1 00:00:43,252 --> 00:00:45,254 క్రికెట్? నువ్వు ఇంక మేలుకోవాలి. 2 00:00:52,177 --> 00:00:53,637 మేము ఎంత కృషి చేసినా, 3 00:00:53,720 --> 00:00:56,390 పెరిగిపోతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి ఇంకా శ్రమిస్తునే ఉన్నాం. 4 00:00:56,473 --> 00:00:58,475 ఈ క్లిష్టమైన పరిస్థితి మళ్లీ మామూలు కావడం అసాధ్యం, 5 00:00:58,559 --> 00:01:01,770 అందుకే మీ మిషన్ అత్యంత కీలకమైనది. 6 00:01:02,354 --> 00:01:04,188 -గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్, బగ్. 7 00:01:04,272 --> 00:01:05,649 హేయ్, క్రికెట్. 8 00:01:05,732 --> 00:01:08,193 పర్యావరణ వ్యవస్థని ఇక్కడ సృష్టించడంలో మీ చక్కని పనితీరుని ఇలాగే కొనసాగించండి. 9 00:01:08,277 --> 00:01:09,778 భూగోళం మీ మీదనే ఆధారపడి ఉంది. 10 00:01:10,445 --> 00:01:13,866 మానవాళికి మీరు ప్రాణదాతలు. 1.5 ఉష్ణోగ్రతల లక్ష్యాన్ని సజీవంగా ఉంచండి. 11 00:01:14,741 --> 00:01:15,742 కౌసిన్యు నిష్క్రమణ. 12 00:01:17,911 --> 00:01:20,664 జనం ఎందుకు ఒకరికొకరు సహకరించుకుని గ్లోబల్ వార్మింగ్ ని ఆపరు? 13 00:01:20,747 --> 00:01:22,082 అది అంత సుళువు కాదు. 14 00:01:22,165 --> 00:01:26,253 చాలా ప్రాంతాలు చమురు మీద ఆధారపడి ఉన్నాయి, ఆ చమురుని మండించడం వల్ల భూమికి హాని జరుగుతోంది. 15 00:01:26,336 --> 00:01:28,922 మంచి విషయం ఏమిటంటే, ఈ విషయంలో మనం కొద్దిగా పురోగతి సాధించాం. 16 00:01:29,006 --> 00:01:31,383 మట్టిలో మొక్కలు పెంచడం. త్వరలో నీటిని కూడా కనుగొనబోతున్నాం. 17 00:01:31,466 --> 00:01:35,095 మనం ఎంత త్వరగా అది సాధిస్తామో, అంతే త్వరగా మనం ఒకసారి సందర్శించి రావచ్చు. 18 00:01:35,929 --> 00:01:36,972 మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను, 19 00:01:37,055 --> 00:01:39,892 కానీ ఇప్పటికే రెండు క్రిస్మస్ పండుగలు, ఒక హాలోవీన్ గడిచిపోయాయి. 20 00:01:39,975 --> 00:01:41,143 ట్రిక్ ఆర్ ట్రీటింగ్ ని మిస్ అవుతున్నా. 21 00:01:41,226 --> 00:01:43,812 నేను ఆకుల్ని, ఆకురాలు కాలాన్ని మిస్ అవుతున్నాను. 22 00:01:44,396 --> 00:01:45,647 నేను కూడా. 23 00:01:47,065 --> 00:01:49,151 అయితే, మీరు ఉద్వేగంగా ఉన్నారా? 24 00:01:50,110 --> 00:01:51,278 దేని గురించి? 25 00:01:52,112 --> 00:01:55,115 మన ఇంటి అతిథులు. మొట్టమొదటి సందర్శకులు. 26 00:01:55,199 --> 00:01:57,618 మన కమ్యూనికేషన్ల వ్యవస్థ ద్వారా నిన్న రాత్రి కేసీ పేరెంట్స్ తో మాట్లాడాను. 27 00:01:57,701 --> 00:01:59,620 వాళ్లు రేపు ఆరు గంటల కల్లా ఇక్కడ ఉంటారు. 28 00:01:59,703 --> 00:02:00,913 మన ఏకైక ఫ్రెండ్ మన గదిలోకి 29 00:02:00,996 --> 00:02:04,583 హాలోగ్రామ్ రూపంలో ప్రత్యక్షమైతే మనకి ఎలా ఉంటుందో తెలుసా? 30 00:02:05,167 --> 00:02:09,003 నేను హై ఫైవ్ ఇవ్వచ్చు. నిజంగా ఇచ్చే హై ఫైవ్ మాదిరిగా. 31 00:02:10,297 --> 00:02:13,842 హేయ్. గతంలో మన ఇంట్లో తయారు చేసే విధంగా, బహుశా మనం కూడా 32 00:02:13,926 --> 00:02:15,886 కొన్ని చాక్లెట్ చిప్ కుకీస్ తయారు చేయాలి అనుకుంటా. 33 00:02:15,969 --> 00:02:18,639 మనకి మళ్లీ సరుకులు వచ్చేది తొమ్మిది నెలల తరువాతే. 34 00:02:18,722 --> 00:02:21,475 ఇప్పుడు మన దగ్గర ఉన్న చాక్లెట్ అంతా కుకీస్ చేయడానికి వాడాలంటావా? 35 00:02:22,309 --> 00:02:25,938 -అవును. -సరే. ఇంక మనం వెళ్లాలి. 36 00:02:29,900 --> 00:02:31,860 వ్యర్థ పదార్థాల ప్రక్రియ ప్రారంభం. 37 00:02:31,944 --> 00:02:33,403 వేస్ట్ ప్రోసెసర్ 38 00:02:39,034 --> 00:02:41,537 నేను చెప్పేది ఏమిటంటే, మనం గనుక మొత్తం చాక్లెట్ వాడేస్తే, 39 00:02:41,620 --> 00:02:43,413 మిగతా వాటి కోసం ఇంకేమీ మిగలదు. 40 00:02:43,956 --> 00:02:45,541 ఖర్జూరా నట్ కుకీ బార్స్ చేద్దామా? 41 00:02:46,291 --> 00:02:49,628 అమ్మా, తొమ్మిది నెలలుగా నేను కుకీస్ తినలేదు. 42 00:02:49,711 --> 00:02:52,089 వాటిని భద్రపరుస్తున్నాం కానీ సిల్లీగా ఆలోచిస్తున్నాం. 43 00:02:52,172 --> 00:02:53,674 భద్రపర్చడమే ముఖ్యం. 44 00:02:53,757 --> 00:02:55,342 చాక్లెట్ కూడా అంతే. 45 00:03:01,265 --> 00:03:04,059 హేయ్, చిన్నబ్బాయ్. నీకు కూడా కుకీ అంటే ఇష్టం కదా. 46 00:03:05,686 --> 00:03:08,272 తేనెటీగల పని ఆగిపోకుండా చేసినందుకు ఇది ఒక కుకీని గెలుచుకుంది అనుకుంటా. 47 00:03:08,355 --> 00:03:11,149 డ్రోన్స్ సాయం చేస్తున్నాయి. కానీ మనకి నిజమైన తేనెటీగలు అవసరం. 48 00:03:11,233 --> 00:03:12,776 -తేనెటీగలు లేకుండా… -పోలినేషన్ ఉండదు. 49 00:03:12,860 --> 00:03:16,113 పోలినేషన్ లేకపోతే, భూమి మీద మూడొంతుల ఆహార సరఫరా ఆగిపోతుంది. 50 00:03:16,196 --> 00:03:19,616 ఒక చిన్న అంశం కూడా మన పర్యావరణం మీద పెద్ద ప్రభావాన్ని చూపించగలదు. 51 00:03:20,367 --> 00:03:24,162 మనం ఇక్కడ చేస్తున్నదంతా మన ప్రజలు చూడాలని కొన్నిసార్లు అనిపిస్తుంది. 52 00:03:24,246 --> 00:03:25,372 ఏదో రోజు వాళ్లు చూస్తారు. 53 00:03:26,081 --> 00:03:29,376 పెద్ద సంఖ్యలో కుటుంబాలు మనలాగ ఇలాంటి ఆవాసాలలో నివసించడాన్ని ఒకసారి ఊహించుకో. 54 00:03:29,459 --> 00:03:34,214 ఒక లైఫ్ బోట్. ప్రతి రోజు ఒకే రకంగా ఉండే లైఫ్ బోట్. 55 00:03:34,965 --> 00:03:36,258 కానీ రేపు మాత్రం ఎప్పటిలా ఉండదు. 56 00:03:37,134 --> 00:03:38,177 రేపు మాత్రం అలా ఉండదు. 57 00:03:38,260 --> 00:03:40,137 జనాన్ని కలుసుకోవడం బాగుంటుంది. 58 00:03:40,721 --> 00:03:41,847 నువ్వు ఏం డ్రెస్ వేసుకోబోతున్నావు? 59 00:03:42,639 --> 00:03:43,932 ఇదే, అనుకుంటా. 60 00:03:46,185 --> 00:03:49,146 వద్దా? అయితే నా కోసం ఏదైనా డ్రెస్ నువ్వే ఎంపిక చేస్తావా? 61 00:03:49,730 --> 00:03:50,898 ఖచ్చితంగా. 62 00:03:54,526 --> 00:03:56,403 -ఈ ఇల్లు పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. -ఆక్సిజన్? 63 00:03:56,486 --> 00:03:58,113 పర్యావరణ వ్యవస్థల చెక్. 64 00:03:58,197 --> 00:04:00,991 -వాతావరణం బాగుంది. -ఈ రోజు కంట్రోల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? 65 00:04:01,074 --> 00:04:03,785 నా ఫ్లయిట్ ప్లాన్ నాకు ఉంది. అదరగొట్టడానికి నేను రెడీ. 66 00:04:08,207 --> 00:04:11,710 గరిష్ఠ ఎత్తు 300 మీటర్లుగా నిర్ణయించాం. ప్రయోగానికి అనుమతి కోరుతున్నాం. 67 00:04:12,544 --> 00:04:13,795 అనుమతి మంజూరు. 68 00:04:14,296 --> 00:04:16,048 లిఫ్ట్ ఆఫ్ ప్రారంభమైంది. 69 00:04:18,926 --> 00:04:20,969 సోలార్ ప్యాన్సెల్ మీద ఇసుక శుభ్రం చేయబడింది. 70 00:04:24,765 --> 00:04:26,225 హ్యాబిటాట్ వ్యవస్థ బాగుంది. 71 00:04:30,562 --> 00:04:31,688 హాయ్, అమ్మా. 72 00:04:36,401 --> 00:04:38,278 కమ్యూనికేషన్స్ టవర్ పని చేస్తోంది. 73 00:04:42,366 --> 00:04:43,951 ల్యాండింగ్ పూర్తయింది. 74 00:04:44,034 --> 00:04:45,369 బాగా చేశావు, మేవరిక్. 75 00:04:45,953 --> 00:04:46,954 ఎవరు? 76 00:04:49,873 --> 00:04:52,501 స్కూలులో బాగా చదువుకో, క్రికెట్. నిన్ను ప్రేమిస్తున్నాము. 77 00:04:53,043 --> 00:04:54,962 నక్షత్రాల్లోకి వెళ్లి తిరిగి వస్తాము. 78 00:04:59,591 --> 00:05:01,426 డీప్రెజరైజేషన్ మొదలైంది. 79 00:05:04,429 --> 00:05:07,140 అప్రమత్తం. బే డోర్స్ తెరుచుకుంటున్నాయి. 80 00:05:17,651 --> 00:05:19,027 శుభోదయం, డిగ్బీ. 81 00:05:22,739 --> 00:05:24,783 నాకు చీజ్ బర్గర్ ఇంకా ఫ్రైస్ అందించు, సరేనా? 82 00:05:25,659 --> 00:05:27,953 సరే. ఇప్పుడు వెళ్లి పక్క దుప్పట్లు సర్దు. 83 00:05:56,523 --> 00:06:00,819 సరే, మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడి నుండి ప్రారంభిద్దాం. థొరో దాగుడుమూతల ఆట ఆడుతున్నాడు… 84 00:06:02,070 --> 00:06:03,363 ఒక హూటింగ్ లూన్ పక్షితో. 85 00:06:04,031 --> 00:06:06,325 ఎవరైనా చెప్పగలరా? అది గుడ్లగూబ కాదు, కానీ… 86 00:06:06,408 --> 00:06:08,118 -చెప్పు? -ఒక హూటింగ్ లూన్ పక్షి. 87 00:06:09,453 --> 00:06:11,580 వాళ్లకి మన మాటలు వినిపించవు. ఇది రికార్డ్ అయి ఉంది. 88 00:06:11,663 --> 00:06:15,584 -నాకు తెలుసు, కేసీ. అలవాటయిపోయింది. -మంచిది. 89 00:06:15,667 --> 00:06:19,546 సరే, అతను ఆ పెద్ద నగరాన్ని వదిలి అడవిలో ఒక పాడుబడిన క్యాబిన్ లో నివసిస్తూ 90 00:06:19,630 --> 00:06:23,800 ఉడుతలు, పిట్టలు ఇంకా వాల్డెన్ లోని చీమలతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. ఇప్పుడు… 91 00:06:23,884 --> 00:06:25,928 -కనీసం అతని దగ్గర చీమలైనా ఉన్నాయి. -ఇంకా ఒక నీటి మడుగు. 92 00:06:26,011 --> 00:06:27,346 ఇంకా ప్రకృతి. 93 00:06:27,429 --> 00:06:31,892 చీమల కోసం నేను ఏదైనా చేస్తాను. నాకు సాలీడు పురుగులు అంటే చిరాకు కానీ కనీసం అవి ఉన్నా ఫర్వాలేదు. 94 00:06:33,143 --> 00:06:34,269 ఆగు. 95 00:06:36,980 --> 00:06:38,941 టి - నువ్వు ఏలిష్ బర్త్ డే పార్టీకి వెళ్తున్నావా? 96 00:06:39,024 --> 00:06:42,069 ఏలిష్ అందమైన బర్త్ డేని నేను మళ్లీ మిస్ అవుతున్నాను. 97 00:06:42,569 --> 00:06:45,614 ఆపకుంటే మేలు. వాళ్లు మన క్లాసుల్ని పరిశీలిస్తుంటారు, క్రిక్. 98 00:06:47,074 --> 00:06:48,325 ఖచ్చితంగా. 99 00:06:48,408 --> 00:06:50,869 అయితే, విచిత్రంగా ప్రవర్తించే మా నాన్నని, అత్యుత్సాహం ప్రదర్శించే మా అమ్మని 100 00:06:50,953 --> 00:06:52,704 రేపు కలవడానికి నువ్వు సిద్ధమేనా? 101 00:06:52,788 --> 00:06:57,709 పూర్తిగా. నీ బేస్ బాల్ గ్లోవ్, నీ రోలర్ స్కేట్స్ ఇంకా నీ సీక్వెన్సర్ తీసుకురా. 102 00:06:57,793 --> 00:06:59,503 మన టాలెంట్ షో కోసం మనం పాట రికార్డు చేయాలి. 103 00:06:59,586 --> 00:07:01,672 మనకి టైమ్ పరిమితంగా ఉంటుందని మా నాన్న చెప్పాడు. 104 00:07:01,755 --> 00:07:03,382 మా ఆక్సిజన్ సప్లయ్ తగ్గడం మాకు ఇష్టం లేదు. 105 00:07:03,465 --> 00:07:08,387 అవును, కానీ నాలుగు గంటల పాటు మనం చాలా సరదాగా గడపచ్చు. అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. 106 00:07:08,470 --> 00:07:10,222 అయితే, శీతాకాలం వస్తోందన్న మాట, 107 00:07:10,305 --> 00:07:14,309 దీనితో తీవ్రమైన వాతావరణం నుండి అడవిలోని ఆ పాడుబడిన క్యాబిన్ 108 00:07:14,393 --> 00:07:15,519 అతనికి రక్షణ కల్పిస్తోంది. 109 00:07:18,689 --> 00:07:21,233 మీ అమ్మకీ నాకూ ఈ రోజు రోవర్ లో ఒక కీలకమైన సంఘటన జరిగింది. 110 00:07:22,401 --> 00:07:24,111 భూమి మీదికి వెళ్ళడానికి ఏదైనా వార్మ్ హోల్ కనిపించిందా? 111 00:07:24,736 --> 00:07:28,073 మార్స్ గ్రహం నేల కింద నీటి ప్రవాహం ఉందని మేము దాదాపు ఖరారు చేయగలిగాం. 112 00:07:28,156 --> 00:07:30,576 మా ప్రయోగనౌక ఆ గ్రహంలో దాదాపు కిలోమీటరు లోతుకు వెళ్లింది. 113 00:07:31,118 --> 00:07:33,453 అక్కడ గనుక భూగర్భ సరస్సు ఉంటే, అది మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. 114 00:07:33,537 --> 00:07:35,747 మన మానవాళికి అవసరమైన మూలవనరు అది. 115 00:07:35,831 --> 00:07:40,627 సూక్ష్మ జీవులు, మార్స్ సముద్రం, ఇవన్నీ అక్కడ మనుషులు నివసించడానికి అవసరమైనవి. 116 00:07:40,711 --> 00:07:42,171 సరే, ఈ రోజు స్కూల్ లో ఎలా గడిచింది? 117 00:07:43,881 --> 00:07:45,048 బాగుంది. 118 00:07:45,132 --> 00:07:48,135 నువ్వు, కేసీ కలిసి రూపొందిస్తున్న ఆ పాట ఎలా వస్తోంది? 119 00:07:48,218 --> 00:07:51,305 రేపు అతని పని పూర్తయ్యాక మేము ఆ పాటని రికార్డు చేయబోతున్నాము. 120 00:07:51,930 --> 00:07:53,015 నీకు శ్రోతలు కావాలా? 121 00:07:53,891 --> 00:07:54,892 వద్దు. 122 00:07:54,975 --> 00:07:57,144 -ఓహ్, ఇలా చూడు. -క్రికెట్. 123 00:08:00,272 --> 00:08:01,356 వాతావరణ హెచ్చరిక. 124 00:08:04,276 --> 00:08:05,611 వాతావరణ హెచ్చరిక. 125 00:08:05,694 --> 00:08:07,571 వెదర్ రోవర్ ఒక తుపానుని గమనిస్తోంది. 126 00:08:07,654 --> 00:08:10,532 ఇది ఏ క్యాటగిరీలో చిన్నది. ఇక్కడికి దాదాపు 14 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. 127 00:08:12,034 --> 00:08:15,621 ఈ ఇసుక తుఫాను సర్దుమణిగే వరకూ కేసీ, అతని కుటుంబం 128 00:08:15,704 --> 00:08:17,497 ఇక్కడికి తమ సందర్శనని వాయిదా వేసుకుంటే మంచిది. 129 00:08:18,290 --> 00:08:21,502 ఆ తుపాను వెళ్లిపోయాక మన ఇల్లు ఎలా ఉంటుందో చూసి, అప్పుడు వాళ్ల రాకని మళ్లీ షెడ్యూల్ చేద్దాం. 130 00:08:22,711 --> 00:08:23,712 ఎంత కాలం? 131 00:08:26,215 --> 00:08:28,759 -బగ్, అది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది… -ఎంత కాలం? 132 00:08:29,760 --> 00:08:32,179 మూడు వారాలు. బహుశా రెండు. 133 00:08:34,097 --> 00:08:36,642 నాకు కావలసిందల్లా నా ఫ్రెండ్ తో కొద్ది గంటలు గడపడమే. 134 00:08:37,142 --> 00:08:38,434 అది చాలా పెద్ద కోరిక అంటారా? 135 00:08:39,227 --> 00:08:43,357 మనం పూర్తిగా వేరే గ్రహం మీద ఉన్నాం, అయినా వాతావరణం మనకి అడ్డం పడుతోందా? 136 00:08:44,107 --> 00:08:45,484 నిజంగానా? 137 00:08:45,567 --> 00:08:47,819 -సారీ, క్రికెట్. -సారీ. 138 00:08:48,362 --> 00:08:50,864 అవును. నేను కూడా. 139 00:09:05,546 --> 00:09:08,966 సరే. టెక్నికల్ గా ఇది వాళ్ల తప్పు కాదన్న విషయం నీకు తెలుసు. 140 00:09:09,842 --> 00:09:12,511 నా ఉద్దేశం, మనం కొన్ని నెలలుగా ఈ పని గురించి కష్టపడుతున్నాం. 141 00:09:12,594 --> 00:09:13,762 ఇంకో రెండు వారాలు పడితే ఏంటి నష్టం? 142 00:09:13,846 --> 00:09:16,056 వాతావరణ మార్పు కోసం ఎవరో ఒకరు ఏదో చేస్తున్నారని 143 00:09:16,139 --> 00:09:19,476 ప్రజలు ఎంత ఆశపడుతున్నారో నీకు తెలుసా? 144 00:09:19,977 --> 00:09:21,645 కానీ, అది ఎవరో కాదు, మనమే. 145 00:09:22,479 --> 00:09:24,773 కానీ కొన్నిసార్లు నేను వేరెవరిలాగో ఉండాలనుకోను. 146 00:09:25,607 --> 00:09:26,608 నేను ఒప్పుకుంటాను. 147 00:09:26,692 --> 00:09:30,696 ఇప్పుడు మనం ఆ టాలెంట్ షో ని మిస్ కాబోతున్నాం. అది మరో రెండు రోజుల్లో ఉంది. 148 00:09:30,779 --> 00:09:32,406 మనం ఇప్పటికీ వేరువేరుగా రికార్డు చేయచ్చు. 149 00:09:33,699 --> 00:09:35,576 మనుషులు ఈ పాటికి భూమిని ముక్కలు చేసి ఉండరని ఆశిస్తాను. 150 00:09:37,202 --> 00:09:39,121 -అందుకు ఎంతో సమయం లేదు. -బహుశా అది నిజం. 151 00:09:44,084 --> 00:09:47,796 సరే. నేను ఆ పదాలను ఇలా స్వరపరిచాను. వింటావా? 152 00:09:48,922 --> 00:09:50,132 వాయించు. 153 00:09:52,718 --> 00:09:58,515 ఒక ఒంటరి గ్రహంలో హాలోగ్రామ్స్ మాదిరిగా, మేము కేవలం నాట్యమాడే కిరణాలం 154 00:09:58,599 --> 00:10:02,436 నువ్వు ఉన్న చోటనే ఉంటూ నా చేతిని అందుకోగలవు 155 00:10:02,936 --> 00:10:06,607 నా చేయి పట్టుకో మనం విశ్వం అంతా పరిగెడదాం 156 00:10:06,690 --> 00:10:09,067 ప్రతిధ్వనుల మాదిరిగా, ఎప్పటికీ విడిచిపెట్టకు 157 00:10:09,151 --> 00:10:11,403 వంద మిలియన్ మైళ్లు 158 00:10:11,486 --> 00:10:13,947 చిరునవ్వు కంటే మరింత అందంగా 159 00:10:14,031 --> 00:10:16,617 నేను కొద్దిసేపటిలో అక్కడికి వస్తాను 160 00:10:16,700 --> 00:10:21,747 మనం నిండు చందమామని తదేకంగా చూస్తూ ఎవరూ లేని ఏకాంతంలో నువ్వూ నేనూ గడపచ్చు 161 00:10:22,289 --> 00:10:24,499 ఆ వెలుగులో, మనం కూడా మెరుస్తాం 162 00:10:25,501 --> 00:10:28,337 ఆగు, మనం బంగారు వన్నె గలవాళ్లం 163 00:10:30,005 --> 00:10:31,757 హేయ్, బాబు. నువ్వు వస్తున్నావా? 164 00:10:31,840 --> 00:10:33,300 నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను. 165 00:10:35,135 --> 00:10:37,596 నేను వెళ్లి మా నాన్నతో చెస్ మ్యాచ్ ఆడాలి. అది ప్రతీకార మ్యాచ్. 166 00:10:39,348 --> 00:10:41,266 గుడ్ నైట్ చెప్పడం మర్చిపోవద్దు. 167 00:10:41,350 --> 00:10:42,351 నేను మర్చిపోను. 168 00:11:05,874 --> 00:11:09,294 టవలెట్ రేషన్ 169 00:11:26,061 --> 00:11:27,187 గుడ్ నైట్, ఫ్రెండ్. 170 00:11:34,111 --> 00:11:35,904 ఈ రోజు ఇంటి పనులు చేస్తున్నందుకు థాంక్స్, బగ్. 171 00:11:36,405 --> 00:11:37,406 మరేం ఫర్వాలేదు. 172 00:11:37,948 --> 00:11:40,742 మేం ఆ తవ్విన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని తుపాను వచ్చేలోగా తిరిగి వచ్చేస్తాం. 173 00:11:43,120 --> 00:11:44,371 నువ్వు బాగానే ఉన్నావు కదా? 174 00:11:44,913 --> 00:11:45,914 ఖచ్చితంగా. 175 00:11:47,291 --> 00:11:49,918 -మర్చిపోవద్దు… -నా మంచం సర్దుకోవాలి. మర్చిపోను. 176 00:12:14,318 --> 00:12:16,111 ఆ గ్రిల్డ్ చీజ్ చూడటానికి అద్భుతంగా ఉంది. 177 00:12:17,487 --> 00:12:20,032 స్కూలులో ఊహాజనితమైన లంచ్ ఏర్పాటు చేయడానికి అసలు కారణం 178 00:12:20,115 --> 00:12:21,909 మనం ఒంటరితనం ఫీల్ అవ్వకూడదని, 179 00:12:21,992 --> 00:12:26,413 కానీ నిజానికి, ఇది మన సొంత ఊరికి ఎంత దగ్గరగా ఉంటే, నేను దానిని అంతగా మిస్ అవుతుంటాను. 180 00:12:28,415 --> 00:12:32,044 సరే. నిన్ను నవ్వించడానికి నా దగ్గర ఒక జోక్ ఉంది. ఇది విను. 181 00:12:32,794 --> 00:12:35,714 ఎలియన్స్ మన సౌర కుటుంబానికి ఇంకా ఎందుకు రాలేదు? 182 00:12:36,715 --> 00:12:39,593 వాళ్లు రివ్యూలు చదివారు. వన్ స్టార్. 183 00:12:42,095 --> 00:12:43,680 మొదటగా, "దాన్ని చెక్ చేయాలి" అంటారా? 184 00:12:44,264 --> 00:12:47,976 రెండో విషయం, పదమూడేళ్ల వయస్సులోనే మీ నాన్న చెప్పే జోకులు నీకెలా తెలుసు? 185 00:12:48,060 --> 00:12:49,102 నిన్ను నవ్వించానుగా. 186 00:12:49,186 --> 00:12:50,896 నిన్ను చూసి నవ్వుతున్నాను. నీ జోక్ గురించి కాదు. 187 00:12:50,979 --> 00:12:52,439 కానీ ప్రయత్నించినందుకు థాంక్స్. 188 00:12:54,942 --> 00:12:56,860 నువ్వు ఎప్పుడూ ఇంత ఆశావాదిగా ఎలా ఉండగలవు? 189 00:12:57,819 --> 00:12:58,904 అది ఒక ఛాయిస్, అనుకుంటా. 190 00:13:03,408 --> 00:13:04,826 నిన్ను ఒక విషయం అడగచ్చా? 191 00:13:05,327 --> 00:13:06,495 అడుగు. 192 00:13:06,578 --> 00:13:09,623 నీ తల్లిదండ్రులపై ఎప్పుడైనా అసహనం వ్యక్తం చేశావా? 193 00:13:09,706 --> 00:13:11,625 -ఎప్పుడూ చేస్తూనే ఉంటా. -కేసీ. 194 00:13:12,459 --> 00:13:13,460 సారీ. 195 00:13:14,044 --> 00:13:17,631 అంటే, వాళ్లు మనల్ని ఇక్కడికి తీసుకువచ్చినందుకు నువ్వు ఎప్పుడైనా అసహనం వ్యక్తం చేశావా? 196 00:13:18,924 --> 00:13:20,759 కొన్నిసార్లు నేను ఒక లగేజ్ అనిపిస్తుంది. 197 00:13:20,843 --> 00:13:22,219 లేదా మాట్లాడే మొక్కని అనిపిస్తుంది. 198 00:13:24,054 --> 00:13:25,973 చూడు, మనం ఏం చేస్తున్నామో నేను అర్థం చేసుకోగలను, 199 00:13:26,557 --> 00:13:31,937 ఇది చాలా ముఖ్యమైన పని, కానీ నేను తాజా గాలిని ఇంకా పరిగెత్తడాన్ని మిస్ అవుతున్నాను. 200 00:13:35,691 --> 00:13:36,942 నా ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను. 201 00:13:38,318 --> 00:13:39,319 నేను నీ ఫ్రెండ్ ని. 202 00:13:40,320 --> 00:13:45,701 నాకు తెలుసు. నేను సొంత ఇంటిని మిస్ అవుతున్నాను. అంతే. 203 00:13:46,743 --> 00:13:49,872 చూడు, నీ కంటే ఎక్కువగా నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. 204 00:13:51,331 --> 00:13:53,208 కానీ, అంటే, మనం ఏం చేయగలం? 205 00:13:53,834 --> 00:13:56,795 నాకు తెలుసు. సారీ. 206 00:13:58,088 --> 00:13:59,590 నేను ఏం ఆలోచిస్తున్నానో తెలుసా? 207 00:13:59,673 --> 00:14:02,676 మనం వాస్తవాన్ని గ్రహించి, ఉన్నదానిని సద్వినియోగం చేసుకోగలమేమో. 208 00:14:04,970 --> 00:14:05,971 బహుశా నువ్వు సరిగ్గా చెప్పావు. 209 00:14:07,306 --> 00:14:09,433 పాట రెండవ భాగంలో కోరస్ గురించి నాకు ఒక ఆలోచన వచ్చిందనుకుంటా, 210 00:14:09,516 --> 00:14:11,059 మనం దానిని తరువాత రికార్డు చేద్దాం. 211 00:14:12,352 --> 00:14:15,272 మనం నిండు చందమామని తదేకంగా చూద్దాం 212 00:14:16,064 --> 00:14:18,734 ఎవరూ లేని ఏకాంతంలో నువ్వూ నేనూ గడుపుదాం 213 00:14:19,318 --> 00:14:21,904 ఆ వెలుగులో, మనం కూడా మెరుస్తాం 214 00:14:22,738 --> 00:14:26,158 ఆగు, మనం బంగారు వన్నె గలవాళ్లం 215 00:14:26,241 --> 00:14:29,745 ఇంక మనం పాలపుంతని అనుసరించగలం 216 00:14:30,245 --> 00:14:34,374 మనతో ఆడటానికి నక్షత్రాలు వస్తానంటున్నాయి 217 00:14:34,958 --> 00:14:38,378 మరో రోజు వెలుగుని మనం అందుకుందాం 218 00:14:38,462 --> 00:14:42,716 అందుకే ఆగిపో, మనం దాదాపు ఇంటిని చేరుకున్నాం 219 00:14:43,300 --> 00:14:45,302 రెండో భాగాన్ని కోరస్ లా పాడు. 220 00:14:47,638 --> 00:14:50,682 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 221 00:14:50,766 --> 00:14:52,976 తారామండలంలో 222 00:14:53,060 --> 00:14:56,647 మన కలల పటాన్ని గీద్దాము 223 00:14:56,730 --> 00:15:01,860 అది అస్పష్టంగా ఉండచ్చు, కానీ చీకటి రాత్రిలో మనం దానిని స్పష్టంగా చూడచ్చు 224 00:15:01,944 --> 00:15:04,196 మన ఉద్దేశాలు, కోల్పోయిన అనుబంధాలు 225 00:15:04,279 --> 00:15:06,240 మనం కేవలం అలా తేలిపోతున్నాము 226 00:15:06,990 --> 00:15:11,828 ఎంతో సజీవంగా ఉన్నామనుకుంటూ అవును, మనం ఎగిరిపోతున్నాము 227 00:15:11,912 --> 00:15:16,917 మనం నిండు చందమామని తదేకంగా చూద్దాం ఇక్కడ ఎవరూ లేరు నువ్వూ నేను తప్ప 228 00:15:17,626 --> 00:15:23,048 ఆ వెలుగులో, మనం కూడా మెరుస్తాం ఆగు, మనం బంగారు వన్నె గలవాళ్లం 229 00:15:23,131 --> 00:15:24,967 ఇంక మనం పాలపుంతని అనుసరించగలం 230 00:15:25,551 --> 00:15:27,594 మనతో ఆడటానికి నక్షత్రాలు బయటకొస్తున్నాయి 231 00:15:28,470 --> 00:15:30,264 -మరో రోజు వెలుగు -కేసీ? 232 00:15:31,181 --> 00:15:34,977 ఆగు, మనం దాదాపు ఇంటికి చేరుకున్నాం 233 00:15:36,311 --> 00:15:38,647 కేసీ! కేసీ… 234 00:15:38,730 --> 00:15:40,148 కేసీ? 235 00:15:44,528 --> 00:15:45,737 స్టార్ట్ స్టాప్ 236 00:15:55,330 --> 00:15:56,582 ఓహ్, లేదు. 237 00:15:56,665 --> 00:15:59,209 క్రికెట్, ఇది డి కేటగిరి. 238 00:15:59,293 --> 00:16:02,087 ఢీ కొనడానికి సిద్ధంగా ఉండండి. మెయిన్ హబ్. వెంటనే! 239 00:16:07,342 --> 00:16:08,802 -కిటికీ అద్దాలు పైకెత్తు. -అలాగే. 240 00:16:11,013 --> 00:16:14,433 -బ్యాకప్ జనరేటర్ ని ప్రారంభించు. ఎయిర్ లాక్స్ మూసేయి. -మూసేస్తున్నా. 241 00:16:14,516 --> 00:16:15,976 ఎయిర్ లాక్స్ మూతబడుతున్నాయి. 242 00:16:17,269 --> 00:16:18,270 మూతపడ్డాయి. 243 00:16:19,688 --> 00:16:22,232 వెదర్ రోవర్ కి ఏం అయింది? అది మనల్ని ఎందుకు హెచ్చరించలేదు? 244 00:16:22,316 --> 00:16:24,526 అది రీడింగ్స్ ని ప్రసారం చేసే లోగానే ధ్వంసం అయిపోయి ఉంటుంది. 245 00:16:24,610 --> 00:16:27,487 నీళ్లు, సోలార్, ఎకో, అన్నీ బాగున్నాయి. 246 00:16:27,988 --> 00:16:29,072 మన హాబిటాట్ పూర్తిగా సీల్ అయిపోయింది. 247 00:16:31,116 --> 00:16:34,411 ప్రమాదం చేరువలో ఉంది. ప్రమాదం చేరువలో ఉంది. 248 00:16:35,704 --> 00:16:37,247 ఢీ కొనడానికి సిద్ధం కండి. 249 00:16:38,040 --> 00:16:39,416 ఢీకొనడానికి సిద్ధం కండి. 250 00:16:40,792 --> 00:16:41,710 హాబిటాట్ కంట్రోల్ సెంటర్ 251 00:17:00,187 --> 00:17:01,688 కనెక్షన్ తెగిపోయింది 252 00:17:02,564 --> 00:17:04,273 భూమితో కమ్యూనికేషన్ ని మనం కోల్పోయాం. 253 00:17:10,489 --> 00:17:11,949 సిగ్నల్ సామర్థ్యం సిగ్నల్ కోల్పోయింది 254 00:17:19,957 --> 00:17:21,165 లేదు. 255 00:17:22,041 --> 00:17:24,336 కేసీ హాబిటాట్ చీకటిగా ఉంది. మనం వాళ్లకి సాయపడాలి. 256 00:17:24,419 --> 00:17:26,922 ఆగు, క్రికెట్. ఆక్సిజన్ తగ్గిపోతోంది. 257 00:17:27,005 --> 00:17:28,173 డ్రోన్ బాగానే ఉంది. 258 00:17:28,257 --> 00:17:30,259 అమ్మా, మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి వాళ్లు బాగున్నారేమో చూద్దామా? 259 00:17:30,342 --> 00:17:33,846 బగ్, విను. రోవర్ బే డోర్ తెరుచుకోవడం లేదు, ఇంకా ఆక్సిజన్ కూడా లీక్ అవుతోంది. 260 00:17:33,929 --> 00:17:37,057 నీటి నిల్వలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ రోవర్ పని చేస్తుందో లేదో కూడా తెలియదు. 261 00:17:37,140 --> 00:17:38,350 నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలి 262 00:17:38,433 --> 00:17:40,978 అలాగే గాలి పీల్చడం కోసం ఎలక్ట్రాలిసిస్ మెషీన్ ని మళ్లీ ప్రారంభించాలి. 263 00:17:41,061 --> 00:17:42,980 ఈ వనరులు లేకపోతే, మనం చాలా సమస్యల్లో ఉంటాం. 264 00:17:43,063 --> 00:17:45,566 వేరే వాళ్లకి సాయపడటానికి ముందు మన సంగతి మనం చూసుకోవాలి. 265 00:17:45,649 --> 00:17:48,235 ప్రస్తుతానికి, ముందుగా మనం నీటి వ్యవస్థని పునరుద్ధరించాలి. 266 00:17:48,819 --> 00:17:52,656 మన పరిస్థితిని చక్కదిద్దుకున్నాక, కేసీ మీద దృష్టి సారిద్దాం. సరేనా? 267 00:17:52,739 --> 00:17:54,116 యాక్సెస్ ప్యానెల్ బయట ఉంది. 268 00:17:54,199 --> 00:17:56,952 మనం అక్కడికి చేరుకోలేం. ఎయిర్ లాక్ తలుపులు బిగుసుకుపోయాయి. 269 00:18:06,461 --> 00:18:09,006 మనం ఈ సొరంగం గుండా ఆ ప్యానెల్ ని చేరుకుని, 270 00:18:09,506 --> 00:18:11,466 నీటి ప్రవాహాన్ని వేరే ఛానెల్ కి మళ్లిస్తే ఎలా ఉంటుంది? 271 00:18:11,550 --> 00:18:13,302 మనిషి ప్రవేశించేంత పెద్దగా ఇది ఉండదు. 272 00:18:14,178 --> 00:18:16,471 నేను చేయగలను. ఒక ఎలుక మాదిరిగా. 273 00:18:45,792 --> 00:18:47,461 -షూట్. -క్రికెట్. 274 00:18:47,544 --> 00:18:49,338 -మనం తనని బయటకు లాగాలి. -ఆగండి. 275 00:18:54,760 --> 00:18:55,761 నేను బాగానే ఉన్నాను. 276 00:18:58,055 --> 00:18:59,473 సరే. 277 00:19:00,724 --> 00:19:02,017 యాక్సెస్ ప్యానెల్ 278 00:19:10,734 --> 00:19:12,611 నీటి ప్రవాహం మళ్లీ ప్రారంభించబడింది. 279 00:19:15,030 --> 00:19:16,740 వాటర్ ప్రెజర్ స్థిరంగా అవుతోంది. 280 00:19:26,625 --> 00:19:28,252 భూమి నుండి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 281 00:19:29,461 --> 00:19:31,004 మరి ఆక్సిజన్ లీక్ సంగతి ఏంటి? 282 00:19:31,588 --> 00:19:33,966 గార్డెన్ ఎయిర్ లాక్ ని మేము సీల్ చేసేశాము. అది అదుపులో ఉంది. 283 00:19:36,093 --> 00:19:37,427 మరి అన్ని మొక్కలు చనిపోతే ఏంటి? 284 00:19:38,220 --> 00:19:42,307 అది మన పనిని తీవ్రంగా దెబ్బతీస్తుంది, కానీ మనం బాగానే ఉంటాం. 285 00:19:42,933 --> 00:19:45,227 కేవలం మళ్లీ మొక్కలు నాటి మొదటి నుండి మొదలుపెట్టాలి. 286 00:19:45,310 --> 00:19:47,688 తరువాత సప్లయ్ డ్రాప్ నాటికి కొత్త మొక్కలు ఆర్డర్ చేయాలి. 287 00:19:47,771 --> 00:19:48,814 కొత్త ఎకో సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. 288 00:19:49,773 --> 00:19:51,483 ఇప్పుడు, మన సొంత భూమి పరిస్థితి అంత తేలికగా లేదు. 289 00:19:51,567 --> 00:19:54,528 అవును. మొక్కలు ఆర్డర్ చేయడానికి మరొక భూమి లేదు. 290 00:19:54,611 --> 00:19:57,155 మరి కేసీ? 291 00:19:58,657 --> 00:20:01,159 వాళ్లు కూడా సరిగ్గా మనం చేసిన విధంగానే అన్ని ప్రక్రియలు చేసి ఉంటారు. 292 00:20:01,785 --> 00:20:03,912 వాళ్లతో మాట్లాడటానికి కనీసం ఒక ప్రయత్నం చేద్దామా? 293 00:20:03,996 --> 00:20:05,789 కమ్యూనికేషన్ల వ్యవస్థ పని చేయడం లేదు. 294 00:20:05,873 --> 00:20:07,332 మనం సూర్యరశ్మిని కూడా కోల్పోతున్నాం. 295 00:20:07,416 --> 00:20:10,252 కాబట్టి, మనం కరెంట్ సరఫరాని ఆపేసి, ప్రతి కిలోవాట్ విద్యుత్ ని ఆదా చేయాలి. 296 00:20:12,588 --> 00:20:13,881 రేపు కలుద్దాం, బగ్. 297 00:20:53,128 --> 00:20:54,296 గుడ్ నైట్, ఫ్రెండ్. 298 00:20:58,091 --> 00:20:59,176 హేయ్. 299 00:20:59,259 --> 00:21:01,011 అతను తిరిగి సిగ్నల్ ఇవ్వలేదు. 300 00:21:03,430 --> 00:21:04,890 అతను ఎప్పుడూ సిగ్నల్ ఇచ్చేవాడు. 301 00:21:07,851 --> 00:21:11,563 కేసీ బహుశా జోక్స్ చెబుతూ 302 00:21:12,064 --> 00:21:14,399 వాళ్ల నాన్నతో కలిసి ఫ్లాష్ లైట్ లో చెస్ ఆడుతుంటాడు. 303 00:21:17,694 --> 00:21:22,658 ఈ రోజు మన చేయి దాటిపోయింది. రేపు మనం ఏదో ఒకటి చేద్దాం, ప్రామిస్. 304 00:21:26,537 --> 00:21:27,746 ఐ లవ్యూ, అమ్మా. 305 00:21:29,164 --> 00:21:30,457 నక్షత్రాల వరకూ వెళ్లి వద్దామా? 306 00:21:30,541 --> 00:21:31,834 నక్షత్రాల వరకూ వెళ్లి వద్దాం. 307 00:21:43,136 --> 00:21:44,972 ఆక్సిజన్ లీక్ కనుక్కున్నాను. దాన్ని సీల్ చేశాను. 308 00:21:45,722 --> 00:21:47,891 మొక్కలు బాగానే ఉన్నాయి, డ్రోన్స్ పాలినేట్ చేస్తున్నాయి. 309 00:21:47,975 --> 00:21:51,603 మనం మరొక హాబిటాట్ కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లలేం. సారీ, క్రికెట్. 310 00:21:52,396 --> 00:21:55,524 లోపలి తలుపు ఎలాగో తీయగలిగాను, కానీ రోవర్ లో వెళ్లడం అనేది కుదరని పని. 311 00:21:55,607 --> 00:21:57,985 బే కెమెరాలో అది కనిపించడం లేదు. బలమైన గాలలు దానిని నెట్టేసి ఉంటాయి. 312 00:21:58,068 --> 00:21:59,945 కాబట్టి, మనం లోపలే లాక్ అయిపోయాం. 313 00:22:00,028 --> 00:22:01,446 హెచ్చరిక. ఆక్సిజన్ లీక్ తెలిసింది. 314 00:22:01,530 --> 00:22:04,283 వేరే హాబిటాట్ లో ఎక్కువ ఆక్సిజన్ లీక్స్ ఉన్నట్లు లైఫ్ సపోర్ట్ చూపిస్తోంది. 315 00:22:04,366 --> 00:22:05,993 -క్లిష్టంగా ఉందా? -ఇంకా లేదు. 316 00:22:08,954 --> 00:22:10,205 డ్రోన్ పరిస్థితి ఏంటి? 317 00:22:10,873 --> 00:22:12,165 ఇప్పుడు ఆ విషయం దేనికి? 318 00:22:12,249 --> 00:22:14,543 అంటే, అవి బాగున్నాయో లేదో కనీసం మనం చూడనక్కర లేదా? 319 00:22:15,586 --> 00:22:18,505 బగ్, మన దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి. దానికి ప్రత్యామ్నాయం కూడా మన దగ్గర లేదు. 320 00:22:18,589 --> 00:22:21,300 -మనం తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించాలి. -మనం దానిని తరువాత పరిశీలిద్దాం. 321 00:22:21,383 --> 00:22:23,844 అవునా, మ్యాక్స్? అంటే, వాళ్ల ఆక్సిజన్ గురించే నా ఆందోళన. 322 00:22:25,762 --> 00:22:26,763 నాకు ఇది అర్థమయింది. 323 00:22:28,515 --> 00:22:29,892 అమ్మా, నేను ఈ పని చేయగలను. 324 00:22:31,518 --> 00:22:33,020 అది ఒకే దెబ్బకి పరిష్కారం అయిపోతుంది. 325 00:22:33,896 --> 00:22:35,898 -క్రికెట్… -అతను నా బెస్ట్ ఫ్రెండ్. 326 00:22:41,486 --> 00:22:43,030 లిఫ్ట్ ఆఫ్ ప్రారంభించబడింది. 327 00:22:49,077 --> 00:22:50,287 బాగా చేశావు, బగ్. 328 00:22:51,580 --> 00:22:52,581 దాదాపు వచ్చేశాం. 329 00:22:53,081 --> 00:22:54,374 నీ క్షితిజాన్ని చూసుకో. 330 00:22:59,129 --> 00:23:02,341 రేంజ్ హెచ్చరిక. డ్రోన్ కి ట్రాన్స్ మిషన్ కావడం లేదు. 331 00:23:05,260 --> 00:23:08,180 పరిస్థితి క్లిష్టంగా ఉంది. డ్రోన్ ఆఫ్ లైన్ అయింది. 332 00:23:08,263 --> 00:23:09,723 లేదు! 333 00:23:16,271 --> 00:23:20,484 ఆ పరికరానికి ప్రత్యామ్నాయం కూడా లేదు, అమహ్లే. అది పోయింది. 334 00:23:21,902 --> 00:23:24,071 అది మూర్ఖత్వం. సారీ. 335 00:23:24,154 --> 00:23:26,073 ఎయిర్ లాక్ పాడవ్వడంతో మనం లోపల ఇరుక్కుపోయాం, 336 00:23:26,156 --> 00:23:28,033 ఇక ఇప్పుడు డ్రోన్ లేకపోవడంతో మనం ఏమీ చూడలేకుండా ఉన్నాం. 337 00:23:28,867 --> 00:23:33,413 -మనం ఇంక ఎలాంటి రిస్కులు తీసుకోలేం. -మన విషయం గురించే మనం ఆలోచించాలి. అంతే. 338 00:23:34,831 --> 00:23:36,917 మనం ఆలోచించవలసింది ఇలా కాదు. 339 00:23:38,252 --> 00:23:41,338 ఈ మొత్తం ప్రయోగం, మీరు నాకు నేర్పించిన దాన్ని బట్టి 340 00:23:41,421 --> 00:23:43,966 మనం మార్స్ గ్రహం మీద ఉండటానికి కారణం మానవాళికి సాయపడటం కోసం. 341 00:23:44,466 --> 00:23:46,844 జనం ప్రాణాలు కాపాడటం కోసం ఒక ప్రాణాధారాన్ని సృష్టించడం మన లక్ష్యం. 342 00:23:47,553 --> 00:23:50,806 ప్రతి చిన్న పని ప్రభావాన్ని చూపుతుంది. అవునా? 343 00:23:51,807 --> 00:23:52,891 -అవును. -అది నిజం. 344 00:23:53,433 --> 00:23:56,103 అయితే, ఇప్పుడు, అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. 345 00:23:57,437 --> 00:24:01,692 కేసీ తిరిగి సిగ్నల్ ఇవ్వడం లేదు. వాళ్లకి ఆక్సిజన్ అయిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? 346 00:24:05,195 --> 00:24:06,905 వాళ్లకి ఏదైనా అవసరం ఉందేమోనని మనం తెలుసుకోవాలి. 347 00:24:07,990 --> 00:24:09,157 క్రికెట్. 348 00:24:09,241 --> 00:24:11,910 నిజంగానా? మనం కనీసం ప్రయత్నం కూడా చేయమా? 349 00:24:13,495 --> 00:24:16,665 మనమే ఆ పరిస్థితిలో ఉంటే ఏంటి? నేనే ఆ పరిస్థితిలో ఉంటే ఏంటి? 350 00:24:17,916 --> 00:24:19,501 మీరు నన్ను కాపాడటానికి రారా? 351 00:24:21,044 --> 00:24:23,380 బగ్, రోవర్ పాడయిపోయింది. 352 00:24:23,463 --> 00:24:26,175 మనం ఎయిర్ లాక్ పాడయిపోయి లోపల లాక్ అయిపోయి ఉన్నాం. 353 00:24:27,676 --> 00:24:29,303 మనం ఎలా సాయం చేయగలం అంటావు? 354 00:24:30,012 --> 00:24:31,013 మనం నడుద్దాం. 355 00:24:35,184 --> 00:24:36,810 మన దగ్గర ఉన్న ఆక్సిజన్ సరఫరా. 356 00:24:37,311 --> 00:24:40,189 అక్కడికి చేరుకోవడానికి ఆరున్నర గంటలు పడుతుంది. 357 00:24:40,898 --> 00:24:45,235 అంతవరకే సరిపోతుంది. కానీ అది ఒక వైపు ప్రయాణానికే వస్తుంది. 358 00:24:46,278 --> 00:24:48,488 పాడయిపోయిన మెయిన్ ఎయిర్ లాక్ ని మనం కష్టం మీద తెరిస్తే గనుక, 359 00:24:48,572 --> 00:24:49,907 హాబిటాట్ లో ఉన్న గాలి అంతా పోతుంది. 360 00:24:49,990 --> 00:24:53,911 దాన్ని మనం మళ్లీ మూయలేకపోతే, ఇంక మనం ఇక్కడికి తిరిగి రాలేము. 361 00:24:55,662 --> 00:24:57,539 అమ్మా, నువ్వు ఈ పనిని చేయగలవు. 362 00:24:58,123 --> 00:25:01,251 మనం ఇది సాధించగలం. మనం చేయగలమని నాకు తెలుసు. 363 00:25:43,544 --> 00:25:45,462 డీప్రెజరైజేషన్ ప్రారంభించబడింది. 364 00:26:34,261 --> 00:26:35,554 మామ్స్? 365 00:26:39,391 --> 00:26:41,560 ఇది నమ్మలేకుండా ఉంది. 366 00:26:45,522 --> 00:26:46,815 మనం అసలు వెళ్లనే లేదా? 367 00:26:48,192 --> 00:26:49,276 అది నీకు తెలుసా? 368 00:26:50,777 --> 00:26:51,778 లేదు! 369 00:26:52,487 --> 00:26:54,239 నిజంగా తెలియదు. 370 00:26:56,575 --> 00:26:57,576 క్రికెట్. 371 00:27:05,918 --> 00:27:07,753 అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? 372 00:27:07,836 --> 00:27:11,423 నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు ఆందోళన పడ్డావా? అంటే, నేను… 373 00:27:11,507 --> 00:27:13,592 నేను ఆందోళన పడ్డాను అనుకుంటా, కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను. 374 00:27:13,675 --> 00:27:15,427 ప్రస్తుతం నేను అన్ని రకాలుగా ఫీల్ అవుతున్నాను. 375 00:27:16,345 --> 00:27:18,555 నాకు కోపంగా ఉంది కానీ సంతోషంగా కూడా ఉంది. 376 00:27:20,182 --> 00:27:21,433 నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. 377 00:27:22,017 --> 00:27:23,352 నువ్వు బాగున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 378 00:27:26,855 --> 00:27:28,065 మీ పేరెంట్స్ ఎక్కడ? 379 00:27:28,148 --> 00:27:31,068 వాళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మేము కూడా ఇప్పుడే ఈ విషయం తెలుసుకున్నాం. 380 00:27:32,069 --> 00:27:36,365 నేను రోవర్ ని పద్నాలుగు నెలలు నడిపాను. 381 00:27:37,491 --> 00:27:41,245 అది ఒక సిములేషన్. హైడ్రాలిక్స్ తో కూడిన ఒక స్టేషనరీ వీడియో గేమ్. 382 00:27:41,912 --> 00:27:43,747 ఈ ప్రయోగం ఉద్దేశం ఏమిటంటే 383 00:27:43,830 --> 00:27:46,625 మార్స్ గ్రహం మీద ఒత్తిళ్లతో ఒక కుటుంబం ఎలా మనుగడ సాగిస్తుందో తెలుసుకోవడం. 384 00:27:46,708 --> 00:27:48,836 క్లిష్ట పరిస్థితిని ఆ కుటుంబం కలిసి ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోవడం. 385 00:27:50,963 --> 00:27:54,883 నేను… మాకు అర్థమైంది అనుకుంటా. 386 00:27:55,717 --> 00:27:58,136 నా మెదడు ప్రస్తుతం మొద్దుబారిపోయినట్లుంది. 387 00:27:58,720 --> 00:28:02,516 మీరు సమయోచితంగా ప్రవర్తించారు, టీమ్ వర్క్ ని, మానవాళి పట్ల మీకు ఉన్న అంకితభావాన్ని చాటారు. 388 00:28:02,599 --> 00:28:04,726 అన్ని ముఖ్యమైన ప్రయోగాలలో మీరు అద్భుతంగా రాణించారు. 389 00:28:04,810 --> 00:28:09,439 మార్స్ లో నివాసం ఉండి, మానవాళి మనుగడను కొనసాగించడానికి మీలాంటి కుటుంబం మాకు అవసరం. 390 00:28:10,399 --> 00:28:12,150 మేము వెళ్లకూడదు అనుకుంటే ఏంటి? 391 00:28:14,236 --> 00:28:16,989 మార్స్ ఒక లైఫ్ బోట్ కాదు. అది ఒక పాఠం. 392 00:28:19,408 --> 00:28:23,453 మేము కార్బన్ న్యూట్రల్, జీరో వేస్ట్ జీవితాన్ని పద్నాలుగు నెలల పాటు గడిపాము. 393 00:28:24,204 --> 00:28:27,457 ఈ మొత్తం కాలంలో అసలైన త్యాగం ఏమిటంటే, ఒంటరితనం. 394 00:28:28,917 --> 00:28:31,837 మనం శుభ్రంగా జీవించడం కోసం మార్స్ వరకూ వెళ్లడం దేనికి? 395 00:28:32,880 --> 00:28:34,923 మనం అలాంటి పనులన్నీ ఈ భూమి మీదనే చేస్తే, 396 00:28:35,007 --> 00:28:36,800 మన రెండు గ్రహాలకు కూడా మేలు జరుగుతుంది. 397 00:28:38,177 --> 00:28:40,762 మనం కలిసికట్టుగా మన భూగోళాన్ని కాపాడుకోవచ్చు. మనకి లైఫ్ బోట్ అవసరం ఉండదు. 398 00:28:43,140 --> 00:28:46,977 క్రికెట్ జూన్, గత ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చేసిన పని 399 00:28:47,060 --> 00:28:48,562 మా అందరికీ కూడా ఒక పాఠం అయింది. 400 00:28:49,938 --> 00:28:51,273 నువ్వు పుట్టుకతోనే నాయకురాలివి. 401 00:28:51,940 --> 00:28:52,941 నేనా? 402 00:28:53,025 --> 00:28:55,152 అవును. నువ్వే. 403 00:28:57,613 --> 00:28:58,864 నువ్వు ఇక్కడే నీ పనిని చేయి. 404 00:28:59,489 --> 00:29:01,825 మేము మార్స్ లైఫ్ బోట్ ప్రయోగంతో ముందుకు సాగుతాం. 405 00:29:02,826 --> 00:29:04,203 అది మీకు అవసరం పడకూడదని ఆశిస్తాను. 406 00:29:07,331 --> 00:29:10,209 మనం మొదలుపెట్టడానికి ముందు మరొక్క విషయం. 407 00:29:11,960 --> 00:29:14,463 -ఇప్పుడు టైమ్ ఎంత అయింది? -మధ్యాహ్నం మూడు గంటలు. 408 00:29:16,757 --> 00:29:17,758 ఇంకా టైమ్ ఉంది. 409 00:29:18,717 --> 00:29:21,261 కేసీ, నీ దగ్గర సీక్వెన్సర్ ఉందా? 410 00:29:22,596 --> 00:29:23,472 ఉంది. 411 00:29:24,473 --> 00:29:28,936 అవును, మనం గాలిలో ఎగరబోతున్నాం నిండు చందమామని తదేకంగా చూద్దాం 412 00:29:29,770 --> 00:29:34,441 ఇక్కడ ఎవరూ లేరు నువ్వూ నేనూ తప్ప ఈ వెలుగులో, మనం కూడా మెరుస్తున్నాం 413 00:29:35,484 --> 00:29:38,070 ఆగు, మనం బంగారు వన్నె గలవాళ్లం 414 00:29:38,153 --> 00:29:40,531 మనం పాలపుంతని అనుసరిద్దాం 415 00:29:40,614 --> 00:29:45,702 మన కోసం నక్షత్రాలు ఆడుకోడానికి వస్తున్నాయి మరొక రోజు వెలుగుని మనం పొందుదాం 416 00:29:45,786 --> 00:29:48,997 కాబట్టి ఆగు, మనం దాదాపు ఇంటికి చేరుకున్నాం 417 00:29:49,081 --> 00:29:52,334 నిండు చందమామ 418 00:29:54,711 --> 00:29:57,047 నిండు చందమామ 419 00:29:57,130 --> 00:30:00,467 ఆగు, మనం దాదాపు ఇంటికి చేరుకున్నాం 420 00:30:57,566 --> 00:30:59,568 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్