1 00:00:09,176 --> 00:00:11,512 ఈ ధారావాహికంలో వివరించబడిన అన్ని పాత్రలు మరియు సంఘటనలు పూర్తిగా కల్పితం. 2 00:00:11,595 --> 00:00:13,931 వాస్తవ సంఘటనలు లేదా మరణించిన లేదా జీవించిన వ్యక్తులుతో సారూప్యత 3 00:00:14,014 --> 00:00:15,933 పూర్తిగా యాదృచ్చికం. 4 00:00:24,274 --> 00:00:26,527 -గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్. 5 00:00:26,610 --> 00:00:28,195 ఏంటి సంగతులు? 6 00:00:28,278 --> 00:00:30,447 నీకు కూడా గుడ్ మార్నింగ్. అంతా బాగానే ఉంది. 7 00:00:32,406 --> 00:00:34,284 సరే, నీ దగ్గర ఫైల్ ఉందా? 8 00:00:35,452 --> 00:00:37,037 -చెప్పండి. -ఆగండి 9 00:00:38,163 --> 00:00:39,665 హలో, అమీర్. ఎలా ఉన్నావు? 10 00:00:40,666 --> 00:00:42,042 ఎలా ఉన్నావు, అలీ? 11 00:00:42,125 --> 00:00:43,961 అది... సమాచారం ఏమైనా ఉందా? 12 00:00:44,044 --> 00:00:45,838 నేను పూర్తి ప్రాంతం అంతా వెతికాను. 13 00:00:45,921 --> 00:00:50,133 మిలిటరీకి టెలిమెట్రీ లింక్ ఉన్న మరొక్క స్టేషన్ ఉంది. 14 00:00:50,467 --> 00:00:51,885 సెకండరీ స్టేషన్. 15 00:00:51,969 --> 00:00:55,389 అక్కడి పలువురు సీనియర్ ఇంజనీర్ల సమాచారాన్ని నేను మీకు పంపుతున్నాను. 16 00:00:55,472 --> 00:00:56,557 వారితో మాట్లాడండి. 17 00:00:56,640 --> 00:00:58,600 బాగా చేసావు, అమీర్. ధన్యవాదాలు. 18 00:01:59,036 --> 00:02:01,622 వద్దు! అతన్ని ముట్టుకోవద్దు! మిలాద్ ని ముట్టుకోవద్దు. 19 00:02:36,782 --> 00:02:37,950 గుడ్ మార్నింగ్. 20 00:02:40,285 --> 00:02:41,411 ఏమైనా సమాచారం తెలిసిందా? 21 00:02:42,246 --> 00:02:43,247 మనం ఎదురు చూడాలి. 22 00:02:46,708 --> 00:02:48,085 అతని సంగతి ఏంటి? 23 00:02:48,168 --> 00:02:49,419 అతను బాగానే ఉన్నాడు. 24 00:02:53,340 --> 00:02:54,508 నాకతనితో మాట్లాడాలని ఉంది. 25 00:02:54,591 --> 00:02:56,134 అది మంచి ఆలోచన కాదు. 26 00:02:56,218 --> 00:02:58,053 అది ఒక ప్రశ్న కాదు. 27 00:03:00,305 --> 00:03:04,059 అతన్ని చూడటానికి నేనొక్కడినే వెళ్ళాలి. అవి ఆదేశాలు. 28 00:03:05,561 --> 00:03:07,062 ఆ ఆదేశాలు ఎవరిచ్చారు? 29 00:03:07,145 --> 00:03:10,190 నా కమాండర్లు, నీ కమాండర్లు. 30 00:03:15,821 --> 00:03:17,072 అతను బాగానే ఉన్నాడా? 31 00:03:18,240 --> 00:03:19,950 అతను తాగుతున్నాడా, తింటున్నాడా? 32 00:03:24,454 --> 00:03:25,873 నేను నీతోనే మాట్లాడుతున్నాను! 33 00:03:27,082 --> 00:03:29,293 మనం అతన్ని అక్కడ అపార్ట్మెంట్ లోనే చంపేసి ఉండాల్సింది. 34 00:03:29,376 --> 00:03:30,752 మనకి అతని అవసరం లేదు. 35 00:03:30,836 --> 00:03:33,088 అతను ఇంకా బతికే ఉన్నందుకు నువ్వు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. 36 00:03:33,547 --> 00:03:35,841 అది అంటోంది నువ్వా, లేక మన కమాండర్లా? 37 00:03:38,260 --> 00:03:39,511 సరే. 38 00:03:40,012 --> 00:03:41,430 అయితే, నేను నీకు చెప్తున్నాను, 39 00:03:42,181 --> 00:03:45,475 అతనికి ఏమైన జరిగితే అందుకు బాధ్యత నీదే. 40 00:04:06,246 --> 00:04:07,664 -హలో, మొహమ్మద్. -హలో. 41 00:04:14,296 --> 00:04:16,130 గుడ్ మార్నింగ్, తమార్. ఎలా ఉన్నావు? 42 00:04:17,257 --> 00:04:18,341 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 43 00:04:18,966 --> 00:04:20,594 అబ్బా, నన్ను కౌగిలించుకో. 44 00:04:24,056 --> 00:04:25,599 మనం ముందుకు వెళుతున్నామా? 45 00:04:25,682 --> 00:04:27,309 మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం, సరేనా? 46 00:04:34,107 --> 00:04:35,943 అబ్బా, నువిక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 47 00:04:39,154 --> 00:04:41,990 మాకు ఈ ఉదయం ఫరాజ్ కమాలి నుంచి ఈ చిత్రం వచ్చింది. 48 00:04:42,074 --> 00:04:44,451 ఈయన మొర్డేచాయ్ రబిన్యాన్, తమార్ తండ్రి. 49 00:04:44,535 --> 00:04:45,744 మొర్డేచాయ్ ఈ ఫోటో తీయడానికి 50 00:04:45,827 --> 00:04:48,247 మూడు గంటల 40 నిమిషాల ముందు అటాటర్క్ లో దిగాడు. 51 00:04:48,330 --> 00:04:50,541 అతను ఎక్కడికి వెళ్లి ఉంటాడో మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, 52 00:04:50,624 --> 00:04:53,418 బహుశా ఇస్తాంబుల్ లో ఒక హోటల్ కి వెళ్లి ఉంటాడు. 53 00:04:53,502 --> 00:04:56,547 కార్పెట్ నమూనా ఆధారంగా మనం దానిని నిర్ధారించవచ్చు. 54 00:04:56,630 --> 00:04:58,507 ఇది పట్టణంలోని అనేక హోటళ్ళతో పనిచేసే 55 00:04:58,590 --> 00:05:00,425 ఉత్తరాన ఉన్న ఒక పంపిణీదారుడికి చెందింది. 56 00:05:00,509 --> 00:05:01,927 ఇతను మన ముఖ్య టార్గెట్. 57 00:05:03,262 --> 00:05:05,597 -మరి అతని భార్య? -నేను డాక్టర్ బెన్ ఆర్జీతో మాట్లాడాను. 58 00:05:05,681 --> 00:05:08,433 ఆమెకి ఇప్పట్లో విమాన ప్రయాణం చాలా ప్రమాదకరం. 59 00:05:08,517 --> 00:05:10,894 సరే, మనం ఫరాజ్ తో మాట్లాడి, 60 00:05:10,978 --> 00:05:12,855 పరిస్థితులను అంచనా వేసి, మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాము. 61 00:05:13,272 --> 00:05:15,816 నేను కదోష్ కి మొర్డేచాయ్ అపహరణ గురించి చెప్తాను. 62 00:05:32,291 --> 00:05:38,046 సర్, మా అమ్మాయి కేవలం కంప్యూటర్లతో మాత్రమే పని చేస్తుంది. 63 00:05:39,756 --> 00:05:42,885 ఆమె మంచి అమ్మాయి, కొంచెం భయస్తురాలు... 64 00:05:46,013 --> 00:05:48,348 ఒక మొసాద్ ఏజెంట్? 65 00:05:48,432 --> 00:05:49,433 అది అసంభవం! 66 00:05:51,810 --> 00:05:57,816 ఏజెంట్లలా కనిపించకుండా ఉండడం అనేది ఏజెంట్లకు ఉండే లక్షణం. 67 00:05:59,067 --> 00:06:01,236 వారిని వారు అలానే ఎంచుకుంటారు. 68 00:06:01,320 --> 00:06:03,447 అయితే నేనేం చేసాను? 69 00:06:03,906 --> 00:06:08,118 సర్, గూఢాచార ప్రపంచానికి నేను అపరిచితుడిని, 70 00:06:08,202 --> 00:06:12,956 కానీ ఇందులో కూడా నీతి, మానవత్వం ఉందనుకున్నాను. 71 00:06:21,173 --> 00:06:22,549 అలాగా. 72 00:06:25,302 --> 00:06:28,889 నేను ఒక రివల్యూషనరీ గార్డ్ మనిషితో మాట్లాడుతున్నానన్న సంగతి మర్చిపోయాను. 73 00:06:29,806 --> 00:06:35,062 మీరు చాలా కాలం క్రితమే మీ మనస్సాక్షిని కోల్పోయారు. 74 00:06:36,230 --> 00:06:38,815 మీరు మా అద్భుతమైన దేశాన్ని ఎలా నాశనం చేసారు. 75 00:06:39,233 --> 00:06:41,109 నీ నుంచి మరొక్క మాట కూడా రాకూడదు! 76 00:06:41,193 --> 00:06:42,819 ఒక్కటి కూడా రాకూడదు! 77 00:06:43,445 --> 00:06:44,780 భోజనం చెయ్యి. 78 00:06:55,165 --> 00:06:59,294 యెహోవా, భూమి యొక్క ఫలాన్ని సృష్టించే నీవు ధన్యుడవు. ఆమెన్. 79 00:07:13,684 --> 00:07:17,062 ప్రవర్తించు. అరవద్దు, గోల చేయవద్దు. 80 00:07:17,646 --> 00:07:19,231 అర్థమైందా? 81 00:07:22,776 --> 00:07:23,902 హలో. 82 00:07:24,444 --> 00:07:25,737 మీరలా చేసి ఉండవలసింది కాదు. 83 00:07:26,780 --> 00:07:29,116 మీరు అర్థం చేసుకునే భాష ఇది ఒక్కటే. 84 00:07:29,199 --> 00:07:33,370 ఫరాజ్, మేము మీ భార్యకు లభించగల ఉత్తమ వైద్య సంరక్షణను ఇస్తున్నాము. 85 00:07:33,453 --> 00:07:35,414 మాకు ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం లేదు. 86 00:07:35,497 --> 00:07:37,875 మరికొన్ని రోజుల్లో మేము ఆమెను విడుదల చేయబోతున్నాం. 87 00:07:37,958 --> 00:07:39,334 నేను నిన్ను నమ్మను. 88 00:07:39,793 --> 00:07:41,211 నువ్వు నా భార్యని కిడ్నాప్ చేసావు. 89 00:07:42,546 --> 00:07:43,755 నన్ను ఆమెతో మాట్లాడనివ్వు. 90 00:07:43,839 --> 00:07:45,799 ఇప్పుడు అది వీలు కాదు. 91 00:07:45,883 --> 00:07:46,967 ఎందుకు కాదు? 92 00:07:47,759 --> 00:07:49,178 ఆమెకేమైనా అయిందా? 93 00:07:49,261 --> 00:07:52,806 ఆమెకి ఏమీ కాలేదు. ఆమెకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. 94 00:07:52,890 --> 00:07:55,142 ఆమె స్థిరపడిన తరువాత నీతో మాట్లాడతాము. 95 00:07:55,559 --> 00:07:59,313 ఈలోపు ఆమె విడుదలకు సంబంధించిన షరతులు మరియు నిబంధనల గురించి నీతో మాట్లాడాలి. 96 00:07:59,396 --> 00:08:01,148 షరతులు స్పష్టంగా ఉన్నాయి. 97 00:08:01,231 --> 00:08:04,359 నా భార్య అర్థరాత్రికల్లా ఇస్తాంబుల్ లో దిగకపోతే... 98 00:08:05,819 --> 00:08:07,404 నేను మొర్డేచాయ్ ని చంపేస్తాను. 99 00:08:08,780 --> 00:08:10,616 దయచేసి నీ భావోద్వేగాలను నియంత్రించుకో. 100 00:08:10,699 --> 00:08:12,409 నీకు అర్థరాత్రి వరకు సమయం ఉంది. 101 00:08:12,993 --> 00:08:14,244 నన్ను పరీక్షించవద్దు. 102 00:08:28,300 --> 00:08:31,595 సరే, అతను సెల్ ఫోన్ ను చూసుకున్నాడు, సిగ్నల్ ను జామ్ చేశాడు, 103 00:08:31,678 --> 00:08:35,682 స్టాక్హోం దగ్గరలో ఉన్న తెలియని ఆపరేటర్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. 104 00:08:35,765 --> 00:08:37,893 మనం రెండు దిశల్లో పని చేద్దాము, 105 00:08:37,976 --> 00:08:40,395 ఖైదీ మార్పిడి ఇంకా అతన్ని కనిపెట్టడానికి ప్రయత్నిద్దాం. 106 00:08:45,234 --> 00:08:49,655 విద్యుత్ సబ్ స్టేషన్, టెహ్రాన్ 107 00:08:53,659 --> 00:08:54,660 పర్హం కస్రాయి? 108 00:08:55,577 --> 00:08:58,497 మిమ్మల్ని కలవడం బాగుంది. మీతో కొంచెం మాట్లాడవచ్చా? 109 00:08:59,665 --> 00:09:01,959 నన్ను క్షమించండి, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా? 110 00:09:02,501 --> 00:09:05,045 దీనిని అనధికారికంగా ఉంచడమే మంచిది. 111 00:09:07,256 --> 00:09:08,549 నేను కూర్చోవచ్చా? 112 00:09:13,887 --> 00:09:16,890 సరే, మిస్టర్ పర్హం, 113 00:09:16,974 --> 00:09:18,725 మీరు ఈ స్టేషన్ లో ఎంత కాలంగా పని చేస్తున్నారు? 114 00:09:19,518 --> 00:09:20,811 సుమారు 15 సంవత్సరాలు. 115 00:09:20,894 --> 00:09:22,354 -15 సంవత్సరాలా? -అవును. 116 00:09:22,437 --> 00:09:23,564 అది చాలా కాలం. 117 00:09:24,273 --> 00:09:27,401 మీకు మీ భార్య కన్నా ఈ వ్యవస్థలు బాగా తెలిసి ఉండాలి. 118 00:09:30,737 --> 00:09:31,905 అంతా బాగానే ఉందా? 119 00:09:33,198 --> 00:09:34,575 ఉంది. ఉంది. 120 00:09:35,534 --> 00:09:39,288 ఇవాళ నా రోజు బిజీగా ఉంది, నాకు కొన్ని నిమిషాలలో ఒక మీటింగ్ ఉంది. 121 00:09:39,371 --> 00:09:42,541 నన్ను క్షమించండి. విషయానికి వద్దాము. 122 00:09:43,166 --> 00:09:47,588 ఇటీవలే మేము మీ సర్వర్ లలో తీవ్రమైన దుర్బలత్వం కనుగొన్నాము. 123 00:09:47,963 --> 00:09:51,300 స్టేషన్ సర్వర్లలో కొన్ని సైనిక వ్యవస్థలతో అనుసంధానమైనట్లు తెలుస్తోంది. 124 00:09:52,426 --> 00:09:54,094 అదెలా సాధ్యం? 125 00:09:55,137 --> 00:09:56,972 అవును, అది సాధ్యమే. 126 00:09:57,055 --> 00:09:59,641 కానీ ఇది దుర్బలత్వం కాదు. అవి బ్యాకప్ సిస్టమ్స్. 127 00:09:59,725 --> 00:10:01,310 వాటిని డిస్కనెక్ట్ చేయవచ్చా? 128 00:10:01,393 --> 00:10:04,479 నేను చేయలేను. నేనందుకు బాధ్యత వహించే వ్యక్తి నంబర్ మీకు ఇస్తాను. 129 00:10:10,194 --> 00:10:13,113 అతనికసలు ఈ సర్వర్లు ఏమిటో తెలుసా? 130 00:10:14,448 --> 00:10:15,616 అతనికి తెలుసనుకుంటాను. 131 00:10:15,699 --> 00:10:18,702 ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి! 132 00:10:22,706 --> 00:10:24,333 మిస్టర్ పర్హం... 133 00:10:26,335 --> 00:10:29,213 నేనిప్పుడు చెప్పబోతున్నది మనిద్దరి మధ్యే ఉండాలి. 134 00:10:29,296 --> 00:10:34,176 కొన్ని విదేశీ శక్తులు ఈ సర్వర్ లను హ్యాక్ చేసి, సైనిక వ్యవస్థలను 135 00:10:34,259 --> 00:10:36,470 యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. 136 00:10:37,221 --> 00:10:39,973 మనమలా జరగనివ్వలేము, కదా? 137 00:10:42,726 --> 00:10:43,769 అవును. 138 00:10:44,353 --> 00:10:48,941 మనం సెక్యూరిటీ స్పెషలిస్ట్ తో మాట్లాడదాం. అతను తన పని సరిగ్గా చేసేలా చూద్దాం. 139 00:10:50,442 --> 00:10:51,610 సరే. 140 00:10:52,736 --> 00:10:57,241 నేను ఒక ఫోన్ చేసి ఈ మీటింగ్ వాయిదా వేస్తాను. 141 00:10:57,324 --> 00:10:58,992 నేను మిమ్మల్ని ఒక్క నిమిషంలో కలుస్తాను. 142 00:11:01,286 --> 00:11:02,371 నేను బయట ఉంటాను. 143 00:11:11,547 --> 00:11:15,425 అయితే? అతని ప్రవర్తన వింతగా ఉంది, కదా? 144 00:11:16,218 --> 00:11:19,012 మిలాద్, నేను పర్హం. నువ్వు ఎక్కడున్నావు? 145 00:11:19,096 --> 00:11:22,391 నువ్వు ఇపుడు వెళ్ళలేవు. ఇప్పుడది చాలా ప్రమాదకరం. 146 00:11:22,474 --> 00:11:24,685 నేను సమస్య రిపోర్టును రద్దు చేసాను. 147 00:11:26,019 --> 00:11:27,938 ఆ వీడియోని పంపించకు. 148 00:11:28,730 --> 00:11:30,774 ప్లీజ్, నువ్వు నాకు తమ్ముడులాంటి వాడివి. 149 00:11:41,159 --> 00:11:42,369 అతనది రద్దు చేసాడు. 150 00:11:42,452 --> 00:11:44,288 నువ్వు కొత్త దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించగలవా? 151 00:11:44,788 --> 00:11:46,164 నీ దగ్గర అతని సమాచారం ఉంది. 152 00:11:46,248 --> 00:11:48,041 వారి సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి సమయం పడుతుంది. 153 00:11:48,625 --> 00:11:52,254 అది ఒక క్లాసిఫైడ్ ప్రాంతం, అందుకు కోడ్ కావాలి. ఇంకా అతనికి నోటిఫికేషన్ వస్తుంది. 154 00:11:53,255 --> 00:11:54,506 అది అతనే చెయ్యాలి. 155 00:11:55,007 --> 00:11:57,968 నువ్వు అతనితో ఉన్నావు కదా. మనమతనితో మళ్ళీ చేయించగలమా? 156 00:11:58,051 --> 00:12:00,304 మనలో ఒకరం పర్హంతో మాట్లాడితే, మనమతన్ని భయపెడతాము. 157 00:12:00,387 --> 00:12:03,432 అతను నన్నెలా చూసాడో నేను చూసాను, అతనికి నా మీద నమ్మకం లేదు. 158 00:12:04,183 --> 00:12:05,642 ఇందులో మనకు మిలాద్ చాలా ముఖ్యం. 159 00:12:06,560 --> 00:12:07,769 నన్ను మిలాద్ తో మాట్లాడనివ్వు. 160 00:12:13,942 --> 00:12:15,903 నేనతనితో అది చేయించగలను, కదోష్. 161 00:12:24,077 --> 00:12:25,078 సరే. 162 00:13:13,669 --> 00:13:15,170 నీకు ఎలా అనిపిస్తోంది? 163 00:13:15,254 --> 00:13:16,630 అవతలకి వెళ్ళు. 164 00:13:23,846 --> 00:13:25,097 నువ్వు తాగాలి. 165 00:13:26,265 --> 00:13:27,641 ఎందుకు? హా? 166 00:13:28,934 --> 00:13:31,270 ఎలాగూ నువ్వు నన్ను ఒక్క క్షణంలో చంపేస్తావు, కాదా? 167 00:13:32,896 --> 00:13:34,690 ఎవరూ నిన్ను చంపబోవడం లేదు. 168 00:13:41,196 --> 00:13:43,115 అయితే నువ్వు ఇదేనా? 169 00:13:45,200 --> 00:13:46,451 ఒక ఏజెంట్? 170 00:13:47,244 --> 00:13:48,453 ఒక ఇజ్రాయెలీ? 171 00:13:53,584 --> 00:13:54,751 అలాగా. 172 00:13:57,045 --> 00:13:59,381 కొన్ని నెలలుగా నువ్వు నన్ను దీని కోసం సిద్ధం చేసుకున్నావు. 173 00:13:59,464 --> 00:14:03,385 డార్క్ నెట్ లో మన చాట్లు, మనం కలిసి చేసినవన్నీ... 174 00:14:04,303 --> 00:14:06,180 అదంతా నటన. 175 00:14:07,973 --> 00:14:09,558 అది ఇప్పుడు అనవసరం. 176 00:14:12,561 --> 00:14:14,396 నేనది ఎలా తెలుసుకోలేకపోయాను? 177 00:14:17,858 --> 00:14:19,526 నువ్వు నాకిలా ఎలా చేయగలిగావు? 178 00:14:21,445 --> 00:14:22,738 నన్ను క్షమించు. 179 00:14:23,864 --> 00:14:25,574 ఇది నిన్ను గాయపరచాలని కాదు. 180 00:14:25,657 --> 00:14:28,785 కరీమ్ కనుక వచ్చి ఉండకపోతే, నన్ను బెదిరించి ఉండకపోతే, 181 00:14:28,869 --> 00:14:32,164 -అంతా బాగానే జరిగి ఉండేది. -కానీ అలా జరగలేదు, కదా? 182 00:14:33,665 --> 00:14:34,833 లేదు. 183 00:14:36,084 --> 00:14:37,586 అలా జరగలేదు. 184 00:14:41,965 --> 00:14:43,258 ఇప్పుడు మనకొక సమస్య వచ్చింది. 185 00:14:43,717 --> 00:14:46,428 పర్హం ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. మనం లోపలికి వెళ్ళలేము. 186 00:14:46,845 --> 00:14:48,514 అది నీ సమస్యలా ఉంది. 187 00:14:48,597 --> 00:14:50,766 నీది కూడా. అతనిది కూడా. 188 00:14:50,849 --> 00:14:53,519 ఎందుకు? అయితే నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు. 189 00:14:58,357 --> 00:15:01,276 చాలు. ఇక నేను చేయను. 190 00:15:02,319 --> 00:15:04,029 నీకు ఏం కావాలంటే అది చేసుకో. 191 00:15:04,112 --> 00:15:06,156 -మిలాద్. -నువ్వు నేను చెబుతోంది వినడం లేదా? 192 00:15:06,240 --> 00:15:09,159 నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాటను కూడా నేను నమ్మను, 193 00:15:09,243 --> 00:15:12,329 నేను నీకు ఇక దేనికీ సహాయం చేయబోవడం లేదు! 194 00:15:12,412 --> 00:15:13,997 నీకు సహాయం చేయడానికి ముందు నేను చచ్చిపోతాను! 195 00:15:14,081 --> 00:15:15,374 బయటకి పో! 196 00:15:21,505 --> 00:15:22,589 నువ్వు పొరపాటు చేస్తున్నావు. 197 00:15:27,219 --> 00:15:28,470 అది చాలా బాగా అనిపించింది. 198 00:15:47,114 --> 00:15:49,241 ఇస్తాంబుల్, టర్కీ 199 00:15:49,324 --> 00:15:51,451 దివాని 200 00:16:02,504 --> 00:16:05,924 నాకూ నా భార్యే నా పూర్తి లోకం. 201 00:16:07,593 --> 00:16:08,594 క్యాన్సర్. 202 00:16:10,679 --> 00:16:13,390 అయితే ఆరజూ మీకు అంతా చెప్పింది. 203 00:16:17,227 --> 00:16:23,358 నా భార్య క్యాన్సర్ ఒక లక్షణం, అది కారణం కాదు. 204 00:16:23,901 --> 00:16:27,362 ఆమె కష్టాలు, మా కష్టాలు... 205 00:16:28,030 --> 00:16:30,699 మా ప్రియమైన దేశం నుంచి దూరంగా, 206 00:16:30,782 --> 00:16:33,118 ఒక కొత్త దేశంలో జీవించడం, 207 00:16:33,202 --> 00:16:35,120 ఆమెని చంపింది అదే. 208 00:16:35,204 --> 00:16:37,456 ఆమె బాధతో మరణించింది, పాపం. 209 00:16:39,333 --> 00:16:41,168 మీరసలు ఎందుకు వదిలి వెళ్లారు? 210 00:16:42,252 --> 00:16:43,795 మీరుమాతో వ్యవహరించాల్సిన అవసరం లేదు కదా. 211 00:16:46,089 --> 00:16:50,302 హోలీ ల్యాండ్ కి వెళ్ళడం నా కల. 212 00:16:50,385 --> 00:16:52,429 జెరూసలేంకి వెళ్ళడం, 213 00:16:52,971 --> 00:16:56,058 ఆ వెస్టర్న్ వాల్ వద్ద ప్రార్థన చేయడం. 214 00:16:57,976 --> 00:17:01,605 నేను మొదటి సారి జెరూసలేం వెళ్ళి, 215 00:17:01,688 --> 00:17:07,109 ఆ పవిత్ర గోడని, ఆ ముస్లీములు కట్టిన ఆ గోడలని చూసినప్పుడు, 216 00:17:07,778 --> 00:17:09,780 నాకు ఎడుపు వచ్చింది. 217 00:17:10,781 --> 00:17:12,406 తర్వాత? 218 00:17:12,741 --> 00:17:15,536 నేనక్కడ వెలివేయబడినట్టు ఉన్నాను. 219 00:17:15,618 --> 00:17:18,579 ప్రతి సంవతరం ఇరాన్ కి రావాలన్న కోరిక బాగా పెరుగుతుంది. 220 00:17:20,374 --> 00:17:23,377 అది ఎంత కష్టమో మీకు తెలియదు. 221 00:17:25,587 --> 00:17:27,422 అయితే మరి మీరు ఎందుకు వదిలి వెళ్ళారు? 222 00:17:30,259 --> 00:17:33,387 నేనది మా అమ్మాయి కోసం చేసాను. 223 00:17:36,265 --> 00:17:38,600 ఆమె చాలా బాగా చేసింది. 224 00:17:39,268 --> 00:17:41,436 ఆమె మీకేం చేసిందో చూడండి. 225 00:18:00,372 --> 00:18:01,748 నీకు ఎలా అనిపిస్తోంది? 226 00:18:05,669 --> 00:18:07,171 నేను ఇంటికి ఎప్పుడు వెళతాను? 227 00:18:07,588 --> 00:18:09,840 అది నీకు సురక్షితం అని మాకు తెలిసిన వెంటనే. 228 00:18:09,923 --> 00:18:11,800 నాకు నా భర్తతో మాట్లాడాలని ఉంది. 229 00:18:13,677 --> 00:18:14,845 ఒక్క నిమిషంలో. 230 00:18:15,220 --> 00:18:17,431 అందుకు ముందు నేను నీతో మాట్లాడాలి. 231 00:18:18,932 --> 00:18:22,352 నీ భర్త ఒక అమాయక ఇజ్రాయెలీ పౌరుడిని కిడ్నాప్ చేసాడు, 232 00:18:22,436 --> 00:18:25,105 నిన్ను వదిలిపెట్టకపోతే, అతన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. 233 00:18:28,859 --> 00:18:32,654 నాకీ కథ త్వరగా పూర్తవ్వాలని ఉంది. ఇది నాకు కూడా బాలేదు. 234 00:18:33,280 --> 00:18:37,117 కానీ నీ పరిస్థితిలో నువ్వు విమానయానం చేయలేవు. నా మాట నమ్మాలి. 235 00:18:37,201 --> 00:18:38,577 నువ్వెలా అంటే అలా. 236 00:18:38,660 --> 00:18:42,080 నాహిదా, నువ్వు నన్ను నమ్మాలి, నీ భర్తకి వివరించాలి. 237 00:18:42,998 --> 00:18:46,293 తరువాత బాధపడే పని అతను చేయడం నాకిష్టం లేదు. 238 00:18:48,003 --> 00:18:51,590 అతన్ని శాంతపరుచు, అతనెవరినీ గాయపరచకుండా చూడు. 239 00:18:52,132 --> 00:18:53,634 అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడు. 240 00:18:53,967 --> 00:18:57,471 మానసికంగా అస్థిరమా? మీరాయనకి ఏ ఎంపికని వదిలిపెట్టారు? 241 00:18:57,554 --> 00:18:59,932 మీ భార్యని కిడ్నాప్ చేస్తే మీరేం చేస్తారు? 242 00:19:02,017 --> 00:19:03,602 నిజం చెప్పాలంటే... 243 00:19:05,395 --> 00:19:07,981 అతను చేసింది నేను చేస్తానో లేదో నాకు తెలియదు. 244 00:19:08,398 --> 00:19:10,192 అతను నిన్ను మరీ ఎక్కువ ప్రేమిస్తాడు. 245 00:19:10,901 --> 00:19:12,653 మీ భార్యకి ఆ మాట చెప్పవద్దు. 246 00:19:13,987 --> 00:19:15,739 దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. 247 00:19:17,032 --> 00:19:19,701 నా భార్య రెండేళ్ళ క్రితం మరణించింది. 248 00:19:24,373 --> 00:19:26,500 నేను నీకు సహాయం చేయగలనని అనుకోను. 249 00:19:27,835 --> 00:19:29,211 నీకాయని గురించి తెలియదు. 250 00:19:29,795 --> 00:19:31,922 ఆయన ఏమైనా చేయాలని నిర్ణయించుకుంటే, 251 00:19:32,589 --> 00:19:34,341 ఆయన మనసు మార్చలేము. 252 00:19:34,424 --> 00:19:35,801 నువ్వు మార్చగలవని అనుకుంటాను. 253 00:19:36,426 --> 00:19:38,428 అతను నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు చెప్పే మాట వింటాడు. 254 00:19:39,096 --> 00:19:41,849 చాలా సంవత్సరాల క్రితం, 255 00:19:41,932 --> 00:19:45,269 నేను ఇంకా ఫీల్డ్ లో పని చేస్తున్నప్పుడు... 256 00:19:47,396 --> 00:19:49,648 నేను చాలా చెడ్డ పరిస్థితిలో ఉన్నాను. 257 00:19:50,482 --> 00:19:52,150 ఇక అంతా అయిపోయిందని అనుకున్నాను. 258 00:19:52,526 --> 00:19:54,319 నా కథ అయిపోయిందనుకున్నాను. 259 00:19:56,572 --> 00:20:01,243 అన్ని ఆదేశాలకు వ్యతిరేకం అయినా, నేను నా భార్యకు ఫోన్ చేసాను. 260 00:20:01,785 --> 00:20:06,039 ఆమెకు వీడ్కోలు చెప్పడానికి ఫోన్ చేసాను. నా చివరి మాటలు చెప్పడానికి. 261 00:20:07,291 --> 00:20:09,293 నేనొక స్పీచ్ కూడా రాసుకున్నాను, 262 00:20:09,835 --> 00:20:12,129 కానీ ఆమె నన్నది చదవనివ్వలేదు. 263 00:20:13,839 --> 00:20:15,090 ఆమె నన్ను ఆపింది. 264 00:20:15,799 --> 00:20:19,553 ఆమెకది వినాలని లేదని చెప్పింది, నేను చనిపోయే అవకాశమే లేదని చెప్పింది. 265 00:20:22,264 --> 00:20:26,059 ఆమె అర్థం చేసుకోవడం లేదని చెప్పాను. అంతే. 266 00:20:26,768 --> 00:20:27,895 అది అయిపోయింది. 267 00:20:32,608 --> 00:20:36,862 ఆ తరువాత, నాతో వాదించడానికి బదులు, 268 00:20:37,863 --> 00:20:40,365 ఆమె నాకొక పాట పాడడం మొదలు పెట్టింది. 269 00:20:44,578 --> 00:20:46,538 అది మా పాట. 270 00:20:48,832 --> 00:20:50,042 పాడు. 271 00:20:52,002 --> 00:20:53,378 నేను పాడకపోవడమే మంచిది. 272 00:21:05,599 --> 00:21:09,978 నాలో తీగలు ఉంటే అవి ప్రకంపనతో వాయిస్తాయి 273 00:21:11,188 --> 00:21:15,275 నాలో ఆందోళన ఉంటే అది దాదాపు బహిర్గతమవుతుంది 274 00:21:16,276 --> 00:21:20,197 నాలో ప్రేమ ఉంటే అది నిశ్శబ్దంగా మాట్లాడుతుంది 275 00:21:20,572 --> 00:21:23,534 నాలో మూలాలు ఉంటే అవి నెమ్మదిగా పెరుగుతాయి... 276 00:21:23,617 --> 00:21:25,869 నీ స్వరం అస్సలు బాలేదు. 277 00:21:26,828 --> 00:21:27,996 ధన్యవాదాలు. 278 00:21:31,667 --> 00:21:33,126 దాని అర్థమేంటి? 279 00:21:37,172 --> 00:21:39,883 అది మామూలు ప్రేమ గురించి. 280 00:21:41,552 --> 00:21:43,345 రోజువారీ ప్రేమ. 281 00:21:44,513 --> 00:21:46,765 జీవితంలోని సాధారణ విషయాలు. 282 00:21:49,852 --> 00:21:51,270 అది బాగుంది. 283 00:22:13,458 --> 00:22:14,585 హలో. 284 00:22:14,668 --> 00:22:15,919 ప్రియా... 285 00:22:16,962 --> 00:22:19,715 -ఎలా ఉంది? -ఎలా ఉన్నావు? 286 00:22:20,215 --> 00:22:22,718 దేవుడి దయ. నేను బాగానే ఉన్నాను. 287 00:22:23,343 --> 00:22:28,307 నేను కొంచెం బలహీనంగా ఉన్నాను. వారు రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. 288 00:22:29,099 --> 00:22:30,809 కానీ ఇప్పుడు నాకు బాగానే ఉంది. 289 00:22:31,393 --> 00:22:32,686 మీరెలా ఉన్నారు? 290 00:22:34,021 --> 00:22:35,689 నాకు నీ గురించి ఆందోళనగా ఉంది. 291 00:22:37,649 --> 00:22:39,568 వారు నన్ను బాగా చూసుకుంటున్నారు. 292 00:22:40,068 --> 00:22:42,237 దేవుడి దయతో, మనం త్వరలోనే కలుసుకుంటాము. 293 00:22:44,031 --> 00:22:45,407 ప్రియా... 294 00:22:46,366 --> 00:22:49,578 వారు మీరొక వ్యక్తిని కిడ్నాప్ చేసారని చెప్పారు, 295 00:22:50,287 --> 00:22:51,914 ఒక ఇజ్రాయెలీ పౌరుడిని, 296 00:22:52,497 --> 00:22:54,833 అతన్ని చంపుతానని బెదిరించారని చెప్పారు. 297 00:22:55,250 --> 00:22:57,753 వారి అబద్ధాలను నమ్మకు. 298 00:22:58,837 --> 00:23:01,048 అయితే అది నిజం కాదా? 299 00:23:02,216 --> 00:23:04,843 మీరు ఇప్పుడు ఇంట్లో GEM టీవీ చూస్తున్నారా? 300 00:23:05,219 --> 00:23:07,012 నాకా షోలు నచ్చవని నీకు తెలుసు. 301 00:23:09,139 --> 00:23:13,894 చూసారా? నేను అక్కడ లేకపోవడం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. 302 00:23:14,728 --> 00:23:19,441 మీరు కూర్చుని నాతో పాటు నా టర్కిష్ షోలను చూడనవసరం లేదు. 303 00:23:22,277 --> 00:23:23,737 ప్రియా... 304 00:23:25,072 --> 00:23:28,450 నా కోసం మరీ ఎక్కువ దూరం వెళ్లలేదని నాకు మాట ఇస్తారా? 305 00:23:30,494 --> 00:23:32,496 దేవుడు తనే నిన్ను నా దగ్గరకు తిరిగి తీసుకురాడు కదా. 306 00:23:34,748 --> 00:23:36,041 అతన్ని వదిలిపెట్టండి. 307 00:23:36,667 --> 00:23:39,211 -నాహిదా... -నా మాట వినండి. 308 00:23:39,294 --> 00:23:43,882 నేను ఇప్పుడు విమాన ప్రయాణం చేసే స్థితిలో లేను. 309 00:23:43,966 --> 00:23:46,844 అతని జామర్ ఆన్ అయి ఉంది, మనకి ఇంకా అతని స్థానం తెలియదు. 310 00:23:46,927 --> 00:23:50,472 అందుకు కొన్ని రోజులు పడుతుంది. ఓపిక పట్టండి. 311 00:23:51,098 --> 00:23:54,560 ప్రియా, వారిలా క్రూరంగా ఉండకు. 312 00:23:55,018 --> 00:23:56,979 అతన్ని గాయపరచకండి. 313 00:23:58,105 --> 00:24:00,274 నేనా మాట ఇవ్వలేను. 314 00:24:00,816 --> 00:24:03,735 నేను నిన్ను ఇంటికి తీసుకువస్తానని మాట ఇస్తున్నాను. 315 00:24:11,368 --> 00:24:12,536 నాహిదా. 316 00:24:13,662 --> 00:24:15,163 ప్రియా. 317 00:24:17,291 --> 00:24:21,253 నువ్వు వారి తరఫున మాట్లాడడం నాకు బాధ కలిగిస్తోంది. 318 00:24:23,046 --> 00:24:25,549 నువ్వు వారితో మాట్లాడనని నాకు మాట ఇవ్వు. 319 00:24:32,639 --> 00:24:33,849 నాహిదా? 320 00:24:36,560 --> 00:24:37,936 నేను నిజంగా అంటున్నాను. 321 00:24:40,856 --> 00:24:42,024 హలో? 322 00:24:42,566 --> 00:24:43,775 చాలు. 323 00:24:44,735 --> 00:24:46,904 నేనిలాంటి మాటలు వినలేను. 324 00:24:47,905 --> 00:24:49,907 నిన్ను మిస్ అవుతున్నాను. 325 00:24:50,532 --> 00:24:54,286 నీ గొంతు, నీ కౌగిలి. 326 00:24:55,621 --> 00:24:59,249 మనం మాట్లాడుకుందాము, మనిద్దరమే. 327 00:25:00,584 --> 00:25:02,753 వారిని విననివ్వు. నాకు అనవసరం. 328 00:25:03,879 --> 00:25:06,840 నాకు కేవలం నీ గొంతు వినాలని ఉంది. 329 00:25:10,135 --> 00:25:11,678 నన్ను ఏం చెప్పమంటావు? 330 00:25:12,596 --> 00:25:14,723 నువ్వు పాడు. 331 00:25:15,974 --> 00:25:20,729 ఫరాజ్, నేను చాలా అలసిపోయాను. నాకు పడుకోవాలని ఉంది. 332 00:25:22,439 --> 00:25:24,233 నువ్వు నాకోసం పాడతావా? 333 00:25:26,485 --> 00:25:30,280 ప్రియా, నేనిప్పుడు పాడే స్థితిలో లేను. 334 00:25:32,991 --> 00:25:36,328 నువ్వు ఇంకా కావాలనుకుంటే 335 00:25:36,745 --> 00:25:39,289 మనం స్నేహితులుగా ఉండాలని 336 00:25:39,748 --> 00:25:43,210 పాత రోజుల్లోలా 337 00:25:43,669 --> 00:25:46,839 కలిసి కూర్చుని, సూర్యోదయంతో లేచి 338 00:25:46,922 --> 00:25:49,967 నీ మనసు తాజాగా అవ్వాలి 339 00:25:50,050 --> 00:25:53,178 కొత్త రాగాన్ని తీసుకోవాలి... 340 00:25:53,262 --> 00:25:54,805 సరే, అతనొక స్క్రాంబ్లర్ వాడుతున్నాడు, 341 00:25:54,888 --> 00:25:58,058 కానీ ఆ అల్గారిథం ఆ పాటని ఇస్తాంబుల్ కి వస్తున్న కాల్స్ లో చూపిస్తోంది. 342 00:26:02,062 --> 00:26:05,440 నువ్వు నాతో ఉండాలంటే 343 00:26:05,524 --> 00:26:08,026 మనం యవ్వనంలో ఉన్నప్పుడే రావాలి 344 00:26:08,777 --> 00:26:11,446 మన ఎముకల మీద చర్మం ఉన్నప్పుడే రావాలి 345 00:26:11,905 --> 00:26:14,992 నా మనసుని ఒంటరిగా వదిలేయద్దు 346 00:26:15,075 --> 00:26:18,120 నా రాత్రికి కొత్త రంగునివ్వు 347 00:26:18,787 --> 00:26:22,124 కొత్త రాగాన్ని తీసుకో 348 00:26:22,207 --> 00:26:25,460 మట్టి రంగుని తీసుకో 349 00:26:25,544 --> 00:26:29,339 నన్ను నువ్వు ఒంటరిగా వదలని చోట 350 00:26:31,466 --> 00:26:33,552 దివాని హోటల్ కాల్ మూలం 351 00:26:33,969 --> 00:26:35,053 బింగో. 352 00:26:40,893 --> 00:26:42,644 ధైర్యంగా ఉండు, ప్రియా. 353 00:26:44,646 --> 00:26:46,356 నువ్వంటే నాకిష్టం. 354 00:26:47,733 --> 00:26:49,568 నిన్ను త్వరలోనే కలుస్తాను. 355 00:26:51,737 --> 00:26:53,030 నేను మాట ఇస్తున్నాను. 356 00:27:03,207 --> 00:27:05,709 ఏమీ అనుకోకండి, నేను మాట్లాడచ్చా? 357 00:27:06,752 --> 00:27:08,712 ఆమె బాగానే ఉందా? 358 00:27:08,795 --> 00:27:10,297 మీరు ఆమెతో మాట్లాడారా? 359 00:27:11,423 --> 00:27:12,591 లోపలికి వెళ్ళు. 360 00:27:14,092 --> 00:27:16,094 ఇక్కడ ఇలా కూర్చోవడం కష్టంగా ఉంటుంది. 361 00:27:16,178 --> 00:27:18,263 నిన్ను లోపలికి వెళ్ళమని చెప్పాను! 362 00:27:18,931 --> 00:27:21,767 లోపలికి వెళ్ళు, జియోనిస్టు కుక్క! లోపలికి! 363 00:27:50,671 --> 00:27:51,672 తమార్. 364 00:27:57,594 --> 00:27:58,595 ఇక్కడ. 365 00:27:59,346 --> 00:28:00,889 -అయితే? -ధన్యవాదాలు. 366 00:28:11,358 --> 00:28:15,153 నీకు ఆరు సంవత్సరాల వయసులో నువ్వు వలస వచ్చావు, నేను 15 ఏళ్ళ వయసులో వచ్చాను. 367 00:28:16,071 --> 00:28:18,699 నా బాల్యం, యవ్వనం ఇక్కడే గడిపాను. 368 00:28:19,533 --> 00:28:21,451 నేనొక ముస్లిం స్కూల్ కి వెళ్ళాను. 369 00:28:23,245 --> 00:28:25,122 కానీ నేను ఇజ్రాయెల్ వచ్చిన తరువాత, 370 00:28:26,373 --> 00:28:27,791 నాకు విదేశీయురాలిలా అనిపించింది. 371 00:28:30,210 --> 00:28:33,046 కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడికి మొదటి సారి వెళ్లాను. 372 00:28:34,840 --> 00:28:36,800 నన్ను అక్కడికి ఒక సీనియర్ ఆఫీసర్ ని కలిసి... 373 00:28:37,509 --> 00:28:41,722 అతన్ని ఆకర్షించి, అతని రహస్య స్థావరంలోకి తీసుకు వెళ్ళేలా చేయమని పంపారు. 374 00:28:42,264 --> 00:28:43,599 యాంటి ఎయిర్ క్రాఫ్ట్ హెడ్ క్వార్టర్స్. 375 00:28:44,224 --> 00:28:45,893 నేను దాని గురించి విన్నాను. 376 00:28:46,351 --> 00:28:48,187 మేము కొన్ని నెలల పాటు సంబంధం పెట్టుకున్నాము, 377 00:28:48,604 --> 00:28:50,439 ఇంకా అది... 378 00:28:50,522 --> 00:28:52,691 వెళ్లకూడని చోటులకు వెళ్ళింది. 379 00:28:55,402 --> 00:28:57,196 అతన్ని చూసినప్పుడల్లా, 380 00:28:57,613 --> 00:29:00,240 మా వీధిలో ఉన్న అబ్బాయిని చూసినట్లు అనిపించేది. 381 00:29:01,408 --> 00:29:06,330 నాకు ఇజ్రాయెల్ తో ఎన్నడూ లేని ఒక ఉమ్మడి భాష, సంబంధం ఉన్నట్లు అనిపించింది. 382 00:29:11,126 --> 00:29:12,419 తమార్. 383 00:29:13,086 --> 00:29:17,257 ప్రేమలో పడడం, దారి తప్పడం ఎంత తేలికో, నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. 384 00:29:18,217 --> 00:29:20,010 ఆ పొరపాటు చేయకు. 385 00:29:22,095 --> 00:29:24,473 నీ నిజమైన గుర్తింపును మర్చిపోకు. 386 00:29:30,020 --> 00:29:31,522 ఇప్పుడు వెళ్లి అతనీతో మాట్లాడు. 387 00:29:32,773 --> 00:29:35,317 అతని మనసుతో మాట్లాడు, నీ మనసు నుంచి కాదు. 388 00:29:36,902 --> 00:29:38,237 నీ మెదడు ఉపయోగించు. 389 00:29:53,168 --> 00:29:54,211 కదోష్... 390 00:29:55,754 --> 00:29:57,297 నువ్వు చెప్పిన ఆ ఆఫీసర్... 391 00:30:00,384 --> 00:30:01,635 ఇప్పుడు ఎక్కడున్నాడు? 392 00:30:02,678 --> 00:30:04,012 అది అనవసరం. 393 00:30:04,930 --> 00:30:06,306 నాకిప్పుడు అతనితో ఎటువంటి సంబంధం లేదు. 394 00:30:21,655 --> 00:30:24,199 నువ్వు ఉన్న పరిస్థితి నీకు అర్థం కావడం లేదు, 395 00:30:24,283 --> 00:30:26,743 నా వెనుక ఉన్న సంస్థ ఏం చేయగలదో నీకు తెలియడం లేదు. 396 00:30:26,827 --> 00:30:28,912 దాని అర్థం ఏంటి? 397 00:30:28,996 --> 00:30:31,456 వారి లక్ష్యం నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? 398 00:30:31,999 --> 00:30:33,333 వారు నీ కుటుంబాన్ని గాయపరచాలనుకుంటున్నారు. 399 00:30:33,417 --> 00:30:34,376 ఇంకా నయం. 400 00:30:34,459 --> 00:30:37,337 వారు నీ గురించి సేకరించిన సమాచారాన్ని చూపించమంటావా? 401 00:30:37,838 --> 00:30:40,007 నీ అహంతో హాని తెచ్చుకోకు. 402 00:30:40,716 --> 00:30:41,967 అహమా? 403 00:30:42,718 --> 00:30:44,595 నా స్నేహితుడు నా కళ్ళ ఎదురుగా హత్య చేయబడ్డాడు. 404 00:30:44,678 --> 00:30:46,680 వారు ఇతరులను కూడా గాయపరుస్తారు. 405 00:30:53,562 --> 00:30:55,480 అయినా నువ్వు ఇక్కడ ఎవరిని రక్షిస్తున్నావు? 406 00:30:56,356 --> 00:30:57,733 నువ్వు ద్వేషించే పాలకులనా? 407 00:30:58,358 --> 00:31:01,695 నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. నీకది ఎందుకు కనిపించడం లేదు? 408 00:31:02,946 --> 00:31:05,908 వారు కోరుకున్నట్లయితే, నిన్నా కమ్యూన్ వద్దనే చంపేసేవారు. 409 00:31:06,408 --> 00:31:09,369 ఈ మిషన్ కనుక సఫలం అయితే, వారు నిన్ను వదిలేస్తారు. 410 00:31:10,746 --> 00:31:12,748 కానీ నువ్వు మాకు సహాయం చేయాల్సి ఉంటుంది. 411 00:31:17,336 --> 00:31:18,712 పర్హంకి ఫోన్ చెయ్యి. 412 00:31:19,379 --> 00:31:20,923 అతన్ని శాంతింప చెయ్యి. 413 00:31:21,340 --> 00:31:24,801 అంతా బాగానే ఉంటుందని చెప్పు ఎందుకంటే అంతా బాగానే ఉంటుంది. 414 00:31:38,607 --> 00:31:39,691 హలో? 415 00:31:39,775 --> 00:31:41,527 ఎలా ఉన్నావు, మిత్రమా? 416 00:31:42,319 --> 00:31:44,071 నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? 417 00:31:44,488 --> 00:31:47,491 నువ్వా పని చేయని దాని రిపోర్టు వెనక్కి తీసుకున్నావు. 418 00:31:47,574 --> 00:31:49,076 నాకు వేరే దారిలేదు. 419 00:31:49,159 --> 00:31:51,119 నువ్వు నా సందేశం వినలేదా? 420 00:31:51,203 --> 00:31:53,956 పర్హం, నువ్వు శాంతించాలి. 421 00:31:55,290 --> 00:31:56,708 చాలు! 422 00:31:56,792 --> 00:31:59,044 నీ కోసం నేనిది చెయ్యలేను. 423 00:32:12,599 --> 00:32:13,892 పర్హం... 424 00:32:16,186 --> 00:32:18,522 నీ వీడియో కేవలం ప్రారంభం మాత్రమే. 425 00:32:19,022 --> 00:32:23,735 నువ్విది చేయకపోతే, నీకు సంబంధం ఉన్న ప్రతి అమ్మాయి గురించి నీ భార్యకి చెబుతాము. 426 00:32:24,778 --> 00:32:28,323 ఇంకా నీ వీడియోని రివల్యూషనరీ గార్డ్ కి పంపుతాము. 427 00:32:28,740 --> 00:32:32,244 ప్రతిదీ రికార్డు చేయబడింది. ఇక్కడ పొరపాటు చేయకు. 428 00:32:33,328 --> 00:32:35,038 మూర్ఖంగా ప్రవర్తించకు. 429 00:32:39,084 --> 00:32:40,836 నిన్ను బతిమిలాడుతున్నాను... 430 00:32:42,462 --> 00:32:44,089 అలా చేయకు. 431 00:32:46,049 --> 00:32:49,011 పని చేయడం లేదన్న కాల్ ని తిరిగి పెట్టు. 432 00:32:55,017 --> 00:32:56,185 నేను చేసాను. 433 00:33:07,070 --> 00:33:08,155 మనకు వచ్చింది. 434 00:33:08,238 --> 00:33:09,781 పర్హం... 435 00:33:11,408 --> 00:33:13,410 కంగారు పడకు, సోదరా. 436 00:33:19,374 --> 00:33:20,876 నువ్వు మంచి పని చేసావు. 437 00:33:21,376 --> 00:33:23,045 ఖుస్రో, ఇతన్ని అరెస్ట్ చెయ్యి. 438 00:33:23,128 --> 00:33:24,922 -ఏంటి? -లే, ద్రోహి! 439 00:33:25,756 --> 00:33:27,508 నన్ను ఏమీ చెయ్యరని మాట ఇచ్చారు. 440 00:33:27,591 --> 00:33:28,634 నేను దేనికీ మాట ఇవ్వలేదు. 441 00:33:29,384 --> 00:33:31,720 -సర్, ఇక్కడ మన పని అవ్వలేదు. -కదులు. 442 00:33:33,722 --> 00:33:35,599 నువ్వు తెలివైన పని చేసావు. 443 00:33:38,810 --> 00:33:40,687 నీపట్ల, నాకు బాధగా ఉంది. 444 00:33:44,274 --> 00:33:46,652 ఈ మంచానికి కట్టివేయబడింది నేనైనా కూడా, 445 00:33:47,319 --> 00:33:49,238 మన ఇద్దరిలో, 446 00:33:50,489 --> 00:33:51,907 స్వేచ్చగా ఉన్నది నేనే. 447 00:33:52,699 --> 00:33:53,992 నువ్వు ఖైదీవి. 448 00:33:54,660 --> 00:33:56,328 నీది దుష్టాత్మ. 449 00:33:57,287 --> 00:33:59,623 నువ్వు నా స్థానంలో ఉండి ఉంటే, 450 00:33:59,706 --> 00:34:02,125 నువ్వు నీ పూర్తి కుటుంబాన్ని త్యాగం చేసి ఉండేదానివి, కాదా? 451 00:34:02,543 --> 00:34:05,462 ఎందుకంటే, మీ ప్రపంచంలో అది అలానే పని చేస్తుంది కదా? 452 00:34:06,213 --> 00:34:09,091 నువ్వు ఏది ముట్టుకుంటే అది చచ్చిపోతుంది. 453 00:34:22,603 --> 00:34:24,398 నీ ఆపరేషన్ పట్ల నీకు నమ్మకం ఉందా? 454 00:34:25,065 --> 00:34:26,483 పూర్తిగా ఉంది. 455 00:34:26,984 --> 00:34:28,402 అయితే పని పూర్తి చేయించు. 456 00:34:28,819 --> 00:34:30,195 విమానాలు బయలుదేరవచ్చు. 457 00:34:32,489 --> 00:34:33,489 అలాగే. 458 00:34:34,324 --> 00:34:35,449 మీరు జాగ్రత్తగా ఉండండి. 459 00:34:36,076 --> 00:34:37,286 గుడ్ లక్. 460 00:34:40,289 --> 00:34:41,706 మనకు సమ్మతి దొరికింది. 461 00:34:42,498 --> 00:34:45,043 వెళ్లి తయారవ్వండి. మనం 50 నిమిషాలలో బయలుదేరుతున్నాము. 462 00:35:26,084 --> 00:35:29,046 నాన్న 463 00:35:36,512 --> 00:35:38,972 "మీ నాన్నగారు రివల్యూషనరీ గార్డ్ ద్వారా కిడ్నాప్ చేయబడ్డారు. 464 00:35:39,056 --> 00:35:41,433 నువ్వు ఇవాళ రాత్రికి లొంగిపో లేదా నీ నేరాలకు అయన శిక్ష అనుభవిస్తారు." 465 00:35:47,856 --> 00:35:49,024 తమార్, అదేంటి? 466 00:35:51,360 --> 00:35:52,361 తమార్? 467 00:35:55,697 --> 00:35:56,782 ఇది నిజమా? 468 00:36:06,291 --> 00:36:08,335 -నీకిది ఎలా వచ్చింది? -నాకు సమాధానం చెప్పు. 469 00:36:11,964 --> 00:36:14,716 ఆయనని ది గార్డ్ బంధించలేదు, ఆయన ఇరాన్ లో లేరు. 470 00:36:18,929 --> 00:36:20,264 ఆయన ఎక్కడున్నారు, ఇది... 471 00:36:23,225 --> 00:36:25,811 అది ఈ ఉదయం జరిగింది. మేమది చూసుకుంటున్నాము. 472 00:36:25,894 --> 00:36:28,522 -నువ్వు నాకు చెప్పకుండా ఎలా ఉన్నావు? -తమార్... 473 00:36:28,605 --> 00:36:32,484 ఇది అసంభవం అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచించకు. 474 00:36:33,569 --> 00:36:34,736 నన్ను చూడు. 475 00:36:36,446 --> 00:36:38,615 మన అత్యుత్తమ ఏజెంట్లు దీని మీద పని చేస్తున్నారు. 476 00:36:38,699 --> 00:36:41,493 -వారాయనని వెనక్కి తీసుకు వస్తారు, ఒట్టు. -వారాయనని చంపేస్తారు... 477 00:36:46,290 --> 00:36:48,584 -ఆయన మరణిస్తారు. ఇదేమవుతుందో నాకు తెలుసు. -కాదు. 478 00:36:49,418 --> 00:36:50,419 వారు చంపరు. 479 00:36:51,503 --> 00:36:53,380 నేను దీని గురించి ఆలోచించవద్దని చెప్తున్నాను. 480 00:36:54,173 --> 00:36:57,092 మనం తిరిగి వచ్చేసరికి ఆయన క్షేమంగా ఉంటారు. 481 00:36:57,176 --> 00:36:59,678 నేనిది చేయలేను. నేను... 482 00:37:03,390 --> 00:37:05,142 వేరే ప్రత్యామ్నాయం ఏంటి? ఎదురు చూడడమా? 483 00:37:05,684 --> 00:37:07,895 మనం ఇంత దూరం వచ్చాం, ఇది చెయ్యాల్సిన సమయం వచ్చింది. 484 00:37:09,021 --> 00:37:10,063 మనం చేద్దాం. 485 00:37:10,856 --> 00:37:12,107 పద వెళదాం. 486 00:37:12,900 --> 00:37:13,901 సరే. 487 00:37:14,735 --> 00:37:16,320 పద చేద్దాం. 488 00:37:16,403 --> 00:37:17,487 అబ్బా. 489 00:37:40,719 --> 00:37:42,387 నా ఆదేశం తరువాత. 490 00:38:05,077 --> 00:38:06,954 -హాయ్. గుడ్ ఈవినింగ్. -హలో, గుడ్ ఈవినింగ్. 491 00:38:07,037 --> 00:38:11,208 మేము ఇప్పుడే దారిలోంచి ఫోన్ చేసాము, క్వీన్ సైజ్ బెడ్ ఉన్న గది బుక్ చేసుకున్నాము, 492 00:38:11,291 --> 00:38:12,668 టీనా ఇంకా పాల్ రిచ్చర్ద్సన్. 493 00:38:12,751 --> 00:38:13,752 దయచేసి పాస్పోర్ట్ చూపించండి. 494 00:38:18,423 --> 00:38:21,802 సరే, వారు హోటల్ వైఫికి కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు అతని గది వెతకండి. 495 00:38:55,210 --> 00:38:56,295 టీమ్ త్రీ... 496 00:38:57,754 --> 00:38:59,548 వెనుక ప్రవేశం వద్ద ఏం జరగుతోంది? 497 00:39:00,257 --> 00:39:02,467 వెనుక ప్రవేశం వద్ద ఏమీ జరగడం లేదు. 498 00:39:06,180 --> 00:39:07,931 వారు ఎక్కడున్నారు? 499 00:39:13,145 --> 00:39:17,733 హావా పర్దోజ్ 500 00:39:20,569 --> 00:39:23,280 సిస్టమ్ లోకి వెళ్లి ఆ కాల్ ఇంకా అలానే ఉందని నిర్ధారించుకో. 501 00:39:25,115 --> 00:39:26,283 తమార్... 502 00:39:39,671 --> 00:39:40,756 ఏమైంది? 503 00:39:42,466 --> 00:39:43,842 నాకది కనిపించడం లేదు. 504 00:39:43,926 --> 00:39:44,927 ఆ కాలా? 505 00:39:47,304 --> 00:39:49,056 ఆ సిస్టమ్. నాకది కనిపించడం లేదు. 506 00:39:49,598 --> 00:39:51,016 అది అక్కడే ఉంది, మళ్ళీ చూడు. 507 00:39:52,559 --> 00:39:54,311 -నాకు బాగోలేదు. -హే! 508 00:40:00,484 --> 00:40:01,735 అలీ, అక్కడ చూడు. 509 00:40:03,737 --> 00:40:06,156 చాలా సేపటి నుంచి ఒక వాన్ అక్కడే ఉంది. 510 00:40:11,537 --> 00:40:14,456 ఒమీద్, మనం కొన్ని నిమిషాలు ఆగుదాము, 511 00:40:14,540 --> 00:40:16,708 అది కనుక కదలకపోతే, దాని దగ్గరకు వెళదాము. 512 00:40:33,475 --> 00:40:35,686 -చాలా ధన్యవాదాలు. -పరవాలేదు. 513 00:40:40,107 --> 00:40:41,108 హలో. 514 00:40:41,567 --> 00:40:42,776 వారు వస్తున్నారు. 515 00:40:43,151 --> 00:40:44,361 వారు ఎప్పుడు వచ్చారు? 516 00:40:45,279 --> 00:40:46,446 ఇప్పుడే. 517 00:40:46,530 --> 00:40:48,198 వారు పైకి వస్తున్నారు. 518 00:40:48,282 --> 00:40:49,283 ధన్యవాదాలు. 519 00:40:50,325 --> 00:40:51,618 లే. 520 00:40:51,702 --> 00:40:52,536 -ఏమైంది? -లే. 521 00:40:52,619 --> 00:40:53,787 -ఏమైంది? -నీ మోకాళ్ళ మీద ఉండు. 522 00:41:00,127 --> 00:41:01,336 లోపలికి పద. 523 00:41:02,963 --> 00:41:04,339 మెల్లగా వెళ్ళు. 524 00:41:33,410 --> 00:41:36,455 విను, ఓ ఇజ్రాయెల్, ప్రభువే మన దేవుడు, ప్రభువు ఒక్కడే. 525 00:41:37,289 --> 00:41:38,832 ఆమెకి తన తండ్రి గురించి తెలుసు. 526 00:41:39,499 --> 00:41:41,251 అతనితో ఏదో ఒక విధంగా మాట్లాడినట్లు ఉంది. 527 00:41:41,960 --> 00:41:42,961 ఆమె ఇది చేయడం లేదు. 528 00:41:43,045 --> 00:41:45,047 నువ్విది ఎందుకు రిపోర్టు చేయలేదు? 529 00:41:45,130 --> 00:41:48,175 ఇది ఒకే ఒక్కసారి దొరికే అవకాశం. తను చేయగలదని అనుకున్నాను. 530 00:41:48,592 --> 00:41:50,010 యేల్, మీ ఇద్దరి పని అయిపోయింది. 531 00:41:50,093 --> 00:41:52,012 ఆమెని కార్ ఎక్కించి, అక్కడి నుంచి బయటపడండి. 532 00:41:52,095 --> 00:41:54,389 విమానాలు త్వరలో బయలుదేరబోతున్నాయి, నేను నేవోని పంపిస్తున్నాను. 533 00:42:07,528 --> 00:42:08,737 వెళ్ళు. 534 00:42:16,411 --> 00:42:18,121 ఆ. వారు వెళ్ళిపోయారు. అది వారు కాదు. 535 00:42:45,983 --> 00:42:46,984 ఖాళీగా ఉంది. 536 00:42:57,995 --> 00:42:58,996 అతన్ని వెతకండి. 537 00:43:03,000 --> 00:43:04,001 నువ్వది విన్నావా? 538 00:43:53,759 --> 00:43:57,596 హోషెన్, బారెకెట్, ఓడెం, యార్కాన్, హెవెన్స్ గేట్స్ కి అనుమతి ఉంది. 539 00:43:58,764 --> 00:44:01,808 రాజర్, హోషెన్ అలైన్ అవుతోంది ఇంకా టేకాఫ్ అవుతోంది. 540 00:44:02,809 --> 00:44:05,812 ఓడెం ఇంకా బారెకెట్ అదే సమయంలో అలైన్ అవుతున్నాయి, టేకాఫ్ అవుతున్నాయి. 541 00:44:05,896 --> 00:44:07,731 టేకాఫ్ తరువాత మిమ్మల్ని దాటడానికి అనుమతి. 542 00:44:08,690 --> 00:44:11,985 ఓడెం మరియు బారెకెట్ టేకాఫ్ చేసి, ఎడమ వైపు నుండి నన్ను దాటవచ్చు. 543 00:44:15,030 --> 00:44:16,949 యార్కాన్ అలైన్ అవుతోంది మరియు టేకాఫ్ అవుతోంది. 544 00:44:18,075 --> 00:44:20,244 యార్కాన్ ఖాళీగా ఉంది. అందరికీ గుడ్ లక్. 545 00:44:25,749 --> 00:44:27,209 నేవోతో ఫోన్ కలపండి, ప్లీజ్. 546 00:44:29,002 --> 00:44:30,212 నేవో, నీకు వినిపిస్తోందా? 547 00:44:30,671 --> 00:44:32,005 ఎలా ఉన్నావు, నేవో? 548 00:44:32,464 --> 00:44:34,800 -బాగున్నాను. -విమానాలు ఇప్పుడే బయలుదేరాయి. 549 00:44:35,717 --> 00:44:37,344 ఎటువంటి సమస్య లేకుండా 550 00:44:37,427 --> 00:44:40,430 ఇవాళ రాత్రికి విమానాలు తమ మిషన్ ని పూర్తి చేయగలవని ప్రధాన మంత్రికి చెప్పాలని ఉంది. 551 00:44:41,265 --> 00:44:43,225 పైలట్లు సురక్షితంగా ఉన్నారని. 552 00:44:44,393 --> 00:44:45,978 అంతా బాగానే ఉంటుంది, సర్. 553 00:44:46,728 --> 00:44:48,063 టీమ్, బయటకు వెళ్ళండి. 554 00:45:02,661 --> 00:45:03,912 పరిస్థితులు ఎలా ఉన్నాయి? 555 00:45:03,996 --> 00:45:07,040 బాగున్నాయి. దయచేసి ఆయనతో మాట్లాడనివ్వండి. 556 00:45:09,084 --> 00:45:10,335 తమార్. 557 00:45:10,419 --> 00:45:12,171 మీ నాన్న మట్లాడుతున్నారు. 558 00:45:13,046 --> 00:45:14,506 వారు ఆయనని ఇప్పుడే విడుదల చేసారు. 559 00:45:20,470 --> 00:45:21,471 నాన్నా? 560 00:45:21,555 --> 00:45:22,806 తల్లీ... 561 00:45:26,435 --> 00:45:27,561 బంగారం. 562 00:45:28,395 --> 00:45:30,272 ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. 563 00:45:30,355 --> 00:45:32,316 ఏడవకు. 564 00:45:32,399 --> 00:45:34,276 బంగారం. ఏడవకు 565 00:45:35,194 --> 00:45:36,236 తల్లీ... 566 00:45:39,448 --> 00:45:40,741 నా బంగారు సలీ... 567 00:45:43,243 --> 00:45:45,078 -హలో. -సురక్షిత ఇంటికి వెళ్లి, 568 00:45:45,162 --> 00:45:48,707 ఖాళీ చేసే ప్రక్రియని ప్రారంభించు, మొహమ్మద్ ని ఆ ఇరానియన్ని చంపేయమని చెప్పు. 569 00:47:04,908 --> 00:47:06,910 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి