1 00:00:08,119 --> 00:00:13,080 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:13,640 --> 00:00:14,800 ఇది నిండు వేసవి, 3 00:00:14,880 --> 00:00:18,199 ఇప్పుడు పొలంలో మామూలు రోజుల్లో ఇలా ఉంటుంది. 4 00:00:21,760 --> 00:00:24,920 నేను ఉదయం 6:30కు లేచి, కాఫీ తాగి, 5 00:00:25,000 --> 00:00:27,960 కోళ్ళను వాటి గూళ్ళనుండి బయటకు వదులుతాను. 6 00:00:28,039 --> 00:00:29,039 శుభోదయం. 7 00:00:29,120 --> 00:00:32,840 తిరిగి వెళ్ళేటప్పుడు, భోజనానికి పుట్టగొడుగులు తీసుకువెళతాను. 8 00:00:32,920 --> 00:00:35,439 ఆ తరువాత చేపలకు ఆహారం వేస్తాను. 9 00:00:36,960 --> 00:00:37,960 ఉదయం 8.45 10 00:00:38,039 --> 00:00:40,960 తిరిగి ఇంటికి వచ్చి, టమోటా సాస్ తయారీ మొదలుపెడతాను, 11 00:00:41,039 --> 00:00:43,359 నేను వ్యవసాయ దుకాణం కోసం చేస్తున్నాను. 12 00:00:43,439 --> 00:00:45,920 కొన్ని మిరపకాయలు, కొంచెం తాజా కొత్తిమీర వేసి, 13 00:00:46,000 --> 00:00:48,000 తక్కువ నుండి అతి తక్కువ మంటపై, 14 00:00:49,079 --> 00:00:53,759 శీతాకాలంలో విరగని కంచెను బాగు చేసేవరకు ఉంచుతాను. 15 00:00:54,399 --> 00:00:55,240 ఉదయం 10.20 16 00:00:55,320 --> 00:00:59,320 ఆ తరువాత నేను నాటిన అడవిపూలను కత్తిరించాను ఎందుకంటే తోటమాలులు చేసేది అదే, 17 00:00:59,399 --> 00:01:01,679 మొక్కలు అందంగా కనిపించే వరకు ఆగి, 18 00:01:01,759 --> 00:01:04,879 వాటిని కత్తిరించేస్తారు, ఇక అప్పుడవి అందంగా కనిపించవు. 19 00:01:06,000 --> 00:01:09,000 దీని తరువాత, కొన్ని కూరగాయలు కోశాను, అవి మా అట్లాంటా 20 00:01:09,079 --> 00:01:10,920 వినియోగదారులకు లీసా అమ్ముతుంది. 21 00:01:11,039 --> 00:01:14,920 కొన్ని రేవలచిన్ని మొక్కలు కూడా కనిపించాయి, అవి కూడా తీసుకున్నాను. 22 00:01:16,120 --> 00:01:18,280 అవి తీసుకుని దుకాణానికి వెళ్ళాను. 23 00:01:18,400 --> 00:01:20,640 ఈ రేవలచిన్ని ఆకులు కడగాలి. 24 00:01:20,719 --> 00:01:23,920 నిన్న కోసినవన్నీ పడేస్తాను, 25 00:01:24,000 --> 00:01:27,560 ఎందుకంటే అవి అమ్ముడుపోలేదు, ఈమధ్య ఎవరూ కూరగాయలు ఇష్టపడడం లేదు. 26 00:01:32,280 --> 00:01:35,319 ఉదయం 11.50 27 00:01:38,719 --> 00:01:44,520 తేనెటీగలను పరిశీలించడానికి వెళ్ళేముందు టమోటా సాస్‌ను ఒకసారి తిప్పేసి వెళతాను. 28 00:01:44,599 --> 00:01:46,280 ఇదిగోండి, వెళ్ళిపోండి. 29 00:01:47,359 --> 00:01:49,120 ఇంకా గొర్రెలు, గొర్రెపిల్లలు. 30 00:01:50,520 --> 00:01:53,640 ఆ తరువాత రోజులో ముఖ్యమైన పని ప్రారంభిస్తాను. 31 00:01:53,719 --> 00:01:55,439 ఎప్పుడూ ఒకటి తిరుగుతుంటుంది, 32 00:01:55,520 --> 00:01:59,879 ఈరోజు, నేను గడ్డిని, గొర్రె పేడను కొట్టం నుండి తొలగించాలి. 33 00:01:59,960 --> 00:02:03,000 కానీ నా ట్రాక్టర్ ముందు బకెట్ లేకపోవడంతో, 34 00:02:03,079 --> 00:02:06,319 కేలెబ్‌ను మరో కొట్టం నుండి మంచు తొలగించే నాగలిని తెమ్మన్నాను. 35 00:02:06,400 --> 00:02:09,919 -అది మీరే చేసుకోవచ్చు కదా? -లంబోర్ఘిని ఇందులో పట్టదు. 36 00:02:10,000 --> 00:02:12,319 వెంటనే, అతని అసంతృప్తి నాకు తెలిసిపోయింది. 37 00:02:12,400 --> 00:02:15,520 అతను నా ట్రాక్టర్ చాలా సంక్లిష్టమైనదని అనుకుంటాడు. 38 00:02:15,599 --> 00:02:16,960 మీ ట్రాక్టర్ చెత్తది. 39 00:02:17,960 --> 00:02:21,240 ఆ తరువాత, నేను ఇంతకుముందు కోసుకొచ్చిన పుట్టగొడుగులను 40 00:02:21,319 --> 00:02:24,520 మీగడతో కలిపి, సోర్‌డో టోస్ట్‌తోపాటు నా తోటలోని 41 00:02:24,599 --> 00:02:26,599 కొత్తిమీర వేసి వండి తింటుంటే, 42 00:02:26,680 --> 00:02:28,599 నా సహచరుల నుండి ఫోన్ వచ్చింది. 43 00:02:28,719 --> 00:02:32,000 వాళ్ళు నా గొర్రెలు తప్పించుకుని రోడ్డు పైన ఉన్నాయన్నారు. 44 00:02:33,560 --> 00:02:37,400 అందుకని, నేను అక్కడికి వెళ్ళాక గొర్రెలు ఏవీ తప్పించుకోలేదని తెలిసింది. 45 00:02:38,439 --> 00:02:42,400 ఇక ఇప్పుడు నాగలి ట్రాక్టర్ ముందు అమర్చబడింది కాబట్టి, 46 00:02:42,439 --> 00:02:44,800 నేను గొర్రెల కొట్టముకు వెళ్ళిపోయాను, 47 00:02:44,879 --> 00:02:47,439 వెంటనే ఇది అందులోనూ పట్టదని తెలిసింది. 48 00:02:48,280 --> 00:02:49,960 అబ్బా. 49 00:02:50,039 --> 00:02:52,599 అప్పుడు దానికి బదులు 80 ఏళ్ళ పాత డెత్‌ట్రాప్‌ను 50 00:02:52,680 --> 00:02:55,879 లీసా ట్రాక్టర్ వెనుక అమర్చి ఉపయోగించాను. 51 00:02:55,960 --> 00:02:57,920 సాయంత్రం 6.25 52 00:02:58,000 --> 00:03:02,599 ఆలస్యం అయిపోతుంటే, చేపలకు మళ్ళీ ఆహారం వేసి, గుడ్లను సేకరించేందుకు వెళ్ళే ముందు, 53 00:03:02,680 --> 00:03:07,400 టమోటా సాస్‌లో కొంచెం మసాలాలు వేసేందుకు త్వరగా ఇంటికి వెళ్ళాను. 54 00:03:08,599 --> 00:03:11,840 ఆ తరువాత కొంచెం విశ్రమించాను, ఎందుకంటే నాకు తెలుసు... 55 00:03:13,319 --> 00:03:15,719 త్వరలోనే చాలా పని ఉంటుందని. 56 00:03:21,159 --> 00:03:25,560 అధ్యాయం 8 పంట కోతలు 57 00:03:29,920 --> 00:03:32,759 మా కొత్త బిజీ జీవితాలలో అదనపు పనులలో ఒకటి 58 00:03:32,840 --> 00:03:37,199 చేనులో ప్రతిరోజు తేమ పరీక్ష చేయడం. 59 00:03:37,280 --> 00:03:42,400 చార్లీ సెలవులకు వెళ్ళడంతో, ఆ పని నాపై, కేలెబ్‌పై పడింది. 60 00:03:42,479 --> 00:03:45,079 -ఇక, అనుభవశాలియైన పాత రైతు... -అవును. 61 00:03:45,159 --> 00:03:49,599 ...కాయను కొరికి దానిలో ఎంత తేమ ఉందో చెప్పేయగలడు, కదా? 62 00:03:49,680 --> 00:03:53,039 అవును, వాళ్ళు ఇలా చేస్తారు. నేను వాళ్ళు ఇలా చేయడం చూశాను. 63 00:03:53,120 --> 00:03:55,800 అది తెరుస్తారు, అది చేసేటప్పుడు గంభీరంగా ఉంటారు. 64 00:03:55,879 --> 00:03:57,479 ఇలా వేస్తే, అవి చూపిస్తాయి... 65 00:03:59,319 --> 00:04:00,560 "12 ఉంది." 66 00:04:00,639 --> 00:04:03,719 -వాళ్ళు సరిగ్గా చెబుతారు, వారికి తెలుసా? -ఖచ్చితంగా. 67 00:04:03,800 --> 00:04:06,759 నేను అలా చెప్పలేను, ఎందుకంటే అనుభవశాలియైన రైతును కాను. 68 00:04:06,840 --> 00:04:09,240 -కాను. -నువ్వు చెప్పలేవు, పిల్లకుంకవు. 69 00:04:09,319 --> 00:04:10,759 అందుకని మనం యంత్రం తెచ్చాము. 70 00:04:10,840 --> 00:04:12,439 ఇది ఎప్పుడైనా ఉపయోగించారా? 71 00:04:13,240 --> 00:04:14,560 ఆలోచించనీ. 72 00:04:14,639 --> 00:04:18,199 అక్కడ ఉన్న ఆ భాగం చూశారా, ఇందులో ఆవాలను నింపాలి. 73 00:04:21,800 --> 00:04:22,759 నింపాలా? 74 00:04:22,800 --> 00:04:26,240 "కొన్ని గంటల తరువాత" అని ఇప్పుడు మనం శీర్షిక పెట్టాలా? 75 00:04:27,879 --> 00:04:30,519 కొన్ని గంటల తరువాత... 76 00:04:31,360 --> 00:04:32,519 ఇంకొన్ని ఉన్నాయా? 77 00:04:35,199 --> 00:04:37,600 ఇలా దానిలో వేయాలి, చూడండి. ఆ తరువాత... 78 00:04:38,360 --> 00:04:40,800 అయితే, ఇది ఆరు కంటే తక్కువ చూపిస్తే, 79 00:04:40,920 --> 00:04:43,120 చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టే. వాటిని కోయలేము. 80 00:04:43,199 --> 00:04:44,759 -సరే. -అది ఎక్కువ ఉంటే... 81 00:04:44,800 --> 00:04:46,240 -తొమ్మిదికంటే. -...తొమ్మిది. 82 00:04:46,319 --> 00:04:48,120 తడిగా ఉన్నాయని, వాళ్ళు తీసుకోరు. 83 00:04:48,199 --> 00:04:50,920 మీరు సిద్ధమేనా? సరే, ఇది పరీక్షిస్తుంది. 84 00:04:54,240 --> 00:04:57,360 అయితే, 8 శాతం తేమ ఉంది, అంటే ఏంటి? 85 00:04:57,480 --> 00:04:59,800 మనవి బాగున్నాయి. మనం ఇక కోసేయవచ్చు. 86 00:05:01,040 --> 00:05:02,639 ఇక కోసేద్దాం! 87 00:05:04,079 --> 00:05:07,439 కానీ, నిజానికి, మేము కోయలేకపోయాం. 88 00:05:08,639 --> 00:05:12,600 ఆవాల కోతకు, మాకు కంబైన్ హార్వెస్టర్ కావాలి, 89 00:05:12,680 --> 00:05:14,120 నా దగ్గర అది లేదు 90 00:05:14,199 --> 00:05:16,680 ఎందుకంటే దాని ఖరీదు రెండున్నర లక్షల పౌండ్లు. 91 00:05:16,759 --> 00:05:18,360 అందుకే అద్దెకు తీసుకుంటాను. 92 00:05:19,120 --> 00:05:22,240 సమస్య ఏంటంటే, ఈ ప్రాంతంలోని ప్రతి రైతు 93 00:05:22,319 --> 00:05:25,800 ఈ ఉదయం పొలాలకు వెళ్ళి తేమ పరీక్షించి, 94 00:05:25,879 --> 00:05:28,560 ఇదే నిర్ణయానికి వస్తారు, 95 00:05:28,639 --> 00:05:30,800 వాళ్ళందరూ అద్దెకు తీసుకోవాలనుకుంటారు. 96 00:05:34,319 --> 00:05:37,759 అక్కడ ఆఫీసులో నాకు ఇంకా భయానక విషయాలు తెలిసాయి. 97 00:05:39,240 --> 00:05:40,240 మూడు రోజులా? 98 00:05:40,800 --> 00:05:42,759 దానికంటే ముందు ఏం చేయలేమా? 99 00:05:42,840 --> 00:05:44,680 లేదు, నా దగ్గర అతని నంబరు ఉంది. 100 00:05:46,840 --> 00:05:48,480 అవును, మీరు సరిగ్గా ఊహించారు. 101 00:05:48,560 --> 00:05:49,879 లేదు, నాకు తెలుసు. 102 00:05:51,959 --> 00:05:54,920 అతను ముందు తన పొలం చేసుకుంటున్నాడు. 103 00:05:57,240 --> 00:05:59,720 సరే, మంచిది, వద్దు, ధన్యవాదాలు. 104 00:06:05,800 --> 00:06:10,560 నేను బయటకు వెళ్ళి చూసినప్పుడల్లా, నిజానికి నాకు ఈ పని కొత్త అని 105 00:06:10,639 --> 00:06:14,040 స్పష్టంగా గుర్తు చేస్తుంది. 106 00:06:14,519 --> 00:06:17,839 చూడండి, కంబైన్ అక్కడొకటి, అక్కడొకటి ఉంది. 107 00:06:19,800 --> 00:06:21,360 అవును, మరొకటి కూడా ఉంది. 108 00:06:21,439 --> 00:06:23,759 ప్రతి పొలంలో ఒక కంబైన్ ఉంది. 109 00:06:27,040 --> 00:06:30,120 మిట్ట మధ్యాహ్నానికి కూడా, నాకు ఏదీ దొరకలేదు. 110 00:06:30,199 --> 00:06:32,319 ...37, 42... 111 00:06:32,399 --> 00:06:37,399 కానీ కేలెబ్‌కు తన స్నేహితుడి రూపంలో జాక్‌పాట్ తగిలింది. అతని అసలు పేరు 112 00:06:37,480 --> 00:06:40,560 సైమన్ అయినా నేను "దేవుడు" అంటాను. 113 00:06:41,199 --> 00:06:44,199 అది వస్తే కనుక... నావి చేయాల్సినవి రెండు పొలాలే ఉన్నాయి, 114 00:06:44,279 --> 00:06:46,879 అందుకని, నావి ఈ సాయంత్రానికి ముగిస్తాను. 115 00:06:46,959 --> 00:06:47,800 సరే. 116 00:06:47,879 --> 00:06:50,040 ఆ తరువాత రేపు మీవి చేస్తాను. 117 00:06:50,120 --> 00:06:51,920 తరువాత కోతలు మొదలుపెట్టవచ్చు. 118 00:06:54,759 --> 00:06:56,079 మరుసటి రోజు ఉదయం, 119 00:06:57,120 --> 00:07:00,959 కంబైన్ హర్వెస్టర్ సమస్య పరిష్కారమయ్యాక, ఇక పనిలోకి దిగాల్సిన సమయం. 120 00:07:01,040 --> 00:07:03,399 -ఇది బాగుంది. -అవును, ఈ రోజు చూడండి. 121 00:07:03,480 --> 00:07:04,319 అవును. 122 00:07:08,240 --> 00:07:10,879 ట్రాక్టర్లు ఇటువైపునుండి రోజంతా వస్తూనే ఉంటాయి, 123 00:07:10,959 --> 00:07:14,040 అందుకని సులుభతరమైన జీవితానికి ఈ స్తంభాన్ని జరుపుతాను. 124 00:07:17,720 --> 00:07:20,920 ఇది చాలా... అవును, నేను అదే అంటున్నాను. 125 00:07:21,000 --> 00:07:23,759 -మీరు అది ఎత్తలేదు. -ఎత్తాను... 126 00:07:27,240 --> 00:07:29,439 సరే, ఇది నీకు ముఖ్యమైన రోజు, లంబో. 127 00:07:30,680 --> 00:07:32,920 మేము దీనికోసమే ఎదురు చూస్తున్నాము. 128 00:07:41,159 --> 00:07:42,480 8.9. 129 00:07:44,000 --> 00:07:45,759 నేను వెళ్ళి దాన్ని జత పరుస్తాను. 130 00:07:47,399 --> 00:07:48,759 సంవత్సరమంతా 131 00:07:48,840 --> 00:07:51,600 కేలెబ్ ట్రాక్టర్లకు వాటిని జతచేయడం చూశాక, 132 00:07:51,680 --> 00:07:56,759 నా లంబోకు అద్దె ట్రయిలర్‌ను జత చేయడంలో సమస్యేమీ ఉండదనుకున్నాను. 133 00:08:01,720 --> 00:08:05,600 నేను అది నొక్కుతాను, తరువాత అది, ఆ తరువాత అది కాదు. 134 00:08:12,600 --> 00:08:14,800 ఇది ఖచ్చితంగా బయటకు రాదు. 135 00:08:14,879 --> 00:08:17,160 నేను ఏదో చేయడం మర్చిపోయినట్టు ఉన్నాను. 136 00:08:17,240 --> 00:08:18,560 నేను ఏం మర్చిపోయాను? 137 00:08:19,959 --> 00:08:20,839 అది కాదు. 138 00:08:21,600 --> 00:08:23,439 ఇక ఒకటే పరిష్కారం. 139 00:08:24,399 --> 00:08:25,959 అది కేలెబ్‌ను చేయమనాలి. 140 00:08:26,040 --> 00:08:28,279 నిజానికి, ఆగండి! ఆగండాగండి, ఆగండి! 141 00:08:30,439 --> 00:08:32,440 సరే, అంతా సిద్ధమైంది. 142 00:08:34,480 --> 00:08:37,000 దానితో, మేము వ్యవసాయ దుకాణానికి 143 00:08:37,080 --> 00:08:39,879 దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాము. 144 00:08:42,639 --> 00:08:46,159 ఈరోజు శుక్రవారం, ఇప్పుడు 11:40 అయింది. 145 00:08:46,240 --> 00:08:50,159 ఆదివారం ఉదయం వాతావరణంలో మార్పు ఉండబోతుంది. 146 00:08:50,240 --> 00:08:55,440 అందుకని, మేము నాలుగు రోజుల కోతపనిని రోజున్నరలో పూర్తిచేయాలి. 147 00:08:57,080 --> 00:08:58,840 ఈ రోజు చాలా కష్టపడాలి. 148 00:09:07,720 --> 00:09:09,960 నా ఏసీ పని చేయడం లేదు. 149 00:09:10,039 --> 00:09:12,840 నాకు చాలా పని ఉండడంతో దాన్ని బాగు చేయలేకపోయాను. 150 00:09:12,879 --> 00:09:15,240 బహుశా అది అక్కడో, లేదా అక్కడో ఉండాలి. 151 00:09:15,960 --> 00:09:17,279 అది బాగుంది, అవును. 152 00:09:17,720 --> 00:09:21,440 డిడ్లీ స్క్వాట్ వ్యవసాయ దుకాణం ఇటువైపు 153 00:09:25,960 --> 00:09:30,360 అయితే, ఈరాత్రికి రాత్రంతా చేయాలి, అవును. 154 00:09:30,440 --> 00:09:32,600 అక్కడ, అక్కడ టాయిలెట్ పేపర్లు ఉన్నాయి. 155 00:09:32,639 --> 00:09:35,720 మీ దగ్గర అవి అయిపోతే, నాకు తెలియచేయండి, సరేనా? 156 00:09:35,759 --> 00:09:38,200 -నిజంగానే టాయిలెట్ పేపర్లు తెచ్చావా? -హా. 157 00:09:38,639 --> 00:09:41,200 అవసరమైనప్పుడు అవి దొరక్కపోవడం మొదటిసారేం కాదు. 158 00:09:41,279 --> 00:09:42,200 చూడు! 159 00:09:43,759 --> 00:09:45,879 మన కంబైన్ హార్వెస్టర్ వచ్చేసింది. 160 00:09:50,639 --> 00:09:51,639 అది వచ్చేసింది. 161 00:09:54,600 --> 00:09:56,600 -అతను సైమన్. -అతను సైమన్. 162 00:10:09,360 --> 00:10:12,759 అతను మీకు ఇది ఎలా చేయాలో చెప్పాడా? వెళుతూ వివరించాలా? 163 00:10:12,840 --> 00:10:13,639 అవును. 164 00:10:14,720 --> 00:10:18,759 ఆ తరువాత ఇంకా ఒత్తిడిని పెంచే విషయాన్ని చర్చించుకున్నాం. 165 00:10:18,840 --> 00:10:22,639 ఇది బార్లీ, ఆవ పంటలు ఒకేసారి సిద్ధమైన 166 00:10:22,759 --> 00:10:24,519 అసాధారణ సంవత్సరం. 167 00:10:24,639 --> 00:10:27,120 -చాలా. ప్రత్యేకమైనది. -చాలా అసాధారణమైనది. 168 00:10:27,200 --> 00:10:31,879 -సాధారణంగా, బార్లీ సిద్ధమయ్యేది... -రెండు, మూడు వారాలు ముందే, అవును. 169 00:10:32,000 --> 00:10:33,519 -ఇంకా ఆవాలు... -అవును. 170 00:10:33,600 --> 00:10:35,879 -అయితే ఇది పొడి వసంతమా? -అవును. 171 00:10:52,600 --> 00:10:53,759 ఇదిగో వస్తుంది. 172 00:11:02,000 --> 00:11:03,600 మనం దూరంగా ఉన్నాం. 173 00:11:09,279 --> 00:11:10,919 నా మొదటి పంట. 174 00:11:14,480 --> 00:11:16,919 కంబైన్లు, అవి చాలా తెలివైనవి, కదా? 175 00:11:17,000 --> 00:11:18,159 అవి అద్భుతమైనవి. 176 00:11:18,240 --> 00:11:20,759 సరిగ్గా చెప్పావు, అంటే, అవి వాటిని కొసేసి, 177 00:11:20,840 --> 00:11:23,200 కాయలను తెరిచి, ఆ చిన్న వాటిని తీసి-- 178 00:11:23,279 --> 00:11:26,000 ఆ భారీ యంత్రం ఆ చిన్న గింజలను బయటకు తీసి అంటుంది, 179 00:11:26,080 --> 00:11:29,960 "అది అవసరం లేదు, అది అవసరం లేదు అది వద్దు. కానీ అది కావాలి." 180 00:11:30,039 --> 00:11:33,440 అది ఎన్ని గింజలను తీసిందో లెక్కిస్తుంది. 181 00:11:33,519 --> 00:11:37,080 అది కేవలం... వ్యవసాయం అద్భుతమైనది, కదా? 182 00:11:37,159 --> 00:11:39,279 ఉత్సాహం ఉరకలేస్తుంది, ఉత్సాహంగా ఉంది. 183 00:11:39,360 --> 00:11:42,960 ఈరాత్రి మూడింటికి రండి, ఉదయం రండి. నేను కొనసాగుతూనే ఉంటాను. 184 00:11:43,039 --> 00:11:44,600 మీరేమో వేళాడిపోయి ఉంటారు. 185 00:11:47,480 --> 00:11:50,360 కంబైన్ నిండిపోవస్తుంటే, 186 00:11:51,360 --> 00:11:53,559 కేలెబ్ తన స్థానంలోకి యుక్తిగా చేరాడు. 187 00:11:57,960 --> 00:11:59,519 అంతే, అక్కడే అలాగే ఉండు. 188 00:12:03,159 --> 00:12:05,519 అది నా పంట మొదటి దిగుబడి. 189 00:12:09,480 --> 00:12:13,279 కంబైన్ నుండి సామర్థ్యానికి తగ్గ రెండు లోడ్లు నింపుకున్నాక... 190 00:12:19,240 --> 00:12:21,759 దాన్ని దించేందుకు గిడ్డంగికి వెళ్ళాడు. 191 00:12:24,240 --> 00:12:28,000 తను తన 19వ శతాబ్దపు ట్రయిలర్‌తో కుస్తీపడుతుండగా... 192 00:12:29,679 --> 00:12:31,000 దేవుడా. 193 00:12:34,440 --> 00:12:37,919 ...నా మొదటి లోడును నింపడానికి మానసికంగా సిద్ధపడుతున్నాను. 194 00:12:39,759 --> 00:12:41,080 నేను వెనుకగా ఉన్నాను. 195 00:12:43,759 --> 00:12:48,360 అతని పసుపు పచ్చ లైటు వెలగింది, అంటే దాని ట్యాంకు 80 శాతం నిండినట్టు. 196 00:12:48,759 --> 00:12:53,399 నేను వెళుతున్నాను. ఇదే ఆ తరుణం. 197 00:12:55,519 --> 00:12:57,200 నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. 198 00:12:57,279 --> 00:12:59,919 వేగంగా వెళ్ళకూడదు, వద్దు, వేగంగా వెళ్ళను. 199 00:13:05,720 --> 00:13:08,840 ఇంకాస్త వెనుకకు వెళ్ళాలి. ఇంకా వెనుకకు, ఇంకా వెనుకకు. 200 00:13:09,840 --> 00:13:12,320 అంతే, నేను మొదట వెనుక నింపుతాను. 201 00:13:12,399 --> 00:13:14,919 ఒక కన్ను అటు వేయాలి, మరో కన్ను ఇటు వేయాలి. 202 00:13:15,000 --> 00:13:16,279 నేను పావురం అవ్వాలి. 203 00:13:17,080 --> 00:13:18,879 అది ఆగిపోయింది. 204 00:13:19,720 --> 00:13:20,960 అయ్యో, నేను ఆగిపోయాను. 205 00:13:21,039 --> 00:13:22,159 వెళుతూ ఉండండి. 206 00:13:22,240 --> 00:13:25,000 నేను అలా చేయలేను. అయ్యో, వెళ్ళలేను. 207 00:13:25,080 --> 00:13:27,600 నేను ముందుకు ఉండాలి. 208 00:13:27,679 --> 00:13:30,919 ఒక్క నిమిషం, నేను ఏం చేయాలి? నెమ్మదిగా వెళ్ళాలి. 209 00:13:31,720 --> 00:13:33,399 సిద్ధంగా, స్థిరంగా... 210 00:13:33,480 --> 00:13:36,559 అయ్యో, పడిపోతున్నాయి, ఛ. 211 00:13:37,559 --> 00:13:40,519 బాగా చేశారు, అవి చాలా మటుకు మధ్యలోకి పడ్డాయి. 212 00:13:40,600 --> 00:13:42,759 దేవుడా, అది కష్టమైనది! 213 00:13:44,039 --> 00:13:46,559 అంతా తారుమారుగా ఉంది, అంటే నేను ఇక్కడ, 214 00:13:46,639 --> 00:13:49,519 నా భుజం పైనుండి చూసి, "అది వెనుక ఉంది" అనుకుంటా. 215 00:13:49,960 --> 00:13:52,279 నేను నెమ్మదిగా వెళ్ళాలి. 216 00:13:52,360 --> 00:13:54,840 అది వెనుక ఉంటే, నెమ్మదిగా వెళ్ళాలి. 217 00:13:55,720 --> 00:13:58,159 ముందు ఉంటే, వేగంగా వెళ్ళాలి. 218 00:14:01,480 --> 00:14:04,559 సంతోషకరంగా, తరువాతిసారి వెళ్ళినప్పుడు ఏ అడ్డంకులు లేవు. 219 00:14:05,440 --> 00:14:06,759 అంతా బాగా చేయగలిగాను. 220 00:14:07,799 --> 00:14:10,480 ఈ రేస్ డ్రైవర్లందరూ నిర్దిష్టమైన డ్రైవింగ్ గురించి 221 00:14:10,559 --> 00:14:13,399 ఆ పదానికి అర్థం తెలియకపోయినా మాట్లాడుతుంటారు. 222 00:14:17,000 --> 00:14:19,840 నేను నా లోడును దించేందుకు వేగంగా వెళ్ళాను, 223 00:14:19,919 --> 00:14:22,799 ట్రాక్టర్లు ట్రాఫిక్‌ను నిరోధించడంపై ఎన్నో ఏళ్ళుగా 224 00:14:22,879 --> 00:14:25,200 ఫిర్యాదు చేస్తుండడం గురించి తెలిసినా, 225 00:14:25,679 --> 00:14:29,080 నేను ఇప్పుడు ట్రాఫిక్‌ను అడ్డుకుంటున్న ట్రాక్టర్‌లో ఉన్నాను. 226 00:14:30,080 --> 00:14:32,480 మీరంతా వ్యవసాయ దుకాణం దగ్గర ఆగిపోయిఉంటే, 227 00:14:32,559 --> 00:14:35,080 ఇక్కడ ఇరుక్కుపోయేవారు కాదు, కదా? 228 00:14:36,759 --> 00:14:40,840 అక్కడ పొలం దగ్గర, ధాన్యాన్ని వేగంగా దించడం ముఖ్యం, 229 00:14:40,919 --> 00:14:45,519 అప్పుడు కంబైైన్ తిరిగి నిండేలోపు, నేను పొలానికి తిరిగి వెళ్ళగలను. 230 00:14:46,399 --> 00:14:47,440 మంచిది. 231 00:14:47,519 --> 00:14:51,720 తరువాత, వెనుకకు... ఒక్క నిమిషం. నేను అటువైపుకు వెళితే. 232 00:14:53,840 --> 00:14:54,960 వెనుకకు... 233 00:15:03,679 --> 00:15:04,879 సరే. 234 00:15:06,120 --> 00:15:07,879 నేను తప్పుగా తిప్పాను. 235 00:15:11,200 --> 00:15:14,120 నేను వెనుకకు వెళితే, దారి కుడివైపు ఉంటుంది. 236 00:15:14,200 --> 00:15:15,159 అవును, అంతే. 237 00:15:21,080 --> 00:15:22,080 దేవుడా. 238 00:15:23,759 --> 00:15:25,919 ఆగు. దృష్టి పెట్టు, జెరెమీ. 239 00:15:26,000 --> 00:15:27,840 అటు వెళితే, వెనుక బయటకు ఉంటుంది. 240 00:15:33,159 --> 00:15:36,799 అబ్బా, ఇది అసాధ్యంగా ఉంది. 241 00:15:36,879 --> 00:15:41,120 ఆరుసార్లు ప్రయత్నించాక, వాటిని సులభంగా వీడియోలో తొలగించేస్తారు, 242 00:15:42,360 --> 00:15:46,120 అత్యంత ఆధునిక అద్దె ట్రయిలర్ లోపలకు వెళ్ళింది. 243 00:15:47,639 --> 00:15:48,960 పోసేస్తున్నాను. 244 00:15:56,360 --> 00:15:58,200 అయ్యో, ఛ, ఛ. 245 00:15:58,279 --> 00:16:01,399 దేవుడా, అది అదృష్టం. నేను ఈ విషయం కేలెబ్‌కు చెప్పను. 246 00:16:05,559 --> 00:16:07,039 వాతావరణం మారకపోవడంతో, 247 00:16:07,120 --> 00:16:10,559 మేము కలిసికట్టుగా వీలైనంత భూమిలో పంటను కోశాము. 248 00:16:19,519 --> 00:16:24,519 సరే, ఈ పొలం, నా మ్యాప్ ప్రకారం 54.8 ఎకరాలు ఉంది, 249 00:16:24,600 --> 00:16:26,919 మంచి వాతావరణం ఉండి ఉంటే, 250 00:16:27,000 --> 00:16:31,799 23,500 పౌండ్ల విలువైన ఆవాలు పండేవి. 251 00:16:31,879 --> 00:16:33,759 ఇది అంత ఉంటుందని అనుకోను. 252 00:16:33,840 --> 00:16:37,159 చార్లీకి ఫోన్ చేసి అడగాలని ఉంది, కానీ అతను సెలవులో ఉన్నాడు. 253 00:16:40,879 --> 00:16:43,399 అయితే, మేము గంటకు 10 ఎకరాలు కోస్తున్నాము, 254 00:16:43,480 --> 00:16:47,759 కెనడా వాసులందరూ మమ్మల్ని చూసి కిందపడి దొర్లి నవ్వుతున్నారు. 255 00:16:51,039 --> 00:16:53,519 ఇక్కడ ఖచ్చితంగా వేడిగా మారిపోతుంది. 256 00:16:53,600 --> 00:16:55,720 నేను కొంచెం సేపు ఏసీ వేసుకుంటాను. 257 00:17:00,399 --> 00:17:01,720 అటు వైపు వెళ్ళాలి... 258 00:17:02,759 --> 00:17:03,799 అది బయటకు... 259 00:17:05,039 --> 00:17:07,759 అంటే కుడివైపుకు వెళ్ళాలి, అప్పుడు అటువైపుకు వెళతాను. 260 00:17:11,440 --> 00:17:14,039 ఆగండి, నేను అది మరోసారి ప్రయత్నిస్తాను. 261 00:17:19,640 --> 00:17:22,640 శాంతియుతంగా పని కొనసాగుతున్నాగాని, 262 00:17:22,720 --> 00:17:25,319 నా మనసులో ఒక ఆలోచన తొలిచేస్తుంది. 263 00:17:26,000 --> 00:17:29,559 నిజానికి మేము ఎంత సాగు చేశాము? 264 00:17:29,680 --> 00:17:32,440 సైమన్, కంప్యూటర్ ఏం చెబుతుంది? 265 00:17:32,519 --> 00:17:34,200 రాబడి మానిటర్ మీద 266 00:17:34,279 --> 00:17:36,680 హెక్టారుకు 2.5 టన్నులుగా చూపిస్తుంది, 267 00:17:36,759 --> 00:17:38,519 అంటే ఎకరానికి టన్ను రాబడి ఉంది. 268 00:17:38,559 --> 00:17:41,640 కానీ మేము ఆశించినది ఎకరానికి టన్నున్నర. 269 00:17:41,720 --> 00:17:43,400 అది మంచి రాబడి. 270 00:17:57,000 --> 00:17:58,799 7.3. బాగానే ఉంది. 271 00:17:59,680 --> 00:18:01,400 నేను చెప్పగలిగింది, 272 00:18:01,480 --> 00:18:04,440 మేము చాలామటుకు ఇయర్‌విగ్‌ల నూర్పిడి చేశాము. 273 00:18:04,519 --> 00:18:06,880 అవి వేలల్లో ఉన్నాయి. 274 00:18:07,799 --> 00:18:11,880 కానీ ఇది సాధారణమే అని చెప్పారు, అందుకని నా పని కొనసాగించాను. 275 00:18:11,960 --> 00:18:14,559 సరే, ఇదిగో వెళుతున్నాము. కోట్ వేసుకున్నాను. 276 00:18:21,039 --> 00:18:25,160 రెండో పొలం నుండి మొదటి పొలం కంటే ఎక్కువ రాబడి వచ్చింది... ఖచ్చితంగా. 277 00:18:30,400 --> 00:18:31,319 ఒక్క నిమిషం. 278 00:18:31,799 --> 00:18:34,640 వెనుకకు అటువైపు వెళ్ళాలి, అవును, అటువైపు వెళ్ళాలి. 279 00:18:39,759 --> 00:18:41,759 అబ్బా, తప్పుగా వెళుతున్నాను. 280 00:18:53,920 --> 00:18:56,079 ఇది ట్రాక్టర్ల సమావేశంలా ఉంది. -కదా? 281 00:18:57,079 --> 00:18:59,559 -అయితే, పికెట్స్ పీస్ పూర్తయింది. -అవును. 282 00:18:59,680 --> 00:19:01,920 ఇప్పుడు మనం లోవర్ వాష్‌పూల్ చేయబోతున్నాం. 283 00:19:02,000 --> 00:19:05,559 ఇంకా 45.7 ఎకరాల బరీ హిల్ నార్త్ ఉంది. 284 00:19:05,640 --> 00:19:07,519 మీరు మొదలు పెట్టండి, జెరెమీ. 285 00:19:07,559 --> 00:19:09,000 -తన లైటు వెలిగింది. -అవును. 286 00:19:34,799 --> 00:19:38,519 మరుసటి రోజు ఉదయం, మేము కోతలను కొనసాగించాము, 287 00:19:38,559 --> 00:19:43,000 నా మొదటి ఇయర్‌విగ్‌ల లోడ్ దింపడం మామూలుగా కంటే కష్టంగా ఉంది. 288 00:19:47,240 --> 00:19:49,480 అతను తన ట్రక్కును పొలం దగ్గర నిలిపాడు. 289 00:19:52,079 --> 00:19:54,079 అతనికి ఏదో అయ్యింది. 290 00:20:02,640 --> 00:20:05,720 ఆత్రంలో అతను అది కనుగొనడు. 291 00:20:09,960 --> 00:20:14,559 ఏదేమైనా, కేలెబ్ విసుగు కలిగేలా పార్క్ చేయడం నా సమస్యలలో అల్పమైనది. 292 00:20:14,640 --> 00:20:18,319 ఎందుకంటే, నిన్నటిలా కాకుండా, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి, 293 00:20:18,400 --> 00:20:22,319 అందువలన ఉదయం తేమ పరీక్ష బాగా లేదు. 294 00:20:25,559 --> 00:20:27,240 -పది. -పది. 295 00:20:29,559 --> 00:20:30,759 సరే. 296 00:20:31,480 --> 00:20:34,680 అది చాలా ఎక్కువ. రెండు శాతం ఎక్కువ. తడిగా ఎందుకు అయ్యాయి? 297 00:20:34,759 --> 00:20:38,160 వర్షం పడలేదు. వాతావరణంలో కొంత తేమ ఉంది అంతేకదా? 298 00:20:38,240 --> 00:20:39,680 గాలిలో తేమ ఉంది. 299 00:20:39,759 --> 00:20:43,319 అందుకని ఉదయం ఏడింటి కంటే ఇప్పుడు ఎక్కువ తేమగా ఉంది. 300 00:20:43,400 --> 00:20:45,160 సరే, మనం ఏం చేయాలి? 301 00:20:46,440 --> 00:20:49,559 సంతోషకరంగా, మేము ఒకటి చేయగలం. 302 00:20:49,640 --> 00:20:53,319 దీనికి బదులుగా మేము బార్లీ కోయవచ్చేమో పరీక్షించాలి. 303 00:20:56,160 --> 00:20:59,079 -ఎంత ఉంది, మిత్రమా? -14.7. 304 00:20:59,200 --> 00:21:01,519 -దానికి పరిమితి ఎంత? -15. 305 00:21:01,559 --> 00:21:04,480 -అయితే, పని ప్రారంభించవచ్చా? -ప్రారంభించవచ్చు. 306 00:21:21,319 --> 00:21:24,000 సరే, అది చాలా విజయవంతమైనది అని చెప్తాను. 307 00:21:25,160 --> 00:21:29,079 నువ్వు అది విన్నావా, పిల్లకుంక? అది విజయవంతమైనది. 308 00:21:29,160 --> 00:21:31,079 సైమన్, అతనిని మోసేయకు. 309 00:21:33,519 --> 00:21:35,519 ఇప్పుడు నా ట్రయిలర్‌లో ఉన్నది 310 00:21:35,559 --> 00:21:38,680 వెదర్‌స్పూన్‌కు సంవత్సరం పాటు సరిపోతుంది. 311 00:21:38,759 --> 00:21:40,799 అవి బీరుకు వాడే గింజలు. 312 00:21:43,000 --> 00:21:47,319 ఏదేమైనా, నేను గిడ్డంగికి వెళ్ళేసరికి, మరో సమస్య వచ్చిందని తెలుసుకున్నాను. 313 00:21:49,480 --> 00:21:52,079 సరే, ఆవ ఎంత మిగిలి ఉంది? 314 00:21:52,559 --> 00:21:55,079 ఇంకా పెద్ద పొలం మిగిలి ఉంది. 315 00:21:55,160 --> 00:21:58,880 దాదాపు 40 లేదా 50 టన్నుల ఆవాలు కోయాలి. 316 00:22:00,720 --> 00:22:02,640 అయితే, నేను బార్లీ ఎక్కడ పెట్టాలి? 317 00:22:06,880 --> 00:22:07,880 హలో. 318 00:22:07,960 --> 00:22:10,880 నేను ఈ బార్లీని ఎక్కడ నిల్వ చేయాలి? 319 00:22:10,960 --> 00:22:13,880 గిడ్డంగి అంతా నిండిపోయింది, మనం వాటిని కలపలేము, కదా? 320 00:22:13,960 --> 00:22:17,519 లేదు, లేదు, వాటిని ఎయిర్‌ఫీల్డ్‌లో నిల్వ చేయాలి. 321 00:22:17,599 --> 00:22:19,160 నేను నిర్మించిన బంకర్, 322 00:22:19,240 --> 00:22:22,000 అక్కడ 400 టన్నులు నిల్వ చేయవచ్చు. 323 00:22:22,079 --> 00:22:24,160 వర్షం పడబోతుంది కాబట్టి మనమలా చేయలేము. 324 00:22:24,240 --> 00:22:26,680 వర్షం పడితే, మనం బయట వదిలేయలేము. 325 00:22:26,759 --> 00:22:28,920 లేదు, అవి తడిచిపోతే తిరస్కరిస్తారు. 326 00:22:29,000 --> 00:22:30,880 వెంటనే వాటిని అమ్మేయాలి. 327 00:22:30,960 --> 00:22:31,960 అంటే ఏంటి? 328 00:22:32,039 --> 00:22:36,440 వాటిని నిల్వ ఉంచలేము, మీరు వాటిని అక్కడ దింపి, 329 00:22:36,519 --> 00:22:38,279 వాటిని వెంటనే అమ్మేయాలి. 330 00:22:38,359 --> 00:22:39,359 ఏంటి, ఈ రోజేనా? 331 00:22:39,440 --> 00:22:41,640 అంటే, అవును, నిజానికి ఈరోజే, అవును. 332 00:22:44,839 --> 00:22:46,359 అక్కడ ఆఫీసులో. 333 00:22:46,440 --> 00:22:49,119 సరే, ధాన్య వ్యాపారులు. 334 00:22:49,200 --> 00:22:50,440 సరే, హాయ్. 335 00:22:50,519 --> 00:22:53,000 నిజంగా, నాకు ఈరోజు ఒక బండి కావాలి. 336 00:22:53,079 --> 00:22:55,240 అయితే, మీరు ఏ సహాయం చేయలేరా? 337 00:22:56,119 --> 00:22:59,559 కొన్ని ఫోన్లు చేశాక, చివరకు ఫలితం దక్కింది. 338 00:23:00,640 --> 00:23:02,920 మీరు చెప్పింది వింటుంటే సంగీతంలా ఉంది. 339 00:23:03,000 --> 00:23:04,759 మంచిది, బై, బై, 340 00:23:04,839 --> 00:23:07,079 బండి వస్తుంది. 341 00:23:08,640 --> 00:23:12,240 లాక్‌డౌన్‌లో ఎవరో యువ రైతులు పాత నిల్వ సౌకర్యాన్ని తగలబెట్టాక 342 00:23:12,319 --> 00:23:16,720 కేలెబ్ నిర్మించిన కొత్త సౌకర్యానికి వెళ్ళాను. 343 00:23:27,119 --> 00:23:30,880 ఇది తొమ్మిదేళ్ళ వాడు ఇసుకలో ఆడుతున్నట్టు ఉంది. నాకు నచ్చింది. 344 00:23:35,440 --> 00:23:37,480 కేలెబ్ తన లోడ్ తీసుకుని వచ్చాడు. 345 00:23:39,000 --> 00:23:42,480 నేను ఆర్డర్ చేసిన లారీ వచ్చిన కొంత సమయానికే అతను వచ్చాడు. 346 00:23:44,480 --> 00:23:46,640 అది స్మార్ట్ లారీ. 347 00:23:46,720 --> 00:23:49,079 -అది మన లోడ్ తూకం వేస్తుందా? -అవును. 348 00:23:49,160 --> 00:23:50,799 -అవునా? అద్భుతం. -అవును. 349 00:23:56,839 --> 00:24:02,119 ఏదేమైనా, లోడింగ్ మొదలవగానే, మేము పండించిన 10 ఎకరాల ధాన్యంతోనే 350 00:24:02,200 --> 00:24:05,799 లారీ మొత్తం నిండిపోయిందని తెలిసి 351 00:24:05,880 --> 00:24:08,279 నాకు తల వేడెక్కినట్టు అనిపించింది. 352 00:24:09,680 --> 00:24:14,000 ఇంకా 140 ఎకరాల ధాన్యం తీసుకెళ్ళాలి. 353 00:24:17,759 --> 00:24:21,480 కేలెబ్ అది గమనించడనే నాకు ఉన్న ఒక్కగానొక్క ఆశ. 354 00:24:21,559 --> 00:24:23,319 మీరు 20 లారీలు తెప్పించాలి. 355 00:24:23,400 --> 00:24:25,079 -ఇరవై లారీలా? -ఇరవై లారీలు. 356 00:24:25,160 --> 00:24:28,240 -వస్తూ పోతూ ఉంటాయి. -ఏంటి, ఒక్కోదానిలో 29 టన్నులా? 357 00:24:28,319 --> 00:24:30,200 శనివారం రాత్రి 6 గంటలయింది. 358 00:24:30,279 --> 00:24:33,160 మనకు ఇప్పుడు ఇంకేం దొరకవు, రేపేమో ఆదివారం. 359 00:24:33,640 --> 00:24:35,319 ఈ రాత్రికి వర్షం పడబోతుంది. 360 00:24:35,880 --> 00:24:37,599 అయితే మనం ఇరుక్కుపోయామా? 361 00:24:37,680 --> 00:24:38,799 అవును. 362 00:24:38,880 --> 00:24:42,319 పూర్తిగా ఇరుక్కుపోయాము, ఇక బార్లీ ఏ మాత్రం కోయలేము, ఎందుకంటే... 363 00:24:43,960 --> 00:24:47,240 మీరు నాశనం చేశారు. మీరిక మీ ఫోన్‌లో "హలో" అంటూ ఉండాలి. 364 00:24:47,319 --> 00:24:48,519 -లేదు. తప్పు. -అంతే. 365 00:24:48,599 --> 00:24:51,680 లేదు, నేను తొమ్మిది నెలల క్రితమే తప్పు చేశాను. 366 00:24:51,759 --> 00:24:52,599 ఏంటి? 367 00:24:52,680 --> 00:24:55,920 "గిడ్డంగి పెద్దది" అన్నప్పుడు, నాది యార్క్‌షైర్ ఆలోచన. 368 00:24:56,000 --> 00:24:58,119 "నేను 22 వేలకంటే ఎక్కువ ఖర్చు చేయను, 369 00:24:58,200 --> 00:25:00,880 "ఆ గిడ్డంగి పెద్దగా ఉంది, అన్నీ పడతాయి." 370 00:25:00,960 --> 00:25:03,240 మనకు గదులు ఉంటాయి, అక్కడ ఆవాలు, గోధుమ, 371 00:25:03,319 --> 00:25:04,920 బార్లీ ఉంచవచ్చు అనుకున్నాను. 372 00:25:05,000 --> 00:25:08,160 వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు... నువ్వూ చెప్పలేదు, నిజానికి... 373 00:25:08,240 --> 00:25:09,799 "మీ గిడ్డంగి చిన్నది" అన్నాను. 374 00:25:09,880 --> 00:25:11,640 అవును, కానీ నువ్వు, 375 00:25:11,720 --> 00:25:14,079 "మీ గిడ్డంగి ఆవాలతో నిండిపోతుంది" అని 376 00:25:14,160 --> 00:25:15,559 -చెప్పాల్సింది. -చెప్పాను! 377 00:25:15,640 --> 00:25:18,480 -నువ్వు అలా చెప్పలేదు. -చెప్పాను! మీరు వినరు. 378 00:25:18,559 --> 00:25:19,640 మీరు వినలేదు. 379 00:25:19,720 --> 00:25:21,240 లేదు, దృష్టి పెట్టరు. 380 00:25:21,319 --> 00:25:24,200 బహుశా, ఇప్పుడు ఏం చెబుతున్నానో, అదీ తెలియదేమో. 381 00:25:25,240 --> 00:25:26,599 ఇప్పుడు ఏం చెప్పాను? 382 00:25:26,680 --> 00:25:28,480 -ఏదో దృష్టి అన్నావు. -చూశారా? 383 00:25:29,200 --> 00:25:30,440 నేను చెప్పేది అదే. 384 00:25:33,240 --> 00:25:37,359 అందుకని, నావల్ల, అన్ని పనులు ఆగిపోయాయి, 385 00:25:40,680 --> 00:25:43,160 కేలెబ్ ఇంటికి బయలుదేరాడు. 386 00:25:52,720 --> 00:25:54,559 నా కారు ఎక్కడ ఉంది? 387 00:26:02,799 --> 00:26:04,839 కనిపించింది. వెనుకభాగం కనిపిస్తుంది. 388 00:26:24,160 --> 00:26:25,559 చూస్తే, 389 00:26:25,640 --> 00:26:28,880 తరువాత ఉదయం, నాకు నా ట్రాక్టర్ తాళాలతో పని పడలేదు. 390 00:26:42,799 --> 00:26:45,640 ఖచ్చితంగా, మేము వర్షంలో కోత పని చేయలేము. 391 00:26:47,519 --> 00:26:49,319 కుండపోత వర్షం తగ్గినా, 392 00:26:49,400 --> 00:26:52,880 మేము మా పొలాలు ఎండకుండా తిరిగి ప్రారంభించలేము. 393 00:26:54,279 --> 00:26:55,720 అందుకని, వేచి చూస్తుండగా, 394 00:26:55,799 --> 00:26:58,599 ఈలోగా ఆ సమయంలో మరో పని చేసుకున్నాము. 395 00:27:04,440 --> 00:27:08,839 ఆదివారం భోజనానికి గొర్రెపిల్లలను పంపించేందుకు సిద్ధం చేస్తున్నాము. 396 00:27:09,680 --> 00:27:12,640 మంచి, బాగా కండ ఉన్న, సరైన బరువు ఉన్న, 397 00:27:12,720 --> 00:27:15,119 కబేళాకు పంపించగల 44 కేజీల పైన ఉన్న, 398 00:27:16,720 --> 00:27:20,039 మంచి మాంసం ఇవ్వగల గొర్రెపిల్లలకోసం చూస్తున్నాం. 399 00:27:39,319 --> 00:27:42,119 అయితే, ఎలెన్, సరైన బరువుతో, పుష్టిగా ఎంత ఉన్నాయి? 400 00:27:42,200 --> 00:27:43,720 -డెబ్బై ఎనిమిది. -78. 401 00:27:50,119 --> 00:27:51,680 వాటికి తెలిసినట్టు ఉంది. 402 00:27:53,079 --> 00:27:56,440 ఇది శాకాహారానికి శక్తివంతమైన ప్రకటన. 403 00:27:58,599 --> 00:28:02,839 కానీ ఓడ ప్రయాణానికి శక్తివంతమైన ప్రకటనలు చూశాను, 404 00:28:02,920 --> 00:28:04,559 అయినా నేనది చేయను. 405 00:28:07,279 --> 00:28:09,240 గొర్రెపిల్లలను పంపించేశాక... 406 00:28:10,599 --> 00:28:13,200 పొలాలు ఎండిపోయాక, 407 00:28:13,279 --> 00:28:16,160 ఆవ, బార్లీ పంటల 408 00:28:16,920 --> 00:28:18,359 కోతలు ముగించాము. 409 00:28:19,640 --> 00:28:23,079 ఆ తరువాత దాన్నంతా ధాన్యం వ్యాపారికి అమ్మాము. 410 00:28:29,839 --> 00:28:32,039 ఇక ఒక పంట మిగిలింది... 411 00:28:33,519 --> 00:28:34,880 అది గోధుమ. 412 00:28:35,160 --> 00:28:36,559 ఎంత ఉంది? 413 00:28:36,920 --> 00:28:38,400 16.6. 414 00:28:39,000 --> 00:28:39,880 ఇంకా ఎక్కువే. 415 00:28:39,960 --> 00:28:42,440 పచ్చదనం లేకుండా ఉండాలి. మరో వారం పడుతుంది. 416 00:28:42,519 --> 00:28:43,880 మనం దాన్ని వదిలేయాలి. 417 00:28:45,160 --> 00:28:49,440 బాధాకరమైనా, నాకు బాధకలిగించే ఫోన్ వచ్చింది. 418 00:28:50,359 --> 00:28:51,319 సరే. 419 00:28:52,720 --> 00:28:53,720 సరే. 420 00:28:55,319 --> 00:28:58,119 అలాగే, నేను తరువాత వస్తాను. 421 00:28:58,599 --> 00:29:00,319 సరే, ధన్యవాదాలు. బై. 422 00:29:06,039 --> 00:29:07,400 వెయిన్ రూనీ చనిపోయింది. 423 00:29:14,680 --> 00:29:18,240 పాపం నా పొట్టేలు ఎలా చనిపోయిందో ఇంకా తెలియలేదు. 424 00:29:18,319 --> 00:29:23,119 అందుకని, దాన్ని మాకు దొరికిన శవపేటికలో గౌరవప్రదంగా ఎక్కించాక, 425 00:29:25,279 --> 00:29:28,720 పశువుల డాక్టర్ దానికి శవపరీక్ష చేసేందుకు తీసుకెళ్ళాడు. 426 00:29:31,039 --> 00:29:35,559 తరువాత అది పేగు తిరిగిపోవడంతో చనిపోయిందని తెలియచేసేందుకు ఫోన్ చేశాడు. 427 00:29:37,359 --> 00:29:42,480 వెయిన్ రూనీ 2018 - 2020 428 00:29:46,079 --> 00:29:50,039 వెయిన్ మరణం నన్ను బాధించడం ఆశ్యర్యంగా ఉంది, 429 00:29:50,119 --> 00:29:52,519 ఎందుకంటే... నాకు బాధగా ఉంది. 430 00:29:54,119 --> 00:29:57,240 అది నా సాయంత్రపు దినచర్యలో భాగం అయింది. 431 00:29:57,319 --> 00:29:59,720 నేను నడకకు వెళ్ళి, వాటికి ఆహారం తీసుకొస్తే, 432 00:29:59,799 --> 00:30:01,400 అవి పరిగెత్తుకుంటూ వచ్చేవి. 433 00:30:02,359 --> 00:30:03,519 నేనిప్పుడు ఇక్కడకు 434 00:30:03,599 --> 00:30:07,400 లియో బాగుందో లేదో చూడడానికి వచ్చాను. 435 00:30:07,480 --> 00:30:10,039 కానీ అది అక్కడ ఆ పొదల్లో దాక్కుంది. 436 00:30:11,039 --> 00:30:13,400 అది బయటకు రాలేదు, కనీసం తినడానికీ రాలేదు. 437 00:30:17,519 --> 00:30:21,640 బాధాకరమైనా, మేము నాకు మిగిలిన ఒక్క పొట్టేలును శోకంలో వదిలేసి వెళ్ళాను. 438 00:30:23,279 --> 00:30:27,640 ఎందుకంటే త్వరలోనే, గోధుమ తేమ స్థితి సరైన స్థాయికి చేరింది. 439 00:30:27,720 --> 00:30:29,160 ఎంత ఉంది? 440 00:30:29,240 --> 00:30:30,559 14.4. 441 00:30:30,920 --> 00:30:33,400 ఇక పని ప్రారంభించవచ్చు. 442 00:30:48,440 --> 00:30:51,119 96 ఎకరాల గోధుమ కోతకు ఉంది, 443 00:30:51,200 --> 00:30:56,279 దాని విలువను ఆవ నూనె గింజలకు, బార్లీకి భిన్నంగా లెక్కిస్తారు. 444 00:30:58,559 --> 00:31:01,319 గోధుమకు, మీకు వచ్చే పరిమాణం... 445 00:31:01,400 --> 00:31:03,880 అది ముఖ్యం కాదు అని చెప్పలేను, అది ముఖ్యమే, 446 00:31:03,960 --> 00:31:07,079 కానీ నాణ్యతకు మించి ముఖ్యం కాదు. 447 00:31:07,160 --> 00:31:09,680 అయితే, సగం ట్రయిలర్ లోడ్ నింపాము, 448 00:31:09,759 --> 00:31:14,000 ఆ సగం ట్రయిలర్ లోడ్ నాణ్యమైన గోధుమ అవునో కాదో తెలియదు, 449 00:31:14,079 --> 00:31:15,880 దానితో రొట్టెలు చేయవచ్చా, లేదా 450 00:31:15,960 --> 00:31:19,480 పశువులకు దాణాగా వేసేంత దారుణమైన గోధుమలా అన్నది తెలియదు. 451 00:31:23,480 --> 00:31:25,519 మేము ఉత్సాహంగా పని చేస్తుంటే, 452 00:31:25,599 --> 00:31:28,680 క్షురకుడి దగ్గరకు వెళ్ళాలని తహతహలాడుతున్న కేలెబ్, 453 00:31:28,759 --> 00:31:32,160 తన క్షవరానికి కొంత సమయం తీసుకున్నాడు. 454 00:31:37,200 --> 00:31:38,319 జుట్టు. 455 00:31:38,680 --> 00:31:39,519 నాకది నచ్చింది. 456 00:31:40,880 --> 00:31:42,599 అది ఇక నా ముఖంపైన పడదు. 457 00:31:43,799 --> 00:31:47,160 ఈ ముచ్చట్ల తరువాత, మూడ్ మారింది, 458 00:31:47,240 --> 00:31:51,920 ఎందుకంటే గారెత్ బేల్ పొరుగు రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని గ్రహించాడు. 459 00:31:53,000 --> 00:31:56,279 మీ ఎడమకు చూడండి, జెరెమీ, అక్కడ అంత బాగా ఉన్నట్టు లేదు. 460 00:31:56,359 --> 00:31:57,880 ఏదో అంటుకుంది, కదా? 461 00:32:03,759 --> 00:32:06,680 ఇది ప్రతి రైతుకు పీడకల లాంటిది. 462 00:32:06,759 --> 00:32:10,400 ఏదో పనిచేయని యంత్రం వలన తగలబడుతున్న పంట. 463 00:32:12,599 --> 00:32:15,720 నేను అదే చూస్తున్నాను, కాస్త ఆగండి, రెండు నిమిషాలు. 464 00:32:17,039 --> 00:32:20,319 అక్కడికి రెండు అగ్నిమాపక యంత్రాలు వెళుతున్నాయి. 465 00:32:20,400 --> 00:32:21,920 అతనికి ఇది ఎలా తెలిసింది? 466 00:32:22,000 --> 00:32:24,160 నీకు అది ఎలా తెలుసు? 467 00:32:24,240 --> 00:32:25,839 నాకు అంతటా పరిచయస్తులున్నారు. 468 00:32:28,440 --> 00:32:30,640 లంబో చక్కని విశ్వసనీయతకు 469 00:32:30,720 --> 00:32:34,119 దేవుడికి కృతజ్ఞతలు తెలిపాను. 470 00:32:36,119 --> 00:32:38,319 తరువాత తిరిగి పని ప్రారంభించాము. 471 00:32:39,480 --> 00:32:42,119 దాన్ని కాస్త వెనుకకు తీసుకెళ్ళండి. 472 00:32:43,480 --> 00:32:47,680 సైమన్ రేడియోలో శాంతంగా, స్పష్టంగా సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు... 473 00:32:47,759 --> 00:32:49,359 బాగుంది, ముందుకు తీసుకురండి. 474 00:32:50,680 --> 00:32:53,519 ...నేను ట్రాక్టర్ బాగా నడపగలుగుతున్నాను. 475 00:32:55,599 --> 00:32:58,359 మీరు కొంచెం ముందుకు మధ్యలో ఉన్నారు, 476 00:32:58,440 --> 00:33:01,680 ప్రస్తుతం మధ్యలోకంటే కాస్త దగ్గరగా రండి. 477 00:33:04,240 --> 00:33:06,160 కానీ, ఆ రోజు తరువాత, 478 00:33:06,240 --> 00:33:09,079 నిల్వ గిడ్డంగి పరిశీలించి తిరిగి వెనుకకు వచ్చాను. 479 00:33:09,160 --> 00:33:13,359 అప్పుడు సైమన్ కాకుండా అతని సహచరుడు కంబైన్ నడుపుతున్నాడని తెలిసింది. 480 00:33:26,160 --> 00:33:29,440 నాకు తెలియదు అంతే. నాకు తెలియదు. 481 00:33:29,519 --> 00:33:31,839 అతను నన్నేం చేయమంటున్నాడో నాకు తెలియదు. 482 00:33:31,920 --> 00:33:35,240 తరువాతిసారి నన్ను పక్కగా రమ్మంటారా? 483 00:33:42,359 --> 00:33:44,960 అతను లైటు ఆన్ చేయకుండానే గొట్టం బయటకు పెట్టాడు, 484 00:33:45,039 --> 00:33:46,759 కావున అతను సిద్ధమనుకుంటున్నాను. 485 00:33:52,440 --> 00:33:54,319 నేను వెనుక ఉన్నానా? 486 00:33:59,160 --> 00:34:00,519 ఏమీ తెలియడం లేదు. 487 00:34:02,519 --> 00:34:04,480 ఛ, ఛ, అబ్బా. 488 00:34:09,119 --> 00:34:10,920 ఒక్క మాట చెప్పలేదు. 489 00:34:13,480 --> 00:34:16,760 అయినా, చివరకు, మేము ఒక వరుసలోకి వచ్చాము. 490 00:34:18,440 --> 00:34:21,039 ఒకటి చెప్పనా, అతనికి 72 ఏళ్ళు, అతనిని చూడండి. 491 00:34:21,119 --> 00:34:22,920 గత వారం అతను నాకు చెప్పాడు, 492 00:34:23,000 --> 00:34:27,119 50 ఏళ్ళుగా ప్రతి ఏడాది అతను తన పొలంలో కోత కోస్తున్నాడని, 493 00:34:27,159 --> 00:34:30,280 కోవిడ్ కారణంగా ఈసారి అది మానుకోలేడని చెప్పాడు. 494 00:34:30,360 --> 00:34:31,320 ఇదిగోండి వచ్చాడు. 495 00:34:35,039 --> 00:34:37,400 నీ లైటు వెలిగించు, జెరాల్డ్. 496 00:34:37,480 --> 00:34:39,599 నీ లైటు ఆన్ చెయ్, నేను తిరిగి వస్తాను. 497 00:34:51,320 --> 00:34:52,760 సరే, అర్థమయింది. 498 00:34:52,840 --> 00:34:54,199 అర్థం కాలేదు, కానీ... 499 00:35:06,199 --> 00:35:09,280 ఆగస్ట్ చివరికల్లా పనంతా పూర్తయింది. 500 00:35:11,639 --> 00:35:15,280 మేము 546 ఎకరాలలో 501 00:35:15,360 --> 00:35:18,960 గోధుమ, ఆవ నూనె గింజలు, బార్లీ సాగు చేశాము. 502 00:35:20,639 --> 00:35:24,159 బాగా పంటలు పండించి ఇప్పుడిక పొలాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. 503 00:35:27,039 --> 00:35:29,599 అయినా నాకు విశ్రాంతి లేదు. గోధుమలు అమ్మాలి. 504 00:35:29,639 --> 00:35:31,119 అందుకని, నమూనా తీసుకుని... 505 00:35:34,039 --> 00:35:36,679 చార్లీకి ఫోన్ చేశాను, అతను, అంతా పని పూర్తయ్యాక, 506 00:35:36,800 --> 00:35:38,639 సెలవుల నుండి తిరిగి వచ్చి, 507 00:35:39,800 --> 00:35:42,800 మా స్థానిక మిల్ దగ్గర అతనితో సమావేశం ఏర్పాటు చేశాడు. 508 00:35:43,800 --> 00:35:44,639 ఇదిగో. 509 00:35:44,679 --> 00:35:46,199 నమూనా సంచి. 510 00:35:51,159 --> 00:35:53,599 నేను ఆశించింది నా గోధుమల పని ఇక్కడితో 511 00:35:53,639 --> 00:35:56,320 ముగిసి, పిండిగా మారి రొట్టెలవుతాయని. 512 00:35:59,400 --> 00:36:02,320 ఎందుకంటే అప్పుడు నాకు అధిక ధర వస్తుంది. 513 00:36:04,480 --> 00:36:05,599 స్ట్రాంగ్ వైట్ బ్రెడ్ మరియు రోల్స్ కొరకు 514 00:36:05,639 --> 00:36:09,199 అయినా, ముందు, మిల్ యజమాని పాల్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. 515 00:36:10,639 --> 00:36:11,880 ఇది మీ... 516 00:36:11,960 --> 00:36:14,519 నంబర్ వన్, ప్రీమియర్ లీగ్ లాంటివి... 517 00:36:14,599 --> 00:36:16,639 -మేలు రకం. -...గోధుమలు. 518 00:36:16,679 --> 00:36:18,960 -నాసి రకం కాదు. -కాదు. 519 00:36:19,039 --> 00:36:22,320 మావి లివర్‌పూల్ లాంటి మేలు రకం, అత్యత్తమైనవి. 520 00:36:22,400 --> 00:36:24,639 కనీసం మ్యాన్ సిటీ లాంటివి. 521 00:36:24,679 --> 00:36:27,639 సరే, అలాగే. ఏం చేయగలమో చూద్దాం. 522 00:36:27,760 --> 00:36:31,679 నేను మా ల్యాబ్‌లో పరీక్షించి, ఫలితం వెల్లడిస్తాను. 523 00:36:31,800 --> 00:36:34,559 -దానికి ఎంత సమయం పడుతుంది? -సరే. ఐదు నిమిషాలు. 524 00:36:34,639 --> 00:36:37,400 పాల్ ప్రకారం, నిర్ణయించే అంశం, 525 00:36:37,480 --> 00:36:41,320 గింజలో ఉన్న ప్రోటీన్‌ల శాతం. 526 00:36:41,400 --> 00:36:44,039 -నిజానికి 13 ఉంటుందనుకుంటున్నారు. -పదమూడు శాతం. 527 00:36:44,119 --> 00:36:46,159 పదమూడు ఉండాలి. 528 00:36:46,280 --> 00:36:49,199 నేను అనుకోవడం 13.4 శాతం మాంసకృతులు ఉంటాయి. 529 00:36:49,320 --> 00:36:52,079 సరే. నేను 12.6, 12.7 ఉంటుందనుకుంటాను. 530 00:36:52,159 --> 00:36:53,960 పాల్, మాకు తెలుసుకోవాలని ఉంది... 531 00:36:54,039 --> 00:36:55,920 అవును, మేము తెలుసుకోవాలి. 532 00:36:56,000 --> 00:36:57,480 సరే. నేను వెళ్ళి పరీక్షించనా? 533 00:36:57,559 --> 00:36:59,159 -సరే. వెళ్ళండి. -నేను... సరే. 534 00:36:59,199 --> 00:37:01,280 -మంచిది. -బై. నాకు మీ టోపీ నచ్చింది. 535 00:37:02,559 --> 00:37:06,800 పాల్ బ్రెడ్ పరిశోధకుడు తన పని ముగించడం కోసం, మేము వేచి చూస్తుండగా, 536 00:37:06,880 --> 00:37:10,760 నేను డబ్బు రూపంలో విజయం ఎలా ఉంటుందో అని ఆశగా చూస్తున్నాను. 537 00:37:12,440 --> 00:37:15,119 -ఉత్తమ గోధుమలు టన్నుకు ఎంత? -185 పౌండ్లు. 538 00:37:15,159 --> 00:37:17,000 సరే, అదే కోళ్ళకు దాణా అయితే... 539 00:37:17,800 --> 00:37:19,559 -ఎంత? -150, 155 పౌండ్లు. 540 00:37:19,639 --> 00:37:23,119 సరే అయితే, నాణ్యమైనది అయితే టన్నుకు 185 పౌండ్లు. 541 00:37:23,159 --> 00:37:26,320 -అంతే. -కోళ్ళకు దాణా అయితే 155 పౌండ్లు. 542 00:37:26,400 --> 00:37:27,440 అంతే. 543 00:37:27,519 --> 00:37:29,760 అయితే, అది మంచి నాణ్యమైనదని రుజువయ్యాక, 544 00:37:29,840 --> 00:37:32,039 ధర విషయంలో బేరం ఆడవచ్చా? 545 00:37:32,119 --> 00:37:34,840 దాని విలువను బట్టి అడగవచ్చు. 546 00:37:34,920 --> 00:37:38,119 అతనిని "నాకు టన్నుకు 200 పౌండ్లు ఇవ్వండి" అని అడుగుతాను. 547 00:37:38,159 --> 00:37:40,559 అది మంచి ధర అనుకుంటా. 548 00:37:40,639 --> 00:37:42,119 -పరిపూర్ణంగా ఉంది. -అవును. 549 00:37:42,159 --> 00:37:44,400 టన్నుకు 200 పౌండ్లు అంటే, 550 00:37:44,480 --> 00:37:48,280 అప్పుడు, "వాటిని ఈరోజు అమ్మను" అని కారులో ఎక్కి వెళ్ళిపోతాను. 551 00:37:48,360 --> 00:37:49,960 మనం "నేను అమ్మను" అనవచ్చు. 552 00:37:50,039 --> 00:37:52,920 "మనం అంటాము, మీకు అమ్ముతాము, కానీ..." 553 00:37:53,000 --> 00:37:55,840 -కానీ ఇప్పుడు అమ్మక్కర్లేదు. -ఈరోజు అమ్మనవసరం లేదు. 554 00:37:56,280 --> 00:37:58,760 అయితే, అతను "సరే, మంచిది" అంటాడు. 555 00:38:00,519 --> 00:38:01,559 అవును, అలా అనవచ్చు. 556 00:38:02,360 --> 00:38:04,159 నాకు బేరం ఆడడం రాదు. 557 00:38:04,280 --> 00:38:07,920 ఊహాగానాల సమయం ఇక ముగిసింది. 558 00:38:08,000 --> 00:38:09,320 అతను తిరిగి వచ్చాడు. 559 00:38:09,400 --> 00:38:11,480 ముఖ్యమైన అన్ని ప్రోటీన్లు, 560 00:38:12,920 --> 00:38:14,519 మొదటి సంఖ్య ఒకటి. 561 00:38:14,599 --> 00:38:15,599 సరే. 562 00:38:15,639 --> 00:38:18,679 -రెండవ సంఖ్య మూడు. -అదీ! 563 00:38:18,800 --> 00:38:19,960 తరువాత ముఖ్యమైన అంశం. 564 00:38:20,039 --> 00:38:21,280 సరే, సున్నా. 565 00:38:21,360 --> 00:38:23,159 తరువాతి సంఖ్య ఐదు. 566 00:38:25,320 --> 00:38:26,679 అంటే దాదాపుగా... 567 00:38:27,039 --> 00:38:29,159 -అది నీకెలా తెలుసు? -రంగును బట్టి. 568 00:38:29,639 --> 00:38:32,760 నేను ఇప్పటి వరకు చూడనంత బాగున్నాయి. 569 00:38:34,400 --> 00:38:36,159 -చాలా. -బాగా చేశావు, జెరెమీ. 570 00:38:36,280 --> 00:38:37,800 ఈయన, కేలెబ్ బాగా చేశారు. 571 00:38:37,880 --> 00:38:41,320 చార్లీ, వీటిని మరపట్టించేందుకు కొని, దానిలో కొంత పిండిని 572 00:38:41,400 --> 00:38:44,639 జెరెమీకి దుకాణంలో విక్రయించేందుకు పంపుతామని అడగవచ్చా? 573 00:38:44,679 --> 00:38:46,920 -సరే. -అంటే, కాదు, మనమింకా బేరమాడలేదు. 574 00:38:47,519 --> 00:38:50,679 -లేదు, దానిని పరిష్కరించాను. -అంటే ఏంటి? 575 00:38:50,800 --> 00:38:54,119 మీకు కారు ధరలు తెలుసుంటే, నాకు గోధుమ ధరలు తెలుసు. 576 00:38:54,159 --> 00:38:55,480 అయితే దానికి ఎంత? 577 00:38:55,559 --> 00:38:58,480 అది సుమారు 180 పౌండ్లు, అధిక ధర 185 పౌండ్లు. 578 00:38:58,559 --> 00:39:00,000 అది చాలా మంచి వార్త. 579 00:39:00,079 --> 00:39:02,039 నిజానికి, ఇవి గోల్డ్ స్టార్. 580 00:39:02,119 --> 00:39:04,039 నేనెళ్ళి వాటిలో స్నానం చేస్తాను. 581 00:39:04,119 --> 00:39:04,960 ధన్యవాదాలు పాల్. 582 00:39:06,519 --> 00:39:08,880 అది నిజానికి మంచి వార్త. 583 00:39:12,840 --> 00:39:16,760 కోతపని అయిపోయాక, చార్లీ డబ్బు లెక్కలు చూస్తుండగా, 584 00:39:16,840 --> 00:39:18,840 నాకు ఒక పోస్ట్ వచ్చింది, 585 00:39:18,920 --> 00:39:20,480 అందులో సీసాలో ఊటనీటి 586 00:39:20,559 --> 00:39:23,679 తాజా పరీక్షల ఫలితాలు వచ్చాయి. 587 00:39:28,400 --> 00:39:32,480 "22 మరియు 37 డిగ్రీల వద్ద బాక్టీరియా ఫలితాలు విఫలమయ్యాయి." 588 00:39:32,559 --> 00:39:35,480 అందుకని, నీళ్ళు అమ్మే స్థితిలో లేవు. 589 00:39:35,559 --> 00:39:39,199 "మీ సూచన కోసం, టీవీసీ కౌంట్ సున్నా ఉండాలి, 590 00:39:39,320 --> 00:39:42,760 "కానీ 10,000 పైగా ఉన్నట్టు కనుగొన్నాం." 591 00:39:44,199 --> 00:39:46,360 అది విఫలం కాదు, విపత్తు. 592 00:39:46,440 --> 00:39:47,760 పది వేలా? 593 00:39:48,760 --> 00:39:52,159 అంటే నేను వెంటనే వ్యవసాయ దుకాణానికి వెళ్ళి, 594 00:39:52,280 --> 00:39:55,840 అరల్లో పెట్టిన నీటిని ఎవరూ కొనకముందే తీసేయాలి. 595 00:39:55,920 --> 00:39:57,199 డిడ్లీ స్క్వాట్ నీరు ఇందులో మలినాలు లేవు. 596 00:39:57,320 --> 00:39:59,800 ఈ పనికి నా యంత్రంతో ఉపక్రమించాను, 597 00:40:01,079 --> 00:40:03,159 ఎందుకంటే నేను నా పాత స్నేహితునితో... 598 00:40:04,679 --> 00:40:06,320 తిరిగి కలిశాను. 599 00:40:13,840 --> 00:40:15,119 అందరికీ, 600 00:40:15,159 --> 00:40:18,920 కొత్త డిడ్లీ స్క్వాట్ వేగంగా స్పందించే వాహనానికి స్వాగతం. 601 00:40:26,880 --> 00:40:28,760 దీన్ని తిరిగి నడుపడం బాగుంది. 602 00:40:32,000 --> 00:40:35,400 నిజానికి, ఇది మడగాస్కర్ రోడ్లపై వెళ్ళగలిగినప్పుడు, 603 00:40:35,480 --> 00:40:39,480 ఖచ్చితంగా చిప్పింగ్ నార్టన్ పొలాల్లో కూడా వెళ్ళగలదు, వెళుతుంది కూడా. 604 00:40:50,599 --> 00:40:54,119 ఈ కారును గంటకు ఎనిమిది మైళ్ళకు మించి నడపకపోవడం విచిత్రం. 605 00:40:54,639 --> 00:40:55,639 ఇప్పుడు చూడండి. 606 00:41:00,559 --> 00:41:03,360 నేనిది నడిపి, ఇక్కడవారి ప్రాణాలు కాపాడుతున్నాను. 607 00:41:11,760 --> 00:41:13,480 నీళ్ళు తీసుకోడానికి వచ్చాను. 608 00:41:13,559 --> 00:41:15,800 -ఎందుకు? -అందులో మలినాలు ఉన్నాయి. 609 00:41:15,880 --> 00:41:18,519 -క్షమించాలి, ఏంటి? -అందులో మలినాలు ఉన్నాయి. 610 00:41:18,599 --> 00:41:20,480 దీనిలో మలినాలు లేవని అందులో ఉంది. 611 00:41:20,559 --> 00:41:23,920 దీనిలో మలినాలు లేవని అందులో ఉంది, కానీ అది ఖచ్చితమైనది కాదు. 612 00:41:24,000 --> 00:41:25,639 ఇందులో మొత్తం అవి ఉన్నాయి. 613 00:41:25,679 --> 00:41:29,280 అది ఏంటో నాకు తెలియదు. అది నిజానికి మలం కాదు, బాక్టీరియా. 614 00:41:29,360 --> 00:41:31,639 కానీ మనం వ్యవస్థను అంతా సబ్బుతో కడిగేసి, 615 00:41:31,679 --> 00:41:32,760 మళ్ళీ పరీక్షించుదాం. 616 00:41:33,800 --> 00:41:34,800 అవి ఏంటి? 617 00:41:34,880 --> 00:41:36,400 పుట్టగొడుగులు. 618 00:41:36,480 --> 00:41:39,599 -ఏంటి? -పుట్టగొడుగులు. పెద్ద పుట్టగొడుగులు. 619 00:41:39,639 --> 00:41:40,679 పెద్దవా? 620 00:41:41,519 --> 00:41:43,440 -అబ్బా. -నీకు ఏం చేయాలో తెలుసా? 621 00:41:43,519 --> 00:41:47,280 వాటిని ముక్కలుగా చేసి, గుడ్డులో ముంచి, పుట్టగొడుగుల వేపుడు చేయాలి. 622 00:41:47,360 --> 00:41:48,639 కానీ అది పుట్టగొడుగు. 623 00:41:48,760 --> 00:41:50,159 హా, అది పెద్ద పుట్టగొడుగు. 624 00:41:50,280 --> 00:41:52,840 మన పొలంలోని పుట్టగొడుగులు ఇవి. వీటిని చూడు! 625 00:41:53,880 --> 00:41:55,840 అవి అద్భుతంగా ఉన్నాయి. 626 00:41:57,119 --> 00:41:59,880 వ్యవసాయి దుకాణంలో అంతా చాలా బాగుంది. 627 00:41:59,960 --> 00:42:00,960 తాజా స్థానిక పాలు ఒక లీటరుకు 1 పౌండు 628 00:42:01,039 --> 00:42:03,880 ఎట్టకేలకు మా కృషికి ఫలితం కనిపిస్తుంది. 629 00:42:04,880 --> 00:42:09,119 ఒరంగుటాన్ హితమైన, మా పొలంలో పండిన ఆవ నూనె గింజలతో తయారయిన వంట నూనెను 630 00:42:09,159 --> 00:42:11,559 ఇప్పటికే అరల్లోకి సర్దాము. 631 00:42:13,079 --> 00:42:16,639 రెండు రోజుల తరువాత, మా గొర్రెపిల్లలు తిరిగి వచ్చాయి. 632 00:42:18,320 --> 00:42:20,639 -చుట్టి పెట్టిన దాని భుజం ఎముక. -సరే. 633 00:42:21,079 --> 00:42:24,000 రొమ్ము, సన్నగా ఉండేది వేపుడుకు. 634 00:42:24,079 --> 00:42:27,880 మీ చాప్స్. కాలేయం, మూత్రపిండాలు ఇంకా ముక్కలు. 635 00:42:27,960 --> 00:42:31,159 వాటికి పురుడుపోసి, పెంచి, పోషించాను... 636 00:42:31,280 --> 00:42:32,880 -అవును. -...పెంచాను. 637 00:42:32,960 --> 00:42:34,960 -ప్రేమించారు. -ప్రేమించాను. 638 00:42:35,039 --> 00:42:38,039 -మీరు చంపేసి, ముక్కలు చేశారు. -మీకోసం ముక్కలు చేశాం. 639 00:42:38,119 --> 00:42:39,039 తినడానికి తయారుగా. 640 00:42:40,400 --> 00:42:44,679 గొర్రెపిల్లలను పెంచి, ముక్కలు చేయడానికి 5,000 పౌండ్ల ఖర్చు అయ్యింది, 641 00:42:44,800 --> 00:42:47,440 కానీ స్థానికంగా అవి చాలా ప్రాచుర్యం పొందినవి... 642 00:42:47,519 --> 00:42:50,480 మీకు రెండు గొర్రెపిల్లలు కావాలి, అయితే అది నాలుగు సగాలు. 643 00:42:51,119 --> 00:42:54,679 ...చూస్తుంటే కొన్ని వందల పౌండ్లు తిరిగి వచ్చేలా ఉన్నాయి. 644 00:42:54,800 --> 00:42:57,079 ఉంటాను. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. 645 00:42:57,880 --> 00:43:00,840 విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆనందించారనుకుంటా. 646 00:43:00,920 --> 00:43:04,480 సూపర్‌మార్కెట్లకు ఎవరు వెళతారు? ఇది పని చేసింది. 647 00:43:04,559 --> 00:43:05,880 శుభోదయం, శుభోదయం. 648 00:43:08,840 --> 00:43:10,760 -ఇంకా ఏడు మిగిలాయి. -మంచిది. 649 00:43:10,840 --> 00:43:13,559 ఏడే ఉన్నాయి, అంతే, ఇప్పుడు ఇంకా 11:30 అయింది. 650 00:43:14,320 --> 00:43:16,119 ఎవరికైనా గొర్రె మాంసం కావాలా? 651 00:43:17,280 --> 00:43:19,679 దుకాణం చాలా రద్దీగా ఉంది. 652 00:43:19,800 --> 00:43:23,079 దీన్ని మూసేయడం బాధాకరం, 653 00:43:23,159 --> 00:43:25,559 ఎందుకంటే పాలు ఎనిమిది మైళ్ళ దూరంలో, 654 00:43:25,639 --> 00:43:27,320 గ్లాస్టర్‌షైర్‌లో ఉన్నాయి, 655 00:43:27,400 --> 00:43:30,079 కానీ ఆక్స్‌ఫర్డ్‌షైర్ నుండే తెచ్చే అనుమతి ఉంది. 656 00:43:33,039 --> 00:43:38,760 సెప్టెంబర్ 657 00:43:39,519 --> 00:43:43,559 ఇది నా మొట్టమొదటి వ్యవసాయ సంవత్సరం. 658 00:43:46,280 --> 00:43:50,559 అయినాగాని, నేను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని అనుకున్నాను. 659 00:43:52,559 --> 00:43:55,360 అందుకని, నా పాత గిడ్డంగి దగ్గర కేలెబ్‌ను కలిశాను. 660 00:43:55,440 --> 00:43:59,039 ఒక సింధూర చెక్క దూలానికి గోధుమ కట్టలు వేలాడదీశాను. 661 00:43:59,559 --> 00:44:01,760 ఇది వేడుకలా ఉంది. 662 00:44:01,840 --> 00:44:03,679 కోతలు ముగిశాక, వాటిని వేలాడదీశారు. 663 00:44:04,400 --> 00:44:06,800 గోధుమ వేళాడదీయడంతో పాటు, 664 00:44:06,880 --> 00:44:08,840 వేడుక చేసుకోడానికి మరొకటి ఉంది. 665 00:44:10,800 --> 00:44:14,280 వాళ్ళు ఇది చేయడానికి వీటిని ఉపయోగించారా? 666 00:44:14,360 --> 00:44:17,119 -ఇది బాగా కనిపిస్తుంది. -లేదు, ఇది పిచ్చిగా ఉంది. 667 00:44:17,199 --> 00:44:19,679 -దీనికి డబ్బులు చెల్లించావా? -అవును. 668 00:44:19,760 --> 00:44:21,719 ఇది-- నేను ఇది ఎలా చేశాను? 669 00:44:21,800 --> 00:44:23,920 కనీసం ఇదైనా ఎందుకు సరిగా చేయలేకపోయాను? 670 00:44:24,000 --> 00:44:26,400 నిచ్చెన ఎక్కి వచ్చే వాడిని, కానీ రాలేను. 671 00:44:26,480 --> 00:44:28,719 -ఎందుకు రాలేవు? -నన్ను కాల్చారు. 672 00:44:30,400 --> 00:44:31,480 ఏంటి? 673 00:44:31,559 --> 00:44:33,519 నా కాలులో కాల్చారు. 674 00:44:33,599 --> 00:44:35,920 -నిన్ను నిజంగా కాల్చారా? -అవును, నిజంగా. 675 00:44:36,000 --> 00:44:39,559 నిన్న నా స్నేహితులతో వలయంలా నిలబడి ఫుట్‌బాల్ ఆడుతున్నాను. 676 00:44:39,639 --> 00:44:43,719 అతను ఎయిర్ రైఫిల్‌తో "ప్రమాదవశాత్తు" నా కాలులో కాల్చాడు. 677 00:44:43,840 --> 00:44:45,400 -హాస్యమాడుతున్నావా? -పిక్కలో. 678 00:44:45,480 --> 00:44:48,960 -ఎయిర్ రైఫిల్‌తోనా? -4 మీ. దూరం నుండి .22 ఎయిర్ రైఫిల్‌తో. 679 00:44:49,039 --> 00:44:50,079 అయ్యో. 680 00:44:50,159 --> 00:44:53,400 ఇప్పడు పక్కు కడుతుంది. తూటా ఇంకా నా కాలులో ఉంది. ఇక్కడ. 681 00:44:54,039 --> 00:44:57,039 -కానీ అతను స్నేహితుడు కదా? -నా స్నేహితుడే, అవును. 682 00:44:57,119 --> 00:45:00,840 అయితే, అతను తన తుపాకీ తీసి, గుండ్లు నింపి, నీపై గురి పెట్టాడు. 683 00:45:00,920 --> 00:45:02,920 -అవును. -అప్పుడు నువ్వు ఏం అన్నావ్? 684 00:45:03,000 --> 00:45:06,199 -"నావైపు గురి పెట్టకు, వెధవ." -ఏమన్నా గొడవపడ్డారా? 685 00:45:06,280 --> 00:45:10,639 లేదు, లేదు, నాకు అతను ఎల్‌కేజీ అప్పటి నుండి ప్రాణ స్నేహితుడు. 686 00:45:10,719 --> 00:45:12,199 అది అనుకోకుండా జరిగిందన్నాడు. 687 00:45:12,280 --> 00:45:13,920 అది అనుకోకుండా ఎలా జరుగుతుంది, 688 00:45:14,000 --> 00:45:17,119 ఒకరిపై ఎయిర్ రైఫిల్ గురి పెట్టి, ట్రిగ్గర్ లాగడం? 689 00:45:17,199 --> 00:45:18,480 తెలియదు. 690 00:45:18,559 --> 00:45:22,480 నా తరువాతి సంభాషణ, అంతే ఇబ్బందికరంగా ఉంటుందని ఊహించాను. 691 00:45:23,880 --> 00:45:27,039 ఎందుకంటే ఆనందమయ చార్లీతో కూర్చుని 692 00:45:27,119 --> 00:45:31,480 పంట నుండి ఎంత రాబడి వచ్చిందో కనుగొనాల్సిన సమయం వచ్చింది. 693 00:45:32,360 --> 00:45:33,639 మనది అంతా పూర్తయింది. 694 00:45:33,719 --> 00:45:34,840 పంట పనులు ముగిశాయి. 695 00:45:34,920 --> 00:45:36,679 -బాగా చేశారు. -ధన్యవాదాలు. 696 00:45:36,760 --> 00:45:38,000 ఎలా అనిపిస్తుంది? 697 00:45:38,079 --> 00:45:41,559 ఇది... అంటే, నేను ఒక నిమిషంలో చెబుతాను, 698 00:45:41,639 --> 00:45:43,239 నువ్వు అంకెలు చెప్తావు. 699 00:45:43,320 --> 00:45:45,199 నువ్వు నాకు వాస్తవం చెప్తావు. 700 00:45:45,280 --> 00:45:47,599 -అంటే, మీకు తెలుసుగా... -మొదలుపెట్టాడు. 701 00:45:47,679 --> 00:45:49,719 సాధారణంగా, ఈ ఏడాది బాగా లేదు... 702 00:45:51,039 --> 00:45:52,320 వ్యవసాయానికి. 703 00:45:52,400 --> 00:45:54,719 నిన్న ది టైమ్స్‌లో చదివాను, 704 00:45:54,800 --> 00:45:58,519 రైతులకు 1976 నుండి ఇదే దారుణమైన సంవత్సరం. 705 00:45:58,599 --> 00:46:00,639 పొడి వేసవి. నాకది బాగా గుర్తుంది. 706 00:46:00,719 --> 00:46:03,199 నా ప్రాథమిక విద్య ఏట. నాకెందుకు ఏం లభించలేదు. 707 00:46:03,280 --> 00:46:04,519 గోధుమ - ఆవ నూనె గింజలు - బార్లీ - మొత్తం 708 00:46:04,599 --> 00:46:07,760 మనం ఈపైన డబ్బాలను చూద్దాం. నీలంవి చూడండి. 709 00:46:07,840 --> 00:46:09,199 మిమ్మల్ని భయపెడతాను. 710 00:46:09,280 --> 00:46:12,320 గత ఏడాది, 2,26,000 పౌండ్ల పంట రాబడి ఉంది. 711 00:46:12,400 --> 00:46:14,159 అది ఖర్చులకు ముందు. 712 00:46:14,239 --> 00:46:16,239 అయితే, 2,26,000 పౌండ్లు. 713 00:46:18,000 --> 00:46:20,039 -సరే. -ఈ ఏడాది 137. 714 00:46:20,119 --> 00:46:23,360 అంటే, అదే పొలం నుండి 90,000 పౌండ్లు తక్కువ. 715 00:46:23,440 --> 00:46:24,760 ఇది తొమ్మిది... 716 00:46:26,559 --> 00:46:30,360 -అది నమ్మశక్యంగా లేదు. -సరే, "నమ్మశక్యం కానిది" అనేది ఒక పదం. 717 00:46:30,840 --> 00:46:33,320 -అది 90,000 పౌండ్లు తక్కువ. -అవును. 718 00:46:33,400 --> 00:46:35,719 అది చాలా ఎక్కువ, 40 శాతం తక్కువ. 719 00:46:35,800 --> 00:46:38,519 90,000 పౌండ్లు వాతావరణం కారణంగా కోల్పోయాము. 720 00:46:39,599 --> 00:46:42,400 అయితే ఖర్చులు ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఎంత-- 721 00:46:42,480 --> 00:46:45,239 -అయితే ఇదిగోండి ఖర్చులు-- -మనం ఖర్చుపెట్టింది-- 722 00:46:45,320 --> 00:46:48,360 -విత్తనాల కోసం 14,000 పౌండ్లు. -విత్తనాల కోసం. 723 00:46:48,440 --> 00:46:53,280 34,000 పౌండ్లు ఎరువులకు, 20,000 పిచికారీలకు. 724 00:46:53,360 --> 00:46:56,119 సరే, 68,601 పౌండ్లు. 725 00:46:56,199 --> 00:47:01,559 ఆ తరువాత 68,457 పౌండ్ల ఖర్చులు. 726 00:47:01,639 --> 00:47:05,000 అది కేలెబ్‌కు, యంత్రాలకు. 727 00:47:05,960 --> 00:47:10,280 అయితే, మీకు సాగు చేసిన పొలాల నుండి 144 పౌండ్ల లాభం వచ్చింది. 728 00:47:19,320 --> 00:47:21,760 అందుకని, వాస్తవం ఏంటంటే, 729 00:47:21,840 --> 00:47:26,119 ఏడాది మొత్తం వారంలో ఏడు రోజులు వ్యవసాయం చేస్తే, 730 00:47:26,199 --> 00:47:30,960 వచ్చిన రాబడి 144 పౌండ్లా? 731 00:47:31,039 --> 00:47:32,280 అవును. 732 00:47:32,360 --> 00:47:35,679 అదృష్టవశాత్తు, మనకు ఈ సబ్సిడీ అందింది. అది... 733 00:47:36,960 --> 00:47:38,719 రైతులు ఏం చేస్తారు? 734 00:47:38,800 --> 00:47:40,679 నిజంగా, వాళ్ళు ఏం చేస్తారు? 735 00:47:40,760 --> 00:47:43,400 తమను అమెజాన్ ఫిల్మ్ సిబ్బంది అనుసరించని వారు, 736 00:47:43,480 --> 00:47:46,480 మీలో ఎవరు కోటీశ్వరులు? లో పాల్గొనని వారికి సంపాదన ఎలా? 737 00:47:46,559 --> 00:47:51,199 అంటే, సబ్సిడీ తగ్గిపోతుంటే ఏం చేస్తారు? 738 00:47:51,280 --> 00:47:55,719 ఊళ్ళల్లో పెను మార్పులు సంభవిస్తాయి. 739 00:47:55,800 --> 00:47:58,000 బహుశా 30 శాతం రైతులు తగ్గిపోతారు. 740 00:47:58,559 --> 00:48:01,840 కానీ ఈరోజు, ఈ కాలంలో వ్యవసాయం ఈ స్థితిలో ఉంది. 741 00:48:01,920 --> 00:48:04,519 ఈసారి రైతు వాతావరణం గురించి బాధపడుతుంటే... 742 00:48:07,079 --> 00:48:09,199 అతని చుట్టూ చేతుల వేసి, బీర్ కొనివ్వండి, 743 00:48:09,280 --> 00:48:13,960 ఎందుకంటే అతను వర్షంలో పని చేయడం దారుణంగా ఉంటుందని బాధపడడం లేదు, 744 00:48:14,039 --> 00:48:16,440 తీవ్రంగా నష్టపోయాడని బాధపడుతున్నాడు. 745 00:48:20,760 --> 00:48:22,800 నేను ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాను. 746 00:48:24,199 --> 00:48:26,679 నేను ఏడాదంతా కష్టపడితే 747 00:48:26,760 --> 00:48:30,400 నాకు 144 పౌండ్లు దక్కాయి. 748 00:48:31,559 --> 00:48:34,280 గ్రాంట్లు, సబ్సిడీలు కలిపినా కూడా, 749 00:48:34,360 --> 00:48:36,920 దానికంటే ఇది అమ్మేసి, డబ్బంతా బ్యాంకులో వేసి, 750 00:48:37,000 --> 00:48:40,360 వచ్చే వడ్డీతో హాయిగా జీవించవచ్చు. 751 00:48:43,159 --> 00:48:48,719 అయినా గడిచిన ఏడాది చాలా అద్భుతంగా ఉంది. 752 00:48:50,400 --> 00:48:54,760 నేను చేయగలనని ఎప్పుడూ అనుకోని చాలా విషయాలు చేయగలిగాను. 753 00:48:56,639 --> 00:48:58,639 నేను గొర్రెల కాపరిని అయ్యాను. 754 00:49:00,920 --> 00:49:02,039 ట్రాక్టర్ డ్రైవర్‌. 755 00:49:04,920 --> 00:49:06,119 దుకాణదారుడు. 756 00:49:09,519 --> 00:49:10,840 మంత్రసాని. 757 00:49:12,679 --> 00:49:14,079 ముఖ్య కార్మికుడు. 758 00:49:15,639 --> 00:49:17,239 ఒక ఇంజనీరు. 759 00:49:19,920 --> 00:49:21,559 పర్యావరణ సంరక్షకుడిని. 760 00:49:30,039 --> 00:49:32,599 డిడ్లీ స్క్వాట్‌లో అంతా 761 00:49:32,679 --> 00:49:37,159 అంతులేని సంతోషం, అంతులేని అసాధారణంగా వ్యవహరించే కుటుంబం. 762 00:49:54,000 --> 00:49:58,280 కానీ నేను మళ్ళీ ఇదంతా తిరిగి చేయగలనా... 763 00:50:00,320 --> 00:50:02,559 రోజుకు 40 పెన్స్‌లకంటే తక్కువ ఆదాయంతో? 764 00:50:06,960 --> 00:50:10,039 ఆ ప్రశ్న వెంటనే 765 00:50:10,119 --> 00:50:12,480 కోతల పండుగ పిక్నిక్‌లో తలెత్తింది. 766 00:50:18,840 --> 00:50:20,400 అవి. 767 00:50:21,599 --> 00:50:24,599 మనం వ్యవసాయం మొదలుపెట్టి ఒక ఏడాది, ఒక రోజు అయిందా? 768 00:50:24,679 --> 00:50:26,960 అవును. అది అయిపోయింది. 769 00:50:27,039 --> 00:50:29,440 నేను నిర్ణయించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, 770 00:50:29,519 --> 00:50:32,199 నేను ఎంచుకోవాలి, వాస్తవంగా. 771 00:50:32,280 --> 00:50:36,679 నేను తిరిగి లండన్‌కు వెళ్ళి నా పాత జీవితాన్ని కొనసాగించడం-- 772 00:50:36,760 --> 00:50:37,840 అవును, అదే చేయండి. 773 00:50:40,639 --> 00:50:43,760 -నువ్వసలు "లేదా" తరువాతది వినలేదు. -లేదు. అదే చేయండి. 774 00:50:43,840 --> 00:50:47,159 నాకు ఇప్పుడు తిరిగి లండన్‌కు వెళ్ళాలని లేదు. 775 00:50:47,239 --> 00:50:49,239 -ఎప్పటికీనా? -నాకిక్కడ సంతోషంగా ఉంది. 776 00:50:49,320 --> 00:50:51,920 మీకు లండన్ నచ్చుతుంది. మీకు లండన్ అంటే ఇష్టం. 777 00:50:52,519 --> 00:50:54,760 మీకు లండన్ సరిపోతుంది. 778 00:50:54,840 --> 00:50:56,920 ఇంకా లండన్‌లో స్నేహితులున్నారు. 779 00:50:57,000 --> 00:50:59,599 మీకు స్నేహితులు ఉన్నారు, అంటే చాలా మంది. 780 00:50:59,679 --> 00:51:01,719 మీకిక్కడా చాలా మంది స్నేహితులున్నారు. 781 00:51:03,400 --> 00:51:04,599 నేను ఉండాలంటున్నాడు. 782 00:51:06,199 --> 00:51:08,239 ఎందుకంటే అతనికి నేనో డబ్బు యంత్రాన్ని. 783 00:51:09,920 --> 00:51:13,760 బాగా ఆలోచిస్తుంటే, నువ్వు వ్యవసాయం చేయాలి. 784 00:51:13,840 --> 00:51:15,079 ఇక్కడ సంతోషంగా ఉన్నావు. 785 00:51:15,159 --> 00:51:17,559 నిజమే. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. 786 00:51:17,639 --> 00:51:21,239 గొర్రెలను పెంచుతున్నప్పుడు, ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానన్నాను. 787 00:51:21,320 --> 00:51:23,840 గొర్రెపిల్లలు వస్తున్నప్పుడు, ఆ రోజు బాగుంది, 788 00:51:23,920 --> 00:51:26,440 "పనిలో ఇంతకంటే సంతోషంగా ఎన్నడూ లేను" అన్నాను. 789 00:51:26,519 --> 00:51:27,960 -నిజంగానా? -లేదు. 790 00:51:28,039 --> 00:51:30,960 -ఆ రంగులు చూడండి. వసంతం రాబోతుంది. -అద్భుతంగా ఉంది. 791 00:51:31,039 --> 00:51:33,679 నిజానికి పొలం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. 792 00:51:33,760 --> 00:51:37,280 ఏ రోజైనా, అద్భుతంగా ఏదో ఒకటి ఉంటుంది. 793 00:51:37,960 --> 00:51:41,880 విషయం ఏంటంటే, ఈ షో ఇక ముగిసింది. 794 00:51:43,039 --> 00:51:44,280 ఇది. 795 00:51:44,360 --> 00:51:45,599 -అభినందనలు. -బాధాకరం. 796 00:51:45,679 --> 00:51:48,760 కానీ గడిచిన ఏడాదిలో మీ సహకారానికి చాలా ధన్యవాదాలు. 797 00:51:48,840 --> 00:51:49,840 అభినందనలు. 798 00:51:49,920 --> 00:51:52,079 మీ అందరికీ, చాలా ధన్యవాదాలు. 799 00:51:52,159 --> 00:51:53,920 నీ సహనానికి ధన్యవాదాలు. 800 00:51:54,000 --> 00:51:56,320 నేను ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఎక్కుతాను. 801 00:51:56,400 --> 00:51:58,920 నాతో వచ్చి, దానికి దుక్కియంత్రం పెట్టు. 802 00:51:59,000 --> 00:52:00,679 నేను ఇక దున్నుతాను. 803 00:52:00,760 --> 00:52:02,960 ఈరాత్రి పార్టీకి వెళుతున్నారనుకున్నాను. 804 00:52:05,760 --> 00:52:07,000 లండన్‌లో. 805 00:52:19,320 --> 00:52:22,000 మీరు చూస్తున్నారు... 806 00:52:23,039 --> 00:52:25,880 జెరాల్డ్ 807 00:52:25,960 --> 00:52:27,159 చార్లీ 808 00:52:29,119 --> 00:52:31,559 ఎలెన్ 809 00:52:31,639 --> 00:52:33,800 కెవిన్ 810 00:52:35,599 --> 00:52:38,039 లీసా 811 00:52:38,119 --> 00:52:40,320 కేలెబ్ 812 00:52:41,880 --> 00:52:45,280 మరియు జెరెమీలను 813 00:52:45,360 --> 00:52:48,119 చూడండి... 814 00:52:48,199 --> 00:52:53,760 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 815 00:53:19,639 --> 00:53:21,679 ఉపశీర్షికలు అనువదించినది: కర్త సమత 816 00:53:21,760 --> 00:53:23,760 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి