1 00:00:38,706 --> 00:00:40,791 స్టార్ బోర్డ్ వైపు అంతా బాగానే ఉంది. 2 00:01:10,571 --> 00:01:12,615 భయపడాల్సింది ఏమీలేదు. 3 00:01:12,615 --> 00:01:14,575 పాక్ట్ నాగరిక దేశం. 4 00:01:14,575 --> 00:01:16,702 మనల్ని ముంచేయాలని చూసారు. 5 00:01:16,702 --> 00:01:17,995 హెచ్చరిక షాట్లు... 6 00:01:19,205 --> 00:01:22,458 నియమబద్ధంగా చేసారు. అది పద్ధతి అంతే. మనకేం ప్రమాదం లేదు. 7 00:01:22,458 --> 00:01:25,169 తుపాకీ అడ్డం పెట్టి పాక్ట్‌కు లాక్కెళతారా? 8 00:01:25,169 --> 00:01:28,297 పాక్ట్ పాత, అవినీతిమయ రాష్ట్రం. అది డబ్బు మీద నడుస్తుంది. 9 00:01:28,297 --> 00:01:31,467 మన స్వేచ్ఛతో సహా దేనినైనా డబ్బుతో కొనవచ్చు. 10 00:01:31,467 --> 00:01:35,012 -అదే నాగరిక లోకపు తీరు. -అగ్రియస్, నేను బర్గిష్‌ను. 11 00:01:35,012 --> 00:01:38,849 కొన్నేళ్ల క్రితమే మనం వాళ్ళతో యుద్ధం చేసాము. ఇక, అంటే... 12 00:01:39,850 --> 00:01:42,645 మనిద్దరం కలిసి, మనలాంటివాళ్లం... 13 00:01:42,645 --> 00:01:44,104 మనమేంటి? 14 00:01:45,231 --> 00:01:47,525 నువ్వు మంచి కుటుంబపు అమ్మాయివి, 15 00:01:47,525 --> 00:01:50,528 నేను సంపన్నుడిని. అదే ముఖ్యం చివరిగా. 16 00:01:51,070 --> 00:01:52,363 డబ్బు స్థాయి అంతే. 17 00:01:54,532 --> 00:01:55,533 రా. 18 00:01:56,367 --> 00:01:57,743 రేవుకు వెళుతున్నాం, సార్. 19 00:01:57,743 --> 00:01:59,495 -ఎక్కడ? -రెగుసా, సార్. 20 00:02:00,037 --> 00:02:00,996 మంచిది. 21 00:02:02,039 --> 00:02:05,000 అక్కడ చాలామంది తెలుసు. ఇబ్బందులేం ఉండవు. 22 00:02:05,751 --> 00:02:10,965 రా, ప్రియా. అందమైన ప్రాచీన నగరం దాని హార్బరు కూడా చాలా బాగుంటుంది. 23 00:02:12,675 --> 00:02:13,759 పైకి వెళదామా? 24 00:02:26,188 --> 00:02:29,733 రెగుసా రేవు 25 00:03:16,238 --> 00:03:17,323 జరుగు! 26 00:03:28,334 --> 00:03:29,335 జరుగు! 27 00:03:33,005 --> 00:03:34,089 జరుగు! 28 00:03:36,216 --> 00:03:37,718 లైనులో నిల్చోండి. 29 00:03:37,718 --> 00:03:39,219 ఖైదీలు సిద్దం. 30 00:03:39,762 --> 00:03:41,055 బాగా చేసారు. 31 00:03:41,055 --> 00:03:42,723 బాగా చేసారు, కామ్రేడ్స్. 32 00:03:46,393 --> 00:03:47,645 ఇది విపరీతం. 33 00:03:47,645 --> 00:03:50,856 మీరు మీ మనుషులపై అదుపు కోల్పోయారా, సార్, 34 00:03:50,856 --> 00:03:53,692 లేదంటే నా సంపద దోపిడీకి ఆదేశాలు ఇచ్చారా? 35 00:03:53,692 --> 00:03:56,445 దోపిడీనా? లేదు, ఇది దోపిడీ కాదు. 36 00:03:57,613 --> 00:03:59,531 ఇది ఒకరకంగా... 37 00:03:59,531 --> 00:04:00,741 పునఃపంపిణీ. 38 00:04:00,741 --> 00:04:01,867 లెఫ్టినెంట్. 39 00:04:10,209 --> 00:04:11,669 రాణిగారిని తీసుకెళ్లండి. 40 00:04:14,046 --> 00:04:16,256 -వద్దు. తాకవద్దు. -ఇమోజెన్, నన్ను చూడు. 41 00:04:17,007 --> 00:04:18,050 -పరవాలేదు. -వద్దు. 42 00:04:18,050 --> 00:04:20,469 -తీసుకెళ్లవద్దు... -తనను వదిలేయండి! 43 00:04:20,469 --> 00:04:22,012 -వద్దు! -చాలిక. 44 00:04:24,181 --> 00:04:28,185 అగ్రియస్. వద్దు. తనను కొట్టవద్దు! 45 00:04:28,978 --> 00:04:29,895 ఇమోజెన్. 46 00:05:41,091 --> 00:05:45,512 కార్నివాల్ రో 47 00:05:57,191 --> 00:06:01,403 మానవ హంతకుడు దేహాన్ని అంత పైకి వేలాడదీయటం కష్టం. 48 00:06:01,403 --> 00:06:03,530 నా మాట ఒక్కటన్నా విన్నావా? 49 00:06:03,530 --> 00:06:07,534 ప్రతి మాటా. మీ వాళ్ళెవరూ ఆ రైలులో ఎవరినీ చంపలేదు అంటావు. 50 00:06:07,534 --> 00:06:10,287 ఒక్కరినీ. వాళ్ళు దానికే అర్హులైనా గానీ. 51 00:06:10,287 --> 00:06:12,289 ఆ ఆఫీసర్ ప్రాణాలను నేనే కాపాడాను. 52 00:06:12,289 --> 00:06:14,917 మీ వాళ్లెవరూ చేయలేదని నువ్వు నమ్ముతున్నావులా ఉంది. 53 00:06:14,917 --> 00:06:16,794 పోలీసులే ఇదంతా రచించి ఉంటారు. 54 00:06:16,794 --> 00:06:19,671 నీ పాత స్నేహితులు చేయరంటావా? 55 00:06:19,671 --> 00:06:22,549 సమస్యలు రావు అనుకుంటే కచ్చితంగా చేస్తారు, 56 00:06:22,549 --> 00:06:25,594 కానీ రైలు దోపిడీకి మీ అందరినీ కూడా ఉరివేసేవారు. 57 00:06:25,594 --> 00:06:28,388 -అసలు సీరియస్‌గా తీసుకుంటున్నావా? -తీసుకుంటున్నాను. 58 00:06:29,973 --> 00:06:32,184 అయితే ఏం చేయబోతున్నావు? 59 00:06:33,644 --> 00:06:36,271 రాత్రికి బేల్‌ఫైర్‌లో పార్టీ ఇస్తున్నారు. 60 00:06:36,980 --> 00:06:39,191 పార్లమెంట్‌లో సగం అక్కడే ఉంటారు. 61 00:06:39,191 --> 00:06:43,278 -రాజకీయవేత్తలు, దౌత్యులు... -దానికీ దీనికీ ఏంటి సంబంధం? 62 00:06:50,202 --> 00:06:51,203 నువ్వు... 63 00:06:54,748 --> 00:06:55,666 ఈ రాత్రి వద్దు. 64 00:06:56,375 --> 00:06:58,085 ఇంకా మంచి సమయం వస్తుందంటావా? 65 00:06:58,085 --> 00:07:00,504 తెలియదు, ఎప్పటికీ చెయ్యకూడదేమో? 66 00:07:01,672 --> 00:07:03,090 మనం మాట్లాడుకున్నాంగా. 67 00:07:06,135 --> 00:07:08,428 నా దగ్గర ఇంకేం ఎత్తు లేదు ఇది తప్ప. 68 00:07:08,428 --> 00:07:10,889 వాళ్ల చేతిలో త్వరగా చచ్చిపోవటానికి ఇదే మార్గం. 69 00:07:10,889 --> 00:07:14,852 రాత్రికి బేల్‌ఫైర్‌లోకి దారి దొరికింది. ఇంకో అవకాశం రాకపోవచ్చు. 70 00:07:14,852 --> 00:07:16,520 చూడు, మన్నించు. 71 00:07:18,313 --> 00:07:20,899 -ఇలా చెప్పాలని నాకు లేదు. -లేదు. 72 00:07:21,567 --> 00:07:25,154 మళ్లీ తప్పించుకొని మిమా చేత చెప్పించుండాల్సింది. మళ్లీ. 73 00:07:28,490 --> 00:07:29,616 విన్యెట్... 74 00:07:30,409 --> 00:07:32,953 నువ్వు నిర్ణయించేసుకున్నట్టున్నావు. 75 00:07:34,413 --> 00:07:36,081 నిర్ణయించేసుకున్నాను. 76 00:07:36,081 --> 00:07:39,585 ఆ డబ్బున్న వాళ్ళందరూ నీ మాటను ఇట్టే నమ్మేస్తారు కదా. 77 00:07:39,585 --> 00:07:41,336 ఒక సంకర జాతి 78 00:07:41,336 --> 00:07:44,423 జోనా బ్రేక్‌స్పియర్‌కు ఛాన్సిలర్ అయ్యే అర్ఙత లేదనటం. 79 00:07:44,423 --> 00:07:47,926 నేను కుటుంబంతో తేనీటి విందులను ఆశించట్లేదు. 80 00:07:49,094 --> 00:07:52,097 కానీ వాళ్ళు నిజం తెలుసుకుంటారు, అదీ ముఖ్యం. 81 00:07:52,097 --> 00:07:56,518 వాళ్ళ నిన్ను కూపంలో పడేసి స్వీటు ముగియకముందే నీ గురించి మరిచిపోతారు. 82 00:07:59,771 --> 00:08:00,939 అబ్బా. 83 00:08:01,815 --> 00:08:05,360 అది ముగిసాక, చక్కబడ్డాక, నేను నీకు కబురు పంపిస్తాను. 84 00:08:06,862 --> 00:08:08,197 అలాగా? 85 00:08:08,197 --> 00:08:10,991 అయితే అది జైలు నుండా లేక శ్మశానం నుండా? 86 00:08:13,619 --> 00:08:16,788 దయచేసి నా గురించి కంగారుపడకు. 87 00:08:16,788 --> 00:08:19,416 ఈసారి నీకోసం ఏడవను కూడా ఏడవను. 88 00:08:31,386 --> 00:08:33,388 -అలాగే మరి, అయితే. -సరే మరి అయితే. 89 00:08:40,562 --> 00:08:41,772 ఫైలో. 90 00:08:44,358 --> 00:08:45,567 నువ్వు మూర్ఖుడివి. 91 00:08:49,821 --> 00:08:51,573 మీ వాళ్ళను జాగ్రత్తగా ఉండమను. 92 00:08:52,616 --> 00:08:56,245 రేపటికల్లా, బేల్‌ఫైర్‌కు బ్లాక్ రేవన్ కన్నా పెద్ద సమస్యలు వస్తాయి, 93 00:10:13,864 --> 00:10:14,990 అకోస్! 94 00:10:16,450 --> 00:10:17,826 -హే. -హే. 95 00:10:22,581 --> 00:10:24,374 -ఎలా ఉన్నావు? -బాగున్నాను. 96 00:10:24,374 --> 00:10:25,542 అవునా? 97 00:11:02,704 --> 00:11:03,872 ఈ చోటు ఏంటి? 98 00:11:04,623 --> 00:11:06,333 నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? 99 00:11:07,250 --> 00:11:09,628 ఎక్కడికి వెళుతున్నావు? నీతోనే మాట్లాడుతుంది. 100 00:11:17,928 --> 00:11:20,972 నిన్నే. ఈ ఇంటి యజమాని ఎక్కడ? 101 00:11:23,266 --> 00:11:24,476 లియోనోరా. 102 00:11:25,268 --> 00:11:26,269 నా పేరు. 103 00:11:27,312 --> 00:11:29,064 లియోనోరా అని పిలవవచ్చు. 104 00:11:31,400 --> 00:11:32,401 ఎంత మర్యాదో. 105 00:11:33,402 --> 00:11:35,195 సరే మరి, లియోనోరా. 106 00:11:35,195 --> 00:11:37,531 ఈ ఇంటి యజమాని ఎక్కడ? 107 00:11:40,075 --> 00:11:41,535 ఇక్కడే ఎక్కడో ఉంటారు. 108 00:11:43,245 --> 00:11:45,414 అతనేనా, ఆ ఆఫీసరేనా? 109 00:11:48,834 --> 00:11:50,419 నన్ను ఇక్కడెందుకు వదిలేసారు? 110 00:11:51,670 --> 00:11:54,089 కొంచెం సేపట్లో తెలుస్తుంది, బంగారం. 111 00:11:54,089 --> 00:11:58,718 -ఈ చోటు ఏంటి? ఇక్కడేం చేస్తారు? -అవి ఇలా ఇవ్వు, సంతోషంగా చెపుతాను. 112 00:12:02,055 --> 00:12:04,599 అస్సలు ఇవ్వను. ఇదేంటో నాకు చెప్పు. 113 00:12:04,599 --> 00:12:05,851 ఇది ఇల్లు. 114 00:12:06,601 --> 00:12:08,311 ఇక్కడ జనాలు పడుకుంటారు. 115 00:12:08,311 --> 00:12:09,729 ఇది వంటిల్లు. 116 00:12:09,729 --> 00:12:13,400 ఇక్కడ వండుతారు, తింటారు, కొన్నిసార్లు, 117 00:12:15,402 --> 00:12:16,778 భోజనం సిద్ధంగా ఉంటే. 118 00:12:16,778 --> 00:12:18,447 వంటిల్లు ఏంటో నాకు తెలుసు. 119 00:12:18,447 --> 00:12:22,409 అలాగా? బంగాళాదుంప ఎలా చేయాలో తెలుసా? 120 00:12:23,743 --> 00:12:25,662 ఎగతాళి కాదు. 121 00:12:25,662 --> 00:12:27,080 నాకు జవాబులు కావాలి. 122 00:12:28,874 --> 00:12:31,835 అలసిపోయాను, ఇంటికి చాలా దూరం వచ్చాను, 123 00:12:31,835 --> 00:12:33,795 అగ్రియస్ ఎక్కడున్నాడో తెలియదు, 124 00:12:33,795 --> 00:12:35,672 అసలేం అర్థం కావట్లేదు. 125 00:12:36,298 --> 00:12:37,883 ఎందుకు బంగారం? 126 00:12:39,551 --> 00:12:42,679 అంటే నేను బర్గిష్. 127 00:12:43,430 --> 00:12:44,598 చెప్పక్కరలేదు. 128 00:12:45,557 --> 00:12:48,351 నాకు తెలిసిన పాక్ట్ కాదిది. 129 00:12:48,351 --> 00:12:49,853 -కాదా? -కాదు. 130 00:12:50,937 --> 00:12:54,900 పాక్ట్ నిక్కచ్చి భూస్వామ్య రాష్ట్రం, చాలా దారుణమైన చోటు. 131 00:12:54,900 --> 00:12:56,735 ఒకప్పుడు. 132 00:12:56,735 --> 00:12:59,237 -ఒకప్పుడా? -దారుణమైన చోటు. 133 00:13:00,697 --> 00:13:03,700 ఆ తరువాత మా దేశానికి కొత్త వెలుగు వచ్చింది. 134 00:13:04,659 --> 00:13:07,037 నీకు తెలిసిన పాక్ట్ లేదిక. 135 00:13:07,037 --> 00:13:08,038 దాదాపు పోయింది. 136 00:13:08,914 --> 00:13:10,707 కానీ పాక్ట్ చాలా శక్తివంతమైనది. 137 00:13:10,707 --> 00:13:12,501 జనాలు శక్తివంతులు. 138 00:13:13,376 --> 00:13:17,088 వాళ్ళ ప్రభుత్వం పరాన్నజీవి, వారి మీద పడి బతుకుతుంది. 139 00:13:17,714 --> 00:13:21,885 మేమంతా ఐక్యంగా నిలిచి వారి పని పట్టటం మొదలుపెట్టాక మారింది. 140 00:13:22,469 --> 00:13:25,680 తిరుగుబాటు అంటున్నావా? 141 00:13:25,680 --> 00:13:27,015 కచ్చితంగా. 142 00:13:27,015 --> 00:13:28,225 అది అనివార్యం. 143 00:13:29,059 --> 00:13:33,271 జనాలు స్వేచ్ఛాజీవులమని సదా అని గుర్తించటం మొదలయింది. 144 00:13:34,272 --> 00:13:36,608 పాక్ట్ భూస్వాముల సంగతేంటి? 145 00:13:40,278 --> 00:13:43,114 ఆ కేరెట్‌లు ఇస్తావా? 146 00:13:47,869 --> 00:13:48,745 దయచేసి? 147 00:13:57,045 --> 00:13:58,046 ధన్యవాదాలు. 148 00:14:00,048 --> 00:14:02,425 నాకు సహాయం చేయటానికి అంత బాధేంటి? 149 00:14:02,425 --> 00:14:03,510 నువ్వు సేవకురాలివి. 150 00:14:03,510 --> 00:14:06,555 మనిద్దరం సూప్ తాగుతాం. చేయటంలో సహాయం చేస్తే తప్పేంటి? 151 00:14:06,555 --> 00:14:07,847 అది పద్ధతి కాదు. 152 00:14:10,559 --> 00:14:13,603 పక్ ప్రేమికుడు పద్ధతా మరి. 153 00:14:15,313 --> 00:14:16,314 మన్నించాలి? 154 00:14:16,314 --> 00:14:18,400 నువ్వు పక్‌తో వచ్చావని విన్నాను. 155 00:14:18,400 --> 00:14:19,818 పెద్ద స్కాండల్ కదా. 156 00:14:19,818 --> 00:14:21,611 అది నీకు సంబంధం లేనిది. 157 00:14:21,611 --> 00:14:23,238 లోకులు కాకులు అంతే. 158 00:14:23,238 --> 00:14:25,657 వారి జీవితంలో ఏమీ ఉండదు కనుక, 159 00:14:25,657 --> 00:14:28,368 మిగతావారి జీవితంలోని మంచిని తక్కువ చేసి చూస్తారు. 160 00:14:28,368 --> 00:14:30,245 నువ్వు అంతే అనుకుంటావా? 161 00:14:30,245 --> 00:14:34,374 నేను కలిసిన ఫాన్‌లలోనైనా వేరేవారిలోనైనా అగ్రియస్ చాలా మంచివాడు. 162 00:14:34,374 --> 00:14:36,418 పుకార్లు పుట్టించేవారికి అదే చెప్పు. 163 00:14:39,296 --> 00:14:41,464 తెలుసుకోదగ్గ మనిషే అనుకుంటాను. 164 00:14:47,012 --> 00:14:49,389 భోజనానికి ఉంటావా? 165 00:14:50,098 --> 00:14:52,767 నాకు సూప్ చేయటంలో సహాయం చేసావు, నువ్వు కూడా పంచుకో. 166 00:14:54,603 --> 00:14:55,937 నాకు సూప్ వద్దు. 167 00:14:57,230 --> 00:15:01,651 ఈ ఇంటి యజమానిని చూడాలి, అగ్రియస్‌ను కూడా చూడాల్సిందే! 168 00:15:03,862 --> 00:15:05,572 ఆఫీసర్లను పక్కకు తీసుకెళ్లు. 169 00:15:07,991 --> 00:15:09,492 నువ్వు, నువ్వు, నువ్వు. 170 00:15:18,043 --> 00:15:21,588 లెఫ్టినెంట్ వాళ్లను ఎక్కడకు తీసుకెళుతున్నావో చెప్పు? 171 00:15:21,588 --> 00:15:23,173 నీకు లంచం కావాలంటే... 172 00:15:23,173 --> 00:15:25,300 ఆయుధాలు ఆయుధాగారానికి. 173 00:15:25,300 --> 00:15:27,552 బంగారం వెండి ఖజానాకు. 174 00:15:27,552 --> 00:15:29,095 ఇది మరీ దోపిడి. 175 00:15:30,055 --> 00:15:33,933 నా పరిచయస్తులు వచ్చాక, మీ పరిస్థితి మరీ ఘోరంగా మారుతుంది. 176 00:15:33,933 --> 00:15:35,185 అవునా? 177 00:15:35,185 --> 00:15:37,395 మన దేశాలు యుద్ధం చేసుకోవట్లేదు. 178 00:15:38,021 --> 00:15:39,481 సంధి ఒడంబడికలు ఉన్నాయి. 179 00:15:40,106 --> 00:15:42,609 ఇది అన్ని సముద్ర జలాల చట్టాలకు వ్యతిరేకం, 180 00:15:42,609 --> 00:15:46,613 నాగరిక దేశాలు అంగీకరించిన ప్రతి చట్టానికి వ్యతిరేకం! 181 00:15:46,613 --> 00:15:49,282 నీ ఒడంబడికలతో సంబంధం లేదు. 182 00:15:49,282 --> 00:15:50,950 మా దగ్గర చట్టాలు వేరే. 183 00:15:52,035 --> 00:15:54,454 నీకు కొరడా దెబ్బలు తినిపిస్తాను. 184 00:15:58,458 --> 00:15:59,584 లెఫ్టినెంట్! 185 00:15:59,584 --> 00:16:00,585 దొరికింది. 186 00:16:02,420 --> 00:16:03,672 కెప్టెన్ లాగ్. 187 00:16:04,506 --> 00:16:05,674 మంచి పని. 188 00:16:20,647 --> 00:16:22,482 మాకు కావలసింది... 189 00:16:23,274 --> 00:16:25,527 అగ్రియస్ ఎస్ట్రయోన్. 190 00:16:27,612 --> 00:16:29,114 స్వాన్ యజమాని. 191 00:16:31,574 --> 00:16:33,952 నేనే అగ్రియస్ ఎస్ట్రయోన్‌ను. 192 00:16:35,328 --> 00:16:36,413 అలాగా? 193 00:16:39,457 --> 00:16:40,667 ప్రమాణపూర్తిగా. 194 00:16:41,418 --> 00:16:45,422 ఆ ఓడకు దాని కంపెనీకి నేనే యజమానిని. 195 00:16:48,174 --> 00:16:49,259 ఇక... 196 00:16:50,802 --> 00:16:52,637 నాకు క్షమాపణ చెప్పాలి, 197 00:16:53,346 --> 00:16:56,099 పెద్దమనుషుల్లాగా మనం అన్నీ మాట్లాడుకుందాం. 198 00:17:10,113 --> 00:17:13,366 మీరు వర్గ విద్రోహి, ఎస్ట్రయోన్ గారు. 199 00:17:14,826 --> 00:17:17,662 వందలమంది రక్తం, చెమట మీ చేతులకు అంటుకున్నాయి. 200 00:17:19,122 --> 00:17:20,415 స్వాన్ క్రూ అంతా, 201 00:17:21,499 --> 00:17:24,210 మీరంతా మీ ఉద్యోగ ఒప్పందాల నుండి ముక్తి పొందారు. 202 00:17:24,210 --> 00:17:25,336 మీరు వెళ్ళవచ్చు. 203 00:17:49,986 --> 00:17:52,280 ఎక్కడో తప్పు జరిగింది. 204 00:17:52,280 --> 00:17:53,406 గోడవైపు నిలబడు! 205 00:17:53,406 --> 00:17:55,867 కౌంట్ బోజాక్‌ను పిలవండి, తను చెపుతారు. 206 00:17:55,867 --> 00:17:57,202 -దయ చూపించండి! -మాట్లాడకు. 207 00:17:57,202 --> 00:17:58,161 ప్లీజ్. 208 00:17:58,870 --> 00:18:01,915 అతను ఇక్కడకు వస్తే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? 209 00:18:01,915 --> 00:18:03,082 తెలుసా నీకు? 210 00:18:44,582 --> 00:18:46,376 రెడీ, ముందుకు! 211 00:18:46,376 --> 00:18:47,544 కవర్... 212 00:18:48,169 --> 00:18:49,712 ఒకటి! 213 00:18:50,880 --> 00:18:52,423 ఆయుధాలు పైకి! 214 00:18:57,136 --> 00:18:58,847 అటెన్షన్! 215 00:19:09,482 --> 00:19:11,901 -బర్గ్‌కు స్వాగతం అంబాసిడర్ గారు. -ధన్యవాదాలు. 216 00:19:11,901 --> 00:19:13,570 దయచేసి. నాతో రండి. 217 00:19:27,166 --> 00:19:28,585 ఛాన్సిలర్ బ్రేక్‌స్పియక్, 218 00:19:28,585 --> 00:19:32,714 న్యూ డాన్ అని పిలవబడే మనుషులు, ఫేలు కలిసిన 219 00:19:32,714 --> 00:19:36,885 సమూహం మా దేశంలో తిరుగుబాటు చేస్తుంది. 220 00:19:38,595 --> 00:19:40,513 వారిని అదుపు చేయలేదంటే, 221 00:19:40,513 --> 00:19:42,557 వారి దృష్టి బర్గ్ మీద పడటానికి 222 00:19:42,557 --> 00:19:45,560 అట్టే సమయం పట్టుదు. 223 00:19:50,273 --> 00:19:52,358 కానీ వారు నిలవలేరు, ఛాన్సిలర్. 224 00:19:53,943 --> 00:19:56,863 బర్గ్ నుండి కొన్న ఆయుధాల సందేశం 225 00:19:56,863 --> 00:19:58,865 లోకానికి తెలుస్తుంది 226 00:19:58,865 --> 00:20:01,701 మన ఇరు దేశాల మధ్య సంఘర్షణలు అంతమొందాయని, 227 00:20:01,701 --> 00:20:06,247 సరికొత్త యుగపు బలం, ఐక్యత, మితృత్వాలకు ఇది నాంది అని తెలుస్తుంది. 228 00:20:07,582 --> 00:20:11,502 మేజర్ వీర్, కదా? సంతోషం. రున్‌యాన్ మిల్‌వర్తీ మీ సేవలో. 229 00:20:11,502 --> 00:20:14,172 సార్, మనం కలిసాం. ఇక్కడే బర్గ్‌లోనే. 230 00:20:14,172 --> 00:20:15,798 నెల క్రితం. 231 00:20:15,798 --> 00:20:17,800 -గుర్తుండకపోవచ్చు. -మన్నించాలి. 232 00:20:17,800 --> 00:20:20,553 గుర్తుంది. ఫైర్స్‌డే విందు రోజు కదా. 233 00:20:20,553 --> 00:20:22,138 నేను ఏం సేవ చేయగలను? 234 00:20:22,138 --> 00:20:24,933 అంటే, రహస్యంగా మీతో మాట్లాడాలి. 235 00:20:24,933 --> 00:20:28,353 మన్నించాలి, నాకు దౌత్య మర్యాదలు తెలియవు. 236 00:20:28,353 --> 00:20:30,688 నాకు కూడా తెలియవు సార్. మిలటరీవాడిని. 237 00:20:30,688 --> 00:20:34,025 నిశ్శబ్దం. అయితే నిజాయితీగా చెబుతాను. 238 00:20:36,653 --> 00:20:40,239 మీ ఆయుధాల కొనుగోలు సందేశాత్మకం కాదు కదా? 239 00:20:40,239 --> 00:20:43,534 మీకు సైన్య సహాయం బాగా కావాలి. 240 00:20:43,534 --> 00:20:48,122 సార్, నేనూ నిజాయితీగా చెబుతాను. మా వ్యూహాలను బలహీనత అనుకోకండి. 241 00:20:48,122 --> 00:20:51,334 అధికారికంగా, ఇది మాజీ శత్రువుల మధ్య 242 00:20:51,334 --> 00:20:53,086 కేవలం ఆయుదాల బదిలీ అంతే. 243 00:20:53,086 --> 00:20:54,754 స్నేహా సంకేతం. 244 00:20:54,754 --> 00:20:58,132 కచ్చితంగా చెప్పాలంటే, కానీ అనధికారికంగా, అది నిజం కాదు 245 00:20:58,132 --> 00:21:00,885 పాక్ట్ పరిశ్రమ నెమ్మదించింది 246 00:21:00,885 --> 00:21:05,431 న్యూ డాన్ విస్తరణతో వారి సమానత్వ సిద్ధాంతాలతో? 247 00:21:06,182 --> 00:21:09,811 తెలుసుకుంటారు, సార్, నేను అంబాసిడర్‌తో ఏకీభవించనని. 248 00:21:09,811 --> 00:21:13,398 తప్పకుండా. కార్మిక సమ్మెలు ఇంకా తగ్గుదలలు 249 00:21:13,398 --> 00:21:15,441 మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి అనుకోండి. 250 00:21:17,276 --> 00:21:18,820 బాగా చెప్పారు మిల్‌వర్తీ గారు. 251 00:21:19,821 --> 00:21:24,117 మితృత్వ స్ఫూర్తితో ఈ రైఫిళ్ల కొనుగోలు 252 00:21:24,117 --> 00:21:28,121 కేవలం సంకేతం మాత్రమే కాదని నిజాయితీగా చెపుతున్నాను. 253 00:21:29,038 --> 00:21:31,958 మా సైన్యం బర్గిష్ రైఫిళ్లు సుదూర కాల్పుల్లో 254 00:21:31,958 --> 00:21:37,171 మావాటి కన్నా ఉత్తమమని మేము అనుభవంతో తెలుసుకున్నాం. 255 00:21:38,423 --> 00:21:40,591 అందుకే వాటిని వాడుకుందామని. 256 00:21:40,591 --> 00:21:42,218 న్యూ డాన్‌‌కు వ్యతిరేకంగానా. 257 00:21:43,761 --> 00:21:47,515 సహజ వ్యవస్థకు వారు ప్రమాదం. 258 00:21:48,474 --> 00:21:51,394 ఫేలు, మనుషులు కలిసి పోరాడుతున్నారు. 259 00:21:51,394 --> 00:21:54,647 బడుగువర్గాల పగటి కల అది. 260 00:21:55,356 --> 00:21:59,861 అంటే, అడగాలి, ఆ పగటికలను ఎలా ఓడిస్తారు? 261 00:22:03,406 --> 00:22:05,992 మిల్‌వర్తీ గారు నా వరకూ, 262 00:22:07,160 --> 00:22:09,162 శవాలు కలలు కనవు. 263 00:22:18,880 --> 00:22:21,007 అంబాసిడర్ తనను తాను ఏమనుకుంటున్నారు? 264 00:22:21,007 --> 00:22:22,467 ఆయుధాల కొనుగోలు ప్రతీకగా 265 00:22:22,467 --> 00:22:25,386 మనం నమ్మాలని అనుకుంటున్నారు. 266 00:22:25,386 --> 00:22:29,140 అందుకే అతను 200 టన్నుల సంకేత మందుగుండు కావాలంటున్నారు. 267 00:22:29,140 --> 00:22:33,519 అతని సైన్యం ఎదురుదెబ్బలు తింటుంది, ఆయనకు ఆయుధాలు కావాలి. 268 00:22:33,519 --> 00:22:35,063 మనకు తెలుసని తనకు తెలుసు. 269 00:22:35,063 --> 00:22:39,108 కచ్చితంగా. అలా చేయలేదంటే మన నిఘా వర్గాలను అవమానించినట్టే. 270 00:22:39,817 --> 00:22:44,197 అయినా, ఈ చిన్ని యుద్ధంలో పాక్ట్‌తో చేరటం మనకు లాభదాయకమేమో. 271 00:22:44,197 --> 00:22:46,324 ఏం లాభం ఉంది? 272 00:22:46,324 --> 00:22:49,911 యుద్ధ సమయపు ఛాన్సిలర్‌ను తప్పించి ఎన్నికలకు ఎవరూ సాహసించరు. 273 00:22:50,620 --> 00:22:53,790 దేవుడా. నేను మరీ అంత వెంపర్లాడట్లేదు? 274 00:22:53,790 --> 00:22:55,792 మనం యుద్ధానికి వెళ్ళము. 275 00:22:55,792 --> 00:22:57,752 వాళ్ళకు ఆయుధాలు అమ్ముతాం. 276 00:22:57,752 --> 00:23:00,838 సోఫీ పాక్ట్ అంటే కంపరం మనకు. వారితో ఏళ్లుగా యుద్ధం చేసాం. 277 00:23:00,838 --> 00:23:04,759 కానీ ఈ న్యూ డాన్ గుంపు పెను ప్రమాదంగా మారుతుంది. 278 00:23:05,551 --> 00:23:08,763 వారి పిచ్చి భావజాలాలు వేసవిలో వ్యాధులలాగా ప్రబలుతాయి. 279 00:23:08,763 --> 00:23:12,183 బర్గ్‌లో సంక్రమణతో కన్నా పాక్ట్‌తో పోరాడటం మంచిది. 280 00:23:13,476 --> 00:23:16,854 వారి చేతిలో మన ఆయుధాలు చాలు ప్రవాహం మారటానికి? 281 00:23:19,565 --> 00:23:20,775 లేదు. 282 00:23:21,651 --> 00:23:25,196 న్యూ డాన్‌‌కు కూడా అమ్మామనుకో. 283 00:23:27,240 --> 00:23:29,200 రెండు వైపులా కొట్టుకు చస్తాయి, 284 00:23:29,200 --> 00:23:32,120 మన సైన్యం టిర్ననాక్‌ను తిరిగి సాధిస్తుంది. 285 00:23:35,373 --> 00:23:38,126 నిన్ను తక్కువ అంచనా వేసినవారిని దేవుడే కాపాడాలి. 286 00:23:38,793 --> 00:23:41,045 నాలాగే భవిష్యత్తును స్పష్టంగా చూస్తావు. 287 00:23:41,045 --> 00:23:42,505 మనిద్దరం ఆలోచిస్తున్నాం. 288 00:23:42,505 --> 00:23:44,841 నేను పైకి చెపుతున్నానంతే. 289 00:23:44,841 --> 00:23:48,302 టిర్ననాక్ తిరిగి సాధించటం మీ నాన్న కల కూడా. 290 00:23:49,595 --> 00:23:52,807 చరిత్రలో నీ పేరు లిఖించవచ్చు... 291 00:23:53,516 --> 00:23:56,894 మనల్ని తిరిగి సామ్రాజ్యకర్త చేసిన ఛాన్సిలర్‌గా. 292 00:23:59,188 --> 00:24:01,607 అది ఆయన చేయలేకపోయారు. 293 00:24:03,442 --> 00:24:04,735 అవకాశాన్ని వాడుకొనే 294 00:24:04,735 --> 00:24:08,239 తెలివి ఉంటే జోస్యం ఎవరికి కావాలి? 295 00:24:09,949 --> 00:24:13,578 -పార్లమెంట్ భరించగలదంటావా? -పాక్ట్ అంటే అసహ్యం వారికి. 296 00:24:13,578 --> 00:24:17,123 పార్టీ సదా యుద్ధ వ్యతిరేకి. ఎలా సర్దిచెపుతావు? 297 00:24:17,123 --> 00:24:20,626 జోనా, నన్ను మరీ తక్కువ అంచనా వేస్తుంటావు. 298 00:24:22,545 --> 00:24:24,839 లేదంటే అవకాశాన్ని వదులుకో. 299 00:24:24,839 --> 00:24:28,009 వచ్చే ఎన్నికల వరకు ఆగు, నువ్వు ఓడిపోవచ్చు, 300 00:24:28,009 --> 00:24:30,094 నీ పాత జీవితానికి వెళ్ళిపోవచ్చు. 301 00:24:34,849 --> 00:24:37,185 ఎలాగైనా నీకు మద్ధతిస్తాను. 302 00:24:38,311 --> 00:24:40,146 ఛాన్సిలర్ మీ నిర్ణయమిది. 303 00:24:58,581 --> 00:24:59,582 వెళ్ళిపోండి. 304 00:25:00,833 --> 00:25:03,711 మాకు కొన్ని సమస్యలు వచ్చాయి. 305 00:25:08,883 --> 00:25:11,219 మన ఒప్పందాన్ని మరిచిపోయావా? 306 00:25:11,219 --> 00:25:14,096 నాతో తమాషాలు వద్దు, ఫిలోస్ట్రేట్ గారు. 307 00:25:14,096 --> 00:25:17,850 మీలాగా కాదు ఫేలు మాట మీద నిలబడతారు. 308 00:25:20,603 --> 00:25:24,565 కానీ ఈ సదుపాయాలు, అవి తాత్కాలికం అంతే సరేనా? 309 00:26:03,688 --> 00:26:05,481 మొండితనం, ఇంకో మార్గం లేదు. 310 00:26:06,190 --> 00:26:10,319 చాలా బాధపడుతున్నాడు, అస్సలు ఆలోచించట్లేదు, ఇప్పుడేమో చావటానికి తయారు. 311 00:26:10,820 --> 00:26:12,029 స్వార్థపు వెధవ. 312 00:26:13,281 --> 00:26:15,825 ఇంకో దారి తప్పకుండా ఉంటుంది. 313 00:26:16,200 --> 00:26:17,368 ఏమన్నా ఐడియాలున్నాయా? 314 00:26:19,078 --> 00:26:21,622 విన్, ఇప్పుడైతే లేవు. సారీ. 315 00:26:25,293 --> 00:26:28,671 ఆ చనిపోయినవాడి సంగతేంటి, హత్య చేయబడ్డ సైనికుడు? 316 00:26:28,671 --> 00:26:30,131 అస్సలు అర్థం కావట్లేదు. 317 00:26:31,048 --> 00:26:33,217 అంటే, చెప్పాలని లేదు కానీ... 318 00:26:34,468 --> 00:26:37,847 దాలియా రైడ్ తరువాత నిన్ను మింగేసేలా చూస్తుంది. 319 00:26:38,556 --> 00:26:39,682 అలా కానే కాదు. 320 00:26:39,682 --> 00:26:43,728 పగతోటి అలా ఒకరిని చంపి, నామీద రుద్ది అందరినీ చిక్కులలో పడేస్తుందని 321 00:26:43,728 --> 00:26:45,187 అనుకోవట్లేదుగా? 322 00:26:47,064 --> 00:26:49,400 లేదు! దేవుడా, లేదు, విన్యెట్. 323 00:26:50,234 --> 00:26:52,320 అలాంటి ఆలోచనే చేయను. 324 00:27:01,037 --> 00:27:02,496 విల్సన్ నువ్వు వెళ్ళవచ్చు, 325 00:27:02,496 --> 00:27:03,998 ఇంకేమీ లేకపోతే. 326 00:27:03,998 --> 00:27:05,082 మేడమ్. 327 00:27:42,495 --> 00:27:43,537 నిల్లీ? 328 00:27:49,210 --> 00:27:52,421 చీకటి పడేంతవరకూ ఉండాల్సింది. ఎవరన్నా చూస్తే ఎలా? 329 00:27:52,421 --> 00:27:54,548 కోవా పై తెచ్చాను నీకోసం. 330 00:27:54,548 --> 00:27:55,716 ఇదిగో. 331 00:27:56,675 --> 00:27:57,927 ఇంకా వేడిగానే ఉంది. 332 00:28:00,554 --> 00:28:01,847 ఆకలేస్తుంది నీకు. 333 00:28:01,847 --> 00:28:03,849 ముందే రావాల్సింది. 334 00:28:03,849 --> 00:28:05,684 అంతా పనివాళ్ళే ఉన్నారు. 335 00:28:06,769 --> 00:28:08,771 ఇక్కడ దాక్కుని ఉన్నానంటే... 336 00:28:09,397 --> 00:28:11,023 నిన్ను చూడాలనిపించింది అంతే. 337 00:28:12,691 --> 00:28:15,861 మధ్యాహ్నం పరిశ్రమ యజమానులతో టీకి వెళ్ళాలి. 338 00:28:15,861 --> 00:28:17,738 ఇంకా ఎంత మిగిలి ఉంది? 339 00:28:25,037 --> 00:28:26,747 ఏడు వందల వేల గిల్డర్లు. 340 00:28:27,748 --> 00:28:29,875 గుర్రాలు అమ్మితే ఇంకొంచెం వస్తుంది. 341 00:28:30,209 --> 00:28:32,420 -అది సరిపోతుందా? -సరిపోవాలి. 342 00:28:35,923 --> 00:28:37,466 నీ జుట్టు బాగాలేదు. 343 00:28:40,344 --> 00:28:42,638 నాకు సరిగ్గా రాదు. 344 00:28:42,638 --> 00:28:44,640 -నేను చేస్తాను. -సరి చేస్తానుండు. 345 00:28:44,640 --> 00:28:48,936 వాళ్ళు నీ అందమైన మొహమే చూడాలి, ఈ మచ్చలు కాదు. 346 00:28:53,357 --> 00:28:55,818 నేను నీ అన్న గురించి రోలో 347 00:28:55,818 --> 00:28:59,530 రహస్యంగా విచారణలు చేస్తున్నాను... 348 00:28:59,530 --> 00:29:01,615 చాలా మొండితల. 349 00:29:01,615 --> 00:29:04,368 డబ్బులన్నీ ఖర్చయ్యాక వస్తాడు. 350 00:29:04,368 --> 00:29:05,786 నీకు కంగారు లేదా? 351 00:29:05,786 --> 00:29:06,829 బ్రతికేస్తాడులే. 352 00:29:08,539 --> 00:29:09,623 మనమంతా బ్రతికేస్తాం. 353 00:29:10,833 --> 00:29:12,960 ఇంకొంచెం పనే మిగిలి ఉంది. 354 00:29:13,919 --> 00:29:15,379 అంతా త్వరలో ముగుస్తుంది. 355 00:29:16,547 --> 00:29:17,548 ప్రమాణం. 356 00:29:28,601 --> 00:29:29,727 డేరియస్. 357 00:29:36,859 --> 00:29:38,652 పక్ ఏం చేసాడో చూడు. 358 00:29:38,652 --> 00:29:41,280 నిన్ను కలవటం బాగుంది. 359 00:29:42,781 --> 00:29:44,325 ఎందుకింత సమయం పట్టింది? 360 00:29:45,117 --> 00:29:48,662 పోలీసును కాదు కదా. నీదాకా రావటానికి చాలా చేయాల్సి వచ్చింది. 361 00:29:49,914 --> 00:29:51,624 నేను మనిషిని కూడా కాదు. 362 00:29:52,291 --> 00:29:53,626 సరే. 363 00:29:53,626 --> 00:29:54,793 నేనే అనుకోవాలి. 364 00:29:55,753 --> 00:29:58,047 నీకే కదా అన్ని సమస్యలు. 365 00:29:58,589 --> 00:30:00,758 నేను జైలులో మాడిపోతూ, వణికిపోతూ, 366 00:30:00,758 --> 00:30:03,552 తన్నులు తింటున్నాను ఇక్కడ, 367 00:30:03,552 --> 00:30:06,680 నీ ఉద్యోగం పోయిందని బాధపడాలి కదా. 368 00:30:10,559 --> 00:30:11,977 అది బెసిలీయన్ గొర్రెనా? 369 00:30:29,828 --> 00:30:31,330 ఇక్కడ అంత ఘోరంగా ఉందా? 370 00:30:36,919 --> 00:30:41,340 ఆ వెధవలు నాకు తగిలింది పాక్ట్ ఆయుధమని గుర్తించారు. 371 00:30:43,717 --> 00:30:44,969 ఇక, రోజూ పరీక్షలు... 372 00:30:46,845 --> 00:30:47,930 ప్రతిరోజూ. 373 00:30:50,224 --> 00:30:51,934 నాచేత చాలా చేయించారు. 374 00:30:54,436 --> 00:30:56,230 నాతో వేరే ఖైదీలను... 375 00:30:57,606 --> 00:30:58,941 ఉంచారు. 376 00:31:02,570 --> 00:31:03,904 వారు లోపలికి వచ్చారు... 377 00:31:05,489 --> 00:31:06,991 కానీ బయటకు రాలేదు. 378 00:31:08,742 --> 00:31:10,744 మన్నించు, డేరీ, ప్రయత్నించాను. 379 00:31:12,288 --> 00:31:14,206 నన్ను ఏం చెప్పమంటావు? 380 00:31:16,584 --> 00:31:18,627 తేవటానికి చేయాల్సిందంతా చేసాను. 381 00:31:18,627 --> 00:31:23,048 అది నా చావుకు నన్ను వదిలి నీ బ్యాడ్జిని వదలక ముందా, తరువాతా? 382 00:31:23,507 --> 00:31:24,508 సరే మరి. 383 00:31:26,135 --> 00:31:28,679 -నీకే వదిలేస్తాను. -ఎక్కడికి వెళుతున్నావు? 384 00:31:28,679 --> 00:31:32,600 బుర్రతో ఆలోచించని మొదటి వ్యక్తివి నువ్వే అనుకుంటున్నావా? 385 00:31:32,600 --> 00:31:34,518 అలా ఏం కాదు. 386 00:31:34,518 --> 00:31:37,563 అయిపోయిందా, నన్ను కూడా తిందామని అనుకుంటున్నావా? 387 00:31:37,563 --> 00:31:39,648 నా చొక్కా తీసేస్తాను, సులభం అవుతుంది. 388 00:31:39,648 --> 00:31:40,649 కానివ్వు. 389 00:31:40,649 --> 00:31:43,569 బూట్లు ఉంచుకో, కొంచెం కరకరలాడుతుంది. 390 00:31:51,076 --> 00:31:52,202 నిజానికి... 391 00:31:53,704 --> 00:31:55,831 అలాంటివి మూడు కావాలి నాకు. 392 00:31:57,625 --> 00:31:58,876 కొంచెం రక్తం కావాలి. 393 00:32:02,880 --> 00:32:04,298 దాచటానికి చోటు. 394 00:32:04,298 --> 00:32:07,885 ఇక్కడ సురక్షితం నువ్వు. యజమానితో ఒప్పందం చేసుకున్నాను. 395 00:32:09,511 --> 00:32:11,055 ఆ చూపు నాకు తెలుసు. 396 00:32:12,931 --> 00:32:14,600 ఏం ఎత్తులు వేస్తున్నావు? 397 00:32:15,851 --> 00:32:18,145 రో ని తెరిచే ప్లాను వేసాను. 398 00:32:18,145 --> 00:32:21,357 నువ్వా? సంకరజాతి వెధవవా? 399 00:32:21,357 --> 00:32:25,361 అబ్సలోమ్ బ్రేక్‌స్పియర్ సంకర జాతి అక్రమ సంతానాన్ని చూస్తున్నావు. 400 00:32:31,033 --> 00:32:32,534 ఇంకొంచెం టీ మార్లో గారు? 401 00:32:34,787 --> 00:32:35,913 హ, ఇవ్వండి. 402 00:32:38,165 --> 00:32:41,043 జెంటిల్మెన్, వచ్చినందుకు చాలా సంతోషం. 403 00:32:41,043 --> 00:32:44,672 ఛాన్సిలర్ పాలసీల గురించి అంసతృప్తి ఉందని నాకు తెలుసు. 404 00:32:44,672 --> 00:32:48,926 లాంగర్‌బేన్ గారు, మా అనేక షాపులలో పరిశ్రమలలో క్రిచ్ వారు 405 00:32:48,926 --> 00:32:51,762 పని చేయకపోతే మేము అవన్నీ మూసేయాలి. 406 00:32:51,762 --> 00:32:56,225 అంటే, వ్యాపార లావాదేవీలు తెలుసని నటించను, జెంటిల్మెన్, 407 00:32:56,225 --> 00:32:59,603 కానీ మనమంతా ఛాన్సిలర్ పాలసీలకు మద్ధతునివ్వాలిగా. 408 00:33:00,896 --> 00:33:03,774 -బర్గ్ మంచి కోసం. -బర్గ్ మంచికా? 409 00:33:03,774 --> 00:33:07,778 ఆ పాలసీలు వ్యాపారాలు ఖర్చును పెంచటం తప్ప ఇంకేమీ చేయలేదు. 410 00:33:07,778 --> 00:33:09,655 ఖండిస్తున్నానని అనుకోకండి, 411 00:33:09,655 --> 00:33:14,493 కానీ నిన్ననే కదా మన రైళ్ళను పిక్స్ గ్యాంగ్ దోచుకున్నది? 412 00:33:14,493 --> 00:33:17,663 వాళ్ళు అది చేయగలిగారంటే ఇక సిటీలో స్వేచ్ఛగా వదిలిస్తే 413 00:33:17,663 --> 00:33:20,124 ఏం గందరగోళం చేయగలరో కదా? 414 00:33:20,124 --> 00:33:23,252 నిన్నటి శిక్షలు సరైన సందేశాన్నే పంపి ఉంటాయి. 415 00:33:23,252 --> 00:33:26,171 జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే, లాంగర్‌బేన్ గారు. 416 00:33:26,171 --> 00:33:28,799 కానీ మాకూ పోషించాల్సిన కుటుంబాలున్నాయిగా. 417 00:33:30,384 --> 00:33:31,719 కచ్చితంగా. 418 00:33:31,719 --> 00:33:33,846 పిల్లలనూ సురక్షితంగా ఉంచుకోవాలి. 419 00:33:34,972 --> 00:33:39,518 కానీ పార్టీకి విశ్వాసంగా ఉన్నందుకు మీరు ఇబ్బంది పడకూడదు. 420 00:33:41,019 --> 00:33:43,605 విశ్వాసానికి బహుమతి ఉండాలంటాను. 421 00:33:44,898 --> 00:33:48,068 అందుకే, విశ్వాసానికి ప్రతీకగా, 422 00:33:48,902 --> 00:33:53,115 మా కీర్తిశేషులైన నాన్నగారి పెట్టుబడులను మీ పరిశ్రమలలో పెడతాను. 423 00:33:56,326 --> 00:34:00,038 పార్టీలో మిగతా సభ్యులకు ఈ ఆఫర్ ఇచ్చాను. 424 00:34:01,206 --> 00:34:02,458 వాళ్లంతా అంగీకరించారు. 425 00:34:06,378 --> 00:34:10,424 ఈ కాంట్రాక్టు నా పరిశ్రమలో నీ యాజమాన్యాన్ని 426 00:34:10,424 --> 00:34:12,509 చాలా ఎక్కువ చేస్తుంది. 427 00:34:13,135 --> 00:34:14,928 మీరు వ్యాపారవేత్తలు, 428 00:34:14,928 --> 00:34:17,514 కానీ తనఖా లేకుండా నేను లోను ఇవ్వలేనుగా, 429 00:34:18,557 --> 00:34:19,767 ఒప్పుకుంటారా? 430 00:34:19,767 --> 00:34:24,354 కానీ క్రిచ్ రో లోనే బంధింపబడితే, పనివారు ఉండరు. 431 00:34:24,354 --> 00:34:26,273 చవక కార్మికులు లేకుండా, 432 00:34:26,273 --> 00:34:29,902 మేము నీకు తిరిగిచ్చే అవకాశమే లేదుగా. 433 00:34:30,319 --> 00:34:34,948 జెంటిల్మెన్, మీకు చిన్న రహస్యం చెబుతాను. 434 00:34:35,741 --> 00:34:40,078 ఛాన్సిలర్‌ను పాక్ట్‌కు సహాయం చేయటానికి నేను ఒప్పించగలను 435 00:34:40,078 --> 00:34:42,748 న్యూ డాన్‌‌కు వ్యతిరేక పోరులో సహాయానికి. 436 00:34:42,748 --> 00:34:44,249 అదే గనుక జరిగితే, 437 00:34:44,249 --> 00:34:48,045 పరిశ్రమలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తుండాలి. 438 00:34:48,045 --> 00:34:49,713 నైపుణ్య ఫే కార్మికులు 439 00:34:49,713 --> 00:34:53,258 పరిశ్రమలకు తిరిగి రావటానికి మినహాయింపులు ఇస్తాము. 440 00:34:53,258 --> 00:34:56,512 ఇక మీ పెద్దమనుషులంతా, 441 00:34:56,512 --> 00:34:59,181 బాగా సంపాదించుకొనే అవకాశం వస్తుంది. 442 00:34:59,181 --> 00:35:01,683 కానీ పాక్ట్‌కు సహాయం అనేది 443 00:35:01,683 --> 00:35:04,770 మీ నాన్నగారి ఆశయాలకు వ్యతిరేకం కదా. 444 00:35:04,770 --> 00:35:06,897 నేను మా నాన్న కాదు, ఫ్లెచర్ గారు. 445 00:35:17,074 --> 00:35:19,576 ఇలాంటి క్లిష్ట సమయాలలో నా నాయకత్వానికి 446 00:35:19,576 --> 00:35:22,955 సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు. 447 00:35:50,107 --> 00:35:52,192 నేను నిన్ను వదిలిపోను. 448 00:35:53,861 --> 00:35:56,280 స్థానాలు మార్చుకోగలిగితే మార్చుకుంటాను. 449 00:35:58,824 --> 00:35:59,867 ఐ లవ్ యూ. 450 00:36:02,744 --> 00:36:03,912 నువ్వు లేకపోతే, నేను... 451 00:36:05,372 --> 00:36:06,373 మూర్ఖుడిని. 452 00:36:08,834 --> 00:36:09,960 నా మూర్ఖుడివి. 453 00:36:12,004 --> 00:36:12,921 పర్వాలేదు. 454 00:36:14,089 --> 00:36:15,424 పర్వాలేదు. 455 00:36:15,424 --> 00:36:18,010 నీకోసం ఉన్నాను. నేను నిన్ను వదలను. 456 00:36:21,763 --> 00:36:23,599 నీకు బాగానే ఉందా, బంగారం? 457 00:36:30,564 --> 00:36:31,773 ఎక్కువసేపు పట్టదు. 458 00:36:34,610 --> 00:36:38,530 ఆ బర్గిష్ వెధవలకు బుద్ధి చెప్పే ఇంకో మార్గం ఉందేమో. 459 00:36:38,530 --> 00:36:39,740 ఏమంటున్నావు? 460 00:36:40,616 --> 00:36:44,453 నాకో ప్లాన్ ఉంది. నాకు నీ సహాయం కావాలి. మీ ఇద్దరిదీ. 461 00:37:45,472 --> 00:37:48,058 వారి సహాయం అడిగితే, వారు అమ్మాయిని కాల్చేస్తారా? 462 00:37:48,266 --> 00:37:50,310 వారు రాక్షసులు, దాలియా. 463 00:37:51,103 --> 00:37:52,562 మనుషులు మారరు. 464 00:37:53,605 --> 00:37:54,856 విన్యెట్ మూర్ఖురాలు. 465 00:38:41,903 --> 00:38:42,863 చూసుకో. 466 00:38:56,543 --> 00:38:57,461 కదులు. 467 00:39:06,636 --> 00:39:07,596 ఇటువైపు. 468 00:39:54,768 --> 00:39:55,894 అగ్రియస్? 469 00:40:04,903 --> 00:40:06,947 నేను నిన్ను మళ్లీ చూడననుకున్నాను. 470 00:40:11,952 --> 00:40:14,496 -ఈ చోటు ఏంటి? -ప్రస్తుతానికి ఇల్లు. 471 00:40:14,496 --> 00:40:16,832 ఇల్లా? మనమిక్కడ ఉండాలా? 472 00:40:16,832 --> 00:40:20,293 వాళ్లు ఇంకో రెండు కుటుంబాలతో పంచుకోవాలి అని చెప్పారు. 473 00:40:20,293 --> 00:40:21,253 పంచుకోవాలా? 474 00:40:21,920 --> 00:40:25,215 మన స్వేచ్ఛకు లంచం కనిపెట్టేంతవరకూ. 475 00:40:25,215 --> 00:40:28,426 అవును. నువ్వు కచ్చితంగా డబ్బులిచ్చి మన ఓడను, 476 00:40:28,426 --> 00:40:30,053 క్రూను విడుదల చేయించవచ్చు. 477 00:40:32,848 --> 00:40:35,058 ఏమైంది? నీకేం కాలేదుగా? 478 00:40:35,725 --> 00:40:38,770 హా. తప్పకుండా. హా, ప్రయత్నిస్తాను. 479 00:40:38,770 --> 00:40:40,647 నువ్వు? నీకేమైంది? 480 00:40:40,647 --> 00:40:41,898 -అంటే... -ఇక్కడ కూర్చో. 481 00:40:41,898 --> 00:40:43,525 చాలా విచిత్రంగా ఉంది. 482 00:40:44,693 --> 00:40:48,363 నన్ను ఒక ఇంటికి పంపారు, వెళ్లిపోయారు అంతే. 483 00:40:48,363 --> 00:40:50,699 ఏం ఇల్లు? నాకు అర్థం కాలేదు. 484 00:40:50,699 --> 00:40:53,493 నాకు కూడా. సామానులాగా నన్ను అక్కడ పడేసారు. 485 00:40:53,493 --> 00:40:56,538 ఒక ముసలి పనిమనిషి మాత్రమే నాతో మాట్లాడింది. 486 00:40:56,538 --> 00:40:58,415 నాచేత దుంపలు వలిపించింది, 487 00:40:58,415 --> 00:41:01,293 ఆ తరువాత ఏవో అసహనపు మాటలు అంది... 488 00:41:01,293 --> 00:41:02,335 దేని గురించి? 489 00:41:03,420 --> 00:41:04,796 నిజానికి మన గురించే. 490 00:41:05,922 --> 00:41:07,257 మన గురించి తెలుసా? 491 00:41:07,257 --> 00:41:08,258 తెలుసు. 492 00:41:08,758 --> 00:41:10,051 చాలా విచిత్రంగా ఉంది. 493 00:41:10,051 --> 00:41:12,262 పనిమనిషి లాగా మాట్లాడలేదు. 494 00:41:12,262 --> 00:41:14,097 తిరుగుబాటు గురించి చెప్పింది. 495 00:41:14,097 --> 00:41:17,225 నేను ఎలా స్పందిస్తాను అన్నట్టుగా చూసింది. 496 00:41:17,225 --> 00:41:19,144 -నిన్ను పరీక్షించింది. -అవును. 497 00:41:19,144 --> 00:41:21,229 అంటే. నేను... 498 00:41:21,229 --> 00:41:22,939 ఏమనుకోవాలో తెలియట్లేదు. 499 00:41:23,773 --> 00:41:27,736 కొమ్ము విరిగింది. తన పేరు లియోనోరా అని చెప్పింది. 500 00:41:29,905 --> 00:41:30,989 లియోనోరా? 501 00:41:32,115 --> 00:41:32,991 అవును. 502 00:41:41,708 --> 00:41:42,792 ఈమెనా? 503 00:41:43,877 --> 00:41:44,878 తనేనా? 504 00:41:45,712 --> 00:41:46,588 అవును. 505 00:41:47,839 --> 00:41:48,924 అవును, తనే. 506 00:41:50,133 --> 00:41:51,259 కానీ తనెవరు? 507 00:41:55,513 --> 00:41:58,099 నేను లేవలేకపోయాను, 508 00:41:59,351 --> 00:42:02,103 ఎంత ప్రయత్నించినా కానీ, ఆ తరువాత తను... 509 00:42:04,648 --> 00:42:08,526 తను నా వైపు ఏదో ఊదింది... 510 00:42:09,569 --> 00:42:12,405 హఠాత్తుగా నేను ఇంకెవరిలోనో ఉన్నట్టుగా... 511 00:42:13,573 --> 00:42:15,367 వాళ్లు చూసేది చూస్తున్నట్టుగా. 512 00:42:17,994 --> 00:42:21,164 మన్నించాలి, మిమా. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. 513 00:42:21,164 --> 00:42:23,458 పాపా నా వద్దకు వచ్చి మంచి పని చేసావు. 514 00:42:25,252 --> 00:42:28,213 ఇఫాయ్ త్సినామీని చూసానంటావా? 515 00:42:30,131 --> 00:42:31,758 నాకు పిచ్చెక్కింది కదా? 516 00:42:35,512 --> 00:42:37,013 ఇంకా దారుణం అనుకుంటాను. 517 00:42:39,641 --> 00:42:42,310 హారుస్పెక్స్ శక్తి చావు నుండి వస్తుంది. 518 00:42:43,061 --> 00:42:44,688 అది క్షుద్ర శక్తి. 519 00:42:46,231 --> 00:42:49,567 తనను మింగేయబోయిన దెయ్యాన్ని త్సినామీ ఆవహించింది అంటారు, 520 00:42:50,568 --> 00:42:53,947 పుకార్ల ప్రకారం, బదులు ఇవ్వగలిగేవారికోసం 521 00:42:55,115 --> 00:42:58,618 ఆమె వేరేవారి మనస్సులను మార్చి కావలసినట్టు చేయిస్తుందట. 522 00:43:00,912 --> 00:43:01,997 చెడ్డ పనులు. 523 00:43:03,581 --> 00:43:05,583 తను నా మెదడులో ఉందంటావా? 524 00:43:07,127 --> 00:43:09,921 ఎలా? తను చనిపోయింది. చావు ఈ కళ్లతో చూసాను. 525 00:43:12,882 --> 00:43:13,800 నేను? 526 00:43:16,011 --> 00:43:17,012 ప్లీజ్? 527 00:44:17,322 --> 00:44:18,323 మిమా? 528 00:44:20,367 --> 00:44:23,119 త్సినామీ దాటేసిందని అన్నావు? 529 00:44:23,119 --> 00:44:24,537 నువ్వు ఉన్నావా అక్కడ? 530 00:44:26,289 --> 00:44:27,499 అవును, ఉన్నాను. 531 00:44:29,042 --> 00:44:30,543 తను చనిపోతూ, 532 00:44:30,543 --> 00:44:32,420 తన శక్తిని నీకు పంపకం చేసింది. 533 00:44:34,172 --> 00:44:35,465 కానీ అది నాకు వద్దు. 534 00:44:37,467 --> 00:44:39,636 నాకు దానితో పనే లేదు. 535 00:44:39,636 --> 00:44:42,138 అవసరం లేదని ఆశిస్తున్నాను, పాపా. 536 00:44:42,138 --> 00:44:44,224 ఎందుకంటే ఆ దృశ్యమే శాపం 537 00:44:45,475 --> 00:44:49,229 దుష్టత్వాన్ని ఆహ్వానిస్తే దుష్టత్వంగానే మారతావు. 538 00:44:54,526 --> 00:44:57,487 ఊనా దీనికోసం తన జీవితాన్ని పణంగా పెడుతుంది. 539 00:44:58,113 --> 00:45:00,365 అలాగే కైన్, ఫెడ్రా ఇంకా నేను కూడా. 540 00:45:01,324 --> 00:45:06,162 దాలియా, వారి వంచనను వారికి చూపే అవకాశం ఇది. 541 00:45:06,162 --> 00:45:09,457 నీ ఆశీర్వాదాలతో వారిని గట్టి దెబ్బ కొట్టాలనుకుంటున్నాం. 542 00:45:10,750 --> 00:45:11,751 ఈ రాత్రే. 543 00:45:22,762 --> 00:45:24,180 సోదర సోదరీమణులారా... 544 00:45:25,890 --> 00:45:31,062 నెలలపాటు, మన ఫేల ఆకలిచావులు చూసాం, 545 00:45:32,313 --> 00:45:37,569 మన ఊపిరిని బాస్ డూ పేరుతో ఆ మనుషులు చిదిమేయటం చూసాం. 546 00:45:41,156 --> 00:45:42,615 కానీ వారు మరిచిపోయారు... 547 00:45:43,825 --> 00:45:46,411 మనమెవరో. 548 00:45:48,288 --> 00:45:51,458 మనం రక్తాన్ని బాధను దిగమింగి 549 00:45:52,584 --> 00:45:55,712 ఆ బర్గిష్ మొహాల మీద చిమ్మే సమయం ఆసన్నమైంది. 550 00:45:55,712 --> 00:45:58,298 మన బాధలను వారు కూడా పడనివ్వండి. 551 00:45:58,298 --> 00:46:00,300 దాని రుచి వారికీ తెలియాలి. 552 00:46:00,300 --> 00:46:01,718 ఎంత ఇష్టపడతారో చూద్దాం. 553 00:46:10,477 --> 00:46:13,271 విన్యెట్ ప్లాన్ అమోఘం, సాహసికం. 554 00:46:13,271 --> 00:46:15,773 చిన్న తప్పుకు కూడా అవకాశం ఉండకూడదు. 555 00:46:16,774 --> 00:46:19,777 అందుకే బర్గ్ మీద దాడికి నేనే నాయకత్వం వహిస్తాను. 556 00:46:21,488 --> 00:46:22,739 దాలియా. 557 00:46:22,989 --> 00:46:24,282 దాలియా, ప్లీజ్. 558 00:46:25,200 --> 00:46:26,784 నీ జీవితాన్ని పణంగా పెట్టకు. 559 00:46:26,784 --> 00:46:28,661 అంతా నిన్నే నమ్ముకున్నారు. 560 00:46:28,912 --> 00:46:30,038 నేను చూసుకుంటాను. 561 00:46:30,872 --> 00:46:33,875 రేవన్ కోసం చిటికెలో ప్రాణాలు వదులుకుంటాను. 562 00:46:34,918 --> 00:46:35,919 నేను చేయలేనా? 563 00:46:36,753 --> 00:46:40,673 ఇక్కడ నాయకత్వం ఎవరిదో నీకింకా అర్థం అయినట్టు లేదు. 564 00:46:40,673 --> 00:46:43,301 నువ్వే నాయకురాలివి అనుకుంటున్నట్టున్నావు. 565 00:46:44,427 --> 00:46:46,930 ప్రయత్నించావంటే రెక్కలు కత్తిరిస్తాను. 566 00:46:48,515 --> 00:46:50,058 -ఆగు-- -దొబ్బేయ్. 567 00:46:50,725 --> 00:46:52,185 లేదా ఏడుస్తూ కూర్చో. 568 00:46:53,811 --> 00:46:54,812 ఏం జరుగుతుందో చూడు. 569 00:47:04,322 --> 00:47:06,366 పని అయ్యేలా చూస్తాము. ప్రమాణం. 570 00:47:06,866 --> 00:47:07,909 మేము వెళ్లాలి. 571 00:47:34,936 --> 00:47:37,939 తన మనఃసాక్షిని కదిలించలేకపోయావన్నమాట? 572 00:47:37,939 --> 00:47:39,315 కదిలించలేకపోయాను. 573 00:47:41,651 --> 00:47:42,610 అంటే... 574 00:47:43,778 --> 00:47:44,946 నీ ప్రయత్నం చేసావు. 575 00:47:53,621 --> 00:47:55,873 మీ అమ్మ కనిపిస్తుంది తెలుసా. 576 00:47:56,958 --> 00:47:59,836 తను చాలా గర్వపడుతుంది, మీ నాన్న కూడా పడాలి. 577 00:48:00,545 --> 00:48:04,048 నేను నీకు తోడుగా పార్లమెంటరీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తాను. 578 00:48:04,048 --> 00:48:06,676 అది నాగరికునిగానైనా నా హక్కు. 579 00:48:07,218 --> 00:48:11,180 సరైన సాక్ష్యాలతో, అదే నీ పక్ స్నేహితురాలు అఫిస్సాలాగా, 580 00:48:11,180 --> 00:48:16,144 మనకేం జరిగినా కానీ నిజం మాత్రం కచ్చితంగా బయటకు వస్తుంది. 581 00:48:16,144 --> 00:48:17,103 కావచ్చు. 582 00:48:17,937 --> 00:48:18,896 ఆశిద్దాం. 583 00:48:20,148 --> 00:48:22,150 ఇలా చేయగలను అనుకుంటున్నావా? 584 00:48:23,526 --> 00:48:24,694 చేయాలనైతే లేదు. 585 00:48:26,279 --> 00:48:27,322 చేయాలి అంతే. 586 00:49:46,275 --> 00:49:49,779 బర్గ్ వైపు నది పక్కన ఉండటం ఎలా ఉంది? 587 00:49:49,779 --> 00:49:51,447 వాసనైతే బాగుంది. 588 00:50:29,193 --> 00:50:31,279 స్పర్న్‌రోజ్, మీకోసం ప్రార్థిస్తున్నాం. 589 00:50:32,321 --> 00:50:33,448 థాంక్యూ, మేడమ్. 590 00:50:34,365 --> 00:50:36,868 మీ ప్రియ సోదరి నుండి ఎలాంటి కబురు లేదా? 591 00:50:36,868 --> 00:50:41,038 అంటే, లేదు, అంటే, నేను అందరినీ నియమించాను, 592 00:50:41,038 --> 00:50:45,168 నా ముద్దుల ఇమోజెన్‌ను రక్షించటానికి అధికారులు అంతా చేస్తున్నారు, 593 00:50:45,168 --> 00:50:48,755 కానీ తనను ఎత్తుకెళ్లినవాడు ఆరితేరిన వెధవ, 594 00:50:48,755 --> 00:50:53,092 కుటిల ఫాన్, చట్టం కళ్లు కప్పి తిరుగుతున్నాడు. 595 00:50:53,092 --> 00:50:55,845 డబ్బున్న పక్. ఇలానే జరుగుతుంది. 596 00:50:55,845 --> 00:50:57,972 మన స్త్రీలపై కన్నేస్తారు. 597 00:50:59,056 --> 00:51:02,935 సారీ. మన్నించాలి, మేడమ్, కానీ నా ఉద్దేశం ఏంటంటే... 598 00:51:03,478 --> 00:51:04,937 అయ్యో పాపం పాపం. 599 00:51:05,980 --> 00:51:08,900 ఛాన్సిలర్ ముందుగానే ఫేలను బంధించి ఉంటే కనుకనా. 600 00:51:08,900 --> 00:51:11,319 హా. అవును, చేసుంటే బాగుండేది. 601 00:51:41,641 --> 00:51:46,646 తను ప్రతిపక్ష నాయకురాలు అయినంత మాత్రాన మేము అన్నింటిలో విబేధిస్తూ ఉండము. 602 00:51:46,646 --> 00:51:50,483 కచ్చితంగా. ఆమెకు చాలా మంచి ప్రోద్భల శక్తి ఉంది. 603 00:51:50,483 --> 00:51:53,319 మాట బయటకు రానక్కరలేదు. 604 00:51:53,319 --> 00:51:55,988 అంబాసిడర్, కానీ నేను మాట్లాడనంటే... 605 00:51:55,988 --> 00:51:58,449 మాతోపాటు వణికిపోతావు. 606 00:52:27,854 --> 00:52:29,397 లేడీస్ అండ్ జెంటిల్మెన్-- 607 00:52:32,775 --> 00:52:34,110 కాల్చేయండి! 608 00:52:36,320 --> 00:52:39,407 -సూటిగా కాల్చలేను! -ఛాన్సిలర్‌ను కాపాడండి! 609 00:52:55,882 --> 00:52:58,050 విందును ఆస్వాదిస్తున్నారా అంతా? 610 00:53:01,137 --> 00:53:04,682 ఆకలి విలువ మీకు తెలియదు. 611 00:53:06,309 --> 00:53:07,643 అంటే, మాకు తెలుసు. 612 00:53:07,643 --> 00:53:12,315 గుర్తున్నామా? పరిశ్రమలలో చెమట చిందించాం. మీ పిల్లలను చూసుకున్నాం. 613 00:53:13,149 --> 00:53:17,236 ఇప్పుడు మీరు నిండుగా తింటుంటే మేము నకనకలాడుతున్నాం. 614 00:53:31,417 --> 00:53:32,627 తను ఊనా. 615 00:53:33,794 --> 00:53:36,130 బాస్ డూ వల్ల చనిపోతుంది. 616 00:53:36,631 --> 00:53:37,965 మీవల్లనే. 617 00:53:38,466 --> 00:53:40,259 చూడటానికి బాగాలేదు కదా? 618 00:53:41,552 --> 00:53:46,766 మలం, రక్తం, రచ్చ ఏమీ చూడాలని అనుకోరు కదా. 619 00:53:47,433 --> 00:53:48,768 అది బాగుండదు కదా? 620 00:53:48,768 --> 00:53:50,186 చూపు తిప్పకండి! 621 00:54:01,989 --> 00:54:03,324 అది బాస్ డూ. 622 00:54:05,660 --> 00:54:09,288 పిక్స్ గుంపులుగా చనిపోతున్నారు. మందు లేదు. మార్గం లేదు. 623 00:54:09,288 --> 00:54:13,000 వారి కుటుంబాలు వారి కేకలను వింటూ చావులను చూడాల్సి వస్తుంది. 624 00:54:16,170 --> 00:54:19,423 మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారో దగ్గరగా చూడండి. 625 00:54:22,802 --> 00:54:23,928 కానివ్వు, ప్రియా. 626 00:54:25,137 --> 00:54:26,138 ఎగురు. 627 00:54:47,368 --> 00:54:49,745 వద్దు! 628 00:55:19,900 --> 00:55:21,152 వీడ్కోలు, ప్రియా. 629 00:55:58,355 --> 00:56:00,524 బ్లాక్ రేవన్ ప్లాన్ నీకు తెలుసా? 630 00:56:04,987 --> 00:56:06,113 అది నా ప్లాన్. 631 00:56:58,833 --> 00:57:01,460 -విన్యెట్! అక్కడున్నావా? -ఏం పర్వాలేదు. 632 00:57:04,505 --> 00:57:05,881 నువ్వు త్వరగా రావాలి. 633 00:57:13,430 --> 00:57:17,685 వారిని అలా పైన వేలాడదీయకండి. పిల్లలున్నారు ఇక్కడ. క్రిందకు దింపండి! 634 00:57:17,685 --> 00:57:20,104 -క్రిందకు దింపండి. -ఏం చేసారో చూడండి. 635 00:57:20,104 --> 00:57:21,438 మనుషులు. 636 00:57:22,690 --> 00:57:24,567 దాలియా ఇంకా బొలెరోను చంపేసారు. 637 00:59:20,349 --> 00:59:22,351 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 638 00:59:22,351 --> 00:59:24,436 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్