1 00:00:16,308 --> 00:00:18,227 అంబులెన్స్ 2 00:00:18,227 --> 00:00:19,645 నేర ప్రదేశం ప్రవేశం లేదు 3 00:00:38,872 --> 00:00:40,082 నువ్వు ఏం చూస్తున్నావు? 4 00:00:43,168 --> 00:00:45,796 ఇలా చూడు. తనకి మన అవసరం ఉంది. 5 00:00:47,631 --> 00:00:48,632 లోపలికి వెళదాం పద. 6 00:00:49,675 --> 00:00:52,553 వాళ్లు అతడిని చూసేసరికి, చెట్టుకి ఢీ కొట్టి కనిపించాడు. 7 00:00:53,220 --> 00:00:54,346 శరీరం చల్లబడిపోయింది. 8 00:00:55,848 --> 00:00:57,349 చనిపోయి కొన్ని గంటలు అయింది. 9 00:00:59,226 --> 00:01:00,310 చనిపోయి కొన్ని గంటలు అయింది, ఈవా. 10 00:01:06,400 --> 00:01:07,693 ఓహ్, దేవుడా. 11 00:01:07,693 --> 00:01:09,653 గ్రేస్, నాకు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. 12 00:01:09,653 --> 00:01:11,405 ఏం జరిగింది? -మాకు ఏమీ తెలియదు. 13 00:01:12,322 --> 00:01:13,323 సారీ. 14 00:01:14,741 --> 00:01:16,660 నువ్వు టీ తాగుతావా, ఉర్స్? -లేదు, తనకి టీ అవసరం లేదు. 15 00:01:16,660 --> 00:01:18,161 తను తాగదు... నీకు మేం ఎవరైనా టీ చేసి తెస్తాం. 16 00:01:18,245 --> 00:01:20,956 బెకా, నువ్వు... -లేదు! నేను వింటున్నాను. 17 00:01:22,875 --> 00:01:23,876 చెప్పు, గ్రేస్. 18 00:01:25,377 --> 00:01:27,212 నిన్న రాత్రి నా బర్త్ డే డిన్నర్ చేశాం. 19 00:01:28,213 --> 00:01:29,298 అది చక్కగా గడిచింది. 20 00:01:30,716 --> 00:01:34,094 అప్పుడు నేను, "మనం త్వరగా పడుకుందాం" అన్నాను. 21 00:01:35,846 --> 00:01:37,806 అతను నా మీద కోప్పడ్డాడు. 22 00:01:38,348 --> 00:01:42,352 దానితో, అతను వెళ్లిపోయాడు. మ్యాచ్ చూడటానికి బైక్ మీద పబ్ కి వెళ్లాడు, ఇంక... 23 00:01:42,436 --> 00:01:43,729 నేను పడుకున్నాను. 24 00:01:44,605 --> 00:01:45,606 నేను కొద్దిగా... 25 00:01:47,274 --> 00:01:48,483 కొద్దిగా బాధపడ్డాను. 26 00:01:51,111 --> 00:01:54,865 ఇది నా పుట్టినరోజు, నా భర్తతో కలిసి ఉండాలని అనుకున్నాను. 27 00:01:55,741 --> 00:01:59,828 అతను నా మీద ఎందుకు అలా అరిచాడో నాకు తెలియలేదు. నన్ను అలా వదిలి వెళ్లిపోయాడు. 28 00:01:59,912 --> 00:02:00,913 ఎందుకంటే వాడు ఒక చెత్తవెధవ. 29 00:02:05,250 --> 00:02:07,669 హేయ్. నువ్వు బాధపడటంలో అర్థం ఉంది, గ్రేసీ. 30 00:02:08,419 --> 00:02:09,630 నాకు కూడా బాధగా ఉంది. 31 00:02:09,630 --> 00:02:11,507 బ్లానడ్ కి ఈ విషయం ఎలా చెప్పాలి? 32 00:02:15,594 --> 00:02:16,595 అతను చనిపోయాడు. 33 00:02:18,472 --> 00:02:19,640 అతను చనిపోయాడు. 34 00:03:57,696 --> 00:03:59,156 ఓహ్, దేవుడా! 35 00:04:10,250 --> 00:04:11,293 పాపం పిచ్చి గ్రేసీ. 36 00:04:14,713 --> 00:04:16,048 ఓహ్, దేవుడా. ఎలా స్పందించాలో తెలియడం లేదు. 37 00:04:18,300 --> 00:04:19,301 నాకు తెలుస్తోంది. 38 00:04:20,761 --> 00:04:22,346 మనం పెద్దగా కష్టపడకుండా వాడు ఆదుకున్నాడు. 39 00:04:30,521 --> 00:04:31,939 డింగ్ డాంగ్, ఈ చెత్తవెధవ చచ్చాడు. 40 00:04:44,618 --> 00:04:46,036 హేయ్, తను బాగానే ఉందా? 41 00:04:46,745 --> 00:04:48,288 ఏం జరిగింది? 42 00:04:48,372 --> 00:04:50,249 తనకి ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్ అవసరం. 43 00:04:52,042 --> 00:04:53,460 తను బతుకుతుందో లేదో చెప్పలేం అంటున్నారు... 44 00:04:53,544 --> 00:04:56,171 ఓహ్, దేవుడా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. 45 00:04:56,255 --> 00:04:57,923 లేదు. ఇక్కడ నీ అవసరం నాకు లేదు. 46 00:04:58,799 --> 00:05:00,884 నీ దగ్గర పెన్ ఉందా? -సరే. ఆగు. 47 00:05:05,472 --> 00:05:07,182 నీకు పెన్ దొరికిందా? 48 00:05:08,100 --> 00:05:09,935 నీ... నీ డెస్క్ మీద పెన్ లేదు. 49 00:05:09,935 --> 00:05:11,645 అక్కడే ఎక్కడో ఒక పెన్ ఉంటుంది చూడు. 50 00:05:13,063 --> 00:05:14,273 నాకు పెన్ దొరకడం లేదు. 51 00:05:14,273 --> 00:05:15,566 మ్యాట్, అక్కడ పెన్నులు ఉన్నాయి. 52 00:05:15,566 --> 00:05:17,901 చూడు, ఫర్వాలేదు. నేను... నాకు చెప్పు. నేను గుర్తు పెట్టుకుంటాను. 53 00:05:17,985 --> 00:05:19,027 మంచిది! 54 00:05:19,111 --> 00:05:21,446 ఎంత కాలమో తెలియదు కానీ నేను కొన్నాళ్లు ఎవ్వరికీ కనిపించకుండా పోతాను. 55 00:05:21,530 --> 00:05:23,323 నా ఇన్ బాక్స్ లో వచ్చే ప్రతి సందేశానికీ జవాబు ఇవ్వు. 56 00:05:23,407 --> 00:05:25,033 మాల్కమ్ టునోక్ కి జిఎఎ టికెట్లు పోస్ట్ చేయి. 57 00:05:25,117 --> 00:05:27,828 విలియమ్స్ సైకియాట్రిక్ రిపోర్ట్ ని నాకు ఇచ్చినందుకు అతనికి "థాంక్యూ" చెబుతూ ఇవ్వాల్సినవి. 58 00:05:27,828 --> 00:05:29,496 అవి నా డెస్క్ మీద ఉన్నాయి. నీకు కనిపిస్తాయి. 59 00:05:31,373 --> 00:05:33,417 సరే, మాల్కమ్ కి జిఎఎ టికెట్లు. 60 00:05:33,417 --> 00:05:34,877 ఇంకా ఏమైనా ఉన్నాయా? -నాకు తెలియదు, మ్యాట్. 61 00:05:34,877 --> 00:05:38,046 నా ఉద్దేశం, మన పని అయిపోయే లోగా మనం పూర్తి చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? 62 00:05:39,381 --> 00:05:40,841 నేను జైలుకు వెళ్లే లోగా అంటావా? 63 00:05:41,466 --> 00:05:46,305 నా ఇంటికి వేరొకరు ఆక్రమించుకునే లోగానా? నా కుటుంబం నాతో తెగతెంపులు చేసుకునే లోగానా? 64 00:05:46,305 --> 00:05:48,640 కనీసం నా పెళ్లి ఫోటో ఒక్కటి కూడా వదలకుండా... 65 00:05:48,724 --> 00:05:51,018 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంటి బాబు? -నాకు తెలియదు. 66 00:05:51,018 --> 00:05:52,186 నిన్న రాత్రి నాకు నిద్రపట్టలేదు. 67 00:05:52,186 --> 00:05:55,272 భవిష్యత్తు అంతా చీకటిగా ఉంది. అదంతా స్పష్టంగా కనిపిస్తోంది. 68 00:05:55,272 --> 00:05:58,025 చూడు, నువ్వు జైలుకు వెళ్లడం లేదు, థామస్, సరేనా? 69 00:05:58,025 --> 00:06:00,944 బెకా తన అక్కలతో కలిసి లేదని మనకి స్పష్టంగా తెలిసింది. 70 00:06:01,028 --> 00:06:02,613 అదంతా ఆలోచించడానికి చాలా ఆలస్యం అయిపోయింది. 71 00:06:02,613 --> 00:06:04,698 మనం మన దృష్టిని పక్కదారి పట్టించాం. మనం చాలా చేసి ఉండాల్సింది. 72 00:06:04,698 --> 00:06:08,035 మనం ఆ శవాన్ని వెలికి తీయించాం, టామ్, దయచేసి... ఓహ్, చెత్త! 73 00:06:08,035 --> 00:06:09,203 విను, నేను ఇంక వెళ్లాలి. 74 00:06:09,203 --> 00:06:12,080 చూడు, కేవలం... టామ్, ఆందోళన పడకు. నమ్ము... దయచేసి నన్ను నమ్ము. 75 00:06:12,164 --> 00:06:13,916 నేను ఇదంతా చక్కదిద్దగలను. 76 00:06:28,430 --> 00:06:29,515 మ్యాట్! 77 00:06:40,317 --> 00:06:41,944 నీ బల్ల వెనుక ఎందుకు దాక్కున్నావు? 78 00:06:41,944 --> 00:06:44,488 నేను దాక్కోలేదు. పెన్ కోసం వెతుకుతున్నాను. 79 00:06:47,199 --> 00:06:48,784 నువ్వు నన్ను విడిచిపెట్టేశావని అనుకున్నాను. 80 00:06:49,368 --> 00:06:51,078 నిన్న నువ్వు నాకు మళ్లీ మెసేజ్ చేయలేదు. 81 00:06:51,078 --> 00:06:56,208 లేదు, కేవలం, థామస్ నిజానికి... 82 00:06:56,708 --> 00:06:59,503 థామస్ హాస్పిటల్ లో ఉన్నాడు. -మంచిది. 83 00:06:59,503 --> 00:07:02,673 నా ఉద్దేశం, సారీ. అది... అతను ఇప్పుడు బాగానే ఉన్నాడా? 84 00:07:02,673 --> 00:07:06,426 అవును, లేదు, అతని భార్య. వాళ్ల బేబీ. 85 00:07:06,510 --> 00:07:09,972 వాళ్లకి కొద్దిగా సీరియస్ అయింది, అందుకే నేను కాసేపట్లో అక్కడికి వెళ్తున్నాను. 86 00:07:17,688 --> 00:07:18,689 అయితే, సరే. 87 00:07:19,731 --> 00:07:23,026 నాకు కొంత సమాచారం తెలిశాక నీకు కాల్ చేస్తాను. 88 00:07:31,869 --> 00:07:38,250 బెకా, జెపి తన చివరి రాత్రి గడిపిన విక్లో పబ్ కి నేను వెళ్లాను. 89 00:07:38,250 --> 00:07:41,628 నిన్ను అక్కడ చూసినట్లు బార్ మెయిడ్ చెప్పింది. 90 00:07:42,629 --> 00:07:47,926 కాబట్టి, నువ్వూ మీ సిస్టర్స్ ఒక దగ్గర లేరు, అవునా? 91 00:07:49,803 --> 00:07:51,096 బార్ మెయిడ్ తప్పు చెప్పింది. 92 00:07:51,180 --> 00:07:52,222 సరే. 93 00:07:55,392 --> 00:07:57,436 పోస్ట్ మార్టెమ్ రిపోర్టులు మీకు ఎలా ఉపయోగపడ్డాయి? 94 00:07:58,896 --> 00:08:00,397 లేదా అవి కూడా తప్పుగా వచ్చాయా? 95 00:08:10,741 --> 00:08:12,034 బెకా ఎక్కడికి పోయింది? 96 00:08:12,034 --> 00:08:13,368 తను ఇక్కడ ఉండాలి కదా. 97 00:08:13,452 --> 00:08:14,870 తను మ్యాట్ దగ్గరకి వెళ్లకుండా ఉంటే మంచిది. 98 00:08:15,704 --> 00:08:18,290 ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా తను తన కోరికల్ని చంపుకోలేకపోతోందా? 99 00:08:20,918 --> 00:08:23,253 గ్రేస్, నువ్వు బాగానే ఉన్నావా, బంగారం? కుదుటపడ్డావా? 100 00:08:23,962 --> 00:08:25,172 అతను నడక కోసం వాడే బూట్లు. 101 00:08:26,173 --> 00:08:27,508 అతని కోసం వీటిని మెత్తబడేలా చేశాను. 102 00:08:28,425 --> 00:08:29,968 వీటిని తొడుక్కుని ఇల్లాంతా తిరిగాను. 103 00:08:30,928 --> 00:08:32,596 అయ్యో, దేవుడా. అతడిని ఇందాకే ఖననం చేశాం 104 00:08:32,596 --> 00:08:36,058 కానీ నేను అప్పుడే తను అసలు ఇక్కడ ఉండనట్లే అతని జీవితాన్ని సర్దేస్తున్నాను. 105 00:08:36,933 --> 00:08:38,227 అతను ఇక్కడే ఎప్పుడూ ఉంటాడు. 106 00:08:40,520 --> 00:08:42,688 బహుశా ఇవి నోరాకి సరిపోవచ్చా? 107 00:08:43,273 --> 00:08:44,983 తన కాలి సైజు ఎంతో నాకు గుర్తు లేదు. 108 00:08:47,486 --> 00:08:48,904 నోరా తరపున నేను అవమానంగా భావిస్తున్నాను. 109 00:08:52,115 --> 00:08:53,492 మన పని అయిపోయింది. 110 00:08:54,618 --> 00:08:57,913 ఇది డోనల్ కి సరిపోతుందా? వాళ్లిద్దరికీ ఒక రకమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందనుకుంటా. 111 00:08:58,830 --> 00:09:00,040 బేబీ బెకా. 112 00:09:01,959 --> 00:09:03,794 గ్రేస్, మనకి ఇంకొన్ని బాక్సులు కావాలి, బంగారం. 113 00:09:04,920 --> 00:09:07,714 అవును. ఉండండి. నేను కింద సామాన్ల గదిలో ఉన్నాయేమో చూస్తాను. 114 00:09:09,967 --> 00:09:11,134 ఇది బాగుంది. 115 00:09:11,635 --> 00:09:13,762 నా ఉద్దేశం, ఇది గొప్పగా ఉంది. 116 00:09:13,846 --> 00:09:18,475 చనిపోయిన నా భర్త దుస్తుల్ని నేను సర్దేస్తున్నాను, కానీ, మీకు తెలుసు. 117 00:09:23,146 --> 00:09:24,565 నేను ఇప్పుడే వచ్చాను... 118 00:09:24,565 --> 00:09:26,567 కాసేపు నోరు మూసుకో. లోపలికి వెళ్లు. 119 00:09:27,067 --> 00:09:28,068 లోపలికి వెళ్లు. 120 00:09:34,825 --> 00:09:37,035 జాన్ పాల్ చనిపోయిన రాత్రి మనం అంతా కలిసి లేమని మ్యాట్ కి తెలిసిపోయింది. 121 00:09:37,119 --> 00:09:39,246 అది అతనికెలా తెలిసింది? -ఏంటి, నువ్వు మ్యాట్ తో ఉన్నావా? 122 00:09:39,246 --> 00:09:41,915 అతను తన ఆఫీసులోనే దాక్కుని ఉండటం నేను చూశాను. 123 00:09:41,999 --> 00:09:44,918 ఓహ్, దేవుడా. అంతా అయిపోయింది. -నా నుండి దాక్కున్నాడు. 124 00:09:45,002 --> 00:09:48,130 చూడు, మొదటగా, నన్ను చూసి దాక్కునే మగవాళ్లు గతంలో ఉన్నారు, సరేనా? 125 00:09:48,130 --> 00:09:50,174 పట్టించుకోకు. -నేను అబద్ధం చెబుతున్నానని తనకి తెలుసు, ఈవా. 126 00:09:50,174 --> 00:09:51,258 లేదు, విను. 127 00:09:52,092 --> 00:09:53,427 వాళ్లు ఇప్పుడు ఏదైనా విచారణ మొదలుపెడితే? 128 00:09:54,303 --> 00:09:57,556 జాన్ పాల్ మరణం వెనుక ఎవరో ఉన్నారని వాళ్లు ఖచ్చితంగా నమ్ముతున్నారు, సరేనా? 129 00:09:57,556 --> 00:10:00,893 వాళ్లు అనుకున్నదే నిజమైతే ఏంటి? అతడిని ఎవరైనా చంపి ఉంటే? 130 00:10:01,727 --> 00:10:03,020 ఏంటి... 131 00:10:03,020 --> 00:10:04,855 హేయ్. -ఇక్కడ ఏం చేస్తున్నారు? 132 00:10:05,522 --> 00:10:10,277 ఇంతపెద్ద బట్టల గదిలో మేమంతా పడతామో లేదో అని ఊరికే చూస్తున్నాం. 133 00:10:10,277 --> 00:10:12,571 కేరీ బ్రాడ్షా కూడా అసూయ పడేంత పెద్దగా ఉంది. 134 00:10:13,155 --> 00:10:15,782 లోపలికి రా! ఇది చాలా పెద్దది. 135 00:10:15,866 --> 00:10:16,867 నిజంగా. 136 00:10:18,660 --> 00:10:19,703 ఇది భారీగా ఉంది. 137 00:10:21,496 --> 00:10:23,540 క్లాఫిన్ అండ్ సన్స్ ఇన్సూరెన్స్ 138 00:10:24,958 --> 00:10:28,712 రోజర్ ని ఇంటర్వ్యూ చేయాలి - ఆ వీధిలో విచిత్రమైన వ్యక్తి. 139 00:10:33,217 --> 00:10:35,260 జిఎఎ ఫుట్ బాల్ సీట్ 82, వరుస 14 140 00:10:36,720 --> 00:10:40,265 పాలసీల డేటాబేస్ 141 00:10:49,775 --> 00:10:52,110 ఇక్కడ మద్యం లేనప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాము? 142 00:10:52,194 --> 00:10:53,237 నాకు ఇక్కడ సూప్ ఇష్టం. 143 00:10:53,237 --> 00:10:55,656 వద్దు. సూప్ వద్దు. మద్యం వద్దు. 144 00:10:55,656 --> 00:10:57,449 ఆ రోజు మీరంతా ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి. -ఏంటి? 145 00:10:58,033 --> 00:10:59,409 ఆ రాత్రంతా నువ్వు ఎక్కడికి వెళ్లావు? 146 00:11:00,118 --> 00:11:01,411 నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? 147 00:11:01,912 --> 00:11:03,622 నేను బెన్ తో ఉన్నాను. ఆ విషయం నీకు తెలుసు. 148 00:11:03,622 --> 00:11:06,542 కానీ, మీరిద్దరూ కలిసి అతడిని చంపేసి ఉండచ్చు కదా. మీకు అందుకు చాలా కారణాలు ఉన్నాయి. 149 00:11:06,542 --> 00:11:09,294 మరి నువ్వు ఎక్కడికి వెళ్లావు? మినా చనిపోయాక నీ మతి చలించింది కదా. 150 00:11:09,378 --> 00:11:10,379 ఖచ్చితంగా. 151 00:11:11,171 --> 00:11:13,882 సొంతంగా ఏదైనా చేయగల మానసిక స్థయిర్యం ఎవరికైనా ఉందంటే, అది నీకే ఉంది. 152 00:11:13,966 --> 00:11:15,384 ఆ విషయం అందరికీ తెలుసు. 153 00:11:15,968 --> 00:11:19,221 నిజానికి, ఈవా, ఈ పని చేస్తానని నువ్వు స్పష్టంగా చెప్పావు కదా. 154 00:11:19,221 --> 00:11:21,723 అవును, కానీ నేను చేయలేదు, సరేనా? 155 00:11:22,432 --> 00:11:23,892 ఆ పెంటో టాబ్లెట్ తో నేను ఏం చేయగలను? 156 00:11:23,976 --> 00:11:25,102 అది నా వాష్ బ్యాగ్ లో ఉంది. 157 00:11:25,602 --> 00:11:26,895 నీ వాష్ బ్యాగ్ ఎక్కడ? 158 00:11:26,979 --> 00:11:28,188 అది బెన్ దగ్గర ఉంది. -బెన్ దగ్గరట... 159 00:11:29,565 --> 00:11:30,607 బెన్ దగ్గర ఉందా? 160 00:11:30,691 --> 00:11:32,234 కానీ అతను నాకు కనిపించలేదు. 161 00:11:32,234 --> 00:11:34,486 జెపి హత్యలో అతని పాత్ర ఏమైనా ఉండచ్చు అనుకుంటున్నావా? 162 00:11:35,070 --> 00:11:38,699 ఎలా? తను ఎలాగో జెపికి మత్తు ఎక్కించి ప్రమాదంలో చనిపోయేలా చేశాడంటావా? 163 00:11:42,327 --> 00:11:43,704 ఓహ్, దేవుడా. 164 00:11:43,704 --> 00:11:47,165 బెన్ దగ్గరకి వెళ్లి, ఆ పెంటో మందులు తీసుకో, తిరిగి మా ఇంటికి వచ్చేయ్. 165 00:11:47,749 --> 00:11:48,792 సరే. 166 00:11:48,876 --> 00:11:50,377 వెళ్లు! -సరే. 167 00:11:50,878 --> 00:11:51,920 ఓహ్, దేవుడా. 168 00:11:53,672 --> 00:11:54,882 ఇంక సెక్స్ చేయకు. 169 00:12:03,599 --> 00:12:06,977 నిన్ను కలవలేకపోయాను. 170 00:12:06,977 --> 00:12:12,357 జెపి చనిపోయాక, నీకు తెలుసు కదా, నేను గ్రేస్ దగ్గర ఉండాల్సి వచ్చింది. 171 00:12:13,400 --> 00:12:15,944 బీమా కంపెనీ వాళ్లు తనని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. 172 00:12:16,695 --> 00:12:17,779 వాళ్లు డబ్బు చెల్లించడం లేదు. 173 00:12:18,530 --> 00:12:22,951 జెపి చనిపోవడంలో ఏదో కుట్ర జరిగిందని వాళ్లు అనుకుంటున్నారు. 174 00:12:24,119 --> 00:12:25,370 అది ఏదో కవితాత్మకంగా లేదూ. 175 00:12:27,164 --> 00:12:29,791 ఆ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు? 176 00:12:30,542 --> 00:12:33,003 జెపి చనిపోయిన రాత్రి, నేను లేచేసరికి నువ్వు లేవు. 177 00:12:34,922 --> 00:12:37,758 నాకు ఫోన్లు చేయడం మానేశావు, అలాగే నా మెసేజ్ లకి కూడా స్పందించడం లేదు. 178 00:12:40,636 --> 00:12:42,471 నా కోసం ఏమైనా చేస్తానని ఒకసారి నాతో చెప్పావు. 179 00:12:44,431 --> 00:12:45,432 తనని నేనే చంపాను అనుకుంటున్నావా? 180 00:12:46,099 --> 00:12:48,310 ప్రేమలో ఉన్నప్పుడు కొందరు విచిత్రమైన పనులు చేస్తారు అనుకుంటున్నా. 181 00:12:48,310 --> 00:12:50,395 నేను కూడా అదే చేస్తా. నీ కోసం ఏదైనా చేస్తా. 182 00:12:52,689 --> 00:12:54,608 నువ్వు వొట్టి అబద్ధాలకోరువి. 183 00:12:55,651 --> 00:12:57,819 లేదు, నేను అలా కాదు... నేను... -చూడు, ఉర్స్. 184 00:12:58,362 --> 00:13:01,532 మన కోసం అద్దెకు తీసుకుందాం అనుకున్న ఇంట్లోకి నువ్వు కనీసం రావాలి అనుకోలేదు. 185 00:13:02,032 --> 00:13:04,952 ఇప్పుడు, నా కోసం తనని చంపేస్తానంటున్నావా? ఇంక ఆపు. 186 00:13:05,452 --> 00:13:06,495 నన్ను క్షమించు. 187 00:13:07,162 --> 00:13:13,001 నాకు విరక్తి కలిగింది. నన్ను నువ్వు అడిగిన పనికి, నాకు విరక్తి కలిగింది. 188 00:13:13,085 --> 00:13:15,087 ఏదైనా చేయమని నేను నిన్ను అడగలేదు కదా. 189 00:13:15,087 --> 00:13:19,174 ఆ రాత్రి నువ్వు నా నుంచి ఏం ఆశించావో మన ఇద్దరికీ తెలుసు. 190 00:13:21,802 --> 00:13:23,595 నేను ఆ రాత్రి నిన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయానంటే 191 00:13:24,638 --> 00:13:27,641 నీ పక్కన మరొక్క నిమిషం కూడా నేను ఉండలేకపోయాను. 192 00:13:29,977 --> 00:13:30,978 నన్ను క్షమించు. 193 00:13:33,564 --> 00:13:34,648 మన ప్రేమ ఇక ముగిసింది. 194 00:13:37,609 --> 00:13:38,652 దయచేసి వెళ్లు. 195 00:13:41,572 --> 00:13:45,075 ఇది ఇంక ముగిసిపోవడం నాకు అవసరం, ఉర్స్. 196 00:13:46,827 --> 00:13:47,744 దయచేసి వెళ్లు. 197 00:14:18,775 --> 00:14:20,110 మైఖేల్, వద్దు. 198 00:14:20,194 --> 00:14:22,321 తొంగి చూడకు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, బాబు... -వెళ్లు! 199 00:14:22,321 --> 00:14:24,323 నాన్నా... -వద్దు, మైఖేల్! 200 00:14:28,285 --> 00:14:30,996 మైఖేల్ నన్ను నీటి పైపు ద్వారా తడిపేశాడు. తరువాత నువ్వే. 201 00:14:31,663 --> 00:14:33,582 నువ్వు బాగున్నావా? టీ తాగుతావా? 202 00:14:50,557 --> 00:14:53,685 రోజర్, మీరేనా? నేను మాథ్యూ క్లాఫిన్. 203 00:14:54,811 --> 00:14:56,104 నేను లోపలికి వస్తే మీకేమైనా అభ్యంతరమా? 204 00:14:59,358 --> 00:15:01,735 సరే, అలాగే. ఇలా నీ ఎడమ వైపు వెళ్లు, సరేనా? 205 00:15:17,125 --> 00:15:19,127 దయచేసి, కూర్చో. -అలాగే. థాంక్యూ. 206 00:15:19,211 --> 00:15:20,462 అంతా చిందరవందరగా ఉంది, మన్నించు. 207 00:15:21,421 --> 00:15:22,297 లేదు, మీరు కూర్చోండి. 208 00:15:24,883 --> 00:15:29,763 నేను విలియమ్స్ ఫ్యామిలీ పాలసీని డీల్ చేస్తున్నాను. 209 00:15:29,847 --> 00:15:34,017 మేము డబ్బు చెల్లించడానికి ముందు కొద్దిగా ఇతర విషయాల్ని పరిశీలిస్తున్నాం. 210 00:15:34,518 --> 00:15:36,603 ఇది సాధారణ ప్రక్రియ. 211 00:15:38,856 --> 00:15:40,649 అయితే, మీకు ఆ కుటుంబం గురించి తెలుసా? 212 00:15:41,149 --> 00:15:42,442 అవును, ఒకప్పుడు తెలుసు. 213 00:15:43,527 --> 00:15:44,528 ఇప్పుడు తెలియదా? 214 00:15:45,612 --> 00:15:46,655 అంటే, అతను చనిపోయాడు, అవునా? 215 00:15:47,781 --> 00:15:48,866 అతను చనిపోయాడు. 216 00:15:51,326 --> 00:15:53,453 కానీ గ్రేస్ ఇంకా బ్లానడ్ ఉన్నారు. 217 00:15:55,205 --> 00:15:58,584 అవును, కానీ, చాలా ఆలస్యం అయిపోయింది, కదా? 218 00:15:58,584 --> 00:16:01,461 ఏం జరగాలో అది జరిగిపోయింది. 219 00:16:03,422 --> 00:16:05,132 ఆ మనిషి ఒక రాక్షసుడు. 220 00:16:06,091 --> 00:16:08,635 నా మీద అతను చాలా దుర్మార్గమైన నింద మోపాడు. 221 00:16:08,719 --> 00:16:09,803 ఏ నేరం? 222 00:16:10,679 --> 00:16:13,140 నాకు పిల్లల పట్ల అసహజమైన ఆసక్తి ఉందట. 223 00:16:13,140 --> 00:16:16,393 పిల్లలు అంటే నాకు ప్రేమ తప్ప మరేమీ లేదు, కానీ అతను అందరూ గుసగుసలాడేలా చేశాడు! 224 00:16:16,393 --> 00:16:18,353 నా చర్చ్ నన్ను బహిష్కరించింది! 225 00:16:19,229 --> 00:16:22,691 నా విధుల్ని నాకు దూరం చేశారు! నా జీవితం నాశనం అయిపోయింది! 226 00:16:23,692 --> 00:16:26,570 ఇదంతా అతనికి ఆట. అందుకోసమే ఇలా చేశాడు. 227 00:16:28,113 --> 00:16:29,531 అది అతనికి వినోదం. 228 00:16:32,534 --> 00:16:33,911 మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? 229 00:16:35,746 --> 00:16:39,374 జాన్ పాల్ చనిపోయిన రోజు మీరు ఎక్కడ ఉన్నారో మీకు గుర్తుందా? 230 00:16:41,919 --> 00:16:42,920 గుర్తుంది. 231 00:16:44,505 --> 00:16:46,507 అతను చనిపోయిన రోజు నేను అతని క్యాబిన్ కి వెళ్లాను. 232 00:16:48,425 --> 00:16:50,010 ఎందుకంటే అతని మీద నాకు ఉన్న ద్వేషాన్ని 233 00:16:50,010 --> 00:16:52,930 నేను మనసులో మోయడం నాకు సాధ్యం కాలేదు, తెలుసా? 234 00:16:52,930 --> 00:16:54,806 అతడిని క్షమించాలని అనుకున్నాను. 235 00:16:55,807 --> 00:16:58,936 నేను మళ్లీ ప్రేమగా ఉండాలని భావించాను, తెలుసా? 236 00:17:00,938 --> 00:17:05,776 మీరు క్యాబిన్ కి వెళ్లినప్పుడు జాన్ పాల్ అక్కడ ఉన్నాడా? 237 00:17:08,403 --> 00:17:10,113 ఆమె క్లెయిమ్ ని చెల్లించండి. 238 00:17:11,281 --> 00:17:12,657 అందుకు ఆమె చాలా అర్హురాలు ఎందుకంటే 239 00:17:13,325 --> 00:17:16,869 ఆ క్రూరపు వెధవతో ఇన్నేళ్లు ఆమె ఎన్నో బాధలు అనుభవించింది. 240 00:17:17,871 --> 00:17:22,917 ఏది అసహజమో నీకు నేను చెప్తాను, అతనికి తన మరదళ్ల మీద ఆసక్తి ఉండేది. 241 00:17:23,502 --> 00:17:24,586 మీ ఉద్దేశం ఏమిటి? 242 00:17:27,005 --> 00:17:28,507 నువ్వు మా ఇంటి నుండి దయచేసి వెళ్లు. 243 00:17:32,052 --> 00:17:33,053 తప్పకుండా. 244 00:17:40,936 --> 00:17:42,187 మిసెస్ విలియమ్స్. 245 00:17:43,856 --> 00:17:44,898 గ్రేస్! 246 00:17:44,982 --> 00:17:46,233 ఏదైనా వార్త చెప్తారు, అని ఆశిస్తున్నాను. 247 00:17:46,233 --> 00:17:49,570 అవును, అంటే, అలాంటిదే. నేను లోపలికి రావచ్చా? -లేదు. 248 00:17:49,570 --> 00:17:52,614 సారీ, లేదు, నేను బ్లానడ్ కి డిన్నర్ తయారు చేయాలి, అందుకని... 249 00:17:53,115 --> 00:17:56,535 సరే, కొన్ని విషయాలు నాకు ఇంకా అయోమయంగానే ఉన్నాయి 250 00:17:56,535 --> 00:17:58,287 వాటి గురించి మీకు త్వరగా చెప్పేస్తాను. 251 00:17:58,787 --> 00:18:00,581 అయితే, విక్లోలో నేను పబ్ కి వెళ్లాను. 252 00:18:00,581 --> 00:18:04,293 మీ భర్త అక్కడికి వచ్చాడో లేదో తను స్పష్టంగా చెప్పలేకపోయింది. 253 00:18:04,293 --> 00:18:06,420 అతను హార్ప్స్ ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడని మాత్రమే నాకు తెలుసు. 254 00:18:06,420 --> 00:18:09,089 అతను చెప్పింది అదే అయితే, అతను అక్కడికే వెళ్లి ఉండాలి. 255 00:18:09,173 --> 00:18:10,591 సరే, బెకా గురించి ఆమె చెప్పింది... 256 00:18:11,508 --> 00:18:14,261 మీ చెల్లెలు, రెబెకా, ఆ రాత్రి అక్కడే ఉందట. 257 00:18:14,928 --> 00:18:18,098 కాబట్టి, మీరు ముందు చెప్పినట్లు తను మీతో లేదు. 258 00:18:18,182 --> 00:18:21,351 తను ఆలస్యంగా వచ్చింది. తను ఎప్పుడూ ఆలస్యమే. 259 00:18:21,435 --> 00:18:24,104 మీ ఎదురింటి ఆయన ఒక పీడోఫైల్ అని మీ ఆయన ఆరోపించాడని చెప్పాడు. 260 00:18:25,439 --> 00:18:29,234 అతడిని క్షమించడం కోసం ఆ రాత్రి అతను క్యాబిన్ కి వెళ్లాడని చెప్పాడు. అక్కడ అతడిని మీరు చూశారా? 261 00:18:30,444 --> 00:18:33,280 మీ చిన్న చెల్లెలు అతను ఆర్థికంగా ఆమెను దెబ్బ కొట్టాడని చెబుతోంది, 262 00:18:33,280 --> 00:18:35,324 అతను తన తల్లినే హింసించేవాడని చెబుతోంది. 263 00:18:38,327 --> 00:18:39,912 అతనికి అంతగా మంచి పేరు లేదు, అవునా? 264 00:20:06,665 --> 00:20:08,125 ఓరి దేవుడా. 265 00:20:17,426 --> 00:20:18,927 ఫోకస్ సన్ షైన్ డాట్ కామ్ ఫిల్తీ వీడియోస్ అండ్ పిక్స్ డాట్ కామ్ 266 00:20:23,015 --> 00:20:23,849 హాయ్ రోజర్. నా పేరు ఆస్కర్ 267 00:20:23,849 --> 00:20:25,934 లేదు. నా అంగం పెద్దగా వంగపండు రంగులోకి మారుతోంది. నేను ఏం చేయాలి? 268 00:20:26,018 --> 00:20:27,561 నువ్వు నా డాడీవి అవుతావా? నాకు అంగం గురించి నేర్పించు 269 00:20:53,629 --> 00:20:54,630 చెత్త. 270 00:21:28,372 --> 00:21:31,583 బిగ్ విన్ ఫర్ జిఎఎ బాయ్స్ 271 00:21:41,051 --> 00:21:42,052 ఓరి దేవుడా. 272 00:21:42,052 --> 00:21:43,428 జిఎఎ శనివారం 06 ఆగస్ట్ 22 273 00:21:52,187 --> 00:21:53,939 థామస్ క్లాఫిన్ కి మీ సందేశం చెప్పండి. 274 00:21:55,357 --> 00:21:59,945 థామస్, జెపి మ్యాచ్ చూడటానికి పబ్ కి వెళ్లాడని గ్రేస్ నాకు చెప్పింది, 275 00:21:59,945 --> 00:22:02,531 కానీ ఆ మ్యాచ్ ఆ మరుసటి రోజు శనివారం నాడు ఉంది. 276 00:22:03,073 --> 00:22:06,451 మాల్కమ్ కి నువ్వు ఇచ్చిన టికెట్లు చూశాను, వాళ్ల మ్యాచ్ లు ఎప్పుడూ శనివారమే జరుగుతాయి. 277 00:22:06,535 --> 00:22:09,037 జెపి ఖచ్చితంగా ఆమెకు అబద్ధం చెప్పాడు. 278 00:22:10,831 --> 00:22:12,040 అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? 279 00:22:53,373 --> 00:22:55,167 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 280 00:22:58,295 --> 00:22:59,755 లేదు, కావలసినంత సమయం తీసుకో, ఉర్స్. 281 00:22:59,755 --> 00:23:02,257 మా జీవితాలు మాత్రం ఇక్కడ ప్రమాదంలో పడి ఉన్నాయి. 282 00:23:08,388 --> 00:23:09,515 బెన్ ఆ పని చేయలేదు. 283 00:23:11,266 --> 00:23:13,977 మరి పెంటో మందులతో ఏం చేశాడు? వాటిని తీసుకువచ్చావా? 284 00:23:19,191 --> 00:23:20,484 అతను చేయలేదని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? 285 00:23:20,484 --> 00:23:22,694 ఎందుకంటే అతను నాతో విడిపోయాడు, బీబీ, సరేనా? అందుకే చేయలేదు. 286 00:23:24,404 --> 00:23:26,865 అతను నా కోసం ఆ పని చేయడు. నేను ఏం ఆలోచించానో నాకే తెలియదు. 287 00:23:29,701 --> 00:23:30,994 నేను అంతా పాడు చేసుకున్నాను. 288 00:23:32,788 --> 00:23:33,956 ఓహ్, ఉర్స్. 289 00:23:35,874 --> 00:23:38,043 సరే, ఇక్కడ ఈ గదిలో మనలో ఎవరైనా చేసి ఉంటే, బయటకి చెప్పాలి. 290 00:23:39,127 --> 00:23:40,337 అది తప్పదు. 291 00:23:40,838 --> 00:23:43,382 మనలో ఎవ్వరమూ దీనిని ఒంటరిగా భరించకూడదు. 292 00:23:43,382 --> 00:23:46,093 మనం అంతా కలిసికట్టుగా, ఎదుర్కొందాం. 293 00:23:46,593 --> 00:23:48,720 ఆ విధంగా మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలం. 294 00:23:51,974 --> 00:23:52,975 ఉర్స్. 295 00:23:55,227 --> 00:23:56,687 ఆ రాత్రంతా ఆమె ఒంటరిగా ఉంది. 296 00:23:57,271 --> 00:23:58,939 ఆమె చేయలేదని ఎలా చెప్పగలరు? -ఎందుకంటే నేను చేయలేదు. 297 00:23:58,939 --> 00:24:00,858 ఎందుకంటే తను చేయలేదు. -సరే. 298 00:24:00,858 --> 00:24:02,651 అయితే, మీరిద్దరూ ఒకరినొకరు నమ్ముతారు, 299 00:24:02,651 --> 00:24:06,238 కానీ నేను మాత్రం నేనెక్కడ ఉన్నానో రుజువు చేయాలా? -తను మరొకరిని ఇందులోకి లాగేది కాదు. 300 00:24:06,238 --> 00:24:08,073 తను ఒక చెత్త సైకో! 301 00:24:08,073 --> 00:24:12,035 నా అక్రమ సంబంధం గురించి నా భర్తకి తెలియకూడదని ఒక వ్యక్తిని చంపాలని అనుకున్నది నేను కాదు. 302 00:24:12,119 --> 00:24:14,329 ఆపు... చెత్తదానా. -చూడండి, ఇంక ఆపండి! సరేనా? ఇంక ఆపండి. 303 00:24:15,414 --> 00:24:17,416 నువ్వు అసలు సైకోవి! -నువ్వు ఎక్కడ ఉన్నావు, బెకా? 304 00:24:17,416 --> 00:24:20,544 ఆ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియాలి. నీ షూస్ కి మట్టి ఎందుకు అంటుకుంది? 305 00:24:20,544 --> 00:24:23,839 నేను పబ్ లో తప్పతాగి ఉన్నాను! మిస్ చెత్త మార్పల్. 306 00:24:23,839 --> 00:24:26,008 నువ్వు ఏదైనా నిర్లక్ష్యంగా చేస్తావని నేను ఆందోళన పడ్డాను, 307 00:24:26,008 --> 00:24:29,303 అందుకే తాగాను. నాకు బాగా బుద్ధి చెప్పావు. -తనతో అలా మాట్లాడకు! 308 00:24:29,303 --> 00:24:31,054 మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? 309 00:24:32,848 --> 00:24:35,559 ఏమీ లేదు. ఊరికే రాజకీయాల గురించి. 310 00:24:36,560 --> 00:24:37,728 జాన్ పాల్ చనిపోయిన రోజు నుంచి, 311 00:24:37,728 --> 00:24:40,063 నేను ఎప్పుడు గదిలోకి వచ్చినా, మీరు మాట్లాడటం ఆపేస్తున్నారు. 312 00:24:40,689 --> 00:24:41,857 లేదు, మేము అలా చేయలేదు! 313 00:24:41,857 --> 00:24:43,525 ఏం అయింది, గ్రేస్? నువ్వు బాగానే ఉన్నావా? 314 00:24:44,443 --> 00:24:45,903 వాళ్లు జాన్ పాల్ శవానికి పోస్ట్ మార్టెమ్ జరిపారు. 315 00:24:46,612 --> 00:24:49,364 నేను అంగీకరించినట్లు దాని మీద సంతకం ఉంది. 316 00:24:50,991 --> 00:24:53,035 ఆ చెత్త వెధవలు. -నోరు మూయి. 317 00:24:54,328 --> 00:24:55,329 ఓహ్, దేవుడా. 318 00:24:57,664 --> 00:25:01,627 మీకు ఆ విషయం తెలుసు. మీకు పోస్ట్ మార్టెమ్ గురించి తెలుసు. 319 00:25:04,338 --> 00:25:06,507 వాళ్లు జాన్ పాల్ శవాన్ని ఎందుకు వెలికి తీశారు? 320 00:25:13,931 --> 00:25:15,599 ఎందుకంటే అతడ్ని హత్య చేశారని వాళ్లు అనుమానిస్తున్నారు. 321 00:25:17,851 --> 00:25:19,436 పైగా ఆ పని చేసింది మనలో ఒకరని వాళ్ల అనుమానం. 322 00:25:22,856 --> 00:25:24,024 మీలో ఒకరా? 323 00:25:25,901 --> 00:25:27,361 వాళ్లు అలా ఎందుకు అనుకుంటున్నారు? 324 00:25:30,072 --> 00:25:32,824 ఎందుకంటే అతడ్ని చంపడానికి మా అందరికీ తలో కారణం ఉందని అనుకుంటున్నారు. 325 00:25:35,077 --> 00:25:36,161 ఇంకా ఎందుకంటే... -లేదు! ఇంక చాలు... 326 00:25:36,245 --> 00:25:37,579 తనకి అబద్ధాలు చెప్పడం ఆపు! 327 00:25:40,457 --> 00:25:42,042 ఎందుకంటే మేము అతడిని చంపి ఉండకపోవచ్చు కానీ... 328 00:25:44,419 --> 00:25:46,004 దేవుడా, మేము ప్రయత్నించాం. 329 00:25:46,505 --> 00:25:49,466 మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ ఉద్దేశం ఏంటి? "మేము ప్రయత్నించాం" అంటే? 330 00:25:49,550 --> 00:25:53,262 మేము జాన్ పాల్ చావుని కోరుకున్నాం, గ్రేసీ. 331 00:25:56,014 --> 00:25:57,558 మేము అది నీ కోసం చేయాలి అనుకున్నాం. 332 00:25:58,851 --> 00:26:00,227 నిన్ను కాపాడాలని అనుకున్నాం. 333 00:26:03,397 --> 00:26:04,982 నువ్వు ఇంకా బ్లానడ్ స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాం. 334 00:26:10,445 --> 00:26:11,738 గ్రేసీ. 335 00:26:22,124 --> 00:26:24,710 నన్ను క్షమించండి. 336 00:26:28,172 --> 00:26:29,965 చాలా, చాలా క్షమించాలి. 337 00:26:35,804 --> 00:26:37,556 ఇదిగో తీసుకో. -అది నా పుట్టినరోజు. 338 00:26:38,056 --> 00:26:39,933 ఆ సాయంత్రం చాలా ఆహ్లాదంగా ఉంది... 339 00:26:44,396 --> 00:26:45,397 ఇలా రా, నువ్వు. 340 00:26:52,029 --> 00:26:54,114 ఈ మెట్లు జారుతున్నాయి, మామీ. 341 00:26:54,198 --> 00:26:55,490 చాలా జారుతున్నాయి. 342 00:26:56,325 --> 00:26:58,619 ఈ మెట్ల విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. 343 00:26:59,494 --> 00:27:02,206 నువ్వు దేని గురించి వెతుకుతున్నావు, బంగారం? -జామ్... జామ్స్. 344 00:27:04,166 --> 00:27:05,751 అవి లేకుండా కూడా ఉండచ్చు, బహుశా? 345 00:27:07,211 --> 00:27:08,545 కేవలం ఈ రాత్రి వరకూ. 346 00:27:11,215 --> 00:27:12,216 నాకు కితకితలు, మామ్. 347 00:27:13,342 --> 00:27:14,885 సరే, అయితే... 348 00:27:14,885 --> 00:27:17,304 నేను మరింత జాగ్రత్తగా ఉండాలి, అవునా? 349 00:27:39,284 --> 00:27:41,787 ఈ రోజు నువ్వు నేను మాత్రమే గడుపుతామని చెప్పు. 350 00:27:44,498 --> 00:27:45,832 అలాగే. 351 00:29:06,038 --> 00:29:07,039 హేయ్. 352 00:29:08,457 --> 00:29:11,126 నా మెడ విరిచేద్దామని ప్రయత్నిస్తున్నావా? ఆ పని చేయకు. 353 00:29:11,210 --> 00:29:13,295 జాన్ పాల్. -వద్దు. నేను... 354 00:29:14,838 --> 00:29:15,923 నేను ఇప్పుడు చేయలేను. 355 00:29:20,010 --> 00:29:21,970 ఇదిగో మొదలైంది, కన్నీళ్ల నాటకం. 356 00:29:25,182 --> 00:29:27,726 కేవలం నిన్ను ముద్దాడాలి అనుకున్నా, బేబీ. నేను కేవలం... 357 00:29:27,726 --> 00:29:30,646 వద్దు, నువ్వు ముద్దు పెట్టాలని అనుకోవు, గ్రేస్. 358 00:29:30,646 --> 00:29:33,857 నీకు ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి. నువ్వు నా మీద పెట్టే ఒత్తిడి... 359 00:29:36,443 --> 00:29:39,446 ఉర్సులా చెబుతోంది అది చాలా సహజం అని, నువ్వు... 360 00:29:41,490 --> 00:29:44,910 నపుంసకత్వానికి చాలా కారణాలు ఉంటాయి, అంటే... 361 00:29:44,910 --> 00:29:47,871 నా అంగం గురించి మీ సిస్టర్స్ తో మాట్లాడావా? 362 00:29:49,540 --> 00:29:50,749 ఉర్సులా ఒక నర్స్. 363 00:29:51,542 --> 00:29:52,918 తను దీని గురించి మాట్లాడేది... -తను బజారుది! 364 00:29:52,918 --> 00:29:54,002 ఏంటి అంటున్నావు? 365 00:29:56,255 --> 00:29:59,550 నీ అక్కచెల్లెళ్లు విషపు మనుషులు, గ్రేస్. వాళ్లు నీ బుర్రని విషంతో నింపుతారు. 366 00:29:59,550 --> 00:30:02,052 ఎప్పుడూ మా సిస్టర్స్ గురించే ఎందుకు మాట్లాడతావు? 367 00:30:02,928 --> 00:30:07,432 నేను ఒక సమస్యని పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాను. -ఏదైనా పరిష్కరించడానికి అసలు నువ్వు ఎవరు? 368 00:30:07,516 --> 00:30:08,809 నా ఉద్దేశం, నువ్వు ఏమీ కావు. 369 00:30:08,809 --> 00:30:12,187 గోడ మీద ఈగవి నువ్వు. ఒక నీడవి. 370 00:30:12,271 --> 00:30:16,191 ఇప్పుడు ఈ లైట్ ఆర్పేస్తే, కనీసం నీ ఉనికి కూడా ఉండదు. 371 00:30:16,275 --> 00:30:17,651 ఒకసారి చూస్తావా? 372 00:30:18,777 --> 00:30:21,780 అది చూస్తావా? ఏం జరుగుతుందో చూస్తావా? 373 00:30:22,281 --> 00:30:23,282 ఇదిగో చూడు. 374 00:30:23,907 --> 00:30:28,453 హలో? మామీ? మామీ ఎక్కడ? ఎవరైనా మామీని చూశారా? 375 00:30:29,621 --> 00:30:31,331 చూశావా? నువ్వు ఇప్పుడు కనీసం నీడవి కూడా కావు. 376 00:30:34,793 --> 00:30:35,794 ఇదిగో ఇక్కడ ఉన్నావు. 377 00:30:36,545 --> 00:30:38,088 నువ్వు తిరిగి వచ్చేశావ్. మామీ వచ్చేసింది. 378 00:30:39,047 --> 00:30:40,048 నీ ఉనికి మళ్లీ ఉంది. 379 00:30:43,760 --> 00:30:46,388 ఎక్కడికి వెళ్తున్నావు? అది నాకు చెప్పాలి. 380 00:30:46,889 --> 00:30:49,141 నా సిస్టర్స్ దగ్గరకి వెళ్తున్నాను. 381 00:30:49,766 --> 00:30:53,896 నువ్వు అది చూడవు, కదా? అసలు సమస్య నీ అక్కచెల్లెళ్లే! 382 00:30:53,896 --> 00:30:55,731 వాళ్లు మాత్రమే నా గురించి పట్టించుకుంటారు. 383 00:30:55,731 --> 00:30:58,275 కానీ, మనల్ని వేరు చేయడానికి వాళ్లు ఏమైనా చేస్తారు. 384 00:30:58,275 --> 00:31:00,527 వాళ్లు నీ గురించి అంతవరకే పట్టించుకుంటారు. 385 00:31:00,611 --> 00:31:01,945 దీని గురించి మాట్లాడతావా? -లేదు! 386 00:31:02,029 --> 00:31:04,573 నీ మీద మనసు రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? 387 00:31:07,701 --> 00:31:10,287 ఎందుకంటే ఆణిముత్యాల్లాంటి నీ సిస్టర్స్ లో ఒకరు నన్ను ప్రలోభపెట్టింది, 388 00:31:11,330 --> 00:31:12,372 అదే కారణం. 389 00:31:12,456 --> 00:31:13,665 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 390 00:31:14,666 --> 00:31:16,752 నిన్ను ప్రలోభపెట్టిందా? నీ ఉద్దేశం ఏంటి అసలు? 391 00:31:18,754 --> 00:31:20,297 నేను తాగిన మైకంలో ఉన్నప్పుడు. 392 00:31:20,297 --> 00:31:21,924 ఏ సిస్టర్, జాన్ పాల్? ఎవరు? 393 00:31:23,800 --> 00:31:24,718 ఈవా. 394 00:31:25,469 --> 00:31:26,553 ఈవా? 395 00:31:26,637 --> 00:31:27,638 అవును. 396 00:31:29,264 --> 00:31:31,600 లేదు, తను అలా చేయదు. నేను నమ్మను... 397 00:31:34,061 --> 00:31:36,480 నువ్వు ఈవాతో సెక్స్ చేశావా? 398 00:31:36,480 --> 00:31:39,358 గ్రేస్, అది సెక్స్ కాదు. 399 00:31:41,151 --> 00:31:42,319 అది ఒక వల. 400 00:31:43,070 --> 00:31:44,071 ఎప్పుడు? 401 00:31:44,780 --> 00:31:46,573 చాలా ఏళ్ల కిందట. పదేళ్ల కిందట. 402 00:31:47,699 --> 00:31:50,702 ఆ కియరన్ గాడు, వాడు మత్తులో పడి ఉన్నాడు, నువ్వు నిద్రపోతున్నావు, 403 00:31:50,786 --> 00:31:53,956 అప్పుడు తను నా మీదకి వచ్చింది. 404 00:31:54,665 --> 00:31:58,252 నేను తాగిన మైకంలో ఏం ఆలోచించలేకపోయాను, ఇంక అది నువ్వే అనుకున్నాను, 405 00:31:58,252 --> 00:32:00,003 ఆ తరువాత తను నన్ను మభ్యపెట్టి, ఇంకా అది... 406 00:32:01,588 --> 00:32:05,384 అది నన్ను కలవరపెట్టింది. అప్పటి నుండి అది నన్ను చిత్రవధ చేస్తోంది. 407 00:32:06,635 --> 00:32:11,139 అయితే నా పుట్టినరోజున మనం ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిందా? 408 00:32:12,140 --> 00:32:14,518 అది జరిగిన తరువాత తను నన్ను నిందించాలని కూడా ప్రయత్నించింది. 409 00:32:15,060 --> 00:32:16,144 దేని కోసం? 410 00:32:17,646 --> 00:32:19,356 ఆ గర్భస్రావం గురించా? -అవును. 411 00:32:21,275 --> 00:32:23,735 కానీ అది జరిగినప్పుడు నేను తనతోనే ఉన్నా. తను పూర్తిగా బాధలో మునిగిపోయి ఉంది. 412 00:32:23,819 --> 00:32:26,530 అవును, అంటే, ఏం జరిగినా, అదంతా తన పొరపాటే. 413 00:32:27,489 --> 00:32:31,743 తను తప్పతాగి ఉంది, గ్రేస్. ఆ తాగుడు వల్లనే తనకి గర్భస్రావం అయింది. 414 00:32:35,539 --> 00:32:36,790 నువ్వు ఏం చేశావు? 415 00:32:36,874 --> 00:32:37,875 ఏంటి? 416 00:32:39,042 --> 00:32:40,169 నువ్వు ఆమెను ఎలా బలవంతపెట్టావు? 417 00:32:40,961 --> 00:32:41,962 నా వైపు చూడు! 418 00:32:41,962 --> 00:32:44,089 నా మీద ఇంకెప్పుడూ అరవకు! 419 00:32:45,174 --> 00:32:46,216 వద్దు. 420 00:32:47,092 --> 00:32:50,137 అది ఆమె తప్పు! నీ అక్క చేసింది! 421 00:32:50,721 --> 00:32:51,889 నువ్వు అబద్ధాలకోరువి. 422 00:32:56,810 --> 00:33:01,565 ఇక్కడ తను అబద్ధాలకోరు. తను నన్ను నిందించింది. 423 00:33:02,149 --> 00:33:06,653 తన మీద తనకే అసహ్యం వేసి, నేనే తనని రేప్ చేశానని చెప్పడానికి కూడా ప్రయత్నించింది. 424 00:33:07,863 --> 00:33:09,406 నువ్వు తనని రేప్ చేశావా, జాన్ పాల్? 425 00:33:09,406 --> 00:33:14,661 నేను రేప్ చేస్తానా? లేదు. అటువంటి ఆడదాన్ని ఎవరూ రేప్ చేయరు. 426 00:33:19,625 --> 00:33:22,169 నాకు దూరంగా వెళ్లు! అబద్ధాలకోరు! -మామీ. మా... 427 00:33:22,169 --> 00:33:24,838 నువ్వు చేసే ప్రతి పని, మన మధ్య ఉన్న ప్రతీదీ అబద్ధమే! 428 00:33:27,007 --> 00:33:30,802 నువ్వు తన జీవితాన్ని నాశనం చేశావు, చెత్త రాక్షసుడు నువ్వు! 429 00:34:05,170 --> 00:34:06,255 గ్రేస్. 430 00:34:47,254 --> 00:34:48,797 నన్ను నిందించావు! 431 00:34:50,424 --> 00:34:52,467 తప్పంతా నాదే అని నేనే అనుకునేలా చేశావు! 432 00:34:58,682 --> 00:35:01,310 చెత్త రాక్షసుడు. 433 00:35:32,174 --> 00:35:33,800 అతను నేను చేశానని చెప్పిన పనిని నేను అసలు చేయలేదు. 434 00:35:33,884 --> 00:35:35,844 నువ్వు చేయలేదు. -నేను అలా చేయలేదు. 435 00:35:38,055 --> 00:35:40,599 నేను... నేను తాగి ఉన్నాను. నేను తాగి ఉన్నాను. 436 00:35:40,599 --> 00:35:44,061 అప్పుడు నేను నిజంగా ఏం అనుకున్నానంటే, నిజంగా అనుకున్నాను, "నేను ఏమైనా తప్పు చేశానా?" అని. 437 00:35:44,061 --> 00:35:45,145 కానీ... 438 00:35:45,229 --> 00:35:47,356 నేను బాత్ రూమ్ కి వెళ్లినట్లు గుర్తుంది. 439 00:35:48,565 --> 00:35:51,068 నేను ఆ తలుపు లాక్ చేయలేకపోవడం గుర్తుంది. 440 00:35:51,068 --> 00:35:54,029 కానీ అక్కడ నేను మత్తులోకి జారిపోయాను, లేదా లేవలేని స్థితిలోనో మరేదో పరిస్థితిలో ఉన్నా, 441 00:35:54,029 --> 00:35:57,157 అప్పుడు నేను పైకి చూశాను, అతను అక్కడ కనిపించాడు. 442 00:35:58,408 --> 00:35:59,785 అతను కింద పడి ఉన్న నన్ను చూస్తున్నాడు. 443 00:36:00,536 --> 00:36:02,996 అతడిని చూసి నవ్వాను, కానీ కేవలం... 444 00:36:04,122 --> 00:36:05,749 తను నాకు సాయం చేయడానికి చూస్తున్నాడు అనుకున్నా. 445 00:36:08,460 --> 00:36:09,670 కానీ అతను... 446 00:36:13,924 --> 00:36:15,884 కానీ నేను ఏమీ చేయలేదు. నేను చేయలేదు. -లేదు. 447 00:36:17,094 --> 00:36:18,470 నేను అతడిని ఆపలేకపోయాను 448 00:36:18,554 --> 00:36:21,056 ఎందుకంటే నేను కేవలం... నేను... ఎందుకంటే నా వల్ల కాలేదు. 449 00:36:21,056 --> 00:36:22,307 నా మాట విను. 450 00:36:24,059 --> 00:36:25,185 అతను నిన్ను రేప్ చేశాడని నాకు తెలుసు. 451 00:36:30,816 --> 00:36:32,359 నేను గర్భవతిని అని నాకు తెలియదు. 452 00:36:35,779 --> 00:36:38,991 గర్భవతిని అవుతానని కూడా ఆలోచించలేదు కానీ అయ్యాను... 453 00:36:40,576 --> 00:36:43,745 కానీ నాకు గర్భస్రావం అయినప్పుడు, నేను అను... అది ఆ పాపానికి పడిన శిక్ష అని ఊరుకున్నాను. 454 00:36:49,543 --> 00:36:50,544 వద్దు. 455 00:36:56,008 --> 00:36:57,509 నన్ను క్షమించు. 456 00:37:14,401 --> 00:37:15,736 వెనెసా రెడ్ గ్రేవ్ ఇసడోరా 457 00:37:27,539 --> 00:37:29,166 కెఎల్ స్టూడియో క్లాసిక్స్ ఇసడోరా 458 00:38:38,110 --> 00:38:42,114 నువ్వు నిన్ను ఎందుకు నిందించుకుంటున్నావో, అది నీ తప్పు కాదు. 459 00:38:43,532 --> 00:38:44,825 మీ ఇద్దరిదీ కాదు. 460 00:38:52,624 --> 00:38:53,834 నువ్వు ఎలా... 461 00:38:56,795 --> 00:38:59,339 అతని శవంతో ఏం చేయాలో నీకు ఎలా తెలిసింది? 462 00:40:44,820 --> 00:40:46,572 హత్య చేసిన ఆయుధంతోనే అతడిని ఖననం చేశావు. 463 00:40:48,031 --> 00:40:49,992 నీ ఉద్దేశం ఏంటి? -అతని పైజామాలు. 464 00:40:50,909 --> 00:40:52,035 సారీ. 465 00:40:52,536 --> 00:40:55,414 ఇన్ని రోజులూ ఇది నీలోనే ఎలా దాచుకున్నావు, గ్రేసీ? 466 00:41:03,505 --> 00:41:06,008 జరిగిన దానిని నువ్వు నాకెందుకు ఎప్పుడూ చెప్పలేదు? 467 00:41:06,592 --> 00:41:10,929 నేను చెప్పాలనే అనుకున్నాను. నేను చెప్పేదానినే. నేను ఆ మరుసటి రోజే నీకు చెప్పబోయాను, కానీ... 468 00:41:12,472 --> 00:41:14,391 ఎప్పుడు నేను చెప్పలేదో, ఇంక చెప్పలేను అని నాకు తెలుసు. 469 00:41:18,353 --> 00:41:19,521 మ్యాట్ ఫోన్ చేస్తున్నాడు. 470 00:41:21,231 --> 00:41:22,232 ఆ ఫోన్ తీయి. 471 00:41:25,819 --> 00:41:26,820 హలో? 472 00:41:27,321 --> 00:41:28,655 నేను నిన్ను కలవాలి. 473 00:41:30,324 --> 00:41:31,325 మంచిది. 474 00:41:33,327 --> 00:41:34,828 నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను. 475 00:41:34,912 --> 00:41:37,831 నేను విక్లో క్యాబిన్ కి వచ్చాను. జెపికి ఏం జరిగిందో నాకు తెలుసు. 476 00:41:39,208 --> 00:41:40,542 బెకా? -ఆగు... 477 00:41:53,263 --> 00:41:54,264 అయితే? 478 00:41:58,143 --> 00:41:59,353 అతను ఏం చెప్పాడు? 479 00:41:59,353 --> 00:42:02,314 తను క్యాబిన్ దగ్గర ఉన్నాడు. నన్ను కలవాలి అంటున్నాడు. 480 00:42:04,024 --> 00:42:05,067 అయితే తను ఏం తెలుసుకున్నాడు? 481 00:42:06,443 --> 00:42:08,237 నేను అదే కనుక్కోవాలి అనుకుంటా. 482 00:42:11,823 --> 00:42:14,409 నేను జైలుకి వెళ్లలేను. నా వల్ల కాదు. నేను చేయలేను... 483 00:42:14,493 --> 00:42:16,870 నేను బ్లానడ్ ని ఒంటరిదానిని చేయలేను. అది నా వల్ల కాదు. 484 00:42:16,954 --> 00:42:18,789 దయచేసి, జెపి చేసిన ఘోరాలన్నీ మనం ఖచ్చితంగా వివరిద్దాం. 485 00:42:19,498 --> 00:42:20,916 ఆ రేప్ గురించి, అతని హింసల గురించి. 486 00:42:20,916 --> 00:42:22,543 నా ఉద్దేశం, అతను మనల్ని అందరినీ విపరీతంగా వేధించాడు. 487 00:42:22,543 --> 00:42:24,711 అవును, అలా ప్రయత్నిద్దాం, ఎందుకంటే ఆడవారికి అది ఎప్పుడూ పని చేస్తుంది. 488 00:42:24,795 --> 00:42:27,130 నేను... -ఎక్కడికి వెళ్తున్నావు? 489 00:42:27,214 --> 00:42:29,299 బ్లానడ్ ని స్విమ్మింగ్ కి తీసుకువెళ్లాలి. 490 00:42:30,092 --> 00:42:32,344 నిజంగానా? -అవును, నిజంగానే. 491 00:42:32,344 --> 00:42:34,221 ఏంటి? ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే, 492 00:42:34,221 --> 00:42:37,349 ఈ చెత్త సమస్యని పరిష్కరించగలం అనుకుంటున్నారా? 493 00:42:38,976 --> 00:42:42,312 నేను వీలైనంత ఎక్కువ సేపు నా కూతురికి తల్లిగా ఉండాలి. 494 00:42:42,396 --> 00:42:44,231 సరే. నువ్వు వెళ్లచ్చు. 495 00:42:45,232 --> 00:42:46,775 ఫర్వాలేదు. -వెళ్లు. 496 00:42:48,777 --> 00:42:50,946 నిన్ను ప్రేమిస్తున్నాం, గ్రేసీ. -నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 497 00:42:50,946 --> 00:42:52,030 నిన్ను ప్రేమిస్తున్నాను. 498 00:42:53,073 --> 00:42:54,199 మేం నీకు అండగా ఉంటాం, సరేనా? 499 00:43:04,501 --> 00:43:05,794 నేను మ్యాట్ ని కలవాలి, కాబట్టి... 500 00:43:05,878 --> 00:43:07,588 అవును. నేను నీతో పాటు వస్తాను. 501 00:43:08,088 --> 00:43:09,464 నన్ను ఇది చేయనిస్తారా? 502 00:43:13,427 --> 00:43:14,469 సరే. 503 00:43:21,810 --> 00:43:23,103 తను నీ జాకెట్ తీసుకువెళ్లింది. 504 00:43:24,021 --> 00:43:25,022 నాకు తెలుసు. 505 00:43:39,995 --> 00:43:41,371 ఏంటి ఆలోచిస్తున్నావు... -బెకా. 506 00:43:41,455 --> 00:43:42,456 ఆ నేరం చేసింది నేనే. 507 00:43:44,166 --> 00:43:46,960 నేనే అతడిని హత్య చేశాను. నేనే చేశాను. 508 00:43:47,044 --> 00:43:48,795 నువ్వు అలా ఎందుకు చెబుతున్నావో నాకు తెలుసు. 509 00:43:50,380 --> 00:43:52,883 నువ్వు అబద్ధం చెబుతున్నావని కూడా నాకు తెలుసు. -నేనే హత్య చేశాను, మ్యాట్. 510 00:43:56,678 --> 00:43:58,972 నిన్ను నువ్వు ఎందుకు ఇలా శిక్షించుకుంటున్నావు? 511 00:43:59,932 --> 00:44:01,934 నా మీద నీకు ఏ మాత్రం ఇష్టం ఉన్నా... 512 00:44:03,519 --> 00:44:06,104 ఈ విషయాన్ని దయచేసి నీలోనే ఉంచుకో. 513 00:44:06,188 --> 00:44:08,524 నన్ను నా అన్నయ్యకి కాకుండా నీకు సాయపడమంటున్నావు. 514 00:44:08,524 --> 00:44:09,900 జెపి ఒక దుష్టుడు. 515 00:44:10,943 --> 00:44:13,278 వాడు ఒక రేపిస్ట్. నా అక్కని రేప్ చేశాడు. 516 00:44:13,362 --> 00:44:17,574 మా జీవితాలని నాశనం చేశాడు. -కానీ గ్రేస్ అతడిని చంపింది. ఆమె హత్య చేసింది. 517 00:44:18,784 --> 00:44:20,244 నువ్వు, నీ అక్కలు దానిని కప్పిపుచ్చాలని చూశారు. 518 00:44:25,916 --> 00:44:28,001 నా నోరు ఎండిపోయింది. నేను మింగలేకపోతున్నాను. 519 00:44:30,796 --> 00:44:32,214 నాకు డ్రింక్ లేదా ఇంకేదయినా కావాలి. 520 00:44:39,263 --> 00:44:40,347 నీకు... 521 00:44:42,349 --> 00:44:45,185 నీకు వేడి నీళ్ల బాటిల్ కావాలా, లేదా... 522 00:44:45,269 --> 00:44:46,270 దేనికి? 523 00:44:48,981 --> 00:44:49,982 అంటే... 524 00:44:51,567 --> 00:44:53,694 నేను ఊరికే అనుకున్నాను... 525 00:44:55,696 --> 00:44:58,740 అవును, అంటే, అది పదేళ్ల కిందట. 526 00:44:59,324 --> 00:45:03,078 నా ఉద్దేశం, వేడి నీళ్ల సీసాలు పని చేస్తాయి కానీ, అవి కేవలం ఒంటి నొప్పులకే. 527 00:45:06,874 --> 00:45:09,918 నా వాష్ బ్యాగ్ కనిపించడం లేదు. ఈ టేబుల్ మీదనే పెట్టా అనుకుంటా. 528 00:45:11,044 --> 00:45:12,379 అందులో పెంటో మందులు కూడా ఉన్నాయి. 529 00:45:12,379 --> 00:45:13,672 దానితో నువ్వు ఏమైనా చేశావా? 530 00:45:14,423 --> 00:45:16,466 అవును, ఉర్సులా. నా కార్న్ ఫ్లేక్స్ లో వేసుకుని తిన్నాను. 531 00:45:17,134 --> 00:45:18,135 సరే, వాటిని తీసుకున్నావా? 532 00:45:18,135 --> 00:45:20,053 లేదు. ఎందుకు? 533 00:45:23,390 --> 00:45:24,474 ఓరి దేవుడా. 534 00:45:26,351 --> 00:45:28,604 బెకా, నేను నీ దగ్గరకి ఇప్పుడు వస్తున్నాం. 535 00:45:28,604 --> 00:45:31,023 దయచేసి ఎలాంటి పిచ్చి పని చేయకు. 536 00:45:31,023 --> 00:45:31,982 వెనుక సీట్లో కూర్చో. 537 00:45:31,982 --> 00:45:33,942 పద. -పోనివ్వు, ఈవా! 538 00:45:34,026 --> 00:45:35,319 పోనిస్తున్నాను! 539 00:45:35,319 --> 00:45:38,280 డ్రైవ్ చేయి! -తనకి ఆ సీట్ బెల్ట్ ఇవ్వు. 540 00:45:54,546 --> 00:45:56,757 చెత్త. 541 00:45:58,175 --> 00:45:59,218 చెత్త. 542 00:46:16,318 --> 00:46:18,028 ఈవా 543 00:46:26,286 --> 00:46:27,496 నిన్ను ప్రేమిస్తున్నాను. 544 00:46:31,333 --> 00:46:33,669 నీ మనసులో లేని విషయాన్ని నువ్వు పైకి చెప్పనక్కరలేదు. 545 00:46:33,669 --> 00:46:35,045 కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. 546 00:46:37,548 --> 00:46:39,007 నిన్ను ప్రేమిస్తున్నాను. అది నిజం. 547 00:46:44,721 --> 00:46:45,806 నన్ను క్షమించు, బెకా. 548 00:47:18,505 --> 00:47:20,048 దయచేసి వెళ్లు. 549 00:47:40,569 --> 00:47:42,654 ఓహ్, దేవుడా, నేను ఇరుక్కుపోయాను! 550 00:47:44,072 --> 00:47:46,408 ఆగు! -వద్దు, ఆగద్దు! 551 00:47:46,408 --> 00:47:47,492 పద! 552 00:47:47,576 --> 00:47:49,369 బటన్ నొక్కు! -నేను నొక్కుతున్నాను! 553 00:47:53,874 --> 00:47:56,793 బెకా. ఏం చేస్తున్నావు? 554 00:47:57,753 --> 00:48:00,839 ఏంటి ఈ చెత్త? ఏం చేయాలని అనుకుంటున్నావు? 555 00:48:00,923 --> 00:48:04,384 నేను చేయలేకపోయాను. నేను చేయలేకపోయాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు. నా వల్ల కాలేదు. 556 00:48:04,468 --> 00:48:08,472 నా వల్ల కాలేదు. -ఆపు. మరేం ఫర్వాలేదు. 557 00:48:09,056 --> 00:48:10,307 నేను ఆమెను చంపేశాను. 558 00:48:11,558 --> 00:48:12,643 విను, నా మాట విను. 559 00:48:12,643 --> 00:48:15,229 తరువాత ఏం జరిగినా కూడా, నిన్ను నువ్వు క్షమించాలి, బెకా. 560 00:48:15,229 --> 00:48:17,689 నువ్వు చేయాలి. నిన్ను నువ్వు క్షమించాలి. 561 00:48:18,774 --> 00:48:20,442 ఫర్వాలేదు. తను బాగానే ఉంది. 562 00:48:20,526 --> 00:48:22,027 అవును, అంటే, ఇంకో నిమిషంలో తను బాగుండదు. 563 00:48:22,027 --> 00:48:23,987 నువ్వు మాకు దాదాపు గుండెపోటు తెప్పించావు! 564 00:48:24,071 --> 00:48:26,782 అతను ఎక్కడ? బెకా, అతను ఎక్కడికి వెళ్లాడు? 565 00:48:29,785 --> 00:48:31,995 గ్రేస్ వాడిని హత్య చేసిందని, దాన్ని మనం కప్పిపుచ్చాలని చూశామని అతనికి తెలుసు. 566 00:48:33,830 --> 00:48:34,831 సరే... 567 00:48:35,958 --> 00:48:38,085 కానీ, బహుశా దీనికి ఏదో మార్గం ఉండే ఉంటుంది. 568 00:48:38,710 --> 00:48:40,087 ఆత్మరక్షణ, లేదా... 569 00:48:40,087 --> 00:48:42,631 గ్రేస్ కి ఏం జరిగినా కూడా, మనం ఆ హత్యని కప్పిపుచ్చాం... 570 00:48:44,675 --> 00:48:47,302 చట్టపరంగా అది పెద్ద నేరమే అవుతుంది అనుకుంటా. 571 00:48:48,136 --> 00:48:50,430 అవును, చట్టపరంగా ఇంకో నేరం ఏమిటో తెలుసా? 572 00:48:51,431 --> 00:48:54,434 సంతకాలు ఫోర్జరీ చేయడం, అక్రమంగా శవాల్ని వెలికి తీయించడం. 573 00:48:54,935 --> 00:48:57,729 మనం ఆ చెత్తవెధవని చంపాలని మనం కొన్ని ప్రయత్నాలు మాత్రమే చేశాం. 574 00:48:57,813 --> 00:48:58,814 బీబీ... 575 00:49:05,028 --> 00:49:06,280 అయితే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? 576 00:49:44,651 --> 00:49:46,486 థామస్ 577 00:49:46,570 --> 00:49:47,779 చెత్త! 578 00:50:52,678 --> 00:50:53,762 క్లాఫిన్ అండ్ సన్స్ జీవిత బీమా 579 00:50:53,846 --> 00:50:55,264 పాలసీ సర్టిఫికెట్ జాన్ పాల్ విలియమ్స్ 580 00:51:31,300 --> 00:51:34,136 నార్త్ డబ్లిన్ హాస్పిటల్ 581 00:51:34,136 --> 00:51:38,223 నాకు కూతురు పుట్టింది. నేను తండ్రినయ్యాను, మ్యాట్. నేను డాడీని అయ్యాను. 582 00:51:42,978 --> 00:51:44,062 తల్లీకూతుళ్లు ఎలా ఉన్నారు? 583 00:51:44,646 --> 00:51:46,273 అవును, పసిపాప ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకొచ్చింది, 584 00:51:46,773 --> 00:51:50,027 ఇంకా థెరెసా నన్ను అబ్రకెబాబ్రాకి వెళ్లి మాంసం కెబాబ్ తీసుకురమ్మని అడిగింది, 585 00:51:50,027 --> 00:51:51,695 అది మంచి సంకేతం. అనుకుంటా. 586 00:51:52,321 --> 00:51:53,322 అది చెడు సంకేతం కూడా. 587 00:51:53,989 --> 00:51:55,991 మనం విలియమ్స్ క్లెయిమ్ చెల్లించనక్కరలేదు, టామ్. 588 00:51:57,117 --> 00:51:58,911 ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? 589 00:52:00,495 --> 00:52:04,291 గ్రేస్ విలియమ్స్. ఆమె క్లెయిమ్ ఉపసంహరించుకుంది. 590 00:52:06,710 --> 00:52:08,879 అంటే, ఇది ఎలా సాధించావు, మ్యాట్? -అదేం పెద్ద విషయం కాదు. 591 00:52:08,879 --> 00:52:10,672 అదే అసలు విషయం! అవును, ఖచ్చితంగా, అదే విషయం! 592 00:52:10,756 --> 00:52:12,633 నీ రహస్యాలు నీకు ఉన్నాయి, సరేనా? 593 00:52:12,633 --> 00:52:15,093 నాకు అవి తెలియకపోయినా నువ్వు పెద్దగా పట్టించుకోలేదు కదా. 594 00:52:15,177 --> 00:52:19,598 నిజానికి, అదంతా నా మంచి కోసమే అని నాకు చెప్పావని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే, ఇది కూడా అంతే. 595 00:52:24,269 --> 00:52:26,522 నువ్వు తెలివైన వెధవవి. 596 00:52:40,953 --> 00:52:42,955 బ్లానడ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. 597 00:52:44,373 --> 00:52:45,791 పైన కోట్ ఏదైనా వేసుకో, సరేనా? 598 00:52:45,791 --> 00:52:47,000 తరువాత కలుస్తా, అమ్మా. 599 00:52:48,544 --> 00:52:49,878 నాకు మెసేజ్ చేయి. 600 00:52:49,962 --> 00:52:51,129 అమ్మా, నేను తరువాత కలుస్తాను. 601 00:52:52,714 --> 00:52:53,674 బ్రోఫీ విక్రయించబడింది 602 00:52:53,674 --> 00:52:54,925 బ్లా, ఐ లవ్ యూ. 603 00:53:04,142 --> 00:53:05,352 నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, అమ్మా. 604 00:53:07,688 --> 00:53:08,689 సరదాగా గడుపు. 605 00:53:10,023 --> 00:53:12,067 బ్లా, త్వరగా! -వస్తున్నా! 606 00:53:23,787 --> 00:53:25,747 కనురెప్ప పాటులో తను ఎదిగిపోయింది. 607 00:53:28,083 --> 00:53:30,711 అవును, చాలా జరిగిపోయింది. అది తప్పకుండా నీలో మార్పుని తెస్తుంది. 608 00:53:33,672 --> 00:53:34,798 నువ్వు ఇల్లు మారిపోతున్నావు కదా. 609 00:53:35,299 --> 00:53:38,218 మాకు మరో మార్గం లేదు. ఇక్కడ ఉండటానికి అయ్యే ఖర్చుని నేను భరించలేను. 610 00:53:38,802 --> 00:53:42,222 మేము ఈవాతో కలిసి ఉంటాం. ఒక వితంతువు ఇంకా ఒక అవివాహిత, కలిసి ఉంటాం. 611 00:53:45,684 --> 00:53:46,977 మేము వెళ్లడానికి ముందు, నేను ఒకటి చెప్పాలి... 612 00:53:46,977 --> 00:53:49,938 దయచేసి వద్దు, గ్రేస్. 613 00:53:50,022 --> 00:53:52,983 నువ్వు చేసిన సాయానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పలేదు. 614 00:53:53,483 --> 00:53:55,068 దానికి నువ్వు కృతజ్ఞతలు చెప్పనక్కరలేదు. 615 00:53:55,152 --> 00:53:57,321 ఏం జరుగుతోందో నేను కళ్లు తెరిచి చూసి ఉంటే, 616 00:53:57,321 --> 00:53:59,406 అతను నిన్ను ఎంత హింస పెడుతున్నాడో తెలుసుకుని ఉంటే, 617 00:53:59,990 --> 00:54:01,742 పరిస్థితి అంత దూరం వచ్చేది కాదు. 618 00:54:03,619 --> 00:54:05,370 నీ సాయం నేను కోరి ఉండకూడదు... 619 00:54:09,082 --> 00:54:10,209 ...కానీ నువ్వు చేసిన సాయం, 620 00:54:11,877 --> 00:54:13,170 అది మంచి పని. 621 00:54:26,350 --> 00:54:27,726 నన్ను మర్చిపోవద్దు. 622 00:54:28,519 --> 00:54:29,728 నేను మర్చిపోను. 623 00:55:08,433 --> 00:55:09,852 అయితే నీ సొంతది తెచ్చుకో మరి! 624 00:55:20,696 --> 00:55:23,490 ఆ డ్రాయర్ వేసుకున్న వెధవ నీళ్లలో పడతాడు అనుకుంటున్నావా? 625 00:55:25,033 --> 00:55:26,994 లేదు. ఇప్పుడు అనుకుంటాను. 626 00:55:29,079 --> 00:55:30,080 నువ్వు బాగానే ఉన్నావా? 627 00:55:32,583 --> 00:55:34,459 హలో, అమ్మాయిలూ! 628 00:55:34,543 --> 00:55:36,003 హోలా! -హలో. 629 00:55:36,003 --> 00:55:37,087 మొత్తానికి. 630 00:55:37,171 --> 00:55:39,548 ఎక్కడికి వెళ్లావు? -సారీ, నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. 631 00:55:39,548 --> 00:55:40,841 చెత్త పిల్ల. -నోరు మూయి. 632 00:55:41,633 --> 00:55:42,926 అలాగే, పిచ్చిమొహమా. 633 00:55:43,010 --> 00:55:44,636 అలాగే, పిచ్చిదానా. 634 00:55:45,220 --> 00:55:47,181 బాబూ, ఆ నవ్వుని ఇన్నాళ్లూ మిస్ అయ్యాను. 635 00:55:48,056 --> 00:55:49,600 ఎంత మిస్ అయ్యానో తెలియదు. 636 00:55:51,852 --> 00:55:54,313 గ్రేస్ ఎంత బాధపడిందో నువ్వు కూడా అంత బాధ అనుభవించావు. 637 00:55:55,939 --> 00:55:57,149 కానీ తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. 638 00:55:59,234 --> 00:56:02,905 ఓయ్! మనం నీటిలోకి వెళ్తున్నామా లేదా? -పదండి మరి. 639 00:56:03,488 --> 00:56:05,908 అవును! రండి. తను ఆలస్యం చేసింది. 640 00:56:08,327 --> 00:56:10,579 దేవుడా. స్వచ్ఛంద కౌగిలింత. 641 00:56:16,502 --> 00:56:17,669 థాంక్యూ, గ్రేసీ. 642 00:56:19,588 --> 00:56:22,883 నిన్ను చూడు. చెత్త వెట్ సూట్. 643 00:56:23,425 --> 00:56:25,010 చెత్తదానా. -నేను తయారై వచ్చాను! 644 00:56:46,448 --> 00:56:49,117 ఇలా రా, గ్రేస్! -దూకు! రా! 645 00:56:49,201 --> 00:56:51,411 దూకేయ్! -వచ్చేయ్! 646 00:56:51,495 --> 00:56:53,747 ఓయ్! -ఇలా రా! 647 00:56:54,540 --> 00:56:56,083 కానివ్వు, గ్రేస్! దూకేయ్! 648 00:56:56,083 --> 00:56:57,501 దేని కోసం ఎదురుచూస్తున్నావు? 649 00:56:57,501 --> 00:56:59,253 నీటిలోకి దూకు! -దూకేయ్, గ్రేస్. 650 00:57:24,862 --> 00:57:25,863 బెల్జియన్ సిరీస్ క్లాన్ ఆధారంగా 651 00:57:25,863 --> 00:57:26,947 మాలిన్ శారా గోజిన్ సృజన 652 00:58:07,237 --> 00:58:09,239 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్