1 00:00:08,800 --> 00:00:11,386 పిల్లలూ, వెళదాం పదండి! స్కూలుకు ఆలస్యం అవుతోంది! 2 00:00:18,143 --> 00:00:19,144 వావ్. 3 00:00:19,228 --> 00:00:21,396 జాక్, ఆ షర్టు ఎందుకు తొడుక్కున్నావు? అది మురికిగా ఉంది. 4 00:00:21,480 --> 00:00:23,148 ఇది మురికిగా లేదు. మచ్చలు పడ్డాయి అంతే. 5 00:00:23,732 --> 00:00:24,983 అలా అయితే… 6 00:00:25,067 --> 00:00:27,194 బయటకు వెళ్లేప్పుడు నువ్వు ఆ షర్టు వేసుకోకూడదు, సరేనా? 7 00:00:27,277 --> 00:00:28,445 కాసడీ! 8 00:00:28,529 --> 00:00:29,905 నేను చాలా అలసిపోయాను. 9 00:00:29,988 --> 00:00:32,783 అది ఎందుకంటే నువ్వు రాత్రంతా ఇసబెల్ తో వీడియో చాటింగ్ చేస్తూ గడిపావు. 10 00:00:32,866 --> 00:00:35,953 నిజానికి ఇసబెల్ మాత్రమే కాదు, కానీ… 11 00:00:36,036 --> 00:00:37,538 నీ బోటనీ ప్రాజెక్ట్ ఎలా జరుగుతోంది? 12 00:00:37,621 --> 00:00:40,916 బాగుంది. అది నిజంగా బాగా వస్తుంది. 13 00:00:40,999 --> 00:00:44,044 అయితే, నువ్వు ఇంకా మొదలుపెట్టలేదన్న మాట? నీ గ్రూప్ లో మిగతా వాళ్లు మొదలుపెట్టేసి ఉంటారు. 14 00:00:44,878 --> 00:00:46,421 నాకు చాలా సమయం ఉంది. 15 00:00:46,505 --> 00:00:49,925 ఆ…హా. రాత్రి తొమ్మిది తరువాత ఇంక వీడియో చాటింగ్ చేయద్దు, కాస్. 16 00:00:50,425 --> 00:00:53,345 అవును. గుర్తొచ్చింది. ఈ రాత్రికి నాకు హాలో డెన్ కావాలి. 17 00:00:53,428 --> 00:00:55,681 ఎస్కేప్ ఫ్రమ్ జాంబీ ఐలాండ్ 3 విడుదల అవుతోంది. 18 00:00:56,390 --> 00:00:58,559 ఈసారి, వాళ్లు ఒక పాడుబడిన గిడ్డంగిలో మనల్ని విడిచిపెడతారు, 19 00:00:58,642 --> 00:01:00,185 సమయం మించిపోయేలోగా మనం తప్పించుకోవాలి. 20 00:01:00,269 --> 00:01:04,022 అవకాశమే లేదు. వద్దు, ఆ ఆట పాత వెర్షన్లు రెండూ నీకు పీడకలలు తెప్పించాయి. 21 00:01:04,105 --> 00:01:05,147 ఏంటి? 22 00:01:05,232 --> 00:01:07,025 నాన్నా, ఇలా చూడు. నేను ఇంకా చిన్న పిల్లవాడిని కాను. 23 00:01:07,109 --> 00:01:08,110 సారీ, వద్దు. 24 00:01:08,193 --> 00:01:11,530 -ఈ మైక్రోవేవ్ మళ్లీ పనిచేయడం లేదు. -ఒకసారి ఆ ప్లగ్ తీసి మళ్లీ పెట్టు చాలు. 25 00:01:11,613 --> 00:01:12,906 అది అలా పని చేయదు, నాన్న. 26 00:01:14,074 --> 00:01:17,369 అవును, కేవలం ప్లగ్ లు తీయడం ద్వారా సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్ బాగయిపోవు. 27 00:01:18,537 --> 00:01:19,538 వచ్చింది! 28 00:01:20,038 --> 00:01:21,915 అవును. ఇది పని చేస్తోంది. 29 00:01:50,652 --> 00:01:51,653 స్వాగతం న్యూటన్ మిడిల్ స్కూల్ 30 00:01:52,237 --> 00:01:53,614 అది ఈ రోజా? 31 00:01:55,574 --> 00:01:59,369 మొదటి జెడ్3 సమీక్ష ఇప్పుడే వచ్చింది. అన్నింటికన్నా ఇదే భయానకంగా ఉందని అంటున్నారు. 32 00:01:59,453 --> 00:02:00,704 అది అంత భయానకంగా ఉందా, హా? 33 00:02:00,787 --> 00:02:02,289 ఓహ్, సరే. మీ తల్లిదండ్రులకు చెప్పకు. 34 00:02:02,372 --> 00:02:04,833 నాకు తెలుసు వాళ్లు, అంటే, ఇలాంటి విషయాలలో తీవ్రంగా స్పందిస్తారని విన్నాను. 35 00:02:04,917 --> 00:02:06,919 ఏంటి? లేదు, వాళ్లు మంచిగా ఉంటారు. 36 00:02:07,002 --> 00:02:08,127 నేను ఇంక ఎదురుచూడలేను. 37 00:02:08,211 --> 00:02:10,714 అది మరో పన్నెండు గంటల నాలుగు సెకన్లలో లైవ్ అవుతుంది. 38 00:02:10,797 --> 00:02:13,592 ఇప్పుడు మూడు, ఇంకా రెండు, ఇప్పుడు ఒకటి… 39 00:02:15,636 --> 00:02:16,637 ఫోన్ కేసు భలే ఉంది. 40 00:02:16,720 --> 00:02:17,721 తెలుసు, బాగుంది కదా? 41 00:02:17,804 --> 00:02:19,932 డౌన్ టౌన్ లో నిజంగా ఒక అద్భుతమైన దుకాణం ఉంది. 42 00:02:20,015 --> 00:02:22,142 -నువ్వు ఊహించనివన్నీ వాళ్లు అమ్ముతారు. -ఓహ్, అవునా? 43 00:02:22,226 --> 00:02:24,937 జిమ్ అయ్యాక స్కూలు ఫోటోలు తీస్తారంటే నమ్మలేకపోతున్నాను. 44 00:02:25,020 --> 00:02:27,356 -చాలా అన్యాయం. నేను చెమటలతో ఉంటాను. -హేయ్, కాసడీ! 45 00:02:28,232 --> 00:02:30,943 బోటనీ ప్రాజెక్టులో నీ వంతు భాగాన్ని నాకు, టిమ్ కి ఎప్పుడు అందిస్తావు? 46 00:02:31,026 --> 00:02:33,111 తరువాత. ఇంకా పని చేస్తున్నా. 47 00:02:33,195 --> 00:02:35,697 సరే. దానిని మనం ఇవ్వడానికి ముందు మన ముగ్గురి ప్రాజెక్టులూ జోడించి చూడాలి. 48 00:02:36,573 --> 00:02:37,866 మీ కొత్త పూల్ ఎలా ఉంది, టెస్? 49 00:02:37,950 --> 00:02:39,785 అద్భుతంగా ఉంది. ఒకసారి వచ్చి చూస్తావా? 50 00:02:39,868 --> 00:02:40,869 సరే! 51 00:02:59,805 --> 00:03:00,806 జాంబీ ఐలాండ్ 3. 52 00:03:00,889 --> 00:03:01,807 -హేయ్! -ఇక నా వంతు. 53 00:03:01,890 --> 00:03:02,891 నేను ఇంకొకటి చూస్తున్నాను. 54 00:03:02,975 --> 00:03:06,770 ఎస్కేప్ ఫ్రమ్ జాంబీ ఐలాండ్ 3 ఈ రాత్రి రిలీజ్ అని నీకు చెప్పాను కదా, ఇప్పుడు అది లైవ్ వస్తోంది. 55 00:03:06,854 --> 00:03:08,313 అది ఆడటానికి నీకు అనుమతి లేదు. 56 00:03:08,397 --> 00:03:10,315 -ఆపు! -నాకు తిరిగి ఇవ్వు, జాక్. 57 00:03:10,399 --> 00:03:12,901 లేదు! నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నావు. ఇంక ఈ గదిని ఆక్రమించుకోవడం మాను! 58 00:03:14,069 --> 00:03:16,029 ఇక్కడ ఏం జరుగుతోంది? 59 00:03:16,113 --> 00:03:18,365 నేను ఏదో చూస్తున్నాను, ఇంకా జాక్ వచ్చి మార్చేశాడు. 60 00:03:18,448 --> 00:03:20,784 ఈ రాత్రికి నా గేమ్ కోసం నాకు హాలో డెన్ కావాలి అని తనకి చెప్పాను. 61 00:03:20,868 --> 00:03:23,328 కానీ నువ్వు ఆ ఆట ఆడకూడదని మేము నీకు చెప్పాము. అది మరీ భయానకంగా ఉంటుంది. 62 00:03:23,412 --> 00:03:25,873 ఏంటి? వినండి, నేను అది చూసుకోగలను. 63 00:03:25,956 --> 00:03:27,749 మరి, కాసడీ, నీ అసైన్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. 64 00:03:27,833 --> 00:03:30,794 కానీ నీకు చాలా సమయం ఉందని మాత్రం నాకు చెప్పకు. 65 00:03:31,545 --> 00:03:33,422 -మీ ఇద్దరికీ విరామం కావాలి. -ఏంటి… 66 00:03:35,382 --> 00:03:37,217 పేరెంటల్ కంట్రోల్స్ ని ఆన్ చేస్తున్నాను. 67 00:03:38,760 --> 00:03:40,387 వారం వరకు హాలో డెన్ లో ప్రవేశం లేదు. 68 00:03:41,138 --> 00:03:42,723 మీ ఫోన్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. 69 00:03:42,806 --> 00:03:44,349 -ఏం… -ఏంటి? ఎందుకు? 70 00:03:44,433 --> 00:03:47,227 రోజూ రాత్రి వీడియో చాటింగ్ చేస్తూ ఆలస్యంగా పడుకుంటున్నావు. అందుకు. 71 00:03:47,311 --> 00:03:48,312 నాకు ఇచ్చేయండి. 72 00:03:48,896 --> 00:03:51,857 పేరెంటల్ కంట్రోల్స్ ఆన్ అయ్యాక మీరు వీటిని తిరిగి వాడుకోవచ్చు. 73 00:04:01,700 --> 00:04:04,077 నియర్లీ న్యూ 74 00:04:15,214 --> 00:04:16,882 ప్రతి ఒక్కరూ జెడ్3 గురించి మాట్లాడుతున్నారు. 75 00:04:16,964 --> 00:04:19,760 కొద్దిసేపట్లో చూసే వాడినే కానీ అమ్మ, నాన్నల వల్ల మొత్తం చెడింది. 76 00:04:19,843 --> 00:04:21,053 వాళ్లు మనల్ని అంతగా నమ్మడం లేదు. 77 00:04:21,136 --> 00:04:23,263 నా అసైన్మెంట్ పనిని ఎప్పుడు చేయాలో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. 78 00:04:23,347 --> 00:04:25,098 నా పనులు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. 79 00:04:26,517 --> 00:04:28,769 మనకి కావలసినవి ఈ ప్రదేశంలో ఉంటాయని నిజంగా అనుకుంటున్నావా? 80 00:04:28,852 --> 00:04:32,105 అంటే, మనం ఊహించనిది ఏదైనా సరే వీళ్లు అమ్ముతారని టైలర్ చెప్పాడు. 81 00:04:37,152 --> 00:04:38,987 హాయ్. మేము ఒక రిమోట్ కోసం చూస్తున్నాము. 82 00:04:39,071 --> 00:04:41,365 హాలో డెన్ లో టర్నాఫ్ చేసే రిమోట్ కోసం చూస్తున్నాం. 83 00:04:42,658 --> 00:04:45,035 చూడండి, మా తల్లిదండ్రులు అనుకోకుండా వాటిని ఆన్ చేశారు. 84 00:04:45,118 --> 00:04:47,996 కానీ, వాళ్లు వృద్ధులు, అందుకే టెక్నాలజీని అర్థం చేసుకోలేరు. 85 00:04:48,080 --> 00:04:50,165 ఆ తరువాత ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది. 86 00:04:50,249 --> 00:04:52,501 ఎవరో మా ఇంట్లోకి జొరబడి ఆ రిమోట్ ని దొంగిలించారు. 87 00:04:52,584 --> 00:04:54,086 వాళ్లు మిగతా వస్తువులు కూడా దొంగిలించారు. 88 00:04:55,462 --> 00:04:56,880 -ఊరికే స్పష్టం చేస్తున్నాను. -అవును. 89 00:04:57,464 --> 00:04:58,674 అలాగే. 90 00:04:58,757 --> 00:05:00,676 మీరు పూర్తిగా స్పష్టంగా ఉన్నారు. 91 00:05:01,927 --> 00:05:06,723 మీకు పనికొచ్చే ఒక యూనివర్సల్ రిమోట్ నా దగ్గర ఇక్కడే ఎక్కడో ఉండాలి. 92 00:05:08,433 --> 00:05:10,602 ఒక స్టార్టప్ నుంచి నాకు అది వచ్చింది కానీ అది మూతబడింది. 93 00:05:11,353 --> 00:05:12,271 ఇదిగో చూడండి. 94 00:05:15,566 --> 00:05:16,859 ఇది ఎంత బాగుందో కదా? 95 00:05:17,609 --> 00:05:20,070 ఇది ఖచ్చితంగా పని చేస్తుందంటారా? మా హాలో డెన్ చాలా కొత్తది. 96 00:05:20,153 --> 00:05:23,073 అలాగే మేము లాక్ చేసిన ఫోన్ కి కూడా రిమోట్ వాడాలని చూస్తున్నాం. 97 00:05:23,156 --> 00:05:25,617 ఇది యూనివర్సల్. 98 00:05:27,578 --> 00:05:29,496 ఇది దేనికైనా పని చేస్తుంది. 99 00:05:39,089 --> 00:05:42,426 మనం ఈ పని చేయడం సరైనదే అంటావా? అంటే, అమ్మా, నాన్నలకి తెలిస్తే అరుస్తారు. 100 00:05:42,509 --> 00:05:45,262 వాళ్లకి తెలిసినప్పుడు కదా, అది జరిగే పని కాదు. 101 00:05:45,888 --> 00:05:47,931 సరే, ఇప్పుడు, వీటిని ఎలా ఆన్ చేయాలి? 102 00:05:48,682 --> 00:05:50,142 ఆ బటన్ నొక్కి చూడు. 103 00:05:51,101 --> 00:05:52,352 సరే. 104 00:05:52,936 --> 00:05:55,564 -ఆన్. -బాగుంది! 105 00:05:56,231 --> 00:05:58,775 సరే, ఇక పేరెంటల్ కంట్రోల్స్. 106 00:05:59,776 --> 00:06:02,112 సరే. ఇప్పుడు అన్నీ ఆపేయ్. 107 00:06:02,196 --> 00:06:03,906 పేరెంటల్ కంట్రోల్స్ ఆఫ్ అయ్యాయి. 108 00:06:03,989 --> 00:06:05,532 పిల్లలూ! 109 00:06:06,575 --> 00:06:09,161 అమ్మా, నాన్నా, మీకు కోపం వచ్చే లోగా, నేను వివరించగలను. 110 00:06:09,244 --> 00:06:12,873 మేము ఇక్కడికి ఎందుకొచ్చామంటే, మేము ఊరికే… 111 00:06:13,457 --> 00:06:15,417 పేరెంటల్ కంట్రోల్స్ ఆఫ్ చేస్తున్నారా? 112 00:06:16,084 --> 00:06:17,085 మీకు కావల్సింది అదే అయితే, 113 00:06:17,169 --> 00:06:20,589 ఇంకా ఆ నిర్ణయం తీసుకునేంత వయస్సు మీకు వచ్చిందనుకుంటే, ఆ మాటే చెప్పండి. 114 00:06:23,175 --> 00:06:24,343 నాకు వచ్చిందా? 115 00:06:31,892 --> 00:06:32,893 అమ్మా, 116 00:06:32,976 --> 00:06:36,104 నా ఫోన్ లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ ని తీసేస్తావా? 117 00:06:36,188 --> 00:06:38,649 ఆ నిర్ణయం తీసుకునే వయసు వచ్చిందని నేను కూడా అనుకుంటున్నా. 118 00:06:40,025 --> 00:06:40,859 సరే. 119 00:06:43,320 --> 00:06:44,321 దానిని నాకు ఇవ్వు. 120 00:06:48,992 --> 00:06:49,993 సరే. 121 00:06:50,077 --> 00:06:53,413 మీరు ఆ కుర్చీలో కూర్చోవచ్చు కదా? మేము ఇప్పుడే తిరిగి వస్తాం. 122 00:06:56,708 --> 00:06:58,043 నువ్వు అది చూశావు, కదా? 123 00:06:58,126 --> 00:06:59,670 మనం అడిగినవన్నీ వాళ్లు చేసేశారు. 124 00:06:59,753 --> 00:07:01,421 అవును. అది రిమోట్ చేసిన పని. 125 00:07:01,505 --> 00:07:04,174 అది హాలో డెన్ పేరెంటల్ కంట్రోల్స్ ని స్విచాఫ్ చేయలేదు. 126 00:07:04,258 --> 00:07:07,427 అది అమ్మా, నాన్నల పేరెంటల్ కంట్రోల్స్ ని ఆఫ్ చేసింది. 127 00:07:08,554 --> 00:07:09,596 అది అసాధ్యం. 128 00:07:09,680 --> 00:07:11,306 సరే, అయితే రుజువు చేస్తా చూడు. 129 00:07:11,390 --> 00:07:13,642 నేను మరొక బటన్ ని ప్రయత్నిస్తాను. అంటే భాషది. 130 00:07:14,268 --> 00:07:16,436 భాష: ఎస్పెనాల్. 131 00:07:21,567 --> 00:07:22,943 ఇది అద్భుతంగా ఉంది. 132 00:07:23,610 --> 00:07:27,489 స్పానిష్ భాషలో నేను చాలా వెనుకబడి ఉన్నాననే బాధ నాకు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 133 00:07:28,907 --> 00:07:29,992 మ్యూట్. 134 00:07:30,075 --> 00:07:32,119 -నువ్వు కూడా ప్రయత్నిస్తావా? -నాకు తెలియదు. 135 00:07:32,953 --> 00:07:35,998 ఏంటి? మనల్ని చిన్న పిల్లల్లా ట్రీట్ చేయడం నీకు తప్పు అనిపించడం లేదా? 136 00:07:37,583 --> 00:07:39,960 అవును. మంచి పాయింటే. నేను ఒకటి ప్రయత్నిస్తా చూడు. 137 00:07:41,378 --> 00:07:44,173 భాష: ఇంగ్లీష్. అన్ మ్యూట్. 138 00:07:45,299 --> 00:07:48,552 అమ్మా, రేపు ఫోటో సెషన్ కి నీ డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్లచ్చా? 139 00:08:03,692 --> 00:08:06,403 ఆ డైమండ్ నెక్లెస్ ని మీ అమ్మ నీకు ఇచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. 140 00:08:06,486 --> 00:08:07,571 ఇది చాలా ఫ్యాన్సీగా ఉంది. 141 00:08:09,239 --> 00:08:10,949 తన వస్తువుల్ని ఇచ్చేంతగా నన్ను నమ్ముతుంది. 142 00:08:11,033 --> 00:08:12,826 జిమ్ కి వెళ్లినా నీ జట్టు చెదిరిపోలేదు ఎందుకు? 143 00:08:13,493 --> 00:08:15,078 జిమ్ క్లాసు ఎగ్గొట్టేలా మా నాన్న ఓ ఉత్తరం రాశాడు. 144 00:08:16,747 --> 00:08:19,166 ఏంటి? ఫోటో కోసం బాగా కనిపించాలి కదా. 145 00:08:21,877 --> 00:08:25,631 ఈ స్వెటర్ తొడుక్కుంటే చాలా ఉక్కపోస్తోంది. ఒక కుక్క నా ఛాతి మీద కూర్చున్నట్లుంది. 146 00:08:26,924 --> 00:08:28,884 -అయితే దాన్ని తీసేయ్. -అవును, నిజమే. 147 00:08:28,967 --> 00:08:32,304 మురికి టీ షర్టుతో నేను ఫోటోలు దిగితే మా పేరెంట్స్ కోప్పడతారు. 148 00:08:32,888 --> 00:08:35,807 ఇది మురికిగా లేదు. మచ్చలు పడ్డాయి. 149 00:08:35,890 --> 00:08:37,518 ఎవరైనా అది ఎందుకు అర్థం చేసుకోరు? 150 00:08:43,941 --> 00:08:45,692 హాయ్, పిల్లలు. స్కూలు ఎలా జరిగింది? 151 00:08:45,776 --> 00:08:46,610 గొప్పగా జరిగింది. 152 00:08:46,693 --> 00:08:50,280 మీరు కోరిన విధంగానే పిజ్జా ఇంకా ఐస్ క్రీమ్ లని డిన్నర్ కోసం సిద్ధం చేశాం. 153 00:08:50,364 --> 00:08:52,157 టేబుల్ సిద్ధం చేయడానికి మాకు సహకరిస్తారా? 154 00:08:52,241 --> 00:08:55,285 నిజానికి, నేను ఈ రాత్రికి హాలో డెన్ లో తిందాం అనుకున్నాను. 155 00:08:55,369 --> 00:08:57,162 మరి నేను నా గదిలో తిందాం అనుకున్నాను. 156 00:08:57,746 --> 00:08:59,748 సరే, మీరు ఎలా కోరుకుంటే అలాగే. 157 00:09:01,208 --> 00:09:02,876 సరే. డిన్నర్ కి థాంక్స్. 158 00:09:04,127 --> 00:09:07,673 ఎస్కేప్ ఫ్రమ్ జాంబీ ఐలాండ్ 3 ఇప్పుడు ప్రారంభం అవుతోంది. 159 00:09:07,756 --> 00:09:09,800 ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించినది. 160 00:09:14,388 --> 00:09:15,848 ఈ గేమ్ అంత భయంకరంగా ఏమీ లేదు. 161 00:09:16,932 --> 00:09:18,559 డిటైల్స్ మాత్రం బాగున్నాయి. 162 00:09:29,236 --> 00:09:30,237 మొదటి క్లూ. 163 00:09:40,622 --> 00:09:43,375 హాలో డెన్ ఆఫ్! హాలో డెన్ ఆఫ్! 164 00:09:59,308 --> 00:10:03,103 రేపు టెస్ ఇంట్లో పూల్ దగ్గర మనం కలిసినప్పుడు ఇది తెస్తాను. 165 00:10:03,187 --> 00:10:04,229 ముద్దుగా ఉంది. 166 00:10:04,313 --> 00:10:05,689 టెస్ ఫోన్ చేస్తోంది. 167 00:10:05,772 --> 00:10:08,317 తను బోటనీ ప్రాజెక్టు గురించి నన్ను మళ్లీ సతాయిస్తోంది. 168 00:10:08,400 --> 00:10:11,278 తను నీ గ్రూప్ లో ఉంది, ఆ ప్రాజెక్టుని రేపు ఇచ్చేయాలి. 169 00:10:11,361 --> 00:10:13,447 అవును, నా వంతు భాగం పూర్తి చేయడానికి నాకు రాత్రంతా సమయం ఉంది, 170 00:10:13,530 --> 00:10:15,741 కానీ తను నాకు ఇలా సందేశాలు పంపిస్తుంటే ఎప్పటికీ పూర్తి చేయలేను. 171 00:10:15,824 --> 00:10:16,909 కాస్? 172 00:10:17,492 --> 00:10:18,952 ఊరికే గుడ్ నైట్ చెబుదామని వచ్చాను. 173 00:10:20,787 --> 00:10:21,914 ఇప్పుడు తొమ్మిది గంటలు దాటింది. 174 00:10:21,997 --> 00:10:24,875 అది నాకు ఎందుకు చెబుతున్నావు? నన్ను వీడియో చాట్ ఆపేయమంటావా? 175 00:10:24,958 --> 00:10:27,628 లేదు, నువ్వు అలిసిపోయి ఉంటావేమో అని ఊరికే గుర్తు చేస్తున్నాను. 176 00:10:28,378 --> 00:10:31,215 నీకు ఎప్పుడు నిద్రవస్తే అప్పుడే పడుకో. గుడ్ నైట్. 177 00:10:32,758 --> 00:10:33,884 నైట్. 178 00:10:35,677 --> 00:10:37,387 మీ అమ్మ మంచిగా మారిపోయిందే. 179 00:10:38,055 --> 00:10:39,890 తను పూర్తిగా కొత్త వ్యక్తిలా అనిపిస్తోంది. 180 00:10:50,734 --> 00:10:52,569 లేదు. నేను ఈసారి భయపడను. 181 00:10:58,825 --> 00:10:59,910 అమ్మా! 182 00:10:59,993 --> 00:11:02,913 లేదు, లేదు, లేదు. సరే. 183 00:11:06,959 --> 00:11:09,211 నాన్నా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 184 00:11:11,588 --> 00:11:13,257 వద్దు. వద్దు. 185 00:11:15,843 --> 00:11:17,845 అమ్మా! ఏంటి? వద్దు! 186 00:11:17,928 --> 00:11:18,929 నాన్నా! వద్దు! 187 00:11:20,264 --> 00:11:22,599 లేదు! లేదు! లేదు! 188 00:11:22,683 --> 00:11:25,435 వద్దు! వద్దు! వద్దు! 189 00:11:26,770 --> 00:11:30,440 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? నువ్వు అరవడం మేము విన్నాము. 190 00:11:30,524 --> 00:11:32,568 ఎస్కేప్ ఫ్రమ్ జాంబీ ఐలాండ్ నిజంగా నన్ను బెదరగొట్టింది. 191 00:11:33,902 --> 00:11:35,153 నేను ఇది ఆడకుండా ఉండాల్సింది. 192 00:11:35,237 --> 00:11:36,905 నేను ఆడకుండా ఉండాల్సింది. నేను ఆడకుండా… 193 00:11:36,989 --> 00:11:39,157 హేయ్, ఎందుకు అంతగా అరుస్తున్నావు? 194 00:11:39,241 --> 00:11:41,451 నీ తమ్ముడికి పీడకల వచ్చింది. 195 00:11:41,535 --> 00:11:42,536 జాంబీ ఐలాండ్ వల్లా? 196 00:11:43,829 --> 00:11:45,289 మళ్లీ పడుకో. 197 00:11:46,039 --> 00:11:47,499 నీకేం ఫర్వాలేదు. 198 00:11:48,792 --> 00:11:50,460 మళ్లీ నిద్రపోవాలా? 199 00:11:50,544 --> 00:11:52,004 అది ఏంటి? 200 00:11:52,087 --> 00:11:55,299 -వాళ్లు ఏం చేయాలి అనుకున్నావు? -నాకు తెలియదు, నాకు ధైర్యం చెప్పచ్చు. 201 00:11:55,382 --> 00:11:58,010 వాళ్ల పేరెంటల్ కంట్రోల్స్ ని మనం మళ్లీ ఆన్ చేయాలి అనుకుంటా. 202 00:11:58,719 --> 00:12:02,222 చూడు, జాంబీ ఐలాండ్ ని తట్టుకోవడం నీ వల్ల కాకపోతే, అప్పుడు నువ్వు ఆ ఆట ఆడకూడదు. 203 00:12:02,890 --> 00:12:06,602 -నీకు కావాలంటే, నేను లైట్లు ఆన్ లోనే ఉంచుతాను. -వద్దు. ఫర్వాలేదు. 204 00:12:09,938 --> 00:12:14,109 నిజానికి, మళ్లీ ఆలోచించాను, దయచేసి ఆ లైట్లు మళ్లీ ఆన్ చేస్తావా? 205 00:12:15,986 --> 00:12:17,237 థాంక్స్. 206 00:12:43,138 --> 00:12:44,473 -ఏం చేస్తున్నావు? -ఏమీ లేదు. 207 00:12:44,556 --> 00:12:45,682 సరే, అయితే. 208 00:12:46,266 --> 00:12:48,560 దీన్ని ఇచ్చేయ్! ఆగు! 209 00:12:49,144 --> 00:12:51,313 హేయ్, నాకు తిరిగి ఇచ్చేయ్! నీకు ఏమైంది? 210 00:12:51,396 --> 00:12:52,731 మనం జోక్యం చేసుకోవాలా? 211 00:12:54,024 --> 00:12:56,568 ఈ గొడవని వాళ్లకు వాళ్లే సర్దుబాటు చేసుకోగల పెద్దవాళ్లు అయ్యారనుకుంటా. 212 00:12:57,194 --> 00:12:58,487 రివైండ్. 213 00:13:03,116 --> 00:13:04,701 -బటన్స్ నొక్కడం ఆపు! -ప్లే. 214 00:13:04,785 --> 00:13:06,745 -నేను కాదు. నువ్వే నొక్కుతున్నావు! -లేదు! 215 00:13:06,828 --> 00:13:07,996 మనం జోక్యం చేసుకోవాలా? 216 00:13:08,080 --> 00:13:08,914 వద్దు! 217 00:13:08,997 --> 00:13:11,458 ఈ గొడవని వాళ్లకు వాళ్లే సర్దుబాటు చేసుకోగల పెద్దవాళ్లు అయ్యారనుకుంటా. 218 00:13:11,542 --> 00:13:12,668 తిరిగి ఇచ్చేయి! 219 00:13:13,836 --> 00:13:14,962 పాజ్. 220 00:13:18,841 --> 00:13:20,843 వాళ్లు స్తంభించిపోయారా? అయ్యో. 221 00:13:24,012 --> 00:13:26,223 కొంప ముంచావు, జాక్. ఇది పని చేయడం లేదు. 222 00:13:26,306 --> 00:13:28,517 మనం గొడవ పడినప్పుడు ఇది జామ్ అయిపోయి ఉంటుంది. 223 00:13:28,600 --> 00:13:29,601 నన్ను చూడనివ్వు. 224 00:13:31,937 --> 00:13:33,063 ఓహ్, లేదు. 225 00:13:46,785 --> 00:13:47,828 హేయ్. 226 00:13:48,328 --> 00:13:50,289 వాళ్లకి చలేస్తుందేమోనని భయంగా ఉంది. 227 00:13:50,372 --> 00:13:52,583 -నీకు నిద్ర బాగా పట్టిందా? -లేదు, నీకు? 228 00:13:52,666 --> 00:13:54,585 లేదు. నేను చాలా భయపడ్డాను. 229 00:13:55,294 --> 00:13:56,753 మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? 230 00:13:56,837 --> 00:14:00,299 నాకు తెలియదు. కానీ అది ఏమైనా కానీ, మనం ముందు స్కూలుకు వెళ్లాలి. 231 00:14:09,349 --> 00:14:10,517 జాక్. 232 00:14:16,815 --> 00:14:19,276 -జాక్. -మిస్ రేయన్? 233 00:14:19,860 --> 00:14:21,737 ప్రిన్సిపాల్ ఆఫీస్ కి వెళ్లు. ఇప్పుడే. 234 00:14:28,118 --> 00:14:30,662 వావ్! ఇది గొప్పగా ఉంది. 235 00:14:32,623 --> 00:14:35,250 -కానీ దీని కాడ ఏది? -నమ్మశక్యంగా లేదు. 236 00:14:36,460 --> 00:14:39,546 అది నా తప్పే. నేను పూర్తి చేయలేదు. 237 00:14:40,339 --> 00:14:43,759 సరే, మిగతాది అంతా బాగుంది. కాబట్టి మీ అందరికీ సి గ్రేడ్ ఇస్తాను. ఇది పాస్. 238 00:14:44,593 --> 00:14:45,636 సి గ్రేడా? 239 00:14:47,513 --> 00:14:48,805 అది కష్టం. 240 00:14:50,641 --> 00:14:53,560 రేపు అమ్మనీ, నాన్ననీ కలుస్తానని ప్రిన్సిపాల్ చెప్పారు. 241 00:14:53,644 --> 00:14:55,354 -కలుస్తారా? వ్యక్తిగతంగానా? -అవును. 242 00:14:58,524 --> 00:15:00,108 హేయ్! నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 243 00:15:00,776 --> 00:15:01,610 నువ్వు ఎక్కడ ఉన్నావు? 244 00:15:01,693 --> 00:15:03,946 నేను టెస్ ఇంట్లో పూల్ దగ్గర ఉన్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు. 245 00:15:04,988 --> 00:15:06,406 నాకు ఆహ్వానం అందలేదు. 246 00:15:06,990 --> 00:15:09,326 లేదు, నేను వెళ్లి తనతో మాట్లాడతాను. 247 00:15:09,409 --> 00:15:11,662 లేదు, వద్దు. తను నా మీద కోపంగా ఉంది, అనుకుంటా. 248 00:15:12,496 --> 00:15:14,373 మా అసైన్మెంట్ ని మేము సరిగా చేయలేదు. 249 00:15:14,915 --> 00:15:15,916 మీరు సరదాగా గడపండి. 250 00:15:17,000 --> 00:15:18,126 నువ్వు బాగానే ఉన్నావా? 251 00:15:19,378 --> 00:15:20,379 పద. 252 00:15:26,593 --> 00:15:28,637 ఆక్టివేటర్ జామ్ అయినట్లు ఉంది. 253 00:15:28,720 --> 00:15:30,597 అవును, మేము కూడా అదే అనుకున్నాం. 254 00:15:30,681 --> 00:15:32,641 దీనికి బదులు దయచేసి మాకు కొత్తది ఇవ్వగలరా? 255 00:15:32,724 --> 00:15:35,561 నేను మీకు ఇంతకుముందే చెప్పాను. దివాళా తీసిన ఒక స్టార్టప్ కంపెనీ నుంచి ఇది కొన్నాను. 256 00:15:35,644 --> 00:15:36,687 నా దగ్గర ఇదొక్కటే ఉంది. 257 00:15:36,770 --> 00:15:38,397 సరే, అయితే, దీనిని బాగు చేయగలరా? 258 00:15:39,064 --> 00:15:42,734 ఈ వస్తువులో ఎంత కొత్త టెక్నాలజీ ఉందో మీకు ఏమైనా అవగాహన ఉందా? 259 00:15:44,403 --> 00:15:45,404 లేదు. 260 00:15:45,487 --> 00:15:47,155 అయితే, ఇప్పుడు మేం ఏం చేయాలి? 261 00:15:47,239 --> 00:15:51,869 నాకు తెలియదు. మీ తల్లిదండ్రుల్ని అడగండి. బహుశా వాళ్లు దీన్ని బాగు చేయగలరు. 262 00:16:01,712 --> 00:16:03,547 తనకి నా మీద కోపం వచ్చిందని అర్థమైంది. 263 00:16:03,630 --> 00:16:05,757 ఆ ప్రాజెక్టులో నా భాగాన్ని నేను సమయానికి ఇవ్వలేకపోయాను. 264 00:16:07,301 --> 00:16:08,343 నేను బిజీగా ఉన్నాను. 265 00:16:09,303 --> 00:16:13,056 అంటే, హలో. మీరు పాజ్ అయిపోయారు ఇంకా అంతా స్తంభించిపోయింది. 266 00:16:13,891 --> 00:16:16,435 అవును, ఖచ్చితంగా, నువ్వు చెప్పినట్లే నేను ముందే మొదలుపెట్టాల్సింది, కానీ… 267 00:16:18,103 --> 00:16:19,229 చాలా ఆలస్యం అయిపోయింది. 268 00:16:20,522 --> 00:16:25,152 టెస్ కి కోపం వచ్చింది, ఆమె కోపం తగ్గించాలంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. 269 00:16:26,945 --> 00:16:28,071 కానీ నువ్వు చెప్పగలవు. 270 00:16:28,697 --> 00:16:31,617 అమ్మ పాజ్ లో ఉందని తెలుసు, కదా? 271 00:16:33,160 --> 00:16:35,913 నాకు భయంగా ఉంది, జాక్. అమ్మనీ, నాన్ననీ నేను మిస్ అవుతున్నాను. 272 00:16:35,996 --> 00:16:38,498 మనం వాళ్లని మళ్లీ మామూలుగా చేయలేకపోతే అప్పుడు ఏంటి? 273 00:16:39,082 --> 00:16:42,544 చూడు, అమ్మ, నాన్న ఏం చేసి ఉండేవారో అని మనకి మనం ప్రశ్నించుకోవాలి. 274 00:16:43,128 --> 00:16:48,550 నేను కలత చెందితే, గట్టిగా శ్వాస తీసుకుని అంతర్మథనం చేసుకోమని అమ్మ చెప్పేది. 275 00:16:49,134 --> 00:16:53,347 నాకు ఆకలిగా ఉందా? అలసటగా ఉందా? అతిగా ఆలోచిస్తున్నానా? 276 00:16:54,097 --> 00:16:55,724 అవును, అవును, ఇంకా కాదు. 277 00:16:55,807 --> 00:16:58,519 ఈ రోజు అంతా నేను ఏమీ తినలేదు తెలుసా? పద. 278 00:17:02,564 --> 00:17:05,526 నాన్న చేసిన బార్బిక్యూ టర్కీ బర్గర్లను ఇప్పుడు తినచ్చు. 279 00:17:05,608 --> 00:17:08,945 నేను కూడా. కానీ కొద్దిగా పాస్తా వేడి చేసుకుని తింటానేమో. 280 00:17:11,573 --> 00:17:13,157 మంచిది. ఇది మళ్లీ పని చేయడం లేదు. 281 00:17:13,242 --> 00:17:15,117 ప్లగ్ తీసేసి మళ్లీ తిరిగి పెట్టి చూడు. 282 00:17:20,665 --> 00:17:21,666 ఇది పని చేసింది. 283 00:17:23,377 --> 00:17:26,630 నాన్న చేసే తక్కువ స్థాయి టెక్నాలజీ పరిష్కారాలని మనం ఎప్పుడూ ఎగతాళి చేస్తాం, 284 00:17:27,923 --> 00:17:29,800 కానీ కొన్నిసార్లు, అవే పని చేస్తాయి. 285 00:17:33,595 --> 00:17:36,515 బ్యాటరీ మార్చినంత తేలికగా దీన్ని బాగుచేయచ్చు అనుకుంటున్నావా? 286 00:17:36,598 --> 00:17:37,683 ప్రయత్నించడంలో తప్పు లేదు. 287 00:17:38,725 --> 00:17:40,143 ఒక సమస్య ఉంది. 288 00:17:40,227 --> 00:17:41,353 బ్యాటరీ ఎక్కడ ఉంది? 289 00:17:43,313 --> 00:17:44,857 ఇదే అయి ఉంటుంది. 290 00:17:44,940 --> 00:17:48,235 ఇది పనిచేయకపోతే, అమ్మా, నాన్నల్ని మనం మళ్లీ మామూలుగా చేయలేము. 291 00:17:53,991 --> 00:17:55,409 మనం ఇంకేదయినా ప్రయత్నించాలి. 292 00:18:10,549 --> 00:18:11,550 పద. 293 00:18:15,721 --> 00:18:17,264 నిజం నిగ్గుతేలే సమయం ఇది. 294 00:18:22,603 --> 00:18:23,979 అన్ పాజ్. 295 00:18:25,272 --> 00:18:26,523 హాయ్, పిల్లలూ. 296 00:18:27,149 --> 00:18:28,984 మీరు ఇంక గొడవ పడటం ఆపేయడం సంతోషంగా ఉంది. 297 00:18:29,067 --> 00:18:31,278 -ఇది పని చేసింది. -ఏం పని చేసింది? 298 00:18:31,361 --> 00:18:34,990 -పేరెంటల్ కంట్రోల్స్ ఆన్ చేయి. -ఓహ్, నేను వెంటనే హాలో డెన్ కి వెళతాను. 299 00:18:35,073 --> 00:18:37,492 -లేదు, ఆ పేరెంటల్ కంట్రోల్స్ కాదు. -ఇవీ. 300 00:18:38,035 --> 00:18:40,370 పేరెంటల్ కంట్రోల్స్ ఆన్. 301 00:18:45,417 --> 00:18:48,795 సరే, ఇక్కడ ఏం జరుగుతోంది? మనం హాలు దారిలో ఎందుకు నిలబడ్డాం? 302 00:18:49,213 --> 00:18:50,589 ఆ పరికరం ఏంటి? 303 00:18:50,672 --> 00:18:53,383 మేము అన్నీ వివరిస్తాము. కానీ మొదటగా, మీరు సరిగ్గా చెప్పారు. 304 00:18:53,467 --> 00:18:54,968 మేము అనుకున్నంత పెద్దవాళ్లం ఇంకా కాలేదు. 305 00:18:55,052 --> 00:18:56,970 మేం నిర్ణయాలు తీసుకోవడంలో మీ సహాయం మాకు ఇంకా అవసరం ఉంది. 306 00:18:59,806 --> 00:19:00,974 మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. 307 00:19:01,934 --> 00:19:03,185 ఇక్కడికి రండి. 308 00:19:03,268 --> 00:19:05,521 -మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాము. -మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. 309 00:19:07,731 --> 00:19:08,565 ఇప్పుడు వివరించండి. 310 00:19:09,149 --> 00:19:11,318 మేము చెప్పడానికి ముందు, మా క్షమాపణలు, 311 00:19:11,401 --> 00:19:15,322 మీరు మమ్మల్ని ఒక వారం రోజుల పాటు ఇంట్లో నిర్బంధిస్తారు, ఇది పూర్తిగా సరైనదే. 312 00:19:15,405 --> 00:19:18,700 అవును. ఇంకా రేపు మీరు మా ప్రిన్సిపాల్ ని కలవాలి, 313 00:19:18,784 --> 00:19:20,369 కాబట్టి మాకు రెండు వారాలు శిక్ష వేయడం మంచిది. 314 00:19:27,918 --> 00:19:30,128 సరే, అమ్మా. నేల శుభ్రంగా తుడిచాను. ఇక నేను వెళ్లచ్చా? 315 00:19:30,212 --> 00:19:32,756 అవును, మేము బట్టలు ఉతికి ఆరేశాం ఇంకా చెత్త బయట పడేశాం. 316 00:19:32,840 --> 00:19:35,133 నాన్నా, ఈ శిక్ష మరీ ఎక్కువైపోయిందని అమ్మకి చెప్పు. 317 00:19:35,217 --> 00:19:39,221 సరే, మమ్మల్ని క్షమించండి. మాకు తగిన శిక్ష పడింది. దయచేసి ఇంక ఆపండి. 318 00:19:39,304 --> 00:19:40,305 సరే, వినండి. 319 00:19:40,389 --> 00:19:42,391 నా ప్రామిస్… మేము ప్రామిస్ చేస్తున్నాం, ఇంక ఇలాంటి పని ఎప్పుడూ… 320 00:19:42,975 --> 00:19:43,976 మ్యూట్. 321 00:20:51,293 --> 00:20:53,295 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్