1 00:00:14,097 --> 00:00:16,600 న్యూటన్ మిడిల్ స్కూల్ 2 00:00:20,896 --> 00:00:24,691 హేయ్. నిదానం! 3 00:00:28,362 --> 00:00:30,155 ఆర్ట్ క్లబ్ లో చేరాలని ఆలోచిస్తున్నావా? 4 00:00:30,697 --> 00:00:32,991 లేదు. సమయం వృథా అవుతుంది. 5 00:00:33,075 --> 00:00:33,909 ఎక్స్ ప్లోర్ డ్రీమ్ డిస్కవర్ 6 00:00:33,992 --> 00:00:35,869 ఇది నాకు సరదాగా ఉంది. ఈ రోజు నీకు డిటెన్షన్ ఉంది తెలుసా? 7 00:00:35,953 --> 00:00:38,038 గుర్తుంది. ప్రతీసారి నువ్వు నాకు గుర్తు చేయక్కరలేదు. 8 00:00:38,121 --> 00:00:40,332 నిజానికి, నేను గుర్తు చేయాలి ఎందుకంటే నేను డిటెన్షన్ పర్యవేక్షకుడిని, 9 00:00:40,415 --> 00:00:42,501 నువ్వు ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చావు. 10 00:00:45,170 --> 00:00:46,588 మిస్టర్ హాడ్జ్, నేను మీకు ఒక మాట చెప్పాలి, 11 00:00:46,672 --> 00:00:49,800 నా గ్రేడ్ గురించి వాదించినందుకు నన్ను డిటెన్షన్ లో పెట్టడం అన్యాయం. 12 00:00:49,883 --> 00:00:51,885 నువ్వు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పావు, 13 00:00:51,969 --> 00:00:54,012 అది సరైన చర్యే అని నేను అనుకుంటున్నానని నేను కూడా నీకు చెప్పాను. 14 00:00:54,096 --> 00:00:57,182 సరే, కానీ నాకు గ్రేడ్స్ ఎంత ముఖ్యమో మీకు తెలిస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. 15 00:00:57,266 --> 00:00:59,142 నాతో ఇలా వాదిస్తూ ఉండే కన్నా 16 00:00:59,226 --> 00:01:02,563 నీ తరువాత పరీక్ష కోసం నీ ఇష్టాన్ని చదువు మీద పెట్టచ్చు కదా. 17 00:01:06,525 --> 00:01:08,986 మీ పేరుతో సైన్ ఇన్ కావడానికి అది ట్యాప్ చేసి, తరువాత మీ ఫోన్ ని ఆ బాక్స్ లో పెట్టండి. 18 00:01:09,069 --> 00:01:11,029 దానిని మీరు అరవై నిమిషాల్లో మళ్లీ తీసుకోవచ్చు. 19 00:01:11,113 --> 00:01:12,531 సైన్ ఇన్ 20 00:01:16,410 --> 00:01:18,412 నీ ఫోన్ ని దయచేసి ఆ బాక్స్ లో పెట్టు. 21 00:01:18,495 --> 00:01:20,747 అలాగే. నేను ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చాను. థాంక్స్. 22 00:01:20,831 --> 00:01:21,832 డిటెన్షన్ నియమాలు 23 00:01:21,915 --> 00:01:23,125 నిన్ను డిటెన్షన్ లో పెట్టారా? 24 00:01:23,208 --> 00:01:24,543 నీ పరామర్శకి థాంక్స్. 25 00:01:26,044 --> 00:01:27,671 -అంతా వచ్చారు. -థాంక్యూ, బెన్. 26 00:01:28,839 --> 00:01:32,176 అయితే ఈ రోజు ఇద్దరే విద్యార్థులు. ఇది కాస్త హాయిగా ఉంది. 27 00:01:33,385 --> 00:01:35,929 కానీ, నిర్బంధం అనేది ఒక చెడు అనుభవం కాదు. 28 00:01:36,430 --> 00:01:39,892 మీరు చేసిన తప్పు ఏంటి, దాన్ని ఎలా మెరుగుపర్చుకుంటారు అని ఆలోచించుకోడానికి ఇది ఒక అవకాశం. 29 00:01:40,559 --> 00:01:43,020 యాస్మిన్, నిన్ను ఇక్కడ చూడటం ఆశ్చర్యంగా ఉంది. 30 00:01:43,812 --> 00:01:45,189 "టీచర్ తో వాదించావు" కదా? 31 00:01:45,272 --> 00:01:47,900 నాకు ఏ గ్రేడ్ రావలసి ఉంటే మిస్టర్ హాడ్జ్ బి గ్రేడ్ ఇచ్చాడు. 32 00:01:48,400 --> 00:01:51,695 నాకు అన్యాయంగా గ్రేడ్ ఇచ్చారని నిరసన వ్యక్తం చేయడానికి కూడా అనుమతి లేదా? 33 00:01:52,988 --> 00:01:55,699 "క్లాసులో అందరి ముందు గట్టిగా అరిచింది, అందరి సమయం వృథా చేసింది" 34 00:01:55,782 --> 00:01:57,409 అని ఇక్కడ రాసి ఉంది, 35 00:01:57,951 --> 00:01:59,870 అది అమర్యాదకరం అని నీకు తెలియాలి. 36 00:02:04,208 --> 00:02:07,419 నేను ఇంగ్లీష్ వ్యాసం రాయాలి కానీ అప్పుడు నేను బొమ్మలు గీస్తున్నాను. 37 00:02:07,503 --> 00:02:10,297 మాడిసన్, నాకు అర్థం కాలేదు. 38 00:02:10,797 --> 00:02:13,926 నీలో ఎప్పుడూ ఈ "నిర్లక్ష్య" ధోరణి కనిపిస్తుంది. 39 00:02:14,426 --> 00:02:15,844 నీకు డిటెన్షన్ లో ఉండటం ఇష్టమా? 40 00:02:15,928 --> 00:02:18,263 నేను ఇక్కడ కూర్చుని గంట సేపు ఏమీ చేయకుండా ఉండచ్చు. 41 00:02:18,347 --> 00:02:20,724 మంచి ఆలోచన. కానీ నా దగ్గర ఇంకా మెరుగైన ఐడియా ఉంది. 42 00:02:21,517 --> 00:02:24,478 నువ్వు నీ డిటెన్షన్ సమయంలో ట్రోఫీ కేసుల్ని శుభ్రం చేయాలి. 43 00:02:25,062 --> 00:02:28,106 మిగతా విద్యార్థులు సాధించిన విజయాలు చూసైనా నీకు స్ఫూర్తి కలుగుతుందేమో. 44 00:02:28,190 --> 00:02:30,317 ఆ పనికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. 45 00:02:30,400 --> 00:02:31,568 నేను తనకి సాయం చేస్తాను. 46 00:02:33,028 --> 00:02:34,029 మంచిది. 47 00:02:56,635 --> 00:03:00,180 వస్తువులు భద్రపరిచే అధికారి గది ముందు ఉంది. శుభ్రపరిచే వస్తువులు అక్కడ నుండి తీసుకోండి. 48 00:03:00,264 --> 00:03:03,100 ఈ బేస్మెంట్ పాత కాలం నాటిదిలా ఉంది. వాసన కూడా అలాగే వస్తోంది. 49 00:03:04,101 --> 00:03:08,188 అవును, ఇది ఈ స్కూలులోనే పాత కట్టడం. దీని పైనదంతా మళ్లీ కొత్తగా నిర్మించారు. 50 00:03:08,689 --> 00:03:12,276 హేయ్, బెన్, ఇది నా మొదటి డిటెన్షన్ కాబట్టి, 51 00:03:12,359 --> 00:03:15,112 నా పర్మనెంట్ రికార్డు నుండి దీనిని తీసేయమని వైస్ ప్రిన్సిపాల్ ని ఒప్పించాలి అనుకుంటా. 52 00:03:15,195 --> 00:03:17,656 అందుకే నువ్వు స్వచ్ఛందంగా వచ్చావు. అతని మెప్పు పొందడానికి. 53 00:03:17,739 --> 00:03:21,243 నీ రికార్డులో ఇది ఉండకూడదు అంటే, నువ్వు అసలు డిటెన్షన్ తెచ్చుకోకుండా ఉండాల్సింది. 54 00:03:21,326 --> 00:03:22,744 కానీ ఇది నీ మొదటి పొరపాటు కాబట్టి, 55 00:03:22,828 --> 00:03:25,372 మీ పేరెంట్స్ ని రప్పించి వైస్ ప్రిన్సిపాల్ ని అడగమను. 56 00:03:26,164 --> 00:03:28,458 అయినా నీ ఎయిత్ గ్రేడ్ రికార్డు కోసం అంతగా ఎందుకు పట్టించుకుంటున్నావు? 57 00:03:28,542 --> 00:03:29,960 దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. 58 00:03:30,043 --> 00:03:31,128 కానీ నాకు అది చాలా ముఖ్యం. 59 00:03:31,628 --> 00:03:34,464 డిటెన్షన్ అనేది చెడ్డది, బి గ్రేడ్ విద్యార్థికి కూడా ఎఫ్ గ్రేడ్ తెప్పిస్తుంది. 60 00:03:34,965 --> 00:03:36,633 అది మీకు అర్థం కాకపోవచ్చు. 61 00:03:36,717 --> 00:03:37,718 ఏమైనా కానీ. 62 00:03:37,801 --> 00:03:39,219 ఈ దారిలో వెళ్లాలి. 63 00:03:44,516 --> 00:03:45,517 నీ వెనుక వస్తాం. 64 00:03:59,489 --> 00:04:01,283 ఈ గోడలు మెటల్ తో ఎందుకు చేశారని ఆలోచిస్తున్నా. 65 00:04:01,867 --> 00:04:04,828 అప్పట్లో, 1950ల కాలంలో, ఇది ఎమర్జెన్సీ షెల్టర్ గా ఉండేది. 66 00:04:05,871 --> 00:04:09,124 డిటెన్షన్ పర్యవేక్షుడిగా, విద్యార్థుల భద్రత కూడా నా బాధ్యతే. 67 00:04:09,208 --> 00:04:12,377 నేను స్కూల్ లేఅవుట్ ఇంకా బయటకెళ్లే దారుల్ని గుర్తు పెట్టుకోవల్సి వచ్చింది, 68 00:04:12,461 --> 00:04:14,046 ఇంకా హ్యాండ్ బుక్ ని చదవాల్సి వచ్చింది. 69 00:04:14,630 --> 00:04:15,797 ఏ హ్యాండ్ బుక్? 70 00:04:15,881 --> 00:04:18,634 న్యూటన్ మిడిల్ స్కూల్ ప్రవర్తన నియమావళి మరియు భద్రత. 71 00:04:18,716 --> 00:04:20,302 మీ ఇద్దరికీ ఒక కాపీని ఈమెయిల్ చేస్తాను. 72 00:04:20,385 --> 00:04:22,053 -వద్దు, థాంక్స్. -వద్దు. 73 00:04:33,732 --> 00:04:35,234 పవర్ 74 00:04:55,462 --> 00:04:57,881 హేయ్! దాన్ని బయటకు తీసుకెళ్లు. 75 00:05:04,096 --> 00:05:05,138 ఇక్కడ చాలా చెత్త ఉంది. 76 00:05:05,222 --> 00:05:07,558 ఇంక అత్యవసర పరిస్థితులు రావనుకుంటున్నారేమో. 77 00:05:09,560 --> 00:05:10,811 సరే. 78 00:05:16,650 --> 00:05:19,152 మీ పని పూర్తయ్యాక, డిటెన్షన్ కి వచ్చి సైన్ అవుట్ అవ్వండి. 79 00:05:24,658 --> 00:05:25,659 బెన్? 80 00:05:31,623 --> 00:05:32,958 ఏం జరుగుతోంది? 81 00:05:36,587 --> 00:05:38,422 ప్రతి ఒక్కరూ గడ్డకట్టుకుపోయినట్లు ఉన్నారు. 82 00:05:40,883 --> 00:05:41,884 ఎమర్జెన్సీ పరిస్థితులలో, 83 00:05:41,967 --> 00:05:43,886 మనం దగ్గరలోని టీచర్ ని హెచ్చరించాలి. 84 00:05:44,553 --> 00:05:47,389 -ఇతను సాయం చేస్తాడనుకోను. -ఊరికే అల్లరి చేయడం ఆపు. 85 00:05:47,890 --> 00:05:51,101 ఎందుకు? ఇది విచిత్రంగా ఉంది. కానీ బాగుంది. 86 00:05:55,814 --> 00:05:57,900 నా ఉద్దేశం, మొత్తం స్కూల్ అంతా ఇప్పుడు మనదే. 87 00:05:59,276 --> 00:06:01,945 మనం హాళ్లలో పరిగెత్తచ్చు లేదా టీచర్ల గదుల్లోకి వెళ్లచ్చు. 88 00:06:02,029 --> 00:06:04,448 -వాటిల్లోకి స్టూడెంట్స్ కి ప్రవేశం లేదు. -సరే, మనం ఏదో ఒకటి చేయాలి. 89 00:06:04,531 --> 00:06:05,532 నీకు ఎందుకు ఆందోళన లేదు? 90 00:06:05,616 --> 00:06:08,076 ఎవరో ఎక్కడో ఈ సమస్యని పరిష్కరించే వాళ్లు ఉంటారని నాకు ఖచ్చితంగా తెలుసు, 91 00:06:08,160 --> 00:06:09,494 ఇంకా వాళ్లు ఇప్పటికే ఆ పనిలో ఉండి ఉంటారు. 92 00:06:09,578 --> 00:06:10,412 నీకలా అనిపిస్తోందా? 93 00:06:10,495 --> 00:06:13,624 ఈ సమస్య పరిష్కరించడం తెలిసిన వ్యక్తి కూడా గడ్డకట్టుకుపోతే ఏంటి? 94 00:06:13,707 --> 00:06:14,708 అలాగే. 95 00:06:14,791 --> 00:06:17,461 సరే. ఇక్కడ ఏం జరిగిందో నీకు ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు, 96 00:06:17,544 --> 00:06:19,671 నేను బయట ఇంకా ఆడిటోరియంలో చూస్తాను. 97 00:06:19,755 --> 00:06:22,341 ఆగు. మనం విడివిడిగా వెళ్లలేము. మనం బడ్డీ సిస్టమ్ ని ఉపయోగిద్దాం. 98 00:06:22,424 --> 00:06:24,009 యాస్మిన్, నేను నీ బడ్డీని అవుతాను. 99 00:06:55,374 --> 00:06:57,668 ఇతను ఎవరి మీదనో అరుస్తున్నట్లున్నాడు. 100 00:07:06,593 --> 00:07:07,761 ఇది ఇంకా బాగుంది. 101 00:07:23,443 --> 00:07:25,487 మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఫోన్ చేయాలి. 102 00:07:28,949 --> 00:07:30,242 అది పని చేయడం లేదు. 103 00:07:31,952 --> 00:07:33,662 ఫోన్లు కూడా స్తంభించిపోయాయి. 104 00:07:33,745 --> 00:07:35,789 మన ఊరంతా ఇలాగే జరిగి ఉండచ్చు అనుకుంటున్నావా? 105 00:08:23,378 --> 00:08:24,379 హలో? 106 00:08:28,800 --> 00:08:29,801 హలో? 107 00:08:38,184 --> 00:08:39,227 ఎవరైనా ఉన్నారా? 108 00:08:45,692 --> 00:08:47,110 పద. 109 00:08:48,779 --> 00:08:50,364 భలే. ఫోన్లు కూడా పని చేయడం లేదు. 110 00:08:51,865 --> 00:08:53,784 3:34 ఇంకా 59 సెకన్లు. 111 00:08:54,785 --> 00:08:58,914 సరే, ఇదంతా ఎప్పుడు జరిగిందో మనకి స్పష్టంగా తెలిసింది. కానీ ఇది పెద్దగా ఉపయోగపడదు. 112 00:08:58,997 --> 00:09:01,708 మేము అయిదు బ్లాకులు తిరిగాం, కానీ ఎవ్వరూ అంగుళం కూడా కదల్లేదు. 113 00:09:01,792 --> 00:09:03,085 అది నిజంగా విడ్డూరంగా ఉంది. 114 00:09:03,168 --> 00:09:05,254 "విడ్డూరం" అనే పదాన్ని మించి ఇక్కడ పరిస్థితి ఉంది. 115 00:09:05,754 --> 00:09:08,006 -ఏమైనా ఆధారాలు దొరికాయా? -ఇక్కడ ఏమీ లేవు. 116 00:09:08,090 --> 00:09:10,008 -జిమ్ ఇంకా పూల్ దగ్గర పరిస్థితి? -నేను అక్కడికి వెళ్లలేదు. 117 00:09:10,092 --> 00:09:12,094 నేను ప్రతి మూలకీ వెళ్లి చూడాలని ఆశిస్తున్నావా? 118 00:09:12,177 --> 00:09:13,887 మాడిసన్, ఇది సీరియస్ సమస్య. 119 00:09:13,971 --> 00:09:16,390 నువ్వు పాడు చేయడానికి ఇది స్కూల్ ప్రాజెక్టు కాదు. 120 00:09:16,473 --> 00:09:18,809 -అవును, మళ్లీ మొదలుపెట్టావు. -ఆగు, ఏంటి? 121 00:09:18,892 --> 00:09:20,853 కిందటి ఏడాది, మాకు ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చారు, 122 00:09:20,936 --> 00:09:22,312 కానీ మాడిసన్ తన వంతు పూర్తి చేయలేదు. 123 00:09:22,396 --> 00:09:24,898 యాస్మిన్, నువ్వు రిలాక్స్ అవ్వు, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నా, 124 00:09:24,982 --> 00:09:26,650 వీటికి మనకి మార్కులు ఇవ్వరు. 125 00:09:26,733 --> 00:09:29,361 వీళ్లందరికీ ఎందుకిలా జరిగిందో బహుశా మనం దాని మీద ఫోకస్ పెట్టాలేమో. 126 00:09:29,444 --> 00:09:31,280 -వాళ్లు స్తంభించిపోయారు. -పూర్తిగా కాదు. 127 00:09:31,363 --> 00:09:32,865 వాళ్లు ఐస్ క్యూబ్ లాగా గడ్డకట్టుకుపోలేదు. 128 00:09:32,948 --> 00:09:34,616 అందరినీ హిప్నటైజ్ చేసి ఉండచ్చా? 129 00:09:34,700 --> 00:09:36,118 ఆ గడియారాన్ని హిప్నటైజ్ చేయలేరు కదా. 130 00:09:37,786 --> 00:09:39,162 ఆ గడియారం, అది కదిలింది. 131 00:09:39,246 --> 00:09:43,166 ఇంతకుముందు, అది 3:34 ఇంకా 59 సెకన్లు చూపించింది, కానీ ఇప్పుడు 3:35 ఇంకా ఒక్క సెకను చూపిస్తోంది. 132 00:09:51,133 --> 00:09:54,678 అతని కళ్లు మూతపడ్డాయి. ఇంతకుముందు, అవి తెరిచి ఉన్నాయి. 133 00:09:54,761 --> 00:09:56,346 ఆగు, అతని కళ్లు మూతబడి 134 00:09:56,430 --> 00:09:58,515 ఆ గడియారం రెండు సెకన్లు కదిలింది అంటే… 135 00:09:58,599 --> 00:10:01,768 అవి పూర్తిగా స్తంభించిపోలేదు, కానీ చాలా నిదానంగా కదులుతున్నాయి. 136 00:10:07,357 --> 00:10:10,444 -ఎవరో ఇక్కడ ఉన్నారు. -ఏం జరుగుతోందో వాళ్లకు తెలిసి ఉండచ్చు. 137 00:10:10,527 --> 00:10:14,281 ఆగు. అది వాళ్లే అయి ఉంటారు. ఇదంతా చేసింది "వాళ్లే" అయి ఉండచ్చు. 138 00:10:16,909 --> 00:10:18,118 ఉష్. వాళ్లు వస్తున్నారు. 139 00:10:52,319 --> 00:10:55,113 -నాకు ఇదేదో బాగా అనిపించడం లేదు. -బెన్. 140 00:11:01,328 --> 00:11:02,329 మీరు బాగానే ఉన్నారు. 141 00:11:03,497 --> 00:11:04,498 బెన్! 142 00:11:08,710 --> 00:11:09,753 ఇతను బాగానే ఉన్నాడా? 143 00:11:09,837 --> 00:11:11,255 మిస్టర్ హాడ్జ్? 144 00:11:15,425 --> 00:11:18,637 గుల్ల ఇటుకలతో నిర్మించి మెటల్ ఇన్సులేషన్ చేశారు. 145 00:11:19,137 --> 00:11:20,639 -మంచి రక్షణ. -దేని నుంచి? 146 00:11:20,722 --> 00:11:22,099 మీరు ఎందుకు ఈ డ్రెస్ లో ఉన్నారు? 147 00:11:22,182 --> 00:11:26,562 ఇది లెడ్ మిశ్రమంతో చేసిన రక్షణ కవచం, మిమ్మల్ని భద్రంగా ఉంచిన ఈ షెల్టర్ లాంటిది. 148 00:11:29,314 --> 00:11:30,399 బెన్ కోలుకుంటున్నాడు. 149 00:11:30,482 --> 00:11:33,151 అతనికి మంచి నీళ్లు ఇచ్చాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. 150 00:11:34,278 --> 00:11:35,612 ఇప్పుడు చెప్పండి, ఏం జరుగుతోంది? 151 00:11:35,696 --> 00:11:39,283 టైం డైలేషన్ గురించి నేను ఒక ప్రయోగం చేశాను. 152 00:11:39,366 --> 00:11:40,951 ఒక ల్యాబ్ లో ఫిజిసిస్ట్ గా పన్నెండేళ్ల కిందట 153 00:11:41,034 --> 00:11:43,537 నేను పని చేసినప్పటి నుంచి ఈ థియరీ మీద అధ్యయనం చేస్తున్నాను. 154 00:11:43,620 --> 00:11:47,833 మొదటగా, టైమ్ గడిచే స్పీడుని మనం మార్చవచ్చు అని నేను నమ్మాను. 155 00:11:49,042 --> 00:11:51,753 రెండు ప్రదేశాలలో, లేదా ఇద్దరు వ్యక్తులలో, 156 00:11:51,837 --> 00:11:53,797 వేర్వేరు టైమ్ ఫ్లో రేట్లని సృష్టించవచ్చు. 157 00:11:53,881 --> 00:11:57,384 ఒక వ్యక్తికి గంట టైమ్ అయితే మరొకరికి అది 36 సెకన్లు కావచ్చు. 158 00:11:58,135 --> 00:12:00,262 నేను ఇది చేయగలనని నా కొలీగ్స్ నమ్మలేదు, కానీ… 159 00:12:00,345 --> 00:12:02,514 అయితే, మీరు అందరినీ గినీ పందుల్లా వాడుకున్నారా? 160 00:12:04,725 --> 00:12:06,143 ఖచ్చితంగా అలా కాదు. 161 00:12:11,148 --> 00:12:14,193 ఈ పరిమిత పారామీటర్స్ లో నేను ఈ ప్రయోగం చేస్తున్నాను. 162 00:12:15,819 --> 00:12:17,863 సీతాకోకచిలుకల్ని మాత్రమే ప్రభావితం చేయాలి అనుకున్నారు. 163 00:12:17,946 --> 00:12:19,781 అవును, కానీ ఆ టైమ్ ఫీల్డ్ జనరేటర్ కోసం 164 00:12:19,865 --> 00:12:22,284 ఎక్కువ మొత్తంలో కరెంటు అవసరమైంది, 165 00:12:22,784 --> 00:12:26,038 కాబట్టి నేను మన స్కూలు అనుబంధ విద్యుచ్ఛక్తిని వాడుకున్నాను. 166 00:12:27,289 --> 00:12:29,791 కానీ అనుకోని విధంగా కరెంటు మోతాదు ఎక్కువైంది 167 00:12:29,875 --> 00:12:32,711 దాని వల్ల పెద్ద మొత్తంలో ఎలక్ట్రికల్ లోడ్ విడుదలై, 168 00:12:33,545 --> 00:12:36,048 భారీ విద్యుత్ తరంగాన్ని సృష్టించింది. 169 00:12:36,632 --> 00:12:39,760 ప్రమాదవశాత్తూ ప్రతి ఒక్కరి టైమ్ ఫ్లో రేట్ ని తగ్గించేసింది. 170 00:12:40,469 --> 00:12:41,970 మీ థియరీని మీరు రుజువు చేశారు. 171 00:12:42,054 --> 00:12:43,555 ఇప్పుడు, మళ్లీ మామూలుగా ఎలా చేస్తారు? 172 00:12:43,639 --> 00:12:46,308 సరే, ఈ మొత్తం ప్రయోగాన్ని రివర్స్ చేసే ఒక ఈక్వేషన్ నా దగ్గర ఉంది, 173 00:12:46,391 --> 00:12:50,020 కానీ మన స్కూలు అనుబంధ విద్యుత్ వనరులు తగ్గిపోయాయి, 174 00:12:50,103 --> 00:12:52,105 ఇంక నాకు ప్రత్యామ్నాయ విద్యుత్ అందుబాటులో లేదు. 175 00:12:52,189 --> 00:12:53,774 ఇంకోలా చెప్పాలంటే, ఈ పరిస్థితిని సరిదిద్దలేరా? 176 00:12:53,857 --> 00:12:56,235 వీళ్లందరినీ సూపర్ నత్తల మాదిరిగా ఇలా వదిలేయలేరు. 177 00:12:56,318 --> 00:12:58,320 -ఇంకా మా సంగతి ఏంటి? -ఏ ఒక్కరినీ ఇలా వదిలేయము. 178 00:12:58,403 --> 00:13:00,155 మీరు ఈ ప్రయోగం చేయలేరని మీ సైంటిస్టు మిత్రులు చెప్పారు, 179 00:13:00,239 --> 00:13:01,949 మీరు వారి మాట ఆలకించి, ఇది వదిలేయాల్సింది! 180 00:13:02,032 --> 00:13:03,867 -ఆగు, చూడు… -మీరు టైమ్ ఫ్లోని మళ్లీ మామూలుగా చేయలేకపోతే, 181 00:13:03,951 --> 00:13:04,993 అందరి జీవితాలు నాశనం అవుతాయి. 182 00:13:05,077 --> 00:13:07,037 -అది మీకు అర్థం అవుతోందా? -నాకు తెలుసు. 183 00:13:07,120 --> 00:13:09,581 మిమ్మల్ని డిటెన్షన్ లో పెట్టి దాన్ని మీ పర్మనెంట్ రికార్డులో నమోదు చేయాలి అసలు. 184 00:13:16,380 --> 00:13:19,800 నేను ఎలా మూర్ఛబోయానో తెలియడం లేదు. నేను డిటెన్షన్ పర్యవేక్షకుడిని కదా. 185 00:13:19,883 --> 00:13:22,803 క్లిష్ట సమయాల్లో నేను సాయం చేయాలి, నేనే కంగారుపడి, మూర్ఛపోకూడదు. 186 00:13:22,886 --> 00:13:26,974 బాబూ, రిలాక్స్ అవ్వు. నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండగలనని అనుకోకు. 187 00:13:27,057 --> 00:13:29,017 -అది నీకు చెప్పడం తేలికే. సారీ. -ముందుకు వాలు. 188 00:13:29,101 --> 00:13:31,770 నా ఉద్దేశం అది కాదు, నువ్వు చాలా తప్పులు చేస్తావని నేను అనలేదు. 189 00:13:31,854 --> 00:13:34,815 ఫర్వాలేదు. అసలు నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? 190 00:13:34,898 --> 00:13:36,066 మా అమ్మ, నాన్న ఇంటికి లేటుగా వస్తారు, 191 00:13:36,149 --> 00:13:39,319 అందుకే స్కూల్ అయిపోయాక నేను ఏదో ఒక పనిని ఎంచుకోవలసి వచ్చింది. 192 00:13:39,987 --> 00:13:42,239 -నీకు ఇది నిజంగా ఇష్టం ఉన్నట్లుంది. -నాకు ఇష్టమే. 193 00:13:42,322 --> 00:13:44,575 మిడిల్ స్కూల్ కఠినంగా, అయోమయంగా ఉంటుంది, 194 00:13:45,075 --> 00:13:47,411 అందుకే మనం ఏం చేయాలో తెలుసుకోవడానికి స్కూలు నియమాలు సాయపడతాయి. 195 00:13:47,494 --> 00:13:48,871 నాకు అది సాయం చేసింది. 196 00:13:49,496 --> 00:13:50,581 అవును, నాకు అది తెలుస్తోంది. 197 00:13:51,290 --> 00:13:53,500 బహుశా నాకు కూడా స్కూల్ అయ్యాక ఏదో ఒక పని ఉండాలేమో. 198 00:13:54,376 --> 00:13:56,086 డిటెన్షన్ కాకుండా. 199 00:13:59,506 --> 00:14:02,467 నా లాకర్ లో కొన్ని స్నాక్స్ దొరికాయి. 200 00:14:04,178 --> 00:14:06,805 థాంక్యూ. నువ్వు బాగానే ఉన్నావా? 201 00:14:08,223 --> 00:14:09,433 మనలో ఎవరైనా బాగున్నామా? 202 00:14:09,516 --> 00:14:12,769 నా ఉద్దేశం, భవిష్యత్తు గురించి మనకి ఏ ప్లాన్స్ ఉన్నా అవేవీ ఇప్పుడు పని చేయవు. 203 00:14:17,232 --> 00:14:20,569 బెన్. నువ్వు కోలుకోవడం సంతోషం. 204 00:14:21,278 --> 00:14:23,197 మీరంతా బాగున్నారని ఆశిస్తాను. 205 00:14:23,280 --> 00:14:24,615 కానీ మీరు అలా లేకపోవచ్చు. 206 00:14:24,698 --> 00:14:29,328 చూడండి, ఇది చెప్పే అర్హత ఉందో లేదో కానీ, సారీ. నేను ఈ సమస్యని సరిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. 207 00:14:29,870 --> 00:14:31,455 వీళ్లందరూ మళ్లీ మామూలు స్థితికి వస్తారా? 208 00:14:32,039 --> 00:14:33,582 అవును, వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారు. 209 00:14:33,665 --> 00:14:36,084 వాళ్ల వరకూ మాత్రం, ఇంకా ఈ ఆవరణలో నడుస్తున్నామనో 210 00:14:36,168 --> 00:14:37,711 లేదా కార్ డ్రైవింగ్ చేస్తున్నామనో అనుకుంటూ ఉంటారు. 211 00:14:37,794 --> 00:14:39,296 ఏదో తేడా జరిగిందని కూడా వాళ్లకు తెలియదు. 212 00:14:40,589 --> 00:14:43,217 -ఆ కార్లు. అవి ఎలక్ట్రికల్ వి కదా. -అవును? 213 00:14:43,300 --> 00:14:45,719 సైన్స్ క్లాసులో మేము ఎలక్ట్రిసిటీ గురించి చర్చించాం, 214 00:14:45,802 --> 00:14:50,557 కొత్తగా వచ్చే కార్లకు ఎక్కువ సామర్థ్యం ఉన్న సూపర్ సెల్ బ్యాటరీలు తయారు చేస్తున్నారని మీరు చెప్పారు. 215 00:14:50,641 --> 00:14:52,518 నా క్లాసును నిజంగా నువ్వు విన్నావు. 216 00:14:54,186 --> 00:14:56,063 మీకు ఎక్కువ విద్యుత్ కావాలి అన్నారు కదా. 217 00:15:02,069 --> 00:15:03,737 మీకు ఇంకొన్ని కావాలా? 218 00:15:03,820 --> 00:15:06,365 అవును. ఆ కారు నుండి మరొక్కటి తీస్తే సరిపోతుంది. 219 00:15:08,242 --> 00:15:09,826 నీకు నిజంగా ఒక మంచి ఐడియా తట్టింది. 220 00:15:09,910 --> 00:15:12,204 టీచర్ చెప్పింది నాకు గుర్తుకొచ్చింది అంతే. 221 00:15:12,287 --> 00:15:16,750 లేదు, నువ్వు తెలివైన దానివి. నువ్వు ఎందుకు ప్రయత్నించవో నాకు అర్థం కావడం లేదు. 222 00:15:16,834 --> 00:15:19,586 -ఇది మళ్లీ గ్రూప్ ప్రాజెక్ట్ గురించేనా? -లేదు. 223 00:15:21,463 --> 00:15:22,464 కొద్దిగా. 224 00:15:23,215 --> 00:15:27,386 సరే. నేను ఎందుకు ప్రయత్నించలేదో చెబుతాను. అది సరిగ్గా వచ్చి ఉండేది కాదు. 225 00:15:29,263 --> 00:15:31,765 ఏ గ్రేడ్ రాకపోతే నువ్వు, ఎమిలీ, మాయా, మీరంతా నా మీద కోప్పడే వారు. 226 00:15:32,516 --> 00:15:33,976 నీ కోసం నీ వంతు పని కూడా మేమే చేశాం. 227 00:15:34,059 --> 00:15:36,520 అందుకే మీకు ఏ గ్రేడ్ వచ్చింది. చూడు, నేను కొన్ని పనులు బాగా చేయలేను. 228 00:15:36,603 --> 00:15:39,231 నేను నాటకం కోసం ఆడిషన్ ఇచ్చినప్పుడు అందరూ నవ్వారు గుర్తుందా? 229 00:15:39,314 --> 00:15:43,277 నేను ఎంత చదివినా సి గ్రేడ్ వస్తుంది. నా టైమ్ వృథా అవుతుంది. 230 00:15:43,360 --> 00:15:45,654 నువ్వు ప్రయత్నించడం ఆపేయకూడదు అనుకుంటా. 231 00:15:45,737 --> 00:15:47,865 నా ఉద్దేశం, ఈ రోజు నువ్వే అందరినీ కాపాడుతున్నావు. 232 00:15:51,243 --> 00:15:53,704 నీకు నువ్వు ఇంత ఒత్తిడిని పెంచుకోకూడదు. 233 00:15:54,496 --> 00:15:56,707 బి గ్రేడ్ వచ్చిందని వాదించిన అమ్మాయేనా ఈ మాట అంటున్నది? 234 00:15:59,251 --> 00:16:02,713 చూడు, మా కుటుంబంలో కాలేజీకి వెళ్లే అవకాశం దక్కిన మొదటి వ్యక్తిని నేనే. 235 00:16:03,422 --> 00:16:07,176 అది మంచిదే, కానీ అన్నీ మంచి గ్రేడ్స్ రావాలని లేదు కదా. 236 00:16:07,759 --> 00:16:10,429 ఈ రోజు తరువాత, బి గ్రేడ్ వచ్చిందని బాధపడటం మూర్ఖత్వం అనిపిస్తుంది. 237 00:16:12,055 --> 00:16:14,808 మనం ఆ గ్రూప్ ప్రాజెక్టు చేసినప్పుడు, 238 00:16:14,892 --> 00:16:17,311 నువ్వు చేసిన పనిని బాలేదు అన్నందుకు సారీ. 239 00:16:19,688 --> 00:16:21,231 అతను సాధించాడు! 240 00:16:23,275 --> 00:16:27,029 ఈ ప్రయోగం సఫలం అయితే, అసలు ఈ ప్రయోగం దేని కోసం, మిస్టర్ హాడ్జ్? 241 00:16:27,112 --> 00:16:30,866 కొన్ని పారామీటర్స్ లో టైమ్ గమనాన్ని మార్చడం వల్ల చాలా విస్తృతమైన ప్రయోజనాలు ఉంటాయి. 242 00:16:30,949 --> 00:16:33,493 నా ఉద్దేశం, ఎవరైనా అనారోగ్యం పాలైనా, గాయపడినా ఇది పనికొస్తుంది. 243 00:16:33,577 --> 00:16:37,206 అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకి చికిత్స అవసరమైనప్పుడు టైమ్ ఫ్లో స్థితిలోకి తీసుకెళ్లవచ్చు. 244 00:16:37,289 --> 00:16:39,166 అలా వాళ్ల ప్రాణాల్ని కాపాడవచ్చు. 245 00:16:39,249 --> 00:16:41,251 అవును, లేదా భూమి ధ్రువ ప్రాంతాలలో మంచు కరిగిపోతుంది అనుకోండి 246 00:16:41,335 --> 00:16:44,254 అప్పుడు టైమ్ ఫ్లో రేటుని తగ్గించి ఆ మంచు కరగడాన్ని నిదానించేలా చేయచ్చు. 247 00:16:44,838 --> 00:16:46,590 మీరు ఈ ప్రయోగాన్ని ఎందుకు వదిలేయలేదో తెలుస్తోంది. 248 00:16:47,424 --> 00:16:50,177 మనం బ్యాటరీలు తెచ్చుకున్న కార్ల మీద నోట్స్ పెట్టాము. 249 00:16:50,260 --> 00:16:51,470 ఇంక పని మొదలుపెట్టే టైమ్ వచ్చిందా? 250 00:16:52,137 --> 00:16:54,473 ఇది గనుక పనిచేస్తే, మీ అందరికీ ఏ గ్రేడ్స్ వస్తాయి. 251 00:17:03,273 --> 00:17:05,733 ఆంపరేజ్ 252 00:17:07,486 --> 00:17:08,487 అయ్యో. 253 00:17:11,949 --> 00:17:14,034 -ఇది పని చేయడం లేదు! -ఏమైంది? 254 00:17:14,117 --> 00:17:16,994 ఈ సూపర్ సెల్ బ్యాటరీలు ఎక్కువ ఐయాన్ ఎక్స్ ఛేంజ్ ని బదలీ చేస్తున్నట్లున్నాయి. 255 00:17:17,079 --> 00:17:19,455 థెర్మియానిక్ వాల్వ్ గనుక పేలిపోతే, అంతా నాశనం అయినట్లే. 256 00:17:19,540 --> 00:17:21,583 దీనిని కూల్ చేయడానికి మనం ఏదైనా మార్గం కనిపెట్టాలి. 257 00:17:24,377 --> 00:17:27,297 -కంప్రెస్డ్ ఎయిర్ చల్లగా ఉంటుంది. -మంచి ఆలోచన. అది ప్రయత్నిద్దాం. 258 00:17:31,718 --> 00:17:33,136 ఇది పని చేయడం లేదు. 259 00:17:33,220 --> 00:17:37,057 పేజీ 14. "ప్రతి తరగతి గదిలో సిఓ2 అగ్నిమాపక పరికరం అమర్చబడి ఉంటుంది." 260 00:17:37,140 --> 00:17:39,434 -అది ఐస్ చల్లదనంతో వస్తుంది. -అది నిజం! 261 00:17:48,610 --> 00:17:50,445 ఇది పనిచేస్తోంది! 262 00:17:50,529 --> 00:17:52,406 హ్యాండ్ బుక్ నాకు కంఠతా రావడం మీకు సంతోషం కలిగిస్తుండచ్చు. 263 00:17:52,489 --> 00:17:54,408 సరే. వెంటనే ఎమర్జెన్సీ షెల్టర్ లోకి వెళ్లండి! 264 00:17:54,491 --> 00:17:57,703 కిందటిసారి జరిగినట్లు ఇప్పుడు జరిగితే, ఆ విద్యుత్ తరంగం చాలా వేగంగా వస్తుంది. 265 00:18:59,973 --> 00:19:01,141 సాధించాం. 266 00:19:01,225 --> 00:19:04,102 అందరూ ఉన్న టైమ్ ఫ్లో లోకి మళ్లీ రావడం బాగుంది. 267 00:19:04,895 --> 00:19:06,480 అయితే, ఇప్పుడు ఏంటి? 268 00:19:09,066 --> 00:19:11,527 కానీ, మీరు ఇంకా మీ డిటెన్షన్ ని పూర్తి చేయాలి. 269 00:19:13,529 --> 00:19:15,822 అయితే, వైస్ ప్రిన్సిపాల్ ఇంక రాడు కాబట్టి, 270 00:19:15,906 --> 00:19:17,074 మిమ్మల్ని త్వరగా పంపించేస్తాను. 271 00:19:18,867 --> 00:19:22,120 -బెన్ నియమాల్ని ఉల్లంఘిస్తున్నాడు. -లేదు. 272 00:19:22,204 --> 00:19:23,413 వెసులుబాటు మాత్రమే. 273 00:19:54,319 --> 00:19:58,240 "అందరినీ కాపాడటం కోసం మీ బ్యాటరీని తీసుకువెళ్లాల్సి వచ్చింది. 274 00:19:58,323 --> 00:20:01,827 గమనిక, దయచేసి మాకు డిటెన్షన్ ఇవ్వద్దు"? 275 00:20:04,830 --> 00:20:07,749 మీకు లిఫ్ట్ కావాలి అనుకుంటా. 276 00:21:02,930 --> 00:21:04,932 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్