1 00:03:02,141 --> 00:03:06,937 కార్నివాల్ రో 2 00:03:22,453 --> 00:03:23,621 చూసుకో! చూసుకో! 3 00:03:50,689 --> 00:03:52,316 అసలేం జరుగుతోంది? 4 00:03:52,316 --> 00:03:55,736 ఇంకో క్రిచ్ దాడి అని విన్నాను. రేవు దగ్గర. 5 00:03:55,736 --> 00:03:57,571 రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. 6 00:03:57,696 --> 00:04:02,076 ఆ స్పారాస్‌లే, ఆశ్చర్యమేం లేదు. మన పక్కలలోనే పీకలు కోస్తారిక. 7 00:04:02,618 --> 00:04:05,537 లూయిసా, రా. మనం ఆరుబయట ఉండటం మంచిది కాదు. 8 00:04:09,833 --> 00:04:14,254 లియోనిడ్, స్పర్న్‌రోజ్ ఇంటి బయటంతా కానిస్టేబుల్స్ ఎందుకు ఉన్నారంటావు? 9 00:04:14,380 --> 00:04:18,300 చాలా కుతూహలంగా ఉంది. ఎజ్రా రెగుసా నుండి వచ్చేసాడేమో మరి. 10 00:04:19,093 --> 00:04:23,222 ఇమోజెన్ దొరికిందేమో తనకు? తను లేకుండా రానని ఒట్టేసాడుగా. 11 00:04:25,683 --> 00:04:27,476 ఏదేమైనా, మంచి పొరుగువారిగా, 12 00:04:27,476 --> 00:04:31,271 ఆ వార్త తెలుసుకోవటం మన బాధ్యత కాదంటావా? 13 00:04:38,862 --> 00:04:40,406 పక్కకు తప్పుకో, యువకుడా. 14 00:04:40,406 --> 00:04:41,949 అనుమతి గల సందర్శకులు మాత్రమే. 15 00:04:42,741 --> 00:04:43,951 ఏమన్నావు? 16 00:04:44,076 --> 00:04:46,495 సారీ, మేడమ్. నేను ఏం చేయలేను. 17 00:04:47,121 --> 00:04:49,790 నేను, నా సోదరుడు స్పర్న్‌రోజ్ గారి స్నేహితులం. 18 00:04:50,207 --> 00:04:51,834 ఇక, నువ్వు మంచిగా... 19 00:04:51,834 --> 00:04:53,460 డియర్, మేము లోనికి వెళ్లాలి. 20 00:04:53,460 --> 00:04:55,295 ఏమన్నా ఇబ్బందా, ఆఫీసర్? 21 00:04:58,090 --> 00:05:01,510 అస్ట్రేయన్ గారా? మీరేం చేస్తున్నారిక్కడ? 22 00:05:02,177 --> 00:05:04,013 ఎజ్రా ఇంకా ఇమోజెన్ ఎక్కడ? 23 00:05:12,813 --> 00:05:16,025 వెనక్కు జరుగు! వెనక్కు జరుగుమన్నాను. 24 00:05:17,192 --> 00:05:18,277 వస్తున్నారు. 25 00:05:30,372 --> 00:05:32,833 మనం రేవు వైపు వెళ్లాలి, మన ఓడ ఉందేమో చూసి-- 26 00:05:36,128 --> 00:05:39,423 మనం కదులుతూనే ఉండాలి. రండి. 27 00:05:40,966 --> 00:05:41,967 సరే. 28 00:06:36,438 --> 00:06:38,065 కామ్రేడ్స్, ఇటువైపు. 29 00:06:39,525 --> 00:06:40,526 త్వరగా. 30 00:06:46,740 --> 00:06:47,741 అరే రండి. 31 00:06:58,836 --> 00:07:01,213 పోరులో చేరటానికి మాకు ఆయుధాలు కావాలి. 32 00:07:01,922 --> 00:07:04,007 ఎవరు వెనక్కి వెళ్లి తేగలరు? 33 00:07:06,677 --> 00:07:08,762 కామ్రేడ్, నువ్వు వెళ్లు. 34 00:08:34,056 --> 00:08:35,057 అగ్రియస్. 35 00:08:40,854 --> 00:08:41,855 పరిగెత్తు, ఇమోజెన్. 36 00:08:44,191 --> 00:08:45,234 -పో. -అగ్రియస్! 37 00:09:07,506 --> 00:09:10,217 మనమిక్కడ ఉండలేము. 38 00:09:12,219 --> 00:09:15,055 సముద్రాన్ని వదిలేసి సరిహద్దుల గుండా పారిపోదాం. 39 00:09:15,055 --> 00:09:16,723 ఇప్పుడే, ఇమోజెన్. ఇమోజెన్. 40 00:09:16,723 --> 00:09:19,017 -ఏంటి? -పాక్ట్‌కు లొంగిపోదాం. 41 00:09:19,017 --> 00:09:21,603 మనం బర్గిష్ అని చెబుదాం. వాళ్లు మన మిత్రులే. 42 00:09:21,603 --> 00:09:23,438 మూర్ఖత. అగ్రియస్‌ను చంపేస్తారు. 43 00:09:23,438 --> 00:09:26,817 లేదు, లేదు. మన సేవకుడని చెబుదాం. రిస్క్ తీసుకుందాం. 44 00:09:26,817 --> 00:09:28,402 -నీకోసం. -ఇమోజెన్, నేను-- 45 00:09:28,402 --> 00:09:29,486 చాలిక! 46 00:09:37,619 --> 00:09:38,996 ఇమ్, నేలమీద వెళదాం. 47 00:09:38,996 --> 00:09:42,499 పోరు దాటేసామంటే, మన అవకాశాలు చూసుకుందాం. సరేనా? 48 00:09:42,499 --> 00:09:45,210 సరే. నువ్వు కావాలంటే ఉండు. 49 00:11:41,493 --> 00:11:43,495 అంతకుముందే నీళ్లు కావాలి. 50 00:11:45,330 --> 00:11:47,332 దానిని పట్టి ఉంచటానికి ఏమీ లేవు. 51 00:11:48,625 --> 00:11:49,626 నిజం. 52 00:11:51,086 --> 00:11:52,087 స్పర్న్‌రోజ్ గారు, 53 00:11:53,630 --> 00:11:55,549 మీరు బిజీగా లేరంటే, 54 00:11:57,134 --> 00:12:00,762 నీళ్లు తెచ్చుకోవటానికి ఏదన్నా వెతికి పెడతారా? 55 00:12:02,389 --> 00:12:06,101 ఓహ్, సరే, సర్. మీ సందేశం అందింది, అస్ట్రేయన్ గారు, 56 00:12:06,101 --> 00:12:08,311 మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. 57 00:12:08,311 --> 00:12:10,230 లేదు, తెలియదు. 58 00:12:12,023 --> 00:12:14,067 నేనే మీరైతే కనుక సంతోషించేవాడిని. 59 00:12:26,705 --> 00:12:29,708 ఇక్కడ పెత్తనం ఎవరిదో స్పష్టంగా తెలుస్తోంది, కాదా? 60 00:12:31,334 --> 00:12:34,045 నిన్ను నువ్వు నిందించుకోకూడదు. అస్సలు కూడదు. 61 00:12:34,463 --> 00:12:37,090 నా సోదరీమణులను అసలు నియంత్రించలేకపోయాను. 62 00:12:37,716 --> 00:12:39,134 నీ మీద ఇంకేం ఆశ పెట్టుకోను? 63 00:12:40,635 --> 00:12:42,471 అదంతా అనవసరం, కదా? 64 00:12:43,847 --> 00:12:46,766 ఈ నరకం నుండి బయటపడ్డాక, మనం మళ్ళీ కలవటం సందేహమే. 65 00:12:46,766 --> 00:12:49,352 ప్రమాణమా? త్వరగా జరిగితే బాగుండు. 66 00:12:49,769 --> 00:12:51,021 అదిగో వచ్చేసింది. 67 00:12:52,189 --> 00:12:53,565 మా సోదరి వచ్చేసింది. 68 00:12:54,357 --> 00:12:57,027 సరే, ఆ స్వరం బాగా వింటావిక. 69 00:12:57,903 --> 00:13:01,990 చూడు, నాలాగా డార్లింగ్ ఇమోజెన్ గురించి నీకు తెెలియదు. 70 00:13:01,990 --> 00:13:04,701 ఆమె పూర్తిగా కుత్సితమే. 71 00:13:04,701 --> 00:13:08,580 ఇమోజెన్ నాకు తెలిసిన మంచి స్త్రీ. 72 00:13:10,665 --> 00:13:13,543 అది నీకు తెలియకపోతే, నీ కర్మ. 73 00:13:13,543 --> 00:13:16,171 తను నిన్ను చిటికెనవేలికి చుట్టేసుకుంది. 74 00:13:16,963 --> 00:13:21,301 ఆమె ఏదో నైతిక విలువలకు ప్రతీక అనుకోవచ్చు. 75 00:13:21,301 --> 00:13:25,597 -పాపం దెయ్యపు హృదయం వాడా-- -నాలుక అదుపులో పెట్టుకొంటే మంచిది. 76 00:13:35,148 --> 00:13:37,108 -నాకు పెళ్లయ్యేది. -ఎజ్రా, వద్దు-- 77 00:13:37,108 --> 00:13:40,070 కానీ డియర్ ఇమోజెన్ నా కన్యా సోదరిగా ఉండిపోవటానికి 78 00:13:40,070 --> 00:13:41,780 అస్సలు ఇష్టపడలేదు. 79 00:13:41,780 --> 00:13:44,783 "సిగ్గుచేటు, ఎజ్రా! సిగ్గుచేటు." 80 00:13:45,575 --> 00:13:47,494 చూసారా, సర్, ఇమోజెన్ అబద్ధాలకోరు. 81 00:13:47,994 --> 00:13:51,915 నాకు సంతోషాన్నిస్తుంది అనిపించే అమ్మాయి దొరికిందంటే చాలు, 82 00:13:52,040 --> 00:13:54,751 మా చెల్లి వచ్చి విషం కక్కేది. 83 00:13:54,876 --> 00:13:58,588 నేను నియంతనని, రాక్షసుడినని పుకారు బాగా వ్యాపించేది. 84 00:13:58,588 --> 00:14:00,840 నేను తనను కొట్టేవాడినని. 85 00:14:00,840 --> 00:14:02,634 వెంటనే, ఆ స్త్రీ మాయం అయిపోయేది, 86 00:14:02,759 --> 00:14:06,137 మళ్లీ ఆ పాత ఇంటిలో నేనూ తనూ సణుక్కుంటూ ఉండేవాళ్ళం. 87 00:14:06,137 --> 00:14:09,182 నేను ఇంకో స్త్రీని కలిసేదాకా, సంతోషపు ఇంకో అవకాశం, 88 00:14:09,182 --> 00:14:12,435 -మరింత విషం. అబద్ధాలు. -నిన్ను వదిలేసేది దానికి కాదు! 89 00:14:12,435 --> 00:14:15,313 తన అబద్ధాల వలలో తానే చిక్కుకుంది, కదా? 90 00:14:16,189 --> 00:14:19,901 అందమైన స్పర్న్‌రోజ్ గారు ఎలాంటి పామో అందరికీ తెలిసి 91 00:14:20,026 --> 00:14:24,197 ఆమె కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి. 92 00:14:24,197 --> 00:14:26,950 -తన మాటలు వినకు. -నా మాటలు విను. 93 00:14:26,950 --> 00:14:29,995 అగ్రియస్, నా మాటలు విను, నీ మంచి కోసం. 94 00:14:31,705 --> 00:14:34,499 ఆమెకు ఎందుకు పెళ్ళికాలేదని ఎప్పుడూ అనుకోలేదా? ఆ. 95 00:14:34,874 --> 00:14:36,209 తను అందగత్తె. 96 00:14:36,668 --> 00:14:39,504 మంచి గౌరవప్రదమైన కుటుంబం, 97 00:14:39,504 --> 00:14:43,174 అయినా నువ్వు రాగానే, తను మగవాడికోసం ఎంత వెంపర్లాడుతుందంటే, 98 00:14:43,174 --> 00:14:45,468 ట్రోతో కూడా పడుకోవటానికి సిద్ధమైంది. 99 00:14:46,219 --> 00:14:51,433 నువ్వు పక్కింటికి రావటం తన జీవితానికెల్లా అదృష్టవంతమైన రోజు. 100 00:14:51,933 --> 00:14:55,145 ఆమె ప్రతిష్ట గురించి తెలియనివాడు 101 00:14:55,270 --> 00:14:57,772 పరువు పోవటానికి పరువే లేనివాడు. 102 00:15:20,712 --> 00:15:24,215 ఆ మాటలన్నింటికీ మన్నించు. 103 00:15:28,219 --> 00:15:30,180 నేనిప్పుడు చాలా మారాను. 104 00:15:30,722 --> 00:15:32,599 నిన్ను నేను తర్కించకూడదు. 105 00:15:33,933 --> 00:15:35,393 కచ్చితంగా అంటావా? 106 00:15:46,488 --> 00:15:50,617 నేను ఐదేళ్లపాటు కార్గో ఓడలో రక్తం చిందించాను. 107 00:15:54,329 --> 00:15:57,123 ఒక రాత్రి, ఇంకా కాంట్రాక్టులో మూడేళ్లు మిగిలి ఉండగా, 108 00:15:58,792 --> 00:16:01,461 నా తోటి పనివారు పారిపోయారు. 109 00:16:03,463 --> 00:16:05,882 తరువాతి ఉదయం, ఫోర్‌మన్ వచ్చి అన్నాడు 110 00:16:05,882 --> 00:16:10,929 వాళ్ళ ఆచూకీ తెలిపినవారికి, 200 వందల బంగారు నాణేలు, స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు. 111 00:16:13,682 --> 00:16:16,059 ఎంత దారుణం. ఎవరైనా నలిగిపోతారు. 112 00:16:16,184 --> 00:16:17,185 నేను కాదు. 113 00:16:19,854 --> 00:16:21,398 నేను వెంటనే చెప్పేసాను. 114 00:16:23,733 --> 00:16:25,485 క్షణం కూడా ఆలోచించలేదు. 115 00:16:27,112 --> 00:16:29,572 నాకు స్వేచ్ఛ లభించే అవకాశం వచ్చింది. 116 00:16:32,158 --> 00:16:33,243 నేను తీసుకున్నాను. 117 00:16:36,329 --> 00:16:37,831 నేనూ ఊహించగలనంతే. 118 00:16:40,333 --> 00:16:41,710 అంతే అనుకుంటాను... 119 00:16:43,837 --> 00:16:45,714 మనుగడకోసం పోరాడావనుకుంటాను. 120 00:16:51,720 --> 00:16:52,804 కానీ ఇంకా ఉంది. 121 00:16:56,599 --> 00:16:57,684 నాకు ఇంకా కావాలి. 122 00:17:00,520 --> 00:17:01,855 మనుగడను మించి. 123 00:17:04,107 --> 00:17:05,817 నాకు అసలైన స్వేచ్ఛ కావాలి, 124 00:17:07,527 --> 00:17:10,447 డబ్బు, భద్రత. 125 00:17:13,199 --> 00:17:15,076 ఆస్తి సంపాదించాలనుకున్నాను. 126 00:17:16,995 --> 00:17:18,580 స్కిప్‌జాక్‌గా చేరాను, 127 00:17:20,999 --> 00:17:22,500 ఫే కాందిశీకులను వేటాడాను. 128 00:17:26,087 --> 00:17:27,130 బాగా చేసేవాడిని. 129 00:17:28,798 --> 00:17:30,049 వాళ్లు నన్ను నమ్మారు. 130 00:17:31,134 --> 00:17:32,427 నేను వారిలో ఒకడిని. 131 00:17:34,679 --> 00:17:38,516 వాళ్లు తిరిగి పోరాడితే, నేను బలం వాడేవాడిని, అప్పట్లో చచ్చేంత బలం. 132 00:17:38,516 --> 00:17:41,978 తెలుసా, నియమాలు ఉల్లంఘించారు, కాంట్రాక్ట్ మీద సంతకం చేసారు-- 133 00:17:46,274 --> 00:17:48,359 వాళ్ల మీద జాలే వేసేది కాదు. 134 00:17:56,242 --> 00:18:01,247 నా సంపాదనంతా వారి రక్తంతో తడిసినదే. 135 00:18:06,795 --> 00:18:07,796 దేవుడా. 136 00:18:12,300 --> 00:18:15,887 సారీ, నేను అన్నీ వెనక్కి తీసేసుకుంటాను. 137 00:18:16,888 --> 00:18:19,516 మీరిద్దరూ గంతకు తగ్గ బొంత. 138 00:18:31,486 --> 00:18:32,487 అది పాక్ట్. 139 00:18:32,779 --> 00:18:33,780 ఏం చేద్దాం? 140 00:18:34,280 --> 00:18:35,281 వ్యూహం! 141 00:18:35,657 --> 00:18:37,158 ఇక్కడే ఉండు, వారిని పోనివ్వు. 142 00:18:38,451 --> 00:18:40,411 ఆ తరువాత లోయలో వారిని చుట్టుముడదాం. 143 00:18:41,496 --> 00:18:44,874 అవసరం లేదు. మనల్ని పరిచయం చేసుకుందాం. 144 00:18:44,874 --> 00:18:47,377 మూర్ఖుడిలాగా చేయకు. అగ్రియస్‌ను చంపేస్తారు-- 145 00:18:48,878 --> 00:18:53,007 కావాలంటే పారిపో. నిన్ను కాల్చను. కానీ నా చెల్లిని తాకావంటే-- 146 00:18:56,427 --> 00:18:57,387 -కాపాడండి! కాపాడండి! -ఆపు! 147 00:18:57,387 --> 00:18:58,847 -దయచేసి! కాపాడండి! -ఆపు! 148 00:19:06,980 --> 00:19:09,023 కాపాడండి! కాపాడండి! 149 00:19:58,698 --> 00:19:59,699 వెళ్ళిపోయారు. 150 00:20:45,787 --> 00:20:48,206 కత్తుల కంటే పదును 151 00:20:49,165 --> 00:20:53,086 మన స్వీయ హృదయ రక్తం కారుతుంది 152 00:20:54,253 --> 00:20:56,506 వచ్చే జన్మలోకి 153 00:21:00,468 --> 00:21:02,178 అది నీ తప్పు కాదని నీకు తెలుసు. 154 00:21:05,431 --> 00:21:07,225 మనల్ని కాపాడుకోవటానికి చంపేసావు. 155 00:21:11,229 --> 00:21:13,856 ఎజ్రా గురించి అసలు నేను ఆలోచించట్లేదు. 156 00:21:16,693 --> 00:21:18,361 అలా అంటే నన్ను ఏమనుకోవాలి? 157 00:21:19,112 --> 00:21:20,738 నువ్వు షాకులో ఉన్నావని. 158 00:21:27,120 --> 00:21:28,621 పర్వాలేదు, బంగారం. 159 00:21:31,958 --> 00:21:33,167 నేను చూసుకుంటాను. 160 00:21:36,462 --> 00:21:38,881 ఎజ్రా కూడా సరిగ్గా అదే అనేవాడు. 161 00:21:42,093 --> 00:21:43,761 నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. 162 00:21:43,761 --> 00:21:45,513 ఏం చేయాలో నాకు చెప్పకు. 163 00:21:50,143 --> 00:21:51,519 నేను అనుకోవటం-- 164 00:21:52,186 --> 00:21:55,023 నా మంచి చెడు నీకు తెలుసు. అంతేగా, ఎప్పటిలాగానే. 165 00:21:55,565 --> 00:21:56,607 ఐ లవ్ యూ. 166 00:21:57,191 --> 00:21:58,234 అవును. 167 00:21:59,110 --> 00:22:01,446 అది నా మీద పెత్తనం చేసే లైసెన్స్ నీకు. 168 00:22:03,990 --> 00:22:04,991 కాదు. 169 00:22:07,660 --> 00:22:10,830 నువ్వు జరిగినదానికి స్పందిస్తున్నావు. నీలాగా నువ్వు లేవు. 170 00:22:13,875 --> 00:22:14,959 నువ్వెవరు? 171 00:22:16,085 --> 00:22:20,923 నీ స్వేచ్ఛ నీకెంత ఇష్టమంటే, అపరిచితులను దాస్యంలోకి అమ్మేస్తావు. 172 00:22:22,008 --> 00:22:24,886 మిగతావారిని సంకెళ్లల్లలో బంధించి 173 00:22:24,886 --> 00:22:26,971 ఆస్తిని, పేరును సంపాదించుకున్నావు. 174 00:22:28,264 --> 00:22:30,266 కానీ నాకు అలా జరగనివ్వను. 175 00:22:30,808 --> 00:22:33,144 నేను నిన్ను అదుపు చేయటం లేదు, ఇమోజెన్. 176 00:22:33,144 --> 00:22:34,270 చేయట్లేదా? 177 00:22:35,855 --> 00:22:40,610 నన్ను ప్రేమించాల్సినవాళ్ల నుండి జీవితాంతం ఆదేశాలు స్వీకరిస్తూనే ఉన్నాను. 178 00:22:42,070 --> 00:22:44,781 నవ్వుమని లేదా నోరు మూసుకోమని, ఏదో ఒకటి. 179 00:22:45,573 --> 00:22:48,451 ఎలా బట్టలు వేసుకోవాలి, ఏం ఆశించాలి 180 00:22:48,451 --> 00:22:52,246 నేను కలలు కనే అవకాశం ఎంత తక్కువో కూడా. 181 00:22:53,956 --> 00:22:58,086 నన్ను అదుపు చేయాలనుకోవటాన్ని నేను ఇట్టే పసిగట్టగలను. 182 00:22:59,170 --> 00:23:00,838 నేను నీ అన్నను కాను! 183 00:23:00,838 --> 00:23:02,465 లేదు, నువ్వింకా దారుణం! 184 00:23:02,465 --> 00:23:06,302 తనలాగా ఉండటానికి నువ్వు ఎన్నో దారుణాలు చేసావు. 185 00:23:06,969 --> 00:23:09,222 తను ఇంకా సంకుచిత స్వభావులు 186 00:23:09,222 --> 00:23:12,892 అందరూ లోకంలోని అన్ని జీవుల తలరాతపై పెత్తనం చేయాలనుకుంటారు. 187 00:23:12,892 --> 00:23:14,143 నీకు అధికారం కావాలి. 188 00:23:14,727 --> 00:23:16,854 కానీ నా మీద అధికారం మాత్రం నీకివ్వను. 189 00:23:17,563 --> 00:23:22,235 నేను లోకం కోసం నీ డ్రాయింగ్ రూమ్‌లో పెట్టే 190 00:23:22,235 --> 00:23:23,569 గాజు బొమ్మను కాను. 191 00:23:23,569 --> 00:23:27,198 నాకోసం అన్నీ ఎంచటానికి నేను మతిలేని పిల్లను కాను. 192 00:23:27,198 --> 00:23:30,409 నేను నీ సొంతం కాదు. నేను నా స్వంతం. 193 00:23:30,827 --> 00:23:32,829 నాకు నీ రక్షణ అవసరం లేదు. 194 00:23:33,621 --> 00:23:35,706 ఈరోజు నాకు స్వేచ్ఛ లభించింది. 195 00:23:36,624 --> 00:23:39,377 నేను దానిని మగవాడి ప్రేమ కోసం తాకట్టు పెట్టలేను. 196 00:23:41,254 --> 00:23:42,463 నీ ప్రేమ కోసం కూడా. 197 00:23:54,809 --> 00:23:57,937 కామ్రేడ్స్, మీరు దొరకటం చాలా సంతోషం. 198 00:23:59,021 --> 00:24:02,150 మేము-- మా యూనిట్ పైన ఇంతకుముందే దాడి జరిగింది... 199 00:24:03,234 --> 00:24:04,360 మేము దారి తప్పాము. 200 00:24:19,542 --> 00:24:21,002 మేము ఆశలు వదిలేసుకున్నాం. 201 00:24:22,753 --> 00:24:25,631 అదృష్టవశాత్తూ, మీరు సంకేతం వదిలారు. 202 00:25:12,678 --> 00:25:13,679 అగ్రియస్. 203 00:25:16,015 --> 00:25:17,058 కనిపిస్తున్నారు. 204 00:25:38,496 --> 00:25:40,790 మీ అన్నను సమాధి చేసే సమయం వచ్చింది. 205 00:25:47,421 --> 00:25:48,839 దయచేసి, వద్దు. నేను... 206 00:25:50,675 --> 00:25:51,759 ఇది ఆదేశం... 207 00:25:54,220 --> 00:25:55,263 కామ్రేడ్స్. 208 00:26:00,434 --> 00:26:01,477 చూడకు. 209 00:26:11,612 --> 00:26:12,655 వద్దు. 210 00:26:19,662 --> 00:26:20,663 ఇమోజెన్. 211 00:26:21,414 --> 00:26:22,999 ఇమోజెన్. నన్ను చూడు. 212 00:27:06,083 --> 00:27:07,585 రెగుసా సంపన్నులు, 213 00:27:11,380 --> 00:27:12,548 పెత్తనందారులు, 214 00:27:15,134 --> 00:27:17,636 అస్సలు నేర్చుకోవటానికి ఇష్టపడరు. 215 00:27:20,431 --> 00:27:21,807 విషాదం. 216 00:27:22,975 --> 00:27:25,519 నాకు ఇదే కావాలని మీరు అనుకుంటారుగా. 217 00:27:26,395 --> 00:27:30,107 నా శత్రువుల కుళ్లిన శవాలను సంతోషంతో చూస్తానని. 218 00:27:31,984 --> 00:27:36,155 కానీ నాకు సిగ్గేస్తుందంతే. 219 00:27:38,324 --> 00:27:41,035 విప్లవం నది లాంటిదనుకున్నాను. 220 00:27:41,869 --> 00:27:46,040 అది పెరిగి పెద్దదై శక్తివంతంగా మారి 221 00:27:46,999 --> 00:27:50,336 లోకంలోని కుళ్లునంతా కడిగేస్తుందనుకున్నాను. 222 00:27:54,840 --> 00:27:56,342 కానీ నాదే తప్పు. 223 00:27:58,052 --> 00:27:59,720 ఇది నది కాదు. 224 00:28:02,098 --> 00:28:03,891 ఇది పెనుతుఫాను. 225 00:28:05,518 --> 00:28:08,771 దారిలో అన్నింటినీ నాశనం చేస్తుంది. 226 00:28:15,528 --> 00:28:20,825 ఆఖరికి శాంతి లభించిందంటే మనం శిథిలాల మీద సంబరాలు చేసుకోవాలి. 227 00:28:26,622 --> 00:28:28,040 కానీ అప్పుడే కాదు. 228 00:28:29,542 --> 00:28:32,962 పాక్ట్ సైన్యం అందరినీ తరిమేసాము, 229 00:28:33,754 --> 00:28:35,840 కానీ వాళ్లు ఇంకా ఓటమిని అంగీకరించట్లేదు. 230 00:28:36,298 --> 00:28:39,051 బర్గ్ ఇంకా వారి మిత్రులే. 231 00:28:40,344 --> 00:28:45,182 మీరు ఇష్టంగా మా పక్షానికి వచ్చి పోరాడుతారు అనుకున్నాను, 232 00:28:45,975 --> 00:28:48,102 కానీ అలా అవ్వలేదు. 233 00:28:48,436 --> 00:28:52,273 మమ్మల్ని చంపాలనుకుంటే, కాల్చేసి పని పూర్తి చేయవచ్చుగా? 234 00:28:53,482 --> 00:28:56,110 మీ అన్నను చేరుకోవటానికి అంత తొందరా? 235 00:28:56,485 --> 00:28:58,654 జైలులో మగ్గిపోవటం కంటే అదే నయం. 236 00:28:59,321 --> 00:29:01,907 నా మనస్సులో మాటలవి... 237 00:29:03,367 --> 00:29:05,870 మనకు చాలా పోలికలున్నాయి. 238 00:29:07,913 --> 00:29:11,083 ఇంకా దగ్గరయ్యే సమయం ఉంటే బాగుండేది, 239 00:29:12,042 --> 00:29:13,377 కానీ లేదు. 240 00:29:14,420 --> 00:29:17,965 బదులుగా, మిమ్మల్ని బర్గ్‌కు పంపించాలి. 241 00:29:20,593 --> 00:29:21,635 ఏంటి? 242 00:29:25,389 --> 00:29:29,435 కాస్టర్‌తోపాటు నా దూతలుగా, 243 00:29:30,436 --> 00:29:33,772 త్వరగా వెళ్లటానికి వీలుగా వ్యోమనౌకను ఇస్తాను. 244 00:29:34,857 --> 00:29:36,942 నా సందేశాన్ని వారికి ఇవ్వాలి. 245 00:29:37,526 --> 00:29:40,571 అది మీరు సంతోషంగా ఇస్తారని తెలుసు. 246 00:29:41,363 --> 00:29:44,158 ఎందుకు? ఏంటా సందేశం? 247 00:29:45,242 --> 00:29:49,622 శాంతి ఒడంబడికలు, మీ దేశం, మా దేశం మధ్య. 248 00:29:50,873 --> 00:29:54,668 అప్పుడే మా పెనుతుఫాను మీ దేశాన్ని తాకకుండా ఉంటుంది, 249 00:29:55,544 --> 00:30:00,382 మీరు మీ బర్గ్‌లో శవాలదిబ్బలను చూడరు. 250 00:30:02,885 --> 00:30:04,011 అయితే, 251 00:30:06,180 --> 00:30:08,974 పార్లమెంటుకు మా షరతులు అందిస్తారా? 252 00:30:21,820 --> 00:30:22,988 వరుసలో! 253 00:30:23,948 --> 00:30:25,241 వరుసలో! 254 00:30:31,080 --> 00:30:32,706 ఇది మరీ వెర్రితనం. 255 00:30:32,706 --> 00:30:34,583 జెంటిల్మెన్, మాటలు వింటామన్నాము. 256 00:30:34,583 --> 00:30:36,460 మనమిక్కడ మరీ బలహీనం. 257 00:30:36,460 --> 00:30:39,588 సంజ్ఞ కూడా పెట్టుకోవాల్సింది, "డిన్నరు సిద్దమని." 258 00:30:39,588 --> 00:30:41,715 మిల్‌వర్తీ, త్వరగా పూర్తి చేయాలిది. 259 00:30:42,424 --> 00:30:47,846 స్పర్న్‌రోజ్ గారు, అస్ట్రేయన్ గారు, కాస్టర్ గారేగా? 260 00:30:47,846 --> 00:30:49,807 కామ్రేడ్ కాస్టర్, అనండి. 261 00:30:49,807 --> 00:30:50,849 ఓహ్, మంచిది. 262 00:30:50,849 --> 00:30:53,519 న్యూ డాన్ దూతలు కదా మీరు-- 263 00:30:53,644 --> 00:30:55,688 అది మా ప్రభుత్వం అస్సలు గుర్తించదు. 264 00:30:55,813 --> 00:30:59,191 అందుకే మేము సమయం తీసుకొని మీతో కలవటానికి వచ్చాము. 265 00:30:59,191 --> 00:31:00,734 చాలా సంక్షిప్త సమావేశం. 266 00:31:00,859 --> 00:31:04,363 జెంటిల్మెన్, చెప్పాలంటే, అది మనకే మంచిది-- 267 00:31:04,363 --> 00:31:07,950 మీలాంటివారంతా రోలో బందీలయ్యారు, వారికి తగ్గ చోటులో. 268 00:31:07,950 --> 00:31:10,578 అందుకే, మీరు నోరు మూసుకుంటే మంచిది. 269 00:31:12,913 --> 00:31:15,499 పాప, నువ్వు చెప్పు. మాకు రోజంతా లేదు. 270 00:31:18,877 --> 00:31:22,214 న్యూ డాన్ తరపున సంధి సమాచారం తెచ్చాను. 271 00:31:22,214 --> 00:31:25,551 పార్లమెంట్ అంగీకరించదు. బర్గ్ పాక్ట్‌ మిత్రులు. 272 00:31:25,551 --> 00:31:29,013 పాక్ట్‌కు ఆయుధాల పంపిణీని వెంటనే ఆపాలని న్యూ డాన్ కోరిక. 273 00:31:29,013 --> 00:31:31,432 అలాంటప్పుడు, మీరు ఇక మిత్రులవ్వరు. 274 00:31:31,432 --> 00:31:33,017 అది సరళం చేస్తుంది కదా. 275 00:31:33,017 --> 00:31:35,603 అది మరీ అత్యాశ. స్పర్న్‌రోజ్ గారు, 276 00:31:35,936 --> 00:31:39,732 మీరు పార్లమెంటులో ఈ సోదిని చెప్పకూడదు. 277 00:31:39,732 --> 00:31:43,193 ఫ్లెచర్ గారు, ఆగండి. ఇక, ఇక్కడ అయిపోతే... 278 00:31:44,278 --> 00:31:46,405 మీలాగే నేనూ బర్గిష్‌ను జెంటిల్మెన్. 279 00:31:47,281 --> 00:31:49,241 నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. 280 00:31:49,241 --> 00:31:52,995 పార్లమెంటుతో మాట్లాడటానికి నేను పెద్ద రిస్క్ తీసుకొని వచ్చాను, 281 00:31:52,995 --> 00:31:55,706 నేను వారితో మాట్లాడే తీరుతాను అది నా హక్కు 282 00:31:55,706 --> 00:31:58,417 స్వేచ్ఛా నాగరికురాలిగా ఇంకా కౌన్సిలుకు చెప్పగల 283 00:31:58,417 --> 00:32:02,379 ఆస్తి హక్కున్నదానిగా, మరీ ముఖ్యంగా ఈ యుద్ధ సమయంలో. 284 00:32:03,255 --> 00:32:05,716 ఆ చట్టం మన నేలంతా ప్రాచీనం, బర్గిష్‌లు ఎవరూ 285 00:32:05,716 --> 00:32:08,719 మీ రిపబ్లిక్ పునాది సాంప్రదాయాలను కొట్టేయలేరు. 286 00:32:08,719 --> 00:32:10,137 నన్ను నిరాకరించలేరు. 287 00:32:11,639 --> 00:32:14,266 స్పర్న్‌రోజ్ గారు సరిగ్గా చెప్పారు. 288 00:32:15,059 --> 00:32:20,230 చట్టపరంగా, ఆమె మాటలు మనం వినాల్సిందే. 289 00:32:20,230 --> 00:32:23,359 అందుకే న్యూ డాన్ నిన్ను పంపినట్టుంది. 290 00:32:25,277 --> 00:32:26,945 అవును, మీరు సరిగ్గా చెప్పారు. 291 00:32:28,405 --> 00:32:30,491 అయితే, మరి, మేము ఏర్పాట్లు చేస్తాము. 292 00:32:32,076 --> 00:32:34,119 ఏం చేస్తున్నావో నీకు తెలిస్తే చాలు. 293 00:32:42,961 --> 00:32:45,130 అస్ట్రేయన్ గారు? ఏంటిది... 294 00:32:47,007 --> 00:32:48,592 ఎజ్రా ఇంకా ఇమోజెన్ ఎక్కడ? 295 00:32:50,094 --> 00:32:51,970 లూయిసా. లియోనిడ్. 296 00:32:53,347 --> 00:32:54,348 హలో. 297 00:32:56,392 --> 00:32:57,935 డియర్, నువ్వు... 298 00:33:00,688 --> 00:33:01,689 నువ్వు చాలా... 299 00:33:03,524 --> 00:33:06,902 -అంటే నా ఉద్దేశం-- -నీ రాక మాకు సంతోషంగా ఉందని. 300 00:33:06,902 --> 00:33:09,113 నీ గురించి చాలా కంగారుపడ్డాము. 301 00:33:09,488 --> 00:33:10,572 మరీ దయ మీది. 302 00:33:13,242 --> 00:33:15,244 మీ అన్న ఎక్కడ? 303 00:33:15,494 --> 00:33:20,082 చివరిసారిగా కలిసినప్పుడు తను నీ పోకడ గురించి కొంచెం కంగారు-- 304 00:33:20,082 --> 00:33:21,542 ఎజ్రా చనిపోయాడు. 305 00:33:26,130 --> 00:33:27,965 మార్టియర్ పేరు మీద, పాపం. 306 00:33:29,258 --> 00:33:32,094 -ఎలా చనిపోయాడో అడగవచ్చా-- -అనుకోకుండా. 307 00:33:38,100 --> 00:33:40,144 ఎందుకు, మరి, నీకు తోడు ఎవరు? 308 00:33:40,269 --> 00:33:43,397 కచ్చితంగా. అంటే, నువ్విక్కడ ఒంటరిగా... 309 00:33:44,273 --> 00:33:45,315 ఉండటం లేదుగా? 310 00:33:46,442 --> 00:33:47,484 ఉండట్లేదు. 311 00:34:01,832 --> 00:34:06,211 సరే, అంటే, నువ్వు అలసిపోయుంటావు, డియర్. 312 00:34:06,837 --> 00:34:11,258 అవును. ఏమన్నా కావాలంటే అడగండి. 313 00:34:23,353 --> 00:34:25,063 మన్నించాలి, నీ చేయి ముద్దాడాను. 314 00:34:27,191 --> 00:34:28,567 నీది తీసుకున్నాను, సారీ. 315 00:35:19,618 --> 00:35:21,078 తను మనలో అత్యుత్తముడు. 316 00:35:31,505 --> 00:35:35,467 బెర్విక్ నిన్ను నమ్మాడు! నేను కూడా! 317 00:35:38,554 --> 00:35:40,013 ఈ స్పారాస్ మగది. 318 00:35:41,098 --> 00:35:43,517 మనిషి రూపంలో, నువ్వు మనిషిని వెతుకుతున్నావు. 319 00:35:43,517 --> 00:35:45,853 నీకెలా తెలుసు ఇదంతా? 320 00:35:45,853 --> 00:35:48,939 మగది ఆడది వేరుగా చంపబడతాయి. 321 00:35:48,939 --> 00:35:51,024 మగవాటికి పెద్ద వెన్నుకోరలుంటాయి. 322 00:35:51,024 --> 00:35:52,109 మళ్లీ చెప్పు? 323 00:35:52,109 --> 00:35:53,944 వాటి వెన్ను మీద కోరలు. 324 00:35:54,278 --> 00:35:57,698 బెర్విక్ శవాన్ని చూస్తుంటే నాకు... 325 00:35:58,907 --> 00:36:00,033 అది మగది. 326 00:36:02,369 --> 00:36:03,912 అదెలా సహాయం చేస్తుంది? 327 00:36:04,830 --> 00:36:06,039 అది సగం తగ్గిస్తుంది. 328 00:36:06,039 --> 00:36:08,584 సగం సిటీకా? 329 00:36:09,501 --> 00:36:12,129 ఎవరికి సహాయం చేస్తున్నావా? మాకా? 330 00:36:12,713 --> 00:36:17,968 లేదా టిర్ననాక్ వెళ్లటానికి ప్రయత్నించినందుకు సిగ్గు పడుతున్నావా 331 00:36:17,968 --> 00:36:22,472 నీ క్రిచ్ స్నేహితులతో కలిసి, ఇప్పుడిక బెర్విక్ చనిపోయాడు? 332 00:36:24,349 --> 00:36:27,519 నీకు తెలియాలి అంతేగా. నీకు తెలుసిక. 333 00:36:31,607 --> 00:36:32,608 సరిగ్గా చెప్పావు! 334 00:36:34,443 --> 00:36:38,697 అయితే, ఇది మగది. ఇంకేమన్నా తెలుసా? 335 00:36:41,617 --> 00:36:43,660 సార్జెంట్! ఇలా రా. 336 00:36:51,418 --> 00:36:54,087 అయ్య బాబోయ్. బర్గిష్ మెరైన్‌లు. 337 00:36:54,796 --> 00:36:57,341 అలలు ఇంకా తెస్తున్నాయి. ఇంకా డజన్ల కొద్దీ. 338 00:36:59,092 --> 00:37:00,469 వాళ్లు ఓడలలో ఉన్నారు. 339 00:37:02,846 --> 00:37:04,514 బేల్‌ఫైర్ సైన్యాన్ని పంపుతుంది. 340 00:37:05,140 --> 00:37:06,141 దేనికి? 341 00:37:06,558 --> 00:37:10,103 ఫే సంతోషంగా వెళ్లిపోతున్నారు. వాళ్లేం ఇబ్బంది పెట్టరు. 342 00:37:12,564 --> 00:37:14,399 వాళ్లు ఫే కోసం లేరక్కడ. 343 00:37:15,359 --> 00:37:17,486 టిర్ననాక్‌ను మళ్లీ ఆక్రమించబోయారు. 344 00:37:38,131 --> 00:37:39,383 లోపలికి వెళ్లండి. 345 00:37:39,383 --> 00:37:41,843 లోపలికి వెళ్లండి! కదలండి! 346 00:37:41,843 --> 00:37:44,930 టార్మలీన్? టార్మలీన్. టార్మలీన్! 347 00:37:45,097 --> 00:37:48,475 లోపలికి, కదలండి! 348 00:37:49,059 --> 00:37:51,478 మార్టియర్ దయ! నీకేం కాలేదుగా? 349 00:37:52,062 --> 00:37:53,105 నేను చూసానది. 350 00:37:53,939 --> 00:37:55,607 నాకోసం వస్తున్న దానిని చూసాను. 351 00:37:56,608 --> 00:37:59,444 అంటే, వచ్చినా కానీ, అది నన్ను దాటుకొని వెళ్ళాలి. 352 00:38:07,494 --> 00:38:08,704 నిజమా? 353 00:38:09,454 --> 00:38:12,332 మీ రేవన్ మోసం చేసిందట. అంటే అవునా? 354 00:38:13,625 --> 00:38:16,044 విన్యెట్? విన్యెట్! 355 00:38:24,136 --> 00:38:25,178 విన్యెట్. 356 00:38:26,847 --> 00:38:27,973 ఏం చేస్తున్నావు? 357 00:38:27,973 --> 00:38:31,059 రేవన్‌కు కలవమని సందేశం. తనను చూసుకో. 358 00:38:31,059 --> 00:38:32,644 తనను తప్పుకోనివ్వకు. 359 00:38:32,644 --> 00:38:36,440 బ్లాక్ రేవన్ వెర్రి తలలు వేసింది. వారికి దూరంగా ఉండు నువ్వు. 360 00:38:36,440 --> 00:38:39,317 ఆ ఓడలే మనందరికీ మార్గం. మనకు దారి! 361 00:38:39,317 --> 00:38:43,363 నాకైతే కాదు. నటించటం బాగానే ఉంది కానీ జోస్యం ఎప్పుడూ తప్పదు 362 00:38:43,780 --> 00:38:46,033 అలా అనకు. నిన్ను తప్పిస్తాను. 363 00:38:49,077 --> 00:38:50,454 తను నిన్ను తప్పిస్తుంది. 364 00:38:51,538 --> 00:38:54,499 తనొక్కతే రేవన్‌కు ఎదురు తిరిగి. 365 00:38:54,499 --> 00:38:57,377 వాళ్లంతా దాక్కుంటున్నారు. వాళ్లను ఎవరన్నా పట్టుకో... 366 00:38:58,503 --> 00:38:59,546 నీకు దొరికితే? 367 00:39:00,589 --> 00:39:02,340 వారిని ఆపే మార్గం చూస్తాను. 368 00:39:25,322 --> 00:39:27,240 విన్యెట్, ఆగు! చెప్పనివ్వు. 369 00:39:29,993 --> 00:39:31,995 -ఆగేవాడివా? -ఓహ్, వెధవ! 370 00:39:31,995 --> 00:39:35,582 ఇంటికి వెళ్లే ఒకే ఒక మార్గం! చివరి ఆశ, దానిని లాగేసుకున్నావు! 371 00:39:35,582 --> 00:39:36,958 నా మాట విను అంతే. 372 00:39:39,795 --> 00:39:41,797 -ఆగు! -కైన్, చావు. 373 00:39:42,297 --> 00:39:43,298 లేదు! 374 00:40:08,824 --> 00:40:11,243 ద్రోహుల్లారా! మీరంతా. 375 00:40:12,577 --> 00:40:15,163 సరే మరి, సరే, శాంతించు, మిస్సీ. 376 00:40:15,789 --> 00:40:20,627 చూడు, తనను నేను తీసుకుంటాను. ఇంకా తన తలమీద పెద్ద మొత్తమే ఉంది. 377 00:40:21,044 --> 00:40:23,755 చెప్పాలంటే, అద్దెలో తగ్గిస్తాను. 378 00:40:24,005 --> 00:40:28,426 పది రూపాయలకు కన్నార్పకుండా అమ్మను కూడా అమ్మేస్తావు. కానీ మీరంతా? 379 00:40:28,593 --> 00:40:31,513 ఊనా సిగ్గుపడేది. తను మనందరి స్వేచ్ఛ కోరుకుంది 380 00:40:31,513 --> 00:40:33,056 దానిని లాగేసుకున్నారు. 381 00:40:33,974 --> 00:40:35,475 విన్నీ, తప్పు. 382 00:40:35,684 --> 00:40:39,938 వాళ్లను స్వేచ్ఛలోకి తీసుకెళ్లటం లేదు. ఇంకో జైలుకు అంతే. 383 00:40:43,024 --> 00:40:45,193 ఏమంటున్నావు నువ్వు? 384 00:41:04,296 --> 00:41:05,338 నీకు తెలుసా? 385 00:41:06,464 --> 00:41:08,633 -ఏం తెలియాలి? -ట్రూప్స్, 386 00:41:10,051 --> 00:41:11,178 మన ఓడలలో? 387 00:41:11,803 --> 00:41:15,724 ఫైలో. నాకు ఆ ఓడలు అంత త్వరగా ఎలా దొరికాయంటావు? 388 00:41:15,724 --> 00:41:19,436 నేను మిలటరీని ఒప్పించాను ఫేలను తీసుకెళ్లటానికి-- 389 00:41:19,436 --> 00:41:23,523 వాళ్లెలాగైనా అక్కడికే వెళుతున్నారు. టిర్ననాక్‌పై ఆక్రమణకు. 390 00:41:24,191 --> 00:41:26,610 అవును, పాక్ట్ వెనక్కి తగ్గింది. 391 00:41:26,610 --> 00:41:31,531 పాత కాలనీలు వదిలేసారు, ఇప్పుడు పార్లమెంటుకు అవి కావాలి. 392 00:41:34,034 --> 00:41:36,703 పిక్స్ ఇంటిని దొంగిలించి. 393 00:41:39,664 --> 00:41:41,374 అదెలా ఫేలకు సహాయం చేస్తుందట? 394 00:41:42,250 --> 00:41:44,336 మార్టియర్ కోసం, ఫైలో, 395 00:41:45,170 --> 00:41:47,923 రో నుండి వారు తప్పించుకొనే మార్గం చూసాను. 396 00:41:49,883 --> 00:41:52,594 ఎన్ని ఒప్పందాలు చేయాల్సి వచ్చిందో నీకు తెలియదు, 397 00:41:52,594 --> 00:41:56,598 ఆ చెత్త మనుషుల తోటి, వారి పెత్తనపు కలల తోటి 398 00:41:56,598 --> 00:41:58,475 లోకాధికారపు జాడ్యం తోటి. 399 00:42:00,185 --> 00:42:02,395 ఒక్క క్షణం, ఆ అవకాశం రాగానే, 400 00:42:02,395 --> 00:42:05,398 ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాను, ఫేల సహాయానికి. 401 00:42:05,398 --> 00:42:09,319 ఆ పిరికిపందలను మాయ చేసాను 402 00:42:09,986 --> 00:42:13,281 ఫేలను అడ్డు పెట్టుకొని వారి మిలటరీ కుట్రలు చేయవచ్చని. 403 00:42:14,532 --> 00:42:17,494 ఓడలను కావాలని నెమ్మదింపజేసాను అది జరగటానికి. 404 00:42:23,625 --> 00:42:25,252 కానీ ఇప్పుడు, ఇదంతా చూడు. 405 00:42:27,295 --> 00:42:29,172 వీళ్లంతా చనిపోయి... 406 00:42:32,634 --> 00:42:36,721 దానికి నన్ను నేనే నిందించుకోవాలి. 407 00:42:46,982 --> 00:42:48,650 రేవన్‌కు తెలిసిపోయింది. 408 00:42:53,071 --> 00:42:54,572 అందుకే వారు దాడి చేసారు. 409 00:42:56,950 --> 00:42:59,494 ఆ ఓడలు మొదటి ట్రూపులను పంపిస్తున్నాయి. 410 00:42:59,494 --> 00:43:02,330 అవి రేవు దాటకముందే వాటిని ముంచేయాల్సి వచ్చింది. 411 00:43:02,622 --> 00:43:04,541 ఫేలు ఎక్కకముందే. 412 00:43:06,459 --> 00:43:09,796 కానీ మనవారిని మేమే బాధిస్తున్నామని నువ్వు అనుకోవటం ఘోరం. 413 00:43:11,256 --> 00:43:15,885 విన్నీ, నిన్ను మోసం చేస్తున్నారు. అందరినీ మోసం చేస్తున్నారు. 414 00:43:17,387 --> 00:43:19,514 స్పారాస్‌తో ఎందుకు చేరారు మరి? 415 00:43:19,514 --> 00:43:23,935 బ్లాక్ రేవన్ చావుకు అవి కారణమని అనలేదా? 416 00:43:25,020 --> 00:43:27,605 అవి మనుషులను, ఫేలను చంపుతున్నాయి. 417 00:43:28,815 --> 00:43:30,650 మనిద్దరి మధ్య గొడవలు పెడుతున్నాయి. 418 00:43:32,402 --> 00:43:36,197 ఒక మంచి పోలీసు వాడు, నాకు తెలిసి బెస్ట్, 419 00:43:36,906 --> 00:43:38,408 అది తెలుసుకున్నాడు. 420 00:43:40,285 --> 00:43:41,703 ప్రశ్నేంటంటే, ఎందుకు? 421 00:43:42,620 --> 00:43:45,874 ఫైలో, న్యూ డాన్ గురించి నీకేం తెలుసు? 422 00:43:47,083 --> 00:43:49,669 టిర్ననాక్ స్వేచ్ఛను బర్గ్ ఎప్పుడూ కోరుకోదు. 423 00:43:51,129 --> 00:43:52,505 నేను మూర్ఖురాలిని. 424 00:43:53,923 --> 00:43:57,093 తను చెప్పటానికి చూసింది, నేనే వినదలుచుకోలేదు. 425 00:43:59,012 --> 00:44:01,264 మనమింకా ఓడిపోలేదు, విన్నీ. 426 00:44:01,848 --> 00:44:03,099 కొత్త స్నేహితులున్నారు. 427 00:44:04,017 --> 00:44:05,810 మనం ఒంటరిగా పోరాడట్లేదు. 428 00:44:08,229 --> 00:44:09,356 స్నేహితులెవరు? 429 00:44:10,482 --> 00:44:14,110 కొత్త సంధి కోసం నిన్న దూతలు వచ్చారు. 430 00:44:14,110 --> 00:44:15,278 అనుకూల సమయం. 431 00:44:15,653 --> 00:44:19,157 మా గూఢచారులు పాక్ట్ లొంగిపోయే దశలో ఉందని తెలిపారు. 432 00:44:19,157 --> 00:44:22,786 న్యూ డాన్ ఇప్పుడే బర్గ్ అతి పెద్ద శత్రువును మట్టి కరిపించింది. 433 00:44:26,164 --> 00:44:30,627 ఇది న్యూ డాన్ అయితే కనుక, వాళ్లు శాంతి కోరుకోవట్లేదు. 434 00:44:32,879 --> 00:44:34,672 వాళ్లు విప్లవం తెస్తున్నారు. 435 00:44:38,218 --> 00:44:40,720 కామ్రేడ్, బ్లాక్ రేవన్ వందనాలు. 436 00:44:44,766 --> 00:44:46,434 నడిపించటానికి సిద్ధమా? 437 00:46:39,547 --> 00:46:41,549 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 438 00:46:41,549 --> 00:46:43,635 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్