1 00:00:20,229 --> 00:00:22,814 డాక్టర్ జోన్ కూపర్, ఎల్.సి.ఎం.ఎఫ్.టి. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్ 2 00:00:23,565 --> 00:00:26,068 అయితే, ఎమిలీ, ఈ వారం ఎలా గడిచింది? 3 00:00:26,652 --> 00:00:28,612 చాలా బాగుంది, అనుకుంటా. 4 00:00:29,279 --> 00:00:31,907 మ్యాథ్స్ లో సి గ్రేడ్ రావడం గురించి అంటున్నావా? అది బాగుందా? 5 00:00:31,990 --> 00:00:35,786 -నిజానికి, అవును. నేను డి గ్రేడ్ వస్తుందనుకున్నా. -ఇదొక్కటే సి గ్రేడ్, బెత్. తనని వదిలేయి. 6 00:00:35,869 --> 00:00:38,247 తను నీ ఇంట్లో తన టాబ్ ని మర్చిపోయింది, అందుకే చదవలేకపోయింది. 7 00:00:40,165 --> 00:00:41,708 మనం ఏదైనా సంతోషకరమైన విషయం మాట్లాడుకుందాం. 8 00:00:42,626 --> 00:00:44,545 ఈ శనివారం వచ్చే నీ పుట్టినరోజు గురించి ఉత్సాహంగా ఉన్నావా? 9 00:00:46,213 --> 00:00:49,633 అంటే మేము లేజర్ ట్యాగ్ ఆడబోతున్నాం ఇంకా వరల్డ్ ఆఫ్ డిస్కవరీ అడ్వెంచర్ పార్క్ కి వెళ్తున్నాం. 10 00:00:51,593 --> 00:00:52,761 విడివిడిగా. 11 00:00:53,470 --> 00:00:55,138 రెండు పార్టీలు జరుపుకోవడం సరదాగా అనిపిస్తుంది. 12 00:00:55,222 --> 00:00:58,725 నువ్వు ఎవరితో పుట్టినరోజు జరుపుకోవాలి అనుకుంటున్నావో దాని గురించి నీ పేరెంట్స్ వాదులాడుకోవడం సరదాగా ఉంటుంది. 13 00:00:58,809 --> 00:01:03,438 ఫర్వాలేదు. నాకు ఆదివారంనాడు గ్యాలరీ ప్రారంభం ఉంది అందుకే శనివారం నాతో ఉంటుందని మేం ఒప్పందానికి వచ్చాం. 14 00:01:04,022 --> 00:01:05,607 మేం ఖచ్చితంగా ఆ విషయంలో ఒక అంగీకారానికి రాలేదు. 15 00:01:06,233 --> 00:01:09,862 ఒక మామూలు చిన్నపిల్ల మాదిరిగా ఒకే పుట్టినరోజుని మేమంతా కలిసి జరుపుకోవాలని నా కోరిక. 16 00:01:09,945 --> 00:01:13,156 స్వీటీ, ఇలా చూడు. మనం గొప్పగా వేడుక చేసుకోబోతున్నాం. నన్ను నమ్ము. 17 00:01:13,240 --> 00:01:15,409 -కిందటి ఏడాది ఫెయిర్ లో జరుపుకున్న మాదిరిగా. -సరే. 18 00:01:16,076 --> 00:01:19,371 -హేయ్, మనం సరదాగా గడిపాం. -లేదు, మనం సరదాగా గడిపినట్లు నువ్వు నటించావు. 19 00:01:20,163 --> 00:01:21,331 నువ్వు ఎందుకు అలా అంటున్నావు? 20 00:01:21,415 --> 00:01:24,334 ఎందుకంటే నా పుట్టినరోజు అయిన వెంటనే మీరిద్దరూ విడిపోయారు కాబట్టి. 21 00:01:25,544 --> 00:01:27,254 అలాంటి మ్యాథ్స్ ని నేను చేయగలను. 22 00:01:27,337 --> 00:01:28,463 అది నిజం కాదు. 23 00:01:28,547 --> 00:01:31,508 మీరు నిజం ఒప్పుకోండి. మనం గడిపిన మంచి సందర్భాలన్నీ, 24 00:01:31,592 --> 00:01:34,469 నా చక్కని జ్ఞాపకాలన్నీ నిజానికి ఒక అబద్ధం. 25 00:01:35,304 --> 00:01:36,930 ప్రతీదీ నా కోసం చేస్తారు. 26 00:01:38,223 --> 00:01:40,350 నీ తల్లిదండ్రులు విడిపోయినంత మాత్రాన 27 00:01:40,434 --> 00:01:42,686 వాళ్లు నీకు మంచి జ్ఞాపకాలు ఇవ్వలేదని అనుకోకు. 28 00:01:42,769 --> 00:01:44,646 ముఖ్యంగా నీ విషయంలో అలా జరగదు. 29 00:01:47,524 --> 00:01:51,361 డాక్టర్ జోన్ సరిగ్గా చెప్పారు. ఎవ్వరూ నటించలేదు. 30 00:01:53,238 --> 00:01:56,116 నీ పుట్టినరోజుని మేం ఇష్టపడ్డాం. నీ అన్ని పుట్టినరోజుల్ని మేము ఇష్టపడ్డాం. 31 00:01:59,411 --> 00:02:00,579 నాకు ఒక ఆలోచన వచ్చింది. 32 00:02:01,455 --> 00:02:02,998 ఆ విషయాన్ని నీకు నేను రుజువు చేయగలను. 33 00:02:04,666 --> 00:02:05,709 నాతో పాటు రా. 34 00:02:18,847 --> 00:02:20,390 మెమరీ థెరపీకి స్వాగతం. 35 00:02:21,391 --> 00:02:25,187 ఇది టచ్ స్టోన్ 3000, అంటే టిఎస్3. 36 00:02:25,771 --> 00:02:27,064 నీ జ్ఞాపకాల్ని మళ్లీ సజీవం చేస్తుంది. 37 00:02:27,147 --> 00:02:28,273 వావ్. 38 00:02:28,774 --> 00:02:31,109 -సరే, ఇది బాగుంది. -చాలా బాగుంది. 39 00:02:31,777 --> 00:02:35,072 మీరు చేయవలసిందల్లా మీ ఫోన్ ని కనెక్ట్ చేసి ఒక ఫోటో ని డౌన్ లోడ్ చేయాలి, 40 00:02:35,155 --> 00:02:38,283 అప్పుడు టిఎస్3 నిన్ను ఆ ఫోటోలోకి తీసుకువెళుతుంది. 41 00:02:40,661 --> 00:02:43,539 టిఎస్3 మీ ఫోన్ లో ఎంబెడెడ్ మెటాడేటాని ఉపయోగించడం ద్వారా 42 00:02:43,622 --> 00:02:48,460 అప్పటి సమయం, ప్రదేశం ఇంకా ఆ ఫోటోలో ఉన్న వాతావరణాన్ని 360 డిగ్రీలలో మళ్లీ సృష్టిస్తుంది. 43 00:02:49,336 --> 00:02:52,256 అయితే, టైమ్ ట్రావెలర్స్ మాదిరిగా జ్ఞాపకాలలో మనం మళ్లీ జీవిస్తామా? 44 00:02:53,257 --> 00:02:56,969 నువ్వు ఫోటోలోని మనుషులతో మాట్లాడలేవు లేదా జరిగిన దానిని మార్చలేవు. 45 00:02:57,052 --> 00:03:02,474 దీని ఉద్దేశం ఏమిటంటే మనం ఒక జ్ఞాపకాన్ని మళ్లీ జీవించి, మన కళ్లతో మనం స్పష్టంగా చూడటం. 46 00:03:03,392 --> 00:03:07,896 ఎమిలీ కిందటి పుట్టినరోజు పొందిన ఆనందాన్ని మళ్లీ చూపించడానికి ఇది సరైన పరికరం. 47 00:03:09,356 --> 00:03:12,401 తన మంచి జ్ఞాపకాలు నిజమైనవని తను తెలుసుకోడానికి ఇది గొప్ప ప్రారంభం. 48 00:03:14,152 --> 00:03:15,612 మీకు ఇది సిద్ధం చేస్తాను. 49 00:03:17,614 --> 00:03:18,824 సరే. 50 00:03:18,907 --> 00:03:21,577 ఎమిలీ, నీ కిందటి పుట్టినరోజు ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి అనుకుంట కదా? 51 00:03:21,660 --> 00:03:23,161 ఓహ్, అవును, టన్నుల కొద్దీ ఉన్నాయి. 52 00:03:23,245 --> 00:03:24,997 మంచిది. ఒక ఫోటో ఎంచుకో. 53 00:03:25,664 --> 00:03:27,749 బెత్, రేయన్, ఆ పాడ్స్ లోని సీట్లలో కూర్చోండి. 54 00:03:34,131 --> 00:03:35,132 ఇది ఎలా ఉంది? 55 00:03:35,966 --> 00:03:37,843 -ముచ్చటైన ఫోటో. -థాంక్యూ. 56 00:03:38,468 --> 00:03:41,013 ఇప్పుడు నీ ఫోన్ ని ఈ పోర్ట్ మీద ఉంచు, 57 00:03:41,513 --> 00:03:42,890 ఇక మిగతా సంగతి మెషీన్ చూసుకుంటుంది. 58 00:03:42,973 --> 00:03:44,641 ఫోటో సింక్ పూర్తయింది. 59 00:03:47,936 --> 00:03:49,354 మీకు అంతా సిద్ధమైంది. 60 00:03:49,438 --> 00:03:52,191 మీకు నా అవసరం ఉంటే గనుక, నేను అక్కడ నా ఆఫీస్ లోనే ఉంటాను. 61 00:03:52,774 --> 00:03:53,775 సరే. 62 00:04:10,459 --> 00:04:11,460 బాగుంది. 63 00:04:15,881 --> 00:04:17,632 ఇది చాలా విచిత్రంగా ఉంది. 64 00:04:19,426 --> 00:04:22,346 ఆ మొక్కజొన్న అద్భుతంగా ఉంది. 65 00:04:31,438 --> 00:04:33,982 హ్యాపీ బర్త్ డే, బంగారం. 66 00:04:38,946 --> 00:04:39,947 మీకు ఎలా తెలిసింది? 67 00:04:40,030 --> 00:04:41,907 కొద్ది నెలలుగా మాకు సూచనలు చేశావు. 68 00:04:42,908 --> 00:04:45,911 అంతా బాగానే ఉందని నమ్మించడానికి సినమన్ మరొక వంక. 69 00:04:47,496 --> 00:04:48,997 అది నిజం కాదని నీకు తెలుసు. 70 00:04:49,081 --> 00:04:51,458 దానిని మీరు ఇద్దరూ కలిసి కూడా ఇవ్వలేదు. 71 00:04:51,542 --> 00:04:53,585 నువ్వు దానిని బయటకు తీసినప్పుడు నాన్న మొక్కజొన్న తింటున్నాడు. 72 00:04:57,089 --> 00:04:58,257 వద్దా? సరే. 73 00:04:58,340 --> 00:05:01,510 -చూడండి, మీరు కనీసం కలవడం లేదు. -మరీ అంతగా ఆలోచించకు, స్వీటీ. 74 00:05:05,597 --> 00:05:08,559 నువ్వు దీనిని రహస్యంగా ఉంచడం నాకు చాలా నచ్చింది. ఇది నీకు అలవాటు లేని పని అని నాకు తెలుసు. 75 00:05:08,642 --> 00:05:11,103 దాదాపు, అంటే, పదిసార్లు చెప్పేయబోయాను. 76 00:05:13,689 --> 00:05:14,940 ఇది నాకు గుర్తులేదు. 77 00:05:20,195 --> 00:05:22,114 అన్నింటిలో ఇదే నా బెస్ట్ బర్త్ డే. 78 00:05:23,574 --> 00:05:24,825 -నేను చూడచ్చా? -అలాగే. 79 00:05:37,462 --> 00:05:38,839 ఇది నమ్మలేనంత గొప్పగా ఉంది. 80 00:05:40,549 --> 00:05:41,967 అది ఒక మంచి జ్ఞాపకం. 81 00:05:42,634 --> 00:05:44,761 ఎమిలీ పుట్టినరోజుని ఎంత గొప్పగా జరుపుకున్నాం. 82 00:05:44,845 --> 00:05:46,054 అదంతా బెత్ ఐడియా. 83 00:05:46,638 --> 00:05:48,015 కానీ, ఈ రహస్యాన్ని నీలోనే ఉంచుకున్నావు. 84 00:05:48,724 --> 00:05:50,142 అందుకు నిన్ను చూసి గర్వపడుతున్నాను. 85 00:06:25,677 --> 00:06:26,887 అది చాలా విచిత్రంగా ఉంది, యాస్మిన్. 86 00:06:26,970 --> 00:06:30,599 కానీ అందులో మంచి విషయం ఏమిటంటే, నా పేరెంట్స్ దాదాపు పది నిమిషాల సేపు కలిసి గడిపారు. 87 00:06:30,682 --> 00:06:33,519 అయితే, నా హవాయ్ యాత్రని నేను మళ్లీ ఎప్పుడు చూడగలుగుతాను? 88 00:06:34,102 --> 00:06:36,230 అందుకు ముందుగా మీ పేరెంట్స్ విడిపోవాలి అనుకుంటా. 89 00:06:37,689 --> 00:06:40,025 నేను వాళ్లని ప్రేమిస్తాను, కానీ అది ఒక అద్భుతమైన విహారయాత్ర. 90 00:06:42,236 --> 00:06:43,946 అయితే, పార్టీల గురించి నీ ఆలోచనలు ఏంటి? 91 00:06:44,029 --> 00:06:46,657 ఇంకా వాటి గురించి ఆలోచించడం లేదు. 92 00:06:47,908 --> 00:06:51,453 నీకు ఇష్టమైన విధంగా నీ పేరెంట్స్ నీకు రెండు పార్టీలు ఇస్తున్నారు కదా. 93 00:06:52,496 --> 00:06:53,539 నువ్వు అదృష్టవంతురాలివి. 94 00:06:54,331 --> 00:06:55,791 వాళ్ల విడాకుల విషయం కాదు, కానీ… 95 00:06:55,874 --> 00:06:58,669 వాళ్లు ఇంకా విడాకులు తీసుకోలేదు. కేవలం విడిపోయారు అంతే. 96 00:07:03,048 --> 00:07:05,592 కానీ మా పేరెంట్స్ ని మళ్లీ ఎలా కలపాలో నాకు తెలుసు అనుకుంటా. 97 00:07:05,676 --> 00:07:07,761 వాళ్లు ఏదో ఒక కారణం వల్ల విడిపోయారు, అవునా? 98 00:07:07,845 --> 00:07:10,472 అంటే అన్నిసార్లు వాళ్లు సరిగ్గా కలిసి ఉండటం లేదా? 99 00:07:10,556 --> 00:07:13,058 నా ఉద్దేశం, మెమరీ మెషీన్ కొద్ది నిమిషాలే చూపించింది, 100 00:07:13,141 --> 00:07:15,102 ఏడాది కిందట వాళ్లు చాలా సంతోషంగా కలిసి ఉన్నారు. 101 00:07:15,853 --> 00:07:17,813 వచ్చే సెషన్ లో, మరిన్ని మంచి జ్ఞాపకాలను లోడ్ చేస్తాను 102 00:07:17,896 --> 00:07:21,233 అంటే పుట్టినరోజులు, మా జూ ట్రిప్ ఇంకా జూలై నాలుగో తేదీ పరేడ్ లాంటివి. 103 00:07:21,316 --> 00:07:23,360 గతంలో ఎంతగా ప్రేమించుకునే వారో అప్పుడు వాళ్లు తెలుసుకుంటారు. 104 00:07:23,944 --> 00:07:25,779 నువ్వు కలలు కంటున్నావు. అది అంత తేలిక కాదు. 105 00:07:27,322 --> 00:07:30,784 బహుశా తేలిక కాకపోవచ్చు, కానీ నేను ప్రయత్నించాలి కదా. 106 00:07:32,119 --> 00:07:36,039 నా ఉద్దేశం, నేను అనుకున్నదే జరిగితే, అప్పుడు రెండు ఇళ్ల మధ్య తిరిగే బాధ తప్పుతుంది కదా. 107 00:07:37,124 --> 00:07:39,835 వాళ్లు వాదులాడుకుంటుంటే నేను మధ్యలో ఇరుక్కుపోవలసిన పరిస్థితి రాదు. 108 00:07:40,878 --> 00:07:42,588 ఇంటి పరిస్థితులు గతంలో మాదిరిగా మళ్లీ మామూలు అవుతాయి. 109 00:07:48,177 --> 00:07:49,303 అద్భుతమైన సెషన్. 110 00:07:50,179 --> 00:07:53,265 నీ విషయాలు మర్చిపోకుండా నువ్వు అమలు చేస్తున్న వ్యూహాల గురించి వినడం సంతోషంగా ఉంది, ఎమిలీ. 111 00:07:54,057 --> 00:07:56,018 మెమరీ థెరపీ పనిచేస్తోంది అనిపిస్తోంది. 112 00:07:56,101 --> 00:07:59,146 మనం మళ్లీ ఇది చేయడం మంచి విషయం. మనం ఇలాంటి సెషన్స్ ఇంకా చాలా చేయాలి. 113 00:07:59,229 --> 00:08:00,564 ఇది నీకు ఉపయోగపడటం నాకు ఆనందంగా ఉంది. 114 00:08:01,398 --> 00:08:02,733 మనం ఇప్పుడు మళ్లీ జ్ఞాపకాలలోకి వెళదాం. 115 00:08:03,317 --> 00:08:06,778 ఒక సెషన్ ఉపయోగపడచ్చు, కానీ మనం నేర్చుకున్నది అమలు చేయడం నిజమైన మార్పుకి కీలకమైనది. 116 00:08:08,071 --> 00:08:10,949 నేను పూర్తిగా దానితో ఏకీభవిస్తాను. ఇది ఇంక మొదలుపెడదాం. 117 00:08:11,450 --> 00:08:14,703 ఫ్యామిలీ థెరపీ కోసం నువ్వు ఇంత ఉత్సాహపడతావని నేను ఎప్పుడూ ఊహించలేదు. 118 00:08:15,621 --> 00:08:16,747 అది నేను వినాలి అనుకుంటాను. 119 00:08:18,707 --> 00:08:20,459 సరే, ఎమిలీ. 120 00:08:20,542 --> 00:08:23,170 కిందటి సెషన్ లో ఫోటోనే మళ్లీ అప్ లోడ్ చేద్దాం. 121 00:08:24,213 --> 00:08:26,840 -నీకు సాయం చేయనివ్వు. -ఓహ్, వద్దు, ఇది ఎలా చేయాలో నాకు గుర్తుంది 122 00:08:33,554 --> 00:08:35,182 -ఫోటో సింగ్ పూర్తయింది. -చూశావా? 123 00:08:45,567 --> 00:08:48,320 -ఓయ్, నువ్వు రెడీనా? -అవును. 124 00:08:52,824 --> 00:08:54,868 మనం మళ్లీ అదే జ్ఞాపకానికి వెళ్తున్నాం అనుకున్నాను. 125 00:08:54,952 --> 00:08:55,994 ఇది కూడా బాగుంది. 126 00:08:57,162 --> 00:08:58,330 సరే. 127 00:08:58,413 --> 00:08:59,957 నువ్వు బాగా భయపడ్డావు. 128 00:09:00,541 --> 00:09:03,085 -అది భయపడటం అనను. -నేను అంటాను. 129 00:09:05,128 --> 00:09:08,799 హేయ్. నువ్వు ఇది చేయగలవు. ధైర్యంగా ఉండు. 130 00:09:12,594 --> 00:09:13,595 రెడీనా? 131 00:09:21,728 --> 00:09:23,939 -నాన్నని చూడు! -ఇది సరదాగా ఉంది. సరదాగా ఉంది. 132 00:09:24,022 --> 00:09:26,942 -అవును. అక్కడ చూడండి. -అవును. 133 00:09:27,025 --> 00:09:28,026 వూహూ! 134 00:09:28,819 --> 00:09:30,946 -ఓహ్, దేవుడా! వూహూ! -ఓహ్, బేబీ! 135 00:09:36,869 --> 00:09:37,870 రండి! 136 00:09:40,664 --> 00:09:41,582 పదండి! 137 00:09:58,932 --> 00:10:00,726 -నాన్న గెలుస్తాడని చెప్పాను కదా. -ఓహ్, అవును. 138 00:10:00,809 --> 00:10:02,477 అదంతా చేతి మణికట్టులో ఉంది. 139 00:10:02,561 --> 00:10:04,521 థాంక్స్, నాన్న. ఇది చాలా ముద్దుగా ఉంది. 140 00:10:05,230 --> 00:10:06,732 నా కొత్త జిరాఫీ నాకు నచ్చింది. 141 00:10:28,170 --> 00:10:30,422 -వద్దు. -నీ పని పడతాను! 142 00:10:40,390 --> 00:10:41,725 ఆగండి. అప్పుడు మంచు పడలేదు. 143 00:10:45,395 --> 00:10:46,897 ఖచ్చితంగా ఇది జరగలేదు. 144 00:10:50,150 --> 00:10:53,278 ఇది జూలై నాలుగో తేదీ పరేడ్ లో మార్చింగ్ బ్యాండ్ కదా? 145 00:10:54,321 --> 00:10:59,284 అవును, ఇంకా ఆ పులి మనం జూకి వెళ్లినప్పుడు చూసినది. 146 00:11:03,372 --> 00:11:05,415 అన్నీ కలిసిపోతున్నాయి. ఆ ఫోటోలు కలిసిపోతున్నాయి. 147 00:11:06,542 --> 00:11:07,793 అంటే దీని అర్థం… 148 00:11:09,086 --> 00:11:10,462 ఎమిలీ! 149 00:11:13,465 --> 00:11:14,800 ఏం జరుగుతోంది? 150 00:11:14,883 --> 00:11:16,051 -తెలీదు. -డాక్టర్ జోన్ ని అడుగుతా. 151 00:11:16,134 --> 00:11:18,387 లేదు, ఇవన్నీ నా ఫోన్ లో ఉన్న ఫోటోలు ఇంకా వీడియోలు. 152 00:11:18,470 --> 00:11:20,389 నేను దీన్ని సరి చేస్తాను. వెంటనే వచ్చేస్తాను. 153 00:11:23,183 --> 00:11:24,768 ప్రాసెసింగ్ ఎర్రర్. 154 00:11:24,852 --> 00:11:25,853 పొరపాటా? 155 00:11:26,562 --> 00:11:29,398 డిలీట్. చేయి. డిలీట్, డిలీట్, డిలీట్. 156 00:11:29,481 --> 00:11:31,149 ప్రాసెసింగ్ ఎర్రర్. 157 00:11:33,694 --> 00:11:35,320 సెషన్ పూర్తయింది. 158 00:11:37,447 --> 00:11:38,574 కానీ, ఇది విచిత్రంగా ఉంది. 159 00:11:38,657 --> 00:11:40,325 చాలా విచిత్రంగా ఉంది. 160 00:11:41,285 --> 00:11:43,328 లేదు, నేను డాక్టర్ జోన్ ని పిలుస్తాను, మనం మళ్లీ లోపలికి వెళదాం. 161 00:11:43,412 --> 00:11:44,413 వద్దు, వద్దు, మరేం ఫర్వాలేదు. 162 00:11:44,496 --> 00:11:46,331 నేను ఒక మీటింగ్ కి వెళ్లాలి, కాబట్టి… 163 00:11:46,415 --> 00:11:49,543 నిన్ను ఏడు గంటలకు కలుస్తాము. ఎమిలీ అన్నీ సర్దుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. 164 00:11:49,626 --> 00:11:52,880 -నేను ఆరు గంటలకే కలవాలి. -తప్పకుండా కలుద్దాం. 165 00:12:07,728 --> 00:12:09,438 ఈసారి నువ్వు అన్నీ సరిగ్గా సర్దుకున్నావా? 166 00:12:09,521 --> 00:12:11,273 అవును, అమ్మా, మూడుసార్లు చెక్ చేసుకున్నా. 167 00:12:11,899 --> 00:12:14,234 సినమన్ కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను? 168 00:12:14,735 --> 00:12:17,863 -దానికి ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు? -దాని పుట్టినరోజు కూడా ఈ శనివారమే, అమ్మా. 169 00:12:17,946 --> 00:12:20,532 అయితే, సినమన్ కి కూడా నీతో పాటే పుట్టినరోజు చేస్తున్నావా? 170 00:12:21,033 --> 00:12:24,828 అది కాదు. కిందటి ఏడాది జాతరలో నా పుట్టినరోజున సినమన్ ని మనం తెచ్చుకున్నాం. 171 00:12:25,621 --> 00:12:28,040 ఎమిలీ, నిన్ను మేము జాతరకి తీసుకెళ్లలేదు. 172 00:12:28,707 --> 00:12:32,920 మేము నిన్ను తీసుకువెళతాం అని చెప్పాం, కానీ నీకు తెలుసు. 173 00:12:33,754 --> 00:12:34,922 సరే. 174 00:12:35,005 --> 00:12:36,590 కానీ, నిన్ను నేను తీసుకువెళతాను. 175 00:12:37,716 --> 00:12:38,884 నీ ఉద్దేశం ఏంటి? 176 00:12:38,967 --> 00:12:42,262 నా పుట్టినరోజున మనం జాతరకు వెళ్లాం. నాకు నువ్వు సినమన్ ని బహుమతిగా ఇచ్చావు. 177 00:12:42,346 --> 00:12:44,515 నాకు జాతర గుర్తుంది అనుకుంటా. సినమన్ కూడా. 178 00:12:44,598 --> 00:12:47,434 కానీ నిజానికి, మనం సినమన్ ని ఎప్పుడు తెచ్చుకున్నామో నాకు గుర్తు లేదు. 179 00:12:47,518 --> 00:12:49,311 నువ్వు ఇప్పుడు జోక్ చేస్తున్నావా? 180 00:12:49,394 --> 00:12:51,980 దేని గురించి జోక్ చేయడం? నాకు అంతా అయోమయంగా ఉంది. 181 00:12:52,648 --> 00:12:53,815 నాకు కూడా. 182 00:12:56,026 --> 00:12:57,027 హేయ్. 183 00:12:58,070 --> 00:13:00,447 ఈసారి తను నీ ఇంట్లో ఏదీ వదిలేయకుండా చూడు. 184 00:13:00,531 --> 00:13:01,532 నాకు అర్థమైంది. 185 00:13:01,615 --> 00:13:03,575 నాన్నా, మనం సినమన్ ని ఎప్పుడు తెచ్చామో నీకు గుర్తుంది, కదా? 186 00:13:03,659 --> 00:13:05,035 గుర్తుంది. అది క్రిస్మస్ రోజు. 187 00:13:06,078 --> 00:13:09,206 లేదు, ఈస్టర్ రోజు. ఈస్టర్ బన్నీ థీమ్ కి అది సరిపోతుంది. 188 00:13:09,915 --> 00:13:11,667 కిందటి సంవత్సరం నా పుట్టినరోజున జాతరలో కాదా? 189 00:13:12,960 --> 00:13:15,128 నీ వయస్సు అప్పటి నుండి నేను జాతరకే వెళ్లలేదు, ఎమ్. 190 00:13:16,088 --> 00:13:18,757 మీరు ఇద్దరూ ఎలా మర్చిపోయారు? చూడండి, నేను మీకు చూపిస్తాను. 191 00:13:22,553 --> 00:13:26,890 -అయితే, మనం శనివారం గురించి మాట్లాడుకోవాలి. -లేజర్ టాగ్ ని మార్చడం ఇప్పుడు కష్టం. 192 00:13:27,724 --> 00:13:28,809 నువ్వు బుక్ చేశావా? 193 00:13:29,726 --> 00:13:30,978 మనం కలిసి నిర్ణయించాం కదా. 194 00:13:31,061 --> 00:13:32,312 ఫోటో ఏదీ? 195 00:13:32,396 --> 00:13:33,981 -నువ్వు నిర్ణయించావు అంటే… -ఫోటో ఎక్కడ ఉంది? 196 00:13:34,064 --> 00:13:37,234 -…మనం నిర్ణయించుకున్నాం అని అర్థం కాదు. -ఒకసారి వస్తే నీ ప్రాణం పోతుందా? 197 00:13:37,776 --> 00:13:39,611 ఇంత మంచి లాయర్ వి ఎందుకయ్యావో ఇప్పుడు తెలుస్తోంది. 198 00:13:40,946 --> 00:13:43,490 నీ ప్రియురాలికి అనుకూలంగా మన వీకెండ్స్ ని మనం ప్లాన్ చేసుకోలేం. 199 00:13:44,074 --> 00:13:46,910 ఆపండి. మీ ఇద్దరికీ ఏమైంది? 200 00:13:46,994 --> 00:13:50,163 మీరిద్దరూ దగ్గరవుతున్నారు, కానీ ఇప్పుడు మన మంచి రోజు మీకు కనీసం గుర్తు లేదు. 201 00:13:50,747 --> 00:13:51,957 ఎమిలీ… 202 00:13:52,040 --> 00:13:53,208 వెళదాం పద, నాన్న. నేను ఊరికే… 203 00:14:07,556 --> 00:14:09,391 ఆ మెషీన్ లో నా ఫోటోల్ని నేను డిలీట్ చేసినప్పుడు, 204 00:14:09,474 --> 00:14:11,351 అది నా పేరెంట్స్ జ్ఞాపకాల్ని కూడా ఎలాగో డిలీట్ చేసేసింది. 205 00:14:12,144 --> 00:14:13,770 కానీ మరి నీకు ఎందుకు ఇంకా గుర్తుంది? 206 00:14:14,438 --> 00:14:17,107 ఎందుకంటే నేను ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పుడు ఆ పాడ్ లో కూర్చోలేదు. 207 00:14:18,775 --> 00:14:20,611 కానీ వాళ్లు దగ్గరవుతున్నారు. 208 00:14:20,694 --> 00:14:23,822 వాళ్లకి ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి రాకపోతే ఏంటి? వాళ్లు ఇంకా ఇంకా గొడవపడుతునే ఉంటారు. 209 00:14:23,906 --> 00:14:26,116 నువ్వు ఎక్కువ ఆందోళన పడకు, సరేనా? 210 00:14:27,242 --> 00:14:30,621 నువ్వు ఒక పని చేయి. ఈసారి నువ్వు మెషీన్ లో సరైన ఫోటోలు అప్ లోడ్ చేయి. 211 00:14:30,704 --> 00:14:32,247 బూమ్. వాళ్ల జ్ఞాపకాలు తిరిగి వచ్చేస్తాయి. 212 00:14:32,331 --> 00:14:34,249 కానీ అవి ఇప్పుడు నా ఫోన్ లో కూడా డిలీట్ అయిపోయాయి కదా. 213 00:14:35,292 --> 00:14:36,293 నీకు అర్థం కావడం లేదు. 214 00:14:36,376 --> 00:14:39,087 ఒక కుటుంబంగా మాకు ఉన్న చివరి మంచి జ్ఞాపకం ఇదే. 215 00:14:39,671 --> 00:14:42,424 వాళ్లిద్దరినీ మళ్లీ కలపాలి అంటే నాకు ఉన్న ఒకే ఒక్క మార్గం 216 00:14:42,508 --> 00:14:44,426 ఈ జ్ఞాపకాన్ని మళ్లీ అప్ లోడ్ చేయడమే. 217 00:14:45,302 --> 00:14:47,095 బహుశా మీ డాక్టర్ సాయం చేయవచ్చు కదా? 218 00:14:47,846 --> 00:14:50,265 లేదు, నేను ఆమెకు ఇది చెప్పలేను. అప్పుడు నేను ఏం చేశానో ఆమెకు తెలిసిపోతుంది. 219 00:14:50,349 --> 00:14:52,643 ఇంక ఆమె నన్ను ఎప్పుడూ ఆ మెషీన్ దగ్గరకి రానివ్వదు. 220 00:14:55,020 --> 00:14:56,188 నన్ను కొద్దిగా ఆలోచించనివ్వు. 221 00:14:59,942 --> 00:15:02,986 నీ దగ్గర ఆ రోజు ఫోటోలు ఏవీ లేకపోతే, మళ్లీ అలాంటివి సృష్టించవచ్చు కదా? 222 00:15:04,154 --> 00:15:07,950 మనం ఆన్ లైన్ లో ఆ జాతర ఫోటో తీసుకుందాం, అందులో మీ అందరూ ఉండేలా ఎడిట్ చేద్దాం. 223 00:15:08,951 --> 00:15:10,035 అది పని చేయవచ్చు. 224 00:15:12,329 --> 00:15:14,039 నా ఉద్దేశం, అది పని చేయాలి, 225 00:15:14,122 --> 00:15:16,041 లేదంటే వాళ్ల జ్ఞాపకాలు ఇంక ఎప్పటికీ తిరిగి రావు. 226 00:15:19,878 --> 00:15:22,756 అది మంచి సెషన్ కాకపోవచ్చు, కానీ, చూడండి. 227 00:15:23,298 --> 00:15:25,509 రెండు అడుగులు ముందుకి, ఒక అడుగు వెనక్కి. 228 00:15:26,093 --> 00:15:29,596 ఇప్పుడు మనం జ్ఞాపకాలలోకి వెళ్లడం అంత మంచి ఆలోచన అనుకోను. 229 00:15:30,597 --> 00:15:33,642 ఏంటి… అమ్మా, దయచేసి విను. ఇది ఉపయోగపడుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను. 230 00:15:34,226 --> 00:15:36,603 సరే, అది నీకు సంతోషం కలిగిస్తే, నేను మరొకసారి ప్రయత్నించడానికి సిద్ధమే. 231 00:15:36,687 --> 00:15:37,896 చూశావా? నాన్న సరే అంటున్నారు. 232 00:15:38,480 --> 00:15:39,606 దయచేసి ఒప్పుకో, అమ్మా? 233 00:15:40,899 --> 00:15:42,985 -సరే, మరొక ప్రయత్నం చేద్దాం. -యస్! 234 00:15:43,068 --> 00:15:45,112 విను, ఈసారి ఫోటోలు సరిగ్గా అప్ లోడ్ అయ్యేలా చూద్దాం. 235 00:15:51,869 --> 00:15:53,787 ఫోటో సింక్ పూర్తయింది. 236 00:16:00,127 --> 00:16:01,253 దయచేసి పని చేయి. 237 00:16:08,051 --> 00:16:09,094 ఇది పని చేసింది. 238 00:16:09,178 --> 00:16:10,429 ఇది ఏ జ్ఞాపకం నుంచి వచ్చింది? 239 00:16:10,512 --> 00:16:12,973 మనం జాతరకి వెళ్లామని నీకు చెప్పాను. నీకు అది గుర్తు లేదు. 240 00:16:13,056 --> 00:16:14,433 -నాకూ గుర్తులేదు. కానీ మనం ఎలా… -రండి! 241 00:16:34,203 --> 00:16:35,704 ఏం జరుగుతోంది? ఇది సరైనది కాదు. 242 00:16:35,787 --> 00:16:37,456 బహుశా అది ఇంకా లోడ్ అవుతుందేమో? 243 00:16:44,087 --> 00:16:45,088 ఏంటి? 244 00:16:50,969 --> 00:16:54,348 లేదు, లేదు, లేదు, లేదు. ఏం జరుగుతోంది? 245 00:16:54,431 --> 00:16:55,599 లేదు, లేదు, లేదు, లేదు. లేదు. 246 00:17:06,318 --> 00:17:08,487 -ఎర్రర్. ఎర్రర్. -ఓహ్, అయ్యో. 247 00:17:08,569 --> 00:17:10,614 -మనం ఇది చేయకుండా ఉండాల్సిందని చెప్పాను. -నన్ను నిందించకు. 248 00:17:10,696 --> 00:17:12,199 ఏదో పొరపాటు జరిగింది. 249 00:17:12,281 --> 00:17:14,242 -అలవాటులో పొరపాటు. -ఈ మెషీన్ ఆగిపోయినట్లు నాకు హెచ్చరిక వచ్చింది. 250 00:17:14,326 --> 00:17:16,537 -ఏం జరిగింది? -మాకు తెలియదు. 251 00:17:16,619 --> 00:17:17,829 ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. 252 00:17:22,626 --> 00:17:24,627 జాతరలో నా పుట్టినరోజు జరుపుకున్నది మీకు ఇప్పుడు గుర్తుందా? 253 00:17:28,507 --> 00:17:29,675 జాతరలో నేను జరుపుకొన్న పుట్టినరోజు? 254 00:17:30,259 --> 00:17:32,469 ఎమిలీ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు నిజంగా తెలియదు. 255 00:17:38,976 --> 00:17:40,519 టిఎస్3 ఆఫ్ లైన్ అయింది. 256 00:17:47,734 --> 00:17:49,152 సరే, నువ్వు మళ్లీ ప్రయత్నించవచ్చు కదా? 257 00:17:49,236 --> 00:17:51,989 ఆ మెషీన్ ని బాగు చేయడానికి కొద్ది వారాలు పడుతుందని డాక్టర్ జోన్ చెప్పింది. 258 00:17:52,072 --> 00:17:54,867 కానీ అప్పటికి, నా పేరెంట్స్ కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. 259 00:17:54,950 --> 00:17:55,951 ఇది ముగిసిపోయింది. 260 00:17:56,034 --> 00:17:58,245 -ఇది పని చేస్తుందని నిజంగా నమ్మాను. -నేను కూడా. 261 00:17:59,538 --> 00:18:01,456 బహుశా నువ్వు ఇప్పటికీ ఈ సమస్యని పరిష్కరించగలవు. 262 00:18:01,540 --> 00:18:02,624 మెషీన్ లేకుండానా? 263 00:18:04,751 --> 00:18:06,378 బహుశా మంచి పాప్ కార్న్ మనకి సాయపడచ్చు. 264 00:18:07,921 --> 00:18:09,381 ఓహ్, దేవుడా. అది నిజం. 265 00:18:09,464 --> 00:18:11,466 జాతరలో మేము రోస్టెడ్ కార్న్ తిన్నాం. 266 00:18:11,550 --> 00:18:12,551 థాంక్యూ. 267 00:18:14,553 --> 00:18:17,431 థాంక్యూ. సరే. నాకు అయోమయంగా ఉంది. 268 00:18:18,015 --> 00:18:21,602 నేను చేయాల్సిందల్లా, నా పేరెంట్స్ ని నా పుట్టినరోజున నన్ను జాతరకి తీసుకువెళ్లమని అడగడమే, 269 00:18:21,685 --> 00:18:23,937 ఆ తరువాత మేము కిందటి సంవత్సరం ఏం చేశామో సరిగ్గా మళ్లీ అదే చేస్తాం, 270 00:18:24,021 --> 00:18:25,522 రోస్టెడ్ కార్న్ తినడం సహా. 271 00:18:26,398 --> 00:18:28,066 తెలివైన పని. నువ్వు ఆ రోజుని మళ్లీ సృష్టిస్తావు. 272 00:18:28,567 --> 00:18:30,527 -అవును. -అది వాళ్ల జ్ఞాపకాలను కదిలిస్తుంది. 273 00:18:31,862 --> 00:18:35,949 కార్న్, గడ్డివాములో ఆటలు, జారుడుబల్ల, ఫెర్రీస్ వీల్, రింగ్ టాస్ ఆటలు. 274 00:18:36,033 --> 00:18:37,242 వాళ్లకి ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. 275 00:18:37,743 --> 00:18:39,661 ఆగు, అయితే నువ్వు కిందటి నీ పుట్టినరోజునే 276 00:18:39,745 --> 00:18:41,705 మళ్లీ జరుపుకోవడం కోసం రెండు పార్టీలు వదిలేస్తావా? 277 00:18:43,957 --> 00:18:46,710 వాళ్లిద్దరూ మళ్లీ దగ్గరవుతారు అంటే, నేను పది వేడుకల్ని కూడా వదిలేస్తాను. 278 00:18:52,216 --> 00:18:54,051 ఎమిలీ, ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. 279 00:18:54,134 --> 00:18:56,220 జాతరలో ఇప్పుడు పార్టీకి ప్లాన్ చేసే టైమ్ నాకు లేదు. 280 00:18:56,303 --> 00:18:59,097 అమ్మా, నువ్వు ఏమీ చేయనక్కరలేదు. అంతా ఇప్పటికే సిద్ధం అయింది. 281 00:18:59,181 --> 00:19:00,641 నాన్న కూడా నన్ను అక్కడ దింపుతున్నారు. 282 00:19:00,724 --> 00:19:03,810 వీటి కోసం ఆయన శనివారంనాడు తన పనులన్నీ వదిలేస్తున్నారా? 283 00:19:03,894 --> 00:19:06,813 దయచేసి వింటావా, అమ్మా? నా పుట్టినరోజున నేను చేయాలనుకుంటున్నది ఇదే. 284 00:19:07,564 --> 00:19:11,527 చివరి నిమిషంలో మార్పులు చేయకు, ఎమిలీ. నేను ఇప్పటికే లేజర్ టాగ్ కోసం డబ్బు కట్టేశాను. 285 00:19:12,110 --> 00:19:15,489 దయచేసి వింటావా, నాన్నా? మీరు విడిపోక ముందు, మనం వెళ్దామని ఎప్పుడూ చెప్పేవాడివి. 286 00:19:18,283 --> 00:19:21,411 నీకు ఫెర్రీస్ వీల్ ఇష్టం కదా. దయచేసి ఒప్పుకుంటావా? 287 00:19:22,621 --> 00:19:24,289 ఇది సరదాగా అనిపిస్తోంది. 288 00:19:24,373 --> 00:19:26,542 మొక్కజొన్న పొత్తు కండెతో తింటే అద్భుతంగా ఉంటుందని అందరూ అంటారు. 289 00:19:28,168 --> 00:19:30,128 ఇంకా మనమంతా ఒక రోజంతా కలిసి గడపవచ్చు కూడా. 290 00:19:30,212 --> 00:19:32,923 అది చాలా సరదాగా ఉంటుంది. కానీ నీ డ్రెస్ ని నేను ఎంపిక చేస్తాను. 291 00:19:34,633 --> 00:19:35,926 సరేనా? 292 00:19:37,219 --> 00:19:39,388 -సరే. -యస్! 293 00:19:41,139 --> 00:19:42,516 మనం సాధించాం. 294 00:19:52,526 --> 00:19:54,027 మనం మొదట ఏం చేయాలని అనుకుంటున్నావు? 295 00:19:54,736 --> 00:19:56,905 బహుశా కార్న్ తిందామా? అవును, నాకు బాగా ఆకలిగా ఉంది. 296 00:19:57,906 --> 00:19:59,116 హేయ్. 297 00:19:59,867 --> 00:20:01,159 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 298 00:20:01,743 --> 00:20:03,078 ఎమిలీని జాతరకు తీసుకువచ్చాను. 299 00:20:04,997 --> 00:20:06,039 కానీ మన ప్లాన్ అది కాదు కదా. 300 00:20:09,251 --> 00:20:11,420 అయితే ఇది మరొకరి ప్లాన్ అనుకుంటా. 301 00:20:13,338 --> 00:20:14,798 నువ్వు మాతో అబద్ధం చెప్పావా? 302 00:20:17,217 --> 00:20:20,095 దయచేసి కోపం తెచ్చుకోకండి. మరోలా చెబితే మీరు ఇద్దరూ వచ్చేవారు కాదు. 303 00:20:21,930 --> 00:20:24,016 ఇది నిజంగా నాకు చాలా ముఖ్యమైనది. 304 00:20:24,600 --> 00:20:28,478 మీరిద్దరూ ఈ ఒక్క రోజు కోసం కలిసి ఉండగలరా? ప్లీజ్? 305 00:20:31,565 --> 00:20:32,608 తప్పకుండా ఉండగలం. 306 00:20:34,776 --> 00:20:35,944 నీ షర్ట్ బాగుంది. 307 00:20:37,779 --> 00:20:38,780 నువ్వు నా కోసం కొన్నావు. 308 00:20:39,489 --> 00:20:40,532 అవును, నాకు తెలుసు. 309 00:20:42,910 --> 00:20:43,994 పదండి వెళ్లి సరదాగా గడుపుదాం. 310 00:20:49,458 --> 00:20:50,709 మొదటగా ఏం చేయాలి అనుకుంటున్నావు? 311 00:20:57,257 --> 00:20:58,258 ఏంటి? అయ్యో. 312 00:20:58,342 --> 00:20:59,551 చాలా ఆలస్యమైంది! అమ్ముడైపోయాయి 313 00:21:00,719 --> 00:21:02,679 -లేదు, నేను… -ఫర్వాలేదు. నాకు ఆకలిగా లేదు. 314 00:21:02,763 --> 00:21:04,598 జాతరలో మొక్కజొన్నకండెలు అయిపోకూడదు. 315 00:21:04,681 --> 00:21:06,517 మనం ఫెర్రీస్ వీల్ ని ప్రయత్నిద్దామా? 316 00:21:12,314 --> 00:21:13,815 పద. అది ఇంకా బాగుంటుంది. 317 00:21:27,204 --> 00:21:29,081 సరే, కానీ నేను ఇది ఎక్కగలను అనుకోవడం లేదు. 318 00:21:29,831 --> 00:21:31,416 ఏంటి? నీకు ఇంకా ఎత్తులంటే భయమా? 319 00:21:31,500 --> 00:21:32,668 దయచేసి రా, నాన్నా. 320 00:21:33,877 --> 00:21:35,838 సారీ, ఎమిలీ. మీరు సరదాగా వెళ్లి రండి. నేను ఇక్కడ వేచి ఉంటాను. 321 00:21:35,921 --> 00:21:37,506 సరే, అయితే నా బ్యాగ్ పట్టుకోగలవా? 322 00:21:37,589 --> 00:21:40,133 వదిలేసేయ్. మనం యాపిల్ పండ్లు ఏరడానికి వెళదాం. 323 00:21:45,013 --> 00:21:46,807 సరే, అందరూ దిగండి. 324 00:21:46,890 --> 00:21:48,100 -పదండి. -అలాగే. 325 00:21:49,101 --> 00:21:50,310 మనం ఒక సెల్ఫీ దిగుదాం. 326 00:21:51,687 --> 00:21:52,688 సరే. 327 00:21:54,940 --> 00:21:56,149 ఇదిగో తీసుకుందాం. 328 00:21:56,233 --> 00:21:58,861 రెడీ? ఒకటి, రెండు, మూడు. 329 00:22:00,195 --> 00:22:03,156 -సరే, పదండి. పరిగెడదాం. -లేదు. వాతావరణం వేడిగా ఉంది, ఎమ్. 330 00:22:03,240 --> 00:22:04,533 అవును, నా పాదాలు నొప్పిగా ఉన్నాయి, బేబీ. 331 00:22:04,616 --> 00:22:07,035 మనం రింగ్ టాస్ కి వెళదాం. ఇది ఈ పక్కనే కుడి వైపు ఉంది. 332 00:22:07,119 --> 00:22:09,371 నీకు దిక్కులు కూడా తెలియడం లేదు. అది ఎడమ వైపు ఉంది. 333 00:22:10,122 --> 00:22:11,707 మంచిది. నీ దారిలో నువ్వెళ్లు. నేను నా దారిలో వెళతా. 334 00:22:11,790 --> 00:22:14,585 ఆగండి. మనం కలిసి ఒకే డైరెక్షన్ లో వెళదాం. 335 00:22:16,795 --> 00:22:18,589 ఇది నా పుట్టినరోజు! 336 00:22:18,672 --> 00:22:19,923 అయితే మనం ఎడమ వైపు వెళదాం అంటాను. 337 00:22:30,934 --> 00:22:32,853 చూశావా? అది ఎడమ వైపు ఉందని చెప్పాను కదా. 338 00:22:32,936 --> 00:22:36,481 దయచేసి ఆపండి. అది పెద్ద విషయం కాదు. మీరు ఎలాగైనా గొడవ పడుతునే ఉంటారు. 339 00:22:36,565 --> 00:22:40,485 హేయ్, నన్ను క్షమించు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నీ పుట్టినరోజున మేము గొడవ పడకూడదు. 340 00:22:40,569 --> 00:22:41,737 ఒప్పుకుంటున్నా. 341 00:22:47,075 --> 00:22:49,703 సరే. కానీ, ఇదే మన చివరి ప్రయత్నం. 342 00:22:50,204 --> 00:22:51,538 నువ్వు నా కోసం జిరాఫీని గెలవాలి. 343 00:22:51,622 --> 00:22:53,457 ఒత్తిడి ఏమీ లేదుగా. 344 00:22:54,791 --> 00:22:58,337 ఇదిగో చూడు. ఒక జిరాఫీ పైకి వస్తోంది. 345 00:23:00,547 --> 00:23:01,673 నువ్వు ఇది గెలవగలవు, నాన్న. 346 00:23:07,679 --> 00:23:08,931 ఫర్వాలేదు. 347 00:23:10,557 --> 00:23:12,059 కొద్దిగా నిదానంగా విసురు. 348 00:23:12,893 --> 00:23:13,894 నేను నిదానంగా విసరమన్నాను. 349 00:23:14,394 --> 00:23:17,439 వెనుక ఇంత గందరగోళం ఉండగా ఏకాగ్రత సాధించడం చాలా కష్టం. 350 00:23:18,941 --> 00:23:21,527 ఇలా చూడు, నాన్న. నువ్వు గెలవగలవు. అవును. 351 00:23:22,110 --> 00:23:23,111 నువ్వు గెలవగలవు. 352 00:23:23,195 --> 00:23:24,863 ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 353 00:23:32,871 --> 00:23:34,373 సారీ, స్వీటీ. నేను ప్రయత్నించాను. 354 00:23:35,332 --> 00:23:36,708 కానీ నేను ఇంకొన్ని టికెట్లు కొంటాను. 355 00:23:37,835 --> 00:23:40,170 నీకు ఏమీ గుర్తులేదు, కదా? 356 00:23:42,047 --> 00:23:43,507 నువ్వు బాగానే ఉన్నావా, స్వీటీ? 357 00:23:44,466 --> 00:23:46,844 జిరాఫీ కావాలని నీకు అంత కోరికగా ఉంటే, ఒకటి కొనిస్తాను… 358 00:23:46,927 --> 00:23:49,304 ఇది జిరాఫీ గురించి కాదు! నా దగ్గర ఇప్పటికే ఒకటి ఉంది! 359 00:23:50,597 --> 00:23:52,516 ఇందులో ఏదీ నాకు అవసరం లేదు. 360 00:23:55,686 --> 00:23:58,021 మన మంచి జ్ఞాపకాలు మళ్లీ మీకు రావడానికి ఇదే మన ఆఖరి అవకాశం, 361 00:23:58,105 --> 00:23:59,815 కానీ ఇప్పుడు మీరు ఇద్దరూ ఎప్పటికీ కలవలేరు. 362 00:24:02,067 --> 00:24:04,945 చూడు, నన్ను క్షమించు. 363 00:24:05,028 --> 00:24:06,655 కానీ అది నిజం, మేము ఇంక కలవలేము. 364 00:24:06,738 --> 00:24:09,241 -కానీ మేము ఇప్పటికీ సరదాగా గడపగలం. -మీ నాన్న సరిగ్గానే చెప్పాడు. 365 00:24:09,908 --> 00:24:12,327 మనం ఇప్పటికీ ఒక కుటుంబం. మేము కలిసి ఉండగలం. 366 00:24:13,579 --> 00:24:16,290 నిజంగానా? ఎందుకంటే నా పుట్టినరోజున కూడా మీరు సరిగ్గా కలవడం లేదు కదా. 367 00:24:18,584 --> 00:24:19,585 నన్ను మన్నించు. 368 00:24:20,752 --> 00:24:22,129 నేను కూడా సారీ, స్వీటీ. 369 00:24:23,922 --> 00:24:25,966 నిన్ను మేము ప్రేమిస్తున్నాం. మేం ఇద్దరం నిన్ను ప్రేమిస్తున్నాం. 370 00:24:26,049 --> 00:24:28,051 మీ అమ్మ సరిగ్గా చెప్పింది. మేం కూడా. 371 00:24:35,058 --> 00:24:36,143 నీకు ఒక విషయం తెలుసా? 372 00:24:37,561 --> 00:24:39,730 గడ్డివాము జారుడుబల్లలు సరిగ్గా అక్కడ ఉన్నాయి. 373 00:24:42,733 --> 00:24:43,775 ఏం అనుకుంటున్నావు? 374 00:24:44,318 --> 00:24:45,569 వెళదాం పదండి. 375 00:24:49,489 --> 00:24:53,160 అయితే, నీ పేరెంట్స్ తో గడపడం నీకు ఎలా అనిపించింది? 376 00:24:56,663 --> 00:25:00,959 నాకు తెలియదు. అది ఎలా ఉందో ఇంకా ఆలోచిస్తున్నాను. 377 00:25:03,504 --> 00:25:07,966 కానీ మేము హవాయ్ ట్రిప్ కి వెళ్లినప్పటి నుండి ఇది మొదలైంది అనుకుంటా. 378 00:25:10,219 --> 00:25:12,596 నీకు సాయం చేయడానికి నా దగ్గర ఒక పరికరం ఉందనుకుంటా. 379 00:25:25,901 --> 00:25:28,153 నీ చివరి ట్రిప్ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయా? 380 00:26:23,041 --> 00:26:25,043 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్