1 00:00:09,720 --> 00:00:11,680 తవ్వుతూ ఉండండి, అమ్మాయిలు. 2 00:00:11,680 --> 00:00:14,320 మీ టైమ్ కాప్స్యూల్ అక్కడే ఎక్కడో ఉంటుంది. 3 00:00:14,320 --> 00:00:16,800 అలాగే, సిస్టర్ బార్బికా. 4 00:00:16,800 --> 00:00:19,640 నువ్వు ఆమెను ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే, 5 00:00:19,640 --> 00:00:21,560 పని పూర్తి చేసేదానివి. 6 00:00:22,440 --> 00:00:24,000 సిస్టర్, ఓ త్వరిత ప్రశ్న. 7 00:00:24,000 --> 00:00:26,920 బౌద్ధ భూతవైద్యానికి కేథలిక్ భూతాలు పలుకుతాయా? 8 00:00:27,480 --> 00:00:29,000 భవిష్యత్ అవసరం కోసం. 9 00:00:29,000 --> 00:00:31,880 ఇదెలా ఉంది, "ఎలా ఉన్నారు, సిస్టర్ బార్బికా?" 10 00:00:31,880 --> 00:00:34,200 మీరు మీ పిల్ల నాటకాలలో మునిగిపోయి 11 00:00:34,320 --> 00:00:38,400 ఇక్కడ మరో మనిషి బతుకుతోందనే విషయాన్నే గ్రహించలేదు. 12 00:00:38,400 --> 00:00:41,800 మర్యాదగా అడుగుతున్నాను, సిస్టర్ బీ... బార్బికా, 13 00:00:41,800 --> 00:00:44,840 మీ క్వార్టర్స్ సరిహద్దు బయట ఉన్నాయి, పాత అలవాట్లు పోవు. 14 00:00:44,840 --> 00:00:46,680 అవును, చాలా సౌకర్యమైన సమర్థన. 15 00:00:46,920 --> 00:00:49,560 ఇందుకే మిమ్మల్ని చాలా కాలంగా దూరంగా ఉంచుతున్నా. 16 00:00:49,560 --> 00:00:51,880 నీరు పెరిగితే ఏం ప్రార్థించానో తెలుసా? 17 00:00:51,880 --> 00:00:55,360 "ప్రియమైన ప్రభువా, ఎవరైనా పర్లేదు, ఈ చెత్త బృందం బతకకూడదు." 18 00:00:55,360 --> 00:00:58,680 2012లో సీతాకోకచిలుక హెయిర్‌క్లిప్‌ల తిరుగుబాటు చూశాను, 19 00:00:58,680 --> 00:01:01,680 లేదా 1996లో ముక్కుపుడకలతో ఆస్పత్రి పాలు కావడం చూశాను. 20 00:01:01,680 --> 00:01:03,160 ఛత్, 2016లో, ఆపకుండా... 21 00:01:03,160 --> 00:01:06,640 వినిపించిన ఆ బిల్లీ ఐలిష్ పరమ విచారపు సంగీతాన్ని తట్టుకున్నా. 22 00:01:06,640 --> 00:01:08,280 -కానీ మీరు... -మేమేంటి? 23 00:01:10,720 --> 00:01:15,280 నేను నేర్పిన వాళ్లలో అతి పెద్ద దొంగముండలు మీరు. 24 00:01:15,280 --> 00:01:18,040 -భాష. -మీరు నాకు పెట్టిన పేర్లు. 25 00:01:18,040 --> 00:01:20,280 -సిస్టర్ ముండమొహం? -మదర్ నాసిరకం? 26 00:01:20,400 --> 00:01:21,880 నిర్మలమైన రోగం? 27 00:01:21,880 --> 00:01:24,000 -చెత్త బ్రిక్కీ. -నక్కి నాకే బిక్కీ. 28 00:01:24,000 --> 00:01:26,040 సిస్టర్ బిక్కీ లేదు పురుషాంగం. 29 00:01:26,040 --> 00:01:27,960 చెత్త బిక్కీ, సాగే స్తనాలు. 30 00:01:27,960 --> 00:01:29,400 ఏమీ చేయలేని సన్యాసిని. 31 00:01:29,880 --> 00:01:30,960 ఆపండి! 32 00:01:31,440 --> 00:01:33,080 దయచేసి ఇక ఆపేయండి. 33 00:01:33,080 --> 00:01:34,440 అది చాలా ఎక్కువ. 34 00:01:37,400 --> 00:01:40,280 ఛత్. పాపం మనం టీచర్‌ను ఏడిపించాం. 35 00:01:41,640 --> 00:01:45,720 క్లాస్ ఆఫ్ '07 36 00:01:46,680 --> 00:01:49,440 {\an8}ఈ క్లాస్‌కు ఏమయింది? 37 00:01:50,560 --> 00:01:52,960 మీ పదిమంది ఎప్పుడూ సమస్యాత్మకమే, 38 00:01:53,520 --> 00:01:56,160 కానీ జనాల తలలు గొరిగించడం, బొటనవేళ్లు కోయడం, 39 00:01:56,160 --> 00:01:59,760 -టాయిలెట్లను ఇతరులు వాడకుండా ఆపడం? -అవును, జెనివీవ్. 40 00:01:59,760 --> 00:02:02,080 చెత్త విషయాలలో కనీసం అది ఆఖరుది. 41 00:02:02,080 --> 00:02:04,320 అయినా అది పెద్ద స్వార్ధమే. 42 00:02:04,920 --> 00:02:06,040 ఆపండి! 43 00:02:06,760 --> 00:02:07,800 మరో వారం 44 00:02:07,800 --> 00:02:11,920 నేను అడుగు పెట్టకపోయింటే ఎవరినైనా చచ్చిపోయేవారేమో. 45 00:02:12,040 --> 00:02:15,680 అంతరాయానికి క్షమించాలి, సిస్టర్, కానీ మాకు అందుకు ఒక రోజే పట్టింది. 46 00:02:15,680 --> 00:02:17,600 శాండీ చనిపోయి వారాలు గడిచాయి. 47 00:02:18,440 --> 00:02:19,440 ఏమిటి... 48 00:02:20,160 --> 00:02:22,880 శాండీ విపరీతంగా పితూరీలు చెబుతుందని తెలుసు, కానీ... 49 00:02:22,880 --> 00:02:25,440 ఇది తుచ్ఛమైన విషయం, అమ్మాయిలు, మీకైనా సరే. 50 00:02:26,120 --> 00:02:30,520 ఇప్పుడు, భవిష్యత్తులో మీ కోసం రాసుకున్న ఉత్తరాలను చూడండి. 51 00:02:30,520 --> 00:02:32,720 మీరు ఎలా మారిపోయారో చూసుకోండి. 52 00:02:38,720 --> 00:02:41,600 వాటిని గట్టిగా ఎవరు చదువుతారు? 53 00:02:44,680 --> 00:02:45,880 నేను చదువుతాను. 54 00:02:45,880 --> 00:02:46,880 సరే. 55 00:02:50,400 --> 00:02:53,960 "ప్రియమైన భావి ఫీబీ, అభినందనలు. 56 00:02:54,480 --> 00:02:57,560 "బహుశా నువ్వు రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంటావు." నిజం. 57 00:02:57,880 --> 00:02:59,920 "చదువు కోసం కాలేజీ వేడుక దాటవేశావు, 58 00:03:00,880 --> 00:03:04,680 "అదనపు ట్యూషన్ కోసం స్కూల్ క్యాంప్ హాజరు కాలేదు. 59 00:03:05,560 --> 00:03:09,320 "గ్రాడ్యుయేషన్ వేడుక రోజున, నీకు స్నేహితులు లేరు. 60 00:03:09,320 --> 00:03:10,960 "ఈ త్యాగాలు విలువైనని ఆశిస్తూ." 61 00:03:13,440 --> 00:03:17,680 సరే, అయితే గత కొన్ని నెలలు దారుణమని తెలుసు, నిజంగా చెడ్డాయి. 62 00:03:17,680 --> 00:03:20,840 కానీ నేను నిజానికి, వింతగా... 63 00:03:22,040 --> 00:03:25,280 మీ అందరినీ తెలుసుకోవడాన్ని ఆనందించాను, అందుకే... 64 00:03:26,000 --> 00:03:26,840 అవును. 65 00:03:31,640 --> 00:03:35,360 "ప్రియమైన అమీలియా." నేను ఎప్పుడూ పని మీద ధ్యాస పెట్టను, కదా, సిస్టర్? 66 00:03:35,360 --> 00:03:40,040 "నాకు నీ దిక్కుమాలిన సమస్య ఏంటో తెలియదు, లేదా ఎందుకు నా ఫోన్‌లు తీయవో తెలియదు, 67 00:03:40,040 --> 00:03:42,400 "కానీ నా బిల్లబాంగ్ లంగా తిరిగి కావాలి." 68 00:03:42,840 --> 00:03:44,640 నేనింకా వేచి ఉన్నా, దొంగమొహమా. 69 00:03:45,000 --> 00:03:46,520 "ప్రియమైన భావి జెనివీవ్, 70 00:03:46,520 --> 00:03:50,000 "లేదా నేనిలా చెప్పాలా, మూడవ మహిళ ప్రధానమంత్రి?" 71 00:03:50,000 --> 00:03:52,840 ఏమిటీ గోల? నాకు నేను ఓ క్షణం కూడా మద్దతు ఇవ్వలేను. 72 00:03:53,200 --> 00:03:56,480 "ఈ సమయానికి, నీకు బ్యూటీ థెరపీలో సెర్ట్ త్రీ ఉంటుంది, 73 00:03:56,480 --> 00:03:59,280 "ఇంకా నెయిల్ టెక్నీషియన్‌గా పని చేస్తుంటావు." 74 00:04:01,080 --> 00:04:02,160 జీవితం ఇదే. 75 00:04:02,160 --> 00:04:05,240 డాక్టర్ కావడానికి గోర్లసంరక్షణ వదిలేస్తానని ఎవరనుకుంటారు? 76 00:04:05,240 --> 00:04:06,440 నేనైతే అనుకోలేదు. 77 00:04:06,720 --> 00:04:09,000 ఇది మిచ్‌కు, అలాగే 78 00:04:09,000 --> 00:04:11,040 వందల స్టూసీ దుస్తులకు ప్రేమ లేఖ. 79 00:04:18,240 --> 00:04:22,520 ఈ వృషణాలే కాళ్ళు, తన చేతులతో పురుషాంగం వయొలిన్ వాయిస్తోంది. 80 00:04:22,520 --> 00:04:24,360 శరీర నిర్మాణ పరంగా సరి కాదు, 81 00:04:24,480 --> 00:04:28,160 ఏదేమైనా ఇది నా భవిష్యత్తు గురించి కచ్చితమైన చిత్రణ, ఇక... 82 00:04:28,800 --> 00:04:30,040 నువ్వేం రాశావు? 83 00:04:32,560 --> 00:04:36,160 నాది బీర్ తయారు చేసే యోని, అందుకే... 84 00:04:36,600 --> 00:04:39,160 కానీ బొమ్మ అంత బాగోలేదు. అవును. 85 00:04:40,320 --> 00:04:43,160 అయితే, ఇంకెవరు మిగిలారు? 86 00:04:43,160 --> 00:04:45,320 -అమీలియా. -లేదు, నాకు ఉత్తరం లేదు. 87 00:04:45,320 --> 00:04:46,800 ఆ సమయానికి వెళ్లిపోయా. 88 00:04:46,920 --> 00:04:50,360 మీ అమ్మ గురించి మరిచిపోయాను. నన్ను క్షమించు, పాపా. 89 00:04:50,360 --> 00:04:51,560 సరే, అమ్మాయిలూ, 90 00:04:52,160 --> 00:04:54,160 ఆత్మావలోకనం చేసుకునే సమయం... 91 00:04:54,160 --> 00:04:57,200 అమీలియా, ఆవిడ ఏం మాట్లాడుతోంది? 92 00:05:03,360 --> 00:05:04,360 అమీలియా? 93 00:05:09,920 --> 00:05:10,920 మా అమ్మ చనిపోయింది. 94 00:05:10,920 --> 00:05:14,040 అందుకే స్కూల్ నుంచి త్వరగా వెళ్లాల్సి వచ్చింది. 95 00:05:16,640 --> 00:05:17,720 ఏంటి? 96 00:05:17,720 --> 00:05:20,480 -టక్ షాప్, ఎవరైనా? -మీల్స్, వస్తావా? 97 00:05:20,480 --> 00:05:24,080 -ఏం అనుకోకపోతే ఒక క్షణం... -జో జో, రా, వెళదాం. 98 00:05:24,760 --> 00:05:26,240 అమీలియా, మాతో రా. 99 00:05:27,160 --> 00:05:29,040 -జోయి, నేను నిజంగా... -జో జో. 100 00:05:30,080 --> 00:05:32,960 ఆమె... ఆమె ఆత్మహత్య చేసుకుంది. 101 00:05:37,640 --> 00:05:40,720 అయ్యో, జోయి. ఏం... ఏం పర్వాలేదు. అది... 102 00:05:41,360 --> 00:05:42,720 రా, వెళదాం. 103 00:05:42,720 --> 00:05:43,640 జో జో. 104 00:05:44,400 --> 00:05:45,880 అమీలియా, మాతో రా. 105 00:05:46,720 --> 00:05:48,600 మనం బయట తిరిగి చాలా కాలమైంది. 106 00:05:49,640 --> 00:05:51,720 లేదు. నేను రాను, వెళ్లు. 107 00:05:51,720 --> 00:05:53,400 నేను డానీని కలవాలి. 108 00:05:57,120 --> 00:05:58,040 నన్ను క్షమించు. 109 00:05:58,560 --> 00:06:00,360 మా ధ్యాస నీవైపు తిప్పావు, జోయి. 110 00:06:00,680 --> 00:06:01,520 అది తన ధోరణికదా. 111 00:06:04,080 --> 00:06:06,280 నన్ను క్షమించు. వాళ్లకు తెలుసనుకున్నా. 112 00:06:06,280 --> 00:06:07,440 లేదు, అదేమీ... 113 00:06:08,040 --> 00:06:08,960 ఏం పర్వాలేదు. 114 00:06:19,480 --> 00:06:20,640 నాకు తెలియదు. 115 00:06:20,760 --> 00:06:23,480 -నాకు తెలిసుంటే... -అది జరిగి చాలా కాలమైంది. 116 00:06:24,440 --> 00:06:27,320 నేను ప్రతిదీ ఎందుకు విపరీతంగా చెడగొడతాను? 117 00:06:27,320 --> 00:06:30,920 ఒకవేళ నేను పునఃకలయికకు ఒత్తిడి చేయకపోతే, మీలో ఎవరూ ఇక్కడ ఇరుక్కోరు, 118 00:06:30,920 --> 00:06:33,040 శాస్కియా అంత బాధగా ఉండేది కాదు. 119 00:06:33,040 --> 00:06:36,280 జెనివీవ్‌కు మలబద్ధకం వచ్చుండేది కాదు. మీ అమ్మ చనిపోయిందని 120 00:06:36,280 --> 00:06:38,240 మాకు చెప్పి ఉండవు, ఇంకా నేను... 121 00:06:38,880 --> 00:06:42,080 అక్కడ బిల్లబాంగ్ లంగాలపై నవ్వుతున్నా, తెలుసుగా? 122 00:06:42,560 --> 00:06:44,000 ఇంత కాలం... 123 00:06:44,000 --> 00:06:48,800 ఇంత కాలం పాటు నువ్వే నన్ను వదిలేశావని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. 124 00:06:55,000 --> 00:06:57,000 ఏమిటది? చెప్పు. నాకు తగినదే. 125 00:06:58,040 --> 00:07:02,560 నాకు జరిగిన దాని గురించి నిన్ను ఓదార్చడానికి నేను నీ వెంటపడ్డాను, 126 00:07:02,560 --> 00:07:04,720 హఠాత్తుగా నిన్ను స్పష్టంగా చూశాను, 127 00:07:04,720 --> 00:07:07,360 నీ గురించి నాకు తెలియని విధానంలో, ఇంకా... 128 00:07:08,480 --> 00:07:10,320 జో, మనం ఇలా చేయనక్కర లేదు. 129 00:07:10,320 --> 00:07:13,840 మనమేమీ... మనమేమీ స్నేహితులం కాము. 130 00:07:15,080 --> 00:07:16,560 కచ్చితంగా, మనం స్నేహితులమే. 131 00:07:16,560 --> 00:07:19,840 -అంత హాయిగా లేదని తెలుసు. -తరచూ మాట్లాడుకునేవారిమని అనుకుందాం. 132 00:07:19,840 --> 00:07:24,040 కొన్ని నెలలకోసారి కలిసి భోజనం చేశామని అనుకుందాం. ఏం మాట్లాడుకునే వాళ్ళం? 133 00:07:25,200 --> 00:07:26,400 మన జీవితాలు. 134 00:07:26,400 --> 00:07:28,320 కానీ మన జీవితాలు విభిన్నమైనవి. 135 00:07:29,440 --> 00:07:31,720 మనం చాలా విభిన్నం, జోయి. 136 00:07:32,840 --> 00:07:35,360 స్కూల్ తరువాత మన బంధం నిలబడేది కాదు, 137 00:07:35,360 --> 00:07:38,120 -నేను వదిలి వెళ్లినా, లేకున్నా. -అమీలియా, 138 00:07:39,120 --> 00:07:41,960 నేను చెడగొట్టానని తెలుసు. నీకు ఫోన్ చేస్తూ ఉండాల్సింది, 139 00:07:41,960 --> 00:07:46,240 కానీ నాకు ఆ విషయం తెలిసుంటే, ఇలా జరిగేది కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. 140 00:07:46,240 --> 00:07:47,720 అవును, ఇలాగే జరిగేది. 141 00:07:48,880 --> 00:07:51,840 బహుశా వెంటనే కాకపోయినా, ఇదే జరిగేది. 142 00:08:01,160 --> 00:08:04,520 నాకు రహస్య టాయిలెట్ ఉండడంపై నన్ను క్షమించండి. 143 00:08:04,520 --> 00:08:07,400 లేదు, మీ అందరినీ దోచుకున్నందుకు క్షమించండి. 144 00:08:07,400 --> 00:08:10,960 చాక్‌పీస్, నీళ్లు కలిపి, అది మీసో సూప్ అన్నందుకు క్షమించండి. 145 00:08:10,960 --> 00:08:12,720 మీ అందరికీ నచ్చినట్లుగా... 146 00:08:12,720 --> 00:08:16,920 నిజంగా నెయిల్ టెక్నీషియన్ అయ్యిండి, డాక్టర్‌నని చెప్పినందుకు క్షమించండి. 147 00:08:16,920 --> 00:08:18,120 ఏంటి? 148 00:08:18,640 --> 00:08:20,400 నువ్వు డాక్టర్‌వి కావా? 149 00:08:20,400 --> 00:08:21,920 నిజంగా పిచ్చిదాన్ని చేశావు. 150 00:08:21,920 --> 00:08:23,080 కదా, అమ్మాయిలు? 151 00:08:26,400 --> 00:08:28,480 పర్వాలేదు, రెనే. మాకు ఓ రకంగా తెలుసు. 152 00:08:29,160 --> 00:08:30,320 ఏంటి? 153 00:08:30,440 --> 00:08:33,480 ఫార్మాల్డీహైడ్‌ను పచ్చడి ఊట అని నువ్వు చెప్పినప్పుడు, 154 00:08:33,480 --> 00:08:35,040 అక్కడే బాగా దొరికిపోయావు. 155 00:08:35,160 --> 00:08:37,760 నువ్వు మాకు "క్రమం తప్పని" యోని పరీక్షలు చేసి, 156 00:08:37,760 --> 00:08:40,000 వైద్యపరికరాన్ని "గరిటె" అన్నప్పుడు? 157 00:08:40,000 --> 00:08:42,520 ఏ ల్యాబ్‌కి స్వాబ్‌లను పంపగలవు? 158 00:08:42,520 --> 00:08:45,200 ఎందుకంటే మా స్వాబ్‌లన్నీ ఓ కట్టగా పోగేశావు. 159 00:08:45,200 --> 00:08:46,520 దానికి అర్థమే లేదు. 160 00:08:46,640 --> 00:08:49,360 నాకు ఎప్పుడు అనుమానం వచ్చిందంటే... 161 00:08:50,760 --> 00:08:53,520 నా బొటనవేలు మొత్తం తీసేసినప్పుడు. 162 00:08:53,640 --> 00:08:55,440 అవును, నన్ను క్షమించు. 163 00:08:55,440 --> 00:08:56,880 అబద్ధానికి క్షమించండి. 164 00:08:57,000 --> 00:08:59,480 ఇక, టెరీసా, తగినంతగా క్షమాపణ చెప్పలేను. 165 00:08:59,480 --> 00:09:00,640 నేనూ క్షమాపణ చెబుతాను. 166 00:09:02,880 --> 00:09:03,880 మీ అందరికీ. 167 00:09:04,360 --> 00:09:05,840 మన్నించాలి, మనం ఇప్పుడు... 168 00:09:05,840 --> 00:09:07,080 పెప్... జెనివీవ్. 169 00:09:07,080 --> 00:09:08,880 ...దీనిపై మాట దాటేస్తున్నామా? 170 00:09:09,000 --> 00:09:12,120 నీ జీవితం నరకం చేశానని, దానితో ఆస్వాదించానని తెలుసు. 171 00:09:14,280 --> 00:09:16,280 నీలోని ఆ పట్టుదలను, 172 00:09:16,280 --> 00:09:18,840 నీలోని అమాయకత్వాన్ని, ఎంతో ద్వేషించాను. 173 00:09:18,840 --> 00:09:20,760 సరే, ఇది క్షమాపణా, లేదా... 174 00:09:20,880 --> 00:09:24,720 కానీ, నిజంగా, నాకు అసూయ అంతే. 175 00:09:25,640 --> 00:09:29,120 ఎందుకంటే నీకు అద్భుతమైన బలమైన వ్యక్తిత్వం ఉంది. 176 00:09:29,760 --> 00:09:31,640 నువ్వేంటో నీకు బాగా తెలుసు. 177 00:09:31,640 --> 00:09:34,440 అది మార్చాలని నేను ప్రయత్నించి ఉంటే క్షమించు. 178 00:09:49,160 --> 00:09:50,240 క్షమాపణ అంగీకరించా. 179 00:09:56,080 --> 00:09:58,160 ఇక్కడ ఈస్ట్రోజిన్ మరీ ఎక్కువైపోయింది. 180 00:09:58,160 --> 00:10:00,760 మనం ఈ గదికి గాలి ఆడనచ్చి, తినడానికి వెళ్లాలి. 181 00:10:02,480 --> 00:10:03,880 రండి. 182 00:10:14,240 --> 00:10:16,960 నువ్వు దేని గురించైనా క్షమాపణ చెప్పాలా, బెక్కీ? 183 00:10:16,960 --> 00:10:18,480 అబ్బా, ఊరుకో. 184 00:10:19,320 --> 00:10:23,120 కొందరిని నిర్బంధిస్తే చాలు, మీ మిలీనియల్స్ సమూహ దావాలు వేస్తున్నారు. 185 00:10:23,120 --> 00:10:25,760 యూనిఫాం ఉల్లంఘనలు, హాల్ వెనుక ధూమపానం, 186 00:10:25,760 --> 00:10:27,520 ఆలస్యమైన అసైన్‌మెంట్‌లపై, 187 00:10:27,520 --> 00:10:31,480 క్రమశిక్షణ చర్యలు పొందావు, ఇక నీ బెదిరింపుల పరంపర చెప్పనక్కర్లేదు. 188 00:10:31,480 --> 00:10:32,520 ఏమన్నావు? 189 00:10:32,640 --> 00:10:35,120 వేధించేదానివి. నేను చూసినవారిలో అధిక వేధింపులు. 190 00:10:35,120 --> 00:10:38,160 లేదు, లేదు, అసెంబ్లీ హాల్ వెనుక ధూమపానం అన్నావు. 191 00:10:40,640 --> 00:10:41,880 కొన్నిసార్లు, 192 00:10:42,720 --> 00:10:44,600 నీలాంటి అమ్మాయిలు, శాస్కియా, 193 00:10:45,080 --> 00:10:48,400 నిర్భంధం మీ మంచి కోసమే. నాకెప్పుడూ కారణాలు ఉండేవి. 194 00:11:00,960 --> 00:11:01,960 అది అయిపోయిందా? 195 00:11:03,240 --> 00:11:04,640 ఏం చేస్తున్నావు? 196 00:11:04,640 --> 00:11:06,800 గొప్ప మర్యాద చేయబోతున్నాను. 197 00:11:07,600 --> 00:11:12,520 జో, కఠినంగా ఉండాలని కాదు, కానీ అమీలియాకు క్షమాపణ చెప్పడంపై ఆలోచించావా? 198 00:11:12,520 --> 00:11:15,440 స్నేహితులే లేని అమ్మాయి నుంచి స్నేహంపై సలహా తీసుకుంటా. 199 00:11:15,440 --> 00:11:18,880 జోయి, అలా చెప్పడం సరికాదు. మనం ఇప్పుడు పరస్పరం మంచిగా ఉన్నాం. 200 00:11:19,680 --> 00:11:21,200 సరే అయితే. మన్నించు, నేస్తం. 201 00:11:23,440 --> 00:11:26,200 టెరీసా, ఈ చేప... చాలా రుచిగా ఉంది. 202 00:11:26,720 --> 00:11:29,720 మసాలా... ఘాటుగా ఉంది. 203 00:11:31,000 --> 00:11:32,960 ఇవాళ మసాలా వేయలేదు. 204 00:11:33,680 --> 00:11:35,600 కానీ, ధన్యవాదాలు, శాస్. 205 00:11:35,600 --> 00:11:39,880 మన్నించు, మనం ఇలా ఉన్నాం, ఎలాగంటే, సానుకూలంగా ఉన్నాం, 206 00:11:39,880 --> 00:11:43,280 కానీ నిజానికి ఏదో తేడాగా అనిపిస్తోంది. 207 00:11:48,000 --> 00:11:49,080 పర్వాలేదు. 208 00:11:53,280 --> 00:11:54,480 ఓరి దేవుడా. 209 00:11:55,120 --> 00:11:56,800 అయ్యో, వద్దు, వద్దు, వద్దు. 210 00:11:56,800 --> 00:11:59,360 నాకూ వాంతులు వచ్చేలా ఉన్నాయి. 211 00:12:00,720 --> 00:12:01,880 నేనలా చేయను... 212 00:12:02,880 --> 00:12:04,800 అమ్మాయిలు, ఒకరినొకరు చూసుకోకండి. 213 00:12:08,000 --> 00:12:09,480 నియంత్రించండి... 214 00:12:10,960 --> 00:12:12,400 వాంతుల పరంపర నియంత్రించండి. 215 00:12:12,400 --> 00:12:15,280 అమ్మాయిలు, ఇది చేప కారణంగానే కావచ్చేమో. 216 00:12:15,880 --> 00:12:18,400 చేప అని అనకు. 217 00:12:36,640 --> 00:12:37,800 సరే. 218 00:12:38,360 --> 00:12:39,720 ఇది ప్రయత్నిద్దాం. 219 00:12:40,320 --> 00:12:41,440 కలిసి భోజనం చేసి, 220 00:12:42,000 --> 00:12:43,360 బంధం నిలబడుతుందేమో చూద్దాం. 221 00:12:44,640 --> 00:12:46,800 జోయి, దయచేసి ఆపెయ్. 222 00:12:46,800 --> 00:12:48,920 సరే, నువ్వు ఎలాగూ తినాలిగా? 223 00:12:48,920 --> 00:12:51,200 అందుకే ఆ పని నాతో చెయ్. 224 00:12:51,680 --> 00:12:53,840 ఇప్పుడు ఎరుపా లేదా తెలుపా? 225 00:12:54,920 --> 00:12:57,080 నాప్కిన్‌లు, వైన్ కాదు. వైన్ లేదు. 226 00:12:58,440 --> 00:13:00,280 ఈ బంధానికి ఎందుకు వేలాడుతున్నావంటే 227 00:13:00,280 --> 00:13:04,160 మనం కలిసి ఇరుక్కుపోవడంతో, అది పెద్ద విషయంలా అనిపించడం వల్ల. 228 00:13:04,640 --> 00:13:05,960 సరే, అయితే, 229 00:13:05,960 --> 00:13:10,440 నాకు చెబుతావా, మన స్నేహం నీకు అంత అర్థరహితం అయితే, 230 00:13:10,440 --> 00:13:12,600 పునఃకలయికకు ఎందుకు వచ్చావు? 231 00:13:13,200 --> 00:13:14,800 మంచి వంటకాల విందు కోసం. 232 00:13:16,560 --> 00:13:19,360 చూడు, ఇద్దరు వ్యక్తులు ఏదైనా పంచుకున్నంత మాత్రాన 233 00:13:19,360 --> 00:13:22,760 అది ఎల్లకాలం కొనసాగే అవసరం లేదని నీకు అంతగా తెలియదా? 234 00:13:27,440 --> 00:13:30,440 సరే, అయితే, సందేశం అందింది. 235 00:13:31,920 --> 00:13:33,040 ఓరి దేవుడో! 236 00:13:33,040 --> 00:13:36,520 ఈ పిడుగులగదిలో ఉండిపోతే నా పని అయిపోయినట్లే. 237 00:13:36,520 --> 00:13:37,440 వద్దు, జోయి... 238 00:13:37,440 --> 00:13:39,840 నీకు స్నేహితులుగా ఉండాలని లేదు, ఏదో ఒకటి. 239 00:13:39,840 --> 00:13:42,920 నా తల్లిదండ్రులను ఇందులోకి ఎందుకు తెస్తావో తెలియడం లేదు. 240 00:13:42,920 --> 00:13:45,640 మంచిది. ఆ లోహాన్ని ముట్టుకోకు. 241 00:13:45,640 --> 00:13:47,800 మొత్తమంతా కరెంట్ ఉంటుంది, మొద్దు! 242 00:13:52,480 --> 00:13:53,720 సరే. 243 00:13:56,200 --> 00:13:57,280 ఎరుపా లేదా తెలుపా? 244 00:13:59,440 --> 00:14:01,960 సముద్రమంతా చావులు, రోగాలతో నిండిపోయింది. 245 00:14:01,960 --> 00:14:04,240 ఎలాంటి సన్నాసులు చేపలను తింటారు? 246 00:14:04,960 --> 00:14:08,960 ఇదే ముగింపా, సిస్టర్? ఎట్టకేలకు యుగాంతం వచ్చేసిందా? 247 00:14:08,960 --> 00:14:12,760 లేదు, పిచ్చి పిల్లా, ఇది కేవలం వాతావరణ మార్పు, విషాహారం తినడమే. 248 00:14:13,480 --> 00:14:14,720 రెనే, బుజ్జీ. 249 00:14:16,280 --> 00:14:18,760 అమ్మాయిలకు 102 జ్వరం ఉంది. నేను ఏం చేయాలి? 250 00:14:18,760 --> 00:14:20,360 నేను డాక్టర్ కాను, సిస్టర్. 251 00:14:20,360 --> 00:14:22,640 అవును, మన్నించు. ఇవాళ చెడ్డగా ఉంది. 252 00:14:22,640 --> 00:14:26,520 అమ్మాయిలలో ఎవరు డాక్టర్, ఎవరు హత్యకు గురయ్యారో నేను ఆరా మరిచిపోయాను... 253 00:14:30,960 --> 00:14:34,080 ఏదేమైనా, నేను డాక్టర్‌నని ఎవరూ నమ్మలేను, ఫీబీ. 254 00:14:34,080 --> 00:14:39,000 ఎలాగంటే, నా నుంచి పెద్ద విషయాలను ఎవరూ ఆశించరు. 255 00:14:46,720 --> 00:14:48,840 మంచితనమే మంచి ఔషధం. 256 00:14:51,480 --> 00:14:54,320 అవును, నీ దగ్గర ఆ డాక్టర్ డిగ్రీ లేదు, 257 00:14:54,320 --> 00:14:55,680 కానీ ఒకటి తెలుసా? 258 00:14:55,680 --> 00:14:56,760 ఏంటి? 259 00:14:57,120 --> 00:14:59,480 జనాలకు మెరుగైన భావన కలిగించగలవు. 260 00:15:01,320 --> 00:15:03,040 నువ్వు మంచి నేస్తానివి, ఫీబీ. 261 00:15:06,240 --> 00:15:07,680 ఇంకా ఎలా వస్తున్నాయి? 262 00:15:20,320 --> 00:15:25,120 10 ఏళ్లలో మీగన్ మాత్రమే నా స్నేహితురాలు కాకుండా ఉండాలని ఆశ 263 00:15:32,240 --> 00:15:35,840 అయితే, యూట్ రబ్బరు టైర్లు విద్యుత్ ప్రసరణ నుంచి 264 00:15:35,840 --> 00:15:38,400 మనను రక్షిస్తాయనే నమ్మకం ఎంతవరకు ఉంది? 265 00:15:38,400 --> 00:15:40,640 అంటే, ఇప్పటికి 20 నిమిషాలు గడిచాయి, అంటే 266 00:15:40,640 --> 00:15:43,800 కావాలంటే ఏ లోహాన్ని అయినా తాకవచ్చు. 267 00:15:43,800 --> 00:15:46,240 నిజానికి, నువ్వు వెళ్లిపోవచ్చు కూడా. 268 00:15:47,480 --> 00:15:49,360 లేదు, నేను జాగ్రత్తగా ఉండడం మంచిది. 269 00:15:49,360 --> 00:15:51,000 నువ్వు కనీసం గమ్‌బూట్, 270 00:15:51,000 --> 00:15:53,920 గ్లోవ్ తీసుకుంటే నేను మరింత సౌకర్యంగా ఉంటాను. 271 00:15:54,360 --> 00:15:55,360 వద్దా? 272 00:15:56,440 --> 00:15:57,520 అలాగే కానివ్వు. 273 00:15:58,320 --> 00:15:59,520 అయితే... 274 00:16:01,000 --> 00:16:02,200 పొలం ఎలా ఉంది? 275 00:16:03,320 --> 00:16:05,760 ఈ ఏడాది పంట బాగా పండిందా? 276 00:16:06,840 --> 00:16:08,600 వేరుశనగ ఎవరికి సరఫరా చేస్తావు? 277 00:16:09,080 --> 00:16:12,400 సూపర్‌మార్కెట్లకా లేక విమానాలలో అమ్మే చిన్న ప్యాకెట్లకా, ఏంటి? 278 00:16:13,240 --> 00:16:14,680 వేరుశనగ వెన్న కర్మాగారాలకు. 279 00:16:17,360 --> 00:16:19,440 వేరుశనగ వెన్నను వేరుశనగతో చేస్తారు. 280 00:16:20,680 --> 00:16:24,520 ఒట్టేసి చెబుతున్నా, నేను అలాంటి విషయం ఏనాడూ ఆలోచించలేదు. 281 00:16:24,520 --> 00:16:25,520 అది పిచ్చితనం. 282 00:16:25,520 --> 00:16:27,760 మనం కలుస్తూ ఉండుంటే, నాకు ఆ విషయం తెలిసేది. 283 00:16:27,760 --> 00:16:30,160 జోయి, ఇది ఆసక్తిగా ఉందనేలా నటించకు. 284 00:16:34,800 --> 00:16:38,160 నువ్వు ఎదుర్కున్నవాటిని నేను ఊహించలేను. కానీ... 285 00:16:39,000 --> 00:16:42,360 నాకు ఎందుకు చెప్పలేదో నిజానికి నాకర్థం కాలేదు, అమీలియా. 286 00:16:42,360 --> 00:16:45,840 వేరుశనగ వెన్నను వేరుశనగతో చేస్తారనా? తప్పు నాదే. 287 00:16:49,720 --> 00:16:51,520 మేము నిజానికి ఎవరికీ చెప్పలేదు. 288 00:16:53,360 --> 00:16:56,360 ఆమె గుండెపోటు చనిపోయిందనే డానీ ఇంకా అనుకుంటున్నాడు. 289 00:17:02,080 --> 00:17:05,080 అయితే, ఏం తప్పు జరిగిందో నీకు తెలుసా? ఎలాగ... 290 00:17:06,840 --> 00:17:08,800 ఆమెకు వ్యాధి ఏమైనా ఉందా? 291 00:17:10,080 --> 00:17:11,160 మన్నించు. 292 00:17:13,200 --> 00:17:15,320 నాకు జవాబు తెలుసుకోవాలని ఉంది. నేనేదో... 293 00:17:20,560 --> 00:17:23,520 -ఇది చేప వల్ల కావచ్చనుకుంటా. -చేప అనకు. 294 00:17:24,040 --> 00:17:26,440 మరి, నేనేంటి? ప్రస్తుతానికే ప్రాణనేస్తాన్నా? 295 00:17:26,440 --> 00:17:28,400 మరింతమంది స్నేహితులను కోరుకున్నానంతే. 296 00:17:29,960 --> 00:17:31,880 మీ దగ్గర అదనపు బకెట్ ఉందా? 297 00:17:31,880 --> 00:17:34,560 మా మధ్యే పంచుకోలేకపోతున్నాం, ఇక నీకు కూడానా. 298 00:17:34,680 --> 00:17:37,440 మాలో కొందరు ఒకే బకెట్ మహిళలు, సరేనా? 299 00:17:37,440 --> 00:17:38,720 మొదలుపెట్టకు. 300 00:17:38,720 --> 00:17:41,880 నీ దగ్గర ఒకటే బకెట్ ఉందంటే, దాన్ని అభినందిస్తున్నావని. 301 00:17:41,880 --> 00:17:42,880 ఏం జరుగుతోంది? 302 00:17:42,880 --> 00:17:45,920 బహుశా ఒక బకెట్ మరొకదానిపై తాగేందుకు ఆధారపడుతుందేమో. 303 00:17:45,920 --> 00:17:50,240 నేను రూపకం మరిచిపోయాను. మనం బకెట్లమా, లేదా మన స్నేహం బకెటా? 304 00:17:50,240 --> 00:17:51,280 మీగన్... 305 00:17:52,960 --> 00:17:54,240 నువ్వు తాగుబోతువి. 306 00:17:56,240 --> 00:17:58,240 అసలు అదెక్కడి నుంచి వచ్చింది? 307 00:17:58,800 --> 00:18:01,560 నిన్న చర్చిలో నేల మీద వైన్ నాకడం చూశాను. 308 00:18:02,280 --> 00:18:05,400 మనం వారాల పాటు చేసినదల్లా మనల్ని చెడగొట్టుకోవడమే, నేను... 309 00:18:06,440 --> 00:18:08,320 నేను ఇకపై చేయాలని అనుకోను. 310 00:18:14,400 --> 00:18:18,320 మరచిపోదగ్గ లారా, నీకు కొత్త బకెట్ నేస్తం దొరికినట్లుంది. 311 00:18:23,240 --> 00:18:24,880 జాగ్రత్త. కారుతుంది. 312 00:18:27,640 --> 00:18:28,880 జోయి, నువ్వు వెళ్లాలి. 313 00:18:28,880 --> 00:18:30,880 నువ్విక్కడ ఉంటే నేనిది చేయలేను. 314 00:18:30,880 --> 00:18:34,080 ఏంటి? ప్రభువు మూడవ రాకలోకి నన్ను వెళ్లమంటావా? 315 00:18:34,200 --> 00:18:35,040 ఏంటి? 316 00:18:35,040 --> 00:18:38,880 ప్రపంచాంతం వచ్చిన రాత్రి రెండవది, అంటే ఇది మూడవదే. 317 00:18:38,880 --> 00:18:41,320 -అవి మామూలు లెక్కలు. -ఏదో ఒకటి. నేను వెళతాను. 318 00:18:41,320 --> 00:18:43,400 -ఏంటి? నిజంగానేనా? -అవును, సరేనా? 319 00:18:43,400 --> 00:18:47,160 నేను అడవులలోకి వెళ్లి చనిపోయే జంతువు లాంటిదాన్ని. నన్ను వెళ్లనీ. 320 00:18:47,160 --> 00:18:49,800 వద్దు, అది ప్రమాదకరం. నీకు షాక్ కొట్టవచ్చు. 321 00:18:49,920 --> 00:18:51,680 ఓరి దేవుడా, నాటకీయంగా ఉండకు. 322 00:18:53,800 --> 00:18:55,080 ఓరి దేవుడా. 323 00:18:55,480 --> 00:18:57,080 అయ్యో, బాగానే ఉన్నావా? 324 00:18:57,400 --> 00:18:58,880 బాగున్నావా? 325 00:19:00,720 --> 00:19:03,200 "నీకు చెప్పానుగా," అనేందుకు ఇది మంచి సమయం కాదా? 326 00:19:07,760 --> 00:19:09,880 నువ్వు మల విసర్జన చేశావు, కాదా? 327 00:19:13,160 --> 00:19:14,000 నేస్తం... 328 00:19:15,280 --> 00:19:17,880 నేనూ చేసుకున్నా, 20 సెకన్ల క్రితం. 329 00:19:18,560 --> 00:19:19,920 పైకి లే. 330 00:19:19,920 --> 00:19:22,160 -ఇది సరదా కాదు. -ఇది సరదానే. 331 00:19:24,080 --> 00:19:26,640 ఈ పని అపరిచితులతో చేయలేము, నువ్వు చేస్తావా? 332 00:19:32,200 --> 00:19:34,720 శాస్కియా, పాపా, డార్మిటరీలోకి రా. 333 00:19:34,720 --> 00:19:36,280 -నీకు తెలుసు. -నీకు మతిమరపు. 334 00:19:36,280 --> 00:19:38,320 తిరిగి రా. నీకు నిద్రపడుతుంది. 335 00:19:38,320 --> 00:19:40,000 అతను చేస్తున్నది నీకు తెలుసు. 336 00:19:40,000 --> 00:19:41,800 నాకేమీ తెలియదు. 337 00:19:41,800 --> 00:19:45,400 దయచేసి ఆపు. అతను నన్నేం చేసేవాడో నీకు తెలుసు. 338 00:19:46,040 --> 00:19:47,920 నీకు మిగతావాళ్ల గురించి తెలుసా? 339 00:19:50,280 --> 00:19:53,960 నిన్ను అతనికి దూరంగా ఉంచేందుకే నిర్భంధనలు చేశాను. 340 00:19:53,960 --> 00:19:58,920 అబ్బా, నీ చెత్త నిర్బంధనలు వదిలెయ్, ఎందుకంటే వాటితో ఒరిగిందేమీ లేదు, నువ్వు... 341 00:20:00,200 --> 00:20:01,920 శాస్కియా, శాస్కియా. 342 00:20:02,560 --> 00:20:03,560 శాస్కియా. 343 00:20:04,520 --> 00:20:06,280 భలే సున్నితత్వం. 344 00:20:06,800 --> 00:20:08,160 శాస్కియా. 345 00:20:21,000 --> 00:20:22,800 మా రిక్లైనర్‌కు... 346 00:20:24,400 --> 00:20:27,000 మా అమ్మ శాశ్వత ఛాయ ఉండేది. 347 00:20:29,000 --> 00:20:33,320 ఆమె నెలల తరబడి సోఫాలో కూర్చోవడంతో ఏర్పడిన 348 00:20:33,320 --> 00:20:36,080 నిజమైన ముద్ర వంటిది. 349 00:20:38,800 --> 00:20:40,800 అది అలా జరిగేది. 350 00:20:42,720 --> 00:20:45,440 ఆమె సోఫా మీద కూర్చునేది, పగలు, రాత్రి. 351 00:20:47,480 --> 00:20:52,040 ఇక ఉన్నట్టుండి ఒక ఉదయం, నిద్ర లేచేసరికి ఆమె అర్థరాత్రిలో 352 00:20:52,040 --> 00:20:54,640 విచిత్రంగా సగం వేరుశనగలను కోసేసేది... 353 00:20:55,080 --> 00:20:56,760 నువ్వు అలా పెరిగినప్పుడు, 354 00:20:56,760 --> 00:21:00,160 ఎదురు చూస్తావంతే. ఎదురుచూసి, ఆలోచిస్తావు... 355 00:21:01,640 --> 00:21:04,480 అది తప్పనిసరి విషయం, అది నాలో కూడా ఉంది, ఇంకా... 356 00:21:06,400 --> 00:21:09,520 ఆ తర్వాత, అది చివరకు జరిగినప్పుడు, అదెలాగంటే... 357 00:21:12,200 --> 00:21:14,080 అది బాధ కాదు. 358 00:21:14,200 --> 00:21:17,320 అది శూన్యం అంతే. 359 00:21:19,240 --> 00:21:23,200 యాంటిడిప్రెసెంట్స్ లేకుండా నేనేంటో ఇప్పుడు నాకు తెలియదు. 360 00:21:25,560 --> 00:21:26,880 కానీ ఆ ఆలోచనే... 361 00:21:28,240 --> 00:21:33,000 వాటిని ఆపాక తర్వాత ఏం ముంచుకువస్తుందన్ని ఆలోచనే? 362 00:21:33,960 --> 00:21:37,800 హేయ్, నువ్వు మీ అమ్మవు కావు, అమీలియా. 363 00:21:38,320 --> 00:21:39,800 లేదు, నేను ఆమెలానే. 364 00:21:42,520 --> 00:21:44,320 కానీ నేను ఆమెలా కాదు, అవునా? 365 00:21:46,200 --> 00:21:47,720 ఎందుకంటే ఇక్కడ ఉన్నానుగా. 366 00:21:50,560 --> 00:21:53,280 నీకు అదంతా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. 367 00:21:55,000 --> 00:21:59,160 నువ్వు ఒంటరిగా అదంతా ఎదుర్కోవడం నాకు అతిపెద్ద పశ్చాత్తాపం. 368 00:22:03,600 --> 00:22:04,600 ధన్యవాదాలు. 369 00:22:46,720 --> 00:22:47,960 నాకు మెరుగ్గా ఉంది. 370 00:22:49,640 --> 00:22:50,880 అవును, నాకు కూడా. 371 00:22:51,480 --> 00:22:52,440 తలతిరుగుడు పోయింది. 372 00:22:52,960 --> 00:22:56,000 నా ఉద్దేశం ఇప్పుడన్నీ బయటకు చెప్పడంతో, దానితో... 373 00:22:56,800 --> 00:22:58,240 నాకు మనశ్శాంతిగా ఉంది. 374 00:23:00,040 --> 00:23:00,960 అయిపోయింది. 375 00:23:01,680 --> 00:23:02,720 ఇక రహస్యాలు వద్దు. 376 00:23:05,720 --> 00:23:06,800 ఇక రహస్యాలు వద్దు. 377 00:23:19,160 --> 00:23:20,360 అబ్బా, ఛ. 378 00:23:22,240 --> 00:23:23,760 దయచేసి నన్ను వివరించనీ. 379 00:23:29,240 --> 00:23:32,640 అతను అమ్మాయిలకు సందేశాలు పంపుతూ, వేరే పేరుతో సేవ్ చేయమన్నాడని 380 00:23:32,640 --> 00:23:35,240 నాకు తెలుసు, అందుకే ఫోన్‌లను తీసేసుకున్నాను. 381 00:23:35,240 --> 00:23:38,360 అతను స్కూల్ అధికార పరిధికి బయట, క్యాంపస్ సరిహద్దులో 382 00:23:38,360 --> 00:23:40,360 అమ్మాయిలను కలవడం నాకు తెలుసు, 383 00:23:40,360 --> 00:23:43,040 అందుకే హద్దులు దాటినందుకు వాళ్లను శిక్షించాను. 384 00:23:43,040 --> 00:23:47,160 ఇదంతా చూశాను... అతనికి ఇష్టమైన వారిని బాగా సన్నిహితంగా పరిశీలించాను. 385 00:23:48,040 --> 00:23:50,720 వాళ్లు అతనిని కలవకుండా నిరోధించడానికి 386 00:23:50,720 --> 00:23:52,760 నిర్బంధించడం కోసం సాకులు వెతికాను. 387 00:23:53,440 --> 00:23:57,400 అతను ఏర్పరచుకున్న బంధాన్ని నాకు చేతనైన విధంగా అడ్డుకోవడానికి. 388 00:23:59,520 --> 00:24:01,800 అవి అసంపూర్ణ పరిష్కారాలు, శాస్కియా. 389 00:24:01,800 --> 00:24:03,680 నన్ను క్షమించాలని ఆశించను. 390 00:24:04,160 --> 00:24:07,280 నేను మరింతగా చేసుండాలని నాకు తెలుసు. 391 00:24:19,120 --> 00:24:20,640 మీరంతా పెద్ద చెత్తమొహాలు. 392 00:24:24,240 --> 00:24:25,280 నీతో కలిపి. 393 00:24:28,640 --> 00:24:29,560 ఆమెన్. 394 00:24:31,840 --> 00:24:33,640 {\an8}రిడ్జ్ హైట్స్ క్యాథలిక్ మహిళల కళాశాల 395 00:24:39,160 --> 00:24:41,120 ప్రవేశానికి అనుమతి లేదు 396 00:24:41,120 --> 00:24:43,440 అద్భుతమైన ఇల్లు, సిస్టర్ బార్బికా. 397 00:24:43,440 --> 00:24:47,240 మేము ఇంత కాలం గిలకొట్టిన గుడ్లు, కొత్తిమీర తినుండేవాళ్లం. 398 00:24:47,240 --> 00:24:49,560 అవును, కమ్యూనియన్ వేఫర్స్ కూడా. 399 00:24:49,560 --> 00:24:52,680 నేను మీకు ఇదంతా చెప్పబోయాను, 400 00:24:52,680 --> 00:24:55,840 కానీ, న్యాయంగా అయితే, టక్ షాప్ మీ అదుపులో ఉంది. 401 00:24:56,400 --> 00:24:59,600 స్కూల్‌లో విసర్జనపై నా భయం పోగొట్టడానికి అదొక మార్గం. 402 00:25:03,440 --> 00:25:07,080 ఏయ్, అమ్మాయిలు, మీ చిన్నప్పటి మీకు 403 00:25:07,080 --> 00:25:10,280 ఓ ఉత్తరం రాస్తే, అందులో ఏముంటుంది? 404 00:25:10,280 --> 00:25:11,840 "చేపలను తినకు." 405 00:25:12,840 --> 00:25:17,280 లేదు, కానీ, నిజంగా, అంటే, ఏ పని ఎప్పటికీ చేయకుండా ఉంటారు? 406 00:25:18,200 --> 00:25:20,720 స్కూల్‌లో సన్నాసిలా ఉండడంపై చింతిస్తున్నా. 407 00:25:21,200 --> 00:25:22,920 నేనేనాడూ సిగరెట్ కూడా తాగలేదు. 408 00:25:23,760 --> 00:25:26,520 బహుశా దాన్ని పరిష్కరించగలం. ఇంకెవరు? 409 00:25:27,480 --> 00:25:30,720 ఇది అతిగా ఉంటుంది, కానీ సీమంతం చేసుకోనందుకు చింతిస్తున్నా. 410 00:25:30,720 --> 00:25:33,160 ఉచితంగా వచ్చే వస్తువుల కోసం ఎదురు చూశాను. 411 00:25:33,160 --> 00:25:36,320 సరే, టీకప్‌కు సీమంతం చేద్దాం. తర్వాత ఎవరు? 412 00:25:37,480 --> 00:25:40,520 అవకాశం వచ్చినా గెరర్టీని వదిలించుకోనందుకు చింతిస్తున్నా. 413 00:25:40,520 --> 00:25:45,120 అబ్బా, అవును, ఆ వెధవ నుంచి ఈ చోటును బాగా శుభ్రం చేద్దాం, సరేనా? 414 00:25:45,120 --> 00:25:46,080 ఇంకెవరు? 415 00:25:46,080 --> 00:25:48,920 నా బకెట్‌ను నిర్లక్ష్యం చేసినందుకు చింతిస్తున్నా. 416 00:25:48,920 --> 00:25:52,160 ఇప్పటి నుంచి నా బకెట్‌లో నీళ్లు తప్ప వేరే ఏదీ నింపను. 417 00:25:52,160 --> 00:25:55,600 దాని అనే అర్థమేంటో అర్థం కాలేదు, కానీ అది చేయవచ్చు. 418 00:25:55,600 --> 00:25:57,320 -రెనే? -నేను అనుకోను, నేను... 419 00:25:57,320 --> 00:25:59,320 నాకు ఏ చింతలు ఉన్నాయని అనుకోను. 420 00:25:59,320 --> 00:26:02,400 నా ఉత్తరం చదివాక, 421 00:26:02,400 --> 00:26:06,840 నేను కావాలని కోరుకున్నదే నెయిల్ టెక్నీషియన్, అదే చేస్తున్నాను. 422 00:26:08,600 --> 00:26:09,520 అమీలియా? 423 00:26:11,760 --> 00:26:13,200 నాకెందుకు చింతంటే... 424 00:26:14,080 --> 00:26:17,560 బేర్‌నేకెడ్ లేడీస్ రాసిన "వన్ వీక్‌" లోని అన్ని మాటలు నేర్చుకోలేదు. 425 00:26:17,560 --> 00:26:18,800 ఆగు, ఏంటి? 426 00:26:18,800 --> 00:26:21,280 "చికిటీ చైనా, ద చైనీస్ చికెన్," పాటా? 427 00:26:21,280 --> 00:26:22,760 అవును. అవును. 428 00:26:22,760 --> 00:26:25,000 అసలు ఆ పదాలు ఏమిటి? 429 00:26:53,880 --> 00:26:55,760 మనకు ఇంకేవైనా తెలుసా? 430 00:27:26,120 --> 00:27:27,280 నా చొక్కా "విప్ప"డం. 431 00:27:27,280 --> 00:27:29,680 -నా చొక్కా పోవడం. -అతను "పోవడం" అని పాడాడు. 432 00:27:29,680 --> 00:27:30,960 పోవడం... 433 00:27:31,480 --> 00:27:33,600 అబ్బా, పాట సంగతి వదిలేయండి! 434 00:28:04,520 --> 00:28:06,440 అది ముగిసినందుకు సంతోషం. 435 00:28:14,080 --> 00:28:15,240 బాగా చేశావు, మిత్రమా. 436 00:28:26,560 --> 00:28:27,720 ఇవాళ... 437 00:28:28,760 --> 00:28:30,240 నీచత్వంలో వర్ధిల్లిన, 438 00:28:31,280 --> 00:28:34,360 అస్పష్ట నియమాలతో విర్రవీగిన, సందేహం ప్రయోజనాన్ని వాడుకొన్న, 439 00:28:35,000 --> 00:28:37,320 ఇతరుల నిశ్శబ్దంపై ఆధారపడిన పురుషులకు 440 00:28:38,160 --> 00:28:41,920 మనం వీడ్కోలు పలుకుదాం. 441 00:28:45,360 --> 00:28:49,000 ఇవాళ, ఇలా అందాం ఈ మగాళ్లంతా... 442 00:28:52,400 --> 00:28:53,680 పోయి చావండి. 443 00:28:54,840 --> 00:28:57,320 పోయి చావండి! 444 00:29:12,840 --> 00:29:13,960 జోయి. 445 00:29:15,800 --> 00:29:17,760 నా యాంటిడిప్రెసెంట్‌లు అయిపోయాయి. 446 00:29:23,320 --> 00:29:24,600 బాగానే ఉంటావు, నేస్తం. 447 00:29:25,960 --> 00:29:27,040 నేనది చూసుకుంటాను. 448 00:29:32,640 --> 00:29:37,080 బాబూ, అందరి చింతలు పోవడం చాలా బాగా అనిపిస్తోంది. కదా? 449 00:29:37,360 --> 00:29:38,800 -అవును. -అలాగే ఉంది. 450 00:29:39,840 --> 00:29:42,480 అవును, అవును, లేదు, ఇది గొప్పగా ఉంది, కాదా? 451 00:29:43,480 --> 00:29:46,760 చాలా బాగుంది, అన్నీ పరిష్కారం కావడం నిజంగా చాలా బాగుంది. 452 00:29:49,160 --> 00:29:50,760 మీరు నిజంగా అంటున్నారా? 453 00:29:51,920 --> 00:29:53,120 మీరు నన్ను మరచిపోయారు. 454 00:29:53,760 --> 00:29:54,680 మళ్లీ. 455 00:29:54,680 --> 00:29:55,920 అయ్యో, అవును. 456 00:29:57,280 --> 00:29:59,720 నా నకిలీ అంత్యక్రియలకు మీరు రాలేదుగా, 457 00:29:59,720 --> 00:30:01,600 అందుకే నాకు నిజమైనది కావాలి. 458 00:30:01,600 --> 00:30:06,120 నేను ప్రశంసించబడాలని, నా గురించి ప్రేమగా మాట్లాడాలని, జ్ఞాపకం చేసుకోవాలని, 459 00:30:06,120 --> 00:30:09,760 నన్ను అసలు మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. 460 00:30:09,760 --> 00:30:11,440 దేవుడా, మీరంతా... 461 00:30:11,440 --> 00:30:14,080 రేపు అంత్యక్రియలు చేస్తే ఎలా ఉంటుంది? 462 00:30:14,080 --> 00:30:15,960 -అవును. అవును. -బాగుంటుంది. 463 00:30:16,480 --> 00:30:17,400 పరిష్కారం అయింది. 464 00:30:19,360 --> 00:30:21,280 నేను అందరి గోళ్లకు రంగు వేస్తాను. 465 00:30:23,960 --> 00:30:25,160 అంటే, బూడిద గోధుమ రంగు. 466 00:32:37,040 --> 00:32:39,040 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 467 00:32:39,040 --> 00:32:41,120 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల