1
00:00:26,200 --> 00:00:27,760
మీరు ఎక్కడికి వెళుతున్నారు?
2
00:00:28,840 --> 00:00:30,880
మిమ్మల్ని పట్టుకుంటా, సన్నాసులారా!
3
00:00:30,880 --> 00:00:33,680
నేను చెప్పగానే వేటాడే
క్రూర తిమింగలాలు ఉన్నాయి!
4
00:00:33,680 --> 00:00:37,640
టిలికమ్ వస్తోంది,
మీరు వెనుక చూసుకోవడం మంచిది!
5
00:00:37,640 --> 00:00:40,200
-వాళ్లు ఎక్కడకు వెళుతున్నారు?
-ఏమనుకుంటావు?
6
00:00:40,200 --> 00:00:42,640
జనాలను, ఆహారాన్ని కనుగొనేందుకు!
7
00:00:43,080 --> 00:00:44,280
లైంగిక భాగస్వాములను!
8
00:00:44,880 --> 00:00:46,720
మొత్తం క్లాస్ అదేనా?
9
00:00:47,080 --> 00:00:49,000
శాండీ, నీ పడవ దొంగిలించారా?
10
00:00:49,000 --> 00:00:53,160
అవును, అన్ని నావలు, అన్ని తెప్పలు,
ఇంకా చచ్చిన కోళ్లు.
11
00:00:53,160 --> 00:00:54,880
నీ పార్టీ భలే ఉంది, అమీలియా.
12
00:00:57,040 --> 00:01:00,600
ఆగండి! అమ్మాయిలు!
13
00:01:01,400 --> 00:01:02,800
నేను అతిగా నిద్రపోయాను!
14
00:01:02,800 --> 00:01:05,720
అమ్మాయిలు, దయ చూపండి,
నన్నిక్కడ వదిలేయకండి!
15
00:01:10,440 --> 00:01:13,440
క్లాస్ ఆఫ్ '07
16
00:01:13,440 --> 00:01:14,760
హేయ్, పాపా.
17
00:01:15,120 --> 00:01:16,120
పద్ధెనిమిది రోజుల తరువాత
18
00:01:16,120 --> 00:01:17,560
టిఫిన్ సిద్ధంగా ఉంది.
19
00:01:18,200 --> 00:01:21,960
ఇలా వచ్చి, దయచేసి తిను, అమీలియా.
ఆఖరి స్కూల్ షూ ఇప్పుడే ఉడకబెట్టాం.
20
00:01:21,960 --> 00:01:24,960
ఉన్నప్పుడే తిను,
ఎందుకంటే తర్వాత కార్పెట్‌కు మారతాం.
21
00:01:28,760 --> 00:01:31,720
ఏయ్, సానుకూలతా జర్నల్‌ను
ఎప్పుడైనా ప్రయత్నించావా?
22
00:01:31,720 --> 00:01:34,360
అవి నీ మెదడు సరిచేస్తాయని విన్నాను.
23
00:01:36,080 --> 00:01:39,560
లేదా ఇదెలా ఉంటుంది...
నవ్వుల చికిత్స ఎలా ఉంటుంది?
24
00:01:40,200 --> 00:01:41,480
అది ప్రయత్నిస్తావా?
25
00:01:42,120 --> 00:01:45,520
మొదట చాలా వింతగా ఉంటుంది,
కానీ నేనూ నీతో చేస్తాను. సిద్ధమేనా?
26
00:01:45,520 --> 00:01:46,960
ఒకటి, రెండు, మూడు.
27
00:01:53,960 --> 00:01:56,600
నన్ను సరిచేయాలని చూడడం ఆపు.
నేను దీనితో గొడవపడను.
28
00:01:56,600 --> 00:02:00,480
ఈ పరిస్థితికి ఇది
సరిగ్గా సరిపోయే సహజమైన స్పందన.
29
00:02:02,240 --> 00:02:04,200
కానీ అక్కడ జనాలు ఉన్నారు.
30
00:02:04,200 --> 00:02:08,160
వాళ్లను ఇతరులు కనుగొని,
సహాయం తీసుకొచ్చేవరకూ వేచి ఉంటే చాలు.
31
00:02:08,280 --> 00:02:10,240
ఇప్పటికి 18 రోజులు గడిచాయి, జోయి.
32
00:02:11,280 --> 00:02:13,560
వాళ్లు తిరిగొస్తారనే
నీ ఆలోచన ముద్దొస్తోంది.
33
00:02:13,560 --> 00:02:15,840
వాళ్ల దగ్గర పెద్ద ఓడ ఏమీ లేదు.
34
00:02:15,840 --> 00:02:19,600
-వాళ్లు రావడానికి సమయం పడుతుంది.
-అలా జరగాలి లేదా చచ్చి ఉండాలి.
35
00:02:37,400 --> 00:02:38,320
అంతేనా?
36
00:02:39,120 --> 00:02:41,680
లోపలి సోల్‌లో బాగా పోషణ ఉంది,
అందుకే నేను...
37
00:02:41,680 --> 00:02:42,760
ఇద్దరి కోసం తింటాను.
38
00:02:42,760 --> 00:02:44,560
అది ఇబ్బందికరం, కానీ తన మాట నిజం.
39
00:02:45,640 --> 00:02:48,640
ఏదో ఒకటి. త్వరలో వెళ్లిపోతాను, సరేనా?
40
00:02:48,640 --> 00:02:52,680
వాళ్లు నా పడవ దొంగిలించకపోతే,
ఎక్కడో పక్షిని తింటుండేదాన్ని,
41
00:02:52,680 --> 00:02:54,480
చెత్త షూలను కాకుండా.
42
00:02:56,240 --> 00:02:57,200
అదృష్టం ఉందా?
43
00:02:57,200 --> 00:03:00,720
నిజానికి లేదు.
తను సిగ్నల్ లేని ఫోన్‌లా ఉంది.
44
00:03:01,560 --> 00:03:03,520
సముద్ర ఉప్పు రేణువులు ఎలా వచ్చాయి?
45
00:03:03,520 --> 00:03:06,840
చుండ్రు. అది ఒక రకమైన రుచిని
జోడిస్తుంది. ఇదిగో.
46
00:03:06,840 --> 00:03:07,920
సరే.
47
00:03:12,680 --> 00:03:14,240
ఇదిగో మళ్లీ పడింది.
48
00:03:24,240 --> 00:03:26,360
స్పృహ తప్పాక ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు.
49
00:03:39,040 --> 00:03:40,600
అది వృథా చేయకు.
50
00:03:43,400 --> 00:03:44,640
ఆపండి!
51
00:03:46,960 --> 00:03:48,280
అమ్మాయిలు, ఇదే సమయం.
52
00:03:48,280 --> 00:03:50,120
మనం మళ్లీ చర్చించాలి.
53
00:03:50,120 --> 00:03:51,640
వద్దు!
54
00:03:51,640 --> 00:03:54,520
-అస్సలు వద్దు.
-అది ఎంపిక కాదు, రెనే.
55
00:03:54,520 --> 00:03:58,400
సరేనా? కొత్త పంటల కోతకు వచ్చే వరకు
మనం ఎదురు చూస్తే చాలు.
56
00:03:58,400 --> 00:04:02,600
సంగీత గదిని ఈ మధ్యనే పునరుద్ధరించడంతో,
కార్పెట్ మీద కూర్చుని ఉండరు.
57
00:04:02,600 --> 00:04:04,320
కార్పెట్ ఆహారం కాదు!
58
00:04:04,320 --> 00:04:07,000
సరేనా? మనం కార్పెట్‌తో
అస్సలు బతకలేము!
59
00:04:07,000 --> 00:04:11,160
మన శరీరాలు మన గ్లిసరోల్,
కీటోన్‌ల నిల్వల్ని తినేస్తున్నాయి,
60
00:04:11,160 --> 00:04:13,840
ఇక ఇప్పుడు
కండరాల ప్రోటీన్ కూడా తినేస్తున్నాయి.
61
00:04:13,840 --> 00:04:17,480
ఏమీ లేకుండానే
మనుషులు యుగాల పాటు బతకగలరు.
62
00:04:17,480 --> 00:04:20,000
గాంధీని చూడు. గ్వినెత్ పాల్‌త్రోను చూడు.
63
00:04:20,120 --> 00:04:23,000
ఏంటి? వాళ్ల అవయవాలు
విఫలం కాకుండా పోలేదు.
64
00:04:23,600 --> 00:04:26,760
అమ్మాయిలు, మన శరీరాలు
ఇప్పటికే పని చేయడం మానేస్తున్నాయి.
65
00:04:26,760 --> 00:04:29,880
ఆ కంపు, అది మన మూత్రపిండాలు
విఫలం కావడమే.
66
00:04:29,880 --> 00:04:32,880
మన ఊపిరితిత్తులు,
అవి చిక్కిపోయే ప్రక్రియలో ఉన్నాయి.
67
00:04:32,880 --> 00:04:36,240
మన గుండెలు చివరికి ముడుచుకుపోయి
పని చేయడం మానేస్తాయి.
68
00:04:36,240 --> 00:04:39,600
సాధారణంగా ఇది,
చివరకు గుండెపోటుకు దారి తీస్తుంది.
69
00:04:39,600 --> 00:04:41,200
లేదా ఏదైనా ఇన్ఫెక్షన్‌కు.
70
00:04:42,360 --> 00:04:45,040
ఆ కత్తిపోటు గాయం ఎలా ఉంది, జో?
71
00:04:45,040 --> 00:04:47,440
అది ఇంకా ఆరనైనా ఆరలేదు, రెనే.
72
00:04:48,000 --> 00:04:52,000
అమ్మాయిలు, ముందుకు సాగే కారణం
ఎప్పుడూ ఏదో ఉంటుంది.
73
00:04:52,000 --> 00:04:53,480
కచ్చితంగా.
74
00:04:54,040 --> 00:04:55,040
సరే.
75
00:04:55,320 --> 00:04:57,440
మనం ముందుకు వెళుతూ వచ్చింది ఇలానే.
76
00:04:58,080 --> 00:05:00,240
నేను కోపం, ఆకలితో బాగా అలసిపోయాను.
77
00:05:01,240 --> 00:05:04,600
సరే, బిక్కీ, కచ్చితంగా
దీనికి నైతిక పర్యవసానాలు ఉంటాయి.
78
00:05:04,600 --> 00:05:06,560
అదీ, నాకు తెలియదు.
79
00:05:06,800 --> 00:05:10,120
వేల ఏళ్ళ నుండి ఏసు శరీరం
అనుకొనే ఆహారం తింటున్నాము.
80
00:05:10,120 --> 00:05:11,680
వాస్తవానికి, అది నిజం.
81
00:05:11,680 --> 00:05:13,760
లేదు. జోయి మాట నిజం. అది అనైతికం.
82
00:05:13,760 --> 00:05:16,040
ఓరి దేవుడా. మీరిది అతిగా ఆలోచిస్తున్నారు.
83
00:05:16,040 --> 00:05:18,880
సరే, మొదట
ఆ గ్వాటిమాలా కోస్ట్ గార్డ్‌ను తిన్నప్పుడు,
84
00:05:18,880 --> 00:05:21,920
వింతగా అనుకున్నా,
కానీ తర్వాత అద్భుతం అనిపించింది.
85
00:05:21,920 --> 00:05:24,080
సరే, మనం ఇలా చేయాలంటే,
86
00:05:24,080 --> 00:05:27,040
మనం బాగా బలహీనం అయ్యేలోపే
దానిని చేయాలి.
87
00:05:27,040 --> 00:05:30,240
సరే. మంచిది.
అయితే మనం ఎవరిని తింటున్నాం?
88
00:05:34,840 --> 00:05:37,080
అవును, నేను అదే అనుకున్నా.
89
00:05:37,760 --> 00:05:40,840
మనం ఎవరినీ తినము,
ఎందుకంటే ఎలా నిర్ణయిస్తాం?
90
00:05:40,840 --> 00:05:42,160
గిరిజన మండలితోనా?
91
00:05:44,520 --> 00:05:45,720
అది వింతగా ఉంది.
92
00:05:46,640 --> 00:05:47,920
గిరిజన మండలి.
93
00:05:53,280 --> 00:05:55,160
లేదు, అమ్మాయిలు, సరదాగా అన్నాను.
94
00:05:56,000 --> 00:05:57,920
లేదు, అమ్మాయిలు. సరదాగా అన్నాను.
95
00:05:58,320 --> 00:06:02,360
నిజంగా బాగుంది.
రియాలిటీ టీవీని ఇష్టపడే నన్.
96
00:06:02,360 --> 00:06:04,720
ఇప్పుడు అదసలు అందంగా లేదు,
అవునా, బిక్కీ?
97
00:06:05,600 --> 00:06:07,240
ఆగండి, సన్నాసులారా!
98
00:06:22,920 --> 00:06:24,600
ఆ చెత్త చుంచు.
99
00:06:27,120 --> 00:06:28,240
హాయ్.
100
00:06:28,680 --> 00:06:33,560
బహుశా నువ్వు ప్రొఫెషనల్‌తో మాట్లాడాలేమో.
101
00:06:34,360 --> 00:06:36,720
కచ్చితంగా, నువ్వు ఆ లక్షణాలను
102
00:06:36,720 --> 00:06:40,440
ఓ నిర్జీవ వస్తువుకు ఆపాదించాల్సి ఉంటుంది,
కానీ నాకు పని చేసింది.
103
00:06:41,760 --> 00:06:44,640
ఇది బాగా చెడిపోయిన పరిస్థితి అని
నాకు తెలుసు,
104
00:06:44,640 --> 00:06:46,400
కానీ నీ గురించి మాకు బాధగా ఉంది.
105
00:06:48,760 --> 00:06:49,840
నీకది వినబడుతోందా?
106
00:06:49,840 --> 00:06:51,920
ఇప్పుడు వింటున్నావు కూడానా?
107
00:06:51,920 --> 00:06:53,280
ఎలాంటివి? గొంతులా...
108
00:06:53,280 --> 00:06:55,200
అగు, ఇలా చేయమని జోయి చెప్పిందా?
109
00:06:55,920 --> 00:06:57,600
అమీలియా, దయచేసి.
110
00:06:58,240 --> 00:07:01,400
బహుశా ఇది
మనం బ్యాటరీ ఛార్జ్ చేసి
111
00:07:01,400 --> 00:07:03,200
ఎలక్ట్రోషాక్ థెరపీ చేయాలేమో.
112
00:07:03,200 --> 00:07:05,960
నీకొకటి తెలుసా?
ఆ మాప్ తీసుకుంటాను.
113
00:07:10,240 --> 00:07:12,800
నోరు మూసుకుని, నన్ను నిద్రపోనియ్.
114
00:07:14,840 --> 00:07:16,600
నోరు ముయ్! ఇక ఆపు.
115
00:07:16,600 --> 00:07:19,400
ఆమె థెరపిస్ట్
నాకు భిన్నంగా పని చేస్తే తప్ప,
116
00:07:19,400 --> 00:07:21,880
ఆమె తన మనసులో భావాలు
మాట్లాడుతోందని అనుకోను.
117
00:07:23,520 --> 00:07:25,080
మీ మాటలు వ్యూహం గురించా?
118
00:07:25,080 --> 00:07:27,160
మీరు నాకు ఓటు వేయరు, అవునా?
119
00:07:27,160 --> 00:07:29,160
ఎవరూ ఎవరికీ ఓటు వేయరు.
120
00:07:29,160 --> 00:07:32,280
నోర్ముయ్! నోర్ముయ్!
121
00:07:32,880 --> 00:07:36,640
వ్యక్తిత్వం, శారీరకం పరంగా
మీ ఆలోచన ఏమిటి?
122
00:07:36,640 --> 00:07:39,560
మాంసం ప్రకారం ఎవరు ఉత్తమం
లేదా మనుగడ విలువ పరంగా
123
00:07:39,560 --> 00:07:41,960
ఎవరు చెడ్డ అని అంచనా వేస్తారా?
124
00:07:41,960 --> 00:07:43,840
అదీ, నా ఆలోచనలో...
125
00:07:43,840 --> 00:07:46,240
మనం ఎవరికీ ఎక్కువ రాకుండా చేయగలం, కదా?
126
00:07:46,240 --> 00:07:48,440
అలా ఎవరినీ ఎంపిక చేయకుండా!
127
00:07:49,280 --> 00:07:50,280
మీరు సన్నాసులు.
128
00:07:53,000 --> 00:07:55,320
మనం జోయి ఓటుపై అసలు ఆధారపడలేం.
129
00:07:57,960 --> 00:08:01,120
ఓరి నాయనో, శాండీ.
ఇదంతా నువ్వే చేశావా?
130
00:08:01,520 --> 00:08:02,960
నా పడవ అద్భుతంగా ఉంది.
131
00:08:03,360 --> 00:08:06,440
అవును, ఆ సముద్ర జలాలలో
కొంచెం నేర్చుకున్నా, జోయి.
132
00:08:06,440 --> 00:08:07,920
ఇప్పుడు ఇది నా పడవ.
133
00:08:07,920 --> 00:08:09,720
సముద్ర జలాల గురించి అయితే,
134
00:08:09,720 --> 00:08:12,520
నువ్వు అక్కడ చాలా సమయం గడిపావు కనుక...
135
00:08:12,520 --> 00:08:13,760
నీ పుణ్యమే కదా.
136
00:08:13,760 --> 00:08:16,440
అవును, ఇంకా దాని గురించి బాధగానే ఉంది.
137
00:08:17,000 --> 00:08:19,120
ఇదే అనుకుంటున్నా. అక్కడ ఏమైనా
138
00:08:19,120 --> 00:08:21,760
అమీలియా కోసం యాంటీడిప్రెసెంట్లు
దొరికే అవకాశముందా?
139
00:08:21,760 --> 00:08:24,600
దోచుకోబడని చోటు
ఏదైనా ఉండాలిగా.
140
00:08:24,600 --> 00:08:26,800
నీ ఆలోచన అంతా తప్పే.
141
00:08:26,800 --> 00:08:29,240
నువ్వు ఆ దోపిడీ చేసే వాళ్ళనే కనిపెట్టాలి.
142
00:08:31,960 --> 00:08:33,800
దాని పేరు స్కూబా సిటీ.
143
00:08:34,520 --> 00:08:36,400
అది స్కూబా డైవింగ్ శిక్షకులు
144
00:08:36,400 --> 00:08:39,760
ఇంకా వారి టూర్ బోట్‌లతో ఏర్పడిన
తేలియాడే సమాజం.
145
00:08:39,880 --> 00:08:42,640
ఎండలో వాడిపోయిన,
మెల్లగా మాట్లాడే,
146
00:08:42,760 --> 00:08:45,520
స్నోర్కెల్‌ను ఉపయోగించిన వెధవలంతా
గుంపుగా ఏర్పడి,
147
00:08:45,640 --> 00:08:48,440
ఉపరితలం కింద ఉన్న
ప్రతిదీ దోచుకుంటున్నారు.
148
00:08:48,440 --> 00:08:51,840
ఆగు, అయితే స్కూల్‌లో విఫలమైన,
వేసవిలో మజా చేసిన
149
00:08:51,840 --> 00:08:55,080
బీచ్ తింగరులు అందరూ
ఇప్పుడు పెత్తనం చేస్తున్నారా?
150
00:08:55,080 --> 00:08:58,720
చాలా వరకు. నీకేం కావాలన్నా,
వాళ్లు నీటి కిందకు వెళ్ళి తేగలరు.
151
00:08:58,720 --> 00:09:02,080
రాత్రి భోజనానికి డబ్బాలో సూప్ కావాలా?
కింద చిల్లరకొట్టు ఉంది.
152
00:09:02,080 --> 00:09:03,600
అంటే, యాంటీడిప్రెసెంట్లు?
153
00:09:03,600 --> 00:09:07,200
కచ్చితంగా వాళ్లు చాలా తేలికగా
కెమిస్ట్‌ను వెతకగలరు.
154
00:09:07,200 --> 00:09:09,360
అది అద్భుతం. అది పరిపూర్ణం.
155
00:09:09,360 --> 00:09:13,880
అవును, పరిపూర్ణం. అది అద్భుతం.
లేదు, స్కూబా సిటీకి వెళ్ళకూడదు, జోయి.
156
00:09:13,880 --> 00:09:16,880
స్కూబా సిటికీ
తిరిగి చెల్లించని ప్రతిఒక్కరి కథ
157
00:09:17,000 --> 00:09:18,520
ఇప్పటికే ముగిసిపోయింది.
158
00:09:19,160 --> 00:09:20,080
ఛత్.
159
00:09:20,960 --> 00:09:24,040
అయితే, మరి అక్కడకు
ఎందుకు వెళ్లాలనుకుంటావు?
160
00:09:24,880 --> 00:09:29,200
జోయి, కేవలం నా కన్నీళ్లను తాగి
మూడు నెలలు బతికాను.
161
00:09:30,760 --> 00:09:33,600
నిజానికి నా బలహీనత
నన్ను దృఢంగా మార్చింది.
162
00:09:34,640 --> 00:09:37,760
ఆ భావనను నా బిడ్డ కూడా
తెలుసుకోవాలని నా కోరిక.
163
00:09:38,960 --> 00:09:42,240
టెరీసాకు కూడా.
ఆమె వచ్చేందుకు నేను ఒప్పించగలిగితే.
164
00:09:42,240 --> 00:09:44,760
అందుకే రెండో సైకిల్ కలిపావా?
165
00:09:47,080 --> 00:09:48,520
స్నేహాలు, కదా?
166
00:09:49,080 --> 00:09:50,760
-మనకున్నవి అవే.
-అవును.
167
00:09:52,760 --> 00:09:54,960
నువ్వు ఓ మహిళను తినాలనుకునే వరకూ.
168
00:10:20,480 --> 00:10:21,400
బాగానే ఉన్నావా?
169
00:10:21,400 --> 00:10:23,400
అమ్మాయిలు! నన్ను తినండి.
170
00:10:24,280 --> 00:10:26,200
నేను చేస్తాను. నా వయసు ఎక్కువ,
171
00:10:26,200 --> 00:10:30,640
నేను స్వర్గానికి వెళ్ళే అవకాశం ఎక్కువ,
ఇంకా పాత నిబంధనలో ఆచారబద్ధమైన త్యాగంపై
172
00:10:30,760 --> 00:10:33,080
కొన్ని ఉదాహరణలను కనుగొన్నాను,
173
00:10:33,080 --> 00:10:35,880
ఇది హత్య విషయంలో
వేదాంత లొసుగుగా పనిచేసింది.
174
00:10:36,000 --> 00:10:37,280
మరి, మీరు ఏమంటారు?
175
00:10:38,640 --> 00:10:43,480
అవును, మాకు
ఓ నిమిషం కావాలనుకుంటా, సిస్టర్.
176
00:10:48,600 --> 00:10:51,960
అది నేను చెబుతాను. మేకపిల్లను తినగలిగితే
మేకను ఎవరు తింటారు?
177
00:10:52,520 --> 00:10:56,320
అది ఉదారమైన ఆఫర్,
సిస్టర్, కానీ...
178
00:10:57,280 --> 00:10:59,520
మేము ఓ నన్‌ను తినలేము.
179
00:10:59,520 --> 00:11:02,320
దేవుడి కారణంగా.
అది ఆయనకు కోపం తెప్పిస్తుంది.
180
00:11:02,320 --> 00:11:04,240
నీకు అర్థమైందిగా?
181
00:11:04,240 --> 00:11:06,640
కానీ నువ్వు గిరిజన మండలిని నడపవచ్చు.
182
00:11:07,280 --> 00:11:10,520
అమ్మాయిలు, నా జోక్‌ను
చాలా దూరం తీసుకెళ్లారు.
183
00:11:10,520 --> 00:11:13,920
-అబ్బా, అది వదిలెయ్. మేక అంతే.
-లేదు, లేదు, లేదు.
184
00:11:13,920 --> 00:11:16,680
సరే, గిరిజన మండలి నడుపుతాను.
185
00:11:17,280 --> 00:11:18,640
నాకు ఓ క్షణం ఇవ్వండి.
186
00:11:21,680 --> 00:11:27,080
అయితే, జోయి, ఈ రాత్రి
ఓటు వేయడంపై ఏమంటావు?
187
00:11:27,680 --> 00:11:30,000
అవును. చూడు, కచ్చితంగా
నేనొక లక్ష్యం.
188
00:11:30,000 --> 00:11:33,640
ఇది పెద్ద పిచ్చితనం అనుకునే
ఒకే ఒక్కదాన్ని నేనే.
189
00:11:33,640 --> 00:11:37,920
చివరిసారి నన్ను
మెలుకువగా ఉంచావు, బుడ్డదానా.
190
00:11:41,600 --> 00:11:42,760
ఎక్కడ ఉన్నావు?
191
00:11:47,280 --> 00:11:49,480
చుంచులా ఆలోచించే సమయం వచ్చింది.
192
00:11:52,040 --> 00:11:55,320
ఓట్లు లెక్కించిన తరువాత,
అదే తుది నిర్ణయం,
193
00:11:55,320 --> 00:11:58,480
అధిక ఓట్లను
ఎవరైతే పొందుతారో...
194
00:11:59,400 --> 00:12:00,520
వారు తొలగించబడతారు.
195
00:12:04,680 --> 00:12:05,840
మొదటి ఓటు.
196
00:12:07,480 --> 00:12:08,440
జోయి.
197
00:12:08,840 --> 00:12:10,040
ఆశ్చర్యమేమీ లేదు.
198
00:12:10,720 --> 00:12:11,640
రెండవ ఓటు.
199
00:12:12,600 --> 00:12:13,760
టెరీసా.
200
00:12:14,480 --> 00:12:15,640
మూడవ ఓటు.
201
00:12:16,800 --> 00:12:18,120
మీగన్.
202
00:12:21,640 --> 00:12:22,760
టెరీసా.
203
00:12:23,200 --> 00:12:24,040
ఏంటి?
204
00:12:25,560 --> 00:12:26,760
టెరీసా.
205
00:12:26,760 --> 00:12:28,600
మీరు నిజంగా అంటున్నారా?
206
00:12:29,040 --> 00:12:31,000
ఇన్ని నెలల పాటు నేను చేసినది
207
00:12:31,000 --> 00:12:33,760
మీకు వండడం, శుభ్రం చేయడమే,
కృతజ్ఞత లేని సన్నాసులారా.
208
00:12:33,760 --> 00:12:38,120
అది కాలివేలు లేకుండా చేశా, గుర్తుంచుకోండి,
నాకు దక్కే కృతజ్ఞతలు ఇవేనా?
209
00:12:38,120 --> 00:12:40,040
నిజానికి, ఇది వ్యక్తిగతం కాదు.
210
00:12:40,040 --> 00:12:43,360
ఏళ్ల పాటు ఐవీఎఫ్ కోసం నీ శరీరాన్ని
గుడిలా చూసుకున్నావు.
211
00:12:43,360 --> 00:12:46,320
-నువ్వు సేంద్రీయ ఆహారానివి.
-నీ రుచికరమైన శరీరం మాకిష్టం.
212
00:12:46,320 --> 00:12:49,720
సరే, ఒకవేళ మీరంతా
మాతృత్వం నాకు వ్యతిరేకంగా వాడాలనుకుంటే,
213
00:12:49,720 --> 00:12:52,240
నన్ను కాపాడుకునేందుకు
నేను దానినే వాడుకుంటాను.
214
00:12:52,560 --> 00:12:53,600
ఏంటి?
215
00:12:53,880 --> 00:12:57,320
-నేను శాండీ బిడ్డను పెంచాలి.
-ఏంటి? నిజమా?
216
00:12:57,320 --> 00:13:00,080
-అసలు ఏంటిది?
-నా కోసం ఆ పని చేస్తావా?
217
00:13:00,520 --> 00:13:03,440
అవును, అది బిడ్డను సురక్షితంగా ఉంచితే.
218
00:13:04,000 --> 00:13:07,720
కానీ మనం సముద్ర దొంగ వెధవలలా
సముద్రం దగ్గర పెంచము.
219
00:13:07,720 --> 00:13:08,960
-ఊరుకో.
-సరేనా?
220
00:13:09,360 --> 00:13:12,640
మనం నేలపై ఉండి వారం వారీ చెకప్‌ల కోసం
రెనే దగ్గరకు వెళతాం.
221
00:13:13,480 --> 00:13:14,800
సరే, సరే.
222
00:13:17,200 --> 00:13:18,560
అయితే, నేను బతికుంటానా?
223
00:13:19,080 --> 00:13:20,280
-అవునా?
-అవును.
224
00:13:20,800 --> 00:13:24,320
అంటే, అమ్మలు అన్నీ చేస్తుంటారు,
అంటే టీ సురక్షితం.
225
00:13:24,320 --> 00:13:26,480
-ధన్యవాదాలు.
-అభినందనలు.
226
00:13:30,360 --> 00:13:32,600
టెరీసా. లెక్కలోకి రాదు.
227
00:13:34,680 --> 00:13:35,800
-జోయి.
-కానివ్వు.
228
00:13:35,800 --> 00:13:37,680
అవి రెండు ఓట్లు, జోయికి.
229
00:13:38,120 --> 00:13:39,640
ఒక ఓటు, మీగన్‌కు.
230
00:13:41,000 --> 00:13:43,360
టెరీసా. లెక్కలోకి రాదు.
231
00:13:44,000 --> 00:13:45,040
చివరి ఓటు.
232
00:13:46,960 --> 00:13:48,240
ఇది మీగన్‌కి.
233
00:13:48,720 --> 00:13:49,800
అసలు ఏంటిది?
234
00:13:49,800 --> 00:13:52,960
అయితే జోయికి రెండు ఓట్లు,
మీగన్‌కు రెండు ఓట్లు.
235
00:13:53,400 --> 00:13:54,560
మనకు టై అయింది.
236
00:13:55,080 --> 00:13:56,440
ఒకటికి రెండు భోజనాల డీల్.
237
00:13:57,080 --> 00:13:57,920
మంచిదే.
238
00:14:01,680 --> 00:14:04,160
అక్కడున్నావు, చిన్నోడా.
239
00:14:04,480 --> 00:14:05,600
అమీలియా?
240
00:14:05,600 --> 00:14:06,880
లేదు, లేదు!
241
00:14:11,520 --> 00:14:13,520
ఏంటి? నీకేం కావాలి?
242
00:14:13,960 --> 00:14:14,840
బాగున్నావు.
243
00:14:15,800 --> 00:14:17,400
నువ్వు గిరిజన మండలికి వచ్చి
244
00:14:18,280 --> 00:14:21,800
దయచేసి, టైబ్రేకర్‌లో ఓటు వేయాలి.
245
00:14:22,120 --> 00:14:26,440
లేదు, వారాల క్రితం చేసిన ప్రమాణం ప్రకారం
చేస్తున్నా, చావు కోసం ఎదురుచూపులు.
246
00:14:26,960 --> 00:14:28,680
సరేనా? మీరది ప్రయత్నించాలి.
247
00:14:29,640 --> 00:14:30,880
అమీలియా!
248
00:14:32,480 --> 00:14:35,080
నేను ఇప్పుడు
ముందులా మారిపోకూడదని చూస్తున్నాను.
249
00:14:35,480 --> 00:14:36,960
సున్నితంగా ఉండాలని నా యత్నం.
250
00:14:37,520 --> 00:14:41,280
నీకు ఈ పరిస్థితి మీద
విభిన్న అభిప్రాయం ఉందని తెలుసు.
251
00:14:41,280 --> 00:14:45,840
కానీ మేము ఎదుర్కునే పరిస్థితికి
నువ్వు కూడా కారణమే.
252
00:14:45,840 --> 00:14:48,280
నీ చిన్న పార్టీ మా అందరినీ చెడగొట్టింది.
253
00:14:48,280 --> 00:14:51,520
అందుకే, దయచేసి, వచ్చి ఓటు వెయ్,
254
00:14:52,360 --> 00:14:57,800
ఎందుకంటే నీకు బతకాలని లేకపోయినా,
మిగతా మా అందరికీ బతకాలని కోరిక.
255
00:15:00,840 --> 00:15:01,800
మంచిది.
256
00:15:05,440 --> 00:15:06,920
అది దాదాపు జరిగిపోయేది...
257
00:15:08,080 --> 00:15:09,640
మళ్లీ కటువుగా ఉండడం.
258
00:15:18,320 --> 00:15:20,600
తప్పకుండా. కానీ నేనెందుకు
నరికే శిలపై ఉండాలి?
259
00:15:20,600 --> 00:15:23,400
వయొలిన్ వాయించడం
బతకగలిగే నైపుణ్యం కాదు.
260
00:15:23,400 --> 00:15:25,840
ఏంటి, అయితే మనం కళకు
ఇకపై విలువ ఇవ్వబోమా?
261
00:15:25,840 --> 00:15:28,960
ఈ దేశం కళకు ఏనాడూ విలువ ఇవ్వలేదు.
ఎందుకు మొదలుపెట్టాలి?
262
00:15:28,960 --> 00:15:30,080
అమీలియా.
263
00:15:30,080 --> 00:15:32,960
విను, నేను చాలా చెడగొట్టానని తెలుసు.
264
00:15:33,720 --> 00:15:37,200
కానీ బయట ఉన్న మనుషులున్నారు,
బతకగలిగే ఇతర మార్గాలు ఉన్నాయి.
265
00:15:37,200 --> 00:15:39,640
ఇది నన్నో, మీగన్‌నో
ఎంచుకోవడం గురించి కాదు.
266
00:15:39,640 --> 00:15:41,320
ఇది ఎవరినీ ఎంచకుండా ఉండడం.
267
00:15:42,840 --> 00:15:45,800
-అవును, దానిలో నాకు అర్థం కనబడుతోంది.
-ధన్యవాదాలు.
268
00:15:46,240 --> 00:15:48,800
ఇంతకీ ఇది ఎలాంటి జీవితం?
269
00:15:48,800 --> 00:15:52,960
మనుషులు బతకగలరు కాబట్టి,
వాళ్లు బతికి తీరాలని అర్థం కాదు.
270
00:15:52,960 --> 00:15:55,160
బాధ అనేది అర్థానికి సమానం కాదు.
271
00:15:56,360 --> 00:15:58,240
కొన్నిసార్లు అది కేవలం బాధే.
272
00:15:59,360 --> 00:16:02,280
లేదు. అది నిజం కాదు.
నా ఉద్దేశ్యం అది కాదు.
273
00:16:02,280 --> 00:16:04,480
ఆశ ఎప్పుడూ ఉంటుంది, సరేనా?
274
00:16:04,480 --> 00:16:06,880
-మనం చాలా కాలం బతికాం, నా ఉద్దేశం...
-లేదు.
275
00:16:07,520 --> 00:16:10,160
లేదు, అది ముఖ్యం కాదు.
నువ్వు విషయం మరిచిపోయావు.
276
00:16:10,160 --> 00:16:11,320
ఏదీ ముఖ్యం కాదు.
277
00:16:11,320 --> 00:16:14,720
మనం కరెంట్ కనిపెట్టడం,
పంటలు పెంచడం, లేదా బయట జనాలు ఉండడం
278
00:16:14,720 --> 00:16:16,680
అవేవీ ముఖ్యం కావు.
279
00:16:16,680 --> 00:16:20,320
ఆ జనాలు ముఖ్యం కాదు.
మనమూ కాదు. నువ్వూ ముఖ్యం కాదు.
280
00:16:21,760 --> 00:16:22,960
నేను ముఖ్యం.
281
00:16:23,640 --> 00:16:26,720
నేను నిజంగా ముఖ్యమే.
నువ్వు రావడానికి అసలు కారణం నేనే.
282
00:16:27,080 --> 00:16:30,160
నువ్వు బతికుండడానికి కారణం నేనే,
అందుకే నన్ను ఎంచుకో.
283
00:16:30,800 --> 00:16:32,200
దయచేసి నన్ను కాపాడు.
284
00:16:33,080 --> 00:16:34,680
ఓహో, జోయి.
285
00:16:35,800 --> 00:16:39,320
ఎంచుకోకూడని అమ్మాయిగా ఉండాలనే విషయం
నీకు తెలియదా?
286
00:16:40,120 --> 00:16:42,760
మళ్లీ ఇక్కడ నిలబడి ఉండటం
నీకు ఆశ్చర్యంగా ఉంది,
287
00:16:42,760 --> 00:16:44,640
ఎలిమినేట్ కావడానికి వేచి చూస్తూ.
288
00:16:46,360 --> 00:16:49,800
ఇక, లేదు, నిన్ను ఎంచుకోను.
289
00:16:52,040 --> 00:16:53,960
కానీ నేను మీగన్‌ను కూడా ఎంచుకోను.
290
00:16:54,880 --> 00:16:57,240
ఇదంతా మనకు త్వరలోనో ముగిసిపోతుంది.
291
00:16:58,040 --> 00:17:00,200
అప్పటివరకూ ఇది కష్టంగా చేయవద్దు.
292
00:17:08,280 --> 00:17:11,280
-ఆమె మంచి మాటలు చెప్పింది.
-జోయి చాలా చెడగొట్టింది.
293
00:17:11,280 --> 00:17:14,160
-అవును.
-ఆమె మాటలు వినకండి. తనకు పిచ్చి.
294
00:17:14,160 --> 00:17:16,080
పునఃకలయికలో మనల్ని ఇరికించింది.
295
00:17:16,200 --> 00:17:18,240
ఏం వేసుకుందో చూశారా?
మానసికంగా సరిలేదు.
296
00:17:18,240 --> 00:17:20,040
శాండీని జోయినే సముద్రంలో తోసింది.
297
00:17:20,040 --> 00:17:22,680
-ఆమె తోసింది.
-దానికి నింద శాస్కియాపై వేసింది.
298
00:17:23,680 --> 00:17:26,200
జోయి కారణంగానే
నెట్‌బాల్ హూప్ నా కాలిపై పడింది.
299
00:17:26,200 --> 00:17:27,960
అది ఓ ప్రమాదం.
300
00:17:27,960 --> 00:17:30,800
నువ్వు ఆఖరి కోడిని
చంపేయడం కూడా ప్రమాదమేనా?
301
00:17:30,920 --> 00:17:34,520
-అందుకే ఇప్పుడు ఆకలితో ఉన్నాం.
-నన్ను ఎప్పుడూ పెపీ అంటుంది.
302
00:17:34,520 --> 00:17:37,280
రేడియోతో పని చేయడం
నాకు మాత్రమే తెలుసు.
303
00:17:38,480 --> 00:17:39,560
ఆమెది తప్పు కాదు.
304
00:17:39,680 --> 00:17:41,080
-అయితే...
-నిజం.
305
00:17:41,080 --> 00:17:45,160
బయట జనాలు ఉన్నారని మనకు తెలుసు,
అన్నింటి కంటే అదే ముఖ్యం.
306
00:17:45,160 --> 00:17:46,280
అదీ, నేను...
307
00:17:48,400 --> 00:17:49,800
చెప్పడానికి ఛలోక్తులు లేవు.
308
00:17:52,960 --> 00:17:54,080
మీగన్.
309
00:17:57,320 --> 00:17:58,640
నా ఓటు మీగన్‌కే.
310
00:17:59,440 --> 00:18:00,800
అవును, నేను కూడా.
311
00:18:01,520 --> 00:18:03,560
-లేదు, లేదు.
-దీనికి అర్థం ఉంది.
312
00:18:04,200 --> 00:18:05,200
లేదు.
313
00:18:05,200 --> 00:18:06,240
నేను కూడా.
314
00:18:07,240 --> 00:18:11,040
-క్షమించు, మీగన్.
-మీగన్. తప్పదని అనిపిస్తోంది.
315
00:18:11,040 --> 00:18:13,440
-ఏమిటీ గోల?
-మీగన్.
316
00:18:14,480 --> 00:18:17,280
నా ఓటు కూడా మీగన్‌కే.
మా బిడ్డది కూడా.
317
00:18:18,880 --> 00:18:20,800
-శాస్కియా.
-దయచేసి వాళ్లకు చెప్పు.
318
00:18:20,920 --> 00:18:22,200
దయచేసి ఇలా చేయకు.
319
00:18:22,200 --> 00:18:24,320
-దయచేసి.
-ఇది వ్యక్తిగతం కాదు.
320
00:18:24,440 --> 00:18:27,480
ఇది కేవలం...
బృందానికి ఇదే కావాలంటే, అప్పుడు,
321
00:18:27,480 --> 00:18:29,640
అవును, మీగనే చావాలి. నన్ను క్షమించు.
322
00:18:30,320 --> 00:18:33,400
అమ్మాయిలు, ఇదిప్పుడు చాలా దూరం వెళ్లింది,
నేను ఇంతసేపు
323
00:18:33,400 --> 00:18:36,040
-ఆడినందుకు క్షమించండి.
-చెప్పండి, సిస్టర్.
324
00:18:36,480 --> 00:18:37,760
గొప్ప మంచి కోసం.
325
00:18:38,040 --> 00:18:38,960
వద్దు.
326
00:18:41,680 --> 00:18:44,320
అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తి...
327
00:18:46,080 --> 00:18:47,080
మీగన్.
328
00:18:53,760 --> 00:18:54,960
నిజంగా అంటున్నారా?
329
00:18:55,800 --> 00:18:58,520
మీరంతా సన్నాసి మొహాలు, అందరూ!
330
00:18:58,520 --> 00:19:00,280
దొంగమొహాల కూతుళ్లు.
331
00:19:00,280 --> 00:19:02,040
వెళ్లిపోండి. నేను పట్టించుకోను.
332
00:19:02,040 --> 00:19:04,640
పొండి! మోసగత్తెలారా.
333
00:19:06,080 --> 00:19:07,720
మీగన్ కూడా ముఖ్యమే.
334
00:19:12,080 --> 00:19:13,080
నన్ను క్షమించు.
335
00:19:18,320 --> 00:19:20,080
శుభోదయం, శ్రోతలారా.
336
00:19:21,080 --> 00:19:23,560
ఇవాళ మాకు చాలా చెడ్డ రోజు.
337
00:19:26,040 --> 00:19:30,560
మరొకసారి, మా అక్షాంశాలు
దక్షిణంగా 34.4100 డిగ్రీలు,
338
00:19:31,320 --> 00:19:34,320
తూర్పున 150.3037 డిగ్రీలు.
339
00:19:35,800 --> 00:19:37,800
మీరు బయట ఉన్నారని మాకు తెలుసు.
340
00:19:38,480 --> 00:19:39,320
దయచేసి...
341
00:19:40,160 --> 00:19:43,000
వచ్చి మమ్మల్ని మా నుంచి కాపాడండి.
342
00:19:49,560 --> 00:19:51,560
ఇవాళ మనకు ఎలా ఉంది?
343
00:19:51,960 --> 00:19:52,880
ఉత్తేజంగా ఉందా?
344
00:19:52,880 --> 00:19:55,200
బాగున్నావా? సరే. అలాగే.
345
00:19:55,200 --> 00:19:57,400
మనకు ఏం ఉందో చూద్దాం.
346
00:19:57,400 --> 00:20:00,080
తను కచ్చితంగా ఓ బిడ్డ. లేదా ఇంకేంటి?
347
00:20:00,320 --> 00:20:01,440
ఊరికే అన్నాను.
348
00:20:01,440 --> 00:20:02,720
లేదు, లేదు. నేను...
349
00:20:03,040 --> 00:20:04,520
వైబ్రేటరా, నిజంగా?
350
00:20:04,520 --> 00:20:06,480
-వద్దు.
-దానితో కానివ్వు, సరేనా?
351
00:20:07,040 --> 00:20:09,440
సరే. కొంచెం చల్లగా ఉండవచ్చు.
352
00:20:12,080 --> 00:20:17,080
నా అంచనాల ప్రకారం,
నీది నాలుగు నెలల గర్భం.
353
00:20:17,680 --> 00:20:19,440
నీకు గుండెచప్పుడు వినాలని ఉందా?
354
00:20:19,440 --> 00:20:21,800
అది కొంచెం ఇలా ఉండవచ్చు.
355
00:20:28,480 --> 00:20:29,640
నిజమా?
356
00:20:30,560 --> 00:20:33,240
నిజమా, ఇది నీకు పని చేస్తుందా?
357
00:20:34,520 --> 00:20:37,480
అవును. క్షమించు.
358
00:20:38,560 --> 00:20:41,440
ఇది, నేను కోరుకున్నది ఇదే.
359
00:20:41,800 --> 00:20:44,560
కానీ నెలల క్రితమే
నాకు నేను సర్దిచెప్పుకున్నా.
360
00:20:44,560 --> 00:20:47,560
అంటే ఇది ఎప్పటికీ జరగదని అనుకున్నా.
361
00:20:48,320 --> 00:20:51,240
సరే, ఏడు నెలల్లో ప్రసవం జరుగుతుంది.
362
00:20:51,240 --> 00:20:52,440
-ఐదు.
-ఐదు.
363
00:20:52,440 --> 00:20:53,560
ఐదు.
364
00:20:54,080 --> 00:20:55,280
గణితం, నేను...
365
00:20:58,920 --> 00:21:02,320
నీకు నీ బిడ్డ దొరుకుతుంది, టెరీసా,
నేను వెళ్లిపోతాను.
366
00:21:03,000 --> 00:21:05,720
నేను... దాన్ని ప్రసవించాక,
367
00:21:05,720 --> 00:21:09,480
నేను వీడ్కోలు చెప్పి, నీకు ఇచ్చేస్తాను.
368
00:21:11,240 --> 00:21:13,080
నిన్ను వెళ్లమని ఎవరూ అనరు.
369
00:21:13,200 --> 00:21:14,800
అబ్బా, ఊరుకో.
370
00:21:14,800 --> 00:21:16,480
ఇక్కడ నేనుండాలని ఎవరూ అనుకోరు.
371
00:21:16,480 --> 00:21:19,160
గ్రేడ్ 12లో ఎప్పుడు
వెళ్ళిపోతానని ఎదురుచూశావు.
372
00:21:19,160 --> 00:21:22,400
జోయి, శాస్కియాలు తొలి అవకాశంలోనే
నన్ను సముద్రంలో తోశారు.
373
00:21:23,320 --> 00:21:26,480
నేను గ్వాటిమాలా కోస్ట్ గార్డుల
బృందంలో చేరాలని చూసినా,
374
00:21:26,480 --> 00:21:27,880
వాళ్లూ నన్ను వదిలేశారు.
375
00:21:28,800 --> 00:21:31,080
అంటే, నువ్వు ఒకరిని తిన్నానని చెప్పలేదా?
376
00:21:31,200 --> 00:21:32,560
సరే, దానికి కారణాలున్నాయి.
377
00:21:32,680 --> 00:21:38,240
కానీ విషయం ఏంటంటే, నేను ఒంటరి జీవిని,
సముద్రానికే చెందుతాను.
378
00:21:42,480 --> 00:21:43,400
శాండీ,
379
00:21:44,320 --> 00:21:48,080
నువ్వు... నిజమైన ఉన్మాదివి.
380
00:21:48,720 --> 00:21:49,640
ధన్యవాదాలు.
381
00:21:50,720 --> 00:21:51,960
కానీ నువ్విక్కడ ఉండాలి.
382
00:21:53,080 --> 00:21:57,680
సరేనా? బిడ్డను పెంచడం కోసం
నాకు తోడుగా వేరే ఎవరూ లేరు...
383
00:21:59,040 --> 00:22:00,320
నా నేస్తం కంటే ఎక్కువగా.
384
00:22:04,640 --> 00:22:05,520
ఏంటి?
385
00:22:11,480 --> 00:22:12,760
ఓహో, అరె మీరు!
386
00:22:13,200 --> 00:22:14,680
పోవే, రెనే!
387
00:22:15,440 --> 00:22:17,040
ఇది మా సమయం.
388
00:23:21,280 --> 00:23:22,520
రాత్రి భోజనం
389
00:23:24,240 --> 00:23:26,560
అయ్యో, వద్దు, వద్దు...
390
00:24:18,600 --> 00:24:20,440
అవును, నాకు తెలుసు. తెలుసు.
391
00:24:20,440 --> 00:24:23,200
బార్బెక్యూలో అందరూ పాడేలా చేసేటట్లు
392
00:24:23,200 --> 00:24:24,800
వయొలిన్‌ని వాయించనని తెలుసు.
393
00:24:26,280 --> 00:24:28,440
అర్థమైంది. మనసు కష్టపెట్టుకోకండి.
394
00:24:28,440 --> 00:24:29,680
లేదు, నేను కాదంటాను.
395
00:24:29,680 --> 00:24:31,400
ద కోర్స్, డేవ్ మాథ్యూస్ బేండ్,
396
00:24:31,400 --> 00:24:34,680
"థోంగ్ సాంగ్" లో ఆర్కెస్ట్రా డ్రమ్‌లా
నీ వయోలిన్ అమోఘం.
397
00:24:35,160 --> 00:24:36,400
ఆ పని నేను చేస్తాను.
398
00:24:37,280 --> 00:24:39,720
తనకు బదులుగా
నేనే స్వచ్ఛందంగా త్యాగం చేస్తాను.
399
00:24:40,720 --> 00:24:42,960
ఆగు, నిజమా?
400
00:24:44,440 --> 00:24:47,000
అవును. చూడండి, ఇక నాకు చాలు.
401
00:24:47,000 --> 00:24:48,080
నాకు ఆశ పోయింది.
402
00:24:49,400 --> 00:24:50,760
మీకు పోలేదు, అందుకే...
403
00:24:52,080 --> 00:24:55,120
మీరు కొనసాగేందుకు ఇది సహాయపడితే,
నేను చేసేది అదే.
404
00:24:56,920 --> 00:24:58,240
అబ్బా ఛ!
405
00:24:59,000 --> 00:25:01,800
-కొంచెం సున్నితంగా లేదు.
-కచ్చితమా, అమీలియా?
406
00:25:02,680 --> 00:25:04,000
హా. కచ్చితంగానే.
407
00:25:04,640 --> 00:25:07,880
కానీ ఈ భావోద్వగపు, ఊకదంపుడు కబుర్ల
చెత్త వద్దు, సరేనా?
408
00:25:07,880 --> 00:25:09,600
నాకు ఏదీ చూడాలని లేదు...
409
00:25:13,360 --> 00:25:16,120
ఆమెకు భయంతో
తప్పించుకునే అవకాశం ఇస్తారా?
410
00:25:16,920 --> 00:25:17,880
లేదు.
411
00:25:18,600 --> 00:25:21,040
మనం ఈ పని ఇప్పుడే చేయాలి,
లేదా ఎప్పటికీ చేయలేం.
412
00:25:21,640 --> 00:25:24,560
తను ఆ సోది చెప్పిన వెంటనే,
నా దృష్టిలో చచ్చింది.
413
00:25:24,560 --> 00:25:27,080
అందుకే, నేనిది చూసుకుంటాను, సరేనా?
414
00:25:27,920 --> 00:25:28,840
మన అందరి కోసం.
415
00:25:29,720 --> 00:25:32,920
కానీ అప్పుడు, ఇకపై,
"జోయి అన్నీ చెడగొడుతుంది," అనకూడదు.
416
00:25:32,920 --> 00:25:36,360
సరేనా? "జోయి ముఖ్యం కాదు,"
అనకూడదు, సరేనా?
417
00:25:36,360 --> 00:25:39,600
ఎవరో ఒకరు హింసాత్మకంగా ఉండాలి,
అది నేనే, సరేనా?
418
00:25:41,240 --> 00:25:42,160
సరే.
419
00:25:43,280 --> 00:25:45,280
వెళ్లి టేబుల్ సర్దండి.
420
00:26:15,400 --> 00:26:16,400
అబ్బా ఛ.
421
00:26:18,520 --> 00:26:20,120
-హమ్మయ్య.
-అసలు ఏంటిది?
422
00:26:20,480 --> 00:26:21,400
హమ్మయ్య.
423
00:26:21,400 --> 00:26:24,160
నిజంగానే నిన్ను చంపేశానని అనుకున్నాను.
424
00:26:24,160 --> 00:26:25,480
అది నిర్ణయించడం కష్టం,
425
00:26:25,480 --> 00:26:28,520
ఎందుకంటే ఒప్పించగలిగేంత గట్టిగా
నిన్ను కొట్టాలి,
426
00:26:28,520 --> 00:26:31,800
కానీ నువ్వు చనిపోయేంతగా కాదు.
నేను అదరగొట్టేశాను.
427
00:26:33,200 --> 00:26:37,520
నేను పడవపై ఉన్న
సైకిల్‌పై ఎందుకున్నాను, జోయి?
428
00:26:37,520 --> 00:26:39,480
ఎందుకంటే నువ్వు వెళ్లాలి, అమీలియా.
429
00:26:39,480 --> 00:26:43,320
స్కూబా సిటీ అనే చోటు ఉంది,
వాళ్లు నీకు ఏదైనా ఇవ్వగలరు.
430
00:26:43,320 --> 00:26:47,640
నువ్వు అక్కడకు వెళ్లి, మందులు తీసుకుని,
తిరిగి ఇక్కడకు రా, దయచేసి.
431
00:26:49,720 --> 00:26:51,920
నువ్వు తెగ చికాకు పెడతావు.
432
00:26:52,320 --> 00:26:55,160
-ఏంటి?
-నేను పోయేందుకు సిద్ధం. మనశ్శాంతిగా.
433
00:26:55,520 --> 00:26:58,960
అప్పుడు నువ్వు
ఈ నకిలీ త్యాగం చేసి అలాగే ఈ పిచ్చి...
434
00:26:58,960 --> 00:27:00,600
పారిపోయే యత్నం చేస్తున్నావు,
435
00:27:00,600 --> 00:27:03,280
అంటే దాని అంతటితో
నేను మాములు కావాలనా?
436
00:27:04,560 --> 00:27:05,560
అవును.
437
00:27:05,560 --> 00:27:07,720
ఓరి దేవుడా. జోయి, నువ్వేంటో తెలుసా?
438
00:27:07,720 --> 00:27:11,400
నువ్వొక... రోగ నిర్ధారణలా, సరేనా?
439
00:27:11,920 --> 00:27:16,200
డాక్టర్ మన దగ్గర కూర్చుని,
ఈ ఇబ్బందికరమైనవి చెబుతాడు,
440
00:27:16,600 --> 00:27:20,360
కొన్నిసార్లు ఆ ప్రాణాంతక విషయం
నీ జీవితంలో భాగం కావచ్చు,
441
00:27:20,360 --> 00:27:22,280
దాంతో జీవించడం
అలవాటు చేసుకోమంటాడు.
442
00:27:24,760 --> 00:27:26,960
మనం ఎంత అదృష్టవంతులమో తెలుసా, అమీలియా?
443
00:27:28,320 --> 00:27:32,440
బయట చాలామంది ఉన్నారని,
వాళ్లు ఒంటరిగానే ఉన్నారని నీకు తెలుసా?
444
00:27:32,440 --> 00:27:35,720
రోగనిర్ధారణలాంటి ఓ మనిషి కోసం
జనాలు ఏ త్యాగానికైనా సిద్ధం,
445
00:27:35,720 --> 00:27:39,520
ఎందుకంటే స్నేహం అని పిలవడానికి
నువ్వు తిరస్కరిస్తున్న ఇది,
446
00:27:39,520 --> 00:27:42,080
ఎందుకంటే నీ దృష్టిలో ఇది చెత్త, ఛీ, థూ,
447
00:27:42,080 --> 00:27:44,240
మనకు మిగిలినది ఇది మాత్రమే.
448
00:27:45,560 --> 00:27:48,200
అందుకే, అవును, మన్నించు,
నేను ఇక్కడే ఉంటాను,
449
00:27:48,640 --> 00:27:51,960
నిన్ను తినేయకుండా ఉండేందుకు
నిన్ను విసిగిస్తూ,
450
00:27:51,960 --> 00:27:53,800
ఇంకా సరైన మోతాదులో దెబ్బ కొడుతూ,
451
00:27:53,800 --> 00:27:57,960
అలాగే నీ నుదుటి జుట్టు ఎలా కనిపించినా
చాలా బాగుందని చెబుతూ... మంచిది,
452
00:27:57,960 --> 00:28:02,680
ఎందుకంటే ఇక్కడ జీవించడం ఇంకా
బతికుండడం మధ్య ఏకైక వ్యత్యాసం ఏంటంటే
453
00:28:02,960 --> 00:28:06,960
ఒకే పని చేస్తూ ఉండడం, కానీ ఆ పని
చేసేందుకు ఇంకొకరు తోడు ఉండడమే.
454
00:28:07,360 --> 00:28:09,200
అది గొప్ప అదృష్టం, సరేనా?
455
00:28:17,560 --> 00:28:19,680
నాకు ఫ్రింజ్ శైలి నప్పదని తెలుసు.
456
00:28:19,680 --> 00:28:21,920
-ఓరి దేవుడా.
-నన్ను ఎందుకు చేయనిచ్చావు?
457
00:28:21,920 --> 00:28:23,960
నువ్వు బాధపడేది అందుకేనా?
458
00:28:23,960 --> 00:28:26,840
అబ్బా, ఛ. దేవుడా.
459
00:28:26,840 --> 00:28:30,080
ఇది మంచిదే.
పశ్చాత్తాపం అంటే ఏదో ఒకటి భావిస్తున్నావు.
460
00:28:33,080 --> 00:28:34,880
నా మనసుకు భావాలు కావాలి.
461
00:28:34,880 --> 00:28:36,760
అవును. మంచిది. అయితే పైకి లే.
462
00:28:36,760 --> 00:28:38,880
పద, పద! ఆలోచించకు. ఇక వెళ్లు.
463
00:28:41,920 --> 00:28:43,400
జాగ్రత్తగా ఉండు.
464
00:28:43,400 --> 00:28:44,920
ఇంకా దయచేసి వెనుకకు రా.
465
00:28:53,480 --> 00:28:57,520
మనం తింటుండగా ఎవరైనా స్తుతించడం
మరింత రుచిగా ఉంటుందని నా ఆలోచన,
466
00:28:57,520 --> 00:28:59,440
అలా మనం త్యాగాన్ని అభినందించగలం.
467
00:28:59,440 --> 00:29:02,520
-ఇది థియేటర్ రెస్టారెంట్ కాదు.
-నేనలా అనలేదు.
468
00:29:02,520 --> 00:29:04,800
ఇది అమీలియాను, మన కోసం
469
00:29:04,800 --> 00:29:07,000
ఆమె చేసిన త్యాగాన్ని గౌరవించడం.
470
00:29:07,000 --> 00:29:08,800
థియేటర్ రెస్టారెంట్‌లానే ఉంది.
471
00:29:08,800 --> 00:29:11,520
-అమ్మాయిలు.
-ఆమె చేసినదాన్ని, ఆమె జీవితాన్ని,
472
00:29:11,520 --> 00:29:14,680
తన అలవాట్లు, స్నేహితులు,
కుటుంబాలను అభినందించడం...
473
00:29:14,680 --> 00:29:16,440
నువ్వు ఏమంటావు?
474
00:29:16,440 --> 00:29:18,240
నేను చెప్పేది, తెలుసుగా...
475
00:29:18,240 --> 00:29:21,040
-కావాలంటే, అలా చేసేందుకు సంతోషమే.
-అమ్మాయిలు!
476
00:29:21,040 --> 00:29:23,840
మేము జో జో ఎఫ్ఎం వింటున్నాం.
477
00:29:23,840 --> 00:29:26,920
మేము స్కూల్‌లా కనిపించేది చూస్తున్నాం.
478
00:29:26,920 --> 00:29:29,360
మేము ఇప్పుడే దాటాం... నెట్‌బాల్ కోర్టులు
479
00:29:29,360 --> 00:29:32,120
ఇంకా శిఖర ముఖానికి చేరాము.
480
00:29:32,120 --> 00:29:33,440
అది పశ్చిమం వైపు.
481
00:29:34,520 --> 00:29:36,040
అది... అది కుర్రాళ్లు.
482
00:29:36,040 --> 00:29:37,120
మా మాటలు విన్నారా?
483
00:30:03,480 --> 00:30:06,320
అమ్మాయిలు! ఆగండి. అమ్మాయిలు!
484
00:30:06,320 --> 00:30:09,200
మనం ఒకరికొకరం తెలియదని తెలుసు,
కానీ నాకు భయంగా ఉంది
485
00:30:09,200 --> 00:30:13,800
ఎందుకంటే నా నుదురు వాసన వస్తోంది,
కొంచెం నాకోసం వాసన చూస్తావా?
486
00:30:14,240 --> 00:30:15,760
వాసన చూడు చాలు.
487
00:30:16,400 --> 00:30:18,040
మన్నించు, అది వింతగా ఉంది.
488
00:30:18,040 --> 00:30:20,400
మన్నించు. అది వింతగా ఉంది.
489
00:30:28,960 --> 00:30:30,240
జోయి, ఆగు!
490
00:30:31,120 --> 00:30:32,480
పడవలోకి ఎక్కు!
491
00:30:32,480 --> 00:30:35,080
నేను లేకుండా వెనుకకు వెళితే
నిన్ను చంపేస్తారు.
492
00:30:35,520 --> 00:30:37,520
ఇది వేధించే సమయం.
493
00:30:37,520 --> 00:30:40,920
ఇక్కడ నిలబడి,
గాలిలో ఊరికే ఊగుతున్నాను,
494
00:30:40,920 --> 00:30:43,240
నన్ను కాపాడతావా లేదా అని.
495
00:30:43,240 --> 00:30:46,760
సరే, న్యాయంగా అయితే,
ఈ పడవ ఇద్దరి కోసం చేసినది,
496
00:30:46,760 --> 00:30:49,160
నేను ఇక్కడే గుండ్రంగా తిరుగుతుంటాను.
497
00:30:50,080 --> 00:30:51,280
అది న్యాయమైన విషయం.
498
00:30:51,280 --> 00:30:52,680
త్వరగా, పిచ్చిదానా.
499
00:30:53,120 --> 00:30:54,040
మన్నించు.
500
00:30:58,800 --> 00:31:00,000
రా, సిస్టర్!
501
00:31:16,040 --> 00:31:18,320
బ్రెండోస్ బక్స్ పార్టీ
502
00:31:20,120 --> 00:31:21,600
బాగుంది, అమ్మాయిలు.
503
00:31:21,600 --> 00:31:24,560
ఇల్లు అనే చోటు కోసం
మేము వెతుకుతున్నాం.
504
00:31:26,200 --> 00:31:28,400
మాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే...
505
00:31:29,080 --> 00:31:31,040
పొయ్యి వెలిగించండి, మహిళలు.
506
00:31:43,080 --> 00:31:45,440
ఏంటి చూస్తున్నారు? మేము రావచ్చుగా?
507
00:31:48,680 --> 00:31:51,160
తీరానికి వస్తున్న
ఆరుగురు అందమైన కుర్రాళ్లు!
508
00:31:58,440 --> 00:32:02,120
-నీ ఫ్రింజ్ శైలి బానే ఉంటుంది.
-దాని గురించి మాట్లాడే అవసరం లేదు.
509
00:32:02,120 --> 00:32:03,520
ఏ సామెత ఉంది తెలుసుగా,
510
00:32:03,520 --> 00:32:06,720
మంచి క్షవరానికి, చెడ్డదానికి మధ్య
ఓ వారమే ఉంటుందట.
511
00:32:06,720 --> 00:32:09,840
ఇలా అయితే, ఎక్కడికీ చేరకుండానే
బంధీ యువరాణి అయిపోతాను.
512
00:32:09,840 --> 00:32:12,880
అయితే, సరే. నావి చిన్న కాళ్లు.
513
00:32:12,880 --> 00:32:15,200
తొక్కుతూ ఉండు, జో జో.
514
00:32:15,680 --> 00:32:16,800
తొక్కుతూ ఉండు.
515
00:33:37,280 --> 00:33:39,280
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల
516
00:33:39,280 --> 00:33:41,360
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల