1 00:00:20,800 --> 00:00:26,760 సమర్పిస్తున్నాం 2 00:00:29,720 --> 00:00:35,680 క్లార్క్‌సన్స్ ఫార్మ్ రెండు 3 00:00:38,320 --> 00:00:40,960 క్లార్క్‌సన్స్ ఫార్మ్‌కు తిరిగి స్వాగతం. 4 00:00:43,240 --> 00:00:46,640 చిత్ర సిబ్బంది ఇక్కడకు చివరిసారి వచ్చి దాదాపుగా ఏడాది అయింది, 5 00:00:47,720 --> 00:00:52,800 కానీ కెమెరాలు చిత్రీకరణ ఆపినా, డిడ్లీ స్క్వాట్‌లో జీవనం కొనసాగింది. 6 00:00:56,640 --> 00:01:02,160 పరిచయస్తుల రాకపోకలతో, కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 7 00:01:05,160 --> 00:01:08,280 దివాళా తీయించేంత ఖరీదైన గొర్రెలను ఇప్పుడు 8 00:01:08,400 --> 00:01:11,920 వీధి చివర్లో నివసించే నిజమైన గొర్రెల రైతు చూసుకుంటున్నాడు. 9 00:01:12,480 --> 00:01:16,120 పరికరాలు, గొర్రెలను నేను సమకూరుస్తే, అతను పని చూసుకుంటాడు, 10 00:01:16,200 --> 00:01:18,040 ఆ తరువాత మేము నష్టాలు పంచుకుంటాము. 11 00:01:19,920 --> 00:01:24,600 మేము కొత్త పంట పండిస్తున్నాము, పాస్తా చేయడానికి ఉపయోగించే, డరమ్ గోధుమలు. 12 00:01:27,040 --> 00:01:29,720 కోట్లాది తేనెటీగలు ఉన్నాయి. 13 00:01:31,520 --> 00:01:33,840 పరాగసంపర్కం విషయంపై, 14 00:01:33,920 --> 00:01:36,680 డిడ్లీ స్క్వాట్ సమాజంలో కొత్త చేరికలు జరిగాయి. 15 00:01:40,760 --> 00:01:44,080 ఆస్కార్ 16 00:01:44,640 --> 00:01:46,400 జూలై 2021 17 00:01:46,480 --> 00:01:48,200 ఇంకా రైతు బజార్ ఉంది, 18 00:01:48,280 --> 00:01:52,840 మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. 19 00:02:00,480 --> 00:02:03,400 6.72 పౌండ్లు అయింది. చాలా ధన్యవాదాలు. 20 00:02:03,480 --> 00:02:04,760 హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? 21 00:02:10,920 --> 00:02:13,720 చూడు. అది నిండిపోయింది. 22 00:02:15,720 --> 00:02:17,600 మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. 23 00:02:17,680 --> 00:02:19,000 -అంతే. -అంతే. 24 00:02:19,520 --> 00:02:22,440 గత వారం ప్రధాన రహదారి వాహనాలతో రద్దీగా ఉంది. 25 00:02:22,520 --> 00:02:25,120 -నేను ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. -మూడు గంటలు. 26 00:02:25,160 --> 00:02:28,360 ఆరోగ్య కేంద్రంలో జనం టీకా వేయించుకోలేకపోయారు. 27 00:02:28,440 --> 00:02:31,160 అగ్నిమాపక కేంద్రానికి సిబ్బంది వెళ్ళలేకపోయారు. 28 00:02:31,880 --> 00:02:33,680 -అది మంచిది కాదు, కదా? -కాదు. 29 00:02:33,760 --> 00:02:36,160 -ఇది వెనుకదాకా ఉంటే... -మనం ఇరుక్కుపోతాము. 30 00:02:36,240 --> 00:02:37,240 డిడ్లీ స్క్వాట్ రైతు బజార్ ఇటువైపు 31 00:02:38,000 --> 00:02:42,080 అంటే మేము రెండు ఎకరాల గోధుమ పొలాన్ని కోసి కారు పార్కింగ్ చేయాలి, 32 00:02:42,160 --> 00:02:44,120 అది కూడా సరిపోదు. 33 00:02:44,920 --> 00:02:47,720 ఇది... పొలంలో మొక్కలు పీకేస్తుంటే నేను ఏడుస్తాను. 34 00:02:47,800 --> 00:02:49,720 -మీకది తెలుసా? -నాకు తెలుసు. అవును. 35 00:02:49,800 --> 00:02:51,000 అలా చేయకుండా ఉందామా? 36 00:02:52,960 --> 00:02:54,040 మీరే యజమాని. 37 00:02:54,720 --> 00:02:57,760 ఆ రోజు ఐటీవీలో నువ్వే యజమాని అని చెప్పావు. 38 00:02:57,840 --> 00:03:00,960 నేను వ్యవసాయం నిర్వహిస్తా, కానీ ఇదంతా నిర్వహించేది మీరే. 39 00:03:01,040 --> 00:03:04,840 -అయితే ఇక్కడ కొంచెం చేయవచ్చు కదా? -అందరినీ వెనుకకు జరపాలి. 40 00:03:13,920 --> 00:03:15,480 అది నేను ఆలోచించలేదు. 41 00:03:15,560 --> 00:03:18,080 ఇంతమంది వస్తారని అనుకోలేదు. 42 00:03:29,800 --> 00:03:33,720 నిజానికి, రైతు బజారు విషయాలు లీసా చూసుకోవాలి, 43 00:03:34,200 --> 00:03:37,520 ఎందుకంటే దేశంలో ప్రతిఒక్క పొలంలో 44 00:03:37,600 --> 00:03:41,440 ఎదురవుతున్న సమస్యలతో నేనూ తీరికలేకుండా ఉన్నాను. 45 00:03:46,720 --> 00:03:49,280 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 46 00:03:49,360 --> 00:03:51,520 అధ్యాయం 9 47 00:03:51,600 --> 00:03:56,480 మనుగడ 48 00:04:00,920 --> 00:04:03,440 ముందుగా, అది కోతల సమయం. 49 00:04:05,720 --> 00:04:08,440 యే లోయ, యే లోయ 50 00:04:08,760 --> 00:04:11,160 ఆటను మార్చామయ్యా ఇక మునపటిలా ఉండమయ్యా 51 00:04:11,240 --> 00:04:14,000 యే లోయ, యే లోయ 52 00:04:14,520 --> 00:04:16,760 రొమ్ము విరచవయ్యా పడమర నీదేనయ్యా 53 00:04:16,840 --> 00:04:19,360 ఇది అదనపు సేద్యమయ్యా వాస్తవం కంటే వాస్తవమయ్యా 54 00:04:19,440 --> 00:04:20,360 మీరు కనుగొనలేరు... 55 00:04:20,440 --> 00:04:21,360 ఇదిగో వచ్చేశాము. 56 00:04:22,720 --> 00:04:24,120 నా రెండో పంట. 57 00:04:25,920 --> 00:04:30,360 గత ఏడాది, 520 ఎకరాల బార్లీ, గోధుమ, ఆవాలు, 58 00:04:30,800 --> 00:04:35,880 నాకు 144 పౌండ్ల మూల ధనాన్ని సంపాదించి పెట్టాయి. 59 00:04:38,240 --> 00:04:41,040 ఈసారి, కచ్చితంగా మరింత సంపాదిస్తానని ఆశిస్తున్నాను 60 00:04:41,120 --> 00:04:46,040 ఎందుకంటే మేము బార్లీ పొలాల్లో ముఖ్యమైన తేమ పరీక్షలన్నీ మొదలుపెట్టాము. 61 00:04:47,440 --> 00:04:49,640 ఈరోజు ఈ బార్లీ పని ముగించాలని ఆశిస్తున్నా. 62 00:04:49,720 --> 00:04:50,800 అది బాగుంటుంది. 63 00:04:50,880 --> 00:04:54,720 సూపర్‌మార్కెట్లు తెరవకుండా, సెలబ్రిటీ లవ్ ఐల్యాండ్‌కు వెళ్ళినప్పుడా? 64 00:04:56,920 --> 00:04:59,320 లవ్ ఐల్యాండ్ లేదు. నా అర్ధాంగికి నచ్చలేదు. 65 00:04:59,360 --> 00:05:01,200 -అయితే మరి ఏంటి? -ఐయామ్ ఏ సెలెబ్. 66 00:05:01,680 --> 00:05:03,560 నిన్ను ఆస్ట్రేలియాలో చూడడం ఇష్టం. 67 00:05:03,640 --> 00:05:05,040 అది దారుణమైన విషయం. 68 00:05:05,120 --> 00:05:08,480 నిజానికి నాకు అదే భయం, నిజంగా వదిలి వెళ్ళడం. 69 00:05:08,560 --> 00:05:10,520 -ఆస్ట్రేలియా వెళ్ళాలని లేదా? -అవును. 70 00:05:10,600 --> 00:05:11,800 వాళ్ళు ఇక్కడికి వస్తే... 71 00:05:13,200 --> 00:05:14,800 -చేస్తాను. -నేను ఒక సెలబ్రిటీని, 72 00:05:14,920 --> 00:05:17,200 నేను చిప్పింగ్ నోర్టన్‌లో నివసిస్తాను. 73 00:05:21,120 --> 00:05:22,200 సిద్ధమేనా? 74 00:05:23,600 --> 00:05:25,360 15.9. 75 00:05:26,480 --> 00:05:30,800 మాది ఆ మాయా సంఖ్య 15.5కు పెద్ద తేడా లేదు కాబట్టి, 76 00:05:30,880 --> 00:05:32,760 మేము సైమన్‌కు ఫోన్ చేశాము. 77 00:05:34,240 --> 00:05:37,520 అతను సరికొత్త కంబైన్ హార్వెస్టర్‌లో వచ్చినప్పుడు, 78 00:05:37,600 --> 00:05:39,520 నేను మరోసారి కొలిచి చూశాను. 79 00:05:41,120 --> 00:05:42,640 15.3. 80 00:05:42,720 --> 00:05:45,560 -బాగానే ఉంది, కదా? -బాగానే ఉంది. మంచిది, చేద్దాం. 81 00:05:55,520 --> 00:05:58,480 సరే, చలవద్దాలు. మనం సిద్ధం. 82 00:06:00,040 --> 00:06:03,920 మా తాతయ్య, అకస్మాత్తుగా చనిపోయారు, ఇది ఆయన పాట. 83 00:06:04,560 --> 00:06:06,320 ద హూ. ఇది ఆయన నాకు వినిపించారు. 84 00:06:45,040 --> 00:06:47,320 నేను ఇది చేసి సంవత్సరం అయింది. 85 00:06:48,880 --> 00:06:50,840 నాకు ఏమైనా గుర్తుందేమో. 86 00:07:00,280 --> 00:07:01,360 అదిగో వచ్చేసింది. 87 00:07:06,440 --> 00:07:07,360 జరుగు! 88 00:07:10,080 --> 00:07:12,040 తను నీ దారికి అడ్డంగా నిలిపాడా, సైమన్? 89 00:07:12,640 --> 00:07:15,200 అవును. ఈ ప్రాంతంలో చాలా ట్రాఫిక్ ఉంది. 90 00:07:20,200 --> 00:07:24,600 ఈరోజు బార్లీ పని చాలా వరకు ముగించాలన్నది లక్ష్యం, కానీ మేము 91 00:07:24,680 --> 00:07:28,160 కేలెబ్ రేడియోలో తెలియజేయకముందు కొన్ని లోడ్లే పూర్తి చేశాము. 92 00:07:29,080 --> 00:07:31,680 తేమ 15.8కు పెరిగింది. 93 00:07:32,160 --> 00:07:35,880 మనకు కావాల్సింది స్థాయి 15.5. మనం దానికంటే ఎక్కువ ఉంటే చేయలేము. 94 00:07:37,960 --> 00:07:40,800 సంఖ్యలు నాకు కొంచెం తక్కువ ప్రాముఖ్యం అనిపించి, 95 00:07:40,880 --> 00:07:44,200 నేను బ్రిటన్‌లో ఉల్లాసవంతమైన భూ ఏజెంట్ సలహా తీసుకున్నాను. 96 00:07:44,920 --> 00:07:47,240 -హలో. -చార్లీ, హాయ్. నేను. 97 00:07:47,320 --> 00:07:50,160 మేము 15.8 తేమలో చివరి లోడ్ కోశాము. 98 00:07:50,960 --> 00:07:52,200 సరే. 99 00:07:53,000 --> 00:07:54,080 అది చాలా ఎక్కువ. 100 00:07:54,720 --> 00:07:56,200 అయితే మేము ఆపేయాలా? 101 00:07:56,280 --> 00:08:00,680 అవును. సరే, అది చిరాకుగా ఉంటుంది. చిరాకు, కచ్చితంగా. 102 00:08:00,760 --> 00:08:03,280 సరే. ధన్యవాదాలు, చార్లీ. తరువాత మాట్లాడతాను. 103 00:08:04,000 --> 00:08:05,720 -ఉంటాను. బై. -సరే. ఉంటాను. 104 00:08:07,120 --> 00:08:09,080 దరిద్రం. 105 00:08:11,000 --> 00:08:12,800 ఎంత ఇబ్బందికరమో. 106 00:08:13,480 --> 00:08:17,840 మన దగ్గర ఏమి ఉన్నాయి? మూడు ట్రైలర్ లోడ్లు, అంతేనా. 36 టన్నులు. 107 00:08:19,320 --> 00:08:22,040 నాకు రైతుకు ఉండాల్సిన మనస్తత్వం లేదు. 108 00:08:22,120 --> 00:08:23,680 నేను పడుకుని అనుకుంటాను, 109 00:08:23,760 --> 00:08:28,000 "అక్కడ బార్లీ ఉంది, మంచి స్థితిలో లేదు, నేను అది నిలబెట్టలేను," అని. 110 00:08:29,080 --> 00:08:33,120 నేనది నిలబెట్టలేనని కాదు. అంటే, నేను బార్లీ పంటను నిలబెట్టలేను అని. 111 00:08:35,640 --> 00:08:38,840 నేను, కేలెబ్ మా నిల్వ ప్రాంతానికి చివరి లోడ్ తీసుకెళ్ళాము, 112 00:08:38,880 --> 00:08:43,960 చిరాగ్గా స్థానిక విధ్వంసకారులు మరోసారి సందర్శించారు. 113 00:08:45,640 --> 00:08:50,640 గత ఏడాది వాళ్ళు ఆ కుప్పను కాల్చేశారు, ఈ సంవత్సరం ఇది కాల్చాలని చూశారు. 114 00:08:50,760 --> 00:08:53,200 దాని గురించి నేను పోలీసులతో చెబుతున్నాను, 115 00:08:53,280 --> 00:08:57,960 గ్రామీణ పోలీసులది మిత్సుబిషి ఎల్200ను తీసేసుకున్నారు, 116 00:08:58,040 --> 00:09:02,200 దానితో వాళ్ళు దుండగులను వెంబడించేవారు, వాళ్ళకు వాక్స్‌హాల్ కోర్సా ఇచ్చారు. 117 00:09:02,280 --> 00:09:05,760 యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్, 118 00:09:05,840 --> 00:09:07,840 ప్రపంచంలోనే ఆరవ ధనిక దేశం. 119 00:09:07,880 --> 00:09:11,120 వాళ్ళు కోర్సాలో అసలు ఎవరినైనా ఎలా పట్టుకుంటారు? 120 00:09:12,480 --> 00:09:16,720 ఇంకా మరింత చిరాకు విషయం ఏంటంటే, దేశంలో లారీ డ్రైవర్ల కొరత వలన, 121 00:09:16,760 --> 00:09:20,400 బార్లీని తీసుకెళ్ళడానికి ఒక్క లారీని మాత్రమే బుక్ చేయగలిగాము. 122 00:09:21,600 --> 00:09:24,440 అంటే అది కొంత బయటే ఉంచేయాలి. 123 00:09:25,880 --> 00:09:29,120 రేపు వర్షం పడుతుందని సూచన. 124 00:09:31,000 --> 00:09:34,240 దీని కారణంగా కోపంగా ఉంది. ఇక్కడ మనకెంత ఉంది? ఐదు టన్నులా? 125 00:09:34,760 --> 00:09:36,440 నాలుగు, ఐదు టన్నులు. అవును. 126 00:09:36,960 --> 00:09:38,880 అది ఇక్కడే ఉండిపోయి, కుళ్ళిపోతుంది. 127 00:09:39,880 --> 00:09:43,120 ఇక్కడ ఉండిపోయి పాడయిపోయే బార్లీ విలువ 128 00:09:43,200 --> 00:09:45,440 -750 పౌండ్లు ఉంటుంది. -అవును. 129 00:09:45,960 --> 00:09:49,320 సూచన తప్పుకావచ్చు. ఉదయం బాగుంటుందేమో. 130 00:09:49,720 --> 00:09:51,000 మనకు తెలియదు కదా, తెలుసా? 131 00:09:54,000 --> 00:09:56,760 తరువాతి రోజు, మాకు తెలుసు. 132 00:10:02,520 --> 00:10:03,760 అబ్బా. 133 00:10:07,080 --> 00:10:09,880 నాకు ధాన్య వ్యాపారి నుండి సందేశం వచ్చింది. 134 00:10:10,000 --> 00:10:12,760 -అందుకనే నిన్న రాత్రి ఆగాము. -అవును. 135 00:10:12,880 --> 00:10:16,320 ఈ ఉదయం 16.5 శాతం తేమలో లోడ్ తీశాము. 136 00:10:16,760 --> 00:10:20,040 దానిని ఆరబెట్టేందుకు 9.75 పౌండ్లు తీసుకుంటున్నారు. 137 00:10:20,760 --> 00:10:22,080 -ఒక టన్నుకా? -ఒక టన్నుకు. 138 00:10:22,160 --> 00:10:24,880 దానికి 4.5 శాతం బరువు నష్టపోతాము. 139 00:10:25,320 --> 00:10:27,880 అందుకని, టన్నున్నరకు చెల్లించరు. 140 00:10:28,000 --> 00:10:31,880 వాళ్ళు నీటికి చార్జీ వేస్తున్నారు, అందుకనే నిన్న రాత్రి మనం ఆపేశాం. 141 00:10:32,000 --> 00:10:34,080 అంటే, మనం ఎంత డబ్బు నష్టపోయాము? 142 00:10:34,160 --> 00:10:36,960 అయితే, దానికి 450 పౌండ్లు ఖర్చు అవుతుంది. 143 00:10:37,040 --> 00:10:41,840 -ప్రాథమిక వ్యాపార పన్నులలో. -మరి 750 పౌండ్లు? 144 00:10:41,880 --> 00:10:45,280 -ఉండిపోయింది... అవును. -తడి ముద్దవుతూ ఉంది. ఛత్. 145 00:10:46,120 --> 00:10:51,320 కానీ, కోత సమస్యలు ఎంత చిరాగ్గా ఉన్నాయో, 146 00:10:52,240 --> 00:10:55,400 అవి నాకు, యూకేలో మిగతా రైతులు 147 00:10:55,480 --> 00:10:58,280 ఎదుర్కొంటున్న దానితో పోల్చుకోలేనివి. 148 00:10:59,240 --> 00:11:04,960 జూన్ 2016లో తలెత్తిన గందరగోళ సంఘటన నుండి తలెత్తుతున్నవి. 149 00:11:11,320 --> 00:11:14,880 బ్రిటీష్ ప్రజలు వెల్లడించారు, జవాబు "మేము తొలగుతున్నాం" 150 00:11:16,720 --> 00:11:21,440 బ్రెగ్జిట్‌తో ఇకపై ఈయూ గ్రాంట్లు, సబ్సిడీలు ఉండవని రైతులకు తెలుసు. 151 00:11:21,520 --> 00:11:24,800 కానీ బ్రిటీష్ ప్రభుత్వం మమ్మల్ని ఆందోళన పడవద్దని చెప్పింది. 152 00:11:25,520 --> 00:11:31,000 యూకేలో నేటి వ్యవసాయ స్థితికి మా మద్దతు అందిస్తాము, పూర్తిగా. 153 00:11:31,080 --> 00:11:34,760 వ్యవసాయం కోసం భవిష్యత్ మద్దతుపై 154 00:11:34,840 --> 00:11:38,520 ఐరోపా సమాఖ్యలో ఈ ప్రభుత్వం అందించిన అత్యంత నిశ్చయతను 155 00:11:38,600 --> 00:11:40,400 ప్రపంచంలో ఏదీ అందించలేదు. 156 00:11:41,160 --> 00:11:45,040 ఏదేమైనా, ఈ ప్రమాణాలు ఇంకా డొల్ల ప్రమాణాలుగానే ఉన్నాయి. 157 00:11:46,160 --> 00:11:48,880 ప్రభుత్వ ఆశయం పెద్దది కావచ్చు, కానీ 158 00:11:48,960 --> 00:11:52,200 ప్రస్తుతం డబ్బు, వివరాల కొరత ఉందని రైతులు అంటున్నారు. 159 00:11:52,560 --> 00:11:55,000 ఆ విషయాలపై ప్రకటనలలో చాలా అస్పష్టత ఉంది. 160 00:11:55,080 --> 00:11:58,000 వాళ్ళు దేనికి, ఎంత చెల్లిస్తారన్నది మాకు తెలియదు. 161 00:11:58,080 --> 00:11:59,520 ఒక ఏడాది, రెండు, 162 00:11:59,600 --> 00:12:01,920 ఐదు ఏళ్ళలో నేను ఎలాంటి వ్యవస్థలో ఉంటాను. 163 00:12:02,000 --> 00:12:04,080 ఎన్నో వివరాలను పరిష్కరించాల్సి ఉంది. 164 00:12:04,440 --> 00:12:05,880 -బ్రెగ్జిట్ అనంతరం. -అవును. 165 00:12:05,960 --> 00:12:07,880 రైతులు. మంచికా లేదా నష్టానికా? 166 00:12:07,960 --> 00:12:08,840 నష్టానికి. 167 00:12:11,280 --> 00:12:17,040 ఈ పెద్ద సమస్యపై ఇక నేను చార్లీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. 168 00:12:17,560 --> 00:12:22,600 మీరు ఒక ఏడాది 82,000 పౌండ్ల రాయితీని కోల్పోతున్నారని మనకు తెలుసు. 169 00:12:22,680 --> 00:12:27,080 తరువాతి కొన్ని సంవత్సరాలు, హెక్టారుకు సున్నా పౌండ్లు వస్తాయి. 170 00:12:27,960 --> 00:12:30,280 నేరుగా వచ్చే ఆ రాయితీలన్నీ పోతున్నాయి. 171 00:12:30,360 --> 00:12:33,160 కొన్ని గ్రాంట్లు, రాయితీలు ఉండవచ్చు. 172 00:12:33,240 --> 00:12:35,680 కానీ అవి ఏంటో మనకు ఇంకా తెలియదు. 173 00:12:35,760 --> 00:12:39,920 లేదు. "ప్రజా ధనం, ప్రజా వస్తువులకే," అని వాళ్ళు అనడం మనకు తెలుసు. 174 00:12:40,560 --> 00:12:43,560 వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోసం రైతులకు చెల్లించనున్నారు. 175 00:12:43,640 --> 00:12:46,280 అందులో అర్థం లేదు. అది ఒక నినాదం మాత్రమే. 176 00:12:46,360 --> 00:12:50,440 కానీ ఆ మాటలకు కచ్చితమనైన అధికారిక ధ్రువీకరణ లేదు. 177 00:12:50,520 --> 00:12:54,880 నేను మాట్లాడిన ప్రతి రైతు, "మనం ఏమి చేయాలి? 178 00:12:54,960 --> 00:12:57,520 "మేము ఏమి పండించాలి? ఏమి పండించకూడదు? 179 00:12:57,600 --> 00:13:00,440 "గ్లైఫోసేట్ నిషేధిస్తారా? ఏమో తెలియదు," అంటున్నాడు. 180 00:13:00,520 --> 00:13:02,800 -వాళ్ళు ఏమి చేస్తారో మనకు తెలియదు. -అవును. 181 00:13:02,880 --> 00:13:04,560 -అవునవును. -నాకు ఇలా ఉంది. 182 00:13:04,640 --> 00:13:08,320 "ఫుట్‌బాల్‌కు కొత్త నిబంధనలు ఉంటాయి," అని ఫిఫా అంటే, 183 00:13:08,400 --> 00:13:12,080 అప్పుడు జట్లు అన్నీ, "ఏంటి? మాకు గోల్‌కీపర్లు ఉండరా? 184 00:13:12,160 --> 00:13:14,960 "మాకు రెండు బంతులు ఇస్తారా? ఆడ, మగ కలిసి ఆడతారా? 185 00:13:15,040 --> 00:13:17,160 -"ఏంటిది?" -మనకు కొత్త నిబంధనలు. 186 00:13:17,240 --> 00:13:19,800 "మాకు తెలియదు. కొత్త నిబంధనలు రాబోతున్నాయి. 187 00:13:19,880 --> 00:13:23,240 "అవి ఏంటో తెలియదు. వచ్చేవారం సీజన్ మొదలవుతోంది" అంటారు. 188 00:13:23,320 --> 00:13:25,560 నిజమే. అందుకని కొంత ఒత్తిడి ఉంటుంది. 189 00:13:26,360 --> 00:13:27,560 ఏదేమైనా, విను. 190 00:13:27,640 --> 00:13:30,840 ప్రభుత్వాన్ని వారి కమిటీ సమావేశాలు, కమిటీ సమావేశాల ఎంపికలు 191 00:13:30,920 --> 00:13:34,040 ఇంకా ఆ నిరర్థక పనులలో నిమగ్నమై ఉండనిద్దాము. 192 00:13:34,120 --> 00:13:36,000 వాళ్ళను, వాళ్ళందరినీ వదిలేయ్. 193 00:13:36,920 --> 00:13:38,600 అయితే, ఇది నా ప్రణాళిక. 194 00:13:39,200 --> 00:13:40,040 ఏంటి? 195 00:13:40,520 --> 00:13:41,400 ఆవులు. 196 00:13:42,560 --> 00:13:43,520 ఆవులా? 197 00:13:44,120 --> 00:13:46,080 గొర్రెలతో నష్టపోయాం అని తెలుసు. 198 00:13:46,160 --> 00:13:48,000 -అవును. -కానీ ఆవులు... 199 00:13:48,600 --> 00:13:49,440 సరే. 200 00:13:49,920 --> 00:13:54,400 -ఎందుకంటే అవి పేడ వేస్తాయి. -వేస్తాయి. 201 00:13:54,480 --> 00:13:56,320 అది నేలకు మంచిది. 202 00:13:56,400 --> 00:14:00,000 -అది నేలకు మంచిదా? -తరువాతి రోజు, అవి పేడ వేసిన చోట 203 00:14:00,080 --> 00:14:02,520 కోళ్ళను వదలాలి, అప్పుడు కోళ్ళు ఆవు పేడలో 204 00:14:02,600 --> 00:14:04,280 -పురుగులు తింటాయి... -అవును. 205 00:14:04,360 --> 00:14:08,280 ...వాటి రెట్టలను, ఆవు పేడను నేలలోకి తొక్కి, 206 00:14:08,360 --> 00:14:10,840 -సారవంతం చేస్తాయి, తిరుగుతాయి, అలా. -అవును. 207 00:14:10,920 --> 00:14:15,200 అలా మొత్తం పొలం అంతా చివరకు తిరిగి సారవంతం అవుతుంది. 208 00:14:15,280 --> 00:14:17,440 అది గుంపుగా మేపే యత్నం. చివరకు... 209 00:14:17,520 --> 00:14:19,680 -అది నేల గురించి. -అది నేల గురించే. 210 00:14:19,760 --> 00:14:22,840 మనం తిరిగి పాత కాలం వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తాము. 211 00:14:22,920 --> 00:14:25,080 -అదే నా ప్రణాళిక. -ఆవులా? 212 00:14:25,160 --> 00:14:26,600 అంటే, ఆవులు. అవును. 213 00:14:26,680 --> 00:14:29,120 -ఎన్ని ఆవులు? -ఏమో తెలియదు. 214 00:14:29,760 --> 00:14:33,080 ఆవులకు బ్యాడ్జర్ల వలన క్షయ వ్యాధి రావచ్చు. 215 00:14:33,160 --> 00:14:36,200 -ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం. -బ్యాడ్జర్లను చంపేద్దాం. 216 00:14:37,080 --> 00:14:38,640 మనం బ్యాడ్జర్లను చంపలేము. 217 00:14:38,720 --> 00:14:41,200 -మనం ఎందుకు చంపలేము? -దానికి అనుమతి లేదు. 218 00:14:41,280 --> 00:14:43,320 అవి ఆవులను చంపుతున్నాయిగా? 219 00:14:43,400 --> 00:14:45,120 అయినా మనం బ్యాడ్జర్లను చంపలేము. 220 00:14:45,600 --> 00:14:47,120 మనం అది అధిగమించవచ్చు. 221 00:14:48,360 --> 00:14:51,520 ఇది నా తదుపరి ప్రణాళిక. సిద్ధమేనా? 222 00:14:52,920 --> 00:14:57,560 మనం ఇప్పుడు ఉపయోగించని గొర్రెల కొట్టాన్ని, రెస్టారెంట్‌గా మార్చేసి, 223 00:14:58,320 --> 00:15:00,000 అందులో గొడ్డు మాంసం అమ్ముదాము. 224 00:15:00,760 --> 00:15:03,000 మన గొడ్డు మాంసాన్ని, రోడ్డు మీద చంపేసి, 225 00:15:03,080 --> 00:15:07,800 రెస్టారెంట్‌లో వండి, అందిస్తే అది కూర్చొని తినేలా... 226 00:15:07,880 --> 00:15:09,800 మనకు గొర్రెలు, పొట్టేళ్ళు ఉన్నాయి. 227 00:15:09,880 --> 00:15:11,760 -అవును. -గొడ్డు, గొర్రె మాంసం. 228 00:15:11,840 --> 00:15:13,840 -మనకు బంగళాదుంపలు ఉన్నాయి. -అవును. 229 00:15:13,920 --> 00:15:17,040 కూరకు పిండి ఉంది. పుదీనా చట్నీకి పుదీనా ఉంది. 230 00:15:17,120 --> 00:15:18,760 -అవన్నీ ఉన్నాయి. -మునగవేరు ఉంది. 231 00:15:18,840 --> 00:15:19,960 డరమ్ గోధుమ ఉంది, 232 00:15:20,040 --> 00:15:22,120 -మన పాస్తా మనమే చేసుకోవచ్చు. -పాస్తా. 233 00:15:22,200 --> 00:15:27,240 అన్నీ, రెస్టారెంట్‌లో తినేని అన్నీ, 234 00:15:27,320 --> 00:15:29,400 డిడ్లీ స్క్వాట్‌లో పండినవి. 235 00:15:31,800 --> 00:15:35,160 అద్భుతం. కేవలం, అవన్నీ అక్కడికి తీసుకొచ్చే విషయం... 236 00:15:35,240 --> 00:15:36,480 అవును, అది చూడు. 237 00:15:36,560 --> 00:15:37,920 -లేదు. -బొమ్మ, చూడు. 238 00:15:38,000 --> 00:15:39,560 ఇవి మనకు కావాలి, ఫ్రీజియన్స్. 239 00:15:40,240 --> 00:15:44,400 -పాడి ఆవులు. "వాటిని తినండి" అన్నప్పుడు... -ఎలా తెలుస్తుంది... ఏంటి? 240 00:15:44,480 --> 00:15:47,240 మీరు అది తినండి అన్నప్పుడు... అది పాడి ఆవు. 241 00:15:47,320 --> 00:15:49,760 ఒక రెస్టారెంట్ పెట్టాలంటే చాలా ఖర్చవుతుంది. 242 00:15:49,840 --> 00:15:51,280 నాకు దాని గురించి తెలియదు. 243 00:15:51,360 --> 00:15:53,480 -అవి వస్తూ, పోతుంటాయి. -వస్తూ, పోతుంటాయి. 244 00:15:53,560 --> 00:15:56,520 వైఫల్యం రేటు 80 శాతం అని తెలుసు, కానీ ఒక పథకం ఉంది. 245 00:15:56,600 --> 00:15:58,080 ఆ 20 శాతంలో ఒకరిగా కావడానికి. 246 00:15:59,680 --> 00:16:03,600 నాకు తెలుసు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మనం కాస్త ఉత్సాహం చూపాలంతే. 247 00:16:03,680 --> 00:16:04,560 నేను కేవలం... 248 00:16:04,640 --> 00:16:06,480 అయితే, ఏదేమైనా, ఇది నా పథకం. 249 00:16:06,560 --> 00:16:08,880 -నన్ను కొన్ని ఆవులను చూడమంటారా? -అవును. 250 00:16:11,480 --> 00:16:16,760 చార్లీ ఆవులను కొనడానికి వెళ్ళగా, నేను తిరిగి కోతలకు వెళ్ళాను. కానీ చేయలేదు. 251 00:16:18,240 --> 00:16:20,080 కారణం తరువాతి నాలుగు రోజులు, 252 00:16:20,160 --> 00:16:25,080 పంటలను నిరంతరం తేమగా ఉంచేందుకు తగినంత వర్షం కురిసింది. 253 00:16:32,440 --> 00:16:35,640 అందుకని, ఈరోజు మరో ఉపయోగం లేని రోజుగా భావించి, 254 00:16:36,200 --> 00:16:40,320 అబ్బా. పెద్ద గాటు ఉంది. 255 00:16:40,840 --> 00:16:44,200 నేను నా ట్రాక్టర్ టైర్లన్నీ మార్చాలని నిర్ణయించుకున్నాను. 256 00:16:45,720 --> 00:16:49,360 అయితే సరదా విషయం ఏంటంటే, ఆ గాలి బహుశా 14 ఏళ్ళదేమో ఇంకా జర్మన్‌ది. 257 00:16:49,440 --> 00:16:50,280 అవును. 258 00:16:52,560 --> 00:16:54,200 ఒక చేయి వేయమంటావా? 259 00:16:54,280 --> 00:16:56,120 వద్దులే అంటాడని ఆశించి అన్నాడు. 260 00:17:05,080 --> 00:17:06,480 దాని గురించి ఏమనుకుంటావు? 261 00:17:07,560 --> 00:17:09,080 మీరు ఏమి చేస్తున్నారు? 262 00:17:10,000 --> 00:17:11,960 -మొక్కజొన్నలు తయారుగా ఉన్నాయి. -ఏంటి? 263 00:17:12,040 --> 00:17:14,560 మొక్కజొన్న సిద్ధంగా ఉంది. మనం వెంటనే వెళ్ళాలి. 264 00:17:14,640 --> 00:17:18,240 ఏమి చేస్తున్నారు? ఇది శీతకాలంలో చేయాల్సిన పని. 265 00:17:18,560 --> 00:17:22,200 -ఇవి శీతాకాలం పనుల లాంటివి. -అవి శీతాకాలం జారుడుగా లేవు. 266 00:17:23,160 --> 00:17:25,080 మంచిది. మిమ్మల్ని ఒక గంటలో కలుస్తాను. 267 00:17:25,200 --> 00:17:26,520 నువ్వు మొదలుపెట్టవచ్చుగా? 268 00:17:26,560 --> 00:17:30,520 నేను మొదలుపెడతాను, అంతా చూసుకుంటాను, మీరు ఇది చేసుకోండి. 269 00:17:30,560 --> 00:17:32,880 నేను చాలా సమస్యల్లో కూరుకుపోయానని చూసి, 270 00:17:32,960 --> 00:17:36,480 ఫిట్టర్లు కొత్త టైర్లను అతి తక్కువ సమయంలో అమర్చారు. 271 00:17:40,760 --> 00:17:43,440 ఆ తరువాత నేను నా ట్రైలర్‌కు జోడించాను, 272 00:17:43,920 --> 00:17:48,680 ఈసారి ఇది క్లిష్టతరం కాకూడదని ఆశిస్తున్నాను. 273 00:17:49,240 --> 00:17:50,160 సరే. 274 00:17:57,160 --> 00:17:58,080 అయ్యో. 275 00:18:01,080 --> 00:18:02,000 ఛ. 276 00:18:03,240 --> 00:18:04,200 పీట్? 277 00:18:05,560 --> 00:18:06,480 ఏంటి? 278 00:18:07,680 --> 00:18:08,560 ఏంటి సంగతులు? 279 00:18:09,080 --> 00:18:12,200 వెనుక ఆ పసుపు కొక్కెం బయటకు వచ్చిందా? 280 00:18:14,080 --> 00:18:15,800 -లేదు. -ఇప్పుడు వచ్చిందా? 281 00:18:16,440 --> 00:18:18,240 -లేదు. -ఇప్పుడు? 282 00:18:19,080 --> 00:18:20,760 -లేదు. -ఇప్పుడు? 283 00:18:21,520 --> 00:18:22,320 లేదు. 284 00:18:23,240 --> 00:18:27,560 అయ్యో, దేవుడా. అతనిని తిరిగి వచ్చి మళ్ళీ ఇలా అయిందని దయచేసి తెలియనీయకు. 285 00:18:41,880 --> 00:18:43,240 అది ఇక్కడ పెట్టాలి. 286 00:18:43,320 --> 00:18:45,000 -సరే. -అది పూర్తిగా సురక్షితం. 287 00:18:46,040 --> 00:18:48,920 అది గత ఏడాదంతా అదెంత ప్రమాదకరమో చెబుతూ గడిపారు. 288 00:18:49,000 --> 00:18:52,080 ట్రాక్టర్ వెనకాల ప్రమాదకరం, కానీ మనం పార ఉపయోగిస్తున్నాం. 289 00:18:52,160 --> 00:18:53,080 సరే. 290 00:18:53,800 --> 00:18:56,800 అది అక్కడ పట్టుకో, నేను ఇప్పుడు ఉంచుతాను... 291 00:19:00,160 --> 00:19:02,400 -అది బయటకు వస్తుందా? కొక్కెం? -లేదు. 292 00:19:03,080 --> 00:19:04,720 -లేదా? -లేదు. 293 00:19:05,240 --> 00:19:06,760 -లేదా? -లేదు. 294 00:19:10,960 --> 00:19:12,520 అది ఇంకా చేయలేదా? 295 00:19:12,560 --> 00:19:13,640 నాకిది చెప్పు. 296 00:19:13,720 --> 00:19:15,520 -సరే. -ఏం తప్పు చేస్తున్నానో చూడు. 297 00:19:15,560 --> 00:19:17,520 -సరే. -కానీ నా మీద అరవకు. 298 00:19:17,560 --> 00:19:19,680 -నేను చాలా కష్టపడ్డాను. -సరే. 299 00:19:20,200 --> 00:19:21,240 సరే. సిద్ధమా? 300 00:19:21,320 --> 00:19:23,080 -సరే. -స్టాప్ బటన్ నొక్కి పెట్టాలి. 301 00:19:23,200 --> 00:19:25,520 -సరే. -ఇప్పుడు, అది పైకి నొక్కాలి. 302 00:19:27,520 --> 00:19:28,320 ఇప్పుడు, కిందకు. 303 00:19:31,560 --> 00:19:33,800 -అది ఇప్పుడు బయటకు వచ్చిందా? -వచ్చింది. 304 00:19:33,920 --> 00:19:37,240 సరే, ఎందుకు... నాకు బాగా చిరాగ్గా ఉంది ఎందుకంటే అది... 305 00:19:40,080 --> 00:19:41,680 నా ట్రైలర్‌ను జోడించాక, 306 00:19:41,760 --> 00:19:45,080 చివరకు కొంత కోత పనులు మొదలుపెట్టాము. 307 00:19:52,080 --> 00:19:55,400 సూర్యరశ్మి, కానీయ్. ఎండిపోనివ్వు. ఎండిపోనివ్వు. 308 00:20:12,160 --> 00:20:16,320 మొదటి విషయాలు మొదట, మనం చిన్న పిల్లను పండిచాము. 309 00:20:18,040 --> 00:20:20,920 ఇది కచ్చితంగా వార్తల్లోకి ఎక్కుతుంది, కదా? 310 00:20:21,000 --> 00:20:23,960 జెరెమీ క్లార్క్‌సన్ పాపాయిని కోసాడు. 311 00:20:25,040 --> 00:20:27,960 బర్‌బెర్రీ. శ్రామిక బిడ్డ. 312 00:20:30,880 --> 00:20:35,080 చూడండి, ఇదీ సమస్య. చూడండి. ఈ బార్లీని ఇక్కడ వదిలేస్తే, 313 00:20:35,680 --> 00:20:39,000 అది అంకురించి, మొలకెత్తి, పెరగడం మొదలుపెట్టింది. 314 00:20:40,040 --> 00:20:41,640 అది చూడండి. చూడండి. 315 00:20:44,080 --> 00:20:48,280 ఇది పూర్తిగా నానుతోంది. 316 00:20:49,280 --> 00:20:53,480 ఇది అంతా కాంక్రీట్ ప్యాడ్ మీద టెలిహ్యాండ్లర్‌తో 317 00:20:54,040 --> 00:20:55,760 విస్తరింప చేయాలని, ఆ తరువాత 318 00:20:56,400 --> 00:21:00,280 కొత్త వాటిని నేను ఇప్పుడే నాటిన వాటిపై పెట్టాలని 319 00:21:00,320 --> 00:21:03,240 ఆ తరువాత అవి లారీలో కలుస్తాయని, 320 00:21:04,280 --> 00:21:06,640 ఆ తరువాత సగటు పరవాలేదని కేలెబ్ చెప్పాడు. 321 00:21:15,040 --> 00:21:16,080 నేను చచ్చిపోతాను! 322 00:21:17,040 --> 00:21:19,960 నేను వ్యవసాయంలో ఒకటి బాగా చేయగలనని తెలిసింది. 323 00:21:25,000 --> 00:21:27,680 అతను, "నువ్వు ఇది చేయలేదు," అంటాడు. 324 00:21:29,880 --> 00:21:32,160 మొదటి పచ్చనివి బయటకు తీయరా? 325 00:21:32,240 --> 00:21:33,080 ఏంటి? 326 00:21:33,160 --> 00:21:36,000 మనం ముందు పచ్చనివి బయటకు తీయాలి కదా? 327 00:21:36,800 --> 00:21:37,920 అలా అని ఎవరు అన్నారు? 328 00:21:38,000 --> 00:21:40,320 -కేలెబ్. -లేదు. తను చెప్పలేదు. చెప్పాడా? 329 00:21:40,800 --> 00:21:41,640 అవును. 330 00:21:46,560 --> 00:21:48,080 మీరు బాగా చేశారు. 331 00:21:50,160 --> 00:21:52,360 -అది సరిపోతుందా? -అది పరవాలేదు. 332 00:21:52,440 --> 00:21:55,360 అది నేను చేశాను. నేను ముందు మొలకలను బయటకు తీశాను. 333 00:21:56,040 --> 00:21:56,880 బాగా చేశారు. 334 00:22:04,840 --> 00:22:05,960 మేము కొనసాగించాము, 335 00:22:06,880 --> 00:22:11,400 ఆ తరువాత కొన్ని రోజుల్లో, మిగిలిన బార్లీని కోశాము, 336 00:22:12,800 --> 00:22:18,040 ఇంకా ఆవాల కోత పని కూడా పూర్తిచేశాము మళ్ళీ వర్షం పని ఆపకముందే. 337 00:22:19,400 --> 00:22:22,160 కానీ అదృష్టం, సమయాన్ని సరిగా వినియోగించుకున్నాను 338 00:22:22,240 --> 00:22:25,680 ఎందుకంటే చార్లీ నేను చూసేందుకు కొన్ని ఆవులు చూసిపెట్టాడు. 339 00:22:26,440 --> 00:22:29,960 అయితే ఇవి... మనం కొనేది ఆడ ఆవునా లేదా మగ ఆవునా? 340 00:22:30,040 --> 00:22:32,840 -పాడి ఆవులు స్పష్టంగా ఆడవే ఉంటాయి. -అవును. 341 00:22:32,920 --> 00:22:36,680 కానీ, వాళ్ళ దగ్గర మాంసం కోసం చంపేందుకు పుష్టిగా ఉన్నవి కూడా ఉన్నాయి. 342 00:22:36,760 --> 00:22:39,920 -కొన్ని మగ ఆవు దూడలు ఉండవచ్చు, కానీ... -అవును. 343 00:22:40,000 --> 00:22:42,240 అవి ఎద్దులుగా మారడానికి ముందు దూడలు. 344 00:22:42,320 --> 00:22:44,400 -అవి కోడెలు? -అవును కోడెలు. 345 00:22:44,480 --> 00:22:46,880 -అవునా? -ఎందుకంటే వాటికి వృషణాలు ఉండవు కనుక. 346 00:22:46,960 --> 00:22:50,760 -వృషణాలు ఎందుకుండవు? -వాటి విత్తులు తీస్తారు. సురక్షిత నిర్వహణ. 347 00:22:50,840 --> 00:22:52,120 -ఒకవేళ మీరు... -ఏంటి? 348 00:22:52,200 --> 00:22:57,520 అంటే, ఒక మగ ఆవుకు వృషణాలు లేకపోతే దాని నిర్వహణ సురక్షితంగా చేయవచ్చు. 349 00:22:58,200 --> 00:23:01,800 అందులో అర్థం లేదు. ఎవరైనా నా వృషణాలు కోసేస్తే నేను సురక్షితం కాదు. 350 00:23:01,880 --> 00:23:05,400 మీరు ఒక ఎద్దు ఉత్పత్తి చేసేంత టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేయరు. 351 00:23:06,520 --> 00:23:09,920 లీసా, "పొడుగైన కనురెప్పలవి తీసుకుందామా?" అని అంటుంది. 352 00:23:10,000 --> 00:23:13,200 తను ఈ వ్యవసాయ జీవితానికి అలవాటు పడిందో లేదో తెలియదు. 353 00:23:13,280 --> 00:23:15,240 -"పొడుగు కనురెప్ప"లా? -"వాటికి చక్కని 354 00:23:15,320 --> 00:23:18,800 -"పొడుగైన కనురెప్పలు," అనింది. -పొడుగైన కనురెప్పలవి తీసుకోవచ్చు. 355 00:23:20,440 --> 00:23:23,680 ఎట్టకేలకు, ఆవుల పెంపకందారుడు, టిమ్ పొలానికి 356 00:23:23,760 --> 00:23:25,160 నార్త్‌హాంప్టన్‌షైర్ చేరాం. 357 00:23:28,360 --> 00:23:31,120 -ఆ శబ్దం సిల్వర్‌స్టోన్ నుండి వస్తుందా? -అవును. 358 00:23:31,200 --> 00:23:33,160 మీరది ఆపేస్తారని అనుకున్నాను. 359 00:23:33,240 --> 00:23:35,000 ఎప్పుడూ పెద్ద శబ్దం చేస్తుందా? 360 00:23:35,080 --> 00:23:36,520 -అవును. -ఎక్కువగా. 361 00:23:36,600 --> 00:23:38,760 చెత్త కార్లు, నిజంగా. 362 00:23:39,680 --> 00:23:41,280 నిన్ను చూడు! 363 00:23:42,240 --> 00:23:44,480 -అది కోడె ఎద్దు. -ఇవన్నీ కోడె ఎద్దులే. 364 00:23:45,880 --> 00:23:47,200 కోడె ఎద్దు అంటే? 365 00:23:48,200 --> 00:23:49,920 అది వృషణాలు లేని ఎద్దు. 366 00:23:50,000 --> 00:23:51,720 -సరే, ఇది... -వృషణాలు లేవు. 367 00:23:52,560 --> 00:23:55,640 -అయితే, ఇవి తినడానికి. -ఇవి తినడానికి. 368 00:23:56,120 --> 00:23:59,720 -అవును. ఇవి పాడి ఆవులు. -ఇవి పాడి ఆవులు, అన్నీ పాడి ఆవులే. 369 00:23:59,800 --> 00:24:01,320 ఇవి తినటానికి కాదు. 370 00:24:01,400 --> 00:24:04,360 -వీటికి పేర్లు పెట్టడం లాంటివి చేయొచ్చు. -అవును. 371 00:24:06,440 --> 00:24:10,000 నేను ఎప్పుడూ... ఇది పబ్లిక్ టాయిలెట్‌లా ఉంది. 372 00:24:10,800 --> 00:24:12,360 అవి ఎప్పటికైనా ఆపుతాయా? 373 00:24:12,440 --> 00:24:14,720 -ఆ. -వాటిని చూడండి. ఆ రెండూ చేస్తున్నాయి. 374 00:24:14,800 --> 00:24:16,520 అది... దాన్ని చూడు. 375 00:24:16,600 --> 00:24:18,960 -చివరకు బోలేడంత పేడ. -అవును. 376 00:24:19,040 --> 00:24:20,640 -మాకు కావాల్సింది అదే. -మంచిది. 377 00:24:20,720 --> 00:24:22,000 -పేడ మంచిదే. -అవును. 378 00:24:22,080 --> 00:24:26,360 అది పొలం అంతా చేయాలి. దానివలన నేను ఎక్కువ నత్రజని వాడకుండా సరిపోతుంది. 379 00:24:26,440 --> 00:24:28,920 అందుకే నేనది ఆలోచించాను. ఆ తరువాత అనుకున్నాను, 380 00:24:29,000 --> 00:24:32,000 -బోరిస్ ఆస్ట్రేలియాతో డీల్ చేసుకున్నాడు. -అవును. 381 00:24:32,080 --> 00:24:34,600 నేను చూసిన దాని ప్రకారం దానితో ఏ ఉపయోగం ఉండదు. 382 00:24:34,680 --> 00:24:38,240 -లేదు, అస్సలు ఉండదు. -చౌక, నాసిరకం గొడ్డు మాంసం వస్తుంది. 383 00:24:38,320 --> 00:24:40,680 గడ్డి మేసే గొడ్డుతో, రెస్టారెంట్ తెరిస్తే, 384 00:24:40,760 --> 00:24:43,760 నేను ఆస్ట్రేలియన్లతో పోటీపడటం గురించి చింతించనవసరం లేదు. 385 00:24:43,840 --> 00:24:48,240 ఇది పొట్టి కొమ్ములది, అది బహుశా మీరు తిన్న ఉత్తమమైన వాటిలో అది ఒకటి. 386 00:24:48,320 --> 00:24:49,160 -నిజంగా? -అవును. 387 00:24:51,360 --> 00:24:52,280 నువ్వు బాగున్నావు. 388 00:24:53,080 --> 00:24:54,440 నీకు మంచి ముఖం ఉంది. 389 00:24:54,520 --> 00:24:58,120 జెరెమీ, వాటి గురించి గొప్పగా మాట్లాడకండి... మనం ధర మాట్లాడుకోవాలి. 390 00:24:58,200 --> 00:25:01,280 -తెలుసు. నాకు దాని ముఖం నచ్చింది. -అబ్బాయిలు, మాట్లాడండి. 391 00:25:01,360 --> 00:25:04,920 సరదా సంభాషణలు ముగిశాయి కనుక, ఇక ఏది కొనాలో ఎంచుకోవాల్సిన సమయం, 392 00:25:05,000 --> 00:25:07,960 అది ముక్కు సూటిగా ఉంటుందని అనుకుంటాను. 393 00:25:08,520 --> 00:25:11,760 ఇక్కడ నాలుగు ఆవులు, దూడలు, అక్కడ నాలుగు ఆవులు, దూడలున్నాయి. 394 00:25:11,840 --> 00:25:15,680 అది ఈనిన ఆవులపై మనకు కొంత అనుభవాన్ని ఇస్తుంది. 395 00:25:15,760 --> 00:25:18,040 అవి క్రిస్మస్ సమయానికి సిద్ధమవుతాయి. 396 00:25:18,120 --> 00:25:19,320 మరో ఏడాదికి. 397 00:25:19,800 --> 00:25:21,080 -అవును. -ఇవి అవుతాయి. 398 00:25:21,160 --> 00:25:23,160 అందుకని మనకు వేరేవి కావాలి... 399 00:25:23,240 --> 00:25:24,880 -వీటన్నిటికీ ఏడాది పడుందా? -ఆ. 400 00:25:24,960 --> 00:25:26,160 -ఈ సమయం... -అవును. 401 00:25:26,760 --> 00:25:30,760 -అందుకని మనం వేరేవి తీసుకోవాలి... -అవును. దేవుడా, ఇది క్లిష్టంగా ఉంది. 402 00:25:30,840 --> 00:25:33,680 అందుకని, మనం ఏవి తీసుకోవాలంటే ఏవైతే... 403 00:25:33,760 --> 00:25:37,960 తరువాతి వసంత కాలం నాటికి అవి గర్భం దాల్చాలి. 404 00:25:38,040 --> 00:25:39,680 అవి వచ్చే వసంతం నాటికి ఈనుతాయి. 405 00:25:40,160 --> 00:25:42,760 లేదు, గర్భందాల్చేది తరువాతి... లేదు. ఈను... 406 00:25:42,840 --> 00:25:44,320 తరువాతి వసంతానికి ఈనుతాయి. 407 00:25:44,440 --> 00:25:46,840 -అయితే మాకు 12 ఆవులు కావాలి. -పన్నెండు ఆవులు. 408 00:25:46,920 --> 00:25:50,880 లేదు. ఇక్కడ ఎనిమిది ఆవులున్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? తొమ్మిది ఆవులా? 409 00:25:52,080 --> 00:25:53,920 దూడలతో ఎనిమిది ఆవులు. 410 00:25:54,000 --> 00:25:56,280 మనం కొన్ని ఆవుపడ్డలు తీసుకోవచ్చు. 411 00:25:56,840 --> 00:26:02,520 ఆ తరువాత... వద్దు. ఆవుపడ్డలు ఆవు దూడల కంటే ముందు తినడానికి సిద్ధంగా ఉంటాయా? 412 00:26:03,000 --> 00:26:04,960 లేదు. అవి పాడి పశువులు. 413 00:26:05,040 --> 00:26:07,520 అవి ఆవు దూడలుగా అవుతాయి. దానితో 12 అవుతాయి. 414 00:26:07,600 --> 00:26:09,240 -దేవుడా. -మనకు కోడె ఎద్దులు 415 00:26:09,320 --> 00:26:11,000 పెంపకానికి, మాంసానికి ఉంటాయి. 416 00:26:13,120 --> 00:26:15,040 కంగారు పడకండి. ఏం తీసుకోవాలో తెలుసు. 417 00:26:17,880 --> 00:26:22,520 ఇక నేను ఏవైతే కొనాలనుకుంటున్నానో వాటి ఖరీదు మాట్లాడుకునే సమయం. 418 00:26:23,520 --> 00:26:24,800 ఆవు ఖరీదు ఎంత? 419 00:26:25,280 --> 00:26:29,480 ఇలాంటి ఆవు, దూడ సుమారు 2,200 పౌండ్లు ఉంటాయి. 420 00:26:29,960 --> 00:26:35,080 అంటే అవి ఎంత సమానమంటే... అంత డబ్బులో ఆల్ఫా 159 కొనవచ్చు. 421 00:26:35,800 --> 00:26:38,240 -అది ఏంటో నాకు తెలియదు. -ఆల్ఫా రోమియో 159. 422 00:26:38,320 --> 00:26:40,800 సిల్వర్‌స్టోన్‌తో ఉంటూ, ఇది తెలియకపోవడం... 423 00:26:41,280 --> 00:26:44,560 అందులో ఇబ్బందులు ఉన్నాయి. అవి కొనాలి, మేపాలి. 424 00:26:45,040 --> 00:26:46,720 అవి చనిపోవచ్చు, ఆ చిన్నవి. 425 00:26:46,800 --> 00:26:49,440 -ఆల్ఫా రోమియోలాగా. -ఆల్ఫా గుద్దేయవచ్చు. 426 00:26:49,520 --> 00:26:50,360 -హా. -కచ్చితంగా. 427 00:26:50,480 --> 00:26:53,520 లేదు, అది దానంతట అదే చనిపోతుంది. ఆడపడ్డ ఎంత? 428 00:26:53,600 --> 00:26:54,680 ఆ ఆడపడ్డలా? 429 00:26:55,160 --> 00:26:56,640 సుమారు 1,800 పౌండ్లు. 430 00:26:57,360 --> 00:26:58,360 1,800 పౌండ్లా? 431 00:26:58,920 --> 00:27:00,040 -ఉండాలి. -ఆగండి. 432 00:27:00,120 --> 00:27:02,360 ఆగండి, నేను క్యాలిక్యులేటర్ తెరవాలి. 433 00:27:02,440 --> 00:27:06,000 -మనకు మొత్తం 20 ఉన్నాయి, 20 పశువులు. -అంతే. అంతే. 434 00:27:06,080 --> 00:27:09,040 అవును. అది 25,000 పౌండ్లు అవుతాయి. 435 00:27:09,120 --> 00:27:10,960 అవును. మాకు ఇంకాస్త తగ్గించాలి. 436 00:27:12,240 --> 00:27:15,200 -ఆవు, దూడ, 2,000 పౌండ్లు. -2,100 పౌండ్లు? 437 00:27:16,000 --> 00:27:16,920 2,000 పౌండ్లు. 438 00:27:17,560 --> 00:27:19,240 -సరే 2,000 పౌండ్లు. -ఆడ దూడలు, 439 00:27:19,320 --> 00:27:22,360 -మనం ఆడ దూడ గురించి అనుకోలేదు. -అది కాస్త ఎక్కువ. 440 00:27:22,440 --> 00:27:24,600 వాటిని 1,500 పౌండ్లకు తక్కువ ఇవ్వలేను. 441 00:27:24,680 --> 00:27:26,920 -1,250 పౌండ్లు. -1,500 పౌండ్లు. అంతే. 442 00:27:27,400 --> 00:27:28,680 అందులో డెలివరీ కూడా ఉందా? 443 00:27:29,160 --> 00:27:31,360 -అవును. -అది ఉపయోగకరమే. 444 00:27:32,200 --> 00:27:33,400 డెలివరీతో 1,450 పౌండ్లు. 445 00:27:33,960 --> 00:27:37,160 -సరే. -సరే. ఏంటి సరే? 1,450 పౌండ్లా? 446 00:27:37,240 --> 00:27:39,200 -అదే ఖరారు. -అదే ఖరారు. 447 00:27:39,280 --> 00:27:40,560 ఒప్పందం చేసుకుందాము. 448 00:27:41,040 --> 00:27:43,520 నేను ఏమి కొన్నానో నాకు తెలియదు. 449 00:27:48,520 --> 00:27:52,360 మరుసటి రోజు ఉదయం, గోధుమ కోతలకు ఇంకా తడిగా ఉంది. 450 00:27:52,440 --> 00:27:55,960 నేను బిల్డర్ ఆలెన్‌ను పిలిచాను, రైతు బజార్ రెస్టారెంట్ గురించి 451 00:27:56,040 --> 00:27:58,120 నా ఆలోచనలు చెప్పడానికి. 452 00:27:59,200 --> 00:28:00,880 -రోజూ వర్షం పడుతుంది. -అయ్యో. 453 00:28:00,960 --> 00:28:03,280 ఎక్కువ లేదు, పంట తడిచేంత పడుతుంది అంతే. 454 00:28:03,880 --> 00:28:06,800 ప్రస్తుతం, కొట్టంలో బెంచీలు, బల్లలు ఉన్నాయి 455 00:28:06,880 --> 00:28:11,280 దుకాణ సందర్శకులు శాండ్విచ్ తింటూ ప్రకృతి దృశ్యాలను ఆనందించవచ్చు. 456 00:28:11,800 --> 00:28:15,560 కానీ రెస్టారెంట్ విషయంలో, నాకు ఇంకాస్త బాగా చేయాలని ఉంది. 457 00:28:15,640 --> 00:28:18,800 ఇది నా ప్రణాళిక. కచ్చితంగా నేలంతా గచ్చు వేయాలి. 458 00:28:18,880 --> 00:28:21,480 -సరే. -మూలన టాయిలెట్లు ఉండాలి. 459 00:28:21,960 --> 00:28:24,480 -సరే. -ఇంకా అక్కడ వంటగది ఉండాలి. 460 00:28:25,200 --> 00:28:27,000 -అక్కడ దడి కట్టాలి. -సరే. 461 00:28:27,080 --> 00:28:28,200 -సరేనా? -మంచిది. 462 00:28:28,280 --> 00:28:29,200 -సరే. -సరే. 463 00:28:29,280 --> 00:28:32,600 ఇంకా ఇక్కడంతా, మొత్తం, అద్దం ఏర్పాటు చేయాలి. 464 00:28:32,680 --> 00:28:34,480 సరే, ఇక్కడ. 465 00:28:35,920 --> 00:28:37,360 మనోహరమైన దృశ్యం ఉంది. 466 00:28:37,440 --> 00:28:39,200 -విచ్‌వుడ్ అడవులు. -సరే. 467 00:28:39,840 --> 00:28:43,040 కచ్చితంగా, దీనివలన చెమ్మ చేరుతుంది. 468 00:28:43,120 --> 00:28:44,800 దానికి పూత వేయాలి. 469 00:28:45,840 --> 00:28:50,400 ఆవుల అమ్మకందారుకు మించి ముగ్ధులను చేసేలా ఉండాలని ఆలెన్ సూచన. 470 00:28:51,200 --> 00:28:52,960 ఇనుప రేకులు, మీ ఇతర పైకప్పు పైన. 471 00:28:53,040 --> 00:28:54,600 రెండు రేకుల మధ్య వేయాలి. 472 00:28:54,680 --> 00:28:58,920 వాటిని తీసేసి, మళ్ళీ పెట్టాలి, అడ్డంగా కొట్టాలి, ఆ తరువాత కిందకు పెట్టాలి. 473 00:28:59,000 --> 00:29:02,360 పైకప్పు పెట్టి, మధ్యలో ఇన్సులేట్ చేసి, కింద బోర్డులు ఉంచాలి. 474 00:29:03,200 --> 00:29:07,000 ఆవిరి అవరోధంతో, ఎగిరిపోయి, వెనుకకు వెళ్ళి కిందకు జారుతుంది. 475 00:29:07,080 --> 00:29:08,600 క్యాజిల్ బోర్డ్ వాడతారు. 476 00:29:08,680 --> 00:29:11,480 ముందు ఉన్న దానికంటే ఇది వెడల్పుగా ఉంది. 477 00:29:11,560 --> 00:29:13,400 ఇది కోట బురుజు లాగా ఉంటుంది. 478 00:29:13,480 --> 00:29:18,200 అది అక్కడ నుండి, రేకు వెనుక కింద నుండి కాల్చితే, బయటకు వస్తుంది, కదా? 479 00:29:18,280 --> 00:29:20,720 విషయం ఏంటంటే, వాటిని నిర్వహించాలి. 480 00:29:20,800 --> 00:29:23,680 వాటిని మీరు నిర్వహించాలి. అది రెండేళ్ళు ఉండదు. 481 00:29:23,760 --> 00:29:26,080 -ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది. -ఏంటి? 482 00:29:26,160 --> 00:29:29,720 ఇక్కడ క్లార్జెస్టర్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉంది. బయోడిస్క్. 483 00:29:30,520 --> 00:29:34,720 ఈ అవరోధం తరువాత అసాధారణమైన హాస్యాస్పద అంచనా ధర చెప్పాడు. 484 00:29:35,480 --> 00:29:38,760 -నాకు అంచనా ధర చెబుతావా? -సరే. 485 00:29:39,280 --> 00:29:40,920 నీకు ఒక అంచనా ధర ఉందా? 486 00:29:42,800 --> 00:29:44,720 -2,50,000 పౌండ్లు. -లేదు, అంతకాదు. 487 00:29:44,800 --> 00:29:46,000 అంత ఉండాలి, కదా? 488 00:29:46,560 --> 00:29:50,080 అద్దానికి రెండుపొరల మెరుపు ఇంకా ప్రజల భవంతి నిబంధనలు, భద్రత, 489 00:29:50,160 --> 00:29:52,640 ఇక్కడకు వచ్చే జనం ఆరోగ్యం మరియు రక్షణ ఉంటుంది. 490 00:29:53,280 --> 00:29:56,120 నీ పెదాల కదలికతో నువ్వు మాట్లాడుతున్నావని తెలుసు, 491 00:29:56,200 --> 00:30:00,320 కానీ నువ్వు చెప్పిన ధరకు నా లోపల శుష్కించుకుపోవటమే తెలుస్తుంది, 492 00:30:00,400 --> 00:30:04,400 -2,50,000 పౌండ్లు. -అవును, సరే. 493 00:30:04,480 --> 00:30:08,680 అయితే, నేను అది రెండున్నర లక్షల పౌండ్లుగా అనువదించాను. 494 00:30:08,760 --> 00:30:09,600 అవును. 495 00:30:09,680 --> 00:30:12,880 ఇప్పటికే ఇక్కడ ఉన్న గోదామును ఉపయోగకరంగా మార్చేందుకు. 496 00:30:15,800 --> 00:30:16,720 ఆలెన్, 497 00:30:18,160 --> 00:30:21,160 నువ్వు ఈ చుట్టుపక్కల ఎస్ క్లాస్ కారులో తిరుగుతావు. 498 00:30:21,800 --> 00:30:24,200 నీ ఇంటికి హాయిగా వెళతావు. నేను హాయిగా అన్నా. 499 00:30:24,280 --> 00:30:26,280 -నీ డ్రైవర్ ఇంటికి తీసుకెళతాడు. -అవును. 500 00:30:26,880 --> 00:30:28,240 లేదు, అది సమస్య కాదు. 501 00:30:28,320 --> 00:30:31,720 -అది సమస్యే. అది చాలా డబ్బు. -అవును. అయిఉండాలి. 502 00:30:31,800 --> 00:30:35,360 అది విశ్లేషించాలి, సమీక్షించాలి. సరైన ధర అనుకుందాము. 503 00:30:35,440 --> 00:30:38,200 నేను తిరిగి వెళ్ళాలి. తేమ పరీక్షలు చేస్తున్నాం. 504 00:30:38,280 --> 00:30:40,400 ఈరోజు కొంచెం కోత పనులు చేయవచ్చేమో. 505 00:30:40,480 --> 00:30:42,160 అవును, అది పొడిగా ఉంటే. సరే. 506 00:30:44,920 --> 00:30:47,760 అన్నట్లు, అది పొడిగా ఉంది. 507 00:30:47,840 --> 00:30:50,000 -15.4 -అది సరిపోతుంది. 508 00:30:50,480 --> 00:30:51,560 మనం ఇది చేద్దాం! 509 00:31:06,120 --> 00:31:11,080 మా దుకాణంలో దొరికే బ్రెడ్ మీద ఇలా రాయాలి, "ఇందులో పురుగుల జాడలు ఉండవచ్చు," అని. 510 00:31:21,000 --> 00:31:24,960 నేను ఉన్న చోట, అది బాగుంది, కానీ మనం మధ్యలోకి చేరేసరికి 511 00:31:25,040 --> 00:31:28,320 ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. అక్కడ మందంగా, పొడుగ్గా ఉంది. 512 00:31:28,760 --> 00:31:31,240 ప్రపంచంలోనే అందమైన కంబైన్ డ్రైవర్, సైమన్. 513 00:31:31,720 --> 00:31:35,520 అతను ఒకసారి మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్ళి, గరిటెలు అడిగాడు. 514 00:31:35,600 --> 00:31:37,480 -ఏంటి? -ఒకసారి మెక్‌డొనాల్డ్స్‌కు 515 00:31:37,560 --> 00:31:40,040 వెళ్ళి, చాకులు, స్పూన్లు అడిగాడు. 516 00:31:47,960 --> 00:31:50,120 అవన్నీ ఎక్కడ ఉన్నాయి, అది పురుగుల దుమ్మా? 517 00:31:51,240 --> 00:31:54,880 పురుగు ఇలా అనడం ఊహించుకోండి, ఉన్నట్టుండి, "అయ్యో దేవుడా!" అని. 518 00:31:54,960 --> 00:31:57,440 లేదు. అది ఆ ఎర్ర దాని గుండా, తరువాత హాపర్, 519 00:31:57,520 --> 00:32:02,360 మీరు అనుకుంటారు, "అయ్యో, దేవుడా. ఇది దారుణం." ఆ తరువాత ఫ్యాన్ తిరిగి, 520 00:32:02,440 --> 00:32:05,480 మైళ్ళు పైకి ఎగురుతారు. మీరు అంగుళం, ఎగిరేది 20 అడుగులు, 521 00:32:05,560 --> 00:32:07,800 అది మనం ఆకాశంలోకి దూసుకెళ్ళడం లాంటిది. 522 00:32:07,880 --> 00:32:11,040 వేగంగా వెళ్ళిపడతారు, అంటారు, "నేను ఎగురుతున్నాను, నిజంగా," 523 00:32:11,120 --> 00:32:12,840 తరువాత ట్రైలర్‌లో ఉంటారు, 524 00:32:13,600 --> 00:32:18,400 తరువాత పిండి మిల్లులో తీసుకెళ్ళబడతారు, అక్కడ మిమ్మల్ని దంచుతారు. 525 00:32:18,480 --> 00:32:20,640 ఇది దారుణమైన ముగింపు. 526 00:32:20,720 --> 00:32:23,440 గోధుమలో ప్రోటీన్లు ఉండాలన్నారు. అది అందించాం. 527 00:32:23,520 --> 00:32:28,240 మనం వాళ్ళకు ప్రోటీన్లు అందించాము. మన బ్రెడ్‌ను, కీమా నాన్‌లా అనుకుంటారు. 528 00:32:29,280 --> 00:32:30,680 కీమా నాన్ ఏంటి? 529 00:32:31,360 --> 00:32:32,440 భారతీయ రెస్టారెంట్. 530 00:32:34,240 --> 00:32:36,600 ఎప్పుడూ భారతీయ రెస్టారెంట్‌కు వెళ్ళలేదా? 531 00:32:36,680 --> 00:32:37,680 వెళ్ళలేదు. 532 00:32:37,760 --> 00:32:40,360 ఈ రెస్టారెంట్లలో కూర దొరుకుతుంది. 533 00:32:40,440 --> 00:32:41,280 సరే. 534 00:32:42,960 --> 00:32:46,360 అంటే, అతను తన పాపాయిని ఆరోజు విదేశీగా వివరించాడు. 535 00:32:46,680 --> 00:32:48,000 ఆక్స్‌ఫర్డ్‌లో పుట్టాడు! 536 00:32:49,760 --> 00:32:52,760 నేను చిప్పింగ్ నోర్టన్‌లో పుట్టా, అలాగే నా కుటుంబం అంతా. 537 00:32:52,840 --> 00:32:56,320 నా కొడుకు ఆక్స్‌ఫర్డ్‌లో పుట్టాడు. తను విదేశీయుడు. 538 00:32:56,920 --> 00:32:57,880 అతను విదేశీయుడు. 539 00:33:02,400 --> 00:33:03,880 వర్షం ఆగిపోయింది. 540 00:33:06,600 --> 00:33:11,520 రెండు సుదీర్ఘ రోజుల తరువాత, గోధుమ పొలాల్లో మిగిలిన పనులు చేశాము. 541 00:33:13,440 --> 00:33:15,880 అయితే, ఇక్కడి సంప్రదాయం ప్రకారం, 542 00:33:15,960 --> 00:33:19,360 భద్రత అధికారి తన పని చేయడానికి వచ్చాడు. 543 00:33:27,040 --> 00:33:28,400 అవును. మాకు కొంత... 544 00:33:29,960 --> 00:33:30,800 సరే. 545 00:33:35,080 --> 00:33:38,000 ఏంటి? అతనిది 52వ పంటా? 546 00:33:38,080 --> 00:33:41,120 అంటే, 52... లేదు, అది 51. లేదు, నాకు 54 అని గుర్తుంది. 547 00:33:42,120 --> 00:33:44,640 అతనిని అడుగుతాను. నిజానికి, అర్థం లేదు, ఉందా? 548 00:33:47,760 --> 00:33:50,040 ప్రపంచ శ్రామికులారా, ఇదిగో వెళుతున్నాం. 549 00:33:51,840 --> 00:33:53,840 ఇది చూడండి. ఇప్పుడు ఇది ఉత్తమ బృందం. 550 00:33:54,320 --> 00:33:58,760 కంబైన్‌లో జెరాల్డ్. కేలెబ్ ఇంకా జెరెమీ ట్రాక్టర్ల మీద ఉన్నారు. 551 00:33:59,360 --> 00:34:01,200 మేము మొదలుపెట్టేముందు, 552 00:34:01,280 --> 00:34:06,600 సైమన్ కొత్త, అత్యాధునిక కంబైన్ జెరాల్డ్ వైపు శబ్దం చేయడం మొదలుపెట్టింది. 553 00:34:22,800 --> 00:34:25,080 హాయ్, జెరాల్డ్, నేను సైమన్‌ను. సమస్య ఏంటి? 554 00:34:41,160 --> 00:34:42,040 అంటే ఎలా... 555 00:34:43,880 --> 00:34:44,840 అది లోడ్ అంతే... 556 00:34:53,760 --> 00:34:56,600 ఇంటూ మార్క్ ఉంటుంది. అది నొక్కాలి అంతే. 557 00:35:08,160 --> 00:35:09,920 ఎస్కేప్ బటన్ నొక్కు. 558 00:35:10,960 --> 00:35:12,880 ఎస్కేప్ బటన్ నొక్కు, జెరాల్డ్. 559 00:35:22,200 --> 00:35:23,760 డిడ్లీ స్క్వాట్ పొలం. 560 00:35:26,280 --> 00:35:31,760 చివరకు పొలం సాంకేతిక నిపుణ పిల్లవాడు సమస్యను పరిష్కరించేందుకు వెళ్ళాడు. 561 00:35:36,280 --> 00:35:39,120 అది బిగుసుకుపోయి ఉంటుంది. ఒకటి ఆఫ్ చేయండి. 562 00:35:43,120 --> 00:35:48,640 సాయంత్రం అవుతుండగా, మేము గోధుమ చివరి కోత ముగించాము. 563 00:35:51,760 --> 00:35:55,280 సరే, అంతే. 2021 పంట వచ్చేసింది, 564 00:35:55,840 --> 00:35:58,640 ఇక ఇప్పుడు, ఆవులు! 565 00:36:08,600 --> 00:36:09,600 సరే. 566 00:36:10,440 --> 00:36:11,320 ఇక్కడ. 567 00:36:14,920 --> 00:36:17,960 -ఏమి చేస్తున్నావు? -దీనికి చేతితొడుగులతో సిద్ధమవుతున్నా. 568 00:36:18,040 --> 00:36:21,360 క్రియోసోట్ నా కళ్ళల్లో పడినప్పటి నుండి నాకది ఇష్టం లేదు. 569 00:36:21,440 --> 00:36:24,520 -మరీ సున్నితం, నమ్మలేకపోతున్నాను. -సున్నితం. 570 00:36:24,600 --> 00:36:26,120 -నువ్వు సున్నితం. -నేను కాను. 571 00:36:26,160 --> 00:36:27,760 నేను క్రియోసోట్ పట్టుకున్నా... 572 00:36:27,840 --> 00:36:31,880 నేను ఈ తరాల అంతరం చర్చను గంటల పాటు కొనసాగించగలను, 573 00:36:31,960 --> 00:36:35,960 కానీ నేను, కేలెబ్ కొత్త ఆవుల కోసం పొలం చుట్టూ కంచె వేయాలి. 574 00:36:37,040 --> 00:36:41,680 నాకు అతని మధ్య యుగం నాటి మనుషులను చంపే విధానంతో 575 00:36:41,800 --> 00:36:44,520 280 కంచె స్తంభాలు వేయడం నిజంగా నచ్చలేదు. 576 00:36:46,880 --> 00:36:47,680 పైకి. 577 00:36:51,840 --> 00:36:55,160 అందుకని, నేను అంతర్గత దహన యంత్రాన్ని అద్దెకు తీసుకున్నాను. 578 00:37:02,680 --> 00:37:05,640 ఇది ఏంటంటే, ఇది నీ పనికి ముగింపు. 579 00:37:06,880 --> 00:37:09,120 ఎందుకంటే సోలోట్రాక్ ఉండగా 580 00:37:10,440 --> 00:37:14,560 కంచె వేసేవాడిని ఎందుకు నియమించుకుంటాము? 581 00:37:14,640 --> 00:37:16,640 సరే. మంచి విషయం. 582 00:37:17,200 --> 00:37:19,400 సోలోట్రాక్. అది మీ సొంతంగా చేసుకుంటారు. 583 00:37:19,480 --> 00:37:22,360 -ఇవెలా పని చేస్తాయో నువ్వు వివరించాక. -నేనెళ్ళవచ్చా? 584 00:37:22,880 --> 00:37:24,800 ఇది ఎలా పని చేస్తుందో వివరించు. 585 00:37:24,880 --> 00:37:28,640 దాన్ని తిప్పి, అక్కడ నిలిపితే, మనం అది వెనుకకు తిప్పుదాము. 586 00:37:31,400 --> 00:37:32,200 ఆగు. 587 00:37:32,320 --> 00:37:37,520 యంత్రాన్ని సరైన స్థానంలోకి తీసుకొచ్చి, ఏదో వ్యక్తిగత సంరక్షక పరికరం పెట్టాక, 588 00:37:37,600 --> 00:37:38,680 మేము మొదలుపెట్టాము. 589 00:37:39,560 --> 00:37:41,760 సరే. అది దానిని కిందకు కొట్టాలి. 590 00:37:45,000 --> 00:37:47,360 ఇది భలే యంత్రం, కదా? 591 00:37:48,400 --> 00:37:49,200 చాలా బాగుంది. 592 00:37:50,600 --> 00:37:54,960 దీనితో స్విస్ సైనికుల చాకు కంటే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. 593 00:37:57,000 --> 00:37:59,200 వెళుతూ ఉండండి, వెళుతూ ఉండండి. 594 00:38:00,760 --> 00:38:03,640 -ఇక్కడ బిగుతుగా ఉందా? -అక్కడ ఇప్పుడంతా బిగుతుగా ఉంది. 595 00:38:04,480 --> 00:38:05,320 వెళుతూ ఉండండి. 596 00:38:07,160 --> 00:38:08,160 లాగి పట్టుకున్నారా? 597 00:38:09,160 --> 00:38:11,840 -అది తెగితే ఏమవుతుంది? -దెబ్బ తగులుతుంది. 598 00:38:19,160 --> 00:38:20,360 అది తొలగించేయనా? 599 00:38:21,560 --> 00:38:23,600 సురక్షిత శిరస్త్రాణం ధరించడం మంచి పని! 600 00:38:24,080 --> 00:38:27,640 నువ్వు సున్నితంగా ఉండడం మంచిదైంది. లేదా జెన్ ఎక్స్‌వా? నీవెవరు? 601 00:38:27,680 --> 00:38:30,800 -అంటే ఏంటి? -నువ్వు 20వ శతాబ్దంలో పుట్టావా? 602 00:38:30,880 --> 00:38:34,040 -అవును కదా? -కాదు. 1998. 603 00:38:34,600 --> 00:38:35,480 అది... 604 00:38:37,360 --> 00:38:40,160 20వ శతాబ్దం 20... లేదు, 2000 నుంచి, కదా? 605 00:38:40,200 --> 00:38:42,960 కాదు. చూడు, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. 606 00:38:44,000 --> 00:38:44,840 అవునా? 607 00:38:51,760 --> 00:38:54,560 తరువాతి రోజు, కంచె వేయడం పూర్తయింది, 608 00:38:54,640 --> 00:38:59,360 సరిగ్గా మన కొత్త డిడ్లీ స్క్వాట్ నివాసితులు వచ్చే సమయానికి. 609 00:39:01,960 --> 00:39:03,000 ఆకర్షణీయమైన లారీ. 610 00:39:03,520 --> 00:39:05,040 -అందంగా ఉంది, కదా? -అవును. 611 00:39:08,120 --> 00:39:09,000 విను! 612 00:39:12,040 --> 00:39:15,920 ఇది చూసేందుకు కేలెబ్ ఉండకపోవడం బాధాకరం. అతని కుక్క కోసం ఇంటికెళ్ళాడు. 613 00:39:17,000 --> 00:39:18,000 చాలా దారుణం. 614 00:39:19,040 --> 00:39:19,880 సరే. 615 00:39:19,960 --> 00:39:20,960 స్వాగతం. 616 00:39:22,040 --> 00:39:23,960 చూడండి, మీ కొత్త ఇల్లు. 617 00:39:24,480 --> 00:39:26,080 -అయితే, అది దూడ. -అవును. 618 00:39:27,920 --> 00:39:29,600 -ఇది దానికి తల్లా? -అవును. 619 00:39:31,160 --> 00:39:33,480 వాటిని చూడండి. ఇది మహత్తరమైనది. 620 00:39:36,080 --> 00:39:37,680 అయితే, నువ్వు ఆడ ఆవువు. 621 00:39:38,920 --> 00:39:41,520 నువ్వు మగ ఆవువు. ఆడ ఆవు. 622 00:39:43,320 --> 00:39:44,560 ఆడ ఆవు. 623 00:39:45,600 --> 00:39:48,160 నాకు ఎప్పుడూ ఆవులంటే కొంచెం భయంగా ఉండేది, 624 00:39:48,280 --> 00:39:51,760 కానీ మీరు భయంగా లేరు. నీ జుట్టు చూడు. 625 00:39:53,080 --> 00:39:54,800 నేను అది పరిశీలించాను, నిజానికి, 626 00:39:55,360 --> 00:39:59,600 ప్రతి సంవత్సరం చాలామంది తమ ఆవులను చంపుతారు. చాలామంది. 627 00:40:00,080 --> 00:40:03,680 అంటే, ఎక్కువగా సంచారులు, అది కచ్చితంగా పరవాలేదు. 628 00:40:06,480 --> 00:40:09,800 ఇది పూర్తిగా సంతృప్తికరంగా ఉంది. గొర్రెలు వచ్చినప్పుడూ మొదట 629 00:40:09,880 --> 00:40:13,040 సంతృప్తికరంగా ఉంది, తరువాత అసంతృప్తిగా మారాయని తెలుసు, 630 00:40:13,120 --> 00:40:16,360 కానీ ఇవి ఇబ్బందికరంగా ఉంటాయని అనిపించడం లేదు. 631 00:40:18,200 --> 00:40:19,640 వచ్చేసారి 632 00:40:19,680 --> 00:40:20,760 ఆవులు బయటకొచ్చేశాయి! 633 00:40:20,840 --> 00:40:22,000 అయ్యో! 634 00:40:22,480 --> 00:40:24,200 దేవుడా, ఎక్కడ ఉన్నావు? ఫెర్న్! 635 00:40:25,040 --> 00:40:26,400 అబ్బా! 636 00:40:57,560 --> 00:40:59,560 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 637 00:40:59,640 --> 00:41:01,640 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి