00:23:08,800 --> 00:23:10,000 విన్నావుగా, పాల్. 280 00:23:10,320 --> 00:23:12,880 హార్లే వీధిలోని డెర్మటాలజీ క్లినిక్‌లో 281 00:23:12,960 --> 00:23:16,920 పని చేస్తున్న నీ ఫియాన్సేను వెళ్లి కలవటం దగ్గరినుండి. 282 00:23:20,200 --> 00:23:21,560 అందుకే ఇప్పుడే ఎంచుకో. 283 00:23:25,040 --> 00:23:26,520 ఏం కావాలి, పాల్? 284 00:23:29,760 --> 00:23:30,760 పాల్ ఎవరు? 285 00:24:33,320 --> 00:24:35,320 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 286 00:24:35,400 --> 00:24:37,400 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల