1
00:00:11,480 --> 00:00:14,760
శుభోదయం, రిడ్జ్ హైట్స్ స్త్రీలకు,
2
00:00:14,760 --> 00:00:16,920
పోకో నుండి బయటపడిన ఆయిల్ రిగ్ పనివారు,
3
00:00:16,920 --> 00:00:20,880
పర్వత షెర్పాలు,
అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ వారెవరైనా.
4
00:00:20,880 --> 00:00:23,320
నీరు పైకి వచ్చి 44 రోజులైంది,
5
00:00:23,320 --> 00:00:25,560
గొప్పలు కాదు గానీ
మనం ఇరగదీస్తున్నాం.
6
00:00:25,560 --> 00:00:27,760
అంత ఆశ్చర్యమేం లేదు.
మీరెప్పుడైనా
7
00:00:27,760 --> 00:00:30,880
బీచ్ హౌసులో ఆడవారి పార్టీకెళ్ళి
ఉ. 10కి చెకౌట్ చేసుంటే,
8
00:00:30,880 --> 00:00:34,600
అప్పుడు ఆడవాళ్లు
అన్నీ చేయగలరని తెలుస్తుంది.
9
00:00:35,640 --> 00:00:37,200
సఫలవంతమైన ఆడవారి వారాంతానికి...
10
00:00:37,320 --> 00:00:40,000
కీలకం ఓ ప్రధాన చెలికత్తె ఉండటమే,
11
00:00:40,000 --> 00:00:43,640
ఇక శాస్కియా వేండర్‌బేక్
మాకు అలాంటిదే.
12
00:00:43,640 --> 00:00:46,120
ఏమంటారు? చావో రేవో!
13
00:00:46,120 --> 00:00:47,200
చావో రేవో!
14
00:00:47,200 --> 00:00:49,160
-చావో రేవో!
-చావో రేవో!
15
00:00:49,160 --> 00:00:50,920
చావో రేవో!
16
00:00:52,160 --> 00:00:54,280
ఆమె పెద్ద తలనొప్పా? అవును, ఆమె అంతే.
17
00:00:54,280 --> 00:00:56,880
కానీ అది ఆమె పనా? కానే కాదు.
18
00:01:05,560 --> 00:01:08,520
ఎందుకంటే ఆమె లేకపోతే,
మాకు వస్తువులు ఉండవు,
19
00:01:08,520 --> 00:01:10,200
లేదా ఆ కౌంటర్ ఉండదు,
20
00:01:10,200 --> 00:01:14,360
లేదా మీరు ఇంకెప్పుడూ వేసుకోని బట్టలు
ఉండవు, కానీ వాటికి మీరు చెల్లించాలి.
21
00:01:14,880 --> 00:01:16,560
రజస్వల కప్పులు అద్దెకు, పాపలు.
22
00:01:17,760 --> 00:01:19,720
కానీ ఆమె ఎక్కువ రోజులు స్రవిస్తుంది.
23
00:01:27,200 --> 00:01:31,880
విపరీతమైన వ్యాయామానికి,
మితమైన సామానుకు, మచ్చలేని సౌందర్య పోషణకు,
24
00:01:31,880 --> 00:01:35,920
ఆమె మంకుపట్టు పట్టడం వల్ల
మేము చాలా అందంగా ఉన్నాము.
25
00:01:38,720 --> 00:01:40,360
కానివ్వండి, వేగంగా. గట్టిగా!
26
00:01:40,800 --> 00:01:43,320
రేడియో కోసం తొక్కాలి. విశ్రాంతే లేదు. అరే!
27
00:01:43,320 --> 00:01:45,080
పద! పద!
28
00:01:45,080 --> 00:01:46,760
పద!
29
00:01:46,760 --> 00:01:49,800
తెలుసు, తెలుసు.
అంటే ఎవరికి పట్టిందట?
30
00:01:49,800 --> 00:01:51,400
చూసేవాళ్లు కూడా లేరు.
31
00:01:51,400 --> 00:01:55,440
కానీ, ఎందుకో గానీ, మా జుట్టు
మా సహజత్వానికి ఆఖరి అవశేషంగా మిగిలింది.
32
00:01:55,720 --> 00:01:59,040
మేము దానిని వదులుకోలేము.
33
00:01:59,600 --> 00:02:01,520
ఇక ఇదే మన ఈరోజు షో, పాపలు.
34
00:02:01,520 --> 00:02:05,720
అక్కడెవరన్నా వింటే కనుక,
దయచేసి మాకు ఒక పడవను పంపండి.
35
00:02:05,720 --> 00:02:11,440
మేము దక్షిణాన 34.4100 డిగ్రీలు
తూర్పుకి 150.3037 డిగ్రీలలో ఉన్నాము.
36
00:02:12,040 --> 00:02:13,240
సమాప్తం, బాబులు.
37
00:02:19,000 --> 00:02:22,280
{\an8}క్లాస్ ఆఫ్ '07
38
00:02:31,440 --> 00:02:32,560
ఆలస్యమైంది.
39
00:02:34,720 --> 00:02:36,160
ఇది పని చేస్తోంది.
40
00:02:36,160 --> 00:02:38,880
ప్లగ్ పెట్టి చూడవచ్చుగా
పని చేస్తుందో లేదో.
41
00:02:38,880 --> 00:02:41,840
అవును, చూడవచ్చు, కానీ ఇదే సరదా.
42
00:02:44,120 --> 00:02:45,040
తెలుసా...
43
00:02:45,960 --> 00:02:48,760
ఏ సోది ఇంగ్లీష్ టీచర్
లైబ్రరీ వాళ్లని ఒప్పించి
44
00:02:48,760 --> 00:02:52,440
ద వైర్‌ను కొనిపించిందో గానీ,
అమ్మాయిలకు విద్యావిషయక ఉపకరణంగా,
45
00:02:52,440 --> 00:02:56,240
వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి.
46
00:03:07,920 --> 00:03:09,400
అవెక్కడ దొరికాయి నీకు?
47
00:03:10,400 --> 00:03:11,880
గెరటీ అరలో.
48
00:03:13,360 --> 00:03:15,200
వాడి ఇష్టాలు చాలా ఉన్నాయి.
49
00:03:15,200 --> 00:03:18,360
ఫీబీ నీలోని ప్రతిభ
ఎవరికీ తెలియకపోవటం బాధాకరం,
50
00:03:18,360 --> 00:03:19,560
కానీ పనైందా?
51
00:03:19,560 --> 00:03:20,840
అది చూడాలి, శాస్.
52
00:03:22,320 --> 00:03:23,520
శాండీ చచ్చినట్టేనా?
53
00:03:24,280 --> 00:03:25,560
లేదనుకుంటాను.
54
00:03:27,200 --> 00:03:30,400
ఎందుకంటే 44 రోజులైంది
55
00:03:30,400 --> 00:03:32,400
తన కచ్చితంగా చనిపోయిందనే అంటాను.
56
00:03:32,880 --> 00:03:35,160
ఇంకెవరు కచ్చితంగా చనిపోయారో తెలుసా?
57
00:03:35,960 --> 00:03:38,640
స్ట్రింగర్ బెల్, మూడవ సీజన్.
బాగా చూడు.
58
00:03:38,640 --> 00:03:40,720
అబ్బా! వద్దు! నువ్వు...
59
00:03:41,720 --> 00:03:43,920
స్ట్రింగర్ బెల్ వద్దు. సోదిది.
60
00:04:04,600 --> 00:04:05,840
ఓహ్, తింగరది పడిపోయింది.
61
00:04:05,840 --> 00:04:07,720
దేవుడా. మనం దానిని చంపేసాము.
62
00:04:07,720 --> 00:04:08,880
బాగానే ఉన్నావా?
63
00:04:09,960 --> 00:04:11,800
వైద్యపు లెంపకాయ వేస్తున్నాను.
64
00:04:15,760 --> 00:04:17,000
ఇంకా బతికే ఉన్నాను.
65
00:04:17,480 --> 00:04:18,560
మోసపోయాను.
66
00:04:19,360 --> 00:04:20,360
బాబోయ్.
67
00:04:20,960 --> 00:04:24,200
సరే, గుర్తుండని లారెన్ బాగానే ఉంది.
68
00:04:24,200 --> 00:04:25,920
మీ సైకిళ్ళు ఎక్కండి.
69
00:04:25,920 --> 00:04:26,920
జోక్ చేస్తోందా?
70
00:04:27,520 --> 00:04:28,360
అరే.
71
00:04:28,360 --> 00:04:31,480
-సీరియస్‌గానా.
-ఇక్కడే ఇలానే ఉండిపోతారా శాశ్వతంగా?
72
00:04:31,480 --> 00:04:35,600
ప్రతిరోజూ రేడియో సంకేతం పంపకపోతే
అదే జరుగుతుంది.
73
00:04:35,600 --> 00:04:37,880
తొక్కకపోతే రేడియో లేదు, రక్షణ లేదు.
74
00:04:37,880 --> 00:04:39,760
-కానీ...
-సైకిళ్ళు ఎక్కండిక.
75
00:04:42,160 --> 00:04:44,480
సరే. ఇదిక ప్రమాదకరం, శాస్కియా.
76
00:04:45,240 --> 00:04:48,760
బ్యాటరీలను చార్జింగ్ చేయటానికి
చస్తున్నాం మనం, దేనికి?
77
00:04:48,760 --> 00:04:52,920
మనం అంతా గుంపుగా 7త్ హెవెన్
నాలుగో సీజన్ చూడటానికా?
78
00:04:54,520 --> 00:04:57,080
అందులోనే బంగారు రంగున్న సోదరుడు
అందగాడిగా మారేది.
79
00:04:57,080 --> 00:04:59,320
సరే, సరే. సైమన్స్ పేరెత్తను.
80
00:04:59,320 --> 00:05:02,880
కానీ, శాస్కియా, మనం మన అసలైన శక్తిని
81
00:05:02,880 --> 00:05:05,640
కర్లర్స్‌కు, స్ట్రైయిటనర్స్‌కు
వాడక్కరలేదుగా.
82
00:05:05,640 --> 00:05:10,240
రేడియో సంకేతం, ప్రోటీన్ ఇంకా
విశ్రాంతి కదా మన ప్రాధాన్యతలు.
83
00:05:11,240 --> 00:05:15,160
మంచిగా దువ్విన జుట్టు, ఇంటి నుండి
పనిచేస్తూ నీ పక్క సర్దటం లాంటిదే.
84
00:05:15,160 --> 00:05:16,520
అది ప్రామాణికం.
85
00:05:16,520 --> 00:05:18,240
ఈ ప్రామాణికం సంగతేంటి?
86
00:05:18,360 --> 00:05:19,920
ఊపిరాడుతోంది, కదా?
87
00:05:21,800 --> 00:05:25,680
మహిళల నెలసరి పరికరాల సమానత్వానికి
జీవితాన్ని ధారపోశానంటావు,
88
00:05:25,680 --> 00:05:28,120
కానీ నీలో స్త్రీలపై
ఆధిపత్యధోరణి కనిపిస్తోంది,
89
00:05:28,760 --> 00:05:29,680
స్త్రీ బాస్.
90
00:05:31,120 --> 00:05:32,080
సిగ్గు సిగ్గు.
91
00:05:35,280 --> 00:05:37,160
నాకు ఆడవాళ్లంటే ద్వేషం లేదు, పెపీ.
92
00:05:38,040 --> 00:05:39,200
నువ్వంటే ద్వేషం.
93
00:05:41,240 --> 00:05:42,920
ఇంకోసారి నువ్వు కనిపించేముందు,
94
00:05:42,920 --> 00:05:47,160
నీ జుట్టంతా చక్కగా సర్దుకొని రా.
95
00:05:47,440 --> 00:05:48,840
నీకు బాగా అర్థమైందిగా?
96
00:05:50,720 --> 00:05:51,960
ఇక ఆమెను ఎత్తు.
97
00:05:55,120 --> 00:05:56,760
సరే, పాపలు, ఏమంటారు?
98
00:05:56,760 --> 00:05:58,040
చావో రేవో!
99
00:05:58,040 --> 00:05:59,720
చావో రేవో.
100
00:05:59,720 --> 00:06:01,320
చావో...
101
00:06:02,120 --> 00:06:03,680
రేవో.
102
00:06:04,240 --> 00:06:05,200
చావో!
103
00:06:08,280 --> 00:06:11,000
నా మెదడులో ఒక భాగమంతా ఎలా అంటుందంటే,
104
00:06:11,000 --> 00:06:14,880
ఒకామె అలా పడిపోయింది,
కానీ నీకేమీ అనిపించలేదా అని.
105
00:06:17,120 --> 00:06:19,680
అంటే, అది సాధారణం కాదు,
ఎలా అనిపించాలంటే...
106
00:06:21,320 --> 00:06:24,160
బాధగా, పశ్చాత్తాపంతో, అంటే...
107
00:06:27,200 --> 00:06:30,880
కానీ అప్పుడే అతని స్వరం కూడా
నా చెవిలో వినిపించింది,
108
00:06:32,280 --> 00:06:33,440
అతను...
109
00:06:34,840 --> 00:06:38,800
అంటున్నాడు, "లేదు, నిజానికి,
నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు.
110
00:06:38,800 --> 00:06:42,680
"నువ్వు తొక్కటం ఆపావంటే,
నీ మనుగడ ఆగిపోతుంది."
111
00:06:43,320 --> 00:06:44,240
ఇంకా...
112
00:06:45,800 --> 00:06:49,240
అంటే, అతని గొంతు అలా
కొన్నేళ్లుగా వింటున్నాను.
113
00:06:49,240 --> 00:06:51,360
బ్లూ బ్లడ్స్ మొదటి ఐపీఓల సమయంలో,
114
00:06:51,360 --> 00:06:54,520
నాకు వచ్చిన తొలి ఆలోచన
"ఓరి దేవుడా, రయన్...
115
00:06:59,960 --> 00:07:02,480
"రయన్ చాలా గర్వపడతాడని."
116
00:07:04,680 --> 00:07:08,400
ఆ ఆలోచనను ఎలా జీర్ణించుకోవాలో
తెలియలేదు నాకు ఇక నేను...
117
00:07:09,000 --> 00:07:11,040
నాకింకా అర్థం కాలేదు...
118
00:07:11,880 --> 00:07:14,560
నిన్ను బాగా చెడగొట్టినవాడే
119
00:07:15,440 --> 00:07:19,160
నువ్వు జీవితంలో సాగటానికి
ప్రేరేపించే స్వరం అవుతాడని.
120
00:07:19,160 --> 00:07:20,280
తెలుసా?
121
00:07:23,280 --> 00:07:24,400
సిగ్గుగా అనిపిస్తుంది.
122
00:07:24,400 --> 00:07:28,000
నా అసలైన థెరపిస్టుతో
కొన్నేళ్ల క్రితమే ఇది అర్థమైంది అనుకున్నా,
123
00:07:28,000 --> 00:07:29,320
అలా అవ్వలేదనిపిస్తుంది.
124
00:07:31,000 --> 00:07:32,320
హే, శాస్?
125
00:07:33,240 --> 00:07:35,640
ఈ నేల చాలా మురికిగా ఉంది.
126
00:07:35,640 --> 00:07:38,880
ఓరి దేవుడా,
నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు.
127
00:07:38,880 --> 00:07:41,040
-నేను మళ్ళీ వస్తాను.
-లేదు, అదేం లేదు.
128
00:07:42,120 --> 00:07:44,000
శాస్, కార్పెట్‌ను తుడుస్తున్నావు.
129
00:07:44,000 --> 00:07:45,640
తెరీసా, నీకేం కావాలి?
130
00:07:47,120 --> 00:07:49,800
నిన్ను కలుద్దామని,
ఎలా ఉన్నావో చుద్దామని వచ్చాను.
131
00:07:49,800 --> 00:07:52,200
పెపేతో మరీ మోటుగా ప్రవర్తించావు.
132
00:07:53,800 --> 00:07:55,000
ఇంకా?
133
00:07:55,720 --> 00:07:56,680
ఇంకా...
134
00:07:58,520 --> 00:08:00,440
నాకు తెలియదు, తను అన్నది నిజమేనేమో.
135
00:08:00,960 --> 00:08:05,360
మనం చాలా కష్టపడి తొక్కుతున్నాం
దానికి తగ్గట్టు అస్సలు తినట్లేదు.
136
00:08:05,880 --> 00:08:07,800
సరే. సరే, నువ్వు అన్నదే సరి.
137
00:08:08,080 --> 00:08:09,600
తను అన్నది తప్పేం కాదు.
138
00:08:09,600 --> 00:08:11,680
-మనకు ప్రోటీన్ కావాలి.
-అవును.
139
00:08:12,200 --> 00:08:15,440
నువ్వేగా తిండి విషయాలు చూసుకొనేది.
140
00:08:16,560 --> 00:08:18,560
అయితే, అదెక్కడుంది?
141
00:08:20,440 --> 00:08:21,800
సరే.
142
00:08:23,880 --> 00:08:24,880
నువ్వు అన్నదే సరి.
143
00:08:26,000 --> 00:08:27,000
ఏదన్నా చేస్తాను.
144
00:08:31,840 --> 00:08:34,440
శాస్, నీ ఆలోచనలు పంచుకోవటానికి
నేనున్నాను, సరేనా?
145
00:08:35,800 --> 00:08:37,040
ఏదైనా సరే.
146
00:08:39,320 --> 00:08:40,400
నేను చేసానది, ఇక...
147
00:08:48,840 --> 00:08:49,960
నన్ను క్షమించు.
148
00:08:52,360 --> 00:08:55,000
ఫీబ్స్, కొంచెం విశ్రాంతి తీసుకుందామా?
149
00:08:55,400 --> 00:08:57,600
నా అలసిన కాళ్లకు కొంచెం విరామం కావాలి.
150
00:08:59,200 --> 00:09:00,840
ఓరి దేవుడా.
151
00:09:14,200 --> 00:09:16,000
హే, రెనే, నువ్వు...
152
00:09:16,000 --> 00:09:18,080
తనేం చేస్తుందో తెలుసుకుంటావా?
153
00:09:18,080 --> 00:09:19,960
మీరు మాట్లాడుకోవచ్చు కదా?
154
00:09:19,960 --> 00:09:22,320
లేదు, గొడవలు అలా పని చేయవు, రెనే.
155
00:09:22,960 --> 00:09:25,640
ఆమెకు బ్యాటరీలు ఎందుకో
కారణమైనా తెలుసుకుంటావా?
156
00:09:25,640 --> 00:09:27,520
జెట్ స్కీకి వాడటానికా?
157
00:09:27,640 --> 00:09:29,040
అది నా పని కాదు.
158
00:09:29,040 --> 00:09:30,480
నిజమే. కాదు.
159
00:09:30,480 --> 00:09:33,080
జోయికి చెపుతావా తన పనీ కాదని?
160
00:09:33,080 --> 00:09:35,760
-అమీలియా అంది...
-అమీలియాకి చెపుతావా
161
00:09:35,760 --> 00:09:39,880
ఎస్ఆర్‌సి ప్రతినిధిగా,
తరగతి సంరక్షణ నా పనే అని?
162
00:09:40,760 --> 00:09:42,480
-సరే, అలాగే.
-రెనే,
163
00:09:42,480 --> 00:09:46,160
జోయికి వెంపర్లాడటానికి
ఇంకొకరిని చూసుకోమను.
164
00:09:46,160 --> 00:09:49,520
-సరే.
-ఇంకొకరా? అంత అతిగా ఊహించుకోకు, తల్లి.
165
00:09:49,640 --> 00:09:51,200
నాకు చాలా ఎంపికలున్నాయి.
166
00:09:51,840 --> 00:09:53,760
మతిమరుపు లోలా, మాట్లాడుకుందామా?
167
00:09:54,400 --> 00:09:55,520
వద్దు, పర్వాలేదు.
168
00:09:56,520 --> 00:10:00,600
రెనే, అమీలియాకు
మతిమరుపు లోలా లెక్కలోకి రాదని చెపుతావా?
169
00:10:00,600 --> 00:10:01,520
తను...
170
00:10:03,360 --> 00:10:05,360
నిజంగానే ఎదగండి, అమ్మాయిలు.
171
00:10:07,400 --> 00:10:08,720
సుడాఫెడ్?
172
00:10:08,720 --> 00:10:10,880
-దగ్గు మందు?
-లేదు.
173
00:10:11,000 --> 00:10:12,040
జాపత్రి?
174
00:10:12,040 --> 00:10:13,320
-లేదు.
-ఏంటి?
175
00:10:13,320 --> 00:10:15,880
-జాపత్రి కూడా లేదా?
-జాపత్రి కూడా లేదు.
176
00:10:16,520 --> 00:10:19,880
మీకు మత్తునిచ్చే ఏకైక అంశం
అదీ నా దగ్గరున్నదైతే
177
00:10:19,880 --> 00:10:23,240
ప్రొలెక్సాఫ్ట్ లేదంటే
కుటుంబనియంత్రణ బిళ్ల.
178
00:10:24,480 --> 00:10:25,960
సరే. ఆనందపు బిళ్లలే ఇవ్విక.
179
00:10:26,360 --> 00:10:29,760
హే, ఇప్పుడే చెపుతున్నాను,
180
00:10:29,880 --> 00:10:32,120
యాంటీ డిప్రెసెంట్లు మత్తునివ్వవు.
181
00:10:32,120 --> 00:10:36,120
సరే, మీ మెదడు రసాయనాలు మార్చడానికి
ప్రొలెక్సాఫ్ట్‌కు వారాలు పడుతుంది.
182
00:10:36,120 --> 00:10:37,040
తెలిసినంతలో.
183
00:10:37,040 --> 00:10:38,640
మాకేం తెలివి లేక కాదు.
184
00:10:38,640 --> 00:10:41,840
మేము వాటిని ఫీనాల్‌లాంటి దానితోనే,
185
00:10:41,840 --> 00:10:44,440
లేదంటే చుండ్రు షాంపూతోనో,
186
00:10:44,440 --> 00:10:47,440
అలంకరణ సామాను చేసే బంకతోనో
బాగా కలిపి తీసుకుంటాం...
187
00:10:48,880 --> 00:10:50,520
ఇది ప్రపంచ అంతం, పిల్లా.
188
00:10:50,880 --> 00:10:51,760
అమోఘం.
189
00:10:52,200 --> 00:10:53,720
లేదంటే మనం...
190
00:10:53,720 --> 00:10:58,000
లేదంటే జోయితో మంచిగా
ఉంటే చాలు నీకు వీటి అవసరమే ఉండదు.
191
00:10:58,000 --> 00:11:00,760
-డిప్రెషన్ పనితీరు అలా ఉండదు.
-త్వరగా.
192
00:11:00,760 --> 00:11:02,760
కాలం బ్యాటరీలతో సమానం, పాపలు.
193
00:11:03,400 --> 00:11:08,120
నువ్వు కిమ్ ష్నాడర్ చేతిలో
చావు దెబ్బలు తింటే నీకు హుడీ ఇచ్చిందెవరు?
194
00:11:08,120 --> 00:11:10,680
-సోదిది.
-అదెలా అంటావు నువ్వు?
195
00:11:10,680 --> 00:11:13,720
ఇన్నేళ్ల తరువాత,
నువ్వు దానిని వాడుకుంటావా?
196
00:11:16,960 --> 00:11:18,400
సరే.
197
00:11:18,720 --> 00:11:21,680
రక్తం గడ్డ కట్టినా సరే
ఆ చెత్త బోరింగ్ బిళ్లలే వేసుకో.
198
00:11:22,120 --> 00:11:24,360
-నీ మర్యాదకు ధన్యవాదాలు.
-వ్యసనపుది.
199
00:11:30,080 --> 00:11:31,360
ప్రొలెక్సాఫ్ట్, దయచేసి.
200
00:11:31,360 --> 00:11:32,960
బాక్సుకి మూడు బ్యాటరీలు.
201
00:11:32,960 --> 00:11:35,880
-ఏంటి? ఎందుకు?
-చూసావుగా. గిరాకీ, సరఫరా, పిల్లా.
202
00:11:35,880 --> 00:11:37,560
అలా రేటు పెంచలేవు.
203
00:11:38,200 --> 00:11:39,360
పెంచగలను.
204
00:11:39,360 --> 00:11:40,920
ఆటలో న్యాయమే, సరే.
205
00:11:40,920 --> 00:11:44,160
ఆటలో న్యాయమే
ఆటలో న్యాయమే
206
00:11:44,160 --> 00:11:47,480
వెళ్లిపో, వెళ్లిపో, వె... తరువాత!
207
00:11:52,960 --> 00:11:54,880
టీ బిస్కెట్టు, ఏం చేస్తున్నావు?
208
00:11:55,160 --> 00:11:57,440
ఓరి నాయనో!
209
00:11:57,440 --> 00:11:59,720
నీ ముఖానికి ఏమైంది?
210
00:11:59,720 --> 00:12:03,200
మిద్దె మీద ముంగీసలాంటి జంతువుతో
తిండి పోరు ఓడిపోయాను,
211
00:12:03,200 --> 00:12:05,160
ఇక ఇప్పుడు చేపలే గతి.
212
00:12:10,680 --> 00:12:14,120
ఈ దృశ్యానికి అలవాటు పడతానని
అనుకోలేదు కానీ ఏం చేస్తాం.
213
00:12:15,560 --> 00:12:19,240
తమాషాగా అనిపించినా కానీ
నాకింకా కాపడబడతామని నమ్మకముంది.
214
00:12:19,240 --> 00:12:22,960
మనమిక్కడుంటే
వేరే చోట ఎక్కడో ఎవరో ఒకరు ఉండే ఉంటారు.
215
00:12:23,480 --> 00:12:27,360
అబ్బా, అవును. మనం ఆస్ట్రేలియాలోనే
అత్యంత ఎత్తైన చోటు లేము,
216
00:12:27,360 --> 00:12:28,840
ఇక ప్రపంచం సంగతి సరే సరి.
217
00:12:28,840 --> 00:12:32,440
వెనిస్ మునిగుంటుంది,
కానీ బ్రిస్బేన్? మునగదు!
218
00:12:32,440 --> 00:12:33,800
గుర్తుంచుకో, టీ టవల్.
219
00:12:33,800 --> 00:12:36,240
బ్రిస్బేన్ ఇంకా నిలిచే ఉంది.
220
00:12:38,000 --> 00:12:42,000
నా అండాలు అక్కడున్నాయని
నువ్వు పదే పదే చెప్పనక్కరలేదు.
221
00:12:42,760 --> 00:12:46,000
మిచ్! అబ్బా. నేను మరిచేపోతాను.
222
00:12:49,680 --> 00:12:50,800
ఇది బావుంది.
223
00:12:51,600 --> 00:12:54,360
ఇంతకుముందెప్పుడూ
ఇలా ఎందుకు కలిసి గడపలేదు?
224
00:12:55,160 --> 00:12:57,120
-శాస్కియా.
-శాస్కియా.
225
00:12:58,600 --> 00:13:00,360
జో, నాకు తన గురించి దిగులుగా ఉంది.
226
00:13:02,880 --> 00:13:04,560
థెరపిస్ట్ సమయంలో వెళ్లావా?
227
00:13:04,560 --> 00:13:06,080
అదా అదంతా?
228
00:13:06,080 --> 00:13:09,240
అవును. రెండు వారాల క్రితం
నేనూ చూసాను.
229
00:13:09,240 --> 00:13:12,000
ఆ కర్రతో కరియోకి
చేస్తున్నట్టు నటించింది.
230
00:13:12,760 --> 00:13:14,360
"రన్‌వే" ద కార్స్‌ది.
231
00:13:17,640 --> 00:13:20,440
జెనివీవ్ మాటను సమర్థించాలని కాదు,
కానీ తనది నిజమేగా.
232
00:13:20,440 --> 00:13:23,080
శాస్కియా ప్రాధాన్యతలన్నీ సోది.
233
00:13:24,360 --> 00:13:25,680
ఇప్పుడు నా వంతా?
234
00:13:26,800 --> 00:13:28,640
అమీలియా సంగతేంటి?
235
00:13:28,640 --> 00:13:33,000
అంటే, ఆమె ఆ బ్యాటరీలన్నీ తీసుకొని
ఏం చేసుకుంటుందస్సలు?
236
00:13:35,080 --> 00:13:37,200
అయ్యబాబోయ్!
237
00:13:40,640 --> 00:13:43,320
-ఆహా!
-మనకు చేప పడింది.
238
00:13:43,320 --> 00:13:45,000
చేప పడింది.
239
00:13:45,480 --> 00:13:50,080
స్వయంగా పట్టిన చేపల కూర,
వెజిమైట్ పూతతో.
240
00:13:50,080 --> 00:13:51,440
అరే!
241
00:13:51,440 --> 00:13:54,320
మార్తా స్టీవార్ట్ కూడా
మన తెరీసా మే ముందు దిగదుడుపే.
242
00:13:54,320 --> 00:13:57,280
వేటాడుతుంది, సేకరిస్తుంది, వండుతుంది.
243
00:13:57,280 --> 00:14:01,520
కొద్ది రోజుల్లోనే ఆ ముంగీసలాంటి జంతువును
ఓడిస్తుంది, కదా?
244
00:14:01,520 --> 00:14:03,560
అందరికీ, టెడ్డీ బేర్ గ్రిల్స్.
245
00:14:03,560 --> 00:14:04,760
ఓహ్, ఆపండి.
246
00:14:05,800 --> 00:14:07,200
శభాష్, తెెరీసా.
247
00:14:07,200 --> 00:14:08,440
అందరూ తినండి.
248
00:14:08,440 --> 00:14:09,840
మీకు అర్హతుంది.
249
00:14:10,440 --> 00:14:12,360
ఏంటి అర్హత? సాల్మొనెల్లా క్రిములా?
250
00:14:12,360 --> 00:14:15,000
బెస్టీ, ఆపు.
ఇది సాల్మన్ అయితే కాదు.
251
00:14:16,040 --> 00:14:17,920
సాల్మొనెల్లా కనుక!
252
00:14:29,200 --> 00:14:30,480
సరే.
253
00:14:31,320 --> 00:14:32,880
చాలా బావుంది.
254
00:14:34,320 --> 00:14:36,840
అంటే, చెత్తగా కనిపిస్తుంది. తినవచ్చా?
255
00:14:37,320 --> 00:14:40,800
ధన్యవాదాలు.
ప్రోటీన్ల ఆలోచన పెపేది, అమ్మాయిలు.
256
00:14:40,800 --> 00:14:44,120
అయితే ఆమెకే మంచి
పోషకాహారపు మాంసం ఇవ్వాలి మరి.
257
00:14:44,120 --> 00:14:46,400
ఆమెకు కళ్లు ఇస్తావా?
258
00:14:46,400 --> 00:14:49,840
-నిజంగా అనట్లేదుగా.
-చేప గుదం తినాలని ఉందా?
259
00:14:57,640 --> 00:15:00,320
రెండు కళ్లు...
260
00:15:01,680 --> 00:15:04,560
వెజిమైట్ రసంతో.
261
00:15:06,400 --> 00:15:07,480
నీకు అవకాశం ఉంది.
262
00:15:08,520 --> 00:15:09,920
వెళ్లి జుట్టు సరి చేసుకో,
263
00:15:10,320 --> 00:15:11,560
లేదంటే కళ్లు తిను.
264
00:15:26,320 --> 00:15:27,880
ఉప్పు ద్రాక్షలాగా ఉంది.
265
00:15:34,520 --> 00:15:37,680
బాగా నచ్చింది,
నేను ఇంకొకటి తింటాను.
266
00:15:49,640 --> 00:15:52,000
-ఎవరన్నా సహాయం చేయండి.
-దేవుడా!
267
00:15:52,720 --> 00:15:53,760
-రెనే!
-బాబోయ్!
268
00:15:53,760 --> 00:15:56,560
-ఏదన్నా చేయండి! కాపాడండి! రెనే!
-ఏమన్నా చెయ్యి!
269
00:16:06,280 --> 00:16:08,000
శెభాష్, పెపే.
270
00:16:26,600 --> 00:16:29,560
ఇంత ఆలస్యంగా ఇక్కడికెందుకు
వచ్చావసలు. వెళ్లు.
271
00:16:29,560 --> 00:16:33,800
సరే, ఈ వ్యాయామ దుస్తుల బహిరంగ విపణి
ఆర్థిక వ్యవస్థలో, పారిశ్రామిక విప్లవం...
272
00:16:33,800 --> 00:16:37,440
తరువాత మనుగడ
సాగించేవారు స్వీయ నియంత్రణ చేసుకుంటారు.
273
00:16:38,040 --> 00:16:39,160
లేదు! ఏంటిది...
274
00:16:41,840 --> 00:16:43,160
వెళ్లమన్నాను.
275
00:17:02,680 --> 00:17:04,560
అలసిపోయినట్టున్నావు, శాస్.
276
00:17:06,560 --> 00:17:07,520
విద్యుత్ ఉంది.
277
00:17:16,640 --> 00:17:19,200
ఇది చెత్త అలవాటు, ఫీబీ.
278
00:17:19,200 --> 00:17:21,240
అదే, లుసిండాకు పొగ తాగటం నచ్చదు.
279
00:17:23,280 --> 00:17:24,080
ఎవరు?
280
00:17:24,200 --> 00:17:27,200
ఆ కుర్ర చిన్న పిల్ల,
నా ఇంటర్న్‌గా పని చేసేది.
281
00:17:27,200 --> 00:17:29,520
అవును, ఆమెకు పొగ పడదు.
282
00:17:29,920 --> 00:17:31,680
దగ్గరకు కూడా రాలేదు.
283
00:17:31,680 --> 00:17:34,800
మూడేళ్ల క్రితం రిడ్జ్ హైట్స్ నుండి
ప్లస్ టూ పూర్తి చేసింది.
284
00:17:36,000 --> 00:17:37,160
పాపం పిచ్చిది.
285
00:17:37,560 --> 00:17:40,280
గెరటీ మాయలో పడిపోయింది,
286
00:17:40,280 --> 00:17:43,640
వాడి పేరు నడుం మీద పచ్చ వేయించుకుంది.
287
00:17:44,560 --> 00:17:46,280
"రయాన్" అంతే,
288
00:17:47,000 --> 00:17:49,240
వంకరగా ఇక్కడ.
289
00:17:50,280 --> 00:17:53,080
ఆమె ప్లస్ టూ పూర్తయ్యాక,
భార్యకు తెలిసేలోపు
290
00:17:53,200 --> 00:17:54,720
వాళ్ళ రంకు ఆరు నెలలు నడిచింది.
291
00:17:54,720 --> 00:17:56,480
-ఎంజాయ్ చేస్తున్నావా?
-హా.
292
00:17:57,520 --> 00:17:59,480
సరే గానీ, అడిగినందుకు థాంక్స్.
293
00:18:00,320 --> 00:18:04,160
స్కూలులో ఫేమస్ అమ్మాయికి
తను అంత ప్రత్యేకం కాదని తెలిపినందుకు?
294
00:18:05,400 --> 00:18:06,400
అవును, ఆస్వాదించాను.
295
00:18:11,520 --> 00:18:12,880
బ్యాటరీకి ధన్యవాదాలు.
296
00:18:19,560 --> 00:18:21,640
ఆరు నెలలా? నేను అసలు...
297
00:18:25,560 --> 00:18:30,520
స్కూలీస్ నుండి తీసుకెళ్లాడు, తరువాత,
మూడు వారాల తరువాత, పనైపోయింది.
298
00:18:33,640 --> 00:18:35,920
నేను ఏళ్లు గడిపాను బయటపడటానికి.
299
00:18:39,920 --> 00:18:41,280
ఇప్పుడు కుళ్లుబోతుని.
300
00:19:05,960 --> 00:19:08,040
-సైకిల్ ధర్నా, సోదిదానా.
-ఏంటి?
301
00:19:08,560 --> 00:19:10,560
జుట్టు సోది ముగిసేదాకా,
302
00:19:11,000 --> 00:19:12,160
నేను తొక్కను.
303
00:19:16,480 --> 00:19:17,480
సరే.
304
00:19:20,160 --> 00:19:21,400
నువ్వు మాకు అక్కరలేదు.
305
00:19:21,960 --> 00:19:22,880
వినపడిందా?
306
00:19:23,720 --> 00:19:26,480
నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు,
అది నీ ఇష్టం.
307
00:19:26,480 --> 00:19:28,400
ఈ క్లాసుకేం ఇబ్బంది లేదు.
308
00:19:29,480 --> 00:19:33,320
నీకు ఎంత విలువ లేదో తెలిసి
నీకే ఆశ్చర్యమేస్తుంది.
309
00:19:34,080 --> 00:19:36,160
నేను నిన్ను మళ్ళీ అడగను.
310
00:19:36,160 --> 00:19:39,240
నువ్వు తొక్కలేదంటే,
నువ్వు ఇందులో పాలుపంచుకోలేవు.
311
00:19:40,800 --> 00:19:43,200
ఈవిడ నీచురాలి నిర్వచనం, పాపలు.
312
00:19:43,200 --> 00:19:45,240
"మాతో కూర్చోలేవు."
313
00:19:45,720 --> 00:19:46,760
కూర్చోలేవు.
314
00:19:47,440 --> 00:19:51,560
బ్యాటరీలు లేవు, తిండి లేదు,
మంచం లేదు, వేడి నీరు లేదు.
315
00:19:52,240 --> 00:19:56,440
బాత్రూంలో పడుకోవచ్చు,
కానీ అంతవరకే, ఇక అన్నీ నువ్వే చేసుకోవాలి.
316
00:19:56,440 --> 00:19:58,800
శాస్, అరే. అది మరీ అతి.
317
00:20:00,560 --> 00:20:03,080
వెలివేత, ప్రపంచాంతపు శైలిలో.
318
00:20:04,320 --> 00:20:07,040
ఏం చేస్తావు, శాస్కియా? చేసి చూపించు?
319
00:20:07,040 --> 00:20:08,040
లేదు.
320
00:20:08,800 --> 00:20:09,960
కానీ వాళ్లు చేస్తారు.
321
00:20:10,440 --> 00:20:13,080
నువ్వు వెంటనే బాత్రూంకి మకాం మార్చకపోతే,
322
00:20:13,200 --> 00:20:15,200
వీళ్లెవరికీ రాత్రికి బ్యాటరీలు ఉండవు.
323
00:20:15,200 --> 00:20:16,760
-ఏంటి?
-అరే, శాస్.
324
00:20:16,760 --> 00:20:19,320
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఈసారి నాది.
325
00:20:19,960 --> 00:20:22,800
జెనివీవ్, ప్లీజ్, తొక్కు, సరేనా?
326
00:20:23,080 --> 00:20:24,960
లేదంటే తలస్నానం చెయ్యి, నాకనవసరం.
327
00:20:24,960 --> 00:20:28,800
కానీ మా అందరికీ ఆ బ్యాటరీలు కావాలి.
328
00:20:42,800 --> 00:20:46,560
మీ పిరికితనాలు పోయాక
నన్ను బాత్రూం దగ్గర కలుసుకోండి.
329
00:20:47,320 --> 00:20:50,200
సైకిల్ ధర్నా జిందాబాద్!
330
00:20:52,080 --> 00:20:54,320
శాస్, అరే...
331
00:20:55,000 --> 00:20:57,760
పెపేని భరించటం కష్టమే,
కానీ అలా వెలివేయలేముగా.
332
00:20:57,760 --> 00:20:59,560
ఆమె చెప్పింది సరేగా.
333
00:20:59,680 --> 00:21:01,720
మనం ఇవి కొంచెం తక్కువ తొక్కి
334
00:21:01,720 --> 00:21:04,440
రెండు రోజులకొకసారి
జుట్టు సరి చేసుకోవచ్చు. కదా?
335
00:21:06,440 --> 00:21:09,680
నిజానికి, నాకూ ఇష్టమే అది.
ఇది మరీ ఎక్కువ పని.
336
00:21:10,000 --> 00:21:11,080
అంగీకరిస్తారా?
337
00:21:12,080 --> 00:21:13,760
-అవును.
-సరే.
338
00:21:13,760 --> 00:21:16,760
-మీ అందరూ గోల చేసారు కనుక...
-ఏం చేస్తున్నావు?
339
00:21:16,760 --> 00:21:19,760
-నువ్వు ఈ బ్యాటరీ వాడుకోలేవు.
-ఇది అన్యాయం.
340
00:21:19,760 --> 00:21:23,320
ఇదంతా నేను కట్టానని
మరువకండి.
341
00:21:23,520 --> 00:21:26,400
చీకట్లో కూర్చొని
చెట్లలో మలవిసర్జన చేస్తామంటే
342
00:21:26,400 --> 00:21:28,760
పందులలాగా, మీ ఇష్టం.
343
00:21:28,760 --> 00:21:31,440
కానీ మీరు సౌకర్యాలు
ఎక్కువయ్యాయని ఏడుస్తుంటే,
344
00:21:31,440 --> 00:21:33,160
భరించాల్సిన అవసరం నాకు లేదు!
345
00:21:40,200 --> 00:21:43,960
శాస్ సామూహిక ఆత్మహత్యలు చేయించక ముందే
ఇక్కడినుండి బయటపడాలి, అంటే...
346
00:21:46,160 --> 00:21:48,880
బ్రిస్‌వేగాస్‌కు వెళుతున్నావు, తెరీసా పాప.
347
00:21:49,240 --> 00:21:50,320
ఇదేంటి?
348
00:21:50,320 --> 00:21:51,800
ఇది పడవ.
349
00:21:52,160 --> 00:21:53,920
-సరే.
-ఇది నీ బోటు.
350
00:21:53,920 --> 00:21:56,120
కావలసిందల్లా, తెరచాప కొయ్య అంతే.
351
00:21:56,720 --> 00:21:59,800
నీకు అందిన బహుమతులు
ఇతరులకు ఇవ్వటంలో దిట్టవి, జోజో.
352
00:21:59,800 --> 00:22:03,440
-ఓహ్, లేదు...
-లేదు, లేదు, పర్వాలేదు.
353
00:22:03,440 --> 00:22:06,080
నాకు నచ్చింది. ధన్యవాదాలు. బావుంది.
354
00:22:06,080 --> 00:22:07,880
మంచిది. నువ్వు యోగ్యురాలివి.
355
00:22:08,320 --> 00:22:09,400
అమిలీయాలాగా కాదు.
356
00:22:09,960 --> 00:22:11,640
అంటే, నాకు తెలిసినంతలో,
357
00:22:11,640 --> 00:22:14,680
మనం ఆజన్మాంతం
ప్రాణమిత్రులం అని ప్రకటిస్తే,
358
00:22:15,600 --> 00:22:17,280
దాని అర్థం ఏంటంటే,
359
00:22:17,280 --> 00:22:20,280
"ప్రతి రెండేళ్లకు
నేను నీ ఇన్‌స్టా బొమ్మలు లైక్ చేస్తాను."
360
00:22:20,280 --> 00:22:21,560
అర్థమైందిగా?
361
00:22:22,320 --> 00:22:26,560
సరే గానీ, ఆమెతో నేను ఇప్పుడు
సర్దుకోవాలనుకున్నా కానీ,
362
00:22:26,840 --> 00:22:30,000
ఆమె బ్యాటరీలను చార్జి
చేయటంలో చాలా బిజీగా ఉంది
363
00:22:30,000 --> 00:22:32,440
ఆమె పెద్ద పురుషాంగ వైబ్రేటర్ కోసం?
364
00:22:32,440 --> 00:22:36,120
నిజంగా, నాకు అదొక్కటే
తడుతుంది ఇక.
365
00:22:36,120 --> 00:22:39,600
సరే, చూడు, జో,
366
00:22:40,160 --> 00:22:43,360
ప్రతి రాత్రి భోజనమప్పుడు,
అమీలియా బిళ్ల వేసుకోవటం చూసాను.
367
00:22:44,080 --> 00:22:45,840
మీగన్ ఇంకా టీగన్ అంటే విన్నాను
368
00:22:45,840 --> 00:22:48,840
సంతోషాన్ని కలిగించే
బిళ్లలు అందకపోవటం గురించి.
369
00:22:49,400 --> 00:22:50,960
సరే, అయితే...
370
00:22:51,880 --> 00:22:54,640
అమీలియా యాంటీడిప్రెసెంట్లు వేసుకుంటుంది.
371
00:22:55,400 --> 00:22:56,320
ఆగు, ఏంటి?
372
00:23:00,280 --> 00:23:04,800
అబ్బా!
373
00:23:07,920 --> 00:23:10,440
ఇది ఘోరం. దారుణం కదా? కష్టమే.
374
00:23:10,440 --> 00:23:13,080
పర్వాలేదు, టీ. గోరు చితికింది అంతే.
375
00:23:13,480 --> 00:23:15,920
కానీ దీనికి శస్త్రచికిత్స చేయాలి, సరేనా?
376
00:23:18,080 --> 00:23:20,840
ఇదేం డిన్నర్‌తో జిరిగే సంగీత షో కాదు.
వెళ్ళిపోండి!
377
00:23:20,840 --> 00:23:21,920
పదండి!
378
00:23:25,600 --> 00:23:26,720
హే.
379
00:23:27,320 --> 00:23:29,960
నేను నీ పక్కనే ఉంటాను, టీ కోజీ.
కంగారుపడకు.
380
00:23:29,960 --> 00:23:32,040
వద్దు, వద్దు. నువ్వు వెళ్లిక.
381
00:23:32,040 --> 00:23:35,920
నువ్వు ఇంకొకరి కళ్లు పీకకముందే
అమీలియాతో కలిసి పో.
382
00:23:37,800 --> 00:23:40,080
సరే. సరే. అలాగే.
383
00:23:41,400 --> 00:23:42,800
అబ్బా, సారీ.
384
00:23:43,560 --> 00:23:45,360
సారీ, వద్దు, అంటే...
385
00:23:46,560 --> 00:23:49,920
తెలుసుగా, తనను భర్తీ చేయలేవు నువ్వు.
386
00:23:52,200 --> 00:23:53,080
అవును.
387
00:23:55,400 --> 00:23:57,400
-నువ్వు వెళ్లిక.
-సరే, వెళతాను.
388
00:23:59,320 --> 00:24:01,200
రెనే, నువ్వు ఇక్కడే ఉండాలి.
389
00:24:02,040 --> 00:24:03,280
నువ్వు కూడా ఫీబీ.
390
00:24:04,120 --> 00:24:06,560
సరే! ఎండీ వస్తోంది.
391
00:24:07,720 --> 00:24:10,800
-ఏంటి?
-నొప్పి తగ్గించేవి నీ దగ్గర ఏమున్నాయి?
392
00:24:11,560 --> 00:24:12,840
ఎక్కువేం లేవు.
393
00:24:13,440 --> 00:24:17,480
ఈ నొప్పిని భరించగలిగేలా
ఏదో ఒకటి వాడి చూడు, సరేనా?
394
00:24:17,480 --> 00:24:19,040
రెనే, చేయగలవా?
395
00:24:19,040 --> 00:24:21,760
సరే, అలాగే. తప్పకుండా చేయగలను.
396
00:24:21,760 --> 00:24:25,800
నిజానికి, మెడిసిన్స్ సాన్స్
ఫ్రాంటియర్స్‌లో చేసినట్టేగా.
397
00:24:25,800 --> 00:24:28,240
అలాంటి పరిస్థితులే అవి,
398
00:24:28,240 --> 00:24:29,400
తెలుసుగా?
399
00:24:30,680 --> 00:24:33,760
ఎన్నిసార్లు చెప్పాలి నీకు?
అది చెత్త అలవాటని.
400
00:24:33,760 --> 00:24:36,040
-ఆగు. అంటే...
-తీసెయ్యి అంతే.
401
00:24:41,200 --> 00:24:43,560
నువ్వు మిగతా
అమ్మాయిలలాగా కాదు, శాస్కియా.
402
00:24:43,560 --> 00:24:44,720
పరిణితి ఉంది.
403
00:24:45,920 --> 00:24:47,640
నీ వ్యాసానికి తక్కువ మార్కులు
404
00:24:47,640 --> 00:24:50,320
వేస్తానంటే నువ్వు నన్ను తిట్టుకోకు.
405
00:24:50,320 --> 00:24:52,520
-కానీ...
-తెలుసు, తెలుసు, అన్యాయం అని.
406
00:24:53,160 --> 00:24:56,160
జనాలకు మన ఇష్టాలు తెలియకూడదుగా.
407
00:24:56,280 --> 00:24:57,960
నువ్వు నా ఫేవరేట్ అయినా కానీ.
408
00:25:00,400 --> 00:25:02,080
అది అర్థమౌతుంది, కదా?
409
00:25:14,800 --> 00:25:15,880
అబ్బా.
410
00:25:22,080 --> 00:25:23,520
అవి మూడు బ్యాటరీలు.
411
00:25:23,800 --> 00:25:25,000
ప్రొలెక్సాఫ్ట్.
412
00:25:25,560 --> 00:25:27,760
నువ్వు ఇంకో రెండు బ్యాటరీలు ఇవ్వాలి.
413
00:25:27,760 --> 00:25:30,480
-ఏంటి?
-వైద్య అత్యవసరాల వలన రేట్లు పెరిగాయి.
414
00:25:31,240 --> 00:25:32,320
నాకు బిళ్లలు కావాలి.
415
00:25:32,320 --> 00:25:36,080
అదొక్కటే చావకుండా ఆపుతోంది నన్ను.
416
00:25:36,720 --> 00:25:39,200
ఇది ప్రళయం, పిల్లా.
అందరికీ కుంగుబాటు ఉంది.
417
00:25:43,120 --> 00:25:44,960
సరే, స్పృహ పోయింది. కానివ్వు, నే.
418
00:25:45,800 --> 00:25:46,920
సరే.
419
00:25:50,880 --> 00:25:52,160
బహుశా...
420
00:25:52,480 --> 00:25:53,920
నేను పూర్తి చేస్తానని నమ్ము.
421
00:25:53,920 --> 00:25:54,960
కంగారేం లేదు.
422
00:25:55,720 --> 00:25:59,200
సరే మరి, ఒకటి, రెండు, మూడు.
423
00:26:07,600 --> 00:26:10,080
మనం గోరు కదా తీసేయాలి?
424
00:26:10,680 --> 00:26:13,200
"దాన్ని తీసేయ్" అని శాస్ అంది.
425
00:26:17,280 --> 00:26:20,200
-దేవుడా. దేవుడా.
-అబ్బా.
426
00:26:20,200 --> 00:26:21,360
అబద్ధమాడాలని కాదు!
427
00:26:21,360 --> 00:26:24,520
ఆత్మీయ కలయికలో అలా చెప్పానంతే.
అందరూ బాగా సాధించారు.
428
00:26:24,520 --> 00:26:27,200
శాండీకి నేను
గోళ్ల నిపుణురాలిని అని చెప్పినప్పుడు,
429
00:26:27,200 --> 00:26:30,720
తన నా తల నిమిరితే,
నాకు చాలా చిన్నతనంగా అనిపించింది.
430
00:26:30,720 --> 00:26:33,840
అందుకే నేను నోరు జారాను.
నేను, "డాక్టరుని," అని సరేనా?
431
00:26:33,840 --> 00:26:37,200
అప్పుడు చాలా బాగనిపించింది.
కానీ ప్రళయం వచ్చాక,
432
00:26:37,200 --> 00:26:39,880
అందరూ అన్నారు,
"డాక్టరు ఉండటం మంచిదే అని."
433
00:26:39,880 --> 00:26:41,120
నేనేం చేయాలిక?
434
00:26:41,120 --> 00:26:43,480
వాళ్లందరూ చనిపోతారని చెప్పాలా ఎందుకంటే...
435
00:26:43,480 --> 00:26:45,320
నువ్వు డాక్టరువి కాదని తెలిసింది!
436
00:26:45,320 --> 00:26:48,040
కానీ నీ ఈ నకిలీ సోదికి
ఇది సమయం కాదు.
437
00:26:48,040 --> 00:26:50,080
బొటనవేలు రక్తం కారుతుంది.
438
00:26:50,080 --> 00:26:53,280
సరేనా? అందుకే నువ్వు
నోరుమూసుకొని దీనిని ఇప్పుడే కాల్చు,
439
00:26:53,280 --> 00:26:56,160
ఆ పుండును మాడ్చడానికి,
టెపిన్యాకీ వాసన వచ్చేదాకా.
440
00:27:10,320 --> 00:27:12,120
మాంసం వండుతుందెవరు?
441
00:27:12,120 --> 00:27:13,200
హాయ్, తెరీసా.
442
00:27:14,440 --> 00:27:17,240
శస్త్ర చికిత్స చాలా బాగా జరిగింది.
443
00:27:17,880 --> 00:27:22,680
ఎడమకాలి బొటనవేలి
ఎముకను తీసేసాము
444
00:27:22,680 --> 00:27:24,320
ఏ ఇబ్బంది లేకుండా.
445
00:27:24,320 --> 00:27:26,240
తరువాత కొంచెం నొప్పిగా ఉండవచ్చు,
446
00:27:26,240 --> 00:27:28,240
-కానీ అది తప్ప...
-క్షమించాలి...
447
00:27:29,120 --> 00:27:30,880
"తీసేసావు" అన్నావా?
448
00:27:30,880 --> 00:27:32,920
అది నిజమే. ఇక్కడి మన మహా వైద్యురాలు
449
00:27:32,920 --> 00:27:37,000
శాస్కియా చెప్పింది చెప్పినట్టు
చేసి దానిని తీసేసింది.
450
00:27:38,680 --> 00:27:41,120
-నేను అది...
-సరే గానీ, మనం వెళ్లాలిక.
451
00:27:41,800 --> 00:27:42,800
అది కాదు...
452
00:27:42,800 --> 00:27:45,280
ఓరి దేవుడా.
నా వేలు తీసేయమన్నావా?
453
00:27:45,280 --> 00:27:47,640
-లేదు.
-గోరు అని మాత్రమే అనుకున్నా.
454
00:27:47,640 --> 00:27:49,080
అవును. సరిగ్గా వినలేదు.
455
00:27:49,080 --> 00:27:50,880
వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?
456
00:27:50,880 --> 00:27:53,840
అంత పాడవ్వలేదు.
వాళ్లు వేలు తీసేయాల్సిన అవసరం లేదు.
457
00:27:53,840 --> 00:27:55,240
ఏంటిదంతా, శాస్కియా?
458
00:27:56,240 --> 00:27:57,360
హలో?
459
00:27:57,360 --> 00:28:00,200
చెప్పాలంటే, తెరీసా?
నువ్వు చెప్పింది నిజమే.
460
00:28:00,200 --> 00:28:02,040
నా భయాలనుండి కోలుకోలేకపోతున్నాను.
461
00:28:02,040 --> 00:28:04,000
ఓరి దేవుడా! ఏంటి? ఏంటి?
462
00:28:04,000 --> 00:28:08,280
అవును, అది,
అవన్నీ మళ్లీ తిరగబెడుతున్నాయి.
463
00:28:08,280 --> 00:28:12,200
ఇది, అంటే, నాకు ఇక్కడున్నప్పుడు
జరిగినవన్నీ గుర్తుకు వస్తున్నాయి.
464
00:28:12,200 --> 00:28:15,000
-ఇప్పుడిప్పుడే తెలుస్తుంది...
-ఇప్పుడు మాట్లాడాలా?
465
00:28:15,000 --> 00:28:17,240
అవును, తెలుసా. నీ వేలికి నా సానుభూతి.
466
00:28:17,240 --> 00:28:19,120
-నిజంగా.
-నువ్వెళ్లీ ఆ సోది
467
00:28:19,120 --> 00:28:22,200
నకిలీ థెరపిస్టుతో మాట్లాడుకోవచ్చుగా
సోదిదానా?
468
00:28:28,880 --> 00:28:30,840
డిన్నర్ గంటలో ఉంది, తెరీసా.
469
00:28:31,360 --> 00:28:33,200
అమ్మాయిలకు చేప కావాలట.
470
00:28:33,760 --> 00:28:36,440
నీ స్థానంలో నేనుంటే త్వరపడతాను.
471
00:28:37,880 --> 00:28:40,280
లేదంటే కుంటుతాను అని చెప్పాలేమో?
472
00:28:45,120 --> 00:28:48,400
అయితే, వాడు నా ఫేవరేట్,
వాడు చాలా మంచివాడు
473
00:28:48,400 --> 00:28:50,160
తెలివైనవాడు కూడా.
474
00:28:50,160 --> 00:28:53,080
చిన్నప్పుడు అసలు టీవీ చూడనే లేదు,
అందుకే ఇదంతా...
475
00:28:53,080 --> 00:28:54,400
ఫీబీ...
476
00:28:55,400 --> 00:29:00,120
ఇప్పుడే ఒకమ్మాయి వేలు కోసేసాను.
477
00:29:00,400 --> 00:29:01,480
అవును.
478
00:29:02,360 --> 00:29:03,840
నువ్వు నన్ను కాపాడావు.
479
00:29:05,760 --> 00:29:06,960
ఎందుకు?
480
00:29:08,320 --> 00:29:10,600
అర్థం చేసుకోగలను కనుక, రెనే, తెలుసా?
481
00:29:11,400 --> 00:29:14,040
ఈ స్కూలులో చేరటానికి
నేను చాలా కష్టపడ్డాను.
482
00:29:14,040 --> 00:29:16,000
కష్టపడి విద్యావిషయక గౌరవాలు పొందా.
483
00:29:16,000 --> 00:29:19,360
ఈ అమ్మాయిలు నిన్ను ఇప్పటికీ
తక్కువగా చూడటంలో అర్థమే లేదు,
484
00:29:19,360 --> 00:29:22,400
నువ్వు కేవలం
సోది సిఈఓ కూతురివి కానందుకు.
485
00:29:22,400 --> 00:29:25,720
అయితే, నువ్వు
మాకు డాక్టరు అని చెప్పావు, సరే...
486
00:29:26,240 --> 00:29:28,000
వదిలెయ్యి, నువ్వు డాక్టరువే.
487
00:29:28,000 --> 00:29:29,600
కానీ అది స్వంతం చేసుకోవాలి.
488
00:29:30,240 --> 00:29:33,200
ప్రపోజిషన్ జో మాటలలో,
అతన్ని నువ్వు కలుస్తావు,
489
00:29:34,040 --> 00:29:37,760
"అందులో భాగమవ్వాలి,
అలానే కనిపించాలి, సోది."
490
00:29:40,000 --> 00:29:44,040
-ఏంటిదంతా?
-ఇదేం పిచ్చి వైద్యం బాబు?
491
00:29:44,040 --> 00:29:46,920
దీన్ని తప్పుగా అర్థం చేసుకోవే, సోదిదానా!
492
00:29:47,400 --> 00:29:51,080
ఇక నువ్వు! ఇదే కదా
నువ్వు నా నుండి కోరుకునేది?
493
00:29:51,080 --> 00:29:52,760
నేను అదుపు తప్పటం.
494
00:29:52,760 --> 00:29:55,680
అవును. అవును.
ఇక్కడ బాసెవరో తెలియచెప్పాలి, సరేనా?
495
00:29:55,680 --> 00:29:57,760
నువ్వు బ్యాటరీలు ఇవ్వటానికి రాకుంటే,
496
00:29:57,760 --> 00:30:00,240
-స్థిమితంగా కూర్చో!
-నాకు అనవసరం!
497
00:30:00,240 --> 00:30:02,960
నీ డీల్ వద్దు నాకిక!
498
00:30:02,960 --> 00:30:06,160
వాడింకా ఇక్కడ పని చేస్తున్నాడు.
499
00:30:07,600 --> 00:30:09,680
ఎవరికన్నా పట్టిందా అది?
500
00:30:14,960 --> 00:30:17,080
ఆ దురాశ స్కాలర్షిప్ సోదిగాడు
501
00:30:17,080 --> 00:30:21,560
నన్ను జీవితాంతం బ్లాక్‌మెయిల్
చేస్తుంటే ఊరుకుంటాననుకున్నావా?
502
00:30:21,560 --> 00:30:23,680
భరించలేనిక.
503
00:30:30,360 --> 00:30:33,400
నీకేం కాలేదు. ఏం కాలేదు.
ఏం కాలేదుగా?
504
00:31:08,120 --> 00:31:09,680
ఇంకెన్ని కావాలి నీకు?
505
00:31:12,400 --> 00:31:13,320
రెండు.
506
00:32:05,840 --> 00:32:07,320
డ' మీరై
507
00:32:20,720 --> 00:32:22,600
ఇది నిజంగానే చేస్తున్నావా!
508
00:32:23,080 --> 00:32:24,640
తను కర్మ అనుభవించాల్సిందే.
509
00:33:47,640 --> 00:33:49,640
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
510
00:33:49,640 --> 00:33:51,720
క్రియేటివ్ సూపర్‌వైజర్
వలవల రాజేశ్వరరావు